Monday 21 September 2020

అమరావతి రైతులు రెండు వందల యాభై రోజుల నుంచి అల్లాడుతుంటే పట్టించుకోని స్థానిక భాజపా నేతలు చెక్క రధాల కోసమూ వెండి సింహాల కోసమూ అల్లాడుతున్నారు - వీళ్ళ హిందూత్వం తగలెయ్య!

సాహిత్యం గురించి మాట్లాడటం చాలా తేలికైన వ్యవహారం.ఏది వాగినప్పటికీ చెల్లిపోతుంది.పద్యకవిత్వం అయితే ఛందస్సును బట్టి విశ్లేషించడమూ వచన కవిత్వం అయితే అలంకారం పట్టుకుని ఏదో ఒకటి వాగెయ్యడమూ సరిపోతుంది - చదివేవాళ్ళకి బోరు కొట్టకుండా చూసుకుంటే చాలు.కానీ, political analysis అనేది చాలా కష్టమైన వ్యవహారం.political analysis అనగానే మనకి ఒక పార్టీని విమర్శించడం,ఒక పార్టీని సమర్ధించడం అనే అనిపిస్తుంది.అయితే అసలు political science అనే సబ్జెక్ట్ ఒకటి ఉందని కూడా తెలియని వాళ్ళకి ఉన్న అపోహ అది."ప్రభుత్వం అంటే ఏమిటి?ఒకప్పటి రాజుల కాలంలో ఎలా వుండేది?ఇప్పటి పార్టీల గోల ఉనికిలోకి ఎట్లా వచ్చింది?వాటికీ వీటికీ పోలికలు ఉన్నాయా?" అనే ప్రశ్నలకి జవాబు చెప్పడానికి ఎన్నో పరిశోధనలు జరిగాయి.వాటి ఫలితమే political science అనేది.

మహాభారతంలోని శాంతిపర్వం కొంత రకమైన సమాచారాన్ని ఇస్తుంది - నైరాజ్యం, ద్వైరాజ్యం, వైరాజ్యం లాంటి చాలా రకాల వ్యవస్థలను పేర్లూ తీర్లతో వివరించి చెప్తుంది. politics,economics అనేవి ఇవ్వాళ వేరువేరు సబ్జక్టులు అయ్యాయి గానీ ఒకప్పుడు ఇవి కలిసే ఉండేవి.ఇప్పుడు కూడా ధియరీ వేరు కానీ రియాలిటీలో రెండూ కలిసి నడిచే తత్వంతో ఉన్నాయి.చాణక్యుడు తన గ్రంధానికి అర్ధశాస్త్రం అని పేరు పెట్టినప్పటికీ అక్కడ చర్చించినది రాజనీతినే!

రాజనీతి అంటే ఏమిటో తెలియని వ్యాపారులూ వ్యాపారం అంటే ఏమిటో తెలియని తెలియని ప్రభువూ ఆయా దేశాలకీ రాజ్యాలకీ అత్యంత ప్రమాదకారులు అవుతారు.ఒక రాజ్యం గానీ ఒక దేశం గానీ ఒక ప్రాంతం గానీ స్వయం సమృద్ధం కావాలంటే అక్కడి ప్రజలకు వ్యాపారదృష్టి ఉండాలి, వ్యాపారులకి రాజనీతి తెలియాలి,ప్రభుత్వాధినేతలకి ఆర్ధికశాస్త్ర పాండిత్యం కావాలి.ఎందుకంటే, సంపద పుట్టేది వ్యాపారం వల్లనే!వ్యవసాయం గురించీ రైతుల గురించీ కవిత్వాలు చెప్పడం వినడానికి బాగుంటుంది కానీ ఒకచోట పండిన పంట అన్నిచోట్లకీ వెళ్ళి అందరికీ అందాలంటే పండించిన రైతులు అమ్మాలి కదా - అన్ని రంగాల వారూ లాభదృష్టితో తమకు కావల్సిన పెట్టుబడులలో రాయితీల్ని గానీ మౌలిక సదుపాయాల్ని గానీ పోట్లాడి తీసుకుంటున్నప్పుడు రైతులకి లాభదృష్టి లేకనే గదా తమకు కావలసిన సౌకర్యాల్ని సమకూర్చుకోలేకపోతున్నదీ అప్పుల పాలవుతున్నదీ!ఎందుకిలా జరుగుతున్నది?

రైతులే కాదు విడి వ్యక్తులు ఎవరూ మార్కెట్లని సృష్టించలేరు.కొత్త మార్కెట్లని సృష్టించడమూ పాత మార్కెట్లని అభివృద్ధి చెయ్యడమూ ప్రభుత్వం యొక్క మొదటి బాధ్యత.ప్రభుత్వం యొక్క మొదటి ఆఖరి విద్యుక్తధర్మం ప్రజలకు ఆర్ధిక భద్రతను ఇవ్వడం.అందువల్లనే "రాజనీతి అంటే ఏమిటో తెలియని తెలియని వ్యాపారులూ వ్యాపారం అంటే ఏమిటో తెలియని తెలియని ప్రభువూ ఆయా దేశాలకీ రాజ్యాలకీ అత్యంత ప్రమాదకారులు అవుతారు." అని అన్నాను నేను.ఇప్పటి వరకు నేను చెప్పినది పాలనా వ్యవస్థ రాజస్వామ్యమా ప్రజాస్వామ్యమా అని చూడక విహంగ వీక్షణ చేశాను.ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న మన దేశంలోని వ్యవస్థలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడానికి కారణం "రాజనీతి అంటే ఏమిటో తెలియని వ్యాపారులూ వ్యాపారం అంటే ఏమిటో తెలియని ప్రభువూ ప్రభుత్వం యొక్క అవసరం ఏమిటో తెలియని ప్రజలూ ఆయా దేశాలకీ రాజ్యాలకీ అత్యంత ప్రమాదకారులు అవుతారు." అనేది తెలియాల్సిన వారికి తెలియకపోవటమే!

ప్రస్తుతం జగన్మోహన రెడ్డి గారు నవరత్నాలను ప్రకటించడమూ వాటిని అమలు చెయ్యాలని చూడటమూ కొందరికి నచ్చడం లేదు.తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ప్రజల్ని దురాశాపరుల కింద మార్చి చెడగొట్టేస్తున్నట్టు జగన్మోహన రెడ్డి గారిని విమర్శిస్తున్నారు.మరి, వారు కూడా ఋణమాఫీ, చంద్రన్న క్రిస్మస్ కానుక లాంటి ఉచిత పధకాలను ప్రవేశ పెట్టారు కదా!ఇక్కడ తెలుసుకోవలసినది యేమిటంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఉచితంగా ఇవ్వాల్సిన వాట్ని కూడా కొనుక్కునేలా చెయ్యడం వల్లనే తగ్గిన తమ ఆదాయంలోని లోటును భర్తీ చేసుకోవడానికి ప్రజలు ఉచితాలను ఉపయోగించుకుంటున్నారు.కాకపోతే ప్రస్తుతం జగన్మోహాన్ రెడ్డి గారు నవరత్నాల పేరున 10,000 ఉచితం పేరున ఇచ్చి మోటర్లకి మీటర్లు పెట్టడం లాంటివాటితో 80,000 ముక్కు పిండి లాక్కుంటున్నారు గాబట్టి సమస్య అయింది గానీ ప్రజలకు కొన్నింటిని ఉచితాల కింద కోరుకునే హక్కు వుంది.అసలు ప్రజలు పన్నులు కడుతున్నదీ కట్టాల్సిందీ విద్య,ఆరోగ్యం,న్యాయం అనేవాటిని ఉచితాల కింద పొందడానికే - మళ్ళీ వాటికోసం డబ్బు ఖర్చు పెట్టడం తెలివి తక్కువ తనం!విద్య అనేది రికామీగా ఇంట్లో గడపటానికి బదులు స్కూళ్ళలోనూ కాలేజిల్లోనూ గడిపే కాలక్షేపం కోసం కాదు,అందరూ చదువుతున్నారు గాబట్టి మనమూ చదవాలనే వేలంవెర్రి కూడా కాదు - వ్యవసాయానికి గానీ ఉద్యోగానికి గానీ వ్యాపారానికి గానీ అనుబంధమై వాటి మార్కెట్లని పెంచే చదువులకి రూపకల్పన చేసి చదువు పూర్తి కాగానే చక్కని ఉపాధిని చూపించి దేశ సంపదని పెంచడం కోసం ప్రభుత్వం చొరవ తీసుకుని వినియోగించాల్సిన ఆర్ధిక వనరు అని ఎంతమందికి తెలుసు?

ప్రభుత్వం ఎందుకు ఉండాలో పన్నులు ఎందుకు కట్టాలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకోవాలో ఇప్పటికీ విద్యావంతులకు కూడా,మరీ ముఖ్యం పొలిటికల్ సైన్సులోనూ ఎకనమిక్ సైన్సులోనూ అపారమైన పాండిత్యం ఉన్నవారికి కూడా తెలియని స్థితి ఉంది దేశంలో - ఇలాంటి చోట వ్యవస్థలు నిర్వీర్యం అయినందుకు కాదు, కాకపోతేనే ఆశ్చర్యపడాలి.తమ ప్రభుత్వమే GST అనే ఇతరులకి కాదు, తమకు కూడా అర్ధం కాని ఒక దిక్కుమాలిన పన్నుల విధానం అమలు చేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకుని మామూలు ప్రజల్నే కాదు, ఆర్ధిక వేత్తలకీ రాష్ట్రాధినేతలకీ తలనొప్పులు సృష్టించితే తప్పనిసరి తద్దినానికి పప్పన్నపు పేరంటం అన్నట్టు లోటును పూడుస్తామని వాగ్దానం చేసి తాత్సారం చేస్తున్నది చాలక నిలదీసిన వాళ్ళకి ఆర్ధిక రంగంలోని వారు ఇప్పటి వరకు వినని "దేవుడు చేసిన నష్టం" అనే కొత్త కారణం చూపించిన మేధావి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు.ఈవిడ కూడా ఆర్ధిక శాస్త్రంలో డిగ్రీ ఉన్న మహిళా రత్నమే.అయినప్పటికీ కార్ల కంపెనీలు దివాళా తీస్తున్నాయంటే "మొక్కై వంగనిది మానై వంగునా?విరుగుట పెరుగుట కొరకే!" అని వేదాంతం చెప్పింది - ఖర్మ! దేవుడు గబ్బిలాలకి కళ్ళు లేని ఒక ప్రతికూలత ఇచ్చి వినికిడి వల్ల జ్ఞానాన్ని పొందడం అనే ఒక అనుకూలతని అమర్చి పెట్టినట్టు భాజపా వర్గాలకి ఎకానమీని చంకనాకించే ప్రతికూలతనీ కుంటిసాకులు చెప్పి జనాన్ని మెప్పించగల అనుకూలతనీ ఇచ్చాడు - ఇట్లా న్యాయం చెయ్యాల్సిన దేవుడే భారతీయులకి అన్యాయం చేస్తుంటే భారతీయులు తమ కష్టాల్ని ఎవరికి చెప్పుకోవాలి?చాయ్ కాచడం తెలిసినవాడు చాయ్ అమ్ముకుంటూ కోట్లకి పడగెత్తి మేడలు మెద్దెలు కట్టుకుంటే ఎవరు వద్దన్నారు?చాయ్ కాచడం తప్ప ఆర్ధికం గురించి అంటే ఢం  తెలీనివాడు ప్రధాని పదవిని కోరుకోవడం ఏమిటి - మన ప్రారబ్ధం కాకపోతేనూ!

చప్పట్లకీ కొవ్వొత్తులకీ కరోనా పోతుందా అనే అనుమానం కూడా లేక చప్పట్లు కొట్టమంటే కొట్టి కొవ్వొత్తులూ వెలిగించమంటే వెలిగించిన ప్రజల్ని కరోనా నుంచి విముక్తుల్ని చెయ్యలేకపోయినప్పటికీ అతన్ని సూపర్ మేనుకి ఎక్కువా అవతార పురుషులకి తక్కువా అన్నట్టు ఆరాధిస్తున్న వాళ్ళకి  అతని ఆర్ధిక రంగ వైఫల్యం గురించి ఎన్ని నిజాలు చెబితే రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలోనే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత అలనాటి బెంగాల్ కరువు కన్న భయంకరమైన ప్రమాదం అంచున ఉన్నామని అర్ధం చేసుకోగలుగుతారు?లాక్ డౌన్ అనంతరం ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండబోతోందని పలు అంతర్జాతీయ సంస్థలు జోస్యం చెబుతున్నాయి.కోట్ల మంది ప్రజల జీవితాలు ఛిద్రమవుతున్నాయి.కొత్త పెట్టుబడులు రావటంలేదు.కరోనా వల్ల చైనా నుంచి మన దేశానికి పరిశ్రమలు తరలివచ్చే అవకాశాన్ని చేజార్చుకున్నాం. ప్రజలు గ్రామీణ ప్రాంతాలాకు తరలి వెళ్లటం అవకాశంగా మార్చుకుని కనీసం గ్రామాభివృద్దిపై దృష్టి సారించే ప్రయత్నం చేయలేదు.చైనా మీద రాండోళ్ళు మోగించటం అంబానీకి మేలు చెయ్యడానికేనని ఇప్పుడు కళ్ళముందు కనపడుతున్నది, అప్పుడు ఎందుకు తోచలేదు?కనీసం మన దేశానికీ చైనాకూ ఉన్న మొత్తం వ్యాపార లావాదేవీల్లో ఒక యాభై మొబైల్ అప్లికేషన్లు ఉంటే ఎంత నష్టం పోతే ఎంత లాభం అనే లెక్కలు కూడా వేసుకోకుండా రెచ్చిపోయారే!వాటికి విదేశీ చైనా లేబుల్ తీసి స్వదేశీ అంబానీ లేబుల్ తగిలించడం వల్ల మన దేశానికి లాభనష్టాల్లో తేడా ఏమిటి?ఎకనమిక్ ట్రాన్సాక్షన్ ఒక దేశపు ప్రభుత్వానికీ స్వదేశీ వ్యాపారికీ మధ్య జరిగితే వ్యాపారికి వచ్చే ఆదాయం కన్న దానిమీద ప్రభుత్వానికి వసూలయ్యే పన్నుల కన్న ఒక దేశపు ప్రభుత్వానికీ విదేశీ వ్యాపారులకీ మధ్య జరిగితే వచ్చే విదేశీ మారక ద్రవ్యం విలువ ఎక్కువ - అది దేశపు కరెన్సీకి విలువని పెంచుతుంది.ఒక దేశానికి గానీ రాజ్యానికి గానీ లోకల్ మార్కెట్ అనే పునాది బలంగా ఉండాల్సిందే గానీ ఆఫ్ షోర్ మార్కెట్ పదింతలు లాభాల్ని తెచ్చిపెడుతుంది అనే ఇంగిత జ్ఞానం కూడా లేనివాళ్ళు చెత్తపన్లకి మోదీనామిక్స్ అని పేరు పెట్టి ఆర్ధికశాస్త్రం పరువు తీస్తున్నారు.

మోదీనమ్మిక్సు యొక్క వైఫల్యం అనుకోనిది కాదనీ వెనక నుంచి ఆడిస్తున్న వారి ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం వల్ల కనబడుతున్న అంతిమ ఫలితం అని ఎంతమందికి తెలుసు?గ్రోత్ రేట్ పడిపోయిందేమిటని అడిగితే మోదీ హిమాలయాల్లో తపస్సు చేస్తున్న దృశ్యాల్ని చూపించి అదరగొడతారు.నిరుద్యోగిత జడలు వుప్పి నాట్యం చేస్తున్నది పరిష్కరించమని అడిగితే మోదీ నెమళ్ళకి మేత పెడుతున్న దృశ్యాల్ని చూపించి బెదరగొడతారు.Demonetisation ఎంత దారుణమైన ఫలితాన్ని తెచ్చిందో చూస్తూనే ఉన్నారు,అయినప్పటికీ చలించలేదు.GST ఎంత దారుణమైన ఫలితాన్ని తెచ్చిందో చూస్తూనే ఉన్నారు,అయినప్పటికీ చలించడం లేదు.ఆధార్ కార్డును స్కూల్ అడ్మిషన్లకీ రైల్వే టిక్కెట్లకే కాదు వరసపెట్టి అన్నిటికీ mandatory చెయ్యడం దేనికో అర్ధం కావడం లేదు నాకు, వీళ్ళకి ఎంత అర్ధం అయింది?కొందరు అందులోని ప్రమాదం ఏమిటో తెలిసి right to privacy కింద కేసులు వేస్తే  కోర్టులకి కూడా టెంకిజ్లెల్ల కొట్టగలమని అనుకున్నారో ఏమో, ఆ సౌకర్యం లేనిది టెర్రరిజాన్ని నిరోధించడం కష్టమనీ right to privacy అనేది elitist concern మాత్రమే అనీ వక్రభాష్యాలు చెప్పిన వాళ్ళు దేశభక్తులా!వాళ్ళని ప్రజాస్వామ్య పరిరక్షకులని చెప్తున్నవాళ్ళు మేధావులా!

మోదీ భజనపరులు మోదీ ఇక్కడ బూర వూదగానే అక్కద చైనా ప్యాంటు తడుపుకుంటున్నదని తప్పెట్లూ తాళాలూ మోగిస్తూ ఉండగానే నేపాలూ శ్రీలంకా చైనా వైపుకి జరిగేసి వీళ్ళలాగే మోదీ భజనలో మునిగిపోయి పని మానేసి కూర్చున్న మన విదేశాంగ శాఖని వెక్కిరిస్తున్నాయి.పదేళ్ళ క్రితం కాంగ్రెసు చేతగాని తనం వల్ల స్విస్సు బ్యాంకుల్లో పోగుపడిన సొమ్ముని అణాపైసలతో సహా వెనక్కి తీసుకొస్తానని గర్జించిన వీరాధివీరుడి హయాములోనే మోదీ మోదీ టాటా టాటా మాల్యా మాల్యా అని లేదు ఎవడికి దొరికింది వాడు కొల్లగొట్టెయ్యటం, దేశాలు దాటిపోవటం చూస్తున్నప్పటికీ వీళ్ళకి చమ్మగానే ఉంది.ఆయిల్ తయారు చేస్తున్న దేశాలే ధరలు తగ్గించి ప్రపంచం మొత్తం పెట్రోల్ రేట్లు తగ్గిస్తుంటే ఇక్కడ మాత్రం ఎందుకు పెంచుతున్నాడు?అడగాల్సిన వీళ్ళు అడగరు, అడిగేవాళ్ళని దేశద్రోహులు అంటారు - నోటికి తింటున్నది అన్నమా, గడ్డియా, మరొకటా!

అత్యంత దయనీయకరమైన విషయం ఏమిటంటే 2013 ఎన్నికల ప్రచారంలో తను సాధిస్తానని చెప్పుకున్న ఆర్ధికరంగ విజయాల్ని సాధించలేకపోయానని తెలిసి మొన్నటి అయిదు రాష్ట్రాల ఎన్నికల నాడు వాటిని దాటవేశాడు - సమయానికి తగినట్టు జరిగిన సైనికుల బలిదానం పరువు దక్కించింది!మోదీ పని గట్టుకుని చేస్తున్న చెత్తపన్లతో ఆర్ధిక రంగ ప్రగతి అట్టడుగుకి చేరింది తెలియక దేశభక్తీ జాతీయతా కూడు పెడతాయనుకుంటున్నారు!వచ్చీ రావటమే స్వఛ్చ భారత్ అన్నాడు, ఏమైంది?తొక్కయింది, తోలైంది!తర్వాత made in india అనాల్సింది పోయి make in india అన్నాడు, ఏమైంది?తొక్కయింది, తోలైంది!మొన్నటికి మొన్న చప్పట్లు కొట్టమన్నాడు, నిన్నటికి నిన్న కొవ్వొత్తులు వెలిగించమన్నాడు - ఏమైంది?తొక్కయింది, తోలైంది! ఇప్పుడు ఆత్మ నిర్భర భారత్ అన్నాడు,ఏమైంది?తొక్క...వద్దులెండి - మరీ క్రూరంగా ఉంటుంది, పాపం!

ఇవ్వన్నీ మోదీగారు వూహించ లేదు,విధి రాత బాగుండక తానొకటి తలిస్తే దైవం ఒకటి తల్చినట్టు జరుగుతున్నాయే తప్ప మోదీ గారి తప్పు లేదు అని ఎవరు అనగలరు?2013 ఎన్నికల ప్రచారంలో తను సాధిస్తానని చెప్పుకున్న ఆర్ధికరంగ విజయాల్ని మొన్నటి అయిదు రాష్ట్రాల ఎన్నికల నాడు వాటిని దాటవేశాడు, అంటే సాధించలేకపోయానని తెలిసి కాదా!

ఆంధ్రాలో అమరావతిని ధ్వంసం చెయ్యటం ధొలేరాకు పోటీ వస్తుందని కాదూ!ఇది కూడా కొందరు "ఇవ్వన్నీ మోదీగారు వూహించ లేదు,విధి రాత బాగుండక తానొకటి తలిస్తే దైవం ఒకటి తల్చినట్టు జరుగుతున్నాయే తప్ప మోదీ గారి తప్పు లేదు" అని అనగలిగిన విషయమే!అయితే, SHIVAM SHANKAR SINGH అనే ఒక డాటా అనలిస్ట్ 2013 నాడు అప్పటి ఆర్భాటం చూసి మత్తెక్కిపోయి పార్టీలో చేరి, అయిదేళ్ళ తర్వాత నిరాశపడి "It takes decades and centuries to build systems and nations, the biggest failure I see in the BJP is that it has destroyed some great things on very flimsy grounds." అంటూ పార్టీని వదిలి వచ్చేశాడు.ఎటువంటి శషభిషలూ లేని SHIVAM SHANKAR SINGH మహాశయుడు "The real negative of this government is how it has affected the national discourse with a well considered strategy. This isn’t a failure, it’s the plan." అనేస్తున్నాడు.డాటా ఎనలిస్ట్ గనక మోసం ఎక్కడెక్కడ ఎలాంటి పద్ధతుల్లో జరిగిందో పూస గుచ్చినట్టు చెప్పాడు.Electoral bonds అనేది అన్నిటికన్న పెద్ద మాయాజాలం - The bonds are anonymous so if a corporate says ‘I’ll give you an electoral bond of Rs 1,000 crore if you pass this specific policy, there will be no prosecution’, there just is no way to establish quid pro quo with an anonymous instrument.ఈశాన్య రాష్ట్రాలను క్రైస్తవంనుంచి హిందూత్వంలోకి లాక్కురావటం హిందూదేవుళ్ళ మహత్యమూ కాదు,భక్తజనుల వీరత్వమూ కాదు - Electoral bonds వల్ల భాజపా పార్టీ బొక్కసంలో కుప్పలు తెప్పలై వచ్చిపడిన కరెన్సీ కట్టల మహత్వం.కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి ఇప్పుడు ఎందుకు జరగడం లేదు?జరుగుతూనే ఉన్నది!కాకపోతే అవినీతికి అర్ధం మార్చేసి అవినీతిని చట్టబద్ధం చేశారు. ధైర్యంతోనే ఆంధ్రాకి ప్రత్యేక హోదా నిరాకరించేశాడు.ప్లానింగ్ కమిషన్ తీసేసి రాష్ట్రాల స్వయంసిద్ధతనూ పాలనాస్వేఛ్చనూ చంపేస్తున్ననీతి ఆయోగ్ పెట్టటం మరొక దుర్మార్గం - దుర్మారపు సంస్థ సాయంతోనే ఆంధ్రాకి ప్రత్యేకహోదాని నిరాకరించగలిగాడు.

ఆంధ్రాలో అమరావతిని ధ్వంసం చెయ్యటం ధొలేరాకు పోటీ వస్తుందని కాదా!తెలుగుదేశం వాళ్ళు బయటపెట్టినప్పుడు నేనూ నమ్మలేదు.ఓడిపోయిన కసిలో ఏదో ఏడుస్తున్నారని అనిపించి అసలు ధొలేరా గురించి తెలుసుకోవాలని కూడా అనుకోలేదు.ఇప్పుడే, ఎలాగూ తెదెపా వాళ్ళ ఏడుపుని ప్రస్తావిస్తున్నాను కదా, తెలుసుకుని రాస్తే బాగుంటుంది కదా అనిపించింది.

Dholera అనేది Special Investment Region పేరుపెట్టి నిర్మిస్తున్న మొదటి ప్రణాళికాబద్ధమైన స్మార్ట్ సిటీ.అప్పుడెప్పుడో వెంకయ్య నాయుడు బతికి ఉన్నప్పుడు రాష్ట్రంలో తెగ తిరుగుతూ విశాఖనీ తెనాలినీ నెల్లూరునీ అని ఒక సిటీ కాదు ఎక్కడ కాలు పెడితే అక్కడ సిటీని స్మార్ట్ సిటీ కింద మార్చేస్తాం అంటూ ఉండేవాడు,గుర్తుందా? పేరుతో ఎందుకూ పనికిరాని సొల్లుని జనం మెదళ్ళలోకి వదల్టం తప్ప "అసలు స్మార్ట్ సిటీ అంతే ఏంటి?వీటిని స్మార్ట్ సిటీ కింద మార్చకపోతే వాటికీ దేశానికీ జరుగ్తున్న నష్తం ఏంటి?వీటిని స్మార్ట్ సిటీ కింద మార్చినట్లయితే వాటికీ దేశానికీ వచ్చే లాభం ఏంటి?" అనే ప్రాక్టికల్ అనాలిసిస్ మాత్రం ఇవ్వలేదు.ఇంతకీ పెంకయ్య నాయుడు చెప్పిన దేశంలోని అన్ని సిటీలనూ స్మార్ట్ సిటీల కింద మార్చే దమ్ము మోదీకి ఉందా అంటే లేదనే చెప్పాలి.ఎందుకంటే, దేశంలోని అన్ని సిటీల్ని కాదు 2009లో ప్లాన్ కాన్సెప్ట్ వేసుకున్న ధొలేరా ఒక్కదాన్ని స్మార్ట్ సిటీ కింద మార్చటం అనే చిన్న పనిని ఇప్పటికీ ఫాస్ట్ ట్రాక్ మీదకి ఎక్కించలేక కిందా మీదా పడుతూ లేస్తూ ఆపెయ్యనూ లేక డేకించనూ లేక నానా గడ్డీ కరుస్తున్నాడు వీళ్ళు అసహాయ శూరుడూ అవతార పురుషుడూ అని మోతెక్కిస్తున్న మోదీ!

DSIR వైశాల్యం 920 sq km ఉంటుంది. Dhandhuka తాలూకాకి చెందిన 19 గ్రామాలూ Barwala  తాలూకాకి చెందిన 03 గ్రామాలూ Ahmedabad జిల్లాలోని 22 గ్రామాలూ దీని పరిధిలోకి వస్తాయి.Ahmedabad, Vadodara, Surat, Rajkot, Bhavnagar వంటి ప్రముఖమైన పారిశ్రామిక కేంద్రాలకు మధ్యన ఉంది.Gujarat State Highways దీనిని అన్ని పోర్టులకీ అనుసంధానించింది.ప్రస్తుతం Ahmedabad International Airport చాలా దగ్గిరలోనే ఉంది.అయినప్పటికీ స్మార్ట్ సిటీ ప్లానులో భాగంగా కొత్త International Airport కడతారు.Census 2001 ప్రకారం దీని పరిధిలోకి వచ్చే ప్రాంతంలోని ప్రస్తుత లబ్ధిదారులు కేవలం 37,000 మంది మాత్రమే!ఇక్కడ అమరావతి గురించి పచ్చని పంట పొలాల్ని రాజధాని కోసం బలి తీసుకుని రైతుల్నీ వ్యవసాయాన్నీ చంద్రబాబు నాసనం చేస్తున్నాదని అలమటించిపోతున్న వాళ్ళు ధొలేరా కూడా అట్లాంటిదే,మరి పచ్చని పంట పొలాల్ని రాజధాని కోసం బలి తీసుకుని రైతుల్నీ వ్యవసాయాన్నీ మోదీ నాశనం చేస్తున్నాడని అలమటించి పోవాలి కదా!

నిజానికి ధొలేరా ప్లానులోని ముఖ్యమైన ఉద్దేశం Ahmedabad, Vadodara, Surat, Rajkot, Bhavnagar వంటి ప్రముఖమైన పారిశ్రామిక కేంద్రాలకు లబ్ధి చేకూర్చటమే తప్ప అక్కడి స్థానికులకు వైభవాలు కల్పించటం కాదు.అది అక్కడి స్థానికులకు కూడా తెలుసు.భజనపరులు అక్కడ Hotel Vision Modi కూడా కట్టేశారు.దాన్ని కట్టినవాళ్ళు ఇద్దరు land brokers.వాళ్ళలో ఒకడైన Dharmendra Singh,"This is barren land. The government will take 50% land from each household, but it will use that to develop roads, power, facilities and so the value of the remaining 50% land will significantly appreciate. There will also be employment when companies come in. Our villagers are illiterate so they don’t understand." అని అంటున్నాడు.అవును మరి,కోర్టులో కేసు వేసిన Bhal Bachao Andolan అధ్యక్షుడు Pradhyumna Singh కూడా "In the SIR Act, the word farmer or agriculture is not even mentioned. There is no concept of compensation or rehabilitation. All they want is to take 50% of our land without any compensation — and the 50% that remains will be allotted to us in areas not ripe for agriculture. Partnership happens voluntarily, not through coercion." అనే అంటున్నాడు.ఉద్యోగిత పెరుగుతుంది కదా అని అంటే,"There is no education in this area. We don’t have a single higher secondary school, no science education, no colleges. Today’s industries require qualified individuals. How are our boys going to get good jobs? They will all be reduced to chowkidars. In agriculture, everyone gets work — the old and young, the educated and uneducated. The distribution of income through agriculture is much higher. We would rather be owners of our land than have such jobs." అని కుండబద్దలు కొట్టేశాడు.

స్మార్ట్ సిటీ అనేది సామాన్య ప్రజల కోసం ఉద్దేశించింది కాదు గాబట్టి మనం కూడా అది లోపం అని అనుకోకూడదు.కానీ, ప్రాజెక్టు యొక్క లాభం పేరున ప్రజలకి చూపిస్తున్న ఉద్యోగిత స్థాయిని కూడా ప్రజలు నమ్మడం లేదు.DSIR చెప్తున్న దాని ప్రకారం ధొలేరా స్మార్ట్ సిటీ 343,000 ‘base’ jobsని సృష్టించగలదు.దీని నుంచి సృష్టించబడిన support services నుంచి 483,630 jobs వస్తాయి.మొత్తం పూర్తయ్యాక 30 ఏళ్ళ కాలవ్యవధిలో 483,630 jobs ధొలేరా నగరం వల్ల పుడతాయి.పుడితే స్థానికులకి ఏంటి లాభం?చదువు లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు వాళ్ళకి రావు.వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి అక్కడ సెటిలై పోతారు.వీళ్ళ పిల్లల తరం వచ్చేసరికి రాజెవడో రెడ్డెవడో?అందుకే,ధొలేరా వల్ల తమకు లాభం అని ప్రజలు నమ్మడం లేదు.అందుకే,రైతులు భూములు ఇవ్వడానికి ఉత్సాహం చూపించడం లేదు.నిజానికి సముద్రానికి దగ్గరి ప్రాంతం కావడం వల్ల అక్కడి ఉప్పునేలలో వ్యవసాయం అంత లాభసాటి కాదు.భూముల రేట్లూ తక్కువే, అయినప్పటికీ రైతులు ఆనాటి అత్యంత సమర్ధుడైన గుజరాతు ముఖ్యమంత్రీ ఈనాటి అత్యంత సమర్ధుడైన భారతదేశ ప్రధానమంత్రీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్మిస్తున్న ధొలేరా అనే స్మార్ట్ సిటీ కోసం భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదంటే కారణం ఏమిటి?

2020 సెప్టెంబర్ నాటికి ధొలేరా యొక్క స్థితి ఎలా ఉందంటే,"At the moment though, the Dholera story is one of progress - work has finally begun – but, coupled with uncertainty.It remains caught between its search at the top for ‘anchor tenants’ which can accelerate the project and the pressure from below from farmers who don’t want it to proceed at all." అని చెప్పాలి. ఇవ్వేళ్టి హద్దులు లేని పోటీతత్వం నిండిన సంస్కృతి మనకి "first is the best" అనే పిచ్చిని అలవాటు చేసింది.మన పిల్లలకే ఫస్ట్ క్లాస్ రావాలి.మన పిల్లలకే ఫస్ట్ జాబ్ రావాలి.మన పిల్లలే టాప్ వన్ బాస్ కావాలి.ప్రతి చోటా ఇదే గోల - "First comes First served!Who came first?Who achieved it First?Who raped you First?Who hit the victim First?" అంటూ పిచ్చెక్కిపోతున్నారు.అది ట్రాష్ అని తెలిసీ కుటుంబీకులం కాబట్టి ట్రాప్ లాగేస్తుంది.ఇప్పుడు మోదీ గారు ధొలేరాని ముందు పూర్తి చేసిన ఘనతని దక్కించుకోవడం కోసం చంద్రబాబు ముందు పూర్తి చేసే అవకాశం ఉన్న అమరావతిని చంపుతున్నారు.

ఇక్కడ చంద్రబాబు చేసిన ల్యాండ్ పూలింగ్ తను కనుక్కున్నది కాదు.అంతకు ముందర కాంగ్రెసు చేసిన పాత భూసేకరణ చట్టాల్ని మోదీ మార్చి కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ధొలేరాకు వాడుకున్న పద్ధతినే అమరావతికి చంద్రబాబు వాడాడు.అక్కడ మోదీ మీద నమ్మకం లేక వ్యవసాయం లాభసాటి కాని ఉప్పునేలని కూడా జనం ఇవ్వం పొమ్మంటే ఇక్కడ చంద్రబాబుని నమ్మిన రైతులు లాభసాటి అయిన వ్యవసాయ భూముల్ని ఇచ్చారు.ఆనాటి అత్యంత సమర్ధుడైన గుజరాతు ముఖ్యమంత్రీ ఈనాటి అత్యంత సమర్ధుడైన భారతదేశ ప్రధానమంత్రీ 2009 నాడు మొదలు పెట్టిన ధొలేరాని 2020 నాటికి కూడా పట్టాలు ఎక్కించలేకపోయాడని తెలిసి కూడా 2014లో ప్లాను వేసి ప్రకటించిన అమరావతిని చంద్రబాబు అయిదేళ్ళలో ఎందుకు పూర్తి చెయ్యలేకపోయాడని అడగటానికి నోరెట్లా వస్తుంది వీళ్ళకి?

అసలు తను ధొలేరా కట్టిన ఖ్యాతితో బాటు అమరావతిని కట్టడానికి చంద్రబాబుకు సహాయం చేసిన ఖ్యాతిని కూడా తీసుకోవచ్చును కదా!తను ధొలేరా కట్టిన ఖ్యాతిని తెచ్చుకోవడం కోసం చంద్రబాబు కడుతున్న అమరావతిని చంపడం దేనికి?ఒకవేళ తను గుజరాతులో కట్టాలనుకున్న ధొలేరా కన్న ముందు చంద్రబాబు ఆంధ్రాలో అమరావతిని పూర్తి చేస్తే అది తనకు అపఖ్యాతి అని ఎందుకు అనుకుంటున్నాడు?తను కేవలం గుజరాతుకు మాత్రమే ప్రధానమంత్రియా?తనకీ ఆంధ్రాకీ ఎలాంటి సంబంధమూ లేదా!సంబంధం లేదనుకుని చూసీ చూడనట్టు వూరుకోవటం లేదు.తను ధొలేరా కట్టిన ఖ్యాతిని తెచ్చుకోవడం కోసం 1983 నుంచి ఉన్న మిత్రబంధాన్ని కూడా తెంచేసి 2014 నాడు మిత్రపక్షం అయిన ప్రాంతీయ పార్టీనుంచి అయిదుగుర్ని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకున్న మర్యాదని కూడా మంటగలిపి చంద్రబాబు మీద శత్రుత్వం పెంచుకుని అతన్ని ద్వేషించి రాయలసీమ ఫ్యాక్షనిష్టు మందని ఆంధ్ర ప్రజల నెత్తి మీదకి తెచ్చిపెట్టి వినోదం చూస్తున్నాడు.

చిన్నప్పుడు ప్రతి వేసవి శెలవులకి తాతగారి ఇంటికి వెళ్ళేవాళ్ళం.మా తాతగారి నలుగురు కొడుకులలో మొదటి,రెండు,నాలుగవ కొడుకులకి ఇద్దరేసి ఆడపిల్లలూ మూడవ కొడుకుకి ఒక ఆడపిల్లా ఒక మగపిల్లాడూ  కలిపి 8 మంది సంతానం.మా తాతగారి వూళ్ళో మావాళ్ళు అందరూ బీరకాయ నారపీచు చుట్టరికాలు ఉన్నవాళ్ళే!మా ఎదురింట్లో ఒక మామిడి చెట్టు ఉండేది.దాని మొదట్లో మెత్తని తడి ఇసక ఉందేది ఎప్పుడూ.దాంతో ఎండ భయం లేదు గాబట్టి చెట్టు కింద ఆడుకునేవాళ్ళం.వాటిల్లో పిచ్చుక గూళ్ళు కట్టటం ఒకటి.నేను వాళ్ళకన్న పెద్దవాణ్ణీ క్రియేటివిటీ ఎక్కువ ఉన్నవాణ్ణి గనక అంతస్థులు పేర్చి కోటల మాదిరి బురుజులు కడుతుంటే మిగిలిన పిల్లలు కుళ్ళి చచ్చేవాళ్ళు.ఒకడు కుళ్ళు ఎక్కువైపోయి "రాత్రికి వచ్చి కూల్చి పారేస్తానులే!" అన్నాడు. రేపు ఇంతకన్న గొప్పది కదతాననే ధీమా ఉంది గనక కూల్చే చాన్సు మాత్రం వాడికి ఇవ్వటం దేనికని రోషం తన్నుకొచ్చి అప్పటికప్పుడు ఎగిరి దూకి నేను కట్టిన పిచ్చికగూడుని నేనే కూల్చేసి నవ్వేశాను. కుళ్ళుమోతు కుర్రాడికి కూడా కుళ్ళుతనం పోయి తను కట్టిన దాన్ని తనూ ఎగిరి దూకి కూల్చేసి నవ్వడం,అది చూసి ఎవరు కట్టిన వాట్ని వాళ్ళు కూల్చెయ్యడం జరిగిపోయింది. రోజుకి అదే గొప్ప ఆట అయిపోయింది.

కానీ, ఒంటిమీదకి యాభై, అరవై, డెబ్భయ్యేళ్ళు వచ్చి సుమారు పదీ ఇరవయ్యేళ్ళ పాటు ఒక రాజకీయ పార్టీలో చేరి ప్రజాసేవ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి స్థానానికీ ప్రధానమంత్రి స్థానానికీ ఎగబాకుతున్నవాళ్ళు ప్రజల సౌభాగ్యం ఇమిడిఉన్న మహానగరాలను కూడా అది వాడి పిచ్చుకగూడు కాబట్టి కూల్చేస్తాను, ఇది నా పిచ్చుకగూడు కాబట్టి కట్టేస్తాను అని రెచ్చిపోవడం కూడా ఆట అనుకుని సర్దుకు పొమ్మంటున్నారు, ఏమిటీ నీచత్వం?

సుమారు 29 గ్రామాల ప్రజలు మొత్తం రాష్ట్రానికి ఉపయోగపడే రాజధాని కోసం భూములిచ్చి ఒక మంచిపని చేసినందుకు 250 రోజుల నుంచి కూడూ నీళ్ళూ నిద్రా మానేసి రోడ్డున పడి అలమటిస్తుంటే కలగని ఆవేదన అంతర్వేది అనే వూళ్ళో ఒక చెక్క రధం తగలబడితేనూ కనకదుర్గ గుడిలో మూడు వెండి సింహాలు లెక్క తెలియకపోతేనూ కలుగుతున్నదంటే రధానికి బదులు వీళ్ళని తగలబెడితే రాష్ట్రానికి పట్టిన శనిద్రం వొదిలిపోయేదని అనిపించట్లేదూ మీకు?

కేవలం మాస్కులు అడిగిన నేరానికి ఒక డాక్టరుని బట్టలు విప్పి నడిరోడ్డు మీద పెడరెక్కలు విరిచికట్టి లాఠీలతో బాదుతున్నప్పుడు ఆవేదన కలగలేదు!ఒక పండు ముసలి రంగనాయకమ్మ రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన అనే హక్కుని ఉపయోగించుకున్నందుకు నేరస్థురాలిని చేసినప్పుడు ఆవేదన కలగలేదు!అచ్చెన్నాయుడు అనే ఒక పెద్దమనిషిని అరెస్టు చెయ్యటానికి అర్ధరాత్రి వందమంది పోలీసులు గోడలు దూకి భీబత్సం చేసినప్పుడు ఆవేదన కలగలేదు!రాష్ట్ర రాజధాని కొలువై ఉన్న ప్రాంతాన్ని అధికారంలో ఉన్న మంత్రులే స్మశానం అనీ ఎడారి అనీ అంటున్నప్పుడు ఆవేదన కలగలేదు!మోటార్లకి మీటర్లు బిగించవద్దని రైతులు ఆందోళన పడుతుంటే ఆవేదన కలగడం లేదు!

జగన్ క్రైస్తవుడనేది ఇప్పుడు కొత్త కాదే!2014 ఎన్నికల తర్వాత కూడా తెదెపా నుంచి సుజనాతో కలిపి అయిదుగుర్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్న మితృత్వం బద్దలయ్యింది చంద్రబాబు అమరావతి ప్లాను వేసిన తర్వాత కాదూ!ధొలేరా కోసం అమరావతిని ధ్వంసం చెయ్యాలంటే చంద్రబాబుని అధికారంలో ఉండనివ్వకూడదని తీర్మానించుకుని అమరావతీ విధ్వంసానికి జగనే తగినవాడని నిర్ణయించుకుని లెక్కపెట్టి ఇచ్చినట్టు అతనికి 151 సీట్లూ చంద్రబాబుకి 23 సీట్లూ వచ్చేలా చేసినప్పుడు జగన్ క్రైస్తవుడనేది తెలియదా?ఆయన తండ్రి క్రైస్తవుడు కాదా!క్రైస్తవీకరణ ఇప్పుడు కొత్తది కాదే, దేవుడి రాజ్యం అనే పేరున ఆనాడు జరగలేదా?

ఇంతవరకు ఎన్నికల ఫలితాలను గురించి పట్టించుకోలేదు నేను.ఎందుకంటే, నా దృష్టి ఎప్పుడూ "ఎప్పుడు ఎక్కడ ఎవడు గెలిచాడు?ఎప్పుడు ఎక్కడ ఎవడు ఓడిపోయాడు?ఇప్పుడు ఇక్కడ ఎవడు గెలుస్తాడు?ఇప్పుడు ఇక్కడా ఎవడు ఓడిపోతాడు?" అనేదాని మీద గాక ఎవరు మంచి పరిపాలన అందించి అభివృద్ధికి బాటలు వేస్తారు అనేదాని మీదనే ఉంటుంది.అయితే, ఒకడికి అధికారం రావడం ఒకడికి అధికారం పోవడం వాటివల్లనే అయినప్పుడు వీళ్ళు అధికారంలో ఉందకూడదనుకుంటున్న చంద్రబాబు పెర్ఫార్మెన్సూ అధికారం ఆశిస్తున్న వీళ్ళ పెర్ఫార్మెన్సూ పోల్చి చూడాలని అనిపించింది.

ఆంధ్రలో 1983 ఎన్నికల నాడు Telugu Desam Party మొత్తం పోలయిన వోట్లలో 46.3% వోట్ల శాతం సాధించి పోటీ చేసిన 289 సీట్లకీ 201 గెల్చుకుంటే Bharatiya Janata Party మొత్తం పోలయిన వోట్లలో 2.76% వోట్ల శాతం సాధించి పోటీ చేసిన 81 సీట్లకీ 03 సీట్లు గెల్చుకుంది.

ఆంధ్రలో 1985 ఎన్నికల నాడు Telugu Desam Party మొత్తం పోలయిన వోట్లలో 46.21% వోట్ల శాతం సాధించి పోటీ చేసిన 250 సీట్లకీ 202 గెల్చుకుంటే Bharatiya Janata Party మొత్తం పోలయిన వోట్లలో 1.32% వోట్ల శాతం సాధించి పోటీ చేసిన 10 సీట్లకీ 08 సీట్లు గెల్చుకుంది.

ఆంధ్రలో 1989 ఎన్నికల నాడు Telugu Desam Party మొత్తం పోలయిన వోట్లలో 36.54% వోట్ల శాతం సాధించి పోటీ చేసిన 241 సీట్లకీ 74 గెల్చుకుంటే Bharatiya Janata Party మొత్తం పోలయిన వోట్లలో 1.78% వోట్ల శాతం సాధించి పోటీ చేసిన 12 సీట్లకీ 05 సీట్లు గెల్చుకుంది.

ఆంధ్రలో 1994 ఎన్నికల నాడు Telugu Desam Party మొత్తం పోలయిన వోట్లలో 44.14% వోట్ల శాతం సాధించి పోటీ చేసిన 251 సీట్లకీ 216 గెల్చుకుంటే Bharatiya Janata Party మొత్తం పోలయిన వోట్లలో 3.89% వోట్ల శాతం సాధించి పోటీ చేసిన 280 సీట్లకీ 03 సీట్లు గెల్చుకుంది.

ఆంధ్రలో 1999 ఎన్నికల నాడు Telugu Desam Party మొత్తం పోలయిన వోట్లలో 43.87% వోట్ల శాతం సాధించి పోటీ చేసిన 269 సీట్లకీ 180 గెల్చుకుంటే Bharatiya Janata Party మొత్తం పోలయి చెల్లిన వోట్లలో 3.67% వోట్ల శాతం సాధించి పోటీ చేసిన 24 సీట్లకీ 12 సీట్లు గెల్చుకుంది.

ఆంధ్రలో 2004 ఎన్నికల నాడు Telugu Desam Party మొత్తం పోలయిన వోట్లలో 37.59% వోట్ల శాతం సాధించి పోటీ చేసిన 267 సీట్లకీ 47 గెల్చుకుంటే Bharatiya Janata Party మొత్తం పోలయిన వోట్లలో 2.63% వోట్ల శాతం సాధించి పోటీ చేసిన 27 సీట్లకీ 02 సీట్లు గెల్చుకుంది.

ఆంధ్రలో 2009 ఎన్నికల నాడు Telugu Desam Party మొత్తం పోలయిన వోట్లలో 28.12% వోట్ల శాతం సాధించి పోటీ చేసిన 225 సీట్లకీ 92 గెల్చుకుంటే Bharatiya Janata Party మొత్తం పోలయిన వోట్లలో 2.84% వోట్ల శాతం సాధించి పోటీ చేసిన 271 సీట్లకీ 02 సీట్లు గెల్చుకుంది.

ఆంధ్రలో 2014 ఎన్నికల నాడు Telugu Desam Party మొత్తం పోలయిన వోట్లలో 44.9% వోట్ల శాతం సాధించి పోటీ చేసిన 175 సీట్లకీ 102 గెల్చుకుంటే Bharatiya Janata Party మొత్తం పోలయిన వోట్లలో 2.2% వోట్ల శాతం సాధించి 04 సీట్లు గెల్చుకుంది.

ఆంధ్రలో 2019 ఎన్నికల నాడు Telugu Desam Party మొత్తం పోలయిన వోట్లలో 39.17% వోట్ల శాతం సాధించి పోటీ చేసిన 175 సీట్లకీ 23 గెల్చుకుంటే Bharatiya Janata Party మొత్తం పోలయిన వోట్లలో 0.84% వోట్ల శాతం సాధించి 175 సీట్లకీ 00 సీట్లు గెల్చుకుంది.

ప్రీ పోల్ సర్వేలూ ఆఫ్టర్ పోల్ ఎనాలిసిస్సులూ ఒక్కొక్కళ్ళు ఒక్కొకలా నమోదు చేస్తారు.అంకెలు కొంచెం అటూ ఇటూ అయినప్పటికీ సరాసరి విలువలు తీసుకుంటే ఏనాడూ నాలుగు శాతం వోట్లు కూడా తెచ్చుకోలేని పార్టీ ఆలయాల చుట్టూ తిరుగుతూ చెక్క రధాల కోసం వెండి సింహాల కోసం చేసే ఆందోళనల్తో అధికారంలోకి రాగలుగుతుందని ఎలా అనుకుంటున్నారు వీళ్ళు?కామన్ సెన్సు కూడా లేదా వీళ్ళకి!

2009 ఎన్నికల నాడు మొత్తం పోలయిన వోట్లలో 2.84% వోట్ల శాతం సాధించిన Bharatiya Janata Party అయిదేళ్ళ తర్వాత 2014 ఎన్నికల నాడు మొత్తం పోలయిన వోట్లలో 2.2% వోట్ల శాతం సాధించి మరో అయిదేళ్ళ తర్వాత 2019 ఎన్నికల నాడు మొత్తం పోలయిన వోట్లలో 0.84% వోట్ల శాతం సాధించడానికి కారణం ఏమిటో తెలుసా?ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ విభజన అంత నికృష్ట స్థితిలో ఆమోదించబడటానికీ ఆంధ్రకు అన్యాయం జరగటానికీ కాంగ్రెసుతో పాటు భాజపాకీ యాభై శాతం వాటా ఉందని ప్రతి ఒక్క వోటరుకీ తెలుసు.ఒక తప్పుల తదక బిల్లుని, బిల్లు మౌలిక స్వరూపంలోనే ఆంధ్రను సర్వనాశనం చెయ్యాలనుకున్న దుర్మార్గం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే సమర్ధించి ఆమోదించాల్సిన అవసరం తనకు లేనప్పటికీ, సమర్ధించి ఆమోదించి "చిన్నమ్మను గుర్తుంచుకో"మని తెలంగాణ వోటర్లని బతిమిలాడుకున్నారే తప్ప ఆంధ్ర వోటర్లని గురించి పట్టించుకోలేదు - ఎంత నిర్లక్ష్యం ఆంధ్రా అంటే!

ప్రజలు తమమీద కోపంతో ఉన్నారని తెలియనంత అమాయకులా వీళ్ళు?ఆంధ్రలో అధికారం కోరుకుంటున్న వీళ్ళు కోపంతో ఉన్న ఆంధ్ర వోటర్లని సముదాయించాలంటే ఏం చెయ్యాలి?మరి వీళ్ళు చేసింది ఏమిటి?తమ పార్టీకి చెందిన వెంకయ్య నాయుడు ఆంధ్ర ప్రజల కోసం నిగ్గదీస్తున్నాడనే కసితో నోరు నొక్కి చంపెయ్యడం ఎందుకు జరిగిందో అర్ధం చేసుకోలేనంత అమాయకులా ఆంధ్ర వోటర్లు?

వోట్ల శాతం మూడు దాటని వీళ్ళు వోట్ల శాతం ముప్పైకి తగ్గని చంద్రబాబుని జాకీలు పట్టి లేపింది తామే అయినట్టు ఫీలైపోయి అంత భీబత్సం చేసి ఉద్ధరించిన ఘనకార్యం ఏమిటి?కోడి పోయి కత్తి వచ్చె డండండం అన్నట్టు 2019 ఎన్నికల నాడు మొత్తం పోలయిన వోట్లలో 49.95% తెచ్చుకోగలిగిన YSR Congress Party పోటీ చేసిన 175 సీట్లకీ 151 గెల్చుకుంటే Bharatiya Janata Party మొత్తం పోలయిన వోట్లలో 0.84% వోట్ల శాతం సాధించి 175 సీట్లకీ 00 సీట్లు గెల్చుకుంది.వోట్ల శాతం పెంచుకోకుండా అమరావతీ విధ్వంసానికి జగన్మోహన రెడ్డిని అచ్చోసిన ఆంబోతులా వదిలి వెర్రిబాగుల చెవిలోపువ్వు రాజకీయం నడిపితే తమకి అధికారం ఎలా దక్కుతుంది? కత్తి పోయి సుత్తి వచ్చె డండండం అన్నట్టు ఆంధ్ర వోటర్లు అయితే ఇదే YSR Congress Partyని మళ్ళీ గెలిపిస్తారు లేదంటే Telugu Desam Partyని మళ్ళీ గెలిపిస్తారు తప్ప తమకు వోట్లు వెయ్యరు కదా!

వోట్ల శాతం పెంచుకోవడానికి ఎన్నికల్లో గెలుపోటముల గురించి మర్చిపోయి నిరంతరం ప్రజల మధ్యన తిరిగి ప్రజల సమస్యల్ని పట్టించుకుని, ప్రజలకు న్యాయం చెయ్యని ప్రభుత్వాల మీద ప్రజల తరపున పోరాడుతూ ఉంటే, ప్రజలకి వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే తమకి లాభం అని నమ్మకం కలిగి వోట్లు వేస్తూ పోవడం తప్ప పెరటి దార్లూ దొడ్డిదార్లూ లేవు.2019 ఎన్నికల నాడు 0.84% వోట్ల శాతం సాధించి 175 సీట్లకీ 00 సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ప్రజాభిమానం పెంచుకునే తిన్ననైన పనులు చెయ్యక త్వరలోనే ప్రధాన పతిపక్షం మేమే అవుతాం అని ఒకసారీ త్వరలోనే అధికారంలోకి వస్తాం అని ఒకసారీ అంటున్నారంటే వాళ్ళకి అధికారం కోసం రాజమార్గం కన్న వక్రమార్గం మీదనే మోజు ఉన్నట్టు తెలియడం లేదూ!

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?Sansad Adarsh Gram Yojana, Make In India, Skill Development, Fasal Bima అంటూ వేసిన గంతుల వల్ల అద్భుతాలు ఏమీ జరగని అసమర్ధతని కప్పి పుచ్చుకోవడానికి లెక్కలు తారుమారు చేసి గ్రోత్ రేటు పెరిగిందని చూపించిన అబద్ధాల కోరు నాయకత్వంలో నడిచేవాళ్ళు నిజాలు ఎట్లా చెప్తారు?చిన్న పరిశ్రమలు ఎన్ని మూసేశారో కేంద్రానికి లెక్కలు తెలియదట!దేవుడు గబ్బిలాలకి కళ్ళు లేని ఒక ప్రతికూలత ఇచ్చి వినికిడి వల్ల జ్ఞానాన్ని పొందడం అనే ఒక అనుకూలతని అమర్చి పెట్టినట్టు భాజపా వర్గాలకి ఎకానమీని చంకనాకించే ప్రతికూలతనీ కుంటిసాకులు చెప్పి జనాన్ని మెప్పించగల అనుకూలతనీ ఇచ్చాడు.మనం మారాలి.మారుస్తానంటే రాజ్యాధికారం ఇచ్చిన దేశాన్ని మార్చని వాడికి మళ్లీ ఓటే వెయ్యకుండా మనం మారాలి.మనం మతం కులం కంపులో ఉండి మన ఓట్లు దొబ్బి ప్రజా పాలన మర్చిపోయిన వాళ్ళకి ఓట్లు వేయడం నుంచి మనం మారాలి.

 

తెలిసీ దేశాన్ని అధోగతికి నడిపిస్తున్నవాణ్ణి మళ్ళీ ప్రధాని పదవిలో ఎందుకు కూర్చోబెట్టాలి?

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...