Friday, 19 August 2016

బ్రహ్మదేవుడికి ఆలయపూజావిధానం ఎందుకు లేదు?పరమశివుణ్ణి లింగరూపంలోనే ఎందుకు పూజించాలి?

     హిందూ ధర్మం/సనాతన ధర్మం ఎంత విస్తారంగా ఉన్నా వాటిలో కొన్నిటిని క్రోడీకరించీ, కొన్నింటిని విభజించి వరస ఏర్పాటు చేసీ సమగ్రంగా కొన్నింటిని తను స్వయంగా రచించీ సమగ్రమైన రూపంలోకి తెచ్చిన మహాజ్ఞాని - వేదవ్యాసుడు!"వివినమూర్తి వెతులాట" అనే బ్లాగు ఒకటి ఉంది.ఎవరో పరిచయం చేస్తే వెళ్ళీ చదివాను.ఆయన చాలా విషయాల్ని సేకరించి ఉంచారు.అందులో శ్రీపాద వారు అనుకుంటాను "హిందువులకా?ఐక్యతా?" అని వ్యాసం రాశారు.అందులో శంకరాచార్యులు,మధ్వాచార్యులు,రామానుజాచార్యులు వేదంలో ఉన్న ఒకే భాగాన్ని తీసుకుని తమకి అనుకూలంగా వ్యాఖ్యానించుకుని మూడు విభిన్నమైన ఆలోచనా ధోరణుల్ని పరిచయం చేసినట్టు చెప్పారు. వారు ముగ్గురే కాదు - హిందువులైనా, హైందవేతరులైనా హిందూమతం గురించి వారు సొంతానికి తెలుసుకోవాలన్నా ఇతరులకి చెప్పాలన్నా అధికారకమైనది వ్యాసప్రోక్త సాహిత్యమే!అంతటి జ్ఞానికి కూడా ఆ జ్ఞానం వల్ల అశాంతి ఎక్కువైపోయి భక్తితో భాగవతం రాసుకుని శాంతించాడు!పోతన గారు భాగవతం సొంతంగా ఏమీ రాయలేదు కదా - వారికి తెలియవలసిన దానికన్నా ఎక్కువ తెలిసిన జ్ఞానం గర్వాన్నీ అశాంతినీ పెంచింది, భక్తిని నింపుకున్నప్పుడు అది వినయాన్నీ ఆనందాన్నీ పెంచింది!

     పోతన విరచిత మహాభాగవతం చదువుతుంటే అక్కడక్కడా గీతాశ్లోకాలలోని భావాన్ని పోలిన పద్యాలు ఉంటాయి. ఎందుకంటే, గీతాశాస్త్రాన్ని సకల శాస్త్రాల సంకలనంగా రచించిన వేదవ్యాసుల వారే సంస్కృత భాగవత కర్త కూడా గనక అవే భావాలు ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. మొత్తం సనాతన ధార్మిక సాహిత్యాన్ని ఔపోశన పట్టిన వేదవ్యాసుల వారు సంక్లిష్టమైన సనాతన ధర్మాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొని వచ్చే ఆలోచనతో సనాతన ధార్మిక సాహిత్యంలోని విభిన్నమైన సిద్ధాంతాల్ని ఒకచోటుకు చేర్చి ప్రతికక్షులు కూడా వ్యతిరేకించలేనంత గొప్పగా నిరూపిస్తూ వాటిమధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని కడుచక్కని పోలికలతో వివరిస్తూ అష్టాదశాధ్యాయి అని కొనియాడబడుతున్న గీతాశాస్త్రం రూపంలో తనకు తెలిసిన సమస్తజ్ఞానాన్నీ నిక్షేపించి అందించారు!భక్తి షట్కం,జ్ఞాన షట్కం,కర్మ షట్కం అని ఆరు అధ్యాయాలని మూడు గ్రూపులుగా విడగొడుతూ మళ్ళీ ఏకసూత్రమైన భావజాలంతో ఒక్కటిగా చేర్చి మొత్తం పద్ధెనిమిది అధ్యాయాలలోని ప్రతి శ్లోకాన్నీ ఛందస్సౌందర్యవిలసితంగా రచించటం పనిలేక చెయ్యలేదు, 700 పైచిలుకు శ్లోకాలు అన్నీ గొప్ప ప్రణాళికాబద్ధంగా రచించినవే - ఏ ఒక్క శ్లోకాన్నో ఎత్తి తీసుకుని గీత మొత్తం ఇదే చెబుతున్నది అనటం అజ్ఞానులు మాత్రమే చెయ్యగలిగిన వెర్రిపని!

     సుమారు ఒక లక్ష సంవత్సరాల నుంచి ఎనభై వేల సంవత్సరాల వెనక ఆఫ్రికా ఖండం నుంచి వచ్చి భారత ఉపఖండంలో స్థిరపడిన మానవ సమూహమే ఇక్కడ అసంఖ్యాకంగా పెరిగి చోటుచాలక ఇతర ఖండాలకు వ్యాపించినదని ఆధునిక శాస్త్రీయ పరిశోధకులు నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పారు. ఇప్పుడు మనం సంస్కృతం అంటున్నది క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి చెందిన  పాణిని చేత సంస్కరించబడిన రూపం.అత్యంత ప్రాచీనమైన తొలినాటి సంస్కృతంలో అప్పటికే ఎంతో సాహిత్యం విస్తరించి ఉంది.అందువల్లనే ప్రపంచంలో ఈనాడు ప్రముఖమైన అన్ని భాషల యొక్క మూలరూపాల్లో ఎన్నో సంస్కృత పదాలు కనిపిస్తున్నాయి."అధాతో విశ్వజిజ్ఞాసా అధాతో బ్రహ్మజిజ్ఞాసా!" అన్న తిరుగులేని నమ్మకంతో వారు ఉపాసించిన జ్ఞానం ఎన్నో విశ్వరహస్యాల్ని వారికి తెలియజెప్పింది!విశ్వాన్ని గురించి తెలుసుకోవడం అంటే విశ్వకర్తను గురించి తెలుసుకోవడమే అన్న అభిప్రాయంలో అబద్ధాలు చెప్పకూడదన్న వాస్తవికతతో పాటు దానికి ఒక పవిత్రత కూడా అమరింది.ఎంతో రహస్యమైన విషయాల్ని కూడా సుబోధకంగా తెలియజెప్పడానికి వారు కధా సాహిత్యాన్ని నిర్మించారు.పౌరాణిక కధలలోని చాలా కధలకి మూలం ఖగోళశాస్త్రపు విషయాలే!ఉదాహరణకి దీపావళి పండుగకి సంబంధించిన నరకాసురుడి కధలో నరకుణ్ణి సత్యభామయే ఎందుకు చంపాలి?ఆనాటి క్షితిజం మీద సూర్యోదయ కాలంలో మొదట మేషరాశి కొంతసేపు కనిపించి,తర్వాత కన్యరాశి పైకి ఎదుగుతూ వస్తూ ఉండగా మేషరాశి కిందకి దిగజారుతూ మాయమైపోతుంది.మామూలుగా సాధువైన మేషం, అంటే గొర్రెకి ఒక్కోసారి తీవ్రమైన క్రోధం పుడుతుంది,కొండల్నీ,బండల్నీ అయినా సరే మూర్ఖంగా గుద్దుకుని చచ్చేవరకు ఆగదు!ఆ మూర్ఖత్వమే నరకుడి స్వభావంలో కనిపిస్తుంది.కన్యరాశికి సంకేతంగా సత్యభామ చేత వాణ్ని చంపించే కధలో చదవగానే తెలియని  విశేషం ఇది.రెండూ తెలిసినవాళ్ళు ఎవరయినా విప్పి చెప్తే గానీ అర్ధం కానివాట్ని అక్కడ ఉన్నది కూడా సరిగ్గా అర్ధం చేసుకోలేనివాళ్ళు తమకు తోచిన అర్ధం చెప్పుకుని వెక్కిరించడం కూడా మరొక  రకమైన అజ్ఞానం!జకీర్ నాయక్ గణేశుడి ప్రస్తావన తెచ్చి హిందూమతాన్ని వెక్కిరించడం ఇలాంటి అర్ధపాండిత్యానికి పరాకాష్ఠ.జాలిపడటం తప్ప మనం చెయ్య్గలిగింది లేదు - తెలిసియు తెలియని నరునికి దెల్పను బ్రహ్మకైనను తరమే?


     ఆదినుంచీ సనాతనుల జిజ్ఞాస అవధులు లేని రీతిన సాగింది.జ్ఞానాన్ని ఇతర్ల మీద పెత్తనం చెయ్యడానికి వాడుకోలేదు, ఇతరులశ్రేయస్సును మాత్రమే  వారు కాంక్షించారు గనకనే ఆనాటి వారి ఆవిష్కరణలు ఈనాటికీ ఆదరించబడుతున్నాయి!ఈ విశ్వం గురించి వారికి తెలిసిన విషయాల్ని వారు దేవాలయ నిర్మాణంలో ఉపయోగించారు.దేవాలయ నిర్మాణం అనేది ఇప్పటివాళ్ళు చేస్తున్నట్టు ఎక్కడ బడితే అక్కడ చెయ్యకూడదు.ప్రాచీన కాలంలో నిర్మితమైన ప్రతి ఆలయమూ అయితే గిరిశిఖరం మీదనో లేకుంటే నదీతీరం వెంబడో నిర్మించటం - నిత్యనైమిత్తికాలతో సతమతమయ్యే జనవాసాలకి దూరంగా - జరిగిందనేది గుర్తుంచుకోవాలి.అక్కడి భౌమాయస్కాత శక్తి ప్రసరించే దిశ మరియూ ఆ శక్తిస్థాయి యొక్క ప్రభావం గురించిన అవగాహనతో ఆ శక్తిని మానవాళికి ప్రశాంతతనీ ఆరోగ్యాన్నీ ఐశ్వర్యాన్నీ కలిగంచే విధంగా ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించారు.ఇవ్వాళ కొత్తగా వీధికొకటిగా పుట్టుకొస్తున్న పిచ్చుకగూళ్ళ లాంటి నిర్మాణాలలో ప్రశాంతత లేకపోవటానికి కారణం క్షేత్రపరంగా గానీ జ్ఞానపరంగా గానీ ఆ ప్రత్యేకతలు లేకపోవటమే!


     క్షేత్ర ప్రాధాన్యతని గమనించి ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించబడిన ప్రతి ఆలయంలో మూడు నిర్మాణాలకి అత్యంత ప్రాధాన్యత ఉంది - ముఖద్వారం పైన అంతస్థులుగా ఉండి దూరానికి కూడా ప్రస్ఫుటంగా కనిపించే రాజగోపురం,ఆలయ ఆవరణలో ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఆకాశానికి సాగినట్టు ఉండే ధ్వజస్తంభం,మూలవిరాట్టు కొలువైన గర్భగృహానికి పైన శంఖువు ఆకారంలో ఉండే విమానశిఖరం.అదనంగా ఏవి ఉన్నా లేకపోయినా ఇవి మాత్రం తప్పనిసరిగా ఉండాలి.రాజగోపురంలో ఉన్న ద్వారసముదాయాల్ని దేవతల ప్రవేశం కోసం అని చెబుతారు.కానీ వాస్తవంగా వాటి ఉపయోగం తెలియాలంటే చిన్నప్పటి సైన్సు పుస్తకాల్లో ఒక పెద్ద గాజు బీకరుకి పైనుంచి కిందకి వరసగా కన్నాలు చేసి నీళ్ళు పోస్తే ఆ నీళు ఏ ఎత్తులో ఉన్న కన్నం నుంచి ఎంత దూరానికి చిమ్ముతాయో చెప్పే ఉదాహరణని గుర్తు చేసుకోండి!నదీతీరంలో కడితే వరదల ఉధృతి నుంచీ గిరిశిఖరం మీద కడితే తుఫాను భీబత్సం నుంచీ ఆలయాన్ని కాపాడటం కోసం చేసిన ఏర్పాటు అది.ఇక ధ్వజస్తంభం అనే నిర్మాణం దగ్గిర ఏ జెండానీ ఎగరవెయ్యరు.పూర్తిగా లోహంతో గానీ కలపతో నిర్మించి లోహపు తొడుగును ఏర్పాటు చేసి గానీ నిలబేడతారు.జెండాగుడ్డలా కనబడే లోహపు కడ్డీల అమరిక ఒక్కో ఆలయానికి ఒక్కోలా ఉంటుంది.పైనుంచి చూసే దేవతలు ఈ అలయాన్ని గుర్తించడానికి ఈ ధ్వజస్తంభం ఉపయోగపడుతుంది అని చెబుతారు.కానీ ఆలయాలు విశ్వశక్తిగ్రాహకాలుగా నిర్మించినవి గనక అలాంటి శక్తిపాతం అధికంగా జరిగి ప్రమాదం సంభవించకుండా చేసిన ఏర్పాటు ఇది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్మించినవి గనకనే ఇంటికన్నా గుడి పదిలం అన్నారు మనవాళ్ళు.ఇక గర్భగృహం పైన ఉండే పిరమిడ్ ఆకారం విశ్వశక్తిని మూలవిరాట్టు మీదకి కంద్రీకరించటానికి పనికొస్తుంది. 

   వీటన్నిటికన్నా మూలవిరాట్టును లక్ష్యలక్షణసమన్వితంగా తీర్చిదిద్ది స్థాపించడం అతి ముఖ్యమైనది.కొన్ని స్వయంవ్యక్తరూపాలకి శిల్పుల అవసరం అంతగా ఉండకపోవచ్చు,కానీ అర్చామూర్తులను చెక్కడం అందరు శిల్పులూ తేలికగా చెయ్యలేరు.లలితాసాహస్రం నుంచి విష్ణుసాహస్రం వరకు ప్రతి నామానికీ ఒక సంపూర్ణమైన మూర్తిమత్వం ఉంటుంది.ఏ నామానికి ఏ మూర్తిని ఏ లక్షణాలతో ఏ రూపంలో ఏ అలంకారాలతో నిర్మించాలి అనెది తంత్రశాస్త్రంలో ఉంటుంది.తంత్రం,సాముద్రికం,జ్యోతిష్యం లాంటి అన్ని విభాగాలలోనూ పాండిత్యం ఉన్నవారు మాత్రమే అర్చామూర్తులని చెక్కగలరు!నిజానికి ఆలయమూర్తులలో ఉండేది దైవం కాదు.అగోచరమైన దైవాన్ని ఎవరూ చూసినవారూ లేరు,చూసినామని చెప్పి వర్ణించనూ లేదు.సనాతనుల కధాసాహిత్యంలో పాత్రల ముఖతా దైవసందర్శనానుభూతిని వర్ణించడం కావ్యమర్యాద ప్రకారం ఆడవాళ్ళ కళ్ళని చేపల్లాగానూ తామరపూరేకుల్లానూ ఉన్నాయనడం లాంటిదే!సనాతన ధార్మిక సంప్రదాయం తరపున ఏ చారిత్రక వ్యక్తీ నిజ జీవితంలో "నేను దేవుణ్ణి చూశాను,ఫలానా విషయం నాకు దేవుడు చెప్పాడు,కాబట్టి మీరంతా దాన్ని నమ్మి తీరాలి" అని ప్రకటించలేదు.సనాతన ధర్మంలోనే కాదు ఇతర మతాల్లో వర్ణించబడిన దైవం కూడా ఒక భావం మాత్రమే!మిగిలిన మతాలలో ఒక దైవపుత్రుడికో ఒక ప్రవక్తకో ప్రత్యేకతని ఆపాదించి అతనికి మాత్రమే కనిపించిన దేవుడు మిగిలినవారికి ఎందుకు కనిపించటం లేదు,ఆ ఒక్క మనిషి చూడగలిగిన దైవాన్ని మిగిలినవారిని చూడనివ్వకపోవటంలో ఉన్న హేతుబద్ధత ఏమిటి అనేది చెప్పకుండా తప్పించుకుంటున్న అశాస్త్రీయతతో పోలిస్తే భారతీయ సంప్రదాయంలోని ఆలయమూర్తికల్పనలో ఎంతో అర్ధం ఉంది!భాషలో ఉన్న ప్రతి పదాన్నీ చిత్రరూపంలోకి తీసుకు రావచ్చు.ఏ లక్షణాల్ని మనం నేర్చుకుని మన ప్రవర్తనలోకి తెచ్చుకుంటే జీవితం ఒడిదుడుకులు లేకుండా సుఖవంతంగా ఉంటుందో ఆ మంచి లక్షణాలకి ప్రతిరూపాలే అర్చామూర్తులు!ఆనందం-విషాదం,క్రోధం-శాంతం,వినయం-గర్వం లాంటి ప్రతిస్పర్ధి ద్వంద్వాలలో ధనాత్మకమైన లక్షణాలను ఒక వైపుకి చేర్చి చూపించడం జరిగితే దైవత్వం,ఋణాత్మకమైన లక్షణాలను అన్నింటినీ ఒక వైపుకి చేర్చితే అసురత్వం - ఇదే దైవాసుర సంపద్విభాగం యొక్క రహస్యం!ఇంకా గట్టి సాక్ష్యం కావాలంటే క్షీరసాగరమధనం కధని గుర్తు చేసుకోండి.లక్ష్మీదేవి పుట్టగానే దేవతలూ దానవులూ అమృతంకోసం మొదలుపెట్టిన పనిని వదిలేసి ఆమె వెంట పడ్డారు, "చవటాయను నేను, వాడికంటే పెద్ద చవటాయను నేను,కోమలాంగీ నన్ను కోరి వరించవే!" అని చొల్లు కార్చుకుంటూ!అయితే, ఆమె పేర్లలో "ఆర్ద్ర" అనే పేరు కూడా ఉంది కాబట్టి జాలిపడి ఆమె కూడా పరకాయించి చూసింది. గంతకి తగ్గ బొంత ఎవడో ఒకణ్ని కట్టుకుంటే పోలా అనుకోకుండా పేరుపేరునా లక్షణాల లిస్టు తిరగేసింది.ఒకడి దగ్గిర జ్ఞానం ఉందనుకుంటే పక్కనే గర్వం ఉంది.ఒకడి దగ్గిర బలం ఉందనుకుంటే పక్కనే క్రూరత్వం ఉంది.పైగా వీళ్ళందరిలోనూ తన వెనకాల ఉన్న సంపద మీద వ్యామోహం వుంది!అంతేకాదు,అసలు పని వొదిలేసి చొల్లు కార్చుకుంటూ తనవెంట పడ్డారు - కాబట్టి వీళ్ళు బుద్ధిమంతులు కానే కారు!ఆఖరుకి అవలక్సణాలు లేకుండా మంచి లక్షణాలు మాత్రమే కుప్పగా పోసినట్టు ఉండి నిశ్చలనిర్మోహనిష్కామసుందరుడైన మహావిష్ణువుని వరించి అతని పేరుకి ముందు శ్రీని చేర్చింది!

     అసలు జ్ఞానం అంటున్నది ఏదో ఒక రూపం గురించిన సమాచారమే కదా!మనకు కనబడుతున్న దాన్ని గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే జ్ఞానోపాసన,అవునా?అలాంటప్పుడు అమూర్తభావం,అభావచేష్ట,అలక్ష్యగమనం అనేవి అర్ధంలేని మాటలు,కాదా!దయానంద సరస్వతి లాంటివారి బ్రహ్మమతం విగ్రహాన్ని ఆరాధించడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తుంది, కానీ వారి మనస్సులో జరిగే ధ్యానానికి ఒక రూపం ఉంటుంది!ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం శక్తి మరియు ద్రవ్యం వేరు వేరు కాదు,అవి రెండు స్థితులు మాత్రమే అంటే నమ్ముతున్నారు కదా,ఎందుకని?అట్లాగే జ్జానం రూపం అనే జంటలు కూడా పరస్పరం సంబంధం ఉన్నవే.ఏ రకమైన జ్ఞానం అయినా ఏదో ఒక రూపం/భావం చుట్టూ అల్లుకుని ఉంటుంది - భావం అనే మాటనే వాడాను కాని అభావం కాదు,గుర్తుంచుకోండి!ప్రతి భావానికీ ఒక నామం,ఒక రూపం ఉంటాయి. సుబ్బారావు అనే పదంలో సుబ్బారావు ఉండడు,కానీ ఆ పదాన్ని చూడగానే వినగానే మీకు తెలిసినవాళ్లలో ఆ పేరుగల వ్యక్తి ఉంటే అతను తప్పకుండా గుర్తుకొస్తాడు.అదీభావ,నామ,రూపాలని ఆశ్రయించుకున్న జ్ఞానం!మీ ప్రమేయం లేకుండా పేరు చూడగానే ఆ మనిషి గుర్తుకొస్తే జ్ఞాపకం,అవసరమై పనిగట్టుకుని  పేరు ద్వారా గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే అది ధ్యానం - ఇంకా అర్ధం కాలేదా?

     ఇంత వివరంగా చెప్పినా అర్ధం కాలేదంటే మీరు ఖచ్చితంగా హేతుబద్ధతతో సంబంధం లేకుండా మొండివాదన చేసే కరుడుగట్టిన అమూర్త్యారాధకులు అయివుంటారు.ధ్యానం కుదురుగా జరగడానికి రూపం యొక్క అవసరం గురించీ ప్రవర్తనని తీర్చిదిద్దే మంచి లక్షణాల్ని అలవర్చుకోవటానికి సాధన యొక్క ప్రాముఖ్యతని గురించీ ఇంతకన్నా విపులంగా నేను చెప్పలేను!మూర్త్యారాధకులు బొమ్మలతో ఆడుకుంటూ నేర్చుకునే స్థాయిలో ఉన్న చిన్నపిల్లలు,మూర్తి అక్కరలేకపోయినా ధ్యానం చెయ్యగలిగిన మేము ఎదిగినవాళ్లం అని డప్పు కొట్టుకునేవారికి ఓక ప్రశ్న వేస్తున్నాను - సాల్వడార్ డాలీ నుంచి మొదలుపెట్టి నైరూప్య చిత్రకారులు ఎంతోమంది గైర్నికా, డాలి అటామికస్, పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమొరీ లాంటి కళాఖండాల్ని గీసింది చిన్నపిల్లల కోసమా!మీరు పంతానికి అవునంటే ఈ ఆర్ట్ గ్యాలరీల్లో గోడలకి తగిలించిన బొమ్మల్ని మోరలెత్తి చూస్తూ నచ్చిన బొమ్మని పట్టుబట్టి కోట్లల్లో వేలంపాడి కొనుక్కుంటున్నవాళ్ళు ఏమవుతారు?సాక్షాత్తూ భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పిన గీతలో గానీ ఈ రెంటినీ చర్చిస్తున్న మరెక్కడయినా గానీ అవి రెండూ వేర్వేరు దారులు అని చెప్పారే తప్ప ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అని చెప్పలేదు!ఇక బహుళదేవతారాధనకి కూడా రుచిభేదం అనే చక్కని మాటని వాడి సమర్ధించేశారు.మా ప్రవక్తగారికీ/దైవపుత్రుడికీ దేవుడు కనబడ్డాడు అంటూనే మళ్ళీ ఆ దేవుడికి ఆకారం లేదనటం,ఆయనగారు తప్ప ఇతరులు ఆ దేవుణ్ణి చూడలేరనటం,చూడటం కాదు చూడాలని అనుకున్నా నరకానికి పోతారనటం - అమూర్త్యారాదాకులకి మల్లే ఇలాంటి శతకోటి గందరగోళాలకి అనంతకోటి ఉపాయాలు వెదకాల్సిన అగత్యం సనాతనులకి లేదు గనక మానవుడు ఇహలోకంలో ప్రశాంతజీవనం సాగించడానికి నేర్చుకోవలసిన ఆదర్శాలకి మూర్తిమత్వాన్ని సాధించి అద్భుతమైన సాంకేతికతని జోడించి ఆలయాల్ని నిర్మించారు.

     ప్రాచీనకాలంలో నిర్మించబడిన ప్రతి ఆలయంలోనూ ఇప్పటివాళ్ళు కూడా సాధించలేని శాస్త్రసాంకేతికసంబంధమైన అద్భుతాలు ఉండటానికి కారణమేమిటి?ఆధునికులు అవి ఎలా సాధించగలిగారో కూడా తెలుసుకోలేకపోతున్నారే!ఎవరు అధికులు?ఎవరు అజ్ఞానులు?ఉదాహరణకి గుడిమల్లం పరశురామేశ్వర లింగం ఆకారం మానవ పురుషాంగాన్ని పోలి ఉంటుంది.సనాతన ధర్మంలోని విశిష్టత ఏమిటో తెలియని వారికి ఇందులో కొంత అసహ్యత కలగవచ్చును,కానీ స్త్రీపుంసయోగోద్భవమైన సృష్టికార్యం ద్వారా ప్రభవించిన వారు తమ జన్మకు కారణమైన వాటిపట్ల ద్వేషాన్ని గానీ అసహ్యాన్ని గానీ ప్రదర్శించటం విజ్ఞత కాదని ఆర్ష సంప్రదాయం చెబుతున్నది.ప్రకృతిలో కానవచ్చే అన్ని జీవజాతులలోనూ సహజంగా ఉన్న లైంగికద్విరూపకత పట్ల అసహ్యం దేనికి?

     ఆదిలో అగ్ని.మిత్ర,వరుణ,పశుపతి,మహామాత వంటి దేవతల్ని వర్ణించిన సనాతనులు తర్వాతి కాలంలో బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులనే త్రిమూర్తులకి అగ్రస్థానం ఇచ్చి తక్కినవారిని దేవతాగణంగా చెప్పి ప్రజలకి ఆధ్యాత్మికపరమైన సహిష్ణుతని అలవాటు చేశారు.బ్రహ్మకు పూజార్హత లేకపోవటానికీ శివునికి మూర్తిపూజ లేకపోవటానికీ భృగుశాపం గురించిన కధ ఒకటి ఉన్నది గానీ అసలైన సాంకేతిక  విషయాలు కొన్ని ఉన్నాయి,అవి తెలుసుకుంటే మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి సనాతనులు ఎంత సూక్ష్మంగా ఆలోచించారో అర్ధమవుతుంది. సనాతన ధర్మం ప్రకారం జన్మకు ప్రాధాన్యత లేదు,బ్రతుకు ఎలా గడిచింది అంతం ఎలా జరిగింది అన్నదే ప్రధానం!పూజ అని చెప్పబడే ప్రతి విధానం లోనూ రూపదర్శనం,భావస్మరణం,నామకీర్తనం ఉంటాయి.అందువల్లనే సృష్టికారకుదైన బ్రహ్మను నిత్యమూ స్మరించాల్సిన విధినుంచి తప్పించి స్థితికారకుడూ,లయకారకుడూ అయిన శివకేశవులకి మాత్రమే నిత్యస్మరణయోగ్యతని కల్పించారు.అయితే ఈ శివకేశవులకి సంబంధించి మనం చూస్తున్న అర్చామూర్తులు ఏవీ వారి నిజరూపాలు కావు.ఆ స్వామి యొక్క లక్షణాల్ని రూపంలోకి అనువదించడానికి తంత్రశాస్త్రంలో కొన్ని సాంకేతిక నియమాలు ఉన్నాయి.రెండూ కేశవ రూపాలే అయినా పద్మనాభ మూర్తికీ హిరణ్యగర్భ మూర్తికీ చాలా తేడా ఉంటుంది.అలా తంత్రశాస్త్రంలో చెబ్బబడిన నిర్దేశాలు తెలిసిన శిల్పవేత్తలు మాత్రమే ఆలయ అర్చామూర్తులని శిల్పాలుగా రూపొందించటానికి అర్హులు!ఇందులో స్థితిని సూచించటం తేలికగానే కుదురుతుంది గానీ లయాన్ని దృశ్యరూపంలోకి తీసుకురావటం దాదాపు అసాధ్యం.అదీ గాక మనం చూస్తున్నది లయకారకుణ్ణి అనగానే చూసేవారిలో భక్తికి బదులు భయం కలిగే ప్రమాదం ఉంది!అందుకే శివుడికి లింగరూపాన్ని ప్రత్యామ్నాయంగా చూపించారు.


     ఈ లింగానికీ పురుషాంగానికీ ఏ సంబంధమూ లేదు.కానీ పైకి పొడుచుకొచ్చేలా ఉన్న లింగాకారాన్నీ అభిషేక జలం పోవటానికి అడుగిన ఏర్పాటు చేసిన దొప్పలా ఉన్న పానపట్టాన్నీ ఉన్నది ఉన్నట్టుగా చూసి తాము చూసిందే నిజం తమకి అర్ధమయిందే జ్ఞానం అనుకునే కొందరు అలా భావించి వాటినే ఖాయం చేసేశారు.కానీ ఆ రూపానికి లింగం అని తొలిసారి ప్రతిపాదించిన వారికి శిశ్నం అనే పదం తెలియదా?ఇప్పుడు మనం భావిస్తున్న న్యూనత వారికి లేనప్పుడు ఏకంగా శివశిశ్నం అనే పదాన్ని వాడకుండా శివలింగం అని ఎందుకు వ్యవహరించారు?ఇప్పుడు మనం ఆలయాలలో చూస్తున్న లింగరూపాన్ని ప్రకృతిలో చూడాలంటే పొగరాకుండా నిశ్చలంగా వెలుగుతున్న జ్యోతి యొక్క పైభాగంలో కనిపిస్తుంది!లింగోద్భవ సమయంలో శ్రీమహావిష్ణువుకీ,బ్రహ్మదేవునికీ గోచరించినది ఆదీ అంతమూ తెలియని జ్వాలాస్తంభమే తప్ప శివుని దేహభాగం కాదు.చీకట్లని దహించే అగ్ని రాగద్వేషాల్ని దహించే జ్ఞానానికి చిహ్నం!జఠరాగ్ని అనేది రగులుతున్నంతకాలం మాత్రమే బ్రతికి ఉందే జీవుడు కూడా జ్ఞానరూపుడే - శివోహం!


     సర్వసామాన్యంగా శివకేశవులకి సంబంధించిన ప్రతి ఆలయంలో అర్చామూర్తి అయితే శివరూపంలో గానీ లేకపోతే కేశవరూపంలో గానీ ఉంటుంది.ఒకరు అర్చామూర్తిగా ఉంటే మరొకరు క్షేత్రపాలకులుగా ఉండటం కూడా జరుగుతుంది.కానీ కొన్నిచోట్ల మాత్రం పూజార్హత లేని బ్రహ్మను కూడా కలుపుకుని త్రిమూర్త్యాత్మకమైన మూలవిరాట్టు కొలువై ఉన్న విశిష్టమైన క్షేత్రాలు ఉన్నాయి.కేశవ క్షేత్రాలలో అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి శివ క్షేత్రాలలో గుడిమల్లం పరశురామేశ్వర స్వామి అలాంటి త్రిమూర్త్యాత్మక రూపంలో వెలిసి ఉన్నారు.


     చాలామటుకు ఆలయాలు ప్రశాంతను కోరి ప్రార్ధించటం కొరకే నిర్మించబడినా కొన్ని ఆలయాలలో ప్రత్యేకమైన వాంచితార్ధపూజలూ దోషపరిహారపూజలూ ఉంటాయి.పరిహార పూజలకు తప్పనిసరిగా బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి.ఈ దానం ద్వారా మన దోషాన్ని వారు గ్రహిస్తారు.వాంచితార్ధపూజలలో అశీర్వచనాలు పలికే బ్రాహ్మణులకి వాక్సుద్ధి ఉండాలి.ఇవి జరిపించే వారు ఆధ్యాత్మికంగా శక్తిసంపన్నులైన ఉపాసకులు అయివుండాలి గనక అన్ని ఆలయాలలోనూ వీటిని నిర్వహించటం కుదరదు.ఆయా పూజలు వాటికి ప్రముఖమైనవిగా చెప్పబడుతున్న ఆలయాలకే వెళ్ళి చెయ్యాలి.ఈ ప్రత్యేకపూజల్లో వాటి ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి చూడగా వివాహప్రాప్తి.సంతానయోగం,సర్పదోషనివారణ,రాహుకేతుగ్రహపీడ,ఐశ్వర్యప్రాప్తి వంటివి ఉన్నాయి.ఐశ్వర్యప్రాప్తి కోసం పూజలు చెయ్యగానే లాటరీలో లక్షలు వస్తాయనే గ్యారెంటీ ఎవరూ ఇవ్వరు - కోరుకుంటున్నది న్యాయమైన కోరిక,అదీ దేవుణ్ణి కాబట్టి కోరిక నెరవేరుతుందనే నమ్మకం ప్రశాంతమైన మనస్సుతో ప్రయత్నించేలా చేస్తుంది, అంతే!వీటిల్లో ఎక్కడా పరలోకం గురించిన వాగ్దానాలు గానీ బెదిరింపులు గానీ లేకపోవటాన్ని గమనిస్తే సనాతన ధర్మం ఇహలోకపు సౌభాగ్యాల్ని సాధించటానికే పెద్దపీట వేసిందని తెలుస్తుంది.

     వ్యక్తిగతంగా నాకుకూడా పరలోకం గురించిన చింతన వ్యర్ధం అనిపిస్తుంది."కోరు ఇట రాజభోగాల గోటు ఒకడు,ఒకడు పరలోకమందలి సుకము కోరు.అందరానట్టి దానికై ఆశపడక చేతచిక్కిన చిల్లర స్వీకరించు;దూరతీరాల మ్రోగు దుందుభిని వినిన తీరునా ఆశ - ఉవ్విళు లూరినంత!" అన్న అఖండప్రజ్ఞానిధి ఉమర్ ఖయ్యాం చెప్పినది అక్షరసత్యం!ఇక్కడ లేనిది ఎక్కడా లేనిదే!కంటికి కనిపించనిదాన్ని నమ్మడం అనవసరమే, కనిపించినదాన్ని గురించి నిజానిజాలు తెలుసుకుంటే చాలు అనేది సనాతన ధర్మం ఢంకామీద దెబ్బకొట్టి చెప్తున్న సత్యం!ఏది సత్యమైనది అవుతుందో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనది అవుతుందో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

Wednesday, 10 August 2016

ఆంధ్రా పొలిటీషియన్ల బుర్రల్లో మట్టి ఏమైనా పెట్టాడా దేవుడు?14వ ఆర్ధికసంఘం లిస్టులో ఉన్న అన్ని రాష్ట్రాలకీ సాయం దక్కింది - ఆంధ్రకు తప్ప,ఎందుకు?

         "14వ ఆర్ధికసంఘం నివేదిక నవ్యాంధ్రను వనర్ల లోటు విషయంలో ప్రత్యేకరాష్త్రంగా ఎప్పుడో గుర్తించింది.2015 నుంచి 20202 వరకు గల అయిదు ఆర్ధిక సంవత్సరాల్ల్లో ప్రతి సంవత్సరమూ నవ్యాంధ్రకు వనరుల కొరత ఏర్పడుతుందని చెప్పింది.ఆ అయిదేళ్ళలో మొత్తం 11 రాస్ట్రాలకు 1,94,821 కోట్లను ఆర్ధికలోటుగ్రాంటుగా విడుదల చేయాలని సిఫార్సు చేసింది.ఈ 11 రాష్ట్రాల్లో అస్సాం,బెంగాల్ మొదటి రెందు సంవత్సరాల్లొనూ కేరళ మూడవ సంవత్సరంలోనూ మేఘాలయ నాల్గవ సంవత్సరంలోనూ లోటునుంచి బయటపడతాయని చెప్పింది.మధ్యలోనే సహాయం నిలిపివెయ్యదగిన ఇవి కాకుండా మిగిలిన ఏడు రాస్ట్రాలు - ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్, త్రిపుర మాత్రమే ఆ అయిదు సంవత్సరాల పాటు ఆర్ధికలోటుతో ఉంటాయని చెప్పింది.ఈ ఏడింటిలో ఆంధ్రప్రదేశ్ మినహాయించి మిగిలిన అన్ని రాష్త్రాలూ ఇప్పటికే ప్రత్యేకహోదాని పొందుతూ ఉన్నాయి!

     అంతేకాక, ప్రత్యేకహోదాను పొందుతున్న అస్సాం,సిక్కిం,మేఘాలయ,అరుణాచల్ ప్రదేశ్,ఉత్తరాంచల్ కూడా 2019-2020 నాటికి నిధుల కొరతను అధిగమిస్తాయి.కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అప్పటికి కూడా నిధుల కొరతను ఎదుర్కొంటూనే ఉంటుందని కూడా చెప్పింది.వీటన్నింటిలో అయిదవ సంవత్సరం నాటికి కూడా నిధుల కొరతను ఎదుర్కొనే దిక్కుమాలిన రాష్త్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని నిర్ద్వందంగా తేల్చి చెప్పడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్ధికలోటుగ్రాంటుగా 22,113 కోట్లు విదుదల చెయ్యటానికి సిఫార్సు చేసింది.

     ఏ 14వ ఆర్ధికసంఘం తనకి చెయ్యాలని తపన ఉన్నా ఆంధ్రకు సాయం చెయ్యడానికి అడ్డం పడుతున్నదని చెప్తున్నదో ఆ 14వ ఆర్ధికసంఘం సిఫార్సులే ఎవరి అభ్యంతరాల్ని లెక్క చెయ్యకుండా ఆంధ్రకు సహాయం చెయ్యమని చెబుతూ ఉంటే,పాత ప్రధాని సభలో చేసిన ఎందుకూ పనికిరాని వాగుదానంతో సంబంధం లేకుండానే ప్రత్యేకహోదా కల్పించి ఇతోధిక సహాయం చెయ్యవచ్చు కదా"

     అయినా సరే ఆ ఒక్కటీ అడక్కు అని చెవిలో పువ్వు పెడుతున్నట్టు కాదనదానికి కారణాలు వెతుకుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ప్రయోజనాల్ని దెబ్బతీసుకుంటూ కేంద్రంలో తన పార్టీవాళు మంత్రులుగా ఉన్నా న్యాయంగా రావలసిన నిధులు కూడా తెచ్చుకోలేని దద్దమ్మగా చంద్రబాబుని నిలబెట్టడం ద్వారా కాంగ్రెసుకి వూపిరి పోస్తూ ఉంటే దేశంలోపల ఉన్నవాళ్లకన్నా దేశం బయట ఉన్నవాళ్ళని ఎక్కువగా మెప్పించగలిగిన వారి ప్రపంచస్థాయి ప్రధానమంత్రి ఆశిస్తున్న కాంగ్రెసు రహిత భారత్ ఎట్లా వస్తుందో భాజపా వారికే తెలియాలి!ఇప్పుడు బిల్లులో లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అంటున్నవారు అప్పుడు బిల్లులో ఉంచాలని ఎందుకు పట్టుఓట్టలేదు?ఇపుడు తమరే అధికారంలో ఉన్నారు గదా, ఆ బిల్లును ఎందుకు సవరించడం లేదు?అయినా సరే భాజపా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నుయాయం చెయ్యడం లేదంటే విభజన బిలుని ఒపుకునే సమయంలోనే ఈ రెండు పార్టీలూ ఒక రహస్య అవగాహనకు వచ్చి ఉండకపోతే కాంగ్రెసును తిరిగి బతికంచడానికి ఎందుకు ఆపసోపాలు పడుతున్నది బీజేపీ?

    నిద్రపోతు రాహుల్ అధ్యక్షుడుగా ఉన్నా కాంగ్రెసు బలపడుతున్నదంటేనూ,ముఖ్యంగా ఆంధ్రాలో కాంగ్రెసుని బతికించటానికి స్వయంగా బీజేపీయే ఇంత గట్టిగా కృషి చేస్తూ ఉండటం చూస్తూ ఉంటేనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదియ్యటానికి ఉత్తరాది రాజకీయ లాబీయింగ్ కారణమని బలంగా అనిపిస్తున్నది నాకు!ఈ రెండు పార్టీలూ తెర వేనక ఉండి ఆడించిన ఉత్తరాది మోనాపలిస్టుల కనుసన్నల మేరకు జరిగిందనేదానికి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు సాక్ష్యాధారాలని చూపిస్తున్నాయి!ఉత్తరాది లాబీయింగ్ అనే మాటని మొదటిసారి విన్నప్పుడు నేనూ నమ్మలేదు.కానీ నా రీసెర్చిలో కొన్ని విషయాలు తెలిశాక నమ్మక తప్పడం లేదు.ఆర్య,ద్రావిడ సిద్ధాంతాన్ని కమ్యూనిష్టు ధాపర్ ప్రచారంలోకి తేవడానికి ముందునుంచే మన శాస్త్రాలలోనే "వింధ్యకి ఎగువన ఉన్నత తరగతికి చెందిన ఆర్యులు ఉంటారు,వింధ్యకి దిగువన మిశ్రమ జాతులు ఉంటారు" అనే సూత్రీకరణలు ఉన్నాయి,గమనించే ఉంటారు!జకీర్ నాయక్ పోష్టుకి సంబంధించిన విషయసేకరణలో నేను స్వయంగా చదివాను.మన దేశపు చరిత్రకి సంబంధించిన ఒక చిత్రమైన విషయం: గుప్తులూ, మౌర్యులూ వింధ్యకి ఇవతలివైపుకి రానేలేదు,అధవా వచ్చినా కొద్దికాలం మాత్రమే అతి తక్కువ ప్రాంతాన్ని పరిపాలించారు.కానీ శాతవాహనులలో మొదటి వాదైన శ్రీముఖుడి నుంచి చివరి రాజు వరక్కొ సుమారు 600 సంవత్సరాలు ఈశాన్య రాష్ట్రాల్నీ కాశ్మీరునీ మినహాయించి సెంట్రల్ ఇండియా అని చెప్పదగిన భూభాగాన్ని ఏకచ్చత్రాధిపత్యంగా పరిపాలించారు.కేవలం రాజధాని వింధ్యకి దక్షిణాన ఉండటం అనే ఒక్క కారణంతో వీరిని దక్స్జిణాదికి చెందిన స్థానిక రాజవంశం అని మాత్రమే మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటూ పెరిగాము.దేశంలో శాలివాహన శకాన్ని ఎక్కువగా వాడటమే వీరి సుదీర్ఘమయిన మరియూ విస్తారమయిన వైభవానికి సాక్ష్యం!రాజధాని వింధ్యకి అవతలివైపున ఉంటే వారు మొత్తం దేశానికి చెందినవారుగానొ,రాజధాని వింధ్యకి ఇవతలివైపున ఉంటే వారు స్థానికులు ఎలా అవుతారు?ప్రస్తుతానికి వస్తే జిలేబీ బ్లాగులో కొంతకాలం క్రితం 2022 తర్వాత మోదీ మధ్యంతరంగా దిగిపోయి దక్షిణాదికి చెందిన వ్యక్తి ప్రధాని అవుతాడనే జోస్యం గురించి వచ్చింది - గుర్తుందా?మన రాజకీయ నాయకులు కూడా ఇలాంటివాటిని నమ్ముతారని మీకు తెలియనిదా!అలాంటి అవకాశం జాతీయస్థాయిలో అందరికీ తెలిసిన చంద్రబాబుకి మాత్రమే ఉన్నది, అవునా కాదా?బహుశా తనని సంహరిస్తాడని అనుకుంటున అష్టమ గర్భాన్ని ముందు తనే చంపేస్తే తనకి చావు ఉండదన్న కంసుడి లాజిక్ కాంగ్రెస్ మరియూ భాజపా పార్టీల్లో ఉన్న ఉత్తరాది నేతలకి కామన్ మోటివ్ అయి వారికి ఈ దుర్మార్గపు విభజన పరిష్కారంగా కనిపించి ఉండవచ్చును - ఆలోచించండి!లేనిపక్షంలో ఆంధ్రకి సాయం చేస్తేనే గానీ ఆంధ్రలో వోట్లు పడవని తెలిసినా మొండిగా వ్యతిరేకించడానికి సహేతుకమైన కారణం యేదీ లేదు.చంద్రబాబుకి రాష్ట్రం లోపలే సమస్యల్ని సృష్టించి జాతీయ రాజకీయాల వైపుకి చూడనివ్వకుండా ఉండటమే కాంగ్రెసుకీ,భాజపాకీ,తెరాసాకీ ఇవ్వాళ ఉన్న కామన్ ఎజెండా!అందువల్లనే విభజన బిల్లులో లేనివాట్ని బిల్లులో లేవు గాబట్టి చెయ్యలేకపోతున్నాం అంటూ విభజన బిల్లులో ఉన్న ఏ సమస్యనీ సర్ధుబాటు చెయ్యకుండా జాగు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. 2014 ఎన్నికల్లోనే భాజపా ఎక్కువ సీట్లు అడిగి అక్కడ తొట్టిగ్యాంగ్ అబ్యర్ధుల్ని నిలబెట్టింది.నేను అప్పుడు ఓక పోష్టు కూడా వేశాను.బాబు తెలివిగా అఖరు నిముషాలో ఎలర్ట్ అయి జాగ్రత్త పడకపోయి ఉంటే తెదెపా పరిస్థితి మరోలా ఉండేది!అడిగినవాళ్ళు ఒకందుకు అడిగారు,ఇచ్చినవాళ్ళు ఒకందుకు ఇచ్చారు - ఆంధ్రావాళ్ళు అమాయకంగా బలయ్యారులేని పక్షంలో 14వ ఆర్ధికసంఘం ఆంధ్రపరదేశ్ రాష్ట్రంతో కలిపి  చెప్పిన అన్ని రాష్ట్రాలకీ సహాయాలు అందుతూ ఉందగా ఒక ఆంధ్రప్రాదెశ్ దగ్గిరకి వచ్చగెసరుకి మాత్రం "ఆంధ్రకి ఇస్తే వాళ్ళూ డ్డుకుంటాతు,వీళ్ళు పోటీ పడతారు" అనే చెత్త కారణాలు ఎందుకు చెబుతున్నట్టు?

     ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు బీజేపీ నాయకులు ఎందుకింత బభ్రాజమానాలలాగ ఉంటున్నారో, రెండేళ్ళ క్రితం నాటి గెలుపు మత్తు ఇంకా దిగలేదనుకుంటాను బీజీపీకి!వెంకయ్యనాయుడు తప్ప ఇవ్వాళ మోదీని గౌరవంగా తల్చుకునేవాడు లేడు.మంత్రులు ఇంట్లో ఉన్న పెళ్ళానికి ఫోను చేసుకోవాలన్నా ఏ ప్రెస్ క్లబ్బుకో పోయి జర్నలిస్టు ఫ్రెండు ఫోనుతో బాత్రూములకి పోయి మాట్టాడుకుని రావల్సిన దుస్థితిలో నడుస్తుంది కేంద్రప్రభుత్వం.ప్రపంచమంతా తిరిగి డప్పులు వాయించినా చప్పట్లు తప్ప పిక్కలు రాలేదు.ఏం చూసుకుని విరగబడుతున్నారో అర్ధం కావటం లేదు!మోదీ కన్నా చంద్రబాబే మెరుగు బహిరంగ సభల్లో చప్పట్లు కొట్టించుకుని వుత్తచేతుల్తో తిరిగిరాకుండా వ్యాపారస్థుల్ని ఆకర్షించి M.O.Uలు సాధించి ధీమాగా ఉన్నాడు.మోదీ హడావిడికి చప్పట్లు కొట్టినవాళ్ళలో పెట్టుబడులు పెట్టగలిగినవాళ్ళు ఎంతమంది ఉంటారు?బీజేపీ వాళ్లలో ఈరకమైన ఈర్ష్య ఏమయినా పనిచేస్తున్నదా?

     కేంద్ర పధకాల్లో 90% లాంటి తక్కువ మేఎలు కోసం అంగలారుస్తూ అఘోరించహ్డం దేనికి?పన్నుల్లో రాయితీలు సాధించడం,లోటుబడ్జెట్ భర్తీ చేయంచుకోవడం లాంతి పనికొచ్చే వాటికోసం ఆందోళన చేస్తే చెప్పుకోవడానికయినా గొప్పగా ఉంటుంది కదా!తల్లి,పిల్ల కాంగ్తెసులు కూడా మాటిమాటికీ "మంత్రుల్ని వెనక్కి తీసుకో,కేంద్రప్రభుత్వం నుంచి బయటికొచ్చేయ్" అని వాగటం,మొగవాని కూనిరాగం లాంటి పనికిరాని ప్రత్యేకహోదా చుట్టూ గొడవలు చెయ్యకపోతే రాష్త్రానికి నిజంగా మేలు చెయ్యగలిగిన పద్ధతిలో వెళ్ళి చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు కదా!అంత గట్టిగా ఆర్ధిక సహాయానికి సంబంధించిన అంశాలు ఉన్న బిల్లుని ప్రైవేటు బిల్లుగా పెట్టడం దేనికి?పెట్టినవాళ్ళు కీలకమయిన సమయంలో వాకౌట్ చెయ్యడం ఏంటి?అసలు వీళ్ళ మెడడులో మట్టి మాతర్మే కాకుండా పేడ ఏమయినా కూరాడా?ఆ రోజున తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ ఇస్తామని వాగుదానం చేసినప్పుడు వూరుకుని అంతా సిద్ధం అయ్యాక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని వీరంగాలు వేసింది వీళ్ళు కాదా?విభజన వల్ల నష్టపోయే సీమాంధ్రకు మంచి ప్యాకేజీ ఇస్తాం అడగండని పబ్లిక్ స్టేట్మెంటు కూడా ఇచ్చినప్పుడు మాకు ప్యేకేజీలు అఖ్ఖర్లేదని తెంపరించింది వీళ్ళూ కాదా?కొందరు బుధిమంతులు ముందుకొస్తే వాళ్లని కూడా నోరు మూయించి అల్లరి చేసింది వీళ్ళు కాదా?అప్పుడు తెలివిగా ఆలోచించి రాష్త్రానికి ఎంతోకొంత మేలు చెయ్యగ;లిగిన రోజున ప్రజల్ని గందరగోళంలో పడేసి హాని చేసిందీ వీళ్ళే!ఇప్పుడు మౌనంగా ఉండటం ద్వారా  రాష్త్రానికి కొంతయినా మేలు చెయగలిగిన ఈరోజున మళ్ళీ గందరగోళం సృష్టించి హాని చేస్తున్నదీ వీళ్ళే!ఓట్లు వెయ్యడం కాదు,కనిపించినవాణి కనిపించినట్టు తన్ని మూలకూర్చోబెట్టేవరకు వీళ్ళు ఇట్లాగే రెచ్చిపోతారా?

    కేంద్రం నుంచి తెలంగాణకూ సహాయం అందుతున్నది.వెనకబడిన జిల్లాల్లో పరిశ్రమలు పెట్టేవాళ్ళకి లాభాలపై కట్టే 15% పన్ను రాయితీ కల్పిస్తూ కేంద్రప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.తెలంగాణలో హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్ని వెనకబడిన ప్రాంతాలుగా ఈ నోతిఫికేషన్ ద్వారా గుర్తించారు. అసలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కీలస్థానంలో ఉన్న చంద్రబాబు ప్రవర్తన కూడా చాలా ఆనుమానాలని పుట్టిస్తునది!మొదట మాటిమాటికీ "విభజన అన్యాయంగా జరిగింది, నేను సమన్యాయం చెయ్యమన్నా గానీ ఎవరూ విన్లేదు" అనే సోదిని ఆపివెయ్యాలి.విబజనలో తన ప్రమేయం కూదా ఉంది గనక, అన్యాయాన్ని ఆపలేకపోయాడు గనక అది తన అసమర్ధతనే బయటపెట్టుకున్నట్టు అవుతుంది.పైగా ఆ గాయాన్ని మాన్పి నేను అన్నిట్నీ సాధించగలను అని ధీమాగా ఉండి ప్రజల్ని ముందుకు నడిపించాల్సిన ముఖ్యమంత్రి పదేపదే దాన్ని కెలకడం వల్ల ప్రజలకి విసుగు పుడుతుంది - విసుగు చిరాకుగా,చిరాకు కోపంగా మారితే తనకే నష్టం!అన్నిసార్లు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రిని  విభజన సమస్యల్ని పరిష్కరించుకుందాం రమ్మని పిలిచినా అతను కనీసం వస్తానూ రానూ అని కూడా చెప్పలేదంటే దానర్ధం ఏమిటి?అతను నిన్నొక గొట్టాంగాడిలా చూస్తున్నాడు!మొదటిసారి అడిగి రెస్పాన్స్ రానప్పుడే అది అర్ధం చెసుకుని నోరు మూసుకుని ఉండాల్సింది - సలహాలకీ సంప్రదింపులకీ పంతుళ్ళనీ,జోస్యుల్నీ కాకుండా కాస్త లోకజ్ఞానం ఉన్నవాణ్ణి ఎవణ్ణన్నా పెట్టుకుని ఉంటే విడమర్చి చెప్పి ఉండేవాడు!14వ ఆర్ధిక సంఘం షాయం చెయ్యమని చెప్పిన రాష్ట్రాల లిస్టులో ఉన్న మిగిలిన రాష్ట్రాలే కాకుండా విభజన వల్ల ఒకేసారి ఏర్పడిన రెండు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ కూడా సాయం అందుకున్నాక కూడా ఆంధ్రప్రదేశ రాష్ట్రం అనాధలాగ ఉండిపోవటానికి బాధ్యతని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాత్రమే తీసుకోవాలి.రాజధానికి సాయం అంటే లోటుబడ్జెట్ ఉన్నవాడు పొదుపుగా ఒక నాలుగు బిల్డింగులు గబగబా కట్టుకుంటాడని అనుకుంటారు గానీ నువ్వు గభాల్న ప్రపంచస్థాయి రాజధాని అని ఎత్తుకుని కేంద్రం సాయం చెయ్యడం లేదంటే ఎట్లా?పొయ్యిలో పిల్లి లేవనివాడు మీసాలకి పూసుకునే సంపెంగ నూనె కోసం అప్పడిగితే నవ్వరా!నీ బుర్రలో పుట్టిన అయిడియాకి ఖర్చూ నువ్వే తెచ్చుకోవాలి - అదే సమర్ధత అంటే!నలుగురు మంత్రుఒని వాళ్ల ప్రభుత్వంలో ఉంచి నీకు న్యాయంగా చెయ్యాల్సిన సాయం కోసం అంతగా దేబిరించాల్సిన ఖర్మ యేమిటి?విభజన సమస్యల్ని పరిష్కరించికోవాల్సిన అవసరం తెలంగాణ ముఖ్యమంత్రికి లేదా?నీకు వాళ్ళ దగ్గిర విలువంటూ ఉండి చూపించడానికి నీకు దమ్ముంటూ ఉండిఉంటే ఒక్కసారి అడగ్గానే వాళ్ళు స్పందించి ఉండేవాళ్ళు.రాష్ట్రానికి ఎప్పుడో రెండేళ్ళ క్రితం జరిగిన అన్యాయానికి సంబంధించిన ఏదుపు ఆపి పౌరుషం తెచ్చుకోవాలసిన చారిత్రక సందర్భం ఇది - సన్నాయి నొక్కులు ఆపి శంఖం పూరించు.బస్తీమేసవాల్ అని తొడగొట్టి రంగంలోకి దిగిన వస్తాదుకే ఇవ్వాళ ఫ్యాన్లు ఉంటారు.ఏడుస్తూ మూలుగుతున్నవాణ్ణి ఎవరూ పట్టించుకోరు.


తాగడానికి డబ్బివ్వలేదని తల్లిని నరికిన తనయుడు కూడా చంద్రబాబు కన్నా సమర్ధుడే!

Wednesday, 3 August 2016

ఈ ఆంధ్రద్వేషపండితప్రకాండులు నోటికి తింటున్నది అన్నమా,గడ్డియా లేక మరొకటా?

     "మీ రెండు రాష్ట్రాల మధ్యనా ఎందుకింత అసహనం?ఈ విషయం మాకు అర్ధం కావడం లేదు!" - తెలంగాణ, స్టేట్ మరియూ ఆంధ్రప్రదేశ్ రాష్త్రం యొక్క ప్రతినిధుల్ని ఉద్దేశించి సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య ఇది!సందర్భం బాబ్లి ప్రాజెక్టుకి సంబంధించిన నదీజలాల పంపిణీ విషయానికి సంబంధించి ఏర్పడిన కమిటీలో విభజన వల్ల తెలంగాణని కూడా కొత్త మెంబరుగా చేర్చడం విషయంలో ఆంధ్ర ఏమో తెలంగాణని చేర్చమని అంటుండగా తెలంగాణ ఏమో ఆంధ్రని తొలగించమని కోరడంలో ఉన్న ఔచిత్యం యేమిటో ఆయనకి అర్ధం కాలేదట!

     కమిటీలో ఏపీ కొనసాగింపుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడంపై స్పందిస్తూ, "ఆంధ్రప్రదేశ్ సమస్య మీతో కాదు,మిమ్మల్ని కూడా కమిటీలో చేర్చమని కోరుతోంది - అయినా మీరు ఏపీని తప్పించాలని ఎందుకు కోరుతునారు?" అని జస్టిస్ ఠాకూర్ ప్రశ్నించారు.గౌరవనీయులు కాబట్టి హుందా అయిన భాషలో ప్రశ్నించారు,కానీ అసలు అర్ధం "ఆంధ్రా కమిటీలో ఉంటే నీకేంటి నెప్పి?నోర్మూసుకుని నీళ్ళలో నీ వాటా నువ్వు తీసుకుపో!" అని మొట్టికాయలు వేసినట్టు:-)

     "గోదావరి అంతర్రాష్ట్ర నది.దిగువ రాష్ట్రాలకూ ప్రయోజనాలు ముడిపడి వుంటాయి.బాబ్లీ నుంచి నీరు కిందకి ప్రవహిస్తుంది గాబట్టి దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆందోళన పడటం సహజం.ఈ కమిటీలో తెలంగాణను చేర్చాలని ఏపీ కోరుకుంటున్నది.ఈ కమిటీ నుంచి ఏపీని తొలగించాలని తెలంగాణ కోరుకుంటున్నది.ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎందుకింత అసహనం ఉందో మాకు అర్ధం కావడం లేదు.బాబ్లీ ప్రాజెక్టుపై గతంలో సుప్రీం కోర్టు ఒక కమిటీని నియమించింది.కోర్టు విధించిన పరిమితుల మేరకు ఈ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్ర నీటి వాడకం  జరిపేలా పర్యవేక్షించడమే ఈ కమిటీ పని.ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రెండూ కలిసి మహారాష్ట్రపై నిఘా వెయ్యవచ్చు.మహారాష్ట్ర తనకు కేటాయించిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుకోకుండా నిరోధించవచ్చు.ఆంధ్ర,తెలంగాణ రెండూ ఈ కమిటీలో ఉంటే ఇద్దరికీ లాభమే" అని చెప్తూ జస్టిస్ ఠాకూర్ తాం తుది తీర్పును వెలువరించారు.

     అయితే,తెలంగాణ తరపు న్యాయవాదులు మాత్రం తమకు మహారాష్ట్రతో అసలు సమస్యలే లేవనీ,వారికి ఆంధ్రప్రదేశ్ కమిటీలో ఉందటమే సమస్య అనె బల్లగుద్ది చెప్పి ఉన్నారు.రకరకాల తింగరి వాదనలు వినిపించినాక ఆఖరికి ఈ ప్రాజెక్తు వల్ల ఏపీకి న్యాయంగా వచ్చేది 1 TMC మాత్రమేనని లెక్కలు గట్టి "ఇంత చిన్న ప్రాజెక్టుపై కమిటీలో కూడా ఆంధ్రప్రదేశ్ ఉండటం తగదు" అని నీతులు చెప్తూ ఇప్పుడు ఏపీని తొలగించకుంటే తాము వేరే కేసు దాఖలు చెస్తామని అంటున్నారు.

     అంటే,తాము ఎక్కడుంటే అక్కడ ఆంధ్ర ఉండకూడదు.ఉంటే ఇబ్బందిగా ఉంటుంది,అక్కడినుంచి ఆంధ్రని తొలగించేవరకు విశ్రమించం అని కరాఖండిగా తేల్చేశారు - ఒకప్పుడు "మేం ఎగువన ఉంటం,మీకు నీళ్ళు బందు జేస్తం" అన్న వీరి రాకాసి ముఖ్యమంత్రి నీచపు హెచ్చరికని కార్యరూపంలోకి తీసుకొస్తున్నారు తెలంగాణ ప్రభుత్వాధికారులు.ఒక ప్రాంతం మీద,ఒక ప్రాంతం ప్రజల మీద ఇంత ద్వేషం ఉన్న వాళ్ళు ఏనాడైనా పైకొచ్చినట్టు దాఖలా ఉందా చరిత్రలో!మటిగొట్టుకు పోయే కాలం దాపరించిన వాళ్ళు మాత్రమే ఇంత బరితెగించి పబ్లిక్ డయాస్ మీద ఇంత అధమస్థాయిలో మాట్లాడగలరు!ఈ వార్తని గానీ విషయాన్ని గానీ కేవలం తెలుగువాళ్ళు మాత్రమే కాదు,ఇంగ్లీషు పేపర్సులో వేస్తే ప్రపంచంలో ఇంగ్లీషు వచ్చిన ఏ దేశీయుదైనా చదువుతాడే - వీళ్ళ తెలివితేటల్ని చూసి ఎంతమంది ఎన్నిరకాలుగా నవ్వుకోవొచ్చో అన్నిరకాలుగానూ నవ్వుకుంటూ ఉంటారేమోన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా వీళ్ళకి?నవ్వుకోవడానికి పనికొచ్చే అతితెలివి తప్ప సీరియస్ కంటెంటు ఉందా వీళ్ళ యేడుపులో!ముఖం మీద ఉమ్మేసి చెప్పితే గానీ అర్ధం కాదా?

     తమ రైతుల కోసం చుక్కనీటిని కూడా వదలరట,ఆంధ్ర కి మాత్రం ఈ ఒక్క టీయంసీ నీటికి ఆశపడవద్దు అని నీతులు చెప్పటం!అసలు పొరుగు రాష్ట్రం యొక్క నీటి అవసరాల గురించిన లెక్కలు చెప్పే అధికారం వీళ్ళకి ఉందా?తన రాష్ట్రానికి ఎంత నీరు వాటాగా వస్తుంది,ఎగువ రాష్ట్రం తనకి న్యాయమైన వాటాని వదుల్తుందా ,దిగువ రాష్ట్రం ఎక్కువ అడుగుతున్నదా అన్ చూసుకుని మూసుకుని కూర్చోకుండా ఏపీ గురించి ప్రస్తావన అయినా ఎందుకు చెస్తున్నది?ఏపీ కమిటీలో ఉందాలా అక్కర్లేదా అని మాట్లాడాలసిన అవసరం తనకేంటి?అసలు ఒకనాటి సమైక్య  రాష్త్రంలో "బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి నష్టం జరుగుతున్నది,మహారాష్ట్ర అన్యాయంగా ఎత్తు పెంచేస్తునది,ఆంధ్ర పాలకులు వివక్షతోనే పట్టించుకోవటం లేదు" అని అల్లాడిపోయినవాళ్లకి హఠాత్తుగా తమ నీళ్లని దోచుకునే అవకాశం ఉన్న మహారాష్త్ర మిత్రుడై తాము అన్యాయం చేస్తే అల్లాడిపోవటమే తప్ప తమకు అన్యాయం చెయ్యలేని దిగువ రాష్ట్రమైన ఏపీ సమస్య ఎప్పుడు ఎందుకు అయ్యింది?మహారాష్ట్రకి తమ ఇష్టానుసారం నీళు వాడుకునే స్వేచ్చ ఇచ్చ్గేసి తను కూడా ఇష్టానుసారం ప్రాజెక్టులు ఎగాదిగా కట్టేసి కాంట్రాక్టర్లని బాగుచెయ్యాలనే దురద తప్పిస్తే ఎగువ రాష్ట్రం మంచిదవటానికి మరో కారణం ఉంటుందా?

     తమకి ప్రత్యేకంగా నష్టం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ కమిటీలో ఉంటే వీళ్ళకి ఇబ్బంది యేమిటి?ఇదొక్కటే అయితే,సాంకేతికమైన వాదనలు మనకి పూర్తిగా తెలియవు గాబట్టి ఓకే!కానీ రెందేళ్ళ పైన హైదరాబాదులోనే ఉన్నారు గదా,ఫైళ్ళు అడిగి తీసుకోలేకపోయినారా!ఎంత శత్రుత్వం ఉన్నవాడయినా తన ఇంటినుంచి ఇతర్లు పొయ్యేటప్పుడు తన మంచితనం చూపించుకోవటానికైనా మర్యాదగా ఉంటాడే, అఖరి నిముషాల్లో వొచ్చిపడి బండిల్స్ వూడదియ్యమని గొవ చేశారు, ఎందుకు?వాళ్ళూ ప్రభుత్వోద్యోగులే,వీళ్ళూ ప్రభుత్వోద్యోగులే  - పద్ధతులు తెలియవా?ఉద్యమం వేడిలో కనీసపు మానవసహజమైన సంస్కారాలు కూడా మంట గలిసిపోయినాయా?

     నిన్నగాకమొన్న తెలంగాణ ఎంసెట్-2 విషయంలో అభాసుపాలైన ఎదవలు ఒకప్పుడు ఆంధ్రా ఎంసెట్ కూడా మేమే నిర్వహిస్తాం అని అత్యంత సమర్ధులకి మల్లే గప్పాలు కొట్టారు - దిక్కుమాలిన కాంగ్రెసుకి ముఫ్ఫయ్ సీట్ల ముష్టిలెక్క చూపించి అడ్డగోలు బిల్లుతో దొడ్డిదారిన రాష్త్రం తెచ్చుకున్న మత్తు దిగక!ఇప్పటికైనా మత్తు దిగుతుందో లేదో?ఆంధ్రద్వేషపు మత్తు దిగేవరకు మొట్టికాయలు తప్పవు - తెలంగాణ హైకోర్టును మాత్రమే కాదు తెలంగాణ సుప్రీంకోర్టును ఏర్పాటు చేసుకున్నా సరే!

     షెడ్యూల్ 8,9,10,11,12 కింద వందల కొద్దీ ప్రభుత్వ కార్యాలయాలూ పరిశ్రమలూ ఆంధ్రాకి రావలసినవి ఉన్నాయి.మా ప్రాంతంలో కట్టారు గాబట్టి అవి మావే అంటున్నారు అదేదో సినిమాలో ఒక కమెడియన్ "వాడు నీ సైకిలు బాగు చేస్తాడు,నువ్వు వాడి పెళ్ళానికి కడుపు చెయ్యి - ప్ఫ్ ప్ఫ్ ప్ఫ్" అని బూతు జోకు వేసినట్టు.ఈ లెకన తెలంగాణ NRIలు కూడా కెరీర్ ముగిసిపోయి దేశానికి తిరిగి వచ్చేటప్పుడు తమ స్వార్జితాన్ని ఆయా దేశాల్లో వదిలేసి కట్టుగుడ్డల్తో వస్తారా?యెదవ తెలివితేటలు!ఒక శాఖకి సంబంధించిన అక్కౌంటును కూడా స్తంభింపజేసి తనవైపుకి ఫిరాయించుకోవాలని సాక్షాత్తూ తెలంగాణ ప్రభుత్వమే ప్రయత్నించి కోర్టు చివాట్లతో వెనకి తగ్గితే గానీ ఆంధ్రాకి న్యాయం జరగలేదు.నాగార్జున సాగర్ రెండ్య్=ఉ కాలవల్లో ఒకటి తెలంగాణకీ ఒకటి ఏపీకి నీటివాటాతో సహా దఖలు పడిపోయాక ఆంధ్రప్రదేశ్ భూభాగంలొ ఉన్న కాలవని కూడా మేమే మెయంటెయిన్ చేస్తాం అనటంలో అర్ధం ఏమిటి?నీ రాస్ట్రంలోని కాలవ సంగతి చూసుకుంటే చాలదా?పొరుగు రాష్ట్రపు కాలవ గురించి మాట్లాడే హక్కు కూడా నీకు లేదు కదా,అయినా ఎందుకు తెంపరించి ఆ పోలీసులూ ఈ పోలీసులూ అభాసుపాలయ్యేవరకు వెళ్ళింది తెలంగాణ ప్రభుత్వం?ఆ నీళ్ళు కూడా దోచుకోవటానికా!ఆంధ్రప్రాంతంవాళు మమ్మల్ని అరవయ్యేళ్ళపాటు దోచుకున్నారని గర్జించినవాళ్ళు ఇవ్వాళ రెండేళ్ళలోనే ఆంధ్రప్రదేశ్ వనరుల్ని దోచుకుంటే తప్ప తెలంగాణ బాగుపడదని తేల్చినట్టు కాదా ఇలాంటి లత్తుకోరు యవ్వారాలకి దిగటమంటే?

ఖడ్గాన్ని ఖడ్గమే రద్దు చేస్తుంది,ద్వేషం ద్వేషంతోనే అంతమైపోతుంది - తస్మాత్ జాగ్రత్త!!!