Wednesday 25 February 2015

రాజకీయ ధర్మసందేహాలకు హరిశ్రీ గారి కొంటె సమాధానాలు!

శ్రీ గురుభ్యోః నమః
శిష్యుడు:అయ్యా గురువు గారూ,ఈ మధ్య మీరు కొన్ని రాజకీయ దుందుడుకు వ్యాఖ్యలు చేసినట్టుగా కనపడుతున్నది!కొన్ని చోట్ల మీరు స్వవచోవ్యాఘాతానికి కూడా పాల్పడినట్టు కొందరు వ్యాఖ్యాత మిత్రులు ఆరోపించారు, గమనించారా?వాటికి మొదట మీరు జవాబు చెప్పాలి.తర్వాత మరికొన్ని ప్రశ్నలు సిధ్ధంగా వున్నాయి!

హరిశ్రీ:నాకు తెలుసు!నేను మాట్లాడే(పోష్టులోకి యెక్కించే) ప్రతి అక్షరమ్ముక్కా బాగా ఆలోచించి ఒకటికి పదిసార్లు ఆ విషయమ్మీద నా పాత అభిప్రాయాలకి యేమయినా తేడాగా వుంటుందా అని మనస్సులోనే చెక్ చేసుకుని మరీ పోష్టులోకి యెక్కిస్తాను!మొదటి విషయం ఒక పాత పోష్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని  మొదట ప్రపంచంలోనే అపురూపమైన రాజధాని ప్రతిపాదించినప్పుడు అద్భుతం అని ప్రశంసించి ఆ తర్వాత అదే ముఖ్యమంత్రిని అదే విషయం గురించి యేకి పారెయ్యడం గురించినది - అవునా?

శిష్యుడు:అవునండి,దానికి మీరు అప్పుడే జవాబు చెప్పినారు - కానీ ఫైనలుగా ఒకసారి చెప్తే ఇదే ఆఖరు మాట అవుతుంది. మరి చెప్పండి!

హరిశ్రీ:ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజకీయ జీవితం కాంగ్రెసులో మొదలైంది!ఆ పాత వాసనల్ని అతను పూర్తిగా వొదిలించుకోకుండానే మామగారి పార్టీలోకి యెకాయెకిన జంపయ్యాడు?అదీ యెప్పుడు,మామగారు పార్టీ పెట్టినప్పుడూ రాలేదు,ఆ పార్టీని ప్రజలు అప్రతిహతంగా ఆదరిస్తున్నప్పుడూ రాలేదు,యెన్నికలు దగ్గిర పడి దాదాపు ఒక ప్రభంజనం లాంటి కుదుపు వస్తున్నదని అందరూ వూహిస్తున్నప్పుడూ రాలేదు,తీరిగ్గా ఫలితాలు తెలిశాక మామగారి పార్టీ అధికారం యేర్పాటు చెయ్యటం ఖాయం అని తెలిశాక చేరాడు!అది కాంగ్రెసు లక్షణం!అందరు కాంగ్రెసు వాళ్లలో లాగే అందరూ తన చుట్టూ తిరుగుతూ వుండాలనే సరదా వుంది.ఆ సరదా కోసం పార్టీని బలమయిన అంకితభావం గల కార్యకర్తల పార్టీగా తీర్చిదిద్దడంలో అద్భుతంగా కృతకృత్యు డయ్యాడు!లక్ష్మీపార్వతి రంగప్రవేశంతో దృశ్యం హఠాత్తుగా మారిపోయింది, అప్పటిదాకా తనచుట్టూ తిరిగే జనాలంతా ఆవిడ కేసి పరిగెత్తారు!తను పోగొట్టుకున్న స్థానాన్ని దక్కించుకోవటానికే అంత భీభత్సమయిన ప్లాను వేసి ఆవిణ్ణి దుష్టశక్తిగా వర్ణించి సాక్షాత్తూ పార్టీ వయ్వస్థాపక అధ్యక్షుణ్ణే అతని వైపు నుంచి వాదన చెప్పుకునే అవకాశం కూడా లేకుండా  బహిష్కరించ గలిగాడు?!నిజంగా ఆవిడకే గనక వీళ్ళు ఆపాదించిన రాజకీయం తెలిసి వుంటే భార్య స్థానంలో వుండటం వల్ల పెద్దాయన చేతి మీదుగానే వీళ్ల నందర్నీ భూస్థాపితం చెయ్యగలిగి వుండేది!యెదటివాళ్ళతో ఒక పదినిముషాలు మాట్లాడితే చాలు యెలాగోలా బురిడీ కొట్టించి తన పాయింటే కరెక్టని వొప్పించి దారికి తెచ్చుకోగలడు - ఆ ప్రజ్ఞలో ఇతను దుర్యోధను డంతటివాడు!

కానీ యేమి లాభం?రామహత్యాపాతకం వల్లనో యేమో ఇతని హయాములో వానలు కురవలేదు.ప్రపంచ మంతట్నీ చూసి ఐటి బూం హైదరాబాదుకుకి రప్పించటంలో తను మునిగి పోతే రైతులూ నేత పని వాళ్ళూ అంతా దివాళా తీసి అప్పుల పాలయ్యారు.వాళ్ళ సమస్యల్ని అవకాశంగా తీసుకుని రోగశేఖరు డొకడు పాదయాత్రలు చేసి ప్రజాభిమానం సంపాదించుకుని అధికారం లోంచి ఈడ్చి తన్నేశాడు?తొందరగా చెడ్డపేరు పోగొట్టుకుని బాగా పేరు తెచ్చుకోవాలనే దురదతో ప్రభుత్వాధికారుల్ని మరీ అతిగా నేను నిద్రపోను మీరూ నిద్రపోవద్దనేటంతగా రుద్దడంతో అన్నీ అవతలోడికి కలిసొచ్చి తను వీధిన పడ్డాడు!కొంచెం సానునయంగా ఆత్మహత్యలు చేసుకునే సామాన్యుల్ని ఓదార్చి అయ్యా బాబూ అని ప్రజల్ని పలకరించి వోదార్చి ధైర్యం చెప్పి వుంటే అధికారం పోయి వుండేది కాదేమో?అప్పుడు పోయిన అధికారం మళ్ళీ ఇన్ని దఫాలుగా వూరించి ఇప్పుడు వచ్చింది!తనే చెప్పుకున్నట్టు తను మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడూ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడూ సమస్యలతోనే వచ్చింది!మొదటిసారి తను చేసింది తక్కువేమీ కాదు.ఎలంగాణా కుతర్క పండితులు వొప్పుకోరు గానీ జాతీయ అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా ప్రకారం హైదరాబాదు ఇటీవలి ఇరవయ్యేళ్ళలో పెరిగిన పెరుగుదలకీ అంతకు ముందరి స్థితికీ పోలికే లేదు!ఒకే ఒక నగరం మొత్తం రాష్ట్ర ఆదాయంలో సింహభాగాన్ని తీసుకొచ్చే స్థితిలో నిలబెట్టాడు.

మొదటిసారికీ రెండోసారికీ అతని సమర్ధతలో తేడా లేదు గానీ ఇతని అసమర్ధత వల్లనే రాష్ట్రం విడిపోగూడని విధంగా విడిపోయి ఒక ముక్కకి మాత్రమే ముఖ్యమంత్రి కాగలిగాడు?!రేఖామాత్రంగా చెప్పిన ఈ మొత్తం రాజకీయ జీవితంలో రామారావుని దుర్మార్గంగా పడగొట్టటం వల్ల ఇప్పటికీ నాకు ఇతనిపైన అవ్యాజమయిన అభిమానం లేదు!తన చుట్టూ జనం మూగాలనీ తనకి మెహర్బానీల కోసం స్థాయి తక్కువ పనులు కూడా చెయ్యగలగడం అనే అవలక్షణం నాకు అస్సలు నచ్చదు కాబట్టి ఇతన్ని అతిగా నేను పొగడను.ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి వుద్యమ కాలంలో ఆధ్రావాళ్లని దొంగలు,దోపిడీదార్లు అంటున్నప్పుడు దాన్ని అడ్డుకోవటానికి అన్ని అర్హతలూ వుండి కూడా నగిరి పింగిరిగా వుండటం ఇతను చేసిన తెలివితక్కువ పని!అప్పటి కాలంలో కమ్యునిష్టుల ప్రాబల్యాన్ని అడ్డుకోవటానికి భాషాప్రయుక్త రాష్ట్రాలనే పేరుతో కలిపిన ఈ తెలుగు రాష్ట్రం విడిపోవటం అనేది యెప్పటికయినా తప్పదు, ఇవ్వాళ కాకపోయినా మరో యాభయ్యేళ్ళ తర్వాతనయినా వందేళ్ళ తర్వాత అయినా యెప్పటికయినా తెలంగాణా వాళ్ళ పైత్యకారి తనంతో ఆంధ్రా వాళ్ళు వేగలేరు, కల్సి వుండటం వల్ల యెక్కువగా నష్టపోయింది ఆంధ్రా వాళ్లే అనేది నా తిరుగులేని నమ్మకం!హైదరాబాదు మన రాజధాని అనుకుని యెన్ని రేవు పట్నాల్ని మూల పడేసుకున్నాం?ఇవ్వాళ్టికీ దేశాల మధ్యన పెద్దస్థాయిలో జరిగే రవాణా అంతా నౌకల ద్వారానే జరుగుతుందని తెలిస్తే ఈ యాభయ్యేళ్ళలో మనం యెంత రెవెన్యూ పోగొట్టుకున్నామో తెలిస్తే ప్రాణం వుసూరు మంటుంది యే కొంచెం బుర్ర గలవాడి కయినా?మంచో చెడో తన అవసరం కోసమో ఇన్నేళ్ళు దొంగలని అంత భీభత్సం చేసిన వాళ్ళ నాయకుడే ఇవ్వాళ తెలంగాణా పునర్నిర్మాణానికి ఆంధ్రావాళ్ళనే సాయమడుగుతున్నాడు చూడు!ఈ మాట ఆరోజునే చంద్రబాబు యెందుకు నిగ్గదియ్యలేదు?అన్నేళ్ళ ప్రభుత్వంలో వుండి గణాంకాలతో సహా లెక్క ప్రకారం వాదించి  "కలిసి వుందటం పట్ల మేము సర్దుకు పోలేక పోతున్నాం,మీ అంత హుషారుగా మేం పరిగెత్తలేము గనక వెనకబడిపోతున్నాం.మాకు నచ్చలేదు,మేం విడిపోతాం.మా బతుకు మేం బతుకుతాం.మా పరుగు మేం పెడతాం. అని యెంత గట్టిగా అడిగినా అడుగు , నీ ఇష్టం - అంతే గానీ ఆంధ్రావాళ్ళు తెలంగాణాని దోచుకోవడం అనే మాట మాత్రం మాట్లా వద్దు" అని ధీమాగా గద్దించి మాట్లాడకుండా గోడ మీద పిల్లివాటం రాజకీయం నడిపాడు,యెందుకు?

ఆ కాలంలో అట్లా మాట్లాడి వుంటే అతనికి చాలా ముందుగానే ఆంధ్రావాళ్ళు మంచి ఫలితాన్ని ఇచ్చేవాళ్ళు!పబ్లిక్ డయాస్ మీద యెలా మాట్లాడితే యే యెఫెక్టు వస్తుందో తెలుసుకుని వ్యూహాత్మకంగా మాట్లాడటంలో ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రితో పోలిస్తే ఇతను దద్దమ్మ కింద లెఖ్ఖ కొస్తాడు!అట్లా గట్టిగా నిలదీసే లక్షణం ఇతని కుంటే తప్పు వొప్పుకుని లెంపలేసుకోవాల్సిన అక్కడి అధమస్థాయి రాజకీయ నాయకుడు ఇవ్వాళ తను చేసిన తప్పు అనే సరిదిద్దుకున్న వుదారుడిగా కూడా వేషం కట్టి విర్రవీగుతున్నాడు?ప్రజలకి జాతి పరమయిన స్వాభిమానం ఒకటి వుంటుందనీ దాన్ని కాపాడటం కూడా ముఖ్యమేనని తెలుసుకోకుండా మళ్ళీ అధికారం సంపాదించడం తన చుట్టూ జనాన్ని తిప్పుకోవడం కోసమే అనే ఆలోచనా విధానంలో వుండటం వల్లనే అతడవన్నీ చెయ్యలేకపోయాడు.

ఇతని గోమీద పిల్లివాటం కన్నా ప్రజలుగా మనం చేసిన ఒక చెయ్యగూని ఘోరమయిన తప్పు మరింత ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. అదేమిటంటే వ్యాపార వేత్తల్ని ప్రజా ప్రతినిధులుగా చట్టసభలకి పంపించటం అనే దిక్కుమాలిన పని?!రిగ్గింగులూ,బూతు క్యాప్చరింగులూ,యెన్నికల ప్రక్రీయలో వున్న లోపాలూ వీటి చాటున సమర్ధించుకుని ప్రయోజనం లేదు.రాష్ట్రాన్ని సమైకంగా వుంచాలని హడావిడి చెయ్యటం దగ్గిర్నుంచీ పెప్పర్ స్ప్రే దరిద్రాలకి కారణమయిన కాంగ్రెసు వాళ్ళంతా చాటుగా తనూ వ్యాపారియే అయిన వుద్యమనేతతో హైదరాబాదులో వున్న తమ వ్యాపారాలకి హాని చెయ్యననే హామీని తెచ్చుకోవడం కోసమే బహిరంగంగా ప్రజల్ని వెర్రివెధవల్ని చేశారు! అట్లా పార్ట్ టైము పొలిటీషియన్లు కాకుండా ఫుల్ టైం పొలిటీషియన్లు అక్కడ వుంటే విభజన వల్ల ఆంధ్రా నష్టపోకుండా జాగ్రత్త పగలిగే వాళ్ళు. ఆ లోపాయకారీ ఒప్పందం వల్లనే ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి తేలంగాణా పునర్నిర్మాణాన్ని కొత్తగా తెలంగాణా వ్యాపార పారిశ్రామిక రంగాన్ని వుత్సాహ పరిచడం ద్వారా కాకుండా మళ్ళీ ఆంధ్రావాళ్ళ పెట్టుబడులు మాకు కావాలి,ఆంధ్రావాళ్ళ వ్యాపార దక్షతని మేం వొదులుకోం అని వాగుతున్నాడు?తెలంగాణా పుచ్చొంకాయ్ మేధావులకి ఇవేవీ అర్ధం కావు!హైదరాబాదూ తెలంగాణా ముఖ్యమంత్రీ ఇప్పటికీ ఆంధ్రావాళ్ల గుప్పిట్లోనే వున్నది,వున్నాడు,వుంటాయి?! 

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబులో ఇదివరకటి పరిపాలనాపరమయిన లోపాలు చాలావరకూ పోయాయి!మొత్తానికి పదేళ్ళు పునర్విమర్శ చేసుకుని యెదిగాడు. రాజధాని విషయంలో అతని ప్లాను మంచిదే!లోటు బద్జెట్, కేంద్రం నుంచి పూర్తి స్థాయి నిధులు రాకపోవటం, ఋణమాఫీ బరువూ - వీటన్నింటితో రాజధాని కట్టడానికి అయ్యే ఖర్చుని రాజధాని నుంచే రాబట్టటం తెలివైన ఆలోచనే - అందులో యెలాంటి వ్యతిరేకతా నాకు లేదు!వచ్చిన కోపమల్లా కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోవటం ఇతని అసమర్ధత వల్లనా అనే అనుమానం వల్ల వచ్చింది. కానీ కాంగ్రెసు ఇక్కడ రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఆర్ధిక వ్యవస్థని భ్రష్టు పట్టించిందని ఆర్ధిక వేత్తల విశ్లేషణలూ చెప్తున్నాయి,కాబట్టి మొత్తం దేశపు ఆర్ధిక స్థితి మెరుగుపడేవరకూ యెదురు చూడక తప్పదేమో?ప్రతుతం చంద్రబాబు నిస్సహాయుడిగా వుండటం వల్ల అతన్ని అతిగా విమర్శించి ప్రయోజనం లేదు.అతనూ ప్రజలూ వెయ్యి కళ్లతో గమనిస్తూ ఒక్కతాటి మీద నడిస్తే తప్ప రాష్ట్రం తలెత్తుకు నిలబడలేదు.ఇదీ చంద్రబాబు రాజకీయ జీవితం గురించి నా ముందరి పోష్టుల్లో వచ్చిన భిన్నాభిప్రాయాల్ని కూడా కలిపి చేసిన నా విశ్లేషణ!ఇప్పటికీ ఇవన్నీ గందరగోళంగా అనిపిస్తే నేనిక ఇంకా విడమరిచి చేప్పలేని అశక్తుణ్ణి!

ఇంక మోదీ గారిని మొదట్లో ఆకాశాని కెత్తటం,డిల్లీ యెన్నికల్లో ఓడించమనటం,పనిలో పనిగా కెజారీవాలుడి వీరవిక్రమోపేతమయిన వుట్టికొట్టుడూ అన్నా హజరీయుని మూర్ఖ ప్రలాప సంభరిత రొడ్డకొట్టుడూ లాంటి వాటి గురించి తర్వాతి ప్రసంగంలో చెప్పుకుందాం. 
స్వస్తి!

2 comments:

  1. బాబు డాబుసరులకు పోకుండా , ఒకటి తర్వాత ఒకటి చూసుకొంటూ వస్తే బాగుండెదేమో . పదవి కొఱకు పెదవిని యిష్టం వచ్చినట్టల్లా ఆడించాడు .రైతుల ఋణమాఫీ కంటే , పల్లెల్లో రోడ్లు లేక , కరెంటు లేక , నీళ్ళు లేక , పరిశుభ్రత లేక యిబ్బంది పడ్తున్న వాళ్ళకు ఆ సౌకర్యాలు ( ఈఋణమాఫీ డబ్బులతో ) ఎంచక్కా చేసి ఆ అసౌకర్యాలని తీసివేస్తే ఎంతో బాగుండేది .
    ఎచ్చులకు ఎప్పుడూ ఎవ్వరూ పోగూడదు . పోతే ఉచ్చుల్లో చిక్కుకోక తప్పదు .

    తెలంగాణా మంత్రి పెదవి పారేసుకొని , వరాలిస్తున్నాడంటే అక్కడ యింతదాకా ( ఆంధ్రా , తెలంగాణా కలసి ) సంపాదించిన సంపద ముఱిగిపోతున్నది . దానిని తన బ్రాండ్ చూపించుకోవాలని , మఱల రాబోయే ఎన్నికలలో తన పార్టీయే ( తనూ , తన వాళ్ళే ) ప్రభుత్వం కావాలన్న తపన . అది ఫలిస్తుందో , లేదో కాలం ( ఓటరు ) చెప్పాల్సిందే .

    ReplyDelete
  2. మీరు చెప్పింది నిజమే!కానీ యెన్నికలప్పుదు ఒకవైపు కేసీఆర్ ప్రక్తంచివుండతం,జగన్ నుంచి పోటీని తట్టుకోవతం ముఖ్యమనుకున్నాడు.నేను చెప్పినట్టు గోదమీదపిల్లివాటం యెత్తుగదకి పోకుండా గట్టిగా వుంతే బాగుండేది!అదీగాక యెప్పుదయితే విభజన ఖాయం అని తెలిసిందో అప్పట్నుంచే ప్రజల్లో చంద్రబాబు మాత్రమే విభజన సన్మస్యల్ని గట్టెక్కించగలదని అనుకున్నారు - అది గమనించి ధైర్యంగా వుండి ఋణమాఫీ గురించి ప్రస్తావించకుండా వుంటే బాగుందేది.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...