Friday, 21 August 2015

గతితార్కికభౌతికవాదం భారతీయ కమ్యునిష్టులకి తాము పుట్టిన దేశాన్ని బద్నాం చేస్తూ చరిత్ర గురించి అబధ్ధాలు చెప్పటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాలేదు కాబోలు!

    నాకు లెనిన్ మొట్టమొదటిసారిగా యే సన్నివేశంలో నచ్చాడో తెలుసా!నిజానికి రష్యా కమ్యునిష్టు దేశంగా మారడమనేది ముందుగా ప్లాను చేసుకున్న ప్రణాళిక ప్రకారం జరగలేదు.కమ్యునిష్టు పార్టీ అనేది ఉంది,కానీ అణచివేత ప్రమాదం ఉంది గనక రహస్యంగానే పని చేస్తూ ఉండేది.ప్రజల్లో జార్ ప్రభువుల అరాచకత్వం పట్ల వ్యతిరేకత ఉంది,కానీ వాళ్ళు తిరగబడే పరిస్థితులు లేవు.అయితే హఠాత్తుగా ఒక నిప్పురవ్వ అరగిలింది - ఫ్రెంచ్ విప్లవంలో క్కూడా ఇలాగే బాస్టిల్ల్లీ కోట ముట్టడి లాంటి ఒక చిన్న సంఘటన నుంచే అంత భీబత్సమైన విప్లవం మొదలైంది!అయితే ఆ చిన్న సంఘటన యొక్క ప్రాముఖ్యతని గుర్తుపట్టి ప్రవాసంలో ఉన్న లెనిన్ శరవేగంగా అక్కడికి చేరుకుని పార్టీ సభ్యుల్ని కూడా అంత వేగంగానూ కదిలించి మొత్తం రష్యా భూభాగాన్ని కమ్యునిష్టు పార్టీ అధ్వర్యంలోకి తీసుకొచ్చి ఆ చిన్న తిరుగుబాటుని గొప్ప విప్లవంగా మార్చివేశాడు - ఒకరకంగా లెనిన్ ఆ సంఘటనని హైజాక్ చేసేసి విప్లవాన్ని స్థాపించినట్టే లెఖ్ఖ!అయితే అప్పటికే తను అన్ని రకాల ప్రణాళికలూ వేసుకుని ఉన్నాడు విప్లవం విజయవంతం కాగానే యెప్పుడెప్పుడు యేమేమి చెయ్యాలి అని.అప్పుడు చేసిన ప్రతిపాదనలలో ముఖ్యమైనది "జాతుల స్వయం నిర్ణయాధికారం" అనేది ఒకటి!దీని ప్రకారం రష్యా కూడా ఒక భాగమైన యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అని పిలిచే భూభాగం మీద ఉక్రేనియన్,ఉబ్జెక్,కజాక్,అజర్బైజాన్,లిధువేనియన్,లాట్వీన్ మొదలైన ప్రత్యేక సంస్కృతులతో పరిఢవిల్లే జనసమూహాలు ఉన్నాయి.వారందరికీ మీ ప్రాంతాన్ని మీరే పరిపాలించుకోమని స్వేచ్చ ఇచ్చేశాడు.కానీ లెనిన్ ఇచ్చినా తీసుకోకుండా వాళ్ళు లెనిన్ నాయకత్వంలోనే ఉంటామని చెప్పి కలిసే ఉండిపోయారు.ఇక్కడ విశేషం యేమిటంటే యే జాతికయినా తన సంస్కృతి మీద మమకారం ఉండాలనేది లెనిన్ ఒప్పుకున్నాడు.అతనిలోని ఆ ఔన్నత్యమే ఆయా జాతుల వారినందరినీ లెనిన్ నాయకత్వానికే విధేయులై ఉండేలాగ చేసింది!మరి భారతీయ కమ్యునిష్టులు తాము పుట్టిన దేశపు సంస్కృతినే అవమానిస్తున్నారు,యెందుకు?



     ఒక చోట అన్యాయం జరిగితే స్వదేశీయుడైనా స్వజాతీయుడైనా ధిక్కరించి తీరాలి,దానిని కాదంటే కాదన్నవాడు మనిషే కాడు!ప్రతి ప్రాంతంలోనూ అక్కడి శీతోష్ణస్థితుల కనుగుణంగా వస్త్రధారణా,ఆహారపు టలవాట్లూ,ఆర్జన సాధనాలూ,ఆచార వ్యవహారాలూ ఆ ప్రాంతానికి అంటుగట్టుకునిపోయిఉంటాయి.ఆ ప్రాంతంలో క్షేమంగా బతకాలంటే విధిగా వాటిని అనుసరించాలి.ఒకవేళ అవి అనవసరమైనవి అనిపిస్తే మొత్తం సమాజం ముందు సోదాహరణంగా చెప్పి ఒప్పించటం గొప్ప విషయం,దాన్ని తప్పని యెవరూ అనరు,అనలేరు!ఒక విషయం తమకి ప్రమాదమని తెలిసినా వదలకుండా పట్టుకుని ఉండేవాళ్ళూ,ఒక విషయం క్షేమకరమని తెలిసినా తీసుకోకుండా మొండికెత్తేవాళ్ళూ యెక్కడయినా ఉంటారా చెప్పండి!ఒకరికన్నా యెక్కువగా హీనపక్షం ఇద్దరు ఒకచోట కలిసి బతకాలంటే వాళ్ళు ఒకరికొకరు హాని చేసుకుని అందరూ నశించిపోకుండా ఉండటం కోసం తప్పనిసరిగా కొన్ని నియమాలు పెట్టుకోవాలి - అవి సత్యం,ధర్మం,న్యాయం అనేవాటిని నిర్వచిస్తాయి!నియమాలు తప్పయితే అందరి అనుమతితో వాటిని సంస్కరించాలి గానీ ఒక నియమం పెట్టుకున్నాక వాటిని తప్పితే యేమవుతుంది?నువ్వు నీ స్వప్రయోజనం కోసం చేస్తే నువ్వు బలహీనుడివైతే మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా నిన్ను దండిస్తారు!నీ వ్యతిక్రమణ వాళ్ళకి నష్టం గనుక వాళ్ళు నిన్ను దండించటం న్యాయమే కదా!నీకు హాని కలిగించే విధంగా యెదటివాడు అతిక్రమిస్తే నువ్వూ వూరుకోవు గదా!దీనికోసమే రాజ్యం అనేది రంగప్రవేశం చేసింది.యెక్కడయినా రాజ్యం దండన ద్వారానే ధర్మాన్ని స్థాపిస్తుంది!నియమాలలో తప్పు ఉండి వాట్ని మార్చగలిగినవాళ్ళు సంస్కర్తలు అవుతారు.నియమాల్ని స్వప్రయోజనం కోసం ధిక్కరించటం యెప్పుడూ ఇతర్ల శ్రమని దోచుకోవటానికే జరుగుతుంది!

     యే రెండు జాతుల్ని పోల్చినా కొన్ని సారూప్యతలూ కొన్ని వైవిధ్యాలూ ఉంటాయి!యే రెండు జాతుల్ని యే విషయం ప్రకారం పోల్చినా ఆ రెంటిలో ఒకటి మెరుగ్గా కనబడటం సహజం.ఒక జాతితో పోల్చిన మరొక జాతి మెరుగ్గా కనబడితే ఆ మెరుగైన దాన్ని ఇంకొక జాతితో పోల్చినప్పుడు మూడవది ఇంకా మెరుగ్గా కనబవచ్చు - మెరుగు తరుగులు సహజం!ఈ పోలికలకి ఉపయోగిత,అంతర్గతసౌష్ఠవం,బాహ్యసంస్కారం లాంటి ధనాత్మక అంశాలనే ఉపయోగిస్తారు గనక  యెన్నింటితో పోల్చినా ఒక సంస్కృతి అన్నింటిలొనూ మెరుగే అని తేలితే ఆ సర్వోత్తమమైన జాతికి చెందిన వారు ఇతర్ల ప్రశంసలకి ఆనంద పడటం దోషమా?అహంకరించి గొప్పలు చెప్పుకోవటం తప్పు గానీ కనీసం ఆనందించటం కూడా తప్పేనా!

     "భారత్,మా జాతికి మాతృభూమి మరియు సంస్కృతం యూరప్ భాషలకు తల్లి.తత్వవిచారణలో భారతదేశమే మాకు మాతృమూర్తి.తల్లి యెలాగంటే,ఆమె యొక్క గణితమే అరబ్బుల ద్వారా మ్నకు అబ్బింది.బుధ్ధుడి ద్వారా క్రైస్తవంలో ఆదర్శాలను ఏర్పరిచింది.గ్రామస్వరాజ్యం,స్వయంపాలన,ప్రజాస్వామ్యం నేర్పిన తల్లి భారతదేశమే.అందుకే తల్లి భారతి మనందరికీ అనేక విధాలుగా అమ్మ" అని విల్ డురంట్ అనే అమెరికన్ చరిత్రకారుడు ప్రశంసించాడు!"భారతదేశం, మానవజాతికి ఊయెల,మానవజాతి వాక్కుకి జన్మస్థానం,చరిత్రకి తల్లి,వీరత్వానికి బామ్మ,సంప్రదాయానికి జేజెమ్మ.మానవజాతి చరిత్రలో అత్యంత విలువైన,మరియు అత్యంత వివరణాత్మకమైన విషయాలన్నీ భారతదేశమందే పోగు చేయబడి ఉన్నాయి." అని మార్క్ ట్వెయిన్ అనే అమెరికన్ రచయిత ప్రశంసించాడు!"మానవుడు,తన ఉనికి గురించి కన్న కలలు మొదలుకొని అన్ని కలలను సాకారం చేసుకునేందుకు ఈ ప్రపంచంలో ఆశ్రయం కల్పించిన ప్రదేశం ఏదైనా ఉందంటే, అది కేవలం భారతదేశం మాత్రమే" అని రోమైన్ రోలాండ్ అనే ఫ్రెంచి పండితుడు ప్రశంసించాడు!మరి మన వెధవాయలు యేం చేస్తున్నారు?అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కానివాళ్ళకి కంచాల్లోనూ పెట్టటం లాంటి నికృష్టానికి తెగబడ్డారు!

     యే రెండు జాతుల మధ్యనయినా ఆదానప్రదానాలు సహాయం,వ్యాపారం,యుధ్ధం అనే మూడురకాలుగా ఉంటాయి.యే పధ్ధతిలో జరిగినా ఒకరికి లాభం ఒకరికి నష్టం తప్పకుండా ఉంటాయి!సహాయంలో కూడా మన దగ్గిర ఉన్నది యెదటివాడికి ఇవ్వడం అనేది నష్టమే,కానీ యెదటి వ్యక్తి పట్ల ఉన్న అభిమానం వల్ల మనము దాన్ని నష్టం అనుకోము.మన దేశాన్ని తిడుతున్నాడు అంటే ఖచ్చితంగా వాడికి మరొక దేశమేదో గొప్పగా నచ్చేసిందని అర్ధం చేసుకోవాలి - యేదో ఒకరోజున ముసుగు విప్పేసి బైటపడతాడు గూడాను!ఒకవేళ వాడికి నచ్చిన దేశం మన దేశం మీద దాడి చేస్తే యేం చేస్తాడు?ఆ దేశమే గెలవాలని కోరుకుంటాడు గదా!అది దేశద్రోహం కాదా?

     వాళ్ళ దగుల్బాజీతనానికి మెచ్చుతునకైన ఒక వుదాహరణ చెప్తాను.అయోధ్యలో  రామజన్మభూమి వివాదాన్ని విచారిస్తున్న న్యాయమూర్తులకి "అసలు హిందువులు క్లెయిం చేస్తున్నట్టు మసీదు కింద హిందూ కట్టడం యేదయినా ఉందని ఆధారాలు ఉన్నాయా" ఒక సాంకేతికపరమైన సందేహం వచ్చి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వార్ని సంప్రదిస్తే వారు అన్ని పరిశీలనలూ జరిపి సాక్ష్యాధారాలతో సహా మసీదు కింది పొరల్లో ఒక హిందూ ఆలయం ఉందని నిర్ధారిస్తే ముస్లిములు దాన్ని యేకపక్షమైన రిపోర్టు అంటూ 8మంది "ఎమినెంట్ ప్రొఫెసర్ల"ని సాక్ష్యానికి తీసుకొచ్చారు.ఈ "ఎమినెంట్ ప్రొఫెసర్ల"లో 6గురు హిందువులు?!చూడండి మమ్మల్ని హిందువులు కూడా సమర్ధిస్తున్నారు అని చెప్పుకోవటానికి అమాయకంగా తెచ్చారో యెత్తుగదతో తెచ్చారో గానీ వారు పేరుకే హిందువులు!హిందువులనే పేరుతో ముస్లిములు సాక్ష్యానికి తెచ్చిన మేతావులు యేనాడూ అయోధ్యలో అడుగు పెట్టకుండానే యే తవ్వకాలూ జరపకుండానే యే పరిశోధనలూ చెయ్యకుండానే ASI చేసిన పరిశోధన యేకపక్షం అని మీడియాలో గోల చేసిన వాళ్ళు కోర్టు విచారణలో తెల్లముఖాలు వేశారు,యెందుకో తెలుసా!అక్కడి లాయర్లు కోర్టులకి కావలసింది నమోదు చేసుకోవటానికి పనికొచ్చే గట్టి సాక్ష్యాలు గానీ వీళ్ళు మీడియా ముందు వాగటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాని సొల్లుకబుర్లు కాదని తెలిసినవాళ్ళు గనక  వాళ్ళు చెప్పిన విషయాల గురించి అడిగిన ప్రశ్నలకే సరయిన సమాధానాలు చెప్పలేక సాక్ష్యాధారాలు చూపించలేక చివాట్లు తిని చెవులు దులుపుకుని పోయారు - సిగ్గు పడ్డారో లేదో తెలియదు!వీళ్ళుట "ఎమినెంట్ ప్రొఫెసర్లు"ట?!

     ఇదొక్కటే అయితే జన్మానికొకసారి పొరపాటు పడ్డారు పోనీలెమ్మని అనుకోవచ్చు,ప్రతి విషయంలోనూ ఇట్లాగే ప్రవర్తిస్తున్నప్పుడు వీళ్ళ నిర్వాకాల్ని తెలిసి కూడా బైటపెట్టకపోతే చరిత్ర క్షమిస్తుందా మనల్ని?బుధ్ధుడు మహాశాంతిమూర్తి,మహావీరుడయితే లోకోత్తరుడే అని ప్రచారం చేసి హిందూమతం ఈ  రెండు మతాల ధాటికి తట్టుకోలేక విలవిలలాడిపోయిందనీ దుర్మార్గంగా ఈ రెంటినీ దేశం నుంచి తరిమికొట్టి గానీ మళ్ళీ పూర్వపు వైభవానికి రాలేకపోయిందని యెన్ని కబుర్లు చెప్తున్నారు?బౌధ్ధమూ జైనమూ బ్రాహ్మణ మతానికి పూర్వం ఉన్న స్వచ్చమైన హిందూమతం అని ఒకసారీ అబ్బెబ్బే హిందూమతానికీ ఈ రెంటికీ పోలికే లేదు వీటిలో ఉన్నదంతా కొంగొత్త భావధార అని ఒకసారీ  అనేవాళ్ళు సత్యసంధులా?

     ఇవ్వాళ కనిపిస్తున్న జైనులు అహింసామూర్తులే,సందేహం లేదు!కానీ వారి 24 తీర్ధంకరులలో నలుగురు చక్రవర్తులు?!చక్రవర్తులు కావాలంటే యుధ్ధాలు చేయాలి,ఇతర రాజ్యాల్ని గెలవాలి!మరి,యే ఒక్క శత్రుసైనికుణ్ణీ చంపకుండానే యుధ్ధాలు గెలుస్తారా?కేవలం ఈ నలుగురు తీర్ధంకరులు మాత్రమే కదా చక్రవర్తులు అని మీరు అనుకుంటే తప్పులో కాలేసినట్టే,తీర్ధంకరులలో క్షత్రియులు కానివారు యెందరున్నారో చెప్పమనండి యే జైన మతస్థుదినైనా!క్షత్రియుడైన ప్రతివాడికీ యుధ్ధం చెయ్యటం విధి - యుధ్ధాలు గెలిస్తేనే కదా రాజయ్యేదీ ఆ తరవాత చక్రవర్తి అయ్యేదీ - మరి హింస లేని యుధ్ధం ఉంటుందా!జైనుల మొదటి తీర్ధంకరుడైన రిషభదేవుని పెద్ద కుమారుదు భరతుడు మొదటి చక్రవర్తి.ఇతని పేరుతోనే మన దేశం భరతఖండం అయిందని హిందూ జైన పురాణాలు రెండూ అంగీకరిస్తున్నాయి!

     మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు జైనమతస్థుడే!నిజానికి మగధను పాలించిన చాలా వంశాలకు సంబంధించిన రాజులంతా అవైదిక మతాలైన జైన/అజీవక సంప్రదాయాల్ని పాటించారు!ఈ చంద్రగుప్తుడి కాలంలోనే అలెగ్జాండరు మన దేశం మీదకి దండెత్తి వచ్చాడనీ పురుషోత్తముణ్ణి చీకటి మాటున నది దాటి వచ్చి గెలిచాడనీ గెలిచాక సెల్యూకస్ అనేవాణ్ణి తన ప్రతినిధిగా ఇక్కడ ఉంచాడనీ చెప్పే విషయాలు అన్నీ అబధ్ధాలే!ఈ మౌర్య చందర్గుప్తుడి కాలంలో సెల్యూకస్ వచ్చి ఇతని చేతిలో ఓడిపోయి తన కూతురు హెలీనాని ఇతని కిచ్చి పెళ్ళి చేసి వెనక్కి వెళ్ళిపోయాడు.

     మనకి అశోకుడి గురించి ఇప్పుడు వినపడుతున్న విషయాలు కూడా చాలామటుకు రూఢిగా నిర్ధారణ కానివే అయినా ప్రామాణికమైన చరిత్రగా పరిగణించి పాఠ్యపుస్తకాల్లోకి కూడా యెక్కించేశారు!అశోకుడు కళింగ యుధ్ధం తర్వాత అక్కడి భీబత్సానికి మనసు చెదిరి పశ్చాత్తాప పడి బౌధ్ధమతాన్ని అనుసరించాడనేటందుకు కూడా విరుధ్ధంగా కనబడేవి బౌధ్ధ మత సాహిత్యంలోనే ఉన్నాయి.అశోకుడి గురించి చెప్పటానికి బౌధ్ధులు రచించిన "అశోకవదన" అనే గ్రంధంలో ఒక భాగం అశోకుడు తను హింసిస్తున్న ఒక బౌధ్ధసన్యాసి యొక్క సహనశీలత్వాన్ని చూసి పరిశుధ్ధుడు అయ్యాడు అని వ్యాఖ్యానిస్తుంది.అప్పటివరకూ యెన్నో యుధ్ధాలు చేసిన వాడు,పైగా అతని క్రూరత్వం వల్ల చండాశోకుడు అని కూడా వర్ణించబడిన వాడు ఆ ఒక్క యుధ్ధంలో ఒక్కసారిగా పశ్చాత్తాప పడిపోయాడంటే నమ్మాలా?ఈ బుధ్ధ భిక్షువుని హింసిస్తూ వుండగా మారటం అనే కధ కూడ గట్టి సాక్ష్యాలు లేనిదే!పోనీ తన 13వ శిలాశాసనం ప్రకారం "దేవానాం ప్రియుడు ఇక యుధ్ధాలు చెయ్యడు" అని చెప్పుకుని పూర్తిగా అహింసాయుతంగా ఉన్నాడనేటందుకూ ఆధారాలు లేవు.అదే అశోకవదన గ్రంధంలో ఒకచోట అశోకుడి క్రూరత్వాన్ని గురించి చేప్పే మరొక కధ వుంది.ఒక జైనసాధువు గౌతమబుధ్దుడు తమ దేవుడి ముందు మోకరిల్లినట్టుగా ఒక బొమ్మ వేస్తే ఒక బౌధ్ధ శ్రమణుడు అశోకుడికి విన్నవించుకున్నాడట.దానికి అశోకుడు వేసిన శిక్ష - మొత్తం 18,000 మంది జైనుల్ని అజీవకుల్ని మరణశిక్ష విధించి చంపెయ్యటం!బౌధ్ధులు అమాయకులే అయి ఉండవచ్చు, యేదో తమ మనోభావాలకి భంగం కలిగిందని రాజుని వేడుకుంటే రాజు చేశాడని సరిపెట్టుకోవడానికీ కుదరదు!ఈ అశోకుడే చనిపోయేటప్పుడు కొంత సొమ్మ్ముని దానంగా వ్రాయించి అప్పటికి ఇవ్వకుండా మరణించాడు.అతని తర్వాత రాజ్యానికి వచ్చిన అశోకుడి మనుమడు సంప్రాతి మొదట దాన్ని చెల్లించి గానీ సింహాసనం యెక్కలెకపోయాడు - అదీ బౌధ్ధుల శ్రమణత్వం!

     వీళ్ళు హిందూమతాభిమాని అయిన పుష్యమిత్రుడు బౌధ్ధాన్ని క్రూరంగా అణిచివేశాడు అని ఆరోపిస్తున్న విషయం కూడా అశోకవదన గ్రంధం లోనిదే!పుష్యమిత్రుడి కన్నా ముందు వీళ్ళంతా ఉదారుదని పొగుడుతున్న అశోకుడు కూడా బౌధ్ధుల్ని సంతోషపెట్టటానికి జైనుల్ని హింసించాడు కదా!అక్కడ అశోకుడూ జైనసాధువు తల నరికి తెస్తే తలకి 1 బంగారు నాణెం ఇస్తానని ప్రకటించాడు,ఇక్కడ పుష్యమిత్రుడూ బౌధ్ధబిక్షువు తల నరికి తెస్తే తలకి 100 బంగారు నాణాలు ఇస్తానని ప్రకటించాడు - యేమిటి తేడా?!!అయినా ఇలాంటి ఒకేఒక్క సంఘటనతో యే మతమూ తుడిచిపెట్టుకు పోదు.బౌధ్ధం,జైనం - ఈ రెండు మతాలూ అవి తొలిసారి ప్రాచుర్యం లోకి వచ్చిన కాలంలో సామాన్యులకి అసలు గుర్తింపు లేదు.యే మతం ప్రాచుర్యంలోకి రావాలన్నా రాజాశ్రయం పొంది రాజమతంగా గుర్తింపు పొందటం తప్పనిసరి!ఒకసారి రాజు ఒక మతాన్ని రాజమతంగా ఒప్పుకున్నాడంటే ఖజానాలో సింహభాగం వాళ్ళ పరమైనట్టే!రాజుకి వీళ్ళ ప్రవచనాల ద్వారా ప్రజల్లో తనపట్ల విధేయత ఉండే సౌకర్యం ఉంటుంది - ఇచ్చి పుచ్చుకోవడం!

     ఒక రాజ్యంలో ఒక రాజు ఇట్లా చేసినంత మాత్రాన ఉపఖండం అని పిలవదగినంత పెద్ద దేశంలో వీళ్ళొక్కళ్ళేనా ఉన్నది - మిగతా చోట్లకి పోవచ్చును గదా?అసలు యెప్పుడో ఒకసారి జరిగే ఇలాంటి చెదురు మదురు సంఘటనల వల్ల యే మతమూ ఒక్కసారిగా తుడిచిపెట్టుకు పోదు.జైనం అశోకుడు చేసిన ఆ ఒక్క సంఘటనతో తుదిచిపెట్టుకు పోయిందా,లేదే?బౌధ్ధం పుష్యమిత్రుడు చేసిన ఆ ఒక్క సంఘటనతోనే హఠాత్తుగా తుడిచిపెట్టుకుపోయిందా,లేదే!ఒక మతం రాజమతం హోదాను తెచ్చుకోవాలన్నా మరో మతం ఆ హోదాని ఆక్రమించాలన్నా దానికో పధ్ధతి ఉండేది - విద్వత్సభలు జరుగుతాయి.రాజే యేర్పాటు చేస్తాడు అప్పుడు రాజమతం కానివాళ్ళలో యెవరయినా అన్యమతస్థులు కోరుకుంటే!ఆ వాదనలో యెవరు గెలిస్తే రాజు ఆ మతాన్ని రాజమతంగా చేసి ప్రోత్సహించాలి అనే నిబంధన ఉండేది.రాజుకి ఒక మతం పైన మక్కువ ఉండి అందులో పాండిత్యం కూడా ఉంటే ముందు రాజునే మెప్పించాల్సి ఉంటుంది విద్వత్సభకి వెళ్ళేకన్నా ముందు!

     ఒకానొకప్పుడు మిధిలరాజు ఉశీనరుడు సర్వ బౌధ్ధమత సిధ్ధాంతాలనీ విమర్సిస్తూ ఉండేవాడు,అయితే ఆయనంతట ఆయన వాని విమర్సకి పోడు,ఎవరైనా అర్హతులు వెళ్ళి ఆయన్ని కదిలిస్తే మాత్రం ఆయన చేసే వాదనలకి సమాధానం చెప్పలేక నిరాశతో వెనుదిరిగి పోయేవారు.బౌద్ధమతము యొక్క ప్రధమ సిద్ధాంతము కార్యకారణ చక్రము. అజ్ఞానము క్రియగా పర్యవసించును. అది విజ్ఞానమగును. నామరూపములు వహించును. షడింద్రియములు, స్పర్శ, అనుభూతి, ఆశ, గ్రహణము, పరిణామము, జన్మము, దుఃఖము – నిట్లు మారుచుండును. దుఃఖమును చంపినచో అజ్ఞానము నశించునని వారి ప్రధమ సిద్ధాంతము. దీనిని బౌద్ధులయిన అర్హతులు చెప్తే విని ఉశీనరుడు చిరునవ్వు నవ్వుతాడు.కొంత చమత్కారంగా ఒక ఉదాహరణ చెప్తాడు. మొట్టమొదట జిహ్వ మీద రుచి అనేది ఉన్నది కనుక కూర చేసుకోవాలి అనే సంకల్పం పుడుతుంది. దానినుండి ఒక శాకము, దానిని ముక్కలుగా తరుగుట, కడుగుట, వేడి చేయుట, తిరుగమూత, లవణాది మిశ్రమమును కలుపుట, – యివన్నీ పుట్టాయి. జిహ్వయందలి రుచి నుంచి యివన్నీ పుట్టాయి. కాబట్టి లవణాది మిశ్రమమును తొలగించినచో రుచి నశించును. – ఈ వాదన విని చర్చకు వెళ్ళిన అర్హతుడు వెలతెల పోతాడు.అయితే ఇలా హాస్యంగా తేల్చేయడం సరైన వాదనా పధ్ధతి కాదని అంటూనే కాని ప్రతిస్పర్ధి యొక దుష్టసిద్దాంతమును ప్రతిపాదించి నపుడు, పాత వస్తువునే కొత్తవస్తువుగా దీపింపచేయబోయినపుడు పండితుడైన వాడేమి చేస్తాడు? అని అడుగుతారు.“అజ్ఞానము, కర్మ, దుఃఖము యివన్నీ వేదాల్లో వున్నాయి. ఉపనిషత్తులలో వున్నాయి. శాస్త్రాల్లో, పురాణాలలో వున్నాయి. అవి ఏవో కొత్త విషయాలుగా అర్హతులు తెచ్చి ఉశీనరుడి దగ్గర చెప్తే మరి అతనేం చేస్తాడు?” అని ప్రశ్నిస్తాడు.

     7వ శతాబ్దంలో తమిళ దేశానికి చెందిన కూన్ పాండియన్ అనే తమిళ ప్రభువు ఇదే పధ్ధతిలో హైందవం నుంచి జైనం లోకి మారాడు.అయితే అతని భార్యకి ఇది నచ్చక తిరు గ్యాన సంబంధార్ అనే పందితుణ్ణి ప్రేరేపించి వాదనకి తీసుకొచ్చింది.ఆయన వాదనలో గెలిచి మళ్ళీ రాజుని హైందవం లోకి తీసుకొచ్చాడు.బౌధ్ధం,జైనం రెండూ స్థూలంగా అహింసని ప్రముఖంగా చెప్పేవి అయినా సూక్ష్మమయిన భెదాలు ఉన్నాయి.వాటిని బట్టి చూస్తే అసలు అశోకుడు పూర్తిగా బౌధ్ధంలోకి మారాడా అనేది కూడా నిర్ధారణగా చెప్పలేము.బౌధ్ధులు అహింసని ప్రచారం చేసినా మాంసాహారాన్ని వర్జించలేదు,బుధ్ధుడు మహాసమాధికి ముందు తెసుకున్నది మాంసాహారమే!కానీ జైనులు పూర్తిగా శాకాహారులు.అశోకుడి శిలాశాసనాల్లో ఆహార విహారాదులకి సంబంధించిన సూచనలలో జైనుల మాదిరి శాకాహారాన్ని గురించి ప్రస్తుతిస్తూ ఉన్నాయి!బౌధ్ధ మతం పూర్తిగా రాజాశ్రయం మీదనే ఆధారపడటంతో ఆ రాజాశ్రయం పోగానే క్రమంగా అంతరించి పోయింది.జైనులు రాజాశ్రయానికి దూరంగా ఉండటం వల్ల అంత ప్రభావశీలంగా యెప్పుడూ లేకపోయినా పూర్తిగా నశించిపోకుండా ఉండగలిగారు.ఇవి నిజమైన చరిత్ర సాక్ష్యాధారాలతో చెప్తున్న సత్యాలు.కాబట్టి హిందువులు ఇకనుంచీ పైత్యకారి కమ్యునిష్టులు హిందూమతం బౌధ్ధాన్నీ జైనాన్నీ క్రూత్రంగా అణిచేసింది అని కూస్తే నిజమేనని నమ్మేసి సిగ్గుతో తల దించుకోవాల్సిన పని లేదు!

     నిజంగా మన సంస్కృతిలో దోషముంటే విమర్శించినా అర్ధం ఉంది,ఒకరోజు కాకపోతే మరొకరోజయినా విన్నవాడు ఆ విమర్శలోని నిజాయితీని గుర్తించే అవకాశం ఉంటుంది!ఒక దేశపు చరిత్రని అబధ్ధాలతో నిర్మించి అబాసుపాలు చెయ్యడమనేది స్వదేశీయుడు చెయ్యడం యెంత ఘోరం?బహుశా పాపపుణ్యాలు లేవని చేప్పే హేతువాదాన్ని నమ్మడం వల్ల గానీ లేకపోతే ఆ గిల్ట్ మనసులో తొలచడం మొదలెడితే ఒక్క రోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేరు గదా! 

స్వజాతిద్రోహం చేసి తలుపులు తెరిచిన వాణ్ణి వీడు ప్రేమించే విజాతివాడు గెలిచాక దగ్గిరకే రానివ్వడు?!

32 comments:

  1. చారిత్రిక తప్పిదాలు చెయ్యడం వారి అలవాటు.

    ReplyDelete
  2. ఒకానొకప్పటి USSR యునైటెడ్ సోవియెట్ సోషలిస్ట్ రష్యా కాదు. యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ గా వ్యవహరించేవారు. రష్యా దాంట్లో ఒక భాగమే.

    ReplyDelete
  3. >>> యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అని పిలిచే భూభాగం మీద సెర్బియన్లు,బోస్నియన్లు...

    సెర్బియా, బోస్నియా పాత యుగోస్లోవియా దేశానికి సంబంధించిన జాతులు. ఇప్పుడు ప్రత్యేక దేశాలు. వీటికి, గతించిన సోవియట్ యూనియన్‌కి సంబంధం లేదు.

    మీరు... ఉక్రేనియన్లు, ఉజ్బెక్‌లు, కజాక్‌లు... అని రాస్తే బాగుంటుంది.

    ఇక పోతే మతాల గురించి నా అభిప్రాయం.

    ఏ మతమైనా ముందు ప్రజలు ఆదరించిన తర్వాతే రాజాశ్రయం పొందింది. సాధారణంగా మెజారిటీ ప్రజలు ఆచరిస్తున్న మతాన్నే రాజూ ఆశ్రయిస్తాడు.

    ఏ మతమైనా మొదట ఒక సమాజ సంస్కరణ గానే మొదలవుతుంది. తర్వాత అవలక్షణాలు పెరుగుతాయి. దానికి హిందూ, ముస్లిం, బౌద్ధం, క్రిస్టియన్ ఏదీ మినహాయింపు కాదు. చివరికి ప్రవక్త చెప్పిన విషయాలకు పూర్తి విరుద్ధంగా మారిపోవడం కూడా కద్దు.

    హిందూ మతంలోని అవలక్షణాల కారణంగా బౌద్ధం ఒక సంస్కరణా ఉద్యమంలా మొదలైంది. 1200 యేళ్ళ తర్వాత అవే అవలక్షణాలు అదీ పునికి పుచ్చుకుని చివరికి ప్రజా వ్యతిరేకతను చవిచూసింది. అప్పుడు ప్రజలకు దానికన్నా శంకరాచార్యుడిచేత సంస్కరించినబడిన హిందూమతమే మెరుగ్గా అనిపించి వుంటుంది! మళ్ళీ శరా మామూలే, అదే... అవలక్షణాలను పెంపొందించుకోవడం.

    ReplyDelete
    Replies
    1. మరోసారి తప్పు దొర్లింది,అర్రె - సారీ!

      ఉబ్జెకిస్థాన్ అనేది రష్యా కి సంబంధించినది అని తెలుసు,కానీ యెంత తన్నుకున్నా గుర్తుకు రాలేదు,అదేంతో.గూలుల్ చేసినా పోయేది!

      సౌందరనందం చదివారా?కొత్తగా పెళ్ళయిన జంటలో నందుణ్ణ్ణీ భిక్ష అడిగి బిక్షగా సన్యాసం స్వీకరించమని ఒత్తిడి పెట్టి లొంగదీసుకుంటాడు గౌతమ బుధ్ధుడు.అంత బలవంతంగా అతనిని లొంగదీసుకోవలసిన అవసర మేమిటి?

      Delete
    2. నందుణ్ణ్ణీ భిక్ష అడిగి బిక్షగా సన్యాసం స్వీకరించమని ఒత్తిడి పెట్టి లొంగదీసుకుంటాడు గౌతమ బుధ్ధుడు.

      యోగుల,గురువుల జీవితాలలో సంఘటనలు తార్కికంగా,హేతుబద్దంగా అర్థం చేసుకోలేరు.

      Delete
    3. ఏ మతమైనా మొదట ఒక సమాజ సంస్కరణ గానే మొదలవుతుంది. తర్వాత అవలక్షణాలు పెరుగుతాయి.

      హిందూ మతంలోని అవలక్షణాల కారణంగా బౌద్ధం ఒక సంస్కరణా ఉద్యమంలా మొదలైంది. 1200 యేళ్ళ తర్వాత అవే అవలక్షణాలు అదీ పునికి పుచ్చుకుని చివరికి ప్రజా వ్యతిరేకతను చవిచూసింది. అప్పుడు ప్రజలకు దానికన్నా శంకరాచార్యుడిచేత సంస్కరించినబడిన హిందూమతమే మెరుగ్గా అనిపించి వుంటుంది! మళ్ళీ శరా మామూలే.....

      well said !!

      Delete
  4. పెద్ద టపాలు రాసేటప్పుడు మీరు ఎమి చెప్పాలనుకొంట్టున్నారో, ముఖ్యమైన పాయింట్లను టపా మొదట్లోనే హైలైట్ చేస్తూ ప్రస్థావించండి. చదివే వారికి సౌకర్యం గా ఉంట్టుంది.

    ReplyDelete
    Replies
    1. పెద్ద టపాలు రాయాలని నేనూ అనుకోవడం లేదండి.ఒక మెయిన్ విషయాన్ని ప్రస్తావిన్వ్హడానికే మొదలు పెడుతుంటాను,కానీ ఒక పాయింటుని పైపైన చెప్పి వొదిలేస్తే సందేహాలు వస్తాయి.కామెంటర్లు అడుగుతారు - అప్పుదైనా చెప్పాలి గదా!ఇందులో విషయం ఒకటే,హిందువులు అణిచేస్తే బౌధ్ధం అభిగిపోలేదు అని - దానికి సాక్ష్యాలు చూపించహ్డమే చేశాను.అయినా ముందు ముందు పోష్టుల్లో అవస్రమైనప్పుడు తప్పక పాటిస్తాను.అయోధ్య వివాదం గురించి అలాగే విడివిడిగా తలకట్లు పెట్టి రాశాను గద.

      Delete
    2. This post can be divided into thee posts and posted each on an alternate day. As this post become too lengthy the original point vanished. This is only a suggestion and it your will

      Delete
    3. @sarma
      The point is only one - what I concluded as "Hindu need not to feel shy about eliminating other religions.It is a false",But I had vast information which I felt irrelevant to the point.for example jains even though they were not following non-vaidic tradition they praised Shiva!

      .I want to conclude the topic simply with that a counter argument.

      but I think all the people are fully unaware and nobody knows much,about such facts,That's why you feel like that!

      I will try to publish more posts segregating my source material and classifying them.

      The problem lies in the fact that nobody knew much about such things and I thought people can understand themselves what I left untold!

      Delete
    4. you have done well in g+ . .. That is the right way I feel.. You got the feel, energy..channelaise it ...link the present post to the next.. and things go super..

      Delete
    5. Linking is to be done as the subject of the post is one. You got the information,feel, knowledge, use it for the good of the society.
      With best wishes.

      Delete
    6. they were not following non-vaidic tradition అన్న చోట they were following non-vaidic tradition అని వుండాలి.కొన్ని దిద్దాను గానీ ఇదొకటి మిగిలిపోయి చెప్పదల్చుకున్నదానికి వ్యతిరేఅకార్ధం ఇస్తుంది.తప్పకుండా కొనసాగిస్తాను.అన్నిటికీ లింకులు ఇస్తాను - ఇదంతా ఒక పెద్ద సాలెగూడు లాగ తయారు చేశారు!

      Delete
  5. http://truthsaboutnehrufamily.blogspot.in/

    ReplyDelete
    Replies
    1. @anonymous
      వీటిలో కొన్ని నాకిదివరకే తెలుసు.కాంగ్రెసుని ద్వేషించడం నా జన్మహక్కు" అనే వరుస పోష్టుల్లో ఇప్పటికి మూడే రాశాను.నాలుగోది ఇందిరా గాంధీ గురించి రాయాలి.కానీ వెనుకాడుతున్నాను.యెందుకంటే గురుశిష్యుల వరకూ నేను వ్యక్తిగత వివరాల జోలికి పోకుండా వాళ్ళ ప్రభావం వల్ల దేశం యెలా నష్టపోయింది అనేది మాత్రమే చెప్పాను.ఇప్పుడు ఈ ఆడమనిషి గురించి యెత్తుకోవాలంటే అక్కడ ఈ బూతుపురాణమే యెక్కువగా ఉంది.కొన్నిసార్లు ఒక భావాన్ని చెప్పడానికి ఫోర్సు అవసరమైనప్పుడు కవి చౌదప్ప దారిలో బ్లాక్ కామెడీ కోసం ప్రయత్నించానే గానీ స్థాయి తక్కువ రచనలు చెయ్యలెదు.ఇలాంటి విషయాలతో పోష్టు రాయడం ఇబ్బందిగా అనిపిస్తున్నది.

      Delete
    2. ఇందిర గురించి వ్రాయడానికి కూడా బూతు పురాణం దొరికిందా మీకు ? ఇక మీకు దేశంలో ఏ స్త్రీ కూడా నచ్చదు. పాపం మీ ఆ.. !

      Delete
    3. అది టచ్ చెయ్యకుండా ఉండలేఅనంతగా ఆవిద జీవితంలో ఒక భాగమై పోయింది మరి?
      యేరుల జన్మ శూరుల జన్మం అని విశ్లషణకి దిగబోతే అవే కనిపిస్తున్నాయి హరి హరీ!

      Delete
    4. @గొట్టిముక్కల
      యే గొట్టాం గాడికి యెందుకు యే బిరుదు ఇచ్చారు అన్నది కాదు ఇక్కడ పాయింటు ఈ దేశప్రధాని ఇంగ్లీషు రాజుని సామంతుడు చక్రవర్తిని పిలిచినట్టు పిలిచి ఒక విదేశీయుడి గురించి మహజరు పంపాల్సిన వసరం ఉందా?అదీ ఇక్కడ దేశం తగలబడిపోతున్నప్పుడు.ప్రతి గొట్టాం గాడూ సాంకేతిక వివరాలతో తొక్కలో దిద్దుబాట్లకి తయారవుతున్నాడు?!

      Delete
  6. కాంగ్రెస్ ని ప్రేమించడం ఈ దేశ ప్రజలందరి బాధ్యత !

    ReplyDelete
    Replies
    1. వైరభక్తి సంప్రదాయాన్ని పాటించడం కోసమైనా ఆ పురాణం యెత్తుకోవాలేమో!
      ఆదిశక్తిని మించిన అమ్మోరి చరిత్ర - రాయకుంటె కాలం నన్ను క్షమించదేమో?

      Delete
    2. నిజమే ఎన్ డి. తివారి , అభీషేఖ్ మన్ను సింగ్వి లాంటి ఘనులను " ప్రేమించడం" కమ్మీలకే సాధ్యం పైగా భారత కమ్మీల జన్మ హక్కు అలాంటి కాంగీలని "ప్రేమించడం". ఆ దరిద్రం భారతీయులకి అక్కర లేదు హారిక గారు ...(నీ తీసేసా నా కాదు కాబట్టి).

      కళ్ళారా వారసత్వ ప్రతిభ చూస్తూ కూడా ఇందిరా రాస లీలలు దాయటం కళ్ళు మూసుకుని చీకటి ఉంది అనడం ఒక్కటే గనక ... ప్రపంచానికి తెలియనీయడం లో తప్పు లేదు.

      Delete
    3. Here vaarastva referscto ENTIRE CONGRESS .... Not RaGa alone!!

      Delete
  7. (1).
    --------------------------
    "New Delhi
    21st May, 1948

    Shri. Jawaharlal Nehru presents his humble duty to His Majesty and invites attention to the relinquishment by His Excellency Earl Mountbatten of Burma of the office of Governor-General of India with effect from June, 1948. As India’s last Viceroy, Lord Mountbatten made an outstanding contribution to the early and peaceful realisation of Indian Independence; as her first Governor-General, his advice and aid to his Ministers have been equally notable for their wisdom, sympathy and understanding.

    In her own sphere, the Countess Mountbatten has been equally active and the men, women and children of India, especially those whom partition uprooted from their established homes under the most cruel circumstances, owe her a great debt of gratitude.

    For the services, perhaps unique in the history of Indo-British association, rendered by Lord and Lady Mountbatten to the Government and people of India and to the cause of friendship between India and the United Kingdom, it is earnestly suggested that His Majesty be graciously pleased to confer upon the retiring Governor-General and his lady, some mark of recognition commensurate with those services.

    Sd/- Jawaharlal Nehru,

    Prime Minister & Minister for External Affairs and Commonwealth Relations."
    ---------------------------------
    (contd.. in 2)

    ReplyDelete
  8. (2).
    (contd.. from 1)

    హరిబాబు గారు,
    మీ బ్లాగులో మీ వ్యాఖ్య (24-08-2015 at 03:36 ; గొట్టిముక్కల గారికి మీ సమాధానం) చూసిన తర్వాత కుతూహలం కొద్దీ గూగుల్ చేస్తే మీరు మీ వ్యాఖ్యలో పేర్కొన్న నెహ్రూ గారి లేఖ (dated May 21, 1948) గురించి సమాచారం దొరికింది. నవంబర్ 14, 2008 నాటి ది హిందు (The Hindu) పేపర్లో Jawaharlal Nehru and the Mountbattens అని కె.నట్వర్ సింగ్ గారు (K.Natwar Singh) వ్రాసిన వ్యాసం లో ఉంది.

    మీరు లేవదీసిన ప్రధాన అభ్యంతరాలు :-
    "@గొట్టిముక్కల
    ....................... ఈ దేశప్రధాని ఇంగ్లీషు రాజుని సామంతుడు చక్రవర్తిని పిలిచినట్టు పిలిచి ఒక విదేశీయుడి గురించి మహజరు పంపాల్సిన వసరం ఉందా?అదీ ఇక్కడ దేశం తగలబడిపోతున్నప్పుడు. ..........!"

    నా అభిప్రాయం :- (1). ఒక దేశపు రాజుని His Majesty అనడం మర్యాదపూర్వకమైన మాటే గాని బానిసత్వం ఏమీ లేదనుకుంటాను. King George VI అంతకు ముందు వరకు భారతదేశానికి కూడా పరిపాలకుడు అనే వాస్తవం వల్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా అలా సంబోధించడమెందుకు అనేది మీ భావం అయ్యుండచ్చు. కాని వేరే దేశాలు కూడా ఓ దేశపు రాజు గురించి అలాగే His Majesty అనే అంటారు కదా. అందువల్ల నెహ్రూ ఏదో సామంతుడు లాగా వ్రాసాడు అనుకోనవసరంలేదని నా అభిప్రాయం. అదీగాక ఆ కాలంలో లేఖారచనా సంప్రదాయాల్ని అనుసరించుండవచ్చు. ఓ ఉదాహరణ - బ్రిటిష్ ఇండియా లో కలెక్టర్లతో సహా ప్రభుత్వాధికార్లు సామాన్య జనానికి ఉత్తరం వ్రాసినప్పుడు దాన్ని I have the honour, Sir, to remain your most obedient servant అని ముగించేవారట. అంతమాత్రాన ఆ అధికారులేమీ తక్కువయిపోలేదుగా. ఆ రోజుల్లో ప్రభుత్వ ఉత్తరాలు వ్రాసే పద్ధతి అదన్నమాట.
    (2). మౌంట్ బాటెన్, ఆయన భార్య భారతదేశం స్వాతంత్ర్యం పొందే సందర్భంగాను, విభజన సందర్భంగానూ చక్కగా వ్యవహరించారని, భారతదేశానికి, ప్రజలకి చెప్పుకోదగ్గ సేవ చేసారనీ, ఇక మౌంట్ బాటెన్ రిటైర్ అవబోతున్నారనీ, అందువల్ల వారి సేవలకి ఇంగ్లాండ్ చక్రవర్తి గారు తగురీతిలో ఏదైనా గుర్తింపు ఇస్తే సముచితంగా ఉంటుందనీ నెహ్రూ గారు తన లేఖలో సూచించారు. ఎవరైనా రిటైర్ అవుతున్నవారిని సత్కరించడం ఆనవాయితీయే కదా. ఆ రీతిగానే నెహ్రూ గారు కూడా భావించి ఉండచ్చు. మౌంట్ బాటెన్ ఇంగ్లాండ్ దేశస్ధుడు, అందుకని సత్కారం గురించి ఇంగ్లాండ్ రాజు గారికి సిఫారసు చేసారన్నమాట నెహ్రూ గారు. దాంట్లో నెహ్రూ గారిని తప్పు పట్టవలసినదేమీ లేదని నా అభిప్రాయం.
    తగిన గుర్తింపు ఇవ్వమన్నాడే కాని "సర్" బిరుదు ప్రదానం చెయ్యమనే సూచన ఆ ఉత్తరంలో లేదు. ఇకపోతే మౌంట్ బాటెన్ అప్పటికే "లార్డ్" బిరుదు కలిగున్నవాడు. పైన గొట్టిముక్కల గారు చెప్పినట్లు లార్డులకి మళ్ళా "సర్" ఇవ్వడం జరగదు. బ్రిటిష్ రాజ్ హయాంలో జీవించినవాడు, ఇంగ్లాండ్ లో చదువుకున్నవాడు అయిన నెహ్రూ గారికి ఈ విషయాల మీద అవగాహన బాగానే ఉండుంటుంది కదా. అయినా ఈ ఉత్తరంలో నెహ్రూ గారు "సర్" బిరుదు ప్రస్తావనే చెయ్యలేదు.
    (3). దేశవిభజన పరిణామాల వల్ల దేశం పరిస్ధితులు క్లిష్టంగానే ఉన్నాయి అప్పుడు, సందేహం లేదు. అయినా దానితోపాటు మిగతా పనులు కూడా చూడాలి కదా ప్రభుత్వం. అందులోనూ ఆ లేఖ మౌంట్ బాటెన్ పదవీ విరమణ సందర్భాన్ని పురస్కరించుకుని వ్రాసినది. ఆ లేఖ వ్రాయడానికి సందర్భానుసారంగా అదే తగిన సమయం కదా.
    మొత్తం మీద నెహ్రూ గారి లేఖలో తప్పు పట్టాల్సిందేమీ లేదని మరోసారి నా వ్యక్తిగత అభిప్రాయం. అయినా ఎవరి అభిప్రాయం వారిదనుకోండి.
    By the way, నేను నెహ్రూ కుటుంబం ఫాన్ని కాదు. దేశానికి జరిగిన పలు నష్టాలకి ఆ కుటుంబం కారణమని నేనూ నమ్ముతాను.
    నా వ్యాఖ్య కించిత్ పెద్దదయినట్లుంది, ఏమనుకోకండి. అలాగే నా వ్యాఖ్యకి మీ ఈ టపాకి ("గతి తార్కిక భౌతికవాదం ...........") సంబంధం లేదు గాని, నెహ్రూ గారి లేఖ గురించి మీరు ఇప్పుడు ఈ టపాలో మీ వ్యాఖ్య (వ్యాఖ్యకి స్పందన) గా ప్రస్తావించారు, అందుకని నా అభిప్రాయం ("దిద్దుబాటు" కాదు) కూడా వ్యక్తపరచాలనే ఉద్దేశ్యంతో నా ఈ వ్యాఖ్య ఇక్కడే వ్రాసాను.

    ReplyDelete
  9. విన్నకోట వారికి వందనం!
    అవును,ఈ లేఖని నేను హిందూ లోనే చదివాను.సేకరించి ఇక్కడ చూపించినందుకు కృతజ్ఞతలు.ఆ వార్తలో కూడా అది అనవసరమనే రకం విమర్సతో కూడిన విశ్లేషణ ఉంది.అసలు స్వతంత్రం వచ్చాక ఇంకా మౌంట్ బాటము మహాశయుణ్ణి పదవిలో ఉంచాల్సిన అవసరం యేముంది?కాశ్మీరు సమస్యని అంతర్జాతీయం చెయ్యడానికి సాంకేతికంగా అది కూడా ఒక కారణమే!వూడగొట్టిన నాగటిదుంపలా ఉండి నేడో రేపో స్వదేశానికి పోవలసినవాడు సాంకేతికంగా ఇవ్వాళ్టి రాష్త్రపతి స్థానంలో ఉండి ఆ యుధ్ధానికి మనస్పూర్తిగా సహకరించగలడా!అందువల్ల్నే యుధ్ధాన్ని ఆపై మధ్యవర్తులకి నివేదించమనే అస్లహా అక్కడి నుంచి వచ్చి ఉండవచ్చునని విశ్లేషకుల అంచనా!

    జిన్నా డైరెక్ట్ యాక్షను ప్రతిపాదించినప్పుడు జరిగిన అల్లర్లు కూడా కొంచెం గట్టిగా శాంతిభద్రతలను కాపాడే పాటి ఆసక్తి ఉంటే అంత భీబత్సాన్ని రగిలించేవి కావు అనేది కూడా అప్పటి చరిత్రని పరిశోధించిన వారిలో మెజారిటీ అభిప్రాయం.నేను "ఈ దేశం యెందుకు విడిపోయింది" అనే పోష్టులో చెప్పినట్టుగా ఇంగ్లీషు వాళ్ళకి ఇక ఇక్కడినుంచి తప్పుకోవలసిన అవసరమూ కాంగ్రెసువాళ్ళకి గాంధీ హవా మరుగైపోతూ యెక్కడికక్కడ కమ్యునిష్టు చైతన్యం పెరిగిన హింసాయుత ఉద్యమాలు చేలరేగుతుండటం వల్ల తొందర పుట్టటమూ కలిసి హడావిడి విభజన జరిగింది.

    నేను ఆ కాలపు చరిత్రని అన్నివైపుల నుంచీ చదివాకనే వ్యక్తుల గురించీ సన్నివేశాల గురించీ నికరమైన అభిప్రాయాల్ని యేర్పరచుకుని ఉన్నాను.యెంత సాంకేతికంగా చూసినా దేశం స్వత్రంతమయ్యాక ఇంకా వెనకటి పరిపాలకుల గురించి,అదీ వాల్ళు మనల్ని దోచుకోవడం - వాళ్ళతో పోరాడి స్వతంత్రాన్ని సాధించుకోవడం నిజమైతే ఆ రకమైన ఆప్యాయతలు అనవసరం కదా?

    అంత స్నేహపూరిత సహకారంతో మనకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు అంటే ఇంగ్లీషు వాళ్ళ దోపిడీ అబధ్ధమైనా కావాలి,లేదంటే దోపిడీదారులతో కూడా సఖ్యత పాటించడం అనేది క్షాత్రలేమి అయినా కావాలి!

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారు,
      పైన నేను వ్రాసిన వ్యాఖ్య (24-08-2015) ప్రధానంగా నెహ్రూ గారి ఉత్తరంలోని పదజాలం గురించి మాత్రమే.
      మీ సమాధానంలో చెప్పిన వాదనలో బలముందనిపిస్తుంది. ఈ విషయం గురించి నెట్లో ఈ క్రింది రిసోర్స్ దొరికింది.
      Why did independent India and Pakistan retain British generals?
      Review by Rajendra Nath అని The Tribune (Sunday, May 12, 2002)
      లో వచ్చిన రివ్యూ కనిపించింది.
      War and Diplomacy in Kashmir 1947-48
      by C. Das Gupta.
      Sage Publications, New Delhi. అనే పుస్తకం మీద రివ్యూ గా వ్రాసిన వ్యాసం ఇది. ఓ కొత్త కోణం చూపిస్తోంది. చదవండి. ఆసక్తికరంగా ఉంది. ఈ క్రింది లింక్ లో చదవచ్చు.

      www.tribuneindia.com/2002/20020512/spectrum/book3.htm

      Delete
    2. హరిబాబు గారు నా వ్యాఖ్యను డిలీట్ చేసినప్పటికీ సమాధానం ఇవ్వడం & విన్నకోట వారు దానికి బహుచక్కని జవాబు ఇవ్వడం సంతోషకరం. చర్చ చాలా బాగుంది, ఇరువురికి ధన్యవాదాలు.

      ఇకపోతే ఇక్కడ "సాంకేతిక వివరాలు" బదులు "న్యాయ/చట్ట సూత్ర విశ్లేషణ" ఏమిటో చూద్దాం.

      ఒక దేశం స్వతంత్రం కావాలంటే రెండు మార్గాలు ఉంటాయి. ఇతరుల ఏకీభావనతో సంబంధం లేకుండా ఏకపక్ష స్వాతంత్ర్య ప్రకటన (unilateral declaration of independence, UDI) ఒకటయితే బహుళామోదంతో స్వతంత్రం సాదించడం రెండవిది.

      ఒకప్పుడు UDI (ఉ. అమెరికా యుద్ధం ద్వారా సాదించిన స్వాతంత్ర్యం) ఒకప్పుడు ప్రాబల్యంలో ఉండేది. ఇరవయ్యో శతాబ్దిలో ఐక్య రాజ్య సమితి లాంటి సంస్థలు రావడం & అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ గట్టి పడడం దరిమిలా ఇది కష్టతరం అయ్యింది. అంచేత సామ్రాజ్యవాదుల దోపిడిపై ఎంత వ్యతిరేకత ఉన్నా "స్వాతంత్ర్యం వాళ్ళు ఇస్తే పుచ్చుకోవడం" అన్న మార్గాన్ని ఎంచుకోవడం ఆనవాయితీగా మారింది. భారత్ మొదలు సామ్రాజ్యవాదుల చెర నుండి విముక్తి అయిన అన్ని దేశాలూ ఇదే బాటను అనుసరించాయి.

      మనం ఇంగ్లాండు పార్లమెంటు చేసిన భారత స్వాతంత్ర్య చట్టం (Independence of India, 1947) ద్వారా కాక UDI బాట పట్టి ఉంటె పర్యవసానాలు ఎలా ఉండేవో ఊహించడం కష్టం కాదు. అప్పటికే రెండు ముఠాలుగా చీలిన ప్రపంచ దేశాలలో రష్యా మనకు మద్దతు చెప్తుంది కనుక అమెరిక & మిత్రపక్షాలు భారత దేశాన్ని గుర్తించే వారు కాదు. తద్వారా మన అంతర్జాతీయంగా పరువు ప్రతిష్టలు, వాణిజ్య సంబంధాలు వగైరాలలో గట్టి దెబ్బ తగిలేది. అప్పటికే మనకున్న ఐక్య రాజ్య సంఘటన స్థానాన్ని పాకిస్తాన్ తన్నుకు పోయినా ఆశ్చర్యం అక్కరలేదు. ఉ. ప్రస్తుత కొసొవో పరిస్తితి చూస్తె మీకే తెలుస్తుంది. We could not have taken our rightful place in the community of nations had we resorted to UDI.

      డా. అంబేద్కర్ & ఇతర రాజ్యాంగ నిపుణులు దీనికి బ్రహ్మాండమయిన పరిష్కారం చూపించారు. తదుపరి స్వతంత్ర దేశాలు కూడా దీన్నే పాటించడం ముదావహం.

      1. భారత స్వాతంత్ర్య చట్టం ద్వారా స్వాతంత్ర్యం "పుచ్చుకోవడం"
      2. బ్రహ్మాండమయిన అధ్యయనం చేసి రాజ్యాంగ రచనా ప్రక్రియ
      3. రాజ్యాంగంలో 395వ అధికరణ ద్వారా సదరు ఇంగ్లాండు చట్టాన్నిరద్దు
      4. ఈ రద్దును బలపరస్తూ రాజ్యాంగ ఉపోద్ఘాతంలో (preamble) "భారత ప్రజలమయిన మేము" (we the people) అనే అంశం పేర్కొని తద్వారా మన సార్వభౌమత్వాన్ని తిరిగి రాజమార్గంలో తీసుకోవడం కొసమెరుపు

      This constitutional & legal masterpiece that set the tone for all subsequent independent nations.

      ఈ ప్రక్రియలో తాత్కాలికంగా (1947 ఆగస్టు 15-1952 జానువరి 26) కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి: వాటినే మీరు ప్రస్తావించారు. ఈ మధ్యకాలంలో డోమీనియన్ హోదా, ఇంగ్లాండు రాజుకు లాంచనపు సలాములు, రాజు "ప్రతినిధి"కి (ముందు మౌంట్బాటెన్ తరువాత రాజాజీ) మొదటి పౌరుడి హోదా వగైరా చిన్నచిన్న సర్దుబాట్లు చేయాల్సి వచ్చినా మనకు ఎంతో నష్టం చేకూర్చే అంశాలను దాటవేయగలిగాము. The compromise was minor & temporary compared to the serious risks of resorting to UDI in a cold war atmosphere.

      A few points in conclusion:

      1. Dismissing important factors as mere "technicalities" betrays impatience, inability to handle facts & logic and, most importantly, ignorance.

      2. The same goes for language like గొట్టాం గాడూ. Can we concentrate on facts & logic, thanks a lot.

      Disclaimer: I am a Republican & very strongly oppose all forms of monarchy. The above comment is only to educate you and is not intended to support/praise either the British Raj or their imperialism.

      Delete
    3. @జై
      పైన ప్రవీణ్ ఈ దేశప్రతిష్ఠకి సంబంధించి విదేశీవనితతో అక్రమసంబంధాన్ని కూడా క్షమించవచ్చు కదా అంటుంటే అసహ్యం వేసి తన కామెంట్లు తీసేశాను.ఆ వరసలో మీ కామెంటు కూడా పోయింది ప్రమాదవశాత్తూ!

      మేధావులు కూడా సాంకేతికంగా ఆలోచించేవారు కూడా మనకి స్వతంత్రం వచ్చాక కూడా స్నేహపూర్వకంగా వారినే గవర్నరు జనరలుగా కంటిన్యూ చేయ్యడం గురించివిమర్శిస్తున్నారు!పైగా మనని దోచుకున్నారు అన్నప్పుడు అది మనకి శత్రుదేశమే అవ్వాలి కదా,వాళ్ళ మనిషికి వాళ్ళు గౌరవాలే చేస్తారో అవమానిస్తారో మనకెందుకు?

      సాంకేతికంగానే ఆలోచించాలంటే వారితో స్నహసహకారాలు పాటిస్తూ విడిపోతే వారి దోపిడీ మరియూ వారితో అరిభీకరంగా పోరాడి సాధించుకోవడం అనే సాంకేతిక ప్రక్రీయకి మరో పేరు పెట్టాలి - మీకు సాంకేతిక వివరాల పట్ల వ్యామోహం ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ పని చెయ్యండి?!

      కానీ దేశప్రజలకి రోటీ,కపడా,మకాన్ తర్వాత ఇజ్జత్ ఆనటే స్వాభిమానం కూడా అవసరమే అనుకుంటే జాతిపితలూ,పండిట్ మహాశయులూ ఆ స్కేలుకి తూగరు!

      Delete
    4. మేము హిందూమతం ఉద్దరించటం లేదు, జై డుప్లిసిటి , వెధవాయి తనాన్ని ఎత్తిచూపుతున్నాము. ఆయనకి సిగ్గు, నీతి, నిజాయితి ఉంటే ఈపాటికే వెనుకబడిన హిందూ మతం వదలి వెళ్లాలి కదా!

      హిందూ మతంలో అటు సామాజికం గా, ఇటు ఆధ్యాత్మికం గా (గురువులు) మొదలైన ఏ అంశాలు నచ్చనప్పుడు, 'జై' ఎందుకు ఆ మతం లో కొనసాగుతున్నాడనేదే ప్రశ్న? ఆత్మ వంచన చేసుకొనే వారు కూడా హరిబాబు ను ప్రశ్నించటమే!

      ఈ లో గ్రేడ్ మోరాన్ లాజిక్,ఫాక్ట్స్ గురించి మాట్లాడటం వింత. వీళ్ల ప్రశ్నలకి హరిబాబు జవాబులివ్వటం రోత గా ఉంది.

      Delete
  10. https://bharatabharati.wordpress.com/2015/09/06/the-double-standards-of-our-civil-society-balbir-punj/

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...