Wednesday, 29 August 2018

క్రైస్తవమతప్రచారకులు ఇంకా ఎంతకాలం అబద్ధాలతో జనాన్ని మోసం చేస్తారు?క్రైస్తవమతవ్యాప్తి చరిత్రలో గౌరవప్రదమయిన విషయం ఒక్కటైనా ఉందా!క్రైస్తవమతానుయాయులు ఇంకెప్పటికి నిజం తెలుసుకుంటారో!


క్రైస్తవేతరులకి ఒక శుభవార్త - ఇంక మనం "క్రీ.శ - క్రీ.పూ" అనే మాటల్ని వాడాల్సిన పని లేదు!క్రీస్తు పుట్టుకకీ ఇవ్వాళ మనం వాడుతున్న క్రీ.శ 1వ సంవత్సరం అనేదానికీ ఎలాంటి సంబంధమూ లేదు!భారతీయుల కాలగణనంలో తిధులూ,ముహూర్తాలూ వంటివాటిని తీసేసి ఉమర్ ఖయ్యాం వంటివారు అరబిక్ క్యాలెండరు తయారు చేస్తే దాన్ని బట్టి 15వ శతాబ్దిలో గ్రెగేరియన్ క్యాలెండరు తయారు చేసేటప్పుడు ఏదో ఒక మొదటి తేదీ ఉండాలి కదా అని ఆ తేదీని పెట్టారు..నాలుగో శతాబ్దంలో ఒక పాస్టరు దాన్ని క్రీస్తుకు అంటగడితే వలసదేశాలలో రుద్దేశారు.ఇప్పుడు పరిశోధకులు ఆ కాలవిభజన క్రీస్తును బట్టి చేశారనడం అబద్ధం అని తేల్చేశారు.కాబట్టి తెలుగులో మనం క్రీ.పూ అని రాస్తున్న దాన్ని పూ.సా.శ(పూర్వ సామాన్య శకం) అనీ క్రీ.శ అని రాస్తున్న దాన్ని సా.శ(సామాన్య శకం) అనీ రాసెయ్యొచ్చు!ఇంగ్లీషులో ఇప్పుడు మనం BC అని రాస్తున్న దాన్ని BCE(Before Common Era) అనీ AD అని రాస్తున్న దాన్ని CE(Common Era) అనీ రాసెయ్యొచ్చు!

ప్రశ్న : యేసు నిజంగా హేరోదు (Herod) కాలంలో పుట్టాడా? అసలు యేసు పుట్టింది డిసెంబరు 25 నేనా?1. మత్తయి సువార్త ప్రకారం: అవును, హేరోదు కాలంలోనే పుట్టాడు (మత్తయి 2:1). 2. లూకా సువార్త :  కురేనియా సిరియా దేశమునకు అధిపతిగా ఉన్నప్పుడు జన్మించాడు (లూకా 2:1-7).

మనకు ఇప్పుడు ఈ ఇద్దరు రాజుల గూర్చి పూర్తి రికార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. వికీపీడియాలో చదవవచ్చు కావాలంటే. హేరోదు(74BC-4BC) రాజు క్రీస్తు పూర్వం 74లో పుట్టి క్రీస్తు పూర్వం 4లో చనిపోయాడు. ఆ తర్వాత తన నలుగురు కొడుకుల్లో ఒకరైన అర్కెలాయు(Archelaus) యూదాను పాలించాడు( ఈ విషయం మత్తయి సువార్తలో కూడా ఉంటుంది). అలాగే కురేనియా(51 BC – AD 21) క్రీస్తు పూర్వం 51లో పుట్టి క్రీస్తు శకం 21లో మరణిచాడు. అయితే  హేరోదు కొడుకు ఆర్కెలాయు  క్రీస్తుశకం 6 వ సంవత్సరం వరకు పరిపాలించిన తర్వాత రోమన్ చక్రవర్తి ఆర్కేలాయుని తొలగించి యూదా రాజ్యాన్ని సిరియాకు కలిపి మొత్తం భూభాగానికి  కురెనియాను క్రీస్తు శకం 6 వ సంవత్సరంలో గవర్నరుగా నియమించాడు.  ఈ ముగ్గురు రాజులు యూదాను ఈ క్రింది సంవత్సరాల మధ్య పాలించారు.

1. హేరోదు (37BC - 4BC )
2. అర్కెలాయు (4BC - 6AD)
3. కురేనియ (6AD - 12AD)

పైన మనం గమనిస్తే హేరోదు చనిపోవడానికి మరియు కురెనియా రాజు అవ్వటానికి నడుమ 10 సంవత్సరాల బేధం వుంది. మరి యేసు జననం గూర్చి చెప్పే రెండు సువార్తల ప్రకారం యేసు , క్రీస్తు పూర్వం 4కు ముందన్నా పుట్టి ఉండాలి లేదా క్రీస్తు శకం ఆరు తర్వాతన్నా పుట్టి ఉండాలి లేదా రెండు సువార్తల్లో చెప్పింది తప్పన్నా అయ్యుండాలి. అందులోనూ రెండు సువార్తల్లో తేది ,సంవత్సరం కూడా ప్రస్తావించలేదు. కానీ క్రైస్తవులంతా క్రీస్తు పూర్వం 1 సంవత్సరం డిసెంబర్ నెలలో 25 తేదీన పుట్టాడని సంబరాలు చేసుకుంటారు. మరి ఈ తేది సంవత్సరాలను కనిపెట్టిన రోమన్ క్యాథలిక్ చర్చి, పోపులకే  తెలవాలి ఆ గుట్టేంటో!

క్రైస్తవులంత పచ్చి అబద్ధాల కోర్లు ఇంకెక్కడా ఉండరు పట్టపగలు కళ్ళముందు జరిగిన దాన్ని జరగలేదని  యేసు మీదా యెహోవా మీదా మేరిమాత మీదా ఒట్లు వేసి చెప్పగలరు!తమకి ఉపకారం చేసినవాణ్ణీ తమని మంచివాళ్ళని నమ్మినవాళ్ళనీ కూడా మోసం చెయ్యగలిగిన సిగ్గు లేని మంద!"నమ్మినవాణ్ణి మోసం చెయ్యడం!"అనేది మనకి క్రూరంగానే అనిపిస్తుంది గానీ నిజానికి ఒకణ్ణి మోసం చెయ్యాలనుకున్నవాడు మొదట చేసేపని ఎదటివాణ్ణి తను అతన్ని మోసం చెయ్యడని నమ్మించడమే!ఆ విద్యలో క్రైస్తవమతప్రచారకులు ఆ మతం పుట్టిన తొలి రోజు నుంచీ ఆరితేరి పోయారు - వీళ్ళ చేతుల్లో మోసపోయిన మొదటి వాడు వీళ్ళకి ప్రాభవం తెచ్చిపెట్టిన కాన్స్టాంటినే!

అసలు ఈ కాన్స్టాంటిన్ క్రైస్తవాన్ని ప్రాభవంలోకి తేవడానికి నమ్మకం కన్న అవసరమే ఎక్కువ పనిచేసింది.312 CE October 28వ తేదీన Milvian Bridge దగ్గిర ఆ చరిత్రని మలుపు తిప్పిన యుద్ధం మొదలయ్యేనాటికి రోమన్ సామ్రాజ్యానికి అతడు సర్వంసహాధిపతి కాదు,అసలు Flavius Vakerus Constantinus అనబడే ఈ చారిత్రక పురుషుడు అప్పటి రోమన్ కులీన కుటుంబానికి చెందిన ఇతని తండ్రి Constantinusకీ  కల్లుపాకల యజమాని(tavern-inn owner) కూతురు Helenకీ పుట్టాడు. Tetrarchy (ruled A.D. 284-305) కాలంలో చక్రవర్తి రోమన్ సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలుగా చేసినప్పుడు Constantinusకి Gaul, Britain కలిసిన ప్రాంతం మీద అధికారం దక్కింది.

ఇప్పుడు అతను బలం పుంజుకుని మిగిలిన ముక్కల్ని కూడా జయించి ఏకచ్చత్రాధిపత్యం కోసం కలలు కంటూ బయలు దేరాడు.అన్ని ప్రాంతాలలోనూ అన్ని కాలాలలోనూ రాజులకి యుద్ధాలకి బయలుదేరేముందు దేవుడి ఆశీస్సులు తమకే ఉన్నాయనీ గెలుపు తధ్యమనీ సైనికులకి హుషారు కల్పించడం చాలా మామూలు విషయం.అయితే ఈ కాన్స్టాంటిన్ మహాశయుడికి అప్పటి యూదుమతం నచ్చలేదు.అదీగాక అప్పటికే ఆ మతం చాలా కాలం నుంచి పాతుకుపోయి ఉండటంతో తనమీద పెత్తనం చేస్తుందని తెలుసు.మతాధిపతులు తనమీద పెత్తనం చెయ్యకుండా ఉండాలంటే కొత్త మతాన్ని ప్రోత్సహించడం తెలివైన పని కదా!అందుకు క్రైస్తవం అతనికి దొరికింది.కలలో శిలువ కనబడటం నమ్మి చెప్పినది గాక ప్రచారపు ఎత్తుగడ అయి ఉండవచ్చు!ఆనాటి యుద్ధంలో గెలుపు కాన్స్టాంటిన్ పరమయ్యింది.అదే వూపులో కాన్స్టాంటిన్ అఖండ రోమన్ సామ్రాజ్యానికి చక్రవర్తి కావడానికీ  అతని ప్రోత్సాహంతో అప్పటివరకు రహస్యప్రార్ధనలతో కాలం గడుపుతున్న క్రైస్తవం శరవేగంతో రోమన్ సామ్రాజ్యపు రాజమతం కావడానికీ ఆ ఇద్దరి అదృష్టమే కారణం కావచ్చు!తమాషా యేమిటంటే అతనికి కలలో శిలువ కనబడినప్పటి పవిత్ర ప్రకటన " In hoc signo vinces " ("in this sign you will conquer") అతి కొద్ది కాలంలోనే Pall Mall సిగరెట్ ప్యాకెట్ మీద కనవడింది - మతాన్ని వ్యాపారానికి వాడుకోవటం, వ్యాపారంతో మతాన్ని ప్రచారం చేసుకోవటంలో క్రైస్తవులు ఆదినుంచీ ముదుర్లే!

కాన్స్టాంటిన్ క్రైస్తవాన్ని నమ్మడం వల్ల గాక అవసరం కోసమే ప్రోత్సహించాడనేటందుకు అసలైన ఆధారం తను బాప్తిజం తీసుకోకపోవటమే.ఆనాడే ఈనాటి పోప్ హోదాని పొందినప్పటికీ అతన పూర్వపు పోంటిమస్ మాక్జిమస్ హోదాని వదులుకోలేదు. ప్రజలు పాటించి తనకు విధేయులుగా ఉండటం కోసం తనే పూనుకుని అల్లించిన కట్టుకధల్ని నమ్మి పాటించాల్సిన అవసరం అతని కేమిటి?

అయితే, అతను అవసాన దశలో మరణశయ్య మీద ఉండి ఒక మతాధికారిని పిలిపించి "Let there be no ambiguity" అనే ప్రకటనతో క్రైస్తవం స్వీకరించాడని ప్రచారంలో ఉన్న కధనం పట్ల కాన్స్టాంటిన్ జీవితాన్నీ ప్రవర్తననీ మనస్తత్వాన్నీ పరిశోధించిన చరిత్రకారులు అనేక సందేహాలని వ్యక్తం చేస్తున్నారు.తమకి అంత సహాయం చేసిన కాన్స్టాంటిన్ చక్రవర్తికే మినహాయింపు ఇవ్వనివాళ్ళు నిర్మల్ హృదయ్ సదన్ రోగులకి చాటుమాటు బాప్తిజం చెయ్యడంలో ఆశ్చర్యం ఏముంది?

సా.శ 315 నుంచి సా.శ 325 మధ్యలో కాన్స్టాంటిన్ స్వయంగా రాశాడని చెప్తూ 3,000 పదాల Constitutum Constantini (the Donation of Constantine) అల్లికని కూడా పుట్టించేశారు!దీని ప్రకారమే పోపుకి ప్రపంచంలోని క్రైస్తవుల మీద ఆధ్యాత్మికమైన అధికారమూ యూరప్ మీద రాజకీయపరమైన అధికారాలు సైతం దఖలు పర్చేశారు!నకిలీ పత్రం కాబట్టి రహస్యంగానే ఉంచాలనుకున్నారు గానీ Catholic church, Eastern Orthodox Church అనే పేర్లతో క్రైస్తవం చీలుతున్న సందర్భంలో బైటికి తీశారు.ఇందులో ఉన్న అతిపెద్ద అబద్ధం ఏమిటంటే అప్పటివరకు రోమ్ నగరానికి ఉన్న ప్రాధాన్యతని కొత్త రోమ్ (Constantinople) నగరానికి దఖలు పర్చేశారు - ఇందులోని వింతేమిటంటారా, ఆ పత్రంలో కాన్స్టాంటిన్ కొత్త రోమ్ నగరానికి ప్రాధాన్యతని దఖలు పరుస్తూ చెప్పిన పదేళ్ళకి ఆ నగరం ఉనికిలోకి వచ్చింది!

అందుకే Voltaire మహాశయుడు ఈ Constitutum Constantini ఉదంతాన్ని "the boldest and the most magnificent forgery." అని హాస్యమాడాడు!Lorenzo Valla అనే లాటిన్ భాషాకోవిదుడు సా.శ 1440లో King Alfonosకీ Pope Eugenius IVకీ మధ్య ఇటలీని ఎవరు పరిపాలించాలనే తగాదా వచ్చి పిలిపిస్తే చూసి ఇది నకిలీదని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పాడు.ఆ పత్రంలో diadem అనే వస్తువును గురించి చెప్తూ అది ఒక స్వర్ణకిరీటం అని ఉదహరించారు,కానీ కాన్స్టాంటిన్ కాలంలో అది ఒక వస్త్రవిశేషం అని తేలింది.పాపం Lorenzo లోకజ్ఞానం లేకపోవటం చేత కేవలం సత్యనిష్ఠతో అంత దుర్మార్గం చేసినందుకు ఎనిమిది మతపరమైన నేరాలను చేసినట్టు నిర్ధారించి సజీవదహనం చేసి సన్మానించారు!

నిజానికి ఇంత దారుణమైన మోసకారి తనం ఉన్న మతం గౌరవాన్ని కోరుకునే మర్యాదస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకర్షించటానికి వీలు లేదు!అయినప్పటికీ ప్రపంచ జనాభాలో ఇంతమంది గౌరవాన్ని ఎట్లా పొందగలిగింది?అదీ గాక, క్రైస్తవాన్ని పాటించేవారిలో మర్యాదస్తులే ఎక్కువ!వీరంతా తాము మర్యాదస్తులుగా ఉంటూ అమర్యాదకరమైన పనులను చేస్తున్న తమ మతప్రచారకులను కనీసం నిలదియ్యలేనంత నిస్సహాయతను చూపిస్తున్నారు,  ఎందుకు?

ఈ ప్రశ్నలకి జవాబులు వెదకాలంటే క్రైస్తవమతం వ్యాపించిన చరిత్రని పరిశోధించాలి - తార్కికంగా ఆలోచించి వేసిన ఏ ప్రశ్నకీ బైబిలులో హేతుబద్ధమైన జవాబులు ఉండవు!జీసస్ యొక్క చారిత్రక యదార్ధత కోసం వెదకడం అనవసరం - దొరికిన ఆధారాలు నాలుగే నాలుగు,అందులో బలమైనవి రెండే రెండు,ఒకదాన్ని క్రైస్తవులే తమ అలవాటు చొప్పున అబద్ధాలతో కంపు కంపు చేశారు,జీసస్ క్రీస్తు అనే ఒక వ్యక్తి ఈ భూమి మీద ఉన్నాడు అని రుజువు చెయ్యటానికి తిరుగులేని సాక్ష్యం ఒకే ఒక్కటి!దాని ప్రకారం చూస్తే అతను బైబిలులో ప్రస్తుతించబడిన జీసస్ క్రీస్తుకి పూర్తి విరుద్ధమైనవాడు - గలీలీ ప్రాంతం దాటితే అతనెవరో తెలియని అనామకుడు.బాప్తిజం ప్రక్రియ జీసస్ కన్న ముందునుంచే ఉన్నది.పాత నిబంధనలో ప్రముఖమైన మహిమాన్వితుడు మోజెస్ ఇతనికి బాప్తిజం ఇచ్చిన ప్రవక్త/గురువు/మెస్సయ్య కొత్త నిబంధనలోకి వచ్చేసరికి జీసస్ కన్న తక్కువ స్థాయిలో కనబడతాడు. సెయింట్ పాల్ అనే ఒక్క వ్యక్తి లేకుంటే ఈనాడు క్రైస్తవం ఇంత గొప్ప స్థితిలో ఉండేది కాదు.ఈరోజు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్న బైబిలు ప్రస్తుతించిన జీసస్ యొక్క యదార్ధ జీవితం అత్యంత అనామకకమైనది!

గలీలీ ప్రాంతం దాటితే అతడెవరో ఎవరికీ తెలియదు!పాత నిబంధనలో అత్యంత ప్రముఖుడై కనిపించే మోజెస్ నుండి బాప్తిజం దీక్షని పొందిన తర్వాత ఆతడు జీవించినది కేవలం రెండు లేక మూడు సంవత్సరాలు మాత్రమే - ఎంతటి ప్రజ్ఞావంతుడికైనా అంత తక్కువ సమయంలో ఎక్కువమందిని ఆధ్యాత్మిక విషయాలలో ప్రభావితం చెయ్యటం చాలా కష్టం.ఆ కొద్దిమందిలో సెయింట్ పాల్ అని తర్బాత పిలవబడిన ఈ శిష్యుడు/భక్తుడు/అనుచరుడు ఉండటం జీసస్ క్రీస్తు యొక్క అదృష్టం తప్ప మరేమీ కాదు!

పాల్ ఎంత శ్రమకోర్చి ప్రచారం చేసినప్పటికీ Gospel of Mark అనేది లేనట్లయితే నాటి నుంచి నేటివరకు పుట్టి గిట్టిన ఎన్నో అనామక మతశాఖల వలెనే క్రైస్తవం కూడా అంతరించిపోయి ఉండేది!ముఖ్యంగా మార్క్ సువార్త అనబడే అతి ముఖ్యమైన భాగాన్ని రచించిన ఆజ్ఞాత పండితుడి మేధస్సు కొనియాదదగినది - మరీ గంభీరమైన విషయాలను ఎత్తుకోకుండా స్త్రీలు,పిల్లలు,అవిద్యావంతులు కూడా చక్కగా అర్ధం చేసుకోగలిగిన తేలికైన తర్కాన్ని  వాడుతూ నమ్మకం,విధేయత వంటివాటిని అలవాటు చేసే విషయాలని మాత్రమే ప్రస్తావించడం అంతకుముందు గానీ తర్వాత గానీ మరెవరూ అంత సమర్ధవంతంగా చెయ్యలేకపోయారు!

ఈ రెంటికన్న అది పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు నిలబెట్టుకుంటూ వస్తున్న మూడు విచిత్రమైన లక్షణాలు క్రైస్తవానికి ఆదరణను కలిగించాయి.క్రైస్తవం పుట్టిన నాడు రోమన్ ఆధ్యాత్మికత చాలా సంకిష్టమైనది - అనేక రకమైన ఆచార వ్యవహారాలు గలవారు తమ ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలను పాటిస్తూనే ప్రభుత్వం శాసించిన జంతుబలుల వంటి ఆచారాలను పాటించటానికి సమ్మతించేవారు.క్రైస్తవులు దీనికి భిన్నమైన ప్రవర్తనని ప్రదర్శించారు - రాజ్యం అందరికీ పాటించమని చెబుతున్న వాటిని వ్యతిరేకించడంతోనే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించారు,ఇది క్రైస్తవులలోని మొదటి ప్రత్యేక లక్షణం!

విచిత్రం యేమిటంటే, వారి ఉద్దేశం సత్యనిరూపణ ద్వారా చేసే సంస్కరణ అయితే ఇతర్లకి ముఖ్యంగా ప్రభుత్వానికి తమ జ్ఞానంతోనూ పాండిత్యంతోనూ సత్యనిరూపణ చేసి ఉండేవారు.ఇప్పటి కధనం ప్రకారమే అప్పుడు తీర్పు వెలువరించిన రాజుకు జీసస్ పట్ల సానుభూతి ఉన్నట్టు ప్రస్తావించుతున్న దానిని బట్టి జీసస్ కనీసం రాజుని మెప్పించే స్థాయి పాండిత్యాన్ని కూడా ప్రదర్శించలేకపోయాడని తెలియటం లేదా!ఈనాడు బైబిల్ ఉదహరిస్తున్న వంశావళి వివరాలను బట్టి తాతల నాడు పోగొట్టుకున్న యూదుల రాజ్యాన్ని స్థాపించడమనే పంతమే ఎక్కువ కనిపిస్తున్నది చారిత్రక వ్యక్తి అయిన జీసస్ క్రీస్తులో.

అసలైన జీసస్ చేశాడో లేదో తెలియదు గానీ ఇప్పటి బైబిల్ రూపకర్తలు అప్పుడు ఉన్న మతశాఖలలో ఎవరూ చెయ్యని ఒక విప్లవాత్మకమైన ప్రతిపాదన చేశారు.కాన్స్టాంటిన్ కాలంలోని మార్పులు చేర్పులలో కూడా రూపం కోల్పోని ఈ మతం యొక్క మౌలిక లక్షణం ఒక వాగ్దానం - ఏ విధమైన సంక్లిష్టమైన కర్మకాండలూ లేకుండా కేవలం ఏ విధమైన ప్రవర్తనా నియమాలను పాటించమని చెప్పకుండా కేవలం యేసే రక్షకుడు అని నమ్మితే చాలు ఇహలోకంలో అనియతమైన సంతోషమూ మరణానంతరం శాశ్వతమైన  పరలోక నివాసమూ ఖాయం అని బల్లగుద్ది చెప్పేశారు,చెప్తున్నారు,చెప్తూనే ఉంటారు!

మతాలన్నీ కూడా నమ్మకం మీదనే ఆధారపడుతున్నప్పటికీ వారు ఇతరులలో తమ మతం పట్ల ఆదరణని పెంచుకోవడానికి పాండిత్యాన్ని ప్రదర్శించి మెప్పిస్తే క్రైస్తవులు తర్కంలో వాదించి గెలిచే పాండిత్యం లేకపోవటం చేత తమ బలిదానం ద్వారా ఇతరులలో కలిగే సానుభూతిని ఆశ్రయించి ప్రజలని మెప్పించారు,మెప్పిస్తారు!జీసస్ క్రీస్తు గనక విచారణ సమయంలో పాండిత్యాన్ని ప్రదర్శించి న్యాయాధిపతులు అడిగిన ప్రశ్నలకి హేతుబద్ధమైన జవాబులు చెప్పి ఉంటే శిలువ శిక్షకు గురై మరణించాల్సిన పని లేదు.

ఇతరులను మెప్పించే హేతుబద్ధత లేకపోయినా ఇతరుల చేత తమ ప్రతిపాదనలను ఒప్పించాలనుకున్నవారికి రెండే దారులు - నాలుగు తన్ని ఒప్పించడం,బుడిబుడి దుఃఖాలతో ఒప్పించడం.క్రైస్తవమతప్రచారకులు ఇప్పటికీ మొదట రెండవదారినీ తర్వాత మొదటిదారినీ అనుసరిస్తూనే ఉన్నారు.కాన్స్టాంటిన్ ప్రోత్సాహం లభించే వరకు ఏ మాత్రమూ హింసాయుతమైన తిరుగుబాట్లు చెయ్యలేదు,కష్టసమయంలో అంతటి భీకారమైన సహనాన్ని ప్రదర్శించినవారు రాజమతం హోదా దక్కగానే ఇతర మతాలనీ స్వమతస్థుల అవిధేయతనీ క్రూరంగా అణిచేశారు, ఇది క్రైస్తవులలోని రెండవ ప్రత్యేక లక్షణం!

ఈ రెండు లక్షణాలూ స్వతసిద్ధమైనవి కాగా రోమన్ పాలకుల అణచివేత వల్ల అనుసరించిన రహస్య జీవితం నుంచి నేర్చుకున్న క్రైస్తవ సహోదర తత్వం(Christian Brotherhood) అనే మూడవ ప్రత్యేక లక్షణం సమకూరింది!అంతర్గత స్వభావంలోని ఈ లక్షణాలు ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయి.కాన్స్టాంటిన్ ప్రోత్సాహం లభించడం వల్ల రాజమతం హోదా వచ్చింది గానీ అతని దృష్టిలో పడడానికి ప్లేగు వంటి భయంకరమైన వ్యాధులు విజృంభించినప్పుడు చావు భయం లేకుండా నిలబడి అందించిన వైద్యసేవల ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొనడమే కారణం - ఇప్పటికీ క్రైస్తవులు హాస్పిటళ్ళూ స్కూళ్ళ ద్వారానే ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు!

తొలినాళ్ళలో ఉనికి కోసం నిస్వార్ధంగా చేసిన సేవలు మలినాళ్ళలో మతాంతరీకరణ మెలిక పెట్టి చెయ్యడం వల్ల ఆ మతానికి అపఖ్యాతిని కూడా తెచ్చిపెడుతున్నాయి - నేటి సమాచార యుగ ప్రభావం వ్యతిరేకతను మరింత పెంచి ప్రజలలో ఆ మతం పట్ల ఉండాల్సిన నమ్మకం పునాదులు కదిలిపోతున్నాయి.చాలా దేశాలలో బైబిలు అమ్మకాలు తగ్గి చర్చిలు మూతబడుతూ ఉండటం ప్రత్యక్ష సత్యమై కనిపిస్తున్నప్పటికీ మతాధికారులు చేష్టలు దక్కి నిలిచి చూడటం తప్ప మతానికి ఆదరణను పెంచలేకపోతున్నారు.దాదాపు మిగిలి ఉన్న అన్ని చర్చిలలోనూ ఆదివారపు సెర్మన్లకు హాజరీ తగ్గుతున్నది - పిల్లడో పిల్లదో పుట్టినప్పుడు బాప్తిజం కోసం,పిల్లల పెళ్ళిళ్ళు జరిపించడం కోసం,కుటుంబంలో ఎవరన్నా చచ్చిపోయినప్పుడు జరిపించే కర్మకాండల కోసం తప్పిస్తే చర్చికి వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చెయ్యని పరిస్థితి చాలా మామూలు విషయమైపోయింది.రిపోర్టులు తెప్పించుకుని చూస్తే అన్ని రిపోర్టులలోనూ మతప్రచారకుల డొల్లతనమే కారణం అని తెలుస్తున్నది!వాగాడంబరంతో సరిపెట్టేసి డబ్బులు వెదజల్లి మాయమాటలు చెప్పి సంఖ్యని పెంచడం కోసం మోళీలు చేసేవారు తప్ప అంకితభావం కలిగిన మతప్రచారకులు దాదాపు శూన్యం!

ఎక్కడో మారుమూల పల్లెటూరిలోని చర్చి ఫాదరే కాదు, పోప్ వంటి స్థాయి గల వ్యక్తులే లైంగిక విశృంఖలతను ప్రదర్శిస్తూ దొరికిపోయి అవమానాల పాలవుతున్నారంటే ఆ మతం యొక్క నిజమైన పరిస్థితి ఎంతటి దుస్థితిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు!అసలు మతంలోనే డొల్లతనం ఉంటే మతప్రచారకులు ఎంత కష్టపడితే మాత్రం గట్టిదనం ఎలా వస్తుంది?

ఇప్పుడు క్తైస్తవం ప్రధానమతం హోదాని అనుభవిస్తున్న అన్ని దేశాలలోనూ ఆ మతం మూడు దశలలో ఎదిగింది - మొదటి దశలో బైబిలు గురించి గానీ అందులోని విషయం గురించి గానీ చెప్పకుండా విద్య, వైద్యం వంటి సేవాల్ ద్వారా తమకు మంచిపేరు తెచ్చుకుని అది తమ మతస్వభావం అని చెప్పుకుని ఇతరుల్ని ఆకర్షించడం ద్వారానూ కష్టాలలో ఉన్నవారి దగ్గిర చేరి ఓదార్పుల ద్వారా ధైర్యం చెబుతూ ధైర్యం కోసం చేసే ప్రార్ధనలతోనూ అంటిస్తారు,రెండవ దశలో పాత మతపు చాయల్ని వదిలించి కొత్త త్రిత్వానికి మాత్రమే బద్దుల్ని చేసే Inquisition ప్రక్రియని పాటిస్తారు,మూడవ దశలో పాత మతాల్లో ఉన్న అత్యంత ప్రభావశీలమైన వాటిని రంగూ రుచీ వాసనల వంటి సమస్తాన్నీ మార్చేసి క్రైస్తవంలోకి తీసుకుంటారు!

ఒక్క భారతదేశంలోనే కాదు inquisition అనేది ఎక్కడ జరిగినా గోవాలో జరిగినట్టుగానే ఉంటుంది.ఇంక్విజిషన్ ద్వారా గోవాని క్రైస్తవీకరించిన గ్జేచియర్ ఎక్కణించి వచ్చాడో ఆ పోర్చుగల్ గడ్డ మీద కూడా సా.శ 17వ శతాబ్ది చరకు ఇంక్విజిషన్ నడుస్తూ ఉండేది.అయితే,18వ శతాబ్దంలో చర్చి అధిపత్యం మీద తిరుగుబాటు జరిగిన తర్వాత ఆనాడు జరిగిన అరాచకాలు బయటపడి క్రైస్తవం ఇవ్వాళ పోర్చుగీసు గడ్డ మీద అవసాన దశలో ఉందని చెప్పవచ్చు!లెక్కలేనన్ని చర్చిల నుంచి మతాధికారుల్ని గెంటివేసి చర్చిల్ని మూసేశారు.అక్కడ 1910 నాటి చట్టాల ప్రకారం ప్రార్ధనల కోసమూ ఇతరమైన ఆహ్వానాల కోసమూ చర్చి గంటల్ని మోగించటాన్ని నిషేధించడమే కాకుండా చర్చి ఫాదర్లు చర్చిలలో ప్రార్ధనాసమయాల్లో గానీ మతక్రతువుల సమయాల్లో గానీ తొడిగే దుస్తులతో రోడ్ల మీద  తిరగడాన్ని కూడా నిషేధించారు!

ఒకనాటి పేరు మోసిన లూసిటేరియన్ సెల్టిక్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రోమన్ సామ్రాజ్యంలో ప్రముఖమైన ప్రావిన్సుల్లో ఒకటని పేరు గడించిన పోర్చుగల్,లూసిటామియా ప్రావిన్సులో మొదట క్రైస్తవానికి నీరు పోసి అది మూడు శతాబ్దాల తర్వాత ప్రాభవం పొందేవరకు కడుపులో పెట్టుకుని దాచిన పోర్చుగల్,ఆరవ శతాబ్ది నాటికే బ్రాగా నగరపు ఖ్యాతితో ఇద్దరు ఆర్చిబిషప్పుల్ని ప్రపంచానికి అందించిన పోర్చుగల్,సా.శ 711 నాటినుంచి కొంతకాలం పాటు వూపిరి సలపనివ్వని ఇస్లామిక్ ఉమయ్యద్ వంశీయుల దాడుల నుంచి తట్టుకోవడానికి క్రైస్తవం ద్వారా ఏకమై పోరాడి సా.శ 11వ శతాబ్ది నాటికి ఒక రాజ్యం హోదాని పొంది వాటికన్ పవిత్ర పరివారంలో భాగమైన పోర్చుగల్ నేడు ఆ మతాన్ని అంత ద్వేషించడానికి కారణం ఏమిటి?ఆ మతం యొక్క నిజమైన స్చభావం ప్రేమ, దయ, శాంతి ఆనె వాటిని పెంచటానికి బదులు అసమానతల్ని పెంచే దోపిడీదారుల్ని పాపక్షమాపణ పేరుతో ప్రోత్సహిస్తూ దోపిడీకి గురయ్యేవారికి తమ కష్టాలకి కారణమైన పాపులను క్షమించేలా పాపుల కోసం శిలువ యెక్కిన ఏసును కీర్తిస్తూ పెడుపులతో కూడిన ప్రార్ధనలకే పతిమితం చేస్తున్నదనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవడమే ఆ మార్పుకి కారణం!

భారతదేశానికి క్రైస్తవాన్ని పరిచయం చేసిన పోర్చుగల్ దేశం తనమీద బలంగా రుద్ది పరాయీకరించిన ఇంక్విజిషన్ దుర్మార్గాన్ని తెలుసుకుని తమకు ఇష్టం లేని మొదటి ప్రపంచయిద్ధంలోకి తోసిన వారెవరో గుర్తించి పూర్వ క్రైస్తవీయ కాలపు సాంస్కృతిక మూలాల్ని వెతుక్కుంటూ స్వాభిమాన పునరుద్ధరణ దిశలోకి నడుస్తుంటే భారతదేశంలోని క్రైస్తవులు మాత్రం అసలు క్రైస్తవం పుట్టినదే భారతదేశాన్ని ఉద్ధరించడం కోసమనీ క్రీస్తును గురించి వేదాల్లో కూడా ఉన్నదనీ రకరకాల పిట్టకధల్ని చెబుతూ తమని తాము మోసం చేసుకుంటూ ఇతరుల్ని మోసం చేస్తూ బతుకుతున్నారు.

ఇప్పటికే చాలాసార్లు చాలామంది చరిత్రకారులు ఎన్నో పరిశోధనలు చేసి అనేకమైన సాక్ష్యాధారాలను చూపించి అబద్ధం అని తేల్చి చెప్పిన తర్వాత కూడాసెయింట్ ధామస్ సా.శ 52 నాటికే ఇండియా వచ్చి కేరళ నంబూద్రి బ్రాహ్మణుల్ని పెద్ద సంఖ్యలో క్రైస్తవంలోకి మార్చేసి కొన్ని చర్చిల్ని కూడా కట్టినట్టు భారతీయ క్రైస్తవులు వాదిస్తున్నారు.సిరియాకీ ఇండియాకీ మధ్య సముద్ర వ్యాపారం అప్పటికే జరుగుతుండటం వల్ల వ్యాపారస్తులు కొందరు ప్రస్తావించారనడం ఒకటీ, poet, St. Ephrem చెప్పిన కవిత్వం రెండోదీ, The Indian Council for Historical Research (ICHR) కొన్ని రికార్డుల్ని బయటపెట్టిందనేది మూడోదీ వారికి బలమైన సాక్ష్యాలుగానే కనిపిస్తున్నాయి.కానీ ప్రపంచంలోని క్రైస్తవులకు అధికారికమైన వాటికన్ ఇప్పటికి చాలాసార్లు సెయింట్ ధామస్ ఇండియాకు రావడాన్ని తిరస్కరించడం వీరి వాదనలోని డొల్లతనాన్ని తెలియజేస్తున్నది!

M.G.S. Narayanan అనే ప్రముఖ చరిత్రకారుడు సెయింట్ ధామస్ అడుగుపెట్టి ఒక పెద్ద బ్రాహ్మణ సమూహాన్నే క్రైస్తవీకరించాడని చెబుతున్న కాలంలో కేరళ కారడవులతో నిండిన నిర్జనారణ్యం అని బల్లగుద్ది చెబుతున్నారు.పోనీ కొందరైనా జనం ఉన్నారని అనుకున్నా ఈ సెయింట్ ధామస్ క్రైస్తవంలోకి మార్చాడని చెబుతున్న నంబూద్రి బ్రాహ్మణ సమూహం సా.శ 6వ శతాబ్ది నుంచే కేరళలో స్థిరపడినట్టు వారిని గురించి పరిశోధించిన చరిత్రకారులు నిర్ద్వంద్వంగా చెబుతున్నారు.అసలు సా.శ 313లో కాన్స్టాంటిన్ గుర్తింపు ఇచ్చి పోత్సహించేవరకూ చర్చిలు కట్టాలనే ఆలోచన అక్కడివారిలోనే ఎవరికీ రాలేదు. ఆదీగాక ఆనాడు సెయింట్ ధామస్ నిర్మించాడని చెబుతున్న చర్చిలలో కనబడుతున్న శిలువ గుర్తు క్రైస్తవానికి అధికారిక చిహ్నమైనది సా,శ 272 తర్వాతనే - బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాట్ట వెనకటి కెవడో, వాడు కూడా వీళ్ళ ముందు సిగ్గు పడాల్సిందే!

ఈ సెయింట్ ధామస్సూ సిరియన్ క్రిస్టియన్ల కధలో ఇరుక్కుపోయిన రెండు కొసమెరుపుల్ని చెప్పి పోష్టుని ముగిస్తాను. మీకు బోరు కొట్టినప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే పుష్కళ యూరియాతో పండించిన వరికంకుల్లా మీ మొహాన నవ్వులు పూయడం ఖాయం!ఈ సెయింట్ ధామస్సు గారిని అక్షరాలా బైబిలు సాహిత్యమే Doubting Thomas అని వర్ణించింది - ఆఖర్న పునరుద్ధానం జరిగాక అప్పటి మాయామేయకాయపు చేతుల మీద గాయాల్ని చూసేవరకు అనుక్షణం అన్ని మహిమల్ని చూపించినా చచ్చినా యేసు దైవపుత్రుడంటే నమ్మను పొమ్మన్న సందేహాల్రావు ఈ ధామోసు గారు.అంతటి సనదేహపక్షినీ నమ్మించిన ఈ పునరుత్ధానమూ తర్వాత యేసు హిందూదేశం చేరి ఏదో ఒకచోట మామూలు చావును పొందడమూ మరొక హాస్యకదంబం.పునరుత్ధానం పట్ల బైబిలులో స్పష్టత ఉందా!

ఏసుక్రీస్తు పునరుత్థానం గూర్చి ప్రశ్నలు బైబిల్లో విరుద్ధమైన సమాధానాలు.
⏺యేసు సమాధిని చూడటానికి ఎంతమంది స్త్రీలు వచ్చారు?
🔹ఒకరు. యో. 20.1
🔹ఇద్దరు. మ. 28.1
🔹ముగ్గురు. మా. 16.1
🔹ఐదుగురు లేక అంతకన్నా ఎక్కువ మంది.  లూ. 24.10
⏺యేసు సమాధిని చూడటానికి స్త్రీలు(స్త్రీ) ఎప్పుడు వచ్చారు?
🔹తెల్లవారు జామున చీకటి వుండగానే. యో. 20.1
🔹సూర్యోదయం వేళ. మ. 28.1, మా. 16.2
⏺యేసు సమాధి దగ్గర స్త్రీలు ఏమి చూశారు?
🔹ఒక దేవదూతను. మ. 28.2
🔹ఒక యువకుడిని. మా. 16.5
🔹ఇద్దరు వ్యక్తులని. లూ. 24.4
🔹ఇద్దరు దేవదూతలని. యో. 20.12
⏺యేసు సమాధి వద్దకు స్త్రీలు వచ్చినప్పుడు సమాధి తెరిచి వుందా లేక మూసి వుందా?
🔹తెరిచి వుంది. మా. 16.4, లూ. 24.2, యో. 20.1
🔹మూసి ఉంది. మ. 28.2
⏺దేవదూతలు కానీ వ్యక్తులు కానీ స్త్రీలు వచ్చినప్పుడు సమాధి బయట ఉన్నారా లేక సమాధి లోపల ఉన్నారా?
🔹బయట ఉన్నారు. మ 28.2
🔹లోపల ఉన్నారు. మా. 16.5, లూ. 24.3-4, యో. 20.12
⏺యేసు బ్రతికి రావాటం గూర్చి స్త్రీలు యేసు శిష్యులకు వెంటనే చెప్పారా?
🔹చెప్పారు. మ. 28.8, లూ. 24.8-9
🔹చెప్పలేదు. మా. 16.8( ఇది మార్కు సువార్తలో చివరి వాక్యం, తర్వాత చెప్పబడ్డ వాక్యాలు ప్రాచీన వ్రాత ప్రతులలో వుండవు).
⏺యేసు సమాధినుంచి లేచిన తర్వాత మొదట ఎవరికి కనిపించాడు?
🔹మగ్దలేనే మరియ, మరియు ఇంకో మరియకి. మ 28.9
🔹మగ్దలేనే మరియకు. మా. 16.9, యో. 20.11-14
🔹క్లెయొపా మరియు ఇంకొకరికి. లూ. 24.13-16, 33
🔹పేతురుకి. 1 కొరి. 15.5
⏺యేసు మగ్దలేనే మరియకు కనిపించినప్పుడు, ఆమె ఏసుని గుర్తించిందా?
🔹గుర్తించింది. మ. 28.9
🔹గుర్తించలేదు. యో. 20.14
🔹అసలు మగ్దలేనేకు కనిపించలేదు. (యేసు బ్రతికి వచ్చాడని దేవదూతలు చెప్తారు.) లూ. 24.23
⏺సమాధి నుండి లేపబడిన యేసును తండ్రి వద్దకు చేరడానికి ముందల  ముట్టుకోవచ్చా ?
ముట్టుకోకూడదు. యో. 20.17
ముట్టుకోవచ్చు. మ. 28.9, లూ. 24.39, యో. 20.27
⏺యేసు సమాధి నుంచి లేచిన తర్వాత తన శిష్యులను ఎక్కడకు వెళ్ళమని చెప్పాడు?
🔹గలిలయకు. మ. 28.10, మా. 16.7
🔹యెరూషలేముకు. లూ. 24.49, అ. కా 1.4

అంతకుముందు అన్ని సందేహాలతో విసిగించిన డౌటింగ్ ధోమాసు గారు ఇంత గందరగోళాన్నీ గబుక్కున నమ్మేసి భారద్దేశానికి వచ్చేసి కేరళ బ్రాహ్మణుల్ని క్రైస్తవీకరించేసి అప్పటికి క్రైస్తవులెవరూ వూహించని శిలువ గుర్తులతో ఆలంకరించబడిన ఎనిమిది చర్చీలు కట్టేసి మైలాపూరులో తమిళ బ్రాహ్మణుల చేతుల్లో చచ్చిపొయ్యాడా?ఓసింతేనా అనుకోమాకండి, ఈయన్ని యేసు కవల సోదరుడని కూడా చెబుతారు - వామ్మో!ఇది ఒక మెరుపు - అయ్యిందా, నవ్వొచ్చిందా!

ఇంక ఏనుగు చచ్చినా ఏనుగే అన్నట్టు మతం మారిన ఈ నంబూద్రి బ్రాహ్మణోత్తములు తమ పిలకనీ,జంధ్యాన్నీ,పప్పునీ,అంటునీ,సొంటునీ వదిలిపెట్టేది లేదు పొమ్మని భీష్మించుకుంటే వాటికన్ ప్రత్యేక అనుమతి ఇచ్చేసింది - హిందువులు ముఖ్యంగా బ్రాహ్మణులు అస్పృశ్యతని పాటించడం వల్లనే ఆ దుర్మార్గానికి గురయినవారు క్రైస్తవంలోకి వెళ్ళి అస్పృశ్యతను తొలగించుకుని క్రైస్తవమతసమాజంలో గౌరవప్రదమయిన స్థానాన్ని పొందగలిగారని వాదించేవారు చర్చి సిరియన్ క్రైస్తవులకి ఇచ్చిన ప్రత్యేకహోదాని ఎట్లా సమర్ధిస్తారో!

అసలు భారతదేశపు సామాజిక చరిత్రలోకి అస్పృశ్యత ఎప్పుడు ప్రవేశించిందనే మూలం కనబడటం లేదు నాకు ఎంత వెతికినా, ఎందుకో? సతీ సహగమనం,బాల్యవివాహాల లాంటి ఎన్నో దురాచారాలకి మూలాలు తేలిగ్గా దొరుకుతున్నాయి.తర్వాతి కాలంలో దురాచారం అయినవి మొదటి దశలో ఒక సదాచారంగానే మొదలయ్యాయి.ఉదాహరణకి సతీ సహగమనం తురుష్కుల దాడిలో అతి ముఖ్యమైనది స్త్రీలను చెరచటం గనక దానినుంచి తప్పించుకోవడానికి పెద్ద సంఖ్యలో అనుసరించాల్సి వచ్చింది!అలాగే బాల్యవివాహాలు అప్పటి సామాజిక అవసరాన్ని బట్టే ఏర్పడినాయని ఆ సమస్య మూలాల్ని పరిశోధించినవారు చెబుతున్నారు.కానీ అస్పృశ్యత అనే దురాచారం యొక్క మొదటి దశకి సంబంధించిన సమాచారం చాలా తక్కువగా కనిపిస్తున్నది, ఏమిటీ వింత?

నాకు తెలిసి పూ.సా.శ 1500 నాటి వైదిక సమాజంలో కులవ్యవస్థ కాదు గదా వర్ణవ్యవస్థ కూడా బలమైన స్థాయిలో లేదు.ఆ విషయం కంచె అయిలయ్య లాంటి కరుడు గట్టిన హిందూమతద్వేషి కూడా ఒప్పుకునేటంత పచ్చి నిజం!అప్పుడే కాదు ఎప్పుడూ పుట్టుకని బట్టి వర్ణాన్ని నిర్దేశించిన దాఖలాలు లేవు!

కల్యాది అని చెప్పబడుతున్న పూ.సా.శ 5000 సమవ్త్సరాల వెనకటి నుంచి భరతఖండంలోని అనేక ప్రాంతాలను యేలిన రాజులలో చాలామంది శూద్రులే అని వారి వంశావళులే తెలియజేస్తున్నాయి.ఇంక పూ.సాశ 300 నుంచి సా.శ 300 వరకు దాదాపు 600 సంవత్సరాల పాటు ఈనాటి భారతదేశపు భూభాగంలో అధికశాతాన్ని పాలించిన ఆంధ్ర శాతవాహనుల కాలంలో ఆయా ఉత్పత్తిదారుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన ఉత్పత్తుల వారీ శ్రేణులే తదనంతర కాలంలో కులాల పేరుతో సంఘటితం అయ్యాయని   చరిత్రని నిజాయితీగా అధ్యయనం చేసిన వారందరికీ తెలుస్తుంది.

కొన్ని వ్యవసాయం మీదా కొన్ని ఇతరమైన ఉత్పతి ప్రక్రియల మీదా ఆధారపడిన ఈ వృత్తిని బట్టి ఏర్పడిన కులాలు,ఉపకులాలు సుమారు 5000 పైచిలుకు లెక్కకి తేల్తున్నాయి.వీటిలో కేవలం ఒక నాలుగైదు కులాలే భయంకరమైన స్థాయిలో అస్పృశ్యతకి గురి కావడమూ వీటినుంచే అధికులు క్రైస్తవ మహమ్మదీయ మతాలలోనికి వెళ్ళడమూ వెళ్ళిన తర్వాత కూడా వారి సామాజిక స్థాయి కేవలం మతం మారినందువల్ల మెరుగుపడకపోవడమూ చూస్తుంటే అస్పృశ్యతకీ మతమార్పిడికీ సంబంధం లేదని తెలియడం లేదా?

సిరియన్ క్రైస్తవులు అని పిలిచే నంబూద్రి బ్తాహ్మన వారసత్వపు శాఖ ఇప్పటికీ కులచాందసవాదాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు!హిందూమతంలో గౌరవం లేదని మతం మారుతున్న అస్పృశ్య కులాల వారు క్రైస్తవమతంలోని ఈ అసమానతల్ని రద్దు చేసే విధంగా చర్చి మీద గానీ వాటికన్ మీద గానీ ఒత్తిడి పెటగలిగిన స్థితిలో ఉన్నారా?ఇవ్వాళ వారికి గౌరవాలు దక్కుతున్నది కూడా ఆర్ధికంగా పైమెట్టుకి ఎక్కడం వల్లనే తప్ప మతం మారినందువల్ల వస్తున్న గౌరవప్రపత్తులు ఏమీ లేవు,అవునా?వ్యాసపరాశరాదిషిర్డీసాయినాధపర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల సాక్షిగా నేను చెప్తున్నది ఒకటే - "కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలుగు" నన్న వేమన్నయే "కలిమి లేని వాని కులము దిగు" నని  చెప్పినది అక్షరసత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!

Sunday, 19 August 2018

నాలాంటి ఒక సామాన్యుడు ఇప్పటికిప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కాగలడా?


మిత్రులారా!

నేను బ్లాగులకి మాత్రమే పరిమితం కాకుండా క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్ళాలని అనుకుంటున్నానని మీకూ తెలిసే ఉండొచ్చు.మా అమ్మాయి పెళ్ళి కావడం అనే లిమిట్ పెట్టుకున్నట్టు కూడా చెప్పి ఉన్నాను గాబట్టి అదీ తెలిసే ఉండొచ్చు.బహుశా,2019 జూన్ నుంచి డిసెంబర్ లోపు మా అమ్మాయి పెళ్ళి జరిగే అవకాశం ఉంది.కానీ కొద్ది రోజుల క్రితం కొత్త ఆలోచన ఒకటి వచ్చి దాని పూర్వాపరాలను అంచనా వేసుకున్నాను.పెళ్ళికీ దీనికీ ముడి పెట్టకుండా పొలిటికల్ యాక్టివిటీ మొదలుపెట్టడమే మంచిది అనే వూహ వచ్చింది.

నిజానికి నేను "శ్రీ రాఘవం!శ్రీ మాధవం!" పుస్తకం రెండు ఉద్దేశాలతో పుస్తకరూపంలో తీసుకొచ్చాను.ఒకటి,ఇంతముకుముందు e-publishing లేదు కాబట్టి విశ్వనాధ,శ్రీశ్రీ లాంటివాళ్ల రచనలు అచ్చులో సాక్ష్యం ఉన్నాయి వాళ్ళు రచయితలు అనేటందుకు.ఆ ఒరవడిలో నా పేరుతోనూఒ ప్రింటులో ఒక పుస్తకం ఉండాలి అనుకున్నాను.ఆ లక్ష్యం నెరవేరింది గానీ రెండవదైన నేను ఆశించిన ఫోకస్ రాలేదు.పబ్లిష్ చేసిన జ్యోతి వలబోజు గారు కూడా చెప్తూనే ఉన్నారు ఇప్పుడు ప్రజల్లో పుస్తకపఠనం పట్ల ఆసక్తి తగ్గిందని.అయినా,మరీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు.

ఇప్పుడు నా కొత్త ఐడియా ఏమిటంటే "తొక్కలో కమ్యునిజాన్ని చితక్కొట్టేద్దాం, రండి!" పేరుతో ముప్పాళ రంగనాయకమ్మ హిందూమతం మీద చేసిన దాడి గురించీ కమ్యునిష్టు సిద్ధాంతం గురించీ నేను వేసిన పోష్టుల్నీ కలిపి ఒక  కొత్త పుస్తకం తయారు చేశాను.మొదటి పుస్తకం ద్వారా వచ్చిన నష్టం కన్న రాని పాప్యులారిటీ గురించిన బెంగే ఎక్కువ!కాబట్టి దీని మీద డబ్బు ఆశించకుండా కేవలం భావాల ప్రచారం కోసం ప్రయత్నం చేద్దామని ఉంది.అయితే,నా ఉద్యోగ రీత్యా ఒక్క రోజు కూడ చెన్నై దాటి కదల్లేని పరిస్థితి ఉంది. అదీగాక నాకు పరిచయాలు కూడా తక్కువే!

జరిపించాల్సిన కార్యక్రమం గురించి నా ప్లాను యేమిటంటే, డాక్యుమెంట్ పంపిస్తాను.దాన్ని కమ్యునిష్టు పార్టీ/సిద్ధాంత వ్యతిరేకుల ముందు పెట్టాలి.వాళ్ళకి ప్రచురణ పట్ల సొంత బాధ్యత తీసుకునే ఉత్సాహం పుడితే వాళ్ళకీ ధర పెట్టి అమ్మితే లాభం వస్తుందనిపిస్తే నాకూ హుషారుగా ఉంటుంది.అదేమీ లేకపోయినప్పటికీ సొంత బాధ్యత తీసుకుని ప్రింట్లు తీసి ఉచితంగానే కేవలం భావాలకి ప్రచారమూ నాకు క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్ళడానికి తగిన ఫోకస్ రప్పించగలిగితే మన హిందూమతానికి గౌరవం పెరుగుతుంది!

దీని ప్రచారం పట్ల ఉత్సాహం ఉన్నవారు మీ మెయిల్ ఐడిని ఇస్తూ కామెంటు పెడితే మెయిల్ బాక్సు నుంచి అటాచ్మెంటుగా రిప్లై ద్వారా పంపిస్తాను.మోడరేషన్ ఉంది కాబట్టి నాకు మీ మెయిల్ ఐడిని అందిస్తున్న కామెంటును పబ్లిష్ చెయ్యను. 

నేను రాజకీయాల్లోకి వెళ్ళడానికి కొన్ని తాత్కాలిక లక్ష్యాలూ కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలూ ఉన్నాయి.తాత్కాలిక లక్ష్యాలలో అయోధ్య,కాశీ.మధుర ఆలయాలని వీలున్నంతవరకు సామరస్యంగానే ముస్లిముల నుంచి విడిపించుకుని కొత్త ఆలయాల్ని నిర్మించడం వంటివి ఉన్నాయి.

దీర్ఘకాలిక లక్ష్యాలు:
1. మెకాలే తరహా విద్యావిధానాన్ని కూకటివేళ్లతో సహా పెకలించి నూతన విద్యావిధానంతో మన కుర్రాళ్ళని ఎక్కడికెళ్ళినా శిఖరాగ్రంలోనే ఉండేలా తీర్చిదిద్దాలి.
2. వ్యవసాయాన్ని లాభసాటి చేసి పరిశ్రమలకి దీటుగా నిలబెట్టాలి.
3. మొత్తం ఆర్ధికరంగాన్ని ఒకప్పుడు 1700 సంవత్సరాల పాటు ప్రపంచపు సంపదలో మూడోవంతును సృష్టించగలిగిన స్థాయికి పెంచి చూపించాలి.

ఇవన్నీ గాలికబుర్లు కావు,నా బ్లాగు పోస్టులకి నేను చేస్తున్న రీసెర్చి యే స్థాయిలో ఉంటుందో మీకు తెలుసు.ఇప్పటికే కొంత క్లారిటీ ఉంది యెలా చెయ్యాలో.వస్తే కొండ, పోతే దారం అన్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠానికే గురి పెడుతున్నాను గానీ కనీసం సభలో చెప్పుకోదగిన స్థాయిలో ప్రాతినిధ్యం ఉన్నా చాలు - వీటిని కార్యరూపంలోకి తీసుకు రాగలను.

నా చూపు లొక్ సత్తా మీద ఉంది. ఎందుకంటే ఇలాంటి R&D మిగతా పార్టీల్లో చెయ్యడం కుదరదు.ఒకవేళ నేను హిందూత్వం గురించి పనిచెయ్యడం పట్ల అక్కడివాళ్ళకి వ్యతిరేకత వస్తే బీజేపీ నా ఫైనల్ చాయిస్ అవుతుంది.ఇప్పుడు భాజపా పాటిస్తున్న హిందూత్వ రాజకీయాలతో నాకు విభేదాలు ఉన్నప్పటికీ ఏ పార్టీలో ఉన్నా సరే హిందూత్వం పట్ల నిబద్ధతని మాత్రం వొదులుకోను.

నేను తెలుగువాణ్ణి కదా, తమిళనాడులో ఎందుకు?తెలుగు రాష్ట్రాల్లో ప్రయత్నించవచ్చు కద! ఆని మీకు సందేహం రావచ్చు.కొందరు మిత్రులు దాన్ని ప్రస్తావించారు కూడాను.నా రేషన్ కార్డూ వోటర్ కార్డూ తమిళనాడులోనే ఉన్నాయి.ఒకసారి వోటు కూడా వేశాను.నేను అనామకుడి స్థాయి నుంచి కనీసం ఈ స్థాయికి  రావడం తమిళనాడులో జరిగింది అనే కృతజ్ఞత ఒకటి ఉంది.అదీ గాక ఇక్కడి ద్రవిడ రాజకీయాలు తమిళనాడుని మిగిలిన భారతదేశపు వైదిక సంస్కృతిలో కలవనివ్వకుండా చేస్తున్నాయి.ఒ ఆంధ్రా తమిళనాడు నుంచి విడిపోకముందు తెలుగువాళ్ళు ఇక్కడి రాజకీయాల్లో గొప్పగా వెలిగారు.విడిపోయాక ద్రవిడ జాత్యహంకారులు తెలుగువాళ్లని తొక్కేస్తున్నారు.తమిళుల్లో కూడా అందరూ ద్రవిడ రేసిస్టులు కారు,మనది వైదిక సంస్కృతి అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు.

సనాతన ధర్మం చెప్పే అమరాసుర సమరంలో ఉన్న విశేషం యేమిటో తెలుసా!ఒక ప్రాంతంలో ఒక సమాజంలో కొందరు సమాజాన్ని ఒక వైపుకి పట్టి లాగుతుంటే దాన్ని మళ్ళీ బ్యాలెన్సు చెయ్యాలంటే మిగిలినవాళ్ళు రెండోవైపుకి రెట్టించిన బలంతో లాగాలి.నాకు ఇప్పుడు ఆ అవసరం/అవకాశం తమిళనాడులో కనిపిస్తున్నది.ఒకసారి మినిమం ఫోకస్ వచ్చాక తమిళనాడులోని తెలుగువాళ్లనీ ద్రవిడ రేసిస్టు వ్యతిరేకుల్నీ నేను గుప్పిట్లో పెట్టుకోగలిగితే తమిళనాడు రాజకీయాల్ని నా చుట్టూ తిప్పుకోవచ్చు.ఆంధ్రాలోనూ తెలంగాణలోనూ నాకు ఈ అనుకూలత లేదు.ఇక్కడ నా ప్లాను సక్సెస్ అయితే నాకు పైన పెత్తనం చేసేవాడు ఎవడూ ఉండడు.అదే మిగతా చోట్ల అయితే రెండో వరసలో సర్దుకోవాలి.

ఆటస్థలం సిద్ధమయ్యింది.ఆటగాడు మంచి వూపు మీదున్నాడు.పిస్టల్ మోగడం ఆలస్యం ఉరకడం మొదలుపెడతాడు.పిస్టల్ పేల్చాల్సింది మీలాంటి మిత్రులు!

రచ్చబండ దగ్గిర చర్చ ఇప్పుడే ముగించాను.అసలు పని మొదలైంది.నా ప్లాను ఏమిటో చదివి క్షేత్రస్థాయిలో జనం గురించి తెలిసిన అవగాహనతో అసలు ప్లాను వర్కవుట్ అవుతుందా లేదా అనేది చెప్పాలి.ఒకవేళ స్థూలంగా ప్లాను బాగానే ఉండి కొన్ని తప్పులు ఉంటే సరి చెయ్యాలి.నేను తమిళనాడు నుంచే ఎందుకు పైకి రావాలనుకుంటున్నానో చెప్పిన దాంట్లో మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా?

నిన్నటివరకు ముసలాడి చావుతో సానుభూతి వస్తుంది,స్టాలిన్ అదృష్టమనుకున్నది కాస్తా అళగిరి దెబ్బకి తారుమారయింది చూశారా?జయలలిత చావు సానుభూతిని AIDMK వాళ్ళు వాళ్ళలో వాళ్లు తన్నుకుని పోగొట్టుకున్నారు.ఇక్కడ ఇలా ఉంది.అందుకే నేను ఇక్కడ రంగంలోకి దిగాలని అనుకున్నది.తమిళనాడు సీట్లు 235లో మొదటి అడుగులోనే ఫుల్ మెజారిటీ తెచ్చుకుని ఒకే వూపులో ముఖ్యమంత్రి అయిపోలేను.కానీ నా వాగ్ధాటితో చరిష్మాతో 10 నుంచి 50 మందిని అసెంబ్లీకి పంపగలిగితే చాలు - "ఎవడ్రా వీడు!" అనే ఫోకస్ వస్తుంది.

అవినీతిని కవర్ చేసుకోవడానికి వాడుకుంటున్న ద్రవిడ ముసుగుని నేను తెలుగు అస్తిత్వం పేరుతో నిలదియ్యాలని అనుకుంటున్నాను.నిజానికి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోకముందు ముఖ్యమంత్రుల లిస్టు చూస్తే అప్పటి తమిళనాడు రాజకీయాల్లో తెలుగువాళ్ళే ఎకువ చురుగ్గా ఉన్నారని తెలుస్తుంది.కానీ రాష్ట్రం విడిపోగానే తెలుగువాళ్ళు హఠాత్తుగా సైలెంట్ ఎందుకయ్యారో,వయ్యాపురం గోపాలకృష్ణ వైగో అని పేరు మార్చుకుంటే తప్ప పనికిరాని దుస్థితి ఎందుకొచ్చిందో అర్ధం చేసుకోచాలి - అప్పుడే నా అవగాహన సరైనదేనని తెలుస్తుంది!

రాష్ట్రం విడిపోకముందు ఏమాత్రం నదురూ బెదురూ లేకుండా ముఖ్యమంత్రులే కాగలిగిన తెలుగువాళ్ళు విడిపోయాక సొంత ఉనికినే మర్చిపోయి తమిళీకరించుకోవాల్సిన అవసరం ఏమిటి?అటువైపు నుంచి వచ్చిన ఒత్తిడి కన్న తెలుగువాళ్ళలోని లొంగుబాటే ఎక్కువ అని నా అనుమానం.పై స్థాయిలోనివాళ్ళు లాభాల కోసం దిగజారితే దిగజారవచ్చు గానీ క్షేత్రస్థాయిలో అలా లేదు.కొన్ని ప్రాంతాలు జిల్లాలకి జిల్లాలూ వూళ్ళకి వూళ్ళూ తెలుగువాళ్ళు బలంగా ఉండి లోకల్ ఎన్నికల్లో తెలుగు అస్తిత్వాన్ని పోగొట్టుకోకుండానే ఎన్నికల్లో గెలుస్తున్నారు.అప్పుడప్పుడు చూస్తున్న వింటున్న ఎన్నికల వార్తల్లోనే ఇది తెలుస్తున్నది!

అంటే, అసెంబ్లీ స్థాయిలో టిక్కెట్లిచ్చే పార్టీ పెద్దలు కండిషన్లు పెట్టి జనానికి తెలుగువాళ్ళని దూరం చెయ్యడం వల్లనే వయ్యాపురం గోపాలకృష్ణ వైగో అని పేరు మార్చుకోవాల్సిన దుస్థితి దాపరించిందని తెలియడం లేదూ!ఈ మిధ్యని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉందని మీకు అనిపించడం లేదూ!

తమిళనాడులోని తెలుగు పొలిటీషియన్లు లోకల్ రేంజితో సరిపెట్టుకుంటున్నారు గానీ అసెంబ్లీ స్థాయికీ లోక్ సభ స్థాయికీ ఎదగాలని అనుకోవడం లేదు.నేను అక్కడ మోటివేట్ చెయ్యాలని అనుకుంటున్నాను.నాకు తమిళం రాకపోవడం మైనస్ పాయింటే గానీ దాని మూలంగా ఈ ప్లాను వెయ్యటం లేదు.తప్పనిసరైతే తమిళం నేర్చుకోవడానికి అభ్యంతరం ఏమీ లేదు.కానీ 2006 నాటి ఎడ్యుకేషన్ బిల్లు లాంటి దుర్మార్గాల్ని అడ్డుకోవాలంటే తెలుగువాళ్ళు కొంతమేర తెలుగు అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి.

ఇది ప్రజల్ని చీల్చేటట్టు కాకుండా తెలుగువాళ్ళకి మరింత ఎక్కువ పొలిటికల్ రిప్రజెంటేషన్ కావాలి అనే విధంగా తెలుగు వాళ్ళని మోటివేట్ చెయ్యడమే నా ప్లాను.అయితే ఒక బలమైన గ్రూపు తయారైన వెంటనే మిగతావాళ్ళు గుర్తుపట్టడం ఖాయం.వాళ్ళు గుర్తు పట్టకుండా ఎంతకాలం మ్యానేజి చెయ్యగలను అనేది నా తెలివికి నిదర్శనం అవుతుంది.ఒకవేళ వాళ్లు గుర్తు పడితే ఆ ఫోకస్ ఎటూ ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఇక వదిలేసి తమిళుల్ని కూడా కలుపుకుని పోవడానికి కూడా రెడీయే!

ఇది స్థూలమైన ప్లాను.ఇంక సూక్ష్మ స్థాయి ప్లాను యేంటంటే నా మూడు లక్ష్యాలు 1.వ్యవసాయాన్ని లాభసాటి చెయ్యడం,2.విద్యావ్యవస్థని ఇప్పటి కాలానికి కనెక్ట్ చెయ్యడం,3.మొత్తం తమిళనాడు ఆర్ధిక వ్యవస్థని సా.శ 1వ శతాబ్దం నుంచి సా.శ 17వ శతాబ్దం వరకు ప్రపంచ అసంపదలో నాలుగోవంతు నుంచి మూడోవంతు వరకు ఆక్రమించిన భారతదేశపు ఆర్ధికవ్యవస్థలా నిలబెట్టడం.వాటికి పెద్ద యెత్తున పరిశోధన అవసరం.అది నేను ఒక్కణ్ణే చెయ్యడం కుదిరే పని కాదు.

యెటూ నా మొదటి ప్రిఫరెన్స్ లోక్ సత్తా కాబట్టి అక్కడ ఇప్పటికే చాలా పని పూర్తయి ఉండాలి.అది చాలదు అనిపిస్తే  మనం ఎన్నుకున్న నియోజకవర్గాలకి ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించాలనుకున్నవాళ్ళకే ఆ పని అప్పగించాలి.మిగతా పార్టీల్లో లాగా ఎన్నికలప్పుడే అభ్యర్ధుల్ని ప్రకటించడంలా కాకుండా ముందుగానే "ఈ నియోజకవర్గం నీది.దీనికి సంబంధించి నువ్వు సమాచారం సేకరించు.ఈ ప్రాంతంలో ఉన్న ఆర్ధిక వనరులు ఏమిటి?మొత్తం ఏరియాలో ప్రతి అడుగునీ ఉపయోగించుకోగలిగితే మొత్తం ఎంత సంపదని సృష్టించవచ్చు!" అనే డాటా కలక్ట్ చేసుకు రమ్మని చెప్పాలి.అన్ని నియోజక వర్గాల సమాచారాన్నీ నేను కలక్ట్ చేసి దగ్గిర పెట్టుకుంటే మీడియా ముందూ ప్రజల ముందూ మాట్లాడి నెగ్గుకురావటం సులువు కదా!

ఇదంతా ఎందుకంటే లోక్ సత్తాకి ఒక చిత్రమైన పరిస్థితి ఉంది.నా పాత పోష్టు "చిత్రమైన గొప్పవాళ్ళు!" చదివారా?చదువుకున్నవాళ్ళు కూడా "లోక్ సత్తా మంచిదే కానీ గెలిచే పార్టీ కాదుగా!" అంటున్నారు.అంటే, పత్రికల్లోనూ మీడియాలోనూ పాల్గొనే చర్చలతోనూ రాస్తున్న వ్యాసాలతోనూ మేధావులనే ముద్ర పడుతున్నది గానీ మేము గెలిచి ప్రభుత్వంలోకి వస్తే తప్పకుండా మీ జీవితాల్ని బాగు చేస్తాము అని అందరికీ అర్ధమయ్యే భాషలో చెప్పే వాగ్ధాటి వాళ్ళలో తక్కువ.నాకది ఉంది గానీ చెప్పడానికి మ్యాటర్ లేందే నాకు గొంతు పెగలదు!

పోష్టులు రాయడానికి ముందు మ్యాటర్ పోగేసుకుని నానా తిప్పలూ పడి దాన్ని హైలైట్ చెయ్యగలుగుతున్నట్టే అక్కడా చెయ్యగలిగితే లోక్ సత్తాని మెయిన్ స్ట్రీం డయాస్ మీదకి తీసుకు రావచ్చు.నాకయితే ఈ ప్లానులో అందమైన కలలు కన్నట్టు కాకుండా సాధ్యమైనంతవరకు ప్రాక్టికల్  వేలోనే వెళ్ళానని అనుకుంటున్నాను.మీ అభిప్రాయం చెప్పాలి.

ప్రత్యేకంగా అడక్కపోయినా మీరు మొహమాటం లేకుండానే చెప్తారనుకోండి,అయినా నావైపు నుంచి నేనూ జోకులేయించుకోవడానికి రెడీగానే ఉన్నాను.మరీ తల వాచే చివాట్లలానూ కుళ్లి చచ్చే వెక్కిరింతల్లానూ కాకుండా చెప్తే నేనూ సరదాగానే తీసుకుంటాను:-)

ఇట్లు 
భవదీయుడు
హరి.S.బాబు