అహల్య పవిత్రత నిజముగ శంకించరానిదేనా?
బాల.48వ సర్గము:విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో
శ్లో||తస్యాంతరం విదిత్వా తు సహస్రాక్ష శ్శచీపతిః,
మునివేషధరోహల్యా మిదం వచన మబ్రవీత్,
శ్లో||ఋతుకాలం ప్రతీక్షంతే నార్ధివ స్సు సమాహితే,
సంగమం త్వహ మిచ్చామి త్వయా సహ సుమధ్యమే.
అతడు(గౌతముడు) లేని కాలము నెఱిగి యింద్రుదు ముని వేషము ధరించి అహల్యతో నిట్లనేను.
సుందరీ!భోగార్ధులు ఋతుకాలమును నిరీక్షింపరు.నేను నీతే సంగమమును కోరుచున్నాను.
శ్లో||మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన,
మతిం చకార దుర్మేధా దేవరాజ కుతూహలాత్,
శ్లో||అధ బ్రవీత్ సురశ్రేష్ఠం కృతార్ధే నాంతరాత్మనా,
కృతార్ధాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్ర మిత~హ్ ప్రభో,
మునివేషధారుని యింద్రునిగా నెఱిగి,యింద్రుడు తనయందాసక్తు డగుట వలన దుర్మతియై సమ్మతించేను.
అంతట కోరిక తీరిన మనస్సుతో "ఇంద్రా!కృతార్ధురాల నైతిని.శీఘ్రముగ నిచటి నుండి పొమ్ము,నిన్ను - నన్ను సర్వదా కాపాడుకొనుము" అనేను.
గౌతము డింద్రుని:
శ్లో||మమ రూపం సమాస్థాయ కృతవా నసి దుర్మతే,
అకర్తవ్య మిదం తస్మా ద్విఫల స్త్వం భవుష్యసి.
దుర్మతీ!నా రూపమును ధరించి యకృత్యమును చేసితివి.అందువలన వృషణములు లేనివాడవగుదువు.
అహల్య గౌతమునితో
శ్లో||అజ్ఞానార్ధర్షితా నాధ ద్వద్రూపేణ దివేకసా,
న కామ కారా ద్విప్రర్షే ప్రసాదం కర్తు మర్హసి.
"నాధా!అజ్ఞానముతో నీ రూపము నందిన ఇంద్రునిచే ధర్షింపబడితిని.కామము వలన గాదు,అనుగ్రహించవలసినది" అని వేడుకొనెను.
గౌతము డహల్యను:
శ్లో||ఇహ వర్ష సహస్రాణి బహూని త్వం నివత్స్యసి,
వాయుబక్షా నిరాహారాతప్యంతీ భస్మశాయినీ.
"ఇచట నీవు పెక్కువేల సంవత్సరములు వాయువును భక్షింపుచు నిరాహారవై తపము చేయుచు బూడిదయందు పరుండి సర్వభూతమూ కదృస్యమై ఈ యాశ్రమమందు వసింపగలవు" అని శపించెను.
ఒకే కధకు రెండు సర్గము లందలి తేడాలు: 1).బాలకాండలో అహల్య యిష్టపడియే ఇంద్రునితో సంపర్కము చేసినటులున్నది.3).ఉత్త్రకాండములో ఇంద్రుడు గౌతముని యాకారములో నుండుటచే భ్రాంతిపడినదై సంపర్కము చేసి నటులున్నది.
ఇంద్రుని కిచ్చిన శాపములో బాలకాండలో వృషహీనుడవు కమ్మని,ఉత్తరకాందలో శత్రువులచే జిక్కుదువని యున్నది.
అహల్య కిచ్చిన శాపము బాలకాండలో అదృశ్యవు కమ్మని యుండగా ఉత్తరకాండలో శిలవుగా యుండుమని యున్నది.
రాముని వనవాసమునకు బొమ్మనుట కైక దోషమా?
1.రాజ్యము భరతునిదని రామునికి తెలియునా?అయోధ్య.107వ సర్గము:రాముడు భరతునితో
శ్లో||పురాభ్రాతః పితానః స్సమాత్రం తే సముద్వహన్,
మాతామహే సమాశ్రౌషీ ద్రాజ్యశుల్క మనుత్వమం.
"మున్ను మన తండ్రి నీ తల్లియగు కైకేయిని వివాహమాడునపుడు నీ తాతయగు కేకయ మహారాజునకు 'కైకేయికి పుట్టినవానికే రాజ్యమొసంగెదను' అని వాగ్దానము గావించెను." - దీనిని బట్టి రాజ్యము తండ్రికి పిదప ణరతునికి చెందవలయునని రామునకు తెలియును.
2.కౌసల్య ఆనందంగా పలికిన పలుకుల కర్ధ మేమిటి?
అయోధ్య నాలుగ సర్గము:రాముడు తన తల్లితో తన పట్టాభుషేక వార్త తెలుపగనే కౌసల్య యిట్లు పలికెను.
శ్లో||వర్స రామ చిరంజీవ హతాస్తే పరిపంధినః
జ్ఞాతీన్ మే త్వం శ్రియా యుక్త స్సుమిత్రా యాశ్శ్చనందయః
"రామా!నీ శత్రువులు చంపబడిరి,నీవు సంపదతో గూడి నా జ్ఞాతులను,సుమిత్ర యొక్క జ్ఞాతులను సంతౌషపెట్టుము." దీనిని బట్టి కౌసల్యకు కూడ దశరధుడు కైక కుమారుననకు రాజ్యాధికారము దత్తత చేయుట తెలియును.అందువలననే తన కుమారునకు రాజ్యము సంక్రమించునను ఆశను వదలుకొనినది.కాని రాముడు ఆమెతో తన పట్టాభిషేక వార్త తెలుపగనే తానూహించని కార్యము తన యెదుట జరగబోవుచున్నందుకు హర్షాతిరేకముతో పులకరించినదై పైవిధముగ పలికెను.కౌసల్యకు కైక పైన గల ఈ ద్వేషమునకు కారణము భరతునకు కలగబోవు రాజ్యప్రాప్తి యని వేరే వచింప నవసరము లేదు.
3.దశరధుని ఆందోళనకు కారణ మేమిటి?
అయోధ్య 1వ సర్గము:
శ్లో||అధ రాజ్ఞో బభూవైవ వృధ్ధస్య చిరజీవనః
ప్రీతిరేషా క రామో రాజస్యా న్మయి జీవతి.
దశరధునకు తాను జీవించి ఉండగా "రాముడెట్లు రాజగునా?" యను నాలోచన కలిగెను.
శ్లో||ఏషా హ్యస్య వరా ప్రీతిర్హృది సం పరివర్తతే
కదా నామ సుతం ద్రక్ష్యా మ్యభిషిక్త మహం ప్రియం.
"నేనెపుడు నా ప్రియపుత్రుడగు రాముడు రాజ్యాభిషిక్తునిగ జూతునా?" యను మిక్కిలి ప్రీతి యెడతెగక దశరధుని హృదయమున నేర్పడెను.దశరధుడు,తాము కైకకు జన్మించిన పుత్రునకే రాజ్య మొసంగుదునని ప్రమాణము చేయుటచే ,దానికి భిన్నముగ రాముని రాజ్యమున ప్రతిష్టించుటకు మార్గము నాలోచించుచు నిరంతర ఖేదము అనుభవించినట్లు తెలియుచున్నది.
అయోధ్య 4వ సర్గము:దశరధుడు రామునితో నిట్లనేను.
"నిన్ను పుష్యమి యందభిషేకింపుమని నా మనస్సు త్వరపెట్టుచున్నది.రేపు నిన్ను యూవరాజ్యమందభిషేకింతును.నీ స్నేహితు లప్రమత్తులై యంతట నిన్ను రక్షింతురు గాక,ఇట్టి కార్యములకు పెక్కు విఘ్నములు కలుగుచుండును.భరతుడు పురమునుండి పంపబడినాడు.అతడు వచ్చులోపల నీ యభిషేకమునకు తగిన సమయము.నీ సోదరుడగు భరతుడు సత్పురుషమార్గమందున్నవాడు,జ్యేష్టుననుసరించువాడు,ధర్మాత్ముడు,జితేంద్రియుడు,దయాహ్ర్దయుడు అయినను మనుజుల మనస్సు స్థిరముగా నుండదని నా అయభిప్రాయము."
పై మాటలను బట్టి దశరధ-రాము లిరువురు రాజ్యార్హత గల భరతుని వలనను,భరతునివైపు వారివలన యేవైన నాటంకములు గల్గునేమో యని యప్రమత్తులై యున్నట్లు తోచుచున్నది.
1.రాజ్యము భరతునిదని రామునికి తెలియును!
2.కౌసల్య ఆనందంగా పలికిన పలుకుల వెనక ఉన్నది కైక పట్ల ద్వేషం!
3.దశరధుని ఆందోళనకు కారణం అక్రమంగా రాముణ్ణి యెట్లా రాజుని చెయ్యాలా అని!
యుధ్ధమునకు కారకుడెవరు?రావణుడా!శూర్పణఖయా!రాముడా!
అరణ్య.11వ సర్గము:రాముడు లక్ష్మణునితో
శ్లో||తస్యేద మాశ్రమ పదం ప్రభావాద్యస్య రాక్షసైః
దిగియం దక్షిణాత్రా సాద్దృస్యతే నోప భుజ్యతే.
శ్లో||యధా ప్రబృతి చాక్రాంతా దిగి యం పుణ్యకర్మణా,
తదా ప్రకృతి నిర్వైరాః ప్రశాంతా రజనీ చరాః
ఏవని ప్రభావముచే రాక్షసులు ఈ దక్షిణదిక్కు నుపభోగింప జాలకుండిరో,భయముతో చూచుచుండిరో ఆ అగస్త్యుని ఆశ్రమమిది.
పుణ్యకార్యము లాచరించుచు నా అగస్త్యు డెప్పటినుండి యిచట నివసించెనో,అప్పటినుండియు రాక్షసులు ఋషులపై వైరము మాని ప్రశాంతి వహించిరి.
పై విషయములను బట్టి అగస్త్యుడు మహాబలవంతుడని తెలియుచున్నది.అరణ్యకాండము 12వ సర్గలో నగస్త్యుడు రామున కనేక యాయుధము లిచ్చినట్లు గలదు.
దండకారణ్యము రాక్షసుల పాలనలోని ప్రాంతము - ఖరుడు మొదలగు రాక్షసరాజు లచట పాలన సాగించుచుండిరి.అగస్త్యుడు,విశ్వామిత్రుడు మొదలగు నార్యర్షులు దండకారణ్యమునకు వలస వచ్చిరి.అట్లు వచ్చినవారు బలహీనులగు రాక్షసరాజుల జయించి వారి రాజ్యము లాక్రమించుట,రాక్షసపాలితప్రాంతములందు యజ్ఞములనుపేరుతో రాక్షసుల యాచారములకు విరుధ్ధముగ వర్తించుట మున్నగు కార్యము లొనర్చుచు, అవసరమని తోచినప్పు డ్డార్యరాజుల సహాయమును పొందుచుండిరి.
అరణ్యకాండ 6వ సర్గ:ఋషులు రామునితో
శ్లో||పంపానదీ నివాసానా మను మందాకినీమపి,
చిత్రకూటాలయానాంచ క్రియతే కదనం మహత్.
పంపానదీ తీరవాసులును,మందాకిని ననుసరించిన చిత్రకూటాలయములందును ఋషు లధికముగ పీడించబడుచున్నారు.
శ్లో||తత స్త్వాం శరణార్ధం చ శరణ్యం సముపస్థితాః
పరిపాలయనో రామః వధ్యమానా న్నిశాచరైః
అందువలన రక్షకుడవగు నిన్ను శరణుకోరి వచ్చితిమి,రాక్షసులచే హింసింపబడుచున్న మమ్ము రక్షింపుము.
రాముడు ఋషులతో
శ్లో||కేవలే నాత్మకార్యేణ ప్రవేష్టవ్యం మమావనం.
విప్రకార మపాక్రష్టుం రాక్షసైర్భవ తామిమం.
రాక్షసులు మీకు చేయు నపచారములను తొలగించుటకు మీ కార్యమునకై నేనీ యరణ్యమునకు వచ్చితిని.తండ్రి యాజ్ఞను పాలించుట కీ వనమునకు వచ్చినను యాదృచ్చికముగ మీ కార్యసిధ్ధి కొరకు వచ్చినట్లయినది.కనుక నా వనవాసము మిక్కిలి ఫలప్రదము కాగలదు.
రాముడీ మాటలు పలుకునప్పటికి సీతాపహరణము జరుగలేదు.రాముడు "ఋషుల కార్యమునకై యీ అడవికి వచ్చినాన" నుటలో నతడ రణ్యవాస కాలములో రాక్షసుల జయింపదలచినాడని తెలియుచున్నది.రాముడు "తన వనవాసము మహాఫలప్రదము కాగలద" నుటలో ఆ ఫలము - రాక్షసవధ,రాక్షసరాజ్యముల నాక్రమించుట కావచ్చును.
అరణ్య.9వ సర్గము:సీత రామునితో
ఈ లోకమున కామజములగు మూడు వ్యసనము లున్నవి:అందు మొదటిది అసత్యము పలుకుట,రెండవది పరస్త్రీగమనమౌ,మూడవది కారణము లేని రౌద్రము.ఈ చివరి రెండును అసత్యమాడుత కంటెను ఘోరమైనవి.మూడవదైన కారణము లేకయే పరుల ప్రాణములను తీయుత యను రౌద్రము మోహముచే నిపుడు నీకు తటస్థించినది.
శ్లో||ప్రతిజ్ఞా తస్త్వయావీర! దండకారణ్యవాసినాం,
ఋషీణాం రక్షణార్ధాయ వధస్సం యతి రక్షసాం.
శ్లో||ఏ తన్నిమిత్తం చ వనం దండకా యితి విశ్రుతం,
ప్రస్థితస్త్వం సహ భ్రాతా ధృఅత బాణ శరాసనం.
వీరా!దండకారణ్యవాసులగు ఋషుల రక్షణ కొరకు యుధ్ధమున రాక్షసుల చముదునని ప్రతిజ్ఞ చేసితివి.దీనికొఱకే నీవు సొదరునితో ధనుర్బాణములను ధరించి దండకాతవికి బయలుదేరితివని వినికిడి.
మరియు సీత రామునితో
శ్లో||న కధం చన సా కార్యా గృహీత ధనుషాత్వయా,
ముధ్ధిర్వైరం వినాహం తుం రాక్షసాందండ కాశ్రితాన్,
అపరాధం వినాహం తుం లోకాన్వీర న కామయే.
నీవీ దండకారణ్య రాక్షసులను పగలేకయే ధనుస్సు దాల్చి వధించుట కిచ్చగింపకుము.అపరాధము లేక యే ప్రాణులను చంపుటకు నే నిష్టపడను.
అని పలుక రాముడు సీతతో:
దండకారణ్యమున రాక్షసులచే పీడించబడుచున్న్న ఋషులు నన్ను కాపాడుమని కోర నేను వారిని రక్షింతునని ప్రతిజ్ఞ చేసితిని.నేను మునులకు ప్రతిజ్ఞ చేసి తద్విరుధ్ధముగ నాచరింప జాలను.నాకెల్లప్పుడు సత్యమే ప్రియము.
అని తన నిర్ణయము తెలిపెను.దీనిని బట్టి రాముని ధ్యేయము రాక్షసవధ యని తెలియుచున్నది.
57వ సర్గము:రాముడు లక్ష్మణునితో
"జనస్థాన నిమిత్తం హి కృతవైరోస్మి రాక్షసైః"
జనస్థాన నిమిత్తమై రాక్షసులతో విరోధము చేసికొంటిని.
ఈ మాటను బట్టి రాముడు రాక్షసులతో కావలెననైయే కోరి విరోధము చెసికొనిన్నట్లు కంపించుచున్నది.అనగా జనస్థానమందలి రాక్షసులతో యుధ్ధమును గోరి శూర్పణఖను కురూపిగ నొనర్చెనా?లేక జనస్థానము నాక్రమించుటకై యేదైన యత్నమొనరించెనా? యను సందేహమును కలుగజేయుచున్నది.వేఅరే యత్నము లేనిచో రాక్షసులతో విరోధము కోరియే శూర్పణఖను విరూపిగ నొనర్చెననుట స్పష్టము.
అరణ్య.17వ సర్గము:శూర్పణఖ రామునితో
శ్లో||అహం శూర్పణఖా నామరాక్షసీ కామరూపిణీ,
అరణ్యం విచరా మీదమేకా సర్వభయంకరా.
నేను శూర్పణఖ యను రాక్షసిని.కామరూపినిని సర్వభయంకరనై ఈ వనమున ఒంటరిగా తిరుగుచుందును.
శ్లో||రావణో నామమే భ్రాతా బలీయాన్ రాక్షసేశ్వరః,
వీరో విశ్రవసః పుత్రో యదితే శ్రోత్ర మాగతః
నా అన్న రావణుడు,రాక్షసులకు రాజు,విశ్రవసుని పుత్రుడు,బలవంతుడు - నీవతని పేరు వినియుండవచ్చును.
శ్లో||తా నహం సమతిక్రాంతా రామత్వా పూర్వదర్సనాత్
సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం.
రామా! నిన్ను చూచి నావారి నందరిని వదలి నిన్ను భర్తగా పొందవలయునని నీ కడకు వచ్చితిని.
శ్లో||"చిరాయు మే భర్తా".
నీవు నాకు చిరకాలము భర్తవు కమ్మ్ము.
18వ సర్గము:రాముడు శూర్పణఖతో
శ్లో||కృత దారోస్మి భవతి భార్యేయం దయితా మమ,
త్వ ద్విధానం తు నారీణాం సు దుఃఖా స సపత్నతా.
నేను వివాహితుడను,ఈమె నా భార్య.నీవంతి స్త్రీలకు సవతు లుండుట చాల దుఃఖము గలిగించును.
శ్లో|| ఏ నం భజే విశాలాక్షి భర్తారం భ్రాతరం మమ,
అసపత్నతా వరారోహే మేరు మర్కప్రభా యధా.
నీవు సవతిపోరు లేనిదానవై నా తమ్ముని భర్తగా పొందుము అని పలుక,శూఒర్పణఖ రాముని మాటలు నిజమని తలచి లక్ష్మణునితో
శ్లో||అస్యరూపస్యతే యుక్తా భార్యాహం వరవర్ణినీ,
మయా సహ సుఖం సర్వాన్ దండకా న్విదరిష్యసి.
...నేను నీ రూపమునకు తగిన భార్యను,నాతో కలిసి నీవు సుఖముగ దండకయందు విహరింపుము.
లక్ష్మణుడు శూర్పణఖతో:
శ్లో||కధం దాసస్యమే దాసీ భార్యా భ్వతు మిచ్చసి,
సోహ మార్యేణ పరవాంభ్రాతా తా కమలవర్ణిని.
నేనే ఇతనికి దాసుడను,నాకు భార్యవై నీవు దాసివగుట కెట్లు తగుదువు?
శ్లో||సమృధ్ధార్ధ్ధస్య సిధ్ధార్ధా ముదితామలవర్ణినీ,
ఆర్యస్య త్వం విశాలాక్షి భార్యా భవ యవీయసీ.
ఓ విశాలాక్షీ!సమృధ్ధార్ధుదగు నార్య్నకు కనిష్ఠ భార్యవై సిధ్ధార్ధ వగుము.
శ్లో||ఏనాం విరూపా మసతీం కరాళాం నిర్ణతోదరీయం,
భార్యాం వృధ్ధాం పరిత్యజ్య త్వామేవైష భజిష్యతి.
అతడు విరూపయు - వృధ్ధయు,అసతియు,కరాలయు,వ్రేలాడు పొట్ట గలదియు బ్నగు భార్యను వదలి నిన్ను పొందగలడు.
శ్లో||కోహి రూపమిదం శ్రేష్ఠం సంత్యజ్య వరవర్ణినిః,
మానుషీషు వరారోహేః కుర్యాద్భావం విచక్షణః.
ఓ సుందరాంగీ!ఇట్టి నీ శ్రేష్ఠమగు రూపమును వదలి యే బుధ్ధిమంతుడు మనుజస్త్రీల యందనురాగము కలవాడగును?
అని లక్ష్మణుడు పలుక పరిహాసము నెరుగని యా రాక్సహసి అతని మాటలు నిజమని తలచెను.
పై విషయములన్నియు నొక్కసారి పరిశీలించుడు.శూర్పణఖ రాముని జూచి,ఆతడెవ్వరో తెలిసికొని, తన కుటుంబ విషయములు తెల్పి నిర్భయముగ కపటము లేకుండ తాను రాముని భర్తగా కోరి వచ్చితి ననియు,తనను భార్యారూపముతో జూచి - శాశ్వతముగ భర్తవగుమని కోరినది.అట్టి కల్మష మెరుగక మాటలాడు స్త్రీని - రాముడు పొగడి తనకు భార్య గలదనియు,తన తమ్ముడామే కనుకూలుడగు వరుడని వచించెను.లక్ష్మణుడును ఆమె అందమును బొగడి తన వదినెగారి అందమును తూలనాడుచు "నీవు మాయన్నకు రెండవ భార్యవగుమనియు - సుందరాంగివైన నిన్ను విడచి మనుజస్త్రీల యందు అనురాగము కలవాడెట్లగును" అని పలికి ఆమె నింకను రెచ్చగొట్టెను.
పరిహాసము నెరుగని శూర్పణఖ మరల రామునితో తన మనోగతమును వెల్లడించెను.పిమ్మట "నీవంటి స్త్రీలకు సవతులుండుట దుఃఖమును గలిగించు" నన్న రాముని పలుకులను బట్టి రాముడు తనను వలచినాడని సీత లేకున్నచో తనను స్వీకరించునని తలచి సీతను చంపబోయెను,అంత రామలక్ష్మణు లామెను బట్టుకొని విరూపిగ నొనరించిరి.
ఈ విధముగ నొక స్త్రీని యాటలు పట్టించి ఆశ గొలిపి విరూపిగ జేయుట వారి సత్య సంధతయా?క్షాత్ర ధర్మమా?ఆమెతో మొదటనే తా మామెను పరిణయమాడువారము గామని తెలుపవచ్చును గదా!అంతకంటె యామె నచటనుండి వెడలగొట్టు మార్గమా పురుషశ్రేష్ఠులకు గోచరింపలేదా?ఆమె పాలితప్రాంతమునకు వచ్చి ఆమెతో పరిహాసము లాడి ఆమెను విరూపిగ నొనర్పుట యార్యరాజుల కుచితమగు చర్యయా?
ఈ సందర్భమున వాల్మీకి రాముని ప్రశంసించుచు
అరణ్య.17వ సర్గము:
శ్లో||అనృతం నహి రామస్య కదాచి దపి సమ్మతం,
విశేషేణాశ్రమ స్థస్యసమీపే స్త్రీజనస్యచ.
రామున కసత్య మెన్నడును సమ్మతము కాదు.విశేషించి యాశ్రమమందుండుత వలనను,స్త్రీఎల సమక్షమునను - అని వ్రాసెను.రాముడీ సంభాషణమంతయు జరిపినది - స్రీ సమక్షముననే కాదు,స్త్ర్రెతోనే.
దీనిని బట్టి రాముడు శూర్పణఖను విరూపిగ నొనర్చుట రాక్షసులతో వైరము కోరియే యని స్పష్టమగుచున్నది.
అరణ్య.20వ సర్గము:శూర్పణఖ - రామలక్ష్మణులు తనకు చేసిన పరాభవమును తెలుప ఖరుడు వారిపై రాక్షసులను పంపెను.ఆ రాక్షసులతో రాము డిట్లనేను -
శ్లో||ఫలమూలాశనౌ దాంతో తాపసౌ ధర్మచారిణౌ,
వసంతౌ దండకారణ్యే కిమర్ధ ముపహరసధ.
ఫలమూలములను దినుచు జితేంద్రియులమై తాపసవ్ర్త్తి నవలంబించి - ధర్మము నాచరించుచు దండకారణ్యమున నివసించు మమ్మేల హింసించెదరు?
శ్లో||యుష్మాన్ పాపాత్మకా ణంతుం విప్రకారా న్మహాహవే,
ఋషీణాం తు నియోగేన ప్రాప్తోహం సశరాయుధః.
హింసాస్వభావము గల పాపాత్ములగు మిమ్ము యుధ్ధభూమిలో సమ్హరించుటకై ఋఋషుల నియోగముచే ధనుర్బానములు దాల్చి వచ్చితిని.
ఇచట రాముడు రాక్షసులతో "యుధ్ధభూమియందు మిమ్ముల సమ్హరించుతకై ఋషుల నియోగముచే ధనుర్బానముల ధరించి వచ్చితి" ననుటచే రాముదు కావలయుననియే రాక్షసులతో యుధ్ధమును కోరి శూర్పనఖను విరూపినిగ నొనర్చినటుల విశ్దమగుచున్నది.
ఇందు రాముదు తమ్మునిచే శూర్పనఖను స్త్రీ యనియు తలపక హింసించి రాక్షసులను హింసాస్వభావము గలవారనుత యెంతయు గర్హనీయము.
మరియు వనమున వేటాడి మాంసను భుజించుచు, తమ్ను పరిణ్యమాడుమని వచ్చిన స్త్రీతో పరిహాసము లాడి యామేను విరూపిని గావించి తాము ఫలమూలములను దినువారమనియు,జితేంద్రియులమనియు,తాపసవృత్తి నవలంబించి ధర్మము నాచరించుచున్నామనియు వచించుట యెంతటి గడసరిమాటలో పాఠకు లూహించెదరు గాక!
రామ-రావణుల చర్యలయందు ఈ క్రింది భేదమును పరిశీలింపుడు!
రాముడు తనను వలచి వచ్చిన స్త్రీతో పరియాచకము లాడి యామేను విరూపిగ నొనర్చెను.
రావణుడు సీతను గాఢముగ కామించియు తన యధీనములో - నేకాంతయై దిక్కులేక - దిక్కుచోచక యున్నపుడామెతో
సుందర.20వ సర్గము
శ్లో||స్వధర్మో రాక్షసాం భీరు సర్వదైవ న సంశయః,
గమనం నా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా,
శ్లో||ఏవం చైత దకామాం తు నత్వాంస్ప్రక్ష్యామి మైధిలి,
కామం కామశ్శరీరేమేయధాకామం ప్రవర్త్తాం,
శ్లో||దేవి నేహభయం కార్యం మయి విశ్వసి హి ప్రియే,
ప్రణయస్వ చ తశ్వేన మైవం భూశ్శోక లాలసా.
పిఱికిదానా,పరస్త్రీలను పొందుట,బలాత్కారముగ తెచ్చుట నిస్సంశయముగ రాక్షసుల ధర్మము,కావున నేనధర్మ మొనరించితినని తలపకుము.
నా శ్శరీరమున కామము యధేచ్చగా ప్రసరించిన ప్రసరించనిమ్ము,నన్ను కామింపని ఇన్ను స్పృశింపను.
ఓ దేవీ!నీవు భయపడకము,నామాట నమ్ముము,యధార్ధముగ నన్ను ప్రేమింపుము,శోకము నందకుము.
22వ సర్గము:
శ్లో||ఏ తస్మా త్కారణా న్నత్వాం ఘాతయామి వరాననే,
వధార్హా మవమానార్ధం ర్హం మిధ్యా ప్రవ్రజితేర తాం.
ఓ సుందరీ!నీవు వధింపదగియున్నను, అవమానింపదగియున్నను,కపటముగ వానప్రస్థవేషము ధరించిన రామునియందే ప్రేమకలిగియున్నను, నిన్ను చంపుట కాజ్ఞ నొసంగకున్నాను.
రావణుని ఈ మాటలకు, రాముని చర్యలకు నెంతటి వ్యత్యాస మున్నదో గమనింపుడు.పరస్త్రీలను బలవంతముగా గొనివచ్చుట స్వధర్మమైనను తాను గొనివచ్చిన భయాక్రాంతయగు సీత నోదార్చి "నన్ను కామింపని నిన్ను స్పృశింపను" అని పలికిన రావణుడు ధర్మాచరణుడా?తనను కామించి వచ్చిన స్త్రీతో పరియాచకము లాడి యామెను విరూపిగ నొనర్చిన రాముడు ధర్మాచరణుడా?
పై విషయములనౌ బట్టి రావణుడు సీతను గొనివచ్చుట - రాక్షస ధర్మము చేతను,తన చెల్లెలికి జరిగిన పరాభవమునకు ప్రతీకారముగను అని తెలియుచున్నది.
రాముడు సుగ్రీవుని చేరి నిర్హేతుకముగ - ధర్మరహితముగ వాలిని జంపి, సుగ్రీవుని వానరరాజుగ చేయుట కిష్కింధను తనకు లోబడిన రాజ్యముగ చేసికొను తలంపు గాని వేరుగాదు. ఆ విషయము నెఱిగియే విభీషణుడు రాముని చేరి స్వవంశనిర్మూలన మొనర్చుకొని నిర్వీర్యమగు లంకకు రాజయ్యెను.రాముడు విభీషణుని తోడ్పాటుతో బలవంతుడగు రావణుని జంపి లంకను తన యధీనరాజ్యముగ నొనర్చుకొని నిర్వీర్యుడగు విభీషణుని లంక కలంకారమగు రాజుగ నొనర్చెను.కిష్కింధయు నదేవిధమిగ మహాబలవంతుడు - ధర్మాత్ముడు - ధర్మరక్షకుడు నగు వాలి చంపబడగా అలంకారపు బొమ్మయగు సుగ్రీవుని చేతికి వచ్చి నిర్వీర్యమాయేను.
కనుక రామ-రావణ యుధ్ధనునకు ముఖ్యకారణము రాముని రాజ్యకాంక్ష, దానికి రాముడు "ఋషుల రక్షణ కొరకు" అని ముసుగు వేసెను - అంతియే గాని సీతాపహరణ మెంతమాత్రము కాదని విదిత మగుచున్నది.దీనికి ముఖ్య వుదాహరణము సీతాపహరణమునకు ముందు రాముడు రాక్షసులను చంపెదనని ఋషులతో పలుకుటయే - ఇంకను దీర్ఘముగ నాలోచించిన తన పూర్వీకులగు అనరణ్యుని చమొఇన,మాంధాతతో ఘోరరణమొనర్చిన రాక్షసరాజగు రావణుని చంపుత యను నాలోచన రామునకు వనవాసమునకు బయలుదేరుటకు పూర్వమునుండియే గలదని యూహింపవచ్చును.
రాముడు శూర్పణఖను విరూపిగ నొనర్చి రామ-రావణ యుధ్ధమునకు బీజము వేసెను.సరియగు చారిత్రక అవగాహన లేని పౌరాణికులు, ఆర్యర్షుల పక్షపాత బుధ్ధి గల పండిత ప్రకాండులు సరియగు ముఖ్యవిషయములు గ్రహింపనొల్లక సీతను రావణు డపహరించుటయే రామ-రావణ యుధ్ధమునకు కారణమని ప్రచారము గావించిరి.
రాముడు సీతను భార్యగ నెంత గొప్పగ యాదరించెను!
రాముదు సీతను పెద్దల యెదుత నగ్నిసాక్షిగ పరిణయ మాడెను.సీత చాల అయందమైనదని వాల్మీకి హనుమంతాదులు వర్ణించిరి.రామునకు సీత యందెంతయో మోహము గలదు.అతడామె యందు మిక్కిలి కామాసక్తుడై యనురాగము గలవాదయ్యెను.రామునికి సీతపై గల వ్యామోహము - ప్రేమ వలననా?కామము వలననా? యని ప్రత్యేకించవలసిన కామము వలననే యబి చెప్పవలయును.వనముల యందాతడు దగ్గఱగ నుండి మాంసము తినిపించుట,అయోధ్య యందామెను చేతులతో గ్రహించి చెఱుకురసమును త్రాగించుట మొదలగు చర్యలన్న్నియు నందమగు నామె యందలి కామోద్రేక చర్యలే యనుట నిస్సందేహము.రామున కామెయందు ప్రేమ లేదనుతయు సమంజసము గాదు,కామము వలన ప్రేమ జనించక మానదు గదా!
రాముడు సీతలేక దేవాధిపత్యముగాని,రాజ్యాదిపతముగాని స్వీకరించననియు(అరన్య.58వ సర్గము 5 శ్లో),సీత లేనిచో ప్రానములు విడుతుననియు(అరన్య.58వ సర్గము 9 శ్లో) వచించెను.సుగ్రీవ - హనుమంతాదుల యెదుట తన భార్యను గురించి కన్నీటితోపలవించెను.కాని లంకాపురియందు రావణుని జయీంచిన పిమ్మట కనీసము సీతను చూదవలెనై యైన రాముడు తలపలేదు,రావణునికి సంస్కారము,విభీషణునికి పట్టాభిషేకము జరిగిన పిమ్మట నింపాదిగ తన విజయమును తెలుపుమని జానకి యొద్దకు హనుమంతుని పంపెను.ఆ మాటలకు నీరసపడిన సీత దీనముగ "రాముని చూడదలచినాన"ని వచించెను.
పిమ్మట విభీషణు డామెను తీసుకొని రాగా రాము డామెతో శత్రువును జయించి నేను నిన్ను పొందితిని,నా పౌరుషము చూపితిని,హనుమంతుని గొప్ప కార్యములు సుగ్రీవుని శ్రమ సఫలమైనవని పలుకుచు తన శౌర్యమును వానర-రాక్షస జనుల యెదుట చెప్పుచుండ సీత కన్నీరు గార్చుచు నిలబడెను.రాముడు సీతపై తనకు కలుగుచున్న క్రోధముతో తన యుధ్ధపరిశ్రమను దెలుపుచు సీత నడవడిని గురించి యతినీచముగ మాట్లాడెను.
యుధ్ధ.118వ సర్గము
శ్లో||పశ్యత స్తాం తు రామస్య భూయః క్రోధో వ్యవర్ధతః,
ప్రభూతా జ్యావసిక్తస్య పావకస్యేవ దీప్తతః,
శ్లో||సబధ్ధ్వా భ్రుకుటీం పత్రే తిర్యక్పేక్షిత లోచనః,
అబ్రవీ త్పరుషం సీతాం మధ్యే వానరరక్షసాం.
ఆమెను చూచుచున్న రామునకు నేతితో తడిసి మండుచున్న యగ్నివలె కోపమతిశయించెను.అతడు కనుబొమలు ముడిచి,కన్ను లడ్డముగా త్రిప్పుచు వానర-రాక్షసుల మధ్యన సీతతో కఠినముగ బలికెను.
యుధ్ధ.118వ సర్గము:రాముడు సీతతో జనమధ్యమున
శ్లో||ఇతి ప్రవ్యాహృతం భద్రేమయై తత్కృత బుధ్ధినా,
లక్ష్మణే భరతే వా త్వం కురుబుధ్ధిం యధా సుఖం,
శ్లో||సుగ్రీవే వానరేంద్రే వా రాక్షసేంద్రే విభీషణే,
నివేసయ మనస్సీతే యధా వా సుఖమాత్మనః.
భద్రే!లక్ష్మనునియందుగాని,భరతునియందుగాని,వానరేంద్రుదగు సుగ్రీవునియందుగాని,రాక్షసరాజగు విభీషణునియందుగాని నీ యాత్మకు సుఖము గలుగునట్లుగా బుధ్ధి నుంచుము.
తనను వివాహమాడి తనకై సర్వమును పరిత్యజించి యడవుల కేతెంచిన ఇల్లాలి నిట్లు పలికిన రాము నేమనవలయును?ఆమె నగ్నిసాక్షిగ పరినయమాడునా డతడు చేసిన ప్రమాణమేమి?భార్య నట్లు "వారిపై మనసు పడుము - వీరిపై మనసు పడుము" అని పలుకువానికి భార్య యెందుకు?ఏంతటి నీచుడు-హీనుదు-త్రాగుబోతు-దుర్వ్యసనలోలుడు-బుధ్ధిహీనుడు భార్య నావిధముగ పరులయందు మనసుంచుమని మాటలాడును?ఇట్టి రాముని ధర్మజ్ఞుడు,సత్యసంధుడు,బుధ్ధిమంతుడు,జ్ఞానసంపన్నుడు,వేదవేదాంగతత్వము నెఱిగినవాడు,క్షమయందు ధరిత్రీసముడు అని వాల్మీకి వచించుటెంత సమంజసము?
రావణుని సోదరియగు శూర్పనఖను విరూపిగ నొనర్చి రావణునిచే సీతాపహరణమునకు నాంది పల్కినది రాముడు.రావణుడు సీత నపహరిప రాముడు క్రోధము జూఒపవలసినది రావణుని మీదగాని సీతమీద కాదుగదా!
భరతుడు తనకు రాజ్యమొసంగుటకు సంసిధ్ధుడుగా నుండెనా? లేదా అయను విషయమును సేకరించుటకై హనుమంతుని గూఢచారిగ నియమించియు,తన కాప్తులైన భరద్వాజ-గుహుల యొద్ద భరతుని విషయము సేకరించిన రాముడు సీత యొక్క శీలమును గురించియు - సీతకు కాపలాయుండిన స్త్రీలద్వారా గాని,మరి యే ఇతర విధముగ నైన సేకరింపవచ్చు గదా!
ఈ సందర్భమున అగ్ని సీతను తన యంకమందుంచుకొని పై చిదుగులను నెట్టివేసి పైకి వచ్చెననుత సహజవిరుధ్ధముగ నున్నది.అగ్ని ప్రభావమును జూపదలచిన సీత అగ్నియందు దహింపకుందనే యుందవలయును.దహింపబడినచో నా మంటలనుండియే రావలయును.లేదా, యెక్కదనుండియో భూమియడ్గున,అగ్ని యడుగున నుండి వచ్చిన సహజముగనే రావలయును.సీఎతపై చిదుగులను నెట్టివేయవలసిన యగత్యమేమిటి?అంతటి మహాత్మ్యముతో నగ్ని వచ్చునపుడు చిదుగులు వాటంతటవీయె పోవా!కనుక ఇది కల్పితమనుటలో సందేహము లేదు.
అగ్నిలో పదబోవు సీతను - అచటి జనుల యఱపుల చేతను,హాహాకారములచేతను చెంతనుబ్న్న వారాపి యుందురు.రామునకు సీత శీలవతి యని యచటి రాక్షసులు, సీత పరిస్థితి స్వయముగ గాంచిన హనుమంతాదులు నచ్చజెప్పియుందురు.రాముడు తాను త్వరపడి పలికిన మాటలను సమర్ధించుకొనుతకై ఆ సంగతి తనకు తెలియుననియు ప్రజలు తనను నిందింతురని తానట్లు పలికితినని వచించి సీతను స్వీకరించి యుండును.
కనుక రాముడు సీతను పవిత్రురాలని తలచియు పరుల కొరకై యగ్నిపరీక్షకు సమ్మతించెననుట యబధ్ధము.పై విషయములన్నిటిని బట్టి రాముడు సీతనొక భోగవస్తువుగ పరిగణించెను.విలాసవతియగు స్త్రీనివలె యనుభవించెను.యౌవనమదోన్మత్తుడై కామించెను.అంతియే గాని యామేను ప్రేమించె ననునది యవాస్తవముగ గంపించుచున్నది.రాముని మనస్తత్వమును తెలిపరచు రాముని ఈ క్రింది వాక్యములను చూడుడు.
అరన్య.75వ సర్గము:
శ్లె||రాజ్యభ్రష్ఠేన దీనేన తస్యా మాసక్త చేతసా,
కధం మయా వినాశక్యం సీతాం లక్ష్మణ జీవితం.
రాజ్యభ్రష్టుడనై,అందుచే దీనునై,ఆ దీనత్వము పోగొట్టుకొనుటకు సీతపై మనస్సు మళ్ళించుకొంటిని.ఆ సీతకూడ లేనిచో నెటుల జీవింపగలను?
ఈ మాటలను బట్టియు రాజ్యభ్రష్టుడగుట చేతనే తన దిగులు పోగొట్టుకొనుటకై సీతయందు తన మనస్సును మళ్ళించుకొనెను.అందుచేతనే మరల రాజ్యమును బొందిన పిదప సీతకంటె తనకు ప్రియమైనది రాజ్యము గనక ప్రజాభిప్రాయమను నెపముతో సీతను వనముల కంపియుండునని తోచుచున్నది.
_______________________________________________________________
ఈ భావాలు అన్నీ న్యూ విజయ ఆర్టుప్రెస్,గాంధీచౌక్-తెనాలి నుండి సెప్టెంబరు 1995లో ప్రధమ ముద్రణ ద్వారా సర్వహక్కులు గ్రంధకర్తవిగా ముద్రించబడిన డా.స్వర్ణ వాచస్పతి గారి "వాల్మీకి రామాయణ సఔరభాలు" అను గ్రందము లోనివి.
వీరి తండ్రిగారు "విమర్శకాచార్య","శిల్పకళాకోవిద" స్వర్ణ సుబ్రహ్మణ్య కవిగారు మహాకవి కందుకూరి రుద్రయ విరచిత "నిరంకుశోపాఖ్యాన" సుధాతరంగిణీ వ్యాఖ్యాత,భారతీయ మహాశిల్పాద్యనేక గ్రంధకర్త,త్రిశతాధిక దేవతా ప్రతిష్ఠా నిర్వాహకులు మరియు కనకాభిషిక్తులు!
ఈ మహాద్భుతమైన గ్రంధరాజమునకు పీఠిక వ్రాసిన వారు కూడా "విద్యా విశారధ","సాహిత్య సరస్వతి" బిరుదాంకితులైన డా.కన్నెగంటి రాజమల్లాచ్గారి గారు అచ్చ్గు క్రొవ్విడి స్వైరిణి వలెనే "గుండె ధైర్యమున్నవారు మాత్రమే ఈ పుస్తకమును చదువుడు" అని హెచ్చరిక గూడా చేసినారు?

స్వైరిణి పాదరేణువు లెవరూ ఇది కనలేదా?
ReplyDeleteతమకిది నెలవు కాదని భయపడి వగచేరా!