Sunday, 10 May 2015

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెసుని బతికించేటట్టయితే ఆ ప్రత్యేకహోదా నా కక్కర్లేదు!

ఔరా, ఈ ఆంధ్రోళ్ళు యెంత పిచ్చోళ్ళు!ఇందుగ్గాదా అరవ తంబిలు ఈళ్ళని ఒక్కరోజు గూడా మదరాసులో ఉండనియ్యకుండా తన్ని తగలేసింది?అంటే అన్నారంటారు గానీ తెలంగాణోళ్ళు ఆంధ్రా దోపిడీదార్లు అంటే తప్పేంది,నన్నడిగితే ఆంధ్రా వెర్రిబాగులోళ్ళు అన్నా గూడా తప్పు లేదు!ఒకేపున విభజన ఖాయం అని కేంద్రంలో ఉన్న తమ పార్టీ అధినేత్రియే కుండబద్దలు కొట్టినాక గూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ఇక్కడి కాంగ్రెసోళ్ళే అరిభీకరంగా రంకెలేస్తే ఆఖరి నిముషాల్లో ఆళ్ళ లొల్లి దేనికోసరమో గూడ అర్దం జేసుకోకుండా ఆ గాదీదకొడుకుల్ని నమ్మి అన్ని రోజులు డేరాలూ పందిళ్ళూ బిగిచ్చి కూడూ నీళ్ళూ మానుకుని గొంతు నెప్పెట్టేదాక అరిచినారు పిచ్చి పుల్లయ్యల మాదిరి!హైదరాబాదులో తమ యాపారాల్ని రేపు ఆడ పవరు కొచ్చెవాళ్ళు అణగదొక్కకుండా జూసుకోవటానికి అని బైటికి జెప్పకుండ, విడిపోయాక ఆంధ్రాకి యేం గావాల్నో బిల్లులోకి యెక్కియ్యకుండా,యెవడన్నా అట్ట తెలివైన మాట మాట్లాడితే సమైక్యద్రోహిగా ముద్దరేసి నానా గత్తర చేసిందెవడ్రా కాంగ్రెసు బాడుఖావుల్లారా?

సెంటర్లో యెక్కడో ఉన్నోడికి రాష్ట్రం సంగతి తెలుస్తాదో లేదో!కాశ్మీరోడికీ తమిళ్నాడోడికీ ప్రాంతాల మధ్య సంతులనం యెట్లా చెయ్యాలో తెలియక కంగారు పడితే ఓకే,కానీ యెద్దుల్లాగా అంత కాలం రాజకీయ జీవితమంతా జనం మధ్య తిరిగి జనం కోసం బతికి ఉంటే మీకు తెలియక పోయేదా?విభజించటం నాకు సమ్మతమేనని లేఖ ఇచ్చాక గూడా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుని బూచిగా చూపించి వాడు అడ్డం కొడుతున్నాడు వీడు అడ్డం కొడుతున్నాడు అని యేడుస్తూ తొమ్మిదిన్నరేళ్ళు ఇవ్వకుండా తప్పించుకోవాలని సవాలక్ష దార్లు వెతికి మొత్తం అందర్నీ అయోమయంలోకి నెట్టిన దెవడురా ముట్లుడిగిన రాజకీయం నడిపే కాంగ్రెసు దొంగనాకొడుకుల్లారా?

మీకు ఇవ్వాలని ఉంటే బాబు యెప్పుడయితే లెటరు ఇచ్చాడో ఆ తేదీ నుంచి నెలరోజులు చాలదా ఈపాటి గొప్ప విభజనకి?ఇవ్వాళ తెలంగాణా ముఖ్యమంత్రి రహదారి పన్ను అనగానే అంత భీకరమైన గొడవ యెందుకు జరుగుతుందో అమాయకులకి తెలియదు గానీ నాబోటి వాడికి తెలియదా?ఇన్నేళ్ళుగా ఒకచోటి నుంచి ఒకచోటికి తిరిగే జనం పెరుగుతూనే ఉన్నా రోడ్డు రవాణా శాఖకి యెందుకు నష్టాలు వస్తున్నాయి? కేశినేని ట్రావెల్స్ మొదలుకొని దాదాపుగా పైవేట్  ట్రాన్స్పోర్టు నంతా మీ చేతుల్లోనే ఉంచుకుని ఒక ట్రిప్పుకి పర్మిట్ తీసుకుని ఆరు ట్రిప్పులు నడిపి కొట్టిన కొట్టుడు తగ్గుతుందని కాదా సమ్మెలూ ధర్నాలకి దిగుతున్నది?రూటు బస్సులుగా నడపటానికి పర్మిషన్ తీసుకుని పెళ్ళిబస్సులుగా అద్దెలకి తిప్పడం దగ్గిర్నుంచి గత యాభయ్యేళ్ళుగా మీరు చేసిన దోపిడీకి మండి గదరా తెలంగాణోళ్ళు విడిపోతామన్నది?

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గిర్నుంచీ ఈ దేశంలో యెక్కడా చెయ్యని విధంగా ఆంధ్రప్రజలు నిరంతరాయంగా మీకు అధికారాన్ని అప్పగిస్తే దేశం మొత్తం మీద కాంగ్రెసు ఇక చచ్చిందనుకున్న రోజుల్లో కూడా 42కి 41 స్థానాలు పువ్వుల్లో పెట్టి అప్పజెప్తే మీరు రాష్ట్రానికి కేంద్రం నుంచి యెన్ని రైళ్ళని యెన్ని ప్రాజెక్టుల్ని యెన్ని సౌకర్యాల్ని తీసుకు రాగలిగారు?సొంతంగా ఒక్క సీటు కూడా తీసుకురాలేకపోయినా మిగతా రాష్ట్రాల వాళ్ళు కోటరీ పేరుతో అంత బలంగా ఉండి తమ రాష్ట్రానికి మేళ్ళు చేసుకుంటున్న కాలంలో మీరేం చేశారురా బానిస కొడుకుల్లారా?ఇక్కడ ముఖ్యమంత్రి యెవడు అనేది తెలియాలన్నా అక్కడి నుంచే పేరు రావాలి!ఇక్కడ కులాల వారీగా ప్రాంతాల వారీగా మతాల వారీగా ప్రజలు చీలే దుష్ట రాజకీయం మీ మూలంగానే పెరిగింది కదరా అంట్లవెధవల్లారా?ముఠాలు కట్టి వాటితో అధికారాని కెగబాకిన ముఠా దాన్ని పదిలంగా వుంచుకోవటానికి తమ సొంత మనుషులకి వెసులుబాటు కల్పిస్తూ తమ సొంత ప్రాంతాల్ని పెంచుకుంటూ ఉండటం వల్లనే కదరా ప్రాంతాల మధ్య అసమానతలు పెరిగి రాష్ట్రం చీలింది?చెయ్యాల్సిన దిక్కుమాలిన పనులన్నీ సిగ్గులేకుండా చేసి ఇవ్వాళ మళ్ళీ మరోసారి ఇంకోరకం దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు - అంటే మిమ్మల్ని నమ్మి మీవెంట తిరిగిన జనాన్ని యెట్టి పరిస్థితుల్లోనూ సుఖంగా ఉండనివ్వరన్న మాట!

ఇప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే కాపీ స్లోగనుతో జనం ముందు వీరంగాలు వేస్తున్న వాళ్ళకి అసలు ప్రత్యేకహోదా స్వరూపస్వభావాలు తెలుసా?దానివల్ల నికరంగా యెంతమేలు జరుగుతుంది?దాని నిర్ధారిత లక్ష్యం యేమిటి?తెలంగాణా ఇస్తానని అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నరేళ్ళ్ళు కాంగ్రెసు సాగదీస్తున్నప్పుడు తెరాసా వాళ్ళు తెదెపా మీద పడి యాడవటం అసలు విభజనకి వ్యతిరేకంగా ఉన్నది కాంగ్రెసులోని హైదరాబాదు వ్యాపారస్తుల కూటమియేనని తెలియకనే చేశారా?రోడ్డు మీద జండాలు పుచ్చుకు తిరిగే మామూలు కార్యకర్తల కంటే తెలియదనుకోవచ్చు,పై స్థాయిలో జరుగుతున్నవన్నీ తెలిసి గూడా కాంగ్రెసుని అంతగా అంటకాగిన కేసీఆర్ తెలివి యేపాటిది?ఆంధ్రాలో అసలు రాజకీయంగా యేమాత్రం అవగాహన లేనివాళ్ళకి గూడా విభజన హడావిడిగా చెయ్యడం నచ్చలేదు!విడిపోవటం ఖాయమని తెలిశాక సమైక్యం అని మొదలుపెట్టినప్పుడే జనానికి కొంత అర్ధమయింది,దానికి తోడు పరమ నీచాతినీచంగా ముఫ్ఫై సీట్ల కోసం డిల్లీలో ఒకళ్లనొకళ్ళు పరువులు దిగజార్చుకుంటూ నడిపిన రాజకీయం మరింత విసుగు పుట్టించింది,ఇక తమ నియోజకవర్గ ప్రజలకి గౌరవనీయమైన ప్రతినిధులైన పార్లమెంటు సభ్యుల్ని కూడా మార్షల్స్ స్థాయికి దిగజార్చిన వైనం కాంగ్రెసుకి క్రమం తప్పకుండా వోటు వేసే సాంప్రదాయిక వోటర్లని కూడా రెచ్చగొట్టింది!ఇన్ని దుర్మార్గాలు చెస్తున్నప్పుడు కూడా వాళ్ళ వెంట నడిచారు మన జనం తెలివి లేకుండా!ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారు,యెందుకని?

పాతవీ పనికిరానివీ అని తెలిసి కూల్చి పారెయ్యాల్సిన సందర్భంలో కూడా కేవలం ఆంధ్రాకోసం ప్రత్యేక హోదాని కొనసాగించాలా?ఒక్క ఆంధ్రాకే కాదు ఇదివరలో నిర్వచనాలతో రూపొందించిన విధివిధానాలను మొత్తంగా పక్కకి తోసేసి అసలే రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆంధ్రాకోసం ప్రత్యేకంగా అలోచించి కొనసాగించాలా?ఇకముందు అసలెవ్వరికీ ఇవ్వనంటుందే తప్ప కేంద్రం ఆంధ్రాకి మాత్రమే ఇవ్వనంటున్నదా?విభజన తర్వాత కొత్తగా మళ్ళీ నడక మొదలు పెట్టటం కష్టంగా ఉంటుందనీ తెలుసు,అన్నీ అమర్చి పెట్టేవాళ్ళు యెప్పుడూ ఉండరనీ తెలుసు,మన కష్టంతోనే యెదగాలనీ తెలుసు - అయినా యెందుకీ వెర్రి ఆవేశం?ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన కష్టం తను పడుతున్నాడు,ఇప్పటికే యెన్నో బహుళజాతి కంపెనీల నుంచీ ప్రపంచ ప్రసిధ్ధి గాంచిన వ్యాపార సంస్థల నుంచీ యం.వో.యూలు రాబట్టి ఉన్నాడు.రాజధాని తొలిదశ పూర్తయి ప్రభుత్వం ఇక్కడికి వస్తే గానీ వ్యవస్థాపరమయిన యేర్పాట్లు పూర్తి కావు, ఇంతట్లోకే తొందరపడితే యెలా?నా మనసులో మొదటినుంచీ ప్రత్యేకహోదా పట్ల వ్యామోహం లేదు - వస్తే రానీ పోతే పోనీ అని తప్ప!ఇవన్నీ మనని ప్రశాంతంగా ఆలోచించనివ్వకుండా గందరగోళం సృష్టించే కాంగ్రెసు మార్కు యెత్తుగడలు, మేధావులు కొంచెం వాస్తవికంగా ఆలోచించడం నేర్చుకోవాలి.

దొంగలు దొంగలు చేరి వూళ్ళు పంచుకుంటారు,వాటా కుదరని వాడు వేరే పార్టీ పెడతాడు అన్న దసరా బుల్లోడు సినిమా పాటను నిజం చేస్తూ యే మనిషైతే ఆంధ్రోళ్ళని తిట్టి రాష్ట్రాన్ని విడగొట్టి అధికారంలో కొచ్చి మళ్ళీ ఆ ఆంధ్రోళ్ళ సాయంతోనే బల్ పసంద్ దిల్ పసంద్ అంటూ ఖుషీగా ఉంటే ఆ బటాచోరు మోసాన్ని మాత్రం తెలుసుకోలేని వాళ్ళంతా అతను గాలి పోగేసి మాట్లాడినా రెల్లుదుబ్బుల మాదిరి తలలూపి ఆమోదించారు!ఇప్పటికీ అదే దోపిడీని పేరు మార్చి చేస్తున్నా అదేమని అడగలేని వాళ్ళు అతను అంటగట్టిన ద్వేషపు మత్తుని మాత్రం వొదుల్చుకోలేకుండా వున్నారు, యెందుకని?యెప్పుడో ప్రాస బాగుందని "ప్రాంతం వాడు దోస్తే ప్రాంతం లోనే పాతరేస్తాం ప్రాంతేతరుడు చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడ్తాం" అని వాగిన ముక్కని ఇప్పటికీ జపించే వాళ్ళు నిన్నటి రోజున తమ ప్రాంతపు దోపిడిదార్లని యేమి చెయ్యగలిగారు?ఇప్పటి రోజున చేస్తున్న వాళ్ళని యేమి చెయ్యగలుగుతున్నారు?రేపటి రోజునైనా వీళ్ళు దోపిడీ అని పేరుపెట్టిన దాన్ని ఆపు చెయ్యగలరా?హైదరాబాదుని ఆంధ్రోళ్ళ కబంధహస్తాల నుంచి ఇడిపిస్తం మా దమ్ము చూపిస్తం అన్న పెద్దమనిషి ఇప్పుడు ఆంధ్రోళ్ళనే అంటకాగుతుంటే యేమి చెయ్యగలుగుతున్నారు?అసలు రాష్త్రం విడిపొయ్యాక యెంత భూమిని ఆంధ్రావాళ్ళ కబ్జా నుంచి స్వాధీనం చేసుకుని తెలంగాణా ప్రజలకి అప్పగించారు?నూటికి 90 శాతం మంది తెలుగువాళ్ళు ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుని బలవంతంగా రుద్దేస్తున్నారనీ తెలుగుని అధికార భాషగా చేస్తే ఉర్దూకి అన్యాయం జరుగుతుందని అఘోరించేవాడు కూడా మేధావియేనా?

ఆంధ్రప్రజలకి అవమానం అంటూ జరిగితే అది అన్ని రాజకీయ పక్షాల వల్లా సమానంగానే జరిగింది!యే ఒక్క పార్టీ అత్యున్నతమైన ఆదర్శాలకి కట్టుబడి లేదు - అధికారమే పరమావధి!ఇవ్వాళ తెలంగాణలో చెరువుల్ని బాగు చేస్తూ వాట్ని ఆంధ్రా దోపిడీ పాలకులు నిర్లక్ష్యం చెయ్యడం వల్లనే అట్లా జరిగిందంటున్నాడూ తెలంగాణా ముఖ్యమంత్రి - అందులో నిజమేంత అనేది కూడా ఆలోచించకుండా తలలూపుతున్నారు కొందరు తెలంగాణా మేధావులు.మహబూబ్ నగర్ జిల్లాలో తుమ్మిడిగుంట్ల(పేరు కల్పితం) అనే వూళ్ళో వర్షాలు దిట్టంగా కురిసి వూరి చెరువు నిండితే ఆంధ్రా నించి యెవడన్నా వొచ్చి ఆ చెరువుని యెండగట్టగలడా?అట్లా యెండగడితే ఆ వూరివాళ్ళు వూరుకుంటారా?అంతెందుకు జీవనదులే యెండిపోయి ప్రవాహవేగం తగ్గి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇసుకమేటలు వేస్తున్న కాలంలో భూగర్భజలాలు కుంచించుకుకుపోతే అది కూడా ఆంధ్రోళ్ళ మూలంగానే జరిగిందని ఒకడంటే విని నమ్ముతున్న వాళ్లలో విద్యాధికులు కూడా వున్నారంటే ఆ మేధావిత్వాన్ని చూసి నవ్వాలా యాడవాలా?ఆంధ్రాలో యెర్రచందనం స్మగ్లర్లకి యెప్పట్నించో సాయపడుతూ పోలీసుల మీదకి లారీలు యెక్కించి చంపటానికి కూడా తెగబడిన రౌడీకూలీల మీద దాడిని ఈ మధ్యనే మొదలైన చిన్న వివాదం మూలంగా తమిళుడైన నరసింహన్ మీద కోపంతో చేశారని అంటున్నాడు ఒకాయన - నిజంగా విభజన కోసం జరిగినదంతా తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని చేసిన న్యాయపోరాటమేనా?

అప్పట్లోనే చెన్నారేడ్ది అరిభీకరంగా రెచ్చిపోయి కూడా తెలంగాణా ప్రజల్లో డిపోవటానికి గట్టి వూపు రాకపోవటంతో ముఖ్యమంత్రి పోష్టుతో సర్దుకుని వొదిలేశాడు, కాంగ్రెసులో ఉంటూనే ప్రతి కాంగ్రెసు ముఖ్యమంత్రినీ ప్రతిపక్షం వాళ్ళకన్నా యెక్కువగా యేడిపించిన రాజశేఖర రెడ్డి చంద్రబాబు నుంచి అధికారం లాక్కోవటానికి తెలంగాణా వాదాన్ని పైకి తీసుకొచ్చాడు,అధికారంలోకి రాగానే నక్సలైట్లతో పాటూ తెరాసాని కూడా అణిచిపారెయ్యాలని చూశాడు,రెండుసార్లు అధికారానికి దూరమైన చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన వాడు కాస్తా అక్కడున్నది నా పాత ఫ్రెండే కదా అని తనూ తెలంగాణాకి సై అన్నాడు. పోనీ సరే అన్నవాడు ఆంధ్రోళ్ళని యెందుకు తిట్టడం అని గట్టిగానూ మాట్లాడలేదు,యెందుకని?ఆంధ్రోళ్ళ దోపిడీ అనే దుర్మార్గమైన మాటని గట్టిగా వ్యతిరేకించగలిగిన ఒకేఒక్క రాజకీయ నాయకుడు చంద్రబాబు ఆనాడు మాట్లాడకపోవటం వల్లనే కదా ఇవ్వాళ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రితో గాడిద అనిపించుకోవాల్సి వచ్చింది!అంతా అయిపోయాక నిన్న మాపార్టీలో పెరిగిన వాడు ఇవ్వాళ నన్ను విమర్శిస్తున్నాడు అని బుడిబుడి యేడుపులు యేడిస్తే యేమిలాభం?నాలాంటివాడికి తమరి మొదటి పార్టీ కాంగ్రెసు అని గుర్తుకు రాదా?కాంగ్రెసులో యెప్పటి వరకూ ఉన్నావు నువ్వు - పార్టీ పెడుతున్నప్పుడు చేరలేదు,జనం నీరాజనాలు పడుతున్నప్పుడు చేరలేదు,యెన్నికల ఫలితాలు ప్రభంజనాన్ని చూపిస్తున్నప్పుడు చేరలేదు,మామగారు గెలిచి అధికారం ఖాయం అనుకున్నాక దూకావు నీ చరిత్ర యేపాటి శుధ్ధమో మాకు తెలియదా నాయనా!గట్టిగా ఆనాడు కేసీఆర్ విద్వేషపూరిత ప్రచారాన్ని అడ్డుకోలేదు,గట్టిగా ఈనాడు రాష్ట్రం పరిస్థితి పట్ల నమ్మకాన్ని కలిగించి ఆందోళనని చల్లార్చలేడు - ఈ గోపి రాజకీయంవల్ల కాదా కాంగ్రెసు బలపడుతున్నది?ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి,తెలివైన వాళ్ళంతా కాస్త నిదానంగా ఆలోచించండి - భూస్థాపితం చెయ్యాల్సిన కాంగ్రెసుకి ప్రత్యేకహోదా పేరుతో వూపిరు లూదకండి!

స్వాభిమాని యెవడూ అతిగా దేనికోసమూ ప్రాధేయపడడు!

12 comments:

  1. ఏం ఫర్వాలేదు. భయపడకండి. ఆంధ్రాజనం వంటి పిచ్చిమారాజుల తాటాకుమంట వంటి కోపం తగ్గి కాంగ్రేసోళ్ళని గెలిపిద్దామనే అనుకున్నా, వారి నాయకాగ్రేసరుడు రాహులయ్యగారు ఆ కాంగ్రేసుని భూస్థాపితం చేయక వదలడు కాబట్టి అది బతికి బట్టకట్టటం జరగని పని, అలాగే నిత్యరంధ్రాన్వేషకుల మాటలు ఇప్పటికే పాతబడ్డ డగిలాగులు కాబట్టి వాటి పవరు ముందుముందు కనిపించదు. ఐనా pot calling kettle black అన్నట్లు కాంగిరేసు కూడా ఇతరుల తప్పులెంచటమేనా విడ్డూరం కాకపోతే!

    ReplyDelete
    Replies
    1. మనం ప్రయత్నించి సాధించకుండా దానంతటది యేదీ జరగదు మాస్టారూ!ఈ మధ్యన విహారయాత్రకి వెళ్ళోచ్చాక ఫోర్సు కనపడుతుంది - యోగా చేశా డంటున్నారు పన్లోపనిగా గ్రహశాంతులు కూడా చేయించారేమో?కాంగ్రెసుని అంత తేలిగ్గా తీసిపారెయ్యగూడదు వేడి తగ్గ్గించకూడదు.

      Delete
  2. సోనియా ఎట్టిపరిస్థితిలోనూ తెలంగాణా ఇవ్వదని కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారం చేస్తే అది సోనియా తప్పా? తెలంగాణా ఏర్పాటు కంఫర్మ్ అయిపోయింది అని దిగ్విజయ్ సింగ్ ప్రకటించిన నాలుగు నెలల తరువాత కూడా తెలంగాణా ఇవ్వరు అని జనం అనుకుంటుండడం నేను విజయనగరంలో చూసాను. అలా ప్రచారం చేసి కాంగ్రెస్‌ని ముంచిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ సభ్యుడు కాదు.

    ReplyDelete
  3. http://economictimes.indiatimes.com/news/politics-and-nation/kiran-kumar-reddy-writing-tell-all-book-on-telangana-to-expose-sonia-gandhi-rahul-gandhi/articleshow/47219951.cms

    ReplyDelete
    Replies
    1. శ్రిరాం గారూ,
      మీ ఇదివరకటి కామెంట్లలో పరమాచార్య విదేశీయులకి వైదికభాషయే అన్ని భాషలకీ మూలం అని సోదాహరణంగా వివరించిన సన్నివేసం గురించి రాశారు.దాని పూర్తి వివరాలు ఉన్నాయా?అది ఒక వ్యక్తి పరమాచార్యని కలవడానికి వెళ్తే ఆ ఫారినర్స్ కలవడం మాటల్లో వాళ్ళు వచ్చిన పని తెలియడం,తను కూడా వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగినట్టు ఉంది కదా - ఆ వ్యక్తి యెవరు?తర్వాత ఆ హీఎబ్రూ గురించి చెప్పుకున్న ఆ ఆమేధావుల పరిశోధన యేమైంది?వాళ్ళు వచ్చినప్పుడు హీబ్రూయే ప్రాచీనం అని నమ్మకంతో వచ్చారు,కానీ పరమాచార్య మరో విధంగా రుజువు చేసినా ఇక్కడ జవాబు చెప్పలేక వూరుకున్నా దాన్ని తమ పరిశోధనా పత్రంలో ఉంచనూ వచ్చు ఉంచకపోనూ వచ్చు.అలాంటి అన్ని విషయాలూ మీకు తెలుసా?

      Delete
  4. దిగ్విజయ్ సింగ్ తెలంగాణాపై స్పష్టమైన ప్రకటన ఇచ్చిన తరువాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా రాదు అంటూ చేసిన ప్రకటనలు నేను TVలో చూసాను.

    ReplyDelete
  5. హరిగారు.. రాజకీయప్రయోజనాలే తప్ప ప్రజాప్రయోజనాలుండవు. చంద్రబాబు రాజకీయ వ్యాపారవేత్త. తనకు ప్రయోజనం లేనిదే ఏ పనిచేయరు. బాబు పిలవంగానే ఎగేసుకుని వచ్చి ఇక్కడెవరు పెట్టుబడులు పెట్టరు. ప్రత్యెక ప్రతిపత్తి లేక పెట్టుబుడులు లేక సీమాన్ద్రులది కుక్కబతుకే.

    ReplyDelete
  6. అనంతమైన కాలప్రవాహంలో ఒక నాయకమ్మన్యుడి టక్కుటమారాలవెలుగుల జిలుగులూ నిలువవు. మరొక నాయకమ్మన్యుడి కల్లబొల్లియేడ్పుల కబురులూ నిలువవు. వేరొక నాయకమ్మన్యుడి ప్రయోజనాల దుర్యోజనాల విలాసాలూ నిలువవు. The Time is a great leveler. మనదేశంలో ఎప్పుడూ నాయకులహ్రస్వదృష్టులమూలానే వినాశనపర్వాలు నడిచాయి, ఇంకా నడుస్తున్నాయి, ముందూ నడుస్తాయి. కాని అన్నీ క్రమేణా కొట్టుకుపోతాయి. ఎందుకంటే, The Time is a great leveler కాబట్టి.

    ReplyDelete
    Replies
    1. ఇక్కడొక జీవికి ప్రాణం పొస్తా!
      అక్కడొక జీవికి ప్రాణం తీస్తా?
      ఒక లెవలైపోద్ది?!
      --ఇది ఒక సినిమా విలన్ డైలాగు.

      లెవలయ్యాక యెవడు నిలబడ్తాడో
      ముందుగా తెలియదు!
      ముందుగా తెలిసేట్టు చేస్తే పెద్దాయన సొమ్మేం పోయిందో?

      తయారయిన దినుసుల్లో తేడా ఉందంటారా?
      తయారయ్యాక బుధ్ధికి పట్టిన తెగులంటారా!

      Delete
  7. i think congress still working against Andhra. For the case between Ap & Ts for higher education council, TS represented by Kapil sibbal and Abhishek manu sangvi. they could have written it for damaging andhra.

    ReplyDelete
    Replies
    1. I don't think this is correct.

      Telangana was represented by Advocate General K. Ramakrishna Reddy.

      http://advocatemmmohanlaw.blogspot.in/2015/05/it-is-settled-position-of-law-that.html

      The other points to be noted are:

      1. Sibal, Sanghvi, Salvi, Jethmalani etc. are prominent lawyers who charge hefty fees. They can't be taking party permission or even inform the party what cases to take

      2. Both the language & logic of the relevant sections (e.g. 75/101) is the same as used in earlier state formation acts. Claiming malafide is not appropriate.

      http://jaigottimukkala.blogspot.in/2015/01/andhra-misadventure-on-tenth-schedule.html

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...