Tuesday 13 January 2015

ఇదండీ కమ్యునిజం చరిత్ర!

          ఈ మధ్యనే కమ్యునిష్టు పార్టీలో కాస్త నోరున్న ఒక ముగ్గుబుట్ట ముసిల్ది బోరు కొట్టి "ఇదండీ భారతం" అని హిందూత్వాన్ని వెక్కిరిస్తూ ఒక పుస్తకం రాసిందంట - యెవడు కొంటాట్ట!"బలే మంచి చౌకబేరము" అని యెగురుకుంటూ కొనుక్కెళ్తారనో యేమో జేవలం వంద రూపయలేనట పుస్తకం ఖరీదు?మరి "ధర తక్కువ బంగారానికి" అని నవ్వుకుంటూ కొనకుండా వెళ్ళిపోతేనో!లోయరు క్లాసు వాళ్ళు కూడా యేదైనా హోటల్లో వుండాలనుకుంటే డీలక్సు రూము లడిగే రోజుల్లో ఈ చీపు ట్రిక్కు నిజంగా పనిచేస్తుందా?భారతం చదివి అర్ధం చేసుకోగలిగిన హిందువుకి "ఇదండీ భారతం" అని ఈవిడ చెప్తే తప్ప తెలియదా?కాకపోతే అటూ ఇటూ వూగిసలాడేవాళ్ళు, సరే అంత నమ్మబుధ్ధయ్యేటట్టు చెప్తుంది గదా అనే లాజికల్ అమాయకత్వం వున్నవాళ్ళు నమ్ముతారేమో?అదీ యెంత కాలం!అసలు తను తన సిధ్ధాంతం గురించి మా కమ్యునిజంలో వున్న మంచి ఇది అని చెప్పి జనాలని మెప్పిస్తూ పాజిటివ్ ప్రచారం చేసుకోవాలి గానీ వాళ్లలోనూ వీళ్ళలోనూ తప్పులు పట్టే నెగిటివ్ ప్రచారం దేనికి? అంతగా కావాలనుకుంటే మన ముసలాళ్ళు కృష్ణా రామా అనుకున్నట్ట్టు - మరీ దురద పుడీతే మార్క్సు సహస్ర నామావళి.లెనిన్ అష్టోతరం,యెంగెల్సు దీక్షలతో కాలం గదపక భారతం మీదకి వెళ్ళిందేమిటో ఈ వయస్సులో?అదీ వీళ్ళ యాభయ్యేళ్ళ నిర్వాకం వల్లా తమ అతి మంచితనం వల్లా జరిగిన నష్టమేమిటో తెలిసి హిందువులు కళ్ళు తెరిచాక ఇప్పుడు అసలు ఆ పుస్తకం యెంత మంది కొంటారో గూడా తెలియదు.ఒక సంవత్సరం తర్వాత ఆ పుస్తకం "వేణువు" బ్లాగులో పాత పోష్టులో వార్తగా తప్ప ఇంకెక్కడా కనపడదు,పాపం యెంత కష్టపడి రాసిందో?!

          నేనయితే అస్సలు కొనను,చదవను,పట్టించుకోను - విషవృక్షం కొన్ని పార్టులు అదీ నాస్తికుడిగా వున్నప్పుడే అసహ్యించుకున్నాను.అసలు ఇట్టా రామాయణాన్ని విమర్సిస్తూ ఒక పుస్తకం రాస్తున్నానని చెప్తే ఈ శీలమూ లైంగిక స్వచ్చతా లాంటి వాటికి దూరంగా వున్న శ్రీశ్రీయే అనవసరంగా రామాయణాన్నెందుకు కెలకడం అన్నా వినలేదట!ఇప్పటి దాకా నేహ్రూ మార్కు సెక్యులరిజాన్ని పైన చెప్పిన కమ్యునిష్టోళ్లతో సహా ముల్లాలు చెప్పింది చచ్చినట్టు వినే సాయిబులు పట్టించుకోకపోయినా పోనీలెమ్మని హిందువులే ఆ పుచ్చొంకాయ్ సెక్యులరిజానికి కూసింత విలువిచ్చారు!ఇన్నాళ్ళూ ఆ సెక్యులరిజం ఇట్టా ఆన్నా బతికి వుందంటే హిందువుల పుణ్యమే!కానీ తిరిగే కాలూ తిట్టే నోరూ వూరుకోవుగా?!

          తను రాసిన పుస్తకం మనం చదివే బదులు తను "ఇదండీ భారతం" అని రాసినట్టు మనం "ఇదండీ కమ్యునిజం" అని నీవు నేర్పిన విద్యయే నీరజాక్షీ అంటే యెష్లా వుంచుంది?మనము కూడా మార్క్సిష్టు సిధ్ధాంతాన్ని హిందూ ధర్మం ప్రకారం విమర్శించి వెక్కిరించ వచ్చునా?చూద్దాం, మన సత్తా యేంటో చూపిద్దాం!చిన్నప్పుడు మాఫ్రెండు వాళ్ళింట్లో క్రీస్టియన్లు బైబులు పుస్తకాల్ని ఫ్రీగా పంచిపెట్టేటట్టు రాదుగ వాళ్ళు  ప్రచురించి వొదిలినటువంటి "గతి తార్కిక భౌతిక వాదం","లెనిన్ కావ్యం","నీలం నోటు బుక్కు" లాంటి ధర తక్కువ బంగారాల్ని చాలా కక్కుర్తిగా చదివాను.ఇప్పటికీ చాలా భాగాలు గట్టిగానే గుర్తున్నాయి.అన్నట్టు "మార్కుసు మతం మానవాళికి మత్తుమందన్నాడు" - కాబట్టి మతాన్ని ఈ భూమ్మీద నించి తరిమెయ్యనిదే జనం బాగుపడరు(మన్లో మన మాట ఒక్క హిందూ మతం మీదనే వీళ్ళ యేడుపుగొట్టు వులిపికట్టె దాడి అంతా? మిగతా మతాల్ని గురించి చాలా ప్రేమగా మాట్లాదతారు!) అని వీరంగాలు వేస్తున్నారే ఆ కొటేషను ఫుల్లుగా చదివా!

          మార్క్సు మొత్తంగా అన్న మాటలివి,"మతం అణగారిన ప్రజల నిట్టూర్పు.ఈ నిర్దాక్షిణ్య ప్రపంచానికి అది హృదయం.ఆత్మలేని ప్రపంచంలో అది ఆత్మ.ప్రజల పాలిటి అది మత్తుమందు." ఇందులో మతం యెందువల్ల మనిషికి అనుసరణీయమవుతున్నదో తెలిసిన మనిషికి వుండే సహృదయత వుందే తప్ప మతాన్ని ఈ ప్రపంచం నుంచి తుదిచిపెట్టేదామనే వెర్ర్రి ఆవేశం వుందా!చాలా కాలం నుంచీ చివరి వాక్యాన్ని మాత్రమే జనానికి చెప్తున్న వాళ్ళు మొత్తం కొటేషను యే అర్ధాన్నిస్తున్నదో తెలియకే అట్లా చేశారా?కాదు, అందులో కమ్యునిష్తుల్లో వున్న నాస్తికులు ప్రపంచాన్నంతా గానీ కుదరకపోతే పార్టీ సభ్యుల్నయినా గానీ తమలాగే తయారు చేసి చూసుకోవాలనే దుగ్ధతో చేశారు!విప్లవాన్ని రహస్యకుట్రల్తో విజయవంతం చెయ్యాలనే వాళ్ళ దురాశే వాళ్ళని ఈ భూమ్మీద నుంచి ఖాళీ చెయ్యబోతున్నది.యేవరి ఖర్మ కెవరు బాధ్యులు?!

          అసలు మతాన్ని గుడ్డిగా నమ్ముతున్న జనాన్ని మతం నుంచి దూరంగా నడిపించాలంటే యేమి చెయ్యాలి?మార్క్సు గారి కొటేషను మొత్తం సరిగ్గా అర్ధమయితే వాళ్ళ మీద అనుకంప చూపించాలి.తమ ప్రాబల్యం లేని చోట వున్నాం గాబట్టి సున్నితంగానే చెప్పి నయగారంగా వొప్పించాలి,క్రీస్తియన్లని చూడండి, తిట్టినా సరే వుడుక్కోరు - మా యేసు క్షమించమన్నాడు అనే పాయింటు మీద గట్టిగా నిలబడి మన్ని క్షమించేస్తారు? అదే వాళ్ళకి ప్లస్ పాయింటు!అదే కమ్యునిష్టులు - ముఖ్యంగా ఈ మురంనా లాంటివాళ్ళు రివర్సు గేర్లో వెళ్ళి మీరు వెధవలు,దద్దమ్మలు,మీకేమీ తెలీదు అనే టైపులో రెచ్చిపోతే ఇలాగే యెదురు తంతుంది రిజల్టు!సముద్రంలో కాకిరెట్ట లాగా అక్కడో వోటూ ఇక్కడో వోటుతో దేశమంతటా వుండి కూడా ఆ కాంగ్రెసు లాంటి బూర్జువా పార్టీని అంటకాగుతూ తుమ్మితే వూడే ముక్కు పరిస్థితిలో యెలాగో ఒకలా నెట్టుకొస్తుంటే ఈ రాంగు టైములో ఆ పుస్తకం రాసి పబ్లిష్ చెయ్యడం దేనికి - మూలిగే నక్కమీద తాటిపండు వేసినట్టు!


          ఇవ్వాళ దేశంలో వీస్తున్న మోదీ హవా కాకతాళీయమూ కాదు పాలపొంగూ కాదు!"వేలాది మందిలో ఒక్క రుద్యమింతురు,వుద్యమించిన వేలాదిమందిలో ఒక్కడు శ్రధ్ధాళు వగును,వేలాదిమంది శ్రధ్ధాళువులలో ఒక్కనికి జ్ఞానం వికసించును,అట్ట్టి వేలాది మంది జ్ఞానులలో ఒక్కడు నన్ను చూడగలడు" అనే పధ్ధతిలో యేర్పడిన పిరమిడ్ అది - శిఖరాన కనబడే మోదీ కేవలం ఆ ఆవేశానికి మూర్తిమత్వం మాత్రమే. యాభయ్యేళ్ళుగా నెహ్రూ మార్కు సెక్యులరిజం ఈ మాత్రమయినా బతికి బట్ట గట్టిందంటే అది హిందువులు ఆచరించడం వల్లనే అని తెలుసుకోకుండా వాళ్లనే మతతత్వవాదులు అనే పేరుతో మళ్ళీ మళ్ళీ చీకాకు పరుస్తుంటే ఇంత కాలానికి సహనం నశించి హిందువుల్లో వుదారులైన వాళ్ళు కూడా మోదీని సమర్ధించడం తమ నిర్వాకం వల్లనే నని వాళ్ళెప్పటికీ తెలుసుకోలేరు!యెందుకంటే దశాబ్దాని కొకసారి "చారిత్రక తప్పిదాల క్షమాపణ తీర్మానాల"తో కాలక్షేపమూ పుస్తకావిషరణ మీటింగులూ ఇక ముందు పనిచెయ్యకపోవచ్చు, ఒకేసారి యెలిజీలు సిధ్ధం చేసుకోవాల్సిన సమయం వచ్చింది?

          మోదీ హవానే కాదు భాజపా వుత్ధానాన్ని కూడా యెవ్వరూ తక్కువ అంచనా వెయ్యడానికి వీల్లేదు.విశ్వ హిందూ పరిషత్ ద్వారా గానీ ఆర్.యెస్.యెస్. కార్యకర్తల ద్వారా గానీ,భజరంగ్ దళ్ ద్వారా గానీ లేక అన్నిటితో క్షేత్రస్థాయిలో గాలి తమ కనుకూలంగా వుందనే విషయం గట్టిగా తెలిశాకనే "కమలమే సకలం కావాలి" అనే మాట అంత ధీమాగా చెప్తూ వుండీ వుండవచ్చు!ఇదంతా కాంగెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ పెద్ద పుడింగిల్లాగా తమ కంటే ఈ దేశప్రజల గురించి మరెవరికీ తెలియదనే కన్నూ మిన్నూ గానని అహంతో చెలరేగిపోవదం వల్ల హిందువులకి కాలగూడని చోట కాలిపోవడం వల్ల జరిగింది?!అటు చూస్తే వీళ్ళు నెత్తిన పెట్టుకు వూరేగిన సూడోసెక్యులరిజము యొక్క అసలు స్వరూపం ముస్లిములలో సంసారపక్షంగా వుంటూ సుఖంగా బతకాలనుకున్న వాళ్ళందరికీ కుంకుడు కాయ రసం లాగా కళ్ళు తెరిపించింది.ఒకసారి కళ్ళు తెరిచిన వాళ్ళు మళ్ళీ కళ్ళు మూస్తే అది వాళ్ళ ఖర్మ గానీ ఇప్పట్లో ఆ పరిస్థితి రాదనే అనిపిస్తుంది!వాళ్ళకీ బాగా కాలిందనేది యే మోదీని యెక్కడయితే గోద్రా అల్లర్ల పేరుతో చిల్లర వేషాలు వేసి దెబ్బ తీద్దామనుకున్నారో అక్కడే ముస్లిములు కూడా మోదీనే గెలిపించినప్పుడే తెలుసుకుని జాగ్రత్త పడివుంటే గుడ్డిలోమెల్లగానన్నా వుండేది కాంగ్రెసు పరిస్థితి.

          1818 మే 5న పుట్టి 1883 మార్చి 14న గిట్టిన కార్ల్ మార్క్స్ అనే పేరు గల ఈ జర్మన్ మేధావి రాసిన రెండు పుస్తకాలు -  1848లొ రాసిన కమ్యునిష్టు మానిఫెస్టో,1867లో మొదలు పెట్టి 1894లో పూర్తి చేసిన బృహద్గ్రంధం దాస్ క్యాపిటల్ -  ప్రపంచంలో వున్న ప్రతి మేధావీ తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన ఒక విప్లవాత్మమైన సిధ్ధాంతాన్ని పరిచయం చేశాయి.నేను మొదట్లో "మార్క్సిస్ట్ యెకానమీ" అనే మాటని చూసి తను ఒక కొత్త ఆర్ధికశాస్త్రాన్ని రాశాడని అనుకున్నాను,కానీ స్మిత్సోనియన్ ఆర్ధిక విధానాలని వొప్పుకుంటూనే అందులో వున్న లోపాల్ని సరిచేయ్యడానికి కొన్ని సూత్రీకరణలు మాత్రమే చేశాడు!ఆర్ధికశాస్త్రానికి సంబంధించి ఇతను కొత్తగా కనిపెట్టిన విషయం "అదనపు విలువ" మాత్రమే.ఆర్ధికాంశాలలో అదనపు విలువ అనేది కార్మికుల శ్రమతోనే సాధ్యం గాబట్టి అది కార్మికులకే చెందాలని ఇతడి వాదన.ఇతని అసలైన ప్రతిభ చరిత్రని వ్యాఖ్యానించడం.యేది చరిత్ర గమనాన్ని నిర్దేశిస్తుంది?సామ్రాజ్యాల వుత్ధాన పతనాలకి కారణ మేమిటి?అవి హఠాత్తుగా జరిగినవా లేక వాటి వెనుక యేదయినా చైన్ రియాక్షను లాంటిది యేదయినా వుందా?ఇలాంటి ప్రశ్నలతో సతమతమయ్యే వారికి ఇతని విశ్లేషణలు కొత్తదారులు చూపించాయి.ఆర్ధికశాస్త్ర విశ్లేషణ అంతా స్మిత్సోనియన్ భావజాలానికి భిన్నంగా లేదు గాబట్టి మనం వుపేక్షించవచ్చు గానీ చరిత్రని అర్ధం చేసుకోవడానికి ఇతను ఇచ్చిన పనిముట్లు మాత్రం ఇప్పటికీ నిక్కచ్చిగానే వున్నాయి!

          ఇక్కడ ఒక విశేషం వుంది! యే హెగేలియన్ భావవాదాన్ని తిరగేసి మార్క్సు చారిత్రక భౌతిక వాదాన్ని  నిర్వచించాడో ఆ భావజాలాన్ని పోలిన సాంఖ్యవాదం హెగెల్ కన్నా చాలా ముందే భారత దేశపు తాత్విక చింతనలో ప్రముఖ స్థానంలో వుంది!హెగెలియన్ భావవాదం లోనూ సాంఖ్యవాదం లోనూ చాలా దగ్గిర పోలికలు వున్నాయి.హెగెల్ చరిత్రలో వచ్చే దశల్ని మూడు అంశాలతో వర్ణించాడు - మొదట ఒక థీసిస్ వుంటుంది,ప్రతి థీసిస్ కీ  కాలక్రమంలో ఆంటిథీసిస్ యేర్పడి ఈ రెంటి సంఘర్షణ వల్ల ఒక సింథీసిస్ యేర్పడుతుంది.ఈ సింథీసిస్ అనుకోకుండా మళ్ళీ థీసిస్ గా మారుతుంది.సరిగ్గా ఇలాంటి పోలికనే గుర్తు చేస్తూ మొదట ఈ ప్రపంచగమనం ప్రకృతి పురుషుల మధ్య జరిగే సంయోగం వల్ల జరుగుతుందనే నిరీశ్వర సాంఖ్యం భారత దేశంలో వచ్చింది.అక్కడ మార్క్సు భావవాదం పునాదితో వున్న దాన్ని తిరగేసి భౌతికవాదానికి మళ్ళిస్తే ఇక్కడ నిరీశ్వర సాంఖ్యంలోని పురుషుణ్ణి కాస్తా పరమ పురుషుడు అని తిప్పేసి సేశ్వర సాంఖ్యంగా మార్చారు!

          తీరా చూస్తే ప్రపంచ చరిత్రలో ఇదివరకే జరిగిన విషయాల్ని యెందుకు జరిగాయో చెప్పడం వరకూ బాగానే వుంది కానీ అత్యుత్సాహంతో కొన్ని ప్రిడిక్షన్స్ కూడా చేశాడు - మొట్టమొదట కమ్యూనిజం అమేరికా లాంటి పారిశ్రామికంగా వ్యాపారపరంగా యెదిగి తను దోపిడీ అని నిర్వచించిన వ్యవహారం దిట్టంగా నడుస్తున్న చోట వచ్చే అవకాశం వందన్నాడు.రష్యా లాంటి పారిశ్రామికంగా వెనకబడీనవి అంటే దోపిడీ అనేది ప్రజలకి అనుభవంలోకి రాని దేశాల్లో వచ్చే అవకాశం లేదన్నాడు.తను రాదు అని చెప్పిన చోట రానూ వచ్చింది కరిమింగిన వెలగపండు మాదిరి పోనూ పోయింది!తను వస్తుంది అని చెప్పిన చోట ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు కూడా కనపడటం లేదు?పైగా నిన్నటి రోజున చార్లీ చాప్లిన్ అనే హాస్యగాడు పొరపాటున "కామ్రేడ్" అనే మాటని వాడినందుకు నానా యాగీ చేసి అమరికా నుంచి గెంటేస్తే స్విట్జర్లాండులో బతకాల్సి వచ్చింది!వారు అశాస్త్రీయమైనవి అని వెక్కిరించే నోస్త్రదామస్ జోస్యాలూ బ్రహ్మంగారి కాలజ్ఞానాలూ కూడా నిజమవుతూ పూర్తి శాస్త్రీయమైన మార్క్సు గారి ప్రిడిక్షన్లు యెందుకు అబధ్ధాలైనాయి?

          అసలు సిధ్ధాంతం లోని మొట్టమొదటి మెలిక మానవుడు వస్తుగత వాది కాబట్టి తన ప్రయోజనాన్నే ఆశిస్తాడు అనేది ఒప్పుకుని స్మిత్తు గారి ఆర్ధిక శాస్త్రాన్ని కూడా కాదనకుండా వొప్పేసుకుని కూడా దానికి విరుధ్ధమయిన వర్గరహిత సమాజాన్ని సాధించడం కోసం "స్వంత ఆస్తి రద్దు" అనేదాన్ని ప్రతిపాదించటం!వస్తుగత వాది అయిన మనిషి ఆ స్వంత ఆస్తి రద్దుకి తనంతట తను వొప్పుకోడు,వొదులుకున్న దానికి అధికంగా ప్రయోజనం వుంటుందంటేనే తప్ప అరిచి గింజుకున్నా వొప్పుకోడు.దానికి విరుగుడుగానే "సాయుధ పోరాటం" అనేదాన్ని ప్రతిపాదించాడు?దాని ఫలితమే మీరు ఇక్కడ చూస్తున్న చార్టు!



          ఒక్కొక్క నెత్తురు బొట్టూ ఆ పెద్దమనిషి పాదాల కింద పడి నలిగి చచ్చిన మిలియన్ మందికి సమానం!ఇప్పటి వరకూ మనం హిట్లరే మహా క్రూరుడు అనే భ్రమలో వున్నాం.ఇవన్నీ కమ్యునిష్టులు కూడా కాదనలేని ఖచ్చితమైన లెక్కలు!ఆ వర్గ రహిత సమాజ స్రష్టలు చంపింది యుధ్ధాలు చేసి విదేశీయుల్ని కాదు స్వదేశీయుల్నే అని అర్ధం చేసుకుంటే వారు చెప్పే భవిష్యదుజ్వల సువర్లోకం యెలా వుంటుందో ఇక్కడ దానికోసం ఆశపడుతున్నవారు తెలుసుకోగలుతారు!వారంతా పెట్టుబడి దారులూ సమసమాజాన్ని వ్యతిరేకించిన ద్రోహులు అని అంటే అనవచ్చు గాక అక్కడ అంతమంది చావడానికి కూడా సిధ్ధపడి వ్యతిరేకించిన వ్యవస్థని ఇక్కడ మనం ఆహ్వానించడంలో అర్ధమేమయినా వుందా?కొందరు శాడిష్టులు మేం పుణ్యాత్ములం, "మా నాన్న చచ్చే వాడిగా కాకుండా చంపేవాడుగా వుండాలని నాకీ పేరు పెట్టాడు" అని టెక్కు చూపించి చచ్చేవాళ్ళలో వుండము గదా అని సంబరపడి సమర్ధించవచ్చు!కానీ భీభత్సం మొదలయిన తర్వాత ఆ గ్యారెంటీ వుండదు.స్టాలిను గారి విజృంభణకి జడిసి దేశం వొదిలిపోయిన ట్రాట్స్కీ గారు కూడా మొదట్లో ఆయనకి అనుంగు సహచరుడే - అతను అధ్యక్ష పదవికి యెదగడానికి సహాయ పడ్డవాడే?

          స్మిత్తుగారి లాగానే మానవుడు వస్తుగత వాది అని తను కూడా వొప్పుకున్నాడు.అయితే, ఆ స్మిత్తుగారి ఆర్ధిక సూత్రాలు చలనంలో "అదనపు విలువ"ని పుట్టిస్తున్నాయని కనుక్కున్నాడు - అంతవరకూ బాగానే వుంది!కానీ దాన్ని పరిహరించే కొత్త ఆర్ధిక శాస్త్రాన్ని రచించలేదు?పైగా ఈ అదనపు విలువ కార్మికుడు రంగప్రవేశం చేసాకనే వొచ్చింది గాబట్టి దీనిమీద సర్వహక్కులూ కార్మికులవే అని తీర్మానించాడు.ఈ అదనపు విలువని శ్రామికులకి మాత్రమే దఖలు పర్చే "శ్రామిక వర్గ నియంతృత్వం" అనే మరో జీడిపాకాన్ని మొదటి సూత్రం నుంచి లాగాడు.వస్తుగత వాది అయిన పెట్టుబడిదారు నయానా భాయానా లొంగి తనంతట తను ఈ అదనపు విలువని కార్మికులకి ఇవ్వడు గాబట్టి "సాయుధ పోరాటం" ద్వారానే ప్రపంచ కార్మికు లంతా యేకమై సాధించాలని నువ్వులద్ది మనం చిన్నప్పుడు ఇష్టంగా తిన్న పాకంజీడి లాంటి ఒక ఆకర్షణీయమైన వంటకాన్ని తయారు చేశాడు.ఈ వంకం తింటే యేమొస్తుంది అనేదానికి అందరు వంటవాళ్ళ లాగే "వర్గ రహిత సమాజం" అని దాని గురించి చవులూరించేలా యెన్నో పిట్టకధలు చెప్పాడు.

          వెక్కిరింతగా అనలేదు నేను పిట్టకధలని,నిజంగానే వర్గరహిత సమాజం గురించి ఆయనా మిగతా మార్క్సిష్టులూ చెప్పే ప్రతి మాటా మిగతా మతాలకి సంబంధించిన పూజారి వర్గం చెప్పే "స్వర్గం" అనే అందమయిన ప్రాక్కల్పన లాగే వుంటుంది తప్ప శాస్త్రీయమయిన మాట ఒక్కటి లేదు?! పెట్టుబడి శ్రమా రెంటికీ 50-50 ప్రాధాన్యత ఇస్తే కొంత న్యాయంగా వుండేది కానీ పెట్టుబడి నథింగ్ శ్రమే యెవ్విరీథింగ్ అనడం ముఖ్యమయిన లోపం!వర్గరహిత సమాజం యేర్పడినాక రాజ్యం అంతరించి పోతుందనే కంటి తుడుపు వ్యాఖ్యతో శ్రామిక వర్గ నియంతృత్వం నిక్కచ్చిగా అమలవుతూ శాశ్వతంగా కొనసాగే విధంగా రాజ్యం యేమి చేయాలనేది చెప్పకపోవటం అసలైన మూర్ఖత్వం?!వస్తుగత వాది అయిన మనిషిని వర్గరహిత సమాజపు నియమాలకి పట్టి వుంచాల్సిన అవసరం లేదనుకున్నాడా?హెగెల్ చెప్పిన దాన్ని తిరగేసినా యెలా చేసినా మార్క్సిష్టు కార్యాచరణ అంటే గతితార్కికంగా పుట్టుకొచ్చే వైరుధ్యాల్ని మనం కోరుకున్న దిశకి నదిచేలా సమన్వయం చెయ్యడం అయినప్పుడు వర్గ రహిత సమాజంలో కూడా మిత్రవైరుధ్యాల విషయంలో నైనా ఆ అవసరం వుంటుంది కదా?వర్గరహిత సమాజం ఆవిర్భవించెయ్యగానే మానవుడిలోని వస్తుగత వాంఛ హఠాత్తుగా అదృశ్యమైపోతుందా?అసలు ఒక ప్రాంతంలో వర్గరహిత సమాజం ఆవిర్భవించిందని యెలా గుర్తు పట్టాలి?అసలు లక్ష్యాన్ని సరిగా నిర్వచించకుండా పిట్టకధలతో సరిపెట్టేస్తే కొత్తగా ఈ సిధ్ధాంతాన్ని ఆచరించాలనుకునే తెలివైన వాళ్ళకి లక్ష్యం గందరగోళంగా వుండదా!అసలు సిధ్ధాంతంలోనే ఇన్ని గందరగోళాలు వుంటే వాటిని అనుసరించేవాళ్ళు మరింత అయోమయాన్ని సృష్టిస్తున్నారు!సాయుధపోరాటమే శ్రామికవర్గనియంతృత్వానికి వున్న ఒకేఒక్క దారి అని మార్క్సు గారు అంత తెగేసి చెప్పినాక కమునిష్టులు యెన్నికల్లో నిలబడ్డం యెందుకు?నిలబడిరిపో, ఒక బూర్జువా వర్గానికి చెందిన కాంగ్రెసు పార్టీ వాడయిన నెహ్ర్రూని "అభివృధ్ధికాముకుడు,శాంతికాముకుడు" అని పొగిడి ఆ పెద్దమనిషి వోట్లకోసం వాడుకున్న కుహనా సెక్యులరిజాన్నే తామూ భుజాన వేసుకోవటం దేనికి?తమకంటూ సొంతంగా సెక్యులరిజం అంటే యెమిటో తేల్చుకోలేని వాళ్ళు ఈ పైలాపచ్చీసు యెన్నికల వ్యవస్థలో వీళ్ళు యెవరినుంచి వోట్లు ఆశిస్తున్నారో వాళ్ళకెవరికీ అర్ధం కాని సిధ్ధాంతాన్ని వూదరగొడుతూ యేమి పీకగలుగుతారు?

          గాంధీ జయంతి రోజున మాంసం తిన్నందుకు లెంపలేసుకున్న కమ్యునిష్టు నాయకులు బౌతిక వాదులా?హవ్వ!ఇంకా నయం గాంధీ జయంతి రోజున యేదయినా గుడి కెళ్ళి గాంధీ గారి పేరున అర్చన చేయించి పూజారి గారిచ్చిన పువ్వుని రొజంతా చేవిలో పెట్టుకు తిరగాలంటే అది కూడా చేసేవాడా!ఇలాంటి కేతిగాళ్ళు శ్రామిక వర్గ నియంతృత్వాన్ని సాధించటం కోసం వర్గపోరాటం చేసి గెలుస్తారంటే నమ్మేవాడిని చూసి నవ్వాలి?!ఒకప్పుడు కమ్యునిష్టులు వస్తున్నారంటే గ్రామదేవతలని వూరేగించినట్టు ప్రభలు కట్టి వూరేగిస్తూ వూళ్ళలోకి తీసుకెళ్ళిన జగజ్జేగీయమానమయిన స్థితి నుంచి బూర్జువా పార్టీల్ని ఆ సీటు మాకొదులు ఈ సీటు మాకొదులు అని దేబిరిస్తూ యెంత  అంటకాగినా తగుమాత్రపు వోట్లని కూడా నిక్కచ్చిగా తెచ్చుకోలేని దుస్థ్తితికి దిగజారడానికి కారణాలు వెతుక్కుంటే నిర్మాణాత్మకంగా యెదగటానికి పనికొస్తుంది గానీ రామాయణాన్నీ మహాభారతాన్నీ తిడీతే యేమొస్తుంది?

          ఈ నాస్తికులంతా యింత గట్టిగా మతాల మీద దాడి చెయ్యాలని చూస్తున్నారు గానీ వీళ్ళు యెదటివాళ్ళని అన్నీ వేదాల్లో వున్నాయిష గాళ్ళు అని వెక్కిరించడం నుంచి ఇన్స్పైర్ అయ్యారో యేమో గానీ కొందరు బుధ్ధిమంతులు అసలు కమ్యునిజంలో కూడా ఒక మతానికి వుండే లక్షణాలన్నీ వున్నాయని ఢంకా బఝాయించి చెప్తున్నారు?దైవం స్థానంలో చరిత్రని చూపించాడు.దోపిడీకి మార్క్స్ ఇచ్చిన నిర్వచనాలన్నీ మతాల్లో పాపకర్మకి ఇచ్చిన నిర్వచనాలతో సరిపోలి వున్నాయి.శ్రామికవర్గనియంతృత్వం అనే సాధనని మోక్షసాధనకి ప్రత్యామ్నాయంగా తీసుకున్నాడు.మనిషి యొక్క అంతిమ గమ్యం విషయంలో మతం స్వర్గాన్నీ భగవంతుణ్ణి చేరడాన్నీ చెప్తే మార్క్సిజం వర్గరహిత సమాజాన్ని గురించి చెప్తుంది.అంటే యేమిటన్నమాట, తొందర్లోనే నేను మొదట్లో చెప్పినట్టు "కొత్తా దేముడండీ కొంగొత్తా దేముడండీ" అనే పధ్ధతికి దిగిపోతే తప్ప రోజురోజుకీ మతానికి ఇంకా గట్టిగా దగ్గిరవుతున్న ఈ కాలం ప్రజలు వీళ్ళని దగ్గిరకి రాబివ్వని కాలం వచ్చింది?!

          తల్లివేరుకి చెదలు పట్టి కొమ్మలన్నీ తెగుళ్ళతో యెండిపోయి అసలు కమ్యునిజమే ఇట్లా అఘోరిస్తుంటే దీని నుంచి సైడుపక్కకి పెరుగుతూ పుట్టిన పిలకల పరిస్థితి ఇంకా గందరగోళంగా వుంది!మార్క్సు "శ్రామికులు" అని చెప్పిన చోటల్లా "మానవుడు" అని రీప్లేస్ చేస్తే మానవవాదం తయారయింది,"స్త్రీలు" అని రీప్లేస్ చేస్తే స్త్రీవాదం అయ్యింది,"దళితులు" అని రీప్లేస్ చేస్తే దళితవాదం అయింది!

          మానవేంద్ర రాయ్ పేరుతో ఇంగ్లీషులో రాయిజం అనీ తెలుగులో మానవవాదం అనీ పిలుచుకునే ఒక పట్టాన కొరుకుడు పడని  రాయిలాంటి సిధ్ధాంతానికి తెలుగు బ్లాగుల్లో ఇన్నయ్య అనే మేధావి మాత్రమే ఆలంబనగా కనబడుతున్నాడు.ఈ మానవేంద్రుడు మొదట్లో మార్క్సు గారితో కొంతకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగి ఆ శ్రామికవర్గనియంతృత్వం - సాయుధ పోరాటం అనేవాటికి కాస్త దడుచుకునో యేమో మార్క్సు గారి సిధ్ధాంతాన్ని 45 డిగ్రీలు పక్కకి తిప్పేసి "నేను శ్రామికుడి బదులు మానవుణ్ణి కేంద్రంగా నిలబెడుతున్నాను,అయితే నేను కూడా సమసమాజాన్నే ఆశిస్తున్నాను, కానీ యే ఫ్రేం వర్కూ వుండకూడదు" అనే హడావిడి మొదలెట్టాడు!నాకు సహజంగా జ్ఞాపకశక్తి యెక్కువ,యేళ్ళ క్రితం చదిబినవి కూడా గుర్తుంటాయి!కానీ ఈ పెద్దమనిషి రాసిన "ఒక పిల్లి ఆత్మకధ" ఈ మధ్యనే చదివినా మొదలూ చివరా తప్ప మిగిలిందంతా మర్చిపోయాను?మొదలవడం అద్భుతమయిన వ్యంగ్యంతో మొదలయింది గాబట్టి గుర్తుంది.ముగింపు గొప్ప తాత్విక చింతనతో వుంది కాబట్టి అదీ గుర్తుంది.కానీ మధ్యలో ఆ పిల్లి గారి బాధేమిటో ఈ రాయి దేన్ని బద్దలు కొట్టాలనుకుందో మాత్రం నాకర్ధం కాలేదు,అందుకే మర్చిపోయాను! యే ఫ్రేం వర్కూ వుండకూడదంటున్నారు గదా అని మీరు అరాచకవాదులా అని పృశ్నించకండి, చాలా అరాచకంగా రెచ్చిపోతారు.స్వేచ్చ,స్వేచ్చ,స్వేచ్చ - యే నియమ నిబంధనలూ లేని యే ఫ్రేం వర్కుకీ కట్టుబడని స్వేచ్చ కావాలి,అంతే!కాకపోతే వీరికీ కమ్యునిష్టులకీ వున్న సారూప్యం హిందూమతాన్ని విమర్శించటం.హిందూ యోగులు గాలిలో తేలతారంటే నమ్మరు గానీ తమ సిధ్ధాంతమే యే ఆధారమూ లేకుండా గాలిలో తేలుతున్నదని మాత్రం ఒప్పుకోరు.వీరు చేప్పే క్యాపిటలిష్టా  శ్రామికుడా అనేది పట్టించుకోకుండా మానవుణ్ణి కేంద్రంలో నిలబెట్టడం అనే వ్యవహారమూ,యే ఫ్రేం వర్కూ వుపయోగించకుండా సర్వమానవసమానత్వాన్ని సాధించటం అనే తతంగమూ ఒక్క శ్మశానంలోనే సాధ్యపడుతుంది - గరిమనాభి సూత్రం ప్రకారం శవం పాడెకి కేంద్రం లోనే వుండితీరుతుంది కాబట్టీ అన్ని శవాలూ ఒక్కలాగే కాల్తాయి గాబట్టీ?!

          స్త్రీవాదం అనే మరో పిలక తొందర్లోనే మాయమైపోయింది యెందుకనో!అప్పట్లో వొల్గా అనే పేరు చాలా యెక్కువగా వినబడుతూ వుందేది.కానీ ఇవ్వాళ మాత్రం స్త్రీవాదం అనేది బలహీన పడిపోయినట్టే లెఖ్ఖ!ఆడవాళ్ళు సహజంగా మగవాళ్ళ కన్నా తెలివైన వాళ్ళు కావడం వల్లనో యేమో వోల్గా గొంతు వినబడే కాలంలో కూడా ఆడవాళ్లలోనే పెద్ద స్థాయిలో కదలిక పుట్టించలేకపోయింది.సౌజన్యారావుని చూసే వరకూ ప్రోనాచ్చి గా వున్న గిరీశం హఠాత్తుగా యాంటీనాచ్చి అయిపోయినట్టు మిత్రులు శ్రీకాంత్ గారు ఒకప్పుడు ప్రోఫెమినిష్టుగా వుండి ఇప్పుదు యాంటీ ఫెమినిష్టుగా మారిపోయి రఘునందన్ లాంటి వారికోసం గృహహింస చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు తన బ్లాగులో.అటు వెళ్ళి ఇటు వచ్చిన తనలాంటి వారికి తప్ప నాకంతగా తెలియని దాన్ని నేను పరామర్సించలేను గాబట్టి దీన్ని వదిలేస్తున్నాను.

          ఇక దళితవాదం పిలకకి ఇప్పుడున్న పెద్ద గొంతు కంచె ఐలయ్య గారిది!ఈయన గారిది నిజంగా మైరావణ చరిత్రే?ఆఖరికి అన్ని కులాల వాళ్ల కోసం పోరాడే మావోయిష్టు నేతకి కూడా పొరపాట్న "గణపతి" అనే గుప్తనామం పెట్టుకున్నందుకే బ్రాహ్మణీయ ఆధిపత్య సంస్కృతిని అంటగట్టేసిన దళితవాదపు మగ ముప్పాళ రంగనాయకమ్మ!మొదటిసారి నేను ఈయన పేరు ప్రముఖంగా విన్నది పౌలస్త్యబ్రహ్మ ముని మనవడయిన రావణుడు కూడా దళితుడే అని వింత ప్రకటన చేసినప్పుడు!ఈయనే కాదు ఇలా సంచలనం కోసం యేదో ఒకటి మట్లాడే వాళ్లంతా "నైబర్స్ ఎన్వీ వోనర్స్ ప్రైడ్" అని ఝమ్మున సేల్స్ పెంచుకున్న వ్యాపార ప్రకటన నుంచి స్పూర్తి పొందిన వాళ్ళే!అప్పటి నుంచీ ఈయన పేరుతో వచ్చిన వ్యాసాలలో కుదిరిన ప్రతిదీ చదివాను.పైకి దళితవాదం అని పేరు పెట్టుకున్నా అసలు రంగు చూస్తే కులవాదం అని స్పష్టంగా తెలుస్తుంది.ఈ మధ్యనే కులపరమయిన రిజర్వేషన్లని సర్ధుబాటు చెయ్యటం గురించి ఒక రచయిత మాదిగలలో వుండే వుపకులాల గురించి చాలా కొత్త విషయాలు చెప్పి వారికి కూడా న్యాయం జరగాలనే విధంగా వాదించారు.ఈ మొత్తం మేధావుల్లో యెవ్వరూ కులాల మధ్య అసమానతలు తొలగాలని నిజంగా కోరుకోవటం లేదు!మందకృష్ణ మాదిగ మరియూ మాలమహా నాడు నేతలు తమలో తమకున్న అధిపత్యాల్ని వొదులుకోకుండా తమ కులప్రయోజనాల కోసమే పోట్లాడటానికి కూడా బ్రాహ్మణాధిపత్యమే కారణమని వారంతా నిజంగా నమ్ముతున్నారా?ఒకవేళ అదే కారణమైతే ఐలయ్య గారు బ్రాహ్మణులు చెప్పడం వల్ల యేర్పడిన తన కులవారసత్వం పట్ల అంత వ్యామోహం చూపిస్తున్నాడేమిటి?బ్రాహ్మణులు అంత దుర్మార్గంగా యేర్పాటు చేసిన కులవ్యవస్థని ధిక్కరించి పారేసి - తను కులరహితుడిగా నిలబడితే గదా బ్రాహ్మణ్యాన్ని ధిక్కరించినట్టు?!

          మీరిలాంటి మహా ధైర్యమయిన మరియూ గంభీరమయిన కులరాహిత్యాన్ని యే దళితవాది నుంచీ ఆశించలేరు!ఈ అసమానతలన్నీ ఇలాగే వుండి లటక్కన తమ కులం మాత్రం అధికారంలోకి రావాలి అనే గొంతెమ్మ కోరిక తప్ప కనీసం దోపిడీకి గురవుతున్న కులాల నన్నిట్నీ ఐక్యం చేసి ఆ పీడిత కులాల మధ్యనైనా సమానత్వాన్ని సాధించే వుద్దేశమూ లేదు?!యెందుకంటే వారి లక్ష్యం కులరహిత సమాజం కాదు,కేవలం అధికారం ఇప్పుడు అనుభవిస్తున్న కులాల నుంచి తమ కులానికీ తమ మిత్రుల కులాలకీ దఖలు పడటం మాత్రమే వీరు కోరుకుంటున్నది!అందుకోసం వీరు కనుక్కున్న మహత్తరమయిన పరిష్కారం యెన్నికల్లో కేవలం తమ కులపు వాణ్నే గెలిపిస్తూ సంఖ్యాబలాన్ని పెంచుకోవటం!అందుకోసం ఇప్పుడు పైనున్న కులాల వాళ్లలో వున్న మంచివాళ్లకి గూడా అణిచివేతయే ఆనందంగా వున్నదని రుజువు చేసే విషయాలని పరిశోధించి తెలుసుకోవటం తమ కులపు వాళ్లందర్నీ తమ కులంలోని దొంగవెధవలకి గూడా సంతోషంగా వోట్లు వేసేలా సంఘటిత పరచటం లాంటి ఘనకార్యాలు చేస్తూ వుంటారు!?కానీ ఈ మేధావులకి తెలియని బేసిక్ విషయం యేమిటంటే మందబలాన్ని పెంచుకోవాలనే వ్యూహంతో తాము పైకి పంపించే తమ కులంలోని దొంగ వెధవలు ఇప్పుడు పైనున్న కులాల్లోని దొంగవెధవల్తో కలిసిపోవడానికే నూటికి తొంభైతొమ్మిది శాతం ఆస్కార ముందనేది?!వాళ్లకి తెలిసినా మనలాంటి వాళ్ళకి చెవిలో పెట్టడానికి వుపయోగించుకున్నా ఈ స్వైరకల్పనల్ని యెన్నేళ్ళపాటు పోషించినా వాళ్ళు ముందు కెళ్లలేరు.

          అసలు ఈ పిలకలన్నీ మొలిచింది కమ్యునిష్టులు దారి తప్పడం వల్లనే గదా!ఆత్మవిమర్శ చేసుకుని తప్పుల్ని సరిదిద్దుకుని అందర్నీ కలుపుకుని తమ లక్ష్యం కోసం పాజిటీవ్ ప్రయాణం చెయ్యాల్సిన సమయంలో ఈ నిగిటివ్ నిర్వాకం దేనికి?అంతమై పోయే కాలం సమీపించినా ఈ దిక్కుమాలిన పన్లతో కాలం గడిపితే యెవరికి నష్టం?

53 comments:

  1. అద్భుతం.. మాటల్లేవంతే.

    అన్నట్టండోయ్ హరిగారూ.. బ్లాగుల్లో తిరిగే చైనా కుక్కకి శ్రీలంకలో సిరిసేన గెలవడంతో పిచ్చి పీక్ స్టేజీకి పోయింది. చైనాలాంటి దేశం మన పొరుగునే ఉన్న శ్రీలంకలో పాగా వేస్తుంటే ఆందోళన చెందడం భారత పాలకుల హ్రస్వ దృష్టి అంట. ప్రజల ప్రయోజనం కోసం ఏ దేశానికైనా ఏదేశంతోనైనా వ్యూహాత్మక సంబంధాలు పెట్టుకునే హక్కు ఉందంట. అంచేత, శ్రీలంకలో పోర్టులూ గట్రా నిర్మించే పేరుతో చైనా మనకు పక్కలో బల్లెంలా వచ్చి తిష్ఠవేయొచ్చటగానీ.. చైనాకు నచ్చని అమెరికాతో ఇండియా ఫ్రెండ్ షిప్ చేయకూడదంట. ఈ చైనా కుక్కల ఉడుకుమోత్తనం ఏ రేంజిలో ఉందో.. వీళ్లవాదనలు ఎంత విచిత్రంగా ఉంటాయో చూడండి. బహుశా వీరి దృష్టిలో దేశమంటే చైనాయే దేశం. భారతదేశం దేశం కాదు. భారత ప్రజలు ప్రజలు కాదు. ఛీ... ఈ చైనా కుక్క ఎదురు పడితే చెప్పుకు పెండ రాసి ఎడాపెడా కొట్టాలనిపిస్తోంది.

    అన్నట్టు ఇంకో విషయం. మన మురంనా, ఆవిడగారి జీవన సహచరుడు (కమ్యూనిస్టుల లెక్క ప్రకారం భర్త అనకూడదు మరి) పాపం చైనాకు వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోదామనుకున్నారట. ఎన్ని లేఖలు రాసినా చైనా ఎంబసీ స్పందించలేదట. ఆవిడే ఓ పుస్తకంలో రాసింది. నాకు ఆ చైనావాళ్ల మీద పీకల్దాకా కోపం ఉంది. అప్పుడే వాళ్లు స్పందించి ఈవిణ్ని తీసుకుపోయుంటే బాగుండేది కదా అని. అక్కడ ఇలాంటివి రాసుంటే తోలు తీసి ‘ఎర్ర’టి ఎండలో ఆరేసినప్పుడుగదా ఈవిడకు భారతదేశం గొప్పదనమేంటో అర్థమయ్యేది అని..

    ReplyDelete
    Replies
    1. ఆ విషయంలో చైనా వోళ్లు చాలా తెలివైనోళ్లలా వున్నారు!
      తను రాసిన లేఖల్లోనే యేదో తేడా కనిపెట్టేసి వుంటారు?

      Delete
  2. కాస్త బేలెన్స్ మెయింటైన్ చేస్తే మీ విమర్శనాత్మక ఆలోచన పద్ధతి బాగుంది.

    ReplyDelete
    Replies
    1. అతిగా వూగుతున్నవాళ్ళని బ్యాలెన్సు చెయ్యాలి గదా!
      చలసాని ప్రసాద్ గారనే మంచి కమ్యునిష్టు "ఇలా మిగిలేం?!" లో పేర్లతో సహా పీకి పాకం పెట్టాడు!
      ఆయనకి చెవులు మాత్రమే పనిచెయ్యవు,మిగిలిన వాళ్లకి బుర్రలు కూడా పనిచెయ్యవు,అంతే తేడా?

      Delete

  3. మధ్య లో రెండు పేరాలు మోడీ కి డెడికేట్ చేసేరు ! పీ ఆర్ పీ రేటింగ్ కోసమా ! జేకే !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. excellent artical

      Delete
    2. పీ ఆర్ పీ రేటింగ్ కోసమా
      ?
      అసలు టపాలోని మెయిన్ పాయింటే అది!
      భాజపా బలం పెరిగే కొద్దీ ఖాళీ అయ్యేది కమ్యునిష్టుల దుకాణాలే!
      అసలు పాయింటు నట్లా దాచేసి మిగిలిన పాయింట్లని జిలేబీ చుట్టల్లా చుట్ట్టుకొచ్చా!

      Delete
  4. ఆయనకి చెవులు మాత్రమే పనిచెయ్యవు,మిగిలిన వాళ్లకి బుర్రలు కూడా పనిచెయ్యవు,అంతే తేడా?
    super comment

    ReplyDelete
  5. పానుగంటి వారి సాక్షివ్యాసాలు రికార్డ్ చేసి ఇక్కడ పెడుతున్నాను... విని మీ అభిప్రాయాలు చెప్పగలరు..
    suryamahavrata.com >> తెలుగులో చదివినవి >> పానుగంటి వారి సాక్షి వ్యాసాలు

    ReplyDelete
  6. ఉతికి ఆరేసారండి... తమ గురించి చెప్పుకోలేని వాళ్ళే, ఎదుటి వారిని విమర్శిస్తారు. మురంనా కూడా అదే తరహా వ్యక్తే.. ఇటువంటి వాళ్ళని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలి.

    ReplyDelete
  7. అద్భుతంగా ఆశక్తికరంగా రాసారు. కాని మన కామ్రేడ్లు నిద్రపోవట్లేదు. నిద్రనటిస్తున్నారు.అందుకే వారిని లేపటం కష్టం.
    వివరంగా చెప్పాక కూడా "వాదనలో పసలేదు" అని చెవులు మూసుకుని పారిపోతారు!

    ReplyDelete
  8. Replies
    1. Respected sir, I like the concept u discussed "kularahithavyakthi", but I need explanation how to be like that with practically in our indian society? How it will be help ful to demolish this communalism in india!!

      Delete
    2. And pls dont tell me birdstories as I cant understand them

      Delete
    3. @who are you?
      where you found that I proposed "kularahitavyakti" in my post?Do you want to demolish communalsim sincerely or trying to be intelectual by acting like an idealist!

      which birdstories you you fond here?How could you suggest not to tell without mentioning them!

      Delete
    4. @హూ యాం ఐ
      అయినా "పిట్టకధలు" అని సుబ్బరంగా లేఖిని లోకెళ్ళి తెలుగులో రాయొచ్చు గదా,ఈ "birdstories" అనే పైత్యం దేనికి "పొలిహోర"కి "TigerRice" లాగా?!

      Delete
    5. కులరహితుడిగా నిలబడితే గదా బ్రాహ్మణ్యాన్ని ధిక్కరించినట్టు?!
      dint you see this in your post?wonder?you dint know what did you write in your post? i think i comented in wrong mans post?enjoy your birdstory writing..all the best

      Delete
    6. And finally, Before u comment others ,u write telugu well,hora ante rice kaadu,poli ante tiger kaadu, puli ante tiger,

      Delete
    7. కులరహితుడిగా నిలబడితే గదా బ్రాహ్మణ్యాన్ని ధిక్కరించినట్టు?!
      i am not proposing, I am just challenging those who decare them as so called "caste wariors".You have to decide sincerely to stood out of the caste system proposed by brahmins If you dislike it,understood?

      Delete
    8. This comment has been removed by the author.

      Delete
    9. @
      హూ యాం ఐ?
      మీ పేరులో వున్న కంఫ్యొజనే మీ కామెంట్లలో కనబడుతున్నది!ఇంతకీ మీరెవరు?బ్రహ్మణులు మీమీద ఒక దుర్మార్గమయిన కులవ్యవస్థని రుద్దారే అనుకుందాం మీరు ఘోషిస్తున్నట్టుగానే.అది మీకు అన్యాయం అనిపించాక గూడా ఇంకా దానినే అంటిపెట్టుకునేడవడం దేనికి?నా ప్రశ్న అర్ధం కాలేదు కాబోలు!బ్రాహ్మణులు మాల కులస్థుల్ని నీచంగా చూడదం అన్యాయమేఅయితే మాల కులస్థులు మాదిగ కులస్థుల పట్లా అలాగే ప్రవర్తిస్తున్నారు,అది పిట్టకధ కాదే!చదువు రానివాళ్ళు కాదు చదువుకున్న వాళ్ళు కూడా "మాలమహానాడు","మాదిగదండోరా" లంటూ విడివిడిగానే తమ స్వార్ధాల కోసమే పోట్లాడుతున్నారే తప్ప అందరూ కలిసి అందరికీ న్యాయం జరిగేతందుకు పోరాదరేమిటి?అసలు

      in fact you are weaving cock and bull stories for your deep attachment with your caste!you are so attached to your caste that you can't even accept for equality even in oppressed castes among themselves,you got it?

      In on eway you are accepting the inequalities and in the other way you are blaming brahmins for your own ignorance,isn't it?

      Delete
    10. nuvvu bharatheeyudavaithene nuvvu british varu (nee paina unnavaripaina nee hakkulaku) paina poraadedavu anduke asthithvam avasram
      idi meeku ardham kaadu endukante meeru samasya ku parishkaaram chupaleru ,chupinhcina parishkaaram thappu ani ela cheppagalaru..?
      britishvaadilage hindu muslim madhya antharaalanu upayoginchi division chesinatte mala madiga ane division nu meeru balaparusthunnaru..okka vishaym gurthunchukondi annellu pai varnaalu unnaru vallu kindi varnaalaku em chesaaru..?dochukovadam thappaa?
      kaani poorthigaa samasyanu sadhinche parishkaaram lenapudu samasyanu konthainaa parishkarinchedi melu ..?kaani adi kooda vaddu ane meeboti vaallu ..?samasyaku parishkaaram choopettaru
      unna parishkaaraanni upayoginchi meeru meeboti vaallu paristhulanu vaadukuntaaru
      kulavyavasthanu nenu atti pettukokundaa ela undaali annadi meeru cheppadam ledu
      adi vadilesi malli pitta kathalu chepthunnaru
      oorike upanyaasaalu aadarshaalu cheppakoodadu
      intha raasinaa naaku telsu meeku ardham kaadu ani
      endukante meeru em cheppalanukuntunnaro denni anghikaristhunnaro denni angeekarinchadam ledoo meeru confusion gaa unnaru
      coment ki reply ichche mundu coment nu poorthigaa chadavandi
      nenu cheppedi naa kindi kulam vaallu naa kinda undaalani kaadu deenini meeru ila rase medhavulu
      kabatti nenu naa paina mariyu naa kinda ekulam undakoodadu
      deeniki edaina parishkaaram choopettagalaru
      leka pothe ippudu jaruguthunnadi kachchithangaa workout authundi
      choosaarugaa prathi okkaru thama asthithvaaniki poratam chesthunnaru..
      anthaku mundu paina unde valle thama asthithvaanikai poradevaallu
      ippudu kindi attadugu vaallu thama asthithvaaniki poraduthaaru
      kaneesam ippudu kindi vaaru porade hakku thamaku undani telusukuntunnaru ..
      appudu ledu ..meeru mundu kulavyavastha nu goorchi poorthi gaa adhyayanam chesi raayandi ledu naaku anthaa telusu ani rasthe mee istam all the best
      సమస్య కు ఉన్న పరిష్కారం తప్పు అనేవాడు ,పరిష్కారం తప్పకుండా చూపగలగాలి,చూపగలడు ఎందుకంటే తను సమస్యను పూర్తిగా ఆవగాహన చేసుకుంటాడు ...




      Delete
    11. This comment has been removed by the author.

      Delete
    12. @who am I
      పరిష్కారం కోసం అంత గట్టిగా అడుగుతున్నారు గాబట్టి తప్పకుండా చెబుతాను!
      మీరు నిగ్గదీసిన విధానం నాకు నచ్చింది,అందుకోసమయినా చెప్పాలని అనిపిస్తున్నది.

      Delete
  9. బాగా రాశారు. . ఇంకొక పిలక వాదం కూడా ఉంది. ఒకప్పుడు దానిలో కొంచెం మార్క్సిజం వాసనలు కలిపారు. అది ద్రవిడ వాదం. నార్త్ ఇండియా వారు ఆర్యులని,సౌత్ ఇండియా వారు ద్రవిడులని ప్రచారం చేశారు. కాని తమిళనాడు చుట్టు పక్క రాష్ట్రాలవారైన మలయళీలు,కన్నడిగులు, తెలుగువారెవ్వరు, ఈ ఆర్య ద్రవిడ సిద్దాంతాన్ని సీరియస్ గా తీసుకొరు. ఎవ్వరు నమ్మినట్లు కనిపించరు.

    ReplyDelete
    Replies
    1. నిజమే,కానీ దాని సారాంశం పూర్తిగా తెలియక వొదిలేశాను.
      ఇవ్వాళే చూశాను.ఉగాది నుంచి కమ్యునిష్టులు కూడా పందగల్ని జరుపుతారంట!వుగాది జరపటం అంటే పంచాంగ శ్రవణం తప్పనిసరిగా వుండాలి,నారాయణ చేస్తాడా?రాఘవులు చేస్తాడా?దానికి మరో పది రోజుల తర్వాత శ్రీరామ నవమి వస్తుంది.వడపప్పూ పానకం మురమ్నా కూడా తాగుతుందా?క్రిష్ణాష్తమి రోజున వుట్లు కొట్టేటప్పుడు వాళ్లకి మురమ్నా చీర్ లీడర్ లాగ వుషారెక్కిస్తుందా?తల్చుకుంటుంతేనే నవ్వాగడం లేదు:-<>)

      Delete
    2. నవ్వకండి. వాళ్ళు నిజంగా మారుతున్నారేమో.

      Delete
    3. చేతులు కాలక ఆకులు పట్టుకొన్నట్లు,వాళ్ళు మారిన ఇప్పుడు ఫలితం లేదు.

      Delete
    4. CPM to celebrate Sri Krishna Jayanthi in Kerala

      Kannur: In an apparent bid to prevent its cadres from migrating to the BJP, the CPM in Kerala has decided to celebrate Sri Krishna Jayanthi this time

      http://english.manoramaonline.com/news/kerala/cpm-to-celebrate-krishna-jayanthi-in-kerala-bjp-rss.html


      SriRam

      Delete
    5. This comment has been removed by the author.

      Delete
    6. అబ్బ!యెంత చల్లని వార్త చెప్పారు?!ఆంధ్రాలో కూడా చేసతె చూడాలి!రాగహ్వులూ నారాయణా ఉట్లు కొడుతుంటే మురంనా కయ్యి కయ్యిన విజిలేస్తూ చీరులీడరుగా హుషారు చేసే దృశ్యం కనుల పందువుగా ఉంటుంది గదా!

      Delete
    7. ఇప్పుడు నిజంగా నవ్వుకోండి

      Delete
  10. చదువుకొనే రోజుల్లో మిత్రులంతా ఎర్ర పార్టి ల అభిమానులు. అప్పట్లో నాకు ఎర్ర సిద్దాంతం పై కొంత అభిమానం ఉండేది. నా మిత్రుడికి బాల గోపాల్ అంటే చాలా గౌరవం. ఈ పోస్ట్ లో మీరు వ్యక్తపరచిన అభిప్రాయాలను పదేళ్ల క్రితమే నేను ఆ కంక్లుషన్ కి వచ్చాను.

    కేరళలో సిపియం వారు తెల్ల దుస్తులలో ఉన్న పెద్ద వివేకానందుడి పోటొను వాళ్ల ఫ్లెక్సి లలో ప్రచూరించుకొంట్టున్నారు.
    Tough Times: Reds Cite Vedas to Win Hearts
    http://www.newindianexpress.com/thesundaystandard/Tough-Times-Reds-Cite-Vedas-to-Win-Hearts/2014/01/26/article2020286.ece

    ReplyDelete
  11. హ్మ్.. మొత్తానికి నేను గిరీష లాంటి వాన్నని తేల్చారన్న మాట.. :-( :-P

    కమ్యూనిష్టుల చరిత్ర గురించి బోలెడంత రాయొచ్చు. అవన్నీ పక్కన పెడితే .. ప్రస్తుతం కమ్యూనిష్టులు కానివారు కూడా మోడీని ఎదుర్కోవడానికి కమ్యూనిష్టు ప్రిన్సిపుల్స్‌ని వెనకేసుకొస్తున్నారు .. మీరు గమనించారో లేదో !! ఎందుకంటే .. మోడీ అనే పెద్దాయన గుజరాతులో సాధించిన అభివృద్ది తీసిపారేయదగ్గది ఏమీ కాదు. ఏ సమస్యాలేని భూతల స్వర్గం అని చెప్పను కానీ, చాలా రాష్ట్రాలతో పోలిస్తే చక్కగా పరిపాలన, అభివృద్ది జరిగింది. పవర్ సెక్టారులో అయితే మరీనూ. మోడీ మాటల మనిషి కాదు చేతల మనిషి. అలాంటి వాన్ని ఎదుర్కోవడం ఎలా? అసలు అభివృద్ది చేయకుండా, అవినీతి పనులు చేస్తూ ఉండేవారినైతే విమర్శించొచ్చు. కానీ, కరక్టుగా పనిచేసే వాన్ని విమర్శించాలంటే.. వాడు పాటించే సిద్దాంతానికి కరక్టుగా అపోజిట్ గా ఉండే సిద్దాంతాన్ని నెత్తినెత్తుకుని, దాన్ని బేస్ చేసుకుని విమర్శించాలి. అంటే, ఒక హోటల్లో వంటలు నాసీ రకంగా ఉంతే .. పోటీదారుడైన మరో హోటలు వాడు.. మా హోటలులో వంటలు దానికన్నా బాగున్నాయి రండి అని ఆకర్శించవచ్చు. అలా కాకుండా .. వంటలు తమ హోటలులో కన్నా మహాద్బుతంగా ఉన్నాయనుకోండి .. అప్పుడు పూర్తిగా వంటలు - వాటి నాణ్యతా, రుచి లాంటివి పక్కన పడేసి .. మా హోటలు చాలా నీటుగా ఉంటుంది, మీ ఆరోగ్యమే మా సౌభాగ్యం అంటూ కొత్త యాంగిలులో ప్రచారం చేసుకోవాలి తప్పదు.

    మోడీ, మంచి లీడర్, పరిపాలనా దక్షుడు, క్యాపిటలిజాన్ని నమ్ముకుని, వ్యాపారాన్ని అభివృద్ది చేస్తూ, దేశాన్ని కూడా చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి. ఆయన్ను ఎదుర్కోవాలంటే .. క్యాపిటలిజానికి అపోజిట్ గా పనిచేసే కమ్యూనిష్టు ప్రిన్సిపిల్సే గతి. అందుకే ఇప్పుడు కొంత మంది కాలమిస్టులూ, రాజకీయ నాయకులు .. ఇది వరకెప్పుడూ మాట్లడుకోని.. "మాల్ న్యూట్రిషన్ గురించి, ధనికులు పేదల మధ్య వ్యత్యాసం గురించి" బోలెడన్ని ఆర్టికల్సు రాస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం కమ్యూనిజం గురించి వ్యాసాలు పత్రికలలో, ప్రతిపక్ష పార్టీల పత్రికల్లో, వాటిని సపోర్టు చేస్తూ కాలం గడిపే వెబ్ సైట్లలో కనిపిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఒకానొక వెబ్సైట్లో, ఒక ప్రముఖ కాలమిస్టు .. కమ్యూనిజం గురించి ఓ పెద్ద సిరీసే రాశారు. కమ్యూనిజం చాలా మంచిదని, ప్రపంచములోని అన్ని చాలా దేశాలలో ఇండైరెక్టుగా అదే అమలవుతోందనీ .. సుభాశ్ చంద్రబోస్ విషయములో కమ్యూనిష్టులను నిందించడం తప్పని .. ఇలా ఆరు, ఏడు ఎపిసోడ్లు రాశారు. ఇది వరకు కూడా కమ్యూనిస్టుల గురించి రాసినా .. ఇంత డిటైలుగా ఎప్పుడూ రాయలేదు. ఈ చమత్కారాలన్నీ మోడీ ప్రధాని అయిన తరువాతే జరిగాయి. దానికి కారణం పైన నేను చెప్పిందేనని నా ఫీలింగ్.

    అంతే కాదు, మోడీ జాగ్రత్తగా ఉండాలి. ఆయన చేసే ప్రతీ పొరపాటు, దేశాన్ని వామపక్ష రాజకీయాల వైపు నడిపిస్తుంది. ఎలా అయితే కాంగ్రెస్ తప్పులు దేశాన్ని రైట్ వింగ్ వైపు నడిపించాయో .. అలా. దేశములో క్యాపిటలిజం ప్రకారం నడిచే వారైనా, లేదా వమపక్ష భావజాలముతొ నడిచే వారైనా సరే .. చెప్పుకోదగ్గ కాలం అధికారములో ఉండి, చక్కన పాలన అందిస్తే అభివృద్ది జరుగుతుంది. అంతే కానీ, మధ్య రకంగా ఉంటూ.. అన్ని వర్గాలనూ ఓట్లకోసం సంతృప్తి పరచుకుంటూ, కరప్షనుతో వర్దిల్లేవారుంతే.. ప్రస్తుతం మన దేశములా తయారవుతుంది.

    ReplyDelete
    Replies
    1. మిత్రులు సరదాగా అభిప్రాయం మార్చుకోవదం గురించి యేమైనా దుర్మారపు అర్ధం తీసుకుంటారేమో అనుకున్నా?మొత్తానికి మీరు కూడా సరదాగానే తీసుకున్నారు,సంతోషం!

      Delete
    2. కమ్యునిజం గురించి యెంతయినా చెప్పొచ్చు గానీ మా మామయ్య స్టేట్మెంటు ఇది:ఇరవయిల్లో నేను కమ్యునిష్టు కాదని చెప్పుకున్నవాడూ నలభై తర్వాత నేను కమ్యునిష్టునని చెప్పుకున్నవాడూ పిచ్చివెధవ కింద లెఖ్ఖ?!

      Delete
    3. Actually you covered it well with these words .. "మిత్రులు శ్రీకాంత్" :-)

      Delete
    4. కమ్యూనిజం చాలా మంచిదని, ప్రపంచములోని అన్ని చాలా దేశాలలో ఇండైరెక్టుగా అదే అమలవుతోందనీ .. సుభాశ్ చంద్రబోస్ విషయములో కమ్యూనిష్టులను నిందించడం తప్పని .. ఇలా ఆరు, ఏడు ఎపిసోడ్లు రాశారు. ఇది వరకు కూడా కమ్యూనిస్టుల గురించి రాసినా .. ఇంత డిటైలుగా ఎప్పుడూ రాయలేదు.
      MBS Prasad ఈ మధ్య ఇటువంటి నాసిరకం వ్యాసాలను విరివిగా రాస్తున్నాడు.

      Delete
    5. @UG SriRam
      అవి వెబ్లో పబ్లిష్ అయి వుంటే ఆ వ్యాసాల లింకు ఇవ్వగలరా?

      Delete
  12. Replies
    1. Adam Smith,father of Modern capitalist Economy

      Delete
  13. వయసు ముదిరే కొద్దీ రంగనాయకమ్మకు చాదస్తం పిచ్చీ బాగా తలకెక్కాయి. మనం ఏవైతే జ్ఞాన మార్గాన్ని బోధిస్తున్న ఇతిహాసాలు అనుకుంటున్నామో వాటిమీద మన వాళ్ళే దండయాత్ర చేయడం గమనార్హం. వాటిలో మంచి ఆదర్శంగా తీసుకోవాలి తప్ప.. ఆనాటి సమజానికి అనుగుణం గా రాయబడ్డ వాటిని మనం ఈ నాడు విమర్శకు పూనుకోవడం ఎంత వరకూ కరెక్టు? ఈ నాడు ద్రౌపది లాగా ఎవరినైనా పణంగా పెట్టి ఎవరైనా జూదం ఆడారా? ఆ మధ్య ఓ మంచి సినిమా పై కూడా ఇలాగే దూషణ చేస్తూ రాసారు ఆవిడ. "ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబనియు ఆధ్యాత్మ వేదులు వేదంతమనియు నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని కవివృ ష భులు మహా కావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష సంగ్రహమని అయితి హసకులు ఇతిహసమనియు పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయంబు అని మహి కొనియాడుచుండ వివిధ వేద తత్వ వేది వేదవ్యసుడాది ముని పరశారత్మజుండు, విష్ణు సన్నిభుఒడు , విశ్వ జానీనమై పరగుచుఒచేసే భారతంబు"

    సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన టు వంటి వేదవ్యాసుడు రచన చేసినటు వంటి ఆ మహాభారతం ఉందే దాన్ని ధర్మమునందు నిష్ణాతులైన వారు ఇదే ధర్మ శాస్త్రం అని మహా భారతాన్ని పిలుస్తారు.

    ReplyDelete
  14. ముసుగు తీసిన కొండలరావు

    హరిబాబు గారు, ప్రజ బ్లాగులో కమ్యునిస్ట్ అభిమానులు వాదనను ఎదుర్కొనలేక, వాదించే వారిని హిందుమతోన్మాదులుగా రాస్తూ, వారికి ప్రజా స్వామ్య విలువల గురించి తెలియవని నిందలు వేస్తూంటారు. ప్రజాస్వామ్య విలువల గురించి, ప్రజాస్వామ్య వాతావరణం గురించి, చర్చించే విధానం గురించి ఊదరగొడుతూంటారు. మరి ప్రజాస్వామ్యం పైన పూర్తిగా నమ్మకం లేకపోతే తాత్కాలిక మజలిగా నమ్మే ఇటువంటి వారు, ఇతరులకు సిగ్గులేకుండా ప్రజాస్వామ్య విధానాల గురించి బోధలు ఎలా చేస్తారు?


    http://praja.palleprapancham.in/2015/08/it.html?showComment=1438811653986#c1606487840445544425

    నీహారిక గారు, కమ్యూనిస్టులుకు ఓటింగ్ పై గుడ్డి నమ్మకం ఉండదు. ఓటింగ్ ని బూటకపు ప్రజాస్వామ్యంగా వారు చూస్తారు. వారిలో కొందరు అసలు ఓటింగ్ ని బహిష్కరిస్తున్నారు. కొందరేమో ప్రజలు విశ్వసిస్తున్నారు కనుక, పార్లమెంటు ద్వారా , చట్టాల ద్వారా కూడా అపుడపుడయినా , కొన్ని సందర్భాలలో అయినా ప్రజలకు కొన్ని మేళ్లు జరుగుతున్నాయి కనుక ముఖ్యంగా ప్రజలు ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తున్నందున దానిని కూడా వర్గ పోరాట సాధనంగా ఉపయోగించుకుని ఎన్నికలలో పాల్గొంటున్నారు. ఎన్నికలలో పాల్గొంటేనే తప్పని మూర్ఖంగా వాదించడం అంటే ప్రజలకు దూరంగా జరగడమే.

    ఎన్నికల ద్వారానే ప్రజల చైతన్యం పెంచగలం అనుకుంటే భ్రమ మాత్రమే. ఇవి రెండూ సమాజానికి మేలు చేయవు.

    ReplyDelete
    Replies
    1. కొత్తగా ఆయన తీసిన ముసుగు కాదు.కమ్యునిజం అంటే తనకి ఉన్న అభిమానం గురించి యెప్పట్నించో చెప్తూనే ఉన్నాడుగా!

      అదంతే,కమ్యునిజంలో వ్యక్తిస్వేచ్చ అనేది ఉండదు.అది ప్రవీణ్ బల్లగుద్ది మరీ చెప్తున్నా ఇంకా శ్రీకాంత్ చారి ప్రజాస్వామ్యబధ్ధంగా కమ్యునిష్టు ప్రభుత్వాన్ని యేర్పరచటం గురించి అడుగుతుంటే నాకు నవ్వాగడం లేదు:-)

      పైగా ప్రవీణ్ మహాశయుణ్ణి జవాబుల కోసం దబాయిస్తున్నాడు,అక్కడి నుంచి జవాబులు రాబట్టగలిగితే వాళ్ళు నక్కని తొక్కి వచ్చినట్టే!

      కమ్యునిష్తులూ క్రిస్టియన్లూ తమ మత ప్రచారంలో ఒనిడా అడ్వర్తైజుమెంటులో కనిపించే నెగటివ్ టెక్నిక్ వాడుతుంటారు.

      మీకు ఆ కాన్సెప్టు యెంత పవర్ఫుల్లో తెలియాలంటే ఒకసారి ఆ ఒనిడా యాడ్స్ గుర్తుకు తెచ్చుకోండి.ఒక చక్కని టీవీ మీ కళ్ళ ముందు కనబడుతుంది.ఇంతలో ఒక రాయి తగిలి భళ్ళున టీఎవీ బద్దలవుతుంది!వెంఠనే "Neighbers envy,Owners pride" అన్న క్యాప్షన్ మరియూ సైతాను మొహంతో ఒక వ్యక్తి తెరమీద కనపట్టం జరుగుతుంది,యెందుకు?

      ఇండైరెక్టుగా ఈ టీవీ మీరు కొంటే మీ పక్కింటివాళ్ళు కుళ్ళి చస్తారు అని రెచ్చగొట్టటం,అవునా?

      డాన్ బ్రౌన్ తన నవలల్లో క్రిస్టియానిటీ దుర్మార్గాలని యేకరువు పెడుతున్న మొదటిరోజుల్లో నేనూ అమాయకంగా వాడిదంతా క్రిస్టియానిటీని చెరిగిపారెయ్యటానికే చేస్తున్నాడనుకున్నా!తర్వాత తను రాసే నవలకి వాటికన్ అంతా తిప్పి చూపించి రహస్యమీన విషయాల్ని కూడా వాటికన్ అధికార్లు అతనికి చెప్పారు అంటున్నప్పుడు నాకు రూఢిగా తెలిసింది,అదొక గొప్ప పచార వ్యూఒహమని?!

      యెలాగోలా నెగటివ్ ప్రచారంతో నైనా సరే క్రీస్తు,బైబిల్,క్రైస్తవం అనే మాటల్ని ముందు జనంలో యెక్కించాలి!తర్వాత అలా యెక్కించుకున్న వాళ్లలో యెవరికన్నా బాధలు గనక ఉంటే అప్పుడు రంగప్రవేశం చేసి "మా దేవుణ్ణీ ప్రార్ధించు,నీ బాధలు పోతాయి" అని గానీ కంచె ఐలయ్య దప్పు కొట్టినట్టు పుళ్ళు కడిగి గుడ్విల్ తెచ్చుకోవటం ద్వారా కోటలో పాగా వెయ్యాలి!

      ఇప్పుడర్ధమయిందా డాన్ బ్రౌన్ క్రైస్తవ మతవ్యాప్తి కోసమే క్రైస్తవాన్ని విమర్శిస్తున్నట్టు మనకి కలరు పులుముతూ నవల్లు రాస్తున్నాడని!

      కమ్యునిష్టులు కూడా అంతే,ప్రవీణ్ లాంటివాళ్ళ ద్వారా అయినా సరె ఆ పేరు జనంలోకి యెక్కించాలి,తర్వాత యెవడికన్నా అన్యాయం జరిగందని యేడుస్తుంటే "పెట్టుబడి దారీ సమాజంలో వుందే క్రూరత్వమే నీకు జరిగిన అన్యాయానికి కారణం" అని పులుముడు వాదనలతో అవతలివాణ్ణి పార్టీలోకి లాక్కోవటం కోసం పడే పాట్లు ఇవన్నీ!

      ఆ చర్చల్లో పర్జాస్వామ్యం ఉండనిది కూడా అందుకే,యెప్పుడయినా ఒక మాట వెయ్యడం తప్పించి నేను వాటిల్లో వేలు పెట్తదం లేదు.

      Delete
    2. ఎమిలేదండి. కమ్యునిజం పాలన రావటానికి, కమ్మిలు ప్రజాస్వామ్యం మద్దతిచ్చినా అది తాత్కాలిక మైనదని కొండలరావుకి స్పష్టంగా తెలుసు. కమ్యునిస్ట్ లకు ప్రజాస్వామ్య వ్యవస్థ పై నమ్మకంలేదు. కాని ఈ పెద్ద మనిషి రమణ బ్లాగు మూసినప్పుడు, దొంగనాయకమ్మ బ్లాగులో వ్యాఖ్యల్యు రాసిన వారి గురించి చెడుగా మాట్లాడాడు. ఈయన ప్రజాస్వామిక విలువలు, స్వేచ్చ గురించి సుదీర్ఘ స్పీచ్ (వ్యాఖ్యలు రాశాడు)ఇచ్చాడు. ఈయన నడిపే కాపీ పేస్ట్ బ్లాగు కన్నా, అక్కడ రాసిన వ్యాఖ్యలు ఎంతో అర్థవంతంగా ఉన్నాయి.

      Delete
  15. http://rajasulochanam.blogspot.in/2015/09/blog-post_26.html

    ReplyDelete
  16. మొట్టమొదట కమ్యూనిజం అమేరికా లాంటి పారిశ్రామికంగా వ్యాపారపరంగా యెదిగి తను దోపిడీ అని నిర్వచించిన వ్యవహారం దిట్టంగా నడుస్తున్న చోట వచ్చే అవకాశం వందన్నాడు.రష్యా లాంటి పారిశ్రామికంగా వెనకబడీనవి అంటే దోపిడీ అనేది ప్రజలకి అనుభవంలోకి రాని దేశాల్లో వచ్చే అవకాశం లేదన్నాడు.తను రాదు అని చెప్పిన చోట రానూ వచ్చింది కరిమింగిన వెలగపండు మాదిరి పోనూ పోయింది!తను వస్తుంది అని చెప్పిన చోట ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు కూడా కనపడటం లేదు?

    The old feudal system changed into a new one led by the party lords.
    _____________________________________
    According to his theory, proletarian revolution was imminent in Britain and Germany where capitalism was highly advanced. But, revolution took place in Tsarist Russia, which was industrially the least advanced. The October Revolution of 1917 was not a mass revolution; it was a coup in which a group of disgruntled soldiers and a small group of revolutionaries usurped power from Tsar.
    It had no continuity or any historical evolutionary nature of Marxian concept of history. It brought in state ownership of property under the aegis of Communist Party in the place of the degenerate private ownership of property in the Tsarist Russia. Finally, the whole property in Russia went into the hands of the communists. Under the communists in Russia, nationalization of property did not take place. The property not only didn’t get nationalized in effect but it became centralized as well. Property became alien to the society. The whole production means in the nation were nationalized and centralized. That became the basis for the centralization of power. The centralization of power in Russia led to fascism. A large of number of people had no say in the government. The old feudal system changed into a new one led by the party lords.



    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...