Friday, 8 May 2015

శిక్ష పడడానికి 13 యేళ్ళు?బెయిలు దొరకడానికి 4 గంటలు!చచ్చినోడు దిక్కులేనోడు అయితే అంతే మరి?!

"కులము గల్గువాడు,గోత్రంబు గల్గువాడు,విద్యచేత విర్రవీగువాడు పసిడి గల్గువాని బానిసకొడుకులు" అన్నాడు వేమన్న!యెప్పుడు?కొన్ని శతాబ్దాల క్రితం - బహుశా సహస్రాబ్దాలు కూడా దాటిపోయి ఉండొచ్చు!కానీ కొన్ని నిజాలు యుగాల తరబడి మళ్ళీ మళ్ళీ రుజువులతో సహా జరుగుతూనే ఉంటాయి - కొన్ని కొన్ని తప్పుల్ని మనుషులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు,యెందుకనో?

ఒక రాజుగారబ్బాయి మనుషుల దుఃఖాల్ని చూసి తట్టుకోలేక తనకి కొత్తగా పుట్టిన పిల్లాణ్ణి కూడా "కొత్తగా తగులుకున్న బంధం" అని విసుక్కుని రాజ్యం వొదిలి అడవులకి పోయి చిక్కి శల్యమై ఆఖరికి ఒక పశువులు కాసుకునే అమ్మాయి అమాయకంగా చెప్పిన మాటలతో దారి మార్చుకుని సరైన జ్ఞానాన్ని పొంది తధాగతుదనే పేరున కీర్తి గడించి ఒక కొత్త మతసాంప్రదాయాన్ని సృష్టించినా అతని శిష్యులే అతని బోధనల్ని సరిగ్గా అర్ధం చేసుకోలేక ఆనవాళ్ళు కూడా లేకుండా మార్చిపారేసి లెక్కకు మిక్కిలిగా చీల్చి ముక్కలు చేసి పవిత్రంగా ఉండాల్సిన ఆరామాల్ని "లంజదిబ్బ" లని పిలిచేటంతగా భ్రష్టు పట్టించి యేం చెప్పాడో తెలియకపోయినా యేదో ఒకటి చెప్పాడు గాబట్టి గొప్పోడంటూ ప్రపంచమంతా నెత్తిన మోసినా అతని వల్ల ఈ ప్రపంచంలోని దుఃఖరాశిలో యెంత తగ్గిందని లెక్క తీస్తే యేం మిగులుతుంది?

సకలజనుల సంక్షేమం ఉద్దేశించి సార్వజనీన దృక్పధంతో ప్రవచించిన ధార్మికబోధలు కూడా ఆఖరికి కోమట్లు బేరాలు పెంచుకోవడానికీ రాజులు పెత్తనం చెయ్యడానికీ వూతకర్రలుగా మిగులుతున్నప్పుడు ఓ నాలుగు కేకలూ మరో నాలుగు నిట్టూర్పులూ యేమి సాధించగలవు?

ఏనుగుల వీరాస్వామయ్య గారు తన కాశీయాత్రచరిత్రలో తనకు కలిగిన కొన్ని ధార్మీక సందేహాలకి తన పాండిత్యంతోనే జవాబులు కూడా సాధించి వివరిస్తారు - "హిందువులలో విధవా పునర్వివాహాలు నిషేధించడం వల్ల బాల్యవితంతువులు బాధలు పడితే కిరస్తానం వారు విధవా పునర్వివాహాల్ని సమర్ధించగా విశంఖలత్వానికి దారి తీస్తున్నాది" అని దృష్టాంతాలతో సహా పూర్వులు యెంత మంచిగా ఆలోచించి సాంప్రదాయం చేసినా కొందరు వాటిని భ్రష్టు పట్టించడం అన్నిచోట్లా వుండటం గురించి తర్కించుకుని ఆఖరికి "అందరికీ వొప్పుదలగా వుండే చెడు కలవని మంచి" యెక్కడా ఉండదని తీర్మానించేశారు!

మనం మనకి మంచి అనుకుని చేసిన పని యెవడో ఒకడికి చెడు కావచ్చు,మనం యెంత అహింసాయుతంగా బతకాలనుకున్నా హింస చెయ్యక తప్పదు!అసలు సిసలు తమాషా యేమిటంటే మనం చెడు అనుకునే పనిలో కూడా మంచి ఉంటుంది?కళ్ళముందు జరిగిన ప్రతిదానికీ యేదో ఒకటి మాట్లాడాలనుకుంటే మనం మాట్లాడిన పది మాటలకి తొమ్మిది బూతుల కింద తేల్తాయి,సారమెరిగి మాట్లాడాలన్న పట్టుదల ఉంటే మితంగా అయిదు మాటలే మాట్లాడినా అందులో నాలుగు మాలు నీతిగా ఉంటాయి!మంచిగా కనబడిన ప్రతివాడూ మంచివాడు కాదు,గాలికి కొట్టుకుపోయే యీక మాదిరి నాకు లాభమొస్తుం దనుకుంటే మంచి పనులు చేస్తా నష్టమొస్తుం దనుకుంటే శుక్రనీతిసారం అడ్డుపెట్టుకుని వెధవపనులు చేసయినా నష్టం తప్పించుకుంటా ననే ధోరణిలో ఉన్నవాడు మంచివాడు కాదు,నష్టమొచ్చే చోట కూడా తప్పుడు పని చెయ్యడానికి వెనుకాడి మౌనంగా నష్టాన్ని భరించేవాణ్ణి మాత్రమే మంచివాడుగా లెక్క వెయ్యాలి!

గట్టిగా మంచికి నిలబడేవాళ్ళే ఇవ్వాళ అసలైన మైనార్టీ వర్గం?
వాళ్ళు మెజార్టీ కానంతవరకూ లోకం ఇట్టాగె ఉంటుంది నేస్తం!

15 comments:

  1. ఇంక మిగిలిన కార్యక్రమం కూడా సజావుగానే జరుతుతుందని ఊహించవచ్చును.
    మానవతావాదిగా మహానటుడిగా పరమనిజాయితీపరుడుగా సమాజసేవకుడుగా అలాగ ఇలాగ నీరాజనాలు అందుకుంటున్న మాహాత్ముడికి హైకోర్టులో న్యాయం దొరుకుతుంది. అది సంతృప్తికరంగా లభించని పక్షంలో సుప్రీంకోర్టువారు తప్పక ఆ కొరత తీర్చగలరు. మరొక మూడేళ్ళలోనో ఏడేళ్ళలోనో ఆ ముచ్చట ముగిసే సమయానికి ఆయనకు వ్యతిరేకంగా నమ్మదగిన సాక్ష్యాధారాలేవీ లభించక కీర్తికిరీటం పెట్టి నీరాజనాలిచ్చి మరీ మన న్యాయవ్యవస్థ అయనను గౌరవించుకోవటమూ, అంతతవరకూ తహతహలాడుతున్న మనదొరతనాలు భారతరత్నలాంటి బిరుదునివ్వటమో అది చాలదనుకుంటే మన దేశానికి రాష్ట్రపతిగా వరించి ధన్యంకావటమో చేస్తాయి. భారతసమాజమూ తరిస్తుంది. మన వ్యవస్థల గొప్పదనం ముఖ్యంగా పాలనా న్యాయవ్యవస్థల అధ్బుత శక్తిని లోకం అంతా వేనోళ్ళ కొనియాడుతుంది. అన్నట్లు ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పిల్లలు పారాయణం చేస్తూ ఉంటారు కూడా.




    ReplyDelete
  2. అందరికీ సల్మాన్ ఖాన్ చింతే. చనిపోయిన వారి పేరు కూడా ఒక్కరూ చెప్పలేరు.
    Woody Guthrie:

    The sky plane caught fire over Los Gatos Canyon,
    A fireball of lightning, and shook all our hills,
    Who are all these friends, all scattered like dry leaves?
    The radio says, "They are just deportees"

    కారంచేడు మారణకాండలో దాదాపు పాతికేళ్ళకు కానీ హంతకులకు (అందరికి కాదు కొందరికి మాత్రమె) శిక్ష పడలేదు. చుండూరు ఉదంతంలో అంతకంటే ఎక్కువ సమయం తీసుకున్నా హంతకులు తప్పించుకున్నారు. Justice delayed is justice denied

    "The law in its infinite majesty forbids the rich and poor alike to sleep under bridges, beg in the streets and steal loaves of bread": Anatole France

    ReplyDelete
  3. Well said. Dickens long ago said 'law is an ass'. How true!. Bina devi wrote stories clearly proving how judgements are subjective. God bless our country and courts!

    ReplyDelete
    Replies
    1. The quote "law is an ass" is attributed to a fictional character (Mr. Bumble) in Oliver Twist, not Dickens himself. I therefore would not attach much weight to this.

      I am not sure who Bina Devi is but am guessing she is a fiction writer. With due respect both to her & your good self, stories can't "prove" claims.

      న్యాయవ్యవస్తలో భయంకరమయిన జాప్యాలు ఉన్న మాట వాస్తవం కానీ దీనికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వం వేసే అనవసరమయిన దావాలు, చాలీచాలని జడ్జీల నియామకాలు, పోలీసుల అడ్డగోలు కేసు తయారీ, తమ అంగధనబలంతో సాక్ష్యాలను/సాక్షులను తారుమారు చేసే "పెద్దలు", సదరు వెధవ పనులకు వంత పాడే పోలీసు/రాజకీయ యంత్రాంగం/వకీళ్ళు ఈ సమస్యకు మూల కారణం.

      న్యాయమూర్తులలో తప్పులు లేవని నేను అనను కానీ అసలు సమస్య అక్కడ లేదు. అంచేత "judgements are subjective" అని కొట్టి పారేయడం మరీ sweeping అవుతుందని నా ఉద్దేశ్యం.

      Delete
    2. //న్యాయమూర్తులలో తప్పులు లేవని నేను అనను కానీ అసలు సమస్య అక్కడ లేదు. అంచేత "judgements are subjective" అని కొట్టి పారేయడం మరీ sweeping అవుతుందని నా ఉద్దేశ్యం.//

      Well, ask any man who booked under women centric laws (like 498A, DV Act, Nirbhaya..) they don't agree with your statement.

      Delete
    3. Srikanth, most of the complaints I have heard are either on the law itself or alleged bias, almost totally about women judges. Bias whether real or imaginary is different from subjectivity.

      There is a simple solution to "probable bias": just ask for "recusal"!

      The apparent subjectivity in some judgments flows from precedent. It cases great courage to overthrow a poorly judged precedent. Not many judges do so but again relying on a wrong precedent is not the same as being subjective.

      Delete
    4. Jai Gottimukkala,

      Yeah, many people mostly complain about law and it's misuse but we can't strike down the possibility of subjectivity. After Nirbhaya Incident, men faced tough situation in almost all women related cases, it may be for getting bail or it may be in severity of the punishment, before that incident situation is not this much worse.

      Is it fair that some incident happen outside influence the judges?

      And one more case, you may know this incident, happened in supreme court.. here is the link..

      Bow down before your wife's 'diktat', SC tells husbands

      Justice Katju, jokingly told a man, fighting for 17yrs for divorce, obey his wife.

      "If your wife asks you to put your face that side, put it that side. If she says, put it this side, then put it this side. Otherwise you will face trouble. Hum sub bhogi hai," the bench remarked again."

      And you know what, the man denied divorce, and asked to wait for few more days for next hearing as his case is not that important. Points that we need to note here are .. Justice Katju is not a woman and his judgement criticized by everyone, including honorable chef justice of supreme court.

      Recusal of Justice Katju ? I don't think that will work. Most of the times they don't work (in case of women centric laws).

      One more thing, up to now, many MRAs talked about male judges, 99% of the times, they talk about male judges not women judges. So, our experience is opposite to yours.

      Delete
  4. సల్మాన్ ఖాన్ కోసం అంగలార్చే వాళ్లందరికీ అతని చుట్టూ నడుస్తున్న 1000 కోట్ల వ్యాపారం కనిపిస్తున్నదే తప్ప పోయిన ప్రాణాలు కనపడ్డం లేదు!అతనికి అనుకూలంగా ప్రజల నుంచి సింపతీని కూడగట్టటంలో మీడియా కూడా తన నిజరూపాన్ని నిస్సిగ్గుగా చూపించేస్తున్నది.అవిభక్త కవలలలో ఒక పిల్ల "సల్మాన్ అన్నయ్య కోసం పూజలు చేశాను" అంటున్నదంటే మనం జాలికబుర్లు చెప్పినందువల్ల ప్రయోజనం ఉంటుందంటారా?

    హిందూ మతమయినా, బౌధ్ధమతమయినా,క్రైస్తవ మతమయినా వ్యాపారస్తుల విరాళాల కోసం వాళ్లని సమర్ధించటం ప్రజలు రాజుకి విధేయుడిగా ఉండాలని సుద్దులు చెప్పటం చేసినంత కాలమే వాటికి మాట చెల్లుబడి ఉంటున్నదంటే డబ్బు మనుషుల్ని యెంతగా శాసిస్తున్నదో గదా!

    అన్నింటినీ డబ్బుతోనే లెక్కగట్టే సంస్కృతియే అసలైన విషవృక్షం - దాని ఫలాలే ఇవి!

    ReplyDelete
  5. Always look forward for such nice post & finally I got you. Really very impressive post & glad to read this. Good luck & keep writing such awesome content. Best content & valuable as well. Thanks for sharing this content.
    Web Development Company in Greater Noida
    Software development company In Greater noida

    CMS and ED
    CMSED

    Homoeopathic treatment for Psoriasis in greater noida

    ReplyDelete
  6. i heard about this blog & get actually whatever i was finding. Nice post love to read this blog
    GST consultant In Indore
    digital marketing consultant In Indore

    ReplyDelete
  7. Buy Jadau Necklace Set at best prices from your nearest buymyJewel retail store in India, Explore the Jadau Jewellery online collection.

    ReplyDelete
  8. Different people, especially digital marketers, find the answer
    to the question where to safely buy instagram accounts for their
    service and product promotion. The internet marketers buy old instagram
    accounts for increasing the promotion of their product. Pvanets have
    different packages so If you are a digital marketer then instagram account
    is the best solution to reach your product to the people.
    old instagram accounts

    ReplyDelete
  9. Different people, especially digital marketers, find the answer
    to the question where to safely buy instagram accounts for their
    service and product promotion. The internet marketers buy old instagram
    accounts for increasing the promotion of their product. Pvanets have
    different packages so If you are a digital marketer then instagram account
    is the best solution to reach your product to the people.
    buy bulk instagram accounts

    ReplyDelete
  10. I am very impressed with your post because this post is very beneficial for me and provide a new knowledge to me.
    Tenorshare 4DDiG Crack
    Driver Easy Pro Crack
    Sony VEGAS Pro Crack
    WebStorm Crack

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...