Saturday, 28 February 2015

ఔరా అయిలయ్య మాస్టారూ!యేమి చెప్పినారు సారూ?

          కొందరి మాటలు వింటుంటే యెంత మంచిగా కనిపిస్తున్నా బండబూతులు తిట్టబుద్దేస్తుంది!కొందరి మాటలు వింటుంటే యెంత వెధవలా కనిపిస్తున్నా ముద్దెట్టుకోవాలనిపిస్తుంది?కానీ కంచె ఐలయ్య మాస్టారు వున్నారే ఈయన్ని మాత్రం ఒకేసారి రెండూ చెయ్యాలనిపిస్తుంది?!మన్లో మన మాట, చూట్టానికి వెధవలా కాకుండా జీనియస్ లాగానే కనపడతాడు లెండి!

          ఇవ్వాళ ఆంధ్రజ్యొతి డైలీలో "అమ్ముడుద్యమం" అని ఒక వ్యాసం రాశాడు,రెండు రాష్ట్రాల్లోని తెలుగు వాళ్ళూ తప్పకుండా చదవాల్సినది!నేను గతంలో ఒకసారి ఈయన్ని గురించే చాలా ఘాటుగా రెండు పోష్టులు వేశాను,కాకపోతే నాకు ఆయనంటే ద్వేషముండి కాక అప్పుదు ఆయన చెప్పిన పాయింటు చెత్తగా అనిపించటం వల్ల ఆ తప్పునే పట్టాను తప్ప ఆయన విశ్లేషణ లన్నీ చాలా శ్రధ్ధగా చదివే వాణ్ణి మొదటి నుంచీ!

          "బ్రాహ్మణ సంస్కృతిని విమర్శించడానికి హేతువాది నంటాడు,బ్రాహ్మణీకపు హిందువులు  మతం పేరుతో గుడిగోపురాలు కట్టి యెన్నో దుర్మార్గాలు చేశారంటాడు,తన కులపోడికి స్మారక భవనం కడితే మాత్రం సమ్మగా వుంది ఈ హేతువాదికి?!పాముల నెందుకండీ రెండు నాల్కల విషజంతువులని తిడతాం,పాపం?!" అనే నా పాయింటు కరెక్టే గాబట్టి విమర్శించినందుకు పశ్చాత్తాపం యేమీ లేదు గానీ వ్యక్తిగతంగా నాకు ఆయనంటే ద్వేషం మాత్రం యెప్పుడూ లేదు.

          ఆయన వాడే పదాలూ ఆ పదాల వెనక క్రమంగా పేర్చుకొస్తున్న భావం నిజంగా నెమ్మది నెమ్మదిగా యెక్కి యెక్కేటప్పుడు కాస్త ఇబ్బంది పెట్టినా తట్టుకుంటే రోగం పూర్తిగా కుదిర్చే ఇంట్రావీనస్ ఇంజెక్షన్ నరాల్లోకి జరజర పాకుతున్నట్టుంటుంది చదువుతుంటేనే!కులం అనే అస్తిత్వం ఆసేతుశీతనగం భారత ప్రజానీకంలో యెంత ప్రముఖ పాత్ర వహిస్తున్నదో ఈయనకి తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదేమో?మోదీ గుజరాతు ముఖ్యమంత్రి అయిన కొత్తల్లోనే భవిష్యత్తులో ప్రధాన మంత్రి అవుతాడని జోస్యం చెప్పాడు ఆధారాలూ లెక్కలతో సహా!

          ఆంధ్రప్రదేశ్ రాష్త్ర విభజన కోసం జరిగిన వుద్యమం లోని డొల్లతనాన్నీ విభజనాంతరం తెలంగాణంలో నడుస్తున్న నాటకాన్నీ ఒక సుప్రీం కోర్టు జడ్జి అప్పీలుకి కూడా వీలు లేకుండా ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంటు లాగ చెప్పాడు!"ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన వృధ్ధిరేటు గణాంకాలు 2012-2013 సంవత్సరం కంటే ఆ జిల్లాల్లో 2014-2015ల్లో బాగా పెరిగింది అని తేల్చాయి. తెలంగాణ అభివృధ్ధి పరిస్థితి ఏందో ఇక్కడి ప్రభుత్వం చెప్పడం లేదు.కామన్ సెన్సు వున్న ఎవరికయినా అర్ధమయ్యేదేమిటంటే  2013-2014 సంవత్సరం కంటే 2013-2014 అభివృధ్ధి రేటు తెలంగాణలో బాగా తగ్గింది.గత రెండు సంవత్సరాల్లో హైదరాబాద్ ఇండస్ట్రియల్ కీలక ఉత్పత్తి సంస్థలు పూణే,బెంగుళూరు వంటి చోట్లకి తరలి పోయాయి"

          మచ్చుకి ఒక గొప్ప సుభాషితం - "పెట్టుబడిని కోపం వచ్చినప్పుడు తిట్టి,అవసరం వచ్చినప్పుడు పొగిడితే అది తిట్టినప్పుదు వెళ్ళిపోయి పొగిడినప్పుడు తిరిగి రాదు. రాజకీయ,ఆర్ధిక రంగాలు పగటి భాగోతాలు కావు కదా!అల్పుడెపుడు పల్కు ఆడంబరము గాను అని వూరికే అన్నారా?ఆ మనిషి అట్లా గాలి పోగేసి మాట్లాడుతుంటే, ఆ మాటలు కూడా విన్నవాళ్ళు ముఖ్యమంత్రి గదా అని ముఖం మీద నవ్వకుండా సీరియస్సుగా వింటున్నట్టు నటించి పక్కకెళ్ళి నవ్వుకునేలా వుంటే  ఆయన గారి వీరభిమానులు మాత్రం "మా ముఖ్యమంత్రి యెంత తెలివిగా మాట్లాడుతున్నాడో చూడండి,అంతా యెంత నిశ్శబ్దంగా చెవులొగ్గి వింటున్నారో చూడండి"  అని పులకించి పోతున్నారు!

  మరో అద్భుతమయిన పరిశీలన యెంత నిక్కచ్చిగా విశ్లేషించి చెప్పాడో వినండి - "నేను చాలా కాలంగా తెలంగాణ ఫ్యూడలిజానికి అభివృధ్ధి కాముక అడ్మినిస్ట్రేటివ్ విలువలు లేవని చెప్పింది ఈ లక్షణా లన్నిటినీ దృష్టిలో పెట్టుకునే. పెట్టుబడికి కొనుక్కునే లక్షణం ఉంటే ఫ్యూడలిజానికి అమ్ముకునే లక్షణం ఉంటుంది." ఏమి పోటు పొడిచారు మాస్టారూ!ఇదే ముక్క ఆంధ్రజ్యొతి రాస్తే "పచ్చ మీడియా విషం కక్కుడు" అని పేరు పెట్టి బూకరించేసేవాళ్ళు వందిమాగధులు?

          "తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టటాన్ని దేశ స్వాతంత్ర్యంతో పోల్చారు.విడిపోవాలా వద్దా అనే అంశంపై ఒక రెఫరెండం వంటిది పెట్టి శాంతియుత వాతావరణంలో చర్చ జరక్కుండా చేశారు.ఇప్పుడు రాష్ట్రం రాగానే సంవత్సరం కూడా తిరక్కముందే భూములు,బంగ్లాలు,చెరువులు,సెక్రటేరియట్ సహా అమ్మితే తప్ప వ్యవస్థను నడుపలేమని తేలుస్తున్నారు." - నేను ఈ ముక్కకి దగ్గిరగా వుండే మాట ఒకటి భవిష్యత్తులో నిజంగా అలాగే జరిగిన యెంతో వాస్తవికమైన ఆధారాలతో ఒపిగ్గా పాయింట్ బై పాయింట్ చెప్తూ ఒక విశ్లేషణ వుద్యమ సమయంలోనే "ధర్మమేవ జయతే" బ్లాగులో వేస్తే ఆ కామెంటు పబ్లిష్ చెయ్యనేలేదు, అడ్మిన్ హోదాలో చదివినా ఆ లాజిక్ అర్ధమవలేదో,అర్ధమయినా తొక్కలే ఇలాంటివి చాలా విన్నాం అనుకున్నారో?! "ఆర్టికిల్ మూడు వుంది కదా అని మీరు మొండిగా అటువైపుకే వెళ్తున్నారు తప్ప దాని పరిణామాలు యేమిటో తెలుసుకోవడం లేదు.ఆఖరికి ఆంధ్రా పొలిటీషియన్లని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు,వాళ్ళు అడ్డం తిరిగి ఈ విభజన మాకు ఇష్టం లేకుండా జరుగుతున్నది గాబట్టి మాకు ఎక్స్ట్రా తాయిలాలు కావాలని అడిగి సాధించుకుంటూ మిమ్మల్ని కార్నర్ చేసినా చేస్తారు.ఆఖరి నిముషం వరకూ అసలు తెలంగాణా వస్తుందా రాదా అనే టెన్షన్ పుట్టించి యేదో ఒక విధంగా వస్తే చాలుననే స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళదం ద్వారా మీకు అన్యాయం జరగవచ్చు,కొంచెం నిదానంగా ఆలోచించండి, సయోధ్యగా ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపాదించి జరిగే చర్చల ద్వారా సాధిస్తేనే మీకు మంచిది" అని వివరంగా చెప్పాను!యెంత సేపూ మేమిక్కడ అంకెకి తక్కువున్నాం, మా మాట ఇక్కడ నెగ్గదు అనే పిడివాదమే తప్ప ఒకడు బలమయిన పాయింటుతో వస్తే వందమందినైనా నోరు మూయించ వచ్చు, అక్కడ అన్యాయమే జరిగితే ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నాయి కదా ఆప్పుడే ప్రజలకి ఇదిగో యెంత దుర్మార్గంగా వున్నారో చూడండని వుద్యమాన్ని ఇంకా బలోపేతం చెయ్యవచ్చు అనే సూటి దారి గురించి ఒక్కడు కూడా ఆలోచించ లేదు?

          ఆయన గారు ఆర్టికిల్ మూడు+విలీనం ఒప్పందం అనే దగుల్బాజీ ప్లానుతో వచ్చి మిగతా వాళ్ళు "అట్లెట్ల వస్తది?" అంటే "ఇట్లిట్లె వస్తది!" అని చెప్పిన తెచ్చిన అని డప్పు కొట్టుకోవటం, వీళ్ళు ఆయనకి పల్లకీలు మొయ్యటం తప్ప చక్కని రాజమార్గం వొదిలి సందుగొందులు తిరిగి బంగారు తెలంగాణ మంటూ కంగారు తెలంగాణ తెచ్చుకున్నరు?23 జిల్లాలకి వేసిన లక్ష కోట్ల బడ్జెట్ 10 జిల్లాలకి వేశాడు!నికర ఆదాయం 6000 కోట్లు మాత్రమే అని అధికారికంగానే చెప్తున్నాడు?అది కూడా ఈ భూముల అమ్మకం ద్వారానే అట!ఇంతకీ అధికారులు నిక్కచ్చిగా లిటిగేషన్లు లేని భూమి యెంత అని ఆరా తీస్తే,జాగ్రత్తగా వినండి - కేవలం 9 యెకరాలే?!వాటిని వేలం వేస్తారట,బాబోయ్ ఆర్ధిక శాస్త్రంలో బేసిక్స్ కూడా తెలియని నాకే గుండె గుభేలు మంటున్నది మిగతా లోటు యెలా పూడుతుంది అని, కానీ ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి వీరభక్తులలో మాత్రం చీమ కుట్టినంత కదలిక కూడా లేదు. భవిష్యత్తు గురించి సరయిన అవగాహన లేని అజ్ఞానం లోనూ యేది యేమయినా సరే అది లేందే బతకలేననే స్థాయిలో ఒక దానిపట్ల కలిగే అమిత వ్యామోహం లోనూ ఒక వ్యక్తి పట్ల విపరీత స్థాయిలో వుండే ఆరాధన లోనూ అంత ధీమా వుంటుంది గాబోలు! పోనీ హడావిడి చేసి అన్ని దేశాలూ తిరిగి పెట్టుబడులు సాధించుకొచ్చాడా నిబ్బరంగా వుండటానికి అంటే ఒకే ఒక్కసారి సింగపూరు వెళ్ళాడు - అదీ వాళ్ళు తోడుగా వస్తామని అన్నా వొద్దని రోడ్డు మీద కారులో రయ్యిమని దూసుకుంటూ వెళ్ళి బిల్డింగుల్ని బయటి నుంచి చూసే సమస్తం గ్రహించేసి ఇక్కడ పెద్ద ట్రావెలాగ్ పురాణం విప్పాడు తప్ప యెంత స్థాయిలో పెట్టుబడులు తెచ్చాడు అనే లెక్క మాత్రం యెవరికీ తెలియదు!లోతుగా వెళ్ళకుండా పైపైన చూసినా కనపడే అంత పెద్ద బొక్క యెట్టా పూడుద్ది, ఆదాయం యెక్కణ్ణుంచి వచ్చుద్ది? తన సొంత మొక్కులూ ప్రభుత్వ ఆదాయంలోనే తీర్చాలి,అల్లుడు శీను చెప్పిన 200 సంక్షేమ పధకాలకీ దాంట్లోంచే వెసులుబాటు చెయ్యాలి, హుస్సేను సాగర్ దగ్గిర్నుంచీ కాకతీయ పధకం కింద రాష్త్రంలో వున్న చెరువుల్ని బాగు చెయ్యటానికీ అందులోంచే సర్దాలి.అడగని వాడిది పాపమన్నట్టు వాగ్దానాలు చేసిన భవంతులకి పదేసి కోట్లూ అందులోంచే సర్దాలి - యేంటండీ ఇదంతా!

          "ఉన్న వనరుల్లో ఉద్యోగులకు,ఆర్గనైజ్డ్ సంస్థలకు అడిగినవన్నీ ఇచ్చుకుంటూ పోతున్నాడు" అని ఇప్పుదు విమర్శించే ఐలయ్య గారే తన కులభవనానికి ఇచ్చినప్పుదు మాత్రం "మంచి పని చేసిండు!" అని ఆకాశాని కెత్తడం చూస్తుంటే చాలా ముచ్చటగా వుంది నాకు?బ్రాహ్మణ వర్గం వాళ్ళు అస్పృశ్యతనీ వాళ్ళ దేవుళ్ళనీ మామీద రుద్దారు అని తను క్రైస్తవ మతంలో వుండి కూడా తన తాత దేవుడై హిందూ ఆచారం ప్రకారం చిన్నప్పుడు తన అమ్మ అక్కడ తలనీలాలు తియించడం గురించి గొప్పగా చెప్పుకుని ఆయన తాత పేరు పెట్టుకున్న వాళ్ళని మంచోళ్ళనీ అలా పెట్టుకోకుండా "గణపతి" అనే సమూహానికి అధిపతి అనే అర్ధం వచ్చే పేరుని పెట్ట్టుకున్న మావోఇష్టుకి కూడా అగ్రకుల దురాంకారం అంటగట్టిన తన స్వభావం కూడా ఆ ఫ్యూడల్ సంస్కృతినే ప్రతిబింబిస్తున్నదని తనలోకి చూసుకునే అలవాటు లేకపోవడం వల్ల తనకి తెలియక పోవచ్చు గానీ చూస్తున్న మనం గుర్తు పట్టలేమా!

          ఒక వెలమ ఫ్యూడలిష్టుని ఒక దళిత ఫ్యూడలిష్టు విమర్శిస్తున్నాడు,మజ్జారే!?పరులెవ్వరైన ఇంత ధాటిగ విమర్శించ గలరా, నిస్సీ?!అందుకే కాబోలు దానవీరశూరకర్ణ సైన్మలో ధూళ్ళిపాళ్ళ మావయ్య "వజ్రాన్ని వజ్రంతొనే ఖోయవలె,ముల్లును ముల్లుతోనే థీయవలె" అని అంత ఘట్టిగా నొక్కి వఖ్ఖాండ్రించాడు!వీళ్ళిద్దరే కాదండి తెలంగాణంలో చిన్నా పెద్దా కత్తీ సుత్తీ డక్కా డవాలు అతిఘోర వుద్యమ నేతల్లో చాలామంది ఫ్యూడలిష్టు మనస్తత్వంలో వున్నవాళ్ళే!అది మనస్తత్వం అని లెక్కేసుకుంటే ఆర్ధిక అంతరువులతో సంబంధం లేకుండా యెవరిలోనైనా వుండొచ్చు - అవునా కాదా?ఈ రెండు రాష్ట్రాలూ యేర్పడిన కొత్తల్లొనే ఒక బ్లాగులో జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్ రాష్త్రానికి కొత్తగా అమిరిన 24X7 ప్లాను కేవలం ప్రతిపాదన వచ్చాక మొదటి వాయిదా లోనే చాన్సు ఇవ్వటం తప్ప బాబు పైరవీ వల్ల రాలేదు అనే పాయింటు మీద ఒకానొక చారిగారు ఆధారాల కోసం,లింకుల కోసం వెంటపడి వేధించి మళ్ళీ వాటిని వెతికి చూపించే వరకూ యెదటి వాళ్ళని అంటే మమ్మల్ని యెంత హింస పెట్టాడో మళ్ళీ తన కామెంటుకి సంబంధించి నిలదీస్తే మా ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి అట్లా అన్నాడు, యెవరూ ఖండించ లేదు గాబట్టి అది నిజమే అనేసుకోండి,నా దగ్గిర అంతకన్నా ఆధారాలు లేవు అని అంత నిర్లక్ష్యంగా జవాబు చెప్పడం పెత్తందారీ తనం కాదా!సాక్ష్యానికి ఈ వుదాహరణ చెప్పానే గానీ ఐలయ్య గారి వాదన ప్రకారం ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి ఫ్యూడలిష్టు అయితే అతన్ని తమకి అభేదంగా చూసుకుంటూ అభిమానించే వాళ్ళు ఫ్యూడలిష్టులు కాకుండా వుంటారా?

          అసలు గతంలో ప్రామాణిక తెలుగు గురించి ప్రస్తావన రాగానే కాళోజీ దగ్గిర్నుంచి అందరూ "ఆ రెండున్నర జిల్లాలోళ్ళు ఆ రెండున్నర జిల్లాల భాష రుద్దుదమని చూస్తున్రు" అని యెగ్గెగ్గెరి గంతులేసి దాన్ని చెగొట్టేశారు!కృష్ణా గోదావరి జిల్లాల వాళ్ళకి తమ మాండలికం మీద ప్రేమ లేకనా దాన్ని ప్రతిపాదించింది?తెలంగాణ లోనే యే రెండు జిల్లాల వాళ్ళూ తమ శుధ్ధ మాండలికంలోనే మాట్లాదల్చుకుంటే ఒకడు చెప్పింది మరొకడికి పూర్తిగా అర్ధమవుతుందా?సరే అప్పటి విషయం పోనివ్వండి, ఇప్పుడు అందెశ్రీ గారు రాసిన వాళ్ళ రాష్ట్ర గీతం ఆ శుధ్ధాంధ్రంలోనే యెందుకు వుండింది?నాకు మాత్రం దెంచనాల శ్రీనివాస్ గారు రాసిన భస్మ సారంగి కవిత అయితే తెలంగాణ సామాన్య ప్రజల గురించి అద్భుతంగా కీర్తించడం వల్ల ఇప్పటిదాని కన్నా గొప్పగా వుండేదనిపించింది!పోనివ్వండి వాళ్ళిష్టం మన కెందుకొచ్చిన గోల?కానీ మా అంతట మాకు తోస్తే తప్ప నువ్వు చెప్తే మేము వినాలా అని గాకపోతే అప్పుడు ప్రస్తావించిందీ ఇదే గదా!

     ఇంకా ఘోరమయిన విషయ మేంటో తెలుసా?"ఆంధ్రప్రదెశ్ సమైక్య రాష్ట్రంగా యేర్పడ్డాక నీలం సంజీవరెడ్డి,కాసు బ్రహ్మానంద రెడ్డి నుంచి మొదలుకొని ఎన్.టి.రామారావు వరకూ. మనమెవరినైతే ఆంధ్ర దోపిడీ ముఖ్యమంత్రులని తిట్టామో వాళ్ళు హైదరాబాదులో ఒక్క ప్రభుత్వ బంగ్లానంటే ఒక్కదాన్ని కూడా అమ్మిన దాఖలాలు లేవు.చివరికి నిజాము ఇంటిగా ఉన్న కింగ్ కోఠీ బంగ్లా ఆ రోజుల్లో అమ్మాలంటే,ఆనాటి విలువతో పోలిస్తే చాలా డబ్బే వచ్చేది.కాని వాళ్ళు అమ్మలేదు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదేళ్ళలో ఇక్కడ ఉండదు.సెక్రటేరియట్లో ఎన్నో పెద్ద పెద్ద బంగ్లాలు ఖాళీగా ఉంటాయి.పది జిల్లాల తెలంగాణ ప్రభుత్వం ఆ బంగ్లాల్లో క్రికెట్ ఆడుకునేంత స్థలం ఉంటుంది.వాటన్నిటికీ వాస్తు బాగలేదని చెప్పిస్తారు.అమ్మకానికి పెడతారు.గిదే ఫ్యూల్ తెలంగాణ పాలక వర్గం.ఇప్పుడు వాస్తు బాగుండదు.రేపు దయ్యం పడుతుంది." అంటున్నాడు ఐలయ్య గారు!నేనింకా మొదట్లో అమాయకంగా కొద్ది మందికి అంత పెద్ద భవనం దేనికని అనుకున్నాడేమోలే ఒఖప్పుడు 23 జిల్లాల జనం కళకళ్ళాడుతూ తిరిగిన చోట 10 జిల్లాల జనం తిరుగుతూ బోసిపోయినట్టుండి బెంగగా అనిపించి పాతరోజులు గుర్తుకొస్తాయని ఇబ్బంది పడి మారుస్తున్నాడేమో ననుకున్నా,పిచ్చి పుల్లయ్యని!

          ఈ ఆమ్మకాల ప్లాను వెనక వున్న జ్వాలాదీప రహస్యం కూడా చక్కగా విప్పి చెప్పాడు!"యెన్నికల్లో టి.ఆర్.ఎస్ పార్టీ ప్రతి దళిత కుటుంబానికీ మూడెకరాల భూమి,ప్రతి బీద కుటుంబానికి(దళిత,దళితేతర) ఒక రెండు గదుల ఇల్లు,ప్రతి పించను దారుకు నెలకి 100 రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేసింది.ఇవి ఇస్తామని నమ్మించాలంటే ఆదాయం లేకపోయినా పెద్ద బడ్జెట్ పెట్టాలి.అందులో చాలా లోటు చూపెట్టాలి.లోటు తీర్చడానికి భూములమ్మాలి.తెలంగాణలో ప్రజల ఉనికి,అభివృధ్ధి,ప్రజా సంక్షేమం కొత్తకోణం నుండి జరుగాలంటే నగర నడిబొడ్డు ఆస్తులు అమ్మడం తెలంగాణ ప్రజల కోసమే అంటే ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఉన్నారు,ఇంకొంత కాలం ఉంటారు.ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి లక్షకోట్ల బడ్జెట్ పెట్టి అంత డబ్బు వస్తుందని చూపించదానికి ఆయన ప్రభుత్వ భూముల్ని హైదరాబాద్ నడిబొడ్డులో వేలం వేసి ఆర్టిఫిషియల్ కొనుగోళ్ళు చేయించి దానితో ఒక రియల్ ఎస్టేట్ బూం సృష్టించారు.రామలింగరాజు కొంప ఆ బూంలో మునిగిందే.అదే మోడల్ లో ఇంత చిన్న రాష్ట్రానికి అంత పెద్ద బడ్జెట్ పెట్టి రూ.6000 కోట్లు భూములమ్మడం ద్వారా రాబడతామని అధికారులకు అమ్మక భూములు వెతికి పట్టుకోండి అని ఆదేశిస్తే లిటిగేషన్ లేని భూములు దాదాపు 9 ఎకరాల వరకు మాత్రమే ఉన్నదని తేలిందట."యేమి ప్లాను,యేమి ప్లాను - అయ్యబాబోయ్!ఐలయ్య ఒక్కడే కాదు గదా చాలామంది ముందునుంచీ విమర్సిస్తున్నారు, అయునా అటువైపు నుంచి సమర్ధన రావడం లేదేంటి ఇంకా?యేం చెబుతారు!బహుశా మమ్మల్నిట్లా భూములమ్ముకునే స్థితికి తీసుకెళ్ళింది ఆంధ్రోళ్ళే,ఇప్పుడు మా తంటాలు మేం పడుతుంటే గోల చేసి అది కూడా చెయ్యనివ్వడం లేదని అంటారేమో?అధికారంలో ఉండి ఉత్త మాటలు చెప్పకుండా లెక్కల్ని పుట్టిస్తున్నారేమో!

          "ఆంధ్రప్రదేశ్,తెలంగాణ మధ్య ఇప్పుడు తేడా యేమంటే విడిపోతే బాగుపడతామని ప్రజలకు తెలంగాణ వాదులు చెప్పారు.ఆంధ్ర అభిమానులు విడిపోతే చెడిపోతామని ప్రజలకు చెప్పారు.విభజన జరిగిన మొదటి సంవత్సరంలోనే తెలంగాణ ప్రభుత్వం అమ్ముడుద్యమం మొదలెట్టింది.ఆంధ్ర ప్రభుత్వం ప్రపంచమంతా తిరిగి పెట్టుబడుల గుడ్ విల్ సమీకరించే స్థితిలో ఉన్నది.కాని తెలంగాణ రాష్ట్రానికి ఆదుకునే గుడ్ విల్ కూడా లేదు." - గుడ్డు విల్లు యెట్టా ఉంటుంది? ఇట్టాగే కావాలని యెట్టా రప్పించుకుందామని అనుకున్నారో అట్టానే వొచ్చింది! ఆంధ్రోళ్ళకి వాళ్ళని మట్లాడనివ్వకుండా ఇచ్చేశారనిపించి జాలితో కూడిన మంచిపేరూ తెలంగాణోళ్ళకి హైదరాబాదు వాటాలో కనీసం న్యాయమైన వాటా కూడా ఇవ్వకుండా ఆంధ్రోళ్ళని తన్ని తగిలేశారనే పొగరు లాంటి చెడ్డపేరూ వొచ్చింది?!భగవంతుడు ఇప్పటి నవ్యాంధ్ర ప్రజల పట్ల యెంతటి దయ చూపించాడు!వీళ్ళిప్పుడు వాళ్ళంతట వాళ్ళు ఇంత గొడవ చేసి విడిపోకపోయుంటే అనంతకాలం వరకూ వీళ్ళతో యెన్ని అగచాట్లు పడుతూ ఉండేవాళ్ళమో గదా!

          జరీబు భూములకి పరిహారం పెంచి రాజధానికి భూములు ఇవ్వం అని ఇప్పటిదాకా బిగిసిపోయి వున్నవాళ్లని కూడా మెత్తబడేటట్టు చేస్తున్నాడు ఇప్పటి ఆంధ్రప్రదెశ్ ముఖ్యమంత్రి. జూన్ నెలలో కొత్త రాజధానికి శంకుస్థాపన ఖాయం అంటున్నారు.పచ్చని పంటపొలాలు మనకున్నాయి.మన మనసుల్లో కష్టించే తత్వముంది.మన బుధ్ధిలో చురుకుదనముంది."జోర్ సెయ్. బారు సెయ్.కోటిపల్లి రేవుకెయ్.కోనంగి రేవుకెయ్"  అనే హుషారైన పాటలు మళ్ళీ వినబడతాయి, అద్దిర బన్నా గువ్వల చెన్నా!


దుష్టాంగం దానంతటదే వూడిపోవటం యెంత అదృష్టం?!

21 comments:

  1. ఇది మీ హరి కాలం లో ఎలాగూ ప్రచురించరు కానీ, మీ సమాచారం కోసం చెప్తున్నా.... దుష్టాంగం కోసం నాలుగు సంవత్సరాలుగా డేరా ల్లో కూర్చొని కుట్రలు ఎందుకు పన్నారు? మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి అని 60 సంవత్సరాలుగా మొత్తుకున్నా మరి ఆ దుష్టాంగాన్ని ఎందుకు ఊడిపోకుండా కాపాడుకున్నారు? ఇప్పుడు మళ్ళీ అంతులేని కుళ్ళు ఎందుకు కక్కుతున్నారు? మీకు సంబందించినది ఏది ఈ రాష్ట్రం లో లేదు కదా... పక్క వాడి జోలి మీకు ఎందుకు? పక్క రాష్ట్రాల మీద పడి ఏడవడానికి మీకు ఇంకా 27 రాష్ట్రాలు వున్నాయి కదా... మీ ఏడుపుగొట్టు, కళ్ళూ ను వాటిమీద చూపెట్టరా?

    ReplyDelete
    Replies
    1. @KIRAN KUMAR
      ఆ పైన విమర్శించిన పెద్దాయన ఎలంగాణా ప్రాంతీయుడే కదా! దాన్ని రిపీట్ చెయ్యటం,ఆయన అభిప్రాయాలతో సారూప్యం వున్న వాటీని చెప్పటం తప్ప కొత్తగా యేమయినా పులిమానా?

      మీరు చరిత్ర సరిగా చదవరనుకుంటాను.అప్పటి తెలంగాణా అసెంబ్లీలోయేకగ్రీవ తీర్మానం జరిపించి కలిశారు మీవాళ్ళు!

      దండకారణ్యం జోనులో ఇప్పుదు మావోఇష్టులు అని పిల్చుకుంటున్న నక్సలైట్ల తాకిడి తెలంగాణా ప్రాంతానికి యెక్కువ గనక కమ్యునిష్టుల ప్రాబల్యాన్ని అడ్డుకోవటం కోసం అక్కడా ఇక్కడా కాంగ్రెసు వాళ్ళే గాబట్టి పై స్థాయిలో ఒప్పందాలు చేసుకుని కల్పేశారు. తాము చేసుకున్న ఒప్పందాల పట్ల గట్టిగా వుండక పోవటం లోపాయకారీ రాజకీయాలతో తెలంగాణా వెనకబడిపోతున్నా సొంత గొప్పలే ముఖ్యమనుకోవటం చేసి మిమ్మల్ని దద్దమ్మల్ని చేసింది మీరు నమ్మిన మీ నాయకులే.ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అన్యాయం చేస్తున్నదీ మీ ముఖ్యమంత్రే!

      కామెంట్లకి మోడరేషన్ లేదు గాబట్టి దానంతటదే కనపడుతుంది.నేను ఇంతవరకూ మరీ విసుగు తెప్పించిన ఒకటి రెండు కామెంట్లని మాత్రమే తీసేశాను.వ్యతిరేకాభిప్రాయం వస్తేనే వుద్యమ ద్రోహి,తెలంగాణా ద్రోహి అని తన్ని కూడా నోరు మూయించారు,అవునా కాదా?

      ర్రెఫెరెండం పెట్టి వుంటే తెలంగాణా ప్రజలు కూడా విభజనకి వ్యతిరేకంగా వోటు చహేసి వుండేవాళ్ళేమో?ఆ భయంతోనే కదా ఆర్టికిల్ మూడు+విలీనం ఒప్పనదం ప్లాను వేసింది.

      Delete
    2. కిరణ్ కుమార్ గారు,

      ఒకవైపు అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టారు అంటూనే మరో వైపు దుష్టాంగం పోయినందుకు సంతోషిద్దాం అనుకోవడం వీరికే చెల్లింది.

      విభజించిన కాంగ్రేసును నానా శాపనార్థాలు పెడుతూనే, విభజించడం మాకే లాభం అనడం వీరికే చెల్లింది.

      దుష్టాంగాన్ని పంపినందుకు ఏడాది కిందనే మరో వైపు వారు పండగ చేసుకున్నాక ఇప్పుడు పాపం, తప్పడం లేనట్టుంది వీరికి!

      ఒకవైపు బీద రాష్ట్రం అంటూ లబలబలాడుతూ కేంద్రాన్ని దేబిరిస్తూనే, మరో వైపు మా వృద్ధి రేటు అత్యధికం అని చెప్పుకోవడమూ వీరికే చెల్లింది!

      ఒకవైపు సవాలక్ష కారణాలపై ఐలయ్యను తిడుతూనే, ఆయన తెలంగాణా నాయకత్వాన్ని తిట్టగానే ఎగేసుకుంటూ వచ్చి ఆయన మాటల్లో (తమకు) పనికొచ్చే విషయాలు ఏరుకుని మురిసిపోవడమూ వీరికే చెల్లుతుంది!

      హరి గారికి రాయడంలో నైపుణ్యం వుంది, కాని తెలంగాణా పై అకారణ ద్వేషం ఈయన్ని ఈయన రాతలను మసక బారుస్తున్నట్టు అనిపిస్తోంది!

      Delete
    3. ఐలయ్య గార్ని ఒకే ఒక్క పాయింటు మీద విమర్శించాను.అది స్పష్టంగానే చెప్పాను.అది తప్ప్ప మిగిలిన అన్ని విషయాల్లో ఆయన పట్ల నాకు గౌరవమే వుంది!నా మొదటి బ్లాగు పోష్టు నుంచి యెక్కడా ఒక మాటకీ మరో మాటకీ వైరుధ్యం లేదు.ఇక ముందు కూడా వుండదు.భస్మ సారంగి గూరించి వూరికే ప్రస్తావించ లేదు.అది నాకు కంఠగతమయింది."రైటా రాంగా జగజ్జననీ","చెట్టెక్కిన మీసం పంచెల మగ రుద్రమ దేవి","బావల బాడిశెలనుంచి మొగుణ్ణి కాపాడుకున్నవా సావిత్రి","కాశిం రజ్వి కన్నేసిన కమ్మరి స్వర్ణ సుందరి","కరువు కరక లిరిగి వులి బాడిస్ చేత బట్టి వూళ్ళు వూళ్ళు దిరిగిన మైకలాంజిలో","నా అదృశ్య మాధురీ దీక్షిత్","నందినై కూర్చున్న నేను ప్రానలింగమై కూర్చుండు నాన్న అమ్మ గర్భాత్మ వొడిలోనే" అనే అద్భుతమయిన చరణాలలో ఆయన చూపించిన తెలంగాణ ప్రజానీకం నాకెప్పుడూ ఇష్టమే!

      నా పబ్లిష్ కాని ఆనాటి సలహాలో మీకు ద్వేషం కనిపించిందా?ఇవ్వాళ ఇంత జరుగుతున్నా తమ బాగు కోసం సాధించుకున్న తెలంగాణాని ప్రభుత్వంలో వున్నవాళ్ళే దోచేస్తున్నా కన్ను తెరవరేమి టన్న ఆందోళన కనబడ లేదా?అయిలయ్య గారు పేరు చెప్పక పోయినా అది ప్రొఫెసర్ కోదడ రాం గారి గురించే ననై అర్ధమవడం లేదా?స్పందించరేమిటి అనే ఆశ్చర్యంలో కూడా కుళ్ళుమోతు తనమే కంపించిందా!
      P.S:నాకు పనికొచ్చేవి అని చెప్పడానికి అసలు దానికి తేడాగా వుండవి యేమయినా ఆయన చెప్పాడా?లిను ఇచ్చాను గదా,మొత్తం అంతా ఇక్కడ యెత్తుకోవడం దేనికని వొదిలేసినవి చాలా వున్నాయిగా!

      Delete
    4. ఐలయ్య గారి "Why I am not a Hindu" అన్న పుస్తకంతో, ఆయన అందులో రామాయణం గురించి, భారతం గురించీ గీత గురించీ రాసిన విషయాలతో ఏకీభవిస్తారా?

      Delete
    5. చెప్పినానా ఈ batch కామెంట్ కింతని, అందుకే పోస్ట్ లో ఎమున్నాసరే ఎయ్యోక నాలుగు ముక్కలు రాసుడు పని చేస్తరు అని? పోస్ట్ మొదట్లో మూడు పేరాలు చదివితే ఎవడు మళ్ళీ గిట్ల అడుగుడు షురు జేయడు ఈ బాత్చ్ తప్పితే.

      Delete
  2. ఔరా ఎంతటి ఆశ్చర్యం? విద్వేషం అనే పదానికే అర్ధం అయిన సీ'కంతా 'చారి ఇంకొకరికి విద్వేషం అని రంగు పులుముటయా?

    అయ్యా సీకంతాచారి మీ ఊపిరి, మీ ఉద్యమ ఆయుపుపట్టు ఏదో మరిసినారే? తమరు కాలు మొక్కే దొర సంగతి పక్కన పెట్టినా, తమరు తమరి అనంగు ప్రియమిత్రుడు తనకి తానే జై కొట్టికునే గొట్టిముక్కల, రకరకాల వేషాల్లో వచ్చే ఈ కిరణ్కుమార్ గత కొన్నేళ్లుగా తెలుగు బ్లాగుల్లోను, ముఖ పుస్తకం లోనూ చేస్తున్న శుభ కార్యములేమి? మీరు పొద్దున్న లేచి ఎక్కడ సందు దొరుకునా అని వెతికి మరీ రాసే కుమ్మరించే విషాన్ని ఏమందురు? పూటకొకసారి చెప్పే అబద్దాలనేమందరు? అట్టాగే మా లబలబలాడుడు సంగతి సరే అప్పనంగా దొబ్బేసింది చాలక ఇంకా అడుకుంటున్నా బొచ్చెల సంగతి, నువ్వే దిక్కు అని పట్టుకుంటున్నా మా కాళ్ళ సంగతి చూసుకో.

    పండుగ చేసుకుంటున్నారా? మరింకే ఆ పని మీద ఉండక, పక్కనొడు ఏమి చేస్తున్నాడా వాడిని ఎలా చేడదోబ్బుదామా మని ఆ పని మీద ఉండడం ఎన్దుకొ. మీకు కావాల్సింది మీరు బాగుపడటం కాదు పక్కనొడు చెడిపొవటమ్. అది ఒకప్పుడు మీకు మాత్రమే తెలుసు ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుసు కాబట్టి ఇక తమరి వాచాలత కట్టేసి దారిచూసుకుంటే బెటర్.

    కిరణ్ కుమార్ అబ్బో బతుకమ్మ ఆటలు ఆడించి చావ దొబ్బితే లగేట్టుకుంటూ ఎవడి పంచన చేరారో అందరికి తెలుసు కానీ తమరి ఘనకీర్తి భజన ఇక కట్టిపెట్టండి. డేరాలా అవ్ మరే రాజు గారు కట్టించుకున్న భవంతుల్లోకి దారిలేక మీరు ఎక్కడ పండారో మాకు కూడా తెలుసులే ఆ చరిత్ర మళ్ళీ చెప్పడు మొదలెడితే బ్లాగులు జాలవు, ఇప్పుడెల్లి మళ్ళీ ఇంకో అవతారంలో రా .

    ReplyDelete
  3. నువ్వు నువ్వే కానీ, నీ లాగా అరువు పేర్ల తో వ్యవహరించవలసిన అవసరం నాకు లేదు.... నేను వేరే అవతారాల్లో కనపడవలసిన అగత్యం కూడా లేదు... నాకు వున్నదే ఒక ఈ మెయిల్ ఐడి.... ఒక్కటే ఫేస్ బుక్.... ఇక పోతే నీ కామెంట్ లు.... బతుకమ్మ ఆడిన చేతులే బందుకూలు కూడా పట్టాయి... మిమ్మల్ని మద్రాస్ నుంచి చావ దొబ్బితే లాగేట్టుకుంటూ వచ్చి హైదరాబాద్ లో పడ్డ సంగతి యాది కి లేదేమో.... మీరు ఏమి తెలంగాణ కు నేర్పించ లేదు... పాబ్లో నెరూడా నే ఆకట్టుకున్న ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటం.... మీ ప్రాంతం వారే నెత్తికి ఎక్కించుకోలేదు.... ముల్కీ నిబంధనలు రాగానే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఎత్తుకున్న మీరు మీకు అనుకూలం గా పరిస్థితులు మారగానే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ప్రాణం తీశారు... ఇంతకీ పక్కవాడి మీద పడే ఏడ్చే వాళ్ళు ఎవరో బ్లాగులు చూస్తే తెలుస్తుంది.... అయినా చాలా ఓపిక పట్టి చాలా రోజులకు హరి గారి బ్లాగ్ లో కామెంట్ రాశాను... నీ లాంటి ఊరు పేరు లేని వారి కోసం కాదు... అయినా కుక్క తెరువు పోతే లక్షణాలు తక్కువ... ఛీ ఛీ....

    ReplyDelete
    Replies
    1. @ కిరణ్ కుమార్ నేను నేనే, దానికి బోడి సర్టిఫికేట్ అక్కరలే. ఓహో అయితే అవసరం లేకుండానే అవతారాలు ఎత్తుతున్నావా, ఇహ అవసరం అయితే ఇంకెన్ని వేసాలు జూడాలో. గవుమల్లా మీరు పట్టిన బందూకూల మీ దొర. మీవోల్లు చెబుతుంటే కొత్త కతలు కూడా మస్తుగా యింటన్నాం . గట్టనా మరి మేపోతాం అన్నప్పుడు మా కాళ్ళు పట్టకు మరీ ఎందుకు బతిమాలిరు? ఆనాడే మా దొరల బంగాలా ముందే బతుకులేల్ల దీస్తం అని పోరాడకపోయారు? ఎవడు ఆపిరు? పక్కనోడి పదేడ్చే వొళ్ళు ఎవరో బ్లాగుల్లో ఏమి మొత్తం ప్రపంచానికే పేపర్లలో, టివిలలో, సింగిడి బొంగిడి పెర్లేట్టి మరీ బూతలు తిట్టింది ఎవడో. ఒకనోటితో తిట్టుడు ఇంకో నోటితో మేము కక్కందే తినుడు. ఎవడికి తెలీనివి మీ చేతలు . ఒలబ్బొ నీ ఏడుపు కామెంట్ కి ఒక స్టేటస్ కూడాగా మళ్ళీ ఛీ ఛీ ఇగ జాలు నీ భజన.

      Delete
    2. సమైక్య పాలన లో ఎంత మోసానికి గురి అయ్యామో అనుభవించిన మాకు తెలుసు.... 60 సంవత్సరాలు ఎవరు ఎవరి పంచన పడి బతికారో, ప్రపంచం మొత్తం తెలుసు కానీ, నిద్ర లే బాబు... కాళ్ళు పట్టుకొని వున్నమంట.... ఒక్క సాక్ష్యం చూపెట్టు.... ఇంతకీ నువ్వు ఏ అవసరం వుండి నపుంసక పేరుతో వున్నావు? తల తిక్క గా మాట్లాడకు.... రాజా గోపాలచారి మీలాంటి వాళ్ళను కుక్కలతో పోల్చి తప్పు చేశారు... కనీసం వాటికి విశ్వాసం అన్నా వుంటుంది.... మీకు అది కూడా లేదు. 60 సంవత్సరాలు అప్పనంగా తెలంగాణ ను వాడుకొని విషం కక్కటం నీలాంటి వాళ్ళాకే చెల్లింది.... ప్రశ్న కు జవాబు చాతకాదు కానీ, డొంక తిరుగుడు మాత్రం బాగా చెప్తున్నావు...

      Delete
    3. మరి 60 ఏళ్ల బట్టి మండితే ఎందుకు మేము పోతామన్న రోజు కుక్కలాగా మా కాళ్ళు పట్టుకు బతిమాలారు? అప్పుడేమి కర్మ ఇప్పుడు కూడా ఆయే బతుకులు కదా మీ తరుపున మీ డోరా చేసేది అదే. ఎపుడు నిద్ర పోయి పక్కనొడు బాగుపడగానే అప్పనంగా అంతే మాని దొబ్బి తింటాన్నారో ప్రపంచం మొత్తం చూస్తానే ఉన్దిలె. దొబ్బి తినేది కాక ఇంకా ఏడుపులు కోదా. రాజగోపాలచారి ఏమన్నాడో మాకు తెల్సులే గానీ, మీ చరిత్ర పట్టిస్తాన మకిలి మాకు అంటిచక. ముందు నీ బ్రతుకు చూసుకొని పొంగు ఇంత ఘనమైన వారసత్వం మాది అని . ఇంతోటి దానికి మళ్ళీ తొక్కలో నీతులు జెప్పుడు.
      నీకు సమాధానం జెప్పెదేంది బతుకు జక్కగా చూసుకురా మందు. ఇదో క్వశ్చన్ బ్యాంకు నీకో సమాధానం . ముందు నువ్వు జెప్పాలా మేము పోతామంటే మా కాళ్ళు ఎందుకు మొక్కిరో

      Delete
    4. రాజగోపాలాచారి ఏమన్నడో తెలుసంట, మరి మీ బతుకులు మాకు తెల్దు. నువ్వే జెప్పినావ్ గా ప్లాబో నెరుడా ఇన్స్పిరేషన్ ఇచ్చానం మా ఏడుపు తో నని, ఇంతోటిదానికి ఇంకొకరిని అనుడు వకటి .

      Delete
  4. విశ్వాసం గురించి నువ్వు జెప్తున్దా. ఎక్కడిదాకో చచ్చినోల్ల దగ్గరికి పోవుడు ఎందుకు సోనియా గాంధి నడిగితే జెప్పుద్ది మీ విశ్వాసం గురించి కతలు కతలు. నువ్వు మాకు చెప్తావ్ . అన్నా మా నిజాం దొర క్రింద బతకలేక చస్తున్నమో అని ఏడ్చినా సంగతి మర్చి ఇప్పుడు మీరు ఏసే ఏసాలు చెప్తాయి మీ సంగతి. కాలం గడిసింది కదా అని మా నిజాం డోరా బగు మంచోడు అని ఇప్పుడు మీరు కూసే జెప్తాయి మీ పెద్దోల్ల త్యాగాలకి మీరు చూపించే విశ్వాసం . క్రింద నలుపు జూసుకోకుండా కారు కోతలు కూయటం నీకు అలవాటైన పనేగా . అలవాటేంది అసలు వచ్చిన పనే అది.

    ReplyDelete
  5. అప్పనం గా వాడుకొని విషం కక్కుతున్నామా, నిజమే మీరు చెప్పే అబద్దాలలో ఇదొకటి . నోరు తెరిస్తే అబద్దాలే. సమైక్య రాష్ట్రంలో బాధలు ఇదో పెద్ద అబద్ధం. అసలు నోరు తెరిస్తే మీకు అబద్ద్ధాలు పక్కనోడి మీద ఏడువు తప్పితే ఇంకేమి రావా?
    మా ఉద్దేమం లో 1200 మంది అమరవీరులు ఆనాడు మరి గిప్పుడు 400 మందే. మా స్టేట్ ఎనకపడి బోయింది ఆనాడు ఇప్పుడు మాదే ధనిక రాష్ట్రం (అప్పనం ఆంధ్రోల్ల సొమ్ము దోచుకున్నగా అది కూడా మనదే అసలు స్టేట్ అడిగిందే అది నొక్క నీకి కదా ) ఇయ్యి మీ బాధలు .

    ఎవడి కాళ్ళు మొక్కినారా మొన్నదాకా రామోజీ ఆంధ్రోడు ఇప్పుడు ఎల్లి ఆ ఆంధ్ర బిర్యానీ అనే పెండ తినోస్తే మనోడు అవుతాడు పని అయినాది కదా ఇప్పుడు అది ఆంధ్రోడి కాలు మొక్కుడు కాదు, మొన్నటి దాకా వరప్రసాద్ ఆంధ్రోడు ఇప్పుడు దేవుడు మరి ఎవరి కాలు మొక్కినట్లో. ఆంధ్ర నుంచే వచ్చే పెట్టుబడులకి రెడ్ కార్పెట్ పరుస్తాం ఇది ఎవడి కాలు మొక్కుడు . సిగ్గుండాలా అడిగి మరీ దొబ్బించుకొను.

    ReplyDelete
  6. సమైక్య రాష్త్రంలో బాధలు - నాకో పాత విషయం గుర్తుకొస్తంది!ప్రజలో జరిగిన ఒక చర్చలో "చూడు మా వెనుకబాటు తనానికి ప్రభుత్వం లెక్కలే అద్దం పడుతున్నాయి" అని కొన్ని లెక్కల్ని ఉటంకించారు.పూర్తిగా ఆ లెక్కలూ ఆ స్టేత్మెంతు అర్ధమూ చదివాక నవ్వాలో యాడవాలో అర్ధం కాలా!అవి మూడు ప్రాంథాలకీ ప్రోత్సాహక నిధిఉల అలాట్మెంట్ లెక్కలు.తెలంగాణాకే యెక్కువ మొత్తం కేటాయించబడింది?కొంచెం సరిగ్గా అర్ధం చేసుకుంటే "ఇంతకీ మీ ప్రాంతానికి యెక్కువ నిధులివ్వడం అన్యాయమంటవా యేంది?" అని యెదటివాడు నిలదీస్తాడేమో అనే జంకు కూడా లేదు ఆ మేతావికి.

    నాకు అక్కడే రెట్టించుదామని దురద పుట్టినా కూడా రెట్టించినా ప్రయోజనం వుండదని ఆగిపోయా:-<)

    ReplyDelete
  7. మా భాదల గురించి అనుభవించిన నేను చెప్తాను.. వినండి... ఎప్పుడో కాదు 2009 ఎన్నికలప్పుడు పోలీసు ప్రొటెక్షన్ పెట్టి కిన్నెరసాని నుండి ధవళేశ్వరం కు నీటి ని తరలించుకు పోయారు...ఉండవల్లి అరుణ్ కుమార్ గెలవటం కోసం.... (అంతకు ముందు కానీ, ఆ తరువాత కానీ ఎన్నడూ కిన్నెరసాని నీళ్ళు ఇతర ప్రాంతాలకు తరలించ లేదు) కిన్నెరసాని డ్యామ్ కట్టింది విద్యుత్ ఉత్పత్తి కి, కొత్తగూడెం, పాల్వంచ మండలాల ప్రజల తాగునీటి సౌకర్యాలు తీర్చడం కోసం....కానీ, బలవంతంగా నీటిని తరలించుకుపోతే 2 నెలలు ప్రజలు ఎర్రటి ఎండా కాలం లో మూడు, నాలుగు కిలోమీటర్లు పోయీ బురద నీళ్ళు వాడుకున్నారు... మనుషులే కాదు.... కిన్నెరసాని పై ఆధారపడ్డ వన్య ప్రాణాలు ఎన్నో ఆ ఎండాకాలం చనిపోతే ఆ వివరాలు సమాచార హక్కు చట్టం కింద అడిగితే అప్పటి మీ ప్రభుత్వ పెద్దలు బెదిరించి వాటిని అపారు... ఆ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా కిన్నెరసాని ఎండిపోతే డ్యామ్ దగ్గరికి వెళ్ళిన ముసలి వారు సైతం ఎడ్చారు. వారి జీవిత కాలం లో చూడలేని దాన్ని చూశామని.... కిన్నెరసాని ని మళ్ళీ నీటి లో నింపటానికి హడావుడి గా భద్రాచలం నుండి కిన్నెరసాని డ్యామ్ వరకు పైప్ లైన్ కోసం పెద్ద గోతులు 150 కోట్ల రూపాయల ఖర్చు తో తవ్వి ఎటుకాకుండా చేశారు... పైప్ లైన్ పూర్తి అయ్యి... గోదావరి నుండి నీళ్ళు రాకముందే అదృష్టవశాత్తు లైలా తూఫాన్ రాబట్టి కిన్నెరసాని మళ్ళీ మునుపటి అంతా కాకపోయినా కొద్దిగా రికవర్ అయ్యింది.. ఇది కేవలం ఒక లోకల్ ఇష్యూ మాత్రమే.... తెలంగాణ మొత్తం ఇలాంటి అన్యాయాలు జరగబట్టే కదా.... 610 జీవోలు, ముల్కీ నిభంధనలు తెచ్చింది.... కాదంటారా.... మరి అంతా బాధ పడే వాళ్ళు జై ఆంధ్ర ఉద్యమం ఎందుకు స్టార్ట్ చేశారు?

    ReplyDelete
    Replies
    1. భలే భలే అచ్చుండు అన్న.ఆ గవర్నమెంట్ లో మన దొరలూ ఉండారు గా ఆళ్ళెం చేసిరి అప్పుడు పండిరా. మాకు రాజశేఖర్ రెడ్డి , ఆయన కొడుకు జగన్ మా కుటుంబ సభ్యులు అని చెప్పుకు తిరిగే మీ దొర ఏం జెసున్దు.
      మరి ఆంధ్ర పల్లెలు, పట్టణాలు లో కరెంటు అనేది లేకుండా ఆళ్ళ బతుకులు చీకటి చేసి కరెంటు మొత్తం దెబ్బ బిడితే అది మాత్రం సమ్మగా ఉండాది . అస్సలు నొప్పె తెలవలా. తీసుకున్నాయి గుర్తే ఉన్దదు. ఎంత తిన్నా పరగాడుపే. మేము కూడాగ అదే అడుగుతున్నాం ఆరోజునే మాది మాగ్గవాలే అని ఎందుకు ముందుకు రాలేదు. చక్కగా అని తెచ్చి ఈడ పెట్టాకా కన్ను పడ్డాది ఇహ షురు . గది కూడగా ఎవరు బతకనీకి కడుపు పట్టుకొని తన రాజధానకి వచ్చినోడి మీ పెతాపం

      Delete
    2. బినామీ పేర్లతో కాలవలు తవ్వి డబ్బు నొక్కిన దొరని నేట్టినేట్టుకొని మామీద పడతం బాగా నేర్చారు. ఆ కాలువలు దొర గారి బ్యాంకు నిమ్పుకోనికి గాక ఇగేందుకు పనికి రావు . దొబ్బిన్దంతా దొబ్బి భలే కబుర్లు చెప్తారు ఈళ్ళు .

      Delete
    3. @KIRAN & SRIKANTH
      తెలంగాణా మిత్రులు ఒకటి గుర్తించాలి.గతాన్ని గురించి తవ్వుకుని ప్రయోజనం లేదు,వొదిలెయ్యండి!ఇవ్వాళ్టి పరిస్థితి యేంటి?అటు మీరూ ఇటు మేమూ కూడా పెట్రోలు ఒక్క రూపాయి పెరిగితే నెలజీతంలో పడే బొక్క తల్చుకుని గుండె గుభేలు మనే మిడిలు క్లాసు గాళ్ళమే.కాబట్టే నేను తెలంగాణా గురించి కూడా మాట్లాడుతున్నాను.చెస్ట్ ఆస్పత్రి మార్చడం విషయానికి సంబంధించి మొదటి రోజునే హాస్పిటల్స్ ట్రాఫిక్ మధ్యలో వుందటం కన్నా నగరానికి దూరంగా వుండటం మంచిదే గదా అన్నాను!సెంటిమెంట్ల కన్నా ఇప్పుడు ప్రాక్టికల్ ఆలోచనలు అవసరం,కోదంద రాం గారి ఫాకల్టీ యేంటి యెకనామిక్సేనా?తెలంగాణా యెకనామిస్టులు చొరవ తీసుకోవాలి,వనరుల్ని డబ్బుగా మార్చటం కోసమే ఆ సబ్జక్టు వున్నది.వాళ్లతో మాట్లాడండి,వాళ్ళ నుంచి తెలుసుకోండి,విడిపోయి యేం సాధించాం అని అనుకోవాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోండి!వెక్కిరింత కాదు,సలహా గానే చెప్తున్నా.

      Delete
  8. Read this article
    బ్రాహ్మణవాది కంచ ఐలయ్య
    http://patrika.kinige.com/?p=5373

    ReplyDelete
  9. Breaking India - Rajeev Malhotra

    What is DFN ? (dalit freedom network) (founded in 2002 by Dr Joseph D’souza, head of the All India Christian Council)

    Dalit Freedom Network, based in Colorado, USA, is West-run organization that professes to champion Indian Dalit emancipation through policy advocacy in the power centers of the USA.

    MISSION :- It describes its mission as, ‘to follow the command ofJesus Christ who called us to be “the salt of the earth” and “the light of the world”’.
    DFN uses a Dalit face to hide the fact that it is the hardcore operational wing of American right wing designs on India. The Dalit label gives it the social status to intervene in Indian causes

    KANCHA ILAIAH was globally promoted by this DFN , an hard core christian body just using DALIT name.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...