Friday, 2 January 2015

తన కులపోడికి గుడికడితే గొప్పగా మురుసుకుంటున్న కంచెకులతిలకుడి విచ్చిన పొట్టలోని పురుగుల్ని లెక్క పెడదామా?

     "బహుశా ఏసు పుట్టక ముందనుకుంట..ఈ ప్రాంతంలో మల్లయ్య అనె గొర్రెల కాపరి పుట్టాడు.ఆయన పుట్టిన తేది మెట్టిన తేది లెవ్వు.ఆయన కాపులో మంద మంచిగున్నదని,పాలు,పెరుగు,చల్ల సమృధ్ధిగా దొరికాయని,మాంసం మస్తుగా తినగలిగేవారని,చలిని చంపే గొంగళ్ళు బోలెడుండేవని,బహుశా మల్లన్న మరణించిన కొరెళ్ళిలో కురుమ-గొల్ల లంతా గుడి కట్టుకున్నారు.ఈ మల్లన్నకు తెలంగాణలో మరో రెండు గుళ్ళు కూడా వున్నాయి. అవే ఐలోని మల్లన్న,కట్ట మల్లన్న గుళ్ళు.ఈ గుళ్ళు ఐలోని పేరులోనే నా పేరు కూడా వుంది.కట్ట మల్లన్న పేరులో మా అవ్వ |కంచె కట్టమ్మ| వున్నది.మా తాత పేరు కంచె మల్లయ్య.ఈ అందరి దేవతల పునాది పేరది.ఈ విధంగా దేవుడైన మా ముత్తాత ముత్తాత దగ్గర ఒక దేవుడిగా ఎలిసిన"కొమురెళ్ళి మల్లన్న గుడి దగ్గర ముఖ్యమంత్రి దొడ్డి కొమ్రయ్య భవనం కట్టిస్తానని ప్రకటించాడు" - ఇది సుప్రసిధ్ధ రచయిత కంచె ఐలయ్య గారి స్వకులాభిమానం!ఈ విధంగా తన కులం వాళ్ళకి యేదయినా మర్యాద జరిగితే ఆయనా మరియూ ఆయన కులం వాళ్ళు మాత్రమే పొంగి పోవాలి.కమ్మ వాళ్ళకీ,రెడ్లకీ వెలమలకీ అలాంటి హక్కు లేదు?ఒకవేళ వాళ్ళు అలా పొగుడుకుంటే ఈ కంచెకులతిలకుడికి కోపమొస్తుంది - ఈ కంచెకులతిలకుడు ఇదివరలో తీర్మానించినట్టు వాళ్ళది కుల దురహంకారం అని అర్ధం చేసుకోవాలి,తెలిసిందా?

     ఈయనకి "సామాజిక శాస్తవేత్త" అనే బిరుదు నామం కూడా వుందండోయ్!తనలోనూ యెదటివాళ్లలోనూ వున్న ఒకే లక్షణం - స్వకులాభిమానం అనేది తనలో వుంటే గొప్ప అనీ యెదటి వాడిలో వుంటే చెత్త అనీ అనడం డబల్ మొరాలిటీ అవుతుందని వున్నత విద్యావంతుడూ సామాజిక శాస్త్రవేత్తా అయిన ఈ పెద్దమనిషికి యెట్లా తెలియలేదబ్బా?ఇంతకీ వీరి ముత్తాత గారు దేవుడవటానికి వీరు చెప్తున్న కారణమేమిటో తెలుసా - వారి గొర్రెలు పాలు యెక్కువ ఇవ్వటం,వారి గొర్రెల మాంసం రుచిగా వుండటం,వారి గొర్రెల వున్ని మరింత దళసరిగా వుండటమూ నట?!ఆ లెక్కన ఇవ్వాళ్టి డయరీ ఫారముల వాళ్ళకి యెన్ని గుళ్ళు కట్టాలి?

     ఒకే గుక్కలో రెండు రాగాలు పలికించగలగటానికి యెంత ప్రజ్ఞ కావాలో తెలుసా?ఈ కంచె వంశాంబుధి చంద్రుడికి అది పుష్కలంగా వుంది!గుడి కట్టడం ఇష్టమే ట!కానీ ఇప్పుడు మాత్రము వద్దు ట!యెందుకు ట!వాళ్ళకి స్మారక భవనం/గుడి కట్టిన దాని కన్నా ఈ 25 కోట్లు కరువు కాటకాల్లో,అప్పుల ఆవేదనలో,ఆకలి కోరల్లో వున్న తెలంగాణా ప్రజల్ని ఆదుకోవటానికి వుపయోగిస్తేనే ఆ దేవుళ్ళు సంతోషిస్తారు ట! ఈ విధంగా కరువులో వుండగా కట్టవద్దని నాలుగో పేరాలో హెచ్చరించిన ఈయనే నెక్సుటు పేరాలో కరువులోనే మెదక్ చర్చిని కట్టడాన్ని పొగుడుతారు.పైదానికి పూర్తి వ్యతిరేక కారణాలతో దాన్ని కూడా సమర్ధించేశారు,ఆ కట్టడంలో వేలాదిమందికి మంచిగా పని కల్పించారు ట!ఒక బ్రహ్మాండమైన చర్చి చరిత్రలో గొప్పగా నిలిచింది ట!మరి ఇప్పుడూ వేలాదిమందికి పని దొరుకుతుంది కదా అని మనం తింగరి దీర్ఘాలు తియ్యగూడదు!మరి ఇప్పుడూ బ్రహ్మాండమైన స్మారక భవనం/గుడి లేస్తుంది కదా అని మనం వంకర మాటలు మాట్లాద కూడదు!ఒకే గొంతుతో రెండు రాగాలు,వారేవ్వా యేమి ప్రజ్ఞండీ?!

     ఇంతకీ ఇప్పుడు కొందరు ప్రజలు బీదరికంలో వున్నారు గాబట్టి వొద్దంటున్నాడు,కొందరు ప్రజలు బీదరికంలో వుండటం కొన్ని శతాబ్దాల తర్వాత కూడా వుంటుంది కదా?అసలు కట్టవద్దంటున్నట్టా?ఆయనకే తెలియాలి!ఒక ఇంట్లో శుభమా అని ఒక కుర్రాడికి పెళ్ళీడు వచ్చిందనుకోండి,పెళ్ళీ చేశారనుకోండి,సరిగ్గా శొభనం గదిలో కొత్త పెళ్ళి కూతురు పాలగ్లాసుతో అడుగు పెట్టిన వేళ మా పక్కింట్లో కుటుంబం అర్ధాకలితో మాడిపోతున్నది గాబట్టి వాళ్ళు ఆ దరిద్రం నుంచి బయటపడే దాకా నేను నిన్ను ముట్టుకోను అని ఆ పెళ్ళికొడుకు ఆ అమ్మాయితో అంటే ఆ అమ్మాయి అతన్ని యెలా చూస్తుంది?ఇప్పుడు మనం ఈయన్ని కూడా అలాగే చూడాలి!

    బ్రాహ్మణ సంస్కృతిని విమర్శించడానికి హేతువాది నంటాడు,బ్రాహ్మణీకపు హిందువులు  మతం పేరుతో గుడిగోపురాలు కట్టి యెన్నో దుర్మార్గాలు చేశారంటాడు,తన కులపోడికి స్మారక భవనం కడితే మాత్రం సమ్మగా వుంది ఈ హేతువాదికి?!పాముల నెందుకండీ రెండు నాల్కల విషజంతువులని తిడతాం,పాపం?! గుడి లాంటి స్మారక భవనం కడతానన్న వాణ్ణి కూడా పూర్తిగా సమర్ధించడు - వేరే కులపోడు గదా?!

     మా ఇంట్లో పేర్లన్నీ మల్లయ్య,కొమురయ్య,కట్టయ్య్య,ఐలయ్య - ఈ దేవుడి పేరు నుంచి వచ్చినవే.కానీ వెలమల్లో ఈ పేరున్న ఒక్క మగ లేదా ఆద వ్యక్తి మనకి కనిపించడు.నరసిమ్హా రావు,రామారావు,విద్యాసాగర రావు,రాజేశ్వర రావు అనే బ్రాహ్మణీయ దేవతల పేర్లతో,అణచివేతే ఆనందంగా గల సంస్స్కృతితో జీవించే వాళ్ళు మారుతున్న దాఖలాలు కూడా లేవు అంటాడు.అదే ప్రశ్న తిరగేసి మరి మీ కులంలో ఈ పేర్లు యెందుకు కనపడవు?మీ పేర్లు పెట్టుకోని ఇతర కులాల వాళ్ళంతా మీదృష్టిలో దురహంకారులా?అంటే మీ కులం గొప్పదని మీకు వుంది గాబట్టి మీ దేవుళ్ళ పేర్లు మాత్రమే పెట్టుకున్నా మీది కులపిచ్చి కాదు,యెదటి వాళ్ళు మాత్రం వాళ్ళ కులదేవుళ్ళకి బదులుగా మీ కులపు దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటేనే మీకు మంచివాళ్ళుగా కనబడతారు,మాస్టారూ మేం మీ కులపు పేర్లు పెట్టుకోము,కానీ మీరు మాత్రం మా కులపు పేర్లు పెట్టుకోవాలి అంటున్న ఇక్కడ పెత్తనం చేస్తున్నది యెవరంటారు?

     తమ కులంలో తాతలూ ముత్తాతలూ తనూ తిరగేసి మరగేసి తమ కులపు దేవుళ్ళ పేర్లనే పెట్టుకున్నట్టు యెదటి కులాల వాళ్ళు తమ కులపు దేవుళ్ళ పేర్లని పెట్టుకుంటే తమది స్వకులాభిమానం గానూ యెదటి వాళ్ళ్ళది కుల దురహంకారం గానూ కనబడటం అంటే యెమిటో మళ్ళీ చెప్పాలా?అనగనగా పంచతంత్రం కధలో ఒక టవును నక్క జనం తంతుంటే పరుగులు పెడుతూ రంగుల డబ్బాలో మునిగి రంగులంటించుకుని అడివిలోకి దవుడు తీస్తే ఆ పిచ్చి జంతువు లన్నీ కంగారు పడి రాజుని చేసుకుంటే, ఒక రోజు సాటి నక్క వూళవేస్తే వొళ్ళ్ళు మరిచిపోయి తనూ వూళవేసి అసలు రంగు బయట పెట్టుకున్నట్టు - తన కులపోడికి గుడి కడుతున్నారన్న సంబరంలో తన కులపిచ్చిని బట్టబయలు చేసిన ఈ మేడిపండుకి ఇప్పుడు రెండే రెండు దారు లున్నాయి.ఒకటి:తన సామాజిక శాస్తవేత్త అనే గుర్తింపుని రద్దు చేసుకుని కంచెకులతిలక నామధేయంతో ఆ గుడిలో పూజారి/గైడు బతుకు బతకటం!రెండు:తనకు వున్నట్టే స్వకులాభిమానం వెలమలకీ,కమ్మలకీ,రెడ్లకీ వుండటం సహజమే అని వొప్పుకుని ఇకనుంచీ నోరు మూసుకోవటం!తొక్కలే అని అహంకరించి ఇప్పట్లాగే కొనసాగాడనుకోండి,"పోవాయ్ శుంఠాయ్,నువ్వొక డబుల్ మొరాలిటీ వెధవ్వి - నీకూ బెబ్బెబ్బే నీ సుత్తికీ బెబ్బెబ్బే" అని మొహం మీదే అంటాడు యెవడో ఒకడు!ఇంత వయసొచ్చి ఒక కుర్రవెధవతో అలా అనిపించుకోవడం తెలివైన పని కాదు గదా!


     "చాకలి ఐలమ్మ ఒక్క చాకలోళ్ళ హీరోయినే కాదు,తమ హక్కుల కోసం ,ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసే స్త్రీలకు-పురుషులకు ఆమె ఆదర్శం.కొమురం భీం ఒక్క ఆదివాసుల హీరోనే కాదు,మొత్తం మానవజాతికి ఆయన ఆదర్శం." మిగతా కులాల్లో యెంత మంచివాళ్ళు వున్నా వాళ్ళ కులాలకే పరిమితం చెయ్యాలే తప్ప మొత్తం మానవజాతికి ఆదర్శప్రాయం అంటే నువ్వు వొప్పుకోవు,సవాలక్ష వంకలు పెడతావు.యేమయ్యా ఐలయ్యా,మా కులాల్లో పుట్టినోళ్ళని గొప్పోళ్ళని వొప్పుకోలేక నక్కలు బొక్కలు వెతుకునన్న తీర్న వంకలు పెడుతున్న నీ కులంలో పుట్టిన గొప్పోళ్ళని నెత్తిన పెట్టుకునే దురద మాకెందుకయ్యా!

     తనకి నచ్చని హిందూ మతం చెడ్డది,తనకి నచ్చిన యేసుమతం మంచిది అని భ్రమించే ఈ మేధావికి హ్యారీ పోటరు సినిమాలో మనం కూడా చూసి సరదాగా ఫీలయిన మంత్రగత్తెలు చీపుర్ల మీద తిరగుతారనే పిట్టకధకి మూలకధ యెంత క్రూరంగా వుంటుందో తెలుసా!యేసు ప్రవచనాల్ని పైగన్లు అనే జాతిమీద రుద్దటానికి చేసిన భీభత్సానికి ఒక సభ్యతాయుతమయిన ముసుగు అది!ఆ జాతిలో మాతృస్వామ్య వ్యవస్థ వుండేది.పైగా వైద్యంలోనూ నాగరిక జీవన విధానంలోనూ అఖండులైన వాళ్ల దగ్గిర రోగమొచ్చిన వాళ్ల దగ్గిర చేరి మా యేసుని ప్రార్ధిస్తే మీరోగం నయమవుతుందని మోసం చెయ్యడం కుదరకపోవదం వల్ల ఆ ఆదవాళ్ళని మంత్రగత్తెలుగా ముద్రవేసి చంపేశారు!మనవాళ్ళు చీపురుని యెంత పవిత్రంగా చూస్తారో మీకెవరికయినా గుర్తుందా?పదిమంది తిరుగుతూ కాళ్లతో తొక్కేచోట వుంచగూడదు!యెక్కడ వుంచినా నిలువుగా నిలబెట్టాలే తప్ప అడ్డదిడ్దంగా పడెయ్యకూదదు!శుభ్రతే సౌభాగ్యం అని తెలియడం వల్లా చీపురులో లక్ష్మీదేవి వుంటుందనే నమ్మకం వల్లా అలా చేసే వాళ్ళు!అలాంటి నమ్మకమే వున్న పైగన్లని పరమ దుర్మార్గంగా వెక్కిరించారు!అన్ని దుర్మార్గాలు చేసిన క్రీస్తుమతం వుదారమైంది,హిందూమతం మాత్రమే క్రూరమైనది?!

యెవడ్రా ఈ కులపిచ్చి గాడికి సామాజిక శాస్తవేత్త అనే గుర్తింపు నిచ్చింది?!

12 comments:

  1. ఐలయ్య స్టేట్మెంట్ ఎక్కడ వచ్చిందండీ?

    ReplyDelete
    Replies
    1. ఆంధ్రజ్యొతి దినపత్రిక లోని వ్యాసం,శనివారం నాటి దనుకుంటాను!
      రెఫ్:టైతిలు:భవంతులు కూడుపెదతయ్యా or some thing like that?

      Delete
  2. శెభాష్ హరిబాబు గారు. నాకు బాగా నచ్చింది. ఈ కుహనా సామాజిక వేత్తలు , కుహనా మతవాదులు అభిప్రాయాలు తప్పని నిరూపించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం బాగుంది. వీళ్ళ కుహనా అభిప్రాయాలతో సమాజపు మెదళ్ళను విషతుల్యం చేస్తున్నారు. వీళ్ళను కూడా అడ్డుకునే వాళ్ళ సంఖ్య తక్కువే. ఆ ప్రయత్నం మీరు చేస్తున్నందుకు సంతోషం గా వున్నది. కానీ దీనిని బ్లాగుతో పాటు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలో రాయగలిగితే ఒకేసారి అది కొన్ని లక్షల మందికి చేరుతుంది.

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా,అడ్రసు దొరికింది,ఆ పత్రికలోనే పబ్లిష్ అవ్వాలి - నా సామిరంగా!

      Delete
  3. విషయం ఇంకొంచెం సున్నితమైనది..కురుమల్లో కిష్టయ్య, శీనయ్య లు ఉన్నారు. కానీ వెలమల్లో మల్లా రావ్, ఐలా రావ్ లేరు.
    అలానే ఐలమ్మ, కొమురయ్య, భీం దోపిడీ కి ప్రతీక లు కాదు. దౌర్జన్యం పై తిరుగుబాటు కి ప్రతీకలు. క్రైస్తవుడైన YSR, హిందువైన CBN దోపిడీకీ ఆధిపత్యానికీ ప్రతీకలు. మానవ జాతి మొత్తానికీ ఆదర్శప్రాయమవ్వాలంటే, దోపిడీ కి కారణమవ్వని వారై ఉండాలి.
    ఒక అల్లూరి సీతారామ రాజు, ఒక వీరపాండ్య కట్టబ్రహ్మన, ఒక తాండ్ర పాపారాయుడు, అలానే ఓ చాకలి ఐలమ్మ, ఓ దొడ్డి కొమురయ్య, ఓ కొమురం భీం వీరంతా మానవాళి కి ఆదర్శప్రాయులు..కుల మతాల ప్రసక్తి లేకుండా. కానీ గత డెభ్భై యేళ్ళు గా అగ్రకులాలలో అల్లూరి వంటి వారు కాగడావేసినా కనపడరు. అందరూ YSR, CBN, KCR, నీలం సంజీవ రెడ్డీ వంటి ఆధిపత్య నక్కలే!

    ReplyDelete
    Replies
    1. అయ్యా, మల్లన్న అనేది మల్లిఖార్జునుడు అనే దేవుడి కున్న అనేకమయిన పేర్లలో ఒక పేరుకి నామాంతరం.చెవిటి మల్లయ్య అని ఆప్యాయంగా పిలవడం దగ్గిర్నుంచీ చాలా చోట్ల చాలా మంది పెట్టుకుంటారు.కాపోతే హిందువుల్లో ఇవ్వాళ ఒక్క శివుణ్ణే కొలాలి,ఒక్క రాముణ్ణే కొలవాలి ఆ పేరునే పెట్టుకోవాలి అనే పట్టుదల లేకపోవదం వల్ల మీకు తెలిసిన్ అకొద్ది మందిలో ఆ పేరు లేకపోవడాన్ని కూడా దుర్మార్గమే అంటారా?

      Delete
    2. హరిబాబుగారూ, చాలా మందే 'మల్లిఖార్జున' అని వ్రాస్తూ ఉంటారు కాని అది సరి కాదు. మల్లిక + అర్జున --> మల్లికార్జున అన్నదే సరైన పదస్వరూపం. ఈ మల్లిక, అర్జున అనే రెండూ సంస్కృతశభ్దాలు కాబట్టి వీటిమధ్య జరిగినది ఒక సంస్కృతసంధి. దానిని సవర్ణదీర్ఘసంధి అంటారు. ఇక్కడ మల్లిక అన్న పదంలోని చివరి అచ్చు అ కారం కాస్తా ఆ కారంగా మరిపోయింది. అంటే పొట్టి అకారం పొడుగు అకారం అయ్యిందన్నమాట. అందుచేత క అన్నచివరి అక్షరం కా అని మారి మల్లికార్జున అన్నపదం యేర్పడింది. అనేకులు తెలియక మల్లిఖార్జున అని వ్రాయటం అలవాటులోని పొరపాటు.

      (కేవలం విషయం తెలియజేయటానికే వ్రాసాను కాని మిమ్మల్ని చిన్నబుచ్చటానికి కాదు. మీకు నేనిలా సలహ ఇవ్వటం పైన అభ్యంతరం ఉంటే, నన్ను మన్నించి, మీ అభ్యంతరాన్ని మాత్రం తప్పక తెలియజేస్తే. యికముందు ఇలా నేను ఉబోసలు ఇవ్వకుండా జాగ్రత్తవహిస్తాను.)

      Delete
    3. మాస్టారూ, మీరు నా గురించి మీరు సందేహ పదనక్కర లేదు.యెవరు మంచి సలహా ఇచ్చినా సరయిన పధ్ధతిలోనే తీసుకుంటాను.ఒక పోష్తుని తిరగరాశాను?మరో పోషూని తొలగించేసాను!కాబట్తి మీరు చూపించిన తప్ప్పుని తప్పకుండా సవరిస్తాను.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...