Tuesday 11 August 2015

పెట్టుబడిదారీ విధానం నిజంగానే తనలోని వైరుధ్యాలకి తనే బలయి అంతమైపోతుందా?

      "యెక్కడ నా సుత్తి?యెక్కడ నా కంకి?వీడెవడో హరిబాబు మన్ని చాలెంజి చేశాడంట!పదండి మన ప్రతాపం చూపిద్దాం,వీలయితే తన్ని గూడా కమ్యునిష్టుగా మార్చిపారేద్దాం" అన్నంత ధీమాగా బ్లాగుల్లో ఉన్న కమ్యునిష్టు లంతా వొచ్చి వాల్తారనుకున్నాను నా "హిందూ పురాణాల అశాస్త్రీయత సంగతి సరే గానీ మీరు పాటిస్తున్న మార్క్సిజం శాస్త్రీయమైనదేనా?ఎర్ర మేధావు లందరికీ ఇదే నా సవాల్!" పోష్టు చూడంగానే? అక్కడికీ రెచ్చగొడదామని "బస్తీ మే సవాల్" అని హడావిడి కూడా చేశాను!

           ఒక్కడు రాలేదు,యెందుకనో?ఆఖరికి సాంతికిరనంట బహుశా స్వైరిణి బక్తుడు గామాలు చివర్లో ఆసికానికి - అది గూడా బాగా కాలి చుర్రుమని సెగ తగిలయినా వస్తారని యేశాలెండి - లీ క్వాన్ యూ కొటేషను మాత్రమే చూసి తెగ బారెడు నెత్తురు కక్కుకుని వొచ్చినోడు వొచ్చినట్టే ఆ కంగారులో టాపిక్కు కమ్యునిజము గురించేనని గూడా అర్ధంగానంత పిచ్చిసన్నాసో యేమో కమ్యునిజం గురించి పోష్టులు రాసుకోండని నాకు సలహా ఇచ్చి పోయాడు,యెక్కడున్నాడో?

   తిరిగే కాలూ తిట్టే నోరూ వూరుకోవు గదా,చూడలేదేమో అనుకుంటే చూసినట్టు సిగినేళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి.సాంతికిరను వచ్చాడు గదా సాక్ష్యముండాది - అంచేత వీళ్ళంతా మనకి బయపడిపోయారని బోల్డు కాంఫిడెన్సు వచ్చేసింది! అసలు నాకు ఈ మధ్యనే నలభై దాటిన వాడెవడూ యెంత వాదించినా మారడనే గట్టి నమ్మకం యేర్పడిపోయింది?అయినా యెందుకీ వృధాప్రయత్నం అంటే నా టార్గెట్ వేరే ఉంది,ఇరవయికి దగ్గిరగా ఉన్నవాళ్ళు,యేది మంచి యేది చెడు అనే ఆప్షన్లు మనం ముందు ఉంచితే చాలు యేది సరయినదో తెలుసుని యెంచుకోగలిగిన వాళ్ళు! మనం మాట్లాడకపోతే అదొక్కటే దారని అటుకేసి వెళ్తారు.అదే మనం గట్టిగా నిలబడితే ఒక వాదన జరిగితే యెవరు సూటిగా మాట్లాడుతున్నారు,యెవరు వంకరగా మాట్లాడుతున్నారు,యెవరు చెప్పేది యుక్తియుక్తంగా ఉంది,యెవరు చెప్పేది మూర్ఖంగా ఉంది అని తెలుసుకోవడానికి పనికొస్తుంది!స్వైరిణికీ స్వైరిణి భక్తులకీ సీరియస్ కమ్యునిష్టులకీ ఇదే నా హెచ్చరిక - మిమ్మల్ని నేను వదలను!నా వ్యక్తిగత రాగద్వేషాలతో కాదు నేను మిమ్మల్ని వెంటాడేది - సత్యం కోసం!

   సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన నా గురుపరంపర,వ్యాసపరాశరాది షిర్డీ సాయినాధ పర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను మీరు యెన్ని  శ్రీరామనవమి పండగలు చేసినా లాభం లేదు, హిందువైన వాడెవడూ రామాయణ విషవృక్షాన్ని మర్చిపోడు?మీరు యెన్ని కృష్ణాష్టమి పండగలు చేసినా ఇదండీ కమ్యునిజం రాసిన స్వైరిణి మీ పార్టీలో హవా చెలాయిస్తున్నంతకాలం మీకు హిందువుల వోట్లు పడవు! 

     మీకు హిందువుల వోట్లే కాదు ఇక కాంగ్రెసుకి ముస్లిముల వోట్లు కూడా పడవు?మీరు వర్గరహితసమాజం వస్తుందని రాసివ్వలేరు గానీ నేను మాత్రం నా మాటల్ని  స్టాంపు పేపరు మీద రాసివ్వడానికి సిధ్ధం!యెందుకంటే కాలం మారిపోయింది.జనం ఇప్పుడు ఇదివరకట్లా యెవడేం చెప్తే అది నమ్మే స్థితిలో లేరు.ఒక్కసారి గత పదేళ్ళుగా యెన్నికల్లో పోలయ్యే వోట్ల శాతాన్నీ వాటిలో కనిపించే స్పష్టతనీ చూడండి, మీకే తెలుస్తుంది! యెక్కడయితే మోదీని గోద్రా అల్లర్ల భూతంగా మీరంతా అల్లరి పెట్టారో ఆ అల్లరి జరుగుతుండగానే అన్నిచోట్లా ముస్లిములే మోదీని గెలిపించారు,అయినా ప్రజలు దొంగచేతికి తాళాలివ్వడం మంచిదనే అమాయకత్వంలో ఉన్నారనే పోలికతో ఇంకా వారికి కోపం తెప్పించడమే తప్ప వాస్తవాన్ని చూడలేకపోతున్నారు, యెందుకని?గతకాలపు చరిత్రలోని మూలమూలల్ని అద్భుతంగా వ్యాఖ్యానించగలిగిన వాళ్ళు వర్తమానంలోని రహస్యాన్ని యెందుకు చూడలేకపోతున్నారు?


ఆఖరికి భండారు శ్రీనివాస రావు గారి వార్తావ్యాఖ్య బ్లాగులో ఉగ్రవాదులకి మతం లేదు పోష్టులో "మేము అధికారములోకి రావచ్చు. రాకపోవచ్చు. కానీ, మా సిద్దాంతం మాత్రం చచ్చినట్టు అమలయ్యేలా చూస్తాం. అది కూడా మీచేతనే అమలు చేయిస్తాం. ఇప్పటి వరకూ అలానే చేశాం. ఇక మిదట కూదా అలానే చేస్తాం. మధ్యలో నీలాంటి కమెడియన్లు కమ్యూనిజం చచ్చిపోయింది అని చెబితే నవ్వుకొంటూ ఉంటాం. బిడ్డా చచ్చింది కమ్యూనిజం కాదు. నీ మత మౌఢ్యం, సో కాల్డు జీవన విధానములోని స్టుపిడిటి. అదే కంటిన్యూ అవుద్ది. ఫైనలుగా కమ్యూనిజమే మిగులుద్ది. రాసి పెట్టుకో.అనీ "ఎన్ని సార్లు చెప్పాలి నీకు? చరిత్ర మొత్తం అదే కన్నా! బౌద్దులను ఎలా చంపెను, శైవులు, వైష్ణవులు ఎలా కొట్టుకు చచ్చెను అనే ఉంటుంది చరిత్ర అంతా. " అనీ ఆజ్ఞాత నామధేయంతో రెచ్చిపోతుంటే నేను కొన్ని ప్రశ్నలు వేశాను.మాటి మాటికీ పిన్నిని పెళ్ళాడాలనుకున్నాను - పెళ్ళాడనివ్వలేదు,ఇదే ముస్లిం మతంలో అయితే యెంచక్కా పెళ్ళాడనిచ్చేవాళ్ళు - హిందూఒమతం ట్రాష్,నేను మొదట బుద్ధిగా విధవని పెళ్ళాడాలనుకున్నప్పుడు మెచ్చుకున్నారు,కానీ నాకు తిక్కరేగి నాకంటే పెద్దదాన్ని పేళ్ళాడాలనుకంటే మాత్రం మెచ్చుకోలేదు అని తిక్కతిక్కగా వాగే ఇన్సెస్ట్ ప్రేమికుడు మాట్లాడినట్టే ఒక్కదానికీ తిన్నగా జవాబు చెప్పకపోగా యెక్కడ బడితే అక్క కమ్యునిజం వెల్లి విరుస్తుంది పోయి చూసుకో అని డబాయిస్తున్నాడు.అంత ధీమాగా చెప్తున్నాడు గదా అని స్కాండినేవియాలో అమలవుతున్నది కమ్యునిజమా? అని గూగుల్ చేస్తే తను డప్పు కొట్టుకుంటున్నది పచ్చి బొంకు అని తేలింది!

తను పాటించేది అంత శాస్త్రీయమైన సిధ్ధాంతం అయితే ఇన్ని బొంకులు అవసరమా?తను చెప్తున్నది సకలజనశ్రేయోదాయకం అయితే నిజాలు చెప్పి ఒప్పించి సూటిగానే మాట్లాడవచ్చునే?కమ్యునిష్టు సిధ్ధాంతం ప్రకారం వచ్చే వర్గరహితసమాజంలో నాకు ఇప్పటికన్నా మంచి జరుగుతుందనే హామీ వాళ్ళు ఇవ్వగలిగితే నేను వొద్దంటానా?మీకు ఇంతకన్నా మంచి భవిష్యత్తుని గ్యారెంటీగా ఇస్తాం అని గట్టిగా నమ్మకం కలిగిస్తే యెవడు కాదంటాడు?యే శ్రామికులకి మేలు జరిపించటం కోసం కార్మిక చట్టాల్ని సాధించిపెట్టాం అని చెప్తున్నారో ఆ శ్రామికులు కూడా వీళ్ళు చెప్పే వర్గరహితసమాజం కోసం వీళ్ళ వెనకాల యెందుకు నడవటం లేదు?లేబర్ చట్టాలు గట్టిగా ఉండటమే కమ్యునిజం యొక్క అంతిమ లక్ష్యమా?కాదే!మరి వీళ్ళు యెవరికోసం పోరాడాము అని చెప్తున్నారో వాళ్ళనే ఇంకొక మెట్టు యెక్కించలేని దద్దమ్మలు ఇతర్లని దద్దమ్మలు అనడం కోడిబుర్రలు అనడం దేన్ని సూచిస్తుంది?శాస్త్రీయం అని ఒక విషయాన్ని అనాలీ అంటే నమ్మకం వల్ల గాకుండా వాస్తవంగా నిరూపణ అయ్యి ఇతర్లకి నమ్మకాన్ని కలిగించాలి,అవునా కాదా?ఇప్పటివరకూ కార్ల్ మార్క్సూ వీళ్ళూ వర్గరహితసమాజం గురించి చెప్తున్న దాంట్లో ఒక మెలిక ఉంది - ఈ భూ ప్రపంచం మీద ఒక్క మనిషి కమ్యునిజాన్ని వ్యతిరేకించినా ఈ భూమి మీద వర్గరహితసమాజం యేర్పడనట్టే!అందుకే గదా రష్యాలో యెందుకు పోయిందయ్యా అంటే చుట్టూ పెట్టుబడిదారీ సమాజం ఉంది గాబట్టి అని చెప్తున్నది!నేను వాళ్ళ నడిగింది ఒకే ఒక ప్రశ్న - వర్గరహితసమాజం గురించి శాస్త్రీయమైన ఒక్క ఉదాహరణ చెప్పమని,దానికే దాస్ క్యాపిటల్ అంతా నీకు చెప్పలేను,ఆంతా చెప్పానయ్యా బాబూ నీది కోడిమెదడు కాబట్టి అర్ధం గావట్లేదు, నువ్వు పిచ్చిపుల్లయ్యవి అని విసుక్కోవడమే తప్ప వర్గరహితసమాజం యెట్లా ఉంటుంది అనేది మాత్రం చెప్పడం లేదు,యెందుకని?బెజవాడ నుంచి హైదరాబాదు వెళ్ళాలంటేనే బోర్డు చూసుకుని ఆ బస్సు హైదరాబాదు వెళ్తుంది అని గ్యారెంటీ ఉన్నాకనే యెక్కుతున్నాం గదా మరి వాళ్ళని గ్యారెంటీ అడిగితే విసుగెందుకు?

ఇన్నేళ్ళుగా మార్క్సిజం సర్వోత్తమమైనది,సమాజాన్ని మార్చడానికి దానికన్నా మించింది లేదు.తుపాకీ గొట్టం ద్వారానే అధికారం వస్తుంది,శ్రామికవర్గ నియంతృత్వమే అన్ని సమస్యలకీ పరిష్కారం అని వూదరగొట్టిన వాళ్ళు ఇప్పుడు "మార్క్స్ మాకు ప్రేరణ కల్గించాడని, మేము అనుకున్నది సాధించడానికి దేశీయ, ప్రాంతీయ పరిస్థితులను భట్టి వెలుతూ ఉంటామని" అనటం విధి వైపరీత్యమా?గతజన్మ పాప ఫలితమా?మాయామేయ జగంబె నిత్యమని సంభావించే కాటికాపరి వేదాంతమా!ఖచ్చితంగా అమలయ్యే ఒక విప్లవ సిధ్ధాంతాన్ని ప్రవచించిన మహోన్నత వ్యక్తి స్థానం నుంచి కేవలం ప్రేరణ ఇచ్చిన వ్యక్తి స్థాయికి తగ్గించారు ఇవ్వాళ,రేపటి రోజున ఈ ప్రేరణ ఇచ్చిన వ్యక్తి స్థానం నుంచి పురాణ పురుషుడిగా మార్చరని గ్యారెంటీ యేమిటి?మరి వీళ్ళు కూడా మార్క్సు చెప్పిన దాంట్లో అన్నీ కొలిచినట్టు లేవు గాబట్టి ప్రేరణ మాత్రమే తీసుకుంటూ పరిస్థితులకి అనుగుణంగా పోతాం,అవసరమైతే మతం మానవాళికి మత్తుమందు అన్న నోటితోనే రామనవమి పండగలో "శ్రీ రాఘవం" కీర్తనలూ చదువుతాం,కృష్ణాష్టమి రోజున ఉట్లు కొడుతూ "హే కృష్ణా ముకుందా మురారీ" అనీ పాడుతాం అంటున్నారు గదా అదే పని యుగాలుగా చేస్తున్న మమ్మల్ని మతవాదులు అనటం యెంతవరకూ సబబు?!

కాబట్టి నేను రూటు మారుద్దామనుకుంటున్నాను,సయోధ్యకి ప్రయోత్నిస్తా!సయోధ్య అంటే ఖాజిసాయెబుగారు తురకల్లో కలిసిపోయినట్టు నేను కమ్యునిష్టునైపోవడం కాదండోయ్ - కొంచెం వాళ్ళు నిర్భయంగా రావడానికి వీలుగా ఉంటాను,అయినా వస్తారో రారో?నేను "మార్క్సిష్టు సిధ్ధాంతాన్ని హిందూ ధర్మం ప్రకారం విమర్శించి వెక్కిరించ వచ్చునా?పోస్టులో లాగా వెక్కిరించకుండా నిజాయితీగా మార్క్సిష్టు సిధ్ధాంతాన్ని పూర్వాపరాలు తరచి చూడడానికి ప్రయత్నిస్తాను ఈసారి - ఆఖరుసారిగా!

మార్క్సిజం అనేది అసలు ప్రపంచంలో అన్ని దేశాలలోని మేధావుల్నీ ఆకర్షించడానికి కారణమేమిటో తెలుసా?గతకాలపు చరిత్రని కొత్తరకంగా వ్యాఖ్యానించి చెప్పడం!ఆయన తన సిధ్ధాంతానికి "గతి తార్కిక చారిత్రక భౌతికవాదం" అని పేరు పెట్టి అప్పటివరకూ చరిత్రలో జరిగిన రాజకీయపరమైన తిరుగుబాట్ల వెనక దాగి ఉన్న కొత్త నేపధ్యాన్ని చూపించగలగటం!కొందరు సంస్కృతీ,సామాజిక విషయాల గురించి కూడా వ్యాఖ్యానించాడు కాబట్టి ఇదొక ఎన్సైక్లోపెడియా అని భ్రమపడతారు గానీ చాణక్యుడిలాగే ఇతని వాదనల్లోనూ పొలిటికల్ యెకానమీ దృక్కోణం మాత్రమే ప్రముఖంగా ఉంది.ఒక ప్రధాన వాదంలో ఉపాంగాలు ఉండటం ప్రతి సిధ్ధాంతంలోనూ సహజమే కదా - ఇందులో చర్చించిన సామాజిక విషయాల గురించిన ప్రస్తావన కూడా అంతే!స్థూలంగా సిధ్ధాంతం గురించిన విషయాల్ని గత పోష్తుల్లో చేశాను.మళ్ళీ రిపీట్  చెయ్యడం నాకు బోరు.కాబట్టి ఇప్పుడు నేను యెంచుకున్న విషయానికి పనికొచ్చే వాట్ని మాత్రం చెప్తాను.మొదటి ప్రతిపాదన ఉత్పత్తి శక్తుల మీద యెవరు అధికారం చెలాయిస్తారో రాజకీయంగా వారు అధికారంలో ఉంటారు అనేది.దీనికి రుజువుగా ఆదిమ కాలం నుంచి ప్రతి సమాజాన్నీ ఉదాహరణగా తీసుకుంటూ ఆ కాలంలో అక్కడ యేది ఉత్పత్తి శక్తి,దాన్ని యెవరు నియంత్రిస్తున్నారు,అప్పటి సామాజిక సంబంధాల మీద అది యెలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నది అని విశ్లేషించాడు.ఈ సాక్ష్యాదారాలను గతకాలపు చరిత్ర నుంచి సోదాహరణంగా చూపించాక అన్ని కాలాల్ల్లోనూ అసలు ఉత్పత్త్తికి కారణమైన శ్రామికులు ప్రయోజనం పొందటం లేదు గాబట్టి ఆ శ్రామికులు ప్రయోజనం పొందగలిగే లక్ష్యంగా శ్రామికవర్గ నియంతృత్వం ద్వారా యేర్పడే వర్గరహితసమాజం అనే ఒక బ్రహ్మపదార్ధం లాంటి కల్పనాత్మక సమాజపు స్థితిని సమస్త మానవాళికీ ఒక అంతిమ లఖ్యంగా ప్రవచించాడు!

ఉత్పత్తి శక్తులకీ ఆనాటి సామాజిక వాతవరణానికీ ఉన్న సంబంధాన్ని కనుక్కోగలగటమే ఇతని విశ్లేషణలోని ప్రత్యేకత.అంతవరకూ అతని విశ్లేషణలన్నీ తిరుగులేని నిజాలే!వేట జీవనోపాధిగా ఉన్న సమూహంలో యెవరు యెక్కువ చాకచక్యంగా జంతువుల్ని వేటాడగలరో వారికే ప్రాధాన్యత!అక్కడ వేకి పనికొచ్చే ఆయుధాలు ఉత్పత్తి శక్తులు,వాటిని అమితంగా ప్రేమించటం,తాము వేటాడిన జంతువుల అవశేషాల్ని తమ దేహం మీద అలంకరించుకోవటం - ఇవన్నీ సామాజిక జీవితంలో దాని ప్రతిబింబాలు!వ్యవసాయం చెయ్యడం నేర్చుకున్న తర్వాత అన్ని దశల్లోనూ భూమి ప్రముఖ ఉత్పత్తిశక్తి అయ్యింది - భూస్వామ్యం రాజరికం దీని ప్రతిబింబాలు!మార్క్సు ప్రధానంగా చెప్పిన శ్రామికవర్గం పారిశ్రామిక విప్లవం తర్వాతనే అవతరించింది!శ్రామికవర్గం ప్రబలశక్తిగా ఉన్న కాలంలో దాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పిన సిధ్ధాంతం తర్వాత వచ్చిన వూహించని మార్పు కంప్యూటరీకరణతో అర్ధం లేనిదిగా తయారైపోయింది!మార్క్సు తన జీవితకాలంలో సిధ్ధాంతాన్ని రాస్తున్నప్పుడూ,ప్రచారం చేస్తున్నప్పుడూ మేధోశ్రమని శ్రమగా గుర్తించలేదు,గుర్తిస్తే నట్లూ బోల్టులూ తిప్పుకునే మామూలు వర్కరుకి 1000 రూపాయలూ మేనేజరుకి 10000 రూపాయలూ ఇవ్వడం న్యాయమే కదా అనిపిస్తుందే తప్ప దాన్ని దోపిడీ అని అనటం ససేమిరా కుదరదు గాబట్టి,అది కుదరనప్పుడు శ్రామికవర్గనియంతృత్వం అనేది కూడా యెవరికీ యెక్కదు గాబట్టి మేధోశ్రమని ఒప్పుకోలేదు - తెలిసే ఒప్పుకోలేదు,మోసం చేశాడు!"పెట్టుబడిదారీ విధానం తనలోని వైరుధ్యాలకి తనే బలయి అంతమైపోతుంది?" అని డంబాలు పలుకుతూ చంకలెగరేస్తున్న అరివీర కమ్యునిష్టు లంతా కేవలం మేధోశ్రమని శ్రమగా ఒప్పుకుంటే చాలు యెంత పెద్ద రేంజిలో సక్సెసయిన కమ్యునిష్టు సమాజమయినా ఒక్క నిముషంలో కూలిపోతుంది?!

నిజంగా పెట్టుబడిదారీ విధానమే అంతమైపోవటం జరిగితే అక్కడ మిగిలేది శూన్యం,యెందుకంటే మార్క్సు పెట్టుబడిదారీ విధానం లో ఉన్న దోపిడీని అరికట్టే ప్రత్యామ్నాయ ఆర్ధిక వ్యవస్థని దేన్నీ ప్రతిపాదించలేదు గనక!తను మానవుడు వస్తుగత వాద అని చెప్పే స్మిథ్సోనియన్ భావజాలాన్ని ఒప్పుకుంటూనే ఆ స్మిథ్సోనియన్ సిధ్ధాంతాల నుంచే మానవుల్ని వాటికి భిన్నమైన ఆదర్శాలతో నిండిఉన్న తను కొత్తగా వర్ణించి చెప్పిన వర్గరహితసమాజంలోకి యెట్లా నడిపించాలి అనే కీలకమైన విషయాన్ని మాత్రం అసలు పట్టించుకోలేదు!దోపిడీకి కారణమైన ఆర్ధిక వ్యవస్థతోనే దోపిడీని నిర్మూలించటం యెట్లా అనే అనుమానం ఇప్పటి వరకూ యే కమ్యునిష్టు కైనా వచ్చిందా?ప్రతిదానికీ ఒక నిర్మితి అవసరం,అనుబంధాలూ ఆప్యాయతలూ సమాజంలో ప్రతిదీ ఆర్ధికానికి సంబంధంగానే ఉంటుంది అని బల్ల గుద్ది చెప్తున్న వాళ్ళు వర్గరహితసమాజం అనేదానికి కూడా ఆర్ధికపరమైన పునాది ఉండాలి అని ఇప్పటికీ అనుకొవడం లేదా?గతాన్నంతా ఉత్పత్తిక్తుల ఆధారంగా అధ్భుతంగా విశ్లేషించినప్పుడు తలూపడమే తప్ప మరి వర్గరహితసమాజాన్ని యే రకమైన ఉత్పత్తిశక్తి యెట్లా ప్రభావితం చేస్తుంది అని అడగటం మర్చిపోయారా?అంతా బొంకులదిబ్బ!


వ్యంగ్యాలు వాడనని అంత దారుణమైన మాట యెందుకు వాడానో తెలుసా?అసలీ ఉత్పత్తి శక్తులు సమాజాన్ని ప్రభావితం చెయ్యటంలో ఒక మిస్సింగ్ లింక్ ఉంది!వేట జీవనోపాధిగా ఉన్న తొలిదశనే తీసుకోండి.ఒక మనిషి మిగిలిన వాళ్ళకి అలివిగాని మృగాన్ని తను గొప్పగా పోరాడి చంపాడనుకోండి,ఆ జంతువు పులి అయితే దాని గోళ్ళని గుర్తుగా అట్టే పెట్టుకుంటాడు.ఇప్పుడు ఆటగాళ్ళ కిస్తున్న గోల్డ్ మెడల్ కూడా గుర్తింపు కోసమే గదా!వాటికి సమాజంలో యెలాంటి ప్రాముఖ్యతా లేదు,ఉండదు!కానీ మరొక వ్యక్తి దగ్గిర ఉన్న యే వస్తువైనా ఈ మనిషి కోరుకుని అది కావాలంటే ఈ పులిగోరుని ఇవ్వాల్సి వచ్చిందనుకోండి - అప్పుడు దానికి వెల అంటూ యేర్పడి అమ్మకపు సరుకుగా మారుతుంది,అవునా!అంటే ఉత్పత్తి శక్తులు వాటంతటవి సమాజాన్ని ప్రభావితం చేయ్యలేవు,వాటికి వెల నిర్ణయించబడినప్పుడే వాటి చుట్టూ ఒక మార్కెట్ యేర్పడినప్పుడే అవి సమాజంలో ప్రకంపనలు సృష్టించగలుగుతాయి - అది సత్యం?!ఆ నిజాన్ని మాత్రం వదిలేశాడు.అన్ని దశల్లోనూ తను ఉత్పత్తి శక్తులు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్తున్నప్పుడు అవి యెట్లా ప్రభావితం చేస్తాయి అనేది తెలియకనే వొదిలేశాడా?ఒక పులిగోరు ఖరీదుని యేర్పరచుకుని మార్కెట్టులో వస్తువుగా నిలబడినప్పటి నుంచీ ఇప్పటి వరకూ అక్కడ జరుగుతున్న దేమిటి?వెల కట్టబడిన వస్తువు,అమ్మకం దారు,కొనుగోలు దారు,మారక ద్రవ్యం,లాభం,నష్టం - వీటిల్లో మార్పు యేమైనా ఉందా?ఇన్ని మిలియన్ల సంవత్సరాల నుంచీ ఆ ఖచ్చితమైన సూత్రాల మీద ఆధార పడి నడుస్తున్న పెట్టుబడి దారీ విధానం మార్క్సు గారికి ముందర యెప్పుడయినా కుప్పకూలిపోయిందా?మెసపొటేమియన్,మాయన్,గోబియన్ ,గీబియన్ సమాజాల గురించి చెబితే చెప్పవచ్చు గాక,వాటి స్థానంలో అంతకన్నా శక్తివంతమైన మరో పెట్టుబడిదారీ సమాజం పుట్టింది గదా!వర్గరహితసమాజం కూడా ప్రత్యేకంగా యే ఆర్ధికసూత్రాల్నీ కాకుండా ఇవే ఆర్ధికసూత్రాల ప్రకారం నడుస్తూ ఉంటే పెట్టుబడిదారీ విధానం కూలిపోతుందనడమే పెద్ద అబధ్ధం,కాదా?! 

ఐన్స్టీన్ రెలేటివిటీ సిధ్ధాంతంలో అన్నీ రిలేటివ్ కానీ కాంతి వేగం మాత్రం కాన్స్టాంట్ అన్నట్టు అసలు వైరుధ్యాలన్నీ మార్క్సు చెప్పిన గతి తప్పిన భౌతిక్కవాదంలో ఉంటే స్థిరమైన విలువలన్నీ పెట్టుబడిదారీ విధానంలో ఉన్నాయి!


పెట్టుబడిదారీ ఆర్ధికవిధానం అప్రతిహతం!

4 comments:

  1. హరిబాబుగారు,
    నాకు సిద్ధాంతాలు తెలియవుగాని మానవ మస్తత్వానికి విరుద్ధంగా ఉన్నదేదీ నిలబడదు.

    ReplyDelete
    Replies
    1. హిందూ మతవాదులు ఉన్నది వదులుకుని లేనివాళ్ళకి సహాయం చెయ్యాలని చెపుతుంటారు. ఇది మాత్రం మానవ మనస్తత్వానికి సరిపడుతుందా? మనిషి తన కోసం తాను బతుకుతాడు కానీ ఇంకొకడి కోసం కాదనే విషయం అమెరికన్ లిబర్తేరియన్ పార్తీ సభ్యుల కంటే మార్క్సిస్త్‌లకే బాగా తెలుసు.

      Delete
    2. హిందూ మతవాదులు దానధర్మాల గురించి చెప్పారు,ఆచరించారు.సాక్ష్యానికి కావాలంతే యెక్కద పుణ్యకార్యం జరిగినా అన్నదానం ప్రముఖంగా ఉటుంది.

      తెలిసి రష్యాలో యేం పీకారు?బెంగాల్లో యెందుకు చంకనాకి పోయారు?పోయాక వాళ్ళు చంపి పాతిపెట్టిన శవాల గుట్టల లెఖ్ఖ తేలిందిగా?అంత వ్యతిరేకత యెందుకుంది బెంగాల్ జనంలో?

      నేను చేస్తున్న చాలేంజి వర్గరహితసమాజం+శ్రామికవర్గనియంతృత్వం అనేది యెంత శాస్తీయమైనదఓ చెప్పమని!బహుశా ఇప్పుదు వైజాగు లైబ్రారీలో లిబర్తేనియన్ గురించి చదువుతున్నట్తున్నావు - అక్కడ ముక్కున బట్తి ఇక్కద చీదుతున్నావు.ఆలోచించి చెప్పు!

      రష్యాలో మొదట్లో ఆ క్యూలని చూసి చాలామంది నవ్వారు గానీ నేను నవ్వలేదు!మైలు పొడుగున ఉన్న క్యూలో ఆఖర్న నుంచున్నా నా రేషన్ నాకు వస్తుంది అనే ధీమా ఉన్నది కాబట్టి నుంచున్నారు,మంచిదే!ఇవ్వాళ తిండికి కూడా లేనివాడు ఆ తింది గ్యారెంటీ అని చెప్తే శ్రామికవర్గనియంతృత్వమా మరొకటా అని ఆలోచించకుండా ఫాలో అయిపోతాడు లెనిన్ హయాములో లాగా!కానీ కొంచెం కడుపు నిండాక అతనిలోని వస్తుగతవాదం ఇంకా కావాలని కోరుకొమ్మ్మంటుంది!అ ఐంకా కావాలన్నది స్వేచ్చ అయితే?ఆ స్వేచ్చ కోరుకున్నది శ్రామికుడే అయినా శ్రామికవర్గనియంతృత్వానికి నచ్చదు,అవునా?స్టాలిన్ హయాములో జరిగింది అదే కదా,కాదా?తియానమెన్ స్క్వేరులో కూడా అదే కధ!లెనిన్ పాపం జాతుల స్వయం నిర్ణయాధికారం అని యెవడికి వాడు విదిపోండ్రా అన్నా సరె కాదు మీ అంత మంచివాడి నాయ్కత్వంలోనే ఒక్కటిగానే ఉంటాం అన్నవాళ్ళు కాస్తా స్టాలిన్ సొంతవాళ్ళే వేరుకుంపటికి తిరగబడ్డారు,అవునా కాదా?మహానుభావుడు తన-పర తేదా కూడా చూదకుండా సొంత వాళ్లనే మట్టగించిపారేశాడు - నేను చెప్పిన చరిత్ర అబధ్ధమా?

      నియంతృత్వం - అది యే రూపంలో నైనా నువ్వు శ్రామికుల మేలు కోసమే అని బాకాలు వూదిన అయెక్కువకాలం నిలబడదు.రష్యాలో జరిగిందే మళ్ళీ అమ్ళ్ళీ జరుగుతుంది.

      Delete
  2. అనుబంధాలూ ఆప్యాయతలూ సమాజంలో ప్రతిదీ ఆర్ధికానికి సంబంధంగానే ఉంటుంది అని బల్ల గుద్ది చెప్తున్న వాళ్ళు వర్గరహితసమాజం అనేదానికి కూడా ఆర్ధికపరమైన పునాది ఉండాలి అని ఇప్పటికీ అనుకొవడం లేదా?

    ధర్మస్య మూలం అర్థం అని చాణక్య గారు చెప్పారనుకుంట (గారు కొత్తగా కలిపా)
    ఇలా యే కమ్మీ చెప్పలేదు అంటే ఈ ఉదాహరణ వారి గందరగోళానికి పరాకాష్ట ని చూపెడుతుంది.

    (మీరు చెప్పిందే నే చెప్పానేమో కానీ ...చెప్పాలనిపించింది!!)

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...