Tuesday 3 March 2015

ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా?పీకేకి ఆస్కార్ అవార్డు వస్తుందా!

          విత్తు ముందా చెట్టు ముందా అంటే యేమి చెప్తాం?చూసిందే సత్యం అనుకునే మామూలు మనుషులైతే చెట్టే ముందు గదా అనేస్తారు.వృక్ష శాస్త్రజ్ఞుల నడిగితే ఒక జాతి నుంచి మరొక జాతి పుట్టటానికి సంబంధించిన మార్పులు విత్తనం నుంచే మొదలవుతా యంటారు.వాదన  కోసమే బతికే ప్రవీణులు ఆ మార్పులు విత్తనంలోకి చెట్టు నుంచే వస్తాయి గదా అని మెలిక వేస్తారు.యుగాల తరబడి చర్చించినా అది తేలదు!

         దీనమ్మా కాంగ్రెసు - యెంతపని జేసింది! కాశ్మీరు దగ్గిర్నుంచీ ఖలిస్థాన్ వరకూ కుంపట్లు రగిలించి వొదిలెయ్యటమే తప్ప ఒక్క కుంపటి కూడా ఆర్పని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ విభజనని కూడా అట్లాగే తగలేసిందిగా!!చచ్చేది చావకుండా స్వతంత్రం వచ్చిందగ్గిర్నుంచీ దేశమంతా తన్ని తగలేసినా నెహ్రూ బాబునీ ఇందిరమ్మనీ రాజీవ్ బాబునీ గెలిపించినందుకు కృతజ్ఞత కూడా లేకుండా తెలుగోళ్ళని బజార్న పడేసింది గదా?!ఇంకా యెందుకో అంత వ్యామోహం,మీసాలు మెలిదిప్పుకుని మరీ వీరత్వం వొలబోస్తుంటే మళ్ళీ వొట్లేసేటట్టున్నారు యెదవ జనాలు?దీపాల మల్లయ్యలని వుంటారు వాళ్లకి దీపాలార్పటం తప్ప దీపాలు వెలిగించటం చేత కాదు!దిక్కుమాలిన స్వతంత్రం రాకుండా వున్నా బాగుండేదనిపిస్తంది ఈ పాపిష్టోళ్ళ చేతుల్లో పడ్డాం! ఇంత దరిద్రంగా విభజించినందుకు సిగ్గుపడి మూలన కూర్చోకుండా సిగ్గు లేకుండా విభజన హామీల కోసం దేశమంతటా ఆందోళనలు చేస్తారంట!

          యెగదీస్తే గోహత్య దిగదీస్తే బ్రహ్మహత్య,కరవమంటే కప్పకి కోపం వదలమంటే పాముకి కోపం,అవ్వకా బువ్వకా,ఎద్దు గట్టుమీదకి లాగడం దున్న నీట్లోకి లాగడం లాంటి దురవస్థలన్నిట్నీ ఒకేసారి తెలుగోళ్ళ మీద కుమ్మరించి పారేసిందా ఇటాలియన్ బారు గర్లు ముండ@!ఈ దేశపు సమాజం తీరు యేమిటో తెలీదు,ఈ దేశభాషల్లో ఒక్కటి కూడా రాదు - అయినా ఈ దేశానికి భాగ్యవిధాతని చేశారు దొంగసచ్చినోళ్ళు!

        యెప్పుడో యాభయ్యేళ్ళ క్రితం మద్రాసు నుంచి విడిపోయినా ఎన్.టి.ఆర్ వచ్చేదాకా మనల్ని కూడా మదరాసీలని పిలిచేటంత గొప్పగా తెలుగోళ్ళకి గుర్తింపు తెచ్చిన యెదవలు, ఇక్కడ ముఖ్యమంత్రిని యెన్నుకోవడానికి కూడా పేర్లు డిల్లీకి పంపించి కట్టుబానిసల్లా బతికిన గాడిదలు,ఒకణ్ణి పడదోసి మరొకడు కుర్చీ యెక్కి సొంతానికి దండుకోవటమే తప్ప ప్రజల గురించి యేనాడూ పట్టించుకోని దరిద్రగొట్టు రాజకీయం తాము చెయ్యటమే కాకుండా తా జెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు తనతో కలిసిన తనలోంచి చీలిన అన్ని పార్టీలకీ అంటించిన కుక్కమూతిపిందెలు ఇవ్వాళ ఆంధ్రాకి న్యాయం చెయ్యడానికి ఉద్యమాలు చేస్తారట!

          ముఫ్ఫయ్ సీట్లకోసం ముండమోపి రాజకీయం చేసి మాతృ రాష్ట్రాన్ని అవశేషంగా నోటితో కూడా వెక్కిరించి అసలు విడగొట్టాక అక్కడొక భూభాగం వుంటుందని కూడా అనుకోని దొంగలంజకొడుకులు* ఇవ్వాళ సాధు సజ్జనుల మాదిరి సుభాషితాలు చెప్తున్నారు,యెవడు వింటాడనో!

          ఇస్తానని యెవడికి చెప్పాడో వాడూ యేడుస్తున్నాడు - కేసు వోడిపోయినోడు కోర్టు మెట్ల మీదనే యేడిస్తే గెల్చినోడు కొంగుచాటు చేసుకుని యేడ్చినట్టు - యెవడికీ మేలు చెయ్యకుండా తమకీ గుణ్ణం కొట్టుకుని ఇంత ఘనకార్యం చేసి యేమి సాధించారో తెలియని దారీతెన్నూ లేని విభజన చేసిన వీళ్ళే మనకి సరైన దారి చూపిస్తారట మళ్ళీ వెంట పరిగెత్తుదామా?ఈసారి ఉత్తుత్తి నరకం కాకుండా నిజమైన నరకలోకపు జాగిలాల్నీ సలసల మరుగుతున్న కుంభీపాకపు ద్వీపకల్పాల్నీ చూపించి తరింపజేస్తారు!

          యెన్నడూ పెళ్ళాం దగ్గిర కూడా నోరు విప్పని మూగమొద్దు నోరు విప్పి చెప్పిన ఒకేఒక మాట కూడా బూతుమా కింద మారిపోయింది?ఇవ్వాల్సినవి లెక్కగట్టి బిల్లులో నిక్కచ్చిగా ఇవ్వలేదు గానీ ఇవ్వడానికి వీల్లేని దాన్ని మాత్రం -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని రాబోయే కొత్త ప్రభుత్వానికి చెప్తాననే వాగ్దానం  చేశాడు!వాగుదానం చెఱువు దానం!దాన్ని పట్టుకుని యెన్నేళ్ళు పోరాడినా కుక్కతోకని పట్టుకుని గోదారిని ఈదినట్టే!

         పిల్లలు పుట్టగానే పురిటి స్నానం చేయించేటప్పుడు కొందరికి సిగ్గూ లజ్జా మానం అభిమానం అనేవి కూడా జారిపోతాయి - అలాంటివాళ్ళు అయితే కాంగ్రెసు పార్టీలో చేరతారు లేదంటే కాంగ్రెసు పార్టీకి వోటు వేస్తారు!యెన్నికలప్పుడు ఇస్తానని వాగ్దానం చేసి ప్రభుత్వం యేర్పడ్డాక నాలుగేళ్ళ పదకొండు నెలల్లో సమైక్య రాష్ట్రపు ఆదాయం అప్పుల వివరాలు తెలియలేదు,అవి న్యాయంగా యెలా పంచితే తర్వాత రెండు ముక్కల మధ్యనా గొడవలు రాకుండా వుంటాయనేది కూడా తెలియలేదు,మొత్తం రాష్ట్రంలో వున్న వనరులేమిటో అవి యెలా పంచితే బాగుంటుందో కనీసం రిపోర్టులు కూడా తెప్పించుకోలేదు అయినా నెలరోజులు తీసుకున్నారు - మీరు చేసింది పదో తరగతి తప్పినోడికి అప్పజెప్పినా ఒక్క రోజులో పూర్తి చేసేవాడు, యెందుకురా ఒక్కొక్కళ్ళూ లాయరు గిరీలూ డాక్టరు గిరీలూ వెలగబెట్టారు?

          మోదీ మాత్రం యేమి చేస్తాడు?ఆంధ్రాకి విభజన పేరుతో ఇస్తే మరో పేరున మాకూ కావాలని పదిమంది బయల్దేరతారు.అన్ని రాష్ట్రాలకీ పన్ను రాయితీలు ఇస్తే కేంద్రానికి ఆదాయం రాక మొత్తం దేశమే అడ్డుక్కు తింటుంది!ఆంధ్రాకి పన్ను రాయితీలు కల్పిస్తే అసలే చురుకైన ఆంధ్రావాళ్ళు తమకన్నా యెక్కడ ముందుకి దూసుకుపోతారో ననే కుళ్ళుమోతు మనస్తత్వాలు చాలమందికే వున్నై!తన పొలం తడిసే దాకా కింద వాళ్ళకి నీళ్ళు బందు జేసే పల్లెటూరి నిశానీ మోతుబరి మనస్తత్వాలే విద్యాధికులైన రాష్ట్ర్రాల ముఖ్యమంత్రుల్లో కూడా కనిపిస్తున్న కాలంలో వున్నాం మనం!ఇవ్వాళ తమాషా చూస్తూ మనకిచ్చిన రేపటి రోజున యెదురు తిరుగుతారనుకున్న వాళ్ళని కదిలించి మాట్లాడించాలి!చెయ్యాల్సింది ఒకే వైపు దాడి కాదు - తటస్థుల్ని మన వైపుకి తిప్పుకుంటే తప్ప గెలవలేం!చివ్వరివరకూ దానికోసమే ప్రయత్నించితే అసలుకే మోసం రావచ్చు,అదనపు సహాయం హామీలు రప్పించుకోఅవడంతో సరిపెట్టుకోక తప్పదేమో?అందులోనన్నా నిక్కచ్చిగా అంకెల విషయంలో రాజీ పడకుండా గట్టిగా వుండాలి,వుంటారా మనవాళ్ళు?!


         ఇలాంటి విషయాల్లో మూర్ఖంగా ఒకే వైపు దాడిని కేంద్రీకరిస్తే గెలవడం కష్టం.ఒంరిగా యెంత భీకరంగా పోరాడినా గెలుపు అనుమానమే అయినప్పుడు అలివిమాలిన దానికోసం పోరాడారు,చెవులు దులుపుకుని తిరిగొచ్చారు అనే వెక్కిరింతకి గురవుతాం!ఇలాంటి వాటికోసమే చాణక్యుడు షాడ్గుణ్యం వుపదేశించాడు.మిత్రుల్ని యుధ్ధంలోకి ఆహ్వానించాలి,తటస్థుల్ని మనకు అనుకూలం చేసుకోవాలి,వ్యతిరేకుల్ని బుజ్జగించి తటస్థులుగా మార్చుకోవాలి - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన చాణక్యానికి పదును పెట్టాలి.అయితే ఇప్పుడే కాదు ఇంకొంచెం వేడి పుట్టి ఆంధ్ర ప్రజానీకం ఆగ్రహం దేశం మొత్తానికి న్యాయమైనదని అనిపించే స్థాయికి పెరిగాక చెయ్యాలి.భాజపా కూడా అధికారికంగా కాకపోయినా పార్టీ పరంగా తన ముఖ్యమంత్రుల్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి మాట సాయం చేసే విధంగా సంసిధ్ధం చెయ్యాలి.కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటున్న మిత్ర రాష్ట్ర్రానికి ఆపాటి సాయం చెయ్యలేదా!ఒక హెచ్చరిక - కాంగ్రెసుని గానీ కాంగ్రెసు పార్టీకి సంబంధించిన సంస్థల్ని గానీ, కాంగ్రెసు పార్టీని అభిమానించే వాళ్ళని గానీ వుద్యమం లోపలికి రానివ్వకుండా ఆ పార్టీ మీద కూడా తన చిత్తశుధ్ధిని నిరూపించుకునే లాగ వొత్తిడి పెట్టాలి.కష్టమే,గ్యారెంటీ లేదు - అయినా తప్పదు:ఉద్యమ స్పూర్తితో కదలాలి!అందుకే సత్యధర్మన్యాయ ప్రతిష్ఠితమైన నా గురు పరంపర వ్యాసపరాశరాది షిర్డీ సాయినాధ పర్యంతం వున్న నా గురు పరంపర పాదాలను స్మరించి "సౌభాగ్య ఆంధ్ర" అనే ఉద్యమాన్ని ప్రతిపాదిస్తున్నాను.ఇది కేవలం ప్రత్యేక హోదా కోసం కాకుండా మనం వేస్తున్న తొలి అడుగులోని ప్రతి విషయాన్నీ ప్రతిబింబించేదిగా ఉండాలి!తప్పనిసరిగా ఉద్యమంలోకి అన్ని వర్గాల వాళ్ళూ ప్రవేశించాలి!నేను కేవలం సంచలనం కోసమో తాత్కాలిక సంరంభం కోసమో యేదీ  చెప్పను!అగ్నులు రగిలినా ఫరవాలేదు,ప్రాణాలే పోయినా ఫరవా లేదు,మళ్ళీ పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి నాటి దృశ్యాలు కనబడినా కంగారు పడకూడదు.వెనక్కి తిరగటానికి వీల్లేని ప్రయాణానికి మనం వేసే తొలి అడుగు బలంగా పడాలి,అంతే!

          యేది యేమయినా నవ్యాంధ్ర ప్రజలు డెబ్బయ్యేళ్ళ తర్వాత మళ్ళీ శూన్యం నుంచే తమ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు.తమ రెక్కల సత్తువ తప్ప మరే సాయమూ లేదు, దేవుడే దిక్కు అనుకుందామన్నా దేవుడు కూడా శీతకన్నేసినట్టున్నాడు మన మీద!

-----------------------------------------------------------------------------------------------------------------
(*శ్రీ శ్రీ ఇవ్వాళ నాకు సపోర్టుగా వుంటానికే ఈ మాట ఇంతకు ముందే తన కవిత్వంలో వాడినట్టున్నాడు!)
(@షిండే త్రయంలో ఒకర్ని నిలదీస్తే మాకూ ఇష్టం లేదు కానీ పైనుంచి ఒత్తిడి పెడుతున్నారన్నాడు?)

18 comments:

  1. విషయం ఒక ఎత్తు. దాన్ని చెప్పటానికి వాడే భాష ఒక ఎత్తు. ఈ వ్యాసంలో విషయం గురించి వ్యాఖ్యానించను. కాని మీరు వాడిన భాషపట్ల మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఉండలేకపోతున్నాను. మన్నించాలి.

    ReplyDelete
    Replies
    1. టపాలో వాడిన భాష గురించి నాదీ శ్యామలీయం మాస్టారి మాటే.

      Delete
    2. వార్నీ సింగడి కవితల జైగోట్టిముక్కల కూడా భాష గురించి మాట్లాడుతున్నాడే. ఈ నీతిమంతుడికి 'బోడి ఆంధ్రప్రదేశ్ ' అని 'కారు' కూతలు కూసిన రోజు ఈ నీతులు గుర్తు రాలేదు కాబోలు ఇప్పుడు ఎగేసుకుంటూ వచ్చాడు, ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే గంటె ఇదే మరి . ఇక చాల్లే ఇయ్యాల్టికి నీ నీతి ప్రవచనాలు పోయి సింగిడి కవితలు చదువుకో.

      Delete
    3. శ్యామలీయం గారు,
      హవ్వ! మీరా ఈసందేశాన్ని ఇచ్చేది.మొన్న మీ బ్లాగులో నావ్యాఖ్యకు ఎలా విరుచుకుపడ్డారో ఒకసారి గుర్తు చేసుకోండి.

      Delete
    4. శ్రీరామ్‍ గారూ, మీకు నా భాష పట్ల అభ్యంతరం ఎలా తోచిందో అర్థం కావటం లేదు. విరుచుకుపడ్డానని ఎందుకనుకుంటారు, వివరణ ఇచ్చానంతే. మీరు అనుకుంటూన్నట్లు విమర్శ అనేదీ దూషణ అనేదీ ఒకటే కాదు. మోసగించారు - దండనార్హులు అనే అన్నాను. ఫలాని నాయకుడిని ప్రత్యేకంగా నిందించలేదు నేను. తదనంతర చర్చలో మాత్రం వెంకయ్యగారి ఇంటర్వ్యూలోని ప్రతిమాట వెనుకనూ అధికారదర్పం ఉందని ఆక్షేపించటమూ, మోదీ మరొక నహుషుడిలా వర్తిస్తున్నాడని ఆక్షేపించటమూ మీ దృష్టిలో తిట్టటం కావటం అసమంజసం. అక్షేపణలన్నీ తిట్ట్లు కావండీ. ప్రస్తుతటపాలో వాడినటువంటి భాషపట్ల నేను అభ్యంతరం చెప్పటాన్ని తప్పుపట్టుతున్నారే - అంటే నాదీ అటువంటి భాషయే అన్న అభిప్రాయం మీదైతే ఒక నమస్కారం. వాదన లేమీ చేయను. ఎవరి విజ్ఞతమేరకు వారు అర్థంచేసుకుంటారని నమ్ముతాను. ఇబ్బంది లేదు.

      Delete
    5. మాస్టరూ,మీరు గ్రాంధికంలో తిట్టారు నేను వ్యావహారికంలో తిట్టాను.తిట్టాల్సిన వాణ్ణి యెట్లా తిట్టినా ఫర్వాలేదు,తిట్టగూడని వాణ్ణి మాత్రం తిట్టను నేను!నా పధ్ధతి అది,అనతె!సజ్జనుణ్ణీ దుర్జనుణ్ణీ కూడా సర్ అని పిలిస్తే అది ఖచ్చితంగా సజ్జనుణ్ణి అవమానించినట్టే లెఖ్ఖ?!

      Delete
    6. నాకు మీ అంత తెలుగు భాష పరిజ్ణానం లేదు. మీరు నిష్టూరంగా రాశారని మాత్రం చెప్పగలను. నేనేమి మీ మంత్ర శక్తిని అవమానించలేదు కాని మీరే "ఇలాంటి వెఱ్ఱిమొఱ్ఱి మాటలకు నేను ప్రతిస్పందనలు చేయాలా?" అన్నారు

      వెంకయ్య నాయుడు ఆంధ్రలో మహానాయకుడు కాడని అందరికి తెలిసినా, విభజన సమయంలో ఎవ్వరు దొరకక,వాళ్ల తప్పులను కవర్చేసుకోవటానికి, ఆంధ్రావారి తరపున మాట్లాడానికి వెంకయ్యను హీరో గా చేశారు. రంగంలోకి దించారు. ఇప్పుడు ఆయనను విలన్ గా చేసి దూషిస్తున్నారు.ఆయన కి నెల్లూరు లో పట్టుమని పది మంది కౌన్సిలర్ ల ను గెలిపించే బలం లేదు.ఆయన కర్ణాటక రాజ్య సభ సభ్యుడు. ఆయనను అడ్డుపెట్టుకొని బిజెపి ని,మోడిని తిట్టటం, బిజెపి ఆంధ్రాలో గెలవదు అంట్టు విశ్లేషణలు చేయటం హాస్యాస్పదం. మీరే కాదు ఆంధ్రజ్యోతి పేపర్ లో,బ్లాగులో నవీన్ పెద్దాడ అనే ఆయన కూడా బిజెపి ని ఎద్దేవా చేస్తూ రాయటం చదివాను. కావురి,పురంధరేశ్వరి గార్లు ఆ పార్టిలో చేరి దానిని ఉద్దరించినట్లు రాశారు. వెంకయ్య, కావురి, పురంధారేశ్వరి, వీరందరు బిజెపి లో లేకపోయినా ఆపార్టికి వచ్చిన నష్టం ఎమీ ఉండదు. ఎలాగు రెండుపార్టిలు రెండు సామజిక వర్గాల వారి. వీరు లేకపోతే కనీసం బిజెపి అన్నా అన్ని కులాల వారు చేరి బలపడటానికి ఆస్కారం ఉంది. రానున్న ఎన్నికలలో ఆంధ్రాలో కాపు,దళిత,బిసి నో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిలబడటానికి అవకాశం ఉంట్టుంది. ఆంధ్రాకు తెలుగుదేశం పార్టి కోరినన్ని నిధులు బిజెపి పార్టి ఇస్తే అవి ఎలాగు అవి ఎవరి జేబులో కి పోతాయో అందరికి తెలుసు. మీడీయాలో మేధావులు మోడి నిధులివ్వలేదని, వాగ్దానాలు నిలబెట్టలేదని గోల చేస్తూంటారులేండి.

      Delete
    7. హరిబాబుగారూ, మీరూ‌ నేను తిడుతున్నాననే అంటున్నారా సంతోషం.
      శ్రీరాం గారూ, ఆరోగ్యం బాగులేదు. వాదించే ఓపిక లేదు.

      Delete
    8. శ్యామలీయం మాస్టారూ!
      మీరు "దండనార్హులు" అంటే శిక్షించదగిన వాళ్ళు అనే కదా అర్ర్ధం!

      శిక్ష యెలాగయినా వుండొచ్చు,పాతకాలం రాజులూ సింగపూరులో లీక్వాన్ యూ కొరడా దెబ్బల శిక్షలు వేశారు!ప్రజలు యెన్నికల్లో వోట్లు వెయ్యకుండా బుధ్ధి చెప్పొచ్చు.బుధ్ధి చెప్పు వాడు గుద్దితేనేమయా వినుర వేమ!

      Delete
  2. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా అని కూడా శ్రీశ్రీయే చెప్పేడు. ఎవరూ ఏమీ పీకే అవకాశంలేదు కనక ఎదురుచూడ్డం అనవసరం. అలాగే పీకే ఆస్కారుకి కూడా ఆస్కారం లేదు.

    ReplyDelete
  3. కేంద్ర సాధారణ బడ్జెటులో ఆర్ధిక లోటు (fiscal deficit) ముందు అనుకున్న టార్గెట్ (దేశ జీడీపీలో) 3.6% సాదించలేక పోయామని, 3.9% శాతం అవుతుందని అరుణ్ జైట్లీ తెలిపారు.

    ఆంద్ర రాష్ట్ర తలసరి ఆదాయం (per capita income) 90,517 రూపాయిలని గవర్నర్ నరసింహన్ ఈరోజు ఆంద్ర రాష్ట్ర ఉభయ సభలలో తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పదమూడు ఆంద్ర జిల్లాల (ఖమ్మం నుండి ఇటీవలి బదలీ మినహాయించి) జనాభా 4 కోట్ల 94 లక్షలు. అంటే ఆంద్ర రాష్ట్ర జీడీపీ షుమారు 4 కోట్ల 46 లక్షల కోట్లు అవుతుంది.

    కేంద్రం సాదించిన 3.9% పరిగణలో తీసుకుంటే ఆంద్ర ఆర్ధిక లోటు 17,432 కోట్లు ఉండవచ్చు. 3.6% తీసుకున్నా 16,091 కోట్లు కంటే తక్కువ లోటు ఉంటె మంచిది. ఆంద్ర బడ్జెటు కోసం వేచి చూద్దాం.

    నిజానికి పై లెక్కలలో రుణమాఫీ, ఉద్యోగులకు పదో పీఆర్సీ సూచించిన 29% కంటే ఎంతో ఎక్కువయిన 43% ఇంక్రిమెంట్ లాంటి ఖర్చులు తొలగించాలి.

    ReplyDelete
    Replies
    1. గొట్టిముక్కల నీకు నీ దొరకి ఆంధ్రప్రదేశ్ తప్ప మీ సంగతి పట్టదు . నిజమేలే ఆళ్లు బాగుపడితే గది మాదే అని ఎదవాలా. లేదు దేవుడో అని సెంట్రల్గవర్నమెంట్ ని అడిగితే మాకు భీ అదే గావాలా అని దేబిరించాలా ఎన్ని పనులు గందుకే ఎప్పుడూ పక్క రాష్ట్రం మీదే మీ సోపు. గింతోటికి దానికి మీకో స్టేట్ దానికో ఉద్దేమం అని పేరు. ఏం బతుకులో.
      నువ్వేవిడివి పక్క రాష్ట్రం ఏమి తీసెయ్యాలో చెప్పినీకి. నీ పని నువ్వు జూసుకో పొయ్యి .

      Delete
    2. యేవో లెక్కలు చెప్తున్నాడుగా,పోనిద్దురూ!

      Delete
    3. హరిబాబు గారూ, లెక్కలలో తప్పుంటే చెప్పండి సార్!

      Delete
    4. ఆ ఎకనామిక్సూ బడ్జెట్ లెక్కలూ అవీ నాకు అంతగా తెలియదు.యెవరయినా అర్ధమయ్యేటట్టు చెప్తే తప్ప!

      Delete
    5. సరే ప్రయత్నిస్తాను. ఆంద్ర రాష్ట్రానికి వచ్చే డబ్బు (cash inflows) కంటే వెళ్ళే డబ్బు (outflows) చాలా ఎక్కువని కొందరి వాదన. ఈ లోటు (deficit i.e. inflows-outflow) తెలంగాణా ఏర్పడడం వల్ల వచ్చింది కాబట్టి కేంద్రం దీన్ని భర్తీ చేయాలని వారు అడుగుతున్నారు. ప్రత్యెక ప్రతిపత్తి కావాలనే డిమాండ్ వచ్చింది.

      ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నంత వరకు తెలంగాణా ధనం ఆంద్ర ఖర్చులకు వాడారని దీనితో తేటతెల్లం అవుతుంది. అలా కాదని అంతక ముందు చేసిన బుకాయింపుల డొల్లతనం వెల్లడయింది. ప్రస్తుతానికి ఈ విషయాన్ని పక్కబెట్టి ఈ లోటు యొక్క గంభీరత పరిశీలిద్దాం.

      దేశ/రాష్ట్ర వాళీగా జరిగే లావాదేవీల మొత్తాన్ని జీడీపీ (GDP i.e. gross domestic product) అంటారు. ఇది ఆ ప్రాంతం ఆర్ధిక స్తొమతును అంచనా వేసే ఒక ముఖ్య ప్రామాణికం. దేశ బడ్జెటు లోటు జీడీపీలో 3.6% మించకుండా ప్రయత్నిస్తామని టార్గెట్ పెట్టుకున్నా 3.9% వరకూ వెళ్ళింది.

      జీడీపీని జనాభాతో విభజిస్తే వచ్చే సంఖ్యను తలసరి ఆదాయం (PCI i.e. per capita income) అంటారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన సంఖ్య ప్రకారం నేను జీడీపీ & లోటు టార్గెట్ అంచనా వేసాను. బడ్జెట్ లోటు ఎంత ఉండబోతుందో వేచి చూద్దాం.

      ఆంద్ర బడ్జెట్ లోటు జీడీపీలో 3.9% కంటే చాలా ఎక్కువ ఉంటేనే లోటును భర్తీ చేయమని కేంద్రాన్ని అడగొచ్చు. అలా కాని పక్షంలో ఈ కోరిక న్యాయం కాదు.

      I hope the above is useful (and easy to follow)

      Delete
    6. [యేవో లెక్కలు చెప్తున్నాడుగా,పోనిద్దురూ!]

      చూసారు గా పాముకు పాలు పోస్తే ఏమవుతుందో !

      వచ్చాడు ఎక్కడ ఎగేసుకుంటూ 'కారు' లెక్కలు ఇక్కడ కాపీ పేస్ట్ చెయనీయకి. తెలంగాణా సొమ్ము తెచ్చి ఆంధ్ర కి పెడుతున్నారా? అవ్ మల్లా మస్తుగా జెప్పినావ్ ఆ తెలంగాణా కి వచ్చే డబ్బు ఎవడు టాక్స్ దొబ్బపెడితే వస్తాంది? సాలార్జంగ్ మ్యుజియం + కుతుబ్షాహీ ఘోరీలు కడితే వస్తాందా . లేకపోతె మీ దొర ఎకరానికి కోటి సంపాయించి ఇస్తే వస్తంద. మొన్నదాకా బ్లాగుల్లో పది మొరిగారే ఆంధ్రోల్ల కోసం హైటెక్ సిటీ కత్తించుకురు. మాకేం చేయాలా అని , లచ్చ నాగళ్ళు తెచ్చి దున్నుతున్నాం అని . పార్మ కంపెనీలు పెట్టి పోల్యుట్ చేస్తున్నారు అని. గయన్నీ తెచ్చి పెడితే ఇయ్యాల దొబ్బి తింటున్తురు ఒక నోటితో తిడతా.

      మేము కాదు అబద్ధాలు చెప్తా మా సొమ్ము అంతా దిగమింగి కూర్చిని తింటురు, గందుకే మేము నష్ట పోతున్నాం అని మొన్నటి దాకా మీరు ఏడ్చిన ఏడుపులు అబద్ధం అని చెప్తున్నాం . మళ్ళీ మాట్లాడితే అప్పనం గా తింటున్నా హైదరబాద్ ఆదాయం లో మా వాటా మాకియ్యకుండా దొబ్బి తింటున్నారు అంటున్నాం . సిగ్గుండాలి ఎదవ లేకల్లు చెప్పనీకి . ఎదవ ఏడుపులు ఏడ్చి ఇప్పుడు వచ్చి ఇట్టాంటి 'కారు' కూతలు కుయ్యనీకి. ఏది సెంట్రల్ గవర్నమెంట్ అడగాలో అది మేము చూసుకుంటాం ఇవ్వల్లో లేదో వాళ్ళు ఏడుస్తారు మద్దెలో నీ తడక అనవసరం పొయ్యి దొరగారి ఫార్మ్ హౌస్ లో పని జూసుకో .

      Delete
    7. @jai
      ఇవ్వాళే పేపరులో చూశా "ఆ చదువులు మాకూ వద్దా" అని!ఏపీలో ఉన్న్నత విద్యాసంస్థలు కరువు.అంటే అన్నీ అక్కడే ఉన్నాయి,అయినా యెందుకో చదువులో మమ్మల్ని అణగదొక్కేశారు అని యేడ్చారు!యెక్కడో కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి అంత దూరం వచ్చి అక్కడ బాగుపడితే పక్కనే ఉండి మీరెందుకు బాగుపడలేకపోయారు, అవే అవకాశాలు మీకు మరింత దగ్గిరగా ఉన్నా - అనే ప్రశ్న యెవణ్ణి బడితే వాణ్ణడిగా!ఒక్కడు సమాధానం చెప్పలా,కొందరయితే అసలు కనబడకుండానే ఐపు లేకుండా పొయ్యారు!

      అసలు కొందరు ఆ ప్రస్నే అర్ధం కాలేదనై తప్పుకున్నారు!మీకిప్పుడు అర్ధమయితే జవాబు చెప్తారా?

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...