Tuesday, 6 January 2015

శిక్షాభయం కూడా లేకుండా కొందరు మగవాళ్ళు ఆడవాళ్ళ మీద బలాత్కార ప్రయత్నం యెందుకు చేస్తున్నారు?

          గత యేడాది డిసెంబర్ నెలలో ఒక ఉబర్ క్యాబ్ డ్రైవర్ తన క్యాబ్లో ప్రయాణిస్తున్న ఒక మహిళపై అత్యాచారం జరిపాడు.ఆ అమ్మాయి ఆ సంఘటనకు ముందు చాలా ధైర్యస్తురాలు.2012 డిసెంబర్ గ్యాంగ్ రేప్ ఘటన తరవాత వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేయడమే కాకుండా తన కుటుంబాన్ని,స్నేహితుల్ని కూడా నిరసనలో పాల్గొనేలా ప్రేరేపించిన మనిషి!అంత ధైర్యం గల మనిషి కూడా కౌన్సిలింగ్ అవసరమయ్యేటంతగా యెందుకు భయపడిపోయింది?

          డిసెంబర్ 5వ తేదీ రాత్రి స్నేహితులతో కలిసి డిన్నర్ చేసింది.రాత్రి సమయంలో తన స్నేహితుల్ని కానీ సహోద్యోగుల్ని కానీ ఇంటివరకు దింపమని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు.ఇంటికి సురక్షితంగా చేరుకునేందుకు పేరున్న క్యాబ్ అయితే మంచిదనుకుంది.రెండేళ్ళ క్రితం డిసెంబర్ 16వ తేదీన జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత మనదేశంలో వున్న ప్రతి అమ్మాయీ సెక్యూరిటీ విషయంలో యెన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తున్నది,తీసుకుంటున్నది.ఇంతకు ముందు చాలాసార్లు తను ఉబర్ క్యాబ్ లో ప్రయాణించింది.అందుకనే ఆ క్యాబ్ సర్వీసు మీద నమ్మకంతో దాన్నే యెంచుకుంది.ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అత్యాచారం జరిగింది!అయినా వీటిని గట్టిగా తల్చుకుంటే కంట్రోలు చెయ్యగలిగిన పోలీసు శాఖలోని అధికార్లూ  ప్రజల జీవితాలకు రక్షణ కల్పిస్తామని ప్రమానం చేసి పదవుల నలంకరించిన గౌరవనీయులైన మంత్రివర్యులూ తదాదిగా గల అప్రకటిత నపుంసకత్వ రోగపీడితులూ ఆడపిల్లలకే దుస్తుల గురించీ ప్రవర్తన లోని క్రమశిక్షణ గురించీ లెక్చర్లు దంచారు, దంచుతున్నారు, దంచుతారు?

          ఆ రోజు రాత్రి రోడ్డు మీద పోలీసు పెట్రోలింగ్ వాహనాలు కనిపించలేదు.తను యెంతగానో నమ్మిన ఉబర్ క్యాబ్ సర్వీసు నేర చరిత్ర ఉన్న వ్యక్తిని డ్రైవర్ గా నియమించింది.తరవాత తెలిసింది యేమిటంటే అంతకు ముందే నిధి షా అనే మహిళా ప్రయాణికురాలు ముద్దాయి అయిన డ్రైవర్ శివకుమార్ యాదవ్ ప్రవర్త్న బాగాలేదని ఫిర్యాదు చేసినా ఉబర్ సంస్థ పట్టించుకోలేదు.అతడిపై ఎటువంటి చర్యా తీసుకోలేదు.వాళ్ళు అప్పుడే సరిగా స్పందించి వుంటే ఈ రోజున తను,తన కుటుంబం బాధపడాల్సిన పరిస్థితియెదురయ్యేది కాదు.ఆ అమ్మాయి లాంటి యెంతోమంది ఆదపిలలు అడుగుతున్న పృఅశ్నలు ఇవి - సోదరుడు,భర్త లేదా యెవరో ఒక మగవాడు తోడుగా లేనిదే ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదా?అమ్మాయిలు ఇంట్లోనే కూర్చోవాలా?ఆడపిల్లలకి బయటికి వెళ్ళేందుకు,ఉద్యోగాలు చేసుకునే హక్కు లేదా!

          ఆ అమ్మాయి తనవంతుగా కొన్ని కోరికల్ని చెప్పింది - ఆడవాళ్ళు నడిపే క్యాబ్ లు కావాలి,పెట్రోలింగ్ వాహనాలు,పోలీసుల సంఖ్య యెంత యెక్కువగా పెరిగితే ఆడవాళ్ళకు అంత సురక్షితంగా వున్నామన్న భావన కలుగుతుంది.అమ్మాయిలు ప్రయాణించే క్యాబ్ లను బాగా చెక్ చేయాలి.అలాగే ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి.మనలో యెక్కువమంది యేదయినా విషయంలో జోక్యం చేసుకుంటే పోలీసుల చుట్టూ తిరగాలి,కోర్టు కేసులు వుంటాయని ఆలోచిస్తారు.ఈ అమాయి తల్లికి తన స్నేహితురాలు ఫోన్ చేసి"మీఎరు కేసు ఎందుకు ఫైల్ చేశారు?మీకు చెడ్డ పేరు వస్తుంది!" అని అంటే ఆమె "ఆ పని చేసిన వాళ్ళకి చెడ్డపేరు వస్తుంది కానె మాకెందుకు వస్తుంది" అని జవాబు చెప్పిందట.ఇప్పుడు భారతదేశం పురుషాధిక్య సంస్కృతిలో వుంది.అందుకని ఆడవాళ్ళకు సమానావకాశాలు ఇస్తే మగవాళ్ళు ఆదవళ్ళని చులకనగా చూడటం మానేస్తారు.బుర్రలు సరిగా ఆలోచించాలంటే సరయిన విద్యావిధానం వుండాలి.

          మరి ఇంత తెలివి గల ధైర్యమున్న అమ్మాయి అంత భయపడిపోవటానికి కారనమేమిటో తెలుసా?ఆ పశువు లొంగకపోతే రాడ్ వుపయోగిస్తా నన్నాడట?!అంటే పత్రికలలో ఆ పాత సన్నివేశం గురించిన వార్తలు అతడికి అందరూ చేస్తున్న ఆందోళనల్నీ నేరస్తుల పట్ల అసహ్యాన్నీ వాళ్ళకి పడిన శిక్షల్నీ కాకుండా మరో రకమయిన నీలి చిత్రాన్ని చూపించాయన్న మాట!చాలా చిన్నప్పట్నించీ ఈ రకమయిన వార్తల్ని చాలా కుతూహలంతో చదవగా నాకు అర్ధమయినది యేమిటంటే వాళ్ళు ఈ నేరాల్ని చెయ్యడం కేవలం లైంగిక పరమయిన కోర్కెలతో చెయ్యడం లేదు,యెదటి వాళ్ళని హింసించి ఆనందం పొందే మనస్తత్వం వుంటుంది వాళ్ళలో.ఆ మనస్తత్వం వున్నవాళ్ళు తను కూడా ఆ అపధ్ధతిని ఫాలో అయితే యెలా వుంటుంది అనే రకమయిన ఆలోచనలతో మరింత వుద్రేక పడతారే తప్ప  శిక్షలకి భయపదరు.ఇప్పటి వరకూ కోర్టులకి పనికొచ్చే న్యాయసూత్రాల్లో సివిలు,క్రిమినలు అనే రెండు రకాల విభాగాలే వున్నాయి.సివిలు అంటే ఆస్తి తగాఅలు,క్రిమినలు అంటే కక్షలు పెంచుకుని ఒకడి మీద మరొకడు దాది చెయ్యటం.ఈ రకమయిన కొత్త స్వభావం గల నేరాలు అందులో నిర్వచించనడక పోవటం నిర్భయ కేసు న్యాయశాస్త్ర కోవిదుల్లో కూడా యెంత గందరగోళాన్ని రేకెత్తించిందో మనకి తెలిసిందే.ఇప్పటికీ ఆ చట్టాలు పటిష్టంగా రూపు దిద్దుకోలేదు!

          మనుషుల తర్వాత కుటుంబ జీవనం సింహాలలోనే బలంగా వుంటుంది.కానీ వాటికి మనలాగా ఎగో ప్రాబ్లెంస్ లేకపోవటంతో అవి చాలా సుఖంగా తమ జీవితాల్ని గడిపేస్తాయి.మనుషులకి కుటుంబ జీవితం యెందుకు అవసరం అంటే మనిషి తప్ప మిగిలిన జంతువులన్నిట్లో పుట్టిన కొద్ది గంటల్లోనే పూర్తి చురుకుగా కదలగలిగి వుంటాయి.కానీ మనుషుల్లో శిశువులు తమ మెడని కూడా యెత్తలేనంత బలహీనంగా వుంటారు.ఆ మెడ కుదరనిదే కనీసం లేచి కూర్చోవడం కూడా సాధ్యపడదు.ఈ బాలారిష్టాలన్నీ గడిచి పూర్తి స్వతంత్రంగా బతకగలగటానికి ఇరవయ్యేళ్ళు పడుతుంది.ఈ కాలమంతా ఆ శిశువుకు పోషణా,భద్రతా,మనోగతమయిన సంస్కారం నేర్పడానికే ఒక స్త్రీ ఒక పురుషుడు ఆజీవపర్యంతం కలిసి బతికే వివాహ వ్యవస్థ యేర్పడింది.కానీ సుఖాల ననుభవించటం మీద వున్న దృష్టి బాధ్యతల్ని స్వీకరించడం మీద వుండనివ్వని ఇప్పటి సంస్కృతి దీన్ని సరిగా సాగనివ్వడం లేదు!ఇప్పుడు మనం ఆలోచిస్తున్న ఈ సమస్యకే కాకుండా ఇప్పటి కాలంలోని స్త్రీ పురుష సంబంధాలు అన్నిటికీ ఇదే మూలకారణం కాబట్ట్టి వివాహ వ్యవస్థని పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం వుంది!

          ప్రతి మనిషి వ్యక్తిత్వంలోనూ లైంగికతకు సంబంధించి ఆడ అయినా మగ అయినా "ఐడియల్ షి" మరియూ "ఐడియల్ హి" పట్ల ఆరాధన వుంటుంది.మగవాడు తను ఆ ఐడియల్ హి లాగా వుండాలని అనుకోవటంతో మొదలై వున్నాననే నమ్మకంలో స్థిరపడతాడు.ఈ ఐడీయల్ హి స్థానంలో సాధారణంగా సినిమా హీరోలు వస్తారు,ఆ తర్వాత క్రికెట్ ప్లేయర్లు వస్తారు.ఈ తాదాత్మ్యం వల్లనే కుర్రవాళ్ళు తమ అభిమాన హీరోలకి అంత వెర్రిగా అతని కతౌత్లకి కూడా పాలాభిషేకాలూ గట్రా చేస్తారు.ఐడియల్ హి లో తనని చూసుకుంటే ఐడియల్ షి తనకి భార్యగా రావాలని కోరుకుంటాడు.ఆడవాళ్లలో కూడా ఇలాగే వుంటుంది - తను తన ఐదీయల్ షి తో మమేకమై తన ఐడియల్ హి లాంటి భర్తని కోరుకుంటుంది.కానీ సమాజంలో ఒక ఐడియల్ హి లేక ఐడియల్ షి కనబదక ముందు తప్పనిసరిగా తమ తలిదండ్రులే ఐడియల్ షి మరియూ ఐడియల్ హి స్థానాన్ని ఆక్రమిస్తారు!ఇప్పుడు తను ఐడియల్ హి గా భావించే వ్యక్తి యెలా అయితే ఐడియల్ షి మీద పెత్తనం చేస్తున్నదో తనూ అలాగే చెయ్యాలనుకుంటాడు.తన ఐడియల్ షి యెట్లాగైతే అణకువగా వుంటుందో తనకు కనిపించిన ఆడవాళ్ళూ తనలో స్పందన కలిగించిన ఆడవాళ్ళు కూడా అట్లాగే వుండాలనుకుంటాడు.

          కానీ ఇక్కడ కనబడుతున్న వాళ్ళు ధీమాగా కనబడుతున్నారు.పైగా తను వుండాల్సిన చోట మరో మగాదు కనబడుతున్నాడు.మానసికంగా ఒక వైకల్యం మొదలైందీ అంటే అది ఇంక దేన్ని గురించీ ఆలోచించనివ్వదు - సమాజంలో తన స్థానం యేమయినా ఫర్వాలేదు,శిక్షకి గురయి చచ్చిపోయినా ఫర్వాలేదు ముందు తన కోరిల తీర్చుకోవడమే ముఖ్యం అనిపిస్తుంది.ఒక మగవాడు ఒక ఆదదాని ద్వారా లైంగిక సుఖాన్ని పొందడం అనేది బలంగా కనిపిస్తూ వుందతంతో ఈ రకమయిన నేరాలను గురించి ఆలోచించే వాళ్లందరూ వాళ్ళు లైంగిక సుఖాన్ని తీర్చుకోవటం కోసమే వాళ్ళు అత్యాచారం చేస్తున్నారని పొరబడుతున్నారు.వాళ్ళు అప్పటికే ఆడదాన్ని భయపెట్టదం ద్వారానే ఆనందం పొందే స్థితికి యెప్పుడో చేరుకున్నారు గనక లైంగికానుభవం వాళ్ళకి యేమాత్రం ఆనందం కలగజేయదు!భయపెడుతూ, బాధపెడుతూ ఆడవాళ్ళు యేడుస్తుంటే చూడటం లోనే వాళ్ళు ఆనందిస్తారు,అదీ ఈ రకమైన నేరాల అసలు దృశ్యం!ఈ మొత్తం వ్యవహార మంతా ఆ అమ్మాయి ఒంతరిగా కనబదిన క్షణంలో జరిగే మార్పులు అని మీరు నమ్మగలరా?సుదీర్ఘ కాలం పాటు అతను ఆ అమనస్తత్వం లోకి యెదుగుతాడు, తనున్న వాతావరణం అనుకూలంగా వుందటం వల్ల -  it is not impulsive crime but an indulging crime?!

          మరి వీటిని ఆపడం యెట్లా?నేరం జరిగాక విచారించి తీర్పు ద్వారా ఒకరికి శిక్ష వేసి మరొకరికి కవున్సిలింగులు ఇవ్వడం కన్నా అసలు జరగకుండా ఆపలేమా! అసలు ఈ నేరాలన్నీ యెప్పుడో గానీ యెక్కడో గానీ జరగవు, అందుకే కాబోలు నిత్యం నేరాల మధ్యనే గడిపే పోలీసుల్లో కూడా సరిగ్గా స్పందించలేని అలసత్వం?!ఇప్పుడిప్పుదు ఇలాంటివి పెరగడంతో కొంచెం చురుకుగా స్పందిస్తున్నారు.నూటికి తొంబై శాతం మంది మగవాళ్ళు బుధ్ధిమంతులే!కానీ చెదురుమదురుగా జరిగినా అవి మన మనసుల్లో కలిగించే భీభత్సం చాలా యెక్కువ,అదీగాక నిర్లక్ష్యం చేస్తే అది అలాంటివాళ్లని ప్రోత్సహించి నట్టవుతుంది! ఒకటి మాత్రం నిజం,శిక్షాభయం తప్ప చాగంటి వారి పరవచనాలూ,మల్లాది వారి పురాణ కాలక్షేపాలూ నేరాల్ని తగ్గించలేవు!కాబట్టి కీలెరిగి వాత అన్నట్టు యెవరిని శిక్షించాలి అనేది తెలిసి వీలెరిగి శిక్ష వుండాలి అని నా అభిప్రాయం.

          ఈ రకమయిన సన్నివేశాలు వినగానే గగుర్పాటును కలిగించడం వల్ల యెంతటివాళ్ళ నయినా వుద్రేకానికి గురి చేస్తాయి.నేనూ వుద్రేకానికి లోనయి కొన్ని తప్పుడు అభిప్రాయాల్ని సమర్ధించాల్సి వచ్చింది.వచ్చిన విమర్శల్ని చూసి మరోసారి దానికి సంబంధించి విషయసేకరణ చెయ్యగా నాకు నా పొరపాటు యేమిటో తెలిసింది.అలాంటి వాటికి స్పందించాతప్పుడు వుద్రేకపడతంలో అప్పు లేదు.అసలు వుద్రేకపడే లఖణం లేకపోతే స్పందన కూడా వుండదు.కానీ పరిష్కారం గురించి ఆలోచించాల్సినప్పుడు మాత్రం రాగద్వేషాలు లేని నిండుమనస్సుతోనే వుండాలి!శిక్షలతో కన్నా సమాజం ఆలోచించే పధ్ధతుల్ని మార్చడం ద్వారానే వీటిని అరికట్టగలం.దీనికి వ్యక్తిగతంగా కుటుంబ స్థాయిలో మనం పిల్లల పెంపకంలో ఇప్పుడు పాటిస్తున్న దోరణుల్ని మార్చుకోవాలి.ఇక సామాజికంగా చూస్తే శాతిభద్రతలి కాపాడతం నేరాలు జరగకుండా నిరోధించటం అనేది ప్రభుత్వం చెయ్యాల్సిన పని కాబట్టి మంచి ప్రభుత్వాలన్ని సాధించుకోవతం అనే రెంటిలో దేన్నీ తాకువ చెయ్యకుండా రెంటికీ 50-50 ప్రాధాన్యత నివ్వాలి.

      వ్యక్తిగతంగా కుటుంబస్థాయిలో మనం పాటిస్తున్న అసమానతలే సమాజం లోనూ వ్యక్తీకరించబడుతున్నప్పుడు మార్పు కూడా కుటుంబ వాతావరణం నుంచే మొదలవ్వాలి.కాబట్టి మగవాడికి ఇప్పటిలా కాకుండా ఆడదానితో సామరస్యంగా ప్రవర్తించి స్త్రీని సంతోష పెట్టగలగడమే నిజమయిన పురుష లక్షణం గానీ భయపెట్టి లొంగదీసుకుని ఆనందించడం కాదు అనే విషయాన్ని బోధపర్చాలి.ఆడపిల్లకి కూడా బెదిరిపోవటం భయపడటం స్త్రీ సహజ లఖణం అని కాకుండా ధైర్యాన్నీ సాహసాన్నె అలవాటు చెయ్యాలి.ఆత్మరక్షణ కోసం పోరాట కళల్ని పరిచయం చెయ్యటం కూడా మంచిదే!అసలైన విషయం యేమిటంటే ఈ నేరాలన్నీ ఒంటరిగా వున్నప్పుడు మాత్రమే జరుగుతున్నాయి.కాబట్టి మగపిల్లల్తో కూడా కలివిడిగా వుండటం అలవాటు చెయ్యాలి.బయట తిరగాల్సి వస్తే వీలున్నంత వరకూ నలుగురైదుగురికి తక్కువగా వుండకుండా తిరగాలి.ఆ నలుగురూ యెటువంటి వాళ్ళో కూడా తలిదండ్రులు తెలుసుకుని తీరాలి.మా అమ్మాయికి వున్న స్నేహితులంతా మాకు తెలుసు.మగపిల్లలు కూడా మా ఇంటికి కూడా వచ్చి గడుపుతారు.మన పిల్లల్ని మనం నమ్మితేనే వాళ్ళూ మనల్ని నమ్మి తమ విషయాలన్నీ మనకి చెబుతారు!ఇలాంటి వాతావరణం వుంటే అలాంటివి జరగవు,జరిగినా కొద్ది సమయంలోనే మళ్ళీ తేరుకోవచ్చు.మన తప్పు లేకుండా జరిగిన ఒక సన్నివేశం జీవితాన్నంతా ప్రభావితం చేసేటంత బలహీనంగా వుండకుండా బతకదం ఇవ్వాళ్టి పరిష్తితుల్లో తప్పనిసరి!

          ఇక ఇల్లు దాటి వెళ్తే అది ప్రభుత్వ వ్యవహారం కాబట్టీ మంచి ప్రభుత్వాల నెన్నుకోవడం తప్పని సరి.మంచి ప్రభుత్వాలు మాత్రమే మనం కోరుకున్న రక్షణ ఇవ్వగలవు.కానీ మనం మనపాటికి కులంపేరుతో మతంపేరుతో మనవాణ్ణే అధికారంలో చూడాలనే కులపిచ్చితో వుంటే ఈ భీభత్సాలు అనంతకాలం వరకూ జరుగుతూనే వుంటాయి.కానీ ఆ విషయంలో పరిస్థితి చాలా నిరాశావహంగా వుంది.సామాజిక శాస్త్రవేత్త అనే గురింపు పదాన్ని చేర్చుకుని తింగరి సిధ్ధాంతాలతో కులపిచ్చిని మతపిచ్చిని బాహాటంగా సమర్ధిస్తుంటే నిరక్షరాస్యుల నుంచి వివేకాన్ని యెలా ఆశించగలం?కుల దోపిడీని వ్యతిరేకిస్తూనే కులాల కుమ్ములాటల్ని మేధావులమని చెప్పుకుంటూనే సమర్ధిస్తే కులమతాల కతీతంగా ప్రజలందర్నీ సమానంగా రక్షించే మంచి ప్రభుత్వాలు యెట్లా వస్తాయి?తను కూడా తన కులానికి పెత్తనాన్నే కోరుకుంటూ అవకాశం వుంటే ఇతర కులాల్ని అణగదొక్కే మనస్తత్వంలో వుంటే ఇప్పటి అసమానతల వల్ల లాభపడే కులస్థుల్ని తప్పు పట్టి ప్రయోజన మేమిటి?యెన్నికల్లో నిలబడ్డ తన కులం వాడు అసమర్ధుదయినా తను కోరుకునేది మందబలం కాబట్టి అలాంటి వాళ్ళంతా తప్పనిసరిగా వాళ్ళ కులపోడికే వోటు వేస్తారు గదా!కాబట్టి ఆ రకమయిన మార్పు ఇప్పట్లో సాధ్యపడదు.ప్రభుత్వాల నుంచి శాంతిభద్రతలకి హామీని పొందలేము గనక వ్యక్తిగతంగా మరింత జాగ్రత్తగా వుండటం తప్ప గత్యంతరం లేదు?!

         మమతా బెనర్జీ గారి  కుడిభుజమో ములాయం సింగు గారి యెడమ భుజమో రేప్ కేసుల్లో ఇరుక్కున్నప్పుదు వాళ్ళు యెలా ప్రవర్తించారో గుర్తుందా?కంచె ఐలయ్య గారి లాంటి వాళ్ళు చెప్పే దళితవాదంతో వచ్చే ప్రభుత్వాలు కూడా అలానే అఘోరిస్తాయి!

6 comments:

  1. ఖంగారు పడడమా? దాన్ని ఖంగారు అనరండి చిరాకు అంటారు. మీరు చెప్పింది ఖాప్ పంచాయితీలు చేసే దానికి తేడా ఏముంది? సరే మీ ఆలోచనా పద్దతిలోనే పోదాం. ఒక వ్యక్తిని మలిచేది కుటుంభం ఒక్కటే కాదు. సమాజం కూడ ప్రభావితం చేస్తాయి. ఫక్తు కమ్యూనిస్టు మాటల్లో చెప్పుకోవాలంటే .. ఈ దోపిడీ దారి వ్యవస్థలో ప్రతీ ఒక్క నేరమూ సామాజిక పరిస్థితుల ఆధారంగా జరుగుతుందే కానీ పుట్టగానే ఎవరూ నేరస్థులుగా పుట్టరు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? ఒక వ్యక్తి అత్యాచారం చేస్తే సమాజానికి, ఆ సమాజము ఆవిధంగా ఉండడానికి కారణమైన "పెద్దలను" అందరినీ శిక్షించేద్దామా? ఢిళ్ళీలో జరిగిన అత్యాచారానికి కారణం ఆ ప్రదేశాన్ని సేఫ్ గా ఉంచలేక పోయిన అధికారులది అని వారిని శిక్షించేద్దామా? ఒక వ్యక్తి నేరం చేస్తే అతని కుటుంబాన్ని వెలివేయాలి అనడం పెదరాయుడు సినిమాలో "పాపారాయుడి" తింగర తీర్పులా అనిపించడం లేదా మీకు?

    ఇంకో మాట, మీరు చెప్పింది కేవలం ప్రతిపాదనే కదా ఎందుకు కంగారు అంటున్నారు కదా? మరి నేను చేసిన ఘోరమైన నేరం ఏమిటండి? దాన్ని వ్యతిరేకించడం లేదా విమర్శించడమే కదా? కామెంటు రాసి నేను కంగారు పడి ఉంటే డిలీట్ చేసిన మీరు ఏమి చేసినట్టు?

    నేను ఎందుకు రియాక్ట్ అయ్యాను?
    అసలు నేను బ్లాగుల్లోకి వచ్చిందే ఇలాంటి వాటిని వ్యతిరేకించడానికి. మీరు నా బ్లాగు చూడండి .. ఇప్పటి నుండి కాదు ఎప్పుడో 2008 నుండి నేను ఈ పని చేస్తూనే ఉన్నాను. ఇదే పని నేను ప్ర.జలో కూడా చేశాను, 498A విషయములో. మీకు గుర్తుందోలేదో మీరు ప్ర.జ బ్లాగులో కూడా ఇలాంటి ప్రశ్న ఏదో అడిగినట్టున్నారు. దానికి కూడా నేను స్పందించాను. కావాలంటే ఒక సారి ప్ర.జ బ్లాగులో చూడండి.
    ఇక నా బ్లాగు చూడాలనుకుంటే ..
    ఏకలవ్య (http://ekalavyas.wordpress.com).

    ఇక సింగపూరు మహాశయుడి దగ్గరకి వెలదాం. సింగపూర్ అమలవుతున్న కొన్ని చట్టాలు మానవ హక్కుల ఉల్లఘించేవి అని అంతర్జాతీయ మానవ హక్కుల వేదికలు బోలెడు సార్లు చెప్పాయి. పోనీ, మానవ హక్కులు అనేవి నేరస్థులకు ఎందుకు అనుకుని అది వదిలేద్దాం. కానీ, సింగపుర్లో ఈ శిక్షలన్నీ ఎవరికి వేస్తారు నేరం చేసిన వారికేనా లేక ఆ వ్యక్తి తండ్రికి, పెల్లయ్యుంటే ఆవ్యక్తి భార్యకీ వేస్తారా?? యెస్, ఒక వేల సింగపూర్ నవ నిర్మాత ఇలా ఇంట్లోని వారికి కూడా శిక్షలు వేయాలి అని ఉంటే ఖచ్ఛితంగా అనాగరికుడు అనే చెప్పొచ్చు.

    ఇంకో విషయం సింగపూర్లో కేనింగ్ అనేది కేవలం మగవారికి మాత్రమే. ఆడవారికి ఉండదు. నన్నడిగితే తాలిబాన్ చట్టాలకి, సింగపూర్ చట్టాలకి తేడా ఏమిటి అంటే .. తాలిబాన్లు తప్పు చేస్తే ఆడా మగా తేడా లేకుండా కేనింగ్ (Caning) చేస్తారు. సింగపూర్లో మాత్రం కేవలం మగవారికి మాత్రమే కేనింగ్ ఉంటుంది. ప్రస్తుత సమాజములో దాన్నే ఆదర్శం అని చెప్పుకుని తిరుగుతూ ఉంటాం. నేను దీన్ని వ్యతిరేకిస్తాను. కేనింగే చేస్తారో లేక కొరడాలతో కొడతారో అది ఆ దేశ చట్టాల ఇష్టం కానీ అది తప్పు చేసిన ఆడా మగా ఇద్దరికీ ఉండాలి కానీ .. ఒక్కరికే కాదు. ఇదీ నా స్టాండర్డ్ డిమాండ్.

    కానీ, ఈ డిమాండును మీరు చెప్పిన విషయములో నేను చేయలేను. అంటే, ఆడది తప్పు చేస్తే ఆవిడ తండ్రికీ, పెళ్ళయ్యుంటే ఆవిడ భర్తకీ శిక్ష వేయండి అనే దాన్ని నేను సపోర్టు చేయలేను.

    ఇంకో విషయం మీ బ్లాగు నాకిష్టమైన బ్లాగు కూడా. చాలా విషయాలలో (తెలంగాణా, కులం వంటివి) మీరు నిర్మొహమాటంగా రాయడం నాకు నచ్చుతుంది. కానీ, మీరు ఆడవారిపై జరిగే నెరాలు అనే విషయానికి వచ్చేసరికి కాలం చెల్లిన పాత భావజాలాన్ని పాటించడం నాకు నచ్చదు. అందుకే నేను వాటిని వ్యతిరేకిస్తుంటాను.

    ReplyDelete
    Replies
    1. సరే,నేను పోష్టులోనే చెప్పాను,నా దగ్గిర డాటా లేదు అని.డాటా మరోరకంగా వుంటే నా అభిప్రాయాల్లో పొరపాటు వొప్పుకోవటానికి సిధ్ధంగా వున్నాను. ఈ ప్రతిపాదన మీద నాకు మోజు పుట్టి చెప్పలేదు.దీని మీద కొంచెం కదలిక పుట్టాలి.అక్కద నేను చెప్పిన మానసిక వికాసం విషయాల్లో యేమయినా లోపం కనబడిందా?మరో రకంగా నయినా వీటిని తగ్గించలేమా?మరీ ముఖ్యంగా ఇవి ప్రతి రోజూ ప్రతిచోటా జరుగుతున్నాయా?లేదు,అవి ఇదివరకు రేర్ గానే జరిగేవి,కానీ ఇప్పుదు తరచూ జరుగుతున్నాయి.ఒక పరిష్కారం దిశగా మనం తొందర పడాలి!నా పోష్టులు ఇన్ని చదివారు,క్రూరతవం యెక్కడయినా కనబడిందా మీకు ఇతరమయిన పోష్టుల్లో?

      మహిళా బాధిత పురుష అంఘాధిపతిగా మీరు చిరాకు అంటున్నారు,ఓకే, మరో పరిష్కారం యేదయినా చెప్పండి,మొత్తం మీద నేను ఇది తప్పనిసరిగా పాటించాలనే వుద్దేశంలో లేను.కానీ యేదో ఒక పరిష్కారం చూడకపోతే సంఘతనలు యెక్కువౌతాయి.జనం కూడా అలవాటు పడిపోతారేమో?!

      Delete
  2. హరి బాబు గారూ, .. నేను భార్యాబాధితున్ని కాదు. నేను ఒకప్పుడు ఫెమినిస్టును. నేనే కాదు ప్రస్తుతం పురుషుల తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్న వారిలో చాలా మంది ఒకప్పుడు ఫెమినిష్టులే.

    ఫెమినిజం ఒక్కప్పుడు మాకు ప్రశ్నించడం నేర్పింది. చిన్నప్పుడు నేను చదివిన బోలెడు ఫెమినిస్టు కథల్లో .. స్త్రీకి .. సమాజం క్షమయా ధరిత్రి, బోజ్యేషు మాత .. అంటూ కొన్ని గుణ గణాలాను నిర్దేశించింది కదా? మరి మగవారికి అలాంటివి ఎందుకు నిర్దేశించలేదు అని ప్రశ్నించేవారు. లాజిక్ గా ఆలోచించి నిజమే కదా? అలా ఎందుకు లేదు. ఇది తప్పు అనుకునే వాన్ని.

    నేను పదవ తరగతిలో ఉన్నప్పుడు తెలుగు పాఠ్యపుస్తకములో "పార్వతీ తపస్సు" అనే పాఠం ఉండేది. అందులో స్త్రీలకుండాల్సిన గుణగణాలు మా తెలుసు మాష్టారు చెబుతున్నప్పుడు, నేను అది వరకే చదివిన స్త్రీవాద కథల ప్రోద్బలముతో .. "మరి మగవారు ఎలా ఉండాలి సార్" అని అడిగిన వాన్ని. ఆయన గుడ్లురుమి " ఊ.. ఊ" అంటూ కోరగా చూసి పాఠం కంటిన్యూ చేశాడు. అదృష్టవ శాత్తూ వీపు విమానం మోత మోగలేదు అప్పుడు.

    ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, ప్రశ్నించడం అనేది నాకు ఎలా అలవాటు అయింది అని చెప్పడం కోసమే. ఆ అలవాటు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. కాకపోతే, ఒకప్పుడు సమానత్వం అన్న స్త్రీలు ఫలానా అంశములో మగవారికి ఒక రూలు, ఆడవారికి ఒక రూలు ఎందుకు అని ప్రశ్నించించ స్త్రీవాదులు ... ఆదర్శ పురుషులూ ఇప్పుడు .. మాత్రం చట్టాల విషయములో మరి చాలా విషయాలలో స్త్రీలకు అనుకూలముగా మార్పులు చేర్పులు చేస్తుంటే నోరు మెదపడం లేదు. అవి పురుషుల మీద ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తున్నా, ఏటా అనేక వేల మంది పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా .. కిమ్మనడం లేదు.

    మరి సమానత్వం స్త్రీలకు లేనప్పుడు గోల చేసిన కంఠాలు ఇప్పుడు ఏమయ్యాయనేదే మా ప్రశ్న. ఆ ప్రశ్నలె ఇప్పుడు నేను అడుగుతున్నాను. అంతే తప్ప నేను భార్యా బాధితున్ని కాను. సంఘాధిపతిని అంతకన్నా కాదు. ఏదో అలా నాకు తప్పు అనిపించిన వాటిని ప్రశ్నిస్తూ నాకు తెలిసిన విషయాలు పంచుకుంటు ఉంటాను అంతే.

    ఇక అత్యాచారాల విషయానికి వస్తే ...
    అది అంత సింపులుగా తేల్చేసే విషయం కాదండీ. చాలా తతంగ ముంది. దానికి మల్టి-లెవెల్ అప్రొచ్ కావాలి. దాని గురించి రాయాలంటే ముందు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి అని పరిశీలించాలి. మళ్ళీ అందులో ఉనన్ రజకీయాలు వివరించాలి. ఇది పట్టాన తేలే సబ్జెక్ట్ కాదు. శిక్ష అనేది ఆ పరిష్కారాలలో ఒక అంశం మాత్రమే. అదే ముఖ్యం కాదు. స్త్రీ-పురుషుల నిష్పత్తి, ఆర్థిక అసమానతలు, mind set మార్పురావడం లాంటి తతంగాలు బోలెడు. కాస్త తీరిగ్గా ఉన్నప్పుడు తప్పకుండా రాస్తాను.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనతో నేను నా అభిప్రాయాల్ని మార్చుకున్నాను,పోష్టుని కూడా అప్డేట్ చేశాను.ధన్యవాదాలు.ముందు ముందు కూడా ఇలాగే తప్పులు వుంటే వీంఠనే తెలియ జెప్తారని ఆశిస్తున్నాను.మరోసారి కృతజ్ఞతలు చెప్పకుండా వుండలేక పోతున్నాను!

      Delete
  3. @ హరి
    శ్రీకాంత్ తో ఏకీభవిస్తున్నాను. ఈ టపాకి సంబంధం లేకపోయినా, మీరు రాసింది చదివితే మీడియా వాళ్ళ ప్రభావం మీ పైన కనిపిస్తున్నాది. చాలా పాత భావాలను ఇంకా కొనసాగిస్తున్నారని పిస్తుంది. రోజు రోజుకి కొత్త చట్టాలు చేసుకొంట్టుపోతే వాళ్ల ఆత్మహత్యల సంఖ్య విపరీతం గా పెరిగిపోతుంది. ముఖ్యంగా మధ్య తరగతి వారిని ఇవి ఇక్కట్లు గురిచేస్తాయి. వెధవపనులు చేసిన సంపన్న వర్గానికి చెందిన తరుణ్ తేజ్ పాల్ బైల్ మీద బయటికి వచ్చాడు. అదే ఇంకొక మధ్యతరగతి వారైతే దశాబ్దం కాలం పాటు జైల్లో మగ్గుతూండేవారు. సార్, మధ్య మగవారి తరపున వాదించటానికి ఎవరు లేరు. ప్రతిదానికి చట్టం చేసి, మన పిలక ప్రభుత్వం చేతిలో పెట్టాలని డిమాండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఇలా కోరుకొనే వారికి బుకిష్ నాలేడ్జ్ తప్పితే కోర్ట్, న్యాయవాదులు, పోలిసులు ఎలా పని చేస్తారో అవగాహన ఉంటే ఇటువంటి డిమాండ్ లు చేయరు. మన కోర్ట్లలో ప్రస్తుతం ఉన్న కేసులు పరిష్కరించటానికి సుమారు 400సం|| పడుతుందని ఒక అంచనా!
    హరిగారు, మనదేశంలో చేసే చట్టాలన్ని ఎక్కువగా వెస్ట్ లో ఉండేవాటికి నకళ్ళుగా తయారు చేస్తారు. దశాబ్దాలుగా వెస్ట్ లో ఫెమినిస్ట్ లు మగవారి మీద అసత్యప్రచారలను చేస్తూ వచ్చారు. రాను రాను ఆర్గనైజేడ్ సంస్థలుగా ఏర్పడి ఏకపక్షంగా చట్టాలు చేసుకొంట్టు పోయారు. నేడు పశ్చిమదేశాలలోపరిస్థితి ఎంతవరకుకొచ్చిందంటే, స్రీలు పెళ్ళిచేసుకొందామనుకొన్నా మగవారు దొరకటం లేదు.
    ఇప్పుడిప్పుడే కొంతమంది పశ్చిమదేశాల మహిళలు నిజానిజాలను తేల్చటానికి బయలుదేరారు.
    వెస్ట్ ఎలా పోతుందో అవగాహన ఈనాలుగు వీడీయోలు చూస్తే మీకే అర్థమౌతుంది.
    https://www.youtube.com/watch?v=6AS7i_EHdjo
    https://www.youtube.com/watch?v=XqHYzYn3WZw
    https://www.youtube.com/watch?v=lNXvduPr4Mw
    https://www.youtube.com/watch?v=3TR_YuDFIFI

    ReplyDelete
  4. హరిబాబు గారు, పై వ్యాఖ్యలో కొన్ని పదాలు ఎగిరిపోయాయి. నేను చెప్పదలచుకొంది ఎమిటంటే, నా వ్యాఖ్య ఈ టపాకి సంబందంలేదు. మనదేశంలో మీడీయా యాంటి మేల్. మగవారినే తప్పుగా చూపించటం జరుగుతూంట్టుంది.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...