Sunday, 2 August 2015

సచ్చా ముసల్మాన్ యెవడూ అయోధ్యలో రామాలయం కట్టడాన్ని వ్యతిరేకించడు - శ్రీరామ జయం!

1.యెలా మొదలయింది?యెప్పుడు పుట్టిందీ నిప్పురవ్వ!


తండ్రి వైపునుంచి తైమూర్ లంగ్ తల్లి వైపునుంచి చెంఘీజ్ ఖాన్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్ ,క్రీ.శ1483లో ఫిబ్రవరి 23 ఉబ్జెకిస్థాన్లో ఉన్న ఫర్గనా లోయలోని అందెజాన్ పట్టణంలో మంగోలు జాతికి చెందిన బర్లాస్ తెగకి చెందిన ఫెర్గనా లోయ ప్రాంత పరిపాలకుడైన ఉమర్ సేహ్ మిర్జాకి జన్మించాడు.క్రీ.శ 1495లో తన పన్నెండవ యేటనే రాజ్యాధికారం చేపట్టి పేరుకి తగ్గట్టు సింహంలాగే పోరాడుతూ నిరంతర యుధ్ధాలతో విసుగెత్తి ఉన్న దశలో ఆలం ఖాన్,దౌలత్ ఖాన్ లోడీల ఆహ్వానంతో 1526లో ఇబ్రహీం లోడీ పాలిస్తున్న భరత ఖండంలోని డిల్లీ సామ్రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు.ఈ మొదటి పానిపట్టు యుధ్ధంలో సుల్తాను వైపు పోరాడుతున్న లక్షమంది సైన్యం బాబరు వైపు పోరాడుతున్న పన్నెండువేల మంది సైన్యం చేతిలో చిత్తుగా ఓడిపోయింది!తుపాకీ బళ్ళు, కదిలించగలిగే ఫిరంగీలు, అత్యుత్తమ ఆశ్వికదళ యుక్తులు మరియు ఆ కాలము నాటి ఆంగ్లేయుల పొడవు ధనుస్సు కంటే అత్యంత శక్తివంతమైన మొఘలు విల్లుల సహాయముతో అద్వితీయమైన విజయాన్ని సాధించాడు బాబర్


1531లో మరణించే వరకూ నిరంతర యుధ్ధాల తోనే కాలం గడించిపోయింది.కేవలం పది సంవత్సరాలే బతికినా కట్టడాలను నిర్మించే సరదా ఉండటంతో ఇతని హయాంలో అనేకమైన కట్టడాలు నిర్మించబడినాయి..కట్టడాలు అంటే కొత్త రాజ్యాన్ని జయించిన యే ప్రభువైనా తన గెలుపుకు సూచనగా తను పాటించే మతానికి సంబంధించిన దేవాలయాలనే నిర్మిస్తాడు,అది సహజం!వాటిలో ఒకటి అయోధ్యలో మీర్ బక్వి అనే బాబరు సేనాని సయ్యద్ మూసా అనే అతని అధ్వర్యంలో  నిర్మించిన ఒక మసీదు ఇన్ని శతాబ్దాలుగా హిందువులకి మనస్తాపాన్ని కలిగిస్తున్నది!

సర్వధర్మసమభావన గల హిందువులకి బాధ కలిగింది ముస్లిములు మసీదు కట్టుకున్నందుకు కాదు,అప్పటికే అక్కడ ఉన్న తమ దేవాలయాన్ని కూల్చి కట్టుకున్నందుకు!అప్పటి నుంచి ఇప్పటివరకూ యెక్కడినుంచి నెట్టివేయబడ్డాడో అక్కడ తమ రాంలాలాని మళ్ళీ చూసుకోవాలని తపించి పోతూ లక్ష మందికి పైగా ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారని చరిత్రకారులు నిర్ధారించారు.యెందుకు కూల్చడం, కొత్తగా కట్టుకోవచ్చును గదా అంటే, కాఫిర్ల ప్రార్ధనా స్థలాల్ని నిర్మూలించడం  అల్లా తమకు అప్పగించిన పవిత్ర కర్తవ్యం అని వారు అనుకున్నారు గాబట్టి?ప్రపంచమంతటా యే ముసల్మాన్ వీరయోధుడు యే రాజ్యాన్ని ఆక్రమించినా మొదట చేసిన పని అక్కడ ఉన్న అన్యమతస్థుల దేవళాలన్నింటినీ నేలమట్టం చేసి ఆయా స్థలాల్లో మసీదుని నిర్మించటం!వారికది ఘనకార్యం గనక గొప్పగా చెప్పుకోవటమూ,అలా గొప్పగా చెప్పుకోవటం వల్ల చరిత్రలో  సాక్ష్యాధారాలతో సహా ఆ విజయాలు నమోదై ఉన్నాయి!ఇటువైపున ఉన్న మనకి అయోధ్యతో అనుబంధం ఉంటుంది గానీ అటువైపున ఉన్నవారికి మాత్రం అది కాఫిర్ల దేవళం - అంతే!

ఈ రోజున పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపి నిర్ధారించినా యెవ్వరూ నమ్మడం లేదు గానీ కొందరు ముస్లిం మతానికి చెందిన చరిత్రకారులే అదీ అప్పటి వారే, బహుశా భవిష్యత్తులో వివాదాస్పదమవుందని తెలియని కాలం కాబట్టి  చాలా నిజాయితీగా - అక్కడొక హిందూ దేవాలయం ఉండేదని వివరంగా వర్ణించారు!అక్బరు నామా మరియూ ఐన్ - ఇ - అక్బరి అనే గ్రంధాలను రచించిన మొఘల్ ప్రభువుల కాలానికి చెందిన అబుల్ ఫజల్ అనే ప్రముఖ రచయిత అయోధ్య త్రేతాయుగానికి చెందిన అవతారపురుషుడూ మరియూ ఇక్ష్వాకువంశప్రభువూ ఐన రామచంద్రుని సామ్రాజ్యానికి రాజధాని అని పేర్కొన్నాడు.అప్పటి అవధ్ సంస్థానం హిందువులకు ప్రాచీనకాలం నుంచి యెంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఉండేదని కూడా వివరించాడు.అక్కడ శ్రీరాముని జన్మదినమైన రామనవమి ఉత్సవాలు యెంతో వైభవోపేతంగా జరిగేవని విసదీకరించాడు.ఔరంగజేబు మనుమరాలైన 18వ శతాబ్దానికి చెందిన సాఫియా - ఇ - చహల్ రచించిన Chahal Nasaih ("Forty Advices") లోని కొన్ని భాగాల అనువాదం ఇలా ఉంది:
"... the mosques built on the basis of the king's orders (ba farman-i Badshahi) have not been exempted from the offering of the namaz and the reading of the Khutba [therein]. The places of worship of the Hindus situated at Mathura, Banaras and Awadh, etc., in which the Hindus (kufar) have great faith - the place of the birthplace of Kanhaiya, the place of Rasoi Sita, the place of Hanuman, who, according to the Hindus, was seated by Ram Chandra over there after the conquest of Lanka - were all demolished for the strength of Islam, and at all these places mosques have been constructed. These mosques have not been exempted from juma and jamiat (Friday prayers). Rather it is obligatory that no idol worship should be performed over there and the sound of the conch shell should not reach the ear of the Muslims ..."
1855లో వజిద్ ఆలి షా పరిపాలనా కాలంలో Amir Ali Amethawi నాయకత్వంలో హిందువుల నుంచి హనుమంత ఘర్ ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవటానికి నడిపించిన విఫల ప్రయోగమైన జెహాదులో ప్రత్యక్షంగా పాల్గొన్న మిర్జా జైన్ అనే వ్యక్తి ఒక సంవత్సరం తర్వాత జ్ఞాపకాలుగా రాసుకున్న రచనలో ఇలా ఉంది:
"The past Sultans encouraged the propagation and glorification of Islam and crushed the forces of the unbelievers (kufar), the Hindus. Similarly, Faizabad and Awadh(Ayodhya) were also purged of this mean practice [of kufr]. This [Awadh] was a great worshipping centre and the capital of [the kingdom of] Rama's father. Where there was a large temple, a big mosque was constructed and where there was a small mandaf, there a small kanati masjid was constructed. The temple of Janmasthan was the original birthplace (masqat) of Ram, adjacent to which is Sita Ki Rasoi, Sita being the name of his wife. Hence at that site, a lofty (sarbaland) mosque has been built by Babar Badshah under the guidance of Musa Ashikan... That mosque is till date popularly known as Sita Ki Rasoi..."
1909లో అలామా ముహమ్మద్ నజముల్ఘనీ ఖాన్ రాంపురి రచించిన Tarikh-i Awadh("History of Ayodhya")  నుంచి తీసుకున్న ప్రస్తావన యొక్క అనువాదం ఇలా ఉంది:
"Babar built a magnificent mosque at the spot where the temple of Janmasthan of Ramchandra was situated in Ayodhya, under the patronage of Saiyid Ashikan, and Sita ki Rasoi is situated adjacent to it. The date of construction of the mosque is Khair Baqi (923 AH). Till date, it is known as Sita ki Rasoi. By its side stands that temple. It is said that at the time of the conquest of Islam there were still three temples, viz. Janmasthan, which was the birthplace of Ram Chanderji, Swargadwar alias Ram Darbar, and the Treta ka Thakur. Babar built the mosque after having demolished Janmasthan."

ఆధునిక చరిత్రకారులలో Will Durant అనే మహానుభావుడు అన్ని దేశాల లోని ప్రాచీన నాగరికతలని తులనాత్మకంగా అధ్యయనం చేసి "The history of civilizations" అనే పుస్తకం రాశాడు.అందులో మిగిలిన నాగరకతల గురించి యేమి చెప్పాడో తెలియదు గానీ భారతదేశం గురించి చెప్పాల్సి వచ్చేసరికి తులనాత్మకత యేమయిందో "భారతదేశం మీద తురుషులు సాగించిన దండయాత్రలు పరమ కిరాతకమైనవి - రక్తసిక్తమైనవి!అదొక విషాద గాధ!అక్కడ నిరూపితమైన నీతి ఒకటి ఉంది,ఒక స్వేచ్చాస్వాతంత్ర్యాలతో విలసిల్లే నాగరికత, ఆ నాగరికతలోని ప్రజలు అనుభవించిన శాంతి సౌభాగ్యాలు యే నిముషంలో నైనా బయటి నుంచి దాడి చేసే క్రూరుల వల్ల ఆనవాళ్ళు కూడా లేకుండా చెరిపివేయబడవచ్చు." అని సెంటిమెంటు కురిపించాడు!ఈ రోజున మనం చూసే భారతదేశాన్ని బట్టి అప్ప్పటి భారతదేసపు వైభవాన్ని మనం వూహించలేము అని కూడా అన్నాడు.భారతదేశపు చరిత్ర మరొక విషయాన్ని కూడా నిరూపించింది.ఇంతకన్నా తక్కువ దాడికే తనకన్నా తర్వాత పుట్టిన మెసపొటేమియన్ నాగరికత మరియూ మాయన్ నాగరికత వంటి ప్రాచీన నాగరికతలు అవశేషాలు కూడా మిగలనంతగా అంతరించిపోయినా కమ్యునిష్టు విమర్సకులు కూడా స్వయంచాలిత యంత్రం అని పొగిడిన ఈ దేశపు సనాతన ధర్మం మాత్రం అన్ని దాడుల్నీ తట్టుకు నిలబడి తనకి హాని చేసిన వారిని కూడా క్షమించి ఈ రోజున ఇస్లాం దర్మాన్ని పాటిస్తున్న వారికి కూడా స్నేహహస్తాన్ని అందిస్తున్నది!


అంతకు ముందు ఇక్కడ యుధ్ధాలు జరగలేదని యెవరూ అనటం లేదు, కానీ ఇక్కడి రాజులు కొన్ని నైతికసూత్రాలకి కట్టుబడి యుధ్ధాలు చేశారు.ఆయుధం పట్టని వారిని చంపగూడదు,స్త్రీ బాల వృధ్ధుల్ని హింసించ రాదు,గో బ్రాహ్మణుల్ని సంహరించ రాదు - వీటిని అందరూ నిక్కచ్చిగా ఆచరించటంతో యుధ్ధ సమయాల్లో కూడా ప్రజల కసలు యుధ్ధాలు జరుగుతున్నాయనేది తెలియనంత ప్రశాంతంగా జీవించే వాళ్ళు!కానీ అదేమి పైశాచికత్వమో - ఒక నగరం వారికి ఓడిపోయిందంటే భస్మీపటలం కావలసిందే,లేదా నేలమట్టమైపోవలసిదే?!అక్కడ రాజ్యం యేర్పరచాలనుకుంటే అక్కడి కాఫిర్ల సంస్కృతిని నిర్మూలించవలసిందే?!అలాంటి క్రూరమైన విధ్వంసానికి రామచంద్రుని సభాభవనం,సీతాదేవి వంటిల్లు లాంటివి కూల్చివేయబడినాయి.కాలగర్భంలో కలిసిపోయినవాటిని యెటూ తిరిగి పొందలేమనేది అందరూ ఒప్పుకుంటారు!అయితే అలసతను వీడి ఇప్పటికి క్షేమంగా మిగిలినవాటినయినా సాధించుకుని సంరక్షించుకోగలమా?

భవిష్యత్తులో యెవరు సంప్రదించినా నిజమేమిటో నిర్ద్వందంగా తెలిసేటందుకు ఆనాడు జరిగినది జరినట్టు చెప్పిన చరిత్రకారు లందరికీ వ్యాసపరాశరాది షిర్దీ సాయినాధ పర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన నా గురుపరంపర పాదాల సాక్షిగా నేను శిరసా ప్రణామం చేస్తున్నాను!

ఇది శ్రీ ధర్మహాస రామచంద్ర విజయేతిహాసము నందు ప్రధమాధ్యాయము సంపూర్ణం
2.రామ్ లల్లా నిజంగానే లోపలికి నడిచొచ్చాడా?ఆరుబయట పాపం చలేసిందేమో!

క్రీ.శ 1949 డిసెంబర్ 22 గురువారం నాటి శుభోదయాన రాం లల్లా యెక్కడి నుంచయితే క్రీ.శ 1528లో పక్కకి నెట్టివేయబడ్డాడో అక్కడ ప్రత్యక్షమయ్యాడు!బిందేశ్వరి ప్రసాద్ అనే సాధువు అప్పటి తన అనుభవాన్ని ఇలా వివరించాడు:"మేమందరం ఆలయానికి దగ్గిర్లో విడిది చేసి ఉన్నాం ఆ రాత్రి.మాకందరికీ కలలో రాం లల్లా కనబడటంతో సుమారు తెల్లవారు ఝాము 3గంటల సమయంలో మేల్కొన్నాం.అప్పుడు ఆలయం కిటికీల నుంచి తొంగి చూస్తే రాం లల్లా కనబడుతున్నాడు తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్ళీ ప్రార్ధనలు చేసి పూజాభిషేకాలు నిర్వహించాము".నిజంగానే ముందరి యుగాల్లో వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఋషులకు దర్శనమిచ్చి వారికి వరాలిచ్చినట్టు ఈ కలియుగంలో కూడా తన మహిమను చూపించాడా!


లేదు, రామభక్తులే చేశారు ఆ సాహసకార్యం - అయితే యేంటి?యెవరయినా నీ ఇంటిలో నుంచి నిన్ను తరిమేస్తే పోతే పోయింది లెమ్మని ఆ ఇంటితో అనుబంధాన్ని తెంచేసుకుని యేమీ జరగనట్టు ఉండిపోగలవా?అలాగే హిందువులు కూడా కొన్ని వందల శతాబ్దాల క్రితం ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును కట్టిన నాటినుంచీ నేటివరకూ యేనాడూ ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు!ప్రభువు అన్యమతస్థుడు,అధికార స్వభావం క్రూరమైనది - తొలినిప్పురవ్వ క్రీ.శ 1853లోనే రగిలింది!అప్పటి నుంచీ ఆపకుండా చేస్తున్న దశల వారీ పోరాటాలు ఫలించి క్రీ.శ 1855లో సీతా కి రసొయినీ రాం చబూత్రానీ స్వాధీనం చేసుకోగలిగారు.క్రీ.శ 1859లో అప్పటి ఆంగ్లేయ ప్రభువులు మందిరం యొక్క లోపలి భాగాన్ని ముస్లిములకీ బయటి భాగాన్ని హిందువులకీ పంచి మధ్యలో ఒక ఫెన్సింగ్ వేశారు.క్రీ.శ 1885లో మహంత్ రఘువర్ దాస్ అనే భక్తుడు రాం చబూత్ర పైన చత్రం నిర్మించుకోవటానికి అనుమతి కోరుతూ కోర్టులో ఒక పిటిషన్ వేశాడు.యెంత తపన ఉండి యేమి ప్రయోజనం?యెన్ని పోరాటాలు చేసినా కలిసిరాని పరిస్థితి!కూల్చినది అన్యమతస్థుల ప్రభుత్వం,తర్వాత వచ్చినదీ అన్యమతస్థుల ప్రభుత్వమే,స్వతంత్రం వచ్చినా అదికూడా విదేశీభావజాలప్రేరిత ప్రభుత్వమే - యెంత సుదీర్ఘకాలపు దురదృష్టం!ఈ రోజున కాస్తకే కూస్తకే తమ మనోభావాలు దెబ్బతిన్నాయని  విధ్వంసాలు సృష్టించడానికి కూడా వెనుకాడని వారు అన్ని శతాబ్దాల పాటు తమ గుండెల్లో నెలకొని ఉన్న దేవుడి కోసమైనా సరే సామరస్యంగా సాధించుకోవాలే తప్ప హింసకి దిగరాదని నిగ్రహంతో వ్యవహరిస్తున్న హిందువులని తమతో పోల్చుకుని చూస్తే  తెలుస్తుంది ఈ దేశంలొ స్వతంత్రభారతప్రప్రధమప్రధాని ప్రతిపాదించిన సెక్యులరిజం ఇప్పటికీ యెందుకు బతికే ఉందో!అంతకన్నా గొప్పదయిన సర్వధర్మ సమభావననే నమ్మి ఆచరించి చూపించిన వారికి ఇది పెద్ద కష్టమా?

18వ శతాబ్దం నాటి అయోధ్య

1949లోని అయోధ్య ఒక ప్రశాంతమైన నగరం.ఆలయాలూ,అతి సన్నని వీధులూ,స్వేచ్చగా సంచరించే గోమాతలూ,ప్రాచీనంగా కనబడే గోడలూ - చాలా అమాయకంగా ఉంటుంది,ఇప్పటికీ అలాగే ఉంది!హిందువులూ ముస్లిములూ - ఇరు మతాల వారూ సహజీవనం చేస్తున్నారు.కానీ, చూడగానే కొట్టొచ్చినట్టు కనిపించేది అక్కడి వీధుల్లో సంచరిస్తున్న సాధువులు!అక్కడ ఉన్న రామ్ లల్లాను దర్శించుకోవడం కోసం దేశమంతటి నుంచీ కొందరు వస్తుంటారు పోతుంటారు,కొందరు అక్కడే ఆశ్రమాలు కట్టుకుని ఉంటుంటారు.అలాంటివారిలో అభిరాం దాస్ అనే సాదువు బయట ఉన్న రామ్ లల్లాను లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.అసలితను రామ్ లల్లాను ఇదివరకు యెక్కడ వుండేవాడో అక్కడికి చేర్చే పవిత్ర సంకల్పంతోనే బీహారు నుంచి ఇంతకు పదిహేనేళ్ళ క్రితమే అయోధ్యకు చేరుకుని శిష్యుల్ని పెంచుకుంటూ మంచి అవకాశం కోసం యెదురు చూస్తున్నాడు.అప్పుడప్పుడూ రాముడు తనకు కలలో మందిరం లోపల దర్శనమిస్తున్నాడని చెప్తూ ఉండేవాడు.అతని శిష్యులు కూడా దానిని అందరికీ ప్రచారం చేస్తూ ఉండేవారు.ఒకసారి అతను ఇదే విషయాన్ని ఒకరోజు అయోధ్యకి సంబంధించిన వ్యవహారాల మీద అధికారం ఉన్న ఫైజాబాద్ మెజిస్ట్రేట్ దగ్గిర ప్రస్తావించాడు.రోగీ పాలే కోరాడు వైద్యుడూ పాలే ఇచ్చాడన్నట్టు ఆయన, "భయ్యా,అది నా పాత కల!నీకిపుడొస్తున్నది,నాకు చాలా కాలం నుంచీ వస్తున్నది" అన్నాడు!

గురు దత్ సింగ్ అనే ఈ ఫైజాబాద్ మెజిస్త్రేట్ అలహాబాద్ గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకుని అప్పటి కుంఫిణీ వారి కొలువులో చేరినా స్వదేశీయాభిమానాన్ని వొదులుకోకుండా బతికిన అతికొద్దిమందిలో ఒకరు.అప్పట్లో దొరల కొలువులో చేరిన వాళ్ళందరూ ప్రత్యేకంగా ఉండే దొరటోపీ తలమీద ధరించాలి.కానీ ఇతను మాత్రం తలపాగ మాత్రమే ధరించేవాడు.ఒకసారి పై అధికారి ముఖం మీదనే "నీవెందుకు టోపీ పెట్టుకోలేదు?" అనడిగితే "మీరెందుకు తలపాగ ధరించ లేదు!" అని యెదురు ప్రశ్నించాడు!అతని అధికార పరిధిలో శాంతిభద్రతలని కాపాడటం కూడా ఉండేది.ఇరు మతస్థులనీ సమానంగానే చూసేవాడు,తన అధికార బాధ్యతల విషయంలో యెంత నిర్మొహమాతంగా,నిష్పక్షపాతంగా ఉన్నప్పటికీ అతనికి ఒకటే బాధ - అప్పటి ప్రభుత్వం అనుసరిస్తున్న ముస్లిములని బుజ్జగించే వ్యవహారం.సంవత్సరాని కొకసారైనా అయోధ్యారాముణ్ణి దర్సిస్తాడు,కాలేజి రోజుల నుంచే రామభక్తుడు!వయసుతో పాటూ భక్తి పెరుగుతూ వచ్చి రాముణ్ణి మళ్ళీ మొదట్లో యెక్కడుండేవాడో అక్కడికి తీసుకెళ్ళాలని భావించే వాడు.ముస్లిములు మసీదును హిందువులకు అప్పగించడమే మంచి  పరిస్కారం అనుకునేవాడు."నేను వాళ్లతో అంత ఉదారంగా ఉంటున్నా అటువైపు నుంచి సహకారం రాదేమిటి?" అని లోలోపల బాధపడేవాడు!


1900 నాటి బాబరీ మసీదు

1940ల్లో ఇతనికి కే.కే నాయర్ అనే మరో ప్రభుత్వాధికారితో పరిచయ మయింది.ఇతను కేరళ ప్రాంతం వాడు.ఇద్దరి అభిప్రాయాలూ ఒక్కలాగే ఉండేవి.హిందూ మహా సభ ప్రభావం బలంగా వుండేది.ఇద్దరూ ఒకేసారి ఫైజాబాద్ నగరానికి బదిలీ అయ్యేందుకు అప్లికేషన్లు పెట్టారు.సింగ్ గారు 1948లో నగర మెజిస్ట్రేట్ గానూ అదే సమయంలో నాయర్ గారు జిల్లా మెజిస్ట్రేట్ గానూ ఫైజాబాద్ చేరుకున్నారు.అప్పటి అధికార పరిధుల ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్ జిల్లాకి సంబంధైంచినంత వరకూ సర్వాధికారి!యెప్పుడయితే సాధువు గురు దత్ సింగ్ గార్ని కదిలించాడో వెంటనే నాయర్ గార్ని కూడా కలుపుకుని గురుదత్ గారి ఇంటిలోనే సమాలోచనలు చేశారు.1949 అక్టోబర్  కల్లా మొత్తం ప్రణాళిక సిధ్ధమయ్యింది.వాళ్ళు అంత రహస్యంగా ప్రణాళికలు వెయ్యడానికీ ప్రతి చిన్న విషయాన్నీ నిర్దుష్టంగా ప్లాన్ చేసుకునీ యెక్కడా ఫెయిలవకూడదనీ అంత గట్టిగా అనుకోవడానికి కారణం అప్పటి ప్రధానమంత్రి.మసీదులో యెలాంటి గొడవ జరిగినా ప్రమాదవశాత్తూ హిందువైన అతనికి తీవ్రమైన కోపం వస్తుందని ఇద్దరికీ స్పష్టంగానే తెలుసు.అయినా సరే,రాజీనామా అయినా చెయ్యాలి గానీ లోపలికి చేర్చిన రామ్ లల్లాని తొలగించకూడదని నిర్ణయం తీసుకున్నారు.

ప్లాను ఇది:మసీదుకి ఉన్న గార్డులలో ఒకరు హిందువు.అతను సాయంకాలం ముందరి కాపలాదారు దగ్గిర తాళాలు తీసుకుని కాపలా మొదలు పెట్టి తన డ్యూటీ పూర్తి అయ్యాక రాత్రి కాపలా కొచ్చే గార్డుకి తాళాలు అప్పగించి వెళ్ళిపోతాడు.సరిగ్గా ఈ తాళాల మార్పిడికి కొంచెం ముందుగా హిందూ గార్డు అభిరాం దాస్ బృందాన్ని లోపల్లికి వొదుల్తాడు.వాళ్ళు సుమారు యేడంగుళాల యెత్తు వుండి యెనిమిది లోహాలతో చేసిన బాలుడిలా కనిపించే రామ్ లల్లా విగ్రహాన్ని లోపలికి చేర్చి పూజలూ అవీ చేసి యెలా వెళ్ళారో అలానే వచ్చెయ్యాలి.ముస్లిం గార్డుని కూడా వశపర్చుకున్నారు.అతను యెవరెవరితో యేమేమి చెప్పాలి,కేసు యెలా ఫైల్ చెయ్యాలి అనే సమస్తం బోధపర్చారు - మహా సామ్రాజ్యాల్ని వశపర్చుకునే రాజనీతి దురంధరులు కూడా కేవలం భక్తి తప్ప మరేమీ లేని ఈ సామాన్యుల ముందు దిగదుడుపే గదా అనిపించే బ్రహ్మ దుర్భేద్యమైన ప్లాను వేశారు!అనుకున్న రోజున, అంటే డిసెంబర్ 22 1949 సాయంకాలం ముస్లిం గార్డ్ రాగానే హిందూ గార్డ్ తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు.ముందే నిర్ణయించబడిన సుముహూర్తం తెల్లవారు ఝాము 3 గంటలకు గంట మోగిస్తూ హారతి సమర్పించి ప్రార్ధనలు చేశారు.శతాబ్దాల నిరీక్షణ తర్వాత సమస్త భక్తజనావళి హృదయాలూ ఆనందామృతవర్షంలో తడిసేలా మందస్మిత వదనారవిందంతో రామ్ లల్లా తన స్వస్థానం చేరుకున్నాడు!

యెక్కడో ఒక మారుమూల జిల్లాలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా ఆనాడు ప్రజాస్వామ్యబధ్ధంగానే సంక్రమించినా అప్రతిహతమైన అధికారంతో వెలిగిపోతున్న ఒక దేశ ప్రధానికి కూడా భయపడకుండా అంత సాహసం చేసిన ఆ ఇద్దరు భక్తాగ్రగణ్యులైన రామదాసులకూ వ్యాసపరాశరాది షిర్దీ సాయినాధ పర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన నా గురుపరంపర పాదాల సాక్షిగా నేను శిరసా ప్రణామం చేస్తున్నాను!

ఇది శ్రీ ధర్మహాస రామచంద్ర విజయేతిహాసము నందు ద్వితీయాధ్యాయము సంపూర్ణం
3.మూసిన తలుపులు తెరిచిన దెవరు?యెందుకు తెరిచారో మరి!

ప్రమాదవశాత్తూ హిందువైన స్వతంత్రభారతప్రప్రధమప్రధాని చాలా కంగారుగా ఆ రాష్ట్ర ముఖ్యమత్రి గోవింద వల్లభ పంత్ గారికి 1949 డిసెంబర్ 26న ఇచ్చిన టెలిగ్రాములో,"అయోధ్యలో జరిగిన పరిణామం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది.మీరు వ్యక్తిగతంగా చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దగలరని ఆశిస్తున్నాను.ఇక్కడొక దుష్ట సాంప్రదాయం మొదలయ్యింది.దీన్ని మొగ్గలోనే తుంచకపోతే మరిన్ని అనర్ధాలకి దారితీస్తుంది." అని తీవ్రాతితీవ్రమైన లౌకికావేశాన్ని ప్రదర్శించాడు.దేశ ప్రధాని వ్యక్తిగతంగా విగ్రహాలను అక్కడినుంచి తొలగించమని యెంత ఒత్తిడి పెట్టినా క్షేత్రస్థాయి అధికారులు అలా చెయ్యడం వల్ల అక్కడి శాంతిభద్రతలకి భంగం కలిగి పెద్దయెత్తున అల్లర్లు చెలరేగవచ్చునని గట్టిగా తిరస్కరించడంతో యెన్ని వారాలు గడిచినా తనచుట్టూ జరుగుతున్న జగన్నాటకాన్ని చూస్తున్న జగదభిరాముడు చిరునవ్వులు చిందిస్తూ అక్కడే వున్నాడు!


ఈ దేశం ఆంగ్లేయుల పీడన నుంచి విముక్తమయ్యే సమయంలో జరిగిన హీనాతిహీనమైన రాజకీయ విన్యాసాలు కలిసి మెలిసి బతకాల్సిన హిందువుల్నీ ముస్లిముల్నీ రెండు జాతులుగానూ రెండు దేశాలు గానూ చీల్చింది.దేశ విభజనకి కారకులుగా ముస్లిములని తప్పు పడితే చారిత్రకంగా మనం ఘోరమైన తప్పు చేసినట్టే!ఆనాడు జరిగిన అత్యంత కీలకమైన యెన్నికల్లో ద్విజాతి సిధ్ధాంతంతో దేశాన్ని విగొట్టాలనుకున్నవార్ని చిత్తుగా ఓడించి ఇంటికి పరిమితం చేసి ఈ దేశంలోనే ఉండి హిందువులతో కలిసి మెలిసి ఉండాలనుకుంటున్నామని అప్పటి సామాన్య ముస్లిం సోదరులు తమ సహృదయతని చాటుకున్నారు.ఈ దేశం ప్రజల ఆకాంక్షలకి విరుధ్ధంగా చీలిపోయి ఇరువర్గాల వారికీ ఒకరి పట్ల మరొకరికి అసహిష్ణుతనీ అనుమానాల్నీ పెంచింది!మత సాంప్రదాయాలలో ఉన్న విభిన్నత కూడా ముస్లిములకి హిందువులలోని అర్చామూర్తుల పట్లా క్షేత్ర ప్రాధాన్యత పట్లా ఉండే వ్యామోహాన్ని అర్ధం కాకుండా చేసింది.దానికి తోడు కొత్తగా ప్రాచుర్యం తెచ్చుకున్న ఉద్యోగావకాశాల్ని మెజారిటీ మైనారిటీ పరంగా విభజించడం ఇరువర్గాల లోని ఉన్నత విద్యావంతుల్ని పోటీదారులుగా మార్చడంతో వారు కూడా ఈ విభేదాల్ని తగ్గించడానికి కృషి చెయ్యకుండా సమైక్యతని సాధించే ప్రయత్నాలకి దూరంగా ఉండిపోయారు.లేని పక్షంలో ఈ సమస్య యే హింసకీ తావు లేకుండా సమస్య ఆనాటి రోజుల్లోనే పర్రిష్కారమై ఉండేది!దేశ విభజన నాటి భీబత్సం అయోధ్యని మాత్రం తాకలేదు.అయోధ్య లోని చాలా ఆలయాల లోని విగ్రహాలు ముస్లిము కళాకారులు చెక్కినవే!అర్చకులు కూడా పూజాదికాలకు అవసరమైన సామగ్రిని ముస్లిం వ్యాపారుల నుంచే తీసుకుంటూ ఉంటారు.అంతకు ముందు నుంచీ అక్కడే కాదు దేశమంతటా ఉన్న హిందూ దేవాలయాలలో కొన్ని చోట్ల కొన్ని కైంకర్యాలను ముస్లిములతో చేయించడం వారూ సంతోషంగా వాటిని చెయ్యడం జరుగుతూనే ఉంది!అడిగే వారు అడిగే విధంగా అడిగితే ముస్లిములు కూడా సానుకూలంగానే స్పందించి ఉండే వారు!

1950లో అటు ముస్లిము న్యాయవాదులూ ఇటు హిందూ న్యాయవాదులూ కొన్ని దశాబ్దాల పాటూ పరిష్కారానికి నోచుకోని జటిలమైన కేసులతో న్యాయస్థానాల్ని ఆశ్రయించారు.రామ్ లల్లాని లోపలికి చేర్చడంలో ప్రముఖపాత్ర వహించిన ప్రభుత్వాధికారు లిద్దరూ హిందూ మహా సభలో చేరారు.దత్ గారు తన కర్తవ్యం ఇక ముగిసిపోయిందని స్వచ్చందంగా రాజీనామా చేసి హిందూ మహా సభలో చెరి రాజకీయ జీవితాన్ని ప్రారంబించాడు.నాయర్ గారు కూడా 1952లో పదవీకాలం ముగిశాక తనూ అదేపని చేశాడు.ఆ హిందూ మహా సభ అనంతర కాలంలో పేరు మార్చుకుని భారతీయ జనసంఘ్ అనే మరింత శక్తివంతమైన పార్టీగా అవతరించింది.అదే తర్వాతి కాలంలో పేరు మార్చుకుని రూపు కూడా మార్చుకుని భారతీయ జనతా పార్టీగా అవతరించింది.

ఈ విశ్వాన్నే తన చుట్టూ తిప్పుకుంటున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయోధ్యలోని ఆ పురాతన మసీదులో రామ్ లల్లాగా అడుగు పెట్టిన నాటి నుంచీ నేటి వరకూ ఈ దేశ రాజకీయాలను కూడా తన చుట్టూరా తిప్పుకుంటున్నాడు.చూడటానికి బాలకృష్ణునిలా కనిపించే ఈ కొంటెరాముడి ప్రస్తావన రాజకీయ వేదికల మీద వినిపించినప్పుడల్లా దేశపు రాజకీయ చిత్రపటం మీద హఠాత్తుగా యేదో ఒక సంచలనం జరుగుతూనే ఉంది!తనకొక సుస్థిరమైన చోటు చూపించి తనని ప్రశాంతంగా భక్తుల నుంచి పూజాదికాలు అందుకునేటట్టు చేసేటంతవరకు దేశ రాజకీయాల నిట్లా అస్థిర పరుస్తూనే ఉంటాడేమో నటన సూత్రధారి?బోడిగుండుకీ మోకాలికీ ముడిపెడుతున్నామా అనిపించేటట్టు ఒకదాని కొకటి సంబంధం లేకుండా  యెక్కడెకడో జరిగిన చిత్రమైన సన్నివేశాలన్నీ సూత్రాన కూర్చిన మణుల మాదిరి అయోధ్యారామునికే అనుసంధాన మవుతున్నాయి!



1981లో అయోధ్యకి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని మీనాక్షీపురం అనే ఒక అనామగంగా ఉండే గ్రామంలో ఒకరూ ఇద్దరూ కాదు 400 కుటుంబాలు ఒకేసారి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు.తమ నెవరూ బలబంతంగా మార్చలేదనీ హిందూమతంలో ఉన్న అస్పృశ్యత వల్ల అగ్రవర్ణాల నుంచి వివక్షని భరించలేక సమానత్వాన్ని కోరుకుని మాత్రమే మారిపోయామని వారు ఖండితంగా చెప్పడంతో హిందూ మతాధిపతులలో ఆలోచన మొదలయింది.సాధువులూ,మత ప్రచారకులూ అంతా మొదట వాళ్లలో వాళ్ళు చర్చించుకుని తర్వాత మొత్తం అందరూ కలిసి ఒక చోట కూర్చుని చర్చించుకోవడానికి 1984లో సుమారొక 500 మంది ఒక ధర్మ సంసద్ యేర్పాటు చేశారు.దానికి చొరవ చూపించింది 1960ల్లో స్థాపించబడిన విశ్వ హిందూ పరిషత్.దాని ఆర్గనైజరు అశోక్ సింఘాల్.వక్తలంతా మంచి విషయాలే మాట్లాడారు.లోపాల్ని అంగీకరించాలి,దురాచారాల్ని దునుమాడాలి,ప్రజలని నైతికంగా ఉన్నతుల్ని చెయ్యకపోవడం వల్లనే ఇట్లాంటివి జరుగుతున్నాయి అని చెప్పారు.అవసరమైన మార్పులు తెచ్చి హిందూధర్మాన్ని మళ్ళీ గౌరప్రదంగా నిలబెట్టాలని కూడా ఆశించారు.కాని వక్తల్లో ఒకరు అలయాలు నిరాదరణకి గురవడం ప్రస్తావన తీసుకొచ్చి "చూడండి!అయోధ్యలో రాముడికి దీపాన్ని కూడా వెలిగించలేక పోతున్నాం,దేశజనాభాలో 80% ఉన హిందువులకి యెంత అవమానం?" అనెయ్యడంతో ఆ సభ చేసిన ముఖ్యమైన తీర్మానాల్లోకి అయోధ్యలో రామాలయం నిర్మించడం మొదటి ప్రాధాన్యతని సంతరించుకునేసింది!


ధర్మ సంసద్ తర్వాత కొన్ని నెలలకి 1984 సెప్టెంబరు మాసాంతంలో బీహారు రాష్ట్రంలోని సీత నాగేటి చాలులో ఉద్భవించిందని చెప్పబడుతున్న సీతామర్హి నుంచి అశోక్ సింఘాల్ అధ్వర్యంలో మొదటి రధయాత్ర మొదలైంది.12 రోజుల శోభాయమాన యాత్ర అనంతరం వారు అయోధ్యలోని సరయూ నదీతీరాన ఆగి ఆ నదీజలాన్ని దోసిట పట్టి రామాలయ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేశారు.ఆ రోజున అక్కడ ప్రతిజ్ఞ చేసిన వారే 50,000 మంది కాగా దేశమంతటా మిగతా పుణ్యనదుల్లో ఇలాంటి ప్రతిజ్ఞలే చేశారు.ఆ భక్త్యావేశంలో మొదట అనుకున్న కేవలం దీపారాధన స్థానంలో "మేము శ్రీరాముడికి తన జన్మస్థానంలో ఆలయం నిర్మించేటందుకు మా సమస్తాన్నీ వొదులుంటాము" అనే మరింత గంభీరమైన ప్రతిజ్ఞగా మారింది!ఇంతటి స్పందనని వూహించని యాత్ర నిర్వాహకులకి తొలిసారిగా మారుమూల పల్లెల నుంచి కూడా భక్తులు కదిలిరావడం ఆశ్చర్యమనిపించింది - రాముడా మజాకా!



ఆ మరుసటి రోజునే అప్పటి ప్రధాని తన అంగరక్షకుల చేతిలో హతమవడం వల్ల జరిగిన వరస పరిణామాలతో యాత్ర మధ్యలోనే ఆగిపోయింది.అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అలవాటుగా పాటించే ప్రజాస్వామ్యబధ్ధమైన రాజరిక సాంప్రదాయం ప్రకారం మరణించిన ప్రధాని కుమారుడైన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు.సహజంగానే కొత్తదనాన్ని కోరుకుంటూ టెక్నాలజీకి పెద్ద పీట వేస్తూ మొదట్లో కొంతకాలం ఆశాజనకంగా ఉన్న ఇతని ప్రభుత్వం తన మితిమీరిన ఆధునికతా వ్యామోహం వల్లనే సమస్యల పాలయ్యాడు.షా బానో అనే ఒక ముస్లిం మహిళ విడిపోయిన భర్త నుంచి మనోవర్తి కోరుతూ సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసింది.1985లో సుప్రీం కోర్టు ఆమె అభ్యర్ధన కనుకూలంగా తీర్పు ఇచ్చేసింది.ఆ తీర్పుని అత్యధ్భుతమైనదిగా అభివర్ణిస్తూ ఆయన మంత్రివర్గంలోని ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ పార్లమెంటులో ప్రసంగం చెయ్యడమూ ఈయన ప్రశంసించడమూ అతివేగంగా జరిగిపోయాయి.కానీ తెల్లారేసరికల్లా పార్టీ మొత్తం చచ్చింది గొర్రె అని నాలుకలు పీక్కున్నా లాభం లేనంత ఇబ్బందిలో పడిపోయింది!

తాము తీర్పు ఇవ్వాలసిన కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వటం ముల్లాలకి కోపం తెప్పించగా అప్పటి దాకా ముస్లిములకి రక్షకుడిగా పోజులు కొడుతున్న కాంగ్రెసు పార్టీ దానిని సమర్ధించటం పుండు మీద కారం జల్లినట్టయి మిత్రులుగా ఉన్న ముస్లిం పార్టీలే సందు దొరికిందని కాంగ్రెసుని యేకిపారేస్తున్నారు.పార్టీలో మిగతావాళ్ళు గొడవకి కారణమైన వాళ్ళని తిడదామంటే గొడవలో ఇరుక్కున్నది సాక్షాత్తూ అధినేతయే - బంట్లు రాజుని తిట్టుటయా!కొండని తవ్వి యెలకని పట్టినట్టున్న దిక్కుమాలిన గత్తర నించి తప్పించుకోవటానికి సుప్రీం కోర్టు రూలింగుని యెందుకూ పనికిరానిదిగా చేసే చట్టాన్ని పార్లమేంటు ద్వారా చేద్దామనుకున్నాడు.దీంతో అప్పటికే కాంగ్రెసు మీద అతిగా ముస్లిముల్ని బుజ్జగిస్తున్నందుకు గుర్రుగా ఉన్న హిందువులు గొడవ మొదలు పెట్టారు.ఒక పిల్లిమొగ్గ,అందులో బ్యాలెన్సు తప్పి మరో పిల్లిమొగ్గ,అందులో బ్యాలేన్సు తప్పి మరో పిల్లిమొగ్గ ఇలా వెయ్యంగా వెయ్యంగా ఆఖర్లో అయోధ్యరాముడు గుర్తొచ్చాడు!సరిగ్గా ఇదే సమయానికి ఫైజాబాద్ కోర్టులో ఒక కేసు కొలిక్కొచ్చి నేడో రేపో తీర్పు ఇవ్వడాని కనుకూలంగా ఉండి జడ్జిగారికి వచ్చిన చిన్న సందేహం వల్ల దాని తాలూకా వ్యవహారం ప్రధాని సమ్ముఖానికి చేరింది!


ఉమేష్ చంద్ర పాండే అనే ఒక కుర్రలాయరు జనవరి 1986లో ఫైజాబాద్ కోర్టులో అయోధ్యలోని మసీదుకు వేసిన తాళం తెరిపించాలని కేసు వేశాడు.అంతకు మూడేళ్ళ క్రితం అతనొక పత్రికలో విలేఖరిగా పని చేస్తున్నప్పుడు అతని పత్రికాధిపతి అయోధ్యలో జరిగే రామనవమి సంబరాల గురించి ఒక మంచి ఆర్టికిల్ రాయమన్నాడు.సహజంగా ఇతరులెవరూ రాయని విశేషం కోసం అంగలార్చే జర్నలిష్టు బుర్రతో పరిశోధన చెయ్యగా అతనికొక తమాషా విషయం తెలిసింది.1949లో అభిరాం దాస్ రామ్ లల్లాని లోపలికి చేర్చినప్పుడు జరిగిన గందరగోళంలో సందర్శకులని చెదరగొట్టి యెవరో తాళం వేసేశారు.తర్వాత కూడా కోర్టులు భక్తుల్ని అనుమతించకుండా పూజారులని మాత్రం పూజాదికాలు చేసి వస్తూ ఉండే యేర్పాట్లు చేసినాయి.ఇప్పుడు ఇతను పరిశోధించి చూస్తే తాళం వెయ్యమని గానీ భక్తులకి ప్రవేశం నిషేధించమని గానీ అధికారికమైన ఉత్తర్వులు యెక్కడా కనపడ లేదు!మొదటి నుంచీ విశ్వ హిందూ పరిషత్ వారు చెప్తూనే ఉన్నా ఇతని పరిశోధనతో అది నిర్ద్వందంగా బయటపడింది.దాంతో వెంటనే కేసు ఫైల్ చేసి ఒక కాపీని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాడు.అది రాజీవ్ గాంధీ కజిన్ అయిన అరుణ్ నెహ్రూ కంటబడింది.జడ్జి వైపు నుంచి శాంతిభద్రతలకి సంబంధించిన సందేహం ఉండటం కూడా తెలిసింది.తెర వెనక పైనించి కిందకి కదిలిన మంత్రాంగం వల్ల ప్రభుత్వం తరపు నుంచి ఇద్దరు అధికార్లు కోర్టులో హాజరై శాంతిణద్రతలకి హామీ ఇవ్వగా 1986 ఫిబ్రవరి 1న మసీదు కున్న తాళం తీసి భక్తులని దర్శనానికి అనుమతించే చారిత్రాత్మమైన తీర్పు వెలువడింది!ఈ గేటు తాళం తీసే సంఘటన అందరికీ కుతూహలాన్ని కలిగించి అప్పటి వరకూ సాధువుల శంఖనాదాలకీ, కొందరు వ్యక్తులు చేస్తున్న చిన్న చిన్న ప్రయత్నాలకీ,రామభక్తులైన లాయర్లు ఫైజాబాద్ కోర్టులో వేసే పిటిషన్లకీ పరిమితమైనది కాస్తా ప్రపంచంలోని ప్రతి హిందువుకీ అయోధ్యలో యేం జరుగుతున్నదో తెలిసి రామాలయం కడితే బాగుండుననే కోరికని రగిలించింది.

తన రాజకీయ మనుగడ కోసమే అయినా అప్పటివరకూ యెవరి దృష్టినీ అంతగా ఆకర్షించకుండా అనామకంగా ఉన్న అయోధ్యరాముణ్ణి ప్రపంచంలోని హిందువు లందరికీ చూపించి పరిచయం చేసిన శ్రీమాన్ రాజీవ్ గాంధీ గారికి వ్యాసపరాశరాది షిర్దీ సాయినాధ పర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన నా గురుపరంపర పాదాల సాక్షిగా నేను శిరసా ప్రణామం చేస్తున్నాను!

ఇది శ్రీ ధర్మహాస రామచంద్ర విజయేతిహాసము నందు తృతీయాధ్యాయము సంపూర్ణం
4.పిల్లిమొగ్గల రాజకీయుల గొడవల్లో మసీదు అప్పుడే కూలినంత పనాయె!


దూరదృష్టి లేని పిల్లిమొగ్గల రాజకీయాలు యెంత చెరుపు చేస్తాయో ఒకసారి అనుభవంలోకి వచ్చాక గానీ తెలియదు!రాజకీయ వేత్తల్లో ఒక రకం మూర్ఖత్వం ఉంటుంది - ఇంతకు ముందు అలా జరిగిందని తెలిపే ఇతర్ల అనుభవాల నుంచి వారు పాఠాలు నేర్వకపోవడం!కొందరికి ప్రతిదీ స్వానుభవం ద్వారానే తెలియాలి, అంటే తన తలకి బొప్పి కట్టే వరకూ యెవరెన్ని చెప్పినా నిరుడు మొన్న దగ్ధులైన వారు తనయంత వారు గాదన్న ధోరణి ఉంటుంది.1989కల్లా రాజీవ్ గాంధీ ప్రభ పూర్తిగా మసక బారి బోఫోర్సు కేసులో పీకలోతున కూరుకుపోయి ఉన్నాడు.అప్పటికి తన పదవీకాలం దాదాపు ముగుస్తుండటంతో రాబోయే యెన్నికల్లో తనని గెలిపించే బలమైన వ్యూహం కోసం వెదుకుతున్నాడు.అటువైపు అశోక్ సింఘాల్ చేసిన రధయాత్ర వూహించినదానికన్నా యెక్కువ విజయవంతమై శుభశకునాలు చూపించడంతో అప్పటికి 2 స్థానాలతోనే ఉన్న భారతీయ జనతా పార్టీ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని తన యెజెండాలో చేర్చుకునేసింది!షాబానో విషయంలో తను యెంత దిగొచ్చినా ముస్లిములు తనకి సానుకూలంగా స్పందించకపోవడం వల్ల వ్యక్తిగతంగా విసుగెత్తి ఉండటం వల్లనూ కావచ్చు,బోఫోర్సు కేసు విషయం తనని అవినీతిపరుడు అని వేలెత్తి చూపడం వల్ల కలిగిన ఆందోళన ప్రభావమూ కావచ్చు ఇక రాముణ్ణే నమ్ముకుందామనుకుని అయోధ్య నుంచే ప్రచారం మొదలు పెట్టాడు.తీరా అక్కడ "నేను రామరాజ్యం స్థాపిస్తాను" అని భాజపా వాళ్ళకి అడ్డంగా దొరికిపోయాడు!"ఈ అవినీతిపరుడు రామరాజ్యం స్థాపించడ మేమిటి?రామాలయం కట్టినా రామరాజ్యం స్థాపించినా అది మా వల్లనే అవుతుంది" అని వాళ్ళు రిటార్టు ఇవ్వడంతో పూర్తిగా నవ్వులపాలై అభాసుపాలయ్యాడు.తర్వాత మణిశంకర్ అయ్యర్ ఆ ప్రసంగం నేనే రాశాను గానీ ఆ మాట మాత్రం తను నోరు జారి వుండొచ్చునన్నాడట!కాలు జారినా తీసుకోగలం గానీ నోరు జారితే తీసుకోలేంగా!దాంతో ఆగాడా,సరిగ్గా యెన్నికలు ముంచుకొస్తున్నాయనగా బూటాసింగుని పంపించి తమ తరపున ముందుగానే  "శిలాన్యాస్" చెయ్యమని పంపించాడు.వెళ్ళీన వాళ్ళు మసీదుని పడగొట్టకుండా బయట కడితే ముస్లిములు కాదనరు, శిలాన్యాస్ చేసి ఆలయనిర్మాణం మొదలెట్టాము గనక హిందువులూ సంతోషిస్తారనే ధైర్యంతో గుడ్డిగా ఒకచోట చేసి వచ్చేశారు!యెవడండీ కాంగ్రెసు సెక్యులరిజానికి కట్టుబడి ఉందని అంటున్న గాడిద?యెవరయినా మీముందు కూస్తే వూరుకోకండి!మంచివాళ్ళు గాబట్టి మీరు వూరుకున్నా నాముందు యెవరయినా అంటే మాత్రం వాడి రెండు చెంపలూ వాయిస్తాను - అదీ నా యెడం కాలి చెప్పుతో!తీరా వీళ్ళు శిలాన్యాసం చేసొచ్చిన స్థలం వివరం చూస్తే అది ముస్లిముల కబరస్థాన్,పైగా తగాదాలో ఉంది.దాంతో ముస్లిములకి మండి ఆ యెన్నికల్లో కాంగ్రెసుని సాఫు చేసేశారు.హిందూమతాన్ని కావిలించుకోవడం అలవాటు లేని పని కావడంతో యెడాపెడా దెబ్బలు తిన్నారు - గీతాచార్యుడు పరధర్మం భయావహ మన్నది ఇందుకే!స్వతంత్రం వచ్చాక మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం యేర్పడింది విశ్వనాధ ప్రతాప్ సింగ్ ప్రధానిగా. 


రామాలయ నిర్మాణ సంకల్పంతో భాజపా బలం ఒక్కసారిగా 2 నుంచి 85కి పెరిగింది!ప్రభుత్వాన్ని యేర్పరచటానికి సహాయం చెయ్యడంతో భాజపాకి మరింత హుషారొచ్చింది.భాజపాకి చెందిన లాల్ కృష్ణ అద్వానీ 1990 సెప్టెంబర్ 25న తన అధ్వర్యంలో రెండవ రధయాత్రను ప్రారంభించాడు.సోమనాధ దేవాలయం నుంచి బయలుదేరి అక్టోబరు 30కల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్వర్యంలో జరుగుతున్న కరసేవలో పాల్గొనడానికి అయోధ్యని చేరుకోవాలని ప్లాను.గొప్ప ప్రభావశీలమైన వక్త గనుక రామాయణం గురించి ఉపన్యాసాలు ఇస్తూ రధయాత్రని చాలా ఆకర్షణీయంగా చేశాడు.అసలు కిటుకు రాముడు ప్రజల్ని కన్నబిడ్డల్లాగ పరిపాలించమని చెప్పే ధర్మాన్ని రాజకీయనాయకులు పాటిస్తే ప్రజలు సుఖసంతోషాలతో విలసిల్లుతారు!వారు "అది మాత్రం అడుగవద్దు" అన్నట్టు ఉండటం వల్లనే ఈ గొడవలు వస్తున్నాయి.ప్రజలకి నీతులు చెప్పడానికే తప్ప అది తన బుర్రకి యేమాత్రం యెక్కించుకోలేదు ఈ దేశపు రాజకీయ నాయకులు,అది ప్రజల ఖర్మ!



అద్వానీ రధయాత్ర అయోధ్య చేరితే మసీదు కూలడం ఖాయమని అందరికీ తెలిసిపోయింది!దానితో యాత్రకి ఆదరణ పెరుగుతున్న కొద్దీ ఆందోళనా పెరిగింది.యాత్ర చివరిదశలో ఉత్కంఠ గూడా పెరిగింది.రధయాత్ర మార్గంలోని రాష్ట్రాల ప్రభుత్వాధికారులకి తమ అధికార నిర్వహణ కత్తిమీదసాములాగ మారింది.రధయాత్ర మార్గంలో ప్రత్యక్షంగా హింస జరగకపోయినా పుకార్ల వల్ల కొన్ని చోట్ల పరోక్షంగా హింస చెలరేగింది.దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ యెక్కడ మతకల్లోలాలు జరిగినా అవి అప్పటి వరకూ ప్రశాంతంగా బతుకుతున్న అక్కడి ప్రజలు హఠాత్తుగా రెచ్చిపోయి ఇకరినొకరు చంపుకునేటంతగా ఒక్కసారి రెచ్చిపోయారనే ఆధారాలు లేవు!అలాంటి ప్రతి సంఘటన వెనకా హిందువుల్నీ ముస్లిముల్నీ కలవనివ్వగూడదనే ఒక వ్యూహం ఉంటుంది.పరిస్థితిని చక్కదిద్దడానికి వీపీ సింగు గారు స్వామినాథన్ కమిటీ వేశారు.అయోధ్య సమస్యకి అప్పటికీ ఇప్పటికీ ఉన్న మెలిక హిందువులకి గల క్షేత్రప్రాశస్త్యం పట్ల ఉన్న గట్టి పట్టుదల,ముస్లిములకి ఒకదానికి వంగితే అన్నింట్లోనూ వంచుతారు గాబట్టి ఒప్పుకోకూడదనే మంకుపట్టు!కాబట్టి అప్పటి మేధావులు వారి సమాలోచనలలో రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా సమస్యని పరిష్కరించడం తప్ప ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడం అసాధ్యమని తేలిపోయింది.ప్లాను:మసీదు చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని ప్రభుత్వం సేకరించి విశ్వ హిందూ పరిషత్ వారికి అప్పగించటం,బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం అట్టే పెట్టుకుని సుప్రీం కోర్టుకు విచారణ నిమిత్తం అప్పగించడం మంచిదని నిర్ణయించారు.అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసిన మొదట్లోనే జిల్లానీ గారు ప్రధానిని వ్యక్తిగతంగా కలిసి తమ అభిప్రాయాలకి విలువ ఇవ్వకుండా ఆర్డినెన్సు ద్వారా అయోధ్య సమస్యని పరిష్కరించడాన్ని వ్యతిరేకించాడు.ఆఖరుకి అప్పటి ప్రధాని చెయ్యగలిగింది మొదట ఒక ఆర్డినెన్సు చెయ్యటం,మరొక ఆర్దినెన్సుతో దాన్ని క్యాన్సిల్ చెయ్యటం!ఈ పిల్లిమొగ్గలతో అప్పటి కేంద్రప్రభుత్వాన్ని భాజపా వ్యతిరేకించటం,ఆ విభేదాల ప్రభావంతో బీహారు దాకా చేరిన అద్వానీ గారిని అరెస్టు చెయ్యటంతో రధయాత్ర ఆగిపోయింది.

అక్కడ అయోధ్యలో పరిస్థితి కూడా మరింత సంక్లిష్టంగా తయారయి కూర్చుంది.కరసేవకుల్నినియంత్రించడానికి సెక్యూరిటీ యెక్కువ చేశారు.అయినా లాభం లేకపోయింది - అనర్ధం జరగనే జరిగింది!యెలాగోలా తప్పించుకుని లోపలికి వెళ్ళిన కొందరు మసీదుని కూల్చడానికి ప్రయత్నిస్తుంటే పోలీసులు మరోదారి లేక కాల్పులు జరపాలి వచ్చింది.కొందరు కరసేవకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.రామాలయ నిర్మాణం ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోవడమే తప్ప యే హిందువూ ఒక్క ముస్లిముని కూడా చంపలేదు!అయినా ముస్లిములు జాలితోనైనా రామాలయ నిర్మాణానికి సానుకూలంగా ప్రతిస్పందించడం లేదు,యెంతకాలమీ కఠినత్వం చూపిస్తారు?

రధయాత్ర సమయంలో జరిగిన అల్లర్లలో ప్రాణాలు పోగొట్టుకున్న ముస్లిములకూ కరసేవ సందర్భంగా జరిగిన కాల్పులలో మరణించిన కరసేవకులకూ పేరుపేరునా వ్యాసపరాశరాది షిర్దీ సాయినాధ పర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన నా గురుపరంపర పాదాల సాక్షిగా నేను శిరసా ప్రణామం చేస్తున్నాను!

ఇది శ్రీ ధర్మహాస రామచంద్ర విజయేతిహాసము నందు చతుర్ధాధ్యాయము సంపూర్ణం
5.అయోమయం ప్రభుత్వాల నిర్వాకంతో మసీదు కూలిపోయింది,ఘోరమే!

రధయాత్రని నిలుపు చేసి కరసేవని ఆపేసిన కారణంగా భాజపా వీపీ సింగు పీక నొక్కేసింది.అవిశ్వాస తీర్మానంలో సభ విశ్వాసం పొందలేక వీపీ సింగ్ దిగిపోతే ఈసారి కాంగ్రెసు రంగంలోకి దిగి తనకి తోలుబొమ్మలా ఉపయోగపడే చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని యేర్పాటు చేసింది!ఈయన అవడానికి మంచి పార్లమెంటేరియనే గానీ యెంత గొప్పవాడి కయినా వేపకాయంత వెర్రి ఉంటుందన్నట్టు యెప్పటికయినా ప్రధాని అవ్వాలనే దురద ఒకటి తొలుస్తూ ఉండేది - కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టు అదిప్పుడు తీరింది!అయోధ్య సమస్యని పరిష్కరించాలనుకున్న వాళ్ళందరిలోకి కాస్త తెలివైన పధ్ధతి ఫాలో అయింది ఇతనే!సుబోధ్ కాంత్ సహాయ్ నేత్ర్త్వంలో 8 మంది హిందువులు,8 మంది ముస్లిములు,రాజస్థాన్ మహారాష్ట్ర ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఒక కమిటీ వేశాడు.రెండువైపులా దస్త్రాలు,మ్యాపులూ,కోర్టు తీర్పులూ లాంటి సామగ్రితో సిధ్ధం అయ్యారు - ఇప్పటివరకూ ఉర్రూతలూపిన సెంటిమెంటు స్థానంలోకి అసలు మసీదుని గుడిని కూల్చి కట్టారా అనే విచికిత్స వచ్చి చేరింది - కొంచెం మెరుగే!ఈలోపు రాజీవ్ గాంధీని యే పురుగు కుట్టిందో మామీద నిఘా పేట్టింది చంద్రశేఖర్ ప్రభుత్వం అని హడావిడి చేసి మద్దతు ఉపసంహరించుకోవడంతో దేశం యెన్నికలకి సిధ్ధమయింది.ఈ యెన్నికల ప్రచారం లోనే 1991 మే 21న శ్రీలంక తమిళ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో హతమై పోయాడు!ఆ సానుభూతి పనిచేసి కాంగ్రెసు మంచి మెజారిటీతో గెల్చి కాంగ్రెసులో నెహ్రూ కుటుంబానికి సంబంధించని తొలి వ్యక్తి పి.వి.నరసింహా రావు ప్రధాని అయ్యాడు.అయోధ్య యే రాష్త్రంలో అయితే ఉందో ఆ ఉత్తర ప్రదేశ్ మాత్రం భాజపా హస్తగతమయింది!



రాష్ట్రప్రభుత్వం రామాలయ నిర్మాణానికి అనుకూలమే గాబట్టి సాధువులు 1992 జులైలో రామభక్తు లందరికీ రామాలయ నిర్మాణానికి ఆహ్వానాలు పంపారు!అప్పటికే ప్రభుత్వం మసీదు చుట్టుపక్కల భూమిని స్వాధీనం చేసుకుని ఉన్నది!ఇదివరకు ఆగిపోయిన కరసేవ స్థానంలో ఈసారి యేకంగా రామాలయ నిర్మాణానికే సిధ్ధమై పోయారు.ప్రధానమంత్రి కలగజేసుకుని సాధువులతో మాట్లాడి మూడు నెలలు ఆగమంటే వాళ్ళు కూడా మూడు నెలలే కదా అని సరే నన్నారు.అక్టోబరులో గతప్రభుత్వం కొంత ఆశావహంగా కనిపించిన పనినే మళ్ళీ ఆ సుబోధ్ కాంత్ సహాయ్ ఆధ్వర్యంలో మొదలు పెట్టమన్నాడు.కానీ గడువు ముగిసిపోగానే విశ్వ హిందూ పరిషత్ మళ్ళీ పని మొదలెట్టటానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు వచ్చాయి.బతికితే రామభక్తి సామ్రాజ్యం చస్తే వైకుంఠం అనేటట్టున్న వాళ్ళని దేంతో భయపెట్టగలరు?దేంతో కొనగలరు?వాళ్ళంతే,యెవ్వరి మాటా వినరు!ఇటువైపు నుంచి ముస్లిములు కూడా వాళ్ళ ప్రయత్నాల్ని ఆపకుండా ఈ చర్చల్ని కొనసాగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.మళ్ళీ కార్యక్రమాన్ని మరోసారి వాయిదా వేయించగలిగారు - అదే 1992 డిసెంబర్ 6!



నవంబరు నుంచే భక్తుల సంఖ్య పెరుగుతూ కదలికలు అనుమాస్పదంగా ఉండటంతో భాజపా అగ్రనాయకులైన అద్వానీ వాజపేయిలతో ప్రధానమంత్రి సమవేశ మయ్యాడు,ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కూడా హాజరయ్యాడు.చర్చల్లో అగ్ర నాయకు లిద్దరూ మసీదుకు యేమీ జరగనివ్వం అని వాగ్దానం చేశారు.మొదట్లో రాష్త్రపతి పాలన పెట్టవచ్చుననే ఊహాగానాలూ వచ్చాయి.కానీ అది శాంతిభద్రతలు మరీ దిగజారిన పక్షంలోనే అటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే సాంకేతిక కారణం వల్ల ప్రధానమంత్రి అందుకు సుముఖత వ్యక్తం చెయలేదు.ముందుగానే అతిగా స్పందించకుండా పరిస్థితి తీవ్రతని బట్టి నిర్ణయం తీసుకోవాలనేది ప్రధానమంత్రి అభిప్రాయం.యెందుకంటే పంజాబులో స్వర్ణ దేవాలయం మీద అప్పటి ప్రధాని చేసిన సైనిక చర్య ప్రభావం అతనికి తెలుసు గనక!ఆనాటి సైనిక చర్య అప్పటి ప్రధాని ఇదే రాజనీతిజ్ఞుడు సలహాదారుడుగా ఉండి వద్దన్నా వినకుండా చేసిన భీబత్సమయిన పని తను చెయ్యగూడదని కూడా అనుకుని ఉండవచ్చు!ఇంటిలిజెన్స్ కూడా ప్రమాదకరమిన సంకేతాలు ఉన్నట్టు ధృవీకరించ లేదు.అక్కడ యేం చెయ్యదలుచుకున్నారు అన్నదాని మీద హిందువుల వైపు నుంచి రకరకాల మాటలు వస్తూ ఉన్నాయి!కొందరు రామాలయం నిర్మించడానికి వీలుగా మసీదుని వేరే చోటికి తరలిస్తామని చెప్తే కొందరు కరసేవ అంటే చీపుళ్ళతో శుబ్రం చెయ్యడం మాత్రమే అని నిర్వచనాలు చెప్తుండే వాళ్ళు - మొదట్లో కూల్చివెయ్యడం వాళ్ళ మాటల్లో రాలేదు!అక్కడికీ ముస్లిం ప్రతింధులు ప్రధానిని,"ఒకవేళ వాళ్ళు నిజంగానే మసీదుని కూల్చితే మీరు చెయ్యగలిగిందేమిటి?" అనడిగితే,"మీరు భారతదేశ ప్రధానితో మాట్లాడుతున్నారని గుర్తుంచుకోండి!భారత సైన్యాలు 24 గంటల్లోగా పొరుగు దేశాల్ని కూడా చేరగలవు,అయోధ్యని చేరుకోలేవా?" అన్నాడు ధీమాగా!



అతని ధైర్యాన్ని పటాపంచలు చేస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రజల నుంచి రామాలయ నిర్మాణానికి అనుకూలమైన తీర్పుతో అధికారంలోకి వచ్చిన కల్యాణ్ సింగ్ అతనికి సహకరించకపోవడంతో ఆ ఒక్కరోజులోనే సుమారు 460 సమత్సరాల తర్వాత ఒక ప్రాచీన కట్టడం నామరూపాలు లేకుండా కాలగర్భంలో కలిసిపోయింది!మొదటి కరసేవ నాడు చెయ్యాలనుకుని చెయ్యలేని వారు ఈసారి మరింత పట్టుదలతో పరిశ్రమించి తమ చిరకాల వాంచని నెరవేర్చుకున్నారు!ఆరోజు జరిగినది చాలామంది హిందువులకి కూడా కోపాన్ని తెప్పించింది!అంతరాంతరాల్లో గుడి కడితే బాగుండుననుకున్న వాళ్ళు కూడా అంత మొండిగా చెయ్యడం భావ్యం కాదని అనుకోవడం సహజంగా కదా!కానీ మరోలా జరగాలంటే ముస్లిములు తమ పట్టు విడవాలి, అది జరిగే అవకాశం లేదు - మరెట్లా గుడి కట్టాలి?ఇక బాబ్రీ మసీదు చుట్టూ మతావేశాల్ని పెనవేసుకుని దాన్ని కాపాడుకోవాలని అంతగా శ్రమించిన ముస్లిములు మాత్రం పూర్తి నిరాశలో కూరుకుపోయారు.జిల్లానీ గారి మాటల్లో చెప్పాలంటే,"మొదట చాలా నిరాశగా అనిపించింది,కానీ వెంటనే ధైర్యం తెచ్చుకోగలిగాం.ఇక్కడే బతకాలి గాబట్టి ఇలాంటి వాటికి సిధ్ధపడక తప్పదు!".కానీ అంత తొందరగా ప్రశాంతత యేర్పడ లేదు,అవకాశం కోసం యెదురు చూసి రెచ్చగొట్టే వర్గాలు ఉండనే ఉన్నాయిగా!సుమారొక సంవత్సరం పాటు యెన్నో మతపరమయిన విద్వేషాలకు సంబంధించిన అల్లర్లతో దేశమంతా అట్టుడికిపోయింది!ఇవన్నీ నిజంగానే భారతీయ ముస్లిము సమాజమంతటికీ రామాలయ నిర్మాణం పట్ల ఉన్న వ్యతిరేకతకి నిదర్శనమా?అవకాశం దొరికినప్పుడల్లా దేశాన్ని అభాసుపాలు చెయ్యడానికి చూస్తున్న విదెశీశక్తుల విషప్రచార ఫలితమా!

తమకేమాత్రం సంబంధం లేని యెక్కడో జరిగిన  సంఘటనకి ప్రతీకారం పేరుతో యెక్కడ బడితే అక్కడ జరిగిన అల్లర్లలో,దాడుల్లో,భీబత్సాల్లో తమకి సమబంధించిన వారు ప్రాణాలు కోల్పోయినా కొన్నేళ్ళ తర్వాత కూడా అన్యాయంగా చనిపోతున్నా మౌనంగా భరించటమే తప్ప ప్రభుత్వాల్ని యెందుకిలా జరుగుతుందని గానీ యెప్పటికి సమస్యని పరిష్కరిస్తారని గానీ నిలదియ్యని సహనశీలురైన సువిశాల భారత ప్రజానీకపు అజ్ఞానానికి వ్యాసపరాశరాది షిర్దీ సాయినాధ పర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన నా గురుపరంపర పాదాల సాక్షిగా నేను శిరసా ప్రణామం చేస్తున్నాను!

ఇది శ్రీ ధర్మహాస రామచంద్ర విజయేతిహాసము నందు పంచమాధ్యాయము సంపూర్ణం
6.దేముడున్నాడా లేడా అని కోర్టులు తేలుస్తాయా మన పిచ్చి గానీ?

ఒకే ఒక్క రోజు జరిగిన సంఘటన ఇన్ని దశాబ్దాలుగా ఒక దేశపు రాజకీయ చరిత్రని ప్రభావితం చెయ్యటం ప్రపంచంలో మరెక్కడా జరగలేదు!బాబ్రీ మసీదుని కూల్చిన దానికి ప్రతీకారంగా 1993లో జరిగిన ముంబై వరస పేలుళ్ళలో 250 మంది చావుకు కారణమైన కుట్రదారుల్లో ఒక నిందితుడే మొన్న ఉరితీయంబడిన యాకూబ్ మెమన్!2002లో రామజన్మభూమిని సందర్శించి వెళ్తున్న 60 మంది కరసేవకుల్ని గోద్రా సమీపంలో ఒక రైలు పెట్టెలో సజీవ దహనం చేస్తే దానికి ప్రతీకారంగా జరిగిన హత్యాకాండలో 1000 మంది ముస్లిములు చనిపోయారు!2008లో ముంబై ట్రిడెంట్ హోటల్ 20వ ఫ్లోరులో అక్కడ ఉన్న అతిధులకి తుపాకీ గురిపెట్టిన దుండగుడు,"బాబ్రీ మసీదు గుర్తుందా?" అని అడిగాడు!



దేశం నలుమూలలా జరుగుతున్న ఉత్కంఠభరితమైన పరిణామాలతో సంబంధం లేకుండా అలాహాబదు కోర్టు రూములో మరొక రకం యుధ్ధాలు నడుస్తున్నాయి!యెవరికి వారు తమ వాదననే నెగ్గించుకోవటానికి చూపించే సాక్ష్యలూ,రుజువులూ,డాక్యుమెంట్లతో 7X4 అడుగుల కైవారం గల 21 అల్మైరాలు నిండిపోయాయి!ఇవి చెదలు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి చాలా ఖర్చవుతుంది.వాదించే లాయర్లలో యెవరికీ లాభం ఉండదు.కేవలం మతాభిమానం కొద్దీ వాదించడమే!మొదట్లో కోర్టుల విషయం తెలియక జనం యెక్కువగా పోగయ్యేవాళ్ళు, తర్వాత అదీ తగ్గిపోయింది.1995లో మసీదు - మందిరం వివాదానికిసంబంధించి దాఖలైన కేసులన్నిట్నీ కలిపి అలహాబాదు హైకోర్టుకి సంబంధించిన లక్నో బెంచికి దఖలు పర్చేశారు.అన్ని కేసుల్నీ మదింపు చెయ్యగా మూడు పార్టీలు ప్రముఖంగా ఉన్నాయి.1.సున్నీ వక్ఫ్ బోర్డు2.నిర్మోహి అఖడా3.శ్రీ రామచంద్రుడు - దేవుడే వాది!
అన్నిట్లోకీ ఆఖరుదైన ఈ మూడో కేసు ఫైల్ చేసింది దేవకీ నందన్ అగర్వాల్ అనే రిటైర్డు జడ్జి!భారత దేశపు చట్టాలకు లోబడి అతను భగవాన్ శ్రీ రామ విరాజమాన్ అని సంబోధిస్తూ రాముణ్ణి ప్రధాన వాది గానూ తనని అతని పక్షాన వాదించే సహవాదిగానూ పేర్కొంటూ పకడ్బందీగా అసలు తన అనుమతి లేకుండా తన స్థలంలో కట్టినవి అక్రమ నిర్మాణాలు అవుతాయి గనక తనదైన స్థలాన్ని తనకు దఖలు పర్చవలసిందిగా రాముడు అడుగుతున్నట్టు కేసు వేశాడు!



యెవరికి వారు పోటీలు పడి సమర్పిస్తున్న ఈ ఆధారాలలో అసలు శాస్త్రీయత యేమిటో తేల్చాలని 2002లో కోర్టు వారు ఇండియన్ ఆర్కియలాజికల్ సర్వే వారి సహాయం తీసుకోలని నిర్ణయించుకున్నారు!తేల్చాల్స్న విషయం మసీదు కింద యేమి వుంది?ఖాళీ స్తలమా?హిందూ దేవాలయమా?ఈ మత విశ్వాసాలకి సంబంధిచినదీ పైగా కోర్టు తగాదాలో ఉన్న విషయం గురించి పరిశోధించటానికి మొదట్లో వ్యతిరేకత చూపించినా కోర్టు ఇచ్చిన వాగ్దానం మేరకు ఆ పని చెయ్యడానికి అంగీకరించింది.మొదట చేసిన ప్రయోగాల ద్వారా తవ్వకాలు అవసరమని తెలియడంతో మళ్ళీ వాటికి సంబంధించిన నియమాలు యేర్పరచి అడ్డంకులు తొలగించారు.మార్చి 2003లో పని మొదలుపెట్టి సుమారు 10,000 చదరపు అడుగుల భూమిని క్షుణ్ణంగా పరిశోధించి 272 పేజీల రిపోర్తును కోర్టుకు సమర్పించింది.వారి రిపోర్టు ఆ శిధిలాలు ఉత్తరదేశపు హిందూ దేవాలయ నిర్మాణ సాంప్రదాయాల కనుగుణంగా ఉన్నాయని తేల్చి చెప్పింది.పైగా కార్బన్ డేటింగ్ పధ్ధతిలో వాటి కాలాన్ని లెక్కిస్తే అవి క్రీ,పూ 13వ శతాబ్దికి సంబంధించినవి అని కూడా నిర్ధారించి చెప్పింది.కోర్టులో ఉన్న హిందువులు దాన్ని స్వాగతించగా వక్ఫ్ బోర్డు వారు మాత్రం రిపోర్టు యేక పక్షంగా ఉందంటూ 8 మంది సాంకేతిక నిపుణుల్ని కోర్తు ముందు హాజరు పర్చారు - అందులో 6గురు హిందువులు!నిజానికి ముస్లిములు ఈ ఆరుగురిని హిందువులుగా గుర్తించడం వల్ల వచ్చిన చిక్కు ఇది!వీరు రోమిల్లా డప్పారు వంటి రెండు నాల్కల హిందూద్వేషుల కూటమికి చెందిన పుర్రచేతి మేతావులు!వీరు పిచ్చి పుల్లయ్యల వంటి జర్నలిష్టుల దగ్గిర చెప్పిన వెధవ కబుర్లనే కోర్టుల్లో కూడా చెప్పి ఠలాయించితే చెల్లుతుందనుకున్న అహంభావులు!కోర్టు వారు వేసిన యే ఒక్క ప్రశ్నకీ సరైన జవాబు చెప్పలేక గట్టిగా తమ మాటలకి ఆధారాలు చూపించి కట్టుబడి ఉండనూ లేక  చచ్చీ చెడి శాయంగల విన్నపములై అన్నట్టు కోర్టువారు వేసిన యక్షప్రశ్నలకి ఉక్కిరిబికిరై బయటపడి అక్కడి తమ నిర్వాకాన్ని యెక్కడా చెప్పుకోకుండా బతుకులీడుస్తున్న వాహినీ వారి పెద్దమనుషులు!అసలు అయోధ్య ముఖం కూడా చూడకుండానే ASI నిగ్గుదేల్చిన నిజాల్ని తప్పు పట్టిన గొప్ప హేతువాద పుంగవులు - వీళ్ళ బతుకులు చెడ!దాంతో అంత కష్టపడి చేసిన పరిశోధన మొత్తం వ్యర్ధమైపోయింది, వీళ్ళ సపోర్టు లేకపోతే ముస్లిములు కూడా తీర్పుకి కట్టుబడి వుండేవాళ్ళేమో?!



2010 కల్లా ఇక ఇరువర్గాలూ వినిపించాల్సిన వాదనలన్నీ ముగిసిపోవటంతో కోర్టు 60 యేళ్ల క్రితం మొదలయి సుదీర్ఘ కాలం పాటు ఫలితం యెలా ఉంటుందో నన్న ఉత్కంఠని రేకిత్తించిన కేసుకి సంబంధించి ఒక తీర్పు ఇవ్వడానికి సిధ్ధపడింది!2010 సెప్టెంబరు 30న ఈ దేశప్రజలందరి చూపులూ అలహాబాదు వైపే ఉన్నాయి!కేవలం ఉత్తర ప్రదేశ్ రాష్త్రంలో 190,000 మంది పోలీసులూ పారా మిలిటరీ దళాలు మొహరించాయంటే మిగతా దేశమంతటి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు!ముగ్గురు జడ్జీలు - ఒక ముస్లిము,ఇద్దరు హిందువులు కలిసి మెజారిటీ నిర్ణయం ప్రకారం ఇచ్చిన తీర్పులో ఆ పావు-ఎకరం భూమినీ మూడు సమాన భాగాలు చేసి మూడు పార్టీలకీ పంచమని తీర్పు ఇచ్చింది.మసీదు యొక్క అంతర్భాగం దేవకి నందన్ అగర్వాల్ గారు పేర్కొన్న రామ్ లల్లాకే అప్పగించారు!యే ఒక్క పక్షానికీ పూర్తిగా ఫిరాయించకుండా భూమిని సమానంగా పంచాలనడం యే పార్టీనీ సంతృప్తి పర్చలేక పోయింది.మీడియా చర్చల్లో కూడా తీర్పు గురించి మాట్లాడిన వారంతా కర్రా విరగలేదు పామూ చావలేదట్టుగా ఉంది అని పెదవి విరిచారు!కానీ న్యాయమూర్తులేమి చేయగలరు - గట్టిగా కొడితే కర్ర విరుగుతుంది నిజమే,యేదో ఒక పాము చావడమూ ఖాయం,అయితే యే పాముని చంపాలి?హిందువులు తీర్పుని తమకనుకూలంగానే అన్వయించుకున్నారు,ముఖ్యంగా అద్వానీ గారు,"కోర్టు తీర్పు కేవలం ఉద్రిక్తతల్ని రాకుండా చూసింది,కానీ రామాలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది" అన్నాడు!వాదుల అభ్యర్ధనతో సుప్రీం కోర్టు రంగంలోకి దిగి అలహాబాదు హైకోర్తు తీర్పు వెంటనే అమలు కాకుండా స్టే ఇవ్వదంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు - కొద్ది రోజుల్ల్లోనే కామన్ వెల్త్ క్రీడలు మొదలవబోతున్నాయి మరి?!

తమ చుట్టూ చెలరేగుతున్న రాజకీయ విద్వేషాలను యేమాత్రం పట్టించుకోకుండా కేవలం న్యాయానికే కట్టుబడి తమ పరిధిలో ప్రజలకు సమానత్వాన్ని ప్రతిపాదిస్తూ ఈ దేశప్రజల ఔన్నత్యం మీద నమ్మకంతో ఈ దేపు మట్టిమీద పుట్టిన ప్రతి ఒక్కరి వివేకానికీ ఒక గంభీరమైన చాలెంజి విసిరే చాతుర్యంతో కూడిన అధ్భుతమైన తీర్పు ఇచ్చిన ఆ ముగ్గ్గురు న్యాయమూర్తులకూ వ్యాసపరాశరాది షిర్దీ సాయినాధ పర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన నా గురుపరంపర పాదాల సాక్షిగా నేను శిరసా ప్రణామం చేస్తున్నాను!

ఇది శ్రీ ధర్మహాస రామచంద్ర విజయేతిహాసము నందు షష్ఠమాధ్యాయము సంపూర్ణం
7.ఈ మొత్తం కధంతా విన్నాక ఇప్పుడేం చెయ్యాలయ్యా అంటే!

మొదట్లో రామాలయ నిర్మాణం కోసం అన్నిటికీ తెగించి పోరాడిన భారతీయ జనతా పార్టీ కేవలం సంకీర్ణ ప్రభుత్వాన్ని మాత్రమే యేర్పాటు చెయ్యగలగడంతో సంకీర్ణ మిత్రుల అభ్యంతరాలకు తలవొగ్గి రామాలయ నిర్మాణాన్ని తన యెజెండా నుంచి తొలగించి లౌకిక పంధాకు మళ్ళింది!2004,2009 వరుస యెన్నికల్ల్లో ఆ పార్టీ ఓడిపోయి కాంగ్రెసుకే అధికారాన్ని అప్పగించేసింది.భాజపా కాంగ్రెసు - రామ జన్మభూమిని చెరోరకంగా వాడుకోవాలనుకున్న రెండు పార్టీలకే సాధారణ మెజారిటీ తప్ప అధ్భుత విజయాలు దక్కలేదు!ఈ వివాదం వల్ల రెండుగా చీలిన వోటర్లలో ముస్లిములను వారికి రక్షకులుగా నిలబడి తమ వైపుకు లాక్కోవడంలో ములాయం సింగ్ యాదవ్ లాంటివారు కృతకృత్యులవడంతో ఇక భవిష్యత్తులో కూడా అఖండమైన మెజారిటీ వస్తుందనే ఆశలు నీరుగారి పోయాయి.ఇంక లాల్ కృష్ణ అద్వానీ మొదలు ప్రముఖ విశ్వ హిందూ పరిషత్ నాయకులంతా మసీదు విధ్వంసానికి కారకులుగా కోర్టులు నిర్ధారించటం వల్లనూ లిబర్హాన్ కమిషన్ వంటి వాటిలో కూడా దోషులుగా తేలడం వల్లనూ వారిని రక్షించుకోవడానికి తల్లకిందు లవుతున్నారు!ఇప్పుడు భాజపాలో రామ్ లల్ల్లాని తలిచేవారు లేరు!యెద్దు పుండు కాకికి రుచి అన్నట్టుగా ఉన్న మీడియా వాళ్ళెవరయినా కెలికితే ఆకుకీ పోకకీ అందని సమాధానాలు చెప్తారు - రాముడేమి వోటుబ్యాంకు?

ఇప్పుడు రామ్ లల్లా యెలా ఉన్నాడో తెలుసా?మసీదు కూలుస్తున్న హడావిడిలో కొందరు గబగబా లోపలి కెళ్ళి ఆ విగ్రహాలను బయటికి తీసుకొచ్చి ఒక తాత్కాలిక విడిదిలో చాలా నిరాడంబరంగా ఉంచారు.పాపం అప్పటి వరకూ అన్నిరోజులు మసీదు లోపలి కెళ్ళి పూజలు చేసిన ఆత్మీయత వల్ల కాబోలు ఆ పూజార్లకి కూడా బాధగా అనిపించిందట మసీదుని పడగొడుతుంటే!ఆ ప్రాంతమంతా ఇప్పుడు కేంద్రప్రభుత్వం అధీనంలో ఉంది.చుట్టూ పసుపుపచ్చని బద్దీలతో ఫెన్సింగ్ కనబడుతుంది.సెక్యూరిటీ చెక్ పోష్టుగా ఉన్న ఒక నడవా దాటి లోపలికి వెళ్ళాలి.సందర్సకుల నుంచి స్వాధీనం చేసుకున్న పెన్నులూ,క్యామెరాలూ చిందరవందరగా పడి ఉంటాయి.2000 మందికి పైగా పహరా కాస్తూ ఇసుక బస్తాలతో ట్రెంచీలతో ఆలయాన్ని కాకుండా యుధ్ధభూమిని తలపించేటట్టు ఉంటుంది!అలాంటి మార్గంలో భయం పుట్టకుండా వుండేందుకు మరింత భక్తితో రామ్ లల్లాని తలుచుకుంటూ సుమారు 200 అడుగులు వేస్తే ఒక చిన్న బోర్డు కనబడుతుంది.ఆ తర్వాత ఒక తెల్లని టార్పాలిన్ కింద గాలికి చుట్టూ ఉన్న దిట్టమైన ముఖమల్ తెరలు వూగుతుండగా నేనెక్కడుంటే అదే వైకుంఠం అన్నట్టు దర్శనమిస్తాడు ఆనాటి పధ్నాలుగేళ్ళ వనవాసాన్నీ నవ్వుతూ గడిపేసిన రామ్ లల్లా!ఆ టార్పాలిన్ బుల్లెట్ ప్రూఫ్,వాటర్ ప్రూఫ్,ఫైర్ ప్రూఫ్ కాబట్టి ప్రస్తుతానికి రామ్ లల్లా క్షేమంగానే ఉన్నట్టు లెఖ్ఖ.అతి సాహసంతో కరసేవకులు చేసిన దుర్మార్గం రాముడినే ఆలయహీనుడిగా చేసింది?!

తరాలు గడిచిపోతున్నాయి!నిర్మోహి అఖడా వారి తరపున కోర్టులో వాదిస్తున్నది మూడో తరం లాయరు.సాక్షుల్లో కూడా కొత్త తరం యెక్కడో అమెరికా వంటి సంపన్న దేశాలలో మంచి జీవితాన్ని వదులుకుని తండ్రుల నుంచి కేసులో ప్రాతినిధ్యాన్ని అందుకుంటూ వస్తున్నారు - మతావేశం అలాంటిది!నిర్మోహీ అఖడా వారు కోర్టు ఖర్చుల కోసం కొన్ని ఆస్తుల్ని కూడా అమ్ముకున్నారు!అయోధ్యలో సీ ఆర్ పీ ఎఫ్ వాళ్ళూ పోలీసులూ అడుగడుగునా ఉన్నారు.ఒంటి మీద షర్ట్ కూడా లేని అన్సారీకే నలుగురు పోలీసులు 20 సంవత్సరాలుగా కాపలా కాస్తున్నారు.ఒక్కొక్కరికీ కనీసం 30 వేల జీతం అనుకున్నా 92 ఏళ్ళ వ్యక్తికే నెలకి లక్ష్హా 20 వేల ప్రభుత్వ ధనం ఖర్చు అవుతుంటే మిగతా ప్రముఖ నిందితులకి ఎంత మంది పోలీసులు ఉంటారో ఊహించండి.మొత్తం మీద 300 వందలకు పైగా పోలీసులు ఖాళీ స్థలాన్ని కాపలా కాస్తున్నారు.1995 నుండి ఇప్పటివరకూ రామజన్మభూమి పై ఎంత ఖర్చు పెట్టారో సహ దరఖాస్థు ద్వారా అడిగితే 2014 వరకూ కేవలం 12 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టినట్లు చెప్పారు.ఒక్క వ్యక్తి రక్షణకే నెలకి లక్ష పైగా ఖర్చు పెడుతుంటే మొత్తం మీద 12 కోట్లు అంటే నమ్మబుద్ధి కావడం లేదు.

హిందువులలో మొదటి నుంచీ ఐక్యత లేదు,ఇకముందు కూడా రాదు!వింత యేమిటంటే తమ కులాలు అణచివేతకి గురయ్యాయి అని దళిత మేధావులు వూదరగొడుతున్నారు గానీ క్షేత్రస్థాయిలోని అదే నిమ్న కులాల వారు హిందూమతం నుంచి విడిపోకపోగా రాముడిని ఇష్టపడతారు.తొలి రధయాత్ర నాడు సరయూ నదిలో ప్రతిజ్ఞ చేసిన వారిలో అన్ని కులాల వారూ ఉన్నారు!ధర్మసంసద్ కూడా యెన్నో మంచి తీర్మానాలు చేసింది,యేమి లాభం?హిందూమతం ప్రమాదంలో పడిందని ఒప్పుకుంటున్న ఇప్పుడు కూడా గట్టి మేలు తలపెట్టకపోతే ఇంకెప్పుడు చేస్తారు!ఈ దేశపు సంస్కృతి మీద విషం కక్కే నాస్తికులూ,కమ్యునిష్టులూ,కొత్తగా క్రైస్తవం తీసుకున్న దళిత మేధావులూ హిందూ మతంలో ఉన్న మంచిని కూడా గుర్తించని స్థితిలో ఉంటే అయోధ్యలో రాముడికి గుడి కట్టడం కోసం వీరిని ఆమోదింప జెయ్యగలమా?నా దృష్టిలో రామాలయ నిర్మాణంకోసం హిందువుల్ని ఒప్పించడం కన్నా ముస్లిములని ఒప్పించడమే తేలిక!

ముస్లిములు ఇదివరకటిలా లేరు!దానికి గోద్రా అల్లర్ల గురించి కాంగ్రెసు పార్టీ కమ్యునిష్టు పార్టీ తదితరులూ యెంత వూదరగొట్టినా వారి మాట వినకపోవటమే సాక్ష్యం!ముస్లిములు కాంగ్రెసుకి దూరంగా జరిగి ములాయం సింగ్ లాంటివాళ్ల వైపుకి జరిగినా అది తాత్కాలికమే, వాళ్ళ ప్రభుత్వం మీద కూడా తీవ్రస్థాయిలో నిరసనలు చేశారు గదా!మొత్తం మీద ఈ వోటుబ్యాంకు రాజకీయం పట్ల పూర్తిగా కాకపోయినా క్రమక్రమంగా భ్రమలు తొలగించుకుంటున్న దశలో ఉన్నారు!ఇవ్వాళ ముస్లిం సమాజంలో మూడు రకాల వారు ఉన్నారు.1).ఇన్నేళ్ళ నుంచీ ప్రభుత్వాలు రిజర్వేషన్ల పేరుతో చేసే వ్యవహారాలలో చిత్తశుధ్ధి లకపోవడం తో పుట్టడమే బీదవాళ్ళుగా పుట్టి బీదరికంలో మగ్గి పోతున్న వాళ్ళు:వీళ్ళే అతి తేలిగ్గా తప్పుదారికి వెళ్తున్న వారు,యెందుకంతే చదువు లేదు,ఉపాధి లేదు,పిచ్చెంకించే జీవితం - ఇలాంటి వారు యెక్కువగా ఉన్న చోట ఒక సభ పెట్టి కొన్ని కాకిలెక్కలు యేకరువు పెడుతూ గొప్ప వాక్చాతుర్యం ప్రదర్సిస్తే చాలు అక్కడి నుంచి కనీసం 10మంది ఉగ్రవాదులు తయారవడం ఖాయం!2).మధ్యతరగతి/ఉన్నతతరగతి ఆదాయవర్గాలు:చిన్నపట్నించీ మంచి చదువూ,సాటి హిందువులతో స్నేహమూ,మంచి ఉద్యోగ జీవితం,సమాజంలో పొందగలిగిన గౌరవాల్ని పొందడం - వీటన్నింటితో ఉదారంగా ఉండగలరు!వీరిలో రాజకీయాల పట్ల ఆసక్తి పుడితే మాత్రం తమ హిందూ స్నేహితులతో వ్యాపార స్నేహ సంబంధాలు చెడగొట్టుకోకుండానే మూడవ తరగతికి జంప్ కాగలరు,ఇవ్వాళ ముస్లిముల కోసం నిలబడటం అంటే అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించటమనే సులువైన దాని నెవరు వదులుకుంటారు?3).తమ రాజకీయ మనుగడ కోసం మొదటి వర్గాన్ని వాడుకోవాలనుకుంటున్న వాళ్ళు:అన్ని పార్టీలూ ఒకే పధ్ధతిలో గాలమేస్తున్నాయి గాబట్టి ప్రత్యేకించి ఒక పేరు చెప్పడం అనవసరం!అయోధ్య వివాదం లోని ఒక కక్షిదారైన వక్ఫ్ బోర్డులో ఉన్న షియా వర్గం చాలా ఉదారంగా హిందువులకి తమ అధీనంలోని భూమిని ఇచ్చివేసి రామాలయ నిర్మాణానికి అనుకూలంగా వుంటే సున్నీ వర్గం వారు మాత్రమే దిగి రావడం లేదు?!

ఒకసారి చేసిన దుందుడుకు పని వల్ల జరిగిన అనర్ధంతో సాధుసంతులూ కరసేవకులూ కూడా ప్రస్తుతానికి తగ్గి వున్నారు.మళ్ళీ వీరికి ఆవేశం పుడితే పరిస్థితి మరీ దిగజారుతుంది.ఈ లోపు రామభక్తులు కొంచెం వివేకంతో వ్యవహరించి విశాల ముస్లిం సమాజం లోని ఉదారవాదుల్ని కదిలించితే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగవచ్చు!అయోధ్యలోని ముస్లిములు కూడా గుడి కట్టడానికి సుముఖంగానే ఉన్నారు.యెందుకంటే,నిరంతర పోలీసు పహరాతో,యెటూ తెగని ఒక సమస్య వల్ల ప్రశాంతత లేకపోవడంతో అయోధ్య నగరాభివృధ్ధి కూడా ఆగిపోయంది!దేశమంతటా ఉన్న సామాన్య ముస్లిములలో చాలామంది తమ చుట్టూ ఉన్న హిందూ సమాజంతో కలిసిపోయి ఉన్నావారే!బిస్మిల్లా ఖాను గార్ని యెవరయినా హిందువు అగౌరవ పర్చిన దాఖలాలు ఉన్నాయా? బాలీవుడ్ సామ్రాజ్యంలో ఇవ్వాళ్టి రోజున ఖాన్ త్రయమే కదా తిరుగు లేని సూపర్ స్టార్లు!కలాం గారు చనిపోతే హిందువులు కూడా ఆత్మబంధువు చనిపోయినట్టు యేడ్చారు కదా!

హిందువులలో ఆలయనిర్మాణానికి ఉండే క్షేత్రప్రాశస్త్యం పట్ల గల వ్యామోహాన్ని గుర్తించి విశాల ముస్లిం సమాజం చొరవ తీసుకుంటే గానీ రామాలయ నిర్మాణం సాధ్యపడదు! అలాంటి ఉదారులైన ముస్లిం సోదరులకి నా వైపు నుంచి నేను రెండు ప్రతిపాదనలు చేస్తున్నాను.2010లో అలహాబాదు హైకోర్టు తీర్పు ప్రకారం మాకు సంక్రమించిన భాగంలో మేము ధర్మహాస(అక్కడ ధర్మం చల్లగా నవ్వుతుంది గనక!) రామచంద్రుణ్ణి ప్రతిష్ఠించుకుంటాము.మీరు మీకు సంక్రమించిన భూమిలో మొహమ్మద్-ఇ-మస్జీద్ కట్టుకోవచ్చును!బాబరు ఒక రాజు,అందరు రాజులలాగే అతడూ మసీదు కూల్చడం మాత్రమే కాకపోయినా ఇతరమైన తప్పులు కూడా చేసి ఉండొచ్చు - అంతకన్నా ప్రవక్త పేరుని మసీదు పేరులో చేర్చుకోవటం మరింత గొప్పగా ఉంటుంది కదా!లేని పక్షంలో వక్ఫ్ బోర్డులోని షియా వర్గం వారి వలె ఆలోచించి భూమిని పూర్తిగా హిందువులకి దఖలు పర్చడం - మీరు యేమార్గం అనుసరించినా హిందువులు మీకు కృతజ్ఞులై ఉంటారు!85% ఉన్న హిందువుల మందబలంతో పని జరిపించుకోవాలని అనుకుని ఉంటే నేను ఈ ప్రసంగాన్ని కేవలం రామభక్తులకు మాత్రమే చేసేవాణ్ణి - రామాలయ నిర్మాణం జరిగితే అది ముస్లిం సోదరుల చొరవ వల్లనే జరుగుతుంది!దేశ విభజన సమయం నుంచీ ఈ రెండు సోదర జాతుల మధ్యనా యెన్నో గాయాలు ఉన్నాయి!గాయాలు అంటూ ఉంటే బుధ్ధిమంతుడు కడిగి శుభ్రం చేసుకోవాలని చూస్తాడే గానీ వాటిని అనంతకాలాల వరకూ మోసుకు పోవాలని అనుకోడు గదా!పదే పదే కెలికినందువల్ల మళ్ళీ మళ్ళీ అశాంతి రగలడం తప్ప యెవరికీ ప్రయోజనం లేదు!

బాబర్ రామమందిరం కూల్చి కట్టాడన్నది హిందువుల వాదం.అది హిందువులదే అని నిరూపించండి మేము స్వచ్చందంగా వదలి వెళ్ళిపోతాము అన్నది ముస్లింల వాదం.త్రేతాయుగం నాటి కట్టడం గురించి కలియుగంలో తీర్పుని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి స్థలాన్ని ముగ్గురికీ పంచడం జరిగింది కానీ తీర్పు హిందూ మత విశ్వాసాల ఆధారం గా జరిగిందన్నది ఇరువురి వాదన.ఇరువర్గాలూ కోర్టు బయట పరిష్కరించుకోవాలని చెప్పడం ఒక విశేషం.ఇరువర్గాలకూ మధ్య ఒకరు కూడా సరి అయిన వ్యక్తులు పనిచేయడం జరగలేదు!బాబ్రీ మసీదు మాదే కనుక మాకు ఇవ్వాలని ముస్లింలూ, భారత దేశంలో ముస్లింల పెత్తనం ఏమిటని హిందువులూ వాదించుకోవడం ఆపి సమస్య పరిష్కారానికి ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది.సమస్య పరిష్కరింపబడకపోవడం వల్ల ఇరువర్గాలకూ నష్టం జరుగుతున్నది. ప్రతి నెలా ఖాళీ స్థలం కోసం లక్షల ప్రజాధనం వృధా అవుతున్నది. గత ఇరవై సంవత్సరాలలో ఎంత ప్రజాధనం వృధా అయినదో ఇరువర్గాలూ ఆలోచించవలసిన అవసరం కనిపిస్తున్నది. రాజకీయంగా ముస్లింలు ఎదగకపోవడమూ అపరిష్కృతంగా ఉన్న అయోధ్య వివాదమే కారణం కాబట్టి అయోధ్య సమస్య పరిష్కరించి  ఒక నిర్ధిష్ట అభిప్రాయాన్ని ఏర్పరుచుకునేలా వ్యవహరించాలని ఇరువర్గాలనూ కోరడం జరిగింది.

రామజన్మభూమిలో మరొక వర్గం అయిన నిర్మోహీ అఖాడా కూడా మత పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. రాముడే స్వయంగా తన స్థలంకోసం వాదించుకుంటున్నాడని తెలిపే వీ హెచ్ పీ మాత్రం  మొండిగా వ్యవహరిస్తూ, రాముడి విషయంలోనూ, రామజన్మ భూమి విషయంలోనూ ఎవరి మాటా వినేది లేదని మొండిగా వ్యవహరించడం జరుగుతున్నది.రాముని స్థలం రామునిదే కనుక ఎవరికీ ఏమీ ఇవ్వనవసరం లేదనీ, నిరూపించుకోవలసిన అవసరమే లేదనీ పార్లమెంట్ లో బిల్లు పెట్టి స్థలాన్ని స్వాధీన పరుచుకుంటామనీ  తెలిపింది.రామజన్మ భూమి రామునిదే అయితే అన్ని సమస్యలూ పరిష్కరించబడి సర్వమానవ సౌభాతృత్వం నెలకొంటుందని ఆశిస్తాను. ఆ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరుకుంటున్నాను. రాముడు ధర్మానికి ప్రతీక గా చెపుతారు కాబట్టి ధర్మబద్ధంగా రామాలయం నిర్మించబడాలని ప్రతి ఒక భారతీయుడు కోరుకోవాలనీ బలవంతంగా ఏ ఒక్కరినీ బెదిరించకూడదనీ ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నాను.

ఒకప్పుడు పందిని చంపి ముస్లిముల జనావాసాల మధ్య పడవేసి ఆవుని చంపి హిందువుల జనావాసాల మధ్య పదవేసి చీప్ ట్రిక్కులు చేస్తే ఇవ్వాళ పుకార్లతో మీడియా సాక్షిగా విషప్రచారాలు చెస్తూ కావాలని జరిపించినవే తప్ప యే మతకలహం లోనూ సామాన్యప్రజలు వాటిల్లో స్వచ్చందంగా పాల్గొనలేదు!ఒకచోట పేలుతున్న బాంబు యెక్కడ తయారవుతున్నది?యెవరు దానికి తయారీ ఖర్చుల్ని సమకూరుస్తున్నారు?యెవరు వాటిని ఫలానా చోటుకి చేర్చడానికి వాహనాలని యేర్పాటు చేస్తున్నారు?విధ్వంసం కూడా లాభసాటి వ్యాపారమే - కొందరికి ఆదాయ మార్గమే?!

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సహకరించే మంచి మనసు గల ప్రతి ముస్లిం సోదరుడికీ పేరుపేరునా వ్యాసపరాశరాది షిర్దీ సాయినాధ పర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన నా గురుపరంపర పాదాల సాక్షిగా నేను శిరసా ప్రణామం చేస్తున్నాను!

అల్లా హో అక్బర్!శ్రీ రామ జయం!

30 comments:


  1. మీరు చరిత్రనంతా సవ్యాఖ్యానంగా బాగా వివరంగా రాసారు.నిజమే.ప్రాచీన కాలంలోను ,మధ్య యుగాల్లోను ఎన్నో ఘోరాలు జరిగాయి.ముస్లిములు మాత్రమే కాదు.ఇంకా చాలామంది ఇలా చేసారు.అలెగ్జాండర్ పెర్సిపోలిస్ ని ధ్వంసం చేసాడు.చెంఘిజ్ ఖాన్(బౌద్ధుడు) ముస్లిం నగరాలు ఎన్నో నాశనం చేసి లక్షలాది ప్రజల్ని చంపించాడు.యూరపియన్లు అమెరికన్ నాగరకతల్ని ఎన్నో నాశనం చేసారు.అంతెందుకు 20 వ శతాబ్దంలోనే హిట్లర్ లక్షలాది యూదుల్ని చంపించాడు.అందువల్ల ఇప్పటికేనా సహనం స్నేహభావంతో విశ్వజనులందరూ మెలగాలి.
    ఐతే రామజన్మభూమి లో దేవాలయం కట్టాలి అనే నా అభిప్రాయం .ఐతే కూల్చివేసిన మసీదు స్థానే ఒక మసీదుని దగ్గరలో నిర్మించవచ్చును.దీనికి ఒక పరిష్కారం కుదర్చవచ్చుననే అనుకొంటున్నాను.రామజన్మభూమి గురించి అంత గొడవ చేసిన B.J.P.ఇప్పుడు అధికారంలో ఉండికూడా మిన్న కుండానికి కారణమేమిటి?

    ReplyDelete
    Replies
    1. అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పు ఆ విధమయిన పరిష్కారాన్నే సూచించింది!కానీ ఇరుపక్షాల్లో యెవరికీ నచ్చలేదు.సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకుంటే స్టే ఇచ్చింది.దాని తర్వాత అడుగు ముందుకు పడలేదు.

      అప్పుడు జరిగిన దానికి ముస్లిములని విమర్సించి ప్రయోజనం లేదు!గుడి కట్టాలంటే ముస్లిముల సహాయం తప్పనిసరి!

      Delete
    2. >>రామజన్మభూమి గురించి అంత గొడవ చేసిన B.J.P.ఇప్పుడు అధికారంలో ఉండికూడా మిన్న కుండానికి కారణమేమిటి?

      ans:కరసేవకులు అంత మూర్ఖంగా మసీదును కూల్చెయ్యటమే!అది మూడు విధాలుగా చెరుపు చేసింది.

      1). అంత పెద్ద జనసమూహం మీద కేసు పెట్టటం కుదరకనో యేమో నాయకులు 8 మంది మీద కేసు పెట్టారు.ఆ సమయానికి అక్కడ ఉండి ప్రసంగాలు చేశారు గనక కోర్టులూ లిబర్హాన్ కమిషనూ కూడా వాళ్ళని తలంటు పొయ్యడంతో నాయకులు తర్వాత దశల్లో ఇక నాయకత్వం వహించడంలో మొహం చెల్లక వెనక్కి తగ్గారు!నిజానికి అలా చేస్తారని అద్వానీకి తెలిసి ఉండకపోవచ్చు. అద్వానీ ఆపాలని ప్రయత్నించటం నాటకం అంటున్నారు గానీ సంచుల్లో పారలూ పలుగులూ పెట్టుకుని పూజాసామగ్రి అని చెప్పి అంత దుర్మారం చేసిన వాళ్ళు అవన్నీ నాయకులకి తెలియకుండానూ నాయకుల మాట వినకుండానూ సొంత తెలివి చూపించి ఉండొచ్చు!అచ్చు షేక్స్పియర్ వర్ణించిన రోమన్ మాబ్ లాగ ప్రవర్తించారు. యేమయితేనేం,తర్వాత నాయకులు మూతికాలిన తెనాలి రామలింగడి పిల్లులయ్యారు!

      బహుశా అద్వానె కూడా తన మాట వినే పరిస్థితి లేకపోవటంతో పుట్టిన విరక్తి వల్ల గానీ తను ఆపాలని ప్రయత్నించినా కరసేవకులు చేసినదానికి తను అపకీర్తి మూటగట్టుకోవటం మూలంగా చిరాకు పుట్టి రామజన్మభూమి ఉద్యమానికి దూరమయి ఉందవచ్చు.లిబర్హాన్ కమిషన్ రిపోర్టునీ కోర్తుల చివాట్లనీ పట్టించుకోకుండా అద్వానె బృందాన్ని అడ్డగోలుగా రక్షించుకోవడంలో మునిగిపోయింది భాజపా!

      2) అంత మూర్ఖంగా కూల్చెయ్యటం రామాలయాన్ని కోరుకుంటున్న హిందువుల్లో అధిక సంఖ్యాకూలకి కూడా తిరస్కారం పుట్టించింది.
      3).వోటర్లు రెండుగా చీలిపోయి ముస్లిములు భాజపా వ్యతిరేక వర్గమైన ములాయం లాంటి వాళ్ళ వైపుకి జరగ్టంతో భాజపాకి ధీమాగా ప్రభుత్వం తరపున చొరవ చేసి ఆలయం కట్టటానికి తగిననత మెజారిటీ రాలేదు.ఇక ముందు రాదు కూడా!

      చాలా పెద్ద పోష్తు,అధ్యాయాలుగా ఉంటుంది.ఆఖరి భాగంలో అన్ని కారణాల్నీ విశ్లేషించాను!

      Delete
  2. సర్వధర్మసమభావన గల హిందువులకి బాధ కలిగింది ముస్లిములు మసీదు కట్టుకున్నందుకు కాదు,అప్పటికే అక్కడ ఉన్న తమ దేవాలయాన్ని కూల్చి కట్టుకున్నందుకు!

    దేవాలయాన్ని కూల్చి కట్టారని మీరు సమర్ధించుకున్నంతకాలం విషయం ఒక్క అడుగు కూడా ముందుకు పడదు.బీ జే పీ లోనే ఎవరూ నిరూపించలేకపోగా న్యాయస్థానం కూడా హిందూ మనోభావాలకనుగుణంగానే తీర్పు ఇచ్చింది తప్ప దేవళం పగలగొట్టారని ఒప్పుకుని కాదు.తులసీదాసు,కబీర్ అప్పటివాళ్ళే కదా ? వాళ్ళు ఎక్కడా రామాలయ కూల్చివేత గురించి ప్రస్థావించలేదు.కవులందరినీ,రచయతలందరినీ భయపెట్టడం ఎవరికైనా సాధ్యపడుతుందా ?

    ReplyDelete
    Replies
    1. అది అప్పటి చారిత్రక వాస్తవం.కవులు,కళాకారులు తమకు నచ్చిన్ అవిషయాలనే రాస్తారు.నెగటివ్ సంగతులు రాయడం రాయకపొవడం వారి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది.ముస్లిములు వందే మాతర గీతాన్న్ని వ్యతిరేకించడానికి ఒక సమర్ధనని చెప్తారు.అది సంతాలుల తిరుగుబాటుకి సంబంధించిన కధ.ఆ తిరుగుబాటు కధలో ముస్లిముల మీద విమర్శలు ఉంటాయి.కానీ తిన్నగా ఆంగ్లేయుల మీద బాణం యెక్క్కుపెడితే అసలు పుస్తకమే నిషేధానికి గురయి ఉండదెదని రచహయిత వైపు నుంచి సమర్ధన వున్నా ముస్లిమూలఓ ఆ రచన పట్ల వ్యతిరేకత అలానే ఉండిపోయింది!

      కావ్యాలు ఆనాటి చరిత్రని గట్టిగా ప్రస్తావించవు!

      Delete
    2. @neeaarika
      న్యాయస్థానం కూడా హిందూ మనోభావాలకనుగుణంగానే తీర్పు ఇచ్చింది తప్ప దేవళం పగలగొట్టారని ఒప్పుకుని కాదు.

      anas:కోర్టు హిందువుల మనోభావాలకు విలువ ఇచ్చి తీర్పు చెప్పిందంటే నమ్మడం కష్టం!తీర్పు ఇచ్చిన జడ్జిల్లో ఒక ముస్లిం కూడా వున్నారు.విలేఖరులు ఆయన్ని గుడి కూల్చి మసీదు కట్టటం గురించి అడిగితే అప్పటికప్పుడు కూల్చి కట్టారని అనలేము,అంతకు మందే కూలిపోయి ఉన్న శిధిలాల మీద కట్ట్టి ఉండవచ్చు అని ఉభయతారకమైన జవాబు చెప్పాడు!ముస్లిము కాబట్టి జడ్జి కూడా మెజారిటీ/మినారిటీ మనస్తత్వానికి లొంగి అలా మాట్లాడాడు అంటే చెయ్యగలిగింది లేదు,కానీ లోపాయకారీగా నయినా కోర్టుకు సమర్పించబడిన వివరాల్ని బట్టి అతనికీ మసీదు కట్టకముందు గుడి ఉండేదని అనుకుంటున్నట్టే గదా!అంతకన్నా జనాన్ని ప్రశాంతంగా ఉంచగలిగిన తీర్పు యెవడూ ఇవ్వలేడు.

      ఇక హిందూ జడ్జిల నయితే అది నిజంగా రామజన్మభూమీయనా అనడిగితే "యెవరు రాముడు?రాముడనగా నమ్మకం!నమ్మంకమనగా నేమి?అది..." అని వేదాంతాలు చెప్పడం మాత్రం నిజం:-)

      Delete
  3. >>>అయితే అలసతను వీడి ఇప్పటికి క్షేమంగా మిగిలినవాటినయినా సాధించుకుని సంరక్షించుకోగలమా?<<<

    సమస్య పరిష్కారించడం లో అలసత్వం అయితే క్షమించవచ్చు....అసలు సమస్యే లేదన్నట్లుగా సమస్యను లేవనెత్తిన వాళ్ళే ఆలసత్వాన్ని ప్రదర్శించడం క్షమించరాని నేరం !

    ReplyDelete
  4. ''మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి, యెక్కడెక్కడనైతే తమ దేవుతలను పూజించెనో ఆ స్థలములన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను. వారి బలి పీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్థంభములను (ధ్వజ స్థంభములు) అగ్నితో కాల్చి వారి దేవతా ప్రతిమలను కూలద్రోసి, వాటి పేరులు అచ్చట లేకుండ నశింపచేయవలెను'' ద్వితీయోపదేశ కాండము 12: 2-4

    ఇదండీ పరిస్థితి.. సరిపోతుందా... ఇంకేమన్నా కావాలా???

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete

  6. జగదీష్ గారు రాసినది నిజమే.బైబిలులో ఉంది.మధ్యయుగాల్లో దాన్ని ఫాలో అయేవారుకూడా.కాని శాస్త్రీయ దృక్పథం అభి వృద్ధి చెందాక ఆధునిక యూరపియన్లు ఈ సంకుచిత భావాలనుంచి బయట పడ్డారు. కాని ఆఫ్రికా,ఆసియా ఖండాల్లో ( ముఖ్యంగా ముస్లిములు) ఇంకా మూర్ఖపు భావాలను వదిలించుకోలేక పోతున్నారు.

    ReplyDelete

  7. జగదీష్ గారు రాసినది నిజమే.బైబిలులో ఉంది.మధ్యయుగాల్లో దాన్ని ఫాలో అయేవారుకూడా.కాని శాస్త్రీయ దృక్పథం అభి వృద్ధి చెందాక ఆధునిక యూరపియన్లు ఈ సంకుచిత భావాలనుంచి బయట పడ్డారు. కాని ఆఫ్రికా,ఆసియా ఖండాల్లో ( ముఖ్యంగా ముస్లిములు) ఇంకా మూర్ఖపు భావాలను వదిలించుకోలేక పోతున్నారు.

    ReplyDelete

  8. జగదీష్ గారు రాసినది నిజమే.బైబిలులో ఉంది.మధ్యయుగాల్లో దాన్ని ఫాలో అయేవారుకూడా.కాని శాస్త్రీయ దృక్పథం అభి వృద్ధి చెందాక ఆధునిక యూరపియన్లు ఈ సంకుచిత భావాలనుంచి బయట పడ్డారు. కాని ఆఫ్రికా,ఆసియా ఖండాల్లో ( ముఖ్యంగా ముస్లిములు) ఇంకా మూర్ఖపు భావాలను వదిలించుకోలేక పోతున్నారు.

    ReplyDelete
  9. తిరిగి కుందెటి కొమ్ము సాధించవచ్చు ....
    మిగతా అందరికి తెలిసిందే !!

    విపరీతమైన దైవభక్తి గల కమ్మ్యునిస్ట్ దొరకడం తేలిక అనుకుంటా!?
    గీత చదివాను అన్న పాపానికే కలాం గారంతటి వారినే కాఫిర్ అని ఆడిపొసుకుంటున్నారు నాయకులు.

    పెద్ద పెద్ద ... పెద్దల నుండి నా తరం యువత వరకు యాకుబ్ కోసం రోడ్డెక్కరు గాని కలాం గారి గురించి కాదు.

    మీ పగటి కల బాగుందండి .

    అది నిజం.కావాలని నాకూకోరిక.

    ReplyDelete
    Replies
    1. **రోడ్డెక్కారు .... Typo :(

      Delete
    2. Canadian show: http://youtu.be/d-6lzMfBkXU

      May be we are looking for people like this ...( person in above video).

      Delete
    3. >>గీత చదివాను అన్న పాపానికే కలాం గారంతటి వారినే కాఫిర్ అని ఆడిపొసుకుంటున్నారు నాయకులు.
      అదే మనలో కూడా. మనవాడు ఖురాన్ నో, బైబిల్నో పొగిడాడని చెప్పమనండి? అందరం వెళ్ళీ కొట్టి చంపుతాం

      Delete
  10. నేను రామ జన్మభూమి గురించి వేస్తున్న పోష్టులో విషయం చాలా పెద్దది గాబట్టి అధ్యాయాలుగా విడగొట్టి అప్పుదప్పుడూ అప్డేట్ చెస్తున్నాను.ఒక్కొక్క భాగం పైన చదువరుల స్పందనలు కోరుతున్నాను.

    ఇది శ్రీ ధర్మహాస రామచంద్ర విజయేతిహాసము నందు తృతీయాధ్యాయము ప్రారంభం

    ReplyDelete
  11. మీరు మిగతా భాగాలు రాసే ముందర ఈ క్రింది ఆర్టికల్ చదవండి. రామజన్మభూమి గురించి పుంఖాను పుంఖాలుగా పేపర్లో వ్యాసాలు రాసిన మార్క్సిస్ట్ చరిత్ర కారులను ఆ కేసు విచారణ సంధర్భంగా వారి వాదన వినిపించమని కోర్ట్ వారిని అహ్వానించింది. అప్పుడు వాళ్ల అసలు భండారం బయటపడింది. సంవత్సరాలుగా రామజన్మభూమి కి రాముడికి ఏ సంభందం లేదు అని వాదించిన వాళ్లు, జీవితం లో ఒక్కసారి కూడా ఆ స్థలాన్ని విసిట్ చేయలేదు. ఒక రచయిత ఒక పేపర్ కి వార్త రాస్తే దానిని ఆధారం చేసుకొని ఇంకొక రచయిత వేరే పేపర్కి వార్త రాసే వాడు. ఇలా కొన్ని ఏళ్లు గా రాస్తూన్న చరిత్ర పరిశోధకులను, కోర్ట్ వారి వాదన వినటానికి అహ్వానించి, ఆధారాలు అడిగితే ఒక్కరు కూడ ఆధారాలు ఇవ్వలేక పోయారు. అదే సమయం లో రామజన్మ భూమి స్థలాన్ని త్రవక్కాలు జరిపితే హిందూ ఆలయం ఉన్నందుకు సాక్షాలు దొఇకాయి. తేలు కుట్టిన దొంగల్లా మార్క్సిస్ట్ చరిత్రకారులు, వారి రాజపోషకుడు హిందు పేపర్ నోరు మూసుకొన్నారు.

    Babri demolition: How HC verdict discredited 'eminent' historians

    http://www.firstpost.com/india/babri-demolition-how-hc-verdict-discredited-eminent-historians-547549.html

    ReplyDelete
  12. @UG
    వీళ్ళు కోర్టుతో చివాట్లు వేయించుకున్న సంగతి బయటివాళ్లకి తెలియదుగా!
    అందుకే సుప్రీం కోర్తు కూడా అలహాబాద్ హైకోర్టు తీర్పుని అమలుచెయ్యకుండా స్టే ఇచ్చింది.
    నాకైతే అలహాబాద్ హైకోర్టు తీర్పు నచ్చింది!

    ReplyDelete
  13. నేను గత ఏడు సంవత్సరాల నుండీ ఇదే విషయాన్ని మొత్తుకుంటున్నా ఎవరూ నమ్మలేదు.నేను స్వయంగా ఢిల్లీ వెళ్ళి నిర్ధారించుకున్న తర్వాతే చెపుతున్నాను.హిందువులని బీ జే పీ మోసం చేస్తున్నది.బీ జే పీ కార్యాలయంలో రామజన్మభూమి కోసం పని చేసేవారు ఒక్కరూ లేరు.అయోధ్య వెళ్ళినవారు ఒక్కరూ లేరు.కిషన్ రెడ్డి గారయితే అయోధ్య మొఖమే ఎన్నడూ చూడలేదని చెప్పారు కూడా...కేవలం రాజకీయ ప్రయోజనాలే తప్ప నిజంగా ఆలయం కావాలని ప్రజలూ కోరుకోవడం లేదు.ప్రవీణ్ తొగాడియా కూడా ఆవు పేడతో అగరబత్తీలు తయారు చేసి వాటిని మార్కెటింగ్ చేస్తున్నారు.ఆయన ముస్లిం లను తిట్టి వాటిని సీ డీ లుగా చేసి అమ్ముతున్నారు.ముస్లిం లను తిడితే రామాలయం గానీ రామజన్మ భూమి గానీ దొరుకుతుందా ?

    ReplyDelete
    Replies
    1. నిజమే,ధర్మ సంసద్ రామ జన్మభూమికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే తీర్మానం చేసే ముందర చేసిన ప్రతిపాదనలు చాలా చాలా మంచివి.కానీ వాటిని పక్కన పెట్టి రామాలయం యెత్తుకోవటం,అది కాస్తా కరసేవకుల దుడుకుతనంతో మొలన పెట్టెయ్యటంతో హిందూమతంలో సంస్కరించాల్సిన లోపాలు అట్లానే ఉండిపోయాయి!

      Delete
  14. నేను రామ జన్మభూమి గురించి వేస్తున్న పోష్టులో విషయం చాలా పెద్దది గాబట్టి అధ్యాయాలుగా విడగొట్టి అప్పుదప్పుడూ అప్డేట్ చెస్తున్నాను.ఒక్కొక్క భాగం పైన చదువరుల స్పందనలు కోరుతున్నాను.

    1. ప్రధమాధ్యాయము: చరిత్రలో తొలిదశలోని పరిస్థితి - ఉద్రేకాల మొదటి దశ!
    2. ద్వితీయాధ్యాయము: 1949లో మొదటిసారి రామ్ లల్లాని మసీదు అంతర్భాగంలోకి చేర్చటం గురించిన కధ.
    3. తృతీయాధ్యాయము: షాబానో కేసు గురించిన మురికిని వదుల్చుకోవటానికి రామాలయాన్ని ఉపయోగించుకోవాని రాజీవ్ గాంధీ వేసిన పిల్లిమొగ్గలు!1986 ఫిబ్రవరి 1న మసీదు కున్న తాళం తీసే సంఘటన అందరికీ కుతూహలాన్ని కలిగిం చటం
    4. చతుర్ధాధ్యాయము అద్వానీ రధయాత్ర,మొదటి కరసేఅవలోనే మసీదుని కూల్చడానికి ప్రయత్నం
    5. పంచమాధ్యాయము: అయోధ్య చుట్టూ కాంగ్రెసు - భాజపా ల డబుల్ గేం,ఒకరి తర్వాత ఒకరు కీలుబొమ్మ ప్రభుత్వాల వైనం,ఆఖరుకి మసీదు విధ్వంసం!
    6. షష్ఠమాధ్యాయము మసీదు కూల్చిన తర్వాత తీరిగ్గా ఆకులు పట్ట్కోవటం,కోర్టులూ,నిజ నిర్ధారణలూ,ఆఖరి వాయిదా!
    7. ఆఖరి అధ్యాయం:సకల జనులకూ అయోధ్య సమస్య పరిష్కారం గురించి చేసిన ప్రతిపాదనలు

    ఇది శ్రీ ధర్మహాస రామచంద్ర విజయేతిహాసము సంపూర్ణం

    ReplyDelete
  15. మీరు మీకు సంక్రమించిన భూమిలో మొహమ్మద్-ఇ-మస్జీద్ కట్టుకోవచ్చును!

    మసీదు అక్కడే నిర్మించడం ఎందుకండీ ? హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర ఉన్న భాగ్య లక్ష్మీ టెంఫుల్ దగ్గరకి ఒక శుక్రవారం వెళ్ళి చూడండి.పోలీసులూ,ట్రాఫిక్ జాం లూ అట్టహాసంగా ఉంటుంది.ఊరిచివర ఉండే పోలేరమ్మ గుడి అంత సైజున్న గుడికే అంతమంది పోలీసులు కాపలా కాస్తుంటే అయోధ్యలో ఎంత అంది ఉంటారో ఊహించండి !

    మళ్ళీ మళ్ళీ అయోధ్యలో ప్రతి శుక్రవారం పోలీసులూ,హడావిడీ అవసరమా ? అనవసరమైన దుబారా చేస్తూనే ఉంటారు మళ్ళీ సబ్సిడీ వదులుకోమని నీతులు చెపుతారు.

    అయోధ్య లో ప్రస్థుతం ఉన్న బాబ్రీ స్థలాన్ని కొనుగోలు చేయడమే ఉత్తమం ! ముందు అద్వానీని అరెష్ట్ చేయమనండి అన్ని పనులూ వాటంతట అవే అయిపోతాయి.అయోధ్యలో మసీదు కట్టుకోడమెందుకు మక్కా మసీదు ప్రక్కన,జెరూసలేం లో హిందువులు గుళ్ళు కట్టుకున్నారా ?

    ఏదైనా వాదిస్తే పూర్తిగా వాదించండి.అయోధ్య రామ జన్మస్థానం అని వాదిస్తున్నపుడు,ప్రక్కనే మసీదు కట్టుకోమని ఉదారత చూపించడం ఎందుకు ? అయోధ్య రాముడిదైతే పూర్తిగా రాముడిదే !

    ReplyDelete
    Replies
    1. రామ రామ కృష్ణ కృష్ణ!

      కొనుగోలు అని పబ్లిగ్గా అంటే చెదగొట్టేవాల్ళు వెయ్యిమంది - ఆయ్!మసీదు పవిత్రస్థలం దాన్ని అమ్ముతావా అన్ని వాళ్ళనీ కొంత్టానికి నువ్వెవడివి అని మనల్నీ కలిపి వాయించేస్తారు.

      కేసీఆర్ లాగా నో ఆప్షన్స్ అనను నేను.
      ప్రతిదానికీ రెండు ఆప్షన్స్ ఇస్తా - హరి హరీ!

      Delete
  16. హరిబాబు గారూ, జరిగిన సంగతులను ఒక కథలా ఆసక్తికరంగా చెప్పి మీ రచనా శైలి అదుర్స్ అని మళ్ళీ నిరూపించారు కంగ్రాట్స్!

    మధ్యమధ్యలో భాష రంగు కాస్త ఎక్కువ (ఉ. గాడిద, సుంతీ) అవడం అన్న ఒకే ఒక్క విషయం అనవసరం అనిపించింది. It may be better to let your argument speak for itself instead of spewing venom.

    రెండు (నా దృష్టిలో) ముఖ్యమయిన విషయాలు మీరు మిస్ అయ్యారని అనుకుంటా:

    1. ఎమర్జెన్సీ కాలం నుండి సంజయ్ గాంధీ ప్రభావం తల్లి ఆలోచనల మీద పెరిగింది. ఇందిరా గాంధీ అప్పటిదాకా చెప్పుకున్న సోషలిజం లాంటి వాటికి దూరం అవుతూ ఆర్యెస్యెస్ వారిని చేరదీయడం మొదలుపెట్టింది. 1980 ఏకాత్మతా యజ్ఞం మొదలు కాంగెస్-ఆర్యెస్యెస్ లోలోపల సంబంధాలు బాగుండేవి. జనతా పార్టీ నుండి వేరుపడ్డ బీజేపీ అప్పటిలో "గాంధియన్ సోషలిజం" భజన చేయడంతో ఆర్యెస్యెస్ 1984 ఎన్నికలలొ కాంగ్రెస్ పార్టీని సమర్తించింది. దీంతో ఖంగు తిన్న బీజేపీ తిరిగి ఆర్యెస్యెస్ మన్ననలు పొందడానికి ఏదో ఒక కొత్త విషయం ఎత్తుకోవాల్సిన అవసరం ఏర్పడింది

    2. 1989 ఎన్నికల ఫలితం తీసుకొచ్చిన మండల్ ఉపద్రవం దరిమిలా తాము ఏదో ఒకటి చేయకపోతే పరిస్తితి చేయి జారిపోయే అవకాశం ఉందని బీజేపీ గ్రహించింది. మండల్ ప్రత్యామ్నాయంగా వెంటనే కమండల్ రాజకీయాన్ని తెరమీదకి తెవాల్సి వచ్చింది.

    In the first case, it was important for the BJP to reclaim the Hindu votebank that post-riots went firmly to Congress. In the latter instance, Mandal was fragmenting the Hindu votebank- an outcome that made BJP shudder.

    ReplyDelete
    Replies
    1. @jai
      సంజయ్ గాంధీ పెరిగి పెద్దయ్యాక తన ప్రభావం వల్లనే హిందూత్వం వైపుకి జరిగందని చెప్పలేం.ఇందిరా గాంధి కాశ్మీరీ బ్రాహ్మణ స్త్రీ.సహజంగా వితంతువు కాగానే మనవాళ్లు తమకే తెలిసి గానీ ఇతర్లు చెబితే గానీ దైవభక్తి వైపుకి మళ్ళటం జరుగుతుంది.రుద్రాక్షలు ధరించహ్టం,స్వామీజీఎల పట్ల గౌరాన్ని చూపించటం ముందు నుంచీ చేస్తూ ఉండేది.సహజంగా జనంలో కావాలని విషం కక్కకుండా తమ మతాన్ని నిష్ఠగా పాటించేవాళ్ళ్ని యెవరూ తప్పు పట్టని మనస్తత్వం ఉంటుంది.

      ఆవిడ తన హిందూత్వాన్ని యే విధంగానూ దాచ్హుకోలేదు - తండ్రి చేసిన కొని తప్పుల్ని తను చెయ్యకుండా తప్పుకోగలిగింది తన రాజకీయ జీవితమలో!

      P.S:నున్నని ఫలితాన్ని ఇవ్వటం అనే దానికి ఇచ్చింది హిందువులైతే "గుండు కొట్టారు" అని ఉండేవణ్ణీ,యేం చేస్తాం అక్కడ ఫలితం చూపించింది ముస్లిములు కదా!

      Delete
    2. ఆవిడ వ్యక్తిగతమా/చిన్నబ్బాయి ప్రభావమా లేదా ఇంకోటా, ఇందిరా-ఆర్యెస్యెస్ సఖ్యత ఎందుకు వచ్చిందనే విషయాన్ని లోతుగా పరిశీలించడం నా ఉద్దేశ్యం కాదు. సదరు సఖ్యత వలన బెజేపీకి కలిగిన అబద్రత ఈ "ఉద్యమం" రావడానికి మరో కారణం అని చెప్పాలని అనిపించింది అంతే.

      "సుంతీ" ఒక్కటే కాదు, మీ వాదనకు అదనపు బలం సమకూర్చని మాటలు ఎన్నో రాసారు. చెప్తున్న విషయాలు బాగున్నాయి కనుక ఇలాంటి "కృత్రిమ సాధనాలు" అవసరమా?

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. @jai
      మీరు చెప్పిందీ కరెక్టే.కానీ అన్నిటినీ కలిపి రాయాలంటే ఈ పోష్టు ఇంకా ఇంకా పెద్దదవుతుంది.

      ఆ ఒక్క మాటా తప్ప్ప నేను ఇంకేదీ రాయకూడని మాటలు రాయలేదే?
      ఇలాంటి విషయం రాస్తున్నాననే గమనికతో జాగ్రత్తగానే రాశానే?

      కొంచెం ఉదాహరణలు చూపిస్తారా?ఈఎ పోష్తులో చెత్త ఉండటం నాకూ ఇష్టం లేదు!

      Delete

  17. Ram temple in Ayodhya was demolished by Aurangzeb: Book


    http://www.deccanherald.com/content/553200/ram-temple-ayodhya-demolished-aurangzeb.html

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...