Monday 27 July 2015

శివ బాహుబలి అవంతికని రేప్ చేశాడా?చీ పాడు!అవంతిక కిదేం పోయేకాలం, కిమ్మనకుండా వూర్కుంది?


          ఇద్దరూ ఇద్దరే!అతనేమో పంతం పడితే శివుణ్ణే పెకలించి తల్లి కోసం ప్రతిదిన గంగాభిషేకం చేయించగలడు!చిన్నప్పట్నించీ అతని చూపంతా ఆకాశం వైపుకే - అక్కడ యేముంది?యెవరెవరు ఉంటారు?నన్నేదో బంధం అక్కణ్ణించి లాగుతున్నట్టుంది - యెందుకని?మరొకరెవరో చెట్టులెక్కగలవా ఓ బాహుబలి పుట్టలేక్కగలవా అని పందెం వెయ్యకుండానే నిర్ణయించేసుకున్నాడు - యెప్పటికయినా ఆక్కడికి చేరాలి!దానికి తోడు ఒక రోజు పైనించి జారిపడిందో చందమామ లాంటి ముఖారవిందాన్ని పోతపోసుకున్న ప్రతిబింబం.పైనించి జారిపడింది గాబట్టి పైకెళ్తే తను ఖచ్చితంగా దొరకొచ్చు?పెళ్ళీడుకొచ్చిన కుర్రాడికి అందమయిన పెళ్ళాం కూడా వస్తుందంటే ఇంక ఆగుతాడా?ఇదివరకు యెక్కలేని యెత్తుని కూడా అమాంతం యెక్కేశాడు కళ్ళ ముందు కావ్యనాయిక ఇంకొంచెమే,ఇంకొంచెమే,ఇక్కడే వున్నా,ఓ పదడుగులు - అంతే అని  రెచ్చగొడుతుంటే అలసటని కూడా హుషారుగా మార్చుకుంటూ!తీరా చూస్తే ఆ అమ్మాయి పెద్ద కష్టంలో ఉన్నట్టుంది!?వెంటాడుతున్న వాళ్ళని తప్పించుకోవడానికి ఆపసోపాలు పడుతూ పరిగెడుతుంటే తనిప్పుదు రక్షించాలి  గాబట్టి తనూ వాళ్ళ వెనకాల పరిగెత్తాడు.ఆఖరి సీనులో గానీ అర్ధం కాలేదు అంత సుకుమారంగా ఉన్న మొహాన్ని చూసి తను చొల్లు కార్చుకుంటూ వస్తే ఇక్కడ కనబడుతున్నది చెట్లమీద ఉన్న స్నేహితులు శస్త్రమందిస్తే కన్ను మూసి తెరిచేలోగా ఒక్కణ్ణి కూడా మిగల్చకుండా వాళ్ళ కుత్తుకలు నరికేసిన సివంగిని అని!
అదంతా చూసిన మనోడికి ఇక్కడ ముఖద్వారం మూసుకుపోయింది గాబట్టి పెరటిదారి మాత్రమే శ్రేయస్కరం అనిపించింది!దాంతో లేడికన్నుల చినదాన్ని పట్టడం కోసం లేడిని వేటాడే శార్దూలవ్యూహం పన్నాడు!యెంత లక్ష్యం కోసం సుఖసంతోషాలని త్యాగం చేసి బతుకుతున్నా మరీ క్రూరంగా ఇరవైనాలుగుగంటలూ అదే పిచ్చిలో ఉండలేరుగా యెవరూ?అలజడి రేపే భావాలు మనస్సును వేడెక్కిస్తే చల్లదనాన్నీ,యేకాంతాన్నీ,నిద్రనీ కోరుకోవటం మానవసహజం.ఆమె కూడా అదే కోరుకునింది.ఇట్లాంటప్పుదు యెలా ప్రవర్తించాలనే ఉపాయాలు ఆడవాళ్లకి భలే తెలుస్తాయి!పరధ్యాన్నంగా ఉన్నట్టూ స్నేహితురాలు మాట్లడడానికి ప్రయత్నించినా మౌనంగా ఉండిపోయి చేష్టల ద్వారానూ తనతో కలిసి రావడాని కిష్టం లేదనే సందేశం పంపించి, స్నేహితురాలు అర్ధం చేసుకుని దూరంగా వెళ్ళగానే యే  రకమైన సందేహాలూ లేకుండా అలా నిద్రలోకి జారుకుంది.వొళ్ళు తెలియని నిద్రలో చెయ్యి నీటిలోకి జారింది.పొంచివున్న మేటి కళాకారుడు తనపని తను చేశాడు.యెంత మొద్దునిద్రలో ఉన్నా కుంచె కదులుతున్న అనుభూతి కూడా రానివ్వకుండా యెట్లా గీశాడు?కళలోని మెళకువ కన్నా ప్రియురాలి మెలకువని కోరుకోని అనురాగంతో చేశాడా!

నిద్రలేచి చేతివైపు చూసుకున్న అవంతికకి అధ్భుతాశ్చర్యానందక్రోధావేఅశాలు ఒక్కసారిగా చుట్టుముట్టి కలవర పెట్టినాయి.యెవరు చేశారో తెలియదు!యెట్లా చెయ్యగలిగారో తెలియదు!యెలా స్పందించాలో తెలియదు!అక్కడె ఆలాగే ఉంటే ఇంకా చెడిపోతానేమోననే కంగారుతో అక్కణ్ణించి త్వరగా జారుకుంది.పాము కాటు వేస్తే విషం లాగేసినా గాయం వెంటనే మానదు గదా,ఇక్కడ కాటు వేసింది శ్రంగార సర్పం మరి!ఉద్యమ నాయకుడి దగ్గిర అవమానం మరింత పంతాన్ని పెంచింది - యెవరో ఆ పని చేసింది యెలాగైనా కనిపెట్టి పనిపట్టాలని.అవంతిక వ్యూహమూ బ్రహ్మాండంగానే ఉంది.ఆ పని చేసింది మగవాడేనని తెలిసిపోయింది!ఒక ఆడదానికి ఐ లవ్ యూ చెప్తున్నట్టు చేతి మీద బొమ్మ గీసి నేనెవరో కనుక్కో చూద్దాం అని దాగుడుమూతలు ఆడటం లాంటి చిలిపిపనులు మరో ఆడమనిషి చేస్తుందా?స్నేహితురాల్ని తనలా పడుకోమంది,ఒకసారి వచ్చినవాడు మళ్ళీ వస్తాడని అనుకోవటం వరకూ అంచనా నిజమే గానీ అలానే వస్తాడని అనుకోవడమే ఆమె చేసిన తప్పు!అప్పుడు నీటిలో చేపలా వస్తే ఇప్పుడు గాలిలో పక్షిలా వచ్చాడు.యెటునుంచి వచ్చినా చూసేందుకు వీలుగా చెట్టెక్కి నిలబడి ఆకర్ణాంతం నారి సారించి చూపుని భ్రూమధ్యంలో నిలిపి యేకాగ్రంగా చూస్తున్న అవంతిక వీరతాసౌందర్యాన్ని ముచ్చటగా చూస్తూ మరోసారి తనపని కానిచ్చేసుకున్నాడు!యెక్కడ నుంచి పట్టుకొచ్చాడో తెలియదు గానీ విషసర్పాన్ని లాఘవంగా ఆమె భుజం మీద వొదిలాడు.అది నారిని లాగిపట్టి ఉంచిన చేతి మీదుగా పాకి విల్లును పట్టిన చేతిని చుట్టుకుంటూ అమ్ము  చివరి వరకూ వెళ్ళీ ఆగింది!చెమట కూడా పట్టనివ్వకూడదన్నంత జాగ్రత్తతో శిలలా ఉండిపోయిన అవంతిక భుజం మీద శిల్పం చెక్కేసి యెలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు మధురశిల్పి శివన్న!.ఇదివరకంటే చేతిమీద గాబట్టి తనే చూసుకోగలిగింది,ఇప్పుదు ఇక రాడనుకుని చెట్టు దిగి స్నేహితురాల్ని కల్సినప్పుడు తను చెప్తే గానీ తెలిసి రాలేదు మళ్ళీ దాడి జరిగిందని,మరిగిపోయింది?!
ఇక దాగుడుమూతలు పూర్తయినాయి.ఇద్దరూ యెదురెదురుగా నిలబడి కలబడి తలపడి కదన కౌతుకంతో విజృంభించారు!ఒకరిలో అవమానం జరిగిపోయిందనే కసి!ఒకరిలో అభిమానం చూపించాలనే కసి!ఆమె కదలికల్లో పంతమూ ఉక్రోషమూ ఉంటే అతని కదలికల్లో నేర్పూ లాఘవమూ ఉన్నాయి.అందుకే అతనే గెలిచాడు!ఆడదాని వొంటిమీద ఉన్న దుస్తుల మీద చెయ్యేసే అధికారం భర్తకి మాత్రమే ఉంటుంది,అందుకే మొదట దుస్తులు మార్చి నేను నిన్నిట్లా చూడాలనుకుంటున్నానని చెప్పాడు!సరసుడైన భర్త తన భార్యకి చేసే అన్ని అలంకారాలూ ఒక్కటి కూడా వొదలకుండా చేసి నీటితెరలో తనని చూసి తనే మురిసిపోయేటట్టు చేశాడు! చెప్పండి, ఒక్క ముక్క నోటితో చెప్పకుండా అనితరసాధ్యంగా ఐ లవ్ యూ చెప్పిన శివ బాహుబలి కౌగిట్లో అవంతిక యెందుకు వాలదు?వాళ్ళలో వాళ్ళు మనమిక ఈ జన్మకి విడిపోము అని సంకల్పాలు చెప్పుకుంటే కళ్యాణం జరిగిపోయినట్టే గద!ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యనా జరిగేది దాంపత్యశృంగారమే గద!ఇంత చిన్న విషయం గూడా తెలియని అజ్ఞానం వల్లనో యేమో మరి అక్కడ బలాత్కారమేదో జరిగిందని యెవరో ఆడమనిషే అంటుంటే ఆమెలోని అజ్ఞానానికి నవ్వాలో యేడవాలో అర్ధం కాలేదు?కొందరు అవంతికని అంత వీరనారిగా చూపించి మరీ అంత తొందరగా శివుణ్ణి ఇష్టపడినట్టు చూపించటం ఆ పాత్రని కించపరిచినట్టుంది అని కూడా అంటున్నారు.అంటే వాళ్ళు ఇప్పటి దాకా చూసి అఘోరించిన  మూస సినిమా ఫార్ములా రొమాంటిక్ సీన్ల మత్తునుంచి ఇంకా బయటపలేదన్న మాట,ఒకవేళ రాజమౌళి గనక వాళ్ళ మధ్యన ప్రేమ నెమ్మది నెమ్మదిగా పెరిగిందని చూపించటానికి నాలుగైదు చెత్తసీన్లని ఇరికించి ఉంటే వాళ్లకి నచ్చి ఉండేదేమో గానీ మనలాంటివాళ్ళం అక్కణ్ణించే "చీ,యాక్,ధూ" అనుకుంటూ ధియేటరు నుంచి బయటపడే వాళ్ళం - రాజమౌళీ,ఆర్కా నెత్తిన చెంగేసుకు పోయేవాళ్ళు!

మన ఆడవాళ్ళు కొన్ని చీరల్ని ప్రత్యేకంగా దాస్తూ యేళ్ళ తరబడి అపురూపంగా యెందుకు దాచుకుంటారో తెలుసా!ఆ చీర కట్టినప్పుడు యేదైనా మధురానుభవం వాళ్ళకి యెదురైతే ఆ చీరని యెప్పుడు కట్టినా వాళ్ళు అప్పటి సన్నివేశంలో తమ అనుభూతుల్ని ఇప్పుడు కూడా అనుభవించగలుగుతారు!అవంతికకి "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అనే సన్నివేశాన్నీ దానికి సంబంధించిన అనుభూతినీ ఆమె హృదయాంతరాళంలో అంత అపురూపంగా నిలబెట్టాడు శివ బాహుబలి!


A MAN WITH STYLE CAN WIN ANY RIGHT MINDED WOMAN!

Tuesday 21 July 2015

కధామంజరి మేష్షారు కూడా బ్లాగు మూసేస్తానని బెదిరిస్తున్నారు!ఇది బ్లాగులోకం మీద విరుచుకు పడిన భేతాళిక మహత్యం కాదు గదా?

          అప్పుడెప్పుడో వ్యూహాత్మకంగా బ్లాగు మూసేస్తున్నాను అనంగానే తధ్ధాస్తు దేవతలు పనిలేక గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని కూర్చుని విసుగుపుట్టే టయానికి అనుకున్నానో యేమో రెచ్చిపోయి దీవించేసి ఉంటారు, ఇప్పుడిప్పుడు మెల్లమెల్లగా నిజంగానే విరక్తి పుడుతున్నది కొద్దిరోజులుగా!యెటు చూసినా ముసలి యెంటీవోడు కుర్ర ఫ్రీదేవితో రొమాన్సు చేస్తున్నంత దరిద్రంగా కనిపిస్తున్నాది దృశ్యమాన ప్రపంచమంతా,నా మనసు కేమైంది?(తొక్కయింది,తోలయింది - నీకసలు మనసంటూ ఉండి యేడ్చిందా?)

          నాకొక్కడికే అనుకుందామా అంటే కధామంజరి మేష్షారు ఒకసారి "బ్లాగైనా మూసెయ్యాలి,బ్లాగు పేరైనా మార్చెయ్యాలి" అని హడావిడి చేసి .అబ్బే న్యూమరాలజీ మీద ఉత్తుత్తి సెటైరు మాత్రమే అనేసినా మళ్ళీ ఇపుడు కొత్తగా "లాభం లేదు,బ్లాగు మూసెయ్యాల్సిందే" అని మరింత గాఠిగా అనేస్తున్నారు,నాకు నిజంగానే అనుమానం వొచ్చేసిందీసారి ప్రమాదం ముంచుకొస్తున్నదని!

          మొగుడు లేని శూర్పణఖ మగాడి కావిలింతల కోసం అంగలారుస్తూ దండకారణ్యంలో స్వైరవిహారం చేస్తూ సీత మొగుడికి ప్రపోజల్స్ పెట్టి యే కాడికి తెచ్చుకుందో చూసి కూడా యేమీ నేర్చుకోని తెడ్డుశ్రీ లాగ మొగుడు నెట్ కనెక్షను బందు జేసినా ఆగకుండా ఈ మధ్యన భయంకరమైన వికట అట్టహాసా(భ.వి.అ.హా)లు చేసుకుంటూ బ్లాగుల్లో తిరుగుతున్న భేతాళిక దెబ్బ ఈయనకి గూడా తగిలిందా యేంటి?ఇదివరకెప్పుడూ లేనిది శ్యామలీయం మేష్షారు కూడా తన కామెంట్లని తనే తొలగించుకుంటున్నారు,హేవిటో?దాని గాలి సోకినా దాని బుధ్ధులే వస్తాయేమో - సీనియరు బ్లాగర్లే ఇట్టా అయిపోతే జూనియరు బ్లాగర్ని నా పరిస్థితేంటి?

          ఇలాంటి ఆలోచనలు మెదడును తొలుస్తుండగా రంజానూ ఆదివారం కలిసొచ్చేసరికి పిచ్చినిదర పోయా.అసలే రంజాను,మనం ఉపోషం ఉండకపోయినా గాలిలో ఎఫెక్టు ఉంటుందేమో,ఆపైన ఈ హిందూ వ్యతిరేక రాక్షసి భేతాళిక గురించిన ఆలోచనలు తోడవటంతో - ఒక భయంకరమైన కల వొచ్చేసింది.నా బ్లాగులో కంటెంటు యెత్తుకుపోయిందని భేతాళిక మీద యాగ్రీగేటరు/ప్రధానికి కేసు పెట్టానంట!"యెవరిని దండించాలి?" కధలో రాజుకి ఆఖరికి పిచ్చెక్కినంత పనై "అసలు వీడు ఈ కధంతా విప్పి చెప్పకపోతే యెవరో ఒకరికి శిక్ష వేసి ప్రశాంతంగా ఉందును గదా,పనిలేని మంగలి లాగ వొచ్చి నా మనశ్శాంతిని పోగొట్టాడు" అనిపించి జరిగిన కధంతా చెప్పిన బ్రాహ్మడికే శిక్ష వేసినట్టు ఈ భెతాళికని దాని మొగుడే ఆపలేకపోయాడు నేనెలా ఆపగలుతాననుకున్నాడు అని నామీద పిచ్చి లెగిసి నన్నే జైల్లో పెట్టాడంట!దాంతో "నను బ్రోవమనీ చెప్పవే బ్లాగమ్మ తల్ల్లీ!" అనీ "యెవడబ్బ పోష్టులని కులుకుతు కామెంటేవు బ్లాగుచంద్రా" అనీ నాకు గుర్తుకొచ్చిన భక్తిపాటలుగా అనిపించే తింగరి పాటలు పాడుకుంటూ దొంగేడుపు యేడుస్తున్నానంట!

          ఇంతలో భ్రామరీయం,బండల్రావు ఇహిహి తీవ్రవాదుల గెటప్పుల్లో జైలు గోడల్ని బద్దలు కొట్టుకుని వచ్చి వాళ్ళ భ.వి.అ.హా లతో కాపలావాళ్లని మూర్చపోయేటట్టు చేసి ధైర్యస్థుణ్ణి గనక వాళ్ళ భ.వి.అ.హా లకి సొఘమే కళ్ళు తేలేసిన నా చెరో చెయ్యీ చెరొకడూ పట్టుకుని లాక్కొచ్చి ఇక్కడ కూలేసి మాయమైపోయారం!అప్పటినుంచి ఇట్టా పడివున్నానంట!కటిక చీకటి!కన్ను పొడుచుకున్నా యేమీ కనబడేట్టు లేదు కన్నుపోవడం తప్ప,అందుకే పొడుచుకోకుండా తీవ్రంగా ఆలోచిస్తూ ఇలా పోష్టుని వ్యాకోచింపజేస్తున్ననన్నమాట!

          భ్రామరీయం అంటే తనని నేనెప్పుడూ విమర్శించలేదు గాబట్టి ఇంకా దీర్ఘంగా పరిశీలిస్తే కొన్నిచోట్ల తనని సమర్ధిస్తూ కామెంట్లేశాను గాబట్టి నన్ను తప్పించి ఉండొచ్చు,బండల్రావు యెట్లా వచ్చాడు నాకోసం ఇంత సాహసం చెయ్యటానికి?జప్రని పాప్యులర్ చేసుకోవటానికి తంటాలు పడుతూ పెట్టుబడిదారీ విధానాన్ని చితక్కొట్టెయ్యాలంటూనే కమ్యునిష్టు సిధ్ధాంతం కూడా లోపాల్ని తొలగించుకుంటేనే(అసలు లక్ష్యమైన వర్గరహిత సమాజం వర్ణనలోని లోపాలకే దిక్కులేదు,ఇంక మిగతా లోపాలు సవరించుకోవటం అనేది జరుగుతుందా!) అది సర్వజనామోదయోగ్యం(ఆంధ్రోళ్ళని తిట్టడానికి దోపిడీ అన్న వొక్క ముక్కని అరువు తెచ్చుకుని లాగి పీకి పిండి పిసికి రాష్త్రాన్ని తెచ్చుకున్న తెలంగాణోళ్ళే వాళ్ళకి దెబ్బవుతుందనుకున్నప్పుడు వాళ్ల రాష్ట్రంలో అధికారంలోకి వద్దామనుకుంటున్న నక్సలైట్లని వొప్పుకోవట్లేదు,ఇంగ అందరూ వొప్పుకోవాలంట హిహిహి) అవుతుందనే భ్రమల్లో ఉండి పైకి తటస్థంగా కనబడే ఆ మ్యూకనిజం పక్షపాతి సీనులోకి యెట్టా వచ్చాడు,ఇందులో యేదో మోసం ఉంది!

          "అడాపావియా అక్కడి చర్చల్లో యెక్కువగా వేలు పెట్టి కామెంట్లు పెంచేది నువ్వే గదుడా?" అని వయస్సార్ భక్తుడైన ఒక అరవతెలుగుబ్లాగరు వేసిన కర్ణకఠోరమైన కేక వినపడి భయంతో వొళ్ళు జలదరించి పోయింది?!ఆహా, పెట్టుబడి విధానంలోని లాభాపేక్ష యెంత మంచివాళ్ళనయినా దిగజారుస్తుంది గదా!అయితే, వాళ్ళిద్దరూ అనేకానేకమైన రహస్య కారణాల వల్ల ఇంకా గాఠిగా చెప్పాలంటే హిప్నటైజ్ చేసి మతం మారుస్తున్న లాంటి దుర్మార్గమైన వశీకరణకి బలయిపోయి ఆ భెతాళిక మగవాళ్ళ సైకాలజీ తెలుసుకుని గురిచూసి ప్రయోగించిన మనోవైజ్ఞానిక మాంత్రికశక్తుల అధీనంలోకి వెళ్ళిపోవదం చేత నాలాంటి రాజకీయ ఖైదీల్ని మునుగుడుపుల అల్లుళ్ళలాగ చూసుకునే బ్లాగు/ప్రభుత్వ కారాగారం నుంచి విడిపించి కూసింతయినా జాలీ దయా లేకుండా గంప గయ్యాళి భేతాళిక యెదాన పడేశారన్నమాట, ఎంత ఘోరం?!

          పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్టున్నాను! నా బ్లాగులో  నేను కమ్మని పోష్టుల్ని రాసుకుని అఘోరించకుండా ప్రతీ బ్లాగులోనికీ యేల దూరవలె?దూరితిని పో బాగు బాగు మీ బ్లాగు అని మెచ్చుకుని భజంత్రీ కామెంట్లతో సంతోష పెట్టక పోటుగాడి వలె రెచ్చిపోయి ప్రతి అడ్డగాడిదతోనూ యేల వాదించవలె?వాదించితిని పో సాటి మగవాళ్లతో సరిపెట్టుకొనక ఈ భేతాళిక నేల కెలకవలె?ఆడుదానితో పోట్లాటకు యెంత కొమ్ములు తిరిగిన వీరాధివీరులయినా దడుచుకొని చత్తురే నేనేల మూర్ఖముగా కొమ్ము విదిలించవలె?నిస్సీ,ఇంత దనుకా ఇంతమందిని ఒఖ్ఖడనై నోరుమూయించిన నేను ఒఖ్ఖ్క ఆడుదానికి భయపడి బ్లాగు మూసుకొని పోవుటయా?చరిత్ర తెలియదు,పురాణాలు చదవదు,కనీసం తను వూడబొడుస్తున్నానన్న సమస్య గురించి నాలుగే నాలుగు ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పలేదు - ఆ పిపీలికానికే అంత పొగరుంటే గండభెరుండాన్ని నాకెంత ఉండాలి!

          ఈ విధంగా ఆవేశం యమహా రేంజిలో యెక్కువైపోయి ఆలోచిస్తుంటే నాలో నేను ప్రేలాపిస్తుంటే ఈ చోటు వేడెక్కినట్టనిపించి కాస్త ఆగాను!నా ఆనుమానాన్ని నిజం చేస్తూ "అయ్యా మీరు అంతలా వేడెక్కడం ఆపేస్తే మీరు ఇక్కణ్ణించి బయట పడేందుకు క్లూ ఇస్తా,దగ్గిరకి రాలేకపోతున్నా అరగంట నించీ - ఇప్పుడు కొంచెం నయం!" అని ఒక సన్నని ఆర్తనాదం వినబడింది.ఇంకా వేడెక్కటం నాకూ ప్రమాదమే గనక తగ్గి ఆరా తీస్తే యాగీ భ్రాజిష్ణ అట!గుర్తొచ్చింది - అమాసకీ పున్నమికీ వస్తాడు,పోష్తుకి సంబంధం లేని కామెంట్లేస్తాడు!చెప్పి వేస్తాడు గనక నేనూ గొడవ పడలేదు - ఆ పాయింట్ల గురించి కూడా యేదో ఓ రోజు పోష్టు వెయ్యకపోతానా అనే ఆశ కాబోలు, కొన్ని వేశా.ఆ కృతజ్ఞతతో వచ్చినట్టున్నాడు!

          "మీరు బాహుబలి సినిమా గురించి యేదయినా విశ్లేషణాత్మకంగా చెప్తారని యెదురు చూశాను,వూరికే బావుంది చూడమని చెప్పి వొదిలేశారు - ఇప్పుడు ఆపని చేస్తే మీకు యేదో ఒక రూపంలో సాయం అందవచ్చు" అని అర్ధం పర్ధం లేని క్లూ ఇచ్చి అడిగినా జవాబు చెప్పకుండా సైలెంటయిపోయాడు!బాహుబలి విశ్లేషణకీ నేను ఇక్కణ్ణుంచి బయటపడటానికీ లింకు యేముంది?యేమో బాబరుకీ రాముడికీ లింకు ఉన్నప్పుడు బాహుబలి విశ్లేషణకీ నేను తప్పించుకోవటానికీ సంబంధం యెందుకు ఉండకూడదు?బీ ఏ రోమన్ ఇన్ రోం అన్నట్టు మనం ఉన్నది కూడా భెతాళిక రాజ్యంలోనే గదా!తిన్ననైన లాజిక్కుల కన్నా తింగరి లాజిక్కుల వల్లనే పని జరగొచ్చు.ఇక్కడ కూర్చుని బ్లాగు రాయడం కుదరదు గాబట్టి కంచుకంఠం కొంగర జగ్గయ్యని ఆవాహన చేసుకుని ఓపెనెయిర్ ధెయేరులో ఉన్నట్టు వూహించుకుని ప్రస్సంగం దంచెయ్యడమే!

          అరెమికాలో కూడా పుష్కరాల తొక్కిసలాటను తలపించేటంతగా బాహుబలిలో యేముంది?మగాళ్ళందరికీ నాకులాగే అతి తెల్లని నున్నని చర్మం గల తమన్నా బాహుమూలాలు నచ్చాయా?అది మగాళ్ళకి?ఆండువారు కూడా వెర్రెత్తిపోతున్నారే,బహుశా వాళ్ళమీద ప్రభాస్ మరియూ రాణాల కండలు తిరిగిన దేహాల ప్రభావం పనిచేసి ఉండొచ్చునా!అరెమికాలో అన్నేళ్ళు ఉండి గూడా యే దేశమేగినా యెందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు అచ్చు హిండియాలో మాదిరి వెనక సీట్ల కోసం అగ్గగ్గ లాడిపోయారంట - పిచ్చి మగాళ్ళు?మా ఫ్రెండు గూడా ఇట్లాగే మరీ ముందైపోయేసరికి చూడ్డం ఇబ్బందిగా ఉంది ఈసారి కాస్త వెనక కూర్చుని చూడాలి అంటుంటే "మంచి సినిమా యెక్కడ కూర్చుని చూసినా బాగానే ఉంటుంది, చెత్త సినిమా యెక్కడ కూర్చుని చూసినా చెత్తగానే ఉంటుంది,నీకు సినిమా చూట్టం తెలీదనుకుంటా!నాకు మాత్రం ఇక్కదే బాగుంది, తమన్నా కళ్ళనిండుగా కనబడతంది?!" అని నేనంటే నన్ను కామాతురుణ్ణి చూసినట్టు చూసి "అన్నా, కాస్త వయస్సు గుర్తు తెచ్చుకో!నీకు మనవరాలు వయసులో వుంది" అంటున్నాడు - ఇంత సౌందర్యదృష్టి లేని అరసికుడు సినిమాలు చూట్టమెందుకండీ?సినిమా హీరోయిన్లు మహాజనానికి మరదలు పిల్లల్రా అని మల్లాది వారిని గుర్తు చేసి జ్ఞాననేత్రాన్ని వికసింపజేశాను!

          యే మాట కామాటే చెప్పుకోవాలి, ఆ సుకుమారికి శృంగారం నప్పినంతగా అంగారం నప్పలేదనిపించింది నా కుశాగ్రబుధ్ధికి!సినిమా నిండా రాజులూ, రాజ్యాలూ, కుట్రలూ, యుద్ధాలూ నిండి ఉన్న ఈ సినిమాని కాస్తంత  వాస్తవికతకి దూరమయితే చాలు ఢాం తుస్స్ సినిమాలో సామాజికస్పృహ లేదు, ఇదంతా బూర్జువా కళాకారుల పెట్టుబడిదారీ ఫ్యూడల్ సామ్రాజ్యాల సంకీర్తన అనే మ్యూకనిష్టు ప్రభావిత విమర్సకులు కూడా వెర్రెత్తిపోయి యెందుకు పొగుదుతున్నారో గదా!బహుశా ఇవ్వాళ్టీ ప్రజాస్వామ్యంలో కూడా అగ్రభాగాన కనబడుతున్న ప్రతి గొట్టాం గాడికీ అతని భజన బృందం చేస్తున్న వ్యక్తిపూజలూ, ఆర్యక మహారాజు మృచ్చకటికంలో వర్ణించిన శకారుని వంటి రాజశ్యాలకుల అనధికారిక నిర్వాకాలు నిరాఘాటంగా చెల్లిపోతుండటాలూ,అందరూ కోరుకుంటున్నారన్న ప్రదర్శనలతో అనువంశిక పాలన కొనసాగుతుండటాలూ చూసి చూసి విసుగెత్తి ఈ నాటకాలకి బదులు ఆనాటి రాజరికంలో నిజాయితీ అయినా ఉండేది గదా అని ఒక రకమైన ఆకర్షణ కలిగిందా?

          ఇవ్వాళ్టి మోడల్ వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగి చిన్న రాష్ట్రాలతో పరిపాలన సులభం అనే వాదనతో కైవారం తగ్గుతూ విడిపోతున్న రాష్ట్రాల లోని ప్రజలు క్రమేణా ఒకనాడు తమ ప్రాంతాలను పరిపాలించిన రాజవంశాలతో మమేకమవుతున్నారు!ఈ మలుపులు మరో నాలుగు తిరిగితే కాలగమనంలో మళ్ళీ ఆనాటి రాజ్యాలు ఉనికిలోకి వస్తాయేమో?ఇక్కడి దాకా యమా సీరియస్సుగా సాగిన నా పరిశోధన హఠాత్తుగా తింగరిగా మారిపోయింది - గాలి మహత్యం!ఈ లెక్కన గేటు వూయెలయ్య "దేవుడు ప్రజాస్వామిక వాదియా కాదా?" అనే సుత్తి వ్యాసాలు రాసుకుంటూ కూర్చోకుండా మగధీర టైపులో కవచకుండల శిరస్త్రాణాలు ధరించి అగ్రకుల శాత్రవ జనభయంకరుడై ఐలహులి వంశస్థాపానాచార్యుడైతేనే దళితులు రాజ్యాధికారంలోకి వస్తారేమో?!

           ఇంకా ఇరగదీసి ఉందును గానీ ఒక ఏడుపుముఖం కళ్ళముందు కనబడ్డం,ఖెవ్వ్ మనే కేక వినబడ్డం ఒకేసారి జరిగేసరికి యేకాగ్రత బద్దలై ప్రస్సంగం ఆపేశాను.ఈ మొహం యెవరిదయ్యా అంటే ఆయనే చెప్పాడు కళ్ళనీళ్ళ పర్యంత మవుతూ ,"అయ్యా హరిబాబు గారూ, ఒకప్పుడు మిమ్మల్ని దళితుల సమస్యలకి మీకు తోచిన  పరిష్కారం చెప్పమని అడిగినందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను. నేనూ మనిషినే, నేను కూడా సినిమాలు సరదాగా చూస్తాను సార్!ఆ గేటు వూయెలయ్యని మగధీర గెటప్పులో వూహించడానికే దడుచుకుని చస్తున్నా!మీరిట్టాంటి పరిష్కారాలు మాత్రం చెప్పకండి - అంతకన్నా శాశ్వతంగా దళితులుగా బతకడమే మేలు.మీ అగ్రకుల దురహంకారాన్ని పోనిచ్చుకున్నారు గాదు" అని చడామడా తిట్టేసి కోపమూ అసహ్యమూ తగ్గడంతోనో యేమో పాలిపోయిన మొహం మామూలుగా అవడం వల్ల మళ్ళీ కనబడకుండా వినబడకుండా ఐపోయాడు! శాడిస్టుని గదా,నేనూ నా మనసులో ఒక రెండు భ.వి.అ.హా లు చేసుకున్నా!

          తీరా తను వెళ్ళీపోయాక నా మామూలు బెంగ నాకు మళ్ళీ మొదలైంది.బాహుబలి విశ్లేషణతో దళిత మేధావి తిట్లు తప్ప బయటపడే మార్గం దొరకలేదే అని వగచి వగచి కృశించి కృశించి నశించి పోయేలాగున్నాను!భ్రాజిష్ణ క్లూ గూడా గాలికి పోయిన పేలపిండిలా అయిపోయింది!అసలు భెతాళికకి పిచ్చి అనేది నా పొరపాటు అవగాహన కావచ్చు?తను నాకు తారసపడిన మొదటి సన్నివేశం లోనే నాకు తన ప్రవర్తన రెండు విధాలుగా అనిపించింది!అయితే కేవలం గుర్తింపు కోసం చేసే సంచలనంలో సంతోషం వెదుక్కునే గందరగోళపు ప్రవర్తన అయి ఉండాలి,లేదంటే అధికారం కోసం యెంతకయినా తెగించే రాజకీయం నేర్చిన మనిషయినా అయి ఉండాలి అని - అలాంటప్పుడు మొదటిది కాక రెండోది తన అసలు రూపం అయితే మాత్రం తను మహా భయంకరమైన మరో భిందిరయే అవుతుంది!తనూ తన ఫ్రెండ్సూ కలిసి పెద్ద రామద్వేషుల మంద పోగయి ఉందక్కడ!

          కాలమహిమ!అసలు రాముణ్ణి అంత నీచంగా విమర్సిస్తున్న మనిషి మీద సైబర్ కేసు పెట్టి జైల్లో తొయ్యాల్సింది,దానికి అందరూ కలిసి రావాలి గదా అనిపించి నాకు తోచినట్టు నేను నాలుగు తిట్లు తిట్టేసరికి ఈ అంతూ పొంతూ లేని చీకట్లో పడి అఘోరిస్తున్నాను.మొత్తం జనాల సంస్కృతే మారిపోయినట్టుంది!?ఈ మధ్యకాలంలో అడ్డూ అదుపూ లేకుండా బతకడమే ఆధునికత అనుకోవటం,మాలో అనైతికత ఉంది అని ధీమాగా చెప్పుకుని విప్పుకు తిరగటమే నాగరికతగా భావించి - "లెస్బియనిజం", "హోమోసెక్సువాలిటీ", "ఇన్సెస్ట్" లాంటి దేనినైనా సరే చట్టబధ్ధం చేసుకుని మరీ చెయ్యాలనుకోవడం ఒక ఘనకార్యంలా భావించే గాలి మంద ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది!ఎడ్వినా ప్రియుడి అభిమానులు స్వేచ్చ ముసుగులో నీతులు చెప్తే మీ ఆలోచనలు మామీద రుద్దకండి మా ఇష్టం వచ్చినట్టు బతికే స్వేచ్చ మాకుంది అని ఘీంకరించటం గొప్ప ప్రజాస్వామ్య సాంప్రదాయంగా చెలామణీ చేసేశారు - చరిత్రనీ,సంస్కృతినీ,సామాజికతనీ అబధ్ధాలతో నింపేసిన విషవ్యూహపు ఫలితమే ఇవ్వాళ్టి దుస్థితి!ఇవ్వాళ మన బలహీనతల్ని వొదులుకోలేక అనైతికతకి గౌరవనీయతని ఆపాదించటం కోసం యెంత నీచాని కయినా పాల్పడితే నష్టపోయేదెవరు,మన రేపటి తరం కాదా?

          ఒక ప్రౌఢ ప్రపోస్ చెసినంత మాత్రాన శూర్పణఖకి ముక్కూ చెవులూ కొయ్యాలా అని అడుగుతుంటే ఆవు చేలో మస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు పెళ్ళీడు కొచ్చిన నవోఢల్లో ఒకరు ఇంకొకరికి ఇద్దరబ్బాయిల పేర్లు చెప్పి వీళ్ళిద్దరిలో యెవరో ఒకర్ని నువ్వు లవ్ చేసితీరాలని రెచ్చిపోతున్నది!బాబరుకీ రాముడికీ సంబంధం ఉన్నప్పుడు ఈ రెంటికీ సంబంధం లేదా?ఉన్నదని ఒప్పుకుంటే ఆ అమ్మాయి చేసింది తప్పా ఒప్పా?తప్పయితే వాళ్లకి మంచి చెప్పగలిగే స్థానంలో ఉన్నట్టా తప్పు కాదంటే ఇంకా రెచ్చిపొమ్మని చీర్ లీడర్ పనులు చేస్తున్నట్టా ఈ భేతాళిక?మరి పిల్లలు తను "అందరూ రాముడికి ఫ్యాన్ లయితే నేను రావణుడికి ఫ్యాన్" అని చెప్పుకుంటుందే ఆ శూర్పణఖనీ రావణుణ్ణీ అనుసరిస్తే అందులో తన బాధ్యత ఉన్నట్టా లేనట్టా!

          ఇప్పటి వరకూ సాహితీ వ్యాసంగం లెమ్మని అనిపించిన శంక్రాభారణం బ్లాగులోని పూరణ కిచ్చే సమస్యలు కూడా ఇప్పుడు బూతులుగా అనిపిస్తున్నాయి,మొత్తం శ్రంగారాన్నే నిషేదిస్తే గానీ ఇలాంటివాళ్ళు పుట్టుకురాకుండా ఉంటారు గదా అనిపిస్తున్నది.నేను యెవరి నుంచయితే జవాబులు ఆశించానో అక్కడి నుంచి జవాబులు రావు?జవాబు దొరికితే గానీ ప్రశాంతంగా ఉండనివ్వని జవాబులు రాని ప్రశ్నల సుడిగుండంలో ఇరుక్కుపోయి నాకు ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చేసింది!"నీరసము వలన మనకొరుగు ప్రయోజన మేమి?పోయిన మనశ్శాంతి తిరిగి దక్కునా?ఈ చెర నీకు వీడునా?బ్లాగులోకము నందు శాంతి స్థాపించబడునా?నీ వూహ సరి కాదు!వారు పేరుకే నవీనులు గాని వారి ఆలోచన లన్నియు ప్రాచీనములే!ఆటవికమూ అకటావికత్వమూ దప్ప మరేమియునూ లేదు.నా గుంటనక్క యెత్తులతో వారిని మరింత గందరగోళ పరచి వారిలో వారికి విభేదములు కల్పించి గెలుపును నీ పాదపెఠము పైన పదవేసెదను.కొంచెపు వంచన పనులకు అయిన వాణ్ణీ అమ్మ తమ్ముణ్ణీ నేనున్నానుగా!" అని మా ధూళ్ళిపాళ్ళ మామయ్య పాచికలు టకటక లాడించుకుంటూ వచ్చాడు.

          నాకు తిక్కరేగిపోయింది - యెదవ ప్లానులేసి వాట్ని ఫాలో అయినోడికే గుండు కొట్టించి జారుకునే ఇట్టాంటి ముదనష్టపోళ్ళని దగ్గిరికి రానిస్తే మనమే  మట్టానికి ముణిగిపోతాం!ఇంక తగులుకుని "మామా గాంధార దేశపు  గుంటనక్క సార్వభౌమా,యే కాలమున నుంటివి?నీ బోడి యెముకల పాచికలు పనిచేయుట కిది నాటి కాలము కాదు!నేటి కాలపు మనుషులు లాభదృష్టితో గానీ లేక నష్టభీతితో గానీ - ఈ రెంటిలో యేదో ఒకదానితో మాత్రమే కలిసెదరు!ఇంత దనుకా గాంగ్రీన్ పార్టీ మరియూ మ్యూకనిష్టుల ఆర్భాట ముడ్డోలముగ నుండి లాభదృష్టితో కలిసినారు, కానీ ఇప్పుడిప్పుడు పరిస్థితులు తిరగబడి వారి పునాదులు కదిలి నష్టభీతిలో నున్నారు.లాభదృష్టి కన్ననూ నష్టభీతి బలమైనది గనుక ఇంకనూ బలముగా అంటుకుపోయెదరు తప్ప నీ నక్కజిత్తులకు విడిపోరు - ఇటువంటి చచ్చు పుచ్చు ప్లానులు మాకవసరము లేదు.అయిననూ నేనిప్పుడా గుడ్డిరాజు కొడుకును గాను,యుధిష్ఠిరుడను!అనగా ధర్మదృష్టి గలిగి యుధ్ధమున స్థిరముగ నిలుచువాడు!నీ వంటివాని యవసరము మా పొరుగు రాష్ట్రమైన లతెంగాణమున చాల యున్నది, అచటికి పొమ్ము!" అని ఝాడించేసరికి మొహం గంటు పెట్టుకుని,"అటులనే పోయెదను" అని గొణుక్కుంటూ పోయేవాడు పోతూ "నీవన్నట్టు వారిని నష్టభీతి కలిపినచో వారింకనూ వృధ్ధి నొందెదరు గద,కానీ లాభదృష్టి, నష్టభీతి యేదియునూ లేని మీ సింధుజాతి మాత్రము ఐకమత్యము కుదరక నశించిపోవుట తధ్యము." అని నాకూ బుర్ర తిరిగిపోయే రిటార్టిచ్చి వెళ్ళాడు?!

          ఔర ఔర - యెంత మాటనేశాడు ఠపీమని!వీడి మాట నిజమై చావదు గదా!లేదులే, పిల్లి శాపాలకి ఉట్లు తెగుతయ్యా యేంటి?వీడి లాంటివాళ్ళు యెంతమంది ఈర్ష్యాళువులై సహస్రాబ్దాల తరబడి కుట్రలు పన్నినా పురాణ యువతి లాంటి సనాతన సంస్కృతి అవిచ్చిన్నంగానే కొనసాగింది గదా!ఇప్పటికీ ననవఓన్మేషమైన యౌవ్వనప్రౌఢిమతో తొణికిసలాడుతూనే ఉంది గదా!తప్పుల్ని ఒప్పుకోగలిగిన ఆత్మ విమర్శ,అన్ని మతాలూ సమానమే అని ఒప్పుకుంటున్న అన్యమత సహిష్ణుత,పైనుంచి రుద్దడంలా కాకుండా వ్యక్తుల ఐచ్చిక విధేయతకే ప్రాముఖ్యత ఇచ్చిన ప్రజాస్యామ్యయుతమైన మతం ఒక్క హిందూ ధర్మమే!హిందూ దేవుళ్ళు ప్రజస్వామ్యవాదులు కారని వక్రభాష్యాలు చెప్పే గేటు వూయెలయ్య యెక్కడ ఇస్లాము ధర్మాన్ని గురించి "క్రైస్తవ మతాం నుంచి పుట్టిన పిలక"గా తప్ప మరోరకంగా వర్ణించడు, ఇవ్వాళ ఆ ధర్మం ప్రపంచవ్యాప్తంగా సొంత సాంప్రదాయాన్ని యేర్పరచుకుని ఒక పూర్తి స్థాయి మతంగా యెదిగిందని గుర్తించడు - అయినా తను ప్రజాస్వామ్యవాదినని చెప్పుకుంటే చెల్లిపోతున్నది!యే హిందువైనా,యే బ్రాహ్మణుదైనా,యే పీఠాధిపతి అయినా ఇస్లాము గురించి అలా అవమానిస్తూ మాట్లాడగా ఎవరైనా విన్నారా?లేదు!అయినా హిందువులు మతమౌఢ్యం గల దురహంకారులే!

          మన మతమే గొప్పది,మిగిలినవన్నీ అనాగరికమైనవి,ఈ ప్రపంచం మొత్తాన్ని మన దేవుడి పాదాల చెంత పడుకోబెట్టడం మన మతాన్ని పాటించే ప్రతి ఒక్కరి కర్తవ్యం అని ప్రభోదిస్తున్నా, ఇతర మతాల లోనివార్ని నయాన గానీ భయాన గానీ తమ మతంలోకి లాక్కోవడానికి యెన్ని దుర్మార్గాలు చేస్తున్నా,ఆధ్యాత్మిక సామ్రాజ్యవాదంలో వేర్లు తన్ని పెరుగుతూ విషవృక్షంలా విస్తరిస్తున్నా,అడుగు పెట్టిన ప్రతి చోటా అక్కడి ప్రాంతీయ సంస్కృతుల్ని ధ్వంసం చేసినా వారు సకల జన వంద్యులేనని తీర్మానించుతున్నారు!నిరాడంబరంగా జీవిస్తూ, ఇంద్రియ నిగ్రహాన్ని ప్రబోధిస్తూ,గౌరవమునే కోరుకుంటూ సంసార బంధనాల్ని త్యజించి ఆశ్రమ వాసులుగా ఉండి తమ కార్యకలాపాల ద్వారా సామాజిక సేవ చేస్తున్నా సరే ఆశ్రమ జీవనం వల్ల తమ చుట్టూ ఉన్న బయటి ప్రపంచంలో యేమి జరుగుతుందో తెలియని అమాయకత్వం వల్ల యే మాత్రం తమకి తప్పులు పట్టటానికి పనికొచ్చే యెంత చిన్న మాట మాట్లాడినా అరిభీకరంగా విరుచుకు పడుతున్నారు!

          దీని వెనక ఉన్నది ప్రజలకు సమాచారాన్ని చేరవేసే బాధ్యతాయుతమైన ప్రవర్తన కాదు, హిందూ మతప్రచారకుల్ని స్వేచ్చగా ప్రచారం చేసుకోనిస్తే తాము యెదగడం కష్టమన్న తెలివితో వారిని తమ మతానికి సంబంధించిన ప్రచారం చేసుకోనివ్వకూడదన్న దుర్మార్గపు వ్యూహం!మీడియా ముందు అలా అడ్డంగా దొరికిపోయేలా మాట్లాడితే విమర్సించరా అని అనేవారు ఇతర మతాల వారూ అలాగే మాట్లాడినా అవి యెందుకు చడీ చప్పుదూ లేకుండా అణగారిపోతున్నాయో, ఆ మీడియాల కెమెరాలన్నీ హిందూ మతప్రాచారకుల చుట్టూరానే యెందుకు మొహరించబడుతున్నాయో తెలుసుకుంటే అసలు విషయం బోధపడుతుంది!పని గట్టుకుని బొక్కలు వెదకదల్చుకుంటే ఈ ప్రపంచంలో యెవరూ పవిత్రంగా నిలవరు!అయితే అలా ఇతర మతాల్లో బొక్కలు వెదకటాన్ని ఒక వ్యూహప్రకారం కోట్లలో మిలియన్లలో డబ్బు వెచ్చించి చేసే సమాచారసామ్రాజ్యవాదుల దుర్మార్గపు వ్యూహానికి బలవుతున్న వాటిలో మొదటిది హిందూ ధర్మం, రెండవది ఇస్లాం ధర్మం!మొత్తం భారతదేశంలోని మీడియా అంతా హిందూమతం మీదనే తమ దృష్టిని కేంద్రీకరించడం అమాయకంగా జరగడం లేదు,ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు అనాలోచితంగా యేదీ చెయ్యరు.వాళ్ళు మనకి చూపించే ప్రతి దృశ్యమూ కూయించే ప్రతి శబ్దమూ వారి వ్యంగ్యరచనా వైభవంతో మన సంస్కృతి గురించి మనమే అవమానకరంగా మాట్లాడేలా మనల్ని తయారు చెయ్యటం కోసం గురిచూసి వొదుల్తున్న శస్త్రమే!

          ఇస్లామిక్ తీవ్రవాదానికి మూలం వారు తమ మీద జరుగుతున్న దాడిని గ్రహించి దానికి లొంగకుండా ఉండటానికీ తమ మత స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవటానికీ తమకి తోచిన దారిలో చేస్తున్న ప్రయత్నమే!వారికి వారి శత్రువెవరో స్పష్టంగా తెలుసు.తమ పైన జరుగుతున్న దాడికి ప్రతీకారం చేస్తున్నామని అనుకుంటున్నారు గనకనే వారిలో పశ్చాత్తాపం లేదు.హిందువులకే ఇంకా ఇవేవీ తెలియడం లేదు - కూపస్థ మండూకాలు!ఉమ్మడి శత్రువొకడు పక్కవాడి మీద దాడి చేసి వాడు కుయ్యో మంటుంటే అదే దెబ్బ మనకీ తగిలినప్పుదు మనం కూడా అలాగే కుయ్యో మనాలి గాబోలు ననుకునే దేభ్యం మొహాలు!ఈ భూమి మీద నుంచి ముస్లిములను ఖాళీ చేసే వ్యవహారం చక్కబెట్టిన తర్వాత హిందువులని ఖాళీ చేసే వ్యవహారం మొదలవుతుంది,

          ఆయుధాల సహాయం తీసుకుని చేసే యుధ్ధాల తోనో, రాజకీయపరమైన కుట్రల ద్వారా ప్రభుత్వాల్ని మార్చడం తోనో చేసే దాడి కన్నా మౌలిక సంస్కృతి మీద చేసే కనిపించని దాడి సుకుమారంగా ఉన్నా అది మరింత ప్రమాదకరమైనది!తెలుపు చర్మం పవిత్రమైనదీ కాదు,నలుపు చర్మం అపవిత్రమైనదీ కాదు,హిందువులకి నలుపు నారాయణ స్వరూపం!అయినా సరే తెలుపుకే ఘనకీర్తిని ఆపాదిస్తూ సౌందర్య సాధనాల ద్వారా ఉద్వేగాన్ని రగిలించడం వెనకా తాము నిర్ధారించిన కొలతలతో ఉన్న నాజూకైన దేహమే కోరుకోదగినదిగా స్త్రీలను పురుషుల ముందు ప్రదర్శనకి నిలబెట్టి సౌందర్యకీర్తికిరీటాలు తొడిగి సన్మానించడం వెనకా తమ సౌందర్యదృష్టినే అందరికీ ఆమోదయోగ్యంగా చేసి ప్రపంచం లోని స్త్రీల నందర్నీ తమ కంటికి నచ్చే విధంగా మూసపోసే ఒక మహా భయంకరమైన సాంస్కృతికసామ్రాజ్యవాదపు వ్యూహమున్నది - పారా హుషార్!సాంస్కృతికంగా యెంత మహోన్నతమైన దశలో ఉన్న జాతి అయినా ఒకసారి తన మౌలిక సంస్కృతికి దూరమైతే తిరిగి దానిని సాధించుకోవడం అసాధ్యమనేది చరిత్ర చెబుతున్న సత్యం!

          ఇంటి లోని వారు గానీ బైటి వారు గానీ హిందూ ధర్మం మీద దాడి చేయడానికి దొరికిన ఒకే ఒక  బ్రహ్మాస్త్రం - కులవ్యవస్థ!కులవ్యవస్థ యేదో ఒక రూపంలో యేదో ఒక స్థాయిలో ప్రపంచంలోని అన్ని చోట్లా ఉన్నప్పటికీ భారత దేశంలోని కులవ్యవస్థకి రెండు ముఖాలున్నాయి - నిచ్చెన మెట్ల వంటి సామాజిక విభజన,కొందరిని స్పృశించడానికే తిరస్కరించి వూరవతలికి తరిమేసిన అస్పృశ్యత!మొదటిదానిలో ఉన్న ఒక చిక్కుముడిని అర్ధం చేసుకుంటే అది అంత ప్రమాదకారి కాదని తెలుస్తుంది.అతి ప్రాచీన కాలం నుంచీ ఇప్పటి వరకూ అన్ని దేశాల లోనూ అన్ని ప్రాంతాల లోనూ అన్ని సమాజాల లోనూ అన్ని జాతుల లోనూ ఒకే విధమయిన సూత్రాలను పాటించే నిర్మితిని కలిగి ఉండి మన చుట్టూ కనబడుతున్న సామాజిక,రాజకీయ,సాంస్కృతిక,ఆధ్యాత్మిక రంగాలన్నిటినీ ప్రభావితం చేస్తున్న ఆర్ధిక నిర్మాణం పెట్టుబడిదారీ విధానం.మరీ తలబంటిగా మునగకుండా పైపైన విశ్లేషిస్తే పెట్టుబడి,శ్రమ,మార్కెట్,వెల,పోటీ అనే అయిదు విషయాలు ఇమిడి ఉంటాయి.పెట్టుబడి దారుదు పెట్టుబడితో వస్తాడు,కొందరు శ్రామికుల్ని  నెలజీతాలకి తీసుకుంటాడు,తయారు చేసిన వస్తువుకు మార్కెట్ దాని డిమాందునీ సప్లైనీ అంచనా వేసి వెల నిర్ణయిస్తుంది,యెవరు యెంత లాభాన్ని కిట్టించుకోవాలనే దానిలో పోటీ ఉంటుంది.ఈ పోటీలో రెండు విభిన్న కులాల వాళ్ళు పోటీ పడుతున్నప్పుడు అక్కడ గెలుపును  నిర్ణయించే రెఫరీ ఆ రెండు కులాల్లో యే కులానికైనా చెందినప్పుడు న్యాయంగా గెలవలేని పరిస్థితిలో రెఫరీని తార్చి గెలవడం కోసం కులం కార్డు ముందుకొస్తుంది!పోటీలో ఈ రకమైన పరిస్థితి వస్తే గేటు వూయెలయ్య గానీ శంకర శాస్త్రి గానీ చంద్రశేఖర రావు గానీ చంద్రబాబు గానీ రఘువీరా రెడ్డి గానీ అందరూ ఒక్కలాగే ప్రవర్తిస్తారు!లాభం కోసం యెంత నీచానికైనా దిగజారడం యే ఒక్క కులానికో పరిమితమైనదా?యెదిగే కుర్రాడికి ప్యాంటు సైజు మార్చినట్టు జనాభాకి తగ్గట్టు ఆర్ధిక కార్యకలాపాల విస్తృతి పెరుగుతుంటే యెంత చెట్టు కంత గాలి అన్న విధంగా ప్రతి ఒక్కరికీ తమ శ్రమకి తగ్గ ఫలితం లభించి ఆర్ధికంగా భద్రత వస్తుంది.ఆత్మగౌరవం ఉన్నచోట ఆత్మన్యూనత ఉండదు గనక అస్పృశ్యత కూడా అంతమవుతుంది!

          కళ్ళముందు కార్యక్షేత్రం కనబడగానే అప్పటి వరకూ నాచుట్టూ పరుచుకున్న అంధాంధ తమసాల నుంచి కళ్ళు చెదిరే కాంతిచ్చటలతో విలసిల్లే సువర్లోకంలోకి ప్రవేశించినట్లయింది!అంతలోనే మృధుమధురమైన స్వరంతో యెవరో నాకోసమే ఆలపిస్తున్నట్టు "అయ్యారే అమరావతి పౌరుడా,సయ్యారే సమరావతి శూరుడా,ఈర్ష్యారే జుగుప్సామతుల చెండాడగ లేవరా" అనే నా భావి కార్యాచరణ జీవితానికి ఆహ్వానగీతం లాంటి కావ్యగానం నన్ను మరింత ఆనంద పరవశుణ్ణి చేసింది.సాధురే సాధు సాధు హసాదు బల్ పసందు ఈ కల సామాన్యమైనది కాదు!అదృష్టం ఈడ్చి తన్నే ఒక క్షణంలో వచ్చే కల - మన లక్ష్యాన్ని కళ్ల ముందు బొమ్మ కట్టించి మనల్ని చరితార్ధుల్ని చేసే ఆ కల ఇదే ఇదే?!

          ఇంతకీ కార్యక్షేత్రం కళ్ళ ముందు కనబడినా యెంతకీ తగ్గని ముసురులా సంజెవేళ ముసిరిన చీకట్లలా ఈ కల మాత్రం ఇంకా చెదరిపోదేం!హరిబాబుగా ఈ లోకంలోకి రావడమే ఒక కల,ఆ కలలో ఇదింకో చిన్న కల.కలలోనే ఒక మెలకువగా మెలకువలోనే ఒక కలగా యెంత కాలమిట్లా?వెనకటికి లావోతజూ అనే వేదాంతికీ ఒకనాడు ఒక చిత్రమైన కల వచ్చిందట.తను ఒక సీతాకోకచిలకగా మారినట్టు.రావణుడు పూనాడో యేమో వాలిన పువ్వునల్లా రేప్ చేస్తూ పోతున్నాదట.పువ్వుల్ని, రేప్ చేసినా తేనెనే స్రవిస్తాయి!కొన్ని పువ్వుల్ని రేప్ చేశాక యెంతైనా వేదాంతి గదా భళ్ళున పశ్చాత్తాపం బద్దలై కలలోంచి ఇలలోకి జారిపడ్డాడట.అప్పుడొక చిత్రమైన సందేహం వచ్చిందట "నేనిప్పుడు - సీతాకోకక చిలుకనని కలగంటున్న లావోతజూనా?లావోతజూనని కలగంటున్న సీతాకోకచిలుకనా!" అని.

          హరిబాబుగా నా బతుకూ అలాంటి చిత్రమైన కల కావచ్చు.ఇక్కడ మూసినకన్ను యే గంధర్వలోకంలోనో తెరుస్తానా!.పక్కనే ఉన్న మనోహరితో,"చూశావా మనోహరీ,ఈ విశ్వాంతరాళంలో యెక్కడో సుదూరంగా ఉన్న భూమి అనేదానిపైన మనమిద్దరం మనుషులుగా పుట్టామట.అక్కడ సుఖపడాలంటే డబ్బు అనేది చాలా అవసరమట.మిగతా వాళ్ళకి దొరికినది హరిబాబు కెందుకు దొరకలేదో తెలియదు గానీ ఆ డబ్బు లేకపోవటంతో ప్రేమ అన్నిట్నీ మరపించినా దరిద్రం ప్రేమని చంపేసి నువ్వూ నేనూ కూడా ఒకళ్ళ నొకళ్ళం తిట్టుకున్నామంట." అని నేను చెప్తుంటే తను "అవునా మనోహరా, నేను నిన్ను తిట్టటమా?అయితే అది రాకూడని కలే!అయినా, మనం అనిమిషులం కదా!అనిమిషులకు కూడా కలలు వస్తాయా?మరి మీకెందుకొచ్చిందో?" అని నవ్వుతూ అంటుంటే ఒకరీ ముఖం ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటామా?లావోతజూ గారిలాగే ఇప్పుడు నాకూ ఒక ధర్మసందేహం పట్ట్టి పీడిస్తున్నది.


నేనిప్పుడు - గంధర్వుణ్ణని కలగంటున్న హరిబాబునా? హరిబాబబునని కలగంటున్న గంధర్వుణ్ణా!

Friday 17 July 2015

తెలంగాణలో చెత్త విప్లవం వర్ధిల్లడం సంగతి యేమో గానీ అది యేలిన్నాటి శనిలాగ ఆంధ్రాకీ పాకింది గదా?!

         అరిభీకరంగా ఆంధ్రోళ్ళ దోపిడీ గురించి పుంఖాలు పుంఖాలుగా జీవితకాలపు ఘోటక బ్రహ్మచర్యాలతో బళ్ళ కొద్దీ పరిశోధనా దస్త్రాలు లిఖించి సొంత ఖర్చులతో తెలంగాణ అంతటా పంచిపెట్టి దశాబ్దాల పాటూ పోరాడి సాధించుకున్న తెలంగాణ వీరాధివీరులూ తెలంగాణ ఇచ్చేస్తే పంచమహాపాతకాలూ చుట్టుకుంటాయని తమ ఆఖరి రక్తపుబొట్టు వరకూ దాన్ని అడ్డుకుతీరతామని ఉత్తరకుమార ప్రజ్ఞలు పలికి అడ్డంగా నిలబడి సగంలో పక్కకి తప్పుకుని దారిచ్చిన అసమర్ధపు ఆంధ్రావాళ్ళూ తీరా విడిపోయాక యేదో మొదట్లో కొన్ని సమస్యలు వచ్చినా కొంతకాలం గడిస్తే రెండు రాష్ట్రాల పరిస్థితీ బాగుండొచ్చు లెమ్మనుకున్నారు గానీ జరుగుతున్నవి చూస్తుంటే ఈ రెండు రాష్ట్రాల లోని సామాన్యులూ పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డారా అనిపిస్తుంది!

          అప్పటిదాకా "అట్లెట్ల వస్తది తెలంగాణ" అని మిగత వాళ్ళు సందేహపడితే "ఇట్లిట్లె వస్తది తెలంగాణ" అని అందర్నీ ఒప్పించి తన వ్యూహ నిర్మాన చాతుర్యంతో అసదృస దుర్భాషా విష పరాక్రమంతో ముఫ్ఫయి సీట్ల బేవార్సు లంచమూ పార్టీ విలీనం ప్రతిపాదనా సకల జనుల కకావికకల సమ్మెలూ రోడ్డు మీద వంటల వినూత్న నిరసనలూ ట్యాంకుబండు మహనీయుల మీద చేతివాటపు కార్యక్రమాలూ వంటి వాటితో యేది నిక్కచ్చిగా పని చేసిందో తెలియదు గానీ మొత్తానికి సాధించుకొచ్చిన మేధావి అధికారంలోకి వచ్చాక మాత్రం వాహనాల రీరిజిస్ట్రేషను,1956 స్థానికత లాంటి అనుమానాస్పదమైన వింతపనులతో అవహేళన పాలయ్యాడు - ఆ తెలివంతా యేమయిందో మరి?సహజంగా ప్రభుత్వంలో  ఉన్నవాళ్ళు ఇట్లాంటి తెలివితక్కువ పన్లు చేస్తే ప్రతిపక్షంలో ఉందేవాళ్ళు యేమి చేస్తారు?వీళ్ళు ఇలాంటి పన్లులు చేసి బద్నామవుతున్నారు గాబట్టి వచ్చేసారి ప్రజలు మమ్మల్నే గెలిపిస్తారు అని చంకలెగరెయ్యకుండా యెవరయినా ఉంటారా!మొగుడు కొట్టినందుకు కాదు గానీ తోడికోడలు నవ్వినందుకు యేడుస్తున్నానన్నట్టు తన తెలివితక్కువ పన్లని తగ్గించుకుని తెలివిగా పరిపాలిస్తే సరిపోయేదానికి తెలంగాణ విఫలప్రయోగం అని నిరూపించటానికి కుట్రపన్నుతున్నాడు అని హశ్శరభ తశ్శరభ అని అంగలార్చి దాన్ని నిరూపించటానికి తనే కుట్రపన్ని ఇరికించినట్టు చిన్నపిల్లవాడికి కూడా తెలిసిపోయే అధమస్తపు ప్లానేసి ఓటుకు నోటు లాంటి స్టింగ్ ఆపరేషన్ ఆర్భాటంగా చేసి బాబుని బ్రమ్మదేముడు కూడా రక్షించలేడు అని వీరంగాలు వెయ్యటం తప్ప తెలంగాణ విశ్వామిత్రులుంగారు ఈ యేడాదిలో బంగారు తెలంగాణ కోసం నికరమైన పని యేదీ అసలు మొదలు పెట్టనే లేదు.

          ఇద్దరికీ తగినంత మేజారిటీ ఇచ్చి మీమీ రాష్ట్రాల్ల్లో మీ ఇష్టమొచ్చినట్టు ఆడుకోండిరా కబ్బాడీ అని జనం ఈలేసి మరీ గ్రీన్ సిగ్నళ్ళిస్తే ఆంధ్రా బాబుకి ప్రతిపక్షనాయకుడు వీకయ్యి అదృష్టం పట్టింది,నేను మాత్రం ప్రతిపక్షాన్ని యెందుకు సహించాలె అని పోటీపడి ఆకర్షతంత్రం వాడటం మొదలు పెట్టాడు!తెలివైనోణ్ణి అనుకుంటాడు గనక ముందే నాకు నాలుగేళ్ళు టైము ఇవ్వండని అడిగి జనం ఇచ్చామని యెక్కడా చెప్పకపోయినా ఇచ్చేశారనుకుంటూ అప్పుడు చెయ్యలేకపోతే అసలు వోట్లే అడగం అన్నాడు!నాలుగేళ్ళ తర్వాత రాజెవడో రెడ్డెవడో - యెవడు చూడొచ్చాడు?!అన్నిసార్లు అబధ్ధాలు ఆడవాళ్ళ కంటే అందంగా చెప్పిన మగవాణ్ణి నిజంగా నమ్మాలా?!ఇటు బాబుని చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి తప్పుల్ని ఉపయోగించుకుని రెండు చోట్లా జెండా యెగరెయ్యాలనే కక్కుర్తితో వెధవ్వేషాలు వేస్తూ తన మీదకి కేసొస్తే తప్ప విభజన చట్టం నిక్కచ్చిగా అమలు చెయ్యమని గట్టిగా అడగాలనిపించలేదు.తీరా రోషమొచ్చి అల్లరి చేసినా కేంద్రాన్ని అడిగి లేదనిపించుకున్నా కిక్కురుమనకుండా పడి వున్నాడు అజగరం లాగ,యెందుకీ పౌరుషహీనపు చేష్టలు!ఇప్పుడయినా మా సొంత పోలీసు స్టేషన్లూ ,హైదరాబాదులో పదేళ్ల హక్కు అని అక్కరకి రాని గొడవలు తప్ప ఆంధ్రాకి పనికొచ్చేవి చెయ్యడు, యేంటో మరి?యెంతోకాలం ముందునుంచే షెడ్యూలు 10లో ఉన్న కంపెనీలన్నీ మావే నని తెలంగాణ ముఖ్యమంత్రి అంత  గట్టిగా అంటుంటే కనీసం గట్టిగా వ్యతిరేకించను గూడా వ్యతిరేకించట్లేదు.ఈయన గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రియా తెలంగాణ ఇల్లిటపు టల్లుడా?ఒక కన్ను సగం గుడ్డిదయి అఘోరిస్తూ ఒకటిన్నర కన్నుతో ఉన్నా ఇంకా రెండు కళ్ళ గురించి  కలలు గంటున్నాడు పిచ్చిమారాజు!షెడ్యూలు 10లో ఉన్న కంపెనీ లన్నిట్నీ తెలంగాణ లాగేసుకంటే అసలే లోటులో ఉన్న రాష్ట్రంలో వీటన్నిట్నీ కొత్తగా యేర్పాటు చెయ్యాలంటే అయ్యే పనేనా?ఇతన్ని ముఖ్యమంత్రిగా యెన్నుకుని ఆంధ్రావాళ్ళు తప్పు చేసేశారు!దేని గురించి యెక్కడ పోట్లాడాలో తెలియని లోకజ్ఞాన శూన్యుదు ప్రతిపక్ష నాయకుదైతే జనం పరిస్థితి ఇలాగే అఘోరిస్తుంది కాబోలు?యెంత అనుభవం ఉండి యేంలాభం బాబుకి క్షాత్రం లేదు,స్వాభిమానం లేదు!కేంద్రం నుంచి రావలసిన వాటికి తను పోట్లాడడు,పార్టీ వాళ్లనీ పోట్లాడ నివ్వడు!పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకీ అంతే,తను మాట్లాడడు,మిగతా వాళ్ళనీ నోరు మూయించుతాడు,యెందుకు?

          ఈ యేడాదిలో నిక్కచ్చిగా బాగుపడిందెవరయ్యా అంటే ఒక రాస్ట్రంలో 49% మరో రాష్త్రంలో 47% అప్పనంగా కొట్టేసిన అధికార్లు!ఇన్నాళ్ళూ అడగందే అమ్మయినా పెట్తదన్నచందంగా నెలల తరబడి స్ట్రెయికులు చేసినా ఇస్తారన్నగ్యారెంటీ లేనిది కాస్తా ఇద్దరు ముఖ్యమంత్రులూ అడగ్గానే ఒప్పేసుకున్నారు?బల్ల కింద చేతులూ ఆగవు,మినిస్టర్లకి తాము కుదిర్చే కాంట్రాక్టుల్లో వాటాలూ తగ్గవు,అదనంగా ఫిట్మేంటు కూడా - వారెవ్వా మీ సోకు మాడ విభజన పుణ్యమా అని తంతే గారెల బుట్టలో పడింది మీరయ్యా?! తెలంగాణలో యే మేకపిల్ల కాలికి దెబ్బతగిలి ముఖ్యమంత్రి గారు అయ్యో అని జాలి పడినా ఆంధ్రాలో మేకపిల్లకీ జబ్బు చేస్తుంది!తెలంగాణ ముఖ్యమంత్రి చూడండి యెంత దయామయుడో,మరి ఆంధ్రా ముఖ్యమంత్రి కేమయింది అని శోకాలు తీసే మేకతల్లులు తయారు?అక్కడ పరిహారం లక్ష  ఇస్తే ఇక్కడ లక్షన్నర ఇవ్వాలి!ఆంధ్రాలో ఒక కోడి పది గుడ్లు పెడితే తెలంగాణాకోడి ఇరవై గుడ్లు పెట్టాలి,లేకపోతే తెలంగాణ మాగాణం ఆబోరు దక్కదు,సంఝే!ఒకరు ప్రపంచ స్థాయి రాజధాని అంటే ఒకరు ట్యాంకుబండు చుట్టూ 60 అంతస్థుల ఆకాశహర్మ్యాలు అనాలి,అనకపోతే అభిమానులు మెచ్చరు?వీళ్ళ సొల్లుకబుర్లు నిజం చేసి చూపించి పోటుగాళ్ళమని నిరూపించుకోవటానికి కావలసిన ధనం మాత్రం వాళ్ల జేబుధనం కాదు,ప్రజలు మరింత రెక్కలు ముక్కలు చేసుకుని వీళ్ళ యెదాన పొయ్యాలి?!

          అధ్భుత రాజధాని కోసం ప్లానేసిన తను డిజైను పన్లు జపాను వాళ్లకిచ్చి ఇటుకలు మోసే పని మాత్రం ఆంధ్రా పిచ్చిజనానైకి చెప్తున్నాడు!హరితహారం పేరుతో పంచాయితీకి యాభైవేల మొక్కలు ఇచ్చి పెంచే బాధ్యత మీదే ఒక్క మొక్క చచ్చినా వూరుకోనని సుగ్రీవాజ్ఞలు జారీ చేస్తున్నాడుతప్పితే దానికోసం నిధుల కేటాయించినట్టు యెక్కడా లేదేంటి?పంచాయితీలకి ఇప్పుడు యెన్ని నిధులు ఉన్నాయి?వాటిల్లో ముక్కా ముతకా పధకాలకి పోనూ మొక్కలు పెంచటానికి సరిపోయేటంత నిలవ నిధులు యెన్ని వున్నాయి?మొక్కలు నాటంగానే పెరగడానికి తెలంగాణ యేమన్నా డిస్నీల్యాండు లాంటి మాయాభూమి కాదుగదా!పాదులు తవ్వాలి,నీళ్ళు పొయ్యాలి,బలాలు చెయ్యాలి - యేదీ వూరికే రాదు గదా?ఒక్కో మనిషీ ఒక్కో మొక్కని కావిలించుకుని పడుక్కుని అన్ని పన్లూ అక్కదే కానిస్తే అదే యెరువూ అదే పోషణా అదే నీరూ అయ్యి పెరగాలి తప్ప మరోదారి యేదయినా ఉందా చెప్పండి!అప్పుడు గూడా వెయ్యిమంది జనాభాయే ఉన్న వూళ్ళో మిగతా ముఫ్ఫయి వేల మొక్కల సంగతేంటి?

          నిన్నటి రోజున పైస్థాయిలోని అధికార్లకి పుట్ట్టిన తెగులు ఇప్పుడు తెలంగాణ పారిశుధ్య కార్మికులకి పుట్టింది!వాళ్ళకి పుట్టిన నాలుగు రోజులకి ఆంధ్రా పారిశుధ్య కార్మికులకి పుట్టింది!వాళ్లడిగిన ప్రశ్న కూడా ఆటంబాంబు లాంటిదే "పెద్ద ఉద్యోగస్తులకి లక్షల్లో జీతాలు ఇస్తారు గానీ ఇంత కీలకమైన పని చేసే మాకు ఇంత తక్కువ జీతమా" అంటున్నారు,అడిగిందే చాలు మెహర్బానీ కోసం అంగలారుస్తున్న ఈ రెండు ప్రభుత్వాధినేతల తీరు చూసి ఒక్కసారిగా తెలివిమీరిపోయారు - వాళ్ళకి మాత్రం బుర్ర లేదా!తమదెంత కీలకమైన పనో చెప్పటానికి పని మానేసి కూర్చున్నారు.వాళ్ళు రోజూ సావాసం చేసేదే గాబట్టి వాళ్ళు భరించగలరు గానీ ఈ చెత్త తెలంగాణనీ ఈ చెత్తాంధ్రనీ మిగతా జనమంతా యెంతకాలం భరించగలరు?!

ఈ చెత్తపనుల్లో పోటీ కోసమా విడిపోయింది,హతవిధీ?!

Tuesday 14 July 2015

యేమిటి తెలంగాణ వాదులు ఆంధ్రావాళ్ళ పట్ల చూపించే ఔదార్యం?సంపద పెంచిన వాళ్ళని దొంగలంటూ పెట్టిన చేతిని కొరకడమా ఔన్నత్యం!

నాకింతవరకూ గుండు మధుసూదన్ అనే తెలంగాణ వ్యక్తితో యెక్కడా సంభాషణ జరగలేదు!మొదట్లో తను పద్యకవిత్వం రాయడం తెలిసి ఆ పోష్టులు కుతూహలం కొద్దీ చూశాను గానీ మితిమీరిన గ్రాంధికం నిండిన తన కవిత్వం  నాకు నచ్చలేదు!నేను కూడా పద్యాలు రాయగలను,రాస్తున్నాను - పనిగట్టుకుని పుంఖాలు పుంఖాలుగా పద్యాలు రాయాలనే దురద నాకు లేదు.నాకు నేను చెప్పాలనుకున్న భావాన్ని జనానికి పాయింటు యెక్కే విధంగా ఉంటే చాలు.భాష విషయంలో నేను పూర్తి లిబరల్.తేలిగ్గా అర్ధం కావాలి,వ్యర్ధపదాలు ఉండకూడదు - ముఖ్యంగా బోరు కొట్టించకూడదు!

కానీ ఆయన కవిత్వంలో ఇవేవీ లేకపోవడంతో ఆ తర్వాత అటుకేసి వెళ్ళడం మానుకున్నాను.ఇవ్వాళ బ్లాగుల్లో జై గొట్టిముక్కల,శ్రీకాంత్ చారి,గుండు మధుసూఒదన్ త్రయం గురించి తెలియని వారెవరు?మొత్తం తెలంగాణ ఉద్యమమంతా వీరు భుజస్కంధాల మీద మోసినట్టు ఫీలయ్యి బ్లాగుల్ల్లో హడావిడి చెయ్యటమే తప్ప తెరాసా పార్టీ సభ్యులో కారో రెలీదు,ఉద్యమమలోని యే సంఘటనలోనైనా ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు యేమయినా ఉన్నాయా అంటే అనుమానమే!జై అయితే అప్పటిదాకా వీరావేశంతో వాదిస్తున్నవాడల్లా నేను సూటిగా ఒక ప్రశ్న వేసేసరికి "నేను ఉద్యమానికి అంచున మాత్రమే ఉన్నాను" అనేసి తప్పుకున్నాడు,ఒక ఉద్యమ భావజాలాన్ని ఒప్పుకున్నాక అంచున ఉండడం మధ్యన ఉండటం కుదురుతుందా?జవాబులుగా ఇట్టాంటి జోకుల్ని వెయ్యగలిగిన కేతిగాళ్ళు మేధావులుగా చెలామణీ అయ్యారు తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని!

నాకు ఆంధ్రా తెలంగాణ ప్రజల మధ్యన యే తేడా కనిపించలేదు.నాకే కాదు చాలామందికి కనిపించవు - వీళ్ళకి మాత్రమే కనిపిస్తాయి.దానికో రహస్యమైన లెఖ్ఖ్కుంది!ఆఫ్రికా ఖండంలోని జనాన్నీ ఇండియాలోని జనాన్నీ,వైదిక సంస్కృతినీ ఇతర సంస్కృతుల్నీ అదీ ఇదీ అని గాకుండా ప్రపంచంలో యే రెండు వర్గాల ప్రజల్ని పోల్చి చూసినా వారిలో కొన్ని సారూప్యతలూ కొన్ని వైవిధ్యాలూ ఉంటాయి.ఆ ప్రజల్ని కలవనివ్వకుండా ఉంచడం ద్వారా గానీ విడదీసి యెడంగా ఉంచడం ద్వారా గానీ లాభం పొందాలనుకునేవాడు వాళ్ళలోని వైవిధ్యాల్ని మాత్రమే చూస్తాడు,వాటిని వైరుధ్యాలుగా ప్రచారం చేసి వాళ్ళమధ్య విభేదాల్ని పెంచుతాడు!అదే వాళ్లని కలిపి ఇరువర్గాలకీ మేలు చెయ్యాలనుకున్న వాదు వాళ్లలోని సారూప్యతల్ని చూస్తాడు,వాటి సహాయంతో వారిమధ్య ఐక్యతని పెంపొందించటానికి ప్రయత్నిస్తాడు!నేను విడదియ్యటం ద్వారా లాభం పొందాలనుకోవటం లేదు గాబట్టి నాకు ఈ రెండు ప్రాంతాల ప్రజలూ ఒక్కలాగే కనిపిస్తారు!వాళ్ళు విడగొట్టి ప్రయోజనం పొందాలనుకుంటున్నారు గాబట్టి తేడాల గురించే మాట్లాదతారు?!

వాళ్ళ రాష్ట్రం వాళ్ళు తెచ్చుకున్నారుగా ఇంకా యెందుకు తిడుతున్నారు వీళ్ళు మనల్ని అని చాలామందికి ఒక అమాయకమైన అనుమానం వస్తున్నది,కానీ ఈ ధోరణి ఇకముందు కూడా ఉంటుందనేది పచ్చి నిజం!కారణం లేని ద్వేషంతో అనంతకాలం వరకూ మనమీద పడి యేడుస్తూ ఉండే పొరుగు రాష్ట్రం తయారయింది - కాంగ్రెసు అనే ఒక నీచ నికృష్ఠ కమీన్ కుత్తే లాంటి పార్టీ చేసిన విభజన వల్ల.ఆ యేడుపుకి అంతూ ఉండదు,మన అశాంతికి పొంతూ ఉందు!యెందుకంటే,విభేదాలని సరి చేసే యే ప్రయత్నాన్నీ సాగనివ్వకూడదనేది ఆ విభేదాల్ని సృష్తించిన వాళ్ళ మొదటి అవసరం  - ఆ విభేదాలు మాయమైపోతే వాళ్ళ లాభమూ పోతుంది గనక వాళ్ళెప్పటికీ ఆ విభేదాల్ని తగ్గించే ప్రయత్నాల్ని సజావుగా సాగనివ్వరు?! రాష్ట్రం సాధించుకున్నాక గూడా ఆంధ్రావాళ్లని తిట్టడానికి ఇదే అసలు కారణం!యేడుపుకి కారణం తెలిస్తే దానికి పరిహారం చేసుకుని యేడుపుని ఆపవచ్చు.కారణం లేని యేడుపునీ,యేడుపు కోసం యేద్చేవాళ్లనీ యేవరాపగలరు?

ఆరునెల్లకోసారి అధాట్న వచ్చి హడావిడి చేసే పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడిన మాటలు పూర్తిగా అర్ధం లేనివి!తను గందరగోళంలో ఉండి ఆ గందరగోళాన్ని అక్కడ వెదజల్లడం తప్ప పట్టించుకోవాల్సిన సరుకంటూ యేమీ లేదు. తను ఇదివరకు మాట్లాడిన వాటిల్లో కొన్నయినా మంచిమాటలు ఉన్నాయి - ఇప్పుడదీ లేదు.ఆర్టికిల్ 8 వొద్దన్నవాడు వూరుకున్నాడా, రెండు రాష్ట్రాలకీ సంధానకర్తగా ఒక ఐ.యే.యస్ ఆఫీసర్ని పెట్టి ఆ ఆఫీసర్ని ప్రధానమంత్రికి అతికించమన్నాడు,అది తెలంగాణ ప్రభుత్వం మీద కేంద్రం పెత్తనం చెయ్యడం కాదా?విభజన బిల్లులో ఉన్నదే నయం కదా తీసుకెళ్ళి పధానమంత్రి కుర్చీకి కట్టెయ్యడం కన్నా!అది నాకు నచ్చలేదు,ఆ ఒక్క పాయింటు మీద ఫుల్ పోష్టు యేమి వేస్తాంలే అని చూస్తుంటే "ఆంధ్రోళ్లు అనొద్దు.. ఆంధ్రా ఎంపీలకు పౌరుషం లేదా?" అనే ఆయన పోష్టులో అదే పాయింటు కనబడటంతో అక్కడ కామెంటుగా వేశాను..పబ్లిష్ చెయ్యటం,దాన్ని పరామర్శిస్తూ జవాబు చెప్పటం,ఆయన అలవాటు చొపున "స్వస్తి" అనటం అన్నీ జరిగిపోయినాయి..కానీ "ఇదంతా మా ఔదార్యమే.. మీ హక్కు కాదు..!!" పోష్టు చూశాక్ మాత్రం వూరికే ఉండలేకపోతున్నాను,సరయిన జవాబు చెప్పి తీరాల్సిందేననిపించింది!యెంత విషం కక్కుతున్నారు చదువు సంస్కారం,విచక్షణ యేదీ లేదా వీళ్ళకి అనిపించింది! 

మధ్యలో నీహారిక ఉరఫ్ ఆకుల ధన ఉదయ లక్ష్మి అనే ఒకావిడ యేదో పుడింగిలాగా వెళ్ళి ఒక తింగరి కామెంటు వేసింది!కేసీఆర్ ముఖ్యమంత్రవుతాడు అని అప్పుడే చెప్పిందట,కానయితే రాజమార్గం వదిలి దొడ్డిదారిన వెళ్తాడని వూహించి అఘోరించలేదట! అందుకనే కేసీఆర్ అంటే ఒక సైడున లవ్వూ ఒక సైడున హేటూ నట!యేదో ఒక వైపు నుంచే చూసి అఘోరిస్తే పొయ్యేదానికి రెండు వైపుల్నించీ చూట్టం దేనికి?కాసేపు పొగట్టం కాసేపు తిట్టటం చేసి జనానికి తిక్క పుట్టించటం దేనికి?అంతా మెంటల్ తెలివి!కేసీఆర్ గారూ మా వూళ్ళో మీ జండాలు నాలుగు కనపడుతున్నాయి,ఇక్కడ కూడా పోటీ చేయండీ అని కూడా అఘోరించగలదు!ఒక మాట కాదు ఒక తీరు కాదు,ఒక విధానం లేదు ఒక సిధ్ధాంతం లేదు - యెందుకీ బహురూపుల సంత?బాబు దొంగ అని తెలిసినా మీరు బాబుని సమర్ధిస్తున్నారు అని వరూధిని బ్లాగులో అంత భీకరంగా నన్ను విమర్శించి ఇక్కడ "సి.బి.ఐ ఒకవైపు సతాయిస్తుంటే" అని కునిష్ఠి పెద్దరికం చూపిస్తూ సమ్యమనం కోసం బతిమిలాడుతున్నది - యెవర్ని?

రోజుకోసారి తన కృతకభాషాపాండిత్యంతో ఆంధ్రోళ్ళని తిడుతూ పుంఖాలు పుంఖాలుగా పద్యాలు రాస్తూ సరస్వతీ దేవికి కూడా తన ద్వేషగీతాలకి రికార్డింగు డ్యాన్సు చేసే దుస్థితి కల్పించిన వాడు ఈ పుచ్చొంకాయ పాండిత్యానికి మురిసి ముక్కలై తిట్టడం మానేస్తాడా?తనదైన శైలిలోనే స్వస్తి వాక్యాలతో గడ్డి పెడుతూ జవాబు చెప్పాడు:"తెలంగాణులు సంయమనం పాటించడం వల్లనే ఇక్కడ తెలంగాణలో ఆంధ్రవాళ్ళు హాయిగా శాంతియుతంగా జీవించగలుగుతున్నారు. తెలంగాణులు అమాయకులు. కుడుమంటే పండుగ అంటారు. ఎవరైనా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళు మంచివాళ్ళనుకుంటారు. లోపల ఒకటి పెట్టుకొని బయటికొకటి మాట్లాడరు! ఏదైనా అసమ్మతి ఉంటే ముఖం ముందటే చెప్పేస్తారు. పై పై మెరుగులతో మాట్లాడరు. వాళ్ళకు ప్రేమించడం తెలుసు...ద్వేషించడం తెలియదు. ఒకవేళ ద్వేషిస్తే జీవితకాలం ద్వేషిస్తారు. మొదటే క్షమాగుణం కలిగి వుంటారు. తాము చూపినది అకారణ క్షమ అని తెలిస్తేమాత్రం వాళ్ళంత కఠినులు ఉండరు. ఆ కఠినత్వం వాళ్ళు తమను మోసం చేసిన వారిపై చూపిస్తారు. అంతే కానీ, సంయమనం కోల్పోరు. వాళ్ళు సంయమనం కోల్పోయేవాళ్ళే అయితే అరవై ఏండ్లు ఆంధ్రవారిని భరించేవాళ్ళేకారు. కాబట్టి మీరు సంయమనం గురించి మమ్మల్ని హెచ్చరించనవసరంలేదు." అని.అయినా తెలంగాణ కోడలినని చెప్పుకునే ఈ మనిషి కనీసం తెలంగాణ గురించి మాత్రమే ఆలోచించి మెట్టినింటిలో ప్రశాంతంగా ఉండకుండా ఇంకా ఆంధ్రా గురించి ఆందోళన పడుతూ సామరస్యం కోసం వాళ్ళని ప్రాధేయపడట మేమిటి?

దానికి నేను చెప్పిన జవాబు ఇది:"ఆంధ్రావాళ్లని మీరు భరించిందేమిటి?విభజనకి ముందు సమైక్య రాష్ట్రంలో హైదరాబాదు ఆదాయం యెంతో తెలుసా? అప్పటి రాష్ట్రంలో ఉన్న రాయలసీమ,తెలంగాణ, ఆంధ్ర అనే మూడు ప్రాంతాల ఒక్కో ప్రాంతం నుంచీ యెంత వస్తుందో ఒక్క హైదరాబాదు నుంచే వాటికి దీటుగా వచ్చేది!అందుకేగా మీరు కూడా హైదరాబాదు తెలంగాణ గుండెకాయ అని దాన్ని యూటీ చెయ్యడానికి ఒప్పుకోనిది!మొహమాటం లేకుండా చెప్పాలంటే మేధావుల దగ్గిర్నుంచి చిన్నపిల్లవాడి వరకూ హైదరాబాదు ఆదాయంలో సింహభాగం ఆంధ్రా పారిశ్రామికవేత్తల నుంచీ వ్యాపారవేత్తల నుంచీ వస్తున్నదని చెప్తాడు!ఇవ్వాళ విభజన అనంతరం మీ ముఖయ్మంత్రి కూడా వాళ్ళని పొమ్మనకపోగా వాళ్ల సేవలు మాకు కావాలి అంటుండదం మీకు తెలియదా?మాకు తెలియదా?యాభయ్యేళ్ల క్రితం నిజాము కట్టిన కట్టడాల గురించి కూడా చరిత్రలు చెప్పేవాళ్లకి విభజన సమయంలో యే ప్రాంతపు ఆదాయం యెంతో లెఖ్ఖలు తెలియవా? 

ఆదాయం పెంచగల సత్తా వున్నవాళ్ళు గనకనే ఇవ్వాళ్టికీ అక్కడనుంచి మీరు వాళ్లని కదిలించలేకుండా వున్నారు,అవునా కాదా?పొరపాటున మీరు తన్ని తగిలేస్తే తెలంగాణ ఆదాయంలోనే ఒక పెద్ద బొక్క పడుతుంది,అది తెలుసా మీకు? మాటల్ని పొదుపుగా వాడటం మీకే మంచిది! ఒక మాటతో సరిపోయేచోట పదిమాటలు మాట్లాడితే ఒకమాతతో సరిపెట్టినప్పటికన్నా వాటిలో యే నాలుగో అయిదో తప్పుడు మాటలు వస్తాయేమో ఇరుక్కుపోతాం అనే వివేకంతోనన్నా తక్కువగా మాట్లాడటం నేర్చుకోండి!మీరు ఆంధ్రావాళ్లని భరించేదేమిటి?వాళ్ళు మొట్టమొదట అక్కడ అడుగుపెట్టినప్పుడు సాటి తెలంగాణ వాడయితే 10 ఇస్తాడు, వాళ్ళు ఇక్కడ భూములు కొనడానికి లిటిగేషను ఉంది గనక ఆంధ్రావాడికి అమ్మ్మితే 30 ఇస్తాడు అనే విధమైన తెలివిని అప్పటి స్థానికులు చూపించడం వల్లనే తెలంగాణా వ్యాపారవేత్తలు అప్పట్లో వ్యాపార పారిశ్రామిక రంగాల్లో ప్రవేశించలేకపోయారు - నిజమైన చరిత్ర చదవండి తెలుస్తుంది! అప్పట్లో ఆ పోటీని తట్టుకుని యెదిగిన మీ తెలంగాణా ప్రాంతపు పెద్దమనిషే తన జీవితానుభవాల్ని చెప్తూ "ఆంధ్రావాళ్ళు పోటీపడి భూములకి విపరీతంగా రేట్లు పెంచెయ్యడంతో మాలో చాలామంది వెనకబడి పోయారు" అని తను చూసినదాన్నే చెప్పాడు. ఇప్పటికయినా మీ అనుబవాల నుంచి పాఠాలు నేర్చుకుంటే యెదుగుతారు తప్ప మమ్మల్ని విమర్సిస్తే లాభమేమిటి? తెల్లారి లేచి నోరు తెరిస్తే చాలు సామాన్యుల్ని మేమేమీ అనట్లేదు మమ్మల్ని దోచుకున్నవాళ్ళనే తిడుతున్నాం అని మీరు యెవరినయితే తిడుతున్నారో ఇవ్వాళ కూడా మీ ముఖ్యమంత్రీ మీరూ వాళ్ళనే నెత్తిన మోస్తున్నారు మా తెలంగాణ వృధ్ధిలోకి రావడానికి మీరే సాయం చెయ్యాలె అని - అది యెక్కుతుందా! పెట్టిన చేతిని కొరుకుతున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? 

మరోసారి మీ మాటల్ని సరిచూసుకోవడానికి ఇవ్వాళ తెలంగానలో యేమి జరుగుతుందో చెప్తాను,"నిన్నటిదాకా మా తెలంగాణాని దోచుకున్నారు అని యెవరిని తిట్టారో యెవరి దోపిడీని బూచిగా చూపించి తెలంగాణాకి వీరివల్ల జరిగిన అన్యాయానికి ప్రతిగానే మేము రాష్తం విడగొట్టుకోవాలనుకున్నాము అని చెప్పారో ఇవ్వాళ్టికీ వాళ్ళు అక్కడే ఉన్నారు,ఆ దోపిడీ దారులు లేనిదే తెలంగాణా అభివృధ్ధిపధంలో పయనించదు అని నిష్కర్షగా మీ ముఖ్యమంత్రియే స్వయంగా అంగీకరించాక కూడా ఆంధ్రావాళ్ళు దుర్మార్గులని అంటున్నారంటే మరొకరు వాదించి రుజువు చెయ్యాల్సిన అవసరం లేకుండా మీ వాదన అబధ్ధమని మీరే ఒప్పుకుంటున్నట్టు" - అర్ధమయిందా?ఇవ్వాళ్టికీ మీకు రాష్ట్రపు ఆదాయం పెంచటానికి ఉపయోగపడుతున్న వాళ్ళని దొంగలని అనడం పెట్టిన చేతిని కొరకదం అనికాక మరేమని అంటారో మీరు చెప్పండి నేను వింటాను! 

ఇవ్వాళ మిమ్మల్ని నిలవలో ఉంచింది వాళ్ళ కష్టమే,కావాలంటే మీ ముఖ్యమంత్రినే అడగండి?!గణాంకాలతో సహా సాక్ష్యాలు ఉన్నాయి గనకనే హైదరాబాదు ఆదాయంలో మా వాటా మాకు పంచమని అడిగాం.సూది మొనమోపినంత కూడా ఇవ్వమన్న దుర్మార్గం మీదే! ఇప్పుడు ఇద్దరూ కలిసి చర్చించుకుని న్యాయంగా పంచుకోమని చెప్తున్న షెడ్యూలు 10లో ఉన్న వాట్ని కూడా లుంగజుట్టి లాగేసుకోవాలనుకుంటున్న అసలైన దోపిడీ మీదే!! 

దాన్ని కప్పుకోవటానికి మాకు దుర్మార్గం అంటగడుతున్నారు - మోసాలతోనూ గయ్యాళితనంతోనూ అబధ్ధాలతోనూ నిర్మిస్తున్నారా తెలంగాణని!మొగుణ్ణీ కొట్టి మొగసాలకి యెక్కడం అనేది మీకే వర్తిస్తుంది,మాకు కాదు?!"

వాళ్లని నిందిస్తున్నట్టున్న నా రాతలు ములుకుల్లా తగిలాయంటున్నాడే గానీ వాళ్ళు అన్న మాటల్ని ప్రస్తావిస్తే మాత్రం దానికి మాత్రం జవాబు ఇవ్వడం లేదు ఆ బ్లాగు యజమాని!తిరపతి సన్నివేశం ఒక్కటే మహా దుర్మార్గం కాబోలు,దానికి ముందు వాళ్ళు చేసినవి చరిత్రలో రికార్దు కాలేదనా ఆ ధైర్యం?

మరో మేతావి జై గొట్టిముకల రంగంలోకి దిగి "ఆదాయం మా ప్రాంతం నుండి వచ్చిందని టెక్కులు పొయెబదులు వాళ్ళను మీ రాష్ట్రానికి రమ్మనండి వస్తారేమో చూద్దాం.అని ఇంత పొడుగున చాలెంజి చేస్తున్నాడు,మరి యెప్పుడో నేనే "వాళ్ళు యెక్కడికెళ్తారన్నది మాకనవసరం వాళ్ళు తెలంగాణని దోచుకున్నారని యాగీ చేసింది మీరు గాబట్టి మీ ముఖ్యమంత్రిని వాళ్ళింకా అక్కడెందుకున్నారని మీరు నిలదియ్యగలరా?" అని తననే చాలెంజి చేశాను గదా?దాన్ని టేకప్ చేసి వాళ్ళ ముఖ్యమంత్రిని నిలదీసి వాళ్ళు తేలంగాణని దోచుకున్నారని చెప్తున్న వాళ్లందర్నీ పేరు పేరునా తేలంగాణ నుంచి తరిమి కొట్టగలరా?తెవాదు లందరికీ ఇది నా చాలెంజ్.

నన్ను చాలేంజి చేసిన ఆ జై గొట్టిముక్కలకి నేను చేస్తున్న ఓపెన్ చాలెంజి ఇది,యాక్సెప్ట్ చేస్తాడా?

Sunday 12 July 2015

బాహుబలి సినిమా చూసేశానోచ్!రాజమౌళి ఇరగదీసేశాడహో!

వెండితెర అధ్భుతం!నింగినుంచి జారుతున్నదా అన్నంత యెత్తునుంచి జారుతున్న ఒక జలపాతం,శివుని జటాజూటం నుంచి ఉప్పొంగి దూకే దివిజ గంగ ఇంత తెల్లగా ఉంటుందేమో అనిపించే కళ్ళు చెదిరేటంత ధవళ సౌందర్యం అతి దగ్గరి నుంచి కనిపిస్తే చూడాలని తహతహ లాడే వాళ్లకీ కొయ్యబొమ్మలు మెచ్చు కళ్లకు కోమలుల సౌరెక్కునా అన్నట్టు ఇప్పటిదాకా తక్కువ రకం అందాలకి అలవాటు పడిపోయి ఇంతకన్నా గొప్ప అందం ఉండదని మైండులో ఫిక్సయిపోయిన దిక్కుమాలిన స్థితిలో ఉన్న సగటు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ఒక మహాధ్భుతమైన సౌందర్య పుష్పం ఒక్కసారిగా వెయ్యిరేకులతో విచ్చుకుంటే చూసి తట్టుకోగలిగిన వాళ్లకి బాహుబలి చూడటం ఒక అదృష్టం!నిజమే - సినిమాలో యెన్నో గొప్ప అంశాలు ఉన్నాయి, అందరూ అనుభవమున్న వాళ్ళే గనక నటీనటుల నటన అధ్భుతంగా ఉంది, అంత సుదీర్ఘమయిన సమయం తీసుకుని చెక్కారు గనక పాత్రల రూపురేఖలూ గొప్పగానే ఉన్నాయి< కధ రాజమౌళి చాలాసార్లు చెప్పినట్టు చందమామ కధే, పాతకాలం రాజులు సింహాసనం మీద యెవరు కూర్చోవాలనే పంతాల కోసం ఒకరినొకరు మోసం చేసుకోవడాలతో కూడిన పాత యెంటీవోడి కత్తి ఫైటింగుల సిన్మాల నాటి రొడ్డకొట్టుడు మామూలు కధ!కానీ వాటికన్నా ప్రత్యేకంగా ఉండి ఇవ్వాళ సినీమా చూసి వచ్చాక నన్ను వెంటాడుతున్నదీ మీరు చూసి బయటి కొచ్చాక మిమ్మల్ని వెంటాడబోయేదీ ఆ జలపాతపు సౌందర్యమే!

తను ఇప్పటికే చందమామ కధల నుంచే ఇన్స్పైర్ అయ్యానని చెప్పేశాడు గనక కధ గురించి చెప్పడానికి పెద్దగా యేమీ లేదు. సినిమా అంతా ఎంజాయ్ చేస్తూ చూసి  ఇంటికొచ్చాక తీరిగ్గా కూర్చున్నాక ఇంతకీ బాహుబలులు యెంతమందీ అని మా ఫ్రెండుకి డౌటొచ్చేసింది!ఇక్కడ కధ చెప్పినా మీకు చూసేటప్పుదు ఖచ్చితంగా డౌట్లొస్తాయి!యెందుకంటే మొదట అనుకున్న కధని పూర్తిగా తీస్తే యేకబిగిన చూడాలంటే ఐదారు గంటలు పడుతుందని చాలామటుకు సీన్లని నరికేసి అత్యవసరమైన వాట్ని కూడా ఒకే సినిమాగా చెప్పలేమని రెండు పార్టులుగా తీశారు గాబట్టి ఇప్పుడొచ్చిన డౌట్లన్నీ తీరాలంటే రెండో పార్టు వరకూ ఆగాల్సిందే!ఫాంటసీ కధ గాబట్టి రీజన్ అడిగే దమ్ము యెవడికీ లేదు.అడిగిన వాడు గొట్టం గోవిందరాజులే!దీనెమ్మా జీవితం మన చుట్టూ ఉన్న లైఫులో మాత్రం యేది రీజను ప్రకారం జరుగుతాంది!?కొందరు మొదటి సగం స్లో అనీ,రెండో సగంలో వార్ సీన్లు సాగదీశాడనీ,, మొదటి పార్టుని మరీ హఠాత్తుగా ఆపేశాడనీ వంకలు పెట్టారు గానీ నాకు మాత్రం అవి కూడా పెద్ద తప్పులని అనిపించలేదు.కామెడీ కోసం కుప్పిగంతులు వెయ్యకుండా,అక్కర్లేని తిగరి హీరోయిజానికి బిల్డప్పులిచ్చే పంచ్ దైలాగుల మోత లేకుండా,అవేవీ లేకపోతే సినిమా హిట్టవ్వదేమో అనే మూఢనమ్మకాన్ని బద్దలు గొడుతూ బోరు కొట్టించని మంచి సినిమా ఇది!

ఒకటి మాత్రం నిర్మొహమాటంగా చెప్తాను.ఈ సినిమాలో చూసిన యుధ్ధపు దృశ్యాల్లో కొన్నిట్ని నేను టీవీలో "300","హెలెన్ ఆఫ్ ట్రాయ్" లాంటి ఇంగ్లీషు సినిమాల్లో యెప్పుడో చూసేశాను.అవి కాపీ సీన్లని నాకు తెలుసు,అయినా సరే కధలో చక్కగా ఇమిడ్చి మంచి కాంబినేషన్ కలిపి తీశాడు గాబట్టి అంత చక్కగా కాపీ కొట్టగలిగినందుకైనా మెచ్చుకోవాల్సిందే!కాపీ కొడుతుండగా ఇన్విజిలేటరుకి దొరికిపోయి డిబారయిన వాడికీ పట్టుబడకుండా కాపీ కొట్టి ర్యాంకు తెచ్చుకోగలిగిన వాడికీ తేడా లేదూ?! 

సినిమాకి వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుదూ నేనూ మా ఫ్రెండూ చెప్పుకున్న కబుర్లతో సహా ఈ బాహుబలి సినిమా చూడటం నిజంగా ఒక మంచి అనుభవమే నాకు మాత్రం!వాడు మొదట సత్యంలో పనిచేసి మహీంద్రా వాళ్ళ కిందకి వెళ్ళాడు.ఇప్పుడు మహీంద్రా పరిస్థితి యేం బాగులేదట!నష్టాల్లో ఉండి వచ్చే నెల నుంచి జీతాల్లో కోత మొదలవబోతుందట.అదివరలో యెక్కడ విన్నా మహీంద్రా పేరు చెవుల్లో హోరెత్తిపోతూ వినబడేది బ్రాండ్ వేల్యూ తగ్గిందా?ఆ ఒక్క కంపెనీకే సమస్య వస్తే జరిగే నష్టం కన్నా ఆ ఫీల్దు మొత్తం ఎఫెక్టయితే చిన్నా చితకా కంపెనీలయితే బోర్డులు తెప్పెయ్యడమే గదా?అందులో పనిచేసేవాళ్ళ పరిస్థితి యేంటి?వెళ్ళేటప్పుదు ఇలాంటి కబుర్లయితే వొచ్చేటప్పుడు మావోడికి హుషారొచ్చేసి ఫ్రెండ్సుకి ఫోన్లు చేసి మౌత్ పబ్లిసిటీ మొదలెట్టేశాడు.గుంటూరోడయ్యుండీ  పుట్టి పెరిగిన మాతృనగరం గుంటూరునే భయంకరంగా అవమానించే లెవెల్లో "గుంటూరు డబ్బా ధియేటర్లలో మాత్రం చూడకురోయ్,బెజవాకో హైదరాబాదుకో వొచ్చి మాంచి సౌండెఫెక్ట్సుతో అదరగొట్టే పెద్ద హాల్లో చూడ"మని ఉబోసలు కూడ పారేస్తున్నాడు.అదేంట్రా మీ వూరినే అట్టా చిన్నబుచ్చుకుంటావు అంటే మా బుంటూరోళ్ళం అంతేరా తమ్ముడు తనోడయినా ధర్మం మాట్లాడే టైపు అని సెల్ఫుడబ్బా కొట్టేసుకుని మా గుంటూరు ముండ కెక్కువా ముత్తయిదువకి తక్కువా అనేస్తున్నాడు!ఒరేయి బాపనోడివి నువ్వు బూతులు మాట్టాడితే యెట్టారా అని పైకి అన్నా గానీ మైండులో మాత్రం సుప్రభాతాల్లో కూడా బూతులు రాసింది వాళ్ళే గదా అనుకున్నా లోపల్లోపల:-)ఇప్పటి దాకా మెయిన్ లైనుకి పక్కకుండిపోయి వెనకబడిపోయిందిరా, ఇప్పుడు డైరెక్టుగా రాజధానిలో కలిసింది గాబట్టి కొంచెం ముందుకెళ్తుందేమోలే అన్నాడు!ఆ సినిమాకి తెగే టిక్కెట్లలో ఓ పదిశాతమయినా నీమూలంగా తెగేట్టు ఉన్నాయి.యెస్సెమ్మెస్ సాక్ష్యాలు జాగ్రత్త్తగా ఉంచి రెవెన్యూలో వాటా అడుగు అని జోకేస్తే నిజమే అడుగుతానని ఐడియా ఇచ్చినందుకు నాకు షేక్ హ్యాడిస్తున్నాడు మా గుంటూరు శాస్తుర్లు!ఒరేయి సమైక్య రాష్ట్రాన్ని బోడి ఆంధ్రప్రదేశ్ అన్నాడురా ఒక గాడిద,ఆ బోడి తెలంగాణ కెందుకు మీవాణ్ణీ చెన్నై రమ్మను అంటే నిజమే,ఈసారి ఫోన్లో కలిసినప్పుదు చెప్పాలి అని వాడూ ఒప్పుకున్నాడు?!

సినిమా గురించి ఆపేసి ఈ జోకులన్నీ యేంత్టని దౌటు రావొచ్చు,మీరు కూడా ఒంటికాయ సొంతికొమ్ములాగా వెళ్ళాను,చూశాను,వొచ్చాను అని కాకుండా నలుగురితో కలిసి సరదాగా వెళ్ళిరండి - ఇంటి దగ్గిర్నుంచి బయల్దేరి మళ్ళీ ఇంతికొచ్చేవరకూ బోరు కొట్టకుండా ప్లాను చేసుకుని వెళ్ళండి అని చెప్పదల్చుకున్నా!

మనవాళ్ళు గోప్పగా అప్పుడప్పుడూ కొన్ని అధ్భుతాల గురించి చెప్తారే అల్లాగ - వానలో తదవని వాడూ బాహుబలి చూడని వాడూ,చూసి నచ్చలేదన్న వాడూ వేస్ట్ క్యాండిడేట్ కింద లెఖ్ఖ!మా ఐద్దరితో పాటు హాలు దగ్గిర మరో తెలుగు కుర్రాడు కలిశాడు - నిన్ననే చూసి మళ్ళీ మావాణ్ణి చాన్సుంటే నాకూ టిక్కెట్టు తీసుకోమన్నాడంట!పైకి యేమడుగుతాం గానీ సినిమా చూశాక ఇప్పుడు మాత్రం కుర్రాడు ఖచ్చితంగా తమన్నా కోసమే వచ్చుంటాడు!రెండు పాటల్లో రాఘవేంద్రుణ్ణి మరిపించేశాడు రాజమౌళి!?

Monday 6 July 2015

హమ్మయ్య, నా చదరంగం సైటుని ముఖపుస్తకానికి అనుసంధానించేశా!

ఇదివరలో నేను చదరంగం ఆధారంగా ఒక వెబ్ పేజి తయారు చేశానని చెప్పాను గదా!దానికి మిత్రులు "అశోక్ కృష్ణ" కొన్ని అదనపు ఆకర్షణల్ని చేరిస్తే బాగుంటుందని చెప్పారు.చాలా శ్రమ తీసుకుని అమూల్యమైన సూచనలు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు!వాటిలో ముఖ్యమైనవి 1.ప్రతివారూ అన్నిచోట్లా వెంటనే రిజిస్టర్ అవడానికి ఉత్సాహం చూపకపోవచ్చు గాబట్టి ఒక ట్రయల్ గేం ఉంచమన్నారు.2.ఇవ్వాళ సోషల్ మీడియా ప్రోత్సాహం లేకుండా యేదీ ముందుకెళ్ళదు గనక ముఖపుస్తకానికి కలపమని ఒక సలహా ఇచ్చారు.

ఆ రెండూ ఇప్పటికి పూర్తయినాయి.మీకు గనక ముఖపుస్తకం అకవుంటు ఉంటే మళ్ళీ ఇక్కడ అన్ని వివరాలూ యేకరువు పెట్టనక్కర లేకుండా రిజిస్ట్రేషన్ ఫారం లోని "from facebook" బటన్ నొక్కితే తిన్నగా మీ ముఖపుస్తకం వివరాలు ఇక్కడికి వాటంతటవే సర్దుకుంటాయి.మీరు పాస్ వర్డ్ మాత్రం పూర్తి చేస్తే చాలు.అట్లాగే లాగిన్ అవ్వాలనుకున్నా లాగిన్ విండోలో ఇప్ప్పుడు యెడమ పక్కన ముఖపుస్తకం లోగో మీద క్లిక్ చేస్తే చాలు,ఇదివరకె మీరు ముఖపుస్తకం తెరిచి ఉంటే అమాంతం ఈ సైటులోకి కూడా వేళ్ళిపోవచ్చు. ఇది ముఖపుస్తకం వారు ఇచ్చిన సౌకర్యమే గాబట్టి సెక్యూరిటీ గురించి కూడా మీరు వర్రీ కానక్కర లేదు!

చదరంగం ఆట కొంచెం తెలిసిన వారు ఇక్కడ తమ ఆటను మెరుగు పరుచుకోవచ్చు.ఈ సైటు మెంబర్ల నుంచి ఆటలో ప్రత్యర్ధిని యెంచుకుని అవతలివారితో ఆడవచ్చును.తద్వారా ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారం కూడా అవుతుంది - బాగా పాప్యులర్ అయితే?!చదరంగం చుట్టూ చాలా సైటులు ఉన్న్నాయి కానీ దీని ప్రత్యేకత ఆని సులువుగా ఆడగలిగేలా చెయ్యటం.ఆట బల్ల మిగతా సైట్ల కన్నా తేడాగా 3డిలో కనిపిస్తుంది.ఆట గురించి యెక్కువ వివరాలూ చరిత్రా లాంతివాటికి పోకుండా పూర్తిగా ఆట ఆడానికి సంబంధించిన విషయాల గురించే యెక్కువ దృష్తి పెట్టాను.చదరంగం ఆటకి సంబంధించిన ప్రత్యేకమయిన యెత్తులు - కోట కట్టడం,ఎన్ పసాంట్,చెక్మేట్,పాన్ ప్రమోషన్ లాంటివన్నీ చాలా సహజంగా వచ్చేటట్లు చేశాను!

కాకుంటే అడోబ్ అప్లికేషన్ ప్యాకేజిలో ఉన్న ఫ్లాష్ ప్లేయరు మీ కంప్యూటరులో ఉంటేనే ఆదగలరు.ఒకవేళ మీ కంప్యూటరులో ఫ్లాష్ ప్లేయరు ఉందా అలేదా అని మీరు చెక్ చేసుకోనక్కర లేదు.అది లేకపోయినట్లయితే ఆ స్థానంలో మెకు ఒక లింకు కనబడుతుంది.ఆ ఇంకు వల్ల ప్రమాదం యేమీ లేదు.అది అడోబ్ వారి అధికారికమైన వెబ్ పేజి కాబట్టి దానిద్వారా వైరస్ పాకుతుందేమో అనే సందేహం కూడా అక్కర లేదు.

ఆట గురించి గానీ సైటు గురించి గానీ సందేహాలు వస్తే అక్కడ హెల్ప్ మెనూ ఉంది.చదరంగం వచ్చిన వారూ,నేర్చుకోవాలనుకునే వారూ ఇక్కడ ప్రవెశించి ఆడి చూసి తమ అభిప్రాయాలను చెప్పగలరు.సైటు ఒక మోస్తరుగా పాప్యులర్ అయినా చాలు నా ఆశయం నెరవేరినట్టే!నా అసలైన ప్రయత్నమంతా దీని చుట్టూ ఒక యాండ్రాయిడ్ యాప్ కూడా తయారు చెయ్యాలని!యాండ్రాయిద్ మెమరీ తక్కువ కాబట్టి డాటా స్తోరేజి కోసం ఒక శాసతమైన చోటు యెట్లాగూ ఉండాలి కదా!వెబ్ పజిగా దీని ప్రయోజనం దీఎనికి ఉన్నా నా అసలైఅన లక్ష్యం దీన్ని యాండ్రాయిడ్ యాప్ చెయ్యాలనే.




Thursday 2 July 2015

అయ్యయ్యో బ్రహ్మయ్యా!అన్యాయం చేశావేమయ్యా?ఇచ్చిన పుణ్యం యేమైందయ్యా!తెలంగాణలోనూ ఖాళీబొచ్చెయేనా?

     దానవీరశూరకర్ణ సినిమాలో అప్పటిదాకా దేవుళ్ళ పాత్రల్లో ప్రశాంత వదనంతో కరుణ ఒలికించే సంభాషణలతో దైవత్వాన్ని చూపించిన నందమూరి తారక రామారావు దుర్యోధనుడనే దుష్టుడి పాత్రలో చాంతాడు పొడుగు దుష్టసమాసాల్ని కరకరా వేడి వేడి సమోసాల్లా నమిలి వూసేసినా నాకు మాత్రం ధూళిపాళ శకుని వేషంలో కొట్టిన డవిలాగులే మజ్ఝారే అనిపిస్తాయి!రామారావు గెటప్పుల్లోనే కాదు మూడు వేషాల్ల్లోనూ ఆపాదమస్తకం చాలా గొప్పగా వేరయిటీ చూపించాడు.దుర్యోధనుడిగా "సోదరా దుశ్శాసనా.." దగ్గిర్నుంచి "వందిమాగధులారా కర్ణమహారాజును కర్ణపేయముగా కీర్తింపుడు" అనే వరకూ పెంకులెగిరిపోయే గొంతుతో క్షణం కుదురుగా నిలవకుండా నిలువెల్లా ఆవేశంతో వూగిపోతే పక్కనే కర్ణుడిగా మహావినయంగా లోగొంతుకతో "మహాదాతా!నా రక్తాన్ని రంగరించి మీ యశోరక్షణకు నా సమస్తం ధారపోస్తాను!" అని సుకుమారంగా చెప్తుంటే కళ్ళు మూసుకుని వింటున్నా మాట్లాడుతున్నది దుర్యోధనుడనీ కర్ణుడనీ తేడా తెలిసేటంత గొప్పగా చేసిన స్వరవిన్యాసం నిజంగా అధ్భుతమే!అటు రారాజు లోని అహంభావాన్నీ ఇటు అప్పటివరకూ ఉన్న స్థితి నుంచి లేవనెత్తి ఒక్కసారిగా రాజుని చేసిన వ్యక్తిపైన ఆ గౌరవాన్ని అందుకున్న వ్యక్తికి ఉండే కృతజ్ఞతనీ ఒకే నటుడు ఒకే సన్నివేశంలో చూపించడం ప్రపంచ చలనచిత్ర చరిత్రలో యే భాషలోనూ యెవ్వరూ చెయ్యని సాహసకృత్యమే!

          కానీ సినిమా అంతా ఒక్క నటుడే కనిపిస్తే బోరు కొట్టి చచ్చేవాళ్ళం కదా!కానీ ఆ విజృంభనకి తట్టుకుని అతనికి దీటుగా నిలబడితేనే కదా మరొక నటుడు కూడా మెప్పించగలిగేది?అలాంటి అధ్భుతాన్ని ధూళిపాళ సునాయాసంగా చేసేశాడు.ముఖ్యంగా మయసభలో అవమానానికి ప్రతీకారంగా అందరూ యుధ్ధం చేసి ఓడించి పగ తీర్చుకోవాల్సిందే నని గట్టిగా అరుస్తున్నప్పుడు,"దానివలన మనకొరుగు ప్రయోజనమేమి?వచ్చిన మచ్చ మాసిపోవునా?పరాభవావమానము సమసిపోవునా?మీ వూహ సరికాదు!వాడు పేరుకు ధర్మజుడే కాని పనువేపరి, జూదరి, వ్యసనపరుడు!వానినా మిషతోనే హస్తినకు రావించి వారి సమస్తమూ హరించి నీవూ నీ శతసోదరులూ వారి దీనత్వమును చూసి పగులబడి నవ్వవలె!అనాయాస మరణమూ దానివలన ప్రాప్తించు అమరలోక నివాసమూ ఆ పాండవహతకుల కంత సులభంగా లభించరాదు,తాము చేసిన తప్పులకు తామే వగచి వగచి కృశించి కృశించి నశించవలె!!" అనే పార్టు అతను చెప్పిన తీరు నాకు మహాధ్భుతంగా అనిపిస్తుంది.శకుని పాత్రలో ధూళిపాళ ద్వారా కొందవీటి వెంకట కవి గారు యెన్నో రాజకీయ సత్యాలు చెప్పారు!"వజ్రాన్ని వజ్రంథోనే ఖోయవలె,ముల్లును ముల్లుథోనే థీయవలె" అని నొక్కి వక్కాణించుతున్న సన్నివేశాన్ని జాగ్రత్తగా పట్టి చూస్తే ఇవ్వాళ్టి రాజకీయ నాయకులంతా ఆ మహానుభావుడి నుంచి ఉప్పుదేశం పొందినవారుగా కనిపించటం లేదూ!

             కాకపోతే ఆ శకుని మామకి తను విసిరిన పాచికలు తను చెప్పినట్టు వినే అదృష్టం ఉంది,ఇప్పటివాళ్ళకి ఆ అదృస్టం లేదు,అంతే!అప్పుదు రారజు ఉన్న పరిస్త్యితి కూడా బయటపడి యుధ్ధం చెయ్యగలిగిన పరిస్థితి కాదు!యెందుకయ్యా యుధ్ధం చేస్తున్నావు అంటే జవాబు చెప్పలేడు?మాసభలో జరిగిన అవమానం బయటికి చెప్పుకోలేదు,అంతకు ముందు ంచీ యెన్నివిధాల అంతం చెయ్యాలని కుత్రలు చేసినా అవన్నీ రహస్యంగానే చేశాడు,దేసంలోకల్లా గొడ్డుమోతు భూమికి రాజుగా పంపిస్తే అక్కడ కూడా సిరిసంపదలతో తులతూగుతుంతే చూడలేక ఇప్పుడు బయతపడి యే కారణం చెప్పగలడు?సరిగా ఇలాంటి పరిస్థితిలో నిలబడిన వాళ్ళు ఇన్ని వేల సంవత్స్రాల తర్వాత కూడా సరిగ్గా అలాంటి మాయాద్యూతాలకే తెగబడుతున్నారంటే ఆ కధ కల్పితమే అయినా ఆ కధకుది క్రాంతదర్సిత్వం యెంత గొప్పది?వ్యాసుదు యే పాత్రలో యే లోపాలు పెట్టాడో ఆ లోపాలకి అంతిమంగా యెలాంతి ఫలితాన్ని అనుభవించారని ఆ కధలో చూపించాడో చరిత్రలో యెన్నొసార్లు అలాంతి లోపాలు ఉన్నవాళ్ళు అలాంతి ఫలితాన్నే పొందారు అనేది గమనిస్తే మనం మహాభార్తం తప్పనిసరిగా చదివితీరాలనిపిస్తుంది - కొందరు బౌధ్ధిక చత్వారం గలవాళ్ళకి తప్ప!శ్రధ్ధగా చదివి అర్ధం చేసుకుంటే అటువంతి ధోరణులు క్నబడుతున్నప్పుడు గుర్తుపట్టి మళ్ళీ అలంటి వినాసనం జరగకుండా జాగ్రత్తపడవచ్చును కదా!

     యెప్పటి కెయ్యది ప్రస్తుతమో దానితో సరిపెట్టుకునే ప్రాప్తకాలజ్ఞత సార్వకాలిక సత్యాల్ని అవగతం చేసుకోనివ్వదు.ఇవ్వాళ కాంగ్రెసు పార్టీ దుస్థితిని చూస్తే జాలి కన్నా అసహ్యం కన్నా భయంకరమైన దుస్థితి యేది ఉన్నా ఆ స్థితి కన్నా హీనంగా ఉంది, యెందుకని?ఒకనాటి మహానుభావులు అందులో చేరి వారి సత్ప్రవర్నతో పార్టీకి కూడా గౌరవాన్ని తెచ్చిపెడీతే ఆ సార్వకాలీక్ యససూ నిచ్చే ప్రజాసేవాపధం నుంచి తప్ప్పుకుని మాయాద్యూతాలను నమ్ముకున్న దుర్మార్గులకి ఆవాసం కావదం వల్ల ఈ దుస్థితి దారించింది!సమస్య ఇదీ అని తెలిసినా పరిష్కారం లేని తప్పులు  అలవాటుగా చేస్తూ చేస్తూ వచ్చి నిన్నటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో నూరవ తప్పును కూడా యేదో ఘనకార్యం చేస్తున్నంత ధీమాగా చేసిపారేసి కాలపురుషుడు విసిరిన సుదర్శనం దెబ్బకి కూలిన శిశుపాలుడి గతి పట్టింది నేదు కాంగ్రెసుకి?!

         సోనియా యేమో నేను మాటిచ్చాను ఇచ్చి తీరాలంటుంది!ఇక్కడి వాళ్ళకేమో ఇవ్వాలని లేదు - వచ్చిన వాడు హైదరాబాదులో ఉన్న తమ వ్యాపారాల్ని(?) తిన్నగా చేసుకోనివ్వడేమోననే స్వార్ధంతో కూడిన భయం లాంటి బెంగ?గట్ట్టిగా తాము అడ్డుపదుతున్నట్టు కనిపించకుండా లేఖలు ఇచ్చి నాకభ్యంతరం లేదని అన్నా ప్రతిపక్షంలో ఉన్నవాడు తాము ఇస్తే అడ్డుకోలేడని తెలిసినా కాలం గడిపేటందుకు అతని మీదకి తోసేసి ఆఖరి వరకూ నాటకాలు ఆడారు?ఇవ్వడం తప్పనిసరి అని తెలిశాక మళ్ళీ వాళ్ళే రెండుగా చీలి ఒక సగం ఇవ్వమనీ ఒక సగం వద్దనీ అయోమయం సృష్టించారు!నిజాయితీగా ఇవ్వదల్చుకుంటే అవన్నీ నిజంగా అవసరమా?ఇవ్వాళ అక్షరాస్యత పెరిగిందనీ,పత్రికల్లో పడిన వార్తలు మారుమూల పల్లెలకీ తెలిసీపోయి చాయ్ బంకుల దగ్గిర కబుర్ల ద్వారా నిన్నటి రోజుల్లోలా కాకుండా ఇవ్వాళ్టి వోటర్లు చైతన్యవంతులయ్యారనేది కూడా తెలుసుకోకుండా యెంత తెలివితక్కువగా చేశారు రాష్త్ర విభజనని, మెంటల్ మంద?23 జిల్లాల ప్రజల భవిష్యత్తుని అనంతకాలం వరకూ వెంటాడే సమస్యలతో ఇస్తూ కూడా మరీ ముఖ్యంగా ప్రతిదానికీ పోట్లాడుకు చావడానికి మాత్రమే పనికొచ్చే విధంగా విభజన బిల్లుని తయారు చేసి కూడా లాభం ఆశించారంటే వీళ్ళకన్నా వెనకతి కాలంలో కూర్చున్న కొమ్మని నరుక్కున్న దేవయ్య కూడా తెలివైనవాడే గదా?! 

        కనీసం ఆ లాభాన్ని పక్కవాడితో పంచుకుందామనే పాటి ఔదార్యం కూడా లేదు - లాభమంతా మనకే రావాలి,అందుకే పుచ్చుకున్నవాడు కూడా గర్భశత్రువై పోయాడు!అడిగీన వాడు ఇస్తానని మాటిచ్చాక గూడా తొమ్మిదేళ్ళు యేడిపిస్తుంటే మనసులో తిట్టుకోడా?కాలం తనకి వాటంగా కలిసి వచ్చినప్పుదు తను చావుదెబ్బ కొట్టడా?యేళ్ళు పెరిగినా బుధ్ధి పెరగని గాడిదలకి రాజకీయమెందుకు?అస్త్రసన్యాసం చేసి పరువుగా రాజకీయ రంగం నుంచి నిష్క్రమిస్తే ఇప్పటికయినా ఒక తెలివైన మంచిపని చేసినట్టు ఉంటుంది - కానీ అది కూడా చెయ్యరు!ఘటశ్శ్రాధ్ధం తంతు కూడా తమకు తామే జరిపించుకునే వరకూ కాంగ్రెసు పతనాన్ని యెవ్వరూ ఆపలేరు కాబోలు?!

       శకుని మామ "ఔరా,అల్లుని పరాభమునకు మామ శకుని చెల్లించిన పరిహార మిదా - ఘురే! ఘురే! యని భారతెతిహాసమున నా చరిత్ర సువర్ణాక్ష్రములతో లిఖించబడవలె" నని ఆశించాడు - ఫలితం సాధించాడు గాబట్టి తన చరిత్రని సువర్ణాక్షరాలతో రాసినా తప్పు లేదు!కానీ ను ఆడిన మాయాద్యూతం వికటించి తననే ఒకవైపు ఇప్పటికే "0" తో నిలబడి మరొక వైపు రేపటికి "0"తో నిలబెడుతున్న చరిత్రని మాత్రం రక్తాక్షరాలతోనే లిఖించవలె!

కాంగ్రెసు తాను చేసిన తప్పులకు తానే వగచి వగచి కృశించి కృశించి నశించవలె!

Wednesday 1 July 2015

శ్రీరమ సీతయై శ్రీనిధితో పలికిన పలుకుల మెరిసినది తెలుగు వారి జీవనదము - గోదావరీ మాత!

సీ||శ్రీరమ సీతయై శ్రీనిధితో పలి
    కిన పలుకుల మెరిసినది తెలుగు

    వారి జీవనదము - గోదావరీ మాత!
    దక్షిణ గంగ!వేదములను విని

    వేదములను పలికే చిలుకల కొలి
    కి! పొడుపు మలపైకి ఇనుడు రాక

    మున్నె దేవతలు తా మునిగి తరించు మ
    హిమలు గల రసధుని!వగపేల

తే||ఆంధ్రులార,గోదావరి పారునంత
     వరకు మనకిక తిరుగు లేదండి!పట్టి
     గుండెలో నిల్పి దేవిలా కొల్చి హార
     తులను ఇవ్వరే - తల్లికి తగిన రీతి?!
(30/06/2015)



పవిత్రతలోనూ ప్రాముఖ్యతలోనూ పరీవాహక ప్రాంతంలోనూ గంగానది తర్వాత రెందవ స్థానం గోదవరి నదికి దక్కుతుంది భరతఖందపు జీవనదు లన్నింటిలోనూ!అటువైపున అరేబియన్ సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కొలువై ఉన్న త్రయంబకేశ్వరుని పదసన్నిధిలో పుట్టిన ఈనది సుమారు 1,465 కిలోమీటర్ల దూరం ప్రవహించినంత మేరా భూమిని సారవంతం చేస్తూ చత్తీస్ గఢ్,మహారాష్ట్ర,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,మధ్యప్రదేశ్,ఒడిషా రాష్ట్రవాసుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ తెలుగువారికి అపరిమితానందాన్ని కలిగిస్తూ  అటువైపున పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం దగ్గిర తూర్పు కనుమల్ని చేరుకుని బంగాళాఖాతంలో కలుస్తూ అత్యంత సారవంతమైన భూముల్ని మరింతగా తన జీవజలంతో అభిషేకిస్తున్నది!

నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తిలో ఈనది తెలుగువాళ్ళని పలకరించటం మొదలవుతుంది.ఆదిలాబాద్ జిల్లాలోని బాసర అనే ప్రపంచంలోనే అపురూపమైన సరస్వతీ నిలయం ఈ నదికి అనుబంధమైనదే!ఈ నదీతీరంలోని నగరాలలో రాజమహేంద్రవరానిది వేయి స్తంభాలతో రామప్ప గుదిలోని యక్షిణీ శిల్పాలతో కోటిలింగాలతో కొలువుదీరిన శోభాయమాన్మైఅన ఘనత!ఈ నగరాన్ని దాటాక గౌతమీ గోదావరి, వశిష్ఠ గోదావరి అనే రెండు శాఖలుగా చీలుతుంది.గౌతమి మళ్ళీ గౌతమి,నీలరేవు అనే రెండు పాయలుగా చీలుతుంది.అటు వశిష్ఠ కూడా వశిష్ఠ, వైనతేయ అనే రెందు పాయలుగా చీలుతుంది.ఈ నాల్గు పాయలతో సోదరి కృష్ణతో కలిసి ఆ నడిమధ్యన సిరులు పొంగిపొరలే వరిధాన్యపు గంపని యెత్తుకుని ఆంధ్రమాత నిలబడింది పచ్చనాకు సాక్షిగా!

ఈ నది పుట్టుకకి సంబంధించిన కధలో రామకధ లోని అహల్యా గౌతముల కధ వినిపిస్తుంది.కానీ ఈ కధలో రామకధ ప్రస్తావన యేమీ ఉండదు.ఈ గౌతమ ఋషి తన భార్య అహల్యతో కలిసి భ్రహ్మగిరి పైన కాపుర ముండేవాడు.ఒకనాడు తన ధాన్యపురాశిని దొంగిలించి తింటున్న గోవుని అదిలించటానికి దర్భను వాడగా గోవు చనిపోతుంది!అప్పుడు ఆ గోహత్యా పాతకాన్ని శమింపజేసుకోవడానికి శివుణ్ణి ప్రార్ధించగా శివుడు మెచ్చి త్ర్యంబకేశ్వరుడుగా అవతరించి గంగను వదిలాడు.ఆ జలధారయే గౌతముని పేర గౌతమి అనీ పాపపరిహారానికి సాయపడింది గనుక గోదావరి అనీ పిలువబడుతున్నది!

భారతీయులు యే నదినైనా పుణ్యక్షెత్రాలతో కొలువుదీర్చి పుష్కరస్నానాలతో తమనీ తమ సమస్త లౌకిక పారలౌకికమైన విషయాలన్నింటిలోనూ ఆ నదితో మమేకం అవుతూ ఉంటారు కదా!నాసిక్ సింహాష్ట కంభమేళా ప్రసిధ్ధం!త్ర్యంబకేశ్వరం 12 జ్యోతిర్లింగాలతో కొలువుదీరిన శివక్షేత్రం!నాందేడ్ శిఖ్కుల పుణ్యక్షేత్రం!పైఠాన్ యేకనాధ నిలయం!ధర్మపురిది అప్పటివరకూ ఉత్తర దిక్కుగా ప్రవహించే దిశని మార్చుకుని దక్షిణ వాహినియై నృసింహస్వామి కొలువుదీరిన అంగరంగ వైభోగం!వ్యాసుడు ప్రతిష్ఠించినాడని భావించే వ్యాసర బాసరగా మారిన సరస్వతీ నిలయం!దక్షిణ గంగాతీరంలో దక్షిణ అయోధ్యగా ప్రకాశించే భద్రాచలం!ఆంధ్రప్రాంతంలోని మరో త్రివేణీసంగమంలో ముక్తేశ్వరుడు కొలువుదీరిన కాళేశ్వరం!తెలుగుకి కావ్యగౌరవం కల్పించిన ఆదికవి నన్నయ్య తిరుగాడిన రాజమహేంద్రి పుష్కర శోభ అనన్యసామాన్యం!

గౌతముని పాపాలను పోగొడుతూ పుట్టిన గోదావరి సర్వులకూ కల్మషహారిణి అగుగాక!

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...