Thursday, 27 August 2015

సీతమ్మ వారి పుట్టింట్లో యెంత వైభోగం?రాముల వారి నట్టింట్లో యెంత నైరాశ్యం!!

     ఆడపిల్లని ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడు అన్నీ చూడాలన్నారు పెద్దలు - జాతకాలతో సహా!అన్నీ కుదిరినా విడివిడిగా ఇద్దరూ మంచి జాతకులైనా దంపతులుగా కలవటానికి జాతకాలు కలవకపోతే వాళ్ళు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో సని అన్నట్టు అష్టకష్టాలు పడుతూనే ఉంటారు, ఆ సీతారాములకీ జాతకదోషం తప్పలేదా?


     ఖట్మండూకి నైరుతిదిశలో 133 కిలోమెటర్ల దూరంలో ఉన్న జనక్ పూర్ నగరాన్ని హిందువులు సీతాదేవి పుట్టినిల్లుగా అభావిస్తారు.నిజానికి సీత తండ్రి జనక మహారాజుని కొందరు రాజర్షి జనకుడు అని కూడా అనుకుంటారు గానీ అది పొరపాటు!అష్టావక్రుడి లాంటి జ్ఞానులతో గోష్టి సాగిస్తూ కనబదే ఆ జనక రాజర్షి వేరు ఈ జనక మహారాజు మహావీరుడు.శివచాపం ఇతని వద్దకు రావడం కూడా యోధత్వమే కారణం!సీత స్వయంవరం రాముడు వచ్చిన ఆ ఒక్కరోజునే జరగలేదు.శివధనుస్సుని యెక్కుపెట్టిన వారికి తన పిల్ల నిస్తాననై ప్రకటించి చాలా కాలమైంది,యెందరో వీరులు వచ్చారు,యెక్కుపెట్టలేక వెళ్ళిపోయారు,సీత సౌందర్యం గురించి తెలిసి విల్లు యెక్కుపెట్టలేకపోయినా యుధ్ధంలో ఓడించి అయినా సాధించుదామని ప్రయత్నాలు కూడా చేశారు.ఇక సీతకి పెళ్ళే కాదేమో అనే నిరాసలో ఉండగా ఆశీసుల కోసం మునులందరికీ కబురు పెట్టినట్టుగానే విశామిత్రుడికి జనక మహారాజు పంపిన ఆహ్వానం వల్ల ఆయన అయోధ్యకి తిన్నగా వెళ్ళడానికి బదులుగా అది కూడా చూసుకుని వెళ్దామని అనుకోవడం వల్ల అటు వెళ్ళడం జరిగింది!అక్కడ యెటూ రాముడు కూడా ఒక రాజకుమారుడే గనక తనూ ప్రయత్నించాడు,ఇక మరెవ్వరూ యెత్తాల్సిన అవసరం లేదు గనక ధనువు విరిగింది - సీతారాముల కళ్యాణం జరిగింది!

     అప్పటినుంచీ మొదలైంది సీత కష్టాల పరంపర!అంతఃపుర రాజకీయాలు సీతకి తెలియనివి కావు.మొదట అసలు రాజవుతాడో,రాజభ్రాత అవుతాడో తెలియని ఆందోళన - యే ఆడదానికైనా పెద్ద కష్టం మీ ఆయన యేం చేస్తుంటాడు అంటే గొప్పగా చెప్పుకునే వీలు లేకపోవటం!మామగారు హడావిడిగానే చేసి అందువల్లనే తగలరాని దేబ్బ తగిలి అఘోరించాడు గానీ తెల్లారితే రాజవుతాడనుకున్న ఆర్యపుత్రుడు అరణ్యవాసం వెళ్ళాలి అడివిలో ఆపదలుంటాయి నువ్వు రావద్దు నన్ను మాత్రం సాగనంపమని చావుకబురు చల్లగా చెప్పాడు!ఇదెక్కడి గోల,ఒక రోజూ రెండు రోజులు కాదు పధ్నాలుగేళ్ళు భర్తను విడిచి ఒంటరిగా ఉండటానికి తన సతీత్వం ఒప్పుకోలేదు.అయితే అయిందని తెగించి భర్త అని కూడా చూడకుండా చనువుంది గనక అనకూడని మాటలు కూడా అనేసి పోట్లాడి మరీ తను కూడా తోడుగా వెళ్ళీంది!సీతకి తర్వాత యే కాలంలో యే భార్య చేసినా సీతని చూసే కదా అలా చేసేది!?

     పోనీలే రాజరికపు చిక్కులు లేవు,యే బాదరబందీ లేదనుకుని హాయిగా మరిది మంచివాడు గనక వేళకి అన్నీ అమర్చిపెడుతుంటే తేనెవెన్నెల రోజుల మాదిరి గడిపేశారు ఆదిదంపతు లిద్దరూ పదమూడేళ్ళూ!అయోధ్యలో సాటివాళ్ళు యెక్కడ తనమీద జాలిపడతారో అని ఇక్కడి సరదాల కన్నిటికీ గుర్తుల్ని సేకరించే పిచ్చి ఆఖరి రోజుల్లో కొంప ముంచేసింది!తన భర్తా మరిదీ అవమానించిన శూర్పణఖ సోదరుడైన లంకాధిపతి రావణుడు అపహరించటమే గాక తనని వరించమని కూడా అవమానిస్తుంటే గడ్డిపోచలా తీసిపారేసింది రాముడు యెలాగైనా వస్తాడు తన చెరని విడిపిస్తాడని అంత నమ్మకం!అది కూడా ఆంజనేయ భగవాన్లు చాకచక్యంతో తన జాద కనుక్కుని కోతిమూక అని రావణుడు తేలిగ్గా చూసిన వానరయూధముఖ్యుల చేతనే కార్యం పూర్తి చెయ్యడంతో నెరవేరి తన కష్టాలన్నీ గట్టెక్కినట్టేనని సంతోషపడింది - కడివెడు పాలలో ఒలికిన విషపు చుక్కలా స్వీకరించాల్సినవాడు తిరస్కారంగా మాట్లాడటం,యెవరి దగ్గిరకయినా ఫోగానీ నా దగ్గిరకి మాత్రం రావద్దని శఠించుకుని కూర్చున్నాడు!ఆ మాటల కర్ధమేమిటో ఆయనకే వైరము లేని హింస  గురించి నీతిబోధ చేసిన సీతకి తెలియదా?మనకి వచ్చే కష్టాలన్నీ మనం చేసే తప్పుల వల్లనే అనీ మనం చేసే తప్పులనీ మనకున్న బ్లహీనతల వల్ల్లనే అనీ తెలిసిన సీతకి అలాంటి సమయంలో యేమి చెయ్యాలో మరొకరు చెప్పాలా!త్నౌ తిట్టాల్సినవి తనూ తిట్టి ఇక సత్యవిక్రముడి మాట మారదని తెలిసి అగ్నిలో దూకింది!అన్నిట్నీ నిర్మొహమాటంగా కాల్చిపారేసే అగ్నిదేవుడు కూడా చల్లబడి నేను కూడా కాల్చలేనంతటిది నీ భార్య అని చెప్పినా కరగలేదా ధర్మిష్ఠి, ఆఖరికి చచ్చి స్వర్గాన వున్న మామగారు దిగివచ్చి చెప్తే గానీ మాట తిప్పుకోలేదు ధృఢవిక్రముడు!

     సీత వనవాసం మొదలు పెట్టే మొదటి రోజుల్లో అందరు ఆడవాళ్ళలాగే ఒక గ్రామదేవతకి తనూ తన భర్తా తిరిగి అదే దారిలో వస్తామనుకుని ఆ తిరిగి వచ్చేటప్పుడు రెందు కల్లు కుండ్లని సమర్పించుకుంటనన మొక్కుకుంది,కానీ తిరుగుప్రయాణం అప్పటివరకూ అనుభవించిన ఆందోళన వల్లనూ భరతుడక్కడ ప్రాణాలు పణంగా పెట్టుకుని ఉండటం వల్లనూ ఆకాశమార్గంలో హడావిడిగా జరగటం వల్లనూ ఆ మొక్కు సంగతి గుర్తుకే రాలేదు - ఖర్మ!చేసిన మొక్కులు తీర్చకుంటే యెంతటివారికైనా వాగ్దానభంగపు కష్టాలు తప్పవేమో,ఈసారి శని అయోధ్యానగర ప్రజల నాల్కల మీద కూర్చుని అగ్నిపునీతకే అక్రమచరిత్రం అంటగట్టేసి చెవుకు కొరుక్కోవటం మొదలుపెట్టారు!?లక్ష్మణుడి ద్వారా అది రాముడికీ తెలిసింది!అప్పుడు రాముదేమి చెయ్యాలి?మరి మూడు యుగాల తర్వాత వచ్చే కలియుగపు ఆఖరిపాదంలో మాదిరి అయిదేళ్ళకు మారిపోయే ప్రభుత్వం కాదు,ఆజీవ పర్యంతం అయోధ్యా నగర ప్రజలకి అంకితమైపోయిన ప్రమాణమే రాజరికం!

     రాజు తనపాటికి తను ధర్మాత్ముణ్ణని డప్పు కొట్టుకోవటం తప్పుగా భావించే కాలమది!ప్రజలు రాజు పట్ల యేమాత్రం అవిధేయత కలిగి ఉన్నా రాజశాసనానికి విలువ ఉండదు,తనకి రాజరికాన్ని వదలివేసే స్వేచ్చ ఉంటే అసలు అమస్యే లేదు,కాబట్టి అయోధ్యానగర ప్రజల పాపచింతనతో కూడుకున్న దోషారోపణకి తెలిసితెలిసీ సీతని బలిపెట్టాడు,పునర్వివాహం గురించి ఆలోచించకుండా ఏకపత్నీవ్రతం కోసం లోహసీతని భరించాడు అన్ని ధర్మకార్యాలలో!యెన్నో యేళ్ళు గడిచిపోయాక,జంటగా సుఖపడాల్సిన కాలమంతా ఇర్వురూ ఒంటరిగా బతికాక అప్పటి వరకూ యెక్కడ వుందో యేమైపోయిందో తెలియని జగదేక సౌశీల్యవతి సీత ఉనికి అశ్వమేధ సమయంలో రాముడు పంపిన అశ్వరాజం కారణాన సీత దగ్గిర విలువిద్య నేర్చుకున్న కుశలవులనే ఇద్దరు కుర్రాళ్ళు రావణసంహారం చేసిన రాముడికే చెమట్లు పట్టించడంతో బయటపడింది!ఇప్పుడు స్వీకరిస్తానని మర్యాదాపురుషోత్తముడు ముందుకొచ్చినా వైకుంఠం చేరేకాలం ఆసన్నమైంది ఇంకా యెందుకు వ్యామోహం అని దివ్యావబోధతో ఆలోచించిందో మళ్ళీ అపవాదు వస్తే మళ్ళీ ఇదే తంతు జరుగుతుందని మానవాంశతో విరక్తి పుట్టిందో వాల్మీకికే తెలిసి ఉండదు సీత మనస్సులో అప్పుడు రగిన కల్లోలం!అయోధ్యానగర ప్రజల కళ్ళ్ళు తెరుచుకునేలాగ భూమి కంపించింది,ధరణిజాత అందరి తప్పుల్నీ క్షమించి సర్వులకూ నమస్కరిస్తూ తల్లి ఒడిలోకి నడిచింది,సీతామనోభిరాముడు కూడా దేవతల వాక్యం గుర్తుకు తెచ్చుకుని సరయూనదిలో ప్రవేశించి క్షీరసాగరం చేరాడు - సీతపై వేసిన అపవాదుకు శిక్ష కాబోలు నన్నట్టు అయోధ్యానగరం ఇప్పటికీ శాపగ్రస్త మాదిరిగానే ఉంది?!

     యెవరి పాపం యెవర్ని కట్టి కుడిపినా మళ్ళీ సీతకే కష్టాలు మొదలైనాయి - ఆనాటి అయోధ్యానగర ప్రజల్ని క్షమించిన సీతకి భక్తుల మౌఢ్యం వల్ల మళ్ళీ కష్టాలు మొదలైనాయి!మూడు యుగాలు ప్రశాంతంగా యేదో ఒక విధంగా ప్రజలు తమని ఆదర్శంగా తీసుకున్నారు తమ మూలంగా ధర్మం నిలబడింది అని సంతోషిస్తుంటే భక్తులకి రామభక్తి మతపిచ్చిగా మారి అక్కడుండాల్సిన రాముడు ఇక్కడున్నాడు,ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ ఉంచాలని యేళ్ళ తరబడి హడావిడి చేసి ఒక్కరోజులో అక్కడున్న మసీదుని కూలగొట్టి తననీ తన ఆర్యపుత్రుణ్ణీ టార్పాలిన్ గుడ్డల కింద కూలేశారు!యెలాగూ మసీదు కూలగొట్టారు ఆలయం కడతారు గదా అనుకంటే కడతామని అధికారంలోకి వచ్చినవాళ్ళలో అసలు అలికిడే లేదు!అసలు వాళ్ళు నిజాయితీపరులో కాదో తేల్చుకోవాల్సిన రామభక్తులు రామాజ్ఞ లేనిదే రామచిలకైనా పలకదని మెట్టవేదాంతం చెప్తున్నారు!ఒక్క ఆలయమే కట్టలేని వాళ్ళు అన్ని ఆలయాల సమస్యల్నీ ఉధ్ధరిస్తారని పగటికలలు కూడా కంటున్నారు?

     రామాలయం కట్టడం అవసరమా అంటే దేన్నీ పట్టించుకోని వారికి యేదీ అవసరం కాదు!"If Pakistan were indeed created as a homeland for Muslims, it is hard to understand why far more were left behind in India than were incorporated into the new state of Pakistan - a state created in two halves, one in the east (formerly East Bengal, now Bangladesh) and the other 1,700 kilometres away on the western side of the subcontinent"1947లో ఉపఖందం రెండుగా చీలినప్పుడు ఆ సంఘటనని విశ్లేషించిన అంతర్జాతీయ విశ్లేషకుల్లో ఒకరికి వచ్చిన సందేహమిది!మిగతా విశ్లేషకులు కూడా దాదాపు ఇదే రకం సందేహాన్ని వ్యక్తం చేశారు!దాని అర్ధం యేమిటంటే వారు మతప్రాతిపదికతతో విడిపోయాక మతప్రాతిపదికతన యేర్పడిన కొత్త దేశంలో ఇముడ్చుకున్నవారికన్నా ముస్లిములు భారతదేశంలోనే యెక్కువ సంఖ్యలో యెందుకు ఉండిపోయారు అని?ఇక్కడ ఉండి అక్కడి భజన చేయకండి అని పటేల్ అంటే అతన్ని ముస్లింవ్యతిరేక చాందసభావాలు కలిగిన హిందూమతతత్వవాదిగా ముద్ర వేసేశారు.వారు కోరుకున్న దానికి ఒప్పుకుని మతప్రాతిపదికన విభజించి వారి దేశం వారికి సమర్పించి మనం ప్రశాంతంగా ఉండవచ్చునని అంకుంటే అదీ నెరవేర లేదు!దేశవిభజన నాటి మారణహోమాన్ని మినహాయిస్తే నాటి నుంచి 1).1969లో గుజరాత్ అల్లర్లు 2).1980లో మొరాదబద్ అల్లర్లు 3).1987లో హషింపుర నరమేధం 4).1989లో భాగల్పుర్ హింస 5).1990లలో సుదీర్ఘకాలం పాటు వ్యూహాత్మకంగా కాశ్మీరీ పండితుల వెలివేత 6).1992లో ముంబై అల్లర్లు - బాబ్రీ మసీదు విధ్వంసానికి నిరసన 7).2000లో అమర్నాథ్ యాత్రీకుల వూచకోత 8).2002లో గోధ్రా రైలుపెట్టెలో కరసేవకుల సజీవదహనం 9).గోధ్రా రైలు సంఘటనకి ప్రతీకారం పేరుతో మూడురోజుల పాటూ అడ్డూ అదుపూ లేని ప్రతీకార దాడులు 10).2002లో కాష్మీరు లోని రఘునాథ దేవాలయం మీద దాడి 11).2002లో అక్షరధాం ఆలయం మీద దాడి 12).2006లో వారణాశి బాంబు పేలుళ్ళు 13).2008లో లష్కరే తోయిబా అధ్వర్యంలో ముంబై దాడులు, యేమిటివన్నీ?ఇదీ మనం సాధించుకున్న ప్రశాంతమైన లౌకికవాదం మరియూ మతసామరస్యం వెల్లివిరుస్తున్నదని భ్రమపడుతున్నఈ దేశపు నడుస్తున్న చరిత్ర.

     దేశవిభజన నాటి  ఉద్రేకాలు చల్లారిపోయిన తర్వాత కాలంలో జరిగిన విధ్వంసాల కన్నిటికీ కేంద్రబిందువు అయోధ్య!భారతీయ ముస్లిము సమాజం యొక్క సామాజిక నిర్మితి చాలా సంక్లిష్టమైనది - అందర్నీ ఒక్క గాటన కట్టెయ్యలేము!మతప్రాదిపదికన రిజర్వేషన్లు ఉండటం కన్నా మతప్రాతిపదికని రాజకీయపునాదిగా చేసుకుని అధికార పీఠానికి యెగబాకటానికి వ్యూహాత్మకంగా మతాన్ని వాడుకునేవాళ్ళు వారిలో కొద్దిమందే ఉన్నప్పటికీ విధ్వంసాలు సృష్టించి విద్వేషాలు రగిలించటంలో ఆరితేరిపోయిన ఆ కొద్దిమందే ఇంత భీబత్సాన్ని రగిలిస్తున్నారు!ఆ కొద్దిమందికి అయోధ్య సమస్య అధరువుగా ఉపయోగపడుతున్నది!వారి రాజకీయ పునాదిని బద్దలు కొట్టనంతకాలం ఆ భీబత్సాలు ఆగవు కాబట్టి అయోధ్య సమస్యని వీలయినంత తొందరగా పరిష్కరించాల్చిన అవసరం యెంతైనా ఉంది.వాస్తవం యేమిటంటే సమస్య కున్న పరిధి చిన్నదే!సాంకేతికంగా ఇప్పుడు ఆలయం కట్టాల్సిన భూమిలో కొంత భాగం వక్ఫ్ బోర్డు అధీనంలో ఉంది.అది ప్రభుత్వం వారు మనకి పిత్రార్జితాన్ని యెలా రిజిస్టర్ చేస్తారో అలా అధికారికంగా దఖలు పడి ఉంది.అందుకే మసీదు కూల్చిన వీరాధివీరులు కూడా ఆలయం కట్టడానికి వెనుకాడుతున్నారు!సామరస్యంగా పరిష్కరించుకోవాలంటే వక్ఫ్ బోర్డు వారి నుంచి ఆ భూమి మర్యాదగా అడిగి తీసుకోవడం తప్ప మరోదారి లేదు.కూల్చిన మసీదుకి పరిహారం చెల్లించి తీసుకుంటే వారు మసీదుని వేరే చోట కట్టుకుంటారు - ముఖ్యంగా అతోధ్య ప్రజలు సంతోషిస్తారు!రామభక్తులు కూడా ఏ విధమైన ఆందోళనలూ లేకుండా ప్రశాంతంగా రాముణ్ణి అర్చించుకోవచ్చు.ఇంతమంది హిందువుల్లో ఆపాటి ఉదారులు లేరా?ఉన్నారు,కాకపోతే యెవరో వస్తారని యేదో చేస్తారని యెదురు చూస్తున్నారు కాబోలు!తమ చేతికి మట్టి తగలకుండా కాగల కార్యం తీర్చే గంధర్వుల కోసం యెదురు చూస్తున్నారేమో,ఈ కాలంలో యే గంధర్వులు వస్తారు?


     యేదో వీరత్వం చూపించుదామని ఒక్కరోజు ఘనకార్యం చేసిననదుకు దశాబ్దాల తరబడి మహానగారాలు యెక్కడ బాంబు పేలుతుందోనని వణికిపోతూ తీరా పేలాక శవాల లెక్కలు తేల్చుకుని మళ్ళీ అటువైపు నుంచి ప్రతీకార దాడులకి దిగటం లాంటి పైత్యకారి పనులతో అతలాకుతలమైపోతున్నాయి!పోనీ ముస్లిములు నిజంగా ఆంత భయంకరులా అంటే దేశమంతటా ఉన్న సామాన్య ముస్లిము ప్రజానీకం,ముఖ్యంగా అయోధ్య లోని ముస్లిములు సామరస్యంగా సమస్య పరిషకరిష్కారమైతే సంతోషిస్తామనీ అంటున్నారు.ఇటువైపు మసీదు కూలగొట్టిన విహింప వారు ఆలయాన్ని కట్టడం కూడా తమకి చేతనైన పాత అలవాటు చొప్పున అప్పటి ముతక పధ్ధతిలోనే హిందువుల్ని ఏకశిలాసదృశంగా తయారు చేసి భాజపాకి అఖండమైన మెజారిటీని కల్పిస్తే చట్టసభల ద్వారా బలవంతంగానే మాట చెల్ల్లించుకోవాలని చూస్తున్నారు!!పోనీ విహింప వారి ప్లాను ప్రకారం హిందువుల్ని కలుపుదామా అంటే ఇక్కడ బ్రాహ్మణ శ్రేష్ఠులు,అగ్రకులస్థులు,దళిత మేధావులు,నాస్తిక శిఖామణులు,కమ్యున్ష్టు దార్శనికులు - ఇందర్ని కలపటం యెవడి తరమూ కాదు!ఒకవేళ బలాత్కారమో మానభంగమో చేసేసి ముస్లిములతో పని లేకుండా పుణ్యకార్యం కానిచ్చేస్తే ఆ తర్వాత కోపోద్రిక్తులైన ముస్లిము వర్గాలు ఖచ్చితంగా సరిహద్దుల కవతల నుంచి రెచ్చగొట్టే ఉగ్రవాదుల సాయంతో రెచ్చిపోవడం ఖాయం!యెగదీస్తే గోహత్య దిగదీస్తే బ్రహ్మహత్య!

సీతాపతీ నీకు టార్పాలిను కప్పేగతి!

19 comments:

  1. ఇంతకీ మీరు చెప్పదలచుకున్నదేమిటో!

    ReplyDelete
    Replies
    1. అంత వివరంగా చెప్పినా కొంచెం కూడా అర్ధం కాలేదా?
      అంతే లెండి,సీత గోల రాముడికే అర్ధం కాలేదు - ఖర్మ!

      Delete
    2. ఎవరి భావజాలంలో నో చిక్కుకున్నట్టున్నారే :)

      Delete

    3. 'బావ' జాలం లో చిక్కు కొని వారంటూ ఎవరైనా ఉంటారంటారా :)

      జిలేబి

      Delete
  2. మీరు చాలా శ్రమించి రాస్తున్నారు. అయితే పక్క దేశం పైన మీ అవగాహన సరిగా ఉన్నట్లు లేదనిపిస్తున్నాది. రామజన్మ భూమి వివాదం వలన ఈ దేశంలో పేలుళ్ళు జరిగాయనుకోవటం సరికాదు. పాకిస్థాన్ ఏర్పడింది, కొనసాగుతుండేది హిందూ వ్యతిరేకత ఆధారంగా. పక్కన వాడు పచ్చగ ఉంటే చూడలేని బాకిస్థాన్ వారు, ఎదో వంక తో భారత దేశంలో అలజడులు రేపుతూంటారు. అది ఆదేశ పాలసి. దానిని అర్థం చేసుకోకుండా, మీరు రామజన్మభూమి సంఘటన వలన బాంబ్ పేళ్ళులు జరిగాయని, మీడీయాలో కమ్యునిస్ట్ సెక్యులర్ మేధావుల ప్రాపగండ నమ్మితే ఎలా? మీలాంటి వాళ్లు నమ్మటం చూస్తూంటే, ఈదేశంలో హిందూ వ్యతిరేక కుహనా సెక్యులర్ వారి ప్రభావం ఎంత ఉందో అర్థమౌతున్నాది.

    రేపు రాముడి గుడి కట్టటానికి ముస్లింలన్నా ఒప్పుకోవచ్చేమో గాని, ఈ సెక్యులర్ మేధావులు ససేమిరా ఒప్పుకోరు. వాళ్ళు అంతటితో ఆగరు ప్రపంచ వ్యాపతంగా హిందూ వ్యతిరేక ప్రాపగండా మొదలు పెడతారు.

    SriRam

    ReplyDelete
    Replies
    1. Muslims in Nepal ask for a Hindu nation, say no to secularism

      In a campaign to "reconvert" the country as a Hindu state, Muslims leaders in Nepal are lashing back at the constituent assembly for attempting to declare the country "secular" in its draft constitution. The Muslim leaders feel that Nepal remaining as a "Hindu nation" helps them feel more secure and allows the citizens to live with religious tolerance.

      http://www.thenewsminute.com/article/muslims-nepal-ask-hindu-nation-say-no-secularism-33143


      SriRam

      Delete
    2. పొరుగు దేశం గురించి నాకు తెలియకపోవడమెంటి,తెలుసు?
      అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక,అందరిదీ ఒకటే మూలం!

      మన బంగారం మంచిదైతే ఇంకేం అన్నట్టు,
      వారి ద్వేషానికి విరుగుడు మనలో ఐక్యత!

      అగ్రకులస్థులకి మరోపేరు సవర్ణ హిందువులు!
      వీరిపైన అధిపత్యమంతా బ్రాహ్మణ శ్రేష్ఠులది?

      వారు కదలనిదే వీరు కదలరు?
      వీరు కదలనిదే వారు కదలరు?

      పిల్లి మెడలో గంట కట్టేదెవరు?!

      Delete
    3. @anon of saying about nepal
      అదేమిటో పాకిస్తానం వారూ భారతీయ కమ్యునిష్టులూ తప్ప హిందువుల్ని అందరూ అభిమానిస్తారు!
      రష్యన్ కమ్యునిష్టులు వారి దేశాన్ని వారు ప్రేమించుకుంటారు!
      ఇండియన్ కమునిష్టులు వారి దేశాన్ని వారు ద్వేషించుకుంటారు?

      Delete
    4. Of the many things she was swayed by that day, one question still rankles. “A Christian comrade can go to the church, a Muslim comrade can go to the mosque but a Hindu comrade cannot go to the temple. Why?”

      Red fades to saffron in Kerala

      http://www.thehindu.com/opinion/op-ed/red-fades-to-saffron-in-kerala/article7591378.ece


      SriRam

      Delete
    5. Saritha Nair expose shows brothel culture in Kerala government, alleges CPM

      Solar scam accused Saritha S Nair, in a recorded conversation, had stated that there is a lobby among Congress ministers in Kerala, who trap women, sexually exploit and exchange them among the colleagues. When the solar scam was exposed in 2013, the detailed call list of Nair had showed that some of the congress ministers were engaged in prolonged conversation with her at odd hours. She had earlier told a court that she was sexually exploited by several political leaders, but the magistrate had failed to record her statement. The magistrate had late faced disciplinary action.

      http://indianexpress.com/article/india/india-others/saritha-expose-shows-brothel-culture-in-congress-government-cpm/

      Delete

  3. హన్నా :) ఎంత మాట ఎంత మాట;

    సీతకి తర్వాత యే కాలంలో యే భార్య చేసినా సీతని చూసే కదా అలా చేసేది!? :)

    నీహారిక గారూ , ఎక్కడ ఇంకా రాలేదిక్కడ ?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పౌర్ణమి అని తెలిసి కూడా ఈ జిలేబీ తెలియనట్లే అడుగుతుంది అబ్బా!

      Delete
    2. உனகி என்ன தெரியும் :)

      Delete
    3. >>>>>సీతకి తర్వాత యే కాలంలో యే భార్య చేసినా సీతని చూసే కదా అలా చేసేది!?<<<<<<
      రావణుడూ,కీచకుడూ పుడితే...... సీత, సైరంధ్రి పుట్టితీరాలన్నమాట !

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
  4. విష్ణు మూర్తి పౌర్ణమికి పుడితే వరలక్ష్మీదేవి అమావాస్యనాడు పుట్టి .....మితముగానూ,ప్రియముగానూ మాట్లాడుతూ అత్తమామలను సేవించే చారుమతికే ద్ధగ ద్ధగలాడే బంగారు నగలిచ్చింది.సీత బంగరులేడిని కోరకుండా వరలక్ష్మీ వ్రతం చేసుకుని ఉంటే బాగుండేది !

    ReplyDelete
    Replies
    1. పిచ్చ పీక్ కి వెళ్లినట్లుందే!

      Delete
    2. పున్నానికి పిచ్చి ముదురుతుంది కదా

      Delete
  5. అడిగితే ఇచ్చేసేంత అమాయకులు అని మీరనుకోబడం ... మీ అమాయకత్వానికి పరాకాష్ట!
    చెవిటి దేవున్ని మైకులదిరేలా పిలిచే వారు అమాయకులు మంచి వాళ్ళు అనుకోవడం కాస్త వ్యంగంగా ఉంది!!
    (చిన్నపిల్లలున్న ఇంట్లో వెనక మైకులదిరేలా శబ్దం చేస్థె తెలుస్తుంది అమాయకత్వం, హాస్పిటల్ వెనక మైకు పగులుతుంటే పేషంటుగా బెద్ పై ఉన్నప్పుడు ఆ అమాయకత్వం అర్థం అవుతుంది అందుకె ఈ పాయింటు)

    భూమిని అడిగితే ఇచ్చేంత మంచివాళ్ళు అడిగేంత వరకు ఆగరు .... సెక్యులర్ కి సిక్యులర్ కి మధ్య తేడాలో ఇరుక్కుపొయారు

    ఆల్ ది బెస్ట్ ... టు కమౌట్ ఫ్రొం యువర్ ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ మైండ్.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...