Wednesday, 14 November 2018

సనాతన ధర్మం అంటే ఏమిటి?అది ఎందువల్ల ప్రత్యేకమైనది!

          "ధార్యతే ఇతి ధర్మః" - పరమార్ధ దృష్టితో చూస్తే అందరినీ ధరించి పాలించు విశేషస్వరూపమునే ధర్మం అనీ వ్యవహార దృష్టితో చూస్తే పాటించే మనిషికి సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టే అలవాట్లనూ ఆ అలవాట్లు మనస్తత్వంలో స్థిరపడేటందుకు అవసరమైన ఆలోచనా పద్ధతిని శాసించే నియమాలని కలిపి ధర్మం అనీ అంటారు.ఈ ధర్మం అనే ఒక్క మాటని పుట్టించి నిర్వచించి విశ్లేషించి నిరూపించి మానవ జీవితానికి కేంద్రస్థానంలో నిలబెట్టటమే సనాతన ధర్మం యొక్క విశిష్టత!

          ప్రాచీన భారతీయ సనాతన ధార్మిక సాహిత్య సృష్టికర్తలు ధర్మపాలన అనే పేరున సత్యవాక్పరిపాలన, పరోపకారము, భూతదయ, బ్రహ్మచర్యం/ ఇంద్రియనిగ్రహం, దానశీలత, ఆహారశుద్ధి, విద్యుక్తకర్మాచరణం, శాంతస్వభావం, క్షమాగుణం అనే లక్షణాలను ప్రతి ఒక్కరికీ ఆవసరమైన లక్షణాలని పేర్కొన్నారు.అవి "మాకు నచ్చినవి, కాబట్టి చెయ్యండి!" అని చెప్పి వదిలెయ్యలేదు - ఎందుకు మంచివి అనే విషయాన్ని కూడా చెప్పారు,ఎట్లా వాటిని అనుష్ఠించాలో కూడా చెప్పారు.అట్లాగే లోభం, క్రోధం, మోహం వంటి అధర్మ సంస్కారాల్ని కూడా "మాకు నచ్చలేదు, కాబట్టి చెయ్యకండి!" అని కాక ఆ దుష్టత్వాలకు అలవాటు పడటం వల్ల కలిగే నష్టాన్ని చెప్పి వాటిని వదిలివెయ్యడానికి సులువైన మార్గాలను కూడా సూచించారు.

          శ్రీ మహాభారత కావ్యనాయకుడైన యుధిష్ఠిరుడు తన ధర్మానికి కట్టుబడి ఉండే తీవ్రత్వాన్ని బట్టి ధర్మరాజు అని పేరు సంపాదించాడు.శత్రువులు అతనిని కష్టాల పాలు చెయ్యటంలో ఇతని సంపదని హరించటంతో పాటు ఇతన్ని ప్రలోభపెట్టి ఇతని చేత అధర్మ కార్యాలను చేయించాలనే ఉద్దేశం కూడా ఇమిడి ఉంది - అయినా నిగ్రహం కోల్పోకుండా నిలబడి భగవత్స్వరూపుడైన శ్రీరాముడి కన్న విశిష్టమైన స్థానాన్ని అందుకున్నాడు!ఇది కూడా సనాతన ధర్మం యొక్క ప్రత్యేకతలలో ఒకటి - ధర్మమే దైవం,దైవమే ధర్మం, ధర్మపాలనకు కట్టుబడిన ప్రతి మానవుడూ దైవసముడే!

          "సనాతనస్య ధర్మ ఇతి సనాతన ధర్మః" - "సనాతనుని యొక్క ధర్మమును సనాతన ధర్మమని అందురు". ఇది షష్ఠీ తత్పురుష సమాసం - స్థాపిత స్థాపక సంబంధాలను సూచించే ఈ సాంకేతిక పదాన్ని బట్టి సనాతనుడైన భగవంతుని చేత స్థాపించబడినది గనక ఇది సనాతన ధర్మం అయ్యింది!జైనులు, బౌద్ధులు, యూదులు, జొరాష్ట్రియన్లు, క్రైస్తవులు, మహమ్మదీయులు - మహావీర తీర్ధంకరుని, శాక్యముని గౌతమబుద్ధుని, ప్రధమ ప్రవక్తయైన  అబ్రహామును, దార్శనికుడైన జరతూష్ట్రను, దైవపుత్రుడైన జీసస్ క్రీస్తును,ఆఖరి ప్రవక్తయైన మహమ్మదును ఆయా మతాలకు మూలపురుషులని నమ్ముతారు.అట్లాగే సనాతన ధర్మాన్ని పాటించే వారు తమది సనాతనుడైన భగవానుడి చేత స్థాపించబడినది తప్ప యే ఒక్క మానవుడూ దీనికి స్థాపకుడు కాదని విశ్వసిస్తారు!

          కొందరు హైందవేతర మతప్రచారకులు రాముడినీ, కృష్ణుడినీ, శివుడినీ తమ మతప్రవక్తలతో పోలుస్తున్నారు - వారి మతాలలో ప్రవక్తలు ఎట్లాగో హిందూమతంలో వీరు అట్లాంటివారని వక్రభాష్యాలు చెప్తున్నారు.ఇది తప్పు - హిందూమతాన్ని స్థాపించినది సనాతనుడైన భగవంతుడు,ఆయనకు తప్ప ఇంకెవరికీ కర్తృత్వం లేదు!రాముడూ కృష్ణుడే కాదు శివుడూ విష్ణువూ కూడా తమ యోగసాధన వల్లా ధర్మపాలన వల్లా యోగీశ్వరులై కీర్తించబడుతున్నారు - అంతే!

          సనాతన ధర్మం తప్ప మిగిలిన వాటిని మూడు విధాల వర్గీకరించవచ్చును - 1).భూతకాలమున ఉండి వర్తమానమున లేనివి, 2).భూతకాలమున లేక వర్తమానమున ఉన్నవి, 3).వర్తమానమున ఉండి భవిష్యత్తున ఉండనివి.సనాతన ధర్మం ఈ మూడు తెగల్లో దేనికీ సంబంధించినది కాదు.ఇతర ధర్మాల కంటె ముందునుంచీ ఉన్నది, ఇప్పటికీ కొనసాగుతున్నది, ఇకముందు కూడా అన్ని ప్రత్యేకతలను నిలబెట్టుకుంటూ కొనసాగుతుంది!కొందరు హిందువులకి ఈ మధ్యనే హిందూ మతం అంతరించి పోతుందేమోనని భయం పట్టుకుంది - ఆ భయం అర్ధం లేనిది. 

          "యత్ జన్యం తద్ అనిత్యం" అనే ప్రకృతి నియమం అనుల్లంఘనీయం.కొన్ని దుష్కర కార్యాలను సాధించటానికి భగవంతుడు అనేక రూపాలను ధరించి కూడా తన కర్తవ్యం పూర్తి కాగానే అవతారం చాలించాడు - తను పెట్టిన నియమాన్ని తను కూడా ఉల్లంఘించటం లేదు!ఆ లెక్క ప్రకారం పుట్టుక ఉన్న ఇతర ధర్మాలు నశిస్తాయేమో గానీ పుట్టుక లేని సనాతన ధర్మం ఎప్పటికీ నశించదు - అనుష్ఠించిన వారు రక్షణ పొందుతారు, అనుష్ఠించని వారే నశిస్తారు. దృశ్యమాన ప్రపంచంలోని సకల వృక్షజాతులూ జంతుజాలమూ ఆఖరికి శిలాఖండాలు కూడా ఈ ధర్మాన్ని పాటిస్తుంటే కొందరు మనుషులు పాటించనందువల్ల ధర్మం నశిస్తుందనుకోవడం అమాయకత్వమే!

          అన్ని విభక్తి ప్రత్యయాలతో కూడిన నిర్వచనాలను పరిశీలిస్తే సనాతనుడైన భగవంతుని చేత స్థాపించబడినది కావటం వల్లనూ స్వతః సనాతనమైనది కావటం వల్లనూ దీనిని విశ్వసించి పాటించిన వారిని సనాతనులను చేస్తుంది.

          సనాతన  ధర్మం ప్రతి ఒక నైష్ఠికుడికీ చెప్పేది మరణానంతరం పొందబోయే స్వర్గనరకాదులను గురించి కాదు, జీవంతో ఉన్నప్పుడే ఈ ప్రపంచంలోనే భగవంతుణ్ణి చూసి, విని, స్పర్శించి ఆనందించి అతనిలో ఐక్యం కావడం గురించి నొక్కి చెప్తుంది!సనాతన ధర్మాన్ని నిష్ఠగా పాటించే ప్రతి మానవుడూ  మొదట ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది పిదప పరమాత్మ సాక్షాత్కారాన్ని అనుభవించి మరణ సమయానికి  గతానుగతికమైన పాపరాశి మిగిలి ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి వీలైన ఉత్తమజన్మనీ పాపరాశి శూన్యస్థితికి చేరుకుంటే ఇంక జన్మ లేని మోక్షస్థితిని అందుకుంటాడు - అది తను యే భగవానుడి నుండి విడివడి జన్మపరంపరలోకి వచ్చాడో ఆ భగవంతుడిలో లీనమైపోవటం అవుతుంది!

          మొదట తెలుసుకోగానే  అసాధ్యం అనిపించే ఇంతటి సంక్లిష్టమైన లక్ష్యాన్ని కూడా చాలా సులభంగా సాధించగలిగేటట్లు మానవాత్మలను సిద్ధపర్చటం కోసం ప్రాచీన భారతీయ ఋషులు ఎంతగానో శ్రమించి ఎన్నో మార్గాలను ఏర్పరచారు,ఎన్నో ఉపాయాలను చూపించారు,శ్రమ తెలియకుండా ఉండేటందుకు ఎన్నో ఆనందాలను సమకూర్చారు - శ్రద్ధ ఒకటి ఉంటే చాలును ఈ ధర్మానుష్ఠానం ద్వారా సాధన పూర్తయ్యాకనే కాదు సాధన మొదలు పెట్టగానే ఆనందం, పరమానందం, బ్రహ్మానందం అనే స్థాయిల్లో ఏదో ఒకదాన్ని పొందవచ్చును!

          సనాతన ధర్మానికి ఆద్యంతాలు లేవు.సృష్టి స్థితి లయ విభూతు లన్నింటా ఇమిడిపోయి వాటిని నడిపిస్తూ ఉంటుంది.ప్రళయంలో సైతం నశించదు - బీజ రూపంలో నిద్రాణమై ఉండి సృష్టి మొదలైనప్పుడు చైతన్యవంతమై సకల భూతాళికీ రక్షణ నిచ్చే మనోగతమైన సంస్కారాల్నీ  క్రమబద్ధమైన జీవన విధానాల్నీ ప్రసాధించి శాసించేది సనాతన ధర్మమే!త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని పాటించేవారికి మరణానంతరం లభించే స్వర్గసుఖాల కన్న వెయ్యి రెట్లు అధికమైన ఆనందానుభూతి జీవిత కాలంలోనే అనుభవంలోకి వచ్చి మరణానంతరం జన్మలు లేని కైవల్యం సిద్ధిస్తుంది.మొత్తం సనాతన ధర్మం వేదములు, స్మృతులు, సాధు సంతుల సదాచార ప్రసంగాలు, ఆత్మకు ఆహ్లాదాన్ని కలిగించే సత్కర్మలు అనే నాలుగు పాదాల పైన నిలబడిన ఒక చతుష్పాత్తు, గోమాత!సనాతన ధర్మం జీవుడు తన సహజాతి సహజ ఉపాధిగతమైన సాంఘిక జీవన పరిధిలోనే ఎలా ప్రవర్తిస్తే తరిస్తాడో బోధిస్తుంది.

          సనాతన ధర్మం  మానవులు సత్యవాక్పరిపాలన, అహింసాయుత వర్తన, త్యాగనిరతి, ఇంద్రియనిగ్రహం, పరోపకారం, అస్తేయం, నియమపాలన వంటి దైవీయ ప్రవృత్తులను అలవాటు చేసుకుని వ్యక్తిగత జీవితంలో ప్రశాంతతనీ సామాజిక జీవితంలో గౌరవాలనూ అందుకుని ప్రశాంత చిత్తులై తమ చరమ లక్ష్యమైన మోక్షసాధన కోసం ప్రయత్నించటానికి ప్రేరణ ఇస్తుంది, ఉత్తేజితం చేస్తుంది,దైవసముల్ని చేస్తుంది!మనుస్మృతి ధర్మం యొక్క పది లక్షణాలను ఇలా క్రోడీకరించి చెప్తుంది:

శ్లో.ధృతిః క్షమా దమోస్తేయం, శౌచ మింద్రియ నిగ్రహః
ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మ లక్షణం!
(మనుస్మృతి VI - 92)

          "ఓర్పు, క్షమ, దమం. అస్తేయం, శౌచం, ఇంద్రియనిగ్రహం, ధీ, విద్య, సత్యం, అక్రోధం - ఇవి ధర్మము యొక్క పది లక్షణాలు" సనాతన ధర్మం ఐహిక సుఖాలను ఆశించటాన్ని వ్యతిరేకించదు, కానీ ఇంద్రియనిగ్రహాన్ని ప్రశంసించి మితిమీరిన భోగలాలసత గురించి హెచ్చరికలు చేసి అంతిమ నిర్ణయాన్ని మన విచక్షణకే వదలి వేస్తుంది.ఈ స్వేచ్చను మరి యే ఇతర ధార్మిక శాఖ ఇంత విస్తృత స్థాయిలో ఇవ్వలేదు!

          ఎంతమంది అనుసరిస్తున్నారు అనే అంకెల్ని మాత్రమే లెక్కకి తీసుకుని ప్రస్తుతం మూడో స్థానంలో ఉందని బెంగ పెట్టుకుని మొదటి స్థానం కోసం ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్న ఇతర మతాల్ని అనుకరించటం కోసం అంగలు వేస్తున్న హిందువులు ఇంత స్వేచ్చను అనుభవిస్తున్న  ప్రజాస్వామిక పద్ధతిలో మా మతంలో చేరితే చాలు మీ రోగాలూ కష్టాలూ మటుమాయం అయిపోయి వైభవాలు దక్కుతాయనే లాభసాటి వ్యాపార ఒప్పందాలూ మేము చెప్పినట్టు వినాలే తప్ప ఎందుకూ ఎలా ఏమిటని అడక్కూడదనే హేతువుకు స్థానం లేని మూర్ఖపు నిబంధనలూ మేం చెప్పేది నమ్మకపోతే మా దేవుణ్ణి మీమీదకి ఉసిగొల్పుతాం, ఆయన మిమ్మల్ని రోగాలతోనూ చావులతోనూ శిక్షిస్తాడనే బెదిరింపులూ ఏవీ లేకుండా కేవలం వ్యక్తుల స్వయం నిర్ణయాత్మకతతో ఇంతమంది ఈ ధర్మానికి బద్ధులై ఉన్నారని తెలుసుకుంటే బెంగ పోయి హుషారు వస్తుంది!


          ఇతరులకి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఆ అబద్ధాల్ని నిజాలని నమ్మి చెప్పటం లేదు,ఎదటివాళ్ళని నమ్మించటం కోసమే శతవిధాల ప్రయత్నిస్తూ  అత్యవసరమైతే తాము కూడా నమ్ముతున్నట్టు నటిస్తారే తప్ప వాళ్ళు అవి నిజాలని నమ్మరు!మనం గనక నిజానిజాలు నిర్ధారించుకోకుండా అబద్ధాల్ని నమ్మితే మనకే నష్టం అనేది రెండు మూడు సార్లు అనుభవంలోకి వచ్చాక తప్పకుండా తెలుస్తుంది.అది తెలిశాక మనకి ఆ అబద్ధాలు చెప్పినవాళ్ళ నిజస్వరూపం తెలియడం వల్ల బలమూ దమ్మూ దన్నూ ఉంటే నాలుగు తన్ని కచ్చి తీర్చుకోవటమో అది కుదరకపోతే వాళ్ళనుంచి దూరంగా పారిపోవటమో చేస్తాం - ఈ విధమైన వాస్తవిక జ్ఞానం  పుష్కలంగా ఉండటం చేత ప్రాచీన భారతీయ సనాతన ధార్మిక సాహిత్య సృష్టికర్తలు తాము సత్యానికి కట్టుబడి సత్యవాక్పరిపాలనని అన్నింటికన్న సర్వోత్కృష్టమైన స్థానంలో నిలబెట్టి మనల్ని కూడా సత్యం వైపుకే నడవమని పదే పదే నొక్కి చెబుతున్నారు!

          వరసలో మొదట చెప్పటమే కాదు లోనారసి చూస్తే సనాతన ధర్మం మొత్తం సత్యం పునాదుల మీద నిర్మించబడినట్టు తెలుస్తుంది.మన వలెనే మానవజన్మ ఎత్తిన రాముడు మనకు పూజనీయుడై దైవసముడు కావడానికి తను సత్యానికి కట్టుబడిన పద్ధతియే కారణం కదా!సత్యం యొక్క గొప్పతనాన్ని శ్రుతి ఇలా ఉగ్గడిస్తున్నది:

మం.సత్యాన్నాస్తి పరోధర్మః, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ
సత్యేన వాయు రావాతి, సత్యేనాదిత్యో రోచతే
దివి సత్యం వాచః ప్రతిష్ఠా, సత్యే సర్వం ప్రతిష్ఠితం
సత్యేన సువర్గా ల్లోకాత్ చ్యవంతే కదాచన
సతాం హి సత్యం, తస్మాత్సత్యే రమంతే!

          "సత్యమును మించిన ధర్మము లేదు. సత్యమే జ్ఞానమును అనంతమునైన బ్రహ్మస్వరూపము. సత్యము వలననే వాయువు వీచుచున్నది. సత్యము వలననే వాక్కు శాశ్వతమగుచున్నది. సత్యమునందే సర్వజగత్తును సుప్రతిష్ఠితమై యున్నది. సత్యము వలననే మానవులు స్వర్గాదుల నుండి చ్యుతులు గాకుందురు. సత్యమే శాశ్వతము. అందుచేతనే మహాత్ములు సత్యమునందే రమించుచున్నారు"

          "యోవై ధర్మః స సత్యంవై తత్" అని బృహదారణ్యకోపనిషత్తు ఉద్ఘాటించి చెప్పడం వల్ల సత్యము వేరు ధర్మము వేరు కాదు, ధర్మమే సత్యము లేక సత్యమే ధర్మము అని సనాతాన్ ధార్మిక సాహిత్య సృష్టికర్తలు భావించినట్లు స్స్పష్టమౌతున్నది.సత్యవాక్పాలన గురించి మనుస్మృతి ఇలా చెబుతున్నది:

శ్లో.సత్యం బ్రూయా త్ప్రియం బ్రూయాత్,న బ్రూయా త్సత్య మప్రియం
ప్రియంచ నానృతం బ్రూయాత్ - ఏష ధర్మః సనాతనః
(మనుస్మృతి VI-138)

          "సత్యమునే పలుకుము ప్రియమునే పలుకుము.సత్యమైనను అప్రియము పలుకకుము.ప్రియమైనను అసత్యమును పలుకకుము." - ఇంతకన్న ఎక్కువ ఎవరైనా చెప్పగలరా?అలా చెబితే సుత్తిలా ఉండదూ!

          సత్యం తర్వాత సనాతన ధర్మం ఎక్కువ కీర్తించినది పరోపకార పరాయణత్వాన్ని. "పరోపకారార్ధ మిదం శరీరం" అన్న శ్రుతివాక్యం అసలు ఈ శరీరం మనకు లభించిదే పరోపకారం కోసం అని చెప్తున్నది కదా!

శ్లో. హే బాల!లోకసేవార్ధం కృత్స్నం త్వజ్జీవితం సదా
అర్పయిత్వా హర్షేణ సార్ధకం కురు యత్నతః!

          "ఓ మానవా! ఎల్లప్పుడు పరోపకారార్ధము నీ జీవితమునంతటిని సంతోషముతో అర్పించి ప్రయత్నపూర్వకముగ నీ జీవితమును సార్ధకము చేసుకొనుము." - ఇక్కడ హర్షేణ, యత్నతః అనే రెండు మాటల్నీ వాక్యపూరణ కోసం వాడలేదని గమనించాలి.ఎందుకంటే, పరోపకారం అనేది మనసులో ఏడుస్తూ మెహర్బానీ కోసం చెయ్యకూడదు. అట్లాగే అవకాశం దొరికితే చెయ్యడం కాదు,మన స్థాయిలో పూనుకుని ఎంతో కొంత పరులకి ఉపయోగపడితేనే ధర్మం నిలబడుతుంది!


          సనాతన ధార్మికుల  శాస్త్రీయత అంతా ఇంద్రియనిగ్రహం గురంచి మిగిలిన అన్నింటికన్న ఎక్కువ సార్లు చెప్పడంలోనే తెలుస్తుంది - ఎన్నిసార్లు "ధర్మం నీకు క్షేమాన్ని కలిగిస్తుంది!అధర్మం నీకు నాశనాన్ని తెచ్చిపెడుతుంది!" అని చెవినిల్లు గట్టుకుని చెప్పినప్పటికీ ఇంద్రియాల మీద అదుపు లేనివాడికి తొలి అడుగు క్షణిక సుఖాల వైపుకే పడుతుంది - సర్వభ్రష్టం అయ్యాక తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత? మధ్యలోనే తెలిసినా  ఆ సమయం అంతా వృధాయే కదా -  ప్రాచీన గురువరేణ్యులలో కూడా కొందరు ఈ స్థితిని కొతకాలం అనుంభవించి కాబోలు "ముందు తెలిసెనా ప్రభూ!అన్ని చైదములు చేసి యుందునా?" అని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు!

          సనాతన ధార్మిక సాహిత్య సృష్టికర్తలు కీర్తించిన మరొక విశిష్టమైన లక్షణం క్షమాగుణం.క్షమ అంటే కష్ట నష్టములను గానీ పరుష వాక్యాలను గానీ సహించి మనని కష్టపెట్టిన వారిమీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకుండా మౌనంగా ఉండిపోవటం.

శ్లో.నరస్యాభరణం రూపం, రూపస్యాభరణం గుణః
గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమా!


          "మానవుని యొక్క ఆభరణం రూపం.రూపం యొక్క ఆభరణం గుణం.గుణం యొక్క ఆభరణం జ్ఞానం.జ్ఞానం యొక్క ఆభరణం క్షమ" - అంటే,మానవునికి రూపం కన్న గుణం కన్న జ్ఞానం కన్న క్షమయే శోభని ఇస్తుందని పై శ్లోకం చెబుతున్నది.అందుకే సత్పురుషులు,ముముక్షువులు,భగవంతుడు ఇతరుల తప్పుల్ని  క్షమిస్తూ ఉంటారు.

          మోక్ష సాధనకు వైరాగ్యం చాలా అవసరం. తన చుట్టూ ఉన్న సమస్తాన్నీ దోషదృష్టితో చూసి విషయవాసనల పట్ల జుగుప్సను పెంచుకుని వస్తుగతమైన వాంచలను తిరస్కరించటాన్ని వైరాగ్యం అంటారు.మానవునికి వైరాగ్యం అనేక కారణాల వల్ల కలుగుతుంది - దుఃఖము చేత కలుగు వైరాగ్యము, భయము చేత కలుగు వైరాగ్యము, వివేకము చేత కలుగు వైరాగ్యము.వీటిలో మూడవది శ్రేష్ఠమైనది.మొదటి రెండూ దుఃఖము గానీ భయము గానీ తొలగిపోగానే వాటి వల్ల కలిగిన వైరాగ్యం కూడా మాయమైపోయే అవకాశం ఉంది.

          యుగాన్ని బట్టి యుగధర్మం ఉంటుంది.కలియుగంలో మనుషులు దానం చేత తరిస్తారని పరాశర స్మృతి ప్రకటిస్తున్నది.

శ్లో.తపః పరం కృతయుగే,  త్రేతాయాం జ్ఞానముచ్యతే
ద్వాపరే యజ్ఞమేవాహుర్దాన మేకం కలౌయుగే!

          "కృతయుగంలో తపము, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగంలో యజ్ఞము కలియుగంలో దానము ముఖ్యమైన ధర్మాలు." - తన స్వార్జితమైన గో హిరణ్యాదులను మూల్యం తీసుకోకుండా శాస్త్రవిధి ననుసరించి తనకు వాటిపై గల హక్కును వదులుకుని యోగ్యుడగు మరొకనికి పూర్తి హక్కులను ఇవ్వడమే దానం అని నిర్వచించటాన్ని బట్టి ఏది పడితే అది ఎవడికి పడితే వాడికి ఎలా పడితే అలా ఇచ్చేది దానం కాదని తెలుసుకోవాలి. తన కష్టార్జితాన్ని మాత్రమే దానం ఇవ్వాలి.యోగ్యులైన వారికే దానం ఇవ్వాలి.ఇతరేతరమైన ప్రతిఫలం ఆశించకుండా దానం చెయ్యాలి.దానం ఇచ్చే వస్తువు మీద వ్యామోహం పూర్తిగా తెంచుకున్నాకనే దానమివ్వాలి.

          కాలం అనే ఒక తన్మాత్రను గురించి ప్రాచీన భారతీయ విజ్ఞానులు తెలుసుకున్నది మాత్రమే జ్ఞానం అని వేదం అనిదంపూర్వమైన రీతిలో స్థాపించి కాలాన్ని సద్వినియోగం చేసుకోవటమే మానవులకు పరమలక్ష్యం అని నిర్దేశించటం ఒక్కటే సనాతన ధర్మాన్ని ఇతర ధర్మాల కన్న అత్యున్నతమైన స్థాయిలో నిలబెడుతున్నది!

          వైదిక సూత్రాల ప్రకారం మానవుడు ఎప్పటి వరకు తనకు జీవిత లక్ష్యమును నిశ్చయించుకొనడో అప్పటి వరకు అతని జీవిత కాలము వ్యర్ధము.ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మానవుడు ప్రతి క్షణం ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రయత్నించాలి,ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగిపోకూడదు,నిరాశలో నిలిచిపోయి దిక్కులు చూడకూడదు,నిరంతరం లక్ష్యం వైపుకు ప్రయాణిస్తూనే ఉండాలి.


శ్లో.ధనే నష్టే పునః ప్రాప్తుం, శక్తి స్యాద్యస్య కస్యచిత్
గత కాలస్తు నాయాతి - ఏవ మీశ్వర శాసనం!

          "ఎవడైనను ధనం పోగొట్టుకుంటే మరల సంపాదింప వచ్చును. ఎవడైనను శక్తిని పోగొట్టుకుంటే మరల సంపాదింప వచ్చును. కానీ గడిచిన సమయం మాత్రం తిరిగి రాదనేది ఈశ్వర శాసనం." - కాబట్టి ప్రతి మనిషీ రోజులో మెలకువగా ఉండే సమయాన్ని తనకు అనుకూలమైన రీతిలో విడగొట్టుకుని ఆ ఏర్పాటు ప్రకారం అలసటకు తావు లేని పద్ధతిలో తన లక్ష్యాన్ని చేరుకోవాలి.


          మన చుట్టూ కనిపించే మనుషుల్ని మూడు విధాలుగా వర్గీకరించవచ్చును - మనల్ని ద్వేషించేవారు, మనల్ని ప్రేమించేవారు, మనపట్ల ఉదాశీనులు.లక్ష్యము పట్ల ధృవనిశ్చయమున్న వ్యక్తికి ఈ మూడు విధాలైన వ్యక్తులూ సహాయకారులే అవుతారు.

          హిందువులు యజ్ఞయాగాదులలో చేసే జంతుహింసను నిరసించి దానిమీద పోరాడటం కోసం గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించి అహింసకు పెద్ద పీట వేశాడనీ అప్పటివరకు హిందువులకు అహింస అంటే ఏమిటో తెలియనే తెలియదనీ చెప్పేవారు వైదిక సాహిత్యమే అహింసకు ఎన్నో నిర్వచనాలను ఇచ్చి అహింసా పరమో ధర్మః అని కీర్తించిందనేది యెందుకు మర్చిపోతున్నారో!

          భక్తిమార్గంలో మానసిక పూజ అత్యంత ప్రధానమైనది.ఈ పూజలో అష్టభావనాసుమాలతో భగవానుని అర్చిస్తారు.ఆ అష్ట పుష్పాలు ఇవే:

శ్లో.అహింసా ప్రధమం పుష్పం, పుష్ప మింద్రియనిగ్రహః
సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః
శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యానపుష్పం తధైవచ
సత్య మష్ట విధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్!


          ఇక్కడ అహింసను ప్రధమ పుష్పంగా కీర్తించడం  దాని ప్రాధాన్యతను చెప్పడం కోసమే కదా!అహింస యొక్క ప్రాముఖ్యతను ప్రజల దృష్టికి తెచ్చి జనులందరు దానిని పాటించునట్లు చేయుటకే ధర్మప్రచారం జరుగుతుందని వ్యాసభగవానుడు మహా భారతంలోని శాంతిపర్బంలో చెప్పాడు.

          మరి ఇంత అత్యున్నతమైన భావ పరంపరతో ప్రపంచం మొత్తాన్ని ఉత్తేజ పరహగలిగిన శాస్త్రీయ చైతన్యం కలిగిన సనాతన ధర్మం ఆస్పృశ్యత అనే ఒక  దురాచారాన్ని ఎలా కొన్ని శతాబ్దాల పాటు సాంఘిక నేరం అని చెప్పదగిన స్థాయిలో పాటించింది?భర్త చనిపోతే బతికి ఉన్న అతని భార్యని కూడా బలబంతాన చితి మీదకి నెట్టేసేవాళ్ళని తెలుస్తున్న వింటుంటేనే ఒళ్ళు జలదరించే భయంకరమైన దురాచారాల్ని కూడా తొలగించుకోగలిగిన వాళ్ళు ఈ ఒక్క దురాచారాన్ని తొలగించుకోలేక ఎందుకు సిగ్గుతో తల దించుకుంటున్నారు?ఇంగ్లీషువాళ్ళ నుంచి స్వతంత్రం తెచ్చుకున్నాక అంబేద్కర్ అనే ఒక వ్యక్తి రాక్షసమైన పట్టుదలతో రాజ్యాంగంలో కఠినమైన నియమాలు ఏర్పరచటం వల్లనూ ప్రత్యేక చట్టాల్ని రూపొంధించటం వల్లనూ ఈ తరంలో బలహీనపడింది గానీ లేకపోతే ఇప్పటికీ కొనసాగుతూ ఉండేది.అంబేద్కర్ తండ్రి ఇంగ్లీషువాళ్ళ సైన్యంలో మంచి స్థాయిలో ఉండటం వల్ల ఈయన పైకి రాగలిగాడు గానీ లేకపోతే ఈ మార్పు కూడా వచ్చి ఉండేది కాదు.అంబేద్కర్ పని చేస్తున్న కోర్టులో ఈయన తక్కిన వాళ్ళకన్న అత్యంత ప్రతిభాశాలి అయినా పక్కన కూర్చునే పాటి సమానస్థాయి గౌరవం కూడా ఇవ్వలేదు - క్లర్కులూ బంట్రోతులూ కూడా ఫైళ్ళని మిగిలిన వాళ్ళకి చేతికి అందించి ఈయనకి మాత్రం ఠాప్పున చప్పుడయ్యేలా బల్ల మీదకి విసిరేవాళ్ళంటే ఆయన హృదయం యెంత వుడికి పోయి ఉంటుందో ఆలోచించుకోండి!

          కొద్ది రోజుల క్రితం వరకు నాకు అస్పృశ్యతని గురించి తెలిసింది చాలా తక్కువ, ఎక్కువ తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదు.కానీ, ఈ మధ్యనే నా బ్లాగులోనే ఒక పోష్టు దగ్గిర ఒక చిత్రమైన సన్నివేశం నడిచింది.ఒక వ్యాఖ్యాత నన్ను "అస్పృశ్యతని గురించి మీరేమైనా పరిశోధించారా?దాని గురించి పోష్టు రాశారా!" అను అడిగితే నేను అది ముగిసిపోయిన కధ కదా, పైగా సున్నితమైన విషయం కాబట్టి భవిష్యత్తులో కూడా రాయకపోవచ్చు అని జవాబు చెప్పాను.అయితే, ఒక అనామక హిందూద్వేషి దీనికి చాలా విచిత్రంగా స్పందించాడు - నేనే ప్రశ్న వేసి నేనే జవాబు చెప్పి నాటకం ఆడినట్టు ఆరోపించాడు!నాకు చాలా అయోమయం అనిపించింది - ఎన్నోసార్లు ఎన్నో బ్లాగుల్లో ఎంతోమందితో ఎన్నో యుద్ధాలు నా సొంత ఐడితోనే చేసిన నాకు నా సొంత బ్లాగులో వేరే ఐడితో కామెంట్లు వేసుకోవాల్సిన ఖర్మ దేనికి?ఇతనే కాదు హిందూద్వేషుల వాదనలన్నీ ఇలాగే అఘోరిస్తున్నాయి.ఒకసారి హిందూద్వేషం పుట్టాక తెలివితేటలు పోతాయా! తెలివితేటలు పోయాక హిందూద్వేషం పుడుతుందా!

          నాకు ఇలాంటి తెలివితక్కువ వాగుడు అసహ్యంతో కూడిన చిరాకు నిండిన విసుగును కలిగిస్తుంది!ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం గురించీ నేను రాయను.మొదట నాకు కుతూహలం పుట్టాలి.నాకు కుతూహలం కలగని విషయం గురించి ఒతరుల కోసం  నేను ఎప్పుడూ రాయను.నాకు కుతూహలం లేకుండా రాస్తే రాధయె రుక్మిణి పోష్టులా ఏడిసినట్టు ఉంటుంది.కానీ, అస్పృశ్యత గురించి అప్పటివరకు నాకు లేని కుతూహలాన్ని ఈ కో.మె.మే(కోడిమెదడుడుమేధావి) పుట్టించాడు - వీళ్ళకి ఇంత ద్వేషం పుట్టించిన అస్పృశ్యత యొక్క ఆదీ అంతమూ చూడాలని కుతూహలం అప్పుడే పుట్టింది.

          ఒక కీలకమైన ప్రశ్నకు జవాబు వెతుకుతూ పరిశోధన మొదలుపెట్టాను.తర్వాత కాలంలో దురాచారం కింద పరిగణించబడిన సతీ సహగమనం,కన్యాశుల్కం,వరవిక్రయం వంటివి మొదటి రోజుల్లో ఒక చారిత్రకమైన అవసరం వల్ల ఉనికిలోకి వచ్చాయి.ఈ దేశం మీద దాడికి వచ్చిన ముస్లిం మతానుయాయులు వారి అలవాటు చొప్పున ఓడిపోయిన వారి స్త్రీలని చెరచటం,బానిసల కింద మార్చటం లాంటివి చేసేవాళ్ళు గనక ఆ నీచమైన బానిసత్వానికి తలవంచలేక దానికన్న అగ్నికీలలకి ఆహుతి కావడమే నయం అనిపించంది,ఆ కాలంలో అది సదాచారమై ఆ భయం లేని కాలంలో అది దురాచారం అయింది.ఆస్తుల పంపకంలో ఒక వ్యక్తి తగ్గడం,జీవితకాలం పాటు పోషించాల్సిన భారం తప్పడం లాంటి దురాశలు అండ లేని ఆడవాళ్ళని బలవంతంగా చితుల మీదకి తోసెయ్యడానికి  కారణం అయి ఉంటాయి. అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్టు కొందరు సత్పురుషులు అందరి చేత మంచిపనుల్ని చేయించటానికి పెట్టిన నియమాలు ఆషాఢభూతుల చేత చెడు ఫలితాలని ఇవ్వటం అప్పుడప్పుడు చాలాచోట్ల జరుగుతూనే ఉంటుంది - స్త్రీకి రక్షణ కోసం వివాహ వ్యవస్థని ఏర్పరిస్తే దాన్ని స్త్రీకి చెరసాలని చేశారు,ఆ చెర నుంచి తప్పించటానికి స్త్రీస్వేచ్చని ప్రతిపాదించి ఉద్యమించి సాధించి చూపిస్తే కొందరు స్త్రీలు విశృంఖలత్వానికి తెగబడి చట్టబద్ధమైన వ్యభిచారం చేస్తున్నారు!ఆస్తుల వారసత్వం నుంచి అస్థుల నిమజ్జనం వరకు అన్నింటినీ మగాళ్ళకే కట్టబెట్టి అందరూ మగపిల్లల కోసమే ప్రయత్నించి ఆడపిల్లని చంపటం లాంటివి చెయ్యటంతో ఆడపిల్లలకి కరువొచ్చి వాళ్ళని డబ్బిచ్చి కొనుక్కోవాల్సి వచ్చింది - అదే కన్యాశుల్కం అనే దురాచారానికి మూలం. ఆడపిల్లల క్రయవిక్రయాలు లాభసాటి కావడంతో మగపిల్లల సంఖ్య తగ్గి వరశుల్కం/వరవిక్రయం/వరకట్నం అనే దురాచారం మొదలైంది.సహగమనం నుంచి మొదలుపెట్టి పరిశీలించి చూస్తే అన్ని  దురాచారాలనీ వాటి ఉద్భవం, వైభవం, నిధనం అనే మూడు దశల్లోనూ ప్రయోజనం,క్షేమం,ఆత్మరక్షణ, లాభం వంటి ఆర్ధిక విషయాలే మనుషుల్ని శాసించాయనేది తెలుస్తుంది. ఇలా మిగిలిన అన్ని దురాచారాలకి మొదలూ తెలుస్తున్నది, దాని వెనక ఉన్న ఆర్ధిక పునాదీ కనపడుతున్నది.మరి, అస్పృశ్యత యొక్క తొలినాటి రూపం ఏమిటి?దాని వెనక ఉన్న ఆర్ధిక పునాది యేమిటి?

          అస్పృశ్యత లనేవి చాలా ఉన్నాయి,కానీ అనువంశికమైన అస్పృశ్యతయే కదా దురాచారం అని పిలువబడుతున్నది.ఇది ఎప్పుడు మొదలైందో తెలుసా!బౌద్ధమతం పుట్టి పెరిగి హిందూమతాన్ని ప్రభావితం చేసి తను బలహీన పడుతున్న దశలో వికృత రూపం దాల్చింది!

          మొదట్లో అందరూ ఈ అస్పృశ్యతని తీసుకెళ్ళి ఆర్య-ద్రవిడ సిద్ధాంతానికి అంటు కట్టేశారు - వారి దాని ప్రకారం ఎక్కడినుంచో ఇక్కడ లేని గుర్రాల్ని ఎక్కి వచ్చి నల్లగా ఉన్న స్థానికులైన ద్రవిడుల్ని గెలిచి విజయ  గర్వంతో మిడిసిపడే తెల్లగా ఉన్న ఆర్యులు జాత్యహంకారం కాలి నుంచి తల వరకు ఎక్కిపోయి "జన్మతోనే మేము అధికులం!జన్మతోనే మీరు అధములు!" అని మతగ్రంధాల ద్వారా ప్రకటించి అమాయకులైన దళితుల్ని నమ్మించి దోపిడీని శాశ్వతం చేసుకోవటానికి వేసిన బృహత్తర ప్రణాళికయే అస్పృశ్యత!

          ఆర్య-ద్రవిడ సిద్ధాంతం అబద్ధమని తేలిపోవటంతో దానితో పాటు దీన్ని కూడా చెత్తబుట్టలోకి పారేశారు.మిగిలిన వాటిల్లో అంబేద్కర్ విశ్లేషణయే వాస్తవానికి దగ్గిరగా ఉండి అన్ని పరిశోధనల్నీ పరీక్షల్నీ తట్టుకు నిలబడింది - ఇవ్వాళ అందరూ అస్పృశ్యతకి సంబంధించి అంబేద్కర్ సూత్రీకరణల్నే పరమప్రమాణం అని ఒప్పుకుంటున్నారు.

          చారిత్రకపరమైన ఆధారాల ప్రకారం అస్పృశ్యత పూర్వ సామాన్య శకం 600 నుంచి సామాన్య శకం 200 మధ్యన పొటమరించి సామాన్య శకం 200 తర్వాత ఉధృత స్థాయికి చేరుకున్న్నది.సామాన్య శకం ఏడవ శతాబ్దిలో భారత దేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు Xuanzang కసాయివాళ్ళు,జాలర్లు,తలార్లు,నృట్యగాన ప్రదర్శనలు ఇచ్చే నటులు,పాకీవాళ్ళు పంక్తిబాహ్యులు/అస్పృశ్యులు అనే పేరున  గ్రామాలకీ నగరాలకీ బయట నివసించేవారని వర్ణించాడు.అంబేద్కర్ అస్పృశ్యతని పాటించటానికి రెండు బలమైన కారణాలను పేర్కొన్నాడు - మొదటిది బౌద్ధమతం ప్రచారం చేసిన అహింస,ముఖ్యంగా జంతుహింసని నిరసించటం అనేది అతి ప్రభావాన్ని చూపించి జంతుహింసని నిషేధించారు.అయితే అప్పటికే ఆహారం కోసం గానీ ఇతర అవసరాల కోసం గానీ వదిలెయ్యటానికి వీల్లేనంత గట్టిగా అలవాటు పడినవారు వాటిని వొదులుకోలేకపోవటంతో వైదిక కాలంలోని చండాలురకి విధించిన సాంఘిక బహిష్కారాన్నే వీరికీ విధించారు.అయితే వైదిక కాలంలోని చండాలత్వం అనువంశికం కాదు.వైదిక కాలం నాటి చండాలత్వం ఆధునిక కాలపు చట్టాల్లోని యావజ్జీవకారాగారం వంటి ఆ వ్యక్తికి మాత్రమే పరిమితమైన శిక్ష - సంతానం తిరిగి సమాజంలోకి వచ్చి గౌరవప్రదమైన జీవితం గడిపే వీలు ఉండేది.

          వెలివేతకి గురి కాబడిన సమూహాలు అన్నీ జంతువధ వంటి అంటురోగాల్ని వ్యాపింపజేసే వృత్తులకు సంబంధించినవారు కావడం గమనించాలి. నృత్యగానవినోదులలో మద్యపానం,మాంసభక్షణం, విశృంఖలత్వం ఉండటం పంక్తిబాహ్యానికి కారణమైందని అందరికీ తెలిసిందే కదా.ఆయా వృత్తులలోనే అటువంటి ఇబ్బంది ఉండటంతో వాటికి సిద్దపడినవారు ఈ వెలివేతని కూడా మౌనంగానే భరించారు - స్పార్టకస్ అధ్వర్యంలో జరిగిన బానిసల తిరుగుబాటు వంటివి భారతదేశంలో జరిగినట్టు లేదు.దీనికి కారణం అస్పృశ్యత బానిసల వ్యవస్థ కంటే కొంత సుకుమారమైనది కావటమే!

          అక్కడి బానిసల వ్యవస్థలో వలె ఇక్కడి బహిష్కృతులు అసలు అస్తిత్వం లేని పరాధీనులు కారు,వారి వృత్తి వల్ల ఆదాయమూ సొంత ఆస్తీ కుటుంబ జీవితమూ అన్నీ ఉండేవి.కానీ, వృత్తికి సంబంధించిన అపరిశుభ్రత, అపరిశుభ్రత వల్ల వచ్చే అంటువ్యాధుల భయం వీరిని సాటి మనుషుల నుంచి  గౌరవ మర్యాదలకు నోచుకోని దయనీయమైన స్థితిలోకి నెట్టివేశాయి. వైదిక కాలంలోని చండాలురకు వలె ఒక తరంతో అంతమైపోకుండా తరాలకు తరాల్ని కబళించటానికి మరో చిత్రమైన కారణం పులి మీద పుట్ర్లా వచ్చి పడింది.ఈ అస్పృశ్యత ఉనికిలోకి వస్తున్న కాలంలోనే సమాంతరంగా లాభసాటి వృత్తుల వారు కౌశలం పెంచుకోవటానికి ఒక్కచోట చేరి వాళ్ళలో వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటూ వాళ్ళ పిల్లలకి తమ విద్యని వారసత్వం చేసుకోవటం వల్ల కులవ్యవస్థ బిరుసెక్కి పోయింది.దీనితో బహిష్కృతుల సంతానం  ప్రధాన స్రవంతిలోకి రావడానికి దారి మూసుకుపోయింది.

          ప్రజలని విడగొట్టి అధికారం దక్కించుకోవాలనే దురద ఉన్నవాళ్ళు తప్ప చరిత్రని నిజాయితీతో అధ్యయనం చేసినవారు ఎవరూ కులవ్యవస్థకు గానీ అస్పృశ్యతకు గానీ బ్రాహ్మణులే మూలకారణం అని నిదించలేరు.తన కులానికి జరిగిన అన్యాయం తెలిసి తను అనుభవించి ఉద్యమించి కేవలం ఒక్క తరంలోనే వూహించని స్థాయిలో అస్పృశ్యతని బద్దలు కొట్టగలిగిన అంబేద్కర్ మహాశయుడికి లేని నోటి దురద అంబేద్కర్ చేసిన కృషిలో వెయ్యో వంతు కూడా చెయ్యలేని కంచె ఐలయ్యకీ కదిరి కృష్ణకీ ఎందుకు పుడుతున్నది?బ్రాహ్మణులు చేసింది అప్పటికే సమాజం యొక్క ఆమోదం పొందిన దాన్ని record చేసి తర్వాత తరాల వారికి communicate చెయ్యటమే!ఒక దురాచారం ఏ ఆర్ధిక పునాది మీద పైకి లేచిందో ఆ పునాది అట్లాగే ఉన్నంతకాలం మనుషులు వ్యక్తిగతమైన ఉద్రేకాలతో ఎంత భీబత్సం చేసినా ఫలితం శూన్యం.

          ఆర్ధిక పునాది మారకపోవటంతో వ్యవస్థీకృతమై కొన్ని శతాబ్దాల పాటు కొనసాగిన ఈ దుస్థితి మీద ఒక గట్టి దాడి చేసిన తొలి వ్యక్తి జ్యోతి బా పూలే - దంపతు లిద్దరూ కలిసి విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి దళితులకు చదువు పట్ల ఆసక్తిని కలిగించి మంచి పునాదిని వేశారు. ఆ తర్వాత శ్రీ B.R.Ambedkar గారు తమ ప్రయత్నం మొదలుపెట్టారు.తన సమకాలికులలో అత్యంత ప్రతిభావంతుడైన న్యాయదృష్టి గల శ్రీ అంబేద్కర్ గారు అస్పృశ్యత అనే మురికిని కడిగేసి సనాతన ధర్మాన్ని పరిశుభ్రం చేయాల్ని అహరహం శ్రమించారు.కానీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీతో సహా అప్పటి మూర్ఖ హిందూ నాయకులు అడుగడున అడ్డు తగులుతుండటంతో విసుగెత్తి పోయి సా.శ 1956 అక్టోబరు నెలలో “I was born a Hindu, but I solemnly assure you that I will not die as a Hindu.” అని ప్రకటించి రెండు అనుచరులతో బౌద్ధమతాన్ని స్వీకరించారు.అసలు 1935లోనే సూత్రప్రాయంగా హిందూమతాన్ని వదలడానికి నిశ్చయించుకుని అన్ని హైందవేతర మతాలనూ పరిశీలించి మిగిలిన వాటిని తిరస్కరించి బౌద్ధమతమే తగినదని ఎంచుకోవటానికి అంత సమయం పట్టింది.

          దుర్భరమైన అణచివేతకు గురవుతున్న దళితులకు తమ దీనత్వాన్ని పోగొట్టుకోవటానికి చేస్తున్న యుద్ధంలో ఉత్సాహాన్ని కలిగించే ఒక మతాన్ని ఇవ్వాలనుకుని తను ఆశించిన లక్షణాలన్నీ బౌద్ధంలో ఉన్నాయని బౌద్ధంలోకి ప్రవేశించారు.కానీ ఆంబేద్కర్ బౌద్ధమతం స్వీకరించే సమయానికి బౌద్ధం కూడా చాలా మారిపోయింది - Japan లోని Buraku జాతివారూ Korea లోని Paekchong జాతివారూ Tibet లోని Ragyappa జాతివారూ అస్పృశ్యతని అనుభవిస్తూనే ఉన్నారు!అయితే శ్రీ అంబేద్కర్ గారు తన సొంత అధ్యయనంతో బౌద్ధంలోని ప్రగతి శీలమైన మౌలిక భావాలను మాత్రం  తీసుకుని నవయాన బౌద్ధం అనే ఒక కొత్త శాఖని ప్రారంభించారు గానీ ఆయన కీర్తిశేషులు కావటంతో సమర్ధులైన యువనేతలు లేని ఆ నవయాన బౌద్ధం నాగపూరు , ముంబాయి వంటి నగరాల్లోనూ ఉన్న అతి తక్కువ మంది సభ్యులతో అసంఘటితమై ఉంది.

          పునాదిని మార్చుకోకుండా పైపై మెరుగులు చూసి భ్రమపడి ఎన్ని మతాలు మారినా మన రాత మారక విసుగు పుట్టటం తప్ప నిజమైన సుఖశాంతులు లభించవు!ఎన్నో ఆటుపోట్లను చూసిన హిందూ పురాణ యువతి ఒక పొరపాటుకు యుగాల పాటు కుమలడం, అనవసరం!కాలచక్రం తిరిగేటప్పుడు కింద ఆకు పైకీ పైని ఆకు కిందకీ వెళ్ళడం సహజం!ఏడిచేవాడిలోనూ ఏడ్పించేవాడిలోనూ వాడే ఉండి విఠలుడు ఆడుతున్న లీలా వినోదం ఇది!ఆదమరిచి మనం ఉన్నప్పుడు వెనక నుంచి తోసి కింద పడేస్తాడు!దెబ్బ తగిలి మనం కుములుతుంటే ఓదార్చకుండా పెద్ద  పెద్ద కళ్ళతో మన కళ్ళలోకి చూస్తూ  నవ్వుతాడు - గొప్ప మాయ గాడు!మనకి "నేను ఏడుస్తుంటే వీడు నవ్వుతాడా?" అని కచ్చి పుట్టి వెంటపడితే "ఇది నేర్పడానికేరా నేను నవ్వింది!" అని పకపకా నవ్వుతూ దూరంగా పారిపోతాడు!ఈయన గారి ఉత్తమ ఇల్లాలు లచ్చిందేవి ఈయన కన్న చిలిపి మాతల్లి!నిన్నూ నన్నూ ఒకచోట కూలేసి ఒక్క గోరుముద్దనే ఇద్దరి మధ్యన తిప్పుతూ "పెట్టేస్తున్నా,పెట్టేస్తున్నా, లటుక్కున పట్టెయ్యాలి,గుటుక్కున మింగెయ్యాలి - ఇదుగో వాడికి పెట్టేస్తున్నా!" అని వూరిస్తుంది!నా కడుపాత్రం కొద్దీ నేను లాక్కుంటే నివ్వు బిక్కమొగం పెడతావు, నీ కడుపాత్రం కొద్దీ నువ్వు లాక్కుంటే నేనుబిక్కమొగం పెడతాను!ఇద్దరికీ పోటీ పెట్టి ఇద్దరి కడుపులూ నింపటమే అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, సురాసురుల కడుపారడి బుచ్చెడి అమ్మ తన పెనిమిటితో కలిసి ఆడుతున్న లీలా వినోదపు జగన్నాటకం!ఇంత హడావిడి దేనికీ అంటే కాలక్షేపం కోసం!ఎల్ల కాలమూ అన్నీ అమిర్చి పెడుతుంటే పిల్ల వెధవలకి బద్ధకం పెరిగి పోదూ!అనంత కాలం పాటు చీమ చిటుక్కుమన్నా వినపడేటట్టు నిశ్శబ్దంగా ఉండాలంటే బోరు కొట్టదూ!అర్ధం కాకపోతే ఇద్దరికీ ఏడుపు, అర్ధం చేసుకుంటే ఇద్దరికీ నవ్వు - అంతగాక ఇదంతా ఏమిటి?

          వేదం వినిన శూద్రుడి చెవుల్లో సీసం మరగబెట్టి పోశారనీ ...వేదం చదివిన శూద్రుడి నాలుక కోశారనీ..బ్రాహ్మడిని తిట్టిన శూద్రుడి నోట్లో సలసల కాలే ఇనుప కడ్డీని దోపారనీ ..బ్రాహ్మల్ని ఏ అంగంతో శూద్రులు అవమానిస్తే ఆ అంగాన్ని నరికేశారనీ ..ఏ పురాణంలో నైనా, ఏవంటి పండితులు గుర్తించి ఇతిహాసంలో నైనా, ఏ చరిత్ర గ్రంధంలోనైనా ఉందా?లేనప్పుడు.. మనుస్మృతిలో కనబడుతున్నాయి కాబట్టి మొత్తం హిందూ మతాన్ని శూద్ర వ్యతిరేకిగా దళిత ద్వేషిగా ముద్ర వేయటం సబబేనా?

          సాధారణంగా లోకంలో ఏ రచయిత అయినా తాను రాసే వాటిలో పొంతన ఉండేలా జాగ్రత్త పడతాడే! మరి, విజ్ఞుడు, విశాల దృష్టి కలవాడు, విశ్వమానవులందరికీ అన్ని కాలాల్లో పనికొచ్చే విషయాలు చెప్పినవాడు అని ఎందరో పాశ్చాత్య మేధావులు మెచ్చుకున్న మనుధర్మశాస్త్రకర్త తను చాటుతున్న ధర్మసూత్రాలలో పొంతన ఉండేట్టు చూసుకోడా? అతడే ప్రకటించిన  నియమాలు , ప్రమాణాలకు, మొత్తంగా అతడి ధర్మశాస్త్రం తీరుకు విరుద్ధంగా అపభ్రంశాలు కనబడితే అవి తర్వాత కాలంలో ఎవరో ప్రబుద్ధులు చొప్పించినవని స్పష్టమే కదా?

          మనుస్మృతిలో ప్రక్షిప్తాల గోల బాధిత సామాజిక వర్గాలలో చైతన్యం పెరిగిన తర్వాత మాత్రమే వినవస్తున్నది కాదు.  మహర్షి దయానంద సరస్వతి, విశ్వనాథ్ నారాయణ్ మండలిక్, భారతరత్న పి.వి.కాణే వంటి పండితులు గుర్తించినదే. 

          అన్నిటికంటె పరమ ప్రమాణం వేదం. దానిలో ప్రక్షిప్తాలు లేవు. వేరు వేరు పాఠాలు లేవు. ఎక్కడా ఒక అక్షరం పొల్లుపోకుండా, ఎవరూ మార్చటానికి వీలు లేకుండా తిరుగులేని కట్టడితో అనాదిగా కాపాడబడుతూ వస్తున్నది కాబట్టి వేదం విషయంలో సందిగ్ధత లేదు. ఆది మూలం వేదం అని మనువే చెప్పినందున వేదంలో చెప్పినదానికి విరుద్ధంగా మనుస్మృతిలో ఏదైనా చెబితే అది మనువు అభిప్రాయం కాదని నిరాకరించవచ్చు.  ఒకవేళ వేదం వారించకపోయినా, ధర్మశాస్త్రంలో నిషేధం లేకపోయినా, శిష్టాచారానికి వ్యతిరేకం కాకపోయినా .. అవన్నీ తెలిసి వాటిమీద పరిపూర్ణ గౌరవం ఉండికూడా ఏదైనా విషయం తన అంతరాత్మ అంగీకరించలేకపోతే మనసుని చంపుకుని దానిని పాటించాల్సిన పని లేదని మనువే మినహాయింపు ఇచ్చాడు. అన్యమతాలకు చెందిన ఏ ధర్మశాస్త్రమూ మానవులకు అనుమతించని వెసులుబాటు ఇది.

          అస్పృశ్యత అనేది భారతదేశంలో క్రమేణ అంతరించి పోతున్నది.ఏనాడు అది ప్రభవించి వృద్ధిని పొందిందో ఆనాటి ఆర్ధికపునాది ఈనాడు ధ్వంసమై పోయింది గనక మళ్ళీ ఉధృతమయ్యే ప్రసక్తి లేదు.హిందువులు తమకు ప్రమాణమైన వేదం చెప్పని అస్పృశ్యతను తమ మనసుల నుంచి మనుషుల మధ్యనుంచి సమూలం పెరికివేయాలి.హిందువులు వైదిక ధర్మం నుంచి దూరం కావడం చేతనే స్వదేశంలో దుస్సహమైన పరాధీనతనీ పరదేశాల్లో దుర్భరమైన ద్వితీయ స్థానాన్నీ అనుభవిస్తున్నారనేది చరిత్ర కళ్ళముందు దివిటీలు కట్టి చూపిస్తున్నది గనక హిందువులు తిరిగి వైదిక ధర్మంలోకి నదవటంవల్లనే నారాయణ ప్రణయినీ నయనాంబువాహపు తాకిడికి దుష్కర్మఘర్మం మరోసారి తగలనంత చిరాయు దూరం వరకు తొలగిపోయి ఆనందకందమనిమేషమనంగతంత్రం సిద్ధిస్తుందనేది వ్యాసపరాశరాదిషిర్డీసాయినాధపర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్న శాశ్వత సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

Tuesday, 6 November 2018

వేదాలు అపౌరుషేయం అనడం హేతుబద్ధమేనా?వేదాన్ని హిందూఋషులకి చెప్పినట్టే బైబిలుని కిరస్తానీయులకీ ఖురానును మహమ్మదీయులకీ ఇచ్చి ఉండవచ్చు కదా - అవి కూడా దైవగ్రంధాలే అనుకోకూడదా!

          హిందువుల పవిత్రగ్రంధమైన వేదాన్ని అపౌరుషేయం అంటారు.అపౌరుషేయం అంటే మనుషులు సృష్టించినది కాదు అని అర్ధం. - దాదాపు ప్రపంచంలోని అన్ని మతాలూ తమ మతానికి ఆధారమైన మూలగ్రంధాన్ని దేవుడు తమకు ఇచ్చిన పవిత్రగ్రంధం అంటున్నాయి - మరి,వేదం ప్రత్యేకత ఏమిటి?

          మొదట ఇతర గ్రంధాల చరిత్రని చూసి తర్వాత వేదం గురించి తెలుసుకుంటే వేదం యొక్క ప్రత్యేకత అర్ధం అవుతుంది. ప్రస్తుతం హిందూమతం కాక ప్రపంచంలో ఎక్కువమందికి తెలిసినవి - జుదాయిజం, క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం.వీటిలో ఆ మతం యొక్క మొత్తం అనుష్ఠానం ఆ మతాన్ని స్థాపించిన ఒకే ఒక వ్యక్తి ముఖతః వచ్చినవి.బుద్ధుడు ఆ మతాన్ని స్థాపించకముందు వైదిక ధార్మిక సాహిత్యంలో మంచి పాండిత్యం ఉన్నవాడు. దేవుణ్ణి గురించి చెప్పకుండా పూర్తి లౌకిక మరియు భౌతిక విషయాల ప్రాతిపదికన ధర్మచక్రప్రవర్తన పేరుతో ఒక భిక్షు సంఘాన్ని నిర్మించాడు గనక బౌద్ధులకి దేవుడు ఇచ్చిన గ్రంధం అంటూ ఏదీ లేదు.జుదాయిజం మూలపురుషుడైన అబ్రహాం తోరాని నిర్మించబోయేనాటికి చక్కని సంస్కారం ఉన్న నాగరికుడి వలెనూ ఆధ్యాత్మిక విషయాల్లో పండితుడి వలెనూ కనబడతాడు - తాను జిజ్ఞాస కొద్దీ దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టుకున్నానని ప్రకటించాడు, తోరా నిర్మాణం కూడా ఒక శిష్యుడికీ అతని గురువుకీ మధ్యన జరిగిన ప్రశ్నోత్తరావళి మాదిరి ఉంటుంది.

          క్రైస్తవుల పాత నిబంధన అబ్రహాము యొక్క తోరాకు అసలుకీ నకిలీకి మధ్య తేడా తెలియనివ్వని రూపమార్పిడితో అలరారుతూ ఉంటుంది!ఇక సారం తెలిసినవారు మహమ్మదీయుల ఖురానును అరబిక్ భాషలోకి తర్జుమా చెయ్యబడిన తోరాకు జిహాదిక్ హింసని కలిపిన పొడిగింపు అని అంటారు.ఆ జిహాదిక్ హింసని ప్రేరేపించే కొత్త చేర్పిడి భాగాల్ని తీసెయ్యడానికి మహమ్మదీయులు పొరపాటున కూడా ఒప్పుకోరు - అది తీసేస్తే తమ మతం జుదాయిస్టు మతానికి నకలు అయిపోతుందని వారికీ తెలుసు.పోనీ జుదాయిజమునే అనుసరించవచ్చు గదా అంటే ఇప్పుడు తమకు దఖలు పడుతున్న ద్రవ్యాకర్షణ తగ్గుతుందని భయం!

          ఇంతకీ ఇవి పుట్టిన తేదీలు ఇటీవలివి గనక ఎప్పుడు పుట్టిందో తెలియని సనాతన ధర్మాన్ని పాటించే మన ముందు నిలబడి తమ మతాన్ని సృష్టించినవారు మనం పూజిస్తున్న రాముడూ కృష్ణుడూ వంటి ఉన్నారో లేరో తెలియని కల్పితవ్యక్తులు కాక వాస్తవ వ్యక్తులు గాబట్టిన్నీ తమ మతగ్రంధాలు వారి అనుభవసారం గాబట్టిన్నీ వాటిలో రక్తమాంసాలు గల వ్యక్తులకు పనికొచ్చే ఆదర్శప్రాయమైన సంగతులు వున్నాయని గొప్పలు చెప్పుకునే ఆ రెండు మతాల ప్రచారకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడేటట్టు విశ్వసనీయమైన ఆధారాలను వెదికి చూస్తే జీసస్సూ మహమ్మదూ అనే ఈ  ఇద్దరూ కల్పితవ్యక్తులు అనిపిస్తారు.జీసస్ గురించి ఇటీవలి పోష్టుల్లో చెప్పాను కదా,మహమ్మద్ విషయం కూడా అంతే!ఈ ప్రవక్తల చారిత్రకతని చూడాలంటే వారి మతగ్రంధాలకి బయట ఇతరుల సాహితీరూపాల్లోనూ తిరుగు లేని ఆధారాలైన శిలాశాసనాల్లోనూ చూడాలి.అలా చూస్తే మహమ్మద్ యొక్క చారిత్రకతని రుజువు చేసే సాక్ష్యాలు కూడా చాలా తక్కువ!అయితే జీసస్ కన్న ఇతను అదృష్టవంతుడు - బలహీనమైన సాక్ష్యాలే అయినా సంఖ్యలో కొంచెం ఎక్కువ ఉన్నాయి.వాటిలో కూడా ఎక్కువ భారతీయుల పుణ్యమే!సింధ్ ప్రాంతానికి చెందిన ఒక హిందూ రాజు మహమ్మదుకి వూరగాయల జాడీని కానుకగా పంపించడం ఒకటి చెప్పుకోదగిన సాక్ష్యం,సరిగ్గా మహమ్మదు కూలగొట్టేనాటికి మక్కా తీర్ధయాత్రకి బయల్దేరిన ఒక కేరళ ప్రాంతపు హిందూ రాజు విషయమే కూలగొట్టక మునుపు అది శివాలయం అనడానికి సాక్ష్యం.ఇలాంటి బలహీనమైన సాక్ష్యాలు తప్ప అతను ఎక్కడ పుట్టాడని చెబుతున్నారో ఆ ప్రాంతపు చరిత్రలో అతని ఉనికిని నిర్ధారించే సాక్ష్యాలు లేవు.అదీ గాక తమది కాపీ మతం కాబట్టి కాపీ కొట్టిన ఆనవాళ్లు తెలియకుండా ఉందేటందుకు వాళ్ళే పూనుకుని ధ్వంసం చేసిన చరిత్రలో వీరి ప్రవక్తకి సంబంధించిన ఆధారాలు కూడా నాశనమై వుంటాయి.అసలు భౌతిక అస్తిత్వమే తెలియని పరిస్థితిలో వాళ్లు ఏమి చదువుకుని ఎంత పాండిత్యం సంపాదించి ఇంత గంభీరమైన జ్ఞానసంపద వెల్లివిరిసే పుస్తకాల్ని రచించగలిగారో ఎట్లా తెలుస్తుంది!

          పేరుకి గొప్ప కుటుంబం, డబ్బున్న సాములని తప్పిస్తే ఇద్దర్లో ఎవరికీ చదువు లేదు, పాండిత్యం  లేదు, గురుశుశ్రూష చేసి జ్ఞానం ఆర్జించిన దాఖలాలు లేవు.అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి తను చెప్పదల్చుకునది ప్రజలకి  చెప్పటానికి ఈ అనామక గొర్రెల కాపరీ ఈ నిశానీ బానిసల వ్యాపారీ తప్ప ఇంకెవరూ దొరకలేదా ఆయా మానవ సమూహాల్లో?అసలు దయనీయమైన విషయం, దేవుడు తమ ప్రవక్తలకి చెప్పిన పరమ సత్యాలతో కూడిన దైవగ్రంధాలు అని చెప్పబడుతున్న బైబిలు,ఖురాను ఎంత అసభ్యకరమైన విషయాలతో నిండి వున్నాయంటే కొన్ని దేశాలలో ముఖ్యంగా టూరిస్టుల ఎద్దడి ఉండే నగరాలలో వీటిని బహిరంగ వేదికల మీద చదవటాన్ని నిషేధిస్తున్నారు - మరి,ఇంత అసభ్యతని తీసుకెళ్ళి దేవుడికి అంటగడుతున్నట్టు లేదూ వారి నిర్వాకం!

          అయితే, హిందువులకు పరమ ప్రమాణమైన వేదం ద్యోతకం కాబోయే ముందు వైదిక ఋషులు వీళ్ళ ప్రవక్తల వలె నిశానీలు కాదు,అప్పటికే గురుశుశ్రూష ద్వారా తగినంత జ్ఞానం సంపాదించి తమకు అర్ధం కాని ఒక విషయం గురించి తపస్సు చేస్తున్నవాళ్ళు!"For every meditation there must be a target" అనేది ఇవ్వాళ రోజువారీ ప్రశాంతత కోసం చేసే మామూలు మెడిటేషన్ ప్రక్రియకి ముఖ్యమైన సూత్రం - అట్లాంటిది ఏ లక్ష్యమూ లేకుండా తపస్సు మొదలుపెట్టరు కదా!మరి, అంత శ్రమపడి కనుక్కున్న దాన్ని కూడా "ఇది నా గొప్పే!ఇది నా గొప్పే!నాకు తప్ప ఇంకెవరికీ తెలిసేది కాదోచ్!" అని గొప్పలు చెప్పుకోకుండా "అయ్యా!ఇది నా గొప్ప ఎంత మాత్రం కాదు,ఆ దేవుడే నాకు చెప్పాడు.నేను నిమిత్తమాత్రుణ్ణి" అని ఎందుకు వినయం చూపించారు?

          ఆ సత్యం ద్యోతకం కాబోయే ఒక నిముషం ముందు కూడా మరు నిముషం తమకు ఆ సత్యం ద్యోతకం కాబోతున్నదని  వారికే తెలియని విషయం ఆ పద్ధతిలో సత్యాల్ని దర్శించిన వైదిక ఋషులందరికీ అనుభవైకవేద్యమే గనుక అలా గొప్పలు చెప్పుకుంటే పరిహాసపాత్రులు కావడం తప్ప ప్రయోజనం ఉండదు!"ఆ మతాల ప్రవక్తలకి సాధ్యం కానిది ఈ వైదిక ఋషులకి ఎట్లా సాధ్యపడింది?తమ శ్రమతో సాధించిన దాన్ని కూడా ఉన్నాడో లేడో తెలియని దేవుడికి అంటగట్టటం అబద్ధం చెప్పడం కాదా?కొందరికి మాత్రమే ఇట్లాంటివి సాధ్యం కావడం మనుషుల్లో అసమానతలని పెంపొందిస్తుంది కదా!వీటిలో హేతుబద్ధత లేదు.ఇవన్నీ సుర అనగా కల్లు తాగి వాగిన లొల్లాయి పాటలు మాత్రమే." అనేవాళ్ళకి ఒక నమస్కారం పెట్టి వూరుకోవడం తప్ప మనం వాళ్ళ చేత వేదాలు గొప్పవి అని ఒప్పించడం అసాధ్యం!

          వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం అన్నింటినీ పరిశోధించడానికీ సర్టిఫికెట్లు ఇవ్వడానికీ పనికొచ్చే ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా వైదిక ఋషులకి సత్యం ద్యోతకమైన పద్ధతిలోనే ఎదిగింది, ఎదుగుతున్నది, ఎదుగుతుంది కూడాను.చిన్న చిన్న ఉదాహరణలు చెప్తే సంశయాస్పదులకి ఎక్కదు గనక కొంచెం పెద్ద సంగతినే చెబుతాను.మన ఆలోచనలూ జ్ఞానమూ కంటికి కనబడవని అంటారు - అది కొంతవరకే నిజం,ఆలోచనలూ జ్ఞానమూ జ్ఞాపకాలూ మెదడులో కొన్ని రసాయనిక చర్యల వల్ల ఉత్పన్నమయే మాలిక్యూల్స్ రూపంలో భద్రపరచబడి ఉంటాయి.ఈ విషయాలని Neuro Physiology స్టడీ చెస్తుంది.ఈ సైన్సు యొక్క ఎదుగుదలలో Otto Loewi చేసిన రెండు కప్పల ప్రయోగం నిరూపించిన సత్యం అత్యంత ముఖ్యమైనది.

          ఇతను చేసిన ప్రయోగం చాలా సంక్లిష్టమైనది - "The experiment consists of a preparation of two frog hearts. The hearts are kept alive and beating in separate beakers containing Ringer’s solution. One of the hearts has the intact vagus nerve connected, which when stimulated is known to slow down the heart. Loewi electrically activated the vagus nerve which slowed down the corresponding heart. He then took some liquid bathing this heart and transferred to the second beaker which contained another heart. The second heart immediately slowed down. The only reasonable explanation to this effect is as follows. When the vagus nerve was activated it released a substance which dissolved in the surrounding liquid. It was this substance that slowed down the first heart. When this liquid was transferred to the second beaker, it slowed the second heart too. Thus the (vagus) nerve acted on the heart not by direct electrical action but by a chemical means."ఇంతకు  ముందు మన చెయ్యి కాలి చుర్రుమనగానే దాన్ని గ్రహించిన మొదటి నాడీ కణం దాని వెనకాల ఉన్న రెండవ నాడీ కణానికి దాన్ని ఎలా అందిస్తుందో తెలిసేది కాదు - ఎందుకంటే, నాడీకణాల మధ్యన ద్రవంతో నిండిన ఖాళీ స్థలం ఉంటుంది!ఇతని ప్రయోగం మొదటి నాడీ కణం ఒక పదార్ధాన్ని ఈ ద్రవంలోకి వదిల్తే  రెండవ నాడీ కణం ఆ ద్రవంలో వ్యాపించిన ఈ పదార్ధం తనకి తగిలినప్పుడు దానికి తగ్గట్టు స్పందిస్తుంఫనే విషయాన్ని రుజువు చేసింది.అయితే అతను ఈ ప్రయోగాన్ని రూపొందించిన విధానం చాలా చిత్రమైనది - తనకు కలలో కనిపించిన దృశ్యాన్ని నిద్ర లేవగానే మొదట ఒక కాగితం మీద రాసుకుని దాన్ని యధాతధం చేసేశాడు!

          మొత్తం కధనం అతని మాటల్లోనే తెలుసుకుంటే మరొక చిత్రమైన విషయం బోధపడుతుంది - "The night before Easter Sunday of [1920] I awoke, turned on the light and jotted down a few notes on a tiny slip of thin paper. Then I fell asleep again. It occurred to me at 6.00 o’clock in the morning that during the night I had written down something important, but I was unable to decipher the scrawl. The next night, at 3.00 o’clock, the idea returned. It was the design of an experiment to determine whether or not the hypothesis of chemical transmission that I had uttered 17 years ago was correct. I got up immediately, went to the laboratory, and performed a simple experiment on a frog heart according to the nocturnal design."చూశారా!Chance indeed favored the prepared mind, with Luck playing her mystical part.జాగ్రదవస్థకీ సుషుప్తికీ తేడా తెలియకుండా అతను శ్రమిస్తున్నాడనేది వాస్తవం,అయినా అతనికి సత్యం గోచరించింది మాత్రం సుషుప్తిలోనే - ఆ ప్రాచీన కాలపు వైదిక ఋషీ ఈ ఆధునిక కాలపు విజ్ఞానీ సత్యాన్ని ఒకలాగే దర్శించారు.అందుకే చాలా ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు వైదిక ఋషుల ఆవిష్కరణల్ని యదార్ధం అని నిరూపిస్తున్నాయి.

          నాలుగు వేల సంవత్సరాల వెనకటిదిగా చెబుతున్న అగస్త్య సంహిత అనే వైదిక విజ్ఞాన గ్రంధంలో విద్యుచ్చక్తిని ఉపయోగించి యంత్రాలను నడిపే విధానం ఉన్నది.ప్రస్తుతం వోల్టా తయారు చేసిన బ్యాటరీ వర్ణనని మర్చిపోయి అగస్త్య సంహితను అనుసరించి మట్టి పాత్రలతో ఘటమాలను ఏర్పరచి విద్యుద్దీపాలను వెలిగించగలిగారు, యంత్రాలను నడిపించ గలిగారు!మన ప్రాచీనులు కట్టిన ఆలయాలు అంత ఎక్కువ శిల్పకళతో కూడి ఉన్నప్పటికీ అంత తక్కువ కాలంలో ఎలా కట్టారో అని చరిత్రకారులూ పరిశోధకులూ వారు ఆశ్చర్యపడి మనల్ని కూడా ఆశ్చర్యపరచటానికి  కారణం మన ప్రాచీనులు విద్యుచ్చక్తిని ఉపయోగించి రాత్రులలో కూడా పని చేశారనీ యంత్రాలను ఉపయోగించారనీ వూహించలేకపోవటమూ నమ్మలేకపోవటమే!ఒకే మహాశిలని నిలువుగా తొలుచుకుంటూ పోయిన కైలాసనాధ దేవాలయ నిర్మాణంలో ఒక విచిత్రం ఉంది.సూర్యకాంతిని అద్దాల ద్వారా గానీ మరే విధంగా గానీ ఉపయోగించుకోలేని చోట్ల కూడా అత్యంత సూక్ష్మమైన వివరాలను ఎట్లా చెక్కగలిగారు?అంత స్థాయిలో పని చెయ్యడానికి అవసరమైన వెలుతురు కోసం కాగడాల్ని వాడితే ఏదో ఒక స్థాయిలో పైకప్పు మసితో పొగచూరిపోవడం ఖాయం - మసితో గోడలూ పైకప్పూ పొగచూరని వెలుతురు విద్యుద్దీపాలు లేకుండా అసాధ్యం!

          అగస్త్యుడనే ఒక వ్యక్తి తను ఆర్జించిన విజ్ఞానంతో తయారు చేసిన దాన్ని వేదానికి ఎట్లా అంటగట్టాలి అనే ప్రశ్న అర్ధం లేనిది - అసలు వేదమే మతగ్రంధం కాదు, విజ్ఞాన శాస్త్రం!మానవుడు భౌతిక ప్రపంచంలో సుఖజీవనం సాగించడానికి అవసరమైన విషయాలే వేదం అంటే ఎవరూ నమ్మలేరు, కానీ అదే నిజం!ఈ లెక్కన హిందువులకి మతగ్రంధం అనేది లేనే లేదు,ఇంక మతం అంటే గ్రంధం ఉండి తీరాల్సిందే అంటున్న వారితో దీన్ని మతం అని ఒప్పించడమే కష్టం, వాళ్ళ మతం కన్న గొప్ప మతం అని ఒప్పించడం మరీ కష్టం!

          అయితే హిందువులు అందుకు ఎంతమాత్రం సిగ్గుపడాల్సిన పని లేదు.యూరుల తోరా యూదుల్ని మాత్రమే తరింపజేస్తుంది,క్రైస్తవుల బైబిల్ క్రైస్తవుల్ని మాత్రమే తరింపజేస్తుంది,ముస్లిముల ఖురాన్ ముస్లిముల్ని మాత్రమే తరింపజేస్తుంది - కానీ వేదం సకల మానవాళినీ తరంపజేస్తుందనేది వ్యాసపరాశరాదిషిర్డీసాయినాధపర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్న గంభీరమైన సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

Tuesday, 30 October 2018

ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర విశేషాలు - ఉపోద్ఘాతం

     మొదటి స్వాతంత్య్ర పోరాటం సఫలమైనట్లే అయి చివర్లో దురదృష్టం కొద్దీ విఫలమై ఏ పోరాటం ఇంగ్లీషువాళ్ళని తరిమికొట్టటానికి ప్రారంభించారో ఆ పోరాటమే ఇంగ్లీషువాళ్ళు మరింత పాతుకుపోవటానికి ఉపయోగపడింది!అప్పటినుంచి రెండవ స్వాతంత్య్ర పోరాటం మొదలయ్యేలోపు భారతీయ సమాజం ఎట్లా ఉండేది?

     ఆధునిక భారతదేశ చరిత్ర అనే అంశాన్ని తరచిన చరిత్రకారులూ పాత్రికేయులూ మేధావులూ విశ్లేషకులూ  ఈ కాలాన్ని గురించి చెప్పేటప్పుడు కాంగ్రెసు పార్టీ స్థాపనతో మొదలుపెట్టి రాజకీయాలనే స్పృశించారు తప్పితే సమాజం గురించి ఎవరూ పట్టించుకోలేదనే చెప్పాలి."మనల్ని విదేశీయులు పరిపాలిస్తున్నారు!","విదేశీయులు పాలించడం వల్లనే మనకి అన్యాయం జరుగుతున్నది!","వీళ్ళని వాళ్ళ దేశానికి తరిమికొట్టి స్వతంత్రం తెచ్చుకోనిదే మనదేశం(?) బాగుపడదు!" అనే రాజకీయ భావనలు రావడానికి పునాదియైన అప్పటి భారతీయ సమాజం గురించి మనకి  వాస్తవాలు తెలియడం లేదు.ఎందుకంటే, అప్పటి సమాజం గురించి చెప్పాలనుకుంటున్న ఇప్పటి మేధావుల్లో ప్రతి ఒక్కరికీ ఒక పొలిటికల్ ఎజెండా ఉంది - తమ ఎజెండాకి వ్యతిరేకమైన విషయాల్ని దాచేసి అనుకూలమైన విషయాల్ని మాత్రమే చెప్పారు!

     ఇలాంటి చిక్కులు ఎదురైనప్పుడే మనుషులకి కాలయంత్రం లాంటి ఫాంటసీల మీదకి మనసు పోతుంది - మనమే వెళ్ళి చూస్తే పోతుంది గదా వాళ్ళూ వీళ్ళూ చెప్పే అబద్ధాలని నమ్మడం దేనికి?అయితే, కాలంలో ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహార్మ్,రిజల్టులో కూడా గ్యారెంటీ లేదు!కానీ తక్కువ ఖర్చుతో కాలంలో ప్రయాణాన్ని సాధ్యం చేసే సాధనం ఒకటి ఉంది - అదే, సాహిత్యం!ఒక కాలం గురించి నిజానిజాలు తెలుసుకోవడానికి ఆ కాలపు ప్రముఖ వ్యక్తుల జీవితచరిత్రలు గానీ ఆత్మకధలు గానీ అధికారికమైన విషయనిధులు(DATA BANKS) అవుతాయి.అలాంటి వాటిలో సా.శ. 18వ శతాబ్ది నాటి సమాజం గురించి దాని నైసర్గిక వర్ణనతో సహా తెలుసుకోవడానికి ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర అనే ట్రావలాగ్ కన్న విలువైనది మరొకటి లేదు.

     వేరే వ్యక్తి చెప్పినదాన్ని నేను మీకు చెప్తున్నానని అనగానే "ఇతన్ని నమ్మవచ్చునా!అబద్ధాలు చెప్పడం లేదని గ్యారెంటీ ఏమిటి?" అనే సందేహం వస్తుంది.కానీ ఈయన కాశీయాత్ర చరిత్ర రాసింది ఉబుసుపోక కోసం కాదు - అప్పటికే రెండుసార్లు కాశీ వెళ్ళి వచ్చి మూడోసారి వెళ్తున్నప్పుడు ఒక స్నేహితుడు తనకూ ఇతరులకూ సహాయకారిగా ఉంటుందని అడిగితే రాసి ఇచ్చినది,స్నేహితుడికీ ఇకముందు కాశీ వెళ్ళానుకున్నవాళ్ళకీ ఉపయోగపడటం కోసం రాసేదాంట్లో అబద్ధాలు చెప్తే ఉన్న పరువు పోతుంది, కదా!

     మొదటి ముద్రణ సా.శ 1838లో జరిగింది - అంటే ఆయన రాసినది మిత్రుడు చదివి మెచ్చుకుని అందరికీ పనికొస్తుందని అనుకోవడానికీ ప్రచురణ సిద్ధమవటానికీ ఏళ్ళు పట్టదు కదా!సా.శ. 2018లో ఉన్న మనం సా.శ 1820ల నాటి భారతదేశాన్ని చూడబోతున్నాం - కాలంలో ప్రయాణానికి మీరు సిద్ధంగా ఉన్నారా?


ఎంతమంది ప్రయాణీకులు ఉన్నారో లెక్క తెలిస్తేనే గానీ ఈ బండి కదలదు.

Thursday, 25 October 2018

మతము లన్నిటి నడుమ ఏ మతము మంచిది?దైవము లందరి నడుమ ఏ దైవము సర్వోన్నతం!

అర్జునుడికి శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించినట్టు మీకు నేను భారతీయ సనాతన ధర్మం యొక్క విశ్వరూపాన్ని చూపించబోతున్నాను!అసలు వేదంలోనే "న తస్య ప్రతిమా అస్తి!" అని తన గురించి తను చెప్పుకున్న దైవం మళ్ళీ అవతారం అనే పేరున రూపం ధరించడమూ ఆ రూపాలను హిందువులు భక్తితో ఆరాధించడమూ ఏమిటి అని కొందరు పండితులకే అనుమానాలు  వస్తుంటే దేవుణ్ణని చెప్పుకున్న శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం ఎట్లా చూపించగలిగాడు?విశ్వం లోపల ఉన్న భూమి మీద నుంచుని విశ్వం మొత్తాన్ని ఎట్లా చూపించగలడు?మొత్తం చూపించాలంటే విశ్వం బయటికి తీసుకెళ్ళాలి - తన నుంచే సమస్తమూ పుడితే ఇంక దీనినుంచి బయటికి వెళ్ళటం సాధ్యమా!ఇంకొక మెలిక కూడా వుంది - దేవతలు కూడా చూడలేరు అంటూనే మనిషైన అర్జునుడ్ని పట్టుకుని నీకు నేను చూపిస్తున్నాను అంటున్నాడు,ఇదేం తిరకాసు?

సంస్కృత సాహిత్యం,అందులోనూ ధార్మిక సాహిత్యం చాలా మార్మికమైనది - ఉన్నది ఉన్నట్టు చూసి మనకి ఎలా అర్ధమైతే దాన్నే ఫిరాయించేసుకుంటే సాయిబుల్లోనో కిరస్తానుల్లోనో నాస్తికుల్లోనో కలిసిపోవడం ఖాయం!నిజానికి, అక్కడ ఆయన చూపించిందీ ఈయన చూసిందీ ఏమీ లేదు - దివ్యదృష్టి ఇవ్వడం కూడా మిధ్యయే!విశ్వానికీ దైవానికీ ఉన్న సంబంధం గురించి కొన్ని గంభీరమైన విషయాలని ఆయన చెప్పాడు,ఈయన జ్ఞానపు స్థాయిని పెంచుకుని అర్ధం చేసుకోగలిగాడు - అంతే!అంతకుమించి సాగదీసి ఆలోచిస్తే దుర్యోధనుడితో సహా కౌరవసైన్యాన్ని తను ఎప్పుడో చంపేశానని అంటున్నాడు కదా,ఇంకా అర్జునుడూ పాండవసైన్యమూ వాళ్ళని చంపాల్సిన అవసరం దేనికనే పిచ్చి డౌట్లు కూడా వస్తాయి!ఒక ముగ్గుబుట్టలాంటి చింపిరిజుట్టున్న పిచ్చి ముసిల్దానికి ఆల్రెడీ ఈ అనుమానం వచ్చేసింది - తెలివైన వాళ్ళు గనక హిందువులకి రాదులెండి, వస్తే ప్రమాదమే!

భారతీయ సనాతన ధర్మం యొక్క విశ్వరూపాన్ని చూడాలంటే ముందు కొన్ని విషయాలని తెలుసుకోవాలి.జుదాయిజం నుంచి పుట్టిన రెండు శాఖల కన్న ఒకింత వెనకబడి తడబడుతున్న హిందూమతం ఇవి ఉనికిలోకి రాకముందు ప్రపంచమంతటా వ్యాపించి తను అడుగు పెట్టిన ప్రతిచోట అక్కడ నెలకొని ఉన్న అజ్ఞాన తమస్సును తన విజ్ఞాన ఉషస్సు యొక్క మృదుస్పర్శతో పోగొట్టి ఆయా మానవ సమూహాలు గొప్ప సంస్కృతులను నిర్మించుకోగలిగేటట్లు చేసింది.ఒక హిందువుగా నేను ఈ మాట చెబితే హిందువులు స్వమతాభిమానం చూపించి నమ్మెయ్యడమూ హైందవేతరులు అనుమానించడమూ సహజమే!కానీ, హిందూ మతస్థులు కానివాళ్ళు తమ మతాన్ని గురించి ఆ మాట చెప్పుకోవటానికి బదులు తమకి సంబంధం లేని హిందూమతానికి  ఆ ఖ్యాతిని కట్టబెడుతుంటే మన వెనకటి తరాల వాళ్ళు సాధించిన విజయాల్ని పొగుడుకోవటానికి మనం ఎందుకు సంశయించాలి?

వాళ్ళెవరో India, that is bharat - so Great! అని ఒప్పుకుని దీని గురించి తెలుసుకోవటం అల్లాటప్పా గోంగూరకట్ట కాదని Indology అనే ఒక వైజ్ఞానిక శాఖనే తెఱిచి పరిశోధనలు చేసి ఎన్నో వాస్తవాలని వెలికి తీస్తుంటే హిందువులు కనీసపు ఆసక్తిని కూడా చూపించకపోతే ఎట్లా!వాళ్ళందరూ సత్యం పట్ల నిబద్ధతతో తమ తమ మత విశ్వాసాలను పాటిస్తూనే భారత దేశపు ఔన్నత్యాన్నీ సనాతన ధర్మం యొక్క విశిష్టతనీ గుర్తించిన సత్యాన్వేషులు - హిందూమతానికి బాకా కొట్టి భజనలు చెయ్య లేదు, గొప్పల్నీ తప్పుల్నీ ఉన్నవి ఉన్నట్టు చెప్పారు!

"Christianity doesn't exist, Jesus Christ never existed.Jesus Christ was an invention by the orthodox bishops at the Councel of Nicaea. That's what he was. He was the idea ,but they were,they wanted to create the ideal the deity to make people to slaves and that deity was tirn the other cheek love thy neighbor and tgis is why we're in a mess.Today, you know not thy enemies and all this crap.This is a great way to subjugate people.You know Don't make them sell their sheep bringing in the sheaves and  these innocent sheep here are more intelligent than Christians. The vedas on the other hand like all in a European and all most in even like all indigenous spiritual traditions all over the world,  tell you fight back to defend yourself.And,  Christianity itself  is Jewish.It's radical jewish offset, a sect,like a kind of branch. Davidians or isis that broke away from judaism and the jews also were cruel while killing others,they were  killing anyone that they deemed to be, you know, sinners." - ఇది అన్ని మతాలనీ తులనాత్మకమైన అధ్యయనం చేసిన ప్రపంచ స్థాయి మేధావులు సూత్రీకరించిన వాస్తవం.

ఇవ్వాళ మాదే అత్యున్నతమైన మతం,మా ప్రవక్తయే జగద్రక్షకుడు,మా దేవుడే సర్వేశ్వరుడు అని డబ్బా కొట్టుకుంటున్న  క్రైస్తవీయ మహమ్మదీయ మతాలు రెండూ జుదాయిజం యొక్క వికృత శిశువులు అనేది ఆయా మతాల వారు కూడా ఒప్పుకు తీరాల్సిన యదార్ధం - అది యెప్పుడో తేటతెల్లమై పోయింది.వికృత శిశువులు అని యెందుకు అంటున్నానంటే, అంతస్సారాన్ని బట్టీ ఆచరణా విధానాలని బట్టీ జుదాయిజం సనాతన ధర్మానికి చాలా దగ్గిరగా ఉండే ఆదర్శవంతమైన జీవనవిధానం కాగా ఈ క్రైస్తవీయ మహమ్మదీయ మతాలకి రూపకల్పన చేసినవారు ఈ జుదాయిజం నుంచి కొన్ని మంచి విషయాలని తీసుకుని ఇతరుల్ని తమకి బానిసల వలె పడివుండేటట్లు చేసుకోవడానికి పనికి వచ్చే స్వంత పాండిత్యపు కొత్త సూత్రీకరణల్ని కలిపి తమ మతాల్ని సృష్టించుకున్నారు.

సనాతన ధార్మిక సాహిత్యంలో కనిపించే బ్రహ్మ, సరస్వతి జుదాయిజంలో కనిపించే అబ్రహాం, సారా అనే రెండు జంటల మధ్యన చాలా దగ్గరి పోలికలు ఉంటాయి.ఈ రెండు జంటల లోని స్రీ పురుషులకి ఒకేసారి సోదర సోదరి సంబంధమూ దాంపత్య సంబంధమూ ఉంటుంది.ముఖ్యమైన తేడా అల్లా బ్రహ్మ,సరస్వతి పేరుతో సనాతన ధార్మిక సాహిత్యంలో కనిపించే జంట మన వంటి పార్ధివ దేహధారులు కాక జ్ఞానరూపాలు మాత్రమే.జుదాయిజం యొక్క మూల ప్రవక్త అయిన అబ్రహాం మరియు అతని భార్య స్థానంలో ఉన్న సారాలు మాత్రం మనవంటి పార్ధివ దేహధారులే!

Psalm 78:2 
I WILL OPEN MY MOUTH IN A PARABLE;I WILL UTTER DARK SAYINGS OF OLD:"హిందూమతం యొక్క సాహిత్యం అంతా ఎవరికీ అర్ధం కాని సంస్కృత భాషలో ఉంటుంది.మా బైబిలు చూడండి ఎంత సరళమైన భాషలో ఉంటుందో!" అని జబ్బలు చరుచుకుంటున్న క్రైస్తవ మతప్రచారకుల బూటకాన్ని బయటపెట్టే వాక్యం ఇది!ఏసు వారి అనుచరులకే కొన్నిసార్లు ఆయన చెప్పిన నిగూఢమైన మార్మికమైన పిట్టకధలూ నీతివాక్యాలూ కలగలిసిపోయిన గందరగోళపు వచనానికి ఠారెత్తిపోయి ఒక్కండే ఉండగా అడిగితే "మీరు నా స్వజనులు!నేను చెప్పు సమస్తమూ మీకు మాత్రమే తెలియవలెను!ఓ నా ఇశ్రాయేలీయులారా,పొరపాటున మన మందలో చేరిన అన్యజనులకు తెలియకుండుటకు నేనట్లు మాట్లాడువాడను!నా తండ్రి నన్ను ఇశ్రాయేలీయుల కొరకే పంపియున్నాడు" అని తెగేసి చెప్పాడు. తమ తమ మాతృభాషల్లోకి అనువదించి శుద్ధ వచనంలో చెప్పినప్పటికీ ఒక పట్టాన అర్ధం కాకపోవడం బైబిలు మరియు ఖురాను యొక్క ప్రత్యేకత అయితే, హిందువుల వేదం సంస్కృతం తెలిసిన ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది - భావం కూడా సూటిగా ఉంటుంది.

"India is, the cradle of human race, the birth place of human speech, the mother of history, the grandmother of legend, and the great grandmother of tradition. Our most valuable and most instructive materials in the history of man are treasured up in india only"
- Mark Twain.


ఎవరీ మార్కు ట్వెయిను గారు?హిందూ మతతత్వ వాదియా!కాదు, కాదు గాక కాదు.వినగానే పొట్టచెక్కలయ్యేలా ఒక్క జోకు వెయ్యటం ఎంత కష్టమో జబర్దస్తు టీవీ క్యామెడీల్ని చూస్తే తెలియడం లేదా!అట్లాంటిది, అరిస్తే హాస్యం స్మరిస్తే హాస్యం అన్నట్టు బతికి ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్న మహా మేధావి!మేధావిత్వం చాలామందిలో ఉంటుంది,కానీ డబ్బుకి సంబంధించిన వ్యవహారాల్లో ఈయన నిజాయితీ యెంత గొప్పదో తెలుసా!తన రచనల వల్ల వచ్చిన డబ్బుని పెట్టగూడని చోట్ల పెట్టుబడి పెట్టి తనతో పాటు ఇతర్లనీ నష్టపెట్టాడు.అయితే మళ్ళీ ఆర్ధికంగా కూడదీసుకోగానే తనవల్ల నష్టపోయినవాళ్ళని పేరుపేరునా గుర్తుంచుకుని చెల్లింపులు చేశాడు - నోటరీలూ గట్రా వుండి చచ్చినట్టు చెల్లించాలేమో అనే పరిస్థితి లేదు, అయినా చెల్లింపులు చేసేశాడు! అంత మంచితనం ఉండబట్టే అంత మంచి హాస్యం సృష్టించగలిగాడేమో - మన హిందూమతాన్ని పొగిడి ఉండకపొయినా మెచ్చుకోవచ్చు కదూ!

కొలంబస్ ఇండియాకి సముద్రమార్గం కనుక్కుందామని బయల్దేరి తను విడిది చేసినది అమెరికా అని తెలియక అక్కడివాళ్ళని రెడ్ ఇండియన్లు అని యెందుకు పేరు పెట్టాడు?అప్పటికే ఇండియన్ కల్చర్ అని తను తెలుసుకున్నది అక్కడ కనపడటం వల్లనే!ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ తమ ప్రాచీనతను తెలుసుకోవటం కోసం జరుగుతున్న త్రవ్వకాలలో అక్కడ ఒకనాడు హిందూమతం అత్యంత ప్రజాదరణ కలిగి ఉండేదని తెలియజెప్పే ఆనవాళ్ళు బయటపడుతున్నాయి.కానీ,అక్కడ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాటిని బయటికి రానివ్వటం లేదు.

"..These Jews are derived from the Indian philosophers;They are named by the Indians Calani.."
-Flavius Josephus(Book 1:22)

ఇంత స్పష్టమైన విషయాన్ని దాచిపెడుతున్నది యెందుకోసం?తమ మతం కొత్త మతం ఏమీ కాదనీ హిందూమతం నుంచి చీలిన జుదాయిజం నుంచి చీలిన పిల్లమతం అని తెలిస్తే ఏ హిందువు తమ మతంలోకి వస్తాడు?

ఈ భూమి మీద కొంతకాలం పాటు అత్యున్నత వైభవాన్ని అనుభవించి కాలం తెచ్చే మార్పులకు తమను తాము మార్చుకోలేక అంతరించిపోయిన నాగరికతలతో ప్రస్తుతం అత్యున్నత వైభవాన్ని అనుభవిస్తూ కాలం తెచ్చే మార్పులకు తమను తాము మార్చుకోలేక అంతరించిపోతున్న నాగరికతలను కలిపిన సమస్త నాగరికతలకీ మూలం వైదిక సాహిత్యమూ అది నిర్మించబడిన సంస్కృతమూ అనేది సాక్ష్యాధారాలతో సహా ఎప్పుడో రుజువైపోయిన గతితార్కిక చారిత్రక భౌతిక యదార్ధం!

వేదం అనే పదానికి మూల ధాతు రూపం "విద్" - దీనికి సమానార్ధకమైన ఆంగ్ల పదం "to know",అంటే మానవుడు తెలుసుకోవలసిన,తెలుసుకోదగిన,తెలుసుకోగలిగిన జ్ఞానం!వైదిక సాహిత్యంలో కనిపిస్తున్న అనేక సంస్కృత పదాలకి ఇతర భాషల్లోకి అనువదించటానికి సరైన పదాలు లేవు."ధర్మం" అనే పదానికి అర్ధం కోసం ప్రముఖమైన ఇంగ్లీషు డిక్షనరీలలో దేన్ని చూసినా ఈ విషయం తెలుస్తుంది."మీ అమ్మాయి పెళ్ళికి తెలుగులో మంత్రాలు చదివిస్తావా?" అని నన్ను అడిగి యేదో ఘనకార్యం చేస్తున్నట్టు విర్రవీగుతున్న ఎర్రిపప్పకి తెలియనిది యేమిటంటే "మంత్రం" అనే పదానికి సరైన పర్యాయపదం తెలుగులో లేదు.నాకు చాలెంజి చెయ్యడంలో చూపించిన తెలివిలో వెయ్యో వంతు తెలివిని ఆ మాట గురించి తెలుసుకోవాలనే దిశలో చూపించి ఉంటే ఆ నిజం తెలిసేది.

తెలుగులో కనీస పరిజ్ఞానం కూడా లేని ఒక గొట్టాంగాడు తెలుగు భాషాభిమాని వేషం కట్టి "నాకు పెళ్ళిమంత్రాలు తెలుగులో కావాలి!లేకపోతే నేనూరుకోను!కప్పెక్కి కూస్తా!రోడ్డెక్కి అరుస్తా!ఉరేసుకు చస్తా!" అని గోల చేస్తున్నాడు.అసలు వేదంలో ఉన్న వాటిని మాత్రమే "మంత్రం" అని పిలుస్తారు,అదే చందస్సు వాడి చెప్పిన ఇతర గ్రంధాలలోని వాటిని శ్లోకాలు అంటారు.అలాంటిది మంత్రాలు తెలుగులో కావాలంట ఆ ఎర్రిపప్పకి!తెలుగులోకి గానీ మరో భాషలోకి గానీ అనువదించటం కాదు,సంస్కృతంలోనే ఒక్క అక్షరాన్ని కూడా మార్చకూడనివి వేదమంత్రాలు.


వేదం బైబిలు వలె ఇశ్రాయేలీయుల సౌభాగ్యం కొరకు మాత్రమే చెప్పబడినది కాదు,వేదం ఖురాను వలె అరేబియన్ల  వైభవం కొరకు మాత్రమే చెప్పబడినది కాదు - సమస్త మానవాళికీ శాంతిభద్రతల్ని ఇవ్వడం కోసం చెప్పబడిన జ్ఞానబోధల సంకలనం!ప్రపంచ స్థాయి మేధావులూ పరిశీలకులూ ఒప్పుకున్న దాని ప్రకారమే మానవజాతి సృష్టించిన సాహిత్యంలో వేదమే అతి పురాతనమైనది, అత్యంత శాస్త్రీయమైనది!వేదం అపౌరుషేయం - అంటే మానవులు ప్రయత్నపూర్వకమైన అధ్యయనం, పరిశీలనం, చింతనం, ప్రయోగం, పరీక్ష, నిర్ధారణం వంటి ప్రక్రియల ద్వారా వీటిని తెలుసుకోలేదు,

ఋషులు తాము ఉద్ధరించబడి ఇతరులను ఉద్దరించగలిగే సత్యమైన జ్ఞానం కోసం సుదీర్ఘకాలం తపస్సు చేసిన అనంతరం వేరెవరో తమకి చెబ్తున్నట్టు ద్యోతకమైన విషయాలని యదాతధం బహిర్గతం చేసినవే వేదమంత్రాలు.అపౌరుషేయం అని చెప్పడం,అవి తమకి దేవుడు చెప్పాడనటం కొంతవరకు వారి వినయస్వభావాన్ని తెలియజేస్తున్నాయి - మానవప్రయత్నం ఉంటుంది,వారు తపస్సు మొదలుపెట్టినదే ఒక లక్ష్యంతో కదా!అదీ గాక అంత గంభీరమైన సత్యాన్ని కనుక్కోవడానికి ముందే వారు శ్రేష్ఠులైన గురువుల వద్ద అందుకు పనికొచ్చే అన్ని విద్యలూ అభ్యసించిన పండితశ్రేష్ఠులు - వారు గొర్రెల కాపర్లో నిశానీలో కాదు.ఎవరో వచ్చి  నోటికొచ్చింది వాగేసి ఇది నాకు దేవుడు చెప్పాడంటే ఒప్పేసుకుని వేదంలోకి చేర్చెయ్యటానికి ఇతర వైదిక ఋషులు గొర్రెలూ కాదు!

వేదం మూడు కాలాలను గురించి మూడు ప్రపంచాలను గురించి ఇతర మతాల వారు తెలుసుకున్న దానికి వెయ్యిరెట్లు తెలుసుకోగలిగిన వైదికఋషులు దర్శించిన జ్ఞానం కాబట్టి అన్యులు వాటిని సవరించడానికి గానీ తిరస్కరించడానికి గానీ సంక్షేపించడానికి గానీ ప్రక్షేపించడానికి గానీ అధిక్షేపించడానికి గానీ అర్హులు కారు. వేదం ఎలా పుట్టింది అని ఇతమిత్ధం చెప్పలేనట్లే ఎప్పుడు పుట్టింది అనేది కూడా తేల్చి చెప్పడం కష్టం, కష్టమే కాదు నిలదీసి అడిగితే అసంభవం అని కూడా చెప్పవచ్చు!హేతువాదులైన శ్డాస్త్రజ్ఞులు కొందరు ఋగ్వేదంలో కొన్ని చోట్ల వర్ణించబడిన గ్రహతారకల స్థితిగతులను పరిశీలించి సుమారు 7000 BCE నుంచి 6000 BCE మధ్యన ఆయా సూక్తాలు చెప్పబడినట్లు నిర్ధారించారు.కానీ ఇలా నిర్ధారించెయ్యడంలో ఒక చిక్కు ఉంది.ఆ గ్రహతారకల అమరిక కొన్ని వేల సంవత్సరాల కొకసారి పునరావృతమవుతూ ఉంటుంది కాబట్టి ఆయా సూక్తాలు ఆ పునరావృతమయ్యే సంవత్సరాలలో ఎప్పుడైనా చెప్పబడి ఉండవచ్చు కదా!

University of Edinburghలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న సంస్కృత భాషలో అపారమైన పాండిత్యం గల Prof. Keith వేదాల వయస్సును నిర్ధారించడానికి ఎంతో పరిశ్రమ చేసి "The determination of the age of the Samhitas will mostly remain a mere guess work!" అని తేల్చి చెప్పారు.మిగిలినవాళ్ళు చేసిన నిర్ధారణలనీ తన పరిశ్రమనీ కలిపి చూసుకుని విసుగెత్తి ఆయన ఆ మాట అన్నాడో లేక ఈయన ఇంత మాట అనేశాక కూడా వేదసాహిత్యాన్ని ఏదో ఒక కాలానికి కుదించుదామనే చిరాశతో చేశారో తెలియదు గానీ మిగిలినవాళ్ళు చేసిన నిర్ధారణలు ఇలా ఉన్నాయి:Maxmuller వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 1200BCE నుంచి 1500BCE మధ్యన అని నిర్ధారించాడు.Keith మరియు McDonald వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 1200BCE నుంచి 2000BCE మధ్యన అని నిర్ధారించారు.Whitney మరియు ఇతర్లు వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2000BCE వెనక అని నిర్ధారించారు.Winternitz వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2000BCE నుంచి 2500BCE మధ్యన అని నిర్ధారించాడు.Jacobi వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 3000BCE నుంచి 4000BCE మధ్యన అని నిర్ధారించాడు.Satyavrata Samashrami వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 5000BCE వెనక అని నిర్ధారించాడు.Balagangadhara Tilak వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 6000BCE నుంచి 10000BCE మధ్యన అని నిర్ధారించాడు.Sampoornananda వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 18000BCE నుంచి 30000BCE మధ్యన అని నిర్ధారించాడు.Pt.Krishna Sastri Godbol వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 18000BCE వెనక అని నిర్ధారించాడు.Avinash Chandra Das Mukhopadhyaya వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 25000BCE నుంచి 50000BCE మధ్యన అని నిర్ధారించాడు.Lele Shastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 40000BCE నుంచి 54000BCE మధ్యన అని నిర్ధారించాడు.Rajpur Patangar Sastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 21000BCE అని నిర్ధారించాడు.Pavaki వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2,40,000BCE వెనక అని నిర్ధారించాడు.Pt.Dinanath Sastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 3,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Dr.Jvala Prasad వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 5,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Nobel Laureate Materlink వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 70,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Maahrshi Dayananda వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 200,00,00,000BCE వెనక అని నిర్ధారించాడు.భారతదేశం బయట ఉండి వేదం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవారికీ భారతదేశం లోపల ఉండి వేదం గురించి తెలియని వారికీ తొలిసారి వేదాలను పరిచయం చేసిన మ్యాక్స్ ముల్లరు స్వయంగా వేదం యొక్క వయస్సు నిర్ధారించడం అసాధ్యం అని చెప్పి ఉన్నాడు కాబట్టి వేదం యొక్క ప్రాచీనతను నిర్ధారించడం అసంభవం - మధ్యలో పుట్టిన నడమంత్రపు గ్రంధాలు మధ్యలోనే నశించి పోతాయి గానీ ఆదియే కాదు అంతం కూడా లేకుండా నిలిచేది ఒక్క వేదమే!


సనాతన ధార్మిక సాహిత్యం ప్రకారం బ్రహ్మ కూడా వేదాలు గోచరించకముందు సరస్వతి పట్ల మోహానికి గురై ఆ శరీరాన్ని విసర్జించి నూతన దేహాన్ని ధరించినప్పటికీ సృష్టి చెయ్యలేని తన నిస్సహాయతను చూసుకుని ఎంతో వేదన అనుభవించి సుదీర్ఘకాలం పాటు తపస్సు చేశాకనే వేదవిజ్ఞానం లభ్యమైంది - అది తనకు గోచరించిన తర్వాతనే సృష్టి చెయ్యగలిగాడు.దాన్నిబట్టి వేదం అనేదానికి హిందువుల పౌరాణిక సాహిత్యంలోనూ బౌద్ధిక వికాసంలోనూ జీవన విధానంలోనూ ఎంత ప్రాధాన్యత ఉన్నదో తెలుస్తుంది. హిందువుగా జీవించడానికి బాప్తిజం, దావత్ లాంటి కార్యక్రమాలు ఏమీ లేవు వేదం చెప్పినది గొప్పదని ఒప్పుకుని పాటించితే చాలును.వేదాన్ని గౌరవించనివాడు హిందువు కాలేడు,వేదనింద చేసిన వాడు హిందువులకి శత్రువే అవుతాడు!

వేదం అంటే ఒకే ఒక పుస్తకం కాదు,వైదిక సాహిత్యంలో 18 విద్యాస్థానములు ఉన్నాయి.విద్యాస్థానం అంటే ఇంగ్లీషులో Branch of Study అని చెప్పుకోవచ్చు.వీటిలో శృతి అనే విభాగంలో ఋగ్వేదం,యజుర్వేదం,సామవేదం,అధర్వ వేదం అనేవి ఉన్నాయి - ఇది ఒక  భాగం మాత్రమే.అయితే,మిగిలిన అన్ని శాఖల్లోని విషయాలు అన్నీ ఈ నాల్గింటిలోని సూత్రాల మీద ఆధారపడి ఉంటాయి.శృతి అనే విభాగంలో ఈ నాలుగూ తప్ప ఇంకేవీ లేకపోవడం వల్ల వేదం,శృతి అనేవాటిని పర్యాయపదాలుగా కూడా వాడతారు. వేదములు నాలుగు - 1.ఋగ్వేదం, 2.శుక్ల,కృష్ణ యజుర్వేదాలు, 3.సామవేదం, 4.అధర్వ వేదం. వేదాంగములు ఆరు - 1.శిక్ష(Phonetics), 2.శిక్షా కల్ప(Study of Rituals), 3.వ్యాకరణ(Grammer), 4.నిరుక్త(Etumology), 5.ఛందం(Prosody), 6.జ్యోతిషం(Astronomy). ఉపాంగములు నాలుగు - 1.మీమాంస, 2.న్యాయశాస్త్రం, 3.పురాణములు, 4.ధర్మశాస్త్రము. ఉపవేదములు అనేకం కానీ ముఖ్యమైనవి  - 1.ఆయుర్వేదం(Medical Science), 2.అర్ధశాస్త్రం(Economic Science), 3.ధనుర్వేదం(Military SCience), 4.గాంధర్వవేదం(Musical Science).


వేదాలను శృతి(Revealed) అని అంటే మిగిలినవాటిని స్మృతి(Memorizes) అని అంటారు.శృతి అనే విభాగంలో నాలుగు ఉపవిభాగాలు ఉంటాయి - ఋగ్వేదం(Collection of Prayers), యజుర్వేదం(Sacrificial Manual), సామవేదం(Rigvedic hymns in musical form), అధర్వవేదం(Magical Charms) - ప్రతి వేదం మళ్ళీ నాలుగు ఉపవిభాగాలుగా ఏర్పరచబడి ఉంది:1.మంత్రసంహిత->ప్రధానమైన భాగం.ఋగ్వేదంలోని మంత్రాలను మాత్రం ఋక్కులు అంటారు.మిగిలినవాటిని మంత్రాలు అంటారు - వీటిని అందరూ అధ్యయనం చెయ్యవచ్చు 2.బ్రాహ్మణములు->ఆయా సంహితలలోని విషయానికి వ్యాఖ్యానములతోనూ కర్మకాండలకు సంబంధించిన వివరాలతోనూ కూడుకున్న వచనభాగం - వీటిని సంహితను అధ్యయనం చేసిన తర్వాత మరింత తెలుసుకోవాలనే ఆసక్తి గలవారికి మాత్రమే బోధిస్తారు 3.అరణ్యకములు->ప్రతి వేదమంత్రానికీ సామాన్య అర్ధం,సాంకేతిక విశేషం,ఆధ్యాత్మిక సంబంధం అనే పాఠాంతరాలు ఉంటాయి గనుక వాటిమధ్యన సమన్వయం ఎలా చెప్పుకోవాలో సూచించే వచనం - నాగరికులకూ లౌకికులకూ ఇవి అనవసరం గనక ఆచార్యత్వాన్ని కోరుకుని అరణ్యవాసానికి ఇష్టపడినవారికి మాత్రమే బోధిస్తారు 4.ఉపనిషత్తులు->ప్రధానమైన సంహిత మీద పూర్తి అధికారం కోరుకునే నమ్మకస్తులైన శిష్యులకు మాత్రమే వారి గురువులు బోధిస్తారు.

"అనంతా వై వేదాః" అని చెప్పిన ప్రకారం వేదం  మొదలూ తుదీ లేనిది. మానవులు తెలుసుకోవలసిన మొత్తం జ్ఞానం ఒక హిమాలయ పర్వతశ్రేణి అనుకుంటే, భగవంతుడి కృప వల్ల సనాతన ధార్మిక ఋషులు తెలుసుకోగలిగినది మొదట మనం చేరుకున్న పర్వతం నుంచి తీసిన మన పిడికిట పట్టగలిగిన ఇసుక కుప్ప అనుకుంటే - ఇతర దేశాల వారిని కళ్ళు చెదిరేటట్టు చేస్తున్న ఇంతటి విస్తారమైన జ్ఞానం కూడా మరీ అంత కొంచెమేనా!వేదం పరిస్థితే ఇలా ఉంటే తోరా,బైబిల్,ఖురాన్ సంగతేంటి?

"ఆదియందు వాక్యము పుట్టెను!" అని పుట్టినప్పట్నుంచీ అఘోరిస్తూ ఇప్పటికీ "ఏమిటి ఆ వాక్యం?" అని నిలదీస్తే నీళ్ళు నమలడం తప్ప ఇదీ ఆ వాక్యం అని చెప్పలేని అర్ధపాండిత్యపు కూష్మాండం గాళ్ళతో మనకి పోలికలూ జ్వాలికలూ పోట్లాటలూ కాట్లాటలూ దేనికి గానీ దేవుడు తమకి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేశాడని సంబరపడిపోయి పప్పన్నం తింటూ కూర్చున్నారా మనవాళ్ళు అని చూస్తే ఏమి కనిపిస్తుంది?వైదిక సాహిత్యం మీద తులనాత్మకమైన అధ్యయనం చేసిన సర్వులూ ఒప్పుకుంటున్నది మొదట ఆవిర్భవించినది ఋగ్వేదమే నని - అంతటి ప్రాచీన కాలంలో కూడా అప్పటి ప్రజలు ఎంత వైభవోపేతమైన జీవితం గడిపారో తెలుసుకుంటే, అవి పరిశోధకులు చెప్పిన వాస్తవాలే అయినప్పటికీ నమ్మలేని విషయాల్ని నేను కల్పించి చెబుతున్నట్టు అనిపిస్తుంది - అంతటి గొప్ప సంస్కృతికి దూరం అయినందుకు మనమీద మనకే అసహ్యం కూడా పుట్టవచ్చు!

అసలు వైదిక సంస్కృతి ఎంతమేర విస్తరించిందీ అని చూస్తే మధ్యభారతంలో ఎక్కువ ప్రభావశీలమై ఉంది,ఈశాన్య భారతంలో బలహీన స్థాయిలో ఉంది,దక్షిణ భారతంలో కూడా ఉన్నత స్థాయిలోనే ఉంది,పశ్చిమాన ఆఫ్ఘనిస్థాన్ వరకు చెప్పుకోదగిన స్థాయిలోనే ప్రభావశీలమై ఉంది.అయితే, ఆఫ్ఘనిస్థానుకు ఇవతలనే ఉన్నప్పటికీ వైదిక సంస్కృతికి చెందిన హరప్పా,మొహంజెదారో వంటి నగరాల్ని కూడా కలిగి ఉన్న ప్రాంతం మననుంచి విడిపోవటం వల్ల దాన్ని వదిలేసి ఒక దేశం రూపంలో ఇప్పుడు మనకి కనపడుతున్న భూఖండమే సనాతన ధర్మానికి మూలస్థానం అని మనం గర్వించవచ్చు!

సింధు నాగరికతా నిర్మాతలుగా ఇప్పుడు తెలిసిన జనసమూహం వైదిక సంస్కృతికి చెందినవారేనా అనేది ఇప్పటికీ నిర్ధారణ కాలేదు.మౌలికమైన విషయాలు కలుస్తున్నాయి గానీ కొన్ని అంశాలలో విభిన్నతలు కనిపిస్తున్నాయి.హరప్ప వంటివి సర్వసంపద్విలసితమైన నగరాలు అయితే వైదిక సంస్కృతికి చెందిన ప్రజలు గ్రామ్యజీవనులు.ముందు ముందు జరిగే కొత్త పరిశోధనల అనంతరం ఈ చిక్కుముడి విడిపోవచ్చు.

మొత్తం మీద వైదిక సమాజం బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర అనే నాలుగు వర్ణాలు కలిసి ఏర్పడినది.వైదిక సంస్కృతి యొక్క అతి ముఖ్యమైన లక్షణం యజ్ఞభావనతో జీవించడం - యజ్ఞం అంటే అగ్నిలో ఓషధుల్ని వ్రేల్చి వాయువుని శుభ్రం చేసి మానవులని ఆరోగ్యవంతుల్ని చేసినట్టు వ్యక్తులు తమ సంపదలో కొంత భాగాన్ని సమాజానికి సమర్పించి సమాజం నుంచి గౌరవాభిమానాల్ని పొందడం!వైదిక సంస్కృతిలోని ప్రజలు తమ జీవితాల్ని ప్రభావితం చేసే ప్రకృతి శక్తులనే దైవభావనతో అర్చించారు. అప్పటి వారు పూజించిన ప్రధాన దైవాలు వాయు(air), మరుత్(storm), ఇంద్ర(rain), వరుణ(water), సూర్య(sun), అగ్ని(fire), పృధ్వి(earth), అరణ్య(forest) - దాదాపు దృశ్యమాన ప్రపంచంలో మానవుడికి భయాన్నీ ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ క్షేమాన్నీ కలిగించే ప్రతి చిన్న అస్తిత్వం పట్ల వారు గౌరవాన్ని ప్రకటించటం ఇందులోని విశేషం!కొందరు అల్పబుద్ధులకి ఇది పిచ్చితనం అనిపించవచ్చు గానీ లోనారసి చూడగలిగిన Sylvain Levi వంటి ఫ్రెంచి ఓరియంటలిస్టులు మాత్రం "The multiplicity of the manifestations of the Indian genius as well as their fundamental unity gives India the right to figure on the first rank in the history of civilized nations.Her civilization, spontaneous and original, unrolls itself in a continuous time across at least thirty centuries, without interruption, wuthout deviation." అని ప్రశంసలు కురిపిస్తున్నారు! 


వైదిక సంస్కృతి ఎలా పుట్టిందో ఎప్పుడు పుట్టిందో తెలియనట్టే ఎంతమేర వ్యాపించింది అని చెప్పడం కూడా కష్టమే!అయినప్పటికీ వైదిక సాహిత్యంలోని కొన్ని వివరాలను బట్టి చూస్తే అప్పుడు గాంధారం అని పిలిచిన ఇప్పటి ఆఫ్ఘనిస్థాన్ నుంచి అప్పుడు ప్రాగ్జ్యోతిషం అని పిలిచే ఇప్పటి అస్సాం వరకు వ్యాపించి ఉంది కాబట్టి ఇప్పుడు ఉత్తర భారతం అంటున్న అప్పటి మధ్యభారతం మొత్తం వైదిక సాహిత్యానికి మాతృస్థానం అని చెప్పటం సమంజసంగా ఉంటుంది.

ఋగ్వేద సాహిత్యంలో యమున ప్రస్తావన లేదు.హిమశ్రేణి ప్రస్తావన ఉంది కానీ వింధ్య ప్రస్తావన లేదు.ఇప్పుడు మనం  నదులలో శ్రేష్ఠమైనది అని చెప్పుకునే గంగకి సరస్వతి అదృశ్యం కాక మునుపు ఇంతటి ప్రాముఖ్యత లేదు కాబట్టి ఒకే ఒక్కసారి ప్రస్తావించబడింది - అదీ ఋగ్వేద కాలం ఆఖరి దశలో!అబ్రహామిక్ మత సాహిత్యంలో The Graet Flood అని వ్యవహరిస్తున్న పెద్ద వరద సరస్వతిని ముంచేసింది - ఆ సమయంలో ఇక్కడినుంచి వెళ్ళినవారే యూదులు.ఈ దురదృష్టకరమైన సంఘటనకి మనస్సు చెదిరి కకావికలై తమకు క్షేమకరమైన నివాసస్థలం కోసం చేసిన ప్రయాణమే "వలసకాండ"లో రూపం మారి కనిపిస్తుంది!

ఈ సరస్వతిని తిరిగి గుర్తుపట్టడం వల్లనే "ఆర్య-ద్రవిడ సంఘర్షణ" జరిగిందనే వికృత సిద్ధాంతం అబద్ధమని తేలిపోయింది!ఇంకొక విశేషం యేమిటంటే, ఆ ప్రాచీన ఋగ్వేద సాహిత్యంలోనే సముద్రాల ప్రస్తావన ఉంది - ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారని చెప్తున్నారో అక్కడ సముద్రాలు లేవు కాబట్టి ఆ సిద్ధాంతాన్ని భుజాల మీద మోసుకు తిరిగిన వారందరూ అవి ఇప్పటి సముద్రాలకి ప్రత్యామ్నాయం కాదనీ అతి పెద్ద జలరాశిని ఋగ్వేద ఆర్యులు సముద్రం అని వర్ణించారనీ చెప్పాల్సి వచ్చింది.కానీ ఋగ్వేద సాహిత్యంలోనే సముద్ర జలాలు ఉప్పగా ఉంటాయన్నది వారికి తెలుసుననీ వాటిమీద నౌకలతో ఇతర భూభాగాలతో సంబంధం పెటుకోవడం గురించిన ప్రస్తావనలు కూడా ఉన్నాయనీ గమనిస్తే ఈ దేశంలోనే పుట్టి ఈ దేశపు గొప్పతనాన్ని దాచెయ్యడంలో ఆ చరిత్రకారులు ఎంత కృతనిశ్చయులై ఉన్నారో తెలుస్తుంది - అటువంటివాళ్ళు రాసిన చరిత్రని మన పిల్లల చేత చదివిస్తున్నందుకు సిగ్గు పడాలి!

వైదిక ఆర్యులు ఋగ్వేద యుగం ముగిసిపోయి తర్వాతి వైదిక సాహిత్యం ప్రభవించే కాలానికి గంగా యమునల మధ్యన ఉన్న మైదాన ప్రాంతం చేరి అక్కడి నుంచి దక్షిణాదికి కూడా వ్యాపించారు - వింధ్యనీ దక్షిణాదికి అటూ ఇటూ ఉన్న రెండు సముద్రాలనీ రెండు పర్వతశ్రేణుల్నీ ప్రస్తావించడమే అందుకు సాక్ష్యం.Henry David Thoreau అనే ప్రముఖ ఆమెరికన్ విమర్శకుడు "In the great teaching of the Vedas,there is no touch of sectarianism. It is of all ages and nationalities and is the Royal road for the attainment of the Great Knowledge" అని చెప్పిన దాన్ని బట్టి అప్పటికే సనాతన ధర్మం ప్రపంచ స్థాయికి ఎదిగిందని అర్ధం చేసుకోవాలి.

కొందరు చరిత్రకారులు అప్పటి రాజ్యం ఇప్పటి ఆటవిక తెగలను పోలి చాలా ప్రాధమిక స్థాయిలో ఉండేదని చెప్పారు.కానీ కొత్త పరిశోధకులు రంగంలోకి దిగిన తర్వాత మరొక దృశ్యం కనబడుతున్నది - ఇప్పటి ఆధునిక రాజ్యాంగ వ్యవస్థలకు దీటైన సభ, సమితి, విధాత వంటి పండితుల సమూహం రాజుకు రాజ్యపాలనలో సహకరించేది, రాజు సర్వస్వతంత్రనియంత కాడు!ఋగ్వేద సాహిత్యంలో పురోహిత,సేనాపతి అనే పదవుల ఉద్యోగుల ప్రస్తావన మాత్రమే ఉంటే మలి వైదిక యుగంలో యువరాజు వంటి కొత్త పదాల వర్ణన కనిపిస్తుంది.గోవులు ప్రధానమైన ఉత్పత్తి సాధనం కాబట్టి యుద్ధాలు కూడా "గవిష్టి" అనే పేరుతో పశుసంపదని పెంచుకోవడం కోసం జరుగుతూ ఉండేవి.

ఋగ్వేద సాహిత్యంలో లేని జనపదాల ప్రస్తావన మలి వైదిక సాహిత్యంలో కనబడుతుంది, అంటే, రాజ్యం యొక్క విస్తీర్ణం ఎక్కువయి సరిహద్దుల రక్షణ కూడా కీలకమైనదని గుర్తించారని తెలుసుకోవాలి.ఋగ్వేద సాహిత్యంలో  సైనికనిర్మితి లేదు,కానీ మలి వైదిక యుగంలో పదాతి,అశ్విక,రధిక విభాగాలతో పూర్తి స్థాయి సైనికనిర్మితి ఏర్పడింది.ఋగ్వేద సాహిత్యంలో పన్నుల ప్రస్తావన లేదు.రాజు ప్రజలు సంతోషం కొద్దీ ఇచ్చిన కానుకల్ని మాత్రం స్వీకరించేవాడు.కానీ మలి వైదిక యుగం నాటికి పన్నుల వసూలు యంత్రాంగం పూర్తి రూపం  తెచ్చుకుంది - సంగృహీతి(Treasurer).భాగదుఘ(Tax Collector) వంటి ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.


రాజ్యపు సంపదని పెంచే ఆర్ధికరంగంలో భూమిని దున్ని చేసే వ్యవసాయం,పశుపాలన మీద ఆధారపడిన వ్యాపారం అనే రెండు పద్ధతులూ లాభసాటిగానే ఉండేవి.ఈ రెండు రకాల ఆర్ధికరంగాల్లోనూ కీలకమైన పాత్రని పోషించడం వల్లనే గోజాతికి అంతటి విశిష్టమైన స్థానం లభించింది - గోపూజ అనేది ఆ జాతి తమకు కలిగిస్తున్న సౌభాగ్యానికి కృతజ్ఞతను తెల్పడం లాంటిది,కృతజ్ఞత అంటే ఏమిటో తెలియనివాళ్ళే హిందువుల గోపూజనీ నదీపూజనీ విమర్శిస్తారు.Carpenter, Potter, Blacksmith, Goldsmith, Gem-Specialist, Hunter, Star-Gazer/Astronomer, Chariot-Driver, Dancer,Singer, Musician, Fisherman, Merchant,Surgeon వంటి వాటిని ఎక్కువ ప్రస్తావించడం వల్ల ఈ వృత్తులు మంచి ఆదాయం తెస్తూ ఉండేవని అనుకోవాలి.Elephant-rearer, Shepherd, Weapon-Manufacturer, Conch-Blower, Gardener, Watchman, Calculation-Expert వంటి వృతులను కూడా అక్కడక్కడ ప్రస్తావించారు.వీరిలో ఆర్ధికవ్యవస్థకి సంబంధించిన లావాదేవీల్ని లెక్కించే గణకులు(Calculation-Experts) ఇప్పటి NRIల మాదిరి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా తెచ్చేవారు - ఇక్కడి గణకుల్ని ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు!

మలి వైదికయుగం పూర్తయ్యేసరికి పురోహిత-రాజరిక వ్యవస్థలు పరస్పరాశ్రితం అయ్యాయి.రాజు యొక్క అర్హతానర్హతల్ని నిర్ణయించడం,రాజును మూర్ధాభిషిక్తుణ్ణి చెయ్యటం,రాజు చేత సత్కార్యాలు చేయించి కీర్తిని పెంచడం పురోహితుల విధి.దీనికి బదులు పురోహితులకి గౌరవమర్యాదల్నీ ఆర్ధిక భద్రతనీ కలిగించడం రాజపురుషుల విధి.

సామాజిక జీవితంలో కుటుంబవ్యవస్థ బలమైనది - అప్పటి కుటుంబాలూ ఇప్పటి కుటుంబాలూ ఒక్కటి కావు,అప్పటి కుటుంబాలు ఇప్పటి గోత్రాలకి సమానం!అంటే,ఇవ్వాళ్టి గోత్ర పురుషుడు తొలినాళ్ళలో తండ్రి యొక్క కుటుంబం నుంచి విడిపోయి గానీ ఆర్ధికంగా ఎదగటం వల్ల కొత్త గుర్తింపును తెచ్చుకోవటం వల్ల గానీ సొంత ఇల్లు కట్టుకుని తన పేరున ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకునేవాడు.అతని తర్వాతి తరాల వాళ్ళు అతని కుటుంబం అయ్యేవాళ్ళు - ఉమ్మడి కుటుంబం కాబట్టి తండ్రి కావచ్చు తాత కావచ్చు ముత్తాత కావచ్చు ఎవరు జీవించి ఉంటే ఆ వ్యక్తియే కుటుంబానికి యజమాని.తొలి తరం కుటుంబపెద్ద పేరున గోత్రం స్థిరపడింది.


ఈ కుటుంబపెద్దనే గృహపతి అని పిలిచారు.ఒక్క యజమాని హోదా లేదనే తప్ప కుటుంబపెద్ద యొక్క భార్యకి సర్వాధికారలు ఉండేవి.ఒక విధంగా చూస్తే పురుషుడు సామాజిక జీవితం మీద దృష్టి కేంద్రీకరించడం,స్త్రీ కుటుంబ పాలన చెయ్యడం అనే సర్దుబాటు అది - గృహిణి,గృహం అనేవి విడదీయలేని అంశాల కింద పేర్కొనడాన్ని బట్టి గృహపతి,గృహపత్ని ఇద్దరికీ సమాన స్థాయి ఉన్నదనేది స్పష్టం!పురుషుడికి కుటుంబ యాజమాన్యం దఖలు పర్చటం అనేది కుటుంబం యొక్క ఉమ్మడి ఆస్తుల మదింపు,వారసత్వ విభాగం,ఇతరులతో భాగస్వామ్య ఒప్పందాలు, రాజ్యానికి కట్టవలసిన పన్నులు వంటివాటిలో చిక్కులు రాకుండా చేసిన ఏర్పాటు కావచ్చు - పురుషుడికి గల ఈ సాంకేతికపరమైన వెసుబాటును తీసేస్తే బాధ్యతలు మాత్రం ఇద్దరికీ సమానంగానే ఉండేవి.

"కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయేషు ధరిత్రి - షట్కర్మ నారి కులధర్మపత్ని" అని స్త్రీలకి మాత్రం సుత్తేసి వూరుకోలేదు."కార్యేషు యోగి, కార్ణేషు దక్షః, రూపేచ కృష్ణః, క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖమిత్రం - షట్కర్మ యుక్తః ఖలు ధర్మనాధః" అని పురుషులకి కూడా నొక్కి చెప్పారు.

ఇంటా బయటా స్త్రీకి వైదిక సమాజం ఇచ్చిన భాగస్వామ్యాన్ని గమనిస్తే ఈ కాలపు ఆండోళ్ళు మమ్మల్ని వేదకాలంలోని మగాళ్ళు చూసుకున్నట్టు చూసుకోండని రాండోళ్ళు మోగించటం ఖాయం - మహిళలకు వైదికయుగం స్వర్ణయుగమే!బహుభార్యాత్వం  అనేది రాజకీయ అవసరాల కోసం రాజులకీ పై స్థాయి వారికి మాత్రమే పరిమితమైంది.నూటికి నూరు శాతం స్వతంత్రత అంటే ఒక విధమైన అరాచకత్వమే,నూటికి నూరు శాతం సమానత్వం అంటే ఒక విధమైన అసంతుష్టత్వమే - పురుషుడికీ నియమాలూ నిబంధనలూ ఉన్నప్పుడు స్త్రీకి రక్షణనీ గౌరవాన్నీ మర్యాదనీ ఇవ్వటం కోసం చేసిన ఏర్పాట్లని కూడా అన్యాయం అనేవాళ్ళు నైతికభ్రష్టత్వాన్ని కోరుకుంటున్నారని అర్ధం చేసుకోవాలి.బాల్యవివాహం అనేది ఆనాడు లేదు - స్త్రీకి యుక్తవయస్సు వచ్చాకనే వివాహం,అదీ పెద్దల నిర్ణయం/ఆమోదంతో పనిలేని స్వయంవరం అనే ఏర్పాటు కూడా ఉన్నది!భర్త చనిపోతే ఇప్పటివలె జీవితాంతం ఒంటరితనం అనుభవించనక్కరలేదు - విధవలకు పునర్వివాహం ధర్మబద్ధమే!


యజుర్వేదం 10:03 women should be valiant అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should earn fame అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should be scholars అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should be illuminating అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should be wealthy అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should be intelligent అని చెబుతుంది.అధర్వవేదం 14:01:20 women should take part in legislative Chambers అని చెబుతుంది.ఋగ్వేదం 10:85:46 women should lead nation as a ruler అని చెబుతుంది.అధర్వవేదం 09:09:02 women should Ride on Chariots అని చెబుతుంది.యజుర్వేదం 16:44 women should participate in war అని చెబుతుంది.

వేదాధ్యయనం చెయ్యాలనుకున్న స్త్రీలకి ఉపనయన సంస్కారం ద్వారా  అర్హత కల్పించబడుతూ ఉండేది.అపాల,ఘోష వంటి స్త్రీలు మంత్రద్రష్టలై ఋషిత్వాన్ని కూడా సాధించారంటే ఇంక అసమానతకి తావు యెక్కడ?సృష్టిలోని చలనానికి కారణమైన శక్తికి స్త్రీ రూపం ఇచ్చి సృష్టికి కర్తయే ఆమె అబి చెబుతుంటే హిందువుల మతగ్రంధాలు స్త్రీని రెండవ స్థానంలోకి నెట్టేశాయి అనేది అర్ధం లేని వాదన.వైదిక యుగంలో ఆలయ నిర్మాణం కానీ మూర్తిపూజ కానీ లేదు.ఉభయ సంధ్యలలో చేసే వ్యక్తిగత ప్రార్ధనలూ యజ్ఞం జరిగే సందర్భాలలో చేసే సామూహిక ప్రార్ధనలూ తప్ప మరొక రకమైన ఆరాధనా పద్ధతి లేకపోవటం వల్ల "అగ్ని" అనే పురుషదేవతాస్వరూపం ఒక్కటే ఎక్కువ కీర్తించబడుతూ ఉండేది. తర్వాత కాలంలో ప్రముఖ స్థానం పొందిన బ్రహ్మ(god of creatoion),విష్ణు(god of nourishment),మహేశ్వరుల(god of annihilatio) కన్న ముందు సరస్వతి(godess of cducation),లక్ష్మి(godess of affluence),పార్వతి(godess 0f protection) అనే త్రిమాతలు వైదికయుగంలోనే ప్రముఖస్థానం  పొందారు.వీళ్ళని జంటల్ని చేసింది హిందూద్వేషులు అనుకుంటున్నట్టు వాళ్ళ కామతృష్ణని తీర్చటం కోసం కాదు: creation-education అనే వాటి మధ్య complementary relationship, nourishment-affluence అనే వాటి మధ్య projectile relationship, annihilation-protection అనే వాటి మధ్య supplementary relationship ఉంటాయి అని ఆర్యఋషులు చెబుతున్నట్టు అర్ధం చేసుకోవాలి.

కాళిక అనే దేవత శివుడు అనే దేవుడి అర్ధాంగి - శివుడికి ఈ దేవత పేరు లాంటిదే అయిన కాళుడు అనే పేరు కూడా ఉంది.annihilation అనే ఒక తత్త్వానికి కాళుడు పురుషరూపం అయితే కాళిక స్త్రీరూపం అవుతుంది - వీళ్ళిద్దరూ చేసేది దుర్మార్గుల్ని annihilate చెయ్యటం ద్వారా సన్మార్గుల్ని protect చెయ్యటం.అయితే హిందూమతానికి సంబంధించిన ఈ కాళి అనే దేవతకి మెక్సికో ప్రాంతంలో దేవాలయం ఉండటానికి కారణం ఏమిటి?కాలిఫోర్నియా నగరం పేరులో ఉన్నది కాళియే - నిజం!సమస్త ఇశ్రాయేల్ అని అర్ధం వచ్చే హీబ్రూ భాషలోని kal-Israel ఆనె పదం నుంచి తొంగి చూస్తున్నది కూడా కాళికయే - Kal Yisroel:All Israel[to be found in jewish glossory].అమెరికా ఖండం లోని ప్రాచీన మయన్ నాగరికత నిర్మాతల జాతినామంలో ఉన్నది కూడా మాయ అనే హిందూ దేవత నామధేయమే!ప్రాచీన aztec సమూహం అజ మహారాజు పేరునే తమ జాతినామం కింద స్వీకరించారు!అక్కడా ఇక్కడా అని లేదు ఒకప్పుడు ప్రపంచం మొత్తం సనాతన ధర్మపు ఆదిప్రణవనాదమే ప్రతిధ్వనిస్తూ ఉండేది!ఇప్పటి క్రైస్తవం పుట్టిన జుదాయిజం సర్వమూ షివమయమే - Ish, Yish, Is, Isa,Issa వంటి దైవసంబంధమైన సంబోధనలు అన్నీ శివనామం యొక్క అపభ్రంశ రూపాలే!బైబిలు పాత నిబంధనలోని వ్యక్తుల పేర్లూ ప్రాంతాల పేర్లలో సంస్కృత మూలాలు స్పష్టంగా కనబడతాయి - yahweh యొక్క consort పేరు asura!న్యూయార్క్ నగరంలో యూదులు తమకోసం నిర్మించుకున్న యూనివర్సిటీకి yeshiva university అని పేరు పెట్టుకున్నారు!పాత నిబంధనలో తరచు కనిపించే seven అనే సంఖ్యాపదం కూడా శివనామమే - He is the Lord of Seven Worlds, Seven Rivers, Seven Churches!భయదనర్తనం చేసే హిందూ దేవుడైన ప్రళయ కాలరుద్రుడినే క్రైస్తవులు తీసుకుని "యహోవా రోషము గల దేవుడు!" అని చెప్పుకున్నారు.వలసకాండలో కనిపించే యహోవా యొక్క ఉగ్రత్వం పరమశివుడు ప్రళయతాందవం చేస్తున్నప్పడు జరిగే భీబత్సాలకి సంబంధించిన వర్ణన!అయితే హిందువుల శివుడికి మనుషులు ధర్మహాని చేస్తూ సాధుసజ్జనుల్ని హింసిస్తే కోపం వస్తుంది,క్రైస్తవుల యహోవాకి మనుషులు యెన్ని తప్పుడుపన్లు చేసినా పర్లేదు గానీ తనని నమ్మకపోతే మాత్రం కోపం వస్తుంది.హిందువుల దేవుడు మనుషులు తనని నమ్మకపోయినా మంచిగా ఉంటే చాలు కటాక్షిస్తాడు,క్రైస్తవుల దేవుడు మనుషులు మంచిగా ఉన్నా తనని నమ్మకపోతే తప్పకుండా శిక్షిస్తాడు.

పరం గురించి ఆలోచించే అవసరం లేని ఇహం లోని అన్ని పార్శ్వాలనూ కూలంకషం తడిమిన వైదిక యుగం నాటి భారతీయసమాజానికి సాటి రాగలిగిన మరొక మానవ సమాజం అప్పుడే కాదు భూమి మీద ఇప్పుడు కూడా లేదు. భక్తియార్ ఖిల్జి నలంద దహనం దగ్గిర్నుంచి ఇప్పటివరకు గడచిన సుమారు వెయ్యేళ్ళ కాలం వైదిక సంస్కృతికి చీకటియుగం అని చెప్పాలి.!భక్తియార్ ఖిల్జి వంటివాళ్ళు దోచుకున్నంత సంపద దోచుకుని సంస్కృతిని ధ్వంసం చేసి పోవటానికీ ఇతర్లు ఇక్కడ తిష్ఠ వేసుకు కూర్చుని అధికారం ఆశ చూపించి మనలోని కొందర్ని మన సంస్కృతికి శత్రువులను చెయ్యటానికీ ఆ సంస్కృతిని అంటిపెట్టుకుని ఉండటం వల్ల ఈ దేశానికి పట్టిన వైభవం వారిలో ఈర్ష్యను రగిలించటమే కారణం!

“ఈర్ష్యీ ఘృణీ త్వసంతుష్టః క్రోధనో నిత్యశంకితః
పరభాగ్యోపజీవీ చ షడేతే దుఃఖభాగినః”
ఇది నారాయణ పండితుని హితోపదేశం, మిత్రలాభం లోని శ్లోకం. ఒకరిని చూచి ఈర్ష్య పడేవాడు, అత్యాశాపరుడు, సంతృప్తి లేనివాడు, కోపస్వభావం కలవాడు, నిత్యశంకితుడు, ఇతరుల సంపదపై ఆధారపడి జీవించేవాడు – ఈ ఆరుగురు నిత్య దుఃఖితులని ఈ శ్లోకం చెప్తోంది.అలాంటి ఈర్ష్యాళువుల కన్ను వైదిక యుగం నుంచీ సా.శ 17వ శతాబ్దం వరకు ప్రపంచం మొత్తం మీద పుట్టే సంపదలో మూడొంతుల నుంచి నాలుగొంతులకి తగ్గకుండా సృష్టించగలిగిన భారతదేశం మీద పడింది - అంతటి వైభవమూ నరుడి కంటికి నల్లరాయి పగులుతుందన్నట్టు పిగిలిపోయింది!

సృష్టికి ముందునుంచే ఉనికిలో ఉండి తను గోచరం కావడం వల్లనే బ్రహ్మకు కూడా మోహాన్ని చెదరగొట్టి సృష్టి రచనకు కావలసిన శక్తియుక్తులని ప్రసాదించి సృష్టిని నడిపిస్తున్న వైదికధర్మం భారతీయ సమాజంలో ఒక వెయ్యేళ్ళ పాటు తన ప్రాభవాన్ని కోల్పోవడం ఏమంత పెద్ద విషయం కాదు.హిందువులు తమ పొరపాటును గ్రహించారు.వేదం పట్ల ఆసక్తి పెరిగింది.పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి సాధించాలనే పట్టుదల కనిపిస్తున్నది.అయితే సామాజికులలో కనిపిస్తున్న ఈ అంకితభావం రాజకీయవాదులలో కనిపించడం లేదు.వైదిక సంస్కృతి తిరిగి లేస్తున్నదని పసికట్టిన హిందూద్వేషులు కూడా దాడిని పెంచిన తరుణంలో బలమైన రాజకీయ నాయకత్వం లేకపోతే దాడిని ఎదుర్కోవటమూ తిప్పికొట్టటమూ కష్టమౌతుంది.అలాంటి రాజకీయ సంఘటన జరగడానికి కూడా హిందువులు తమ జ్ఞానాన్ని విస్తృతం చేసుకోవాలి.

మన మతాన్ని బలహీనం చెయ్యడానికి హిందూద్వేషులు మూడు ముఖ్యమైన విషయాలని ఎంచుకున్నారు - 1).బ్రాహ్మణాధిక్యత,2).మూర్తిపూజ మరియు బహుళదేవకీర్తనం, 3).పురాణకధలలోని అసంబద్ధత అనేవి.నిజానికి వాళ్ళు హిందూమతంలోనే ఉన్నాయని చెబుతున్న ఇవే లోపాలు వాళ్ళ మతాల్లో కూడా ఉన్నాయనేది వాళ్ళకి తెలియటం లేదు.

"బ్రాహ్మణులు హిందూమతానికి సంబంధించిన అన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకుని ఒళ్ళలిసే పనులకి పోకుండా కూర్చుని తింటూ ఇతర్ల మీద పెత్తనం చేస్తున్నారు!" అనేవాళ్ళకి క్రైస్తవంలో పాస్టర్ల్కూ ఇస్లాములో ముల్లాలూ కూడా రికామీగా తిరుగుతూ జనం మీద పడి బతకటం ఎందుకు కనిపించటం లేదు?మనం చేస్తున్న స్థాయిలో కాదు గానీ క్రైస్తవులు శిలువకీ ముస్లిములు నల్లరాయికీ చేస్తున్నది కూడా ఒకింత తక్కువ స్థాయిలోని మూర్తిపూజయే కదా!మనకున్న విస్తారమైన పౌరాణిక సాహిత్యంలో అక్కడొకటీ ఇక్కడొకటీ తప్పులు కనిపెడుతున్న వాళ్ళకున్న అతి తక్కువ పురాణకధల్లోనే లెక్కలేనన్ని బూతులు కనపడుతున్నాయి కదా!వాళ్ళ మతసాహిత్యం మనకి తెలియదని వాళ్ళ ధైర్యం - ఒకవేళ తెలుసుకుని రెట్టించి అడిగితే "ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు!మేం మీలో తప్పులు పడితే తిరిగి మీరు మాలో తప్పులు పడితే అది ఉడుకుమోత్తనం అవుతుంది కానీ మీ మతం మా మతం కన్న గొప్పదని ఋజువు చేసినట్టు కాదు!" అని అడ్డం తిరిగి వాదిస్తారు.

వాళ్ళ పురాణ కధలు మన పురాణ కధల నుంచి కాపీ కొట్టినవి కాబట్టి వాటి అసలు అర్ధం వాళ్ళకి తెలియదు,కానీ మనం మన పురాణ కధలకే కాక వాళ్ళ పురాణ కధల వెనక ఉన్న అసలైన అర్ధం కూడా చెప్పగలం - ఎందుకంటే, మన పౌరాణిక సాహిత్యకర్తలు వైదిక సాహిత్యంలో కనిపించే శాస్త్రీయతకి లోబడే ఆ రచనల్ని కూడా చేశారు!ఉదాహరణకి శివుడూ విష్ణువూ ఒకరితో ఒకరు యుద్ధం చెయ్యటం, బ్రహ్మ శివుడి భార్యకేసి కసిగా చూడటం,శివుడు బ్రహ్మ తలని గోటితో తుంచెయ్యడం,తన గోరుకి అతుక్కున్న బ్రహ్మకపాలాన్ని వదిలించుకోవడానికి శివుడు భూమి మీద ఉన్న పుణ్యక్షేత్రాలని సందర్శించడం లాంటి కధల్ని సృష్టి నడవటానికి కారణమైన "మాయ - లీల" అనే శక్తులను గురించి ప్రజలకి అర్ధం అయ్యేటట్లు చెప్పటం కోసం కల్పించారు.

వేదంలోనూ భాగవతంలోనూ పురాణాలలోనూ అసలు సృష్టి ఎలా జరిగిందనేదానికి ఒకే ఒక విశ్లేషణ ఉంది - పదార్ధ తత్త్వాలు అన్నీ మహత్తత్వం అనే మాయ వల్లనే ఏర్పడుతాయి.ఈ మాయ కూడా ఈశ్వర స్వరూపమే కాబట్టి జీవులు కూడా పరమేశ్వరుని నుంచి ప్రభవించిన పరమేశ్వరుని స్వరూపాలే కానీ ఆ సత్యాన్ని జీవులు తెలుసుకోలేవు - కారణం మాయ తనకు తనే ఒక ముసుగులా మారి జీవులకి తమలోని ఈశ్వరతత్త్వాన్ని గ్రహించే వీలు లేకుండా చేస్తుంది.ఈ ముసుగు తొలగిపోతే సృష్టిని నడిపిస్తున్న పరమేశ్వరుని లీల తెలుస్తుంది - అదే మోక్షం!అయితే , మాయ ముసుగును వేసినది భగవంతుడే కాబట్టి ఆయన తనంతట తను తొలగించడు - అది జీవుడు ప్రయత్నపూర్వం చెయ్యాల్సిన దుష్కర కార్యం.

అసలైన సృష్టికర్త ఒక్కడేననీ ఆ ఏకేశ్వరుడిని మనం కంటితో చూడలేమనీ సాక్షాత్తూ వేదం చెబుతూనే ఉంది,భాగవతంలోని విరాట్పురుష వర్ణన ప్రకారం అనంతకోటి విశ్వాలలోని ప్రతి విశ్చమూ మన విశ్వం యొక్క నిర్మితినే పోలివింటుంది.విశ్వాన్ని నిలబడి ఉన్న  అండంలా వూహించుకుంటే కింద మహావిష్ణువూ పైన మహాశివుడూ ఉంటారు.నిరంతరం ధ్యానమగ్నులై ఉంటూ మాయకు లోబడకపోవటమే వీరి ప్రత్యేకత - దృశ్యమాన ప్రపంచం నిర్మించబడిన మాయావరణానికి లోపలనే ఉన్నారు కాబట్టి సర్వేశ్వరుడి లీలావినోదం ప్రకారమే వీరు కూడా అప్పుడప్పుడు మాయకు లోబడుతూ ఉంటారు. మాయ కూడా ఈశ్వరస్వరూపమే కాబట్టి దానికి లోబడటం నేరమో ఘోరమో కూడా కాదు.ఎటూ అది ముసుగే కాబట్టి ప్రధానపాత్ర దాన్ని లాగిపారేసి అసలు తత్త్వాన్ని చూడటంతో కధ పూర్తయిపోతుంది, అంతే!

ఏసు శిష్యులు "నీవు రెండవ తూరి ఎప్పుడు వత్తువు?" అని అడిగి "మీరు జీవించియున్న కాలముననే వత్తును!" అని క్రీస్తు చెప్పిన జవాబు విని గంపెడాశతో బతికినంతకాలం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి వాళ్ళు చచ్చిపోయిన ఇన్ని తరాల తర్వాత కూడా బూర వూదుకుంటూ వచ్చే క్రీస్తు రెండవ రాకడ కోసం చెవులు రిక్కించుకుని ఎదురు చూస్తున్న గొర్రెలకి ఇవన్నీ అర్ధం కాకపోయినంతలో నష్టమేమీ లేదు గానీ ఇలా అర్ధం తెలుసుకుని ధృఢమైన నమ్మకం పునాదుల మీద నిలబడిన హిందువులు లక్ష డాలర్లు ఇచ్చినా మతం మారిపోరు.

అప్పుడు గాంధారలో మతం మారారు ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది, సింధ్ హిందువులు మతం మారారు పాకిస్తాన్ అయ్యింది, ఉత్తరంలో మతం మారారు టిబెట్ ముక్క అయ్యింది, ఈశాన్యంలో మతం మారారు బర్మా ముక్కలు అయ్యింది, బెంగాలులో మతం మారారు బంగ్లాదేశ్ అయ్యింది.

ముల్లాలు - పాస్టర్లు ఒక్కటే గోల "మతం మారండి మతం మారండి" అని. మతం మారితే తెలియని పరలోకం ఏమో కాని, మిగిలిన భారత దేశం కూడా మరిన్ని ముక్కలు అవుతుంది. మతం మారితే దేశాన్ని ముక్కలు చెయ్యడానికి సహాయం చేసినట్టే!

ప్రపంచ చరిత్రలో:ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి ->ఈజిప్ట్ నాగరికత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->బాబిలోనియా నాగరికత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->పెర్షియన్ నాగరిత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->గ్రీకు నాగరికత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->మాయన్ నాగరికత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->ఆస్ట్రేలియా నాగరికత నాశనం అయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->మంగోలియా నాగరికత నాశనం అయ్యింది, క్రైస్తవం అడుగుపెట్టింది->చైనీస్ నాగరికత నాశనం అయ్యింది

భారత చరిత్రలో:ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->అఖండ భారతం ముక్కలయ్యింది, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->కుల గొడవలు పెంచారు, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->సనాతన సామాజిక వ్యవస్థ ను కూల్చారు, ఇస్లాం+క్రైస్తవం అడుగుపెట్టాయి->మొత్తం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెడుతున్నారు.

మళ్ళీ వీళ్ళెవరో కాదు,సరస్వతి ఎండిపోయినప్పుడు అటువైపుకు వలసపోయి  మూలంతో సంబంధం తెగిపోయి పోగొట్టుకున్న పాలు తేనెలు పొంగిపొర్లే పాడిపంటలతో నిండిన భూతలస్వర్గం కోసం అలమటిస్తున్న మందభాగ్యుల వారసులే!ఎక్కడ పోగుట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలన్నట్టు తిరిగి వైదిక సంస్కృతిని పునరుద్ధరించడం వల్లనే మనం క్షయం లేని వృద్ధిని సాధించి ప్రపంచానికి శాంతిభద్రతల్ని ప్రసాదించగలమనేది వ్యాసపరాశరాదిషిర్దిసాయినాధపర్యంతం ఉన్న గురుపరంపర పాదాల సాక్షిగా నేను చెబుతున్న పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

Tuesday, 9 October 2018

భీష్ముడు కూడా శ్రీమహావిష్ణువు అవతారమేనా?ఎందుకు కాకూడదు - స్వఛ్చంద మరణమూ అవతార పరిసమాప్తీ ఒకటే కదా!

ప్రథమ స్కంధము : ఉపోద్ఘాతము
1-1-శా.
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.

భావము:
సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరి తనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ము డైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను. 

హరివాక్యం:
ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంధ ప్రారంభ పద్యం - భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమానమైన పద్యం. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. (అ) శ్రీ కైవల్య పదఁబు జేరుటకునై చింతించెదన్ (ఆ) లోకరక్షైకారంభకున్ (ఇ) భక్తపాలన కళా సంరంభకున్ (ఈ) దానవోద్రేక స్తంభకున్ (ఉ) కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ (ఊ) మహానందాంగనా డింభకున్ అనే ఆరు అద్భుత ప్రయుక్తాలు భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షణ చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు. 

పోతన గారి గురించి మనకి చాలా కల్పిత కధలు ఉన్నాయి.ఆయనొక బీదరైతు అనుకుంటూ ఉంటారు చాలామంది ఆ కధల్ని బట్టి.కానీ తన తాత తండ్రులైన భీమన సోమనలకు చేర్చిన మంత్రి అనే పదం వాళ్ళు రాజసభలో మంత్రిగా ఉందేవాళ్ళని సూచిస్తున్నది - ఇప్పటి ప్రభుత్వోద్యోగులకి ఉండే ఇలాంటి బిరుదుల్ని ఆ హోదా లేనివాళ్ళు పెట్టుకోకూడదు కదా!ఇతనికి మాత్రం ఆ పొడ గిట్టక స్వతంత్రజీవనం గడిపాడని అనుకోవచ్చు."మనుజేశ్వరాధములు" అనే మాట ఛందస్సు కోసం వాడినట్టు కాక మనస్సులో ఉన్న కసిని బయటపెట్టుకుంటున్నట్టు పద్యం మొత్తం మీద ఖంగున మోగుతుంది!

ఇప్పుడు మనమనుకుంటున్నట్టు ఏదో మారుమూలాన నాలుగైదెకరాల మడక దున్నుకుంటూ బీదరికం అనుభవించే దుర్గతిలో లేడనీ లౌక్యం తెలిసిన పెద్ద రైతు అనీ అనుకోవాలి.అదీగాక,ఆనాడు కూడా కవిత్వం రాయాలంటే తను రాయడానికి తాళపత్రాలు సిద్ధం చేసుకోవడం దగ్గిర్నుంచీ ప్రచారం కోసం ప్రతులు తీయించడం వరకూ ఇవ్వాళ్టి లాగానే చాలా శ్రమా వ్యయమూ కలిసిన వ్యవహారం - అందుకే అప్పుడూ ఇప్పుడూ కవులకీ కళాకారులకీ రాజాశ్రయం తప్పదు!ఇతనికి తగినంత ధనం ఉన్నది గనక రాజాశ్రయం అవసరం లేకపోయింది,అవసరం లేదు గనక తిట్టగలిగాడు!

మధురాధి పతే రఖిలం మధురం అన్నట్టు పోతన గారి కవిత్వంలో రమ్యం కాని భాగం ఏదీ లేదు!ప్రస్తుతానికి భీష్మ పితామహుడు అవతార పరిసమాప్తి ముందు సాక్షాత్తూ శ్రీకృష్ణుణ్ణి చూస్తూ స్తుతిస్తూ చెప్పిన పద్యాలను గురించి చెప్పాలనుకుంటున్నాను.గతంలో గరికపాటి వారు "హయరింఖాముఖ,కుప్పించి యెగసిన" పద్యాలను గురించి చెప్పటం విన్నాను.చాలా బాగా చెప్పారు.అయితే,ఇప్పుడు నేను వాటిని చదువుతున్నప్పుడు కొన్ని కొత్త ఆలోచనలు పుట్టాయి.వాటిని మీతో పంచుకుంటాను.

ప్రథమ స్కంధము : భీష్మనిర్యాణంబు


హరివాక్యం:
అవతార పురుషులైన శ్రీరాముడూ శ్రీకృష్ణుడూ తమ కార్యం పూర్తి కాగానే తమ పార్ధివ దేహాల్ని విడిచిపెట్టి నిజస్థానం చేరిన విధంగానే అర్జున  శస్త్రాలకి ఖిలమై నీరసించిన ప్రాణజ్యోతిని దేహధర్మానుసారం అప్పుడే పోనివ్వకుండా నిలిపి ఉంచి తను కోరుకున్న సుముహూర్తంలోనే విడువగలిగిన భీష్ముడి నిర్యాణం ఆ ఇద్దరి అవతార పరిసమాప్తికి సమానమైనదే!


ఇతని జననం కూడా విశిష్టమైనదే - శివపత్ని అయిన గంగ ఇతని కోసం మానవదేహం దాల్చి శంతనపత్ని కావలసి వచ్చింది!ఇతను తొలిసారి తన తండ్రికి దాదాపు పన్నెండేళ్ళ వయస్సులో కనిపిస్తాడు.అక్కడ సంవత్సరం చెప్పినట్టు చూడలేదు నేను,కానీ పూర్తి యవ్వనంలో ఉన్నట్టూ చెప్పలేదు, మరీ పసిబాలుడిలా ఉన్నట్టుగానూ చెప్పలేదు - కాబట్టి ఉజ్జాయింపు అంచనా వేశాను.శ్రీకృష్ణుడి జనన కధనం ప్రకారం తను బొడ్డు తాడు తెంచుకుని పుట్టలేదు - మొదట పన్నెండేళ్ళ బాలుడిలా కనబడి నేను మీకు పుత్రుడినౌతున్నానని చెప్పి మరుక్షణం దేవకి ఒడిలో శిశువులా చిరునవ్వులు చిందిస్తూ కనబడతాడు. బౌద్ధమతానికి ప్రారంభకర్త అయిన గౌతమ బుద్ధుడు కాక విష్ణువు అవతారమైన సుగత బుద్ధుడు పెంపుడు తండ్రి ముందు కనబడినప్పటి వయస్సు పన్నెండేళ్ళు అని చాలా స్పష్టంగా ఉంటుంది!

అసలు రహస్యం ఏమిటో తెలియడం లేదు గానీ బాల వటువుగా బలిని సందర్శించే వామన మూర్తి కూడా దాదాపు పన్నెండేళ్ళ వయస్సులో ఉండటమూ కపిలముని తన తల్లికి జ్ఞానబోధ చేసినప్పటి వయస్సు కూడా ఇదే స్నిగ్ధయవ్వనం కావడమూ నేను గమనించాను.అన్నింటి మధ్యన బలమైన కారణం ఉంటే పెద్దలు చెప్పాలి - అది నా ప్రస్తుత జ్ఞానానికి అతీతమైన విషయమే!బహుశా వేదాధ్యయనం మొదలుపెట్టడానికి నిర్దేశించిన వయస్సు కావచ్చునని నేను వూహిస్తున్నాను.

అలా జనన మరణ విశేషాలు రెండింటిలో వాసుదేవసముడైన శ్రీ భీష్మ పరంధాముడు కట్టెదుట నిల్చిన శ్రీ కృష్ణ పరంధాముణ్ణి చూసి ధన్యుడై సాటి మానవులు తరించడం కోసం కొన్ని దివ్యమణుల్ని వెదజల్లుతున్నాడు!

1-219-మ.
"త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.
భావము:
“ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం గలవాడు; పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు; నల్లని ముంగురులు కదలాడుతుండే వాడు; ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం కలవాడు; మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తు చేరి ఉండే అందగాడు; అయిన మా శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి.

1-220-మ.
హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.
భావము:
గుఱ్ఱాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ముకొట్టుకుపోతున్నా; ముంగురులు చెదిరి పోతున్నా; అధికమైన రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు కారుతున్నా; ముచ్చటైన ముఖమంతా ఎఱ్ఱగా అవుతున్నా; నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తు యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణపరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను.

హరివాక్యం:
గుఱ్ఱాల్నీ,వాటి కాలి గిట్టల్నీ,వాటినుంచి రేగిన  ధూళిని కూడా వర్ణించాలా?అవేం అందమైన అమ్మాయిల కళ్ళా,చెంపలా,పెదవులా,వక్షోజాలా,నడుమా,పిరుదులా,తొడలా,పాదాలా - అబ్బో!ఆనాటి ప్రబంధ కవుల నుంచీ ఈనాటి సినిమా కవుల వరకూ పోల్చని పోలిక లేదు.అయినా తనివి తీరడం లేదు.ఈయనేమిటండీ,గుర్రాల మీదా వాటి కాలిగిట్టల మీదా వాటినుంచి పైకి లేస్తున్న దుమ్ము మీదా ఇంత అందమైన పద్యం చెప్పాడు!

కుసింత వెరైటీ కోసం చెప్పాడా!కాదండి!ఆ గుర్రాల్ని పొగడాల్సిందే!వాటి అదృష్టమే అదృష్టం!ఏ క్షణాన సారధిత్వానికి ఒప్పుకున్నాడో ఆ క్షణం నుంచీ వాటికి ఆయన చేసిన సేవలు ఎలాంటివో చూడండి!మేత పెట్టటం,నీళ్ళు తాపించడం,ఒళ్ళు కడిగి శుభ్రం చేయడం,మెత్తని శయ్యలు అమర్చడం,వాత్సల్యంతో ఒళ్ళంతా నిమురుతూ కబుర్లు చెప్పడం - యశోదానందులకి చేశాడా దేవకీ వసుదేవులకి చేశాడా రుక్మిణీ సత్యభామలకి చేశాడా ఇవన్నీ!

పెద్దలు ఏమిటో చెప్తారు, కొందరు దేవతలూ ఋషులూ  శ్రీమహావిష్ణువు శ్రీరాముడిగా అవతరిస్తున్నాడని తెలియగానే కోతులై పుట్టారనీ శ్రీకృష్ణుడిగా అవతరిస్తున్నాడని తెలియగానే గోపికలై పుట్టారని.ఈ లింకులు కలిపే పిచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే శ్రీకృష్ణుడి బొటనవేలికి గాయం చేసినవాడు రామాయణ కావ్యంలోని వాలి అనేవరకు వెళ్ళింది! వాలి పగ తీర్చుకోవటం కోసం వరం పొంది మళ్ళీ పుట్టటం అంటే వాణ్ణి చంపటం అన్యాయం అంటున్నట్టు కాదూ!మూడు కాలాలనీ ముడి వేసి చూడగలిగిన వాడూ యోగశక్తితోనే తనువు చాలించగలిగినవాడూ గాంధారి శాపాన్ని మన్నించడం కోసం ఒక మిషని కల్పించుకోవడానికి మామూలు బోయవాడు చాలడా?రామాయణ కాలం నాటి వాలి మళ్ళీ జన్మ యెత్తి రావాలా!పౌరాణికులు ఇలాంటి అతి చేష్టల్ని తగ్గించుకోవాలి.ఇంతకీ అంతటి మేధావులు శ్రీకృష్ణుడు గోపికలతో ఆడుకుంటాడని తెలిసి ఆడుకోవడంతోనే సరిపెట్టుకున్నారు గానీ ఈ గుర్రాలై పుట్టాలని ఎవరూ అనుకోలేదేమిటో - ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్సయ్యారు?ఇలాంటివి అదృష్టంతో రావండి!అర్హత ఉండాలి.మానవజాతిలో అపుడప్పుడూ కొందరు జాతవేదులు ప్రభవిస్తారు - కాలానికి అవసరమై పుట్టిన ముహూర్తం వల్లనో, పుట్టి పెరిగిన కుటుంబ వాతావరణం వల్లనో,మిత్రబాంధవ సంపర్కం వల్లనో కొందరికి ప్రత్యేకించి గురువులెవరూ లేకపోయినా తమ జన్మకారణం తెలుస్తుంది.ఆ జాతవేదులనే ఈ అశ్వాల రూపంలో భావించితే అర్ధం అద్భుతః అనిపిస్తుంది - దైవకార్యం నెరవేర్చే జాతవేదులకి కూడా భగవంతుడు ఇవే సేవల్ని చేస్తాడు!మహాకవి పోతన ఇక్కడ స్మరిస్తున్నది అలాంటి జాతవేదులనే!

1-221-మ.
నరుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో
బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం
బరభూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ
పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.
భావము:
ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తూ రథాన్ని తీసుకు వెళ్ళి ఉభయ సేనలకు మధ్యప్రదేశంలో నిలబెట్టాడో, కౌరవపక్ష రాజు లందరిని పేరుపేరునా చూపిస్తూ ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేసాడో -  ఆ శ్రీకృష్ణపరమాత్మ నా హృదయపద్మంలో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక.

1-222-క.
తనవారిఁ జంపఁజాలక
వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్
ఘన యోగవిద్యఁ బాపిన
మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్.
భావము:
రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనుదీస్తున్న ధనుంజయునికి మహా మహిమాన్వితమైన గీతోపదేశం చేసి, సందేహాలు పోగొట్టి, యుద్ధంలో ముందంజ వేయించిన వాని; మునులచే స్తుతింపబడు పరముని పాదభక్తి నాలో పరిఢవిల్లుగాక.

1-223-సీ.
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి; 
గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ; 

నుఱికిన నోర్వక యుదరంబులో నున్న; 
జగముల వ్రేఁగున జగతి గదలఁ; 

జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ; 
బైనున్న పచ్చనిపటము జాఱ; 

"నమ్మితి నాలావు నగుఁబాటు సేయక; 
మన్నింపు" మని క్రీడి మరలఁ దిగువఁ;

1-223.1-తే.
గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి 
"నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున" యనుచు మద్విశిఖ వృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.
భావము:
ఆ నాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీరగంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కన్పిస్తున్నది; కుప్పించి పై కెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి; ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమండలం కంపించిపోయింది; చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారుచేలం జారిపోయింది; “నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవ ” ద్దని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్కచేయకుండ “అర్జునా! నన్ను వదులు. ఈ నాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను” అంటూ కరిపైకి లంఘించే కంఠీరవం లాగా నా పైకి దూకే గోపాల దేవుడే నాకు రక్ష.

హరివాక్యం:
ఈ జంట పద్యాలలోని సీస పద్యపు ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క విచిత్రమైన వైరుధ్యం ఉంది.వీటన్నిటికీ తేటగీతి చివరి రెండు పాదాల్లో జవాబు దొరుకుతుంది!మొదటి పాదంలోని వైరుధ్యం:భూమి మీద ఎక్కడో కురుక్షేత్రం అనేచోట మెరిసిన ఈయన కుండలాల తళుకులు ప్రపంచం మొత్తాన్ని ఎట్లా వెలిగిస్తాయి?దీనికి గరికిపాటి వారు చెప్పినది బాగుంది గనక దాన్నే ఖాయం చేద్దాం.అదేమిటంటే, లలితాసాహస్రంలో కనత్కనకతాటంకయుగళే అని ఉంటుంది.ఈయనా ఆవిడా ఒకరే అని అనుకుంటే అది విచిత్రం అనిపించదు.


రెండవ పాదంలోని వైరుధ్యం:పధ్నాలుగు లోకాల ఈ బ్రహ్మాండాన్ని ఉదరంలో మోస్తున్నవాడు తన ఉదరంలో ఉన్న ఈ విశ్వంలోకి రావడమే ఒక వింత, మళ్ళీ ఇక్కడున్న ఒక చిన్న రధం మీద నుంచి నేల మీదకి దూకితే తనతో సహా తన ఉదరంలో ఉన్న ఈ విశ్వం కదిలిపోవాలి గదా - చిన్న అదురుతో ఆగిపోయిందేమిటి?దీనికి గరికిపాటి వారు చెప్పినది బాగానే ఉంది కానీ నేను మరో వైపు నుంచి చూద్దామనుకుంటున్నాను.

మనం ఉన్న విశ్వం యొక్క పరిమాణం ఎంత?తెలియదు!కానీ కొలవడానికి తీసుకున్న కొలత మన దేహమే,అవునా?మన దేహం తప్పించి మిగిలిన వాటిని మనకన్న ఎంత పెద్దది, మనకన్న ఎంత చిన్నది అని సాపేక్షంగా కొలుస్తున్నాం.అయితే, అనంతకోటి విశ్వాలలో అన్నీ ఇదే పరిమాణంలో ఉండాల్సిన పని లేదు - మరొక విశ్వం మన బొటనవేలి పరిమాణంలోనే ఉండవచ్చు!ఆ చిన్న పరిమాణంలో ఉన్న విశ్వం కూడా మన విశ్వంలో ఉన్న ఆన్నింటినీ కలిగి ఉండవచ్చు.ఇలా ఉన్న విశ్వాల అమరికలో మనం ఉన్న విశ్వంలో భగవానుడు దూకినది ఒక చిన్న రధం మీద నుంచి నేల మీదకి గాబట్టి మిగిలిన విశ్వం కదలదు.కానీ ఆయన ఉదరంలో ఉన్నవి మొత్తంగా కదులుతాయి గాబట్టి ఆ విశ్వాల లోపల ఉన్నవాళ్ళకి ఈ కదలిక తెలియదు.

మూడవ పాదంలోని వైరుధ్యం:చక్రం గిరగిరా తిప్పేస్తూ కోపంతో భీష్ముడి మీదకి ఉరుకుతుంటే పైనున్న ఊత్తరీయం జారిపోయిందట!ఇందులో విచిత్రం ఏముంది అనిపించవచ్చు అధాట్న చూడగానే!కానీ, అలవాటులో పొరపాటు అన్నట్టు ఇక్కడ ఒక అనౌచిత్యం ఉంది. యుద్ధరంగంలో రధికుడితో పాటు సారధి కూడా కవచాలూ శిరస్త్రాణాలతో కూడిన దుస్తులు ధరించాలి కదా - కొంచెం వేగంగా కదిలితేనే జారిపోయే పచ్చని పటము ఇక్కడ తొడగటం ఉచితమా!

సినిమా రాముళ్ళని చూసీ చూసీ మాయపొర కమ్మకుండా బుర్ర చురుగ్గా పనిచేస్తున్న ఒకాయన ఉషశ్రీ గారిని ఒక ప్రశ్న అడిగారు, "వయసొచ్చిన ప్రతి మగాడికీ గడ్డాలూ మీసాలూ పెరగటం సహజం కదా!అదీ ఒకసారి క్షురకర్మ మొదలెట్టాక మధ్యలో ఆపేస్తే రెట్టింపు వేగంతో పెరుగుతాయి కదా!మరి,పధ్నాలుగేళ్ళు అడివిలో గడిపినా రామలక్ష్మణుల మొహాలు నున్నగా ఉన్నాయేమిటీ?"  అని.ఉషశ్రీ గారు సినిమా వాళ్ళ మీద కాస్త విసుక్కుని నందిగ్రామం దగ్గిర భరతుణ్ణి కలిశాక తల మీదా ముఖం మీదా చంకల్లోనూ పెరిగిన వెంట్రుకల్ని తీసేసి తలంటు పోసుకుని కొత్త బట్టలు తొడుక్కుని అయోధ్యానగర ప్రవేశం చేసినట్టు వాల్మీకం నుంచే శ్లోకాలు ఉదహరించి చెప్పారు.

మనం చూస్తున్న దేవుళ్ళ పటాలన్నీ రవివర్మ లాంటి చిత్రకారులు గీసినవి.వాళ్ళకి ఆ మొహాల్లో పవిత్రత కనపడ్డానికి పసితనాన్ని సూచించే మీసాలు లేని మొహం గుర్తు అని ఒక మూఢనమ్మకం ఏర్పడిపోయింది.ఆ మూఢనమ్మకాల్నే సినిమా వాళ్ళూ కొనసాగించారు,తమ సొంత మానసిక రోగాల్ని కూడా వాటికి కలిపారు.యన్.టి. రామారావు చూడండి, రావణుడి వేషంలో కైలాసం వెళ్ళినా దుర్యోధనుడి వేషంలో సభకి వెళ్ళినా భుజం మీద గద ఉండాల్సిందే!సైకాలజీలో మనకి ఇష్టమైన వస్తువుల్ని ప్రతి చోటుకీ దేహానికి అతికించుకున్నట్టు వెంట తీసుకుపోవడాన్ని ఫెటిషిజం అంటారు.

అసలు దుర్యోధనుడు అలా గదని మోసుకుంటూ తిరగనూ లేదు.అసలు కృష్ణుడు కవచ శిరస్త్రాణాలు తొడక్కుండా యుద్ధరంగంలోకి వెళ్ళనూ లేడు.అయితే, పోతన గారు కూడా శ్రీకృష్ణుడికి సంబంధించినంతవరకు ఆయనకున్న భక్త్యావేశంతో ఒక రూపానికి అతుక్కుపోయాడు.అది అసహజమే గానీ రాసిన పోతన గారు భక్తుడు,చూస్తున్న భీష్ముడు భక్తుడు,చదువుతున్న మనమూ భక్తులమే - ఒక దణ్ణం పెట్టుకుని వదిలెయ్యడమే!

నాల్గవ పాదంలోని వైరుధ్యం:"బాబ్బాబు!నా పరువు తియ్యకు, వెనక్కిరా" అని బతిమిలాడుకోవడంలో వైరుధ్యం ఏముంది అని మీకు సందేహం రావచ్చు!కానీ కృష్ణుడు అంత ఆవేశం ఎందుకు తెచ్చుకున్నాడు?అర్జునుడు ఆపకపోతే నిజంగానే భీష్ముణ్ణి చంపేసేవాడేనా?లేదు,ఆ సంరంభం ఆర్జునుడికి చురుకు పుట్టించి భీష్ముడి కధని ముగించడానికి చేసిన నటన!అర్జునుడు తాతగారి మీద మమకారంతో యుద్ధంలో చూపించాల్సిన ధాటి చూపించకపోవడం వల్లనే కదా ఇంత గొడవ జరిగినది - ఒకసారి విషాదం అనుభవించి గీతాసారం విన్నాక మళ్ళీ బెంగ పుట్టుకు రావటం అసహజం కాదూ!నేను గతంలో చెప్పి ఉన్నాను,ఇవ్వాళ చూస్తున్న లక్ష శ్లోక విస్తారమైన భారతం అంతా వ్యాస విరచితం కాదు,అందరూ తలా ఒక చెయ్యి వేసి పెంచి ఇంత పెద్దది చేశారని - దానికి ఇది సాక్ష్యం!

అసలు వ్యాసుడు రాసినవి 4000 అయితే శిష్యులు 6000 రాసినవి కలిపిన మొదటి రూపం 10,000 శ్లోకాలు మాత్రమే అని అంటారు.ఈ మధ్యనే ఆ మూలకధని మాత్రమే తీసుకుని జయం పేరుతోనే ఒకరు నవల వ్రాసినట్టు చదివాను.

అయితే,చేర్పుల వల్లనే ఆ కావ్యం మోనాలిసా నవ్వులా ధర్మతత్వజ్ఞులకు ధార్మిక గ్రంధంలా ఆధ్యాత్మిక వేత్తలకు మోక్షసాధనంలా కనబడుతూ అనితర సాధ్యమైన విశిష్టతని దక్కించుకున్నది!గీతకి ఇవ్వాళ ఉన్న విశ్వవ్యాప్తమైన ప్రాచుర్యం అక్కడ అమరిపోవడం వల్లనే కదా!కిం కర్తవ్యతా విమూఢుడైన ప్రతివాడూ తనని తను విషాద యోగంలో ఉన్న అర్జునుడితో పోల్చుకోవడమూ గీతాబోధ సమస్తమూ తనకే జరుగుతున్నట్టు భావించడమూ గీతని ఆ కధనుంచి విడదీస్తే జరగదు!మూలకధకీ నేటి కధకీ మార్పులు ఎలా జరిగాయో తెలుసుకోవడం వరకు మంచిదే గానీ ప్రస్తుతం మనకి తెలిసిన కధని మర్చిపోవడం అనవసరం - మర్చిపోలేం కూడా!

1-225-క.
పలుకుల నగవుల నడపుల
నలుకల నవలోకనముల నాభీరవధూ
కులముల మనముల తాలిమి
కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్.
భావము:
తియ్యని మాటలతో మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయకోపాలతో, వాల్చూపులతో వ్రజవధూమణుల వలపులు దోచుకొనే వాసుదేవుడిని మనస్సులో మరీ మరీ సేవిస్తాను.

1-226-ఆ.
మునులు నృపులుఁ జూడ మును ధర్మజుని సభా
మందిరమున యాగమండపమునఁ
జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది
దేవుఁ డమరు నాదు దృష్టియందు
భావము:
మునీంద్రులు, నరేంద్రులు చూస్తూ ఉండగా యింతకు మునుపు ధర్మరాజు సభామందిరంలోని యజ్ఞ మండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగా యున్నాడు..

1-227-మ.
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థిం
తు శుద్ధుండనై."
భావము:
ఉన్న ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాసులకు ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా. ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్రహృదయంతో ప్రార్థిస్తున్నాను."

హరివాక్యం:
ఇక్కడ పోతన గారు హైందవద్వేషులు సదా విమర్శించే హైందవధర్మంలోని మూర్త్యారాధన మరియు బహుళ దేవతా ప్రశస్తి అనే రెండు ముఖ్యమైన విషయాలకీ తిరుగులేని సమర్ధన ఇచ్చేస్తున్నాడు!ఇక్కడే కాదు, సనాతన ధార్మికులు సృష్టించిన ఆధ్యాత్మిక సాహిత్యంలో ఉన్న విశిష్టత ఏమిటంటే సాహిత్యానికి సంబంధించిన రమ్యత,గాఢత కూడా ఉండి గుర్తుంచుకోవడం తేలిక అవుతుంది. విదేశీయులూ వేరే మతస్థులు కూడా సనాతన ధర్మానికి ఆకర్షితులు కావడానికి వాటిలోని వస్తుగతమైన తార్కికతతో పాటు శైలిపరమైన సౌందర్యం కూడా ఒక కారణమే!

ఏం చెప్తున్నాం అన్నదానితోపాటు ఎలా చెప్తున్నాం అనేది కూడా ముఖ్యమే - అన్నప్రాశన నాడే ఆవకాయ పెట్టేస్తే పిల్లాడు అల్లాడిపోతాడు!ఎంతటి పండితుడికైనా నిర్గుణ పరబ్రహ్మ మీద మనస్సు లగ్నం చెయ్యడం దాదాపు అసాధ్యమే - అసలు ఆ పదాన్ని పరిచయం చేసినవారికే దాని పూర్తి అర్ధం తెలియదు పాపం!నేనయితే నిర్గుణోపాసనని తిరస్కరిస్తాను కూడా.ఎందుకంటే,జ్ఞానం కోసం జ్ఞానం,కళ కోసం కళ వంటి పనికిమాలిన లక్ష్యాలు పెట్టుకుంటే ఇహానికీ పరానికీ పనికిరాకుండా పోతాం.మన దేహాలు తయారైన పృధివ్యాపస్తేజోవాయురాకాశాల మూలతత్వం మహదహంకారం - అది కూడా భగవత్స్వరూపమే!మనల్ని మోహానికి గురి చేసి పతనం చేస్తున్నదని అనుకుంటున్న మాయ కూడా భగవంతుడి కన్న వేరు కాదు, అవునా?మరి, రూపధారులమైన మనం భావనామరూప సంకీర్తనం చెయ్యడానికి భయపడటం గానీ సంకోచపడటం గానీ అవసరమా?"మేం విగ్రహారాధనని వ్యతిరేకిస్తున్నాం!" అని అంటున్నవాళ్ళే అలవాటులో పొరపాటుగా కాకుండా బరితెగించి విగ్రహారాధన చేసేస్తూ ఉంటే హిందువులు సిగ్గుపడటం దేనికి?అయితే, ఒకటి గుర్తుంచుకోవాలి మూర్తిపూజ అంటే ఆలయాల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలకి చేసే అభిషేకాదులు మాత్రమే కాదు, అక్కడినుంచి మొదలుపెట్టి దృశ్యమాన ప్రపంచంలోని అన్ని రూపాలలోనూ భగవంతుణ్ణి చూడగలిగే స్థాయికి ఎదగాలి!

హిందూమతప్రచారకులు ముఖ్యంగా నోటిని అదుపులో పెట్టుకోవాలి,ఆసక్తిని కలిగంచడం కోసం హాస్యప్రసంగాలు చెయ్యడం మంచిదే గానీ హాస్యం అపహాస్యం స్థాయికి దిగజారకూడదు.గరికిపాటి నరసింహారావు లాంటి అనుభవజ్ఞులు కూడా ఒక్కోసారి ఆవేశం వల్లనో అనాలోచితంగానో చెప్పకూడని విషయాలు చెబుతున్నారు,అనకూడని మాటలు అంటున్నారు.ఈ మధ్యనే వారు గణేశ్ నిమజ్జం పేరుతో వ్యాపారమూ పోటీ ఎక్కువయ్యాయనీ అవన్నీ అక్కర్లేదనీ వాటిలో భక్తి ఉండదనీ ఎవరింట్లో వాళ్ళు కూర్చుని ఒంటరిగా చేసే పూజల్లోనే భక్తి ఉంటుందనీ మాట్లాడారు - అది నాకు నచ్చలేదు.ఒంటరి పూజని పెద్దలు అప్పటికే సర్వం త్యజించిన యోగులకి ప్రాణోత్క్రమణ సమీపించిందని తెలిసినప్పుడు మనిషి కనిపిస్తే చాలు "నాకు నెప్పిగా ఉందిరో!వైద్యం చెయించరో!నన్ను బతికించరో!" అని వ్యామోహం పెరక్కుండా ఉండటానికి చెప్పారు.గృహస్థు అయిన ప్రతి ఒక్కరికీ తన పాటికి తను వైదిక విధుల ప్రకారం బతకడంతో పాటు ధర్మప్రచారం కూడా ఒక ముఖ్యమైన విధి.

సత్యనారాయణవ్రతం కుటుంబసభ్యులు మాత్రమే చేసుకోవాలని చెప్పారా?అసలు ఆలయాలు ఉన్నదే సామూహిక ప్రార్ధన కోసం - అలాంటప్పుడు ఈయన అవన్నీ అక్కర్లేదు,మీ ఇంట్లో మీరు పూజలు చేసుకుంటే చాలు అంటారేమిటి!ఈయనే ఇలా చెప్తున్నప్పుడు ప్రబోధానంద లాంటివాళ్ళని మనం తట్టుకోగలమా?ప్రపంచ స్థాయిలోనే ఏకం కావలసిన సమయంలో హిందువులు ఒంటరిపక్షులు కాకూడదు - తస్మాత్ జాగ్రత్త!


కలిసి ఉంటే కలదు సుఖం!కలిసి నడిస్తే కలదు జయం!కలిసి బతికితే కలదు వైభవం!!