Sunday, 4 January 2015

వీళ్ళు యేమి చదివారు?ఆ చదువు యేమి సంస్కారం నేర్పింది?



          యాబై అరవై యేళ్ళుగా తెలంగాణాకి ద్రోహం జరగడంలో తెలంగాణా రాజకీయవేత్తల ప్రమెయమే యెక్కువని అంత కాలం రాజకీయ జీవితం గడిపాక కూడా ఇతనికి నిజంగానే తెలియదా? ఈ మనుషుల బ్రోకరేజి వ్యాపారం చేసి పైకొచ్చిన వాడు పెద్ద నీతిమంతుదిలా పోజులు కొడుతూ ఆంధ్రా రాజకీయ వేత్తల్ని మాత్రమే అంటున్నాను సామాన్యుల్ని కాదు అని యెంత సమర్ధించుకున్నా కొన్ని లక్షల కోట్ల మంది ముందు సభావేదికల మీద పచ్చి బూతుల్ని కూడా అవి బూతులు కాదని తెగబడి యెలా మాట్లాడ గలిగాడు?

       ఇంతకు ముందు మాతృ రాష్ట్రం నుంచి విడిపోయిన రాష్ట్రాలు మొదట విడిపోవటానికి సభలో మెజారిటీ మైనారిటీ లెక్కలతో కొలిస్తే అంకెకి తక్కువే అయినా తమ శాసన సభలోనే విభజన ప్రతిపాదన చేసి ప్రతికక్షుల్ని కూడా వొప్పించి సోదర రాష్ట్రాలు రెండూ సాదరంగా విడిపోయాయని తెలిసి కూడా ఇక్కడ మేము అంకెకి తక్కువున్నాం మాకు న్యాయం జరగదు అని ఆర్టికిల్ మూడుని భుజానేసుకుని యెందుకు తిరిగాడు?ఆంధ్రోళ్ళని తిడుతూ విడిపోయే అమర్యాద కరమయిన పధ్ధతిలోనే తెలంగాణా తీసుకురావాలనే వూహ యెలా వచ్చింది ఇతనికి?

           ఒకసారి వాహనాల చట్టంప్రకారం రిజిస్టరు చేయబడిన వాహనానికి రెండవ రిజిస్ట్రేషన్ అనే చెత్త వూహ యెలా వచ్చింది?వాహనాల చట్టంలో యేమయినా అస్పష్టత వున్నదా?లేదే, కోర్టు ముక్క చివాట్లు పెట్టింది గదా?అప్పటికీ వెనక్కి తగ్గకుండా వాహనం మీద వుండే నంబరు ప్లేటు మీద మాత్రం మారిస్తే చాలుననే మొదటిదాని కన్నా చెత్త వూహ యెలా వచ్చింది?హత్యలూ దోపిడీలూ చేసి పారిపోయే వాళ్ళు చేసినట్టు యే వాహన యజమాని అయినా తప్పు నంబరు వాహనం మీద వేస్తే ట్రాఫిక్ పోలీసులు చూస్తూ వూరుకుంటారా?అలా వూరుకోమని ప్రభుత్వాధినేతగా లిఖిత పూర్వకంగా పోలీసులకి ఆదేశాలు జారీ చెయ్యగలడా?




       తెలంగాణా సిటిజన్ కార్డు గురించి మాట్లాడేటప్పుడు ఈ దేశమలో దేశమంతటా ఒకే రకమయిన పౌరసత్వం వుంటుందనీ యే రాష్ట్రంలోనూ రాష్ట్రం పేరుతో పౌరసత్వపు కార్డులు లేవనీ నిజంగానే తెలియదా?పదో తరగతి వరకూ జాగర్ఫీ, హిస్టరీ, సివిక్సు అనే పాఠాలు చదివిన వాళ్ళేవరికయినా తెలిసే విషయం ఈవిడ కెందుకు తెలియలేదు?

        ఒకప్పుడు దెయ్యాలకి భయపడి జనాలు "ఓ స్త్రీ రేపు రా" అని రాసుకున్నట్టు తెలంగాణాలో వుండాలనుకున్న ఆంధ్రా వాళ్ళంతా ఇంటి తలుపుల మీద ఆ విషయం ప్రత్యేకంగా వుల్లేఖించాలని యెలా అనగలిగింది?అది తెలంగాణేతరు లందరికీ చెప్పిందా,ఆంధ్రావాళ్లకి మాత్రమేనా?రాజ్యాంగ బధ్ధంగా యెన్నికయిన వాళ్ళు ఇలాంతి అసమానతల్ని ప్రజలకి ఆదేశించటం కుదరదని నిజంగానే తెలియదా??అంతకాలం మేము రాజకీయ నాయకులనే ద్వేషిస్తున్నాం అని చెప్పుకుంటూ ఆ మాట చెప్పింది మాత్రం సామాన్య ప్రజలకే గదా!

     కాశ్మీరు తో సహా పాకిస్తాను వాళ్ళు యేమి అడిగితే అది ఇచ్చేసి పాకిస్థానుతో స్నేహంగా వుండవచ్చు కదా యెందుకీ యెడతెగని కలహాలు అని భారత ప్రభుత్వానికి చాలా గొప్ప సలహాల్ని ఇచ్చిన ఈ మనిషి పొరుగు రాష్త్రం విషయంలో తన తండ్రికి ఆ సలహా ఇచ్చి అది అతను పాటించేటట్లు చెయ్యగలదా?పోనీ ఈ గొప్ప ఆలోచనతో ముందుకెళ్తే రేపు పాకిస్తాను వాళ్ళు నిజాము యెటూ నేను ఇండియాలో కలవను పాకిస్తానులో కలుస్తాను నాకు పాకిస్తాను వరకూ రోడ్డు మార్గం కావాలని అడిగాడు కాబట్టి ఆ నిజాము గారు పరిపాలించిన ప్రాంతాన్ని కూడా అడిగితే సంతోషంగా వొప్పుకుంటుందా?
     బ్రాహ్మణ సంస్కృతిని విమర్శించడానికి హేతువాది నంటాడు,బ్రాహ్మణీకపు హిందువులు  మతం పేరుతో గుడిగోపురాలు కట్టి యెన్నో దుర్మార్గాలు చేశారంటాడు,తన కులపోడికి స్మారక భవనం కడితే మాత్రం సమ్మగా వుంది ఈ హేతువాదికి?!పాముల నెందుకండీ రెండు నాల్కల విషజంతువులని తిడతాం,పాపం?! 

       మా ఇంట్లో పేర్లన్నీ మల్లయ్య,కొమురయ్య,కట్టయ్య్య,ఐలయ్య - ఈ దేవుడి పేరు నుంచి వచ్చినవే.కానీ వెలమల్లో ఈ పేరున్న ఒక్క మగ లేదా ఆద వ్యక్తి మనకి కనిపించడు.నరసింహా రావు,రామారావు,విద్యాసాగర రావు,రాజేశ్వర రావు అనే బ్రాహ్మణీయ దేవతల పేర్లతో,అణచివేతే ఆనందంగా గల సంస్స్కృతితో జీవించే వాళ్ళు మారుతున్న దాఖలాలు కూడా లేవు అంటాడు.అదే ప్రశ్న తిరగేసి మరి మీ కులంలో ఈ పేర్లు యెందుకు కనపడవు?మీ పేర్లు పెట్టుకోని ఇతర కులాల వాళ్ళంతా మీదృష్టిలో దురహంకారులా?అంటే మీ కులం గొప్పదని మీకు వుంది గాబట్టి మీ దేవుళ్ళ పేర్లు మాత్రమే పెట్టుకున్నా మీది కులపిచ్చి కాదు,యెదటి వాళ్ళు మాత్రం వాళ్ళ కులదేవుళ్ళకి బదులుగా మీ కులపు దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటేనే మీకు మంచివాళ్ళుగా కనబడతారు,మాస్టారూ మేం మీ కులపు పేర్లు పెట్టుకోము,కానీ మీరు మాత్రం మా కులపు పేర్లు పెట్టుకోవాలి అంటున్న ఇక్కడ పెత్తనం చేస్తున్నది యెవరంటారు?

     ఈయనకి "సామాజిక శాస్తవేత్త" అనే బిరుదు నామం కూడా వుందండోయ్!తనలోనూ యెదటివాళ్లలోనూ వున్న ఒకే లక్షణం - స్వకులాభిమానం అనేది తనలో వుంటే గొప్ప అనీ యెదటి వాడిలో వుంటే చెత్త అనీ అనడం డబల్ మొరాలిటీ అవుతుందని వున్నత విద్యావంతుడూ సామాజిక శాస్త్రవేత్తా అయిన ఈ పెద్దమనిషికి యెట్లా తెలియలేదబ్బా?

   నేను "మీసాల సుహాసిని" అని ఎటకారంగా పిలుచుకునే రాధాకృష్ణ గారు ఈయనగారి తెలివితేటలకి మెచ్చుతునక అనబడే మరో విషయం చెప్పాడు?"చర్చ్ ఫాదర్ నా పుండును ఆప్యాయంగా కడిగి శుభ్రం చేస్తాడు. హిందూ మతానికి చెందిన స్వాములు నన్ను స్పృశిస్తారా?" - అని అఅడిగాడట!వినగానే ఈ ప్రశ్న ఢాం ఢమేల్ మనిపించేటంత ఇంటిలిజెంట్ అనిపిస్తుంది,కానీ వైద్య సదుపాయం ఇంతగా అభివృధ్ధి చెందిన ఈ రోజుల్లో కూడా పుండుని కడిగించుకోవటానికి డిస్పెన్సరీకి వెళ్ళి ఆయింట్మెంటు పూయించుకుని బ్యాండేజి వేయించుకుని ఆంటిబయాటిక్ ఇంజక్షన్లు చేయించుకోవటం తెలివైన పనా ఫాదర్ దగ్గిరకో స్వామీజీ దగ్గిరకో కెళ్ళి ఆయన మన  పుండు కడుగుతుంటే మనం ఆయన ముఖంలోకి చూసి పరవశించడం తెలివైన పనా?

      ఇంత మూర్ఖపు ఆలోచనల్ని కూడా గొప్పగా భ్రమింప జేసే ఈ పెద్దమనిషి యేదయినా అగ్రకులంలో పుట్టి వుంటే ఇప్పుడు తనే విమర్శిస్తున్న వాళ్ళని మించి దురహంకారాన్ని ప్రదర్శించే వాడేమో గదా!
------------------------------------------------------------------------------------------------------------------

12 comments:

  1. బుర్ర బాదుకోవడానికి ఇన్ని రాళ్ళున్నాయన్నమాట!!.

    ReplyDelete
  2. ఆలస్యం అమృతం విషం...నిదానమే ప్రదానం ...ఈ రెండు హితోక్తులు నేను వాడితే నేనెవరిని?
    అసలు ఈ రెండు విరుద్ధ భావాలు హితోక్తులు గా ఎందుకు చెలామణి అవుతున్నాయి..?
    అలాగే ఒకే అంశాన్ని రెండు వేర్వేరు సామాజిక వర్గాల వాళ్ళు చెప్తే రెండు రకాలుగా అర్ధమౌతుంది..
    కుల నిర్మూలన అని పై కులం అతను చెబితే అది ఆదర్శం
    అదే విషయాన్ని కింది కులం అతను చెబితే అది ఆదర్శంగా కనబడదు..ఎందుకంటే పై కులాల వారి లాగా , కింది కులాల వారిది కులం పట్ల దురభిమానం అనుకోవడం పొరపాటు, ఎందుకో కొంచెం మానవత్వం తో ఆలోచిస్తే ఎవరికైనా అర్ధమౌతుంది,అందుకోసం పిట్ట కథలు అన్ని పరిస్థితులకు సరిపోవు ...అనేది మీకు కూడా తెలుసు ...ఈ మధ్య మీ పోస్ట్ లు మరియు కామెంట్స్ ఇలా అతికిన్చాబడుతున్నట్టు అనిపిస్తోంది.. మీ నుండి ఎన్నో మంచి పోస్టులు చూసి నేను ఎన్నో విషయాలు తెల్సుకున్న మీ అభిమాని

    ReplyDelete
    Replies
    1. @srinu the boss
      నేనెప్పుడూ యే పోష్టునీ యే కామెంటునీ బలవంతంగానో తప్పనిసరి తద్దినం లాగో అతికించను.బాగా ఆలోచించి ప్రతి అక్షరాన్నీ ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని నా అభిప్రాయాలలో తప్పు లేదని నిర్ధారించుకున్నాకే పబ్లిష్ చేస్తాను.

      Delete
  3. @srinu the boss
    ఈ మధ్య మీ పోస్ట్ లు మరియు కామెంట్స్ ఇలా అతికిన్చాబడుతున్నట్టు అనిపిస్తోంది.
    >>
    ఒక విషయం చెప్పాలి.అన్ని కులాల వాళ్ళ విముక్తి కోసం పోరాదే మావోయిష్టు పోరాట యోధుడు కూడా "గనపతి" అనే పేరు పెట్టుకోవదం వల్ల కులపిచ్చివాడిగా జమకట్టేయ్యెదం మీరు సమర్ధించగలరా?ఈ ఆదివారం ఆంధ్రజ్యొతిలో "భవంతులు బతుక్దెరువైతయా" అనే వ్యాసం మీరు చదివారా?కొమరం భీం మొత్తం మానవాళికే ఆదర్సం కావాలని కోరుకోవదం లో నాకెటువంటి తప్పూ కనబదలేదు,కానీ కమ్మవారిలొనూ, వెలమ వారిలోనూ సామాజిక రుగ్మతలకి పోరాడిన వాళ్లని కూడా కులానికి పరింతం చేసి మాట్లాదటం మీకు స్బబుగా అనిపిస్తుందా?పై కులాల్ వాల్ళు తమని అణ్గదొక్కితే ఇప్పుడు ఆయన ప్రజాస్వామ్యబధ్ధమైన సమానత్వం కోరుకుంటున్నాడా?ఇదివరకు ఆ పైకులాల వాళ్ళు చేసినట్టు తన కులం అన్ని కులాల మీదా పెత్తనం చేస్తే చూడాలనే దురద అతనిలో కనబడుతున్నదా!మీరు కొంచెం స్పష్తంగా విదమరిచి చెప్పండి.

    ఔన్నత్యాన్ని మెచ్చుకోగలను కానీ ఔధ్ధత్యాన్ని ప్రశంసించ లేను!

    ReplyDelete
    Replies
    1. మీరు ఒకటి చెప్పగలరా?కులాల మధ్య అంతరం తొలగించే పద్ధతి...?
      మహాత్మా జ్యోతి బా పులే వంటి పెద్దల నుండి చెప్పెది ఒక్కటే కడుపు నిండిన వాడికి ఆకలి అంటే ఏమిటో తెలియజేస్తేనే ఆకలి గా వున్నవాడి ఆకలి బాధ తెలుస్తుంది...మనమీద పెత్తనం చెలాయించే వాడి మీద పెత్తనం ఖచ్చితంగా చేలయిన్చాల్సిందే...?పెత్తనం వద్దు అందరం సమానం అంటే వాళ్ళు ఎవరు వినరు ,వినడం లేదు అనే విషయం తెలుస్తూనే ఉంది..
      ఇది కాకుండా అందరూ మారే ఏదైనా పద్ధతి ఉంటె చెప్పండి..?
      నేను అతివాదిని కాదు ...ఇక్కడ ప్రేమ తో చెప్తే మెదడుకు ఎక్కిన్చుకొనే పరిస్థితి మీకు కనపడుతోందా? ప్రేమ లేని చోట ప్రేమ గా ఉండాలి అనేది ఉదారస్వభావం...మనం ప్రేమ తో చెప్తే బ్రిటిష్ వాడు వెళ్ళిపోయే వాడా?అందుకే సమానానికి ,కొంచెం ఎక్కువ సమానం కొంచెం తక్కువ సమానం అనే పదాలు వింటున్నాము..అంటారు అందరూ రెండే వర్గాలు ఉండాలి ..ధనిక /బీద ...ఎక్కువ కులం లోని బీద తక్కువ కులం లోని బీద కు సమానమా?ఇక్కడ ఆత్మగౌరవం గురించి ఎవరు అర్ధం చేసుకోరేమి?మీరు కూడా ఇలాగే అలోచిస్తున్న్నారా?
      దీని పై ఇంకా మీరు చెప్పొచ్చు ...కాని ఇది చూడడానికి కనిపించే సమస్య కాదు ...ఇది ఒక వ్యక్తి ఆత్మ గౌరవానికి సంబదించిన సమస్య ...?
      నేను పెట్టిన కామెంట్ మిమ్ములను బాధ పెట్టడానికి కాదు ..మీ బ్లాగ్ మీ ఇష్టం ..కాని నేను మీ నుండి ఇలాంటి పోస్ట్ ఉహించనందున కొంచెం మీ పైన ఒక రకమైన అవగాహన ఏర్పడుతోంది ..ఒక మిత్రుడిగా చెప్తున్నాను ఒక సారి సమీక్షించు కోగలరు ..లేదా మీ ఇష్టం

      Delete
    2. @srinu the boss
      మీరు ఐలయ్య గారు గయ్యాళిగా చెప్పిన దాన్నే సెంటిమెంటుతో చెప్తున్నారనిపిస్తున్నది!నేను ఐలయ్య గారిలో వ్యతిరేకిస్తున్నది యేమిటో స్పష్తంగా చెప్తాను.మీరు వేసిన ప్రశ్నలు యెందుకు వేసారో అర్ధమయింది.కానీ ముందు ఐలయ్య గారు మరియూ మీలో వున్న గందరగోళం యేమిటో స్పష్టం చేస్తాను.దానికి సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను.వాటికి జవాబు మీరు చెప్ప జవాబుల్ని బట్టి నేను మీ ప్రశ్నలకి జవాబు చెప్తాను.

      మొదటగా అనదరికీ ఒక్కలాగే కనపడాల్సిన సామాజిక వాస్తవాల గురించి రెండు సామేతలతో మొదలెట్టారు మీ వాదన.ఆదర్శ్మ నేది పై కులం వాడు పాటించినా కింది కులం వాడు పాటించినా ఒక్క లాగే వుంటుంది.అలాంటివే ఆదర్శాలు.అలాగే తప్పు పని యే కులం వాడు చేసినా తప్పే అవుతుంది.

      మీరు మన మీద పెత్తనం చేసేవాడి మీద ఖచ్చితంగా పెత్త్తనం చెయ్యాల్సిందే అంటున్నారు.అంటే రక్తానికి రక్తం అనే సినేమా డయలాగు లాగా దోపిడీకి దోపిడీయే సమాధానం అవుతుందంటారా మీరు?ఇవ్వాళా వాళ్ళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని దోచుకున్నాట్టు రేపు మేము మా కు అధికారం వస్తే ఇతర కులాల్ని అణిచి వేసాతము,ఇతరుల్ని దోచుకుంటాము అని అంటున్నట్టా!దానికి ఐలయ్య గారు గయ్యాళిగా వాదిస్తే మీరు అమాయకంగా ఆత్మాభిమానం అనే పేరు పెడుతున్నార్రు,అవునా కాదా?

      ఈ మధ్యనే కులపరమయిన రిజర్వేషన్లని సర్దుబాట్లు చెయ్యతం గురించి ఒక రచహయిత మాదిగలలో వుండే వుపకులాల గురించి చాలా కొత్త విషయాలు చెప్పి వారికి కూడా న్యాయం జరగాలనే విధంగా వాదించారు.ఈ మొత్తం మేధావుల్లో యెవ్వరూ మంకృష్ణ మాదిగ మరియూ మాలమహా నాడు నేతలు తమలో తమకున్న అధిపత్యాల్ని వొదులుకోకుండా తమ కులప్రయోజనాల కోసమే పోట్లాడటానికి కూడా బ్రాహ్మణాధిపత్యమే కారణమని మీరు అనుకుంటున్నారా?ఒకవేళ అదే కారణమని ఐలయ్య గారు అంత అభీకరంగా ద్వేషిస్తూ తమ కులవారసత్వం పట్ల మాత్రం అంత వ్యామోహం చూపిస్తున్నాదేమిటి?

      తను పాటించే క్రీస్టియానిటీ చాలా వుదారమైనది, హిందూ మతంలో ఆ వుదారత లేదు అని మీఎకు గొప్పగా అనిపించే అతితెలివితో వాదిస్తున్న ఆతను ఒక రెడ్డి క్రిస్టియను ఒక మాల క్రిస్టియను సౌహార్ద్రంగా కలిసిపోయి వాళ్ళ కులభేదాలని మర్చిపోయి కులాంతర వివాహాలు చేసుకుంటున్నారా?

      సెంటిమెంటు తో నామేద పిట్టకధలు వొదలకుండా నా ప్రశ్నలకి సూటిగా జవాబిస్తే కంచె ఐలయ్య లోని డొల్లతనంతో బాటు మీ గాయపడ్ద ఆత్మాభిమానపు అసలు రంగు కూడా మీకే తెలుస్తుంది?!

      Delete
  4. మీరు మీ ఆలోచన ధోరణి గురించి ఇప్పుడు పూర్తిగా అర్ధమయ్యింది...
    నేను అడిగిన ప్రశ్న కు జవాబు ఇవ్వలేని మీరు కేవలం డిఫెన్సు లో పడ్డారని నాకు అర్ధమయ్యింది..
    మీరు మన సమాజం లో లేరు అని మీరు అడిగిన ప్రశ్నలను బట్టి నాకు అర్ధమయ్యింది
    ఎందుకంటే అవి మీకు తెల్సిన జవాబులే...
    చెప్పడానికి ఆదర్శం అనేది మీరు చెప్పినట్టుగా ఉంటుంది...
    కాని సమాజంలో చెలామణి అవుతున్న ఆదర్శం దానికి భిన్నంగా ఉన్నది ..లేదు అంటే మీ ఇష్టం
    >>అలాగే తప్పు పని యే కులం వాడు చేసినా తప్పే అవుతుంది.
    <>దోపిడీకి దోపిడీయే సమాధానం అవుతుందంటారా మీరు?
    <<చూడండి ఒక సారి ఆలోచించండి పెత్తనం కింది వాళ్లకి ఇస్తే ఏమౌతుంది? ,ఇప్పుడు పైన ఉన్నవాళ్ళు కింది స్థాయిని బరించలేరు..కాబట్టే వాళ్ళు పైనే ఉండాలనుకుంటారు ఇప్పుడు ...వాళ్ళు పైన ఉండలేరు అనే విషయాన్ని తెలుసుకున్నపుడు వాళ్ళు సమానంగా ఉందాం అంటారు ...ఇది మనోవిజ్ఞాన సూత్రం..వాళ్ళు దోచుకునేంత ఛాన్స్ ఇస్తారంటే అది అతిశయోక్తి...ఇది మీరు జీర్ణించుకాకపోయినా ఇదే నిజం

    ReplyDelete
    Replies
    1. ,ఇప్పుడు పైన ఉన్నవాళ్ళు కింది స్థాయిని బరించలేరు..కాబట్టే వాళ్ళు పైనే ఉండాలనుకుంటారు ఇప్పుడు ...వాళ్ళు పైన ఉండలేరు అనే విషయాన్ని తెలుసుకున్నపుడు వాళ్ళు సమానంగా ఉందాం అంటారు ...ఇది మనోవిజ్ఞాన సూత్రం
      >>
      ఈ మనోవైజ్ఞానిక సూత్రం గురించి నేనూ ఆలోచించాను.దాని గురించీ చాలా చదివాను.అలాంటి వ్యూహాలు నిజంగా పనిచేస్తాయని మీరు నమ్ముతున్నారా!నేనేదో కులపిచ్చితో కిందికులాలు పైకి రావదం జీర్ణించుకోలేనట్టు అనుకుంటున్నట్టు వున్న్నారు,దానికి నేను చెయ్యగలిగిందేమీ లేదు.

      Delete
  5. >>మాదిగ/మాల/కులవారసత్వం
    <<డివైడ్ అండ్ రూల్ జరుగుతోంది...ఒక చక్రం తిరుగుతోంది...పైన కి ఎక్కిన వాడేప్పుడు తన పైన వాడిని అందుకోవాలని చూస్తాడు ,కింది వాడిని తొక్కుకుంటూ... ఇది కూడా మానవ నైజమే..పైన ఉన్నవాడేవడైన కింది వాడిని పైన ఆధిపత్యం చూపిస్తాడు ..కానీ పైన వాడి పైకి ఎక్కి అలా చుపపించలేడు..అందుకే అట్టడుగున ఉన్నవాడే మొదట పైకి వెళ్ళాలి
    ఇక కులవార్సాత్వాన్ని చూపించాలి..ఎందుకంటే ఏ కులం తక్కువ కాదు ,నా కులం కూడా తక్కువ కాదు అని చూపించాలిగా,ఎందుకంటే కింది వాళ్ళు ఆత్మ న్యూనత లో ఉన్నారు ..వాళ్ళని మోటివేట్ చెయ్యాలి...

    ReplyDelete
  6. >>క్రీస్టియానిటీ చాలా వుదారమైనది,
    <<క్రీస్టియానిటీ/ ముస్లిం/బుద్ధం/కులం వాటి మూలల్లో లేని ఏ మతమైనా వుదారమైనదే ... ఎందుకంటే అందులో కులాలు పుట్టించిన వాళ్ళు మన మెదావులే..మన మేధావులు లేకుంటే అది వుదారమైనదే..మీకు తెలియదా Dr.BR Ambedkar విధి లేని పరిస్థితులలో budhism తీసుకున్నాడు ,ఆయనను హిందువుగా జీవించనియ్యలేదు అని
    ...ఫైనల్ గా మీ పిట్ట కథలు మీకు కూడా నచడం లేదు అన్నమాట
    this is my last reply
    u know why?

    ReplyDelete
    Replies
    1. @srinu the boss
      this is my last reply
      u know why?
      ?
      I know this reply only will come from you.
      you are justifying maalas suppressing maadigaas by the influence of brahmanik law and at the same time castes must be there!
      you are not for "kula nirmoolana" or equality among castes and you try to ascend to top with your caste support deliberately and you call me disguised?.

      graet logic boss?!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...