రాజ్యం వీరభోజ్యం అన్న పెద్దలే రాజ్యాంతే నరకం దృవం అన్నారు!
రాష్ట్రాన్ని విడగొట్టటం మరో అధికార కేంద్రాన్ని సృష్టించే పై స్థాయిలోని పెద్దమనుషుల వెసులుబాటు కోసం జరిగిందే తప్ప తెచ్చుకున్న వాడికి తెలంగాణా ప్రజల సౌభాగ్యం మీద దృష్టీ లేదు.ఇచ్చిన వాడికి అసలు విభజించాక అటుపక్కన మరో ముక్క కూడా వుంటుందనే వివేకమూ లేదు?విభజించితే తను అన్ని సీట్లు గ్యారెంటీగా ఇస్తానంటున్నాడు,విభజించకుండా వుండాలంటే మీరు యెన్ని సీట్లు గెలిపించగలరు అని పరిశీలకుడి హోదాలో వచ్చిన తన పార్టీ వాడే కూశాడని మర్చిపోయిన లఘువీరుడు ఇతర్ల మతిమరుపును గురించి యాష్ట పడిపోతున్నాడు?!మాతృరాష్ట్రం అనే గౌరవప్రదమైన హోదా వుండగా అవశేషాంధ్ర అని విన్నవాడికి గుందెలు భగ్గుమనే విధంగా వెక్కిరింతగా మాట్లాడిన దౌర్భాగ్యులు ఇవ్వాళ రాష్ట్రం పట్ల యేదో బాధ్యత వున్నట్టు రెచ్చిపోతున్నారు.సమైక్యవాదం పేరుతో హడావిడి చేసిన దంతా కాంగ్రెసు వాళ్ళు కాదా!వాళ్ళ అసలు వుద్దేశం రాష్ట్రాన్న్ని సమైక్యంగా వుంచడం కానే కాదు,కేసీఆర్ నుంచి హైదరాబాదులో వున్న తమ వ్యాపారాల్ని పదిలంగా వుంచుకోవటానికి కావలసిన లోపాయకారీ హామీ కోసమే జరిగింది!?అతడూ వీళ్ళలాగే పార్ట్ టైం పొలిటీషియన్ కం ఫుల్ టైం బిజినేస్ మాగ్నెట్ గనుక పై స్థాయిలో అది దొరకగానే చల్లబడిపోయారు!
చంద్రబాబు ప్రజాభిమానంతో అధికారంలోకి వచ్చినా కేంద్రంతో గట్టిగా వ్యవహరించకుండా పిరికిగా యెందుకుంటున్నాడో తెలుసా?ఒకనాడు వాజపేయి అనే మేధావీ రుజువర్తనుడూ భాషాయుధ పాణీ నిష్కపటీ ఉదారుదూ అయిన వాజపేయి వల్ల ఒకానొకప్పుడు కేవలం 2 సీట్లకే పరిమితమయి కూడా భాజపా నేడున్న స్థానానికి వచ్చింది!మోదీ ఇవ్వాళ వచ్చాడు?2 సీట్లకి మాత్రమే పరిమితమయిన స్థానం నుంచి యే అంశాన్ని చూసి ప్రజలు ఆదరించారో భాజపా వాళ్ళు మర్చిపోయి వుండవచ్చు.రధయాత్ర నాడు భాజపాని ద్వేషించిన నాలాంటి వాళ్ళు కూడా కాంగ్రెసుకి భిన్నంగా అక్కడున్న వాజపేయి,అద్వానీ లాంటి వాళ్ళ హుందా అయిన రాజకీయ వ్యక్తిత్వాలను చూసే అభిమానించడం మొదలు పెట్టారు!కానీ ఒకసారి అధికారాన్ని అనుభవించి పోగొట్టుకుని మళ్ళీ సాధించిన ఇప్పటి భాజపా నేతలు ఆ గతాన్ని మర్చిపోయి కమలమే సకలం కావాలి అనే ధూర్తత్వాన్ని ప్రదర్శిస్తూ కాంగ్రెసుకి నకలుగా తయారయ్యారు.దేశప్రజలంతా నిర్ఘాంతపోయి చూసే విధంగా లగడపాటి రాజగోపాల్ అనే కాంగ్రెసువాడు చేసిన పెప్పర్ స్ప్రే దుర్మార్గమే కాంగ్రెసుకి ఆ గతి పట్టించింది!అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన పట్టుదల మీదనే వచ్చిందని చెప్పుకున్న ప్రత్యేక హోదానీ విభజన ప్యాకేజినీ తను అధికారంలో వుండి కూడా మా చేతుల్లో లేదని వెంకయ్య నాయుడు చెప్పినప్పటి నుంచే ఆప్ వైపుకి త్రాసు మొగ్గడం వూపందుకుంది?!
సకలం కావాలీ అనే భాజపా లక్ష్యం ప్రతి పార్టీకి వుండొచ్చు,కానీ యెలా సాధించాలనుకున్నది ఆ పార్టీ?తను చేసిన వాగ్దానాల్ని నిరపేక్షంగా నెరవేర్చి సజావైన పధ్ధతిలోనా!తనకే లాభం రావాలనే తొండి రాజకీయపు పైత్యకారి తనంతోనా!
ఆంధ్రప్రదేశ్ విషయంలో భాజపా పరమ దుర్మార్గమైన వ్యూహంతో వుంది!జగన్ మీద వున్న కేసులు ఇప్పుడు విచారణ జరుగుతున్న పధ్ధతి ప్రకారం 2090వరకూ కూడా పూర్తి కాకపోవచ్చు,అసలెప్పటికీ పూర్తి కానె కాకపోవచ్చు!అసలు జగన్ మీద ఆరోపణలు యేమిటి?తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించాడని కదా!ఆ తండ్రి ముఖ్యమంత్రి అనే ప్రధమ స్థానంలోనే వున్నా మంత్రివర్గ సభ్యులకి తెలియకుండా చెయ్యగలడా యే పని అయినా?అధికార దుర్వినియోగం జరిగితే అది రహస్యంగా యెప్పటికీ జరగదు?!కన్నమేసే దొంగ కూడా తోడు లేకుండా చెయ్యడు గదా, మరి అతని మంత్రివర్గంలో వున్న లఘువీరుడికీ బొత్సకీ పార్టీలో యెవ్వడికీ తెలియకుండా జరిగిందా అది?ఆ కేసు స్వరూపం ప్రకారం అసలు ముద్దాయి జగన్ అవ్వడు వీళ్ళే అసలు నేరస్థు లవుతారు!జగన్ ధైర్యం కూడా అదే!చంద్రబాబు తోక ఝాడించిన మరుక్షణం జగన్ భాజపా సహకారంతో నిర్దోషిగా బయట పడి తెదెపాని మట్టి కరిపిస్తాడు.నేను జగన్ అభిమానిని కాదు,కానీ ఇన్ని విధాల కేసులతో సతమతమవుతున్నా రోజుకొకసారి తెదెపా శ్రేణులతో యెప్పుడు జైలు కెళ్తావో తెలియదు అని జోకు లేయించుకుంటున్నా అంత ధీమాగా వుండగలటానికి కారణం యేమిటనే ప్రశ్న వేసుకుంటే మీకే అర్ధమవుతుంది! జగన్ కూడా నిక్కచ్చిగా కేసుల నుంచి బయట పడదల్చుకుంటే చాలా ఈజీగా బయట పడగలడు,కానీ తనకి సానుభూతిని రప్పిస్తున్న ఈ వ్యవహారాన్ని తనూ తన కనుకూలంగా తీసుకుంటున్నాడు!
యే విధంగా జరిగినా ఒకసారి అధికారం కోల్పోయాక మళ్ళీ అధికారంలోకి రావడం అంత తేలిక కాదని మనందరి కన్నా చంద్రబాబుకే యెక్కువ తెలుసు! అంతా మోసం!అంతా దగా!ముఖ్యమంత్రుల బోర్డు ఒప్పుకోదేమో అని అనుమానాలు ఇప్పుడు వెలిబుచ్చుతున్న వాళ్ళు ఇచ్చినవాడు తమ పార్టీ వాడు కాదు గదాని గట్టిగా కృషి చెయ్యకపోవడం వల్లనే గదా వ్యతిరేకించేది?హామీ ఇచ్చిన వాడు నిన్నటి వాడయినా ఇచ్చింది ప్రధాని స్థానంలో వుండి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రులయినా మరెవరయినా కుంటిసాకులతో దానికి తూట్లు పొడిస్తే రాజ్యాంగబధ్ధమయిన ఆ పదవికే తలవొంపులు కాదా?
ఒక దేశప్రధాని ఇచ్చిన న్యాయబధ్ధమయిన హామీ పట్ల ఇంత అనిశ్చితిని రగిలించిన భాజపాని యెవరయినా యెలా అభిమానించ గలరు?అందుకే వ్యతిరేక ప్రభంజనం దిల్లీలో తొలి విసురు విసురుతున్నది?!ముస్లిముల్ని రంజింప జేసినా కాశ్మీరులో వుషారు ఇచ్చినా ప్రధాని స్థానంలో ఉండి ఒక నగర ప్రజానీకాన్ని రంజింపజెయ్యాలని చూసినా యెదురు తన్నడం యెందుకు జరుగుతుందో యెదురుదెబ్బ తగిలిన తర్వాతనయినా బోధపర్చుకుంటే మంచిది.
అధికారాంత మందు జూడవలె గదా అయ్యల సౌభాగ్యములు?!
ఏ రాయైనా ఒకటే పళ్ళూడగొట్టుకోవటానికి
ReplyDeleteఏ పార్టీఐనా ఒకటే ప్రజల్ని మోసంచేయటానికి.
ఈ దేశంలో బహుశా మరొక స్వాతంత్ర్యసంగ్రామం జరగాలేమో ప్రజలకు న్యాయం జరగాలంటే. అప్పుడు నాడు ఫ్రెంచ్ విప్లవంలోవాడబడిన ఆ గెలెటిన్ వాడి ప్రజాద్రోహనేరస్థులను ఏరివేసి "స్వఛ్ఛభారత్" స్థాపిస్తారేమో దేశప్రజలు!
అద్దంలా ఊడ్చి సిధ్ధం చేసిన రోడ్లమీద సెలెబ్రిటీలమంటూ కొందరు పళ్ళికిలించుకుంటూ కొత్త చీపుళ్ళను పట్టుకొని ఫోటోలూ వీడియోలూ దిగటం అనే తమాషా నాటకమా స్వఛ్ఛభారత్ అంటే?
దేశమంతా దగామయం బ్రతుకంతా దుఃఖమయం
ఇదా స్వతంత్రభారతదేశం పేరుతో సగటు భారత ప్రజ జీవితం?
ఎంతదారుణం!
అదేంటి? రాష్ట్రాన్ని విడదీయమని చెప్పి చంద్రబాబు బ్లాంక్ చెక్ లాంటి లేఖ ఇచ్చినా గెలిపించారుగా? తెదెపాని ఆంధ్రా వారే గెలిపించగా, బిజెపి అంతకన్నా ఎక్కువ ఏం పాపం చేసిందని ఢిల్లీ వారు ఓడిస్తున్నారు? కేంద్రం అన్యాయం చేస్తుందని భావిస్తే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలగి NTRలా యుద్ధం ప్రకటించకుండా ఎందుకు ఊరుకుంటున్నాడు?
ReplyDeleteఢిల్లీలో ఆప్ గనక గెలిస్తే ప్రజలు నీతివంతమైన రాజకీయాలు కోరుకుంటున్నారని చూడాలి తప్ప దాన్ని ఆంప్ర విభజనతో ముడిపెట్టడం సబబు కాదనుకుంటా.
తెలంగాణా "ఇచ్చి"నందుకు కాంగ్రెస్ పార్టీని లోక్సభలోనే కాదు, మహారాష్ట్ర/హర్యానా/ఝార్ఖండ్/కాశ్మీర్/డిల్లీ విధాన సభ ఎన్నికలలో కూడా ప్రజలు తిరస్కరించారు. తెలంగాణాకు మద్దతు తెలిపినందుకే ఎన్సీపీ/శివసేన/లోక్దళ్/జేఎమేం/జేకేఎంసీ మునిగి పోయారు. రేప్పొద్దున జరిగే బీహార్ ఎన్నికలలో కూడా ఇదే కారణంతో కాంగ్రెస్/ఆర్జేడీ/జేడీయూ వారికి ప్రజలు బుద్ధి చెబుతారు.
Deleteహిలరీ క్లింటన్ గెలుస్తుందో లేదో తెలుసుకోవాలని అనుకుంటారా? సింపుల్ మై డియర్ హోల్మ్స్: ఆవిడ తెలంగాణా గురించి ఏమి చెప్పిందో తెలుసుకోండి.
PS: lighter vein, just for fun :)
@ తెరాస చెంచాలు
Deleteహిల్లరీ క్లింటన్ దాకా ఎందుకు మీ దొర కాల్మోక్కండి . మస్తుగ సెలవిస్తాడు . యట్టాగో చెప్పనా
1. మోడీ సన్నాసి (అప్పుడు) పొద్దునోసారి, సాయంత్రం ఓసారి కాలుమొక్కుడు (ఇప్పుడు)
2. చంద్రబాబు నాఘర్ కా నాఘాట్ కా అన్న చందాన దేనికి పనికి రాకుండా పోతాడు (అప్పడు) చంద్రబాబు గిర్రు గిర్రు మని చక్రం తిప్పి మాతాన ఏమి లేకుండా చేతాన్నాడు (ఇప్పుడు)
3. ఆ నాయుడు ఈ నాయుడు కలిసి మాకు అన్యాయం చేస్తురు (అప్పుడు) మాఆమ్మయి , వెంకయ్య కలిసి ఒకే సీట్లో కూచొని పార్లమెంట్ కి పొతారు. వెంకయ్య ని మించి తురం ఖాన్ లేడు, ఆయన గా మంత్రి పదవిలో ఉండుడు మా అదృష్టం (ఇప్పుడు)
4. మా తెలంగాణా మాకొస్తే చాలు మస్తు డబ్బులు (అప్పుడు) తింటానికి తిండి తిండి లేదు బాబా కాస్త మీరే దయ చూడాలా (ఇప్పుడు)
5. హైదరాబాద్ విశ్వనగరం (అప్పుడు) హైదరాబాద్ ఒక చెత్త నగరం (ఇప్పుడు)
6. లచ్చ నాగళ్ల లో దున్నుడే (అప్పుడు ) రామోజీ రావు నా దేవుడు ప ఫిలిం సిటీ ఇంద్రలోకం (ఇప్పుడు)
7. ఆంధ్ర బిర్యానీ పెండ లేక్కుంటది (అప్పుడు ) ఆళ్లు పెట్టె బిర్యానీ మా రుచి ఎవడొచ్చి ఇచ్చినా రెడ్ కార్పెట్ సిద్దం .
ఇన్ని ఇవరాలు తెల్సిన దొరని వొదిలి మీరేడా పోయేది . రేపో మాపో ఏదో చెప్పేది దాకా ఆగురీ , అప్పుడు ఊషారిగా బ్లాగుల్లో కాపీ పేస్టు చేద్దురు .
@నేను నేనే
Deleteబాగానే కాలినట్టుందే, ఉన్నమాటంటే! శానా బాగనే చెప్తున్నవ్ గనీ, ఇంతకీ హిల్లరీ క్లింటన్ గెలుస్తదా ఓడుతదా? ఇంకా మీరు ఎవరెవర్ని ఓడిస్తున్నరు, ఎవరెవర్ని గెలిపిస్తున్నరు, గవన్నీ చెప్పు సారూ, తెల్సుకుంటం!!
ఎవడికి కాలిందో బానే ఎరికైంది లే గానీ ఇగ అపు నీ నకరాలు. దెయ్యాలగ్గూడా బానే కాలతాందిలే ఈ మద్దెన. జెప్పిన గా ఎవడో జెప్పుదేంది మీకు మీ దొర కాల్మొక్కు అని, మళ్ళీ నన్ను అడుక్కోనుడు ఏందీ. పచ్చని పొలాలొ తలబెట్టుకొంటామో ఇంకేమో కాలబెట్టుకొంటామో నీకొందుకో అది మా ఇష్టం మీలెక్క పక్కనోల్ల మది ఏడ్చుచు మాత్రం జేయం.
Deleteఔ గానీ, మస్తు గా ఏడుస్తురు పొలాలొ పొలాలొ అని, మీ ఏడుపుగొట్టు ఉద్దెమామ్ ఎందుకు జేసిరు, మీదంతా మాకు దోచి పెద్తురు ని గందా , మరి గిప్పుడు ఈ ఏడుపు షురు జేస్తిరేంది. ఏడ బాగుపడతారో అని మీ దొర గాని గిట్ల ఏడ్చమన్నాడెం మీ దొర. సర్లే ఏడ్చిరి జరా బలమోస్తాది.
@sreekaant chaari
Deleteఅదేంటి? రాష్ట్రాన్ని విడదీయమని చెప్పి చంద్రబాబు బ్లాంక్ చెక్ లాంటి లేఖ ఇచ్చినా గెలిపించారుగా?
??????????????
మొదట్లో నేనూ క్యాచ్ చెయ్యలేదు మీరన్న ఈ ముక్కని!భలే తెలివి మీది?ఆంధ్రావాళ్ళు విభజనని యెప్పుడూ వ్యతిరేకించలేదు,అది తెలుసా మీకు?నాతో సహా మామూలు ప్రజానీకంలో కూడా విడిపోతామనే వాళ్ళని కలిపి వుంచలేం అనే అభిప్రాయంలోనే వున్నారు.పోస్టులో సమైక్యం అంటూ గంతులేఇంది కాంగ్రెసు వాళ్ళానని కూడా స్పష్టంగా చెప్పాను.అయినా మీకు యెప్పట్లాగే అసలు పాయింటు అర్ధం చేసుకోకుండా మీకు అర్ధమయినదే నేను రాశాననేఎ మీకు కావాల్సిన ముక్క రాయలేదనీ అంటున్నారు.ఇస్తానన్న కాంగ్రెసు అధిష్టానమే ఇవ్వనివ్వననై వీరంగాలౌ ఆ పాఋటీ వాడే అయిన కికురె ముఖ్యమంత్రిగానే ఆ మాటలంటున్నా మావాడు మంచివాడు అనేసినా మీకు యే మాత్రం అది కనబడలేదు.కానీ చంద్రబాబు బ్లాంక్ చెక్కు ఇచ్చాడుగా అతన్నెందుకు గెలిపించారు అని అమాయకంగా నన్నడుగుతున్నారు,మీ వాదన మీకయినా తెలివిగా అనిపిస్తుందా?
హరిబాబు గారు,
Deleteమీమాటల్ని మీరే ఖండించుకుంటానంటే నేను చెయ్యగలిగిందేం లేదు.
మీ హెడ్డింగు ఏమిటి? "ఆంధ్రాకు అన్యాయం చేసినోడు ఎవడూ బతికిబట్టకట్టడు… కాంగ్రెసుకి దేశంలో పట్టిన గతి ..." అంటే కాంగ్రెసు ఆంధ్రాకు అన్యాయం చేసిందనేగదా తమరి భావం? మరి కాంగ్రేసు ఆంధ్రాకు ఏం అన్యాయం చేసింది? విభజన ఒక్కటేగా? కనీసం ఆ విభజన కూడా పోలవరం, స్పెషల్ ప్యాకేజీ, విద్యా సంస్థలు, రాజధానికి ఆర్థిక సాహాయం అన్నవి కలిపి ఇచ్చింది... కాగితం మీదైనా.
మరి చంద్రబాబు ఏం చేశాడు? ఏ ఒక్క కండిషనూ పెట్టకుండా విభజించమని ఉత్తరం రాశాడు. అందుకే బ్లాంక్ చెక్ అన్నాను, అర్థమైందా?
విభజన ఒక్కటేగా?
Delete??
ఇభజన ఒక్కటేనా??ఇస్తాననై అధికారంలోకి వచ్చి అందరి దగ్గిర్నుంచీ మీరన్న బ్లాంకు చెక్కు లేఖల్ని తీసుకునీ నికరమయిన నాలుగేళ్లలో యేమాత్రం హోం వర్క్ చేసింది?రాష్త్రం మొత్తం ఆదాయం,అప్పులు,వనరులు యేవి యెవరికి పంచితే తర్వాత గొదవలు రాకుండా వుంటాయీ నేది హోం వర్క్ అంటూ చేస్తే యెవరు వ్యతిరేకిస్తారు?
మీకన్నా కేసీఆరే నయంగా,విభజన వల్ల ఆంధ్రాకి అన్యాయం జరిగిందని పబ్లిగ్గా ఒప్పుకున్నాడు!కిందటి పోశ్టులో చెప్పాను.మాకు వాగ్దానం చేసిన వాటికన్నా నయాపైసా అక్కర్లేదు అని,మా ముఖ్యమంత్రి కొడా అదే అడుగుతున్నాడు.మీ ముఖ్యమంత్రి అప్పుడు ధీమాగా మాకసలు యే ప్యాకేజీ అక్కర్లేదు ఆంధ్రావాళ్లకె ఇచ్చుకోండి అన్నాడు.రామాయణమంతా విని అన్నట్టు "చేసింది విభజనేగా" అని అడుగుతున్నారంటే మీకు బుర్ర సరిగా పని చేస్తున్నదా?మాకెఉ న్యాయంగా రావల్సినవి అడుగుతున్నప్పుదు మాటసాయం చెయ్యకపోతే మానె మౌనంగా నన్నా వుందలేకపోతున్నారు.పోష్టుల్లో తప్పులు పట్టి వెక్కిరించాలని చూస్తున్నారు,పాపభీతి కూడా లేదా!
గత పోష్టులోనే చెప్పాను - అప్పుదు ధీమాగా వద్దన్నా తేంగాణాకి కూడా కేంద్రసాయం అవస్రమే,ఒకరినొకరు వెక్కిరించుకోకుండా అవస్రమయితే యెదటి అవాడికి మాటసాయం కూడా చెయ్యడానికి సిధ్ధంగా వుందాం అని.అయినా యెద్దుపుండు కాకికి రుచి అన్నట్టు మళ్ళీ మళ్ళీ అదే దోరణి చూపిస్తున్నారు,యేమిటి దీనర్ధం?
మరి చంద్రబాబు ఏం చేశాడు? ఏ ఒక్క కండిషనూ పెట్టకుండా విభజించమని ఉత్తరం రాశాడు.
Delete??
బుర్ర లేనోడే ఈ అభిప్రాయాన్ని ఇప్పుడు కామెంటుగా రాయగలడు!లేకలు యెందుకడిగారు.సబహ్లో బిల్లు పెట్టి దమ్ము చూపించి పాస్ అచేయించుకోవటానికి తగిన బలం లేదు కాబట్టి "అయ్యా,మేము బిల్లు పెట్టినఫ్పుదు సభలో మీరు వ్యతిరేకించకుండా వుంటారా?!" అనే హామీ కోసం సభ బయట వ్యక్తిగత స్థాయిలో అడిగి తీసుకున్న లేకహలో మీరు కండిషన్లు పెట్టలేదని బాబుని తప్పు పడుతున్నారు.ఇదేమి తెలివి?
లేఖలు అడగడమంటే "YES/NO" చెప్పమని కాదు. మొత్తం అభిప్రాయాలు చెప్పమని.
Deleteమరి ఇప్పుడు అడుగుతున్న చంద్రబాబు అప్పటి లేఖలో విభజనతో పాటు ఎలాంటి రక్షణలు కావాలని అడిగాడు? అది చెప్పండి ముందు? ఎవరి బుర్రలో ఏముందన్నది తర్వాత ఆలోచిద్దాం.
అయ్యా, ఈ విభజన సరిగ్గా జరగదం లేదు అని డిల్లీలో నిరాహార దీక్ష పట్టినా పట్టించుకోలేదు.చరిత్ర అంతా తెలిసీ మళ్ళీ మొదటి కొస్తే యేమి చెయ్యగలం,కీ బోర్దు నొక్కీ నొక్కీ చేతులు నొప్పి తప్ప!అసలు సభ బయట ఇచ్చే లఖలే చెల్లవు,అవి నాలుక గీసుకోవటానికి కూడా పనికిరావు మొర్రో అంటుంత్టె అవేవో అభిప్రాయాలు వివరించే అధీకృతమయిన దస్తావేజులన్నట్టు మాట్లాడుతున్నారు?!అర్ధం వున్నా లేకపోయినా యేదో ఒకటి కక్కెయ్యాలి,అంతే!?
Deleteవిభజనకి ఒప్పుకుని అన్నీ మర్చిపోయి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోకుండా రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్ళుగా కలిసుందామ అని మీవాళ్ళు చెప్పిన మాతకి విలువిచ్చి తెలంగాణా ప్రజల గురించి గానీ సంస్కృతి గురించి గానీ ఒక్క మాత కూడా తూలకుండా వున్నా నేను అన్ని ప్రాంతాల మీద కారం జల్లానని కూడా అనిపిస్తే నేను ఇంకా మీనుంచి సామరస్యం కోసం అంగలార్చలేను.కామెర్ల రోగికి ప్రపంచమంతా పచ్చగానే వుంటుంది గాబట్టి మీకు నాపైన గల అభిప్రాయంతో నేను విభేదించను.మాకు వాగ్దానం చేసిన వాళ్లు దద్దమ్మలు కాదు!అడుగుతున్న మేమూ చెవలాయలం అంతకన్నా కాదు!!
>>> అన్ని ప్రాంతాల మీద కారం జల్లానని కూడా అనిపిస్తే
Deleteఅపార్థం చేసుకోకండి. అన్ని ప్రాంతాలు అంటే అందులో మీ ప్రాంతం కూడా అని నా అభిప్రాయం. అంతకన్నా ముఖ్యంగా అన్ని ప్రాంతాలనూ సమానంగా విమర్శిస్తున్నారని కూడా నా అభిప్రాయం. ఒకాయన "మా ప్రాంతం గోల మీకెందుకు" అన్నప్పుడు వాడిన మాట అది.
>>> ఈ విభజన సరిగ్గా జరగదం లేదు అని డిల్లీలో నిరాహార దీక్ష పట్టినా పట్టించుకోలేదు
Deleteపోనీ, సరిగ్గా ఎలా జరగాలో అప్పుడైనా చెప్పాడా? కనీసం రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడైనా చెప్పాడా?
మళ్ళీ మొదటి కొచ్చారు,అక్కడా ఇక్కడా అధికారంలో వుంది అంతకు ముందర యెన్నికల్లో ఇస్తామని చెప్పి నాలుగేళ్ళు గడిచిన తర్వాత కూడా వాళ్ళకి రాష్త్రం ఆదాయం,అప్పులు,వనరులు యెలా పంచాలి అనే హోం వర్క్ చెయ్యని వాళ్లని వొదిలేసి ప్రతిపక్షంలో వున్నవాడి మీద దాడి చేస్తున్నారు?కాంగ్రెసు వాళ్ళకి తెలంగాణా ఇవ్వాలని గానీ,న్యాయంగా విభజించాలని గానీ వుంటే హెం వర్క్ చెయ్యకుండా యేవరు ఆపగలరో మీరు చెప్పగలరా?
Deleteప్రతిపక్షంలో వున్నాడన్న వంకతో మీరు వెనకేసుకు రావడం అంత బాగా లేదు.
Deleteప్రతిపక్షంలో వుండే 2008 దసరా నాడు తెలంగాణా విభజన గురించి గంట ఉపన్యాసం ఇచ్చాడు. ప్రణభ్‌కు ఉత్తరం ఇచ్చాడు.
ప్రతిపక్ష నాయకుడిగా 2009లో తెలంగాణా ఏర్పాటుకు తీర్మానం మీరు పెడతారా, లేక నన్ను పెట్టమంటారా అని రోషయ్యతో హుంకరించాడు.
ప్రతిపక్షంలో వుండే పాదయాత్ర సందర్భంలో తెలంగాణా ఇంకా ఎందుకు ఏర్పాటు చేయడం లేదు అని ఏకంగా మన్మోహన్ సింగుకే లేఖ రాశాడు (ఎవరూ అడక్కుండానే).
ఇక అడిగితే ఇచ్చిన లేఖలు సరే సరి.
ఇన్ని సందర్భాలలోనూ ఏ ఒక్క సారి కూడా విభజన వల్ల ఆంధ్రకు కలిగబోయే లోటు పాట్లను గురించి కాని, తీసుకోవలసిన రక్షణ చర్యలను గురించి కాని ప్రస్తావించలేనే లేదు.
కాంగ్రెస్ మిన్నకున్న ప్రతీసారీ తెలంగాణా అంశాన్ని లేవనెత్తి కేవలం స్వంతలాభానికి వాడుకుందామని అనుకున్నాడు (తెలంగాణ పై ప్రేమతో కాదు). తాను మాత్రం గోడ మీది పిల్లి వాటంగా వుంటూ, కాంగ్రెస్ ఇవ్వదని భావించినప్పుడల్లా అదిలిస్తూ, ఇచ్చే ప్రయత్నం చేసినపుడు వ్యతిరేకిస్తూ కాలక్షేపం చేశాడు తప్ప ఎప్పుడైనా వాస్తవికంగా నిజానిజాలు మాట్లాడ డానికి ప్రయత్నం చేశాడా? అలా చేసుంటే కనీసం ఆంధ్రులకైనా ఒక క్లారిటీ వచ్చుండేదేమో.
బొందలగడ్డ లోంచి లేచొచ్చి కామెంట్లు రాస్తన్నా పాగల్ సీకాంతా చారి నీకు అసలు పోస్ట్ అర్ధమయ్యిందా. అసలు అర్ధమవ్వుడు కాదు మొత్తం సదివినావా లేకపోతె మనకోచ్చేది కామెంట్ కింతని కదా పోస్ట్ లో ఏముంటే ఏందిలే అని కామెంట్లు రాస్తన్నవా.
Deleteఆడ అడ్డగోలు గా విభజన చేసిన కాంగ్రెస్, ఓట్లు కోసం కబుర్లు జెప్పి ఇప్పుడు మావల్ల కాదో అంటన్నా బిజెపి గురించి మాట్లాడతా ఉంటె నీ గోస ఏందీ? నీ లెక్కలో మరి చంద్రబాబు గురించే ఎందుకు అడుగుతుండా కెసిఆర్ కేమయ్యింది, జగన్ కేమయ్యింది, మా కయితక్క కేమనియింది, హరీస్ గానికి ఏమయింది, మా బుల్లి దొరకేమయింది, ఈడ అడ్డదిడ్డమైన ఆంధ్రోల్ల గురంచి , ఆంధ్ర ప్రదేశ్ గురించి నానా చెత్త వాడుగు వాగే సీకంతా చారికి, గొట్టిముక్కలకి ఏమయ్యిద్ది అని గూడక అడగాల్న్లె . అయ్యేట్టా మరిచా? అయ్యి గూడక అడుగు, ఓహో ఆటిగురించి అడగనీకి దొర పైసల్లియ్యడా .
యాది మరిసినా నీకు LOL ని జెప్తే కానీ అర్ధమయ్యి ఏడవదు కదూ నీ తొక్కలో కామెంట్లకి LOL. .
@శ్రీకాంత్ చారి
ReplyDelete@జైగొట్టిముక్కల
అనవసరంగా అన్నిబ్లాగులలోకి దూరి ఆంధ్రా వాళ్ళ పుండు మీద కారం చల్లే ప్రయత్నం మానుకుని మీ పని మీరు చూసుకుంటే మిగతా వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది.
అయ్యా వజ్రం గారూ,
Deleteఈ బ్లాగు రచయిత అన్ని ప్రాంతాలమీదా ఉత్తి కారమే కాదు పెప్పర్ స్ప్రే కూడా చల్లుతారు లెండి. మీరేం అట్టే వర్రీ కానక్కర్లేదు. అదేమన్నా వుంటే ఆయన చూసుకుంటారు.
వజ్రం భయ్యా మన మనశ్శాంతి కోసం వేరే వాళ్ళ పొట్ట గొట్టుడు ఏమంత మర్యాద. పాపం ఇట్టా రాత్తె గదా నాలుగు పైసలు వచ్చి కడుపునిండా తినేది . పోన్లే బ్రతుకు తెరువు ఆళ్ళని జూసుకోనీ. దొర నలుగాల్లలు సల్లగాజూదాలా ఈల్లని. పాపం గొట్టిముక్కల అయితే జేట్లాగు లో బాధలో ఉంది గూడక కామెంట్లు రాస్తాడు తెల్సా పాపం సిన్సియారిటీ..
Deleteఅవశేషాంధ్ర అనండి, విశేషాంధ్ర అనండి, విశిష్ఠాంధ్ర అనండి, పరిశిష్ఠాంధ్ర అనండి, దుష్టాంధ్ర అనండి ఇంకా ఏదో ఒక రూపంలో ఆంధ్రప్రదేశం ఉండనే ఉంది ఒకపక్కన. మరొక పక్కన వినూత్నస్వర్ణవిశోభాన్వితభాస్వద్దివ్యభవ్యస్వరూప మైన అరివీరభీకర తెలంగాణం ఉండనే ఉంది. సరే కాని ఆ ఆంధ్ర ఉంది చూడండి, పేరుకే ఉంది కానండీ, అది దీనాతిదీనమైన స్థితిలో పడి ఉంది. అలా ఉండటాన్ని భరించలేక ఉక్రోషంతో ఏతదాంధ్రప్రజానీకంలో ఎవరైనా ఏదైనా మాట్లాడితే అది అపహాస్యం చేయబడుతుంది. ఎందుకంటే బలహీనుడి మాటకు విలువలేదు కాబట్టి. అది సహజమే అని గ్రహించాలి. ఎవరినీ తప్పుపట్టకండి. ఒకవేళ నిజంగా కాస్త పచ్చగానే ఉండుంటే అప్పుడు ఒకవేళ ఏమి మాట్లాడినా కూడా అదీ అపహాస్యం చేయబడేదే. ఎందుకంటే అది ఆంధ్రుల అహంకారంగా పరిగణించబడేది కాబట్టి. అందుచేత కాలం కలిసిరాని స్థితిలో ఉన్న సదరు ఆంద్రులనబడే నిర్భాగ్యులు ఎంత నోరు మూసుకొని ఉంటే అంత మంచి దేమో ఆలోచించుకోవాలి. అలా నోరుమూసుకున్నా చేతకాని వారన్న మాటతో అపహాస్యం పాలయ్యే వారే కదా అంటారా - కావచ్చు. కాలం కలిసి రాకపోవట మంటే ఏమిటనుకున్నారు మరి? దయచేసి ఈ విషయంపై అనవసర చర్చలతో మనస్సులు పాడుచేసుకోవద్దని నా సవినయ విజ్ఞప్తి.
ReplyDeleteదేనికైనా టైం రావాలి. ప్రస్తుతానికి ఓ రెండేళ్ళ దాకా చంద్రబాబు చేయగలిగింది ఏమీ లేదు. అనవసరమైన దుబారా లకిపోకుండా పొదుపుగా నడుపుకొని రావటమే ప్రస్తుతానికి మార్గం. కానీ ఎక్కడా , పోయినాయన అందరికీ బాగా నేర్పేసి పోయాడు.
ReplyDeleteఅయ్యా జంటకపులూ,
ReplyDeleteఆప్ నీతిమంతమైనదని అనుకోవాలా?ఇదివర్లో అక్కణ్ణించి బయటి కొచ్చిన ప్రతివాడూ కజ్రీవాల్ నిజంగా క్రేజీవాలే అని ఇచ్చిన స్టేట్మెంట్లు మర్చిపోయారా?ఇప్పుడు భాజపాలో చేరి యెగస్పార్టీగా మారినావిడ మూలమూ అదే కదా!కొంతమంది కజ్రీవాల్ గుణంలో అహంకారం,ఒంటెత్తు పోకడలూ వున్న్యాయని అన్నారుగా సారూ!బహుశా మీ దొర గుణాల్తో యెవరు కనిపించినా మురిసి పోతారేమో?అందుకే అన్నిట్నీ కూలగొట్టి కట్టేస్తాననేదాకా వెళ్ళాడు!
వాహనాల రీ రిజిస్ట్రేషను నాడే చెప్పా,"తోటకూర నాడే చెప్పకపోతివే" అని తల్లి చెంపలు పగలగొట్టినట్టు మీ చెంపలు మీరే వాయించుకోవాల్సి వస్తుందని,అది గుర్తుందా?
యెప్పుడో ముప్పయ్యేళ్ళ ముందు కాళోజీ అన్న"ప్రాంతంవాడే..." ముక్కని ఇప్పటికీ పెతి కామెంటులోనూ వేసేఅ గొట్టి ముక్కల వారికి అన్ని పిచ్చిపన్లు చేస్తున్నా పాతరెయ్యాలని ఆవేశం ప్రదర్సించడం లేదెందుకో?
మీ వైపుకి తొంగి చూస్తే ముందు ముందు పొట్ట చెక్కలయ్యే ముచ్చట్లు కూడా చెప్పేటట్టు వున్నాడు మీ ముక్కుమంత్రి :--<>)
హరిబాబు సూరనేని గారూ,
DeleteAAP నెలన్నరలో ఏం చేసిందో దేశం చూసింది. రేపూ చూడబోతుంది గెలిస్తే. KCRది కేజ్రీవాల్‌ది ఒకటే గుణం అన్నందుకు మీకు ధన్యవాదాలు.
పచ్చని పొలాలు తగలబెట్టించడం కన్నా పాత బంగళాలు కూల్చి కొత్తవి కట్టడం పెద్ద తప్పేమీ కాదు లెండి. నంబరు ప్లేట్లగురించి తమరు వర్రీ కావద్దు, అది కేవలం టెక్నికల్ ప్రాబ్లం, మెల్లిగా సర్దుకుంటుంది. తెలంగాణలో TSయే వుంటుండి, సరేనా?
మీరు పొట్ట చెక్కలు చేసుకుంటే మాకొచ్చే నష్టం ఏమీ లేదుగానీ, మీ జంట నాయుళ్ళ విదూషకత్వం చూస్తే మాత్రం మాకేమీ నవ్వు రావడం లేదు, బహుషా మీకూ రావడం లేదనుకుంటా!
మీకు నావ్వురాదని మా గామాత్రం తెల్దా . విషయం ఏదన్నా గాని మీకోచ్చుడు ఒకటే గాదె ఏడుపు గౌ గానీ గదేంది రెండో నాయుడి సంగతి మీ దొర ఫ్యామిలీ మస్తు గా తెల్సుకుని జెప్పిరి బాగా authentic గా జేతున్నావ్ . ఔ లే కొత్త దోస్తానా గదా ఆ మాత్రం యవ్వారం ఉంటాదిలే నీకు దొరకి.
Deleteఏంకయ్య లాంటి వాళ్ళని ప్రజలే నిలదీయాలి.ప్రస్తుతం ఓ ఆంధ్ర పార్టీ అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇంధనం ఉన్న వ్యక్తి ఎవరూ కనపడటం లా, పవన్ కల్యాణ్ గొంతు విప్పి తనదైన ప్రత్యేక ఆంధ్ర వాణిని వినిపించటానికి ఇది సరైన సమయం. రైతు ఋణ మాఫీ నుంచీ, ప్రత్యేక హోదా వరకూ ప్రజలు గుర్రుగా ఉన్నారు.
ReplyDeleteమీ పోస్ట్ చదివిన తరువాత నాకు కలిగిన అభిప్రాయాలను ఈ డిస్కషన్ ఎక్కువ మంది పరిశీలనకు వెళ్ళాలనే సదుద్దేశంతో ఒక పోస్ట్ గా ఈ క్రింది లింక్ లో నా బ్లాగ్ లో ప్రచురించడం జరిగింది. అసౌకర్యానికి మన్నించగలరు...
ReplyDeletehttp://nmraobandi.blogspot.in/2015/02/blog-post_10.html
thanks,I like your post also
Deletethank you sir...
Deleteఇష్టం వచ్చినట్లుగా విభజించి మనని తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో పడవేసిన కాంగ్రెస్స్ కు, ఢిల్లీని మించిన రాజధానిని ఇస్తామని చెప్పిన బి.జె.పి కు, మనను దొంగలు దోపిడిదారులుగా ముద్రవేసి ( మనవాళ్లు వ్యాపారం చేస్తే దొంగలు,దోపిడిదారులు అన్నారు. మరి ఇవాళ తెలంగాణాలో జరుగుతున్నదేమిటి ) వెల్లగొట్టిన తెలంగాణా సోదరులకు ఎప్పటికైనా మన బాధ, మన దుఖం, మన అవమానం అర్ధం అవుతాయంటారా?
ReplyDeleteవెళ్ళగొట్టామని అంటారేమిటండీ, రచయిత గారు "ఆంధ్రావాళ్ళు విభజనని యెప్పుడూ వ్యతిరేకించలేదు" అని ఢంకా బజాయించి చెపుతుంటే!
Deleteశ్రీకాంత్ చారి గారు,
Deleteనిజమేనండి. మెజారిటీ సీమాంధ్రులు విభజనకు మనసులో బాధగా వున్నా సమైక్య వుద్యమానికి అంతగా సహకరించకుండా వుండి విభజనకే ఎక్కువభాగం సహకరించారు ( మౌనం వహించారు ). కానీ మా బాధ, దుఖం, అవమానం (సోదరులతో అన్యాయం గా మాటలు పడి(( ఇవాళ మీ నాయకులు, పారిశ్రామిక వేత్తలు చేస్తున్న పనులే ఆనాటి ఆంధ్ర నాయకులు, పారిశ్రామిక వేత్తలు చేసివుండచ్చు )), కల్లబొల్లి హామీలతో ఆదాయపరంగా ఘోరంగా విభజింపబడి ఇవాళ దేశంలో అత్యంత పేద రాష్ట్రాలలో ఒకటిగా తయారవబోతున్న, జీతాలకు కూడా డబ్బులు లేని రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం ( పొరుగువాడి పంచన పడివుండాల్సిన దౌర్భాగ్యం ) గా తయారయిన పరిస్తితి చూసినాక కూడా మీలాంటి మేధావులే మా ప్రజల బాధ, దుఖం, అవమానం అర్ధం చేసుకోలేకపోతే సామాన్య తెలంగాణా ప్రజలు అర్ధం చేసుకుంటారని ఆశించడం నా అత్యాశే లేండి. అర్ధం చేసుకొని ఏం చెయ్యాలంటారని మీరడగవచ్చు. ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు.తెలంగాణా ప్రజలలో మామీద ( కొంతమంది పెంచి పోషించిన ) ఇన్నాళ్లూ వున్న దురభిప్రాయాలు తొలగిపోతే చాలు.
ReplyDeleteహరి బాబు గారు,
మీరేమన్నా జ్యోతిష్కులా ! ఇంత ఖచ్చితం గా నిన్నే చెప్పెసేరు ఇవ్వాల్టి అల్టిమేటం గురించి !!
జిలేబి
నిజమే,ఇవ్వాళ పేపర్లో చంద్రబాబు స్తేట్మెంటు చూసి నాకూ అదే అనిపించింది!వార్నీ సరిగ్గా పోష్టులో నేను వాడిన మాటలే వాడాదే అని.కానీ అందరిలోనూ అదే మాట కదుల్తుందేమో?
Deleteమీరు కోరుకున్నట్లే జరిగింది ఢిల్లీలో. చూద్దాం భాజపా ఇప్పటికైనా చేతలు మొదలిపెడుతుందో లేదో!
ReplyDeleteశిష్యుడు:శ్రీ గురుభ్యోన్నమః,అయ్యా గురువారూ మీ పోష్తు వుద్దేశం నెరవేరింది - ఆప్ వూడ్చి పారేసింది!భాజపా కంగు తిన్నది!కాంగ్రెసుకి ముఖమే చెల్లలేదు?
ReplyDeleteఉషశ్రీ:చూడు శిష్యా,నేను భాజపా గెలుపుని వతిరేకించటానికి పోస్టులో ఏపీ గొడవనే యెత్తినా యే ఒక్క పార్టీకీ అసలు ప్రతిపక్షమే లేని అప్రతిహతమయిన అధికారం వుండకూడదనేది అసలు వుద్దేశం!అప్పుడు జనాలకి అతను మంచి చేశాడు కానేఎ తిక్క యెక్కువై చెడ్డాడు.ఈసారి తిక్కగా వుండనటున్నాడుగా,చూద్దాం!
ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా వరకూ ఆలోచిస్తే యెంత గట్టిగా అడుగుతున్నా వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితే?యెందుకంటే వాస్తవంగా అక్కడి ఖజానా కూడా సరిగ్గా లేదు!ఏపీకి ఇస్తానన్న అమరుక్షణం మాకూ కావాలని అడిగే వాళ్ళు పదిమంది వున్నారు,అందులో తెలంగాణా కూడా ఒకటి.
శిష్యుడు:గురువు గారూ యెటూ ప్రస్తావన వచ్చింది గాబట్టి ఆ తెవాద మూర్ఖులకి ఓ నాలుగక్షింతలు వేద్దురూ - వీళ్ళ కాకిగోల భరించలేకుండా వున్నాం!
ఉషశ్రీ:వస్తున్నా,వస్తున్నా అక్కడికే వస్తున్నా !తెలంగాణా మిత్రులకి చెప్పాల్సింది ఒకటుంది.మిగతా రాష్ట్రాల గురించి వొదిలేసి మన రెండు రాష్ట్రాలకి సంబంధించినంత వరకూ ఆంధ్రాలో తెదెపా సహకారం వున్నా సొంత బలాన్ని పెంచుకునేటందుకు అవసరమైన పునాది లేదు.అదే తెలంగాణాలో హిందూ వోట్లని నికరంగా కాపాడుకుంటూనే హైదరాబాదు ముస్లిములలఓ కూడా బలం పెంచుకునేతందుకు ప్రయత్నిస్తుంది.అన్ని చోట్లా చేసినట్తే ముస్లిముల్ని శత్రుత్వంతో గాకుండా పాజిటివ్ యెత్తుగడతొనే వెళ్తుంది,మతకలహాలు రగిలించే మూర్ఖపు దారిలో వెళ్ళదు.భాజపాని ఆ దారిలో వెళ్ళనివ్వకుండా ఆపాలనే కేసీఆర్ నిజామౌని పొగడ్డం లాంటివి చేస్తున్నాడు!
ఆ రకంగా భాజపా ఆంధ్రాకి మాత్రమే ఇచ్చి వూరుకోదు.మీరిప్పుడు కాస్త ప్రశాంతంగా వుండి ఆంధ్రాకి ఇవ్వగానే మాకూ కావాలి అని అడిగితే మీకూ రావొచ్చు.వాస్తవంగా చూస్తే చంద్రబాబు తెలివిలో కొంచెం కేసీఆర్ కన్నా వీక్ అయినా అనుభవం,పాత పరిచయాలు వీటితో కొట్టుకొస్తున్నాడు.సొంతానికి సేఫ్ గార్డ్స్ యేర్పరచుకోవడంలో కేసీఆర్ అఖండుడు!కాబట్టి తెలంగాణాకి కూడా ప్రమాదం యేమీ లేదు.మీరూ కంగారు పడకుండా ఇంకా మమ్మల్ని ఆడిపోసుకోకుండా ఆంధ్రాకి వచ్చేదీ రానిదీ చూసి మీరు చెయ్యగలిగినది మీరూ చేసుకోండి!
స్వస్తి!
An interview with Sudharani, the woman farmer who has become a cause of worry for TDP
ReplyDeletehttp://www.thenewsminute.com/lives/746