Tuesday, 12 May 2015

సందేహం లేదు,ఈ తరం మహానటి నిత్యా మీనన్!

          నటనంటే యేమిటి?మనకు కలగని అనుభూతుల్ని కలిగినట్టు భ్రమింపజెయ్యడం!జీవితంలో యెవరూ యెప్పుడూ నటించరా?అప్పుడప్పుడూ మనమూ నటిస్తూనే ఉంటాం - మనకి నచ్చనివాళ్ళతో తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే నవ్వుతూనే మాట్లాడతాం కదా!అయితే స్టేజి మీదనో తెర మీదనో నటించేవాళ్ళని అంతమంది యెందుకు అభిమానిస్తారు?జీవితంలో నటించడం మోసగించడం అని తెలుసు గనక అతిగా చెయ్యలేం,అవునా?అదే కళ్ళముందు ఒక వ్యక్తి మరో వ్యక్తికి సంబంధించిన అతి సున్నితమైన ఉద్వేగాల్ని సైతం అవి తనకే యెదురవుతున్నాయేమోనని భ్రమింపజేస్తుంటే కొద్దిసేపయినా నిజంగా ఆ అనుభూతులన్నీ ఆ వ్యక్తి సొంత అనుభూతులని నమ్మేసి ఆ మాయలోంచి బయటపడ్డాక ఆ ప్రతిభకి చప్పట్లు కొట్టాలనిపిస్తుంది! ఒకప్పుడు నాటకరంగంలో వేమూరి గగ్గయ్య అనే నటుడు హిరణ్యకశిపుడి వేషం వేసి వికటాట్టహాసాలు చేస్తుంటే చూసే ప్రేక్షకులకి భయం పుట్టేదట.

        నిన్నటి తరం తమిళనటుడు శివాజీ గణేశన్ పరాశక్తి అనే సినిమాతో మొదలెట్టి తను నటించే ప్రతి దృశ్యంలో యెంతమంది ఉన్నా అందులో యెవరు యెంత గొప్పగా నటించినా సరే వాళ్ళందర్నీ నస్మరంతిగాళ్లని చేసే విధంగా చెలరేగిపోయి అప్పటి నుంచీ ఇప్పటివరకూ చూసిన ప్రతివాళ్ళనీ ఒక్కలాగే స్పందింపజేస్తున్నాడు కదా!అతనిది అతినటన అంటారు గానీ అవే పాత్రల్ని అవే సంభాషణల్ని మితనటనతో మెప్పించగలిగిన మరో నటుడు యెవరయినా ఉన్నారా?అక్కడ నటనకి సంబంధించిన రెండో భాగం ఉందని తెలియాలి, ఆ ఉద్వేగాల్ని తను అనుభవిస్తున్నాని నమ్మించటమే గాదు చూసేవాళ్ళలోనూ కలిగించే లక్షణం అది!
          ఉరుమి సినిమా ఆర్టిస్టుల లిస్టులోనూ అలా మొదలైంది సినిమా గురించిన కబుర్లలోనూ నిత్యా మీనన్ మంచి నటి,చాలా బాగా చేసింది అంటుంటే ఓహో అనుకోవడమే తప్ప ఇప్పటివరకూ నిత్యామీనన్ సినిమా ఒక్కటి గూడా చూడలేదు,కానీ మొన్న "మా" చానెల్లో "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" చూశాక ఒక అద్భుతాన్ని చూసినట్టనిపించింది! ఆ సినిమాకి సంబంధించిన వార్తల్లో డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నట్టు గుర్తు,ముస్లిం అమ్మాయి పట్టి పట్టి మాట్లాడిన ఎఫెక్టుతో అధ్భుతంగా చేసింది!డైలాగులదేముంది శ్రమపడితే యెవరయినా బాగానే చెప్పొచ్చు గానీ బురఖాలోంచి గోల్డు మెదల్సు లాంటి రెండు కళ్ళు మాత్రమే కనిపిస్తున్న దృశ్యాల్లో గూడా బురఖా వెనకాల ఆ అమ్మాయి పెదాలు అల్లరిగా విచ్చుకుంటూ నవ్వుతున్నాయని తెలిసేట్టుగా కళ్ళతోనే చూపించడం అంటే అది యెంత గొప్ప నటనో కదా!అలా కళ్ళతో నటించగలిగే నటిని అభినేత్రి అంటారు - వుదాహరణకి సావిత్రి.
        వయస్సుతో సంబంధం లేకుండా ఆడామగా యెవరయినా సరే సినిమా అనేది తెరమీద కనబడే బొమ్మలని తెలిసినా యేడుపు సీన్లలో యెప్పుడో ఒకప్పుడు కనీసం ఒక కన్నీటి చుక్కయినా రాల్చే ఉంటారు!నాకింత వరకూ అలాంటి ఫీలింగ్ యెప్పుడూ రాలేదు గానీ "నాన్నకి దూరంగా ఉండి సుఖపడొచ్చు గానీ నాన్నని దూరం చేసుకుని సుఖపడలేను" అనే దృశ్యంలో మాత్రం చాలా బరువుగా ఫీలయ్యాను.నాకు నదిరా అనే అమ్మాయి అప్పుడు ఇరుక్కుపోయి ఉన్న దౌర్భాగ్యం కనబడింది - ఆ తండ్రి చావకుండా యే పక్కగదిలోనో ఉండి ఉంటే తనే మూర్ఖత్వాన్ని వొదిలించుకుని కధని సుఖాంతం చేసేవాడనిపించింది!ఏరొబిక్స్ లాంటి హిస్ట్రియానిక్స్ యేమీలేవు - 100%లవ్ లో నాగచితన్య క్లైమాక్సులో అట్లా అంతసేపు ఆపకుండా అరుస్తుంటే నాకు యెడుపు రాకపోగా క్యామెడీ సీను చూసినట్టనిపించింది - కూర్చున్న చోటు నుంచి కదలకుండా మామూలుగా మాట్లాడుతున్నట్టే యెంత సులువుగా చూసేవాళ్ళకి ఆ దుఃఖాన్ని చూపించింది!

          ఇవ్వాళ తెలుగు సినిమా పరిశ్రమ తక్కువ పెట్టుబడితో తీసే మంచి సినిమాలు యెక్కువగా హిట్టవుతూ ఉంటే హీరోల చంకల్లో మట్టి దులుపటానికి పనికొస్తూ వాళ్ళకి మార్కెట్టును పెంచే పంచ్ దయలాగుల మోత సినిమాలు యెవడూ చూడడు కాబట్టి "హ్హహ్హహ్హ అసలు హీరోని నా డెన్నుకే రానివ్వను గదా నన్ను ఇంకెట్లా చంపుతాడు నువ్వు నన్నిక తప్పించుకోలేవులే హీరోయిన్నూ" అని యెదవ ప్లాన్లేసి హీరోకి అడ్డంగా దొరికి చచ్చే సదరు సినేమా విలన్ల మాదిరిగానే ఆడించటానికి ధియేటర్లు దొరక్కుండా చేసే ముఠా ఒకటి పని చేస్తుందని తెలిసింది! అది అందరికీ తెలిసి పేర్లతో సహా అడ్డంగా దొరికిపోయాక ఇప్పుడు గుమ్మడికాయల దొంగలేమో భుజాలు తడుముకుంటున్నారు.ఆలీసెంగా సీన్లోకడుగుపెట్టిన సినేమా పోలీసుల్లాగే మిగతావాళ్ళు కొందరు "ఇంకానా ఇకపై సాగదు ఆ దురంతం" అని డయలాగులు దంచుతున్నారు. ఆ వూపు యెన్నాళ్ళుంటుందో తెలియదు గానీ మరి ఈ సినిమా దుర్మార్గుల నుంచి యెలా తప్పించుకుందో తప్పించుకుని మొత్తానికి క్రియేటివ్ కమర్షియల్స్ వారికి ఓ మంచి హిట్టు కొట్టింది!
        ఈ పాలిటిక్స్ పక్కన పెడితే అన్ని అవాంతరాల్ని దాటుకుని రిలీజయ్యి హిట్టయిన చిన్న మంచి సినిమాలన్నిట్లో ఒక విశేషం ఉంది - ఒక సెంట్రల్ పాయింటుని రియాలిటీకి దగ్గిరగా ఎలెవేట్ చెయ్యడం!ఈ సినిమాలో హీరోయిన్ కూతురికి వచ్చిన డౌట్ "నరాల రాపిడి కోసం మాత్రమే చూసుకోకుండా మనసుతో ప్రేమించుకుని ఒక జీవితకాలం పాటు విడిగా ఉన్నా ఒకరికొకరు పూర్తిగా అంకితమవడం సాధ్యమా?" అనేది ఈ తరాన్ని గూడా కదిలించిందనే దానికి గట్టి సాక్ష్యం ఈ సినిమా సక్సెస్.యెక్కడో చదివాను తను కావాలనే ఎక్స్పోజింగుకి దూరంగా ఉంటున్నట్టు - దాన్ని గట్టిగా నిలబెట్టుకుంటే ఖచ్చితంగా సావిత్రి తర్వాత మరో అభినేత్రి అవుతుంది  నిత్యా మీనన్!
చిన్న నిత్య
_______________________________________________________________
(చిత్రాలు:గూగుల్)

19 comments:

  1. చివరి లైను తప్ప మిగతా అంతా మీతో ఏకీభవిస్తున్నానండీ. చిన్నారి నిత్యని చూట్టం ఇదే ప్రధమం :)

    మరో విషయం. మీరు తెలుగు భాషాభిమానులు కదా. మీ ప్రొఫయిల్ ఫోటో దానికి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు కదా - విదేశీ హీరో ది కాకుండా.

    ReplyDelete
    Replies
    1. అనుకున్నా యెవరో ఒకరు అడుగుతారని.ప్రొఫైల్ ఫొటోకి సరిపడే ఫొటో యేదీ కంప్యూతరులో లేదు.వీలు చూసుకుని యెక్కించి మారుస్తా.నేను మీకిచ్చిన వార్డు "బ్లాగు భీకర" నచ్జ్చ్జిందా?
      :-)

      Delete

  2. హరి కాలం వారు సినిమా మీద కూడా పడ్డం ఉందా !!

    కాలం మారి పోయిన్దిస్మీ !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబీ మంత్రివర్గ ప్రమాణం చేస్తునందని తెలిసినప్పుడే కాలం మారిపోచ్చి:-)

      Delete
  3. సావిత్రితో పోల్చగల నటీమణులు ఇప్పుడు లేరనుకుంటాను హరి గారు.

    ReplyDelete
    Replies
    1. నేనుకూడా సావిత్రితో పోల్చలేదండి.ఆ తరం వాళ్లనీ ఈ తరం వాళ్లనీ పక్కపక్కన నిలబెట్టలేము గానీ ఆ వరసలో నిలబెట్టవచ్చు కదా!అదీ మంచిపాత్రలు పడాలి, వాట్ని గొప్పగా చెయ్యాలి,వెధవ్వేషాలు వెయ్యకుండా ఉందాలి - చూద్దాం.

      Delete
    2. సావిత్రి గొప్పనటి. సందేహం లేదు. కాని ఆమే చాలా లావు,దానిని కవర్ చేయటానికి, సినేమా మొదలు నుంచి చివరిదాక క్లొస్ అప్ ల లో సావిత్రి ముఖాన్ని మాత్రమే చూపేవారు. సావిత్రి కాలం నాటి సమాజం ఇప్పుడు లేదు. ఈ కాలం హీరోయిన్ లు సావిత్రి కన్నా బ్రహ్మాండంగా గా నటించేవారున్నారు. బర్ఫి సినేమాలో ప్రియాంక chopra, నరసింహలో రమ్యకృష్ణ నటించినట్లు సావిత్రి నటించ గలదా?

      Delete
  4. శివాజీ కన్నా గొప్పగా నటించేవారు తెలుగులోనూ ఉన్నారు. యస్వీర్ , నాగయ్య , గుమ్మడి 70 లకు ముందు ఎన్టీర్.

    ReplyDelete
    Replies
    1. యన్.టి.ఆర్. మంచి నటుడే కాని కొన్ని సినేమాలలో యన్.టి.ఆర్. శివాజిని కాపి కొట్టే వాడు. శివాజి అంత ఓవర్ గా అరచేవాడు కాడు.

      Delete
  5. తెలుగు సినేమాలు చూసి చాలా కాలమైంది. మూడేళ్ల క్రితం ఈ అమ్మాయి నితిన్ తో కలసి నటించిన సినేమాను ఒకటిచూశాను. అదొక సుత్తి ప్రేమ కథా చిత్రం. మీరు చెప్పిన సినేమా చూస్తాను.

    ReplyDelete
  6. Not related to this post.

    హరిబాబు గారు,
    మీరు హీబ్రు భాష గురించి అడిగారు. మిత్రులను అడిగి చూశాను, మీకిచ్చిన లింక్ మించి నా దగ్గర సమాచారం దొరక లేదు. ఎవరైనా కంచి పరమాచర్యా ఫాలోయర్స్ ని అడిగండి. ఆయన గురించి పెద్ద అవగాన లేదు.

    ReplyDelete
    Replies
    1. ok,that was a very interesting scene to know much more about our culture!

      Delete
  7. ఇప్పుడున్న కధానాయికల్లో కొంచెం చెప్పుకోవచ్చంటే నిత్యా మీనన్ ఒక్కటే. ఇక కళ్ళ గురించయితే ఆ సీన్లో సావిత్రే గుర్తొచ్చింది.

    ReplyDelete
  8. ఈ సినిమా చాలా బాగుందని అందరూ అంటుంటే మొన్న టివిలో చూసాను. బాగుంది కాని, చాలా నెమ్మదిగా సాగి కొన్ని చోట్ల బోరు కొట్టింది. నాకైతే నిత్యా మీనన్ మహానటి అనేంత గొప్పగా ఏమీ చెయ్యలేదనిపించింది. జయప్రద, జయసుధ ఇలాంటి పాత్రలని ఇంతకంటే బాగా చేసారు. మంచి అవకాశాలు వస్తే అవికా గోర్, శృతిహాసన్ కూడ బాగా చెయ్యగలరు.
    సావిత్రి గారి గురించి చెప్పాలంటే ఒక్క మాయాబజార్ చాలు. ఎవరైనా కథానాయిక నటన నేర్చుకోవాలంటే మాయబజార్‌లో సావిత్రి నటనని మించిన టెక్స్ట్ బుక్ ఉండదు.

    ReplyDelete
  9. హరిబాబుగారు,
    మీరన్నట్లు నిజంగా ఆ సినిమాలో నిత్యా మీనన్ ఏక్షన్ అద్భుతం గా వుంది. ఆమె మిగతా సినిమాలన్నీ ఇంతకుముందు చూసినా అందరూ ఆమెని గొప్ప నటి అంటుంటే అంత గొప్ప నటన ఆమెలో ఏముందో అర్ధమయ్యేది కాదు. కానీ ఈ సినిమా చూసిన తరువాత మాత్రం ఆమె గొప్ప సహజనటి అని అర్ధమయ్యింది. కానీ డైరక్టర్ ప్రతిభ వల్ల ఆమెలోదాగి వున్న గొప్ప నటనా సామర్ధ్యాలు బైటకి వచ్చాయనుకుంటున్నాను.

    ReplyDelete
  10. హరిబాబుగారు,
    మీరన్నట్లు నిజంగా ఆ సినిమాలో నిత్యా మీనన్ ఏక్షన్ అద్భుతం గా వుంది. ఆమె మిగతా సినిమాలన్నీ ఇంతకుముందు చూసినా అందరూ ఆమెని గొప్ప నటి అంటుంటే అంత గొప్ప నటన ఆమెలో ఏముందో అర్ధమయ్యేది కాదు. కానీ ఈ సినిమా చూసిన తరువాత మాత్రం ఆమె గొప్ప సహజనటి అని అర్ధమయ్యింది. కానీ డైరక్టర్ ప్రతిభ వల్ల ఆమెలోదాగి వున్న గొప్ప నటనా సామర్ధ్యాలు బైటకి వచ్చాయనుకుంటున్నాను.

    ReplyDelete
  11. @vkbabu
    కానీ డైరక్టర్ ప్రతిభ వల్ల ఆమెలోదాగి వున్న గొప్ప నటనా సామర్ధ్యాలు బైటకి వచ్చాయనుకుంటున్నాను.

    అవును,నిజమే!బంగారు పళ్ళేనికయినా గోదచేర్పు కావాలి గదా!మిగతావాళ్లని చిన్నబుచ్చటం కాదు.కానీ నటనలో ఉండే సహజత్వం తనని ప్రత్యేకంగా నిలబెడుతుంది.సమంతా గూడా ఒప్పుకుంది యేమాత్రం భేషజం లేకుండా.తను గూడా మంచి నటే నా దృష్టిలో.సావిత్రి గూడా అప్పటి దర్శక రచయితలు అంత మంచి పాత్రల్ని ఇవ్వడం వల్లనే తన ప్రతిభని నిరూపించుకుని పేరు తెచుకున్నదని నా అభిప్రాయం.సినిమాలు తీసేఅ ధోరణి మారి మంచి సినిమాలు పెరిగితే ఇప్పటివాళ్ళలోనూ ఆ సిన్సియారిటీ ఉన్నవాళ్ళు కందరున్నారు - వాళ్ళని ఎంకరేజ్ చెద్దాం.

    ReplyDelete
  12. ఒక్కొక్కరికి ఒక్కో నటి నచ్చుతుందిలెండి.
    నాక్కూడా నిత్య మీనన్ హావభావాలు నచ్చాయి. కళ్లతోనే నటిస్తుంది తను. "గుండె జారి గల్లంతయ్యిందే" లో చివరి సీన్ నా దృష్టిలో సూపర్.

    ReplyDelete
  13. మంచి నటి సౌందర్య తరువాత నేను ఇష్టపడే నటి. గంగ సినిమా కేవలం నిత్యమీనన్ కోసం చూసాను. ఆ సినిమాలో మనం తట్టుగోగలిగేది ఎమన్నాఉందా అంటే అది ఈమే ఉన్న ఒక 10 నిమిషాలు మాత్రమే

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...