Sunday 25 January 2015

ఈ ముక్క చెప్పడానికి వంకయ్యకి ఇంతకాలం పట్టిందా?అసలు హోదా కోసం పోట్లాడిందే తను అనైనా గుర్తుందా!

     మొదట్లో కొత్త మీడియా వందిమాగధుడైన మీసాల సుహాసిని ఈరకమైన వార్తల్ని వడ్డిస్తుంటే బహుశా డిల్లీలో నిధుల కోసం బేలమొహం పెడుతున్నాడేమో అనుకున్నా!విభజన యెన్నికల ముందు జరిగింది,ఆ విభజన తను కూడా వొప్పుకోవటం వల్లనే జరిగింది కదా?తను మద్దతు ఇవ్వకుండా కాంగ్రెసు ప్రతిపాదించిన విభజన బిల్లు సభలో నెగ్గే పరిస్థితి వుందా!ఇప్పుడు కాంగెసుని చూపించి తప్పుకోవడం అంటే ఆంధ్రా వాళ్ళకి చెవిలో పువ్వులు పెట్టటమే - ఈసారి ఆంధ్రావాళ్లకి కాలితే కాంగ్రెసు ప్రేరిత అసమైక్య వుద్యమం లాగా వుండదు.పొట్టి శ్రీరాములు కీర్తిశేషుడైనప్పుడు జరిగిన దానికి పదింతలు జరుగుతుంది?!భాజపా కూడా సమర్ధించడం వల్లనే విభజన ఇలా జరిగిందనేది అందరికీ తెలుసు.అయినా ఆంధ్రాలో ఆ కొన్ని సీట్లయినా వచ్చాయంటే కారణం యేమిటో ఆంధ్రులు యేమి ఆశించి ఆమాత్రం బలమయినా ఇచ్చారో తెలియనంత అమాయకుడా తను?

     అడిగి సాధించానంటున్న తనే ఇప్పుడు నాచెయ్యి దాటిపోయింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముష్టి చిప్ప పట్టుకుని అందరు ముఖ్యమంత్రుల్నీ మోకాళ్ళు నిమరాల్సిందే అనే మాటని ఆంధ్రా నడిబొడ్దున అంటుంటే విన్నవాళ్ళు అంత మౌనంగా యెందుకు వున్నారో నాకర్ధం కావడం లేదు.ఆంధ్రులు పౌరుష ప్రతాపాలు గలవాళ్ళు అనే మాట అబధ్ధం కాగూడదు.ఆ పెంకయ్య మాటకి రావాల్సిన స్పందన ఇది కాదు?మాట తేడా రానేవొచ్చింది సోదరు లారా!రూటు మార్చి చెలరేగి కార్యం సాధించుకోకపోతే మానుషం మిగలదు!

     కేంద్రం సాయం చెయ్యనిదే వుద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వుండి ప్రపంచంలోనే అతి విశాలమైన రాజధాని కడతానంటే విన్నవాల్ళు నవ్వరా అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా నాకంతటి అనుభవం వుంది,హైదరాబాదుని నేనే పెంచాను అనే ప్రబుధ్ధుడికి?ప్రజలు అంతటి రాజధాని మాకు కావాలి అని అడిగారా?ఒకవేళ అడిగినా వాస్తవ పరిస్థితిని చెప్పి ఇప్పుడు మన వల్ల కాదు అని నిజాయితీగా చెప్పాల్సిన సమయంలో యెందుకీ వేలాంవెర్రిని పెంచాడు?పైగా అటువంటి పనులకి భూసేకరణకి చట్టం ఒకటి వుంది,అందులో భూమి ఇచ్చిన రైతులకి నష్టం జరగకుండా యెన్నో చట్టపరమైన రక్షణలు వున్నాయి.ఇప్పుడు హైదారాబాదుని వొదులుకోవదం వల్ల మనసు గాయపడింది దాని బాబు లాంటి రాజధాని కడదాం మీరు భూములివ్వండి - కేంద్రం కూడా సాయం చేస్తానన్నది,మోదీ మంచివాడు మనకి యెంత కావాలంటే అంతా ఇస్తాడు అనే అబధ్ధాలతో "ల్యాండ్ పూలింగ్" అనే కొత్త చట్టాన్ని తెచ్చి మరీ చెయ్యడం దేనికి?లేదు, ఇది సరైన పధ్ధతి కాదు - ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పై స్థాయిలో బడాబాబుల్నీ కాంట్రాక్టర్లనీ పెంచడానికి భూముల రేట్లు పెరగడం అనే తాయిలం చూపించి రైతుల్ని మోసం చెయ్యాలనుకోవడమే నిస్సందేహంగా!భూముల రేట్లు పెరగడం,కొంత కాలం తర్వాత లాభసాటిగా మార్చి మీకే ఇస్తానంటే మంచివాడని నమ్మి ఒపుకోవడం తప్ప ఈరకమైన భూసేకరణలో రైతులకి చట్టబధ్ధమైన హక్కులు చాలా తక్కువ - ఈ అబధ్ధీకుణ్ణి మమ్మి అధ్భుతాలు జరుగుతాయని ఆశించడం శుధ్ధ దండగ?!పైగా ప్రభుత్వం ప్రజల నుంచి భూమిని తీసుకోవడానికి వుపయోగిస్తున్న భూసమీకరణ డాక్యుమెంట్లు కూడా ప్రభుత్వం అడిగితే ఇచ్చినట్టు కాకుండా వాళ్ళంతట వాళ్ళే మా భూములు తీసుకోండని ప్రభుత్వాన్ని అడిగినట్టు వున్నాయట!అంటే యేమిటి?స్వచ్చందంగా నువ్వు యెవడికయినా పూర్తి ఆరోగ్యకరమైన మనస్థితిలో వుండి ప్రభుత్వం గుర్తించిన పత్రాల ద్వారా ఒకసారి ఇస్తే తర్వాత దానినుంచి వెనక్కి వెళ్ళాలనుకుంటే యే కోర్టూ నీకు అనుకూలంగా తీర్పు ఇవ్వదు, తెలుసా!ఇంకా భూసేకరణ అధికారికంగా మొదలయినట్టు లేదు, ఒకవేళ మొదలైనా పర్లేదు - ఇప్ప్పటికే ఇవ్వడానికి ఒప్పుకున్న రైతులంతా మంచి లాయర్లని సంప్రదించుకుంటే మంచిది.ఒకసారి చెయ్యి దాటిపోయాక యేదీ అంత తొందరగా తిరిగి రాదు!


     యేం ఫర్వాలేదు,యేరు దాటి తెప్ప తగలేసే రాజకీయాలు యెన్నయినా చెయ్యొచ్చునన్న ధీమాలో వున్నట్టున్నారు - ఆ నాయుడూ ఈ నాయుడూ!ఆ కలలే కంటూ రెచ్చిపోండి,కళ్ళు తెరిచి చూసేసరికి జగన్ ముఖ్యమంత్రి అయి కనబడతాడు?!తమాషా అనుకుంటున్నారా 13 జిల్లాల ప్రజల జీవితాలతో ఆడుకోవటం?యెన్నికల తర్వాత అక్కడ మీ ప్రభుత్వం నిలదొక్కుకున్నాక ఇక్కడ  కొత్త రాష్ట్రం యేర్పడినాక తమరు చేసిన వాగ్దానాలే అవి!మీరిచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చనంత అసమర్ధులు తట్టా బుట్టా సర్ధుకుని అధికార నివాసాలు ఖాళీ చేసి ఇంట్లో కూర్చోండి.సమర్ధుడేవడో వాడే వచ్చి మాకు కావలసినవి సాధించి పెడతాడు!?ఇది కష్ట కాలం అనుభవజ్ఞుడు అధికారంలో వుంటే మంచిదన్న ఒకే ఒక్క కారణం వల్లనే యెన్నికల తులాభారంలో త్రాసు తెదెపాకి మొగ్గిందని ఫలితాల లెక్కలు చెప్తున్నాయిగా?!ఇప్పుడీ కాకిలెక్కలూ గాలికబుర్లూ యెవరికి చెప్తారు?చెప్పినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడీ సొల్లు కబుర్లు పట్టించుకోరు!యెలా చేస్తావన్నది మాట ఇచ్చిన వాడివి అన్నిసార్లు మాట్లాడిన వాడివి నువ్వు తేల్చుకోవాలి.మాకు ఫలితం మాత్రమే కావాలి,తెలిసిందా?లాజిక్కులతో మేజిక్కులు చెయ్యాలనుకుంటే మేము మా మేజిక్కు చూపిస్తాం,ఖబడ్దార్! డిల్లీలో గెలవడానికి నిన్నటి రోజున మోదీని తిట్టిన బేదీని తెచ్చిన పతనం కళ్ళముందు కనపడుతూనే వుంది - హస్తినలో శృంగభంగం తప్పదు?ఇప్పుడు భాజపా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేసినట్టుగా నెరవేర్చలేని వాగ్దానాలు చేసి ఆనక చేతులెత్తెయ్యడమూ కంటితుదుపు ఆశ్వాసనలతో సరిపెట్టెయ్యడమూ చెయ్యడం వల్లనే కాంగ్రెసు ఖర్మ అలా కాలింది!ఆ పార్టీ మీద క్రోధం - అంటే అటువంటి రాజకీయం మాకు నచ్చదు అని ప్రజలు తెగేసి చెప్పడమే ఇప్పటివరకూ భాజపా అప్రతిహత విజయ పరంపరకి కారణం.ఆ దారినుంచి తప్పి కాంగ్రెసుకి మల్లే వంకర టికర పనులు చేస్తే భాజపాకీ అదే గతి పడుతుంది.తమని తాము అతిగా వూహించుకున్న వాళ్లే రావణుడూ,దుర్యోధనుడూ,హిట్లరూ - మరొకడూ మరొకడూ - ఆ లిస్టులో చేరాలని ఉషారుగా వుందేమో పాపం పెంకు నాయుడికీ మోదీకీ?!

     అంధ్రప్రదేశ్ విభజన యెంత భయానకంగా జరిగిందో దేశమంతటికీ తెలుసు?అది తమకూ జరుగుతుందేమో నన్న భయం తోనే అదివరకు తెలంగాణా ఇచ్చాక మాకూ కొత్త రాష్ట్రం కావాలి అని సన్నాయి నొక్కులు నొక్కిన వాళ్ళంతా మూతికాలిన తెనాలి రామలింగడి పిల్లుల్లాగా చడీ చప్పుడు లేకుండానిశ్శబ్దమై పోయారు?అయినా 30 సీట్లు గట్టిగా వస్తాయో లేదో తెలియని తెలంగాణా వాళ్ళకి మేలు జరగడం గురించి వుత్తర ప్రదేశ్ వోటరూ,హిమాచల్ ప్రదెశ్ వోటరూ పట్టించుకుంటాడా - యే తెలివితో థెలంగాణా ఇచ్చేసి ఆ వూపుతో దేశప్రజలందర్నీ మెప్పించగలననుకున్నదో ఆ పిచ్చిపుల్లమ్మ పార్టీ?!కానీ చట్టసభల సాక్షిగా జరిగిన గందరగోళాన్ని చూశారు,దానికి కారణ మెవరో గూడా తెలుసుకున్నారు - తడాఖా చూపించారు!అట్లాంటి ఫలితమే తమకూ కావాలని కోరుకుంటున్నారా కమలమే సకలం కావాలి అని కలల్లో విహరిస్తున్న భాజపేయులు?

మాట తప్పితే మోడీ అయినా తల దించుకోక తప్పదురా?
అవమానకరమైన ముగింపుతో అంతమైన వాళ్ళు కాకండి!

34 comments:

  1. "...ఈసారి ఆంధ్రావాళ్లకి కాలితే..."

    ఆంధ్రా వాళ్లకి కాలదు! ఒకవేళ అలా జరిగే అవకాశం ఉంటే గింటే విభజన బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెట్టంగానే జరిగి ఉండాలిసింది. అప్పుడే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండిపోయి ఊరుకున్నారు అంటే మరెప్పటికీ కాలటం గీలటం లాంటివి ఏమీ ఉండవు అన్న మాట. ఆంధ్రుల ఆరంభ శూరత్వం జగద్వితం, ఈ విషయం రాజకీయ నాయకులకు ఇంకా బాగా తెలుసు. ప్రత్యెక ఆంధ్ర ఉద్యమం 1972-73లో తీవ్రంగా జరిగింది. మీరు చెప్పే వెంకయ్య నాయుడు గారి రాజకీయ ప్రస్థానం ఆ ఉద్యమంలోనే మొదలయ్యింది.అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సి ఆర్ పి ని, కొన్ని చోట్ల మిలిటరీని దింపి ఆ ఉద్యమాన్ని అణచివేసింది. ఆ క్రమంలో 350 మంది సామాన్య ప్రజలు పోలీసు కాల్పుల్లో మరణించారు. ఆంధ్ర ప్రాంతం అట్టుడికిపోయింది, పెళ్ళిళ్ళు జరుగుతుంటే శుభలేఖలు పంపటానికి లేక (అతంగా వ్యవస్థ స్తంభించి పోయింది) స్థోమత ఉన్నవారు ఆహ్వానాలు పత్రికల్లో ప్రకటనలుగా ఇచ్చుకున్నారు.

    అలాంటి తీవ్ర ఉద్యమం 1973 మార్చికల్లా చప్పగా చల్లారిపోయింది, ఆ తరువాత 1977 ఎన్నికల్లో వచ్చిన అవకాశం ఆంధ్రులు ఎలా ఉపయోగించుకున్నారు? దేశం మొత్తం కాంగ్రెస్ ను "ఛీ" కొడితే, మనవాళ్ళు, 42 సీట్లల్లో, 41 కాంగ్రెస్సుకు దానం చేశారు. ఇప్పుడు కొద్దిగా మెరుగు. వెంటనే వచ్చిన ఎలేక్షన్లల్లో, కాంగ్రెస్ ను పూర్తిగా తిరస్కరించారు. కాని ఆంధ్రా వాళ్ళ ముందు ఉన్న చాయిస్ ఏమున్నది!? ఒకటేమో రెండు కళ్ళ పార్టీ, వీళ్ళని అస్సలు నమ్మటానికి లేదు, మరొకటి కాంగ్రెస్ తోక.

    1972-73 తరువాతే ఎవరికీ కాలలేదు, అప్పుడే లేనిది ఇప్పుడు ఎదో పెద్ద ఉద్యమం వచ్చే అవకాశమే లేద గాక లేదు. రాబొయ్యే ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా నిలదొక్కుకుని మళ్ళీ వాళ్ళ పరిస్థితి చక్కబడేట్టుగా చేసే ఔదార్యం మన ఆంధ్రులకి పుష్కలంగా ఉన్నది. మన దృష్టి ఒక్కటే, known evil is better అని, అంతే. పైగా, దురదృష్టవశాన అంతకంటే చాయిస్సూ లేదు.

    ఆంధ్రా భవిష్యత్ ఏమవుతుందో కదా అని విచారం అంతే.

    ReplyDelete
  2. వెంకయ్యనాయుడుగారు విశాఖ ఉక్కు ఉద్యమంతో వెలుగులోకి వచ్చారని గుర్తు. బహుశః అదే వారి రాజకీయప్రస్థానానికి నాంది కావచ్చును.

    జాతీయరాజకీయాలు అంటే ఆంధ్రప్రజల్ని వెర్రివెధవల్ని చేయటమే అన్నసంగతి దశాబ్దాలుగా చూస్తూ కూడా ఏదో ఉద్యమాలు వచ్చేస్తాయని భ్రమలు పెట్టుకోవటం ఏమిటండీ, చోద్యం కాకపోతే.

    చివరికి తేలిందేమిటంటే ఏ రాయైతేనేం పళ్ళూడగొట్టుకోవటానికీ అని. కాంగ్రెసు వారు నిన్న ముంచారు. బీజేపీ వారు నేడు ముంచుతున్నారు. రేపుమాపు ముంచబోయేవారెవరన్నది అప్రస్తుతం. మళ్ళామళ్ళా మునగటం ఆంధ్రజనానికి రివాజన్నది ప్రస్తుతాంశం.

    ఇప్పుడు ఆంధ్రజనుల తక్షణ కర్తవ్యం తెలుసుకోవాలి. అదేమిటంటే, స్వయంకృషితో చచ్చీచెడీ మళ్ళా ఎదిగి పైకివచ్చి సంపదను సృజించటం దాన్ని కేంద్రం‌ జాతీయప్రయోజనాలపేరుతో తరలించుకుపోతుంటే దేశభక్తిగీతాలు పాడుకుంటూ ఉండటం. అవమానాలు అలవాటేకాబట్టి ఆంధ్రులు వాటిని పెద్దగా పట్టించుకోవలసిన పని ఉందని అనుకోను. అన్నట్లు తమ అసమర్థతను జనం ఔదార్యం అని పిలుస్తూ ఉంటారు తమాషాకి అన్న సంగతి ఆంధ్రులకు తెలుసో తెలీదో కాని అది వఠ్ఠి అసమర్ధత తప్ప మరేమీ కాదని ఆంధ్రులు కాని వారందరికీ మహబాగా తెలుసు.

    ReplyDelete
  3. అంధ్రుల మొదటి దురదృష్టం ఏమిటంటే, రాష్ట్ర ప్రయోజనాలకంటే స్వంత ప్రయోజనాలే ముఖ్యమనుకున్న గత కాంగ్రెస్ MPలు.
    రెండోది, BJPకి మన అవసరం లేకుండా పూర్తి మెజారిటీ రావడం. సంకీర్ణ ప్రభుత్వం అయి ఉంటే ఇలా మాట్లాడగలిగేవారా?
    పార్లమెంట్ సాక్షిగా అధికార, విపక్షాలు ఇచ్చిన హామీలకి విలువ లేదా? దాని మీద న్యాయపోరాటం చెయ్యలేరా?
    అయినా ఇప్పుడు కేంద్రంతో పోరాడి చంద్రబాబు సాధించేది ఏమీ ఉండదేమో! ఈ మాత్రం సహకారం కూడ దక్కదు.
    కాని BJP ఒక విషయం గుర్తుంచుకోవాలి. UPలో 70 సీట్లు మళ్ళీ గెలుచుకోవాలంటే అద్భుతం జరగాలి. 2019లోనే వాళ్ళకి మన అవసరం వస్తుంది.

    ReplyDelete
  4. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న పార్టీ మళ్ళీ గెలిచే అవకాశాలు సున్నా. ఎందుకు అంటే, ఈ రాజధాని నిర్మాణం, ఇంకా విభజనకు సంబంధించినవి ఇప్పుడప్పుడే తేలే విషయాలు కాదు. ఈ కార్యక్రమంలో పాటుపడిన ప్రభుత్వం, నిజంగా పాటుపడినా సరే(ఈ విషయంలో చాలాలక్ష అనుమానాలు ఉన్నాయి), వాళ్ళ టైము పూర్తయ్యే సమయానికి పూర్తి అపకీర్తే మూటకట్టుకుంటారు. మళ్ళీ మేమంటే మేము అంటూ మిగిలిన పార్టీలు మూగుతాయి. మనకు అసలే misplaced sympathies ఎక్కువ. కాబట్టి ఇప్పుడు సోదిలోకి లేవనుకున్న పార్టీలే పైకి వచ్చే అవకాశమే ఎక్కువ.

    2019 కి రాజెవరో భటుడు ఎవరో, అప్పటి పరిస్థితి అప్పటిది. కాని నా భయం మాత్రం ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడప్పుడే ఈ రాజకీయ నాయకుల దెబ్బ నుంచి తట్టుకోవటం కష్టం. సునామీలు, తుఫానులు, భూకంపాలు ఇంకా ఇలాంటి ప్రమాదాలు తట్టుకోవచ్చు, తట్టుకుని సత్వరం కోలుకోవచ్చు, కాని రాజకీయ నాయకుల దెబ్బ నుంచి కోలుకోవటం అంత సులభం కాదని మాన ఆంధ్రులకు ఇప్పటికి కూడా తెలిసినట్టు లేదు.

    ReplyDelete
  5. కేంద్రం సాయం చెయ్యనిదే వుద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వుండి ప్రపంచంలోనే అతి విశాలమైన రాజధాని కడతానంటే విన్నవాల్ళు నవ్వరా అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా నాకంతటి అనుభవం వుంది,హైదరాబాదుని నేనే పెంచాను అనే ప్రబుధ్ధుడికి?ప్రజలు అంతటి రాజధాని మాకు కావాలి అని అడిగారా?ఒకవేళ అడిగినా వాస్తవ పరిస్థితిని చెప్పి ఇప్పుడు మన వల్ల కాదు అని నిజాయితీగా చెప్పాల్సిన సమయంలో యెందుకీ వేలాంవెర్రిని పెంచాడు?
    -----------------------------------------------------
    How realistic it is. బాగు పడాలంటే ఉన్న డబ్బులతో సరిపెట్టుకుని ముందుకు సాగాలి అంతే గానీ అనవసరమనిపించే వాటికోసం ప్రపంచమంతా అప్పుల కోసం తిరుగుతుంటే చివరికి ఏమవుతుందో ! మద్రాస్ నుండి విడిపోయినప్పుడు కర్నూల్ లో డేరాలు వేసుకుని ప్రభుత్వం నడిపారు.

    ReplyDelete
    Replies
    1. నాయకులకి ఆ వాస్తవదృష్టీ చరిత్ర గురించిన అవగాహనా లేదు.పార్ట్ టైం పొలిటీషియన్లుగా తమ వ్యాపారాలకు మాత్రమే ప్రాధాన్యత నిచ్చే వాళ్ళని ప్రజాప్రతినిధులుగా యెన్నుకోవడం అనే తెలితక్కువ పనికి ఫలితమిది,అనుభవీస్తున్నాం.నాయకులకి ఆ తెలివే వుంటే తెలంగాణా వుద్యమంలో పేట్రేగిపోతున్న అబధ్ధాల్ని యెప్పటికప్పుదు ఖండించి మన ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంటే సహించి వూరుకుని వుండేవాళ్ళు కాదు!రెండు రాష్ట్రాల్లోనూ కరువు రాబోతుందని కొత్తలో ఒకసారి మాత్రమే ఆర్ధికనిపుణులు హెహ్చరించారు!తర్వాత వారిని కట్టడి చేసి వుండవచ్చు.ముఖ్యమంత్రులు చూస్తే ఒకరిని చూసి మరొకరు పపూబెల్లాల పధకాలకే బడ్జెట్టులో సిమ్హభాగాన్ని వృధా చేస్తున్నారు?బాధ్యత గలిగిన మేధావులు కళ్ళు తెరిచి దాన్ని నిలబరించకపోతే రెండు రాష్త్రాల్లోని తెలుగు వాళ్ళ్ళూ సమానంగానే నష్టపోతారు.ఒకరినొకరు తప్పులు పట్టుకోవదంలో మునిగివున్న విద్యాధికులు కూడా తప్పు దారిలోనే వెళ్తున్నారు?!

      Delete
  6. హరిబాబు గారూ,

    తెలంగాణా ఉద్యమం ఉదృతంగా ఎగిరిన రోజులలో తెలంగాణా రానేరాదని ఎందరో ఆంధ్రులు (ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు) నొక్కి వక్కాణించారు. వాటిని గుడ్డిగా నమ్మొద్దని, తెలంగాణా తథ్యమని మాబోటి వాళ్ళు చెబితే మమ్మల్ని కొట్టి పారేశారు, పైగా మాకు బిరుదులూ ఇచ్చారు.

    తీరా తెలంగాణా రావడం అనివార్యం అని తేలిపోయాక, ఇంకొందరు (ముఖ్యంగా టీడీపీ/బీజేపీ నాయకులు) కొత్త నాటకాలు తెరకు తెచ్చారు. పోలవరం కడతామని, ప్రత్యెక ప్రతిపత్తి హోదా తెస్తామని, బడ్జెటు లోటు మొత్తాన్ని పూడుస్తామని, హైదరాబాదును తలదన్నే రాజధాని కడతామని కుప్పిగంతులు వేసారు. ఇవేవీ జరగవని, అసలు వీటిని చేసే సంవిధాన వెసులుబాటు లేవని అంటే మమ్మల్ని కుళ్ళుబోతులుగా ముద్రిస్తారు కానీ ఇప్పటికయినా వాస్తవాలు గుర్తిస్తే మంచిది.

    Mixing up preference with prediction is a one way street to disaster.

    రాజధాని కోసం ఇంత హంగామా ఎందుకని అడిగారు. బాగుంది కానీ కారణాలు మీకు తెలీవా? అధినాయకుడే కాంట్రాక్టర్ల గుప్పిట్లో ఉన్నప్పుడు వారికి లాబించే దిశలో వెళ్తాడు కదా.

    అలాగే (మరో ఉదాహరణ) విద్యా విధానంలో సమూలమయిన మార్పులు చేస్తేతప్ప మున్ముందు ఉపాధి కల్పన పెంచాలేము. కానీ బట్టీ ఫాక్టరీ యజమాని సభ్యుడయిన మంత్రిమండలి ఆ సాహసం చేయగలదా?

    ReplyDelete
    Replies
    1. @jai gaaroo,
      నేను నా పోష్టుల్లో తెలియజెప్పాలని అనుకుంటున్న విషయాలు కూడా అవే?!మరో పోష్తులో చెప్పాను - పార్ట్ టైం పొలిటీషియన్లుగా మాత్రమే పనికొచ్చే వ్యాపార ప్రముఖుల్ని చట్ట్టసభలకి పంపించాము , దాని ఫలితమె ఈ గందరగోళం.వుదాహరణలు నేను నా రాష్ట్రం కోసమే ప్రత్యేకించినా అక్కడ తెలంగాణాలో కూడా అదే జరుగుతున్నది.మరి మీరేమి సాధించగలరో తేల్చుకోండి?!

      వుద్యమంలో వీరాధివీరుల్లా చెలరేగిపోయిన వాళ్ళు కూడా కొందరు మీరు ఆంధ్రోళ్లని తిట్టిన ఆ అవినీతిలోనే మునిగితేలుతుంటే ఇంకొందరు యేమి చెయ్యాలో తెలియక చేష్తలుదుగి చూస్తున్నారు!వ్యక్తిగతంగా మీరు గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలరా అంతా బాగానే వుందని?

      నేను చాలాసార్లు "వుద్యోగాల కయితే మంచి చదువులు కావాలి,మరి తెలంగాణా మొత్తం మీద పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చెయ్యగలిగిన వాళ్ళే లేకపోయారా?" అని అడిగీన్ పెతిసారీ మాకు తెలియదనో, కృష్ణాజిల్లాలో సారవంతమయిన భూముల ఆదాయాన్ని తేరగా పెట్టారనో చెప్తున్నారు.అసలు కారణం నేను చెప్పకుండా మీవాళ్ళు యెవరయినా చెప్తారేమో అనే ఇంత కాలం యెదురు చూశాను."ఆంధ్రావాళ్ళు వచ్చేసి భూముల రేట్లు భారీగా పెంచడంతో అంత రేటు పెట్టి భూముల్ని కొనలేక మాలో చాలామంది వెనక్కి తగ్గారు" - ఈ మాట నాకిప్పుడు పేరు గుర్తు లేదు కానీ ఒక ప్రముఖ వ్యాపార వేత్త తన జీవితాన్న్ని సింహావలోకనం చేసుకుంటూ అన్న మాటలు.నేను విన్నదే మీకు చెప్తున్నాను తప్ప నా స్వయం కపోల కల్పన కాదు.కావలిస్తే ఇప్పుడు కూడా అప్పటి పరిస్థితికి సాక్ష్యాలు కనబడొచ్చు.అలా తెలంగాణా వాళ్ళు అడుగుపెట్తలేనంతగా భూముల రేట్లు పెరిగి మీ వ్యాపరస్తులు వెనకపడిపోవటానికి కారణం నేను వూహించాను.అప్పుదు భూములు అమ్మే వాళ్ళు "తెలంగాణా వాడికి అమ్మ్మితే 10 ఇస్తాడు,అదే ఆంధ్రా వాడికమ్మితే 20 ఇస్తాడు" అని అనుకోవదం వల్ల,అవునా కాదా?తెలంగాణాలో భూములు కొనగూడదన్న మెలిక అప్పటి తెలంగాణా వ్యాపారస్తులకి తెలియదా?అమ్మే వాళ్ళు ఆంధ్రా వాళ్లకే యెక్కువ రేటుకి అమ్మడానికి కారణం కూడా అదే గదా!అవునూ నేను ఇదే పాయింటు ఒకప్పుదు చెప్తే అక్కద తెలంగాణాకి రక్షణలు వున్నాయి కొనదం కూడా తప్పే అని నాతో వాదించిన మేధావులు ఇవ్వాళ మీ ముఖ్యమంత్రికి ఆ మాట గుర్తు చయ్యదం లేదేమిటో?

      ఇవ్వాళ "దళిత పారిశ్రామిక వేత్తలు" అనే కాన్సెప్టుని బెల్లం లాగా చూపిస్తున్నాడు.ఒకసారి వినియోగదారుడిగా మీరు కొంటున్న ప్రతి వస్తువునీ ఒక సౌకర్యాన్ని ఆశించి కొంటున్నారు,అవునా?తను అడుగుపెట్టిన చోట యెంతటి క్రూరమయిన మోనాపలీ వున్నా సరే తను మిగతా వాళ్ళకన్నా యెక్కువ సౌకర్యాన్ని ఇవ్వగలను అనుకున్న వాడు భూమిని కొనడం లోనూ పెట్టుబడిని తెచ్చుకోవదం లోనూ వెనకాదడు.అసలు రహస్యం అది - ఇవ్వళ ప్రభుత్వమే వుషారు ఇచ్చినా అది లేకుండా తెలంగాణా వాదైనా అంగారక గ్రహవాసి అయినా వ్యాపారంలో తొలి అడుగు వెయ్యలేడు?!అక్కద వెనకబడ్దారు మీరు.ఒకటే మాట - అతిగా రక్షణలు కోరుకున్న వాడు యెవ్వడూ ముదుకెళ్ళినట్టు చరిత్రలో యెక్కడా లేదు!అది ఇన్నేళ్లకి ముస్లుములకి తెలిసింది అందుకే ఆ రకంగా మోసం చేసిన కాంగ్రెసుని వొదిలి మతతత్వ పార్టీ అయినా భాజపా వైపుకి వెళ్తున్నారు.మీకు తెలియడానికి మరో యాభయ్యేళ్ళు పట్టినా ఆశ్చర్యపోను నేను?!

      ఆయనే వుంటే మంగలెందుకని మీ ప్రాంతం సమస్యలకి కారణమె మీకు తెలియదు - మీరు మాకు అది కుదరదు ఇది కుదరదు మీరు చెయ్యలేరు మేము అప్పుడే చెప్పాం,మమ్మలని కుళ్ళుమోతు లన్నారు అని చాన్సు దొరికింది గదా ఆని రెచ్చిపోతున్నారు?!

      Delete
    2. హరిబాబు గారూ, తెలంగాణా వాదులు అందరూ గుడ్డిగా కెసిఆర్/తెరాస వెనుక నిలబడతారనుకోవడం భ్రమ. కెసిఆర్ దీక్ష మానినట్టు వార్తా రాగానే ఏమి జరిగిందో అందరికీ గుర్తు.

      తెలంగాణా రాదనీ రాజకీయ నాయకులు మళ్ళీ కేంద్రంతో కుమ్ముక్కు అవుతారని చెప్పిన జోస్యం నిజం కాలేదు. తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందన్నారు అదీ కాలేదు. ఎందుకు? సోయికి వచ్చిన ప్రజల ఆగ్రహాన్ని తట్టుకొనే ధైర్యం ఎవరూ చేయరు.

      తెలంగాణా ప్రయోజనాలకు ఎవరు తూట్లు పొడిచినా ఊరుకొనేది లేదు. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతరేయమని కాళోజీ చెప్పిన సూక్తిని అమలు చేయడం ఖాయం.

      మీ వ్యాఖ్యలో భూమి ధర వగైరాల కాంటెక్స్టు అర్ధం కావడం లేదు.

      Delete
  7. >>> ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పై స్థాయిలో బడాబాబుల్నీ కాంట్రాక్టర్లనీ పెంచడానికి భూముల రేట్లు పెరగడం అనే తాయిలం చూపించి రైతుల్ని మోసం చెయ్యాలనుకోవడమే నిస్సందేహంగా!

    ఈ మాటలు మేం మొదటే చెప్పినపుడు మీరేమి మాట్లాడారో గుర్తొచ్చిందా? క్రింద చదువుకోండి.

    *** కాబట్టి ఇప్పుదు మనం యెవరి సొల్లు కబుర్లకీ విలువ ఇవ్వనక్కర్లేదు, హైదరాబాదును తలదన్నే బలమయిన రాజధానిని కట్టుకోవాలి! రాజధాని మొత్తం తిరిగి చూస్తే చాలు రాష్ట్రమంతా తిరిగి చూసిన అనుభూతి కలగాలి!! సారవంతమయిన వ్యవసాయ భూములు వున్నాయి.పొడుగాటి సముద్ర తీరం వుంది, యెన్నో రేవు పట్నాలు వున్నాయి - మనం నంగిరి పింగిరిగా బతకాల్సిన పని లేదు!!

    *** ఒక వేళ యే తొండి రాజకీయాల వల్ల నయినా కేంద్ర సాయం అందకపోయినా మన సొంత బాధ్యతగా మనం రాజధానిని కూడా కట్టుకోలేని దుస్థితిలో వున్నామా?

    *** వాళ్ళు సింగపూరు వెళ్ళి పాఠాలు నేర్చుకునే టైములో మనం ఆ సింగపూరునే ఇక్కడ చూపిద్దాం. అది అసంభవ మేమీ కాదు

    ***చంద్రబాబుకి ఈ రాష్ట్రానికి తను యేది చేసి చూపించాలన్నా ఇదే ఆఖరి అవకాశం. తనకీ తెలుసు ననుకుంటాను.విజన్7 ఇంకా సూపర్ సెవెన్ అనీ తను చెప్తున్న వాటిల్ల్లో మంచి ప్రాక్టికాలిటీ వుంది.

    ***: http://harikaalam.blogspot.in/2014/09/blog-post.html

    ReplyDelete
    Replies
    1. @sreekaant chaari
      1.మనం నంగిరి పింగిరిగా బతకాల్సిన పని లేదు!!

      2.కేంద్ర సాయం అందకపోయినా మన సొంత బాధ్యతగా మనం రాజధానిని కూడా కట్టుకోలేని

      3.మనం ఆ సింగపూరునే ఇక్కడ చూపిద్దాం. అది అసంభవ మేమీ కాదుదుస్థితిలో వున్నామా?

      4.చంద్రబాబుకి ఈ రాష్ట్రానికి తను యేది చేసి చూపించాలన్నా ఇదే ఆఖరి అవకాశం. తనకీ తెలుసు ననుకుంటాను.విజన్7 ఇంకా సూపర్ సెవెన్ అనీ తను చెప్తున్న వాటిల్ల్లో మంచి ప్రాక్టికాలిటీ వుంది.

      పై వాటికి ఇప్పటికీ కట్టుబదే వున్నాను.కేంద్రం నుంచి సాయం అనుమానం గనకనే ఈ రకంగా ప్రవర్తిస్తున్నాదని నా అనుమానం.కేంద్రాన్ని ఒత్తిడి చేసయినా అది సాధించి తీరాలి?తీరుతాం?!రహస్యంగా యే విలీనం ఒప్పందాలూ చెయ్యకుండానే బహిరంగమగా చేసే న్యాయపోరాతం ద్వారానే సాధిస్తాం?!

      Delete
    2. 4. చంద్రబాబుకి ఈ రాష్ట్రానికి తను యేది చేసి చూపించాలన్నా ఇదే ఆఖరి అవకాశం. తనకీ తెలుసు ననుకుంటాను.విజన్7 ఇంకా సూపర్ సెవెన్ అనీ తను చెప్తున్న వాటిల్ల్లో మంచి ప్రాక్టికాలిటీ వుంది.

      పై వాటికి ఇప్పటికీ కట్టుబదే వున్నాను.
      >>> కేంద్రం సాయం చెయ్యనిదే వుద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వుండి ప్రపంచంలోనే అతి విశాలమైన రాజధాని కడతానంటే విన్నవాల్ళు నవ్వరా అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా నాకంతటి అనుభవం వుంది,హైదరాబాదుని నేనే పెంచాను అనే ప్రబుధ్ధుడికి?

      మీ మాటలు మీకే ఎబ్బెట్టుగా అనిపించడం లేదూ?

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. @sreeekaant chaari
      తర్వాతి పేరాగ్రాఫులో నేను రాసినేమితో చద్వకుండా మీకు పనికొచ్చేతంత మటుకే యేరుకునే మీలాంటివాళ్ళకి యెబ్బెట్టుగానే వుంటాయి లెండి?!

      read and understaand this alao
      తమాషా అనుకుంటున్నారా 13 జిల్లాల ప్రజల జీవితాలతో ఆడుకోవటం?యెన్నికల తర్వాత అక్కడ మీ ప్రభుత్వం నిలదొక్కుకున్నాక ఇక్కడ కొత్త రాష్ట్రం యేర్పడినాక తమరు చేసిన వాగ్దానాలే అవి!మీరిచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చనంత అసమర్ధులు తట్టా బుట్టా సర్ధుకుని అధికార నివాసాలు ఖాళీ చేసి ఇంట్లో కూర్చోండి.సమర్ధుడేవడో వాడే వచ్చి మాకు కావలసినవి సాధించి పెడతాడు!?ఇది కష్ట కాలం అనుభవజ్ఞుడు అధికారంలో వుంటే మంచిదన్న ఒకే ఒక్క కారణం వల్లనే యెన్నికల తులాభారంలో త్రాసు తెదెపాకి మొగ్గిందని ఫలితాల లెక్కలు చెప్తున్నాయిగా?!ఇప్పుడీ కాకిలెక్కలూ గాలికబుర్లూ యెవరికి చెప్తారు?చెప్పినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడీ సొల్లు కబుర్లు పట్టించుకోరు!యెలా చేస్తావన్నది మాట ఇచ్చిన వాడివి అన్నిసార్లు మాట్లాడిన వాడివి నువ్వు తేల్చుకోవాలి.మాకు ఫలితం మాత్రమే కావాలి,తెలిసిందా?లాజిక్కులతో మేజిక్కులు చెయ్యాలనుకుంటే మేము మా మేజిక్కు చూపిస్తాం,ఖబడ్దార్!

      finishing touch:యెలా చేస్తావన్నది మాట ఇచ్చిన వాడివి అన్నిసార్లు మాట్లాడిన వాడివి నువ్వు తేల్చుకోవాలి.మాకు ఫలితం మాత్రమే కావాలి,తెలిసిందా?
      I am fully aware what I am going to demand,got it?I start typing after first word to last word comes into my mind as asingle statement. The promise may be unpractical but he has to fulfil I am not concerned how they will do?!
      Don't try to derive your own meanings in others statements by plucking only parts.It is real absurd,OK?!

      Delete
    5. ఇప్పటి మీ ఆవేదన అర్థం చేసుకున్నా లెండి. మీ పేరా నిండా అదే కనపడుతోంది. ఇప్పుడు మీరు రాసిందికాదు ప్రశ్నిస్తున్నది, అప్పుడు రాసినదాన్ని.

      ముఖ్యమంత్రి సిగపూరూ, లేండ్ పూలింగూ అంటున్నప్పుడు ప్రాక్టికాలిటీ వున్నవాడూ, సమర్థుడూ అని మీరే జై కొట్టేరు. పైగా అనుమానాలను వ్యక్తం చేసినవారిని నోటికొచ్చినట్టు తిట్టేరు. అప్పుడు "మనం యెవరి సొల్లు కబుర్లకీ విలువ ఇవ్వనక్కర్లేదు, హైదరాబాదును తలదన్నే బలమయిన రాజధానిని కట్టుకోవాలి" అన్నారు. ఇప్పుడేమో "ప్రపంచంలోనే అతి విశాలమైన రాజధాని కడతానంటే విన్నవాల్ళు నవ్వరా, తమాషా అనుకుంటున్నారా 13 జిల్లాల ప్రజల జీవితాలతో ఆడుకోవటం?" అని మీరే అంటున్నారు.

      అదే విషయాన్ని అడిగితే దానికి మాత్రం సమాధానం దాటవేస్తూ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు వ్రాస్తున్నారు. మొదట మీరే భజనలు చేసి, ఆనక మిమ్మల్ని మీరే ఖండించుకోవడం కామెడీగా లేదూ?

      Delete
    6. మీకు యెదటి వాళ్ళ రాతలు అర్ధం చేసుకోవదంలో లోపం వుందని తెలుసు గానీ మరీ ఇంత అధ్వాన్నంగా వుంటుందని అనుకోలేదు.అది చెప్పబోయే ముందు మనిద్దరికీ వున్న తేడాని వివరిస్తాను.అప్పుదు కొంచెం స్పష్తం కావచ్చు నా వుద్దేశ్యమేమిటో?మీకు లాగా కేస్సీఆర్ నందంటే నందని పందంటే పందని అనే మూర్ఖాభిమానం నాకు చంద్రబాబు మీద లేదు.ఆ పోష్టులోనే అది వుంది,చదివారు గదా?నాకు అతని పట్ల అనుమానాలు వున్నాయి కానీ ఇప్పుడు తన అవసరం రాష్ట్రానికి వుంది,అయినా సరే ప్రాక్టికల్ గా సక్సెస్ అవుతాడా అనేది చూశాక భవిష్యత్తులో సానుకూలంగా వుంటానేమో అని కూడా అన్నాను,చదవలేదా?

      రాష్ట్రం ఇప్పుడు వున్న పరిస్థితిని బట్టి అంత భారీ వాగ్దానాలు చెయ్యడం తప్పే,కానీ చేశాడు అంటే దాన్ని యెట్లాగయినా సాధించి తీరాలి!నేను ఈ బ్లాగులో నిలదీసిన వాటినే మా వాళ్ళు ముఖాన్నే అడిగారు,ఇవ్వాళ వాటికి మా ముఖ్యమంత్రి జవాబు చెప్పాడు.చాణక్యుడు రాజు దండధరుడై అంకుశం చేతిలో వుంచుకుని పరిపాలిస్తేనే రాజ్యం క్షేమంగా వుంటుందన్నాడు.ప్రతిపక్షం బలహీనంగా వున్నది గాబట్టి ఇవ్వాళ ఆ స్థానం మనలాంటి వాళ్ళది.మాట బాగుంటే మెచ్చుకోవటం,మాట తేడా వస్తే మాట దాచుకోకుండా విమర్శించహ్తం విషయంలో నా ఖచ్చితత్వాన్ని నేను పాటిస్తున్నాను,నా కళ్ళు తెరుచుకునే వున్నాయి.దేనికి యే మాట మాట్లాదాలో తెలిసే మాట్లాడుతున్నా.కేంద్రం నుంచి నిధులు రావడం నిక్కచ్చిగా లేదు గాబట్తే రైతుల్ని బతిమిలాడుకుని భూమి తీసుకుంటున్నాడు.మామూలు చట్టం ప్రకారం చెయ్యాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా కష్టం.అదీ నాకు తెలుసు.కాబట్టి రైతులు యెలర్ట్ గా వుండటం తప్పదు అని అంటున్నాను!ఇదంతా ఇలా జరగడానికి కారనం విభజించిన వాళ్లకి విడిపోయాక ఆంధ్రప్రదేశ్ కూడా ఈ భూమి మీద వుంటుంది అనికూడా అనుకోకుండా భయానక్ పధ్ధతిలో చెయ్యదమె కారన మయినప్పుడు అటువైపు వుండి సరదాగా ఎంజాయ్ చేస్తూ మొదటి నుంచీ విభజనకి ఒప్పుకున్న వాళ్ళు ఆంధ్రా లో కూడా వున్నారు,ఇవ్వాళ విభజన వల్ల ఆంధ్రావాళ్ళే యెక్కువ ఇబ్బంది పడుతున్నారు అని కొంత కడుపులో పెట్టి దాచుకునే సౌహార్ద్రం వుంటే నా బాధ పూర్తిగా అర్ధమై వుండేది మీకు?

      మనస్సులో ఆ భావం లేదు గనకనే బాధ అర్ధమయిందంటూనే తప్పులు పడుతున్నారు,యేం చేస్తాం, విలీనం ఒప్పందం అయితేనేం,ఇంకెన్ని పైశాచికపు వూహలు చేస్తేనేం కార్యసాధకులు గదా - ఆ ధీమా చూపిస్తున్నారు,అనతేనా?!

      ఆయన నందంటే నందనాలి అనే ఆత్రంలో మీ ముందు తరం వాళ్ళు కళ్లతో చూసి నిలువెల్లా అసహ్యించుకుని కాళ్ళ చేతులా పోరాడిన నిజాముని అవస్రమయితే లండన్ ఆర్కైవ్స్ లో నుంచయినా సరే కొత్త ఆధారాలు పట్టుకుని నిజాము మంచోదని నిరూపించలనుకునే గొప్ప మనసు మీది!అందుకే ఆరోగ శాఖ మంత్రే ఆసుపత్రి పాలయ్యాడు?!అయినా ఇంకా భజన చేస్తూనే వున్నారు.మేమలా చెయ్యడం లేదు గనక మా దోరణి మీకు కొత్తగా వుంది,కదూ?!

      Delete
    7. అదిగో మళ్ళీ మొదలు పెట్టారు కప్పదాట్లు. ఇక్కడ కెసీఅరు, నిజాము పూర్తిగా అనవసరం. ఇక అసలు ప్రశ్నకు మీ సుదీర్ఘ వ్యాఖ్యలో సమాధానంలేదు.

      Delete
    8. చెప్పానుగా మీకు అర్ధం కావడం కష్టమని!
      యెందుకు అర్ధం కావదం లేదో కూడా రాశా?
      మాకు కావాల్సినవి సాధించుకుంటాం,మా ధీమా మాకు వుంది లెండి?

      Delete
    9. హరిబాబు గారు
      విభజనే విజయంగా భావించే ఇలాంటి వారు వాస్తవాలును ఉద్దేశపూర్వకం మరిచిపోయి మాట్లాడతారు.తెలంగాణా రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఇక్కట్లూ వీరి కళ్లకు కనపడవు.

      Delete
    10. హరిబాబు సూరనేని,

      నా ప్రశ్న కానీ సరిగా అర్థం కాలేదా ఏమిటి? అప్పుడు చంద్రబాబు చెప్పిన విషయాల్లో మంచి ప్రాక్టికాలిటీ వుందని కితాబిచ్చిన మీరు, ఇప్పుడు మాత్రం అవే విషయాలను చెప్తుంటే విన్నవాల్ళు నవ్వరా అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా అని ఎలా అనగలిగారు? అన్నది నా ప్రశ్న, అర్థమైందా ఇప్పటికైనా?

      మీరే చెప్పి మీరే ఖండించుకున్న ఈ రెండిట్లో ఏది మీ అసలు అభిప్రాయం. అప్పుడే రెండో అభిప్రాయాన్ని వ్యతిరేకించిన వాళ్ళని తప్పు పట్టడం తప్పని ఒప్పుకుంటారా ఇప్పటికైనా?

      Delete
    11. నేను ప్రాక్తికాలిటీ వుందన్నది దేని గురించి - సూపర్ సెవన్ ఫార్ములా గురించీ పెట్టుబడుల్ని తీసుకు రావడానికి చేస్తున్న ప్రయత్నాల గురించీ,అవునా కాదా?అన్నిటికీ కలపాలంటే అన్నిట్లోనూ ప్రాక్టికాలిటీ వుందని చెబుతాను గానీ వేటిలో ప్రాక్తికాలిటీ వుందో అక్కడ చ్చెప్పాను,విభజన ఇలా జరగడం వల్లనే మేము లోటులో వుండటం వల్లనే ఇబ్బందులు యెదురవుతున్నాయి అని నాకు తెలుసు కాబట్ట్టి హెచ్చరిక అవసరం కాబట్టి మాత దాచుకోవదం లదనీ చెప్పాను - మాతకి జవాబూ వచ్చింది కాబట్టి నేను సర్దుకు పోయాను మేము ఆశాజీవులమే తప్ప దురాశా జీవులం కాదు?అక్కడ కేంద్రంలోనూ వొట్టిపోయిందనేదీ అందరికీ తెలుసు కానీ యెద్దు పుందు కాకికి మాత్రం తెలియకపోవదంలో ఆశ్చర్యమేమీ లేదు కదా?!

      అవి మాకు ఇచ్చిన వాగ్దానాలు కాబట్టి తప్పకుండా సాధించుకుంటాం.సాధించదంలో వెనకడుగు వెయ్యకుండా గట్టిగా హెచ్చరిస్తున్నాం,అదీ చెప్ప్పాను గదా!ఒకవేళ రాకపోయినా మీలా యెవరి మీద పదో యాడవం.మా సొంత కష్టం తోనే అన్నీ సాధించుకుంటాం!అదీ విషయం,ఇప్పటి కయినా అర్ధమయితే సంతోషిస్తాను!?

      Delete
    12. హరిబాబు గారు,

      తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రెండూ బాగుపడాలనే నా అభిప్రాయమూనూ. అలా కోరుకోవడంలో మీకున్న హక్కును నేను గౌరవిస్తాను. నేనడిగింది ఒకటే. "రాజధానిపై అప్పుడు మేం ఇవే సందేహాలు లేవనెత్తితే తీవ్రంగా వ్యతిరేకించారుకదా" అని. అంతకు మించేం లేదు. కావాలంటే ఆ విషయం వదిలేయండి, కామెంట్లు కూడా తొలగించినా ఫరవా లేదు. కేంద్రం సహాయం చేయాలని మీరు కోరుకోవడంలో తప్పులేదు, మేమూ అదే కోరుకుంటున్నాం. కేంద్రం సవతిప్రేమ చూపొద్దని అనుకుంటాం తప్ప మీకు ఇవ్వొద్దని అనుకోం.

      Delete
    13. @sreekaant chaari
      విభజనకి సంబంధించి మీరూ మేమూ ఒకళ్లలో ఒకళ్ళ్ళు తప్పులు పట్టుకోకుండా ఒకళ్ళ కోసం ఒకళ్ళు కలిసి పోట్లాడాలిసిన సమయం ఇది.రాజదహాని అలా యెందుకు చేసాడు అనేదానికి కారణం తను అప్పుదే చెప్పాడు,నేనూ ఒప్పుకున్నాను.మీకు అది ఇప్పటికీ తెలివి తక్కువ నిర్ణయం అనిపించహ్దం వల్లా నా అప్పటి అభిప్రాయాన్ని ఇప్పుదు ఖందిస్తూ మీ వాదననే సమర్ధిస్తున్నానని మీకనిపించహడం నన్ను నిలదియ్యదం వరకూ నాకు యే విధమయిన ప్రతికూలతా లేదు!నేను మొత్తంగా చెప్తున్నది ఇది:తను కేంద్రం రాజధానికి ఇచ్చినా చాలా తక్కువగానే ఇస్తుంది,మిగిలిన నిధులు వేరే చోటి నుంచి తెచ్చేకన్నా ఆ రాజ్ధానినే తన ఖర్చుని రాబట్టుకునే విధంగా ప్లాన్ చేసాడు.భూము లిచ్చిన రైతులు కూడా అది తెలిసి తమంతట తామే ఇచ్చారు,కానీ కళ్ళు మూసుకుని వుంటే చివర్లో పెంచి ఇచ్చేటప్పుదు గొడవలు రాకుండా రక్షణలు వున్నాయో లేవో చూసుకోమని రైతులకి సూచించాను!

      ఇప్పటి నా పోష్టు కూడా సూటిగా చంద్రబాబు అధ్భుత రాజధాని నిర్నయాన్ని వ్యతిరేకించడం గురించి కాదు,అంత పెద్ద రాజధానిని కట్టాలని యెలాగూ అనుకున్నప్పుదు కేంద్రం నుంచి నిధుల విషయంలో గట్టిగా వుండాలి కదా అనే!వెంకయ్య నాయుదు నిధులు రాకపోవచ్చునని ప్రాటించడాన్ని బేస్ చేసుకుని గదా నేనీ పోస్టు రాసింది?!

      అసలు విభజనకి సంబంధించి ఫైనల్ గా ఒకటి చెప్తాను.కావాలి అనటమే కానీ యెలా కావాలి అనే దాని విషయంలో తెరాసా హోం వర్క్ చెయ్యలేదు!ఇస్తాం అన్నవాళ్ళు కూడా యెలా ఇవ్వాలి అనే దాని మీద హోం వర్క్ చెయ్యలేదు.ఇస్తానని యెన్నికల్లో చెప్పి గెలిచినా 4 సంవత్సరాల 11 నెలలు సాగదియ్యదం ఆ పార్ట్టీ లోనే విభజనని వ్యతిరేకించే వాళ్ళు యెక్కువగా వుండటం వల్ల.అందుకనే మొదటి నుంచీ మీకు మీ అసలు శత్రువు కాంగ్రెసు అని నేను చెప్పింది!యేదో ఒక రకంగా ప్రతిపక్షాల మీదకి తోసేసి తప్పుకోవడానికే చూసింది.ఆఖరికి భాజపా గెలుపు ఖచ్చితంగా తెలిశాక వచ్చాక ఇస్తామ అనే భాజపా ధీమాని చూసి దానికన్నా మనమే ఈస్తే పోలా అని ఇట్లా అఘోఇంచారు.అసలు హోం వర్క్ చేసి రెడీగా వున్న యేకసభ్యపార్టీ అధ్యక్షుది ప్లాను చాలా బాగున్నా యెవరూ పట్టించుకోలేదు?మొత్తం యధావిధిగా యెవరూ అమలు చెయ్యరు గానీ ఆ ప్లాను ఆధారంగా దానిమీద చర్చించి వుంటే ఇప్పుడీ లుకలుకలు వచ్చేవి కాదు.తెలంగాణా పవర్ ప్రాబ్లం గురించి కూడా ప్లాను వేశాడు - పత్రికల్లో చదివిన దాన్ని బట్టి!

      మందబలమే ముద్దు అనుకున్న మిగతా పార్టీ లన్నీ ఇంతమందిమి వున్నాం,ఆ ఒక్కడి ప్లాను మనం ఫాలో అయ్యేదేమిటి అని అహానికి పోకుండా వుంతే బాగుండేది?!తెలంగాణా అసాంజి బ్లాగులో ఒక మంచి సూచన చూశాను.దాని ప్రకారం మొదట మాకు వాగ్దానం చేసినవి రాబట్టుకోగలగదంలో మీరు మాకు సపోర్టు వస్తే తర్వాత మీకూ పూర్తి నిధుల కేటాయింపు జరగలేదు కాబట్టి ఆ విషయంలో మీరు మా సపోర్టు తీసుకోవచ్చు,అదే రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగువాళ్ళుగా కలిసుండట మంటే?!తలల్ని లెక్కబెట్టతం కాకుండా తలలో వున్న సరుకుని బట్టి పోవదం తెలిసే వరకూ ఇప్పుడు మనం చూస్తున్నది కూడా నిజమైన ప్రజాస్వామ్యం కాదు,యేమంటారు!

      Delete
  8. @sreekaant chaari
    జాత్యహంకారాన్ని చూపిస్తూ మిగతా వాళ్లకన్నా మేము మా జన్యువుల వల్లనే గొప్ప్పవాళ్లం అని చెప్పే సిధ్ధాంతాల్ని సపోర్టు తెచ్చుకుని అసమానతల్ని వ్యతిరేకించే మీ వాదనకి సప్పోర్టుగా తెచ్చుకుని బల్లగుద్ది వాదించి - కాబ్ట్టి గుణకర్మ విభాగం అని చెప్పినా వయాసుడు జన్మ పేరున విభజించినట్టే అని వాదించగలిగిన మేధావి తమరు?!

    మీరు సప్పోర్టుగా తెచ్చుకున్నవి గాని ఒప్పుకుంటే కొమరం భీం పుట్టడు!అంబేద్జ్కర్ పుట్టడు,దళితులు పుట్టుకతోనే దళితులు గాబట్టి వాళ్ళని అక్కదే వున్వ్=చతం కరెక్టు అనే అర్ధం కూడా పీకొచ్చు యెదటివాళ్ళు - ఆ పని చెయ్యలేకనే మీకు దణ్ణం పెట్టి తప్ప్పుకున్నా!

    మీరు సప్పోర్టుగా తెచ్చుకునే సిధ్ధాంతాలు న్యాయమైనవో అన్యాయమైనవో కూడా గ్రహించలెరు గానీ నా పాత పోష్టునీ ఇప్ప్పటి పోష్టునీ భలేగా మిక్సప్ చేశారుగా?!

    గురివింద గింజలు!గురివింద గింజలు!!యెదటివాళ్లలో తప్పులు పట్టడానికి యేళ్ళ తరబడి కూడా వీడెప్పుడు నాకు దొరికే మాట వొదుల్తాడా అని యెదురు చూస్తున్నారన్నమాత!నా పోష్టు నాకు గుర్తుందదా?దాన్ని సాధించుకోవడానికే యెప్పుడు అనుమాన మొస్తే అప్పుడు చెలరేగుతున్నాం.మీకు లాగా కొన్నేళ్ళ తర్వాత నిద్ర లేవం?!

    ReplyDelete
    Replies
    1. ఆ చర్చలోనే మీ మేధావితనం బయటపడింది, జనం ఆవార్డులు గూడా ఇచ్చారు లెండి. విషయాన్ని దాటవేస్తూ మీరు చేసే అనవసరమైన కామెంట్లకు నేను బదులివ్వడం లేదు.

      Delete
    2. అవార్డులు ఇచ్చిన వాళ్ళు యెలాంటి వాళ్ళో మీరు లంకించుకున్న జాత్యహంకారి సిధ్ధాంతాన్నే వాళ్ళూ లంకించుకోవడంలోనే బైటపడిందిగా?!కిందపడ్డా చెయ్యి పైనే వుందని సొంతడబ్బా కొట్తుకునే వాళ్లతో వాదించడం కన్నా మూసీనది మురికినీటితో ముఖం కడుక్కోవడం వుత్తమం అనే వాదన నుంచి తప్పుకున్నా,మీరు జవాబు ఇస్తారో లేరో అనవసరం అనుకుని?!

      Delete

    3. "జాత్యహంకారి"

      నేను ఏ సిద్ధాంతాన్నీ అరువు తెచ్చుకోలేదు. కేవలం భగవద్గీతలో ఉన్న వాటి గురించి మాత్రమే వాదించాను. పై పదం ఉపయోగించి రెచ్చగొట్టాలని మీరు చూస్తున్నట్టుంది. అది మీకు ఎలాగూ అలవాటేగా? అయినా ఆ చర్చలో నేను దూర దలుచుకోలేదు ఇక్కడ. అవసరమైతే అక్కడే కామెంటండి, చర్చిద్దాం.

      Delete
    4. మీరు మళ్ళీ అర్ధం తీసుకోగూదని అర్ధమే తీసుకుంటున్నారు,ఇది మీకు అలవాటేగా!"జాత్యహంకారి" అని కొటేషన్లలో పెట్టి రెండుసార్లు రెట్టించి అడగతంలో నేను మిమ్మల్ని అంటున్నానని అర్ధం చేసున్నట్టా?నాకు చిరాకు పుట్టి తొలగించిన కామెంటులో "ళోళ్" అని పర్యాచకపు కామెంటు వెయ్యడం ద్వారా మీరు నాకు దాన్ని అంటగడుతున్నట్టా?

      పుట్టుకతోనే గుణాలు వస్తాయి అని ఆ సిధ్ధాంతాల్ని సాక్ష్యంగా చెప్పిందెవరు,నేనా,మీరూ మీ మిత్రులా,వ్యాసుడా?

      Delete
    5. >>> ఆ సిధ్ధాంతాల్ని సాక్ష్యంగా చెప్పిందెవరు,నేనా,మీరూ మీ మిత్రులా,వ్యాసుడా?

      మొదటి విషయం, ఆరోజు నన్ను సమర్థించినవారెవరో కూడా నాకు తెలియదు. నిజానికి వారికన్నా మీరే ఎక్కువ తెలుసు బ్లాగు పూర్వకంగా. ఎవరో వచ్చి నా వాదనని సమర్థించగానే వారు నా మిత్రులు అని ఫిక్సయిపోవడం మీకే చెల్లింది.

      ఇక రెండో విషయం. ఎవరో వచ్చి (పోనీ మిత్రులే అనుకున్నా) నా వాదనను సమర్థించగానే వారి అభిప్రాయాలన్నీ నాకు ఎలా అంటగడుతున్నారు? నా వాదనతో గెలవలేక, వారి అభిప్రాయాలను నాకు అంటగడుతూ "జాత్యహంకారి" అని ముద్ర వేయడానికి వికృత ప్రయత్నం చేయడం ఎలా సబబనుకుంటున్నారు? ఇది మీతో చెప్పించడానికే రెండో సారి అడిగాను, అర్థమయిందా?

      అరోజు నా వాదన ఇది.

      పదాలు, శబ్దాలు ఎలా వాడి పుస్తకాల్లో ఎలా రాసినా... చివరికి గుణకర్మల వల్ల కాక జన్మ చేతనే కులాలను నిర్ణయించారూ అని. గుణకర్మల వల్ల కులాలు నిర్ణయించిన దృష్టాంతాలు లేకపోగా, భేషుగ్గా గుణాలున్నా జన్మ వల్ల విద్యనేర్పకుండానో, పెళ్ళి చేయకుండానో వెలివేసిన దృష్టాంతాలున్నాయని. దానిలో మీకు జాత్యహంకారం కనపడితే, మీ వాదనకు నా నమోవాకాలు. ఇక సెలవు.

      Delete
    6. 1.మీరు అక్కడ మీ వాదనగా చెప్తున్న దానికి అక్కడ నేను చేసిన వాదన ఇది:మనుషులు తమ స్వార్ధాల కోసం వాటిని తమ కనువుగా మార్చుకుని ఆచరించిన వాటిని అసలు సిధ్ధాంతాల్లోనే అలా వుంది అనటం తప్పు అని. దానికి దృష్టాంతంగానే విద్యాబుధ్ధులు నేర్పించే తలిదండ్రులు యేది నేర్పితే అదే నేర్చుకోవడం ఇంకా గట్ట్టిగా చెప్పాలంటే తమ తల్లిదండ్రుల్ని అనుకరించటం అన్నది అన్ని కులాల్లోనూ ఇప్పటికీ జరుగుతూ ఉంటే యెప్పటి వాళ్ళో అయిన ఆ నియమాల్ని అప్పటి సంజానికి అనుకూలం గా వుండతం కోసం పెట్టుకున్నవాళ్ళని ఇప్పుడు విమర్శంచి ప్రయోజనం యేమిటి అని,అవునా కాదా?బాగా గుర్తు చేసుకోండి!ప్రజ నిర్వాహకులు మాటిమాటికీ మార్పులు చేస్తున్నారు ఆ లింకు నాకు దొరక్ లేదు.కానీ గుర్తు చేసుకుంటే సరిపోతుంది.చెప్పిన జవాబును కూడా గమనించకుండా పాత వాదననే కొనసాగిస్తే యేమి చెయ్యగలరు యెవరయినా?.

      ఇవ్వాళ్తి సమాజమూ కొన్నిట్ని గట్టిగా పాటించమని ఒత్తిడి చేస్తున్నది గదా!అలా చెయ్యని వాళ్ళని వెలివెయ్యదం లాగా కాకపోయినా గౌరవహీనంగా చూడటం లేదా?ఒకటి తప్పు అని తెలిశాక కూడా అదే పని చేస్తున్నారూ అంటే దాని వల్ల లాభమయినా వుండాలి,లేదా దానిపట్ల బలహీనత అయినా అయి వుండాలి,అవునా కాదా?ఈ రెండూ ఒకదాని పట్ల లేకపోతే దాన్ని విసిరి పారెయ్యటానికి అర నిముషం కూడా పట్టదు,అదీ అక్కడే చెప్పాను,మీరు ఖాతరు చెయ్యలేదు! .

      ఇది కూడా అక్కడి నా వాదననే మళ్ళీ ఇక్కడ్ అచెప్తున్నాను.దాన్ని వొప్పుకొవడం వ్యతిరేకించడం యేదీ చెయ్యకుండా మళ్ళీ మీ మొదటి వాదననే కంటిన్యూ చేశారు మీరు,గుర్తుందా?

      2.మనిషికి కుటుంబంలో పెరగడం వల్ల కొన్ని అభిప్రాయాలు సామాన్యంగా వచ్చినా ఒక వయస్సు వచ్చాకనే సొంత ప్రవర్తన యేర్పడుతుంది.అది తన కుటుంబ వాతావరణానికి పూర్తి భిన్నంగా వుండవచ్చును కూడా.దాన్నే స్వభావజం అంటారు.మరి ఇంత స్పష్తంగా విడమరిచి చెప్పినా మీరు పెంపకం వల్ల మాత్రమే గుణాలు యేర్పడతాయి అనే జనరక్ విషయాన్ని ఆ వుద్దేశం లేకుండా ఆ మాట వాడిన వాడికి - వ్యాసుదయినా మరొకడయినా - అతను అదే అన్నాడు అనతం అంటగట్టతం కాదా?

      3.మిమ్మల్ని సమర్ధించిన వాళ్ళు ఆధునిక సిధ్ధాంతాన్ని సపోర్టుగా తెచ్చుకుంటున్నాం అన్న వాళ్లకి వాళ్లని సంబోధిస్తూనే అక్కదే జవాబు చెప్పాను.కాకపోతే నాకు ఒక రోజు గ్యాప్ రావదం తో మీకు సమర్ధనలుగా ఇచ్చేసి ఇక అటువైపుకు రాకపోవడం వల్ల్లనేఓ యేమో తర్వాత వారి నుంచి జవాబు రాలేదు.

      4.సిధ్ధాంతం సపోర్టు తీసుకోకపోయినా మీ వాదనా అదే కదా!వరకట్నంఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని యే ధర్మశాస్తరంలో చెప్పబడిందని తీసుకుంటున్నారు?డబ్బు మీద ఆశతో తీఎసుకుంటున్నారు."విధవ" అనే మాతతో పాటు "పునర్బువు" అనే మాట కూడా వుంద్ అంటే మళ్ళీ పెళ్ళీ చేసుకున్న ఆడవాళ్ళు కూడా వున్నరనే గదా అర్ధం.కానీ అట్లా నొక్కేస్తే ఇంట్లో ఒక జీతం లేని పనిమనిషి దొరుకుతుంది గదా అని తర్వాత వాళ్ళు తిరగమోత వేశారు.అలాంటి వాటిని కూడా ఆ వుద్దేశం లేని వాళ్ళకి అంతగట్టతం తపు అనే మొదటి నుంచీ నా వాదన,అది మీరు పట్టించుకోకుండా నాకు ఇష్తం లేకపోయినా నాకు అన్యాయం అనిపించినా నేను కూడా కులానికి కట్టుబడి వుండటానికి ఆ పెద్దమనిషి చెప్పడమే ముఖ్య కారణం అనది కూడా కరెక్టే అంటే ఇక వాదించటానికి యేముంటుంది చెప్పండి?

      Delete
  9. గేందీ గీళ్ళు బంగారు తెలంగాణ సాధించటం అయిందా ఇగ పక్కనోళ్ళ మీద పడ్డారు. యాది మర్సినా గీ బాచ్ సొంత సంగతి వొదిలి పక్కనోళ్ళ మీద పడి యేడ్చే రకం గాదూ, పాపం పుట్టకతో వొచ్చిన బుద్దాయే ఇహ పుడకల మీద తగులడే దాక బోదు .

    కేచీర్ హైదరాబాద్ డల్లాస్ జేస్తా డల్లాస్ జేస్తా అంటుంటే ఏదో అనుకున్యా ఆడ డల్లాస్ లో భూకంపం రాంగాన్లే గీడ హైదరాబాద్ లో షేక్ అయ్యుండ్లా గది జూసి మాంచి ఉషారు మీదున్నుట్టున్నారు గీళ్లు గదే బంగారు తెలంగాణా అని. బాగా పెట్టారు ఇద్దరికీ గడ్డి హరిబాబు గారో.

    ఓ పక్క స్టేట్ కి ఏదిస్తే మాకూ గదే కావల అనేడ్చే ఏడుపు గొట్టు బాచ్.... లక్ష నాగళ్ళు యాడ దాచీరు, గాటిని కూడా వేలమేస్తురా బంగారం పూత పూయనీకి.

    ReplyDelete
  10. రాష్ట్రం తెగిన గాలిపటం తోకలా తయారయింది (షేపుతో సహా). వెనకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమల అభివృద్ధికి పక్కా ప్రణాళిక, హోదాతో నిమిత్తంలేకుండా కనీసం ఒక్క అయిదేళ్ళు దానినో గాడిలో పెట్టేందుకైనా పక్షాల మధ్య సయోధ్య అవసరం ఎంతో ఉంది. కాని పాలక ప్రతిపక్షాలు సవితుల్లా జుట్లు పట్టుకుంటున్నాయి - ఇంకా ప్రభుత్వం పుట్టి ఏడాదన్నా కాకముందే.
    నా దృష్టిలో పాలనా యంత్రాంగ నిర్మాణాన్ని విభజించి కొన్ని ముఖ్య కార్యాలయాలు రాయలసీమలో ఏర్పాటు చేస్తే అక్కడి ముఖచిత్రం కొంత మారుతుంది, విలువైన పంటభూములు కొన్ని కాపాడబడతాయి.
    ఇంకా, రాజధాని నిర్మాణానికి సింగపూర్ వాళ్ళే అక్ఖర్లేదు. స్థానికంగా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నిర్మాణ సంస్థలు (GVK, GMR, L & T etc) ఎన్నో ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. సూర్య గారూ, మా బాగా చెప్పారు. రాయలసీమ & ఉత్తరాంధ్రల అభివృద్ధి జరగనంత వరకు సీమాంధ్ర రాష్ట్రం ముందుకు పోవడం కష్టం. అయితే రియల్ ఎస్టేట్ & సాఫ్టువేరు ఆధారంగా తయారు చేసిన అభివృద్ధి నమూనా ఈ ప్రాంతాల అవసరాలు తీర్చలేదు. సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఉత్తరాంధ్ర & ఖనిజ సంపద కలిగిన సీమ అభివృద్ధి ఆయా వనరుల సక్రమ ఉపయోగం ద్వారా జరగడం ఉత్తమం.

      Delete
  11. kamma, kapulu,,,,,,,,,reddys ni tokke rajakeeyam nadustunnadi.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...