Sunday 27 December 2015

నిజంగా ఇగ్లీషు ప్రపంచ భాషలందు మేలుబంతియా?ఇంగ్లీషు రాకపోతే ప్రపంచంలో ఇంకెక్కడా బతకలేమా!

     మా తాతగారు అరివీర భయంకర కమ్యునిష్టు!ఎంత గొప్ప కమ్యునిష్టంటే ఆయనెదురుగా కమ్యునిజాన్నీ మార్క్సునీ ఎంగెల్సునీ ఎంత తిట్టినా కిమ్మనే వాడు కాదు,కానీ నెహ్రూని గానీ ఇందిరా గాంధీని గానీ ఏ కొంచెం మాట తూలినా సరే ముసలి సింహంలా విరుచుకు పడేవాడు,బతికుండగా చాలాసార్లు అడిగాను "తాతయ్యా!నీమీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసి పెరుగన్నం లేంది ముద్ద దిగని నిన్ను కొండపల్లి గట్ల మీదకి పంపించిన మనిషిని నువ్వు మంచిది అంటున్నావు, మరి అంత మంచిదానికి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇవ్వాలన్నంత కోపం తెప్పించిన నువ్వు మంచివాడి వెట్లా అవుతావు?" అని - సూటిగా జవాబు చెప్పలేదు!ఎంత శాస్త్రీయంగా అలోచించే వాళ్ళకయినా కొంత వెర్రి సహజమేనని సరిపెట్టుకోవాలి,లేకపోతే నాకు మనశ్శాంతి కరువవుతుంది మరి:-)

     ఇవ్వాళ మాతృభాషలో విద్యాబోధనకి మోకాలొడ్డుతూ ఇంగ్లీషుని సమర్ధించేవారి వాదనలు కూడా అలాగే ఉన్నాయి.ఇంగ్లీషు ప్రపంచంలో కల్లా అత్యంత ప్రజాదరణ గల భాష అట!ఇవ్వాళ మనం చూస్తున్న అభివృధ్ధి అంతా సైన్సూ,సోషలూ,మ్యాథ్సూ,చెమిస్ట్రీ,ఫిజిక్సూ అన్నీ వాళ్ళు కనుక్కున్నవే గాబట్టి వాళ్ళ భాషలోనే చదవాలట!పోనీ సాంకేతిక పదజాలాన్ని మన భాషలోకి మార్చుకుందాం అంటే పుట్టించిన ప్రతి మాటకి పది వెక్కిరింపులు!"పెంటామిరస్" అనే మాటకి "పంచభాగయుత" అని అందామంటే మాకు పంచెలు గుర్తుకొస్తున్నాయి అంటారు అక్కడ ఉన్న పెంట బాగనే ఉందేమో మరి?ఇంకా వీరు చెప్పే అతి ముఖ్యమైన కారణం - ఇంగ్లీషు నేర్చుకోకపోతే గ్లోబల్ కనెక్టివిటీకి దూరమైపోతామట?!
     పైన ఉన్న మ్యాపుని చూశారుగా,అందులో దార్క్ బ్లూ కలరులో ఉన్నవి ప్రజల్లో ఎక్కువమంది మాట్లాడుతూ మాతృభాషగానూ రాజభాషగానూ ఇంగ్లీషు చలామణీ అవుతున్న దేశాలు,లైట్ బ్లూ కలరులో ఉన్నవి అనధికారికంగా ఇంగ్లీషు ప్రధానభాషగా ఉన్న దేశాలు - దాదాపు ఇవన్నీ ఒకప్పటి మహా ఘనత వచించిన రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యపు వలస దేశాలు!వారు వలసల పేరుతో ఆక్రమించుకుని బలవంతంగా రుద్దిన చోట్లలో తప్ప మరెక్కడా ఇంగ్లీషు కనబడటం లేదు,గమనించారా?
     పైన ఉన్న మ్యాపుని చూశారుగా,పింకు రంగులో తళత్తలాయమానంగా మెరుస్తున్నవి వారి విజృంభణలోకి వెళ్ళి వారి పాలనలో తమ మూలాల్ని కూడా మర్చిపోయేటంతగా కొన్ని తరాల పాటూ గడిపిన దేశాలు - వారి వలసలు.అదండీ ఇంగ్లీషు యొక్క విశ్వవ్యాప్తమైన వైభవం!మనవాళ్లకి దేశం దాటితే అమెరికా తప్ప ఇంకొక దేశం కనబడ్డం లేదు,కాకుంటే వారి ముత్తాత అయిన బ్రిటిషు వారి మూలాలు ఉన్న లండన్ నగరంలో తప్ప ఇంకెక్కడా చెల్లకుండా పోతామేమోనని ఏదో మొహమాటంతో కూడిన భయం ఒకటి ఉన్నట్టుంది మన దేశంలోని ఆంగ్లభాషాభిమానులకి - అలవాటయిపోయిన బానిసత్వం ఒక పట్టాన వదలదు పాపం!

     ఇంగ్లీషు వాళ్ళు వలసలు ఏర్పాటు చెయ్యటం మొదట 1580లో సర్ వాల్టర్ ర్యాలీఘ్ అనే పెద్దమనిషికి దక్షిణ అమేరికాలో కాలనీ ఏర్పాటు చెయ్యడాబికి పర్మిషన్ ఇవ్వడంతో మొదలైంది.సరే, పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు,తొలి వలసని ఏర్పాటు చేశాడు,వర్జీనియా అని పేరు పెట్టాడు - పెళ్ళికాని రాణి పేరు మీద!మొదటి రెండు సార్లు లోకల్స్ గట్టిగా నిలబడటంతో ఫెయిలయ్యి ఆఖరికి 1857లో మొదటి డిపెండెంట్ కాలనీ జాన్ వైట్ గవర్నరు గిరీతో మొదలైంది.అయితే, 1591లో కొత్త సప్లైల కోసం బ్రిటన్ వెళ్ళి తిరిగొచ్చేసరికి కాలనీ మొత్తం గల్లంతై "Croatan" అనే పేరు ఉన్న ఒక చెక్కముక్క(Sign Board) మాత్రం మిగిలింది - ఖాజీ సాయెబు గారు పోయి తురకల్లో గల్సాడన్నట్టు కూలీలుగా ఉన్న సెటిలర్లు పోయి హ్యాపీగా నేటివ్ తెగల్లో కల్సిపోయారు:-)

     చచ్చీ చెడీ శాయంగల విన్నపములై అన్నట్టు మళ్ళీ మళ్ళీ సెటిలర్లని పంపగా పంపగా 1619 నాటికి వర్జీనియా పూర్తి స్థాయిలో ఇండిపెందెంట్ కాలనీగా ఏర్పడింది.అట్లా తొలిదశలో 13 కాలనీలు ఏర్పడ్డాయి.ఇవ్వాళ్టికీ ఆ పేర్లు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రముఖంగా వినబడుతున్నవే - 1).మసాచుసెట్స్ 2).న్యూ హాంప్ షైర్ 3).రోడ్ ఐలాండ్ 4).న్యూ యార్క్ 5).కన్నెక్టికట్ 6).న్యూ జెర్సీ 7).పెన్సిల్వేనియా 8).డిలావర్ 9).మేరీలాండ్ 10).వర్జీనియా 11).నార్త్ కరోలినా 12).సౌత్ కరోలినా 13).జార్జియా.

     అలా మొదలైన వీళ్ళ విజృంభణ కెనడా,ఇండియా,ఆస్ట్రేలియా,ఈజిప్టు,పశ్చిమ,దక్షిణ,తూర్పు ఆఫ్రికా దేశాలతోపాటు ఇరాక్ వంటి అనేక ఖండాల్లో అనేక దేశాల్లో వాలుగాలిలో తెరచాప నావలా సాగిపోయి దారి కడ్డు వస్తే మహా పర్వతాల్ని కూడా పెకలించుకుని లాక్కుపోగలిగిన గోదావరి వరదలాగ చెలరేగింది.ఈ వలసల స్థాపనకి సుమారు 200 సంవత్సరాలు పడితే ఎక్కడికక్కడ చీకొట్టించుకుని మళ్ళీ సముద్రంలో కాకిరెట్ట లాంటి తొలినాటి స్థితికి చేరుకోవటానికి ఎంత గట్టిగా లెక్కేసినా 50 ఏళ్ళు దాటి ఉండదు - దీనివల్ల ఏమి సాధించారో వాళ్ళకే తెలియాలి!నిన్నటికి నిన్న టోనీ బ్లెయిర్ ఇరాక్ మీద దాడికి అబధ్ధాలని పేర్చీ మరీ వ్యూహాలు పన్నడం చూస్తే గతంలో తాము చేసింది తప్పని అనుకోనట్లు కనిపిస్తుంది - సిగ్గులేని జాతి!అయితే, ఒకనాటి బ్రిటిషు జాతిలోని మహోన్నతుల్ని తలుచుకుంటే ఈ పాడుపని అంత మొండిగా చేసి ఉండకపోతే,ఆ మాననీయుల ఆదర్శాల ప్రకారం నడుచుకుని ఉంటే ప్రపంచం మొత్తం సగౌరవంగా తల వంచి నమస్కరించాల్సిన స్థితి వీరికి దక్కి ఉండేది -  వివేక భ్రష్ట సంపాతం ఒకసారి మొదలైతే మధ్యలో ఆగనివ్వదు కాబోలు!

     ఇంగ్లీష్ వాళ్ళ వైపు నుంచి వస్తున్న ఆగని దాడికి కొంతా తెగల్లోనూ ఇంగ్లీషు వాళ్ళ మూలంగా అమరుతున్న కొత్త సౌకర్యాల పట్ల పెరపెర వల్ల కొంతా పట్టు సడిలి 1620ల నాటికి మొత్తం 13 కాలనీల్లోనూ మొదట న్యాయమైన జీతభత్యాలిచ్చే అవసరం లేని అర్ధ బానిసల వ్యవస్థ వూపందుకుని తెల్లజాతి అమెరికన్ వ్యాపారస్థులు యూరోపియన్ పొగాకు మార్కెట్లని కొల్లగొట్టి ధనవంతులయ్యారు.అలా మొదలై మొత్తానికి 1700 నాటికి బానిసల వ్యవస్థ పూర్తిగా స్థిరపడిపోయింది.అంటే, ఇంక కనీసపు మానవసహజమైన హక్కులు కూడా లేని సామూహిక దోపిడీ చట్టబధ్ధం అయిపోయింది.అమెరికా స్వాతంత్ర్య పోరాటం అని వారు చెప్పుకునేది అమెరికాలోని తెల్లజాతివారు తమ మూలస్థానమైన బ్రిటిష్ రాణి అధికారం నుంచి పూర్తిగా తెగదెంపులు చేసుకోవడమే తప్ప మరొకటి కాదు.ఈ 21వ శతాబ్దంలో కూడా అక్కడి భూమికి నిజమైన హక్కుదారులైన ఒకనాటి స్థానికులకి స్వావలంబనకి అవకాశం లేదు- కనీసపు హక్కులు కూడా లేవు!

     వలస నుంచి 1940లో విడిపోయిన ఉత్తర అమెరికా ఖండంలోని కెనడా కూడా తెల్లజాతివారు తమకోసం తాము ప్రకటించుకున్న అర్ధ స్వాతంత్ర్యమే తప్ప అక్కడా నేటివ్ కమ్యూనిటీ పరిస్థితి దయనీయంగానే ఉంది.1947లో విముక్తమైన భారత్ కూడా సాంస్కృతికంగా తన పరాధీనతని పోగొట్టుకుని తనదైన స్వయంప్రభతో ప్రకాశించే అవకాశం ఉన్నప్పటికీ అధిక సంఖ్యాకుల్లో బలంగా పాతుకుపోయిన సాంస్కృతికపరమైన బానిసత్వం వల్ల ఆ దిశలో ముందుకు అడుగు వెయ్యటం లేదు.బ్రిటిషర్లకి సముద్రవాణిజ్యం కోసం సూయజ్ కెనాల్ యొక్క అవసరం ఉండటం వల్ల ఈజిప్టు మీద తన పెత్తనాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఎక్కువ కాలమే నిలబెట్టుకున్నా 1956లో సూయజ్ కెనాల్ మీద అధిపత్యాన్ని వొదులుకుని ఈజిప్టు నుంచి కూడా వెనక్కి వెళ్ళక తప్పలేదు.ఒకరిని చూసి మరొకరు ఆవేశం తెచ్చుకున్నట్టు ఆఫ్రికా దేశాలూ,ఇరాక్ వంటివన్నీ 1950 దరిదాపుల్లోనే వలస పాలన నుంచి విముక్తం అయ్యాయి.ఇప్పటికీ చిన్నా చితకా దేశాలు కొన్ని వారి వలసలు గానే ఉన్నాయంటే వారి భల్లూకపు పట్టు ఎంత గట్టిదో అర్ధం చేసుకోవచ్చు!

     ఇంగ్లీషువాళ్ళు భారతదేశంలో అంతగా విస్తరించటానికి కారణం అప్పటి రాజుల్లో ఉన్న అనైక్యతా సమాజంలో ఉన్న చీలికలూ అనే చారిత్రక నిష్పక్షపాతం వాళ్ళూ మనలోనే తప్పులు ఉన్నాయి గాబట్టి ఇంగ్లీషువాళ్ళ మీద కోపం తెచ్చుకోకుండా అహింసాయుతంగా పోరాడితే చాలునన్న మోహనదాసు భక్తులూ ఇతరదేశాల్లో వాళ్ళు చేసింది ఏమిటో తెలుసుకోవాలి.ఏడుతరాలు నవలలో కుంటా కింటే అనే ఒక వ్యక్తి స్వేచ్చ కోసం మాటిమాటికీ తప్పించుకు పారిపోతున్నాడని గొడ్డలితో అతని కాలిని నరికే సన్నివేశం చదువుతుంటేనే "అబ్బ?" అని ఒళ్ళు జలదరించినంత పనయ్యింది నాకు!ఆస్ట్రేలియాలో వీళ్ళు అడుగుపెట్టకముందు స్థానికులైన అబోరిజిన్స్ మీద వీళ్ళు చేసిన దుర్మార్గం మనిషైన వాడు ఎవడూ వూహించనిది!అబోరిజిన్సని పిలిచే స్థానిక సంప్రదాయ జీవనం గడిపే తెగల్లోని ఆడవాళ్ళని రేప్ చేసి తమ ద్వారా వాళ్లకి పుట్టిన పిల్లల్ని తల్లుల నుంచి దూరం చేసి తమ ఇళ్ళల్లో పనివాళ్ళుగా పెట్టుకుని ఎబోరిజిన్స్ చిన్నపైల్లల మీద అత్యాచారాలు చేస్తారనీ అనాగరికులనీ నూరిపోస్తూ పెంచారు.అంటే, ఒక జాతికి సంబంధించిన కొన్ని తరాల్ని ఆ జాతి మీదకే ఉసి గొలపడం అన్నమాట - అదంతా స్టోలెన్ జెనరేషన్స్ పేరుతో ప్రపంచంలోని పాపులందర్నీ పరిశుధ్ధ పరచటం కోసం తాను శిలువను మోసిన కరుణామయుని కీర్తించే చర్చి కూడా ఏ మాత్రమూ కరుణలేని విధంగా ప్రవర్తించిన చారిత్రక వాస్తవం!ఇలాంటివాళ్ళతో మోహనదాసూ అతని భక్తులూ పళ్ళికిలిస్తూ వాళ్ళ తిండి తిని వాళ్లతో ఫొటోలు దిగి గుండ్రబల్ల ముచ్చట్లు ఎలా చేశారో నాకిప్పటికీ అర్ధం కాదు!ఇంగ్లీషు వాడైన షెరిడన్ మహాశయుడు తన తిట్లు తగిలేది తన జాతికే అనేది కూడా పట్టించుకోకుండా భారతదేశంలో జరుగుతున్న దాని గురించి తెలిసి తీవ్రమైన కోపం తెచ్చుకుని "భగవంతుడి పేరున నా అణువణువులోనూ నిండిన అసహ్యంతో ఈ ప్రభుత్వాన్ని శపిస్తున్నాను" అనేశాడు,  అంతటి ధిక్కారం మనకేది?

     అయితే, రాగద్వేషాల కతీతంగా అంచనా వేస్తే బ్రిటిషు వలస పాలన నుంచి బయటపడిన తర్వాత ఇరాక్,ఈజిప్ట్,జమైకా,కెన్యా,నైజీరియా వంటి దేశాల పరిస్థితి స్వయంపాలన వల్ల అప్పటికన్నా మెరుగుపడలేదు సరిగదా మరింత అనాగరికత వైపుకి పయనించాయి.భారత్ పరిస్థితి కూడా ఆనాటివారు ఆశించినంత గొప్పగా ఈనాటికీ లేదు, ఎందుకు?ఈ వాదనతో మరోసారి ప్రపంచాన్ని కబళించడానికో ఏమో కొందరు యూరోపియన్ మేధావులు ఈ సూత్రీక్రణలతో కొత్తగా విశ్లేషణలు కూడా మొదలుపెట్టారు. అంటే, ఆయా దేశాల్లో గతంలో తాము చేసిన ఘనకార్యాలు తప్పు కాదని అనుకుంటున్న వాళ్ళు - ఇరాక్ మీద యుధ్ధానికి అబధ్ధాలను కూడా చెప్పిన టోనీ బ్లెయిర్ ఒక్కడే కాకుండా - చాలామందే ఉన్నారన్నమాట!నిజంగానే ఇంగ్లీషువాళ్ళు చెప్పినట్టు ఈ దేశాలు స్వయంపాలనకి అర్హత లేకపోయినా తమలో లేని గొప్పని ఉందనుకుని ఆవేశపడి స్వతంత్రం ప్రకటించుకుని తప్పు చేశాయా?కానే కాదు,అసలు కారణం వేరే ఉంది!వీటి గత చరిత్రలో ఒక మెలిక ఉంది, ఇంగ్లెషు వాళ్ళు వలసలు స్థాపించక ముందు నుంచీ ఆయా దేశాల్లో అనేక జాతులు కలిసి మెలిసి బతికాయి,అనేక రకాల ప్రభుత్వాలు కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచీ అక్కడి ప్రజల్ని ప్రభావితుల్ని చేశాయి.ప్రతి కొత్త సంస్కృతీ తొలిదశలో పాత సంస్కృతితో సంఘర్షించినా పోనుపోనూ వాటిమధ్య సయోధ్య యేర్పడి ఎంత పరస్పర విరుధ్ధమైన సంస్కృతులైనా ఏమాత్రం విడదీయటానికి వీల్లేనంతగా కలిసిపోయి ఒకే సంస్కృతిగా రూపు దిద్దుకున్నాయి.కానీ ఇంగ్లీషు వాళ్ళ ప్రభావం అలాంటిది కాదు,ఇది వారి సంస్కృతిలో కలవకపోగా ఆయా సంస్కృతులని నాశనం చెయ్యడానికి ప్రయత్నించింది!వీరి మీద తిరగబడే సమయంలో తమ సొంత ఆస్తిత్వం కోసం ఇంగ్లీషువాళ్ళు రావడానికి ముందరి కాలంలోని మూలాల్ని వెదుక్కునే ప్రయత్నంలో కలిసిపోయిన కాలంలో కనిపించని వైరుధ్యాలు ఇప్పుడు ప్రముఖమై కనబడుతున్నాయి.మన దేశంలో ప్రస్తుతం మనం చూస్తున్న గందరగోళం - స్వాతంత్రపోరాట కాలంలో సమైక్యంగా పోరాడిన భిన్న వర్గాలు దేశం స్వాతంత్ర్యాన్ని పొందిన తర్వాత ఒకరితో ఒకరు కలహించుకోవడానికి మూలకారణం ఇదే!

     ఇంగ్లీషు భాష పట్ల మనకున్న వ్యామోహాన్ని వొదులుకుని మాతృభాషల్లో విద్యాబోధనకి ప్రాధాన్యత ఇవ్వనంతవరకూ మనల్ని పట్టిన పరాధీనతా పోదు,సాంస్కృతిక బానిసత్వమూ  వదలదు,మన దేశం ప్రపంచంలో తలయెత్తుకుని నిలబడటమూ జరగదు.ఒక జాతి సంస్కృతి యొక్క గొప్పదనానికీ ఆ జాతి మాట్లాడే భాషలోని సాహిత్యానికీ దగ్గరి సంబంధం ఉంటుంది.ఒక తరం నుంచి ఒక తరానికి సంస్కృతి ప్రవహించేది మాతృభాష ద్వారానే - అందుకే ఇంగ్లీషువాళ్ళు తమ తెలివి నంతా ఉపయోగించి మొదట దాని మీదనే దాడి చేశారు - వలసల్ని స్థిరపర్చుకోవడానికి వాళ్ళు ఫాలో అయిన మోడస్ ఆపరేండి లోని మొదటి మెట్టు మాట్లాడే భాషని మార్చటం, ఇంగ్లీషు భాషని స్థానికుల చేత బలవంతంగా మాట్లాడించటం. భారతదేశంలోనూ సరిగ్గా ఇదే జరిగింది,కాకపోతే ఇక్కడ క్రూరంగా వెళ్తే మొదటికే మోసం వస్తుందని తెలుసు గనక కొంచెం సుకుమారమైన పధ్ధతిలో వెళ్ళారు,అంతే!మందు కొట్టేవాళ్ళకి కిక్కు యెక్కడం రెండు రకాలుగా ఉంటుందని తెఉసు.ఆబగా కక్కుర్ర్తిగా లాగిస్తే ఎంత ఫాస్టుగా టాపు లేపేటంత రేంజిలో ఎక్కుతుందో అంత ఫాస్టుగా దిగిపోతుంది - దాన్ని తట్టుకోలేనప్పుడే వాంతులూఒ హ్యాంగోవర్లూ వస్తాయి!ఆరారగా కబుర్లు చెప్పుకుంటూ పుచ్చుకుంటే కిక్కు ఎక్కడం ఎక్కుతున్నప్పుడు తెలియకపోయినా ఎక్కాక మాత్రం ఒక పట్టాన దిగదు!ఇంగ్లీషువాళ్లని తరిమికొట్టేసి వందేళ్ళు పూర్తి కావొస్తున్నా ఇంకా "all the historical information which has been collected from all the books written in the Sanskrit language is less valuable than what may be found in the most paltry abridgements used at preparatory schools in England." అంటూ మన సంస్కృతి పట్ల ఇంత దుర్మార్గమైన వెక్కిరింతతో ఉన్న అజ్ఞాన సింధువు లార్డు మెకాలే గారు ప్రవేశపెట్టిన సాంస్కృతిక పరాధీనతని పెంచే విద్యావిధానాన్ని మార్చుకోకుండా జాతి స్వాభిమానాన్ని పెంచే మాతృభాషలో చదువుకోకుండా మనకు మనమే అడ్డు పడుతున్నామంటే ఇంగ్లీషువాళ్ళు మనకి ఎక్కించిన పరాధీనత కిక్కు ఎంత బలంగా ఎక్కిందో చూడండి!
Thomas Babington Macaulay
     తొలిదశలో ఎక్కడో ఒక ప్రాంతంలో పుట్టిన జర్మను భాషలోని మాండలిక రూపం అతి తక్కువ కాలంలోనే ఇంతింతై వటుడింతయై పెరిగి ఉప్పెనవలె ప్రపంచ మంతటా వ్యాపించింది - అది నేటి ఇంగ్లీషు భాష!ఆ వ్యాపించటం ఎలా జరిగింది?ఇప్పటికీ తమ దేశంలో జాతీయభాషగా మాత్రమే పరిమితమైన జర్మను భాష కన్నా దాన్ని ప్రపంచవ్యాప్తం చేసినది - దూరతీరాలకు వ్యాపించి,వ్యాపించిన ప్రతి చోటా బలవంతంగా రుద్దగలిగిన స్థాయిలో చెలరేగిపోయిన రాజకీయాధికారం!అదే మాదిరి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ఒక మాండలికమైన హిందీ అప్పటి ప్రభువులు తమ కార్యకలాపాల్లో వాడటం వల్ల క్రమేణా పెరిగి నేటికి దేశంలో ఎక్కువమంది మాట్లాడే భాషగా అవతరించింది.ఇవ్వాళ్టికీ తమిళులు ఒక్కరే ఈ స్వదేశపు భాషని జాతీయభాషగా గుర్తించడానికి నిరాకరించి ఇంకా పరదేశపు భాష ఇంగ్లీషునే ఎక్కువగా ఆదరించడానికి కారణ మేమిటి?తమిళనాడు లోని సామాన్య ప్రజలు వ్యతిరేకిస్తున్నారా?వారు హిందీ సినిమాలు అస్సలు చూడరా!కాదు,అక్కడ కూడా ద్రవిడ నామధేయాన్ని పార్టీ పేరులో ఉంచుకున్న వారి రాజకీయమే కారణం!

     ఒక జాతి ఏ విధంగా నైనా శక్తివంతమైతే,తన సొంత గడ్డ ఆ శక్తికి ఇరుకైపోతే,తప్పనిసరిగా వ్యాపించే దశలో ఉంటే ఆ జాతికి సంబంధించిన అన్ని రూపాల్లోనూ అది ప్రతిఫలిస్తుంది -- భాష,కళ,ఆర్ధికం,హార్ధికం!వ్యాపించే సమర్ధత ఉన్నది గనక వ్యాపించియే తీరుతాడు - "రెక్కలుండటమే వస్తే ముడుచుక్కూచుంటాడా ఎవడైనా(గులాబి అత్తరు)!" అయితే కొత్త చోటుకి వెళ్ళినవారు మన ప్రాచీనుల వలె మర్యాదస్తులు అయితే ఉభయతారకమైన పంపకాలు జరుగుతాయి!కానీ ఆంగ్లేయులు మాత్రం వారు వ్యాపించిన ప్రతిచోటా ఆధిక్యాన్నే ప్రదర్శించి ఇతరుల సంస్కృతుల్ని ధ్వంసం చేసి ఆ స్థానంలో తమ వాటిని ప్రవేశపెట్టారు!వారి ధ్వంసరచన ఎంత క్రూరమైనదంటే వారి వలసలు స్వతంత్రమైనాక కొన్ని దేశాల వారికి తమదైన సంస్కృతికి మళ్ళటానికి పాత గుర్తులు పూర్తిగా మాసిపోయేటంత!

     మరాఠా అస్తిత్వానికి ముచ్చటపడి శివసేనను అభిమానిస్తున్న మహారాష్త్ర ప్రజల్ని గానీ తమ ప్రాంతపు ఆస్తిత్వం కోసం పట్టుబట్టి సాధించుకున్న తెలంగాణ ప్రజల్ని గానీ కర్ణాటక తదితర రాష్ట్రాలలో చెలరేగుతున్న ప్రత్యేక ఉద్యమాల్ని గానీ దేశభక్తి లేనివాళ్ళు మూర్ఖంగా చేస్తున్న వేర్పాటువాదపు విధ్వంసకర ప్రయత్నాలుగా ముద్ర వెయ్యకుండా వాటిలోని అస్తిత్వవాదపు మూలాల్ని చూస్తే భవిష్యత్తు కార్యాచారణకి అవసరమైన దారి కనబడుతుంది.పుట్టీ పుట్టగానే మనిషికి మొదట వచ్చేది అస్తిత్వమే, దేశభక్తి అనేది వ్యక్తి పెరిగి పెద్దయి సమాజం లోకి వెళ్ళాక వస్తుంది.ప్రతి వ్యక్తికీ ఒక మాతృభాష ఉంటుంది.తల్లిదండ్రులు,బంధుమిత్రులు వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ తనతో మాట్లాడుతూ తనకి పరిచయం చేసే భాష శిశుప్రాయం నుంచే అలవాటైపోతుంది.కానీ బళ్ళో వెయ్యంగానే నువ్వు వృధ్ధిలోకి రావాలంటే మన భాషలో కాదు,ఇవన్నీ మళ్ళీ కొత్తగా ఇంగ్లీషులో నేర్చుకోవాలి అంటే ఆ పిల్లవాడు ఖచ్చితంగా గందరగోళానికి గురవుతాడు.అప్పటికి తన మాతృభాష మీదనే పూర్తి అధికారం రాని స్థితిలో భావానికీ రూపానికీ ఇంకా లంకె కుదరకుండా ఉన్నప్పుడు ఈ అస్పష్టమైన పాండిత్యాన్ని అమాంతం కొత్త భాషలోకి తర్జుమా చేసుకోవడం అయిదారేళ్ళ కుర్రవాడికి/కుర్రదానికి సాధ్యపడుతుందా అనేది ఆంగ్ల భాషాభిమానులు ఆలోచించడం లేదు!సహజంగా ఇవ్వాళ మనం స్కూళ్ళకి పంపిస్తున్న వయసులో పిల్లలందరూ కొత్తవి నేర్చుకోవడం పట్ల ఆసక్తిగానే ఉంటారు,అయినా కొందరు మొద్దావతారాలుగా ఎందుకు తయారవుతున్నారు?అప్పటివరకూ మాతృభాషలో కేరింతలు కొట్టిన పిల్లలు ఈ గందరగోళానికి అలవాటు పడకపోవటమే ఎంతో హుషారుగా మొదలుపెట్టిన చదువుల్ని అర్ధాంతరంగా ఆపెయ్యటానికి అసలు కారణం!మాతృభాషలో విద్యాబోధన నిక్కచ్చిగా జరగడానికి మొదటి ఆఖరి అడ్డంకి పాఠ్యపుస్తకాల్ని ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చెయ్యగలిగిన ద్విభాషాకోవిదులైన పండితులు లేకపోవటమే తప్ప ఈ దేశపు పిల్లలు చదువుకోవడానికి ఉత్సాహంగానే ఉన్నారు.

     ఇవ్వాళ ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడుతున్న భాష ఇంగ్లీషు కానేకాదు,ఒక లెక్క ప్రకారం అది నాలుగో స్థానంలో ఉంది!Ethnologue: Languages of the World, 15th ed. (2005) & Wikipedia.org వారి లెక్కల ప్రకారం చైనీస్ మాండరిన్ భాషను మాతృభాషగా గలవారు 873 మిలియన్లు ఉండగా 2వ భాషగా నేర్చుకుని మాట్లాదగలుగుతున్నవాళ్ళు 178 మిలియన్లు ఉన్నారు - మొత్తం మీద 1.051 బిలియన్ల మంది మాట్లాడుతూ ప్రధమ స్థానంలో ఉంది!హిందీ భాషను మాతృభాషగా గలవారు 370 మిలియన్లు ఉండగా 2వ భాషగా నేర్చుకుని మాట్లాదగలుగుతున్నవాళ్ళు 120 మిలియన్లు ఉన్నారు - మొత్తం మీద 490 మిలియన్ల మంది మాట్లాడుతూ ద్వితీయ స్థానంలో ఉంది!స్పానిష్ భాషను మాతృభాషగా గలవారు 350 మిలియన్లు ఉండగా 2వ భాషగా నేర్చుకుని మాట్లాదగలుగుతున్నవాళ్ళు 70 మిలియన్లు ఉన్నారు - మొత్తం మీద 420 మిలియన్ల మంది మాట్లాడుతూ తృతీయ స్థానంలో ఉంది!ఇంగ్లీషు భాషను మాతృభాషగా గలవారు 340 మిలియన్లు ఉండగా మొత్తం మీద 510 మిలియన్ల మంది మాట్లాడుతూ చతుర్ధ స్థానంలో ఉంది!స్థానం మాతృభాషని బట్టి ఇచ్చారనేది గుర్తుంచుకుంటే 510 మిలియన్లు ఉన్నా నాలుగో స్థానంలోకి ఎందుకు వెళ్ళిందో తెలుస్తుంది.మళ్ళీ 2013లో తీసిన లెక్కల ప్రకారం ప్రపంచంలో మాతృభాషగా ఉండి ఎక్కువ మంది మాట్లాడుతున్న 10 భాషలు ఇవి:1). మాండరిన్(1197 మిలియన్లు) 2).స్పానిష్(406 మిలియన్లు) 3).ఇంగ్లీష్(335 మిలియన్లు) 4).హిందీ-ఉర్దు(260 మిలియన్లు) 5).అరబిక్(223 మిలియన్లు) 6).పోర్చుగీస్(202 మిలియన్లు) 7).బెంగాలి(193 మిలియన్లు) 8).రష్యన్(162 మిలియన్లు) 9).జపనీస్(122 మిలియన్లు) 10).జవనీస్(84 మిలియన్లు) - దీన్ని బట్టి మీకేం అర్ధ మవుతుంది? ప్రపంచంలో ఇంగ్లీషు భాష ఒక్కటే కాదు,మనం నేర్చుకుని మాట్లాడగలిగితే ఉపాధి/వ్యాపారం/జీవితం కోసం ఎక్కడికయినా వెళ్ళోచ్చు అని కదా!

     అంకెలు పూర్తిగా ఖచ్చితం కాకపోవచ్చు,ఎందుకంటే చైనీస్ భాషల్లో మాండరిన్ అనేది ఒక మాండలికం కావచ్చు,మళ్ళీ మాండరిన్ లోనే ప్రాంతాన్ని బట్టి శాఖలూ ఉండవచ్చు - మనకి తెలుగులో ఉన్న జిల్లాల వారీ మాండలికం లాగ!కానీ స్థూలంగా నిష్పత్తులలో మాత్రం చాలా కొద్ది తేడాయే ఉంటున్నది.లెక్కల కోసం ఎంచుకున్న పధ్ధతి పూర్తి శాస్త్రీయంగానే ఉన్నది కాబట్టి ఈ గణాంకాలు అందరూ ఒప్పుకుంటున్నవే.ప్రస్తుతం దేశాల వారీగా చూస్తే ఇంగ్లీషు 101 దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది,అరబిక్ 59 దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది,ఫ్రెంచ్ 51 దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది,స్పానిష్ 31 దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది,రష్యన్ పోర్చుగీస్ 11 దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్నాయి.ప్రస్తుతం సమాచార సేకరణకి సంబంధించి అంతర్జాలం మీద ఆధారపడుతున్నాము గాబట్టి వాటి వివరాలు చూసినా ఇంగ్లీషు ఒక్కటె ఇంటర్నెట్ మొత్తాన్ని ఆక్రమించెయ్యలేదని తెలుస్తుంది.ఇంటర్నెట్ వినియోగంలో నిష్పత్తి ఇలా ఉంది: 1).ఇంగ్లీషు(27.3%) 2).చైనీస్(22.6%) 3).స్పానిష్(7.8%) 4).జపనీస్(5.3%) 5).పోర్చుగీస్(4.3%) 6).జర్మన్(4.0%) 7).అరబిక్(3.3%) 8).ఫ్రెంచ్(5.2%) 9).రష్యన్(2.5%) 10).కొరియన్(2.1%) - అందరూ ఆంగ్ల భాషా వ్యామోహంలో లేరు!

     జ్ఞానం ఏ రూపంలో ఉన్నా అది భాష ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.ఆ జ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం అయితే ఉపాధికీ ఆర్జనకీ తోడ్పడుతుంది,కళాసృజనకి సంబంధించినదైతే ఆనందం పరమావధి అవుతుంది.అన్ని భాషల లోనూ ఉండే సారూప్యాలు - అక్షరం,పదం,వాక్యం,నిర్మాణం/వ్యాకరణం!భాషా శాస్త్రజ్ఞు లందరూ ముక్తకంఠంతో ఒప్పుకుంటున్న మొదటి విషయం అనేక భాషలు నేర్వాలనుకున్నవారు మొదట ఒక భాషలో మంచి పట్టును సాధించాలి.ఆ తర్వాత తులనాత్మకంగా, అంటే మొదటి భాషలోని ఈ పదానికి రెందవ భాషలో ఏ పదం సరిపోతుంది,మొదటి భాషలో మనం చక్కగా  వ్యక్తీకరించగలుగుతున్న ఒక భావాన్ని మరొక భాషలో యెలా చెప్పగలం అనే విధంగా నేర్చుకోవడం తప్ప ప్రతి భాషనీ విడివిడిగా నేర్చుకోవడం అనేది శుధ్ధ తెలివితక్కువ పని.పుస్తకంలో ఎంత విషయం అచ్చయి ఉన్నా గురువు విశ్లేషించి చెప్పకుండా ఏదీ బోధపడదు - ముఖే ముఖే సరస్వతి!

     ఇవ్వాళ దేశంలో విద్యాబోధన జరగాల్సిన దానికి రివర్సు గేరులో జరుగుతున్నది.ఇంత గట్టిగా ఇంగ్లీషును చిన్నతనం నుంచీ రుద్దినా ఉత్తీర్ణత శాతం చూస్తే ఫలితం ఏమంత గొప్పగా లేదు,ప్రావీణ్యతని లెక్కించినా గిరీశం మార్కు బొట్లేరింగ్లీషు తప్ప అయిదు నిమిషాలు తప్పుల్లేని ఇంగ్లీషు మాట్లాడగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు - ఈ ఆంగ్లభాషాప్రచారకుల్లొనే తప్పుల్లేని ఇంగ్లీషు మాట్లాడగలిగిన వాళ్ళు ఎక్కువమంది ఉండకపోవచ్చు, మరి ఎందుకొచ్చిన వ్యామోహం?మొదట మన మాతృభాషని మనం క్షుణ్ణంగా నేర్చుకుని పిదప పరభాషలో ప్రావీణ్యత సంపాదించి ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఒద్దికగా వాళ్లలో కలిసిపోయి బతుకుతూ మన భాషని వాళ్లకి కూడా నేర్పుతూ ఉంటే ఒకనాటికి మన భాష కూడా ఎక్కువ మంది మాట్లాడే ఎన్నదగిన భాషల్లో ఒకటవుతుంది.ఇంగ్లీషువాళ్ళలా కాకుండా అట్లా మర్యాదాపురుషోత్తముల వలె వ్యాపించితే ఎవరు కాదంటారు!

పరభాషా వ్యామోహమనే చెట్టుకి పరాధీనత తల్లివేరు - వేరుని మాడ్చకుండా చెట్టుని కూల్చలేం!


Friday 18 December 2015

కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (శ్రీమతి ఇందిరా గాంధీ)

        "నేను ఇందిర కోడల్ని!ఎవరికీ భయపడను?" - ఒక కేసులో ముద్దాయిగా పేర్కొనబడి,కోర్టు వారు ఫలానా తేదీన హాజరు కమ్మని శ్రీముఖం పంపితే 2015లో అంతకు ముందు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని అప్పగించిన రెండు విడతల దశాబ్ద కాలపు అధికారంలో అవినీతిని ఇంటిపేరుగా చేసుకున్నంత ధీమాగా కుంభకోణాల పరంపరని ప్రోత్సహించి, ఆఖరి దశలో తత్వం బోధపడి కూడా ఆంధ్రప్రదేశ్ రాస్ట్రాన్ని ఆ రాష్ట్రానికి చెందిన సొంత పార్టీ వాళ్ళు ఎంత మొత్తుకుంటున్నా వినకుండా చీల్చగూడని విధంగా చీల్చి లాభం పొందాలన్న పరమ బేఖారీ వ్యూహాలతో, దిక్కుమాలిన ఎత్తుగడలతో ఎన్నికలకి సిధ్ధమై కాగితాలు చూసి ప్రసంగాలు దంచే తనూ తను మాట్లాడుతున్నవి ఎన్నికల ప్రసంగాలు అని తెలియక "మా అమ్మ ఏడ్చింది" అంటూ "వుడ్వర్డ్స్ పట్టమని చెప్పు" అన్న జోకు మాదిరి ప్రసంగించే తన పుత్రుడూ చాలు పార్టీని ఉధ్ధరించడానికి అనుకుని, తీరా ఎన్నికల్లో అనుకున్నది ఒకటీ అయినది ఒకటీ అయి బండి బోల్తా కొట్టి అధికారం పోగొట్టుకుని అసహనం పెంచుకున్న శ్రీమతి సోనియా గాంధీ ఈవిధంగా ప్రతిస్పందించింది - భయపడనని చెప్తూ భయాన్ని దాచుకోవడానికా అనేది నా అనుమానం!నిజమే, ఈ కోడలి స్థానంలో ఉన్నమరుగుజ్జు ప్రస్తావించిన మహాకీర్తికాయురాలు శ్రీమతి ఇందిరా గాంధి తను భయపడకపోవటమే కాదు, ఇతర్లని భయపెట్టి ప్రతికక్షులతో "కాళిక" అనిపించుకుంది.స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధాని రాజకీయంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని అభాసుపాలై ఉందవచ్చు గానీ,పదవిని స్వప్రయోజనాలకి వాడుకోవటానికి వీలయినంతవరకు దూరంగానే ఉన్నాడు,చాలాసార్లు తనని వ్యతిరేకించిన ఎదటివారి అభిప్రాయాలకి విలువనిచ్చి తన వరకూ తను ప్రజాస్వామ్యాన్ని గౌరవించాడు.కానీ అతని శిష్యరికంలో ఎదిగిన అతని కూతురు శ్రీమతి ఇందిరా గాంధి మాత్రం పూర్తి విరుధ్ధమైన దారిలో నడిచి శుభకీర్తినీ అపకీర్తినీ సరిసమానంగా సంపాదించుకుంది!
        తెలిసో తెలియకో శ్రీమతి సోనియా గాంధీ రెండు పరస్పర విరుధ్ధమయిన చారిత్రక సన్నివేశాల్ని తను గుర్తు చేసుకుని మనకి గుర్తు చేసి అనాటి ఫలితాన్ని మళ్ళీ సాధించాలని ఆశిస్తున్నది. కానీ అప్పుడు శ్రీమతి ఇందిరా గాంధీ అనూహ్యమయిన ఫలితాన్ని అందుకున్న పరిస్థితికీ ఇప్పుడు శ్రీమతి సోనియా గాంధీ నిలబడి ఉన్న పరిస్థితికీ తేడాలు కూడా ఉన్నాయి.పోలికలు కలిసొచ్చి కాలం అనుకూల ఫలితాన్ని ఇస్తుందని కాంగ్రెసు ఆశిస్తున్నది,కానీ తేడాలు కలిసొచ్చి పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంభట్టు అన్నరీతిన ఎదురు తంతే?!ఈవిడ పోల్చుకుని మురిసిపోతున్న సన్నివేశం యేమిటంటే, శ్రీమతి ఇందిరా గాంధీ తను 1971 నాటి ఒకానొక ఎన్నికల్లో తప్పుడు పధ్ధతుల్లో గెలిచానని ఒక కోర్టు నిర్ధారించుకుని ఆ ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వటంతో, అల్లాటప్పా గోంగూర కట్ట పొలిటీషియన్ మాదిరిగా సిగ్గుపడి పదవి నుంచి దిగిపోకుండా, అప్పటి దాకా అమాయకంగా నడిచిన భారత రాజకీయ చరిత్రని బట్టి చూస్తే ఏ భారత రాజకీయ నాయకుడైనా ఇలాంటి పని చేస్తాడా అని సందేహమొస్తే చేస్తాడని ఎవరూ వూహించని ఒక మహాసాహసోపేతమైన నిర్ణయం తీసుకుని, 1975లో భారతదేశపు రాజకీయ చరిత్రలో చీకటియుగం అని పిలవదగిన అత్యయిక పరిస్థితిని దేశం మొత్తం మీద రుద్దేసి, 21 నెలల పాటు జంకూ గొంకూ లేకుండా తను దొరికిపోతాననుకున్న చీకటి తప్పులకి సంబంధించిన సాక్ష్యాల్ని చెరిపేసి, తర్వాతి ఎన్నికల్లో జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో అప్పటి ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడి ఓడించి ఎమర్జన్సీ రోజుల్లో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్న కాలంలోనే - శత్రువర్గం చేసిన చిన్న పొరపాటును అమోఘమైన చాణక్యనీతి ప్రదర్శించి తన కనుకూలంగా మలుచుకుని జైలుపాలవ్వాల్సిన భవిష్యత్తుని లాఘవంగా వెనక్కి తిప్పి దెబ్బతిన్న ఆడపులిలా తిరగబడి ఇక ఎన్నటికీ రాదనుకున్న అధికార పీఠాన్ని తిరిగి అధిష్ఠించింది!
        ఈ రెండు సన్నివేశాల్లో ఉన్న మొదటి తేడా శ్రీమతి ఇందిరా గాంధీ కున్న రాజకీయ పరిణీతీ వ్యూహాత్మక చాతుర్యమూ ఈవిడకి లేకపోవటం!రెండవది ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ కున్న ఎమర్జనీ నాటి తప్పిదాలకి తాను కారణం కాదని తప్పించుకోగలిగిన "బెనిఫిట్ ఆఫ్ డౌట్" ఈనాడు ఈవిడకి లేదు - విదేశీ హస్తం అన్నమాటతో అన్ని విమర్శల్నీ కొట్టిపారేస్తే జనం పిచ్చోళ్ళ మాదిరి నమ్మేశారు!ఇప్పటి కేసు స్వయంగా తనూ తన కొడుకూ ఒకటో నెంబరూ రెండో నంబరుగా ఉదహరించబడిన అవినీతి కేసు - గొడవ ఎక్కువ చేస్తే జనానికి కేసు బలంగా ఉందేమో రుజువైతే జైలుకెళ్ళాల్సి వస్తుందని గోల చేస్తున్నారేమో నని అనుమానం వచ్చే ప్రమాదం ఉంది!అప్పుడు కూడా అనుభవ రాహిత్యం వల్ల అధికారంలో ఉన్నవాళ్ళు వ్యక్తిగత ప్రతిష్ఠల కోసం ఒకరినొకరు విమర్శించుకుని అప్పటికే జనంలో పలచన అయ్యారు,చరణ్ సింగ్ ఏమో మురార్జీ కన్నా నేనే పుడింగిని అని అనుకుని అన్యాపదేశంగా చురకలు వేస్తూ ఉండేవాడు,మధు లిమాయే రాజ్ నారాయణ్ ద్వయం ఎప్పుదూ భారతీయ జన సంఘ్ నాయకులతో పోట్లాడుతూ ఉండేవాళ్ళు,ఈ గొదవల్లో ఒకానొక దురదృష్టకరమైన సమయంలో ఇంత జరుగుతుందని అనుకోకుండా చరణ్ సింగ్ ఇందిరాగాంధీ మీద కేసు వెయ్యటం అన్యాయం అని చిన్న ఫీలర్ వదిలాడు - ప్రతి రాజకీయ నాయకుడికీ ఉండే తను మిగిలిన వాళ్ళ కన్నా ప్రత్యేకం,నేనైతే అలా చేసేవాణ్ణి కాదు అని చాటుకోవాలనే దురద కొద్దీ!మామూలు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళకయితే దాన్ని అంత గొప్పగా ఉపయోగించుకోవటం అస్సలు సాధ్యపడి ఉండేది కాదు,కానీ అక్కడ ఉన్నదెవరు?పూర్వకాలం రాజులకి చిన్నప్పణ్ణించీ నువ్వు పెద్దయ్యాక రాజువి కావాలి,అందుకోసం ఇవన్నీ నేర్చుకోవాలి అని శిక్షణ ఇచ్చి తయారు చేసినట్టు పెరిగిన రాజవంశపు తయారీ!
        ఇందిరా గాంధీని దేశప్రజలందరూ నమ్మి ఓట్లేసి గెలిపించారు గాబట్టి ఎమర్జన్సీలో అసలేమీ జరగలేదని అనుకోగలమా?లేదు,జరిగినాయనడానికి గట్టి సాక్ష్యాలే ఉన్నాయి,ఆవిడ శత్రువులు బలహీనులై వాటి సాయంతో ఆమె ఆతని కట్టించలేకపోయారు, అంతే!కేవలం రెందేళ్లలో తన మీద ఎమర్జన్సీ నేరాలకి సంబంధించి నిజనిర్ధారణ కమిటీ విచారణ జరుపుతుండగానే,తనని వారం రోజులు జైలులో ఉంచినా, మరెన్నో విధాలుగా ఈమెని డ్యామేజి చెయ్యాలని వాళ్ళూ తమ శక్తి కొద్దీ ప్రయత్నించినా ఎన్నికల నాటి పరిస్థితి "ఒక సివంగికి ఎదురుగా కోతుల గుంపు" అనే విధమైన వాతావరణాన్ని సృష్టించుకోగలిగిన శ్రీమతి ఇందిరా గాంధీ ఆధునిక కాలపు నాగమాంబ - మాయురే
        ఎమర్జన్సీ విధించటానికి కారణమైన అలహాబాద్ హైకోర్టు తీర్పులో ప్రస్తావించబడిన 1971 నాటి ఎన్నికలలో ప్రతిస్పర్ధి రాజ్ నారాయణ్ కోర్టు తీర్పుతో అధ్భుతమైన విజయాన్ని సాధించినట్టు,సాంకేతికంగా చూస్తే ఇందిరాగాంధి రెండు సార్లు ఓడిపోయినట్టు!అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా "firing prime minister for traffic ticket" అని వర్ణించినంత దిక్కుమాలిన పరిస్థితి తనది,కానీ వెంటనే సుప్రీం కోర్టులో ఆ తీర్పుని చాలెంజ్ చేసింది.సుప్రీం కోర్తు కూడా పార్లమెంటు సభ్యురాలిగా తను పొందుతున్న సకల సౌకర్యాల్నీ రద్దు చెయ్యాలనీ,వోటింగులో పాల్గొనరాదనీ కఠినంగా తీర్మానించి ప్రధానమంత్రిగా కొనసాగడానికి మాత్రం ధారాళంగా అనుమతి ఇచ్చింది,యెందుకో మరి?హై కోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచే నిరసనలు జరుగుతూనే ఉన్నాయిగా, ఆ నిరసన కార్యక్రమలో ఈ తీర్పు వచ్చిన మరుసటి రోజు జయపకాశ్ నారాయణ్ ఏ ప్రభుత్వాధికారి యైనా పోలీసు అధికారి అయినా పరిపాలించడానికి అర్హత లేని ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్ని అమలుపరచాల్సిన అవసరం లేదనేశాడు,సరిగ్గా లాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న శ్రీమతి ఇందిరా గాంధీ కేవలం 24 గంటల్లో అప్పటికి ఆనవాళ్ళు కూడా లేని పాకిస్తానుతో యుధ్ధప్రమాదాన్నీ ఎప్పటి నుంచో ఉన్న ఏలిన్నాటి శనిలాంటి కరువు భెబత్సాన్నీ కారణాలుగా చూపించి రబ్బరు స్టాంపు కన్నా విధేయుడైన ఫక్రుద్దీన్ ఆలీ అహమద్ చేతుల మీదుగా అత్యయిక పరిస్థితిని ప్రకటించి ప్రతి ఆరునెల్లకూ ఒకసారి వుత్తుత్తినే పొడిగింపు తతంగం చేస్తూ తనకి బోరుకొట్టి 1977లో ఎన్నికలు ప్రకటించే వరకూ కొనసాగిన ఈ రాజ్యాంగ రమణీ మానహరణ దుశ్శాసన పర్వంలో జరిగిన దారుణాలు  సమాచార వ్యవష్తని కూడా నిర్వీర్యం చెయ్యటంతో ప్రజలు తెలుసుకోలేకపోయారు - అదె ఈ అనైతిక రమణికి వరమైంది!ఎమర్జన్సీలో జరిగినది కేవలం ప్రజాస్వామ్యానికి పాతర వెయ్యటం మాత్రమే కాదు,అదొక వల్లకాటి అధ్వాన్న శకం!తల్లి అధికారంలో ఉండడం వల్ల తాను అనుభవిస్తున్న వైభవాల కొవ్వు అంగుళం మందాన పేరుకుపోయి తల్లి తర్వాత ఈ దేశానికి తనే అధినేతనని అనుకుంటున్న ఈవిడ సుపుత్రుడు జనాభా పెరుగుదలని అరికట్టటానికి చేసిన వికృత ప్రయోగం ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యనిది - తప్పనిసరి వంధ్యత్వం?!
        ఒకసారి సంజయ్ గాంధీ హిందీ చిత్రసీమకి చెందిన ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ని కాంగెసు ప్రచార గీతాలు పాదమంటే అతను తిరస్కరించాడు.దాని ఫలితం 1974 మే 4 నుంచీ ఎమర్జన్సీ ఎత్తివేసేవరకు ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న ఆల్ ఇండియా రేడియో,దూర దర్శన్ కార్యక్రమాలలో కిషోర్ కుమార్ గొంతు వినిపించకుండా పోయింది అప్పటి  ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ శాఖకి మంత్రిత్వం వెలగబెడుతున్న విద్యా చరణ్ శుక్లా అనధికారిక నిషేధం విధించదంతో!చూస్తున్న వెర్రిజనాలకి ఇదేమీ తెలియదుగా,వెర్రిమొగమేసుకుని చూపించినది చూట్టం తప్ప:-)అసలీ తల్లీ కొడుకుల మధ్యన ఉన్న అనుబంధం చాలా చిత్రమైనది.మామూలుగా మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రుల్ని విధిగా గౌరవించమనే సంప్రదాయపు సూక్తుల్ని నూరిపోయ్యటం,తలిదండ్రుల పట్ల కొంచెం విసుగుతో మాట తూలితేనే మనల్ని పంచమహాపాతకాలు చేసిన వాళ్ళలాగ తూర్పారబట్టి రౌరవాది నరకాల గురించి భయపెట్టి హడావిడి చేసే వాతావరణంలో పెరిగిన వాళ్ళకి ప్రధానమంత్రి పదవిలో ఉన్న తల్లిని నిట్టాడిలా ఎదిగిన కొడుకు పదిమందీ చూస్తుండగా కొట్టాడని వింటే నమ్మలేం?!కానీ నమ్మి తీరాలి,ఎందుకంటే ఆ విషయం చెప్పినది పులిట్జర్ బహుమతి గ్రహీత Lewis M Simons.అతని కధనం ప్రకారం ఒకసారి పొరపాటున చెయ్యి విదిల్చినట్టు అనుకోకుండా జరిగినది కాదట, కావాలని పోట్లాడుతున్నట్టుగానే కొట్టాడట - ఆరు సార్లు!ఒక ప్రైవేటు పార్టీలో ఆ సంఘటన జరిగితే ఆ పార్టీకి అటెందయిన ఇద్ద్దరు నమ్మదగిన వ్యక్తుల నుంచి వచ్చిన వివరం అది.వాళ్ళిద్దరూ తను ప్లాంట్ చేసిన వాళ్ళు కాదని కూడా చెప్తున్నాడు.అదీ గాక ఒక వ్యక్తి తమ ఇంట్లో పిచ్చాపాటీ కబుర్ల మధ్యన ఆ తల్లీ-కొడుకుల ప్రస్తావన వచ్చినప్పుడు తను స్వయంగా చూసిన ఈ సంఘటన గురించి చెప్పాడనీ,రెండవ వ్యక్తి తను అడిగితే కన్ఫర్మ్ చేశాడనీ చెప్తున్నాడు, నమ్మాల్సిందే!
        ఈ తల్లీ కొడుకుల చిత్రమైన వ్యవహార శైలిని అర్ధం చేసుకోవటానికీ పుత్రరత్నం తల్లి మీద ఎందుకు పెత్తనం చేస్తూ ఉండేవాడో తెలుసుకోవటానికీ తక్కిన వాళ్ళందరి మీదా పెత్తనం చేసే మహారాణి అతని పెత్తనాన్ని ఎలా సహించిందనే ప్రశ్నకి జవాబు వెతుక్కోవటానికీ సంజయ్ గాంధీ దుర్మరణం తర్వాత జరిగిన కొన్ని యాదృచ్చికంగా కనిపించే ఒకదాని కొకటి సంబంధం లేని వింత విషయాలు ఉపయోగపడతాయి!ప్రమాద వార్త విన్న వెంఠనే శ్రీమతి ఇందిరా గాంధీ అతని చేతి కున్న వాచీని గురించి వాకబు చెయ్యటం ఇప్పటికీ మిస్టరీయే - దుఃఖంతో సంచలించి పోవాల్సిన తల్లి స్థానంలో ఉన్న స్త్రీ ముఖంలో దుఃఖానికి బదులు ఆరా!అదే సమయంలో వీరి కుటుంబానికి ఏ మాత్రమూ సంబంధం లేని ముహమ్మద్ యూనస్ రక్తసంబంధీకుడు చనిపోయినట్టు తట్టుకోలేని దుఃఖంతో విల విల లాడటం చూస్తే ఎవరికయినా ఏమనిపిస్తుంది?పైగా సంజయ్ గాంధీ పుట్టింది దంపతు లిద్దరూ ఒకరి నొకరు ద్వేషించుకుని విడాకులు తీసుకోవటం ఒకటే తక్కువగా వేరువేరు జీవితాలు గడుపుతున్న కాలంలో?!ఈ ముహమ్మద్ యూనస్ రాసిన పుస్తకం Persons, Passions & Politics చదివితే అతనికి సంజయ్ గాంధీ అంటే ఉన్న అపారమైన ఆత్మీయత వెనుక ఉన్న నిగూఢత అర్ధమవుతుంది!
        శ్రీమతి ఇందిరా గాంధీ ఒకానొక చోట విలేఖరులు అడిగిన ప్రశ్నలలో తండ్రినీ తననీ పోల్చుకుంటూ "I am not new kid to plitics,my father is my teacher - he is saint but not me" అన్నది,నాకు నిజంగా మొదట షాకూ పిదప స్మైలూ వచ్చాయి.ఎందుకంటే అంతటి స్వేచ్చావిహారి బైరాగిలా కనిపిస్తే ఈమె ఇంకెంత ఘనాపాటీ అయి ఉండాలి!అయితే, రాజకీయ రంగంలో మాత్రం,మరీ ముఖ్యంగా విదేశాంగ నీతి విషయంలో తండ్రి కన్నా భిన్నంగా ఉండటం నాకు నచ్చింది.చైనా విషయంలో తండ్రి తత్తరపాటునీ దాని ఫలితాన్నీ చాలా దగ్గిర నుంచి చూసి ఉండటం వల్ల గాబోలు దేశరక్షణకి సంబంధించిన విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవటంలోనూ, ప్రపంచ వేదికల మీద ప్రసంగించేటప్పుడు మన దేశపు గొంతును బలంగా వినిపించటంలోనూ అద్వితీయమైన ప్రతిభని చూపించింది!అటు ప్రపంచ దేశాల ముందు అమాయకంగా మాట్లాడుతూ ఇటు రహస్యంగా అణ్వస్త్ర సముపార్జనని జరిపించటమూ, యుధ్ధ సమయాల్లో ఆమె చూపించిన తెగువా నిజంగా కొనియాదదగ్గవే!తండ్రి పొరపాట్లని చూసి ఉండటం కాఠిన్యాన్ని పెంచిందనుకోవటానికి వీలు లేకుండా తన రాజకీయ జీవితపు లేత యవ్వనప్రాయం లోనే ఇప్పటికీ ఆ తండ్రీ కూతుళ్ళలో ఎవరిని విమర్శించినా కారల్ మార్క్సుని విమర్శించిన దానికన్నా లబలబ లాడిపోయి మీదబడి తంతారేమోననే స్థాయిలో రెచ్చిపోయి తిట్లకి లంకించుకునే కమ్యునిష్టుల యేలుబడి లోని కేరళ ప్రభుత్వాన్ని మహిషాసుర మర్దినిలా తొక్కేసిన సంఘటన సాక్ష్యంగా ఉంది కదా, తన సహజ స్వభావమే స్త్రీ రూపంలో ఉన్న పురుషత్వం కావచ్చు - ఆడ చాణక్యుడు?!కానీ తండ్రి సమయంలో భయపడుతూ భయపడుతూ చాటుగా మాటుగా జరిగిన అవినీతి తన హయాములో రెక్కలు విప్పుకుని ఎగురుతుంటే చూస్తూ వూరుకోవటం, అధికారాన్ని ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించటానికి కాకుండా తనకు అంగరంగ వైభవాల్ని సనకూర్చుకోవటానికి ఉపయోగించుకోవటం లాంటివాట్ని ఎలా క్షమించగలం?
        ఎప్పుడైతే ఒక కోర్టు తన ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చిందో స్వాభిమానం ఆభిజాత్యం అనే పెద్ద మాటలు వాడకుండా సిగ్గూశరం ఉన్నవాడు ఎవడయినా అక్కడ ఉండి ఉంటే కోర్టు తీర్పుకి కట్టుబడి పదవి నుంచి దిగిపోయి ఉండేవాడు,కనీసం తను అప్పీలు చేసుకున్న సుప్రీం కోర్తు కూడా దయదల్చి ప్రధానమంత్రిగా ఉండనిచ్చి పార్లమెంటు సభ్యత్వానికి సంబంధించిన సమస్త సౌకర్యాల్నీ వూడబెరికి, బిల్లుల మీద వోటు చెయ్యడానికి వీలు లేదని తీర్పు ఇచ్చినప్పుడయినా వెనక్కి తగ్గలేదు,ఎమర్జన్సీ కాలంలో పుత్రరత్నం అమాయక ప్రజల మీద చేసిన ఘాతుకాలు తెలిసినప్పుడు పశ్చాత్తాపం ప్రదర్శించ లేదు - ఇంత విపరీతమైన స్థాయిలో అధికారం పట్ల వ్యామోహం ధర్మాధర్మవిచక్షణజ్ఞానం గల సత్పురుషుడిలో ఉండటానికి ఆస్కారం ఉంటుందా?నీతి లేదు,రీతి లేదు,చట్టం లేదు,న్యాయం లేదు - తను అధికారంలో ఉండాలి, అంతే!

        అధికారం ఉన్నచోట బెల్లం చుట్టూ ఈగల్లాగ జనం గుమిగూడటం సహజమే గాదా,ఈ మాత్రం దానికే ఇదైపోవాలా,ఎమర్జన్సీ కాలంలో హరిత విప్లవమూ, 20 సూత్రాల కార్యక్రమమూ, ఇంకా కొన్ని మంచిపనులూ జరిగాయిగా, ఆమె పూనుకుని చేసిన మంచిపనులతో పోలిస్తే ఆవిడే సమర్ధించుకున్నట్టు అంతటా ఉన్న అవినీతిని పెద్దగా పట్టించుకోవటం అనవసరం పోనిద్దురూ అనుకుంటారు కొందరు!కానీ అట్లా ఆమె చుట్టూ చేరి ఆమెకి విధేయులుగా ఉంటూ "ఇందిరయే ఇండియా, ఇండియాయే ఇందిర" అని భజనలు చేసేవారు ఏ లాభమూ లేకుండా చేరుతారని అనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు.ఒకసారి ఆమె తను వెళ్తున్న విమానంలో వూరికే కలయదిరుగుతూ కార్గో విండో నుంచి లోపలికి చూస్తే రకరకాల సామాన్లతో మొత్తం నిండిపోయి ఉంది.అవి ఎవరివి అని ఆరా తీస్తే "మీ అంతరంగిక రక్షణ సిబ్బందివి!" అని జవాబు వచ్చింది.ప్రధానమంత్రి రక్షణ సిబ్బందిగా ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని ఆయా దేశాల్లో వారు చేసిన షాపింగు అది - అలా తక్కువ రేటుకి దక్కించుకున్న వాటిని అమ్మితే ఎంత తక్కువ లాభం కిట్టించుకున్నా లాభమేగా!ఒక దేశప్రధాని అంతరంగిక భద్రతా సిబ్బందిగా ఉన్న వాళ్ళకి పొరలుపొరలుగా ఉండే రాయితీల్ని లెక్కేస్తే వారిలో ఎవరూ తమ పర్సులో నుంచి ఒక్క రూపాయి కూడా బైటికి తీసి ఉండకపోవచ్చు, డౌటా?అసలు ఎమర్జెన్సీ అంత హఠాత్తుగా విధించినది తను చట్టానికి పట్టుబడకుండా ఉండటం కోసం ఆధారాల్ని చెరిపేసుకోవటానికే అయి ఉండవచ్చు!ఆవిడ హయాంలో మన దేశసంపద అంతకుముందు ఉన్న 70 రూపాయల కన్నా కొంచెం పెరిగి 100 రూపాయలు అయ్యిందనుకుంటే తనూ తన వందిమాగధులూ 40 రూపాయలు నొక్కేసి మిగతా దేశజనాభా కంతటికీ 60 రూపాయలు పంచితే దాన్ని యే రకంగా సమర్ధించాలి?!

        15 ఏళ్ళపాటు పాటు అధికారంలో ఉన్నా లేకపోయినా ఇతర్ల దృష్టిని తన మీద ఉండేలా చూసుకుని ఈ దేశపు రాజకీయ వ్యవస్థ నంతా తన గుప్పిట్లో పెట్టుకుని తను సాధించిన ఘనకార్యం ఏమిటి?బతికి ఉన్నంత కాలం తనవల్ల లాభం పొందిన వాళ్ళే చచ్చిన మరుక్షణం నుంచి అన్ని రాజకీయ నిర్ణయాలకీ తననే బలిచేసి, తమకు పేరు తెచ్చుకోవడం కోసం తన మీద బురద జల్లుతూ పుస్తకాలు రాయడం లాంటి సిగ్గులేని పనులు చేశారు!భారతదేశపు రాజకీయ చరిత్రలో దుర్మరణానికి గురయిన తొలి ప్రధానిగా వినుతి కెక్కడం వెనుక ఉన్నది ఆమెని చంపిన శత్రువుల దుర్మార్గమా తన స్వయంకృతాపరాధమా ఏది సరైన కారణం అని నిగ్గదీసి అడిగితే ఎంత గట్టి సమర్ధకుడైనా నీళ్ళు నమలాల్సిన పరిస్థితి - నిరంతర విజయాలని కోరుకుని ఎవరికీ సాధ్యం కాని అలాంటిదాని కోసంఎండమావుల వెంట పరిగెత్తి ఎప్పటికప్పుడు పాతనీతులన్నీ పరగడుపే నన్నట్టు నీతిగల వాడెవ్వడూ చెయ్యగూడని తప్పులు చేస్తూ ఒక తప్పు బయటపడుతుంటే ఆ తప్పుని కప్పి పుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తూ ఆత్మని సుఖాలకి బలిపెట్టి పగ వాడికి కూడా కోరుకోగూడని బతుకు బతికింది!దేహాన్ని ప్రేమించేవాళ్ళకి ఆమె అందం అచ్చెరువు గొలుపుతుంది,భోగాన్ని ప్రేమించేటట్లయితే ఆమె కట్టిన చీరలు ప్రతి ఆడదానికీ నచ్చుతాయి,విజయాన్ని ప్రేమించేవాళ్లకి ఆమె సాధించిన విజయాలు అధ్భుత మనిపిస్తాయి - కానీ ఆత్మని విలాసాలకి బానిసని చెయ్యకుండా నైతికతకి విలువ నిచ్చేవాళ్ళకి పంజాబీలు శ్రీమతి ఇందిరా గాంధీని ఎందుకు అసహ్యించుకుంటున్నారో తెలిస్తే ఆమె చరిత్ర వెగటు పుట్టిస్తుంది - మళ్ళీ ఇటువంటి రాజకీయ వేత్త ఈ భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండు ననిపిస్తుంది!

        సహజంగా సిక్కులు శాంతిప్రియులు,సాధుజీవనులు!ప్రతి జాతిలోనూ ఇవి మామూలుగా ఉండే మంచి లక్షణాలే,కానీ వారిలో ఇంకే జాతిలోనూ కనిపించని మరో రెండు విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి - హాస్యప్రియత్వం,పోరాటతత్వం!మీరూ నేనూ మరెవరయినా సరె మనల్ని ఎవరయినా అవహేళనగా ఒక చిన్న మాట అంటేనే రోషం పొడుచుకొస్తుంది, అక్కడికక్కడ అవతలి వాణ్ణి చంపెయ్యాలన్నంత పగతో రగిలిపోతాం.కానీ సర్దార్జీ జోకుల పేరుతో ఎన్ని వందల జోకులు వేసినా వారు కోపం తెచ్చుకోలేదు,పైగా ఎంతో స్పోర్టివ్ మెంటాలిటీని చూపించారు.ఒకాయన అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటున్న సందర్భంలో ఒక సర్దార్జీ జోకును వారిలో ఒక సర్దార్జీ కూడా ఉన్నందువల్ల మొహమాట పడి బీహారీ బాబుల పేరుతోనో మరో పేరుతోనో చెప్తుంటే ఆ సర్దార్జీ "ప్రపంచంలో ఉన్న సర్దార్జీలంతా చచ్చారనుకున్నావా ఏం?అది మా జోకు,మరొకళ్ళ కెట్లా కలుపుతావు!" అని గద్దించాడట.అంతటి హాస్యప్రియులు ఖలిస్థాన్ ఉద్యమ కాలంలో కనబడిన ప్రతి సిక్కునీ ఇతను కూడా ఖలిస్థాన్ ఉగ్రవాదియేమో అనే విధంగా చూస్తుంటే వారెంత క్షోభించి ఉంటారో!కాకతాళీయంగా జరిగిందో లేక సిక్కులు మనస్థాపానికి గురవడం వల్ల జరిగిందో తెలియదు గానీ అప్పటినుంచీ దేశంలో సిక్కులు కనబడటం అదివరకటికన్నా తగ్గిపోయిందనిపిస్తున్నది నాకు!ఖలిస్థాన్ ఉగ్రవాదం పూర్తిగా శ్రీమతి ఇందిరా గాంధీ బ్రెయిన్ చైల్డ్ అనటానికి ప్రముఖ పాత్రికేయుడు కుల్ దీప్ నయ్యర్ ప్రస్తావించిన ఒక సన్నివేశం తిరుగులేని సాక్ష్యం!తమ ఇద్దరి అంతర్గత సంభాషణలో తను అప్పుడే ఈ వ్యూహం మంచిది కాదు,ఫలితం వికటించి భవిష్యత్తు దారుణంగా ఉండవచ్చు,సిక్కులని ఇలా హింసపేటవద్దు అని తను చెప్పినట్టూ దానిని ఆమె బేఖాతరు చేసి తన వ్యూహానికే కట్టుబడినట్టూ తన వ్యాసాల్లో ఒక చోట ప్రస్తావించారు.భారతదేశం లోనేకాదు,ప్రపంచంలోని జర్నలిష్టు లందరిలోనూ ఎన్నదగిన వ్యక్తి అబధ్ధం చెప్పడు.కేవలం జల్లో ఉన్న అభిమానంతో అధికారం చేపట్టిన అకాలీదళ్ ప్రాప్యులారిటీని తగ్గించి తన పార్టీ మాత్రమే పంజాబును పరిపాలించగలదు అని ప్రకటించుకోవటనికి పంజాబీల్ని ప్రపంచం ముందు ఉగ్రవాదులుగా నిలబెట్టిన దుష్ట రాజకీయాన్ని ఒక వివేకం గల వ్యక్తి చెప్పినా వినకుండా ఏళ్ళ తరబడి సాగించిన వ్యక్తిని మహమ్మారి అని గాక ఇంకేమి అనగలం?!

       ఆఖరికి గత చరిత్రలోని అలాంటి వ్యూహాలన్నీ బెడిసికొట్టినట్టుగానే,కుల్ దీప్ నయ్యర్ గారు హెచ్చరించినట్ట్టుగానే ఏకు మేకయి తను సృష్టించిన భూతం తన పరిధిని దాటి పెరుగుతున్నప్పుడు కోర్టు తీర్పును గౌరవించటానికి బదులు ఎమర్జన్సీ పెట్టిన పధ్ధతిలోనే ఆ భూతాన్ని చంపటానికి సైన్యాన్ని పంపించింది - అదీ తిన్నగా సిక్కులు పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయం పైకి!ఏమి రాజకీయం అది?అడుసు తొక్కనేల, కాలు కడుగ నేల!ఒక వ్యక్తి తను చేసిన పాపం కట్టికుడిపి తన తప్పులకి పరిహారంగా ప్రాణం పోగొట్టుకుంటే కాంగ్రెసు పార్టీ వాళ్ళు దాన్ని కూడా ఒక త్యాగశీలిని హతమార్చిన సిక్కుల దుర్మార్గంగా పులిమేసి ఒక్క ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే 2,000 మంది సిక్కుల్ని దిక్కులేని వాళ్ళుగా చేశారు!ప్రజలు వాళ్ళంతట వాళ్ళు ఈవిడ మీద అభిమానంతో చేసిన దారుణాలు కావవి, చోటా మోటా కాంగ్రెసు నాయకుల దగ్గిర్నుంచి మంత్రులు, పార్లమెంటేరియన్లు దగ్గరుండి పర్యవేక్షిస్తూ చేసిన దుర్మార్గాలు.తరవాతెప్పుడో పెదవి చివరి క్షమాప్నలు రెండు ముక్కలు గాల్లోకి వదిలారేమో గానీ ఏ మాత్రమూ సిగ్గు పడకుండా ఇప్పటికీ ఆ దారుణాలు చేసిన తమ పార్టీ వారిని ఈషణ్మాత్రపు మందలింపులు కూడా చెయ్యకుండా కోర్టు శిక్షల నుంచి తప్పించటానికి పదరాని పాట్లు పడుతున్నారు.అయినా ఈ దేశంలో కాంగ్రెసుకి జనం వోట్లు వేస్తున్నారు - ఆశ్చర్యం?!

        నాస్తికులూ కమ్యునిష్టులూ ఎప్పటికీ అర్ధం చేసుకోలేరు గానీ ఏ మతం వారైనా తాము ఇంట్లో పూజించే చిన్న ప్రతిమ లాంటిది పొరపాటున తమ చేతినుంచే జారి కిందపడితే ఆ రోజంతా ఎంత ఆందోళన పడతారు?తమ వల్ల జరగరాని అపరాధం ఏదో జరిగిపోయిందని కంగారు పదతారు గదా!అలాంటిది ప్రతి రోజూ స్వర్ణ దేవాలయ సందర్శన చేస్తున్నప్పుడు ఆ గోడల మీద తుపాకీ గుళ్ళకి పెచ్చులూడిన భాగాల్ని చూస్తుంటే మనసు దుఃఖంతోనూ కోపంతోనూ దహించుకుపోదా?తన తప్పుడు వ్యూహానికి మన జాతిని కించపరిచిందని తెలిసిన వాళ్ళెవరయినా ప్రతీకారం తీర్చుకోకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటారా - అందులోనూ సిక్కులు?!సిక్కులు ఎంతటి శాంతిప్రియులో అంతటి వీరయోధులు, వారి పోరాటతత్వం ఇతరు లెవరికీ సాధ్యం కానిది!ఒకసారి ఉద్దాం సింగ్ సాహసాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఈ పేరును తల్చుకుంటుండగానే నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి!డయ్యర్ నేరాల్ని విచారిస్తున్న కోర్టులో మొదటి నుంచీ చివరి వరకూ తను కూడా ఉన్నాడు.లాయరుగా ఆ కేసు పట్ల ఉన్న ఆసక్తిని చూపించి పిటిషను వేసి వెళ్ళీ కూర్చున్నాడు.తీర్పు ఎటూ డయ్యరుకి అనుకూలంగానే వస్తుందని తెలుసు.ఆఖరి నిముషంలో చేసిన పనినే అక్కడ ఏ క్షణంలోనైనా చెయ్యగలడు, కానీ చెయ్యలేదు!మనస్సులో జ్వాలలు రగుల్తున్నా మొహంలో భావాలు కనబడనివ్వకుండా ఉండటం మామూలువాడికి సాధ్యం కాదు.పక్కనున్న వాళ్లకి ఏ మాత్రం అనుమానం రాకుండా సొల్లు కబుర్లు చెప్తూ కూర్చోవటం కూడా అలాంటిలాంటివాళ్ళు చెయ్యలేరు.కానీ ఆ ఉద్దందపిండం మాత్రం తను కోరుకున్న క్షణం తన కళ్ళ ముందు నిలబడేవరకూ చాలా ప్రశాంతంగా ఉండి ఆఖరి క్షణంలోనే తను చెయ్యాలనుకున్నది చేశాడు - గెలిచానని విర్రవీగుతూ అట్టహాసంగా కోర్టుమెట్లు దిగుతున్నప్పుడే య్యర్ని  చంపాడు, సరిగ్గా బియాంత్ సింగ్ ద్వయం చేసింది కూడా అదే కదా!

        శ్రీమతి ఇందిరా గాందీ నివాసగృహాన్ని ఆమె చనిపోయిన చోటుతో సహా స్మారకస్థలంగా మార్చిన తర్వాత 2014లో రెందవసారి సందర్శిస్తున్న ఒక సందర్శకురాలికి చాలా చిత్రమైన అనుభవం కలిగింది.ఆమె పేరు దీప్తా రాయ్ చక్రవర్తి ప్రముఖ న్యాయవాది,గణితశాస్త్రజ్ఞురాలు,అతీంద్రియ అనుభవాల మీద పరిశోధనలు చేస్తున్న వ్యక్తి - రచయిత్రి కూడా!ఆమె అనుభవాన్ని ఆమె మాటల్లోనే వింటే ఏమి కనబడి అతీంద్రీయ శక్తులతోనూ అలాంటి అనుభవాలతోనూ పరిచయం ఉన్న అంతటి మనిషి కూడా భయపడిందో తెలిస్తే మనకీ ఒళ్ళు జలదరిస్తుంది:

        "నేను మొదటిసారి పన్నెండేళ్ళ వయసప్పుడు  వెళ్ళాను.బుల్లెట్లకి చిద్రమైన కాషాయ వర్ణపు చీరనీ అక్కడి గాలిలో ఉన్న దిగులునీ ఇప్పటికీ మర్చిపోలేను.ఇదే ఇల్లు ఇదే కుటుంబంలోని మరొక హత్యకు గురైన ప్రధానమంత్రికి కూడా స్మారకస్థలమే.శ్రీమతి ందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ 1991లో ఒక ఆత్మాహుతి దాడిలో తునాతునకలై పేలిపోయి గుర్తుపట్టటానికి వీల్లేనంత దయనీయమైన చావుకి గురయితే దొరికిన మట్టుకు శకలాల్ని ఏరి ఒక గాజు పెట్టెలో ఉంచారు.గాజుపెట్టె అడుగున పక్కపక్కన నిలబెట్టిన రెండు శిధిలమైన బూట్లు ఒక చచ్చిన సైనికుడు ఇంకా నడకలోనే ఉన్నట్టు కనబడుతున్నాయి..

        రెందవసారి నేను వెళ్ళీంది కొంచెం పెద్ద్దయ్యాక కాలేజి రోజుల్లో.ఢిల్లీలో ఉన్న జీసస్ అండ్ మేరీ కాలెజిలో మ్యాధమేటిక్స్ చదివేటప్పుడు వారాంతాల్ల్లో కొన్ని ముఖ్యమైన స్థలాల్లో తిరుగుతూ అలాంటి ప్రత్యేకమైన చోటుల్లో  ఉండే అతీంద్రీయ వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉండేదాన్ని.అది నడివేసవి కావటంతో బైట ఉన్న 40 డిగ్రీల వేడితో పోలిస్తే చల్లగా అనిపించింది.గోడల నిండా పేపర్ క్లిప్పింగులు పరుచుకుని ఉన్నాయి.శ్రీమతి ఇందిరా గాంధీ ఆఖరి క్షణాల్లో ధరించిన ఆ పాత చీర  నాకు గుర్తున్నట్టే గాజు తెరల వెనక నుంచి కనబడుతూనే ఉంది.


   ఈసారి కొంచెం దగ్గిర కెళ్ళి చూశాను.ఆ వతావరణంలో నేను ఇదివరకు వచ్చినప్పుదు ఫీలైన అదో రకమైన దిగులు అలాగే ఉన్నా ఎందుకో ఇప్పుడా చోటులో కొత్తగా నూతనోత్సాహం కనబడుతుండటం నాకు కుతూహలాన్ని కలిగించింది.ఆ కాటన్ చీర మీద పరుచుకున్నబుల్లెట్ కన్నాలూ నెత్తుటి మరకలూ కాలం దాని ప్రభావం అది చూపించటం వల్ల ఒక శాశ్వతమైన ముద్రని వేసినా,ఇప్పుడా చీర కొత్త రకం శక్తి తరంగాల్ని సకారణంగానే వెదజల్లుతున్నట్టు కనిపిస్తున్నది.ఆ చీరను ఒకప్పుడు ధరించిన శ్రీమతి ఇందిరా గాంధీ ఇప్పుడు ఆ చీరలోకి ఆమెయొక్క ఆశయాలూ వ్యామోహాలతో అమాంతంగా వచ్చేసి నట్టుంది.ప్రస్తుతం తనున్న స్థితిలో తన ఆశలు నెరవేరే అవకాశం లేదని తెలిసిన నిరాశ కూడా ఉంది.అపరిమితమైన అధికారాన్ని కోరుకుని,దాన్ని కన్నబిడ్దల కన్నా ఎక్కువగా ప్రేమించి,దానిమీదనే బతికిన ఒక స్రీని హఠాత్తుగా దానినుంచి లాగేస్తే ఆ స్త్రీ ఎలా ఉంటుందో ఈ చీర కూడా అలాగే ఉంది.


        అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బియాంత్ సింగ్ ద్వయం తమ వ్యూహం అమలు చెయ్యటానికి సరిగ్గా ముందురోజున ,అంటే అక్టోబర్ 30,1984న ఒరిస్సా లోని భువనేశ్వర్ దగ్గిర ప్రసంగిస్తూ "నా తుది శ్వాస వరకూ ఈ దేశానికి సేవ చేస్తూనే ఉంటాను,ఒకవేళ నేను చనిపోతే నా ప్రతి రక్తపు బొట్టూ ఈ దేశాన్ని శక్తివంతం చేసి సమైక్యంగా నిలబెడుతుంది" అన్నది.

        అదే ఆమె ఆఖరి ప్రసంగం!శ్రీమతి ఇందిరా గాంధీ మనసులో కూడా తనకిక చావు తప్పదని తెలిసిన సంచలనం మొదలైందా!దుర్మార్గుల నోతినుంచి తన చావును తనతోనే చెప్పించే హరిమాయ లీలావినోదమా అది?ఇద్దరు రాజ వంశీయుల దేహాల నుంచి గగుర్పాటును కలిగించే విధంగా జారిన రక్తాన్ని ఇముడ్చుకున్న ఈ భవనం కనబడుతున్న వాటికన్నా నిగూఢమైన వాటిని వేటినో గొప్పగానే దాస్తున్నది.


        అక్కడికి కొన్ని మీటర్ల దూరంలోనే శ్రీమతి ఇందిరా గాంధీ చివరిసారి నడిచినంత మేర స్ఫటికంతో కప్పి ఉంచారు.ఒక నదీప్రవాహపు దిశని సూచిస్తున్నట్టు అక్కడొక సైన్ బోర్డ్ ఉంది.అలలు కదుల్తున్నట్టు కనబడే స్పెషల్ ఎఫెక్టు గూడా ఉంది.సరిగ్గా శ్రీమతి ఇందిరా గాంధీ కూలిన చోటుని మార్క చేశారు.చెట్ల మధ్యనుంచి ప్రతిఫలించే సూర్యకాంతిలో స్నానమాడుతూ ఆ ప్రదేశమంతా చాలా అందంగా ఉంది.ఇక్కడి వరకూ మనం నడిచి వచ్చిన స్థలాల వల్లా మనం చూసిన వస్తువుల వల్లా మనలో కలిగిన భావావేశాలన్నిటికీ ఇది పతాక సన్నివేశం!1854లో ప్రముఖ శాస్త్రవేత్తా వేదాంతీ అయిన Baron Von Reichenbach స్ఫటికంలో ఒక రకమైన జీవశక్తి ఉంటుందని చెప్పాడు.స్ఫటికానికి జ్ఞాపకాల్ని నిక్షిప్తం చేసుకునే శక్తి ఉందట.ఇక్కడి లౌడ్ స్పీకర్ల నుండి మళ్ళీ మళ్ళీ వినబడుతున్న శ్రీమతి ఇందిరా గాంధీ ఆఖరి ప్రసంగం ఆమె ప్రభని తిరిగి పైకెత్తటానికి జపిస్తున్న ఉచ్చాటన మంత్రం లాగుంది.


        ఇంటి లోపల ఉన్న చీకటికీ దిగులుకీ భిన్నంగా ఈ ఆరుబయట మెరుస్తున్న నీరెండ వింతగా ఉంది.ఈ కనిపిస్తున్న దృశ్యమంతా ఒక అధికార దాహంతో తపించిపోతున్న శక్తిలో ఉండే అసంతృప్తి చేత ఆవరించబడి ఉన్నట్టుంది.నేనంతా తన లోకి ప్రవేశించిన జీవించి ఉన్నవారి నుంచి  ఆశల్నీ వాంచల్నీ పీల్చుకుని బలపడే ఒక తిమింగలం కడుపులో ఉన్నట్టు ఇబ్బందిగా ఆనిపించి ఆ దారికి చివర్న కనపడుతున్న బైటికి వెళ్ళే గేటు వైపుకి గబగబా నదవటం మొదలుపెట్టాను.
బైట రోడ్డు మీద హారన్లు మోగించుకంటూ తిరుగుతున్న కార్ల చప్పుళ్ళు వినిపిస్తూ మళ్ళీ మానవప్రపంచంతో సంబంధం కలిగినట్టయి రిలీఫ్ అన్పించింది.ఇంతలో నా వెనక ఇంకో విజిటరు కాబోలు పరిగెత్తుకొస్తున్నట్టు అడుగుల చప్పుడు వినబడింది - వగరుస్తున్న చప్పుడు కూడా!నాకు ఆశ్చర్యమనిపించింది,ఈ పరిసరాల్లో ఎవరికైనా అంత వేగంగా పరిగెత్తాల్సిన అవసరం ఏముంది?అంతలోనే అంతా నిశ్శబ్దం, బహుశా ఆ మనిషి నా ఆలోచనల్ని చదివి ఆగి నిశ్చలంగా ఉండిపోయినట్టు, అపుడు, మళ్ళీ ఒక నిట్టూర్పు!కుతూహలం ఎక్కువై వెనక్కి తిరిగి చూశాను నేను అప్పుడే తిరిగి వచ్చిన మలుపు వైపుకి. యెన్ని నిమిషాలు గడిచినా ఎవరి అలికిడీ లేదు.మళ్ళీ స్ఫటిక శిలాప్రవాహం వరకూ వెళ్ళాను.ఇప్పుడు నేనున్న చోటు నుంచి చూస్తే ఎవరైనా రెండో వైపు ఉన్నవాట్ని కూడా స్పష్టంగా చూడొచ్చు.ఒక ఖాకీ డ్రస్సులో నిశ్చలంగా నిలబడ్డ గార్డు ఉన్నాడు,ఇద్దరు కాలేజి కుర్రాళ్ళు గాజు ప్లాక్ లొపలికి తొంగి చూస్తూ కనిపించారు.వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు.

        సరిగ్గా అప్పుడే రెండు మానవాకారాలు యేదో మాట్లాడుకుంటూ ఆ ఇంటివైపుకి వెళ్తుండటం చూశాను.ఈ చెట్లూ చేమల మధ్యనుంచి హఠాత్తుగా నడకదారిలో ప్రత్యక్షమయ్యారు.వాళ్ళిద్దరూ ఇప్పుడు నేనున్న వైపుకి వస్తున్న కాలేజి కుర్రాళ్ళ జంటని దాటుకుని వెళ్లారు,కానీ ఒకరినొకరు పట్టించుకున్నట్టు కనిపించ లేదు.ఒకానొక క్షణంలో భుజాలూ భుజాలూ తగుల్తాయేమో అన్నంత దగ్గిరగా వెళ్ళినా ఏ జంటా రెండో జంట వైపు తల తిప్పలేదు,మర్యాదకయినా చూపులు కలపలేదు.ముఖాలు ఎటూ నాకు కనపదవు గనక వాళ్ళని వెనక నుంచే పరిశీలనగా చూశాను.తల్లి పొట్టి జుట్టుతో దృఢమైన ఆకృతితో ఉంది.కొడుకు కొంచెం భారీగానే కనబడుతూ ఉండి కుర్తా - పైజమాలో ఉన్నాడు.నిజంగా వీళ్ళు ఆ తల్లీ కొడుకు లేనా?ఇంకా అధికారం నిలబెట్టుకోవటం ఎట్లా అని వ్యూహాలు పన్నుతూనే ఉన్నారా?ఇప్పటికీ కోతరెలు ఏర్పాటు చహెసుకోవటం కోసం,సపోర్తర్లని పెంచుకోవటం కోసం లాబీయింగులు చేస్తూ రాజ్యాధిపత్యం తమ వంశం నుంచి జారిపోకుండా ఉండేటందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారా?మళ్ళీ తమ ప్రాభవం చిగురించ బోతున్నదని తెలిసి హదావిడిగా రహస్య సమావేశానికి వెళ్తున్నారేమో!
"

        పోనీ శ్రీమతి ఇందిరా గాంధీ అనే ఒక వ్యక్తి చేసిన దారుణాలకి మొత్తం పార్టీని నిదించడం దేనికి అనుకున్నా,పొనీ మిగిలిన వారు చెసిన దారుణాలకి శ్రీమతి ఇందిరా గాంధీ అనే ఒక్క వ్యక్తిని బాధ్యురాల్ని చెయ్యడం దేనికి అనుకున్నా ఆ రెంటికీ విడివిడి ఆస్తిత్వం లేదు గదా!ఒక రాజకీయ పార్టీలో గానీ ఒక సమాజంలో గానీ అగ్రభాగాన కనబడే ఆ ఒక్క వ్యక్తీ కింది నుంచి పైకి విస్తరించుకుని ఉన్న ఒక సంస్కృతికి దర్పణం అయినప్పుడు దశాబ్దాల తరబడి జరిగిన తప్పులకి ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉంటుంది.ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల సమయానికే కాంగ్రెసు ప్రజాభిమానాన్ని పూర్తిగా కోల్పోయింది.అప్పుడు అంతులేని ప్రజాభిమానాన్ని పెంపొందించుకుని ప్రచండశక్తిలా కాంగ్రెసుని ఢీకొన్నది ఎవరో తెలుసా!ఇపుడు కాంగ్రెసుకి ఎడమభుజాల్లా మారిన వామపక్షాలు అని పిలువబడే రెండు రాజకీయ పక్షాలూ కలిసి ఉన్న భారత కమ్యునిష్టు పార్టీ!అప్పటి వాతావరణాన్ని గురించి పెద్దలు చెప్పినదాని ప్రకారం కమ్యునిష్టులు వస్తున్నారని తెలిస్తే పల్లెటూళ్ళల్లో వారిని పోలేరమ్మ గంగానమ్మ లాంటి గ్రామదేవతలకి కట్టినట్టు ప్రభలు కట్టి వూరేగిస్తూ తోడ్కొని వెళ్ళేవాళ్ళు సామాన్య ప్రజలు!అయినా కమ్యునిష్టులు ఎందుకు వోడిపోయారు?ఆనాటి చరిత్ర తెలియని కుర్రాళ్ళు ఇవ్వాళ ఎన్నికల్లో కులప్రసక్తి,ధనబలం,వ్యసన ప్రేరేపణం లాంటివాటి గురించి విసుక్కుంటూన్నారు గానీ ఆనాటి తొలి ఎన్నికల నుంచే కాంగ్రెసు వాటిని తారాస్థాయిలో ప్రయోగించింది - ప్రజాభిమానం లేకపోయినా అధికారం మనకే కావాలి అనే పట్టుదలతో!వింతేమొటంటే ఎన్నికలు సజావుగా జరిగితే ప్రపంచంలోనే మూడో కమ్యునిష్టు దేశంగా భరతదేశాన్ని నిలబెట్టేటందుకు తమకు దక్కాల్సిన పూర్తి అర్హత ఉన్న స్థానం నుంచి అంత కిరాతకమగా నెట్టివేసిన కాంగ్రెసు పట్ల కమ్యునిష్టు పార్టీ ఏ మాత్రమూ కోపాన్ని చూపించకపోవటం!కామన్ సెన్సుతో కూడిన మామూలు పొలిటికల్ స్ట్రాటజీ పరంగా చూసినా కాంగ్రెసు యొక్క దుర్నీతిని ప్రజల ముందు ఎండగట్టి ఉండాల్సింది పోయి న్యాయంగా తనకి దక్కాల్సిన అధికారాన్ని తమనుంచి గుంజుకున్నవారిని అపరిమితమైన పొగడ్తలతో ముంచెత్తడం బుర్రలో గుజ్జు ఉన్నవాడెవడయినా చేస్తాడా:-)

        ఏ ఒక్క చారిత్రక తప్పిదం నుంచీ ఏ ఒక్క గుణపాఠమూ నేర్చుకోకుండా మళ్ళీ మళ్ళీ చారిత్రక తప్పిదాలు చేస్తూ అనంతకాలం వరకూ వర్గరహితసమాజం కోసం పోరాడుతూనే ఉండగలిగిన గతితార్కిక చారిత్రక భౌతికవాదపు సిధ్ధాంతుల గురించి మనకెందుకు గానీ అసలు కాంగ్రెసు పార్టీ వాళ్ళు తమ పార్టీకి నేతృత్వం వహించడానికీ వారిని అగ్రభాగంలో ఉంచుకుని వారి ప్రభావక శక్తిని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చి భారతదేశాన్ని పరిపాలించడానికీ ఆ ఒక్క కుటుంబాన్నే ఎందుకు అప్రకటిత వంశపారంపర్య సంప్రదాయంతో ముందుకు తీసుకొస్తున్నారు?ఈ దేశాన్ని పరిపాలించడానికి ఇంకెవ్వరికీ లేని శక్తియుక్తులు కేవలం ఆ కుటుంబానికే ఉన్నట్టు ఆ కుటుంబంలోని వారు కాకుండా ఇంకెవ్వరు పరిపాలించినా ఈ దేశానికి ప్రమాదం అనే భావనని ప్రజల్లో ఎందుకు పెంచి పోషిస్తున్నారు?వేరే పార్టీ ప్రభుత్వంలో ఉన్నంత కాలం భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి నేలకొనదనే మూఢనమ్మకాల్ని గూడా ప్రచారం చెయ్యడం అటుంచి తమ పార్టీలోనే ఇంకెవ్వరూ సమర్ధులు లేనట్టు మాటిమాటికీ ఆ కుటుంబం నుంచి వస్తే చాలు ఎంతటి దేభ్యమ్మొహాన్నైనా సరే మోసి తరిస్తూ అన్ని ప్రజాస్వామ్య సంప్రదాయాల్నీ గాలికొదిలేసి రాజభక్తి లాంటి విధేయతని ప్రదర్శించడానికి కారణం ఏమిటి?శ్రీమతి ఇందిరా గాంధీ అంటే తొలి యవ్వన కాలం నుంచీ రాజకీయ నాయకులతో అతి దగ్గిరగా తిరిగింది గాబట్టి ఇంకా తన తండ్రికి సహాయకూరాలిగా కూడా పని చేసింది కాబట్టి అప్పటికి రాజకీయ రంగంలో చాలాకాలం ఉంచి ఉన్నదని సరిపెట్టుకోవచ్చు,కానీ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే సమయానికి కనీసం కాంగ్రెసు పార్టీ కార్యకర్తగానే లేడు - రాజకీయాలకి దూరంగా విదేశాల్లో తన బతుకు తను బతుకుతున్నవాణ్ణి తీసుకొచ్చ్జి ప్రధానమంత్రిని చేశారు.అంత హడావిడి చేసి తీసుకొచ్చినందుకు దక్కిన ఫలితం ఏమిటి?షాబానో కేసులో ముస్లిముల మనోభావాలకి వ్యతిరేకంగా మాట్లాడి కాంగ్రెసుకి అప్పటివరకూ ఉన్న బలమైన వోటుబ్యాంకుని దూరం చేసేశాడు.అంతగా కాంగ్రెసు పార్టీ ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకు వస్తున్నప్పుడు ఆ కుటుంబం యొక్క చరిత్రని గురించి కూడా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఇంతవరకూ మేధావులమనుకునేవారికి ఎందుకు కలగలేదు?
        ఈ వంశవృక్షంలో రెండు అతి ముఖ్యమైన వైరుధ్యాలు ఉన్నాయి.ఒక రకంగా చెప్పాలంటే వాస్తవం ఏమిటనేది ఎప్పటికీ తెలియని మిస్టరీలు.సాధారణంగా హిందువులలో అందులోనూ వీరు కాశ్మీరీ బ్రాహ్మణులు అని చెప్తున్నారు గాబట్టి బ్రాహ్మణులలో ఇంటిపేర్లు హఠాత్తుగా పుట్టుకు రావు.ప్రతి  బ్రాహ్మణుడికీ గోత్రం అనేది ఖచ్చితంగా ఉంటుంది అది భరద్వాజ,కశ్యప,కౌండిన్య లాంటి ఒక వైదిక ఋషికి సంబంధించిన ధార!ఇంటిపేర్లు వారికి అంత ముఖ్యం కాదు గాబట్టి అవసరార్ధం కొత్త ఇంటిపేర్లుగా చీలితే చీలవచ్చు - కానీ దానికి అవకాశాలు చాలా చాలా తక్కువ?!ప్రాచీన కాలం నుంచీ ఉన్న ఇంటిపేరు అయితే ప్రతి ఇంటిపేరుతోనూ ఒకటి కన్నా ఎక్కువ కుటుంబాలు కనబడతాయి.కానీ కాశ్మీరు భూఖండం మొత్తాన్ని కంచుకాగడా వేసి వెతికి అయినా సరే ఈ ఇంటిపేరుతో మరో కుటుంబం ఎక్కడయినా ఉందేమో ఎవరయినా కనిపేట్టి చూపించగలరా?శ్రీమతి ఇందిరా గాంధీ ఆడపిల్ల గాబట్టి వేరేవాళ్ళని పెళ్ళి చేసుకోవడం  వల్ల ఇంటిపేరు మారింది గానీ ఆమె తండ్రి శ్రీమాన్ జవహర్ లాల్ నెహ్రూకి తాతగారైన శ్రీమాన్ గంగాధర నెహ్రూ నుంచి కిందకి దిగుతూ వస్తున్న ఈ కొద్దిమందే తప్ప ఇంకెవరూ ఈ ఇంటిపేరుకి సంబంధించిన వారు కనబడటం లేదు,ఎందుకని?గంగాధర నెహ్రూ తలిదండ్రుల గురించి గానీ అన్నలూ తమ్ముళ్ళూ అక్కలూ చెల్లెళ్ల గురించిన వివరాలు ఏమీ తెలియడం లేదు, ఎందుకని?కరువు లొచ్చినా వరద లొచ్చినా ఇంకేమి జరిగినా ఆ ఇంటిపెరుతో ఉన్న మిగతా అందరూ నశించిపోయి ఈ ఒక్క కుటుబమే బతికి బట్టకట్టడం అయితే మిస్టరీ అయినా కావాలి లేకుంటే ఫాంటసీ అయినా కావాలి గానీ హిస్టరీ మాత్రం ఇలాంటి కట్టుకధల్ని ఒప్పుకోదు కదా!
        భారతదేశంలోని వంశచరిత్రలకి సంబంధించి అసలు పరిశోధనలు జరగడం లేదని కాదు,కానీ ఈ కుటుంబ చరిత్రని గురించి మాత్రం అధికారికంగా ఎటువంటి పరిశోధనలూ జరగవు.స్వతంత్రించి కొందరు ఔత్సాహికులు తమంత తాము పరిశోధనలు చేసి తేల్చిన విషయాలు మాత్రం నమ్మలేనివి గా ఉన్నాయి.1857 తిరుగుబాటుకి ముందు ఢిల్లీలో ఘియాసుద్దీన్ ఘాజి అనే ఒక కొత్వాలు ఉండేవాడు.అయితే తిరుగుబాటును అణిచివేసే సమయంలో శత్రుశేషం మిగలకూడదని ఇంగ్లీషువాళ్ళు సిటీలో ఉన్న మొఘల్ ప్రభుత్వంతో సంబంధం ఉన్న వాళ్ళందర్నీ వెతికి పట్టుకుని మరీ చంపుతూ ఉండటంతో చాలామంది మొఘల్ సర్దారులు ప్రాణాలరచేత బట్టుకుని పారిపోయారు.అయితే మొఘలులకి అనుకూలంగా ఉన్నారని నిర్ధారణగా తెలిసిన వాళ్ళు తప్ప మిగిలిన హిందువులు ఇంగ్లీషువాళ్ళ దృష్టిలో లేరు గనక ఫ్రెంచ్ విప్లవం నాడు ఆడవేషాలేసుకుని సరిహద్దులు దాటి లండను కొచ్చి పడిన ఫ్రెంచ్ జమీందారుల మాదిరి హిందువులుగా పేర్లు మార్చుకుని ప్రాణాలు కాపాడుకున్న బతకనేర్చిన వాళ్లలో ఈ ఘియాసుద్దీన్ ఘాజి ఒకడు, అప్పటికి బుర్రకి తగిలిన గంగాధర్ అనేదాన్ని ఒంటిపెరుగానూ ఎర్రకోట పక్కన ఉన్న ఒక కాలవని ఇంటిపెరుగానూ మార్చుకుని బతికిపోయాడు!Through out the world, we do not find any descendant other than that of Gangadhar, having the surname Nehru. The 13th volume of the “Encyclopedia of Indian War of Independence” (ISBN:81-261-3745-9) by M.K. Singh states it elaborately.

        ఇవన్నీ చాలాకాలం నుంచీ చాలామంది కాంగ్రెసువాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ అడుగుతూనే ఉన్నారు.కానీ ఇదంతా కాంగ్రెసు మూలస్తంభాలని అవమానించటానికి హిందూ మతతత్వవాదులు చేస్తున్న విషప్రచారం అని కొట్టిపారేసి మేము జవాబు చెప్పం పొండి అని భీష్మించుకోవటమే తప్ప వీటిని ధైర్యంగా అబధ్ధాలని ఖండించనూ ఖండించడం లేదు,కనీసం అసలు నిజమేమిటో సాక్ష్యాధారాలతో నిరూపించి వీళ్ళ నోళ్ళు మూయించనూ మూయించడం లేదు.ఎన్నిసార్లు తప్పించుకోవాలని చూసినా ఈ ప్రశ్నలు కాంగ్రెసువాళ్ళని మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే ఉంటాయి.ఒకనాటికి జవాబు చెప్పక తప్పనిసరి అయినప్పుడు అప్పటికి ఉన్న కొన్ని ఆధారాలు కూడా గాలిలో కలిసిపోయి బిక్కమొగం వెయ్యాల్సిన దిక్కుమాలిన పరిస్థితి రావచ్చు.ఎప్పటికైనా జవాబులు చెప్పాల్సిన అవసరాన్ని గుర్తించి ఇప్పటికయినా కాంగ్రెసువాళ్ళు జవాబుల కోసం పరిశోధన మొదలుపెడితే బాగుంటుంది.పోయిన అధికారం తిరిగి దక్కించుకోవడానికి ఆమె పధ్ధతుల్ని వాడితే అధికారం దకించుకున్నాక మళ్ళీ ఎన్నిక చెల్లదని కోర్టులు తీర్పులిస్తే ఎమర్జన్సీ పెట్టటం, తనకి నచ్చని అకాలీదళ్ ప్రభుత్వాన్ని బలవంతంగా లాగిపారేసి ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టటం లాంటివి చెయ్యదని గ్యారెంటీ ఉందా?అదీగాక తల్లీ కొడుకు లిద్దరూ మ్మెమ్మెమ్మే బెబ్బెబ్బేలని తెలిసి కూడా ఆ కుటుంబం నుంచే నాయకత్వాన్ని మన మీద రుద్దాలనుకుంటున్న ఇప్పుడు అసలు కుటుంబం యొక్క మూలాల్ని గురించి మనం కూడా నిగ్గదీస్తే తప్పేమిటి?

        రాచపీనుగ తోడు లేకుండా వెళ్ళదన్నట్టు తన పాపాలకి తను ఆహుతై చస్తూ చావులో కూడా కొన్ని వేల మంది అమాయకుల్ని బలి తీసుకున్న మనిషిని పొగుడుతున్న వాళ్ళు, ఆ మనిషి వల్ల సిక్కు జాతికి జరిగిన అన్యాయం పట్ల మనస్పూర్తిగా సానుభూతిని కూడా ప్రకటించలేని వాళ్ళు, మళ్ళీ మళ్ళీ అవే పధ్ధతుల్లో అవే నికృష్టమైన పనులు పునరావృతమయినా పరవాలేదనుకుంటున్నవాళ్ళు దేశంలో ఎంతమంది వున్నారు అని లెక్క తెలియాలంటే ఇప్పటికీ కాంగ్రెసుకి పడుతున్న వోట్లని లెక్కిస్తే చాలు!


అబధ్ధాలతో చరిత్రని నిర్మించాలనుకునేవాళ్ళు అధికారంలో ఉండకూడదు - ప్రమాదం!
________________________________________________________

1    2    3    4    5    6                                     (తేదీల వివరాలు:వికీ పీడియా,చిత్రాలపీటిక:గూగుల్)

Sunday 13 December 2015

రూపాయిపెరుగువడ తయారీ విధానం గురించి తెలుసుకుందాం!దేశానికి ఫారిన్ ఎక్స్చంజి నిల్వల్ని విపరీతంగా పెంచేద్దాం?

        ఇది అతి రహస్యమైన లక్ష్మీపురాణము లోని ప్రసాద పరిషేచన మను ప్రధమాధ్యాయములో చెప్పబడీన అత్యంత ఫలప్రదాయకమైన పిండివంటకం.కావున ధనార్ధులు భక్తిశ్రధ్ధలతో పచనం గావించి భుజించిన యెడల సకల సంపదలూ వాటంతటవే దరి చేరగలవు!

1).మొదట రూపాయిని స్వార్ధము,పీడన,ధూర్తత్వము,దోపిడి,మోసము వంటి మలినాలు లేకుండా గట్టి సంకల్పంతో శుభ్రపరచి దేశభక్తి ద్రావణమున నిలవ ఉంచి దాన్ని చూస్తేనే రాముడూ జీసస్సూ ప్రవక్తా కనబడేటంత కాలం నానబెట్టాలి.

2).తర్వాత అధికఫలితం కొరకు విదేశీ మారక ద్రవ్యం అనే లవణాన్ని కొంచెం చేర్చి అంతర్జాతీయ వాణిజ్య విధాన సంప్రదాయం అనే రుబ్బురోలుతో బాగా రుబ్బి మెత్తగా చెయ్యాలి.

3).ఇపుడు జాతీయ ఆర్ధిక విధానం అనే నూనెని అంతర్గత కలహాలు అనే దోషగుణాలు పోయి ఉత్సాహపూరిత వాతవరణం అనే పొగలు కక్కే వరకు మరిగించి అందులో ఇంతకు ముందు తయారు చేసి పెట్టుకున్న మెత్తగా రుబ్బిన రూపాయిని వెయ్యాలి.

4).వేగుతున్న రూపాయి ఒక మోస్తరుగా గట్టిపడి మరీ మాడువాసన రాకముందరే లాఘవంగా బయటికి తీసి పోటాపోటె పెట్టుబడులు అనే ఉల్లిపాయలూ విస్తరణ వ్యూహాలు అనే పచ్చి మిరపకాయలూ అంతర్జాతెయ ద్రవ్యనిధి నుంచి పొందే సహాయాల వంటి మసాలా దినుసులూ కలిసిన ఎగుమతులు దిగుమతుల వ్యాపారం అనే పెరుగులో ముంచి ఉంచాలి.

ఇప్పటికే వంటకం యొక్క ఘుమఘుమలు మీ ముకుపుటాలని చేరి ఉంటాయి,ఇక వడ్డించడమే మిగిలి ఉంది!

        లక్ష్మీపురాణము లోని ప్రసాద పరిషేచన మను ఈ అధ్యాయమునకు ధనవిద్యా ధనగుహ్య యోగము అను నామాంతరము గూద కలదు,కాన దీనిని తాము వండి ఇతర్లకు తినిపించు వారికీ దీని విధి విధానమును ప్రచారము చేయు వారికీ ధనప్రాప్తి తధ్యము.వారు షేర్లు కొన్న కంపెనీలు మార్కెట్టును అప్రతిహతంగా దున్నేయగలవు,వారి ఇంట క్రెడిట్ కార్డుల వర్షము కురియగలదు! 

ఇతి శుభం!

Saturday 12 December 2015

ఇద్దరిదీ నీలివర్ణమే, అంతవరకే పోలిక!బుధ్దుల్లో,ముఖ్యంగా చేతల్లో ఎన్ని తేడాలు?అయినా ఐద్దరూ ఒకటే నట - ఏమిటో ఈ గందరగోళం?!

     ఒకాయన దర్జాగా రాజుగారి ఇంట్లో రాణీగారి కడుపున పుట్టి మనిషిలా బతికి చూపించాడు!ఒకాయన గర్భవాసం జోలికే పోకుండా అధాటున వాళ్ళ ముందు కొచ్చేసి కనబడ్డమే 12 యేళ్ళ పిల్లాడిగా కనబడి "నేను మీకు కొడుకునౌతున్నానోచ్" అని చెప్పి తిన్నగా శిశువై ఒళ్ళోకి దూరాడు!

     ఒకాయన బుధ్ధిమంతుడల్లే క్లాసులో ఉన్నాడా అనిపించేటట్టు ఉన్నా చదవాల్సినవన్నీ చదివేసిన సైలెంటు బాబు!ఒకాయన సాటి పిల్లలకి లీడరైపోయి అల్లరి చేస్తూ వెన్న దొంగతనాలు చేస్తూ వాళ్ళతో చల్దులారగిస్తూ ఈ పిల్లాడు దేముడేంటీ అని బ్రహ్మ దేవుడికి కూడా అనుమానమొచ్చేలా పెరిగిన వైలెంటు బాంబు!

     ఒకాయన ఏకపత్నీవ్రతమనే కఠినాతికఠినమైన నైతికనియమాన్ని తనకి తనుగా చేపట్టి తనయంతట తనుగా వలచి వచ్చిన ఎలనాగను కూడా కాదని తోసిపుచ్చి పుంసాం మోహనరూపాయ అని పొగిడించుకోగలిగిన శీలవంతుడు!ఒకాయన చిన్ననాడే వ్రజభామినులకి మగపోడుముల ముచ్చటైన తాకిడిని కూడా రుచిచూపించి ఏ వనిత కా వనితకు తానొక్కడినే అయినట్టు ఆమెకే సొంతమయినట్టు చెలరేగిపోయిన అష్టమహిషుల మనోహరుడు!

     ఒకాయన సరిగ్గా రేపు పట్టాభిషేకం అనగా ఇవ్వాళ వనవాసానికి వెళ్ళమన్నా కొంచెం కూడా బాధపదకుండా తండ్రి నన్ను ఖైదు చేసి రాజువికా అని హింటు ఇచ్చినా నాకఖ్ఖర్లేదని అదవులకి వెళ్ళగలిగిన త్యాగశీలియైన జగదేకధనుర్ధరుడు!ఒకాయన అప్పటిదాకా తను ఆడి,పాడి,అల్లరి చేసిన వ్రజభూమి తనది కాదు అని తెలిసినప్పుడు కూడా ఇతర్లని ఓదార్చాడే తప్ప తను కన్నీరు పెట్టకుండా ఉండగలిగిన స్థితప్రజ్ఞుడైన గీతాచార్యుడు!

     ఒకాయన వీళ్ళు క్షమించరాని తప్పు చేశారు అనుకున్నవాళ్ళని తను స్వయంగా పూనుకుని కోదండధారియై వధించి ధృఢవిక్రము డనిపించుకున్నాడు!ఒకాయన తన శత్రువుల్ని కూడా వాళ్లతో వీళ్ళతో చంపించి తన చేతికి మట్టంటకుండా చూసుకుని యోగీశ్వరు డనిపించుకున్నాడు!

     ఒకాయన చిన్న తప్పు చేసిందని తను ఎంతగానో ప్రేమించి తనని తప్ప ఇంకెవ్వర్నీ పెళ్ళి చేసుకోనని వ్రతం కూడా పట్టినవాడు, ఆ ఒకే ఒక్క భార్యని పదిమందిలో అవమానించేశాడు - నిన్నసలు భార్యగానే స్వీకరించను పొమ్మనేశాడు!ఒకాయన పెళ్ళాం కాలితో తన్నినా సహించి "అయ్యయ్యో కఠినమైన నా తలకి తగిలి సుకుమారమైఅన్ నీ కాలుకి గాయం అయ్యిందేమో!" అని గారాబం కూడా చేసి ఆమె కోరుకున్న పువ్వు కోసం చెట్టునే కొట్టుకొచ్చేశాడు!

     ఒకాయన భార్య మీద బెంగతో పొర్లిగింతలు పెట్టి యేడ్చి తమ్ముడు ఓదారిస్తే తేరుకుని మానవప్రయత్నంతోనే తన కార్యం సానుకూలం చేసుకుని ఆదర్శవంతమైన ప్రవర్తనతో జీవితం గడిపి విగ్రహమాన ధర్ముడైనాడు!ఒకాయన చిన్నప్పట్నుంచే ఇతరుల సంకల్పాల్ని నియంత్రించడం అనే ఒక్కటి తప్పించి అన్నిరకాల అతిమానుష శక్తుల్ని చూపించి తనకు తనే దేవుడినని ప్రకటించుకుని విశ్వరూప ప్రదర్శన కూడా చేసి లీలా మానుష విగ్రహధారియైనాడు!

అయినా ఇద్దరూ హిందువులకి సమానంగానే పూజనీయు లయ్యారు - రామ రామ కృష్ణ కృష్ణ!"ఏ యుగాని కైనా ఏ జగాని కైనా రాముడే దేవుడు" అని కొందరు కీర్తించారు."బృందావన మది అందరిదీ గోవిందుడు అందరివాడే" అని కొందరు కీర్తించారు.ఎవర్ని ఫాలో అవాలి?ఎవర్ని సారీ అనాలి?ప్రశాంతంగా "కృష్ణా రామా" అనుకోనివ్వకుండా ఈ హరిబాబొకడు ఇన్ని మడతపేచీలు పెట్టాడు, ఇదేం ఖర్మరా దేవుడా?

తెలియని వాళ్ళకి ఎప్పటికీ తెలియని గందరగోళం?తెలిసిన వాళ్ళకి తెలిసినకొద్దీ పెరిగే భక్తిచైతన్యం!

Monday 7 December 2015

కడుపుకి బుక్కెడు బువ్వ తినడం కోసం ఆవునే చంపాలా ఈ రచయిత గారు!హిందువుల్ని వెక్కిరించటానికి చట్టాల్ని కూడా ధిక్కరించాలా ఈ సెక్యులరిష్టులు?

     నేను కధలు రాయను గానీ మంచి కధ కనపడితే చదవటం బాగుంటే మెచ్చుకోవడం చెయ్య్యకుండా ఎలా ఉంటాను?ఈ మధ్యనే సారంగలో "బుక్కెడు బువ్వ" అనే ఒక కధ చదివాను.మొదటి కధ అంటున్నారు గాబట్టి నాకు కూడా శిల్పరీత్యా విశ్లేషించే పాందిత్యం కూడా లేదు గాబట్టి కధలో తప్పులు వెదికే పని చెయ్యను గానీ తీసుకున్న విషయం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో రాజకీయ విద్వేషాలకి కారణమైన గోవధ!గోవధని ఇతివృతంగా తీసుకోవడంతో సహజంగానే అందరి దృష్టినీ ఆకర్షించింది.వివాదాస్పదమయిన అంశం కావడంతో వ్యతిరేకతా వస్తుంది,వాద ప్రతివాదాలూ జరుగుతాయి.అది రహస్యమేమీ కాదు.అయితే నా అభిప్రాయం మాత్రం ఎన్నిసార్లు వేసినా ప్రచురితం కావటం లేదు.రోజుకోసారి చొప్పున ఒక ఆయిదు రోజుల పాటు వేసి చూశను.అయినా ఒక్క కామెంటూ పబ్లిష్ అవ్వలేదు.మిగిలిన వారి కామెంట్లు పడుతూనే ఉన్నాయి,ఒకరు తన కామెంట్లకి వెంటవెంటనే జవాబులు రావడం గురించి ప్రస్తావించారు కూడాను. కామెంటు ఘాటుగా ఉండటం వల్ల నా అభిప్రాయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ప్రచురించకూడదనే ఉద్దేశంలో వారు ఉన్నట్టు అనుమానం వచ్చింది!పట్టు వదలకుండా పబ్లిష్ అయ్యేవరకూ మళ్ళీ మళ్ళీ వేద్దామంటే "పనిలేక"  బ్లాగు లాగానే ఇది కూడా మూతబడుతుందేమో ఎందుకొచ్చిన గోల, నా మూలంగా సారంగా కూడా నా సామిరంగా అయిపోతే ఇంకో పాపం చుట్టుకుంటుంది,ఏ దిక్కూ లేకుంటే అక్కమొగుడే దిక్కన్నట్టు ఎలాగూ నాకో సొంత బ్లాగు ఉందిగా అనిపించి అక్కడ ప్రచురితం కాని కామెంటుని ఇక్కడ వేస్తున్నాను.



     నాకు మొదటి నుంచీ ఒక విషయం చూచాయగా తెలియటం వల్ల వీరి వాదనల పట్ల కొంచెం ఆశ్చర్యం కలుగుతూ ఉండేది - నాకు తెలిసింది ఏమిటంటే దేశంలో 1950ల నుంచే గోవధ నిషేధ చట్టాలు ఉన్నాయి!కొందరు ఇదివరలో పశువుల్ని చంపటం మాదిగలు చేసి వాటి చర్మంతో చెప్పులు కుట్టుకోవటం ఎప్పటినుంచో ఉంది కదా ఇప్పుడెందుకు కొత్తగా ఆవులకి గడ్డి పెట్టనివాళ్ళు,వాటి పేడ ఎత్తనివాళ్ళు గోల చేస్తున్నారు అని వాదిస్తున్నారు. వాళ్ళు చేసింది సహజంగా వృధాప్యానికి చేరిన వాటిని చంపటం గానీ సహజ మరణం వల్ల గానీ మాత్రమే వారు ఆ పనులు చేసేవారు, క్రయవిక్రయాలు జరిగేవి కావు!ఇప్పుడు ఇక్కడ వివాదాస్పదమవుతున్నది పెద్ద సంఖ్యలో వ్యాపారం కోసం చంపటం!అదీ ఆరొగ్యంగా ఉన్నవాటిని చంపి తినటం, హోటళ్లలో మెనూ ఐటంసుగా వడ్డించటం!కానీ ఈ రచయిత ఏమి సన్నివేశం కల్పించారు?ఒక బిచ్చగాడికి మూడు రోజుల్నించి ఎవరూ బిచ్చం వెయ్యకపోతే ఆకలికి తట్టుకోలేక ఆవుని చంపి తిన్నాడని?!నేను ఆ కామెంటులో ఆ చట్టాల విషయాన్ని ప్రస్తావించి వూరుకునే కంటే ఆధారాలు చూపించటం మంచిది కదా అనే వుద్దేశంతో ఆఖరి నిముషంలో అసలు నిజంగా చట్టాలు అంత గట్టిగా ఉన్నాయా లేవా అని వెతికితే పూర్తి ఆధారాలతో ఉన్న సమాచారం దొరికింది.బహుశా నేను చూపిస్తున్న ఆధారాలు బలమైనవి కావటంతో నా సమాధానాన్ని ప్రచురించే ధైర్యం వారికి రావటం లేదు కాబోలు!ఇదీ న్యాయానికి కట్టుబడి వాదిస్తున్నాం,హిందువుల అన్యాయాన్ని ఖండిస్తున్నాం అని చెప్పుకునే వీరి న్యాయవర్తన. సిగ్గు లేకపోతే సరి!


     అత్యంత భయానకంగా చెలరేగిపోతున్న "ISIS" తీవ్రవాదాన్ని విమర్శించే కధనంలో నిధులు ఎక్కణ్ణించి వస్తున్నాయో వివరించే భాగంలో పిగ్గీ బ్యాంక్ బొమ్మ ఉందని కనీసం ఎడిటర్ గారికి తమ అసంతృప్తిని తెలియజేసే మామూలు దారి ఉందని తెలియకనో తెలిసినా అంత సహనం లేకనో ఆ దారిలో వెళ్ళకుండా పత్రికాఫీసు మీద దాడి చేసినది ముస్లిములే!ఇలాంటివి ఎన్ని జరిగినా ఈ సోకాల్డ్ సెక్యులరిష్టులకి చీమ కుట్టినంత ఆందోళన అయినా రాదు,ఎందుకనో?ఇండియన్ మీడియాకి ఎటూ సిగ్గూ శరం పోయి చాలాకాలమైంది గదా!ఇంకో లక్ష సార్లు ఇలాంటివి జరిగినా వారికి ముస్లిముల్లో ఉన్న అసహనం కనపడదు.తస్లిమా నజ్రీన్ మీద జరిగిన దాడి ఎప్పటిది?అప్పుడు వీరి ప్రతిస్పందన ఎంత బలంగా ఉంది!



     హిందువులు తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి.వీరికి తమ చరిత్ర పట్ల ఉన్న నిర్లక్ష్యమే ఈరోజున ఎవరు దేని గురించి విమర్శించినా జవాబు చెప్పుకోలేక తెల్లమొహం వేస్తూ బితుకు బితుకు మంటూ బతకే దుస్థితికి కారణం!ఒకసారి ప్రపంచం మొత్తం జీరో భారతీయుల ఆవిష్కరణయే అని నిర్వివాదంగా ఒపుకున్నాక కూడా కొందరు యూరోపియన్ మేధావులు గ్రీకుల "ఒమిక్రాన్" నుంచి వచ్చినదని వాదించటం మొదలుపెట్టారు.భారతీయులకి ఈ గొప్పదనాన్ని ఇవ్వటం వారికి సుతరామూ ఇష్తం లేదు, ఏదో ఒక విధంగా ఈ గొప్పని భారతీయుల నుంచి తీసెయ్యాలి,అంతే!మన దేశంలోనే ఈ దేశాన్ని పొగడటానికి సిగ్గుపడే వారు ఉండగా వారెందుకు అలాంటి అవకాశాల్ని వదులుకుంటారు?ఆఖరికి గుజరాతులో క్రీ.శ 585 నాటి ఒక శాసనంలో శూన్యాంకం దర్శనమిచ్చాక గానీ వారు వెనక్కి తగ్గలేదు.ఈ రోజుకీ మనం వాడుతున్న అంకెలు పూర్తిగా భారతీయుల చేత కనుగొనబడినవే అయినప్పటికీ ఇంకా "అరబిక్ న్యూమరల్స్" అని వ్యవహరించటం అసలు విషయం తెలియకపోవడమే కారణం.వాటిని "భారతీయుల సంఖ్యామానానికి అంతర్జాతీయ రూపం" అని మాత్రమే వ్యవహరించాలి, మనవారి ఆవిష్కరణలకి గుర్తింపు రావాలి అనే పట్టుదల ఉంటే!



     క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాడు పాణిని ప్రతిపాదించిన భాషాశాస్త్రసిధ్ధాంతం యొక్క గొప్పదనం మనవారికి తెలియకపోయినా విదేశీయులు అందులోని విశేషాన్ని గుర్తించడం వల్ల కంప్యూటరు వాడకానికి సంబంధించిన భాషారూపం అయిన "Backus-Naur form language" ఇప్పుడు "Panini-Backus form language" గా పేరును మార్చుకుంది, ఎంతమందికి ఇది తెలుసు?



     ఇప్పటికీ భారతీయుల చరిత్రని కేవలం 10,000 సంవత్సరాలు వెనక్కి జరపటానికే ఎన్నో సందేహాలు వెలిబుచ్చుతున్నారు.కానీ డి.యన్.ఏ పరిశోధనల ద్వారా భారతదేశంలో 45,000 సంవత్సరాల క్రితమే ఆవు మచ్చిక జంతువుగా ఉందని రూఢిగా తెలిసింది - అంటే, క్రీ.పూ 43.000 సంవత్సరాల వెనకటి నుంచీ అన్నమాట!1984లో "Evolution of Domesticated Animals" గ్రంధంలో  Epstein, H. & Mason, I. L ఆవు పశ్చిమాసియాలో మొదట పెంపుడు జంతువుగా మారి భారతదేశానికి వచ్చందని భావించారు.కానీ 1994లో Loftus చేసిన కొత్త పరిశోధనా ఫలితం వల్ల పశ్చిమాసియాతో సంబంధం లేకుండా ఇక్కడే మొదటిసారిగా మచ్చిక అయ్యి మానవ వినియోగంలోకి వచ్చిందని నిర్ధారించబడింది. ప్రపంచంలో జన్యు శాస్త్రం రీత్యా ఆవులలో రెండే రెండు జాతులు ఉన్నాయి.ఒకటి టారీన్,ఇది  యూరోప్,పశ్చిమాసియా,చైనా దేశాల్లో ప్రముఖంగా కనబడుతుంది.రెండవది జెబు,ఇది భారత్,మధ్య ఆసియా,దక్షిణ చైనాలలో ప్రముఖంగా కనబడుతుంది.2009లో Chen యొక్క పరిశోధనా ఫలితం ప్రపంచంలోని జెబు జాతి ఆవులన్నీ భారతదేశం నుంచే ఇతర ప్రాంతాలకి వెళ్ళాయని నిర్ధారణ అయ్యింది.ఆవుని మచ్చిక జంతువు చేసుకోవడం అంటే అప్పటికే స్థిరనివాసం ఏర్పడి ఉంటుంది.నాగరికత అనేది స్థిరనివాసం వల్లనే పెరుగుతుంది, ఇంక క్రీ.పూ 1500 నాటి హరప్పా కాలానికి అంతటి సర్వతోముఖమైన అభివృధ్ధిని సాధించటంలో ఆశ్చర్యం ఏముంది!



     భారతీయులకి గోవు పవిత్రంగా నిలబడటం అనేది ఒక్కరోజులో ఎవరో ఒకరు శాసించగా జరిగినది కాదు.కొన్ని వేల సంవత్సరాలుగా సహజీవనం చేస్తూ ఆ జాతి యొక్క ప్రత్యేక లక్షణాలను విశ్లేషించుకుని చేసిన ప్రతిపాదన!గోజాతికి మానవ జీవితంలో ఉన్న ప్రాధాన్యత వల్ల ఆ జాతిని సంరక్షించుకునే ఉద్ద్దేశంతో ఈరోజు భారత ప్రభుత్వం పులిని జాతీయ జంతువుగా చేసిన అధికారికమైన ప్రకటన లాంటిదే,కాకపోతే ఇది సంస్కృతికి సంబంధించినది కావటంతో ఆ సంస్కృతిని గౌరవించే వారు పాటిస్తున్నారు.ఆ సంస్కృతి పట్ల ద్వేషం ఉన్నవారు దాన్ని ధిక్కరిస్తున్నారు.చారిత్రక వాస్తవాల్ని పరిశీలిస్తే ఔరంగజేబు కూడా గోవధని నిషేదిస్తూ శాసనాలు చేశాడని తెలిస్తే వింతగా ఉంటుంది,కానీ ఆ శాసనాలు అన్నీ అప్పటి కాలంలో ఆ జాతికి ఉన్న ఆర్ధిక ప్రాధాన్యతని బట్టి చేసినవి అని అర్ధం చేసుకోవాలి.ఇవ్వాళ గోసంరక్షకులు నిజంగా చెయ్యాల్సినవి రెండు పనులు:1.గోసంరక్షణ చట్టాలు ఉన్నాయి అని తెలుసుకుని గోవధ చేస్తున్న వారిని వ్యక్తిగత దాడులతో హింసించడం లాంటివి చేసి చెడ్డపేరు తెచ్చుకోకుండా చట్టానికి పట్టించి అది శిక్షార్హమైన నేరమని తెలియజెప్పే న్యాయపోరాటం ద్వారా ఎదుర్కోవడం.2.గోజాతికి ఆర్ధిక రంగంలో తిరిగి ప్రాధాన్యతని తీసుకురావటం.ట్రాక్టర్లు వచ్చాక ఎద్దులతో దుక్కి దున్ని చేసే వ్యవసాయం ఆగిపోయింది.శ్వేతవిప్లవం పేరుతో పాల సేకరణ కేంద్రాలలో లీటరుకి వెన్న శాతాన్ని బట్టి వెల నిర్ణయించడంతో గేదేలు ఆవుల స్థానాన్ని ఆక్రమించాయి.యెంత బలమయిన ఆహారం పెట్టినా ఆవుపాలలో వెన్న శాతం స్థిరంగానే ఉంటుంది,అదే గేదెలకి పెట్టిన తిండిని బట్టి వెన్న శాతం పెరుగుతుంది.కాఫీలూ టీలూ ఆవుపాలతో కన్నా గేదెపాలతో బాగుండటం కూడా జనం ఆవుపాల నుంచి గేదెపాలకి మారడానికి ఒక కారణం అనుకుంటున్నాను నేను!వ్యవసాయ రంగంలో మార్పులు తీసులు రావడం కష్టం గానీ ఆరోగ్యం రీత్యా చూస్తే గేదెపాల కన్నా ఆవుపాలు శ్రేష్ఠం,ఆ అవగాహన జనంలో పెరిగితే మళ్ళీ గోజాతికి పూర్వవైభవం రావచ్చు.కొన్ని వేల సంవత్సరాల పాటు భారతీయుల జీవనవిధానంలో మమేకమైన గోజాతి నేడు చంపి తినడానికి తప్ప ఇంకెందుకూ పనికిరానిదైపోయింది,యెంత విషాదం!

     ఇదివరలో గ్రామాలలో జరిగినది వేరు.అప్పుడు గోజాతికి ఆ వ్యవస్థలో ప్రాముఖ్యత ఉందేది.ఒక జాతిని సంరక్షొస్తూ మన అవసరాలకు తగినట్టు ఉపయోగించుకునే ఉభయతారకమైన పధ్ధతి - ఉదాహరణకి కోళ్ళ పెంపకం పూర్తిగా ఆహారం కోసమే చేస్తున్నాం!కొందర్రు బీఫ్ తినడం మా తిండిహక్కు,దాన్ని వద్దనడం, ఎప్పటినుంచో ఉన్నదాన్ని ఇవ్వాళ కొత్తగా వ్యతిరేకించడం కేవలం బ్రాహ్మణాధిక్యత,కాబట్టే వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. శాఖాహారాన్ని భారతదేశం లోని బ్రాహ్మణులే కాదు, ప్రపంచం లోని చాలా దేశాలలో ఎంతోమంది పాటిస్తున్నారు.ఆహారపు అలవాట్లలో ఉన్న రెండింటిలో ప్రతిదానికీ అనుకూలతలూ ప్రతికూలతలూ ఉన్నాయి.కానీ కొందరు వద్దంటున్నారు గాబట్టి మరింత ఎక్కువ జంతువుల్ని చంపి తింటూ పండగ చేసుకోవటం మానవత్వం ఉన్నవాడెవడూ చెయ్యదగిన పని కాదు!రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తిస్వేచ్చలకే పరిమితులు ఉన్నప్పుడు మీరు తినడం కోసం ఆవుల్ని చంపే హక్కు ఎవరయినా ఇస్తారా?ఆవుల్ని చంపవద్దంటున్న వాళ్ళు మా ఇష్టమొచ్చిన తిండి తినే హక్కుని కాదంటున్నారు అని వీరంగాలు వేస్తూ "బీఫ్ ఫెస్టివల్" లాంటి హేయమైన పనులకి తెగబడుతున్న వాళ్ళు వారు తినడానికి చంపే వాటిలో ఏ ఒక్కదానికయినా తిరిగి ప్రాణం పొయ్యగలరా!చచ్చిన వాటిని బతికించ లేని మీకు మీ తిండి కోసం వాటిని చంపే హక్కు ఎట్లా వస్తుంది?ఎవరిస్తారు!మూర్ఖంగా ఎదటివారిని దుర్మార్గులుగా నిలబెట్టడం కోసం మీరు అనాగరికమైన పనులు చేస్తున్నారు తెలుసుకోండి!పులుల కోసం అభయారణ్యాలు నిర్దేశించినట్టు ఆవులకి కూడా రక్షణ మందిరాలు నిర్మించాల్సిన స్థితికి దేశాన్ని తీసుకు వెళ్ళకండి,వెనక్కి తగ్గండి!

ఇదీ అక్కడ ప్రచురణకి నోచుకోని నా కామెంటు:
Openion the first:ముస్లింలు బాగుపడలేదు కనుక హిందూ మతాన్ని కూడా ఎవరూ విమర్శించకూడదు అనుకుంటే హిందువులు కూడా ముస్లింలలాగే వెనుకబడి ఉండిపోతారు. “మీరు ముస్లింలని ఎందుకు విమర్శించడం లేదు” లాంటి ప్రశ్నలు అడగడం అంటే “మేము ముస్లింల కంటే బాగుపడం, అలా ఉండడమే మాకు ఇష్టం” అని చెప్పుకోవడమే అవుతుంది. హిందువులకీ, ముస్లింలకీ మధ్య ఉన్నది వాళ్ళు పూజించే దేవుని విషయంలోనే తేడా తప్ప సాంఘిక దురాచారాల విషయంలో ఈ రెండు మతాల మధ్య పెద్ద తేడా లేదు.

Openion the secondLఇదే పెద్దమనిషి స్త్రీల విషయంలో హిందువుల కన్నా ముస్లిములే ఉదారంగా ఉన్నారు అని చర్చ మొదలుపెట్టి సరైన ఆధారాలు చూపించలేక హిందువులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకీ సూటిగా సమాధానాలు చెప్పలేక పోయారు

P.S::వీరి అసలు సిసలైన జీవిత లక్ష్యం ఏమిటంటే ఎవరిలో తప్పు ఉంటే వారిని విమర్శించడం కాదు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ హిందూమతాన్ని మాత్రమే విమర్శించటం,హిందూ మతమే ISIS తీవ్రవాదుల కన్నా భయంకరమైన తీవ్రవాదుల్ని సృష్టిస్తున్నదని జనాన్ని భయపెట్టడం.ఇలాంటివారినే సూడోసెక్యులరిష్టులు అంటారు.కానీ చందు తులసి గారు మాత్రం కొంచెం భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు,వారి అమూల్యమైన  ఈ రెండు అభిప్రాయాలూ చాలా న్యాయంగా ఉన్నాయి.కానీ వాస్తవంలో ఆ అభిప్రాయాలు వెలిబుచ్చటానికి అవసరమైన సన్నివేశాలలో జరుగుతున్నది మాత్రం మరొకలా ఉంది.

అభిప్రాయం 1: కొందరికి ఉన్న ఆవుమాంసం తినే హక్కుని 100% సమర్ధిస్తాను
హరిబాబు ప్రశ్న:ఎక్కడ?ఈ దశంలో 1950ల నుంచే గోబధ నిషేధానికి చట్టాలు ఉన్నాయి,అది తెలుసా మీకు?
-----------------------------------------------------------------------------------------
States where cow slaughter is legal:
13) Kerala
No restrictions.
23) West Bengal
No restrictions.
In these two states both public and govt are influenced by leftist ideology
16, 18) Other Northeast
No ban in Arunachal, Mizoram, Meghalaya, Nagaland, Tripura, Sikkim. In Manipur, Maharaja in 1939 decreed prosecution for cow slaughter, but beef consumed widely.
States where cow slaughter is banned:
1) Andhra Pradesh & Telangana Slaughter of cows, calves prohibited. Bulls, bullocks can be killed against “fit-for-slaughter” certificate, issued if animals can no longer be used for breeding; draught/agricultural operations. Violators face 6 months jail and/or Rs 1,000 fine.
2) Assam Cow slaughter banned except on issue of ‘fit-for-slaughter’ certificate, at designated places.
 3) Bihar Slaughter of cows, calves banned; of bulls, bullocks older than 15 years allowed. Violators face 6 months’ jail and/or Rs 1,000 fine.
 4) Chandigarh Killing a cow, storing/serving/eating beef banned; eating meat of buffalo, bullock, ox also banned.
5) Chhattisgarh Slaughter of cow, buffalo, bull, bullock, calf, and possession of their meat banned. Transport, export to other states for slaughter also banned; attracts same punishment of 7 years’ jail, fine up to Rs 50,000.
6) Delhi Slaughter of “agricultural cattle” — cow, calf, bull, bullock — and “possession of [their] flesh”, even if they are killed outside Delhi, banned. Buffaloes are not covered.
7) Gujarat Slaughter of cow, calf, bull and bullock; transport, sale of their meat banned. Punishment: Rs 50,000 fine, up to 7 years’ jail. Ban does not include buffaloes.
8) Haryana As per a 2015 law, “cow”, which includes bull, bullock, ox, heifer, calf, and disabled/diseased/barren cows, can’t be killed. Punishment: 3-10 years jail, fine up to Rs 1 lakh. Sale of canned beef and beef products, and export of cows for slaughter banned.
 9) Himachal Pradesh Slaughter of all bovines punishable by 5 years’ jail. Killing allowed in the interest of research, or if animal has contagious disease.
*10) Jammu & Kashmir Slaughter of cow and its progeny punishable by up to 10 years’ jail. Possession of “flesh of any [of these] slaughtered animal(s)” punishable by a year; killing of “he or she buffalo” punishable with fine five times the animal’s price.
11) Jharkhand Slaughter of cows and oxen; possession, consumption of their meat, banned. Violators face up to 10 years’ jail and/or Rs 10,000 fine.
 12) Karnataka Cows can be slaughtered if old or diseased. Possession not a crime. Bill proposed by BJP in 2010 made slaughter punishable by 7 years’ jail and Rs 1 lakh fine, but it did not become law.
14) Madhya Pradesh Slaughter of cow, progeny banned. Penalty raised to 7 years’ jail in 2012, burden of proof on accused. Buffaloes can be killed.
 15) Maharashtra Slaughter, consumption of meat of cow, bull, bullock banned since March 2015 after revision of existing law. 5 years’ jail and/or Rs 10,000 fine. Slaughter of buffaloes allowed.
Mizoram No restrictions.
17) Odisha 2 years’ jail, Rs 1,000 fine for cow slaughter. Old bulls, bullocks can be killed on fit-for-slaughter certificate; cow if it suffers from contagious disease.
19) Punjab “Beef” doesn’t include imported beef; “cow” includes bulls, bullocks, oxen, heifer, calves. Slaughter allowed for export, with government permit.
20) Rajasthan Slaughter of “cow, calf, heifer, bull or bullock” prohibited; possession, transport of their flesh prohibited. 10 years’ imprisonment and/or Rs 10,000 fine.
21) Tamil Nadu Cow, calf slaughter banned; up to 3 years’ jail and/or Rs 1,000 fine. Beef consumption and slaughter of economically worthless animals allowed.
22) Uttar Pradesh Slaughter of cow, bullock, ox banned. Can’t store or eat beef. 7 years’ jail and/or Rs 10,000 fine. Can import in sealed containers, to be served to foreigners. Buffaloes can be killed.
 * Jail terms 10 yrs for cow slaughter in Haryana, Jammu and Kashmir, Jharkhand and Rajasthan. Punishment up to varying terms in jail in other states.
* Hefty fine 1 lakh in Haryana, and Rs 50,000 in Chhattisgarh and Gujarat. Range of smaller fines for slaughter and related crimes in other states.
-----------------------------------------------------------------------------------------
     నేను చెప్పడం దేనికి వాటి గురించిన కుతూహలం ఉంటే ఒక్కో రాష్ట్రంలో ఉన్న శిక్షలూ అవీ రమారమి ఆరు నెల్ల నుంచీ ఏదేళ్ళ వరకూ జైలు శిక్ష వెయ్యదగ్గ నేరం!ఇవేవీ మీరు మెజార్టీ వాళ్ళు మైనార్టీ వాళ్ళ మీద బలవంతంగా రుద్దేశారు అని తిరిగి నామీద విరుచుకుపడడానికి వీలిచ్చే చట్టసభలు చేసిన శాసనాలు కావు,కోర్టుల ముందు ఇరు పక్షాలూ వాదించగా కోర్టులు గోసంరక్షకులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులు.ఆ వాదనల సందర్భంగా వారు ఎంత మొండిగా ఉన్నారో మీకు తెలుసా!మా మతంలో ఆవుల్ని చంపమని రాసి ఉంది కాబట్టి మేము చంపే తీరుతాం అన్నారు.ఆధారాలు చూపించలేకపోవటంతో వారి వాదన నెగ్గలేదు.”a Constitution Bench of the Supreme Court of India has clearly ruled that a total banon slaughtering of cow and cow progeny is absolutelyCONSTITUTIONAL and in accordance with the law of the land. The complete ban on cow slaughter does NOT violate any rights or laws as guaranteed by the Constitution of India to every Indian citizen.The Supreme Court of India has clearly held that Islam does not call for cow slaughter and there is no provision in any of the Islamic scriptures that require for cow slaughter on any day in general or on Bakri Eid in particular.” అనే ఈ సుప్రీం కోర్టు రూలింగు యొక్క అర్ధం ఏమిటో తెలుస్తున్నది కదా!అదీ పరిస్త్థితి, ఆవుల్ని చంపే తీరాలి అని వారికంత పట్టుదల, అంత పట్టుదల ఎందుకు అని అడిగీతే హిందువులది మతోన్మాదం - ఏమిటీ న్యాయం?

అభిప్రాయం 2: కావాలని ఎవరూ ఆవుమాంసం తినడం లేదు కదా!
హరిబాబు ప్రశ్న: అవునా!ఆవుమాంసం అమ్మ డం,కొనడమే కాదు దగ్గిర వుంచుకోవడం కూడా నేరమే అని మీకు తెలియకనో తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారో గానీ ఆవుమాంసం అమ్మేవాళ్ళకి తెలుసు.కోర్టు నుంచి అధికారులు తనిఖీకి రాబోయే ముందు కోర్టులు సాంకేతికంగా తమ తీర్పుల్లో "COW" అని రాయడం వల్ల ఇక్కడ లిస్టులో "OX" అని మార్చి "ఇక్కడ వడ్డిస్తున్నది ఎద్దుమాంసం మాత్రమే,ఆవు మాంసం కాదు" అని వాదిస్తున్నారు.

P.S: హిందువులు ముస్లిముల మనొభావాలకు ఇబ్బంది కలిగించకూడదు,మంచిదే!మీలాంటి వారు హిందువుల మనొభావాల్ని గాయపరచినా మౌనంగా ఉండిపోవాలి - అప్పుడే మీ దృష్టిలో హిందువులు మంచివాళ్ళు అవుతారు - అంతేనా?ఈ దశంలో ఇతర మతస్థుల మనోభావాలకు ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తించే బాధ్యతని హిందువుల మీదే పెట్టారు,అధిక సంఖ్యాకులుగా అల్ప సంఖ్యాకుల పట్ల మర్యాదగా ఉండటం ఔన్నత్యమే కాబట్టి హందువులు కూడా కాదనడం లేదు!కానీ మీలాంటివారు హిందువుల మనోభావాల మీద ఎంత తెవ్ర స్థాయిలో దాడి చేసినా కనీసం అభ్యంతరం వ్యక్తం చెయ్యకుండా ఉండే బాధ్యతని కూడా హిందువుల మీదే పెట్టారు,ఎంత అన్యాయం?!తాము అనుసరించే మతం పట్ల ముస్లిములు కూడా హిందువుల మాదిరిగానే ఆలోచిస్తారు, వారి తరపున ఇంత అరిభీకరంగా చేస్తున్న మీ ఆందోళనల్లో వారు భాగం పంచుకోకపోవడానికి అదే కారణం!

     జీవితంలో ప్రతి ముస్లిమూ పదిమంది హిందువుల్ని చంపాలి,వందమంది హిందూస్త్రీలని చెరచాలి,వెయ్యి గోవుల్ని చంపాలి అని ప్రగల్భాలు పలికి పాల్పడిన హింసకి కూడా తరతరాలుగా హిందువులు ముస్లిముల పైన జరిపిన అకృత్యాలకి జవాబుగా చేశారు గాబట్టి అనే వంకతో వాటిని గూడా హిందుచుల ఖాతాలోనే వేశారు!ఇప్పటికీ కాశ్మీరు లో హిందూ పండితుల విషయంలో మీరు కనీసపు ప్రతిస్పందన కూడా వెలిబుచ్చరు,కనబడని లింకులూ పని చెయ్యని లింకులూ అని అనేవారు కాశ్మీరులో దశాబ్దాల నుంచీ జరుగుతున్నదానికి ఏనాడూ ప్రతిస్పందించగా మేమెవ్వరం చూదలేదు,చాటుగా యేమైనా గిణిగారేమో!

  నిజానికి మీకు చట్టం పట్ల న్యాయం పట్ల గౌరవం ఉంటే చట్టపరంగా నేరమని వారికే నచ్చజెప్పి కోర్టులు నిషేధించిన మాంసం తినకండని అవతలి వారిని ఎడ్యుకేట్ చెయ్యాలి,లేదా సకల విధాలుగా ప్రయత్నించి సమాచారాన్ని క్రోడీకరించుకుని సాంకేతిక పోరాటంతో కోర్టు తీర్పుల్ని రద్దు చేయించాలి.ఈ రెంటిలో ఏది చేసినా మీరు చాలా సమదృష్టితో ఆలోచిస్తున్నట్టు లెఖ్ఖ!కానీ మీరు అలా చెయ్యడం లేదు.కేవలం హిందువుల్ని మతోన్మాదులుగా చిత్రించడమే ఇక్కడ మేధావులుగా గుర్తింపు తెచ్చుకోవడానికి దగ్గరి దారి అయ్యింది!హిందువులకి నచ్చని పని చెయ్యడానికి చట్టాన్నీ న్యాయాన్నీ మరి సభ్యతా పరిధుల్ని కూడా దాటడమే సెక్యులరిజమా?మీరిలాగే యేకపక్షపు నిరసనలతో పక్షవాతపు సెక్యులరిజాన్ని మరింత సమర్ధవంతంగా ఫాలో అయితే ఇప్పటివరకూ ఉదారంగా ఉన్న హిందువులకి కూడా సెక్యులరిజం మీద ఉన్న భ్రమలు నశించిపోయి పూర్తిగా హిందూత్వం వైపుకి జరుగుతారు.అది ఆల్రెడీ మొదలైంది,అందుకే మీలో ఇంత అసహనం కనపడుతున్నది.ఇంకా డోసు పెంచండి!

ALL THE BEST FOR INCULCATING GREATER HINDU UNITY!
----------------------------------------------------------------------------------------------------------------------------------------------శాలివాహన శకం 1937 మన్మధ నామ సంవత్సరం మార్గశిర మాసము 16వ తేదీ సోమవారము
(చిత్రాలు:గూగుల్ సౌజన్యం)

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...