Monday 29 June 2015

అయ్యలారా?అమ్మలారా!ఆంధ్రాని బాగుచెయ్యలి సాయం పట్టండయ్యా!పనీ పాటా యేమీ చెయ్యఖ్ఖర్లేదు - పీకల్దాకా తాగితే చాలునండయ్యా?!

     మంచోడు మంచోడు మామిడికాయంత దొడ్డోడు అని మురిసినంతకాలం పట్టలేదు మంచమంతా చెడగొట్టే రకమని తెలియడానికి?!అప్పుడెప్పుడో మామగారు పార్టీ పెట్టినప్పుడు అటు వెళ్ళలేదు మర్యాద కోసమైనా - ఉన్న పార్టీకి అంకితమైన నిజాయితీ అనుకుందామా?అబ్బే,మామ గెలిచి అధికార పీఠం యెక్కడం ఖాయం అని తెలిసేదాకా ఆగి అప్పుడు ఝామ్మున జంపయ్యాడు!ఫలితాలు తెలియడానికి ఒక్క రోజు ముందు దూకినా నాబోటివాళ్ళు మంచివాడేలే ఆఖరి నిముషాల్లో అయినా జనంలో పొంగిపొర్లిఉతున్న వూపుని గమనించి నిజాయితీగానే వచ్చాడని నమ్మేవాళ్ళు - అడ్డెడ్డెడ్డే, కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలాగా దూకేశాడు!పోనీ మామగారికి మంచిపేరు తెస్తూ తన మర్యాద కాపాడుతూ నైతికంగా ఉన్నతంగా ఉన్నాడా అంటే అదీ కుదురుగా చెయ్యలేదు.అప్పటి దాకా తన చుట్టూ తిరుగుతున్న జనం ఒక ఆడదాని చుట్టూ తిరగడం భరించలేక కొత్తగా రాజపురోహితుడి వేషం కట్టాలనుకున్న వాధా ఘృష్ణ లాంటి సంస్కారహీనపు  మీడియా మాయావులు మామగారి చెవిపోగుల గురించీ మారిన బొట్టు తీరుల గురించీ యెద్దేవా చేస్తూ ఒక దుష్టశక్తిని సృష్టించి జనాన్ని భ్రమింపజేసి ప్రజాప్రతినిధుల్ని యెత్తుకెళ్ళి విలాసవంతమైన పంచతారల భవనాల్లో దాచి చాలా గొప్ప ప్రజాస్వామికంగా తిర్రుగుబాటు చేశాడు!ఇల్లలుకుతూ పేరు మర్చిపోయిన ఈగలా తన చరిత్రని మర్చిపోవడం వల్లనేమో ఇవ్వాళ మరొకడు దిమ్మ తిరిగి గూబ గుయ్యిమనిపించే దెబ్బ కొడితే విలవిలలాడుతున్నాడు - ఒక సచ్చీలుణ్ణి అపఖ్యాతి పాలుచేసినంతగా రోదిస్తున్నాడు!రామహత్యాపాతకం  కట్టి కుడపక మానుతుందా?

     విమానంలో మాంగారి కాళ్లకి అడ్డం పడిన పెట్టెని అటు జరిపి ఇటు జరిపి హడావిడి చేసిన మనిషే విమానం దిగగానే చాలా కూల్ కూల్ యెత్తుగడతో గూబ గుయ్యిమనిపించిన చతురత వెనక్కాల పెట్టుకుని ఇప్పుడు అదే తారకరాముని అభిమాని తన అభిమాననేతను దెబ్బతెసిన విలన్ మీద పగతీర్చుకున్నంత సరదాగా కొట్టిన తమలపాకు సరసానికే హడిలిపోతున్నాడు వృధ్ధనారి పతివ్రత అయినట్టు!

     యేం మాట్లాడితే పేపర్లో పెద్దచ్చరాల్తో తన పేరు పడుద్దో,యేం చేస్తే అందరూ తనని ఇంద్రుడూ చంద్రుడూ అని పొగుడుతారో అనే ప్రచారకండూతి తప్ప ప్రజల గురించి యేనాడన్నా నిజాయితీగా ఆలోచించాడా?అలా అలోచిస్తే అధికారం పోయినప్పుడు తెరాసా సాయంతోనైనా మళ్ళీ అధికారంలోకి వద్దామని కలలు గన్న రోజులు గుర్తు లేవా?తెలంగాణ నేత ఒకడు ఉసిగొలుపుతుంటే గయ్యాళిమంద అంతా ఒక్కటై ఆంధ్రావాళ్ళని అన్యాయంగా తిడుతున్నప్పుడు అదేం మాట మీకు రాష్త్రం కావాలంటే అడిగి తీసుకోండి మీ కష్టాలకీ సమస్యలకీ ఇతర్ల నెందుకు తిట్టడం అని నిలదీసి అడిగి ఆంధ్ర ప్రజల్లో ఉండే స్వాభిమానం నిలబెట్టాలని అనుకున్నాడా?తన స్థానంలో యెన్.టి.ఆర్ ఉంటే అలా కిక్కురుమనకుండా ఉండేవాడా?సాఫ్టువేరుతో మ్యాజిక్కులు చేసి ఉద్యోగాలు రప్పించటం పిడకలేసినట్టు ఒకే ఒక్క నగరంలో అభివృధ్ధిని పోగుపడెయ్యటం - ఇవేనా నాయకత్వానికీ సమర్ధతకీ గీటురాళ్ళు?ప్రజల్లో రోటీ కపడా మకాన్ అన్న ఆ మూడింటి తర్వాత ఆత్మాభిమానం అనేది ఒకటుంటుందనీ ఒక వర్గం వాళ్ళు కేవలం దురుద్దేశంతో భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలు కూడా వేసుకుని కారుకూతలు కుయ్యడం వల్ల ప్రజలు ఆ మాటలకి దీటుగా జవాబు చెప్పలేని తమ ప్రాంతం నాయకుల దేబెతనానికే యెక్కువ కష్టపెట్టుకుంటున్నారనీ గమనించని వాడు అతడేమి ప్రజానాయకుడు?విభజన అన్యాయంగా జరుగుతున్నదని తెలిసినప్పుదు అక్కడా ఇక్కడా పడుక్కుని అఘోరించే బదులు ప్రజల ముందుకొచ్చి అక్కడ జరుగుతున్నదేమిటో విప్పిచెప్పి ధైర్యంగా క్రూరమైన విభజనకి వ్యతిరేకంగా ఉద్యమిస్తే యెవరు అడ్దుకునే వాళ్ళు - గోడమీదిపిల్లి రాజకీయపు మనస్తత్వం నిలువెల్లా మూర్తీభవించటం వల్ల కాదా ఆ ఫలితమివ్వని తింగరి పనులన్నీ చేసింది!సమర్ధించావా తెలంగాణాని నిండుమనస్సుతో సమర్ధించి సహాయం చేసి ఆంధ్రాకి న్యాయం జరిగేలా పోట్లాడాలి, లేదా లక్షమంది వ్యతిరేకించినా సరే ఇది నా పాయింటు భవిష్యత్తులో తెలుస్తుంది నేను రైటో మీరు రైటో అని చెప్పి గట్టిగా నిలబడాలి - అది నిజమైన నాయకత్వ లక్షణం అంటే,అది వుందా మనోడికి?

     తమ నాయకుల్లోనూ తమలోనూ ఉన్న వెధవాయిత్వాల్ని గురివిందల్లాగ దాచుకుని ఆంధ్రావాళ్ళ దోపిడీ వల్ల మేం నష్టపోయాం అని తిడుతుంటే ప్రాంతీయాభిమానం ఆంధ్రుల కుండకూడదా?ఆంధ్రప్రజల తరపున మాట్లాడే అవకాశం ఉండి కూడా రెండు కళ్ళ సిధ్ధాంతం చాటున నత్తిమాటలు మాట్లాడకుండా ఉంటే ఆంధ్రపరజలు తనకి కూడా మామగారిని మించి నీరాజనాలు పట్టి ఉండేవాళ్ళు - ఆంధ్రుల ఆత్మాభిమానం అనే నినాదంతో పుట్టిన పార్టీలో ఉండి స్వాభిమానం లేకపోవటం వల్ల అవకాశం జారవిడుచుకుని ఒంటికన్నుతో మిగిలాడు, ఆ ఒక్కటి గూడా గుడ్డికన్ను మూస్తే యెంత తెరిస్తే యెంత అన్నట్టు ఉంది!

     అదంతా పోనీ విభజన తర్వాత ఇంతవరకూ రాష్ట్రానికి నికచ్చిగా యేమి సాధించాడు?యెంతసేపూ రాను రానంటూ చెట్టెక్కి కూచున్న పక్క రాష్త్రపు ముఖ్యమంత్రిని చర్చలకి పిలుస్తూ ముసలి ముత్తయిదువ కబుర్లు చెబుతూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి యేమో గయ్యాళితనంతో షెడ్యూలు 10లోని వాటితో సహా అన్నిటికీ లుంగజుట్టి ఒడేసుకునేందుకు ఇప్పటికే హోం వర్కు పూర్తి చేసేసుకుని అవకాశం కోసం యెదురు చూస్తున్నాడు!విభజన చట్టంలోనే ఉండి విభజన చట్టం ద్వారా అధికారికంగా దఖలు పడి ఆంధ్రాకి రావలసిన వాటిలో దేన్నీ సాధించకుండా యేడాదిలో ఈ పోటుగాడు చేసిన ఘనకార్యం యెమిటి?అసలు విభజన బిల్లుని వండివార్చిన వాళ్ళు విభజన తర్వాత ఆంధ్రప్రదెశ్ అనే భూభాగం ఒకటి ఉంటుందని అనుకున్నారా అని అనుమానమొచ్చేలా చేస్తుంటే చూస్తూ కూర్చున్న వాడు ఇవ్వాళ కేంద్రంలో నలుగురు మంత్రుల్ని చేర్చి కూడా ప్రత్యేకహోదాని కూడా సాధించలేకపోవడం అంటే అక్కడ నడుస్తున్నది సమస్థాయిలో ఉండి చేస్తున్న స్నేహమా?లేక వాళ్ళ సాయం లేనిదే పదవిలో ఉండటం కష్టమని తెలిసిన కుర్చీ కాపాడుకునేందుకు పనికొచ్చే దాస్యమా?

     పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు హైదరాబాదులో కూర్చుని కేసుల్లో ఇరుక్కుని అఘోరించకపోతే అప్పటి ముఖ్యమంత్రి చేసినట్టు రెండవ నిముషం నుంచే సొంత రాష్ట్రం నడిబొడ్డు నుంచి పారిపాలించవచ్చు గదా?ఇప్పుడు సౌకర్యవంతమైన భవనాలకీ కొదవ లేదు గదా!ఒకవేళ ఉన్నాడే అనుకుందాం తన జాగ్రత్తలో తను ఉండొద్దా!అంతా అయిపోయి అడ్డంగా దొరికిపోయాక ఇపుడేడ్చి యేం లాభం?ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి యొక్క  సిధ్ధాంతం,వ్యూహం,ఆయుధం అన్నీ ద్వేషమే నని చిన్నపిల్లాణ్ణి అడిగినా చెప్తాడు, తనింకా అతను తన మంత్రివర్గంలో చేతులు కట్టుకు తిరిగిన మనిషిలాగే చూసినందుకు ఫలితం అనుభవిస్తున్నాడు!మన రాష్ట్రానికి యేదయినా గట్టిగా అడిగితే తెలంగాణలో 2019కి దెబ్బ తగుల్తుందేమో అనే రంధిలో అన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి ధాటిగా మాట్లాడి లాక్కుపోతున్నా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చోవడం వల్ల యేమి వొరిగింది?!ఇప్పుడు షెడ్యొలు 10 విషయంలో నైనా గట్టిగా ఉంటాడో వీట్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి వాగ్ధాటికే వదిలేస్తాడో?

     అడ్డగోలుగా దొరికిపోయేలా కేసులో ఇరికించటమంటే మొహం మీద ఉమ్మెయ్యటం లాంటిదే కదా - ఇంకా చూరు బట్టుకుని ఇల్లిటపుటల్లుడి లాగా కేంద్రాన్ని నేనిక్కడే ఉంటాను నాకు ఆర్టికిల్ 8 కావాలి అని మారాం చేస్తున్నాడంటే సిగ్గూ లజ్జా వొదిలేసినట్టు కాదా - క్షాత్రం తనకి లేదని ఆంధ్రప్రదేశ్ జనం కూడా తనలాగే అన్నీ వొదిలేసుకుని కూర్చోవాలా!కేంద్రం కలగజేసుకుని చెప్పినంత మాత్రాన తెలంగాణ ముఖ్యమంత్రి వింటాడా?ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని యెన్నికలకి దిగుతాడు, యెవడి పెర్ఫామెన్సూ బాగోలేని స్థితిలో మోదీ గానీ తను గానీ ఇప్పుడు యెన్నికలకి సిధ్ధంగా ఉన్నారా - యెందుకింకా అభాసు పాలయ్యే క్షాత్రం లేని నికృష్టపు పనులు?దెబ్బ తిని ఇన్ని రోజులైంది తిరిగి దెబ్బ కొట్టగలిగాడా?దెబ్బ కొట్టే పాటి తెగువ లేనప్పుడు అక్కడ స్థానబలిమి లేనప్పుడు ఇంకా ఆక్కడే యెందుకు?అటువైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రంతో యేమాత్రం పనిలేకుండా ధీమాగా తనకి కావల్సినవన్నీ పోట్లాడి మరీ సాధించుకుంటూ మగాడిలాగా నెట్టుకొస్తూ ఉంటే ఈ పునిస్త్రీ రాజకీయంతో నాబోటివాళ్ళకి విసుగు తెప్పిస్తున్నాడు!

     రాష్ట్రం లోటుబడ్జెట్టులో వచ్చింది!కేంద్రం నుంచి ప్రత్యేక హోదా కానీ ఇతోధికమైన సాయానికి నికరమైన వాగ్దానం కానీ యేదీ తేలేదు!అయినా ప్రపంచం పట్టనంత రాజధాని కడతానంటున్నాడు - ఆదాయం యెక్కడిదయ్యా అంటే గంధపు చెక్కల స్మగ్లర్ల నందర్నీ చంపేసి వాళ్ళనుంచి స్వాధీనం చేసుకున్న చందనం ముక్కల్ని అమ్మటమూ మద్యం షాపుల్ని పెంచటమూ అద్భుతమైన పరిష్కారాలట - వీటి తర్వాత  వ్యభిచారాన్ని చట్తబధ్ధం చేసి వ్యభిచార కేంద్రాల్ని కూడా తెరిస్తే బాగుంటుంది?!

కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టినట్టు ఒక ఆల్పుడికి అధికారమిచ్చామా గతిలేక!

Sunday 28 June 2015

ఇప్పుడిక్కడ రెండు చీలుదారుల శృంగాటక జంఝాటంలో ఇరుక్కుని ఉన్నాం!?

ఇప్పుడిక్కడ రెండు చీలుదారుల శృంగాటక జంఝాటంలో ఇరుక్కుని ఉన్నాం మనం.దేన్ని యెంచుకోవటమా అనేది తప్పనిసరి మొహమాటాల్తోనూ కీర్తిప్రతిష్ఠల వ్యామోహాల్తొనూ నిర్ణయించుకోవాల్సిన పని లేదు - అంత గందరగోళమూ లేదు!దేనికి దానికి ఖచ్చితమైన లాభనష్టాల మదింపు - ఈ యెంచుకున్న దారిలో నడవాలంటే ఏ దుర్గుణాల్ని ప్రయత్నించి వొదుల్చుకోవాలి,ఏ మంచి లక్షణాల్ని నేర్చుకుని సాధించాలి అనే అవగాహన  - స్పష్టంగానే ఉంది.

ఒక దారి - వ్యామోహాల వల్ల కలిగే భీభత్స విషాదాల్తో కలగుండువడి తలదించుకు తిరగాల్సిన నిత్య నిరంతర దాసత్వం - రాజీ మార్గం.ఈ దారిలొ నడిచేవాళ్లు తలని మోకాళ్ళ మధ్యకి చేర్చుకుని గూని గొడుగులా వంచుకుని యెదురైన ప్రతి అడ్డగాడిదకీ వంగి వంగి సలాములు చేస్తూ ఇతర్ల కాళ్లకి అడ్డం పడకుండా చూసుకుంటూ తన కాళ్ళని అడ్డదిడ్డంగా ఝాడిస్తూ నడవాల్సి ఉంటుంది,తప్పదు!ప్రతివాడూ తన వ్యక్తిత్వాన్ని కొంచెం కొంచెం కించపరుస్తున్నా నవ్వుతూ భరించగలిగితే యెంతటి అవమానానికైనా తిరుగుబాటు చెయ్యని నిరపాయకరమైన వ్యక్తి అని నమ్మించగలిగితే మంచివాడూ మాననీయుడూ అనే బిరుదుల్ని ఇవ్వడం జరుగుతుంది.

నీ దగ్గిరున్నదాన్ని గుంజుకునేటప్పుడు నీకు నెప్పి తెలియకుండా ఇచ్చే ఆ ఘనమైన పొగడ్తలన్నీ నిన్ను బాగానే సంతృప్తి పరుస్తాయి.అప్పుడప్పుడూ నీ కన్నా చవటల దగ్గిర్నుంచి లాక్కుని "అప్పుడప్పుడూ నేనూ సమర్ధుణ్నే సుమా!" అని నువ్వూ మురిసిపోవచ్చు.స్వతంత్రంగా దేనికీ ప్రయత్నించకపోవటం వల్లనూ యే గొప్ప పనికీ నాయకత్వం వహించకపోవటం వల్లనూ తీరిగ్గా వైఫల్యాల గురించి బెంగపెట్టుకోవాల్సిన సన్నివేశమేదీ యెదురుకాకుండానే హాయిగా కాలం గడిచిపోతుంది - అది చాలు నీకు!పరిస్థితులు యెంత ప్రతికూలంగా ఉన్నా శీతలరక్తజంతువుకి మల్లే చక్కగా సర్దుకుపోగలిగి ఉండి స్థిమితమైన బతుకును కోరుకునే ప్రశాంతమనస్కులకి ఈ దారి అత్యంతమొ భద్రత నిస్తుంది.

కానీ,స్వాభిమానం ఆబిజాత్యం లాంటి ఉన్నత లక్షణాల్ని గురించి మాత్రం ఆలోచించకూడదు.అవమానాలకి రోషపడి ప్రతిఘటించటం లాంటి అలవాటు లేని దుందుడుకు పనులు కొత్తగా మొదలు పెట్టిన మరుక్షణమే నీ జీవితంలో ఒడిదుడుకులు మొదలవుతాయి,జాగత్తగా ఉండు!నీ శక్తికి మించిన కష్టాలు యెదురవడం వల్ల నీ బౌధ్ధికపునాదులు కదిలిపోవచ్చు - కనుక తార్కికంగా ఆలోచించడం ఈ దారిలో వెళ్ళడానికి లాభసాటి కాదు?!

మరో దారి - ఠీవిగా రొమ్ము విరుచుకుని శిరస్సు నిఠారుగా నిలబెట్టి అడుగులు ధాటిగా వేస్తూ ఆత్మాభిమానం గలవారు మాత్రమే నదవగలిగిన త్యాగభరిత జీవనం - రాజమార్గం!ఈ దారిలో నడిచేవాళ్ళు దృష్టిని దిగంతాల వరకు ప్రసరిస్తూ ఎవరికీ అతివినయాలు చూపకుండా స్థిరమైన గమనంతో కదలగలుగుతారు.ఐతే,చూపు ప్రసరించినంత మేరలో కనిపించే యెంత చిన్న అంశాన్నీ నిర్లక్ష్యం చెయ్యని సమదర్శిత్వం ఉండాలి.ఇంకా క్రిందటి క్షణం వరకూ మనం ప్రాణాధికంగా ప్రేమించిన దేన్నైనా సరే క్షణమాత్రపు సంకల్పంతో ఆ అర్వాత మరెన్నడూ దాన్ని వదిలినందుకు బాధపదకుండా త్యజించగల నిర్మోహత్వం అలవర్చుకుంటే అది కొన్ని సందిగ్గ్ధ క్షణాల్లో అక్కరకొస్తుంది.

ఈ దారిలో కదలడమంటే వ్యామోహాల్ని జయించి - ఒక పధ్ధతీ పాడూఒ లేని సామాజిక స్థితి మన వ్యక్తిత్వాల మీదకి విసిరే - ప్రలోభాల్ని తప్పించుకుంటూ సాధ్యపడినప్పుదు తోటివార్ని కూడా ఉచ్చుల్లోంచి బైటపడేస్తుండటం గనక ఇతరుల మీదకి వలలు విసిరి తమ ఉచ్చుల్లో చిక్కుకున్న అమాయకుల్ని పీల్చిపిప్పి చెయ్యడమే జీవనోపాధిగా పెట్టుకున్న వారు అక్కసుతో నిన్ను ణౌతికంగానూ మానసికంగానూ హింసకి గురి చెయ్యవచ్చును కూడా!అందుకు సిధ్ధంగా ఉండి ఆ హింసకు ప్రతిహింస చెయ్యటానికి ఆయుధం పట్టాల్సిన తప్పనిసరి సందర్భంలో దానికీ నువ్వ్వు వెనుకాడకూడదు.ఐతే శత్రువు మీద చేసే దాడిలో ఆత్మరక్షణ పరిధిని దాటి ఒక్క అమాయకుడినైనా నీ చేతినుంచి ప్రయోగించబడిన ఆయుధం గాయపర్చినా,నీ తడాఖా చూపించి యెదటివాణ్ణి భయపెట్ట్ నెగ్గుకురావాలనే ఉబలాటం నీ అమనస్సులో కదిలినా - ఉత్తరక్షణంలో నువ్వు ధర్మమార్గం నుంచి తప్పుకుని నీ మమలు వెనక్కి తిరిగిపోయి ఆ పిశాచాల గుంపులోనే కలిసిపోయినట్టు లెఖ్ఖ!

ఒక్కటి గుర్తుంచుకో,ధర్మవీరులైన వారిలో తాము నడిపే ఉద్యమాల్లో శత్రువుల మీద చేసే న్యాయపూరితమైన దాడిలో పోరాటానికి దూరంగా ఉన్న అమాయకులు బలి కాకుండా చూదతం యెత్లాగన్న తపన యే స్థాయిలో ఉంటుందో,తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ లక్ష్యాన్ని యెంత సమర్ధవంతంగా నిర్వహించుకు రాగలరో అంతవరకే సాధుసజ్జనుల దృష్తిలో ఆదర్శప్రాయులౌతారు! 
(18/09/1991)

ధర్మానికి కట్టుబడిన వాడు ఓడితే ధర్మం ఓడినట్టు - సాధుసజ్జనులకు ప్రమాదం కలుగుతుంది!ఓటమిని గర్వంగా చెప్పుకోవాలనుకోవడం తప్పు, ఓడిపోకూడదనే పంతంతోనే యోధుడు యుధ్ధం చెయ్యాలి!ఓడిపోతామని తెలిసినా ఒళ్ళు దాచుకోకుండా పోరాడగలిగిన వాడే నిజమైన యోధుడు!యుద్ధం చెయ్యకుండా వెనక్కి తగ్గే భీరుత్వం యెనాటికీ గౌరవప్రదం కాదు.ఇవన్నీ నిక్కచ్చిగా జరిగి తీరాలంటే ముందు నీ శత్రువుని గుర్తుపట్టాలి,శత్రువు ఫలానా అని తెలుసుకోవడంలోనే యోధుడికి వివేకం అవసరమౌతుంది!చెయ్యగూడని వాడితో యుధ్ధం చేసి అంతా అయిపోయాక అమాయ్కుణ్ణీ వేధించానని పశ్చాత్తాప పదటం యోధలక్షణం కాదు!

క్షాత్రమా దాస్యమా అనే ప్రశ్న వస్తే నేను క్షాత్రం వైపుకే ముగ్గు చూపుతాను!ఒక మహానుభావుడు "శాంతి అనెది రెందు యుధ్ధాల మధ్యన వచ్చే విరామం లాంతిది" అన్నాడు, మరో మేధావి "శాంతి కోసం సమరమే సాధనం" అన్నాడు!అవును,శాంతిని భగ్నం చేసేవాళ్ల మీద యుధ్ధం చేసి వాళ్లని నిగ్రహించడం వల్లనే మనం శాంతిని స్థాపించగలము,ఆ యుద్ధం ఆగితేనే అశాంతి పైకి లేస్తుంది.యెప్పటికీ నాకు స్పూర్తి నిచ్చే మంత్రవాక్యం ఒకే ఒక చిన్నమాట:

శాంతి కోసం సమరమే సాధనం!!!

Thursday 25 June 2015

పాపం, తెలంగాణ లారీల యజమానులకి రెండు రాష్ట్రాల మధ్యన సింగిల్ స్టేట్ ట్యాక్స్ కావాలంట?అసలు సింగిల్ స్టేట్ కోసం ఉద్యమిస్తే గానీ అది కుదరదేమో!

          భ్రమల్ని ప్రేమిస్తూ భ్రమలే జీవితంగా గడుపుతూ భ్రమల్లో పొందే ఆనందం కోసం వాస్తవ జీవితం లోని సుఖాల్ని కూడా త్యాగం చెయ్యగలిగిన అతి మేధావులకి తప్ప విశాల తెలంగాణ ప్రజానీకానికి యేనాడూ విభజన ఉద్యమానికి అండదండలు ఇవ్వాలనిపించ లేదు!తార్కికంగా ఆలోచించే తెలంగాణలోని నిజమైన మేధావులకి విడిపోతే ఇంతకన్నా బాగుంటుందన్న నమ్మకం యేనాడూ లేదు?వీళ్లందరినీ ఆంధ్రోళ్ళు మనల్ని దోచుకోవదం వల్లనే మనం వెంకక పడ్డాం,విడిపోయి ఆ దోపిడీని వదలగొట్టేస్తే చాలు అంబరాన్ని చుంబిస్తాం అని వూదరగొట్టి కనీసం యెదటివాళ్ళకి వచ్చిన అనుమానాలకి సరయిన జవాబులు కూడా ఇవ్వలేక అలాంటివాళ్ళంతా తెలంగాణ ద్రోహులని ముద్దర్లు కొట్టేసి,లక్ష అబధ్ధాలతో కోటి రౌడీ పన్లతో తెచ్చుకున్న దానిని మంచితనంతో ఒప్పుకుంటున్నామే గానీ సాంకేతికంగా ఈ విభజన చట్టబధ్ధమైనదని అసలు ఒప్పుకోవాలా?

          అసలు ఆ విభజన చట్తాన్ని కూర్చిందే నేనని ఒకానొక దశలో డప్పు కొట్టుకున్న వ్యక్తియే ఆ చట్టం సరిగ్గా లేదని అంటుంటే ఆ విభజన చట్టమే పనికిమాలినదని అర్ధం కాదా?తన ప్రమేయంతోనే తన ఆమోదం కోసం కేంద్రమంత్రులు కూడా తన చుట్టూ తిరిగి తనకు చూపించాకనే బిల్లు సభలో కొచ్చిందని తనూ చెప్పాడు,ఆ కేంద్రమంత్రులూ లోపాయకారీగానూ పత్రికల వాళ్ళు గుచ్చి గుచ్చి అడిగితే పత్రికాముఖంగానూ ఒప్పుకున్నది నిజం కాదా?తెలిసి తెలిసీ ఇంత అధ్వాన్నంగా తనెందుకు తయారు చేశాడో,వాళ్ళు చేస్తే చూసినప్పుడో తనెందుకు ఒప్పుకున్నాడో ఇప్పటికయినా తిన్నగా చెప్తాడా?మన పిచ్చి గానీ ఆ మనిషి యేది తిన్నగా చెప్పాడు గనక!ఆయనకీ ఆయన అభిమానులకీ తిన్నగా మాట్లాటం వస్తే మనకె బాధలన్నీ యెందుకు?!తెలంగాణ తరపున దాఖలయిన ఓటుకు నోటు మరియూ ఆంధ్ర త్రపున దాఖలయిన ట్యాపింగ్ వ్యవహారం లాంటివి పట్టించుకోకుండా విశాల తెలంగాణ ప్రజానీకం యొక్క సమస్యలు సుదూరంలోనన్నా పరిష్కరించబదతాయనే గ్యారెంటీ యెంతమంది తెలంగాణ్యుల కుంది?

          ఈ రెండు కేసులూ ఒకళ్ళు మరొకళ్ళ మీద బురద జల్లుకోవడానికి తప్ప యెందుకూ పనికిరానివేనని తెలియడం వల్లనే రేవంత్ పరిస్థితి యేంటి?అదృష్టం బాగుండి అతనికి బెయిలొస్తందా?జైలుకి వెళ్ళి చిప్పకూడు తింటాడా?బాబు కూడా అరెస్టవుతాడా? - ఇలాంటి కుక్కజట్టీలకి దూరంగా ఉన్నాను!అరిభీకరంగా చెలరేగిపోయి బాబు అవినీతి గురించి వాదిస్తూ పుంఖాలు పుంఖాలుగా వాదించిన తర్వాత కూడా "Horse trading is everywhere,nobody is an exception" అనేవాళ్ళు ఒంటిమీద స్పృహ వుండి కళ్లముందు జరిగేది చూస్తూ అంతా తెలిసే అలా మాట్లాడుతున్నారా?నేనైతే మొదటినుంచీ ఒకే మాట అడుగుతున్నా,ఒకడు అవినీతిపరుడయితే కావచ్చుగాక,అతన్ని అవినీతిపరునే అర్హత మరో అవినీతిపరుడికి ఉంటుందా అని, దానికి సూటిగా జవాబు చెప్పగలరా?రేవంత్ అడ్డంగా దొరికిపోయి జైలు పాలయినా,చంద్రబాబు కూడా ఆ ఫోను సంభాషణ మూలంగా పదవిని పోగొట్టుకున్నా యేమాత్రం బాధపను,ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సరయిన రాజకీయ చైతన్యం అంటూ ఉంటే మరొక నాయకుడు వస్తాడు!అలా కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఖర్మ,అంతే?

          కానీ తెలంగాణ మేధావుల మేధావిత్వం ఇంత అధమ స్థాయిలో అఘోరించటానికి కారణం యేమిటి?"పరారీలో బాబు అనే వార్త చూడాలని ఉంది" అనేటంతగా బాబు అవినీతిని ద్వేషిస్తున్నవాళ్ళు కేసీఆర్ అవినీతిని చూడరేందుకు?బాబు పట్ల గల ద్వేషానికి కారణం యేమిటి.,కేసీఆర్ పట్ల గల బానిసత్వానికి కారణం యేమిటి?తెలంగాణకి కేసీఆర్ అవినీతి వల్ల అన్యాయం జరిగినా ఫర్వాలేదు అని సహిస్తున్నప్పుడు చంద్రబాబూ అవినీతిని కూడా సహించవచ్చును గదా?ఆకర్ష తంత్రం మొదలు పెటిన మొదట్లోనే కాంగ్రెసువాళ్ళు బాహాటంగానే "మీ మీద పాతకేసులు తిరగదోడతాం,మిమ్మల్ని జైలుకి పంపిస్తాం మా పార్టీలో చేరకపోతే అంటున్నారు - మరీ ఇంత ఘోరమా?" అని అన్నప్పుడు అక్క యేం జరుగుతుందో తెలియదా?అది అవినీతి కాదా?యే అవినీతిపరుల్ని భూస్థాపితం చేస్తానన్నాడో అదే అవినీతిపరుల్ని పక్కన పెట్టుకుంటే బంగారు తెలంగాణ యెట్లా వస్తుంది?మీకు కావలసింది బంగారు తెలంగాణయే అయితే కేసీఆర్ అవినీతిని యెందుకు వ్యతిరేకించడం లేదు!అదే అవినీతిని ఇప్పుదు కూడా పదింతలు ధైర్యంగా చేస్తుంటే సహిస్తున్నప్పుడు రాష్ట్రం విడిపోవలసిన అవసరం యేమిటి?పరిశ్రమల్లో వ్యాపారాల్లో అదే దొపిడి దొంగలైన ఆంధ్రోళ్ళ హవా సాక్షాత్తూ ముఖ్యమంత్రి అండదండలతోనే సాగుతున్నప్పుడు ఈ విభజనని వ్యతిరేకిస్తే తప్పేమిటి?ఇదివరకటి వారి పరిపాలనలో ఉన్న చెడు అదే విధంగా కొనసాగుతున్నప్పుడు ఈ తెలంగాణ ఆస్తిత్వం యొక్క ప్రత్యేకత మేమిటి?

          ఉద్యమంలోనూ నిజాల్ని చెప్పి అందర్నీ ఒప్పించకుండా రౌడీతనంతోనే చెలరేగిపోయారు,అధికారంలోకి వచ్చాక కూడా ప్రజల్ని మెప్పించే చక్కని పరిపాలనతో బలాన్ని పెంచుకోవాలనే రాజమార్గం వదిలి అదే రౌడీతనానికి ఆకర్ష తంత్రం అనే సంకేతికమైన ముద్దుపేరు తొడిగి దొడ్డిదారిన వెళ్తూ చెలరేగిపోతున్నారు,రాజధానిలో సగం హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పదేళ్ళపాటు హక్కు ఉన్నదని చట్టంలో లేదా?చట్టంలో మీకు ఇష్టం లేనివాట్ని మీరు వ్యతిరేకిస్తే మొత్తం విభజన చట్టాన్నే మేము వ్యతిరేకిస్తాం,తప్పా!అప్పుడు కేంద్రంలో ఉన్న ఒక లత్తుకోరు పార్టీతో లాలూచీ ఒప్పందం ద్వారా 23 జిల్లాల మీద రుద్దిన ఈ విభజనని రద్దు చేసి పారెయ్యాలి!అసలు నిజాలతో చారిత్రక వాస్తవాలతో ఇంతకు ముందు విడిపోయిన అన్ని రాష్ట్రాల మాదిరిగానే శాసనసభలో విభజన తీర్మానం పెట్టి వోతింగు ద్వారానే విడిపోవాలని మేము అంటాం - ఒప్పుకుంటారా?మా వాదన కనీసం నినను కూడా వినకుండా జరిగిన విభజన ప్రజాస్వామికం యెలా ఔతుంది?ప్రజాస్వామికంగా జరగని విభజన పట్ల మేమెందుకు గౌరవం ప్రకటించాలి?యే ప్రాంతీయాభిమానాన్ని రెచ్చగొడుతూ ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చారో వారినే ఆ ప్రాంతీయాభిమానం అబినీతికి దూరంగా ఉంచలేకపోతుంటే దానివలన ప్రయోజనం యెవరికి యెందుకు యెంత వుంటుంది?కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికీ,కేసీఆర్ కుటుంబానికి నాలుగు మంత్రిపదవులు తెచ్చుకోవడానికీ,కేసీఆర్ ఇది నా అడ్డా అని జబ్బలు చరుచుకోవడానికీ 23 జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఈ విభజనని బలవంతంగా ఒప్పుకోవాలా?యే లక్ష్యం కోసం యెవరెవరు అన్నేళ్ళు మిన్నూ మన్నూ యేకం చేసి ఇవ్వళ రాష్ట్రాన్ని సాధించుకుని అధికారంలోకి వచ్చాక వాళ్ళనే అవినీతికి దూరంగా ఉంచలేనప్పుదు,విశాల తెలంగాణ ప్రజానీకం తరపున నిలబడి ఆ అవినీతిని వ్యతిరకించాల్సిన వాళ్ళు కూడా అవినీతిపరులకే కొమ్ము కాస్తూ బాజాభజంత్రీలతో ప్రోత్సహిస్తున్నప్పుడు ఆ ప్రాంతీయాభిమానంలోని పవిత్రత యెంత?

          ఇప్పటికిప్పుడు ఈ ఓటుకు నోటు దగ్గిర్నుంచి ఫోన్ల ట్యాపింగు వరకూ సమస్తాన్నీ ప్రజల ముందు పెట్టి మళ్ళీ యెన్నికలకి నిలబడగలడా?ఇదివరకు గెలుచుకున్నన్ని సీట్లు కూడా రావని నేను ధీమాగా చెప్పగలను!యెందుకంటే ప్రజల్లో ఈ యేడాది పాలన మీద అధ్భుతమైన ప్రశంస లేవీ పలేదు.ఇప్పుదు మొదలు పెట్టిన చెరువులు తవ్వడం,నగరాన్ని శుభ్రం చెయ్యడం,వ్యవసాయాన్ని బాగుచెయ్యడం,తమ ఉద్యమం ధాటికి జడిసి పారిపోయిన పరిశ్రమల్ని మళ్ళీ వెనక్కి రప్పించుకోవడం - ఇలాంటివాటికి తనే చెప్పుకున్నట్టు నాలుగేళ్ళు పడుతుంది.అది గనక జరుగుతుంటే ప్రజలు కూడా యెదురు చూడగలరు!కానీ ఇప్పుడు జరుగుతున్నవి మాత్రం విశాల తెలంగాణ ప్రజానీకానికి యేమాత్రం పట్టనివి,అవునా?దాని గురించి చెప్పుకునే అవకాశం యెటూ లేదు - అవినీతి అంతటా ఉన్నదని వాళ్లే ఒప్పుకుంటున్నప్పుడు పొరుగు రాష్త్రం ముఖ్యమంత్రి అయిన  బాబు అవినీతి తెలంగాణ ప్రజలు పట్టించుకుంటారా?తన అవినీతి వ్యవహారాలు బయటికి వస్తే?వస్తాయి - యెన్నికలంటూ వస్తే అప్పుయినా యెదటివాళ్ళు వాట్ని హైలైట్ చేస్తారు!ఉద్యమకాలంలో ప్రజల్ని అనేక రకాల ఇబ్బందులకి గురిచేసినా అది ఉద్యమకాలం కాబట్టి సరిపెట్టుకున్నారు,అధికారంలో ఉండి ప్రజలకి ఇబ్బంది కలగకుండా పరిపాలించాల్సిన కాలంలో మళ్ళీ తమని ఇబ్బందులకి గురి చేస్తే విశాల తెలంగాణ ప్రజానీకం మద్దతు ఇస్తుందా - అదీ తమ అవినీతిని దాచుకోవడానికి ప్రాంతం గొప్పని వాడుకుంటున్న వాళ్ళకి?

          ఇవ్వాళ లారీల యజమానులకి తెలియదా రాష్త్రం విదిపోయాక కూడా ఒకే పన్ను సాధ్యపడదని,తెలుసు కానీ భ్రమల్లో బతికేవాలాళ్లలాగ కాకుండా విభజన వల్ల నిజమైన ఇబ్బందుల్ని యెదుర్కొంటున్న వాళ్ళు కాబట్టి దానికి పరిష్కారం కోరుతున్నారు!రాకపోకలు తప్పనిసరి అయినప్పుదు అది సుఖంగా ఉండాలని కోరుకోవటం వాళ్ళ హక్కు,కాదా?ఇక్కడ చూస్తే అనాగరికమైన పరిపాలనతో గందరగోళం వుంది,ఇక్కడి నుంచి బైటికి పోయి  నాలుగు బ్బులు సంపాదించుకుందామంటే పన్నులు తడిసి మోపెడు అవుతున్నాయి?సత్య మార్గాన పోయి న్యాయమైన వాదనల్తో చట్తప్రకారం శాసనసభలో బిల్లు పెట్టి ధర్మంగా తమకు యేమి కావాలో అడిగి యెవరికి కావలసినవి వాళ్ళు పంచుకునేలాగ విడిపోతే ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా!

          ఇదివరకు సమైక్య రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకి అప్పటి ప్రభుత్వాల మీద విరుచుకు పడ్డవాళ్ళు ఇప్పుదు కనీసం ఓదార్చతాని కయినా వెళ్ళటం లేదు,యెందుకని?అప్పట్లో చంద్రబాబు వెళ్ళకపోయినా మిగతా మంత్రులు కొందరయినా వెళ్ళారు,ఇప్పుడదీ లేదు గదా!ధనిక రాష్ట్రంగా ఉన్నామని చెప్పుకోవదమే తప్ప అందులో ప్రజలకి నిక్కచ్చిగా ఉపయోగిస్తున్నది యెంత?వ్యక్తి->కుటుంబం->వీధి->గ్రామం->జిల్లా-రాష్ట్రం-దేశం->ప్రపచం అనే వృత్తాలలో మీరు చెప్తున్న "మాప్రాంతం" అనేది యెక్కడ నుంచి మొదలై యెక్కడి వరకూ సాగి యే అంతరువులో స్థిరంగా వుంటుంది?ప్రాంతం పట్ల మమకారమే అన్ని సమస్యలకీ పరిష్కారమా?ఇప్పుడు తెలంగాణ రాష్త్రం మొత్త్తం ఒకే ప్రాంతమా?యే జిల్లాకీ సొంత ఆస్తిత్వం లేదా?తమ అవినీతిని సహించడానికి ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని బూచిగా చూపిస్తున్నారని మీకు తెలియదా,తెలిసీ సహిస్తున్నారా?కేసీఆర్ మరియూ అతని అభిమానులూ ఇదే రకంగా కొనసాగితే భవిష్యత్తులో మళ్ళీ ఈ రెండు రాష్ట్రాల్నీ విలీనం చెయ్యాలన్న సమైక్యవాదం పుడితే తెలంగాన నడిబొడ్డునే పుడుతుంది!ఇంకా గట్టిగా మాట్లాడితే తొలి జండా కేసీఆర్ ఇంటిముందే యెగరొచ్చు?!

ద్వేషంతో సాధించింది ఆ ద్వేషంతోనే పోతుంది!

Sunday 21 June 2015

యేది సత్యం యేద సత్యం ఓ మహాత్మా?యేది ధర్మం యేద ధర్మం ఓ మహర్షీ!

          "యేకం సత్ విప్రాణి బహుధా వదంతి" అన్న పెద్దలే "సత్యమేకం లలితాఖ్యం వస్తు,సత్యం వదిష్యామి" అన్నారు!"ఆలస్యం అమృతం విషం" అన్న పెద్దలే "నిదానమే ప్రధానం" అని కూడా అన్నారు?సినీమాయాజగత్తులో తెలుగుభాషలో కనపడే బొమ్మల నోటినుంచి వినపడే మాటల్లో యెన్నెన్నో మాయలు చేసి యెవరూ వినని పదాల్ని వుపయోగించీ అవసరార్ధం తనే కొత్త పదాల్ని సృష్టించీ అసదృశంగా నిలబడిన పింగళివారు పాతాళభైరవిలో నేపాళ మాంత్రికుడి ద్వారా "జనం కొరింది మనం శాయడమా?మనం చేసింది జనం చూడడమా?" అని అడిగించి, సదాజపుడి చేత "యెప్పుడూ జనం కోరింది చేస్తున్నారుగా ఈసారికి మీరు చేసింది చూపండి" అని చెప్పించి కొత్తదారి చూపిస్తారు.విమర్శకులొకరు అందులో చాలా లోతైన అర్ధాన్ని వెదికారు!రచయిత,నటుడు,ప్రయోక్త - ఇట్లా సృజనశీలురైన వ్యక్తులకి కూడా ఈ సందేహం అప్పుడప్పుడూ కలుగుతుంది కాబట్టి అది కేవలం ఒక గారడీ విద్యలు చేసేవాడు తమాషాకి వేసిన ప్రశ్న కాదనేశారు!

          ఒక్కొక్క విప్రవరుడూ ఒక్కొక్క రకంగా చెప్పిన వాటిల్లోనుంచి మౌలికసత్యాన్ని కనుక్కోవడం యెట్లా?ధర్మం అన్ని కాలాల్లో అన్ని తావుల్లో అందరికీ ఒక్కలాగే ఆచరణీయ మవుతుందా?ధర్మం అనే మాటకి యెవడికి తోచిన అర్ధం వాడు చేప్పుకుని ఇది నా స్వధర్మం అంటే యేమి చెయ్యాలి?స్వధర్మాన నిధనం శ్రేయ మెందు కయింది?పరధర్మం భయావహ మెందు కయింది?హిందూ సన్యాసి వివేకానందుల వారు ధార్మికక్షాత్రాన్ని బోధించాడు!కమ్యునిష్టు కవి శ్రీరంగం శ్రీనివాస రావు అధర్మనిధనం కోసం ఖడ్గసృష్టి చేస్తున్నానన్నాడు!రెంటికీ తేడా యేమిటి?సాయుధ పోరాట సిధ్ధాంత కర్తలు తాము పెట్టుబడిదారుల్ని దునిమేస్తే అది శ్రేయోరాజ్యం కోసం చేసిన మహత్కార్యం అంటున్నారు,వారే మళ్ళీ హిందూధర్మం గురించి ప్రస్తావన వస్తే మాత్రం మాట తిప్పేసి అది భయంకరమైనదనీ అందులోని భాగమైన గీత హింసని బోధిస్తుందనీ భయపెడుతున్నారు?రాజులంతా బూజులని జనాన్ని నలిపేశారని అంటున్నప్పుడు స్టాలిన్ చేసిన హత్యల్ని గురించి యెత్తితే మాత్రం గప్చుప్ సాంబారుబుడ్డి అయిపోతారు,యెందుకనో?

          యెన్ని ప్రశ్నలు వేసుకున్నా జవాబు ఒక్కటే!సత్యం అనేది అనేక రకాలుగా ఉండదు.చిన్న సత్యం పెద్ద సత్యం అని చెప్పగలమా, లేదే!ఈ ప్రపంచం గురించి తెలుసుకోవలసినది చాలా ఉంది.మనకి కనపడుతున్న వాటి గురించే మనకి తెలిసినది చాలా తక్కువ. ఇప్పటికి తెలిసినది కూడా యే ఒక్క మనిషికో బోధపడినది కాదు.ఒక్కొక్కరి జ్ఞానం ఒక్కొక్క ఇటుకగా  ఒకదాని పైన ఒకటి పేర్చి కడుతూ వస్తున్న అసంపూర్తి భవనం మనకి తెలిసిన విజ్ఞానమంతా, యెప్పటికి పూర్తవుతుందో యెవరికీ తెలియదు!యెవరి అనుభవాన్న్ని బట్టి వారు నేర్చుకున్నది ప్రత్యేకమైన విషయమే అయినా ఇంతకు ముందు తెలిసిన జ్ఞానంతో అది కలిసిపోగలుగుతున్నది - అనుభవాలు వేరు గనక వైవిధ్యత ఉంటుంది,చెప్తున్నది ఒకే విషయాన్ని నిరూపిస్తున్నది గనక సారూప్యత ఉంటుంది,అదే పరమసత్యం!సత్యానికి కొలబద్ద యేకోన్ముఖత!ఒక విషయం గురించి యెంత చెప్పినా అంటే ఒక్క వాక్యమే చెప్పినా వెయ్యి వాక్యాలు చెప్పినా మరెన్ని వాక్యాలు చెప్పినా మొదటి వాక్యానికీ చివరి వాక్యానికీ అర్ధంలో వైరుధ్యం ఉండకూడదు, వైరుధ్యం కనిపిస్తున్నదీ అంటే అది అబధ్ధమే!ప్రయోగాలతో నిరూపించగలిగినవీ ప్రయోగాలతో నిరూపించలేనివీ అయిన రెండు రకాల జ్ఞానసంబంధమైన విషయాలకీ మొదట సారాంశాన్ని మాత్రమే చూసినప్పుడు వాటిలోని సత్యాసత్యాల్ని తేల్చడానికి ఈ కొలబద్దనే వాడుతున్నారు ప్రపంచమంతటా!

          ప్రపంచంలోని అతి ప్రాచీనమైన నాగరికతలలో నేటికీ సజీవంగా కొనసాగుతున్న వాటిలోకల్లా ప్రాచీనమైనదీ భరతఖండంలో అత్యంత ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్న సనాతన ధర్మం అవిచ్చిన్నంగా కొనసాగటానికి ఈ లక్షణం బీజప్రాయమై ఉండటమే కారణం!ఒక సంస్కృతి ఇంత కాలం పాటు కొన్ని వందల తరాల మానవుల్ని ఆ సంస్కృతికి అంటుగట్టుకుపోయి ఉండగలిగేలా చేస్తున్నదంటే అది వారికి క్షేమాన్ని ప్రసాదిస్తుండటమే కారణమని వేరే చెప్పాలా!పాటించడానికి తనని కష్టపెడితే యే మనిషీ ఆ ధర్మాన్ని పాటించడు,అవకాశం దొరకగానే ఎడంకాలితో తన్ని పారేస్తాడు.అట్లాగని యెప్పటి కెయ్యది ఆకర్షణీయమో దాని వెంబడే పరిగెడితే మౌలికలక్షణంలో గుర్తు పట్టలేనంత మార్పుని తీసుకొచ్చి ఆ సంస్కృతి లోని యేకోన్ముఖతని నాశనం చేస్తుంది, మరింక అక్కడున్నది ఒకే సంస్కృతి అని చెప్పడ మెట్లా కుదురుతుంది?దేనిని వదలకుండా పట్టి ఉంచాలి,దేనిని కాలాని కనుగుణంగా మార్చుకోవాలి అనే రెండు అంశాల పట్లా శధ్ధ వహించడం చేతనే తనకన్నా తర్వాత పుట్టిన అనేక సంస్కృతులు కొద్దికాలంలోనే అంతరించిపోయినా ఈ భారతీయ జీవన ధర్మం మాత్రం నేటికీ తొలినాటి జవసత్వాలతోనే సజీవంగా నిలబడి ఉంది!

          ఈ సంస్కృతి విశిష్టత తన చుట్టూ ఉన్న ప్రకృతిని అర్ధం చేసుకుని ఆ ప్రకృతిని ధిక్కరించకుండా ఉండటంలోనూ తను దేనివలన ఈ ప్రపంచంలో క్షేమంగా ఉండగలడో ఆ ప్రకృతిని చెగొట్టకుండా తీసుకున్నదానికి పదింతలుగా ప్రకృతికి మేలు చేస్తూ ఆ ప్రకృతిలోనే ఆనందంగా కలిసిపోవడాన్ని శోధించి సాధంచి బోధించి ధ్యానించడంలోనూ ఉంది!నాల్గు వేదాలు,అష్టాదశ పురాణాలు,అసంఖ్యాకమైన ఉపనిషత్తులు,అరణ్యకాలు,గీత - అన్నింటిలోనూ ఉన్న యేకోన్ముఖత అంతా ఈ నాలుగు వాక్యాల్లో ఉంది:
శ్లో:ఈశా వాస్య మిదం సర్వం
     యత్కించ జగత్యాం జగత్
                                                                 తేన త్యక్తేన భుంజీధాం
                                                                 మా గృధః కస్యస్విర్ధనః!
          భగవంతుడు యెవరు,అతనెలా ఉంటాడు,అతనెక్కడ వుంటాడు,అతని కేది ఇష్టం - యేది కాదు,మనిషి చెయ్యాల్సినది యేమిటి,మనిషి  చెయ్యగూనిది యేమిటి - అన్నీ ఇందులో కొండ అద్దమందు కొంచెమై ఉన్నట్టు ఇమిడి ఉన్నాయి!లక్షల సంఖ్యలో పౌరాణికులు,బోధకులు యెన్నో గ్రంధాలు రాసి మళ్ళీ వాటికి వ్యాఖ్యానాలు చేర్చి బయటి వాళ్ళకి చూడగానే సంక్లిష్టంగా కనిపించే హైందవ ధర్మ సారం మరీ ఇంత చిన్నదా అనిపిస్తుంది గదూ!అవును,ఇట్లా తేలికగా అర్ధమయ్యే రీతిలో ఉండటం వల్లనే ఆచరణ మరింత తేలికైంది, అర్ధంలో గందరగోళం లేకపోవటం వల్ల దీన్ని అతిక్రమించాలనే ఆలోచన కూడా యెవరికీ రాలేదు!ఈశ్వరుడు అన్నింటినీ అవరించి ఉన్నాడు - యెట్లా?ఒక దుప్పటిలాగా పైన మాత్రమే కాకుండా యెంత చిన్న అంశంగా విడగొట్టి చూసినా లోపలా బైటా కూడా కనిపించే విధంగా నిండి ఉన్నాడు!కాబట్టి పరిత్యక్తుడవై భుజించు!పొరపాటున కూడా ఇతరులకి సంబంధించిన దాన్ని సంగ్రహించకు!పరిత్యక్తత అనే పదాన్ని విశ్లేషించడానికే భగవద్గీతలో స్థితప్రజ్ఞుడు అనే సూత్రం ప్రతిపాదించబడింది - "యేదీ నాకు అధికారికంగా దఖలు పడలేదు,నా మేనిలో ప్రాణమున్నంత వరకూ నాకు అందుబాటులో భగవంతుడు ఉంచినది, అవసరం మేరకు మాత్రమే నేను తీసుకోవాలి" అనే గమనికయే స్థితప్రజ్ఞుని జీవన విధానమైన పరిత్యక్తత!

          కరువులూ,మశూచికాలూ వచ్చి నశించినప్పుడు తప్ప మిగిలిన కాలమంతా దృఢంగా ఆరోగ్యంగా చిరకాలం జీవించి యెంతో గంభీరమైన వేదాంత భావనల్ని కూడా హాస్యస్పూర్తితో సామెతలుగా మనకందించిన వారికి మూఢనమ్మకాల్ని అంటగడుతున్న మనం యెన్ని మూఢనమ్మకాల్ని వైజ్ఞానిక సత్యాలుగా భావిస్తున్నామో తెలుసుకుంటే అంత సుదీర్ఘకాలం అజ్ఞానంలో బతికినందుకు యెంతటి వాడికయినా నిర్వేదంగా అనిపించటం ఖాయం!పాండిత్యం వాదనల్లో గెలవడానికి పనికొస్తుంది.వివేకం జీవితంలో సుఖపడడానికి పనికొస్తుంది.రెండూ తెలివికి సంబంధించిన పర్యాయ పదాలే గానీ ఒకదాన్ని వాడాల్సిన చోట మరొకదాన్ని వాడితే ఇప్పటి మన సమాజంలాగే దరిద్రంగా అఘోరిస్తుంది!



          ప్రాణావసరమైన తిండి విషయంలోనే చూస్తే రోజుకి రెండు లేక మూడు సార్లు పళ్ళెంలో తెల్లని వరి అన్నం రాశిగా పోసుకుని నాలుగైదు కూరలు కలిపి ముద్దలు చేసుకుని కుంభాలకి కుంభాలు లాగించడమే భోజనం అనుకుంటున్నాం,కానీ ఆ ఒక్క ఆహారపు టలవాటు మనకి గ్రహపాటుగా యెట్లా మారిందో తెలుసుకోలేక పోతున్నాం!ఇదివరలో ఒక్క వరినే కాదు,జొన్నలు,సజ్జలు,రాగులు కూడా పండించే వాళ్ళు - మరి ఇప్పుడెందుకు పండించటం లేదు?ఒకసారి మీ చిన్నప్పుడు చూసిన జొన్న చేనుని గుర్తుకి తెచ్చుకోండి,జొన్న చేను చుట్టూ పాతకాలంలో అల్లిన శృంగారం రంగరించిన గాధల్ని గుర్తుకు తెచ్చుజోండి?హఠాత్తుగా జొన్నచేలు మాయమైపోయినయ్యేమిటి మన జీవితాల్లోంచీ సాహిత్యం లోంచీ మనల్ని వెర్రివెధవల్ని చేస్తూ?వూచబియ్యం అనే మాట యెవరికయినా గుర్తుందా!చిన్నప్పుడు మాకూ ఓ జొన్నచేను ఉండేది,ఓ ఆదివారం పెద్దవాళ్ళు కాపలా అతనికి ఒక కబురు అందించమని పంపిస్తే వెళ్ళాను.ఆ సమయానికి తను  కంకులు తుంచుతూ ఉన్నాడు గనక అతను చిదుగులు యేరటం,నిప్పు రాజెయ్యటం,కంకి మీద ఉండే వెంట్రుకలు మాత్రం మాడేలాగ కాల్చటం,అతని పైపంచెలోనే మడిచి కర్రతో చిన్నగా కొట్టటం దగ్గిర్నుండి చూశాను,తిన్నాక ఆ పాలకంకుల రుచి నన్నిప్పటికీ ఆ సీను గుర్తుంచుకునేలా చేసింది!ఇవ్వాళ బొత్తిగా వెరయిటీ లేకుండా ఈ వరి అన్నం ఒక్కదానికే అంటుగట్టుకు పోవడానికి హోటళ్ళు మొదలయ్యాక వాళ్ళు వ్యాపారం పెంచుకోవడానికి బొమ్మకట్టి చూపించిన దృశ్యానికి బలయిపోవటమే కారణమా?!



          ఒక్క పిడికెడు జొన్నలు తింటే ఇక రోజంతా యేమీ తినకపోయినా ఫర్వాలేదనిపిస్తుందనేది యెంతమందికి తెలుసు?ఇక్కడ బ్లాగుల్లోనూ పూర్ణచంద్ గారు వరన్నం,పాలు,పంచదార లాంటి తెల్లనివన్నీ యమ డేంజరు,పళ్ళెంలో రంగు పడితేనే ఒంట్లో రంగు పడుద్ది అంటున్నా ఇంకా ఈ వరన్నం మీద వ్యామోహం పోకపోతే యెట్లా?అసలవి కూడా అఖ్ఖర్లేదు ఒక రెండో నాలుగో అరటిపళ్ళు తిన్నా చాలు గదా!అంత పెద్ద ఆనకట్ట,అదీ ఆ కాలంలో అంతమంది మనుషులతో తను కూడా వాళ్లలో ఒకడిగా కలిసిపోయి పని చేయించి కట్టిన అంత గొప్ప వ్యక్తి ఆర్ధర్ కాటన్ కేవలం అరటిపళ్ల మీదనే ఆధారపడి బతికాడంటే నమ్మగలరా!రావు బాలసరస్వతి గుర్తుందిగా,ఆవిడ ఈ మధ్యనే ఆంధ్రజ్యొతి కిచ్చిన ఇంటర్వూలో నేను ఇప్పటివరకూ కొన్ని కోర్టు కేసుల్ల్లో ఇరుక్కుని ఉన్నాను, అవన్నీ నాకు అనుకూలంగా వచ్చి పరిస్థితి మళ్ళీ ఇదివరకట్లాగ కుదురుకున్నది గనక ఖాళీగా ఉండకుండా మళ్ళీ సినిమాలు తీద్దామనుకుంటున్నాను అనేసరికి కళ్ళు తిరిగినంత పనయింది - యెందుకంటే ఆవిడ వయసు చూస్తే 85 దాటింది,సినిమా తియ్యడం అంటే మాటలా?అంత ధీమాగా చెప్తున్న ఆవిడ ఆహారం పళ్లరసాలు!మనలాగ రోజుకి రెండుమూడుసార్లు ఫుల్లుమీల్సు లాగించకుండా ఆకలేసినప్పుడల్లా  కొంచెం కొంచెం ఫ్రూట్ జ్యూసు తాగుతూ ఆవిడంత గట్టిగా బతుకుతుంటే పూర్ణచంద్ గారు చెప్పినట్టు వరన్నం వల్లనే మనమిలా నీరసంగా తయారయ్యామా, యేమో?నాకింకా దీర్చంగా ఆలోచిస్తే ఇవ్వాళ్టి రోజున దేశాల మధ్యనా రాష్ట్రాల మధ్యనా రావణ కాష్ఠాలు రగిలిస్తూ పెరిగిపోతున్న ఈ నీటి తగాదాలకి కారణం కూడా వరన్నమే ననిపిస్తుంది - వరన్నం అభిమానులు అనామకంగా వచ్చి నన్ను శాపనార్ధాలు పెట్టకుందురు గాక!మీరే ఆలోచించండి,వరి పొలాల కోసమే గదా నారుమళ్ళు చెరువుల్లాగ నింపటం,వాటిల్లో యేకొంచెం నీరు తగ్గినా పంటలు పాడైపోవటం,రైతులు బేజారవ్వటం జరుగుతున్నది,అటు చూస్తే జొన్నలకీ రాగులకీ ఈ గొడవలేమీ అఖ్ఖర్లేదు గదా!ఈ పొలిటికల్ సంగతు లిక్క దేనికి గానీ నాకయితే మనలాంటి ఉద్యొగస్థులు కూడా పొద్దున్నే ఆఫీసుకు పోవటానికి ముందు లంచ్ బాక్సుల్లో వరన్నమూ కూరలూ కలుపుకోవటానికి కాళ్ళు తొక్కుకుంటూ అవస్థలు పడే బదులు బాటిళ్ళలో పళ్ళరసాల్తో ప్రయోగం చేస్తే యెట్లా ఉంటుందా అనిపిస్తుంది,కానీ కుదురుతుందా?కాకపోతే ఈప్లానులో ఒకటే ఈక్నెసు - లంచవరు మిస్సయిపోద్ది,ఆ పేరుతో కొట్టే హస్కు తగ్గిద్ది!



          లంచనీ సప్పరనీ యెక్కువ మొత్తంలో ఒకేసారి తినడం వల్ల జీర్ణక్రియ మీద యెక్కువ భారం పడుతుంది గనక యాండ్రాయిడ్ ఫోన్లలో మాదిరి ఉన్న కొంచేం శక్తిని పొదుపు చెయ్యదం కోసమని నిద్దరొస్తుంది - అదే పై పధ్ధతికి మళ్ళితే రోజంతా హుషారుగా ఉండగలుగుతాము కదా!నిద్ర కూడా రోజూ పదింటికి ఠంచనుగా పక్క యెక్కెయ్యాలనీ 7 గంటల లోపల లేవరాదనీ అనుకోకుండా దేహానికి నిద్ర అవసరమైనప్పుడే నిద్ర పోవాలి - ఆందోళనలు యెక్కువై అసలు నిద్రపట్టకపోతే కంగారు పడాలి గానీ మామూలప్పుడు అలాంటి మిలిటరీ దిసిప్లిను అఖ్ఖర్లేదు!కానీ లేవడం మాత్రం సూర్యొదయానికి ముందు లేచి స్నానాదికాలన్నీ పూర్తి చేసుకుని సూర్యోదయాన్ని సర్వేంద్రియాలతో అనుభవిస్తే ఆ రోజంతా ప్రత్యేకంగా ఉంటుంది!నిద్ర రావడ మంటూ వస్తే పక్కనే బాంబులు పేలినా పట్టించుకోకూడదన్నంత గట్టిగా వస్తేనే పడుకోండి - తిరిగి నిద్ర లేచేలోపు ఈ లోకం యెట్లా పోయినా నాకనవసరమనిపించేటంత గాఢంగా నిద్రపోవాలి,కాకుంటే చుట్టుపక్కల బాడీ లాంగ్వేజి స్పెషలిష్టులు  యెవరైనా ఉన్నారేమో చూసుకోండి - యెందుకంటే మీరు నిద్రపోయే భంగిమని బట్టి మీకున్న మాయరోగాల్ని కూడా కనిపెట్టగలిగేటంతగా ఆరితేరిపోయారు వాళ్ళీమధ్యన!



          ఇక దుస్తుల సంగతి చెప్పాలంటే అదో పెద్ద మైరావణ చరిత్ర!తెల్లోడు మనల్ని నలిపేస్తున్నప్పుడు కాలెజీల్లో కుర్రాళ్ళూ ముసలాళ్ళూ కూడా స్వదేశీ మత్తులో పంచెకట్టులోనూ చీరకట్టులోనూ తిరిగి స్వతంత్రం రాగానే తొక్కలో స్వదేశీని అమాంతం విసిరిపారేసి ప్యాంటుల్లోకీ స్కర్టుల్లోకీ దిగిపోయారు,అప్పటి వాళ్ళెందు కట్లా చేశారో నాకిప్పటికీ మిస్టరీయే!సరిగ్గా భూమధ్యరేఖ మీద తిరుగుతూ ఉన్న మన వేడి ప్రాంతానికి నూలు దుస్తులూ పట్టు చీరలూ ప్రశస్తం,కానీ వినేవాడెవడు?పంచె కడితే విడాకు లిచ్చేస్తానని మా బంగారం యెప్పుడో వార్నింగు ఇచ్చింది గాబట్టి నేనంటే గిట్టని నీహారిక లాంటి వాళ్ళు యెంత బలవంతపెట్టినా నేను కట్టను గాక కట్టను, ఇంక మీకు చెపితే "యెదటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి" అనే ప్రేమనగర్ పాట యెత్తుకుంటారు నా మొహమ్మీదనే!మా నాన్నగారు పోయినప్పుడు కార్యం చేయించడానికొచ్చిన పంతులుగారు ఆ కబురూ ఈ కబురూ చెప్తూ ఇవ్వాళ జనంలో భయమూ భక్తీ పెరిగినాయి గనక మాకుర్రాళ్లకి ఆదాయం బాగానే పెరిగింది గానీ పెళ్ళిళ్ళు మాత్రం కావట్లేదు,మా అమ్మాయిలు గూడా ఈ అచ్చివాయ్ బుచ్చివాయ్ మంత్రాలు చదివే పిలక రాయుళ్ల కన్నా నీటుగా ఏసీల్లో తిరిగే సాఫ్టువేరు కుర్రాళ్ళని చేసుకోవటానికే చూస్తున్నారు అన్నాడు,కాబట్టి ఆడవాళ్ళు తమ కిష్టమైన మగాణ్ణి పంచెకట్టులో చూడాలనేటంతగా మారేవరకూ మనం మగధీరుడి లాగ పంచె కట్టుకు తిరిగాలని ఆశ పెట్టుకునే పని లేదు,అవునా?యేమైనా సరే పంచెకట్టి సాంప్రదాయం నిలబెట్టాల్సిందే నన్న పట్టుదల యే మగాడిలో నైనా ఉంటే నాలుగు రోజుల్లో సన్నాసుల్లో గలిసిపోవడం ఖాయం గనక ఇంటి కన్నా గుడి పదిలం అని నమ్మేవాళ్ళు మాత్రమే సాహసించాలి!



          తిన్నాక తలుపులు బిగించుకుని గమ్మున తొంగుందామనుకున్నఇంటి విషయాని కొస్తే మరీ ఘోరంగా వుంది పరిస్థితి!కాంతి గాని గాలి కాని చొరబడకుండా పట్టపగలు కూడా లైట్లూ ఫ్యాన్లూ వేసుకుని తిరగాల్సిన దరిద్రంలో ఉన్నారు నగరవాసులు!ప్రతిరోజూ ఇంత ధారాళంగా ఎలెక్ట్రిసిటీని వాడుతూ యేడాది కొకసారి ఎర్తవరు పేరుతో ముక్కీ మూలిగీ ఒక గంట ఆపేసినంత మాత్రాన ఉరికిపడే సౌభాగ్యం యేముంటుంది?పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పైరుపచ్చలతో వాగువంకలతో గువ్వాగోరింకల తేట్రింతలతో పిల్లతెమ్మెరలతో కొబ్బరాకుల గలగలలతో కళకళలాడుతూ ఉండాల్సిన పల్లెటూళ్ళు కూడా నగరాలకి కాపీక్యాట్ అయిపోతున్నాయి - కొంతకాలం సిటీలైఫుకి అలవాటు పడి పల్లెటూళ్ళకి వెళ్ళేవాళ్ళు గొప్పకోసం ఆ వైభవాల దరిద్రాన్ని కూడా తమతోపాటు మోసుకురావడంతో!మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి చూస్తే శక్తి నిత్యత్వ నియమం ప్రకారం భూమి మీద కొత్తగా జీవరాశిని పుట్టించలేమని తెలుస్తుంది,తమ చుట్టూ ఉన్న వాతావరణం నుంచి కొంత సారం తమలోకి తీసుకుంటూ అధికంగా చేరిన సారంతో సంఖ్యని పెంచుకుంటూ ఉన్న మొత్తం జీవధాతుసంచయంలో ఒకచోట శిధిల మవుతుంటే ఒకచోట కిసలయిస్తున్నది!అందుకే ఒక ప్రాంతంలోని జీవుల ద్రవ్యరాశిని మొత్తం లెక్కించి బయో మాస్ ఇండెక్స్(BMI) అనే ప్రామాణిక సూచితో కొలుస్తారు.మనిషి ఒక్కడే కాకుండా,అతను పెంచుకునే పెంపుడు జంతువులైన ఆవు,గేదె,కుక్క,చిలుక లాంటి ప్రతి జీవికీ ఆ జీవి జీవనక్రియలు ఆరోగ్యంగా జరగాలంటే వాటికి యెంత గాలి అవసరం,యెంత నీరు కావాలి,వాటిమీద యెంత మేర కాంతి ప్రసరించాలి అనే లెక్కలు స్పష్టంగా ఉన్నాయి.వీటిలో యేది లోపించినా ఆ జీవుల ఆరోగ్యం దెబ్బతింటున్నదని పరిశోధనలు వెల్లడిస్తూనే ఉన్నాయి,అయినా భవన నిర్మాణంలో వీటిని ఉపయోగించుకోవాలనే తెలివిడి అటు కట్టేవారిలోనూ లేదు,ఇటు ఉండేవారిలోనూ లేదు!సౌకర్యం,సౌందర్యం లేని తమ ఇంటితీరు వల్లనే ఒకప్పటి వాళ్ళకి లేని నీరసాలకి బలవుతున్నామనీ, వచ్చేవరకూ వూహించనయినా వూహించలేని కొత్త కొత్త రోగాల బారిన పడుతున్నామనీ యెంతమందికి తెలుసు?సిమెంటు రోజు మొత్తంలో వేడిని మెల్లగా పీల్చుకుంటుంది,తర్వాత వదలడం కూడా అంత మెల్లగానే వదుల్తుంది - దీన్ని హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు - ఇవ్వాళ కొంచెం ఉష్ణోగ్రత పెరగ్గానే నాకంతా తెలిసునని చెప్పుకోవడానికీ యెవణ్ణో ఒకణ్ణి తిట్టడానికీ పనికొచ్చే ఓజోను హోలు గురించి లెక్చర్లు దంచుతారు గానీ యేదైనా రాయిని చూసుకుని - గ్రానైట్ అయినా సరే - దానిమీద యెండ తగ్గి సాయంకాలపు గాలి వీచిన కొద్దిసేపటికి కూర్చుని చూడండి - చాలా చల్లగా ఉంటుంది!భవనాల నిర్మాణంలో సిమెంటు వాడకం ద్వారానూ గాలీ వెల్తురూ చొరబారని చీకటి గుయ్యారాల వల్లనూ ఇంటిలోపల వేడి పెరుగుతుంటే దానికి పరిష్కారంగా ఫ్యానులూ, ఏసీలూ, ఫ్రిజ్జులూ తెచ్చుకుని ఎలెక్ట్రిసిటీని యెక్కువగా వాడుతూ ఖర్చుల్నీ జబ్బుల్నీ పెంచుకుంటున్నాం?పెరిగిన ఖర్చుల్ని తట్టుకోవడానికి తిండికీ నిద్రకీ కూడా తీరిక లేనంతటి యాంత్రికజీవనానికి అలవాటు పడిపోతున్నాం - కనీసం ఇట్లా బతకటం అవసరమా అనే ప్రశ్న కూడా పుట్టదం లేదేమిటి?



          రోగమొస్తే వేసుకునే మందులు కూడా విషాల కన్నా ప్రమాదకరమైనా అవే మింగుతూ కూడా యేదో ఒక చిరుతిండిలో మాత్రమే ఉన్నట్టు ఆ ఒకటీ నిషేధిస్తే చాలునని అల్లరి చేస్తున్న వాళ్ళు యెంత పిచ్చి వాళ్ళు?ఇవ్వాళ క్రిమి సంహారక మందులుగా వాడుతున్నవి నిన్న మొన్నటి ప్రపంచ యుధ్ధాల్లో శత్రుసైనికుల్ని చంపడానికి వుపయోగించినవని యెంతమందికి తెలుసు?మనుషుల్నే చంపగలిగినవి పురుగుల్ని చంపలేవా!వాటిని చంపటానికి పంటల మీద పిచికారీ చేస్తే వాటిని తిన్న మనుషులే చస్తున్నారు తామెందుకు తొందరగా చస్తున్నామో కూడా తెలుసులేని అమాయకత్వంతో!



          మన లోపల జరిగే జీవరసాయనిక క్రియల లోని అసలు మర్మమేమిటో ఇక్కడ వివరిస్తాను,కొంచెం శ్రధ్ధగా చదవండి. ఇప్పుడు చెప్పబోయే విషయం మీద నాకు యెంత అధికారం ఉన్నా మీరు కూడా శ్రధ్ధ చూపిస్తే గానీ యెక్కదు!యెముకలు,దంతాలు,గోళ్ళు,వెంట్రుకలు లాంటివన్నీ కాల్షియం,సల్ఫర్ లాంటి నిర్జీవ మూలకాలతో ఉంటే మిగతా శరీరం మొత్తం గ్లూకోజ్,ప్రోటీన్,ఫ్యాట్ అనే మూడు ముఖ్యమైన మాలిక్యూల్స్ విభిన్న నిష్పత్తులలో కలిసి అనేక రకాలైన కణజాలాల్ని యేర్పరుస్తాయి. కణజాలం అంటే ఒకే రకమైన కణాల గుంపు.నాడీ మండలం యొక్క నిర్మాణ మంతా నాడీ కణాల కలయికతో యేర్పడుతుంది.కండరాలలో ఉండే కణాలన్నీ ఒక రకంగా ఉంటాయి.వాటి వాటి పనుల కోసం నిర్మాణంలో వైవిధ్యం ఉన్నా అన్ని కణాలకీ సామాన్యమైన నిర్మాణం ఒకే రకంగా ఉంటుంది.కణం యొక్క బయటి వాతావరణం నుంచి కణద్రవ్యాన్ని వేరు చేస్తూ ఒక పొర,ఈ జీవద్రవ్యంలో ఒక కేంద్రకం ఉంటాయి.ఈ జీవద్రవ్యంలో జరిగే భౌతిక రసాయనిక క్రియలలోని ఒక విచిత్రమైన అతి చిన్న గారడీయే తన చుట్టూ ఉన్న నిర్జీవ ప్రపంచం నంచి జీవానికి ప్రత్యేకత నిస్తుంది.చిన్నప్పుదు మనం చదువుకున్న ఆస్మాసిస్ పాఠం గుర్తుంది కదా,జీవద్రవ్యంలో కూడా ఈ ఆస్మాసిస్ యెప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మనం ప్రయోగశాలలో చూసే ఆస్మాసిస్ అటూ ఇటూ సమానమైన గాఢత వచ్చేశాక ఇక ఆగిపోతుంది - దాన్ని ఈక్విలిబ్రియం అంటారు!అయితే జీవద్రవ్యంలో జరిగే భౌతికరసాయనిక చర్యలన్నీ పూర్తిగా ఈక్విలిబ్రియం వరకూ వెళ్ళకుండా నిలిపి ఉంచబడతాయి.దీన్ని స్టడీ స్టేట్ అంటారు.ఇదెలా జరుగుతుందంటే మనం ప్రయోగం చేస్తున్న సమతాస్థితిలో ఉన్న ద్రవాల్లో ఒక వైపున గాఢతని పెంచినా తగ్గించినా అవి రెండూ సమానమయ్యేటంత వరకూ ఆస్మాసిస్ మళ్ళీ మొదలవుతుంది కదా - సరిగ్గా ప్రాణుల లోపల స్టడీ స్టేట్ కదలకుండా పట్టి వుంచే అలాంటి మోడిఫికేషనే తన చుట్టూ ఉన్న నిర్జీవ ప్రపంచాన్నుంచి జీవాన్ని వేరు చేస్తున్నది!మనం తీసుకునే ఆహారం చాలా సంక్లిష్టంగా ఉంటుంది.దీన్ని బద్దలు చేసి కణాల వరకూ పంపించటానికి శక్తి కావాలి,ఇవి కణాలలో దహించబడినప్పుడు పుట్టే శక్తి ఈ స్టడీ స్టేట్ అనేదాన్ని పట్టి ఉంచుతుంది!దుర్గంధం రాగానే అనుకోకుండానే ముక్కు మూసుకోవడానికి కారణం అది జీవరసాయనికచర్యల్ని స్టడీ స్టేట్ నుంచి ఈక్విలిబ్రియం వైపుకి బలంగా తొయ్యడం వల్ల జీవధాతువులు ప్రకంపించి పోవటమే కారణం - జీవరసాయనిక చర్యలు పూర్తిగా ఈక్విలిబ్రియం దగ్గిరకి వెళ్ళటం అంటే హంస లేచిపోయిందన్న మాటే?!



          ప్రాచీన భారతీయ వైద్య విధానమైనా ఆధునిక పాశ్చాత్య వైద్య విధానమైనా కారణం లేని రోగం ఉండదు అనే మూలసూత్రాన్ని గట్టిగా నమ్ముతున్నాయి.అందుకే రోగనిర్ధారణ అనేది రెంటిలోనూ అతి ముఖ్యమైనది. శారీరక రోగాలకే కాదు మానసిక రోగాలకి కూడా అవి మనల్ని బాధ పెట్టటానికీ ఆ బాధ తొలగిపోవటానికీ ఒక బలమైన కారణమే ఉంటుంది.యే రోగమూ కారణం లేకుండా రాదు,వచ్చిన యే రోగమూ దానంతటదే తగ్గిపోదు.శారీరక వ్యాధులకి కారణాలు ఇంద్రియాలకి కనపడతాయి గనక వైద్యశాస్త్రంతో సంబంధం లేనివాళ్ళు కూడా గుర్తుపట్టగలుతారు, కానీ మనోవ్యాధుల్ని యెట్లా తెలుసుకోవాలి?అందుకే ఒకప్పుడు ఈ మనోవ్యాధుల్ని తగ్గించటానికి మరోమార్గం కనబడక మంత్రతంత్రాలతో కూడిన భూతవైద్యాన్ని వాడేవాళ్ళు!తొలిసారిగా దీన్ని బద్దలు కొట్టి మానసిక రోగాల్ని సమర్ధవంతంగా నిర్ధారించి నివారణ మార్గాల్ని సూచించటానికి పనికొచ్చే శాస్త్రీయమైన విధానాన్ని ఆధునిక మనోవైజ్ఞానికశాస్త్ర పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ మేధావులైన స్నేహితులూ గురువులూ కూడా ఒక పట్టాన ఒప్పుకోలేనంత విప్లవాత్మకమైన సూత్రీకరణలతోనూ ఆ సూత్రీకరణల్ని ఉపయోగించి తను కొంతమంది వ్యాధిగ్రస్తుల్ని పూర్తి ఆరోగ్యవంతుల్ని చెయ్యడంతోనూ ఒక కుదుపుని తీసుకొచ్చాడు!అతని సూత్రీకరణల్ని యధాతధంగా ఇప్పటి సైకియాట్రిస్టులు రోజువారీ కేసుల్ని పరిష్కరించటానికి వాడకపోయినా కొన్ని జటిలమైన వాటికి మాత్రం ఫ్రాయిడియన్ సైకోఎనాలిసిస్ యొక్క సహాయాన్ని తీసుకుంటున్నారు.ప్రతి కేసుకీ వాడకపోవటానికి కారణం ఫ్రాయిడ్ చెప్పినవి నమ్మటానికి ఇబ్బందిగా అనిపించటమే!ఉదాహరణకి ఒక డాక్టరు తన పేషెంటుకి నువ్వు చిన్నప్పుడు నీ తల్లిని కామించావు అని చెబితే అతను ఒప్పుకోగలడా,మళ్ళీ ఆ డాక్టరు దగ్గిరకి వైద్యం చేయించుకోవటానికి వస్తాడా?ఫ్రాయిడ్ కూడా తన సిధ్ధాంతాన్ని కేవలం ఒక డాక్టరు తన దగ్గిరకొచ్చిన పేషెంటుకి వైద్యం చెయ్యటానికి పనికొచ్చేటందుకు మాత్రమే పరిమితం చెయ్యకుండా మానవాళి సమస్తానికీ ఉపయోగ పడేటందుకు - తమలోనికి చూసుకుని తమలోని దౌర్బల్యాల్ని జయించటానికి పనికొచ్చే తత్వశాస్త్రం లాగ తయారు చేశాడు!"ఆత్మానం విద్ది" అన్న ప్రాచ్య దేశపు జ్ఞానులూ "know thy self" అన్న పశ్చిమ దేశపు జ్ఞానులూ ఆ తెలుసుకోవడం యెట్లా అనేది మాత్రం ఇతమిత్ధంగా చెప్పలేక పోయారు ,ఫ్రాయిడ్ ఆ పనిని పూర్తి చేశాడు - అతడు జ్ఞాని!



          ఆ జ్ఞానంలోని మెచ్చుతునకలు కొన్ని వివరిస్తాను,మొదట నమ్మటానికి ఇబ్బందిగా ఉన్నా స్థిమితంగా ఆలోచిస్తే అవి నిజమేనని ఒప్పుకోవాలనిపిస్తుంది!అమాయకమైన బాల్యం అనేదాన్ని అతడు నిరాకరించాడు. తమ జననేంద్రియాల మధ్యన గల విభిన్నతని  గమనించిన తొలిబాల్యపుదశలొనే యెవరూ చెప్పకుండానే మగపిల్లలకి ఆధిక్యతాభావం ఆడపిల్లలకి అత్మన్యూనతా వస్తాయి.అయితే తలిదండ్రులు మనోవైజ్ఞానిక శాస్త్రం చదవకపోయినా తమ పిల్లల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తే వారు తమ పిల్లలందర్ని సమానంగా చూసి పెంచడం ద్వారా వారిలోని అవలక్షణాల్ని వదిలించగలరు.ఈ వయసులో పాజిటివ్ ధోరణి ఉన్నా ఒకవేళ పెరిగి పెద్దయ్యాక పదే పదే తమమీద ఇతర్లు దాడి చేసే పరిస్థితుల్లో బతకటం తప్పనిసరి అయినప్పుడు నెగెటివ్ ధోరణికి మళ్ళటం జరగవచ్చు - అది దురదృష్టకరమే!అయినా అక్కడ ఆ మనిషి గనక కొంతకాలానికి తప్పు తెలుసుకుని ఆ దుస్థితి నుంచి  బయటపదే అవకాశం ఉంది.కానీ ఈ వయస్సులో నెగిటివ్ ధోరణికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఒకంతట పాజిటివ్ ధోరణికి మళ్ళరు,దానికి కారణం తమలోని తప్పుల్ని తప్పులుగా గుర్తించని స్థాయికి అప్పటికే వెళ్ళిపోవటం!



          ఫ్రాయిడ్ తన కొచ్చిన "ఇర్మా ఇంజక్షన్" అనే కలని విశ్లేషించుకోవడం ద్వారా సూత్రీకరణల్ని యేర్పరచుకోవటం మొదలు పెట్టి అప్పటిదాకా పూర్తి ఆరోగ్యంగా ఉండి హఠాత్తుగా పక్షవాతానికి గురయిన ఒక పేషెంటుని తన పధ్ధతి నుపయోగించి స్వస్థతకి తీసుకురావటంతో ఇక వెనుదిరిగి చూసుకోకుండా తన కాలపు మేధావుల్నీ తద్వారా ప్రపంచంలోని మనోవైజ్ఞానికశాస్త్రజ్ఞు లందర్నీ ప్రభావితం చెయ్యగలిగాడు.మనోవ్యాధికి మందు లేదు,నిజమే!ఇప్పటికీ సైకియాట్రిస్టులు యే రోగాన్నీ మందులతో నయం చెయ్యరు - అదీగాక పూర్తిగా కూడా నయం చెయ్యలేరు!శరీరవైద్యశాస్త్రానికీ మనోవైద్యశాస్త్రానికీ సంబంధించి ఒక జోక్ వుంది,అదేమిటంటే మొదటిదానికి సంబంధించిన పుస్తకాలు చదివితే అక్కడ చెప్పిన జబ్బులన్నీ మనకి ఉన్నట్టు అనిపిస్తుంది,రెండోదానికి సంబంధించిన పుస్తకాలు చదివితే అక్కడ చెప్పిన రోగాలు పక్కవాళ్ళ కున్నట్టు అనిపిస్తుంది!



          పైన చెప్పుకున్న మొదటి పేషెంటు కధ ఇట్లా ఉంది:ఫ్రాయిద్ తన ఫ్రీ అసోసియషన్ అని పేరు పెట్టిన హిప్నాటిక్ ట్రాన్సులోకి వెళ్ళి ఆ అమ్మాయి చెప్పింది యేమిటంటే తన తండ్రి చావు బతుకుల్లో ఉన్న సమయంలో అతడికి సేవ చేస్తూ ఉన్నపుడు ఒకానొక సందర్భంలో మితిమీరిన శృంగార భావనలు చెలరేగడం?!తంద్రిని జాగ్రత్తగా చూసుకోవలసిన సమయంలో అట్లా ఆలోచించినందుకే తండ్రి మరణించాడేమో అనే ఆలోచన కూడా తోడవటంతో అపరాధ భావనకి లోనైంది.శరీరానికి మనం ఇచ్చే పోషణ మనస్సుని యెట్లా ప్రభావితం చేస్తుందో మనస్సు కూడా శరీరాన్ని ప్రభావితం చెయ్య్యగలదు - దీన్ని సైకోసొమాటిక్ ఎఫెక్ట్ అంటారు!"నీ తండ్రి అట్లా పడివుంటే నువ్వు శృంగారం గురించి ఆలోచించావు - నువ్వు నీచురాలివి?" అనే ఒక వాదనా "లేదు,నేను తప్పు చెయ్యలేదు - నేను అమాయకురాలిని!" అనే ప్రతివాదనా చెరోవైపునా అంతరంగంలో యెదతెరిపి లేకుండా సంఘర్షించడంతో మనస్సు అలిసిపోయి దేహాన్ని శిధిలం చేసింది! తనలోనే ఉండి తనని విమర్శించే భాగం యొక్క వ్యతిరేకత నుంచి తప్పించుకోవటానికి కవచంగా కూడా ఈ శరీరం చచ్చుబడిపోవటం ఉపయోగ పడింది - చూడు యెట్లా అయిపోయానో అని జాలి పుట్టించి విమర్శల నుంచి తప్పించుకోఅవచ్చు కదా!ఈ అపరాధ భావన నుంచి తప్పించుకోవటానికి వాడుకునే షీల్డింగ్ మెకానిజమే మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞులకి పని కల్పించే లక్షోపలక్షల మనోవ్యాధులకి మూలం!



          ఈ షీల్డింగ్ మెకానిజం రెండు రకాలుగా ఉంటుంది - ఆ అమ్మాయిలో పాసివ్ షీల్డింగ్ ఉండటం వల్ల  తనకు పక్షవాతాన్ని తెచ్చుకుని కృశించింది,అగ్రెసివ్ షీల్దింగ్ మెకానిజం ఉంటే తన చుట్టూ ఉన్న మనుషుల్ని విసిగించి ఉండేది.షీల్డింగ్ పాసివ్ స్ట్రాటజీలో ఉన్నా అగ్రెసివ్ స్ట్రాటజీలో ఉన్నా తనలో సమాజం అనుమతించని భావాలు ఉండటం వల్ల సమాజం శిక్షిస్తుందనే భయమూ తనకు ఆ భావాల పట్ల మమకారం ఉండటం వల్ల వాట్ని వదులుకోలేని మోహమూ ఒకేసారి విజృంభించటంతో గందరగోళం,అసహనం,కోపం లాంటివి ప్రవర్తనలో ప్రముఖంగా కనపదతాయి!ఆత్మహింస, పరహింస - ఈ రెంటిలో దేనినైనా సరే యే స్థాయిలోనైనా చెయ్యడానికి వెనుదీయని మొండిధైర్యం మాత్రం అధికంగా ఉంటుంది. ఈ సంక్లిష్టతలేవీ లేని మిగతా వారి కన్నా ప్రత్యేకంగా ప్రవర్తిస్తారు.ఈ ప్రత్యేకతలకి తోడు స్వానురాగం కూడా తోడైతే అగ్నికి వాయువు తోడైనట్టే!ఇటువంటి అగ్రెసివ్ షీల్డింగ్ మెకానిజం ప్రభావంలో ఉన్న వ్యక్తులతో వాదనకి దిగితే అవతలి వారు గెలవటం కష్టమే కాదు అసంభవం!యెందుకంటే, యెదటివారి మీద పైచేయిగా ఉంటేనే తమ ఆత్మన్యూనత పైకి లేవకుండా ఉంటుంది గాబట్టి యెంత అడ్డదిడ్డంగా వాదించి అయినా సరే తమదే ఆఖరి మాట అయ్యేటట్టు జాగ్రత్త పడతారు!అవతలివారికి విసుగు పుట్టి ఆపెయ్యాల్సిందే తప్ప వీరి వైపు నుంచి మాత్రం చర్చ ఆపరు గాక ఆపరు!వారికి కావలసిన షీల్డింగ్ గెలవటం - అంతే?!"రాముడిపై నా ఆరోపణలు రెండు...ఒకటి స్త్రీలపై హింసను మొదలుపెట్టిందే రాముడు. రెండు వివాహ వ్యవస్థలో విడాకులు తీసుకువచ్చిందే రాముడైతే ఆదర్శ దాంపత్యం ఎలా అయింది ?అన్న కొద్దిసేపట్లోనే "మీరు రాముడిని కేవలం అభిమానిస్తున్నారు,నేను రాముడిని అనుకరించాలని ప్రయత్నిస్తున్నాను.అని కూడా అనగలరు. యేదో ఒక విధంగా యెదటివాళ్ళ వాదనల్ని యెట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకుని వాళ్ళ కన్నా తక్కువగా ఉండటానికి సిధ్ధపదకపోవటం వల్ల్ల "నేను కాశ్మీర్ సమస్యని పరిష్కరించటానికే రామజన్మభూమి సమస్యలో వేలు పెట్టాను" అని కానీ "సంస్కృతం నేర్చుకోవాలన్న కోరికా తీరికా లేవు . రామాయణాన్ని చదివే ఉద్దేశ్యం ప్రస్థుతానికి లేదు.ఉర్దూ నేర్చుకున్నా ఇంగ్లీష్ నేర్చుకున్నా నాకు ఉపయోగపడుతుంది.నా ప్రాజెక్ట్ కొంచెం ముందుకెళుతుంది.రాముడిని ద్వేషించినా తరించవచ్చు అని ఆర్యుల ఉవాచ !సామాన్యులకు అర్ధమయ్యేలాగా చెప్పవలసిన బాధ్యత రాముడి తరుపున వకాల్తా పుచ్చుకున్న వారిదే !" అని కానీ మరోరకమైన వాదన కానీ యెంతో గంభీరంగా చెయ్యగలరు, మనకి తెలితక్కువగా అనిపిస్తుంది గానీ వారికి కాదు - వారిలో ఉన్న ఆత్మన్యూనత+స్వానురాగం ఆపని చెయ్యనివ్వదు!ఈ అగ్రెసివ్ స్ట్రాటజీ యెట్లా పని చేస్తుందంటే "నేను వీళ్ళందరి కన్నా యెంతో ప్రత్యేకమైన యెన్నో రెట్లు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని,నేను వీళ్ళని శిక్షించగలనే కానీ నాముందు ఓటమి నంగీకరించిన వీళ్ళు నన్ను శిక్షించలేరు" అనే సమర్ధన దొరుకుతుంది అపరాధ భావనకి కవచంగా!తను ద్వెషించే తన అసలు ప్రవరనని మరుగుపరుస్తూ మారుపేర్లతో పూర్తి భిన్నమైన వ్యక్తిలా వ్యవహరించటం కూడా షీల్డింగ్ చేసే గారడీయే,ఇక్కడ తక్కువ గానీ అమెరికా వంటి దేశాల్లో ఒకే మనిషి నాలుగైదు విభిన్న వ్యక్తిత్వాల్ని ప్రదర్శించే కేసులు చాలా బయట పడ్డాయి,వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ తను ఒక రకమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో తనదే అయిన మరో వ్యక్తిత్వానికి సంబంధించిన కనీసపు జ్ఞాపకం కూడా ఉండదు వాళ్ళకి - మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్దర్ అంటారు దీన్ని! తమకి అపరాధభావన కలగజేసే విషయాల ప్రభావం లేనప్పుడు యెంతో తెలివిగా కనపడటం వల్ల ఇతర్లకి వింతగా అనిపిస్తుంది - అంత తెలివిగా ఉన్నవాళ్ళు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నా రేమిటని?ఇలాంటి యెన్ని కేసుల్ని తరచి చూసినా ఇలాంటివారి కందరికీ రెండే రెండు అంత్యదశలు కనబడుతున్నాయి - ఒకటి తనలోని లోపాన్ని తెలుసుకుని మనసులోని అపరాధ బావనల్ని తగ్గించుకుని సమాజానికీ తనకీ ఉండే సంతులనాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన ప్రవర్తనకి మళ్లటం, లేదా మార్క్ ట్వయిన్ రాసిన విచిత్రవ్యక్తి కధ చివర్లో పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించే చర్చి ఫాదర్ పాత్ర లాగ స్థిరపడి పోవటం?విజ్ఞులైన వారు యెవ్వరూ ఆ స్థాయిలో అపరాధభావనలు తమలో ఉండకుండా జాగ్రత్త పడాలి. తమకు తెలిసిన వారిలో ఉంటే వీలయితే వారిని సరిదిద్దటానికి ప్రయత్నించటం లేదంటే వారికి వీలయినంత దూరంగా ఉండటం తప్ప తమకూ అది అంటుకోకుండా ఉండటానికి మరో మార్గం లేదు?!మానసిక వైద్యం కూడా ఆ వ్యక్తి సంసిధ్ధత లేకుండా పని చెయ్యదు!మనోవైద్యులు చేసేది కూడా ఆ వ్యక్తికి తన రుగ్మతని తొలగించుకోవటానికి సూచనలు ఇస్తూ సహాయం చెయ్యటమే తప్ప సొంతంగా పూనుకుని చేసే వైద్యం అంటూ ఉండదు అక్కడ!చంద్రమా మానసో జాతః అన్నట్టు అన్ని సమస్యలకీ మనస్సు ముఖ్యం అని తెలిసిన వాళ్ళు గనకనే మనసుని నిర్మలంగా ఉంచుకోవటానికి సూర్యనమస్కారాల నుంచి మొదలు పెట్టి యోగాసనాల వరకూ యెన్నో సాధనాల్ని సమకూర్చి ఉంచారు మన ప్రాచీనులు, వాటిని ఉపయోగించుకోకుండా దాని అవసరం కూడా తెలియని అల్లోపతి వెంట పడటాన్ని తగ్గించుకోవడం మంచిది!



          అల్లోపతి మందులకి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ గురించి వింటూనే ఉంటారు,అవి చేసే పని ఈ స్టడీ స్టేట్ మెకానిజం బలహీన పడేలా చెయ్యటమే!అల్లోపతి మందులు వాడేవాళ్ళకీ ఇచ్చేవాళ్ళకీ కావలసిన శీఘ్ర నివారణ ఆ మందుల్ని వాళ్ళు ఆ పవరు కోసం పడే పాట్లు సైడ్ ఎఫెక్ట్స్ గురించి పట్టించుకోకుండా చేస్తున్నాయి?దీనికి బిన్నంగా భారతీయ సాంప్రదాయిక వైద్యవిధానంలో రోగాన్ని తగ్గించటానికి పనికొచ్చే అసలు మందుతో పాటు ఈ సైడ్ ఎఫెక్ట్స్ మీద పనిచేసే మరో దినుసుని కూడా కలపటం అనేది చాలా పట్టుదలగా చేస్తారు,స్టడీ స్టేట్ మెకానిజంని దెబ్బతియ్యకుండా ఉండటానికే యెక్కువ సమయం తీసుకుంటారు!మన సాంప్రదాయక వైద్యవిధానం యొక్క శక్తిని నేను మా ఇంట్లోనే కళ్ళారా చూశాను.నగర జీవనం ఆడవాళ్ళ సుకుమారమైన దేహాల మీద చూపించే ప్రభావం మా బంగారం మీద కూడా పడింది!అల్లోపతిలో ఆపరేషన్ చేసినా పూర్తిగా నయమవుతందనే గ్యారెంటీ లేని ఒక సున్నితమైన సమస్యకి ఆయుర్వేదంలో మంచి ఫలితం కనిపించింది!మొదత్లో మామూలు నడకే కష్టంగా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు తన ఇదివరకటి స్థితికి కేవలం మూడువారాల్లో వచ్చేసింది - ఖర్చు కూడా కేవలం రూ.30,000 మాత్రమే!ఆ పంతులు గారు భయమూ భక్తీ పెరిగాయన్నది కరెక్టే - హాస్పిటల్ కెళ్తున్నా రోగం తగ్గుతుందో లేదో అనే గ్యారెంటీ లేకపోతేనూ ఖర్చు తడిసి మోపెడవుతుందేమో ననిపిస్తేనూ మొదట గుర్తొచ్చేది దేముడే కదా!



          యెందరో పురాణ పురుషుల్ని కళ్లకి కట్టినట్టు చూపించి తిరపతి భక్తుల్తో మొక్కించుకుని దేవుడల్లే బతికి రాజకీయాలలోకి తారాజువ్వలాగ వొచ్చి కాంగ్రెసు పార్టీ ధణుతెగరగొట్టి వచ్చినవాడు ఫల్గుణుదు అన్నట్టు యెకాయెకి ముఖ్యమంత్రి పీఠానికే యెక్కిన యెంటీవోడు యెక్కడో యెవడో గొట్టాంగాడుఒక అత్యాచారం చేస్తే తను విరక్తి ఫీలయ్యి కాషాయం కట్టాడు,కానీ కట్టిన తీరు మాత్రం కన్యాశుల్కంలో గిరీశం వేషంలో తను కట్టిన షోకిల్లా పధ్ధతిలో చెంగు ధోవతి జేబులోకి దోపాడు - దాని కిక్కునిచ్చే యెఫెక్టు వల్లనే కాబోలు అతి కొద్దికాలంలోనే మళ్ళీ సంసారి అయ్యి తెల్లధోవతికి మారాడు!?ఆ కాలంలో యెవరయినా మగాడు ఆ తీరులో పంచె కట్టి మణికట్టుకి మల్ల్లెపూలు చుట్టి గడప దాటితే "యెక్క్కడికి వెళ్తున్నావు?" అని అడిగిన వాడు పాపాత్ముడు?!కులస్త్రీలకి శ్రంగారం నిషేధం -  భర్తగారు కోరుకుంటే దగ్గిర కొచ్చి కోరిక తీర్చిపోవటం తప్ప తానుగా నవ్వను కూడా నవ్వకూదదు?పురుషులకి మాత్రం స్వేచావిహారం - వెలయాలు ప్రియురాలిగా లేనివాడు అసమర్ధుడే!ఇప్పటికీ ఆడది నాకు అలా ఉంటే బాగుంటుంది అని రొమాన్సు గురించి మాట్లాడితే కంగారు పడని మగవాళ్ళు చాలా తక్కువ - అన్ని మైనారిటీ వర్గాల కన్నా మంచివాళ్ళు అనే వర్గం మరీ దిక్కూ దివాణం లేని మైనారిటీ ఇవ్వాళ!శృంగారం అనేది మగవాడు ఆడదాని నుంచి ఆనందం పొందడానికే తప్ప ఆడదాని మనోభావాలకి అందులో తావులేదని అనుకోవడం వల్లనే ఇవ్వాళ స్త్రీల మీద అన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి.బలం ఉన్నవాడు బలాత్కారం చేస్తున్నాడు,తెలివి ఉన్నవాడు కల్లబొల్లి కబుర్లు చెప్పి తన కోరిక తీరాక తన దారిన తను పోతున్నాడు,సౌజన్యం ఉన్నవాడు స్నేహంతో ఆకట్టుకుంటున్నాడు - మనిషి ప్రవర్తనలో కనబడే అన్ని రకాల పాజిటివ్,నెగటివ్ ఆలోచనల మీద కూడా ఆ మనిషి యొక్క శృంగార జీవితం లోని అంశాలు ప్రభావం చూపిస్తున్నాయని ఇటెవలి పరిశోధనల ద్వారా నిర్ద్వందంగా నిరూపించబడింది.అయితే పశ్చిమ దేశాల విజ్ఞానం ఈరోజు చెప్తున్న దానిని మన ఋషులు యెప్పుడో గ్రహించారు - వాత్స్యాయన ఋషి రచించిన కామసూత్ర గ్రంధం యెప్పటిది?వేదాంతం గురించి చెప్పే భగవద్గీతలో "కామమ్ము లందు ధర్మావిరుధ్ధ కామమ్ము నేను" అని ప్రస్తావించడ మంటే దానికెంతటి విలువనిచ్చారో తెలుస్తున్నది గదా!కామి గానివాడు మోక్షగామి కాడు అనే ఉద్దశంలో కాబోలు మానవు లంతా తప్పక సాధించాల్సిన నాలుగు పురుషార్ధాలలో మోక్షానికి ఒక మెట్టు కింద మూడో పురుషార్ధంగా నిలబెట్టారు.వాత్స్యాయనుడు శ్రంగారం పురుషుడు స్రీని సంతోషంగా ఉంచడం కోసం ఆమెకి ఇష్టమైన పధ్ధతిలోనే చెయ్యదం తన కర్తవ్యంగా భావించాలని  - అంటే పురుషుడి కోసం స్త్రీ కాదు స్త్రీ కోసమే పురుషుడు అని బల్ల గుద్ది చెప్తున్నాడు, ఇప్పటి మన నమ్మకాలకి పూర్తి విరుధ్ధంగా ఉంది కదూ!

          అపారమైన జలరాశి మధ్య నిలబడినా మన దోసిలి పట్టినంత నీటినే మనం తాగగలం - చెంబు కొద్దీ గంగ!జ్ఞానం కూడా అంతే - తిండీ,నిద్రా,బట్టా,నిద్రా,ఇల్లూ,శ్రంగారం లాంటివాటిలో ఉన్నట్టుగానే మితమైన జ్ఞానమే హితం.పరిధిని మించిన జ్ఞానం ప్రమాదం?మన ముందున్న సమస్యకి కొత్త సమస్యల్ని తెచ్చిపెట్తని ఒక చక్కని పరిష్కారం సాధించుకోవటానికి పనికొచ్చేటంత జ్ఞానం చాలు.చదివింది అర్ధం చేసుకుని అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకునే లక్షణం లేకుండా దెభ్భైవేల పుస్తకాలు చదివినా లక్ష పుస్తకాలు చదివినా వ్యర్ధమే?అబధ్ధాలతో పేనవేసుకున్న సంస్కృతీ ప్రభావం వల్ల మనలో కొత్తగా దిగబడిన ఈ వింతైన మూఢనమ్మకాల్ని పోగొట్టుకోవటానికి న్యాయబుధ్ధితో ఆలొచించి సత్యసౌందర్యంతో విలసిల్లే ధర్మమార్గం వైపుకి నడిచే ఉద్దేశం లేనంతకాలం మనం యెవరినైనా గానీ యెవరైనా మనని గానీ దీర్ఘాయుష్మాన్ భవ అని యెంత నిండు మనస్సుతో దీవించినా అది పనిచెయ్యదు!

          అదేమిటో,పరాధీనతలో ఉండగా పౌరుషంతో స్వతంత్రభావనల్ని మానసాల్లో నింపుకున్నామన్నారు, ఆ స్వతంత్రం రాగానే వల్లమాలిన నిర్లక్ష్యంతో పరాధీనులైపోయారు - యేమి చిత్రమైన జాతిరా ఇది!పరాధీనతని జాతికంతటికీ నీచంగా చూపి స్వపరిపాలన రాగానే ప్రజల్ని స్వాభిమానంతో తలయెత్తుకు తిరిగేలా చేస్తామని ప్రగల్భించారు,ఆ స్వాధీనత ప్రాప్తించగానే మన సంస్కృతినే పరిహసిస్తూ హాస్యానికి కాదు నిజంగానే మనవాళ్లుత్త వెధవాయలోయ్ అనుకునేటట్టు ప్రవర్తిస్తున్నారు - యెంత నికృష్టమైన వాళ్ళురా వీళ్ళు?


యేది సత్యమో అదే శివమూ అవుతుంది!యేది శివమో అదే సుందరమూ అవుతుంది!!
సత్యం శివం సుందరం!!!
-----------------------------------------------------------------------------------------------------------------
(చిత్రదాత:గూగులమ్మ)

Wednesday 17 June 2015

ఈ దేశ చరిత్రకి తొలిసారి మిరియాల కషాయం తాగించిన వాస్కో డ గామా నిజంగా మనం గౌరవించాల్సిన వాడేనా?

మీరు గోవాలో కానీ కొచ్చిన్ కోట ప్రాంతంలో గానీ తిరుగుతూ ఉంటే యెక్కడో అక్కడ తొలిసారిగా భారత్ అనే ఒక ధనధాన్యసమృధ్ధులతో తులతూగే సంపద్విలసితమైన భూఖండం మీద అడుగుపెట్టిన విదేశీ యాత్రికుడిగా వాస్కో డ గామాను స్మరించే జ్ఞాపికలు కనబడతాయి.చరిత్రని శ్రధ్ధగా అధ్యయనం చెయ్యనివాళ్ళు ఆ ప్రతిమల పట్ల మన ప్రభుత్వాలూ కొందరు ప్రముఖులూ చూపించే గౌరవాదరాల్ని గమనించి చూస్తే అతను ఈ దేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన అవతార పురుషడని భ్రమించే అవకాశం యెంతైనా ఉంది!కానీ యదార్ధంగా ఈ దేశ ప్రజల మీద అతడు చేసిన దారుణాలు తెలుసుకుంటే ఆ విగ్రహాల నలా క్షేమంగా కాపాడుతూ పాఠ్యపుస్తకాలలో అతని ఘనకార్యాన్ని మాత్రమే కీర్తిస్తూ అధ్యాయాలకి అధ్యాయాలే కేటాయిస్తుంటే బుధ్ధిగా చదువుకుంటున్నందుకు మనలో దేశభక్తి అంటూ ఉంటే మనమీద మనకే అసహ్యం కలుగుతుంది,కానీ అసలు కధ యెంతమందికి తెలుసు?

వాస్కో డ గామా పోర్చుగల్ దేశంలో సైన్యంలో అతి తకువ స్థాయిలో చేరి అతి వేగంగా యెదుగుతూ 1460 కల్లా సైన్స్(Sines) నగరానికి గవర్నరు హోదాకు చేరుకున్న Estêvão da Gama అనే వ్యక్తికి 140లో మూడో కొడుకుగా పుట్టాడు.వాస్కో డ గామా బాల్యం గురించి యెక్కువగా తెలియదు.ఒక పోర్చుగీసు చరిత్రకారుని అభిప్రాయం ప్రకారం ఎవొర పట్టనంలో లెక్కలు,నౌకాయానం నేర్చుకున్నాడు.

1487లో ప్రపంచ నావికా చరిత్రలో ఒక విశేషమైన సంఘటన జరిగింది.బార్తలోమ్యూ డయాస్ అనే అతను ఆఫ్రికా ఖంపు కొసన ఉన్న గుడ్ హోప్ అనే ప్రాంతానికి చేరగలిగాడు.దీనివల్ల అట్లాటిక్ సముద్రం హిందూ మహా సముద్రం కలిసి ఉన్నాయని తెలిసింది.దీనితో యూరోప్ ఖండం లోని చాలామందికి అప్పటిదాకా సిరిసంపదలతో తులతూగుతున్నదని విఖ్యాతి గాంచిన భారతదేశాన్ని పట్టుకోవాలనే ఆశ రగిలింది!1490ల కల్ల్లా రాజైన మాన్యూల్ మనసులో ఒక స్థిరనిశ్చయం కలిగింది.కేవలం అతని దేశానికి సంపదని సాధించుకోవటమే కాకుండా తూర్పు దేశాల్ని పట్టి ఇస్లాముని మట్టుబెట్టి జెరూసలేం ప్రభువుగా అవతరించాలనేది అతని ఆలోచన.

ఆతని ఆశీస్సులతో ఆజ్ఞాపత్రంతో 1497 జూలై 8న లిస్బన్ రేవు పట్టణం నుంచి నాలుగు వెనక వచ్చే నావలతో సెయింట్ గాబ్రియేల్ పేరు గల తన ఫ్లాగ్ షిప్ కూడా కలిపి 170 మంది సిబ్బందితో బయలు దేరాడు.కొన్ని నెలల పాటు తెలిసిన దారిలోనే ప్రయాణించి గుడ్ హోప్ చేరి అక్కడి నుంచి తనదైన కొత్తదారిలో ప్రయాణం చేసి జనవరికి హిందూ మహాసముద్రంలో ఇప్పటి మొజాంబిక్ దగ్గిర లంగరు వేశాడు.చాలామంది నావికులు రోగాల బారిన పడటంతో విశ్రాంతి తీసుకుని నావలకి రిపేర్లు చేసుకుని మళ్ళీ మార్చ్ 1498లో మొజాంబిక్ నుంచి లంగరు యెత్తారు.

ఏప్రిల్ కల్లా ఇప్పటి కెన్యా ప్రాంతాన్ని చేరుకుని ఆగకుండా అక్కడి నుంచి బయలుదేరి మరో 23 రోజుల ప్రయాణంతో మే 20న కాలికట్ నగరాన్ని చేరుకున్నాడు.కానీ వాస్కో అజ్ఞానం వల్ల ఆ ప్రాంతం వాళ్ళు క్రైస్తవులని భ్రమపడ్డాడు.కాలికట్ ప్రంతంలోని వారంతా హిందువులు కాగా అప్పటికి వాస్కో కి గానీ అతని బృందానికి గానీ హిందూ మతం అనే ఒక మతం ఉందని తెలియకపోవడం వల్ల యేర్పడిన తికమక అది!అప్పటి ప్రభువు స్నేహపూరితంగా ఆహ్వానం పలికినప్పతికీ మూడు నెలలు గడిపినా ఇరువర్గాల మధ్యనా సయోధ్య ఏర్పడలేదు.అప్పటికే రాజుకి దగ్గిరగా ఉన్న ముస్లిము వ్యాపారులు వాస్కోకి రాజుతో వ్యాపార సంబంధాలు యేర్పరచుకునే అవకాశం యేర్పడనివ్వలేదు.

ఇక లాభం లేదని నిశ్చయించుకుని ఆగస్ట్ 1498లో నిరాశతో పోర్చుగల్ వెళ్ళిపోవటానికి మళ్ళీ లంగరు యెత్తాడు.ఈసారి వాస్కో బయలుదేరిన వేళావిశేషం బాగులేదు - ఋతుపవనాలు మొదలవటంతో వర్షాలతో శిధిలమైపోయాడు.మామూలు నేల మీద వర్షం పడితే ఫర్వాలేదు గానీ సముద్రం మీద ప్రయాణించే సమయంలో పడే వర్షాన్ని యెంతటివాదైనా తట్టుకోలేడు!చాలామంది నావికులు స్కర్వీ బారిన పడటంతో పొదుపు కోసం తన నావల్లో ఒకదాన్ని తగలబెట్టేశాడు?ఆఖరికి బయలుదేరిన సంవత్సరం తర్వాత 1499 జులై 10న వాస్కో నావల్లోని మొదటి నావ పోర్చుగల్ తీరాన్ని చేరింది.మొత్తం మీద వాస్కో సుమారు రెండు సంవత్సరాల పాటు 24,000 మైళ్ళు ప్రయాణించాడు,170 మందిలో 54 మనది మాత్రమే ప్రాణాలతో పోర్చుగల్ గడ్డమీద తిరిగి అడుగుపెట్టగలిగారు!

వాస్కోకి అపూర్వస్వాగతం లభించింది,ఇక ముస్లిము వ్యాపారుల్ని అణిచివేసి భారత్ అనే బంగారుకోడిపెట్టని ఒడిసిపట్టటానికి పాడ్రో అల్వరస్ కాబ్రల్ అనే వాడితో కొన్ని నౌకల్ని పంపించారు.ముస్లిం వ్యాపారులతో జరిగిన సంకులసమరంలో 800 మంది ముస్లిం వ్యాపారుల్ని నౌకలతో సహా హతమార్చి విజయగర్వంతో వెనక్కి వెళ్ళాడు కాబ్రల్!అతను భారతదేసంలో తొలి పోర్చుగల్ వ్యాపార స్థవరాన్ని యేర్పాటు చేశాడు.మళ్ళీ 1592లో వాస్కో 20 నౌకలతో భారతదేశానికి బయలు దేరాడు.10 నౌకలు అతని సొంత అధికారం కింద ఉండగా అతని మేనమామ,మేనల్లుదు కూడా ఈసారి భాగస్తు లయ్యారు.అప్పటి వరకూ తను సాధించిన ఘనకార్యాలతోనూ కాబ్రల్ మూలంగా అప్పటికే భారత భూభాగం మీద యేర్పడి ఉన్న అనుకూలతల వల్లా అతని కంటే తాను ఘనుడనని నిరూపించుకోవాలనే వీరావేశంతోనూ మత్తెక్కిపోయి ఇక తనలో అప్పటి వరకూ దాగి ఉన్న పోర్చుగల్ శౌర్యాన్ని ప్రదర్శించాలనుకున్నాడు వాస్కో!

తన వీరత్వ ప్రదర్శన కోసం యెక్కడ ముస్లిం కనిపిస్తే అక్కడల్లా సజీవ దహనమే!ఆఖరికి మక్కా వెళ్ళి తిరిగొచ్చే యాత్రికుల నావని సైతం,అందులో మహిళలూ చిన్నపిల్లలూ ఉన్నారని తెలిసి కూడా యేమాత్రం దయలేకుండా తగలబెట్టేశడు?!ఆ వెంటనే కాలికట్ నగరం చేరుకుని మొదటిసారి వచ్చినప్పుడు తనకి అనుకూలంగా ఉండనదుకు ప్రతీకారంగా కాబోలు అక్కడి వైభవాన్నంతా ఛిన్నాభిన్నం చేసి 38 మందిని బందీలుగా పట్టుకుని కాలికట్ నగరానికి దక్షిణ దిశలో ఉన్న కొచ్చిన్ రేవుని చేరుకున్నాడు.ఆక్కడి ప్రభువుతో వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకుని 1503 ఫిబవరి 20న స్వదేశానికి తిరుగుముఖం పట్టి అక్తోబర్ 11న పోర్చుగల్ చేరాడు.రెండోసారి అతనికి తన ఘనవిజయాలకి తగ్గ గుర్తింపు రాలేదని కొంత అసంతృప్తిగా అనిపించినా రాజుకి భారతదేశానికి సంబంధించిన విషయాల్లో సలహాలు ఇచ్చే పదవిని పొంది 1519లో కౌంట్ బిరుదును చేజిక్కించుకున్నాడు.పోర్చుగీసు అధికారుల్లో పెరుగుతున్న అవినీతిని అణిచివెయ్యటానికి 1524లో వైస్రాయ్ పదవి నిచ్చి భారతదేశానికి పంపిస్తే ఒక సంవత్సరంలోనే ఆరోగ్యం చెడి కొచ్చిన్ నగరంలో తనువు చాలించాడు.వాస్కో డ గామా వల్ల ఈ దేశానికి జరిగిన భావి విషాదం యేమిటో తెలుసా?సరిగ్గా శతాబ్దం కూడా దాటకుండా అతడు చూపించిన సముద్రమార్గంలోనే ఆంగ్లేయులూ ఫ్రెంచివారూ వచ్చిపడి పోర్చుగీసుల స్థానం కోసం ఒకరితో ఒకరు పక్కింటి వాళ్ళు మనింటికొచ్చి యెవరు మనని యెక్కువ దోచుకు తినాలనే రకంగా పందేలు వేసుకుని పోరాడుకుంటూ మొదట పోర్చుగీసు వాళ్ళని తరిమికొట్టి తర్వాత జరిగిన పరస్పరారోహణ క్రమంలో ఆంగ్లేయులు విజృంభించి ఈ దాశాన్ని తమ పాదపీఠంగా మార్చుకోవడం!

అప్పటికే తీసిన ప్రతి సినిమాలోనూ దేశం పట్ల తనకున్న బాధ్యతని చూపించిన సంతోష్ శివన్ ఈ వాస్కో డ గామా ప్రతిమల్ని పదే పదే చూస్తూ ఆవేదనతో దహించుకుపోతూ అతని నిజరూపాన్ని చూపించే ఒక కధాంశాన్ని ఆలోచించుకున్నాడు.అతని ఆలోచనల్ని  యధాతధంగా చదివితే "ఉరుమి" అనే సినిమా తియ్యడం వెనక ఉన్న అతని సిన్సియారిటీ తెలుస్తుంది:"Whenever you travel to Goa or Fort Kochi or such places, you will always find a suite in the name of Vasco da Gama who is revered as a discoverer of India. But when you delve deeper into the history, you will realize that he discovered India for the Western world but he is the conqueror, the first colonial ruler in the world as they all came to trade in pepper but instead of trading they decided to conquer the place. Hence I thought it would be interesting to make a film that would show the small peppercorn changing the entire history of India. I think for every Indian it would be interesting."
ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు కనిపించిన మొదటి అధ్భుతం జెనీలియా డిసౌజా!తెలుగు సినిమాల్లో హీరో చుట్టూ తిరుగుతూ ఆటపాటలకి మాత్రమే పరిమితమైన ఈ గ్లామర్ తార ఇందులో ఆరక్కళ్ ఆయేషా అనే వీరనారిగా కన్ను చెదిరే నటనా సౌందర్యంతో ప్రకాశించింది!ప్రతిభ ఉండి ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం దేనికని అలాంటి సినిమాల్లో నటించిందే తప్ప ఒక గంభీరమైన పాత్ర ఇస్తే ఆ పాత్రని అంతే గొప్పగా చూపించగలనని నిరూపించుకుంది,శభాష్ జెనీలియా - శెభాష్!గ్లామర్ కురిపించే పాత్రల్లో పడుచువాళ్ళ గుండెల్లో కలకలం రేపగలిగిన ఆమె కళ్ళు చాలా పవర్ఫుల్ అని మీకూ తెలుసు,కానీ ఈ సినిమాలో ఆపాదమస్తకం తన పవర్ చూపించింది - కత్తి లాంటి నటి కత్తి చేతబట్టి కత్తిలాగ మెరిసింది!ఆరక్కళ్ ఆయేషా రూపురేఖలు తెలియక పోయినా తను కూడా ఇలాగే చూస్తుందేమో,తను కూడా ఇలాగే కదుల్తుందేమో,తను కూడా ఇలాగే మాట్లాడుతుందేమోనని భ్రమిపంపజేసేలా కనబడింది తెరమీద!

ఈ సినిమాలో నాకు సంతోషాన్ని కలిగించిన మరో అంశం ఇవ్వాళ ఆంగ్లేయుల దుర్నీతికి గురై పరస్పరం కలహించుకుంటున్న హిందువులూ ముస్లిములూ సోదర సమానులుగా కలిసిపోయి బతుకుతున్న నిరుడు కురిసిన హిమసమూహాల్ని చూడటం!ఒక రాజు తన కూతురు ఒక ముస్లిముని ఇష్టపడుతున్నదని తెలిసి యేమాత్రం సంకోచించకుండా తనంతట తనే పూనుకుని వాళ్ళిద్దరూ సంతోషపడేలా వివాహం జరిపించడానికి నిర్ణయించుకోవడం ఇవ్వాళ చూడగలమా?"పుణ్యభూమి నా దేశం నమో నమామి" లాంటి దేశభక్తి గేయాలు యేవీ లేకపోయినా సినిమా పూర్తయ్యేసరికి దేశభక్తి నరనరాల్లోకి ఇంట్రావీనస్ ఇంజక్షన్ లాగ యెక్కిపోయేటంత తెలివిగా తీశాడు దర్శకుడు ఈ సినిమాని,దానికెంత ప్రతిభ కావాలో గదా!సంతోష్ శివన్ కున్న దేశభక్తి ఉంది అలాంటి టెక్నిక్ వెనక!పాటగా వినిపిస్తే ఆ పాట చెవులకి వినబడుతున్నప్పుడే ఆవేశం పుడుతుంది,కానీ కధలోనే అంతర్లీనంగా ఇమిడ్చితే ఆ కధ గుర్తున్నంత కాలం ఆ స్పందన ఉంటుంది,అవునా?

ఈ దేశచరిత్రని పరమ దుర్భరమైన పరాధీనతకి నడిపించిన విషాద భరితమైన కాలానికి సంబంధించిన కధని తీసుకుని ఆనాడు ఆ పరాధీనతని తప్పించడానికి తమ ప్రాఅణాల్ని పణంగా పెట్టిన వీరకుమారుల్ని యేమాత్రం ఆదంబరాల హంగులు లేకుండా చూపించడం దేశభక్తి లేనివాడికి అసాధ్యమే!


వీరుల్ని పొగడటం కూడా వీరత్వమే,అది మనలో యెంతమంది కుంది?

Sunday 14 June 2015

ఆంధ్ర పారిశ్రామికవేత్తల సాయం లేంది పూట గడవని స్థితిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి నిజంగా ఆంద్ర ముఖ్యమంత్రిని అరెస్టు చెయ్యగలడా?

          ఆంధ్రావోడిగా నా సొంతమాటల్లో చెప్తే పులిమేస్తున్నాడు గురుడు అని తాటాకులు కదతారు.కాబట్టి ఒక తెలంగాణా బ్లాగరు పోష్టుల నుంచే యెత్తి చూపిస్తే ఇవ్వాళ తెలంగాణా వాళ్ళు ఆంధ్రావాళ్ళ మీద యెంతగా ఆధారపడి బతుకుతున్నారో తెలుస్తుంది! "ఆంధ్రా నేత‌ల‌తో సంబంధం ఉన్న కంపెనీల‌కు తెలంగాణ కాంట్రాక్టులు ఇవ్వొద్దు" అని 2015 జూన్ 10న అంత దీనంగా ఆక్రందిస్తున్నది యెవరు?ఇతర్ల కుళ్ళును చూపించి హీరో అయిన అస్సాంజి పేరు పెట్టుకుని తన కుళ్ళుని బయట పెట్టుకుంటున్న తెలంగాంఆ అసాంజి బ్లాగరు!యేమిటట ఈయనగారి ఆరోపణలతో కూడిన ఆవేదన?ఆంధ్రా నేత‌ల‌తో సంబంధం ఉన్న కంపెనీల‌కు తెలంగాణ కాంట్రాక్టులు ఇవ్వొద్దు.. వారంతా ఇక్క‌డ కాంట్రాక్టులు చేసుకొని డ‌బ్బులు కూడ‌బెట్టుకుని అదే సొమ్ముతో ఇక్క‌డి పాల‌న‌ను అస్త‌వ్య‌స్తం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.. వీలైతే తెలంగాణ‌లో పారిశ్రామిక వేత్త‌ల‌ను త‌యారు చేయండి..సలహా బాగానె ఉంది,కానీ పారిశ్రామిక వేత్తల్ని యెట్లా తయారు చెయ్యాలో తెలుసా ఈయనకి - దేశంలో బిజినెస్ స్కూల్సు చాలా ఉన్నా అందులో డిగ్రీలు పుచ్చుకున్న వాళ్ళలో యెంతమంది బిజినెస్సుల్లో ఆరితేరిపోయారో డాటా యేమయినా ఉన్నదా ఈయన దగ్గిర!ఇదంతా తెలంగాణా ఆవిర్భవించెయ్యగానే ఆధాటున జరిగిపోతుందని ఈయన కలగన్నాడని అనుకోకుండానే జరిగిపోతుందా - పిల్లి శాపాలకి ఉట్లు తెగుతాయా?ఆదర్శాలు బాగానే చెప్పాడు,కానీ పాపం అదే నోటితో ఉన్న వాస్తవం యెట్లా ఉందో కూడా ఆయనే చెప్పాడు విని తరించండి:మ‌న కాంట్రాక్ట‌ర్ల‌కు అర్హ‌త‌లు, అనుభ‌వం లేద‌ని కొన్ని ప్రాజెక్టుల్లో వారిని అన‌ర్హులుగా ప‌క్క‌న పెడుతున్నారు.. యెంత పచ్చినిజం చెప్పేశాడు?కానీ అట్లా పక్కన పెడుతున్నది యెవరు - ఆంధ్రా దోపిడీ దారుల్ని పొలిమేరలు దాటిస్తానని కూస్తే పులకించిపోయి ఈ కేతిగాళ్ళంతా చప్పట్లు కొట్టి వోట్లు గుద్ద్ది అధికారంలోకి పంపించిన ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వం వారు,కాదా!

          ఇంత సీరియస్సుగా తెలంగాణ పట్ల భవ్యావేశంతో రాస్తున్న వాణ్ణి "కేతిగాడు" అంటావా అని యెవరైనా నన్ను నిలదీసే ముందు తెలంగాణ సినిమా పరిశ్ర్మ వృధ్ధిలోకి రావటానికి మ‌ల్టీప్లెక్స్‌ల‌లో ఒక షో తెలంగాణ సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించే నిబంధ‌న తెస్తే బాగంటుందన్న పోష్టు చూడండి,నాకైతే నవ్వాగలేదు తెలుసా?ఇంతకీ తెలంగాణలో తెలంగాణ వారికి ప్రాముఖ్యత రావడం లేదన్న బాధ యెప్పటి నించి సెలవేసి రగుల్తుందో తెలుసా?2015 ఏప్రిల్ 28న మ‌న కాంట్రాక్ట‌ర్ల‌నూ ప్రోత్స‌హించండి...! స‌బ్ కాంట్రాక్టర్లుగా మ‌న‌వాళ్ల‌ను మార్చొద్దు అనేటప్పటికి తెలంగాణ ఆవిర్భవించి యెంత కాలమయింది?ఇంతగా ఆంధ్రా పారిశ్రామికవేత్తల బానిసాధముడై తరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రికి నిజంగా ఆంధ్రపరదేశ్ ముఖ్యమంత్రిని అరెస్టు చెయ్యగలిగే ధైర్యముందా?ఒకవేళ ధైర్యం చేస్తే అతన్ని నిలవరించలేకపోయిన ఆంధ్ర పారిశ్రామిక వేత్తలు చూస్తూ వూరుకున్నందుకు తిరిగి ఆంధ్ర రాష్ట్రంలోని తమ స్వస్థలాలకి ధైర్యంగా రాగలరా!

          సంపద పెంచటమంటే బతుకమ్మ చుట్టూ గంతులేసినంత తేలికనుకున్నారు కాబోలు!ఇక్కడ ఐప్పుడు అంతగా పెరిగిన ఆంధ్రావాళ్ళు ఒక్కరోజులో యెదిగారా?ఇది మన రాజధాని అని నమ్మి అక్కడ గొప్పగా బతకాలనే ఆశతో స్వస్థలాల్లోని ఆస్తుల్ని తెగనమ్మి యే ఒప్పందాల్ని ఉల్లంఘించారని వీళ్ళివాళ జరిగిందేమిటో తెలియకుండా పుచ్చొంకాయ కబుర్లు చెప్తున్నారో ఆ ఒప్పందాల్ని అడ్డు పెట్టుకుని 10 రూపాయల భూమిని 30 రూపాయలు చెప్తే అవసరం తమది గనుకా అంత పెట్టినా అంతకంతా లాభం తియ్యగలం అనే నమ్మకంతో కొని అక్కడ తొలి అడుగు వేసిన సందర్భంలో సాటి తెలంగాణ వాడి కమ్మితే 10 ఇస్తాడు,రూల్సు అడ్డంగా వున్నాయి గనక ఆంధ్రావాడయితే 30 ఇస్తాడు అనే తెలివి చూపించిన వాళ్ళు అమాయకులా?ఒక తెలంగాణా వ్యాపారవేత్తయే తన గతకాలపు జీవితానుభవాల్ని చెప్తూ "ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు యెంతకయినా తెగించి భూముల్ని యెక్కువరేటుకి  కొనటం, దాంతో భూముల రేట్లు అమాంతం పెరుగిపోవటంతో తెలంగాణలో చాలామంది అప్పట్లో వ్యాపారాల్లో పరిశ్రమల్లో అడుగుపెట్టలేకపోయారు" అన్నాడు,నిజమో అబధ్ధమో అప్పటి పరిస్థితుల పట్ల అవగాహన వున్న యెవడయినా చాలా తేలికగా తెలుసుకోగలడు.యే రక్షణల్ని బూచిగా చూపించి వాట్ని ఉల్లంఘించి మీరు మాకన్యాయం చేశారని మమ్మల్ని బెదరగొడుతున్నారో ఆ రక్షణలే మీ వ్యాపారవేత్తలకి ముందరి కాళ్ళ బంధాలై ఇవ్వాళ దాని ఫలితం చూస్తున్నారు - చరిత్రని చరిత్రలా చదవండి!

          నిజాము జనాన్ని పీడించి నిలవేసిన సంపద వుండటం వల్ల అప్పుదు కూడా తెలంగాణ ధనిక రాష్ట్రం అని డప్పు కొట్టుకున్నా చంద్రబాబు ఐటిని ప్రవెశపెట్టి ప్రపంచానికి తలుపులు తెరవడం వల్ల తప్ప టూరిష్టులు చూసి సంతోషించటానికి మాత్రమే పనికొచ్చే నిజాము కట్టిన భవనాల వల్లనా హైదరాబాదు పెరిగింది?వూరికే హైదరాబాదుని ఒక్కదాన్నే పెంచాడు అనే వాళ్ళు ఇవ్వాళ ఈ ముఖ్యమంత్రి చేస్తున్నదేమిటో చూస్తున్నారా?టాంకుబండు పక్కన 60 అంతస్థుల మేలు కడతాను,ఇంకా పెంచుతాను అంటున్నాడే తప్ప తెలంగాణ లోని మిగిలిన నగరాల్ని గుఇంచి ఆలోచించటం లేదేమిటి?

          మాటిమాటికీ ఆంధ్రాలో దారుణాలూ మోసాలూ జరిగిపోతున్నాయని విపరీతమైన ఆందోళన పడుతూ "ఇవీ ఆంధ్రా మేధావులు విశ్లేషించుకోవలసిన విషయాలు" అని నీతులు చెప్తున్న వాళ్ళకి నేను ఒకే ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను:ఆంధ్ర దోపిడీ నుంచి విముక్తం చేస్తానని బీరాలు పలికి ఇంకా ఆంధ్రోళ్ళనే అంటకాగుతున్న మీ ఉఖ్యమంత్రిని ఆ ఆంధ్రోళ్ళని తరిమికొట్టమని నిగ్గదియ్యగలరా?నిగ్గదీస్తే యేం జరుగుతుందో తెలుసా!ఒక పెద్ద ఖాళీ యేర్పడుతుంది,ఆ ఖాళీ లోకి ఇవ్వాళ కొత్తగా మీవాళ్ళు పరిశ్రమలూ వ్యాపారాలూ పెట్టి రాష్ట్ర ఖజానాకి తగినంత రెవెన్యూ రప్పించాలంటే కనీసం 25 యేళ్ళు పడుతుంది,మీరు మీ దుస్థితి గురించి విశ్లేషించుకోండి!

          ఇట్టాంటి పిచ్చ యవ్వారాలు చేసి మాకు అతిగా కాలేటట్టు చేస్తే మేము ఒత్తిడి చేసి ఆంధ్రా పారిశ్రామిక వేత్తల్ని ఖాళీ చెయించినా జరిగేది అదే - కాబట్ట్టి అతిగా బాబుకి యేదో అయిపోతుందని ఆశపడితే లక్ష నాగళ్ళతో రామోజీ ఫిలిం సిటీని దున్నిస్తే చూద్దామనుకున్నట్టే ఉంటుంది - కళ్ళు తెరిచి చూడండి!అయినా కేసీఆర్ మీ అంత పిచ్చొడేం కాదు లెండి.

          మీరు విశ్లేషించుకుని విచార పడవలసింది మరొకటి ఉంది - అధికారంలో ఉన్నాడు గాబట్టి చాటుమాటుగా కాకుండా ఇంటికే పిలిపించుకుని డబ్బుకి లొంగేవాళ్ళకి డబ్బులిచ్చి డబ్బుకి లొంగనివాళ్లని బ్లాక్ మెయిల్ చేసి తెగబడుతుంటే అది మీకు హీరోయిజం లాగ కనిపించిందా?ఒక ముఖ్యమంత్రి ఇలాంటివాడయితే అని బాబుకి యే విశేషణాలు తొడుగుతున్నారో అవి అసలేమాత్రం తనకి వర్తించనంత పులుగడిగిన మిత్యమా కేసీఆర్!పగబట్టి వేధిస్తూ ఉనికిని కాపాడుకోవటం కోసం మనమూ యేదయినా చేద్దామనే స్థితికి తీసుకెళ్ళేలాగ మెంటల్  కార్నరింగ్ చేసి ఆశపెట్టి పోలీసులకి పట్టించి ప్రగల్భాలు పలికే నీచస్థాయి రాజకీయం ఇక్క కాక ఇంకెక్కడన్నా జరిగిందా!ఇక్కడే యెందుకు జరిగింది?ఫలానా వాడు మా పార్టీ నుంచి ఫిరాయించాడు అని స్పీకరుకి రిపోర్టు ఇచ్చినా ముడ్డి కదల్చకుండా కూర్చుంటే అవతలివాణ్ణి రెచ్చగొట్టినట్టు కాదా?రహస్యంగా కాదే ఆన్నీ బాహాటంగానే జరిగినాయి కదా,అయినా అతనూ మీరూ సమర్ధించుకుంటున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది - మీరు ఉన్నతమైనదని చెప్పుకున్న ప్రాంతీయాభిమానాన్ని అతనూ మీరూ కలిసి భ్రష్టు పట్టిస్తూ తెలంగాణాని మాఫియా అడ్డాగా మీ చెతుల్తో మీరే మారుస్తున్నా తెలుసుకోలేకపోతున్నారేమిటా అని మీమీద జాలిగా కూడా వుంది,పోనివ్వండి మీ ఉన్నతాశయాలు భ్రష్టు పట్టిపోతున్నాయని మీకుండాల్సిన బాధ నాకెందుకు?

          ఒకటి మాత్రం నిజం - వారం క్రితం వరకూ నేను కూడా యెంతయినా సాటి తెలుగువాళ్ళు కదా,ఉద్యమకాలంలో వేడిలో యేదో తొందరపడి ఒకటీ రెండూ అన్నారులే అని సరిపెట్టుకుని మానసికంగా "ఆంధ్రాకీ తెలంగాణాకీ తగాదా వస్తే ఆంధ్రా వైపునే నిలబడినా తెలంగాణాకి యే మహారాష్ట్రతోనో తగాదా వస్తే తెలంగానాకే సపోర్టుగా ఉందాం" అనుకున్నాను గానీ ఇవ్వాళ హైదరాబాదులో జరిగినదానికీ జరుగుతున్న దానికీ నిలువెల్లా మీరంటే అసహ్యంతో రగిలిపోతున్నాను!ఆతిధేయ రాష్త్రంగా వుండి వాళ్ళిక్కడ ఉన్నంతకాలం మర్యాదగా వ్యవహరించి పదిమందితో మంచి అనిపించుకోవలసిన స్థానంలో ఉండి అతిధిని దొంగగా నిరూపించి అవమానించాలనుకోవటం యే రకమైన సంస్కారం?ఇదేనా తెలంగాణా సామాజికుల అతిధి మర్యాద!నువ్వు అధికారంలో ఉని ధీమాగా ఇంటికే పిలిపించుకుని బేరసారాలు చెయ్యటం డబ్బుకి లొంగాపోతే కేసుల్లో ఇరికిస్తానని బెదిరించటం నిస్సిగ్గుగా చేస్తూ,మాఫియా గూండాలు  వేరే ముఠాని పట్టించటానికి ఇక్కడ మాల్ ఉంది కలెక్ట్ చేసుకో రమ్మని పిలిచి పోలీసులకి ఉప్పందించిన తరహా నీచపు యెత్తుగడలు వెయ్యటం గొప్పగా చెప్పుకుంటున్నారే,కొంచెమయినా విచక్షణ లేదా?ఒక వ్యక్తి నన్ను ఆర్ధికంగా దెబ్బతియ్యాలంకుంటున్నాడు కేసీఆర్ అని పార్టీలో చెప్పుకుని సపోర్టు తీసుకుని గూడా కుదురుగా ఉండలేక దూకేశాదంటే అతని మీద యెంత ఒత్తిడి పెట్టి ఉండాలి?

          మరీ ముఖ్యంగా తెలంగాణా ఉద్యమలో ప్రముఖంగా కనిపించి నిజాయితీ గల ఉద్యమ కార్లుల మాటల ద్వారా పాటల ద్వారా ప్రతికక్షుల్ని కూడా మెప్పించగలిగిన ప్రాంతీయాభిమానాన్ని "ఇది నా అడ్డా ఇక్కడ నీ రుబాబు చెల్లదు" అని అమీరుపేట గూండా దిల్షుక్నగరు గూండాతో మాట్లాడే స్థాయికి దిగజారుస్తున్నాడు!దీన్ని నిజంగా అమీరుపేట గూండాలు ఆదర్శంగా తీసుకుని రేపోమాపో "అమీరుపేట రాష్ట్ర సమితి" యేర్పాటు చేస్తే యెట్లా ఉంటుంది?ఇక్కడ మాత్రం జోకు కాదు సూటిగానే అడుగుతున్నాను!మీ ముఖ్యమంత్రే ఇంకా లోపల ఆంధ్రోళ్ళ చెప్పులు నాకుతూ బైట వీధి గూండాల భాష మాట్లాడుతున్నాడు,మీకు నిజంగా దమ్ముంటే మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీ తెలంగాణ గౌరవం పేంచేలా కట్టడి చెయ్యండి.ఆంధ్రావాళ్ళు తెలివిగానే ఉన్నారు,వాళ్ళ గురించి కాదు రాష్ట్రం సాధించుకున్నాక ఇప్పటి మీ నిజమైన స్థితి యేంటో ఆలోచించుకోండి!ఇంకా మాకు మండాల్సినంతగా మండలేదు,మండితే మాత్రం సినిమా వాళ్లతో సహా పనికొచ్చేవాణ్ణి ఒక్కణ్ణి కూడా వదలం,హైదరాబాదులో ఉండకుండా ఖాళీ చెయించడానికి మీకు లాగ పన్నేండేళ్ళు తీసుకోం మాకు 12 నెలలు చాలు - ఖబడ్దార్!

ఆంధ్రా మిత్రులకి నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా - ఈసారి ఇట్లాంటిది జరిగితే మనం తగలెయ్యాల్సింది కేసీఆర్ దిష్టిబొమ్మల్ని కాదు,మనవాళ్లని సినిమా వాళ్లతో సహా ఆంధ్రాకి వచ్చెయ్యమని పిల్చి రానన్నవాళ్ళ దిష్టిబొమ్మల్ని తగలెయ్యాలి!

ఆంధ్రావాళ్ళు బెజవాడలో అరిస్తే గోల్కొండ ఖిలా దడదడ లాడాలి?!

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...