Monday, 18 May 2015

పనిలేక బ్లాగు యెందుకు మూతపడింది?అందులో నా ప్రమేయం యెంత!నేను దొంగనాయకమ్మ బ్లాగులో కామెంట్లు వెయ్యడం తప్పా?!

హఠాత్తుగా వరూధిని బ్లాగులో మే 13న ఒక బాంబు పేలింది - నేటితో "పనిలేక" బ్లాగు మూతపడింది అనే కామేంటుతో!నిజంగా ఇది సంచలనమే,యెందుకంటే కొత్తగా తెలుగు బ్లాగుల్లో కడుగుపెట్టినవాళ్లకి తెలియదు గానీ పాతకాపు లందరికీ బాగా తెలిసిన బ్లాగే అది!రొజుకోసారయినా ఆ బ్లాగుని తొంగి చూడకుండా ఉండలేరు, అక్కడి విషయానికి తగ్గట్టు కామెంటు వెయ్యకుండానూ ఉండలేరు!నేనయితే ఆగ్రిగేటరు వరకూ వెళ్ళడం యెందుకని నా ఆడ్మిన్ అక్కౌంటులోనే ప్రతిరోజూ చూడడానికి వెలుగా ఫ్యావరేట్ బ్లాగుల లిస్టులో యెప్పుడో చేర్చేశాను.

అసలు ఇవ్వాళ తెలుగు చదవాలని యెంతమంది అనుకుంటున్నారు?భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే నినాదంతో విడిపోయిన తొలి రాష్ట్రం తెలుగుని రాష్త్రంలో అధికార భాషగాచేసుకోలేకపోయింది, పైగా తర్వాత విడిపోయిన రాష్ట్రాలు త్వరపడి వారి వారి రాష్ట్రాలలో అధికార భాషలుగా తమ తమ  మాతృభాషల్ని చేసుకోవదం చూశాక గూడా సిగ్గుతోనయినా తొందరపడలేదు మనం, యెందుకని?మాతృభాష అధికార భాషగా లేనిది కేవలం మనకేనా, ఇంకా యే దిక్కుమాలిన రాష్ట్రాలైనా మనకి తోడు ఉన్నాయా!ఇప్పుడీ గొల యెందుకంటే మామ్మూలుగానే భాష మీద ఇంత నిరాదరణ ఉండగా పనిగట్టుకుని ఆగ్రిగేటరు అవసరమైన తెలుగు బ్లాగుల్ని యెంతమంది చూస్తున్నారు - ప్రమాదవశాత్తూ రావడమే తప్ప తెలిసి వచ్చిన వాళ్ళెంతమంది?

నా బ్లాగులో నేనెప్పుడూ నా వ్యక్తిగత విషయాలు ఇంతవరకూ రాయలేదు,భవిష్యత్తులో మరోరకంగా రాయాలనే ఉద్దేశం ఉంది గానీ ఇట్లా రూలు మార్చవలసి వస్తుందని అనుకోలేదు.అనుకోనివి జరగడమే కదా జీవితం!దాదాపు మనకొచ్చే కష్టాలన్నీ అనుకోకుండానే వస్తాయి,ముందే తెలిస్తే తప్పుకునేవాణ్ణి గదా అనిపించేటట్టు వస్తాయి!కానీ యెవరో అన్నట్టు,"మనం పడే తిప్పలకి చాలామటుకూ మనకున్న వ్యామోహాలతోనూ భయాలతోనూ మనం చేసే తప్పులే కారణం" అనేది తెలుసుకోగలిగీతే వ్యామోహాల్నీ భయాల్నీ జయించి తప్పులు చెయ్యకుండా తిప్పలు పడకుండా బతకొచ్చు.ఇవ్వాళ నేను పడుతున్న కష్టాల్లో పదిశాతం గురించి చెప్పినా చాలామంది తట్టుకోలేరు, అయినా నేనెట్లా చిదానందమూర్తిలాగా సీరియస్ పోష్టుల్ని గూడా బోరు కొట్టనివ్వకుండా రాయగలుగుతున్నాను అంటే నేను గతంలో చేసిన తప్పులకీ నేనిప్పుడు పడుతున్న తిప్పలకీ లింకు ఉందని తెలుసు గాబట్టి, నా కష్టాలకి యెవణ్ణో బ్లేం చేసి నా ఇగోని సాటిస్ఫై చేసుకునే అవలక్షణాలు గానీ చిన్న చిన్న కుక్కజట్టీలకి హృదయం బద్దలు చేసుకుని కిందామీదా పడి మూర్చరోగాలు తెచ్చుకునే బలహీన మనస్తత్వం గానీ లేదు గాబట్టి!అట్లాగే నాకు సంబంధం లేని విషయాల్ని పనిగట్టుకుని మనసుకి పట్టించుకుని ఆక్రోశపడి మనశ్శాంతిని కోల్పోను, మనంతట మనమెందుకు మన జుట్టు యెదటివాళ్ళ చేతికిచ్చి తీరా వాళ్ళు మన జుట్టుకి రిబ్బన్లు కట్టాక అదుగో వాడు నన్ను అవమానించాడని యేవటం?

రమణ గారు చేసిందీ అదే!తన పాటికి తను బ్లాగులో యే విషయమైనా రాసుకునే స్వేచ్చ ఆయనకి ఉన్నది నిజమె!కానీ అవి కేవలం తన కంప్యూటరు ముందు కూర్చుని తను మాత్రం చదువుకుని పులకించిపోవడానికి రాయడం లేదు గదా?పబ్లిష్ చేసిన ప్రతి పోష్టూ ఆగ్రిగేటరు ద్వారా అందరికీ కనబడుతున్నప్పుడు ఆ పోష్టు చదివిన వాళ్ళలో అది కలిగించే ప్రభావాన్ని కూడా తెలుసుకోవాలి గదా, తెలియకపోవడానికి ఆయన నిరక్షరకుక్షి కాదుగా!చదివినవాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు, ఆ పోష్టు తమకి ఇబ్బందికరంగా ఉంటే యే మాత్రమూ సంకోచించరు - అది మానవనైజం!తమ చేతల వల్ల యెదటివాళ్ళకి ఇబ్బంది కలిగీతే యెవరయినా సహజంగా యేమి చేస్తారు?యందుకు యెదటివాళ్ళు ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని తన పోష్టుల్లో ఆ ఇబ్బందికరమైన విషయాల్ని సృశించకుండా నిగ్రహంగా ఉంటారు,అవునా కాదా!లేదు నేనిలాగే రాస్తాను అంటే యెదటివాళ్ళ ఇబ్బందిని అసలు పట్టించుకోవాల్సిన పనిలేదు కదా!మరో మార్గం అంటూ ఉంటే అది దొడ్డిదారి మాత్రమే, ఆ దారినే యెంచుకున్నారు ఆయన , కామెంట్లు బందు జేస్తున్నానని ప్రకటించారు 2014 అక్టోబరులో అనుకుంటాను.అది కూడా మళ్ళీ వరూధిని బ్లాగులోనే చూశాబు.ఆ పోష్టు బహుశా వరూధిని బ్లాగరు ఆ సంగతి గురించి సరదాగా రాసిన వాటిలో రెండవది అనుకుంటాను,యెందుకంటే అదే విషయంతో మరొక పాత పోష్టు గూడా చూశాను ఆ బ్లాగులోనే!

యేమయితేనేం అక్కడి సరదా కామెంట్లని చూసి నేనూ కొంచెం క్యామెడీగా ఒక కామెంటు వేశాను - - అప్పుడూ ఇప్పుడూ కూడా చెప్తే యెవరూ నమ్మరు గానీ కొంచెం రెచ్చగొట్టి అయినా రమణ గారు మళ్ళీ కామెంట్లు ఓపెన్ చేసేటట్టు చూడాలనేది నా వుద్దేశం. అయితే పుణ్యానికి పోతే పాప యెదురయినట్టు ఆయన కామెంట్లకి తలుపులు తెరిచారు గానీ నన్ను మాత్రం అపార్ధం చేసేసుకున్నారు!ఆయన రెస్పాన్సు చూసి కంగారు పడి అక్కడే ఒక కామెంటు వేశాను,అయినా డ్యామేజీ జరిగిపోయింది,చెయ్యగలిగినది వేడికోలు మాత్రమే గదా?నా మట్టుకు నాకు మిగతావాళ్ళతో ఆయన యెన్ని తలనొప్పులు పడ్డారో తెలియదు గానీ, నేనెప్పుడూ ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు కామెంట్ల ద్వారా!ఒకోసారి ఆయన గూడా మీరు వాడిన మాటలే బాగున్నాయి వాటితో పోష్టుని అప్డేట్ చేస్తున్నానని గూడా అన్నారు, చేశారు గూడా - చేప్పాను గదా దేన్నీ అతిగా తలకెక్కించుకోనని!

నా సమస్య అంతా నా సొంత గొదవ మాత్రమె కదా,ఆ బ్లాగులో ఈ బ్లాగులో వెళ్లబోసుకుని ప్రయోజనమేమిటి?అక్కడికీ వరూధిని బ్లాగులోనే ఒకసారి చిన్నగా నసిగీతే "ఆగండి ఆగండి" అంటూ వారించడం జరిగింది,నేను కూడా అప్పటికి ఆగిపోయాను. ఆగక చేసేదేమిటి - అప్పటికే "డాక్తరు గారికి నమస్కారం" అంటూ మొదలుపెట్టి వినయంగా నావైపునుంచి నేను చెప్పుకోవలసిన ముఖ్యమయిన విషయాలన్నీ నివేదించుకున్నాను.ఆ కామెంటు కనబడకపోయినా "అది పబ్లిష్ చెయ్యడం వల్ల యేమి వొరుగుతుంది నాకు, చదివే ఉంటారు యెటూ తర్వాతి కామెంట్లు వేస్తారు గదా" అని సరిపెట్టుకుని తర్వాతి పోష్టులోని విషయం నన్ను బాగా కదిలించి ఒక మంచి కామెంటు వేసి అది పబ్లిష్ కాకపోవడం వల్ల ఆయన నా పేరుతో వచ్చిన కామేంట్లేవీ కనీసం హరిబాబు యేమైనా వివరణ ఇస్తున్నాడేమో చూద్దాం అనే అనుమానం కూడా తెచ్చుకోకుండా తొలగించివేస్తున్నారని అర్ధమైపోయింది గదా!

ఈలోపు "నా బ్లాగులో నా ఇష్తమొచ్చినట్టు నేను రాస్తాను,చదివడం వరకే తప్ప విమర్శించే అధికారం యెవరికీ లేదు,ప్రశంసల్ని మాత్రమే ప్రచురిస్తాను" అనే ఆయన ధోరణికి వ్యతిరేకంగా దొంగనాయకమ్మ బ్లాగుని కొందరు తెరవడం జరిగింది,నేను అక్కడ దీని గురించే కాదు మిగతావాట్ని గుఇంచి కూడా కామెంట్లు వేశాను.నాకు నేను పెట్టుకున్న రూలు - విషయాన్ని గురించి విమర్శించదమూ,ధోరణిలో ఉన్న లోపాన్ని యెత్తి చూపించడం తప్ప వ్యక్తిగతంగా నేను యేనాడూ యెవర్నీ విమర్శించకూడదనే దానికి కట్టుబడే ఉన్నాను!దొంగనాయకమ్మ బ్లాగు వుద్దేశం కూదా వ్యతిరేకించదగినంత క్రూరంగా యేమీ లేదు!నా పోస్టుల్లో సరదాగా జగదేక వీరుని కధ సినిమా గురించి రాసిన భాగాల్ని మెలితిప్పి రాముడు సీతని వొదిలెయ్యటానికి లింకు కలుపుతూ వాడకూడని చోట వాడటం చూశాను.నా మామూలు పధ్ధతిలోనే ప్రతిస్పందించాను గూడా, ఆ అధికారం అందరికీ ఉండటం ప్రజాస్వామ్యానికి యేమి చెరుపు చేస్తుందో మరి?

ఈ మధ్యనే "కళింగ కేక" అనే బ్లాగుని చూశాను.అక్క కేక బలంగా వెయ్యాలనుకుంటున్నారా?నెమ్మదిగా వెయ్యాలనుకుంటున్నారా? అనే ఆప్షన్లని చూసి ఆవేశపడిపోయి టాప్ లెవెలు కేకకే బటన్ నొక్కాను!తీరా కొంచెం వివరంగా చూస్తే ఆయన ఒకపోష్టులో కృష్ణదేవరాయల స్పోకం మచ్చల మొహాన్నీ తక్కువకాలం బతకడాన్నీ అదోరకమయిన విధంగా ప్రస్తావించటం చూసి కంగుతిన్నాను? ఆయన కళింగ గజపతులతో మమేకమై వాళ్ళని ఓడించిన దుర్మార్గుడు గనక కృష్ణదేవరాయల్ని మేమెందుకు పొగడాలి అంటున్నాడు?కృష్ణదేవరాయలకి స్పోకం మచ్చలు ఉందటం వాస్తవమే గానీ పెద్దనని "పెద్దిరాజు" అనటంలో ఆయన యేమి చెప్పదల్చుకున్నాడో మీకు తెలుస్తూనే ఉంది గదా!చూశాక నేను వూరుకోను గదా!"యేమిటిది?గజపతులంతా అందగాళ్లేనా?వాళ్లలో ఉన్న అవకరాల్ని వెతికి ఒక పోస్టు నేనూ వెయ్యగలను,చరిత్రలో సొంతపైత్యాలు జోడించకండి,రాయలైనా గజపతులైనా చేసింది ఒకటే - అందరూ ఒక తానులో ముక్కలే.ఇవ్వాళ మనం ఉన్న సువిశాల భారతదేశం గురించి వాళ్లలో యెవరూ వూహించను గూడా వూహించలేదు.వాళ్ళ అధికారాన్ని తమప్రాంతంలో బలంగా వుంచుకోవడం కొత్తప్రాంతాలకి విస్తరించడం తప్ప?ఇప్పటి కాలంలో బతుకుతూ అప్పటి వాట్ని తవ్వి తలకెత్తుకోవదం ఈ రాజు మాప్రాంతం వాడు గనక పొగుడుతాం అతన్ని ఓడించిన రాజుని తిడతాం అనటం అనవసరం కదా!" అని కామెంటు వేసాను.షరా మామూలే కామెంటు పలేదు.కొంతకాలానికి ఆ బ్లాగరు కళింగరాష్ట్రసాధనాపితామహుడు కూడా కావొచ్చు,ఆలోచించుకోండి?!

ఒక విషయాన్ని చూసీ చూడగానే అందులో యేదయినా తమకి నచ్చనిది ఉంటే స్పందించకుండా ఉంటే యేమి జరుగుతుంది?యెవరూ ప్రతిస్పందించలేదు గాబట్టి ఒకనాటికి అది న్యాయమైన వాదనగా మారుతుంది!ఉదాహరణకి తెలంగాణా వాదుల పైత్యకారి వాదనలు చాలామటుకు సరయిన సమయంలో స్పందించాల్సిన వాళ్ళు స్పందించి సరయిన జవాబులు చెప్పి ఉంటే యెట్లా ఉండేది?ఇక్కడ బ్లాగుల్లో జరిగిన వాదనల ప్రకారం చూసినా అవి చాలామటుకు ఆధారం లేనివే - ముఖ్యంగా ఆంద్రోళ్ళ దోపిడీ అనేది!కాబట్టి యేవడేమి రాసినా వ్యతిరేకించకుండా ఉండిపోవటమే ప్రమాదకరం - ఆ బ్లాగరు వ్యతిరేకించడానికి అవకాశం ఇవ్వకపోతే ఆ అవకాశాన్ని సృష్టించుకుని అయినా వ్యతిరేకించి తీరాల్సిందే!


అసందర్భం వచనం బృహస్పతిరపి బ్రువన్ విద్వజ్జన మవామానం లభతే!

14 comments:


  1. ఇప్పటి కాలపు ప్రమాణాలతో పాతకాలపు చరిత్రల్ని పరిశీలించకూడదు.కృష్ణ దేవరాయల ఘనకార్యాలు ,విజయాలు అందరికీ తెలిసినవే.అలాగే గజపతులు కూడా విజయాలు సాధించారు,మంచిపనులు ఎన్నో చేసారు.మీరన్నట్లు అప్పటి రాజులు ,సుల్తానులు,వాళ్ళ రాజ్యవిస్తరణకే యుద్ధాలు చేసేవారు. ఇక డా; రమణ గారి బ్లాగు ఆయనకు తోచినట్లు రాసుకోవచ్చును.కాని దాని మీద ఇతరులకు కామెంట్లు రాసే హక్కు కూడా ఉంది.కాని ఎవరైనాగాని.decency హద్దులు దాటి రాయకూడదని నా అభిప్రాయం.

    ReplyDelete
    Replies
    1. నిజమే మాస్టారూ,అందుకే గదా మనవాళ్ళు అసందర్భంగా మాట్లాడీతే బృహస్పతికైనా వెక్కిరింతలు తప్పవని ముందే చెప్పారు!

      నేను ఆయనకి కోపం తెప్పించిన యెర్రపైత్యం అనేదాన్ని గురించి కూడా పట్టించుకోలేదు.శంకరాభరణంలో కుర్ర సంకరం పెద్ద సంకర్శాస్త్రిని చూట్టానికి వెళ్ళి యెదురింటివాళ్ళ మ్యూజిక్కుకి డ్యాన్సు చేసి దెబ్బతిన్నట్టు ఇరుక్కుపోయాను..ద.హా అనుకోండి అ.హా అని కూడా నవ్వుకోండి నాకేం అభ్యంతరం లేదు.

      అసలు తెలుగు బ్లాగుల పాప్యులారిటీ యెంత?యేదో ఆయన పనిగట్టుకుని బ్లాగు పేరు "పనిలేక" అని పెట్తుకున్నా అందరం పని లేనప్పుదే గదా బ్లాగుల్లోకి వస్తున్నది!ఈ కాస్త దానికి అటు బ్లాగరుగా రమణ గారూ ఇటు కామెంటర్లుగా ఆయన వ్యతిరేకులూ తేగేదాకా లాగారు,నా గొదవతో నేనూ ఆయాన్ని విసిగించినా ఇప్పుడు మాత్రం నిజంగానే యేదోలా ఉంది - రోజుకోసారయినా అడ్మిన్ పానెల్ నుంచె కొత్త పోష్తు యేమయినా వేసారా అని చూసేవాణ్ణి!

      మీరు కమ్యునిష్తు అయితే సుబ్బరంగా పార్టీ తరపున ప్రచారం కూడా చేసుకోవచ్చు,యెవరు కాదన్నారు?మనమొక మాట చెపతే విన్నవాడు సైలెంటుగా ఉండిపోయినప్పటి కన్నా విమర్స వచ్చి దానికి మనం జవాబు చెప్పగలిగినప్పుడే మన భావాల్న్ మనం గట్టిగా చెప్పగలిగాం అనేది తెలుస్తుంది!

      నా పధ్ధతి ఇది -ఐడి ఉంటే మోదరేషన్ లేకుండా యెవరు వేసిన ఆప్పటికప్పుడే ఇక్కడ కనబడుతుంది,యెట్లాగూ వాట్ని అడ్మిన్ హోదాలో తొలగించవచ్చు గాబట్టి మరీ నచ్చకపోతే అప్పుదే తీసెయ్యవచ్చు.కాకపోతే ఒకటే కుదరటం లేదు,మీరూ కష్టేఫలి మాస్టారూ,శ్యామలీయం గారూ ఇంకా కొందరు ప్రతి కామెంటుకీ లెక్క తప్పకుండా జవాబు ఇస్తున్నారు.నాకది కుదరతం లేదు.యెవరయినా క్లారిఫికేషన్ అడిగీతే మాత్రం కాదనకుండా చెప్తున్నాను.

      ఈ మాత్రపు చిన్న చిన విషయాలకి అంతలేసి గొడవలు యెందుకు చేస్తున్నారో,పట్టింపులు దేనికో!ఐతే ఒకటి,అన్యాయంగా నామీద కోప్పడటం మాత్రం ఆయన కావాలని చేసిందే.ఈ మధ్యనే "కొందరు నా కామెంట్లు యెందుకు పబ్లిష్ చెయ్యటం లేదు" అని సతాయిస్తున్నారు అని కూడా ప్రస్తావించారు - ఆయన కెందుకంత కారనం తెలుసుకోవాలని కూడ అనిపించని వ్యతిరేకత నాపట్ల?అందువల్లనే నేను కూడా అట్లా ప్రతిస్పందించాల్సి వచ్చింది!

      Delete

  2. హరి బాబు గారు,

    మీ యొక్క సిన్సియారిటీ ఆ అనామత్తు బ్లాగు (దొంగ నాయకమ్మ) లో మీ ప్రొఫైల్ ద్వారా నే కామెంటు పెట్టినప్పుడు తెలిసి వస్తోంది. ఆ బ్లాగు లో అందరూ అనామత్తు గార్లే కామెంటడం ! ఈ నేపధ్యం లో మీ సిన్సియారిటీ ని తప్పు బట్ట లేము .

    అయితే , శ్యామలీయం వారు చెప్పినట్టు ఆవేశం తో కామెంటడం దాని పర్యవసానాన్ని ఎవరు చెప్పలేరు .

    ఎవరు ఏ విషయానికి హార్ట్ అవుతారో ఆ పైనున్న మా కొండ దేవర కే ఎరుక !

    మీ బ్లాగు ద్వారా కూడా శ్రీ రమణ గారికి ఇదే విన్నపం !

    విన్నపాలు విన వలెను ! వింత వింతలు ! 'ఫన్' నగవు' పనిలేని బ్లాగోదరా ! బ్లాగు తెర పైకెత్త వేల వయ్యా !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అస్తు!శుభమస్తు!!అత్యధ్భుతమస్తు!!!

      Delete
  3. హరిబాబు గారు,
    మీరు రాసుకొనేదేదో మీ బ్లాగు లోనే రాసుకోవచ్చుకదా! ప్రజ బ్లాగు లో చర్చలకు దిగి సమయం ఎందుకు వృథా చేస్తారు? చాలా రోజులక్రితమే అక్కడ చర్చలో పాల్గొనటం బంద్ చేశాను. ఎన్ని ఆధారలతో వాదించిన లాభం ఉండదు. ఏ చర్చకి ఒక ముగింపు(లాజికల్ కంక్లుషన్) ఉండదు. ఒకానోకరోజు చర్చించిన పోస్ట్ లన్ని అకస్మాతుగా మాయమైపోతాయి. కృష్ణదేవరాయలను తీసుకొచ్చి తెలంగాణ నైజాం పాలకులతో పోల్చటం, రాజులంతా ప్రజలను దోచుకొంటారు. కనుక కృష్ణదేవరాయలు అదే చేసి ఉంటాడు, ఆయన ప్రత్యేకంగా ప్రజలకు ఎమి చేశాడు? గుడులను కట్టించటం తప్ప అని అసంబద్ద, అహేతుక, అడ్డుగోలు వాదనకు దిగుతారు. ఆ బ్లాగులో ఒక్క కృష్ణదేవరాయలే కాదు, రాముడు గురించి,హిందు సమాజానికి చెందిన అంశాలపై ఎండేమంటే తెడ్డేంలా వాదించేవారి సంఖ్య కొదువలేదు.వాళ్ల కోసం పుస్తకాలు తెచ్చి టైపుకొట్టలేము. టైపుకొట్టినా వారికి నచ్చకపొతే ఎదురుదాడికి దిగుతారు. కారల్ మార్క్స్ జీవితం గురించి వాస్తవాలను తెలిపే సమాచారం ఇస్తే, అసహనానికి గురై ఎదురుదాడికి దిగాడు. మార్క్స్ గురించి ఆధారాలు కావాలి అని చీప్ వాదన చేశాడు. ఒకవైపు అడ్డుగోలుగా వాదించే వారి వ్యాఖ్యలను భావప్రకటన స్వేచ్చ పేరుతో ప్రచూరిస్తూ మీకు నీతులు చెప్పటం అన్నిటికన్నాపెద్ద కామేడి.

    ReplyDelete
    Replies
    1. @Sriram
      పైన చెప్పిన "కళింగ కేక" దగ్గ్గిర వాదించినా ప్రజ దగ్గిర వాదించినా నాకు సమస్యలు యెదురు కాలేదు.నేను చివర్లో చెప్పీనట్టు "ఒక విషయాన్ని చూసీ చూడగానే అందులో యేదయినా తమకి నచ్చనిది ఉంటే స్పందించకుండా ఉంటే యేమి జరుగుతుంది?యెవరూ ప్రతిస్పందించలేదు గాబట్టి ఒకనాటికి అది న్యాయమైన వాదనగా మారుతుంది" గాబట్టి చర్చలకి వెనుకాడే ప్రసక్తి లేదు!ప్రజలో గూడా చెప్పాను - ఒకసారి విసిగి సైలెంటుగా కొంతకాలం ఉన్నాన్ను,ఇప్పుడు చివరి వరకూ నిలబడతానని!

      Delete
    2. మీరు చెప్పేది అర్థమయ్యింది. ఒక పనిచేయండి. ప్రజలో ప్రశ్నకి మీరు మీబ్లాగు లో బదులు రాసి అక్కడ లింక్ పెట్టండి. ఇంతక్రితం 498ఎ చట్టం పై చర్చ జరిగితే అక్కడ ఎన్నో విషయాలను సాక్షాలతో సహ లింక్ లు గా ఇచ్చాను.ఆ టపా కొద్ది రోజుల తరువాత మాయమైపోయింది.ఆయనకు ఎదైనా ఐడియా నచ్చినపుడు పాలసి మార్చి టపాలను తొలగిస్తారు.

      Delete
    3. @SriRam
      మీ పాయింటూ నిజమే,ఈసారి ఆలోచిస్తాను!

      Delete
  4. బాగా చెప్పారు. ఎవరి జ్ఞానం తెలివి తేటలు ప్రకారం చెప్తారు మనకు నచ్చితే ఓకే నచ్చాకపోతే ఖండిస్తాము. కొందరు ఎంతో సహేతుక వాదనలు చేస్తారు కొందరు వితండవాదం చేస్తారు. చిన్న ఉదాహరణ ఏదో తెలంగాణా వాళ్ళ బ్లాగులో ఒక పోస్ట్ ఆంధ్రలో తెలంగాణా ఎంసెట్ కేంద్రాలు ఏర్పాటుకి తెలంగాణా విద్యాశాఖ నిరాకరణ. ఏపీ కుట్రలకు తెలంగాణ సర్కారు దీటైన సమాధానం. అసలు వార్త ఏంటంటే ఆలస్యంగా అడగటం వల్ల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటానికి అసలు కారణం అని ఆ శాఖా మంత్రి చెప్పారు. దీని కింద ఆయన రాసాడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణా కాలేజీలలో 15 శాతం నాన్ లోకల్ సీట్లు 100 శతం కాజేయాలని కుట్ర అంటా అందుకని తెలంగాణ సర్కారు దీటైన సమాధానం ఇచ్చిందంట. ఆ వార్తకి వీళ్ళు అన్వయించికున్న దానికి సంబంధం ఎమన్నాఉందా. ఆంధ్రలో లేకపోతే హైదరాబాద్కి వచ్చి రాస్తారు. అందులో ఏముంది అని వాదించి రిప్లై చేస్తే అక్కడ ప్రింట్ అవ్వదు. ఇలా ఎన్నో బ్లాగులు వాళ్ళకు నచ్చినవి మాత్రమే తీసుకుంటారు ఇటువంటి వాళ్ళకి కామెంట్స్ రాసి బాదపడటం వేస్ట్. లైట్ తీసుకోండి. ఆయన రాయటం మానుకోవటం ఆయన నిర్ణయం అందులో మీ ప్రమేయం ఏమి లేదు ఉండదు కూడా. ఎందుకంటే ఒక మానసిక వైద్యుడైన ఆయన, మీరు విమర్శించారు అనో వెటకారం చేసారనో రాయటం మానేస్తే అది ఆయన సమస్య మీ ఈ పోస్ట్ చూస్తే బాగా బాదపడుతున్నరనిపిస్తుంది. నేను తప్పయితే లైట్ తీసుకోండి.

    ReplyDelete
    Replies
    1. లేదు లేదు!పోష్టులోనే చెప్పా కదా,పొరపాటున కూడా బాధపడే మనస్తత్వం కాదు నాది.యోధత్వం యెక్కువ నాకు?!

      Delete
  5. మొదట్లో ఆయన సరదాగా రాసినా తరువాత కాలం లో ఎర్రపైత్యం ఎక్కువైంది. తను రాసేది మనం చదవడానికి కానపుడు అంత పబ్లిగ్గా రాయటం దేనికో! బహుశా మెంటల్ పేషెంట్లని చూసి చూసి తనకి కూడా మోకాలు దెబ్బతిని ఉండొచ్చు!

    ReplyDelete
    Replies
    1. మోకాలు దెబ్బతిని ఉండొచ్చు!
      ?
      మరీ అంత యెటకారం కూడదు:-)

      Delete
  6. ప్రతీక పవిత్రతలు వద్దని డాక్టర్ గారే సెలచిచ్చారుగనుక, సరదాగా వేసిన సెటైర్ ని అవమానంగా ఫీలవకూడదుమరి!

    ReplyDelete
    Replies
    1. కానివ్వండి,నాకు పోయేదేం లేదు - నేనూ సరదాగా నవ్వుకుంటా!సుబ్బరంగా నాకు కమ్యునిజం అంటే ఇష్టం అని చెప్పి బాహాటంగా యెంత సమర్ధించుకున్నా యెవరూ అభ్యంతర పెట్టరు.ప్రవీణ్ ఉన్నాడు,తెలకపల్లి రవి గారు ఉన్నారు,ఇంక అచాలామంది ఉన్నారు.కాకపోతే వాళ్ళకన్నా యెక్కువగా రెచ్చిపోవాలనుకున్నారు కాబోలు విద్వజ్జనం తమ తడాఖా చూపించారు!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...