Saturday, 31 January 2015

ఇద్దరు బెమ్మచారులు పాలిస్తున్నారండయా మన దేశపు జనాల్ని?!

     "బ్రహ్మచారీ శతమర్కటః" అని యెందుకన్నారా అని చాలా కాలం నుంచి దురదగా వుందేది.మనకి వున్నయ్యి బాల్యము,యవ్వనము,కౌమారము,వార్ధక్యము అని నాలుగే గదా ఈ బ్రహ్మచర్యం అనేది యెలా వచ్చిందీ అని కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే చదువుకీ బ్రహ్మచర్యానికీ లింకు పెట్టారు.మామూలుగా రోజువారీ పన్లకి నోటిలెక్కలు సరిపోయేవి.కానీ ఇవ్వాల్టి వుద్యోగాల మాదిరి యేదయినా పెద్దయెత్తున పనికొచ్చేది నేర్చుకోవాలంటే మాత్రం యెవరో ఒక గురువుని పట్టుకుని ఆయన గారి ఆశ్రమమలో చేరి చదువుకుని ఆయనో కుర్రాడో ఇక చాలనుకునే వరకూ వుండి వెళ్ళేటప్పుడు గురుదక్షిణ చెల్లించి జనం మీదనో రాజుగారి మీదనో పడేవాళ్ళు!

మొట్టమొదట గురువుగారు చేసే పని యేమిటంటే తన దగ్గిర కొచ్చిన కుర్రాడికి జంఝప్పోగు తగిలించటం?అందుకే బ్రాహ్మలకే గాదు కంసాలులకీ,ఇంకా విశేషవృత్తుల వారికి కూడా జంధ్యం వుండేది!అ కాలంలో అది వేశారు అంటే కుర్రాడు వున్నతవిద్యలో వున్నట్టు లెఖ్ఖ!ఆ వీరతాడు వేసిన గురువుగారు పెట్టే ఆతి ముఖ్యమయిన కండిషను "బ్రహ్మచర్యం!" చదువుకునే వయస్సులో ఇప్పట్లాగ అమాయిలకి లైన్లెయ్యటం అస్సలు కుదరదన్న మాట?వేస్తే వీపు చీరేస్తారు,తన్ని తగిలేస్తారు,మధ్యలో బయటికెళ్తే యెందుకూ  కొరగాకుండా ఐపోతాడు?!అప్పటి వరకూ యెంత అందమైన ఆడపిల్ల కనపడినా మాతృభావన చేసి పక్కకి తప్పుకోవలసిందే,ఓరి దేవుడోయ్?!

ఆ చదువు కాస్తా పూర్తయ్యాక ప్రభుత్వోద్యోగిగానో సీనియర్ల దగ్గిర సహాయకుడిగానో కుదురుకుని పెళ్ళి చేసుకునే వరకూ మాత్రం కుర్రాడు అచ్చోసిన ఆంబోతు లాగా యెన్ని తిరుగుళ్ళయినా తిరచొచ్చు.ఈ దశలోనే కుదురు తక్కువ వాళ్ళు అప్పటిదాకా కట్టుకున్న కచ్చడాలు తొలిగిపోతాయి గనక మర్కటాల మాదిరి ఆవేశపడి పోయేవాళ్ళు?!వాస్తవానికి ఆ పెళ్ళికాని ప్రసాదులకి అప్పట్లో ప్రత్యేకమయిన పేరు లేకపోవటంతో ఆ బ్రహ్మచారి క్యాటగిరీలోనే లాగించేశారు.

ఈ దశలోని బ్రహ్మచారులు అత్యంత ప్రశస్తమైన వాళ్ళు.మళ్ళీ వీళ్లలో రకాలు కూడా వున్నాయి!"అస్ఖలిత బ్రహ్మచారులు","నిష్కళంక బ్రహ్మచారులు","ఘోటక బ్రహ్మచారులు" అనేవి ముఖ్యమైనవి. మొదటిది అప్పటికింకా స్త్రీ సాంగత్యం కుదరకపోయినా కుదిరితే ఆ బ్రహ్మచర్యాన్ని వొదిలేసే మామూలు రకం!రెండో రకం యెందుకనో పెళ్ళి పట్ల విముఖత వుండి దానితో పాటు ఆధ్యాత్మికత కూడా కలిసి పెళ్ళికీ స్తీ సాంగత్యానికీ దూరంగా వుండటం -  ఇప్పటికీ రా.కృ.మి లో కనపడుతున్నారు?మూడో రకం ప్రమాదకరమైనది - వాళ్ళు మాత్రమే  బ్రహ్మచర్యానికి అంకితమై పోవడంతో సరిపెట్టుకోకుండా మిగతా వాళ్లని కూడా ప్రభావితం చెయ్యాలని చూస్తారు?!

వీళ్లు కాకుండా "నాతి గల బ్రహ్మచారులు" మరో రకం?!పెళ్ళి చేసుకున్నాక కొంతకాలానికి జ్ఞానోదయమై అటు పూర్తిగా సన్యాసానికీ ఇటు పూర్తిగా సంసారానికీ కాకుండా కేవలం భార్యకి శృంగారపరంగా దూరంగా మాత్రం వుంటూ గృహస్థుగానే చెలామటీ అవుతూ వుంటారు - కత్తి మీద సామే అయినా తప్పదు మరి?!



ఈ నాతిగల బ్రహ్మచర్యం గురించి చెప్పాక మెల్లగా మీకూ లైటు వెలిందనుకుంటాను ఇదంతా అప్రస్తుత ప్రసంగం కాదని?!ఇవ్వాళ మననేలుతున్న వాడు నాతిగల బ్రహ్మచారి?ఇప్పుడు చాన్సు తప్పిపోయింది గానీ ఆ సీటు మా ఫామిలీదే అని ధీమాగా వున్న రాహు బాబు ఘోటక బ్రహ్మచారి!పైగా ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేకపోయినా ప్రతిపక్షంలో వున్న అతిపెద్ద పార్టీకి నాయకుడిగా వుండటం వల్ల ఇప్పుడు కూడా మనని ప్రభావితం చేస్తున్నట్టే గదా!ఇంతవరకూ తను ప్రచారం పేరుతో అడుగుపెట్టిన ప్రతి యెన్నికల్లోనూ విజయావకాశాలు వున్నచోట కూడా అపజయాన్నే తెచ్చిపెట్టటం చూసి జ్ఞాననేత్రం కొంచెం వికసించటం వల్ల కాబోలు అప్పుడప్పుడూ కాంగిరేసు వారికే ఈ బ్రహ్మచారి యేం గట్టెక్కిస్తాడు అనిపించి నాయనమ్మ పోలికల్తో వున్నఅనుంగు సోదరిని పిలుద్దామా ఆంటే ఆవిడా తన మొగుడు బంగారం మూలంగా చెడతాననో యేమో తనూ వెనకాడుతున్నాది?!ఆక్కడ మరో అసలు సిసలు నికార్సయిన మర్కటమూర్తి ఒకడున్నాడు?!అవిడ మొగుడికి నోటిదూలెక్కువై ఆత్తగారి యేలుబడిలో వున్నదని కూడా చూసుకోకుండా "ఈ దేశపు జనం అరిటి పండు రాజ్యపు వెధవలు" అనేసి అక్కడా ఒక మర్కటం వుందనిపించాడు?!పాపం భరతమాత దగ్గిరున్న ఒకే ఒక అరిటిపండు కోసం యెన్ని మర్కటాలు పోటీ పడుతున్నాయో?!



దళితేతరులు దళితులకి న్యాయం చెయ్యలేరు గాబట్టి దళిత అనుకూల ప్రభుత్వం కోరుకుంటున్నట్టు బ్రహ్మచారి సంసారులకి న్యాయం చెయ్యలేడు గాబట్టి వుద్యమం చేద్దామా అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు నాతి గల బ్రహ్మచారి నుంచి ఘోటక బ్రహ్మాచారి కిందకి వెళ్తామా అని భయంగా వుంది?!

ఆ ఘోటక బ్రహ్మచారి యేమో అమాయకంగా కాంగ్రెసుని మళ్ళీ అధికారంలోకి తెచ్చేవరకూ పెళ్ళి చేస్కోననేశాడు.ఈ లెక్కన కాంగ్రెసు మళ్ళీ లేవలెక పూర్తిగా అదృశ్యమై పోతే కాంగ్రెసుతో పాటూ గాంధీ - నెహ్రూ కుటుంబాలకి సంబంధించిన ఈ ఒకే ఒక వారసుడితో ఆ రెండు ఇంటిపేర్లూ కూడా భారత రాజకీయ రంగం నుంచి అదృశ్యమై పోతాయా?!

శుభం భూయాత్!!!
_______________________________________________________________
చిత్రములు:గూగులమ్మి!

10 comments:

  1. "అప్పటి వరకూ యెంత అందమైన ఆడపిల్ల కనపడినా మాతృభావన చేసి పక్కకి తప్పుకోవలసిందే,ఓరి దేవుడోయ్?"

    నిఝ్ఝంగా అలా ఎవరైనా చేసినట్లుగా సాహిత్యంలోంచి రాముడు ప్రవరాఖ్యుడులను మాత్రమే చెప్పగలను.

    కొంగు చూడగానే పంచెలు తడుపుకున్న (అనగా వీర్య స్ఖలనాలు జరుపుకునేంతటి 'ఇంద్ర్రియ' నిగ్రహం కలిగిన) మునీశ్వరుల (సన్యాసుల) కధలు మాత్రం ప్రతి పురాణంలో చదివాను. విచ్చలవిడి శ్రంగారం విషయంలో హిందూపూరాణల తరువాతే బైబిల్‌కూడా!

    ReplyDelete
    Replies
    1. కధల్లో కనపడే పాత్రలు చేశారు గానీ,అవ్వన్నీ చదువైపోయిన వాళ్ళు చేసిన నిర్వాకాలు గదా!చదువుకునేతప్పుడు మాత్రం వెధ్దవ్వేషాలు వెయ్యనిచ్చేవాళ్ళు కాదనుకుంటా?ఇప్పటి స్కూళ్ళలో లాగే క్రమశిక్షణ కమిటీలూ అవీ మెయింటెయిన్ చేసే పధ్ధతి వుండేదని చదివా.మరీ మాత వినని వాళ్లకి కచ్చడాలు కట్టేవాళ్ళు?!ఇప్పటి క్రికెట్ ప్లేయర్లు సేఫ్టీ కోసం పెట్టుకున్న చిప్పల్నే అక్కడ కట్టేసి తాళాలు వేసేవాళ్ళు!

      Delete
    2. చంద్రుడు - తార కధ గుర్తుతెచ్చుకోవలసిందిగా మీకు నా ప్రార్ధన. sex అనేది ఒక primordial force దాన్ని నీతులతో బంధించలేం. అలా బంధించాలని ఎప్పుడైతే సమాజం అనుకుంటుందో మనిషిలో splits పెరిగిపోయి, జెకుళ్ళూ, హైడులూ బోల్డూమంది తయారైపోతారు (Strange Case of Dr Jekyll and Mr Hyde Book by Robert Louis Stevenson కధలోలాగా).

      బ్రహ్మచర్యం అంటే abstinence from sex కాదని చదివినట్లు గుర్తు. కృష్ణుడు బ్రహ్మచారిగానే చెప్పబడుతాడు.

      Delete
  2. హరి గారూ ,

    పాహుల్ బ్రహ్మచారి మాత్రమే . ఎందుకంటే వివాహం చేసుకోలేదు కనుక .

    ఘోటక బ్రహ్మచారి మాత్రం కాడు . ఎందుకంటే అతనికి అమ్మాయిల సాంగత్యం బాగానే వున్నది , అది వాళ్ళ తాతగారి వారస్త్వమే కదా !

    ReplyDelete
    Replies
    1. నిజమే నండి,కాకపోతే అస్ఖలితం.నిష్కళంకం అనే వాటిల్లో చేర్చడానికి వీల్లేక ఆ క్యాటగిరీ లోకి తొయ్యాల్సి వచ్చింది - కర్కోటక బ్రహ్మచారి అంటే సరిపోతుందేమో!

      Delete
    2. కర్కోటక బ్రహ్మచారి :-)

      Delete
  3. ఇప్పుడింకా నయం.
    గతంలో వాజ్‌పేయి, కలాం గార్లతో పాటు బోలెడంతమంది ముఖ్యమంత్రులు (వీళ్ళలో ఆడవాళ్ళూ ఎక్కువ) మనలని పరిపాలించేవారు.

    ReplyDelete
  4. హరిగారూ... మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఎలా? మా మెయిలైడీ namonthly@gmail.com

    ReplyDelete
    Replies
    1. @namastae 2
      యెందుకోసం కాంటాక్ట్ చెయ్యాలనుకుంటున్నారు?మీ వివరాలు చెప్పండి ముందు!

      Delete
  5. మా మాసపత్రికలో మీ బ్లాగ్ ఆర్టికల్స్ ప్రచురణ నిమిత్తం. ఉదాహరణకు.. గతంలో ప్రచురించిన బ్లాగు టపాల పేజీ లింకు ఇది... http://issuu.com/namastheandhra.com/docs/na_oct_issue/27

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...