Friday, 30 January 2015

ఈ బొబ్బిలి దొర దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాల?!

దొర తలిస్తే దెబ్బల్కి కొదవా?!నేను తలిస్తె మొత్తం తెలంగాణానె అనంతగిరి మాన్యాలు పట్టిస్త?!తెలంగాణా తెచ్చింది నేను!తెలంగాణా నాది!తెలంగానా నేను!తెలంగాణాకి సలాం జెయ్యకుంటె మెదలు విరుస్తనన్న,ఆ పచ్చ బాకా మీదియా గాణ్ణి నోరు మూయించిన,లేకుంటె నా కొదుకు మీద సొల్లు కబుర్లు రాస్తడు?కేసీఆర్ కొదుకు తప్ప్పు జేస్తడా ఆ గొట్టాం గాడు రాజయ్య లెక్క?బోడి రాజయ్య యెవడయ్య నేను జేస్తె అయ్యిండు మంత్రయినా,వుపముఖ్యమంత్రయినా!?నాలాగ తెలంగాణా తెచ్చిండా,స్వయం ప్రకాశంగ యెదిగిండా?నేను మంత్రిని జేస్తె మంత్రయినప్పుదు సమ్మగుండె!పీకినప్పుడె వచ్చింద తంట?పెతిదానికీ తనే మాట్లాడ్తడు,హెల్తు యూనివర్సిటి అంటడు,అదంటడు,ఇదంటడు - అసుంటియి మాట్లాడితె నేను మాట్లాడాల,నా కూతురు మాట్లాడాల,నా కొడుకు మాట్లాడాల,నా అల్లుదు మాట్లాడాల!గది గూడ దెలియలె ఆ దిమాగు తక్కువోంకి - నేనెందుకు పీకిన్నొ?!యెవడు బడితె వాడు దేని గురించి బడితె దాని గురించి మాట్టాడితె నా ఫ్యామిలీకి మైలేజి యెట్లొస్తది?

చెష్టు ఆస్పత్రి యెక్కడ బెడితె యేంది?ఆస్పత్రి యెక్కడుంటె అక్కడికె గద పోయెడిది.రోగమొచ్చినోని ఇంటి ముంగల బెట్టాలా యేంది?నాలుగేళ్ళు ఆగినంక అందర్నీ నా లెక్క పెద్ద ఫాం హౌసు వోనర్ని జేస్త!గప్పుదు అమెరికల వున్నా పోవొచ్చు ఆస్పత్రికి.నా ఇష్తమొచ్చిన లెక్క జేస్త నన్ను మించినోడు వొచ్చెదంక!యెన్ని మాట లిచ్చినా యెన్ని సార్లు దప్పినా యెంత జబర్దస్తుగ జేసిన!యెవడన్న గదేందని యేనాడూ అడగలె?నా అంతట నేను ముఖ్యమంత్రి నయిన్నా?అందరు జేరి నీకన్న మొగోడు లేడంటెనె గదా అయ్యింది?మరింక గిప్పుడీ సణుగుదేంది!నాకన్న మొగోడు వుంటె దీస్క రాండి నేను తప్పుకుంట?!

సమజైందా?!నేనొక్కసారె జెప్త!చెప్పింది చేసుడే?!

18 comments:

  1. I have some researvations on the Rajaiah episode, but still I agree that there should have been some amount of transparency there.

    The shifting of Secretariat (that too on the name of Vastu) to the current chest hospital area, and shifting the hospital to Ananthagiri looks like a total absurdity to me.

    ReplyDelete
    Replies
    1. All I laid here is only for fun!Actually I think k.c.r is doing all those things fully knowing the complexities and he is well aware of repercussions.

      Some times I also got confusion but once he gave clarification I thought the point is not totally meaning less.

      my approach is : let him do upto 4yrs as he himself declared in the assembly.if we can get any LOLS why should we miss it?!..

      Delete
    2. The Rajaiah episode could (should) have handled better. No doubt it is the CM's prerogative to decide the cabinet but the NTR shades leave a bitter taste.

      The other & deeper problem is the veil of secrecy around charges against Rajaiah. Why hide corruption allegations from the public?

      Moving the chest hospital away from the pollution of Erragadda is OK.There is no point however why the teaching hospital status should be risked. Better to find a more suitable location close to the new medical university or proposed AIIMS so that the affiliation can be transferred to this (of course after the new MU/AIIMS actually starts functioning).

      The shifting of secretariat, high court and various other offices to a new location makes no sense at all. Which citizen needs to visit two offices the same time? What about security with so many high risk people in the same location?

      Vastu, my left foot! Are we going to let this pseudo scientific nonsense dictate how the aspirations of people are going to be fulfilled? We did not fight for Telangana to enable this nonsensical approach.

      I thought of writing a blog post condemning the so called vastu based decisions. I held it off but wrote a stinker addressing various Telangana friends.

      Finally what will happen to the vacated buildings, many of which are in heritage structures?

      Delete
    3. Jai,

      Obviously shifting of the chest hospital is a secondary effect of the first and important one, the shifting of Secretariat. Vastu seems only to be a superficial reason. The inherent reason could be some big company wants to build a 100 flour sky scraper over there and wants that very location.

      Delete
  2. Yes, it's pure fun for those outside the circle, courtesy sonia, diggi, pallam, chi'jeevi, kavuri n the ilk.

    ReplyDelete
  3. అప్పుడే ఇన్ని కామెంట్లా?!ఆఫీసులో పని పూర్తవగానే అలా పబ్లిష్ చేసి ఇంటికొచ్చేశా!తీరా ఇంటి దగ్గిర నెట్వర్క్ ప్రాబ్లం.

    మిత్రులందరికీ శుభం!ఒకటండీ,ఇద్ద్దరికీ బలమయిన ప్రతిపక్షం లేదు.ఆంధ్రాలో కాంగ్రెసు యేదయినా మాట్లాడితే మీరు చేసిన పని వల్లే అని కొట్టిపారెయ్యొచ్చు.జగన్ యేదయినా మాట్లాడితే రేపో మాపో జైలు కెళ్ళేవాడివి నువ్వు మాకౌ చెప్తావా అనెయ్యొచ్చు.తెలంగాణాలో గట్టిగా మాట్లాదే వాళ్ళందర్నీ ఆకర్ష తంత్రంతో లొంగదీసేఅ వీలు కుదిరింది.ఆ రకంగా ఇవ్వాళ యే రాజ్యాధినేతకీ లేని అదృష్తం పట్టింది.

    ఇప్పుడప్పుడే ముఖ్యమయిన పనులేవీ మొదలెట్టకపోవచ్చు,యెందుకంటే ఇప్పుడు మొదలెట్టి రెండు మూడేళ్ళలో లుకలుకలు బయట పడితే 2019లో బద్నాం అవుతారు!కాబట్టి హడావిడిగా చెయ్యడానికి పెద్దగా పనులేమీ లేవు.నిన్న పత్రికా సమావేశం చూశాను.నాకు ఇంకొకటి కూడా అంపించింది ముందే. చాతీ సమస్యలనేవి గుండెపోటు లాగా అర్జెంటుగా రావు.అలాంటప్పుడు నగరానికి అంటే ట్రాఫిక్ రద్దీకి దూరంగా వుంచటం మంచిదే.సారుకి వున్న వాస్తు నమ్మకం కూడా ఒక కారనం.

    ఇక చంద్రబాబుకి ప్రస్తుతం రాజధాని పని తప్ప ఇంకో పెద్ద పని లేదు.మొత్తం మీద ఇద్దరినీ అలా వాళ్ళ పాటికి వాళ్లని వొదిలెయ్యటమే తప్ప ఇంకేమీ చెయ్యలేం.వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే,కోరి తప్పులు చేసి 2019లో మళ్ళీ గెలవలేని స్థితిని తెచ్చుకోరు.సభలో ప్రతిపక్షం మాటే చెల్లుబడి కానప్పుడు మనం బ్లాగుల్లో వుధ్ధరించగలిగేది యేముంటుంది?మాట దాచుకోలేదన్న సాటిస్ఫాక్షన్ తప్ప?!

    పార్టీలన్నీ తమ బలాన్ని ఇంకా ఇంకా పెంచుకోవడం విషయంలో చాలా గట్టిగా వున్నాయి,భాజపా ఐతే మరీ మిత్రుడా సత్రువా అనేది కూడా పట్టించుకోవడం లేదు.పైగా ఈ రెండు రాష్ట్రాల అధినేతలూ అసమర్ధులు అనే ముద్ర వేసి తను యెదగటానికి అవకాసం కోసం చూఒస్తున్నది కాబ్ట్టి మన రెండు రాష్ట్రాలకీ ముందుకాలం గడ్డుకాలమే!

    నాలుగేళ్ళ తర్వాత వాళ్ళే మా ప్రోగ్రెసు రిపోర్టు ఇదీ అని చెప్పేవరకూ మనం చెయ్యగలిగింది లేదు ఇట్టా సరదా పోష్టు లేసుకోవడం తప్ప.

    ReplyDelete
    Replies
    1. నాలుగేళ్ళు ఆగి ఉంటె ఫాస్ట్ 1956 కటాఫ్ ఆపగలిగే వాళ్ళం కాదు కదా.

      Delete
    2. అదీ నిజమె నండోయ్,మొత్తానికి విద్యార్ధులను ఇబ్బందిని గమనించి పాత దాన్నే ఓకే అన్నాడు, ఫాస్టు ఇక లేనట్తే?!అలాంటివాటికి గొదవ చెయ్యాల్సిందే లెండి.

      Delete
    3. @Jai Gottimukkala

      FASTను ఎవరు ఆపారు? కోర్టులు వేసిన మొట్టిక్కాయలు కాదా??

      Delete
    4. యెంత ధీమాగా చెప్తున్నాడు వాస్తు బాగా లేదని మారుస్తున్నాననీ,తన సొంత మొక్కులు తీర్చుకోవడానికి ప్రజాధనాన్ని వుపయోగిస్తాననీ!ఇంతకన్నా అదృష్టవంతుదైన రాజ్యాధినేత యెవడయినా వున్నాడా?!లఖ్సో అరలక్షో కాదు,అన్నీ కోట్లలఓనే - ఇంత డబ్బుని ప్రజలకి మేలు చేసే వాటికి బయటికి తియ్యడేం?రాజయ్యని తీసెయ్యడానికి కారనమైన ఆరోపనలో నిజమేంత?అక్కడ ఆస్పత్రుల నిర్వహనకీ ఆరోగ్య పరిరక్షనకి కేటాయించిన నిధులెన్ని ఒక స్వీపరు కూడా జీతం లేనిదే పని చెయ్యదు,అక్కడ కేటాయించాల్సిన నిధులన్నీ ఇట్లా దుబారా చెయ్యడం సబబా?కేటీఆర్ చెప్పిన దాని ప్రకారమే సంక్షేమ పధకాలు 200 పైనే వున్నాయట గదా?బడ్జెట్ రంజి యెంత?అందులో సిమ్హభాగం ఈ అనవసరపు ఖర్చులకే పోతే అభివృధ్ధికి కావలసిన పెట్టుబడుల కేటాయింపుల సాంగతేంటి?

      తెలంగాణా మేధావులు నాయకత్వ మార్పుకి సిధ్ధపడి ప్రత్యామ్నాయాన్ని తయారు చెసుకోవడం తప్పని సరి!

      Delete
    5. శ్రీకాంత్ గారూ, కోర్టు మొట్టికాయలు వేసిందా? నేనయితే చూడలేదు.

      అసలు మొట్టికాయలు ఆంటే ఏమిటి? కేసు ప్రక్రియ జరుగుతుండగా (ఉ. వాయిదాలు వేసినప్పుడు లేదా మధ్యస్త ఉత్తర్వులు జారీ అయినప్పుడు) చేసే మౌఖిక వ్యాఖ్యలకు న్యాయపరమయిన విలువ లేదు. వీటిని ఉబుసుపోక మాటలు (obiter dictum or passing remarks) అంటారు. మీడియా వీటిని తీసుకొని హంగామా చేయొచ్చు గాక కానీ ఇందుట్లో అంతకంటే ఎక్కువ ఆపాదించలేము.

      తుది తీర్పులో పొందు పరిచిన strictures విలువ వేరే. వీటి ఆధారంగా ధిక్కార ఆరోపణ (contempt of court) కలగొచ్చు & వీటికి కొంత మేరకు గత నిర్ణయ హోదా (stare decisis) ఉంటుంది కాబట్టి నిజమయిన మొట్టికాయలుగా భావించ వచ్చు.

      మనలో మాటగా strictures ను కూడా ఎన్నోసార్లు పట్టించుకోని దాఖలాలు ఉన్నాయి. వీటి ఆధారంగా నిర్ణయం కాదు సరికదా కనీసం స్టాండు మార్చక పోవడం చూస్తూనే ఉంటాం. ఉ. ఆల్మాటీ కేసులో సర్వోత్తమ న్యాయస్థానం కొట్టి పారేసిన స్తాండునే ఆంద్ర రాష్ట్రం బ్రజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ముందూ తీసుకుంది. అక్కడ అక్షింతలు పడ్డాక కూడా ప్రస్తుత వివాదంలో అదే పాట పాడుతుంది. Andhra is arguing against res judicata forum after forum.

      ఫాస్ట్ విషయంలో పథకం ప్రకటించలేదు, కేసు అసంబద్దం, ఇందులో కూడా తీర్పు రాలేదు. ఒకవేళ వాదనకు వెళ్ళినా 1955 డీపీ జోషీ తీర్పు దృష్ట్యా పథకం చెల్లుతుంది.

      I fought against the 1956 cutoff and welcome the decision to drop the matter. This does not mean the legal objections would have prevailed: they fail under all grounds.

      Delete
    6. @Jai Gottimukkala

      // కేసు ప్రక్రియ జరుగుతుండగా (ఉ. వాయిదాలు వేసినప్పుడు లేదా మధ్యస్త ఉత్తర్వులు జారీ అయినప్పుడు) చేసే మౌఖిక వ్యాఖ్యలకు న్యాయపరమయిన విలువ లేదు. వీటిని ఉబుసుపోక మాటలు (obiter dictum or passing remarks) అంటారు.//

      కానీ, తరువాతి సెషన్లలో తెలంగాణా తరపు లాయర్లు వాటికి తగిన వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అందునా ఇవేమీ సరదాగా అన్న మాటలు కాదు. వీటిని మొటిక్కాయలనే అంటారు. ఎందుకంటే, అవి కోర్టులో కేసు గతి ఎలా ఉండబోతోందో తెలియజెప్పేవి. కాకపోతె అంత్య తీర్పు అనేది అది కాదు అన్నదైతే నిజమే. అలా అని అది కాబోదు అన్నదానికి కూడా చెప్పలేం.

      ఫాస్ట్ పథకం ఇంకా రానట్టయితే, కేసు అసంబద్దమయితే .. కోర్టు దాన్ని ఎందుకు స్వీకరించింది. తెలంగాణా తరపు లాయర్లు కేసు స్వీకరించడాన్ని ఎందుకు సవాలు చేయలేదు? కోర్టుతో ఇలాంటి "పాసింగ్ రిమార్క్‌స్" చేయించుకోవాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడింది?

      ఇక మీరు చెబుతున్నకేసు డి.పీ జోషీ కేసును కూడా ఛాలెంజు చేయొచ్చు. ఎందుకంటే, తీర్పు అనేది "అలా చేయకూడదు అని ఎక్కడా చెప్పలేదు" అనే ప్రాతిపధికన ఇచ్చినది. అంతే కానీ " అది న్యాయమే, అలా చేయొచ్చు" అని స్పష్ఠంగా రాసి ఉన్న రూలు ప్రకారం ఇచ్చింది కాదు. ఒక లూప్ హోల్ ఆధారంగా వచ్చిన తీర్పు అది. కావాలంటే ఒక సారి పరిశీలించండి. అది జడ్జిలను భట్టి మరియూ పరిస్థితులను భట్టి, మరి కొన్ని అంశాలను భట్టి ఉంటుంది. అంటే.. విభజన భిల్లులోని అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి వస్తుంది. వీటన్నింటినీ పరిశీలించిన తరువాత న్యాయ మూర్తులు గతములో ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నది మీకు తెలియంది కాదనుకుంటా !!

      వీటికి భయపడే, విషయం అంత దూరం పోకుండా ముదు జాగ్రత్త పడ్డారని అనుకుంటున్నాను.

      Delete
    7. పై కామెంటులో నా ఉద్దేశ్యం, డీ.పీ జోషి కేసును ఆసరాగా చేసుకుని వాదించే వాదనను కూడా ఛాలెంజు చేయొచ్చు అని.

      Delete
    8. శ్రీకాంత్ గారూ, ఈ కేసు తాలూకా లింకులు తెలిస్తే ఇవ్వగలరా? అవి చదివాక మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తాను.

      డీపీ జోషీ కేసు మీరు చదివారా? ఆ తీర్పును తిప్పి రాయడం అంత సులభం కాదు.

      మీరు లూపుహోలుగా వర్ణించిన విషయం reasonable classification అంటారు. అంచేత మీ అభిప్రాయం సరికాదు.

      చాలెంజ్ చేసిన వ్యక్తి నియమం తన హక్కులను కాలరాసిందని నిరూపించాలి. జోషీ ఈ విషయంలో విఫలం అయ్యారు. నెగటివ్ పాజిటివ్ అంటూ వేర్వేరు తీర్పులు ఉండవు. The opposite of ultra vires is intra vires. ఇక రూలు ఉందా అని అడిగితె పైని పేర్కొన్న reasonable classification రూలే కదా.

      Delete
  4. @Jai Gottimukkala,

    మీరు చెప్పిన సమాచారం మేరకే నేను ఆ ప్రశ్నలు అడిగానండి. నేను దీని గురించి పేపర్లో అప్పుడెప్పుడో ఒక వార్త చదివానంతే.

    డీ.పీ జోషి కేసును కొట్టివేయాల్సిన పనిలేదు. దాన్ని తిరగరాయాల్సిన పనీ లేదు. ( ఆ మాట కొస్తే డి.పీ జోషి కేసును తిరగ రాయడం కూడా అసాధ్యం అయితే కాదు.) చేయాల్సిందల్లా ఆంధ్రా - తెలంగాణాల మధ్య నడుస్తున్న వివాదం దానితో పోలిస్తే ప్రత్యేక మైనది అని నిరూపిస్తే చాలు. విభజన చట్టము, మరికొన్ని సెక్షన్లు అందుకు పనికొస్తాయి (రాష్ట్రపతి ఉత్తర్వులు).

    నేను ఇప్పుడు మళ్ళీ చదవడం లేదు. కానీ, అప్పుడెప్పుడో చదివాను ఈ డి.పీ జోషి కేసు గురించి. సుప్రీము కోర్టులో ఇద్దరు జడ్జిలు దీన్ని వ్యతిరేకించారు. ముగ్గురు సమర్ధించారు. అంటే సరైన లాయరు, కాస్త భిన్నాభిప్రాయం గల జడ్జి మరొకరు జతైతే ఈ కేసును తిరగరాయడం కష్టం కాదు కదా? ప్రస్తుతం ఈ కేసు విషయానికి వస్తే కావలసింది ప్రస్తుతం ఆంధ్రా -తెలంగాణాల మధ్య పరిస్థితులు, స్థానికథను నిర్ణయించే సంవత్సరం, విభజన భిల్లులోని, రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవన్నీ కలిపి మంచి లాయరు జతకలిస్తే తెలంగాణాకు వ్యతిరేకంగా మారే అవకాశం బాగానే ఉన్నట్లే లెక్క.

    //The opposite of ultra vires is intra vires. ఇక రూలు ఉందా అని అడిగితె పైని పేర్కొన్న reasonable classification రూలే కదా.//
    ఇది అన్ని సార్లూ చెల్లదండీ. ఇలాంటి కేసులు నేను బాగానే చూశాను. 498A, DV Act అత్యాచారానికి సంబందించిన కేసుల్లో స్త్రీలకు శిక్ష పడే అవకాశం లేదు. చట్టాలు దుర్వినియోగమే అయినా శిక్ష ఉండదు. వీటిలో కొన్ని చట్టాలలో అయితే క్లియరుగా (DV Act) రాసే ఉంది. స్త్రీలను శిక్షించే వీలు లేదు అని. కానీ, కొంత మంది జడ్జిలు శిక్షాస్మృతిలోని ఇత్ర అంశాలను పరిగణలోకి తీసుకుని శిక్షించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి.

    DV Act అయితే, ఏకంగా చట్టములోని ఒక అంశం మరో చట్టానికి విఘాతం కల్గిస్తోంది అని ఓక జడ్జిగారు ఏకంగా సవరణ (లాంటిది చేసి).. DV Act is a loosely drafted law అని దాన్ని రూపొందించిన ఫెమినిస్టులందరికీ గాఠ్ఠిగా మొట్టిక్కాయలు వేశారు. (మీరు కావాలంటే DV Act is a loosely drafted law అని సెర్చ్ చేసి చూడండి. అంటే, స్పష్టంగా రాసిన చట్టాలే .. దిక్కులేదు. మంచి లాయర్, డిఫరెంటుగా ఆలోచించే జడ్జి ఉంటే .. ఈ కేసును విధ్యార్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

    ReplyDelete
    Replies
    1. ముందు మాట: ఫాస్ట్ పథకంతో ఆంధ్రకు లేదా ఆంధ్రులకు ఎటువంటి సంబంధం లేదు. ఆంధ్రులకు 15% ఓపెన్ కాటగిరీలో పోటీ చేసే అవకాశం ఉంది. వారికి తెలంగాణా నుండి ఆర్ధిక సాయం పొందే హక్కు ఎంతవరకూ లేదు. చట్టంలో సెక్షన్ 75 ఆంధ్రులకు వెసులుబాటు గురించి మాత్రమె వర్తిస్తుంది కాబట్టి అదీ ఇక్కడ సరిపోదు. అంచేత ఇది తెలంగాణా-ఆంద్ర మధ్య వివాదం కాదు.

      రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రవేశ ప్రక్రియకు (15% ఓపెన్ కోటా) చెందుతాయి. ఆర్ధిక సాయం గురించి తెలంగాణా చట్టం ఏమీ చెప్పలేదు.

      డీపీ జోషీ కేసులో 4 న్యాయమూర్తులు (అయ్యర్, ముఖర్జీ, బోస్ & సిన్హా) మెజారిటీ తీర్పును వెలువడించారు. ఒకే ఒక్కరు (దాస్) మైనారిటీ డిసెంట్ నోటు ఇచ్చారు. ఇదొక్కటే కాక, ఈ తీర్పు ఆధారంగా మరెన్నో కేసులు నిర్ణయించారు వచ్చాయి. అంచేత తీర్పు తిరగరాయడం అతి కష్టం, డాన్ భాషలో నామున్కిన్ కాకపోయినా బడీ ముష్కిల్ :) .

      స్తానికతకు ఫాస్ట్ పథకానికి ఎటువంటి సంబంధం లేదు. 371-డీ స్థానికత నిర్ణయిస్తుంది కానీ డోమిసైల్ కాదు.

      Reasonable classification అనేది హక్కులలో మినహాయింపుకు సంబందించింది. మీరు చెప్పిన కేసులో గురించి reasonable classification ఉంటె తెలపండి, నేను చదువుతాను.

      There are two principles for deciding reasonable classification:

      1. The classification must be founded on intelligent differentiation
      2. The classification must bear a reasonable nexus to the objective of the law under discussion

      Delete
    2. మీరు చెప్పిన డీవీ ఆక్టు కేసు బత్రా వర్సెస్ బత్రా అనుకుంటా, ఇప్పుడే చదివాను, ఆ కేసులో నిర్ణయించిన విషయం చట్టంలో సెక్షన్ 17 & 19 లకు సంబందించినవి. న్యాయమూర్తి అన్నది 2 (ఎస్) లో shared household నిర్వచనం గురించి.

      ఈ కేసును ప్రస్తుత చర్చకు కానీ డీపీ జోషీ కేసుకు కానీ reasonable classification అనే కాన్సేప్తుకు కానీ ఎలా అన్వయించారొ నాకు అర్ధం కావడం లేదు.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...