Wednesday 26 February 2020

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ తెలివిని చూపించకపొతే మిగిలిన నాలుగేళ్ళలో జగన్ పరిపాలన ఇంతకన్న భయానక స్థాయికి చేరుకుంటుంది!


చంద్రబాబు నాయుడు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు.నిజానికి Thursday, 26 July 2018 నాడు నేను నా బ్లాగులో ప్రచురించిన 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవిశ్వాస తీర్మానం పెట్టి ఏమి సాధించాడు?భారత ప్రధానమంత్రి అవిశ్వాస తీర్మానం నుంచి ఏమి సాధించాడు!' అన్న పోష్టులో "1.ఈయన మిత్రపక్షం హోదాలో తన పార్టీ నుంచి నలుగుర్ని కేంద్రంలో మంత్రులుగా నిలబెట్టి ఏమి సాధించాడో కేసీయార్ అవేమీ చెయ్యకుండానే సాధించాడు - ఇది నేను అంటున్నది కాదు,ఇవ్వాళ రెండు రాష్ట్ర్రాల్లోనూ కనీసం పేపరు చదవగలిగిన ప్రతి విద్యావంతుడూ తెలుసుకోగలిగిన విషయం! 2.రాష్ట్రానికి సంబంధించి మొదటి సంవత్సరంలోనే పరిష్కారం కావల్సిన ముఖ్యమైన సమస్య పరిష్కారం కాకపోవటానికి తెదెపాకి భాజపాతో ఉన్న మొహమాటమే కారణం కదా!తెగదెంపులు చేసుకున్నాక కూడా పనికిమాలిన విషయాల మీద దృష్టిపెట్టి దారి తప్పకుండా దీన్ని ముందుకు తెస్తే భాజపా ఖచ్చితంగా ఇరుకున పడేది!3.యెన్ని కేసులున్నాయో, యెంత దోచుకున్నాడో, యెప్పటికి రుజువులు దొరుకుతాయో, యెప్పటికి శిక్ష పడుతుందో తెలియదు గానీ 2014లో జగన్ గట్టి పోటీ ఇచ్చిన మాట వాస్తవమే - ఇప్పటికీ అతను ధీమాగానే ఉన్నాడు, 2019లో కూడా అతని బలం అతనికి ఉంటుంది.పవన్ కళ్యాణ్ మొదట్లో సామరస్యం చూపించినా ఇప్పుడు శత్రుపక్షంలో చేరిపోయాడు. ప్రజల్లో చంద్రబాబు పనితీరు పట్ల పెదవి విరుపులే తప్ప కనీసపు స్థాయి ప్రశంసలు కూడా లేవు - ఇన్ని స్వయంకృతమైన ప్రతికూలతలతో 2019లో తెదెపా ఎంతమేరకు వ్జయం సాధిస్తుందో వూహించి చెప్పడం కష్టమే!4.అవిశ్వాస తీర్మానం విషయంలో కేవలం ప్రవేశపెట్టడంతో సరిపెట్టుకోకుండా తను స్వయంగా ఢిల్లీ వెళ్ళి అందరు ప్రతిపక్ష నేతలతో మాట్లాడి వీలయితే ప్రభుత్వాన్ని పడగొట్టటం లేదంటే భాజపాకి సభలో విశ్వాసం నిరూపించుకోవడం కష్టం అనిపించేలా ఒత్తిడి పెడితే పరిస్థితి చంద్రబాబుకి అనుకూలం అయ్యేది - ఇప్పుడు చంద్రబాబు ఎన్నికల లోపు మళ్ళీ ఇలాంటి డ్రామాల కోసం చూడకుండా ప్రభుత్వం మరియు తెదెపాల పనితీరును మెరుగు పరుచుకోవడం మీద దృష్టి పెట్టడం మంచిది." అని చెప్పాను.ఇందులో ఎంత మేర చంద్రబాబు భజన ఉందో మీరు తేల్చుకోండి.
అదే పోష్టులో మోదీ గురించి "1.అవిశ్వాస తీర్మానం పెట్టిన చంద్రబాబు పరిస్థితి దయనీయంగానే ఉన్నప్పటికీ ఇక తొలిసారి అవిశ్వాస తీర్మానం ప్రస్తావన వచ్చినప్పటినుంచీ మొదలుపెట్టి అవిశ్వాస తీర్మానానికి జవాబు చెబుతూ చేసిన ప్రసంగం వరకు దానికి స్పందించిన మోదీ ప్రవర్తనని గమనించితే మొత్తం ప్రపంచం మీద తనకన్న నీచుడైన రాజకీయవేత్త ఉండడు అని తనకు తనే రుజువు చేసుకున్నాడు!2.అవిశ్వాస తీర్మానం పెట్టిన ఉద్దేశం ఆంధ్రాకి కేంద్రప్రభుత్వమే ఉద్దేశపూర్వకమైన అన్యాయం చేస్తున్నదనే తీవ్రమైన ఆరోపణతో - మోదీ ప్రధాని హోదాలో చేసిన ప్రసంగం మొత్తాన్ని ఎంత సునిశితంగా గమనించినా ముఖకవళికల్లో గానీ జవాబు చెప్పటానికి ఎంచుకున్న పదజాలంలో గానీ చెబుతున్న విసయాన్ని మరింత స్పష్టం చేసే ఆంగికాభినయంలో గానీ దానికి సంబంధించిన గంభీరత ఎక్కడైనా ఉందా?వీలున్నంతవరకు అవిశ్వాసం ముప్పుని తప్పించుకోవాలని తెరచాటు ఎత్తులన్నీ వేసి ఇక తప్పించుకోవడం కుదరదని తెలిశాక నెగ్గడానికి కావలసిన లెక్కల్ని సరిచూసుకుని ప్రతిపక్షం తనమీద అవిశ్వాస తీర్మానం పెట్టగలగడమే ఒక అద్భుతం అన్నట్టు కలరు పులిమి మాట్లాడినవాడు లెక్కల ప్రకారం నిజాయితీ పరుడు అవుతాడు?" అని చెప్పిన విషయాలు కూడా యదార్ధమే కదా!
నన్ను నేను ఒక political analyst అని చెప్పుకుంటున్నాను.ఒక పొలిటికల్ ఎనలిస్ట్ ఎలా ఉండాలో నాకు తెలుసు.ఇతరుల చేత నీతులు చెప్పించుకునే బాల్యదశ దాటి చాలా కాలం అయింది.నేను నా విశ్లేషణకి ఎంచుకున్న పద్ధతి కూడా ఆఎదినుంచీ ఒక్కలాగే ఉంటున్నది.రాజకీయ వాత్వారణం,రాజకీయ నాయకత్వం ఎలా వుండాలి అనే విషయంలో నాకున్న స్థిరమైన నియమాల ప్రకారమే వ్యాఖ్యానిస్తాను. నియమాలు కూడా చాలా చిన్నవి.వ్యక్తులుగా చూస్తే నాకు చంద్రబాబు, కేసీయార్, జగన్, నరేంద్ర మోదీ ఒక్కలాగే కనపడతారు - వ్యక్తిగత విషయాల్ని బట్టి నేను అభొమానిన్వ్హాలంటే అందర్నీ అభిమానించాల్సి వస్తుంది.నాకు కనపడతం కాదు, మీరు కొంచెం ఎక్కువ తెలుసుకోవడం మొదలుపెడితే మీకూ అలాగే కనిపిస్తారు.ఇక్కడ కొందరు చేస్తున్నది ఏంటంటే మొదట ఏదో ఒక పాయింటు మీద వాళ్ళని ఆకర్షించినవాళ్ళని ఒక్క పాయింటు చుట్టూ గానుగెద్దులా తిరుగుతూ only vimal తరహా పిచ్చని పెంచేసుకుని అతని గురించే ఆసక్తి చూపిస్తూ అతనిలోని మంచి విషయాల్ని మాత్రమే తెలుసుకుని ఆరాధిస్తూ అతను అధికారంలోకి వస్తే చాలు అద్భుతాలు జరిగిపోతాయనీ అతనిలా ఉంటే ఏదో ఒక రోజున తనూ అతనంతటి వాణ్ణి అవుతాననీ నమ్ముతూ అతనినే అనుసరిస్తూ అతను తప్ప ఇంకెవ్వరూ మంచివాళ్ళు కాదనుకుంటూ అతన్ని అధికారంలోకి రానివ్వనివాళ్ళని దుర్మార్గులని లేబుల్స్ కొట్టేస్తూ స్వయంతృప్తి పొందుతూ ఉంటారు.అలాంటివాళ్ళకి అలాంటి దురద లేని నేను వాళ్ళ అభిమాన నాయకుడిలో ఉన్న లోపాల్ని చూపించగానే వెంఠనే హీరోగాడి విలన్ పార్టీవాడిలా కనపడతాను.
వాళ్ళకి నేనెలా కనపడతానో అది నాకు సంబంధించిన విషయం కాదు.నాకు సంబంధించినంతవరకు సత్యమే నాకు ప్రమాణం.లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ "కొత్త రకం రాజకీయం" కోసం బయలుదేరి ఏమి సాధించాడు?అతను సాధించింది ఏమీ లేదు! పార్టీ పెట్టని తొలీద్శలో ఎడ్యుకేట్ చెయ్యడం బాగానే నడిచింది, పార్టీ అయ్యాక పునాది మీద అధికారం సాధించలేక పార్టీని రద్దు చేశాడు, ఇప్పుడు ఎడ్యుకేట్ చెయ్యడం కూడా ఆగిపోయింది.JP ఫెయిలవడానికి కారణం ఎడ్యుకేట్ చెయ్యడాన్నీ దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యడాన్నీ విడగొట్టడమే ముఖ్యమైన కారణం. ఆదర్శవంతుడైన political activist నిరంతరం రెంటినీ కలిపి చేస్తూ ఉంటే మంచి ఫలితం వస్తుంది!
భారతదేశంలో గత కొన్ని యేళ్ల నుంచి ప్రజలు, అనగా వోటర్లు మ్యానిఫెస్టోలనీ తాయిలానీ వాగ్దానాలనీ పట్టించుకోవటం లేదు, ముఖ్యమంత్రి స్థానంలో గానీ ప్రధానమంత్రి స్థానంలో గానీ అప్పుడు వున్న సమస్యలని పరిష్కరించి తమకు భద్రతని ప్రసాదించి తమని అభివృద్ధి పధంలోకి నడిపించగలడని నమ్మకం కలిగించే వ్యక్తి పార్టీలో ఉంటే పార్టీకి వోటు వేస్తున్నారు, అవకాశం లేనప్పుడే ఇతరమైన అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు!
మొదటిసారి అధికారం కోసం పోటీ పడుతున్నవాడు అంతకు ముందు అధికారంలో ఉన్నవాడి కంటే తను సమర్ధుణ్ణని చెప్పుకోవాల్సి ఉంటుంది, అది చాలా కష్టమైన వ్యవహారం!కేసీయారుకి తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం అవకాశాన్ని ఇచ్చింది. వెసులుబాటు జగనుకి లేదే! అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి స్థానానికే న్యాయం చెయ్యలేనివాడు ముఖ్యమంత్రి పదవికి యెట్లా న్యాయం చేస్తాడు?
ఒకసారి అధికారంలోకి వచ్చాక అతని పెర్ఫార్మెన్సుని చూస్తారు - మొన్నటి 2019 ఎన్నికల్లో కేసీయార్ ఓడిపోతే బాగుండునని కోరుకున్నానే తప్ప వోడిపోతాడని చెప్పటానికి నేను ధైర్యం చెయ్యనిది ఎందుకు?కేసీయార్ తెలంగాణని ఒక్కసారి శిఖరాగ్రం చేర్చలేదు గానీ తెలంగాణ అభివృద్ధి పధంలోకి నడుస్తున్నదనే గ్యారెంటీ ఇచ్చాడు కాబట్టి ప్రజలు అతన్ని గెలిపించారు, అదే అనుకూలత చంద్రబాబుకీ ఉంది - అందుకే "తెలంగాణలో కేసీయార్ గెలిచినప్పుదు ఆంధ్రలో నేనెందుకు వోడిపోతాను!" అని ధీమాని చూపించాడు. అలాగే మొన్నటి 2019 ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే బాగుండునని అనుకున్నానే గానీ గెలుస్తాడని చెప్పటానికి నేను ధైర్యం చెయ్యనిది ఎందుకు? చంద్రబాబు చేస్తున్న తప్పులు చెప్పాను, అవి సరిదిద్దుకోకపోతే ఓడిపోయే ప్రమాదం ఉందని చెప్పాను, అతను ఆ తప్పుల్ని సరిదిద్దుకోలేదు, వోడిపోయాడు - ఇందులో నేను చేసిన భజన ఏమిటి?
ఎన్నికల్లో గెలుపోటములకి ప్రాధాన్యత ఇవ్వను నేను. మొన్న ఎవరు గెల్చారు, నిన్న ఎవరు గెల్చారు,ఇప్పు డెవరు గెల్చారు, రేపు గెలుస్తారు అనేవి జూదగాళ్ళకి డబ్బులు తెచ్చిపెడతాయి తప్ప ఆయా పార్టీల నాయకులలో ఉన్న ప్రజాసామ్య స్పూర్తి/పరిపాలనా దక్షత వంటివాటిని పట్టించుకుంటేనే ప్రజలకి నిజమైన ప్రయోజనం ఉంటుంది.  తమ అధికార పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి పధంలో నడిపించగలిగిన దక్షతని బట్టి మాత్రమే నా వైపునుంచి వచ్చే ప్రశంసలూ విమర్శలూ ఉంటాయి.ఎన్నికల్లో గెలుపోటములు పార్టీల ఎన్నికల వ్యూహాలను బట్టి ఉంటాయి. చంద్రబాబు మొదటి ఎన్నికల్ని ఎలా ఎదుర్కొన్నాడో చూడండి!1995లో ఎన్నికల గెలుపోటములు ఉన్నప్పటికీ దేవుడి ఇమజి ఉన్న NTRను వెన్నుపోటు పొడిచిన చెడ్డపేరుతో ఎకాఎకిన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 1999లో 185/294 అసెంబ్లీ సీట్లూ 29/42 పార్లమెంటు సీట్లూ ఎలా గెల్చాడు!చేసిన అభివృద్ధిని చూపించి చెప్పుకుని గెల్చాడు. దానికి పూర్తి భిన్నమైనది మొన్నటి అపజయం నాటి ప్రవర్తన. మొన్నటి 2019 ఎన్నికల్లో తెదెపా ఎన్నికల ప్రచారం చాలా నీరసంగా ఉందనేది వాస్తవం.ఇవ్వాళ "ఇవి గ్రాఫిక్సా!" అంటూ చేస్తున్న హడావిడి ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెయ్యలేదు?ఇక లోపాయకారీ వార్తల ప్రకారం కేసీయారు హైదరాబాదులో ఆస్తులున్న తెదెపా అనుకూల వర్గాల్ని కట్టడి చెయ్యడం నిజమేననీ తను కూడా బాధితుణ్ణేననీ చెప్పినప్పటికీ కుళ్ళు జోకులేసి వూరుకోవడం తప్ప రెమిడియల్ యాక్షన్ తీసుకోలేదు - నేను చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుందనే అతి చెయ్యడమే అంత దయనీయమైన ఓటమికి ముఖ్యమైన కారణం.
మొట్ట మొదటి సారి NTRని పడగొట్టి అధికారంలోకి వచ్చినప్పటినుంచి చంద్రబాబుది ఉపాధి కల్పన విషయంలో రాక్షస పంతం!ఇన్వెస్టర్లకి నమ్మకం కలిగించి తన అధికార పరిధి ఉన్న ప్రాంతంలో పెట్టుబడుల కుంభవృష్టిని కురిపించడంలో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అతనికి సరి తూగగలిగిన వ్యక్తి ప్రస్తుత తరపు నాయకుల్లో ఎవడూ లేడు.ఉంటే చూపించమనండి అతన్ని ద్వేషించే బుర్ర తక్కువ సన్నాసుల్ని.2014 నుంచి 2019 వరకు ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల్లో మూడవ స్థానంలో నిలబెట్టాడు ఆంధ్రాని చంద్రబాబు.పోనీ అదేమన్నా అందరూ అతనికి సహకరించి జాకీలు పెట్టి లేపితే జరిగిందా అంటే ప్రతి అడ్డ గాడిదా ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు సక్సెస్ కాగూడదని పంతం పట్టి ఎదురు నిలబడ్డారు.అన్ని ప్రతికూలతల మధ్యన మాత్రం సాధించటమే గొప్ప!ఇప్పుడు గానీ అధికారంలో ఉంటే అమరావతీ ఆంధ్రా కూడా అయిదేళ్ళు పూర్తయ్యేసరికి ఒక ఇంద్రజాలాన్ని ప్రపంచ ప్రజలకి చూపించి వుండేవి!
లోపాయకారీ వార్తలా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మోదీ జగనుతో నీ అసలు సంఖ్య 50 మాత్రమే అని అన్న ముక్క నేనూ చదివాను.ఇలాంటివి నూటికి నూరు శాతం నమ్మవచ్చునా అని అంటే అక్కడ వార్త తనకెలా తెలిసిందో అతను చెప్పలేదు అనేది మాత్రమే తీసుకుంటే నమ్మడం కష్టమే.కానీ వార్తా పత్రికలు ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ అజమాయిషీలో ఉంటాయి. మనకి తెలిసేలా పత్రికలో ప్రచురించకపోయినా ఎవరన్నా కేసు వేసి ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ అతన్ని ఆధారాలు చూపించమని అడిగినప్పుడు చూపించకపోతే ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ పత్రిక లైసెన్సును రద్దు చేసే అవకాశం ఉంది.అతనికున్న పాప్యులారిటీని బట్టి కేసునీ ప్రెస్ కౌన్సిలునీ మ్యానేజి చేసే అవకాశం కూడా ఉంది గానీ కేసు వేసినవాడు అతన్ని మించినవాడు అయితే? కేసీయారు తొక్కితే ఏం చేశాడు!
జగన్ ఎలా గెల్చాడన్నది కాదు కొశ్చ్బెను, గెల్చాక ఏం చేస్తున్నాదన్నది పాయింటు.మొదటి రోజుల్లో అతనికి కేసీయారూ మోదీ జగనుకి విధించిన తక్షణ కర్తవ్యం చంద్రబాబు మళ్ళీ పైకి లేవకుండా 2022లో గానీ 2024లో మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడమని.జగనుకి బుర్రలో గుజ్జు ఉండి ఉంటే అప్పటి రాజశేఖార్ రెడ్డిలా చంద్రబాబు చేసిన మంచి పనుల్ని కొనసాగిస్తూ రాజధాని పనుల్నికూడా  కొనసాగిస్తూ CRDA చట్టం ప్రభుత్వానికి అమ్మకపు హక్కుల్ని ఇచ్చిన భూముల్ని పద్ధతి ప్రకారం వాడుకునేలా పరిపాలించి ఉంటే ఇప్పటికి చంద్రబాబు అనామకుడై తెదెపా అంతరించి పోయి ఉండేది!
కానీ, అతను వేసిన తప్పటడుగుల వల్ల చంద్రబాబు మరింత బలం పుంజుకోవటం మొదలుపెట్టాడు.ఇప్పుడు మోదీ, కేసీయార్, జగన్ త్రయం యొక్క ప్లాను ఒకవేళ మళ్ళీ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటికీ బాగు చెయ్యడానికి వీల్లేని స్థాయిలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించటం. రాష్ట్ర పౌరులం కాబట్టి వినడానికి కష్టంగా ఉన్నా నమ్మలేనట్టు అనిపించినా ఇది నిజం .
లేకపోతే ఏమిటండీ! పోలవరం ప్రాజెక్టును 70 శాతం వరకు పనులను గిన్నిస్ బుక్ రికార్డులతో పరుగులెత్తించి, పట్టిసీమను కట్టి  రైతులకు నీళ్లు అందించి, శాసనసభ, సచివాలయ భవనం - వెలగపూడి,విద్యుత్ సౌధ భవనం -విజయవాడ, ఏపీ పోలీస్ హెడ్ కోటర్స్ - మంగళగిరి, హైకోర్టు ఆఫ్ ఏపీ - నేలపాడు,ఏపీఐఐసీ భవనం - మంగళగిరి,ఏపీ పోలీస్ టెక్ టవర్స్ - మంగళగిరి,దేవాదాయ భవనం -  గొల్లపూడి,కమాండ్ కంట్రోల్ సెంటర్ - వెలగపూడి,ఆర్ అండ్ బి భవనం - విజయవాడ,  సుమారుగా 1250 కోట్లు ఖర్చు చేసి కట్టారు. ఇవి కాకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్,  ఐఏఎస్ ఐపీఎస్ టవర్స్, రోడ్లు డ్రైనేజీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 10 వేల కోట్లు ఖర్చు చేసి 70 శాతం నిర్మాణాలు పూర్తి చేశాడు.అయినా ఎందుకు ద్వేషిస్తున్నారు ఆంధ్ర ప్రాంతపు బుర్ర తక్కువ సన్నాసులు చంద్రబాబుని?
సంవత్సరంలో జగన్ చేస్తున్న తరహా పరిపాలన ఇలాగే కొనసాగితే నాలుగేళ్ళ తర్వాత చంద్రబాబు కాదు కదా కుబేరుడూ ఇంద్రుడూ దిగివచ్చి పరిపాలిచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ బాగుపడదు!వ్యక్తులుగా చూస్తే నాకు చంద్రబాబు, కేసీయార్, జగన్, నరేంద్ర మోదీ ఒక్కలాగే కనపడతారు అని నేను ఎందుకు అన్నానో తెలుసా!మిగిలిన ముగ్గురు కూడా అభివృద్ధిలో పోటీ పడాలని అనుకుంటే చంద్రబాబు సాధించిన అద్భుతాల్ని వాళ్ళు కూడా సాధించగలరు - వాళ్ళు అసమర్ధులు కారు.చంద్రబాబు సైతం ప్రతి చోటుకీ తను వెళ్ళి కూర్చుని అభివృద్ధి చెయ్యటం లేదు.నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి నడిపించినది ఎవరో తెలుసా!A.P.V.N. Sharma అనే ఒక నిజాయితీ పరుడైన అధికారి కేవలం అనుకంప,ఆదర్శం అనే రెండు గుణాలతో సాధించిన అద్భుతం.అద్భుతం అని అనడానికి కూడా గట్టి సాక్ష్యం ఉంది, Harward Business Review ఈ విజయగాధని నమోదు చేసింది. శతకోటి లింగాల్లో ఒక బోడిలింగం అన్నట్టు సింగరేణి అనే ఒక బొగ్గు కంపెనీని నష్టాల నుంచి లాభాల వైపుకి పరుగులు పెట్టించడాన్ని ఇంత పొగడటం దేనికి అనిపిస్తే దాని చరిత్ర తెలుసుకోవాలి. ఎప్పుడో 1871, అంటే స్వతంత్రం తెచ్చుకుందామనే ఆలోచన కూడా పుట్టని ఇంగ్లీషు వాళ్ళ పరిపాలనా కాలంలో Geological Survey of India అధ్వర్యంలో  Dr. William King ఇల్లెందు(yallandu) ప్రాంతంలో coal seams ఉన్నాయని కనుక్కుని తన పేరును పెట్టేసుకున్నాడు.1886 నుంచి బ్రిటిష్ రాణి నుంచి అనుమతులు పొంది వాడుకోవటం మొదలుపెట్టారు.23 December 1920న అప్పటి  Hyderabad Companies Act కింద దాన్ని public limited company చేసి The Singareni Collieries Company Limited' (SCCL) అని పేరు పెట్టారు.1960 కల్లా Government of India కూడా extending loan assistance ద్వారానూ  participation in the equity ద్వారానూ భాగస్వామి అయ్యింది. అలాంటిది 1994 నాటికి రెండు సార్లు సుదీర్ఘ కాలం పాటు మూసి ఇక కొనసాగించడం కుదరదనే నిర్ణయానికి వచ్చేశారు అందరూ.డిజాల్వ్ చేసేసి కార్మికులకి ఇవ్వగలిగినంత ఇచ్చేసి రోడ్డు మీద వదిలెయ్యడమే మిగిలింది.
శర్మ గారు చేసిన అద్భుతానికి చంద్రబాబుని ఎందుకు పొగడాలి?
మిగిలిన వాళ్ళలా "శర్మ గారూ!మనకి రిస్కూ చెడ్డ పేరూ రాకుండా ఎలా డిజాల్వ్ చెయ్యాలో చెప్పండి!" అని గాక, "ఎంత రిస్క్ అయినా సరే తీసుకుని సింగరేణి కంపెనీని ఒక దారిలో పెట్టండి!" అని పురమాయించినందుకు - నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అది సాధ్యం అనే నమ్మకం లేదు, కానీ సాధించ్ఘాలనే పట్టుదల మాత్రమే ఉంది.శర్మ గారిదేముంది, ఆయన ఉద్యోగి.డిజాల్వ్ చెయ్యాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే A.P.V.N. Sharma కాదనగలడా!ఈరోజున DSP హోదాలో ఉన్న ఒక పోలీస్ అధికారి నోటివెంట "లంజకొడకా!" లాంటి మాటలు వస్తున్నాయంటే దానికి కారణం ఏమిటి?A.P.V.N. Sharma గారిని నిజాయితీ పరుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సి రావడమే ఒక దరిద్రం - ఇవ్వాళ ఉన్న పరిస్థితిని బట్టి అట్లా చెప్పాల్సి వచ్చింది. చంద్రబాబు ఎన్నుకున్న టీం అలాంటిది, జగన్ ఎన్నుకున్న టీం ఇలాంటిది - నాయకుడి సంస్కారమే అతను ఎన్నుకున్న టీములోనూ ఉంటుంది.
ప్రస్తుతం ఆంధ్రాలో విద్యావంతులలో కూడా కూర్చున్న కొమ్మని నరుక్కునే వెర్రి తనం కనిపిస్తుంది.గత కొద్ది రోజుల్లోనే ముఖ పుస్తకం వేదిక మీద జరుగుతున్న సంభాషణలో ఒక తేలంగాణ విద్యావంతుడు "మీరు జగన్ను ప్రోత్సహించడం వల్ల మాకు చాలా లాభం కలుగుతున్నది.పిల్లల చదువులకి 8 ఎకరాలు అమ్మాల్సి వస్తుందని అనుకున్నాం, ఇప్పుడు 1 ఎకరం అమ్మినా చాలుననిపిస్తున్నది" అంటే ఇక్కడి విద్యావంతుడు అతనికి "ధాంక్స్!" చెప్తున్నాడు.ఆహాహా!ఏమి తెలివి?ఏమి తెలివి?మ్న రాష్ట్రాన్ని బాగు చేస్తాడని ఓటు వేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు అమన్ రాష్ట్రాన్ని దుంప నాశనం చేస్తూ పొరుగు రాష్ట్రాల్ని బాగు చేస్తుంటే ఇతను నాకు జగను ఇవ్వాళా రేపూ బోల్డు బోల్డు కమిటీలు వేసేసి మొన్నెప్పుడో చంద్రబాబు చేసిన అవినీతి గురించి ఎల్లుండోనూ ఎప్పుడో మరెప్పుడోనూనూ బయటపెట్టేస్తాడు ఎదురు చూస్తూ ఉండమని చాలెంజిలు విసురుతున్నాడు - పైన తను చదివింది ఎకనమిక్సు!
మూడు రాజధానుల హడావిడి మొత్తం బీజేపీ ఆదేశాల మీదనే నడుస్తున్నది - ఆందోళన చేస్తున్న వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని అనటం దగ్గిర్నుంచి రైతుల మీదకి కార్లని నడపటం వరకు వాళ్ళు చేస్తున్నవి ఉద్యమ కారుల్ని రెచ్చగొట్టి హింసకి ప్రేరేపించడం కోసమే!రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడితే గానీ అది సాకు చూపించి రాష్ట్రపతి పాలన విధించడం కుదరదన్న బీజేపీ ఇబ్బందిని తొలగించడానికే జగన్ ప్రభుత్వం ఉద్యమ కారుల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నది!మొన్నటి 2019 ఎన్నికల్లో కొలిచినట్టు జగన్ దగ్గిర్నుంచి లాక్కున్నాడని అంటున్న 23 సంఖ్యయే తెదెపాకి రావడం అనేది ఒక్కటి చాలు జగన్ తెచ్చుకున్న 151 కూడా ఈవీయం మాయాజలం అని చెప్పడానికి.ఎన్నికల కమిషన్ వీవీప్యాట్లని 50-50% లెక్కించడానికి తిరస్కరించడం మరింత బలమైన సాక్ష్యం!
1996 నాడు పీకలోతు నష్టాల్లో కూరుకుపోయిన సింగరేణి బొగ్గు గనుల సమస్యని అతను పరిష్కరించిన తీరుని ప్రపంచ స్థాయి ఆర్ధిక విశ్లేషకులు ఎంత ప్రశంసించారో తెలుసుకోండి.అదే 2019 నాడు కేసీయారూ జగనూ ఆర్టీసీ సమస్యల్ని ఎలా పరిష్కరించారో చూడండి.
ఇప్పటి తరహాలో అయిదేళ్ళ పూర్తి కాలం జగన్ పరిపాలిస్తే చంద్రబాబు కాదు గదా అమరేంద్రుడు ముఖ్యమంత్రీ కుబేరుడు ఆర్ధికమంత్రీ అయినప్పటికీ రాష్ట్రాన్ని బాగు చెయ్యలేరు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ తెలివిని చూపించకపొతే మిగిలిన నాలుగేళ్ళలో జగన్ పరిపాలన ఇంతకన్న భయానక స్థాయికి చేరుకుంటుంది!

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...