Tuesday, 3 February 2015

మళ్ళీ కాంగ్రెసుకి జీవం ఆంధ్రా వాళ్ళే పోస్తారా?

            చావబోతున్న పార్టీ మళ్ళీ బుసకొడుతున్నది?క్రూరంగా విభజించి అన్యాయం చేసినందుకు కాంగ్రెసు చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రంలో సున్నాకి దించారు!యేమి లాభం ఇద్దరు స్మార్ట్ నాయుళ్ళూ తమ దివాళాకోరు రాజకీయంతో కాంగ్రెసుకి కోరలు తగిలిస్తున్నారు?!వీరంగాలు వేసేటందుకు రంగభూమిని సిధ్ధం చేస్తున్నారు,చేజేతులా ఆయుధాలు సమకూరుస్తున్నారు.భాజపా వాజపేయికాలం నాటిలా అమాయకమైన పార్టీ కాదు?!మొన్నటి యెన్నికల్లో మిగతా దేశమంతా యెట్టాగూ మోదీ హవా తో కొట్టుకొస్తాం గదా అనే ధీమాతో అనుకుంటా తను వోడిపోయినా బాబుని బలహెనుణ్ణి చెయ్యాలని మితృత్వం నటిస్తూనే తనకిచ్చిన సీట్లలో దద్దమ్మల్ని నిలబెట్టి తొండి రాజకీయం చెయ్యబోయింది.సమయానికి బాబు కళ్ళు తెరిచి ఇచ్చిన సీట్లు కూడా వెనక్కి లాక్కుని హడావిడిగా గట్టి అబ్యర్ధుల్ని నిలబెట్టడం వల్ల పరువు దక్కింది గానీ అన్ని కేసులతో సతమతమవుతున్నా ఇప్పటికీ నువ్వా నేనా అంటున్న జగన్ ఈజీగా ముఖ్యమంత్రి ఐ వుండేవాడు - కనీసం ఇంకా గట్టి పోటీ ఇచ్చి ఇవ్వాళ్టి ధీమా లేకుండా చేసేవాడు.

        ఇప్పుడు కూడా ప్రధానమంత్రి దగ్గిర్నుంచి వెంకయ్య నాయుడు వరకూ ఆంధ్రాని ఆదుకోవడం మా బాధ్యత,కాంగ్రెసు చేసినట్టు మేము చెయ్యం అంటూనే ప్రత్యేక ప్రతిపత్తి లేదని ముఖానే చెప్పేసి ఆంధ్రాకి రావలసిన నిధుల్లోనూ కోతపెట్టి మాట ఇచ్చి తప్పడం అనే ద్రోహానికి పూనుకుంది.కమలమే సకలం కావాలని ఆశించే భాజపా యే ముఖం పెట్టుకుని ఆంధ్రాకి తను మాట ఇచ్చినవి ఇవ్వకుండా వోట్లడుగుతుంది?ఆంధ్రాలో యేనాడూ సొంత బలమ లేదు!బాబు సాయం లేకుండా సొంతంగా ఒక్క సీటు కూడా రాదు?ఇప్పుడు కృష్ణాతీరం కబ్జాలో భాజపా వాళ్ళూ వున్నారని బయట పడుతున్నది.ఇలాంటి బేఖారీ గాళ్ళని చూసి యెవడూ వోటు వెయ్యడు భాజపాకి!భాజపాకి యెప్పటి నుంచి బలం పెరిగిందో అందరికీ తెలుసు?వాజపేయిని చూసీ కాంగ్రెసులో వున్నంత అవినీతి పరులు భాజపా లో లేకపోవడం వల్ల వున్నత స్థాయి రాజకీయాల్ని కోరుకునే వాళ్ళంతా అభిమానించడం వల్లనే భాజపా బలపడింది. 

              గోకరాజు లాంటివాళ్ళు పెరిగాక భాజపా ఇలాంటి వాళ్ళ అండతో అధికారం లోకి వచ్చిందా?భాజపా అధికారం లోకి వచ్చాక వీళ్ళ హవా పెరిగిందా?ప్రజలకి యేదయినా ఒకటే!భాజపా కూడా కాంగ్రెసు పధ్ధతిలోనే వెళ్తే ప్రజలకి యేపార్టీ అయినా ఒకటే అనిపిస్తే పాత పార్టీ కాంగ్రెసు మీద సానుభూతి పెరుగుతుందే తప్ప కొత్త పార్టీని కావిలించుకోరు!అలవాటుగా భాజపాకి పడతాయనుకున్న వోట్లన్నీ కాంగ్రెసుకి పడ్తాయి.ఆ ధైర్యం తోనే రఘువీరా రెడ్డి విజృంభిస్తున్నాడు!చంద్రబాబు కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని తనకి తనుగా రాబట్టలేనని తెలిసి పెట్టుబడుల కోసం అంటూ రాజధాని కట్టడం కోసం అంటూ చేస్తున్న హడావిడి జనాల్లో కష్టపడుతున్నాడనే ఇమేజి రప్పించటం వల్ల తెదెపా వోటుబ్యాంకు ప్రస్తుతానికి క్షేమంగానే వున్నా కేంద్రం నుంచి యేమాత్రం సాయం రాకపోయినా ఇంకా భాజపాని అంటకాగుతూ వుంటే తొందర్లోనే ఆ పార్టీకి కూడా గడ్డు పరిస్థితి యెదురు కావచ్చు.

           భాజపా మాత్రం కేంద్రం లో వెంకయ్య నాయుడు అట్లా చక్రం తిప్పుతూ వుండి కూడా తెదెపా నుంచి నలుగుర్ని కేంద్రమంత్రులుగా తీసుకుని కూడా ఆంధ్రాకి తను వాగ్దానం చేసినవి ఇవ్వకుండా ఆంధ్రపరదేశ్ నుంచి బలమైన ప్రాతినిధ్యాన్ని ఆశిస్తే మాత్రం అది అత్యాశే అవుతుందిభాజపా రాష్ట్రంలో ఆశిస్తున్న స్థానాన్ని కాంగ్రెసు ఆక్రమించడం ఖాయం!ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం లో ఇవ్వాళ ప్రతి ఒక్కరికీ ఈ రాష్ట్రం తమ కన్యాయం జరిగేలా విభజించబడిందనేది తెల్సు.ఇప్పుడు యెవరేమి చేస్తారు అనే విషయాన్ని వాళ్ళు ప్రశాంతంగా వుంటూనే వెయ్యి కళ్లతో యెదురు చూస్తున్నారు.వాళ్ళని మోసం చేసి నెగ్గుకు రావడం కష్టం!

              మోదీ హవా మీద అతినమ్మకం తొలగి పోయి మిత్రుల్ని కూడా మింగేసి యెదుగుదామనుకుంటున్న హజం తగ్గాలంటే డిల్లీలో వోటమి తప్పని సరి.నేను మనస్పూర్తిగా డిల్లీలో భాజపా వోటమిని కోరుకుంటున్నా!పైగా అఖరి నిమిషాల్లో బేదీని దించి యెటూ ప్రమాదకరమైన యెత్తునే వేసింది.ఆ యెత్తు వికటిస్తే గానీ కళ్లకి పట్టిన పొరలు చిరగవు?!అక్కడ గెల్చినా గెలవకపోయినా ఆంధ్రాలో కాలు మోపాలంటే మాత్రం ఆంధ్రాకి తను వాగ్దానం చేసిన ప్రత్యేక హోదానీ పన్నుల రాయితీని ఖచ్చితంగా రాష్ట్రానికి ఇవ్వాలి?!ఒకసారి లేస్తే కాంగ్రెసుని ఆపడం కష్టం?!

21 comments:

  1. >ఆంధ్రాని ఆదుకోవడం మా బాధ్యత,కాంగ్రెసు చేసినట్టు మేము చెయ్యం అంటూనే ప్రత్యేక ప్రతిపత్తి లేదని ముఖానే చెప్పేసి....

    ఇటువంటి వాటినే శుష్కప్రియాలూ శూన్యహస్తాలూ అన్న సామెతతో చెబుతారు పెద్దలు.

    ReplyDelete
  2. >ఒకసారి లేస్తే కాంగ్రెసుని ఆపడం కష్టం?!
    భయపడకండి. రాహుల్ బాబా భజనతో మీ గండం ఇట్టే గట్టేక్కగలదు.

    ReplyDelete
    Replies
    1. :-)
      నిజమే,రాహుబాబు వుండగా కాంగ్రెసు లేవదు!!ఆయన ప్రచారాని కొస్తే అంతే - కాంగ్రెసు ఢమాల్?!కానీ కాంగ్రెసు వాళ్ళు తెలుగు మీరిపోయి ఆయన్ని తీస్కరాకపోతే?

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. > కాంగ్రెసు వాళ్ళు తెలుగు మీరిపోయి ఆ రాహుల్ అనే ఆయన్ని తీస్కరాకపోతే?
      రాహుల్ బాబాను ఎన్నికల ప్రచారానికి రమ్మని పిలవటానికీ రవద్దుపొమ్మని తిరస్కరించటానికీ తెలుగువాళ్ళెవరూ? తెలుగోడికీ అంత సీనుందా? మనలో మనమాట, కాంగ్రెసుపార్టీ నిన్నను, తెలుగోళ్ళు సారీ ఈ ఆంధ్రోళ్ళు సంబరపడతారని ముచ్చటపడే ఆంధ్రప్రదేశాన్ని రెండుముక్కలు చేసిందా? అంతా కాంగ్రెసువారి యిష్టారాజ్యం కదా? యువరాజుగారి ముచ్చటో మహారాణీగారి ముచ్చటో చెల్లించారంతే. రేపూ ఈ దిక్కుమాలిన ఆంధ్రావాళ్ళేదో ఛీ అనేస్తారని రాహుల్ బాబా రావటం మానేస్తారా ఏమిటీ‌, బడాయి కాకపోతే! ఎమీ భయపడకండీ.

      Delete
  3. Allama Iqbal wrote "खुदा ने आजतक उस क़ौम कि हालत बदली, नहो जिसको ख़याल आप अपनी हालत के बदलने का" (Khuda ne aaj tak us qaum ki haalat naheen badlee, na ho jisko khyal aap apni haalat ke badalne ka, loose translation: "Allah does not change the condition of a people unless they themselves want the condition to be changed".

    ReplyDelete
  4. If tdp fails in their term in fulfilling their promises to a.p., it deserves certainly to be thrown out along with bjp. But let's not bring back congress which needs to be buried for ever lest we're further divided into rayalaseema n kalinga andhra!

    ReplyDelete
    Replies
    1. No point just burring the Congress. Remember, Congress is cancer. Period. It should be eradicated. Not just silenced, which is a dangerous thing to do.

      Delete
  5. దిల్లీలోని తెలుగువాళ్ళు తలుచుకుంటే, అక్కడ బిజెపికి బుద్ధి చెప్పగలరు.
    ఇప్పటికే కేజ్రీవాల్ బిజెపికి చుక్కలు చూపిస్తున్నాడు.

    ReplyDelete
    Replies
    1. > దిల్లీలోని తెలుగువాళ్ళు తలుచుకుంటే, .....
      అవునండీ. తెలుగువాళ్ళు తలుచుకుంటే, ఏదైనా సాధించగలరు. ఇది అనుకుందుకు ఎంతో అహ్లాదకరమైన మాట. కాని తెలుగువాళ్ళు నిజంగా గట్టిగా తలుచుకోరన్న సంగతి రాష్ట్రవిభజనతోనే తెల్లమాయె కాదా? ఆంధ్రులు ఆరంభశూరులే కాని కార్యశూరులు కారన్న సంగతి ఆంధ్రులతో సహా సమస్తప్రపంచానికీ మహాబాగా తెలుసు. అందుకే politics are cutting us like watermelon.

      Delete
    2. పదేళ్ళ బానిసత్వంతో ఇలా డీలా పడ్డాం కాని, ఒకప్పుడు ఇందిరాగాంధీకే చుక్కలు చూపించామని మర్చిపోవద్దండి.
      ఉందిలే మంచి కాలం ముందు ముందున.

      Delete
    3. బోనగిరి గారు,
      తెలుగువాళ్ళు తలచుకొంటే అని భాషభిమానం ఇప్పుడు పనిచేయదు. అంత భాషాభిమానం ప్రజలకుంటే రాష్ట్రవిభజనే జరిగేది కాదు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టి మూతపడే సమయంలో, తెలుగుదేశంలో చోటు దొరకని వారు బిజెపిలో తాత్కలికం గా సేదదీరుతున్నారు. ఉదా|| పురంధరేశ్వరి గారు. కొన్ని నెలల క్రితం ఆమే తెలుగుదేశంలో చేరనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కమిట్మెంట్ లేని ఇటువంటివారితో పార్టి నింపేకన్నా ఇతరులకు చోటిస్తే, బిజెపి పరిస్థితి కాంగ్రెస్ పార్టికన్నాబాగుంట్టుంది. బిజెపి లో వెంకయ్య నాయుడు గారు ఇప్పటికే చాలా కాలంగా రాజకీయాలలో ఉంట్టున్నారు. బహుశా ఇది ఆఖరి టర్మ్ కావచ్చు. ఆయన రిటైరైన తరువాత పార్టిని ప్రక్షాళన చేసి కాపు, దళిత,ఇతర వర్గాల వారికి అవకాశాలు కలిపిస్తే, అన్ని వర్గాల వారిని కలుపుకొని పోతూ బిజెపి,కొత్త శక్తితో తెదే,వై.యస్.ఆర్. పార్టిలకు మంచి పోటి ఇవ్వగలదు. కాష్మీర్ ఎన్నికలలో బిజెపి కి వ్యుహరచన చేసిన తెలుగువాడైన రాం మాధవ్, వీలైతే నిర్మలా సీతారామన్ రానున్న రోజులలో రాష్ట్ర రాజకీయాలలో (వ్యుహ రచనలో ) ప్రముఖ పాత్ర వహిస్తారేమో!

      Delete
    4. ఆంద్ర దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు గారికి మంచి పేరు ఉంది. స్వతహాగా ధార్మిక భావాలు ఉండడమే కాక సంఘపరివార్ నేపధ్యం కూడా ఉంది. ఆయన గుళ్ళను & ధార్మిక వ్యవస్తను ప్రక్షాళన చేస్తే ప్రజలలో పాపులారిటీ పెరగడమే కాక నాయకత్వ పటిమ పెంచుకొవోచ్చు.

      ఉ. టీటీడీ పగ్గాలను మద్యం వ్యాపారుల చేతిలో పెట్టడం, VIP దర్శనాల వల్ల సామాన్య భక్తులకు ఇక్కట్లు, లడ్డూల నాణ్యత లాంటి అనేక విషయాలలో భక్తులకు ఆందోళన ఉంది. ఇదే పరిస్తితి మిగిలిన గుళ్ళలో కూడా. పాలన వ్యవస్తలో పారదర్శకత్వం తీసుకొచ్చి భక్తుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి కావాల్సిన రాజకీయ ద్రుడత్వం (political will) ముక్కుకు సూటిగా వెళ్ళే మనస్తత్వం ఉన్న మాణిక్యాల రావు గారికి ఉన్నాయి.

      Delete
  6. ఢిల్లీలోని తెలుగువాళ్ళు తలుచుకుంటే ... ఆ చూపించే పెతాపమేదో ఆంధ్రలో నే బిజెపి కి చూపించవచ్చుకదా!
    వెంకయ్యగారికి గల ప్రజాబలం అందరికి తెలిసిందే. నమో ప్రధాని పదవికి పోటి పడుతున్నపుడు అద్వాని కి మద్దతిచ్చిన వారిలో వెంకయ్య నాయుడు గారు ప్రముఖులు. నమో ఎంతో విశాల హృదయుడు, కనుకనే గతాన్ని గుర్తుపెట్టుకోకుండా ఆయనకి కేంద్ర కేబినేట్ మంత్రి పదవి ఇచ్చాడు. మీ అభిప్రాయాలు చదువుతూంటే ఆంధ్రాలో బిజెపికి ఉన్న ఆ కాసింత పేరు ఆయన వలన పోతున్నట్లు ఉంది.

    ReplyDelete
  7. మీరన్నట్లు భాజపా వాజపేయ్ కాలంలా లేదు . నేడు భాజపా అంద్రు మోదీ జపం చేస్తున్నారు , ప్రధాన మంత్రి పదవికి అద్వానీ గారిని సపోర్ట్ చేసిన వెంకయ్య నాయుడితో సహా . కారణం మోదీ కున్న రాజకీయ బ్యాక్ గ్రౌండే ( మంచా\ చెడా అన్నది పక్కన పెట్టండి ) మూల కారణం .

    ఇక ఆంధ్రా ప్రదేశ్ విషయానికొస్తే ( ఉమ్మడిగా వున్నప్పుడే ) బలం లేనిది . అందుకనే విభజన భజన చేశారు . విడగొట్టేవారికి చేయూతనిచ్చారు . ఆంధ్రా ప్రదేశ్ లో ఎటూ లేదు , కనీసం యిప్పుడైనా ఈ తెలంగాణాలో నైనా ఈ విభజన పేరుతోనైనా కొంత బలం పుంజుకోవాలనుకొంది . అక్కడా ఆ ఆశా నిరాశే అయ్యింది .

    ఇక ఆంధ్రా ప్రదేశ్ విషయానికొస్తే యిప్పటికీ మితృత్వం కనపరుస్తూనే తన వాళ్ళను బాబు చుట్టు త్రిప్పుతూ నేర్చుకొనమంటున్నది తన వాళ్ళను . మరో వైపు అమిత్ షాను ఆంధ్రా ప్రదేశ్ కి పంపించి బలపరచుకో చూస్టుంది .

    భారత దేశం మొత్తం పాగా వెయ్యాలనుకొంటుంది .

    ఇక బాబు విషయానికొస్తే ఎన్నికలలో చేసిన అన్ని వాగ్దానాలు కార్య రూపం దాల్చటం ఎవ్వరికీ సాధ్యం కాని పనే . ఎందుకంటే నోరున్నది గదా అని , ఓట్లు వస్తాయి గదా అని వాగ్దానాలు యివ్వకూడాదు . వాగ్దానాలు గర్భాదానమంత సులువు కాదన్నది మరచిపోకూడదు .
    నూటికి నూరు శాతం కాకున్నా 60 నుంచి 65 శాతం వరకు తీర్చినా మరో పార్టీ ఆంధ్రా ప్రదేశ్ లో పుంజుకోలేదు .

    ఇంక దిల్లీ విషయానికొస్తే ,
    బేడీని పిలిపించుకొన్నదే పాగా వెయ్యాలని . కేజ్రివాల్ తొందర పడకుండా అడుగులు వేస్తే మఱల గద్దె ఎక్కగలడు , లేకుంటే భాజపానే . కాంగ్రెస్ కి అవకాశమే లేదు .
    కాంగ్రెస్ లో నష్ట జాతకులే ఎక్కువున్నారు . సోనియా , రాహుల్ , వాద్రే వరకు . ప్రియాంక కూడా వాద్రే వల్ల ఆ కోవలోకి చేర్చబడ్డది .

    మీరందరు అన్నట్లు కాంగ్రెస్ భూస్థాపితం అయి తీరవలసిందే .

    ReplyDelete
    Replies
    1. శర్మ గారూ,
      అన్ని అభిప్రాయాల్నీ చర్చించి చాలా చక్కని విస్లేషణ చేసారు!మీరు ఇచ్చిన తీర్పునే ప్రజలూ ఇస్తారని ఆశిద్దాం!

      Delete
    2. శర్మ గారూ, భాజపాకు ఆంధ్రలోనే కాదు ఇతర అనేక రాష్ట్రాలలో బలం లేదు. పార్టీ బలం పుంజుకొవదానికె డానికే తెలంగాణా ఏర్పాటు కోరినట్టయితే ఇతర రాష్ట్రాలలో అదే పని ఎందుకు చేయలేదు? అలాగే "మాత్రు రాష్ట్రాలలో" తమకు బాగానే బలం ఉన్నా మూడు రాష్ట్రాలను ఏర్పాటు ఎందుకు చేసింది? అంచేత తెలంగాణా ఉద్యమానికి భాజపా ఇచ్చిన మద్దతును పార్టీ పాలిసీగానే భావించాలి తప్ప టాక్తికల్ వ్యూహం కాదు.

      ఇప్పట్లో ఆంద్ర తెలంగాణా రాష్ట్రాలలో పెద్దగా anti-incumbency రాలేదని నా అంచనా. రెండు చోట్లా ముఖ్య ప్రతిపక్షం బలహీనం అయ్యిందని కూడా అనిపిస్తుంది. తద్వారా ఏర్పడే political space ను గెలవాలని భాజపా ప్రయత్నించడం వరకు సరే కాని సఫలం అవుతుందా?

      కాంగ్రెస్ పార్టీని ఆంధ్రలో పూర్తిగా సమిసిపోయిందని అనలేము. ఇలా అనుకునే వారు తమ కోరికను జోస్యంగా భావిస్తున్నారని నా అనుమానం. Mixing up preference for prediction is a sure shot method of buying disappointment.

      Delete
    3. గొట్టిముక్కల గారూ ,

      అలా అనటానికి సరైన కారణం వున్నది . ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న భాజపా వెంకయ్య నాయుడిని , సుష్మారాజ్ ని , బరిలోకి దించింది కంగ్రెస్ వాళ్ళ బేరసారాలతో .

      ఇచ్చే ముందు వెంకయ్య నాయుడు గారు రెండు చోట్ల స్థానం ఆశించి , ఆంధ్రా వాళ్ళకి ప్రత్యేక హోదా 10 ఏళ్ళ పాటు అనే స్లోగన్ని , సుష్మారాజ్ మా వల్లనే యిది సాధ్యమైంది అన్న స్లోగన్ని గన్ లా ఎక్కు పెట్టారు .
      ఆపై ఆ యిరువురూ ప్లేటు మార్చి ప్రత్యేక హోదా అసాధ్యమని , సోనియమ్మ పెద్దమ్మ అయితే , నేను మీ చిన్నమ్మనని చెప్పుకొన్నారు .

      అంతే గాని వేరే ఏ దురుద్దేశాలు లేవు .

      Delete
    4. శర్మ గారూ:

      సుష్మా స్వరాజ్, ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, రమణ సింగ్ తదితర ముఖ్య నాయకులు ఎప్పటినుండో తెలంగాణా కోసం కొట్లాడుతూ వచ్చారు.

      ఇక వెంకయ్య నాయుడి విషయానికి వస్తే, రాజ్యసభలో భాజపా చివరి నిముషం డ్రామా తాలూకా వివరాలు కొన్ని ప్రొఫసర్ శేషగిరి రావు అనే ఆంద్ర భాజపా నాయకుడు ఇటీవల ఒక పుస్తకంలో చెప్పారు. దొరికితే చదవండి.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...