పాంచాల కురిచ్చి నుంచి వీరపాండ్య కట్తబ్రహ్మన "నారు పోశావా?నీరు ఇచ్చావా?యెందుకు కట్టాలిరా శిస్తు?" అని హుంకరించి తిరగబడిన పోరాటమే ఆంగ్లేయుల మీద భారతీయులు జరిపిన సమరాల్లో మొట్టమొదటిది!అయితే ఆ వీరుడి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్ల్లాలోని కందుకూరు ప్రాంతం నుంచి విజయనగర రాజ్యం కాలంలో వలస వెళ్ళిన వాళ్ళనేది కూడా తెలుసుకుంటే అతడు మనకి బంధువే కదా అని గర్వంగా వుండదా!
క్రీ.శ 440 నాటి బోధిధర్ముడు పల్లవ రాజు - ఈ పల్లవులు తెలుగు రాజులు!స్థానిక ప్రభువులుగా తమిళ నాడులో వున్న రాజ వంశాలు మూడే - పాండ్య,చేర,చోళ వంశాలు మాత్రమే ప్రాచీన తమిళ కావ్యాల్లో ప్రముఖంగా కీర్తించబడ్డాయి.బోధిధర్ముడి గురించి చెప్పే యే గ్రంధమైనా అతడు పల్లవుడే అని చెప్తున్నది!1959లో తెలుగు భాషా సమితి ప్రచురించిన విజ్ఞాన సర్వస్వంలో పల్లవులు తెలుగు వారే అని ఆధారాలను ప్రకటించారు.ఇక్ష్వాకుల తర్వాత,అంటే క్రీ.శ 300 నుంచి క్రీ.శ 600 వరకూ తొలి పల్లవులు తెలుగునేలను పరిపాలించారు.
కుమార విష్ణువు అనే అతను కాంచీనగరాన్ని గ్రహించినట్టు వేలూరుపాళెయం శిలాఫలకాలు తెలియజేస్తున్నాయి?ఆంజనేయుడికి తన శక్తి తనకి తెలియనట్టు ఆంధ్రులకి తమవన్నీ యెదటివాళ్ళకి ధారపోసి అమాయకంగా నిలబడటం అలవాటయిపోయింది గనకనే శ్రమించి పెంచిన సంపదని కూడా దోపిడీ అని వదరుబోతులు ఇల్లెక్కి కప్పెక్కి కూస్తుంటే "సాక్ష్యాలు చూపించి మాట్లాడు బే!" అని దబాయించే కన్నపు దొంగలకి వుండేపాటి కనీసపు క్షాత్రం కూడా లేకుండా నిజమే నని ఒప్పుకుని ఇవ్వాళ వుద్యోగులకి జీతాలివ్వలేని దుస్థితిలో తమ కిచ్చిన హామీలని ఇచ్చిన వాళ్లే వెక్కిరిస్తున్నా చేతులు నలుపుకుంటూ రాజధాని కూడా లేకుండా నిలబడ్డారు?!!
ఇవ్వాళ "వారెవ్వా!నీ సృష్టి అద్భుతం,నీ వ్యాపార దక్షత మాకు కావాలి" అని వాళ్ళ ముఖ్యమంత్రే పొగుడుతున్నవాణ్ణి కూడా దోపిడీదారుగా ముద్రవేసి లక్ష నాగళ్లతో దాన్ని దున్నిస్తుంటే చూడాలని కలలు గన్న పైశాచిక ప్రవృత్తి గలవాళ్ళు మీరు పెంచిన సంపదలో ఒక్క నయాపైసా కూడా ఇవ్వం,మీరు మాత్రం ఇక్కడ వుండటానికి వీల్లేదు అని అంటుంటే జవాబు చెప్పలేక నీళ్ళు నమిలారు.ఇవ్వాళ నిజంగా అన్యాయానికి గురయి కూడా ప్రశాంతంగా వుందగలుగుతున్నారు,యేమి సౌజన్యం?!తెలంగాణాలో ఇతరులు భూములు కొనగూదదని పెద్దమనుషుల వొప్పందంలో వుంది,కొన్నా సరే అది తప్పే అని నాతో వాదించిన మేధావులు ఆ ముక్క వాళ్ళ ముఖ్యమంత్రికి చెప్పరేమి?అబధ్ధాలతో,నాకిది ఇస్తే నీకది ఇస్తాననే పార్టీల విలీనం లాంటి నీచకృత్యాలతో చెలరేగి తమకి ద్రోహం చేసిన వాళ్ళు యేదో ఘనకార్యం సాధించినట్టు పొంగి పోతుంటే తప్పు చేసిన వాళ్లలా తలదించుకుని కుంగిపోతున్నారు,యేమి సౌమనస్యం?!కోళ్ళపందేలకి వొచ్చినవాళ్ళు "తెలంగాణా నాది,నెల్లూరు నాది,చిత్తూరు నాది" అంటుంటే "మరి హైదరాబాదు మాది కాదన్నారేం" అని అడగాలని అక్కడ లేని నాకనిపించింది గానీ అక్కడున్న వాళ్ళు మాత్రం ప్రజల్లో ఆత్మీయతలు ఇంకా మిగిలాయని చంకలు గుద్దుకున్నారు,యేమి సౌహార్ద్రం?!
ఆ అవమానాలూ ఈ దుర్భర స్థితీ చుట్టూ యేమి జరుగుతందో తెల్సుకోకుండా చరిత్రలో అసలు యేం జరిగిందో తెలుసుకోకుండా మట్టిబుర్రల్లా వుండటం వల్లనే అని ఇప్పటికయినా తెలుసుకుంటే మరోసారి - ఇక్కడ ప్రతిపక్షమే లేదు గాబట్టి మనకి తిరుగు లేదు,నెక్స్తు యెలక్షన్ల కల్లా తెలంగాణాని కూడా చంకలో ఇరికించుకుందాం అని కలలు గంటున్న రెండుకళ్ళ సిధ్ధాంతి - ముందు కేంద్రం నుంచి నిక్కచ్చిగా నిధులూ హోదా తెచ్చుకోవటం మానేసి రాజధాని కోసం అంటూ భూసమీకరణ పేరుతో రైతులకి చట్టపరమయిన రక్షణలు కూడా లేకుండా లాక్కుంటూ చేస్తున్న మోసాన్ని పసికట్టగలుగుతారు!లేదంటే మరోసారి ఇక భవిష్యత్తులో గొప్పగా చెప్పుకోవటానికి యేదీ మిగలకుండా మోసపోతారు.
వాళ్ళ దుర్మార్గం అట్లా వుంచితే,రాష్ట్రాన్ని విభజించే పని ఒక పదో తరగతి కుర్రాడికి అప్పజెప్పినా ఇంతకన్నా చక్కగా ఆ పని చేసి వుండేవాడు,ఈ అన్యాయానికి కారణం కేంద్రంలోనూ రాష్త్రంలోనూ అధికారంలో వుండి కూడా ఇంత దరిద్రంగా విదగొట్టిన తమ పార్టీయే అని తెలియకనే ఇవ్వాళ లఘుశంకవీరుడు అంత ఆవేశం ప్రదర్శిస్తున్నాడా?నిజంగానే ఆ గర్జనలకి పొంగిపోయి ప్రజలు అతనికీ అతని పార్టీకీ బ్రహ్మరధం పడతారా?చచ్చిన గాంగ్రీను పార్టీని మళ్ళీ నతికిస్తారా?దూరంగా వున్న చెత్తని మళ్ళీ తెచ్చి తల మీద రుద్దుకుంటారా?ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం విజ్ఞత యేమిటో చూడాలి?!
మీరు చెప్పిన బోధి ధర్ముడు మీది అంటున్న మీ ధర్మాన్ని త్యజించాడు కదండి.. మీరు మాత్రం పట్టుకుని ఎంతకాలం వేలాడుతారు లెండి.. అయినా ఈ దేశంలో వెల్లివిరిసిన ఒక ధర్మ చైతన్యానికి హైందవం అంటూ పేరుపెట్టడమెందుకు.. అంత విశాలమైన చైతన్యాన్ని అంది పుచ్చుకునే వారెవరైనా పేరులేని ఆ మనసిక సాఫల్యతను పేరు పెట్టి, గ్రూపు కట్టి అవమానించి, చిన్నగా చూపించటం ఎంతవరకు సబబు.. ఆ చైతన్యం వెల్లివిరిసిన ఏ మనిషి కూడా తనొక గ్రూపుకు సంబంధించిన వాడినని చెప్పుకుని ఆ చైతన్యాన్ని కించపర్చలేడు... గ్రూపు కట్టే ప్రతి వాడూ కాకుల గుంపులో కాకిగా తప్ప మరెక్కడా నిలిచి పోడు..
ReplyDeleteపూర్తిగా వొదిలెయ్యలేదని నా అనుమానం?నిన్ననే ఒక నిజాన్ని టీవీలో చూశాను.కాశీలో వున్న మొత్తం ఆలయాలు 20,000 కాగా అందులో 16,000 బౌధ్ధ ధర్మానికి సంబంధించినవి అని?!లెక్క వేసే చెప్పినటున్నాడు, లెక్క అబధ్ధమైతే నమ్మినందుకు నాది దోషం అయితే కావచ్చు?!కానీ దేశంలో వున్న ఆరామాలని వేటినీ కూల్చడం లేదు.బౌధ్ధులు కూడా ఈ దేశంలో వున్నారు.ఇక్కడ బౌధ్ధధర్మం లుప్తమై పోవడానికి హీనయానం,వజ్రయానం అంటూ చీలికలు పేలికలు చేసుకుని సర్వభ్రష్టాలనీ ఆరామాల్లో పోషించి ఆఖరికి వాటిని లంజదిబ్బల కింద పరిగణించిన చరిత్ర మీకు తెలుసా?
Deleteఅజంతా పేరుతో ఓక్ పెద్ద కధ పులికంటి కృష్ణారెడ్డి గారనుకుంటాను రాయగా చదివాను.మారుని కన్యలని పరమ సెక్సీ గా వర్ణించి వ్యభిచారానికీ భోగలాలసతకీ యెట్లా ఆరామాలు ఆలవాల మయి చెడినాయో చాలా వివరంగా వర్ణించారు.వాటిలో వున్న లోపాలకి ఆయా శాఖలు అణగారిపోయినా దానికీ హైందవమే కారణమా?!బోధిధర్ముడిలో ఆ అపతనం లేకుండా గౌరవనీయుడు అయినప్పుడు ఆ గౌరవనీయుడితో ఆత్మీయత ప్రకటించుకోవదం కూడా దోషమేనా?!