Saturday 29 August 2015

ఓ పవిత్ర భారత నారీ నువ్వెక్కడున్నావు!ఈ నైతిక భ్రష్ఠత్వ మేమిటి నీకు?జగమంతా సూర్యవంశమేనని సర్దుకుపోవాలా?!

     ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి ఇద్దరు మగళ్ళ పేర్లు చెప్పి వాళ్లలో యెవరో ఒకర్ని "లవ్" చెయ్యమని వెంటపడి వేధించటం!తిరస్కరించినందుకు కోపమొచ్చి అర్ధనగ్నంగా నడిపించి వీడియో తీసి ఇద్దరు మగాళ్లకి పంపించటం - చూసి యెంజాయ్ చెయ్యమని సందేశాలు ఇచ్చి మరీ రెచ్చగొట్టడం, యేమిటీ విశృంఖలత్వం?!ఆ ఇద్దరిలో ఒకడు ట్రెయినీ లెక్చరర్,యెక్కడ జరిగింది ఇదంతా?నాగార్జునా విశ్వవిద్యాలయం యేమన్నా నాగరికతకి దూరంగా ఉందా!జనసమూహం మధ్యనే ఉన్నారు గదా వీళ్ళంతా?!ఆ మొదటి అమ్మాయి చెయ్యమన్నది ఒక జీవిత కాలపు బంధం అనబడే సీరియస్ వ్యవహారమా - కాదు టెంపరరీ రొమాన్సు కోసం తార్చడం!

     ఇలాంటి తార్పుడు పనుల కోసమా కష్టపడి ఫీజులు కడుతూ కాలేజిలకి పంపిస్తున్నది?ఇలాంటి పైశాచిక చేష్టలకి ట్రెయినింగు కోసమా కాలేజీలు ఉన్నది?అంత దుర్మార్గం అంతకాలం పాపభీతి గానీ ఆత్మవిమర్స గానీ లేకుండా ఒక ఆడపిల్ల చేసిందంటే తలిదండ్రుల పెంపకం అట్లా అఘోరించిందని అర్ధం కావడం లేదా!జరగకూడనిది జరిగిపోయాక యెవరెవరి ప్రతిస్పందన యెలా ఉంది?అంత దుర్మార్గం చేసిన తమ కూతురు అమాయకురాలని తలిదండ్రులు వెనకేసుకొచ్చారు - ఛీ!ఒక మంత్రి మేము సింగపూరును తలపించే రాజధాని కడుతుంటే ఆధునిక సంస్కృతిని అలవాటు చేసుకోలేక చచ్చింది అనేశాడు ఆ టార్చరు భరించలేకా అధికార్లకి రిపోర్టు ఇచ్చినా పట్టించుకోకా "ఈ కాలేజీ వేస్టు ఈ యూనివర్సిటీ చెత్త" అని డైరీలో అసహ్యించుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన ఆడపిల్ల గురించి - ఛీఛీ!ఆడపడుచుల కోసం అలమటించే అన్నగారి ఆశయాలకు కట్టుబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అతనింకా మంత్రిగానే ఉన్నాడు కాబోలు - ఛీఛీఛీ?

     తన వయస్సులో సగం ఉన్న కుర్రాళ్ళతో కలిసిపోవడం అని సమర్ధించుకుంటూనో యేమో అసహ్యంగా కాళ్ళూ చేతులూ వూపుతూ డ్యాన్సులు చేస్తున్న నేలబారు దిగజారుడు బ్రోతలు వెధవ విద్యాధికారియా?ఆ అమ్మాయీ ఆమె తండ్రీ యెన్నిసార్లు యెన్ని రిపోర్టులు ఇచ్చినా పట్టించుకోకుండా ఒక ఆడపిల్ల చస్తే ఇంత రాధ్ధాంతమేమిటని విసుక్కున్న యాజమాన్యాన్ని నిలదీసి ఉతికి ఆరెయ్యటానికి బదులు వాళ్ళనే సమర్ధిస్తూ కొందరు కుర్రాళ్ళూ పెద్దాళ్ళూ కూడబలుక్కున్నట్టు కులసంఘాల బోర్డులతో ఆందోళనలు చెయ్యటం - యెన్ని సిగ్గుపడాల్సిన పనులు సిగ్గు లేకుండా చేశారు?!అంటే నిజంగానే రిషితేశ్వరి అనే అమ్మాయి ఒళ్ళు కొవ్వెక్కి చచ్చిపోయిందనా వాళ్ళు అంటున్నది?!బయటపడింది గాబట్టి ఆ ఒక్కచోటు చుట్టూ ఆందోళనలు చేశారు, అక్కడ కొత్త మనిషిని వీసీగా అపాయింటు చేశారు,మరి మిగతా చోట్ల అద్భుతంగా వెలిగిపోతున్నదా?

     ఇప్పుడంటే ఆ తార్పుడు వీడియో తీసిన ఆడపిల్ల కేసులో బుక్కయి అఘోరిస్తున్నది గానీ ఇలా జరక్కపోతే కొన్నేళ్ళ తర్వాత ఇప్పటి ఇంద్రాణి ముఖర్జీలా తయారై ఉండేది కాదా?ఒకటో రెండో సన్నివేశాలు జరిగితే యెక్కడో ఒకరిద్దరు వెధవ పన్లు చేస్తే మొత్తం ఆడజాతిని విమర్శించటం అన్యాయమే కావచ్చు,కానీ మళ్ళీ మళ్ళీ జరుగుతున్నప్పుడు అదీ ఇంత తరచుగా బయట పడుతున్నప్పుడు కూడా మాట్లాడకుండా ఉంటే మనం కూడా వాటిని ఆమోదిస్తున్నట్టు కాదా?యాక్సెప్టబిలిటీ పెరగడం వల్లనే ఇవి తరచుగా జరుగుతున్నాయి,నిజం!ఇప్పుడు బయటపడుతున్నవి జరుగుతున్నవాటిలో యే పదో వంతులోనో ఉంటాయి,బయటపకుండా సమాజంలో జరిగిపోతున్నవి చాలా యెక్కువ శాతమే!ఇవి అక్రమ సంబంధాలు కూడా కాదు,అంతకన్నా నీచమైన వ్యవహారాలు!కొన్నేళ్ళ క్రితం నేను "సూర్యవంశం" అనే టీవీ సీరియల్ చూశాను.కధలో అభూత కల్పనలూ,నేల విడిచి సాము చెయ్యడాలూ లేకుండా పాత్రల రూపురేఖలు కొంచెం వాస్తవానికి దగ్గిరగా ఉన్నట్టు అనిపించి ఆసక్తిగా చూశాను.కానీ క్లైమాక్సు దగ్గిర కొచ్చేసరికి పెద్ద షాకు!అప్పటిదాకా పవిత్రంగా సంసారపక్షంగా ఉండే ఆడమనిషి కూడా తన భర్తకి ఇంకో భార్య ద్వారా పుట్టిన కొడుకూ తన భర్తకి తన ద్వారా పుట్టిన కూతురూ పెళ్ళి చేసుకుంటామంటుంటే అదేదో చాలా మామూలు విషయమన్నట్టు అనుమతి ఇచ్చేస్తుంది?!పైగా ఆఖర్లో "జగమంతా సూర్యవంశం" అనే కొటేషను ఒకటి తెరమీద వొదిలారు!అంటే ఆ తల్లీ ఈ కూతురూ ఇంకో తల్లీ దాని కొడుకూ వీళ్ళిద్దరి మొగుడూ అందరూ సూర్యుడి బిడ్డలే కాబట్టి అన్నా చెల్లెలో అక్కా తమ్ముడో అయ్యేవాళ్ళు కూడా సుబ్బరంగా పెళ్ళి చేసుకోవచ్చునని సీరియల్ తీసిన వాళ్ళూ దాన్ని జనం మీదకి వొదిలిన చానెలు వాళ్ళూ తేల్చేశారు!ఆ సాగలాగుడు మలుపులకి అప్పటికే విసుగెత్తి పోన్లే అయిందనిపించాడు కదా హమ్మయ్య అనుకున్నారో యేమో యెవరూ అభ్యంతరం చెప్పినట్టు నాకెక్కడా దాఖలాలు కంపదలేదు!

     హఠాత్తుగా యెప్పుడో యెక్కడో ఒకచోట జరిగినా అది తప్పు అనే అభిప్రాయం మనకుంటే మన జీవితంలో అలాంటి పని చెయ్యము గదా!అది లేకపోవటం వల్లనే అంత నిస్సిగ్గుగా ఇంద్రాణి అన్ని తప్పులు చేసింది, అవునా?మతధర్మ శాస్త్రాల పట్టు సడిలింది,డబ్బుతో కోర్టుల్ని మ్యానేజి చేసి చట్టం నుంచి తప్పించుకోవచ్చుననే ధీమా పెరిగింది,అనైతికంగా ఉండటమే సాహసకార్యంగా గుర్తింపు పొందింది!తమని చెల్లెలి గానూ తమ్ముడి గానూ పరిచయం చేస్తున్నప్పుడు ఆ పిల్లలూ వ్యతిరేకించ లేదు!ఆ కూతురూ తను సంబంధం పెట్టుకుంటున్నది యెవరితోనో తెలిసి కూడా కొనసాగించింది - యెవరి వెసులుబాటు వారు చూసుకున్న అపవిత్ర సూర్యవంశమే ఇక్కడ కూడా!ఇవ్వాళ్టి ఆడవాళ్ల లోని చిత్రమైన యాక్సెప్తబిలిటీకి మరో వికృతమైన వుదాహరణ - బాహుబలి సినిమాలో అప్పటికే ప్రేమించుకుని మనస్సులో ఒకరినొకరు భార్యాభర్తలుగా అనుకుని ఉన్న జంట మధ్య జరిగిన శృంగారాన్ని కూడా మానభంగం కింద అల్లరి చేసిన తెలుగమ్మాయి అన్నపూర్ణ వల్లక్కాడో యెవరో s/o సత్యమూర్తిలో నిత్యా మీనన్ కారెక్టరు ఒకణ్ణి గాఢంగా ప్రేమిస్తూ కూడా హీరోని గాఠిగా కావిలించుకోవడాన్ని యెందుకు వ్యతిరేకించలేదు?ఒక మగాడు తనకి నచ్చిన అమ్మాయి పట్ల ఆ అమ్మాయి కూడా ఇష్తపడుతున్నదని తెలిశాకనే కొంచెం రఫ్నెస్ చూపిస్తే తట్టుకోలేక రేప్ అని హడావిడి చేసిన ఆడమనిషికి వేరే మగాణ్ణి పెళ్ళిచేసుకోవడానికి సిధ్ధమై ఉండి కూడా హీరోని అంత గాఠిగా కావిలించుకోవడం అనైతికం అనిపించ లేదా?ఇలా తగలడింది ఇవ్వాళ్టి ఆడవాళ్ళ నైతికత?!

     ఇదివరకటి రోజుల్లో పాటించిన మగాడు యేం చేసినా ఫర్వాలేదు ఆడది మాత్రం బుధ్ధిగా ఉండాలి అనే రూలుని వీళ్ళు రివర్సుగేరుకి తీసుకొచ్చారు,ఇదే మహిళాభ్యుదయం కాబోలు!ఒకప్పుడు మాతృస్వామ్యం కూలిపోయి పురుషస్వామ్యం మొదలైంది మితిమీరిన ఇన్సెస్ట్ వల్లనే!ఆనాడు వివాహం అనేది లేకుండా గుంపులో గోవిందా అని యెవరు యెవరితో యెంత కాలం కుదిరితే అంత కాలం స్వేచ్చాప్రణయవిహారులుగా తిరగవచ్చుననే పధ్ధతిని పాటించేవాళ్ళు కాదంటే వెలివేసేటంత గొప్పగా!ఒక తల్లి నుంచి పుట్టిన వాళ్ళు అంతా ఒక సమూహం - తొలి తరపు తల్లి పేరుతో గణం అనే పేరుతో ఉండేది!ఆ రాణి స్థానంలో ఉన్న ఆడది కూడా కొడుకా మనవడా అని చూడకుండా తనకి నచ్చినవాణ్ణి యెన్నుకుని అతన్ని రాణీగారిమొగుడుగా ప్రకటించి మరింత హక్కుగా కూడుతూ ఉండే కాలమూ ఉంది.కానీ పోను పోనూ తెలియని రోగాలు వచ్చి గణాలకి గణాలే తుడిచిపెట్టుకు పోతున్న దశలో రెండు వేర్వేరు గణాలకి సంబంధించిన స్త్రీ పురుషుల మధ్యన జరిగిన సాంకర్యం వల్ల మంచి సంతానం కలగడంతో అప్పటి తెలివికి తోచిన పరిష్కారం - ఒకే తెగకి చెందిన స్త్రీ పురుషుల మధ్యన సంబంధాన్ని నిషేధించి తమ తెగలోని స్త్రీలని మరో తెగకి పంపించి ఆ తెగలోని స్త్రీలని తమ తెగలోకి తెచ్చుకోవటం!దీనివల్లనే మొదటిదిగా స్వజాతి సంపర్కం వల్ల పుడుతున్న జన్యుసంబంధమైన రోగాలకి స్త్రీలే కారణం అనే ఆత్మన్యూనతా రెండవదిగా కొత్త తెగలో పట్టు సాధించలేకపోవటమూ కలిసి మొత్తం ఆడపెత్తనమే కుప్పకూలి పోయింది?!ఈ సోదర సొదరీ సంబంధాల వల్ల పుట్టే పిల్లలు ఈ కాలంలో కూడా రోగాలతో పుట్టి యెక్కువ కాలం బతకడం లేదు - చాలా దేశాలలో చట్టపరంగా కూడా నిషేధాలు ఉన్నాయి.ఒక పరనారీ వ్యసనగ్రస్తుదైన రామద్వేషిని 18 యేళ్ళు దేశప్రధానిగా భరించితే అతగాడు JNU లాంటి విద్యాసంస్థల్ని హిందూ మతద్వేషులతో నింపితే  పిన్నిని పెళ్ళాడాలనుకునే మదపిచ్చి కమ్యునిష్టులు పెరిగి హేతువాదం పేరుతో వావివరసల్ని కూడా భ్రష్టు పట్టించారు!

     ఇప్పుడీ ఇంద్రాణి ముఖర్జీని ప్రముఖులైన హిందూమత ద్వేషులు యేదో ఒకనాడు సామాజిక విప్లవకారిణిగా అభివర్ణించి వెనకేసుకు వస్తారు చూస్తూ ఉండండి!ఇప్పటి భర్తగారి నామధేయం వల్ల గోడ మల్లయ్యలు కూడా మా మతస్థుల మీద జరుగుతున్న కుట్ర అంటూ వారి తరపున ఉద్యమించినా ఆశ్చర్యపోనక్కర లేదు - ఒక మీడియా చేతులో ఉంది కదా మీడియా లో మిత్రులూ ఉన్నారు శత్రువులూ ఉన్నారు, మీడియా కిక పంగే పండగ!సరే ప్రస్తుతానికి కోర్టులో కేసు బుక్కయింది కానీ విచారణకి సహకరించటం లేదట అసలు కధానాయిక  - యే రావణ జఠల్మానీయో కేసు టేకప్ చేసి సలహా ఇచ్చి ఉంటాడు!అసలు అన్ని అబధ్ధాలూ అన్ని పెళ్ళిళ్ళూ అవసరమా?ఒక భర్తతో పడలేదంటే ఆ ఒక్కడిలో తప్పు ఉందనుకోవచ్చు,విడాకులు తీసుకుని పోనీ పెళ్ళి చేసుకోవాలనే అనుకుంది, కూతురుని చెల్లిగా చెప్పుకునే ఖర్మ దేనికి?ఆ కూతురు యెలా ఒప్పుకుంది?యే ప్రశ్నకీ యెవరినుంచీ సమాధానం రాదు ఇప్పుడప్పుడే,కానీ అందరి పాపాల చిట్టాలూ యేదో ఒకనాడు బయట పకపోవు, అనాడు తల దించుకోకా తప్పదు!మన సాహిత్యంలో శుకసప్తతి కధలు ఉన్నాయి.అందులోని విషయం కూడా ఇలాంటి అనైతిక శ్రంగారమే!ఒక కులస్త్రీకి ఒక పరపురుషుడు ఆహ్వానం పంపుతాడు.ఈమెకి కూడా మోహం పుట్టి సింగారించుకుని వెళ్ళబోతుండగా పెంపుడు చిలక ఆపి ఒక కధ చెప్తుంది.ఆ కధలో వస్తువు ఇదివరకే పరపతులతో ప్రణయం సాగించిన మదవతుల విన్యాసాలు!అయితే ఆ కధలు విశృంఖలత్వానికి తెర యెత్తినవి కావు- మెలిక యేమిటంటే కధంతా చెప్పి ఆ కధలోని స్వైరిణి వలె నువ్వు దిగజారుడు పనులు చెయ్యగలవా అనే రకపు ప్రశ్నలు వేస్తుంది చిలక.అవి తను చెయ్యలేనని తెలుసుకుని ఉసూరూమనటమూ అప్పటికి వేళ మించిపోవటమూ జరిగి నాయిక వెనక్కి తగ్గుతుంది - ఆ రోజుకి అలా ఆమె పవిత్రత నిలబడుతుంది,మరుసటి రోజు రాత్రి మరో కధ!అంటే కధకుదు రంకు చెయ్యాలంటే ఇన్ని బొంకులు బొంకాలి,పరువుగా ఉండదల్చుకున్నవాళ్ళు ఇటువంటి పనులు చెయ్యరాదు అనే నీతిని యెక్కించడం కోసమే ఆ కధల్ని అట్లా కల్పించాడు,అయితే ఇవ్వాళ లేనిదే అది - పరువూ గిరువూ జాంతానై నచ్చిందా దోచెయ్! 

     నాకయితే ఇలాంటివి ముందు ముందు మరిన్ని బయటపడినా సమాజంలో యే చలనమూ కలగదని గట్టిగా అనిపిస్తున్నది!యెందుకంటే కలిగితే నిర్మాణాత్మకంగా సమస్య మూలానికి వెళ్ళాలి,మూలం దగ్గిరికి వెళితే మొత్తం సంస్కృతినే మార్చవలసి వస్తుంది,ఇప్పటి సంస్కృతిని మార్చడం అంటే ఇవ్వాళ అనుభవిస్తున్న సుఖభోగాల్ని వొదులుకోవాలి - యెవరు వొదులుకుంటారు?యేమి చెప్పినా ముప్పే!యేం చెప్తాం?నీతిగా ఉండమంటాం,అంతేగా?పొరపాట్న రాముడి గురించి చెబితే పోవాయ్ పుల్లాయ్ అంత నీతిగా ఉండి యేమి ఉధ్ధరించాడు అడివిలో కందమూలాలు తిన్నాడు,నన్నూ అట్లా ఉండమంటావా అని అడుగుతుంటే ఇంక నీతులు చెప్పడ మెట్లా?!బ్రాహ్మణులు కూడా పిలకల్ని గొరిగించుకుని క్రాపులతో తిరుగుతున్న కాలంలో మళ్ళీ వెనక్కి వెళ్ళడం సాధ్యమా:-)కానీ ఒకటి మాత్రం నిజం - సీత కష్టాలు సీతవి,నిజమే కావచ్చు!అన్ని కష్టాలు భరించినా ఆత్మగతమైన ఒక ధీమా,నేను తప్పు చెయ్యలేదు అనే భావమే సీతని జగత్సుందరిని చేసింది!ఇంద్రాణి అనే గొప్ప పేరున్న ఈ బొంకుల దిబ్బ జైలుపాలై అఘోరిస్తున్న ఇప్పటి స్థితిని అప్పుడే వూహించుకుని ఉంటే చెయ్యగలిగేదా?వీళ్ళ కోసమే అన్నట్టు వేమన్న యెప్పుడో అన్నాడు,"నిరుడు ముందర దగ్ధులైన వారు తన యంతవారు గారో!యెక్కడికి పోవ నెరిగి యముడు చంపడా?" అని!

     ప్రతి తప్పుకీ ఒక శిక్ష ఖచ్చితంగా ఉంటుంది,కొన్ని శిక్షలు వెంటనే పడతాయి,కొన్ని టైము తీసుకుంటాయి - ఈలోపు తప్పించుకోగలమనుకున్న వాళ్ళు కొంచెం హడావిడి చేస్తారు - అంతే!ఈ భూమి మీద యేదీ ఒకేసారి తడిగానూ పొడిగానూ ఉండదనుకున్న వాడు నురగతో చచ్చాడు!కిందా కాకుండా మీదా కాకుండా,లోపలా కాకుండా బయటా కాకుండా ఉండే చోటు యెక్కడా లేదనుకుని జీవమూ నిర్జీవమూ అయినది ఉండనే ఉందని విర్రవీగిన వాడు స్తంభాన్ని చీల్చుకుని పుట్టిన ఉగ్రనరసింహమూర్తి వాడిగోళ్ళకి బలైపోయాడు!బిడ్డల తొలిబుధ్ధులు తల్లిఒడిలోనే మొదలవుతాయి,ఇక్కడ తల్లీ చెడింది,ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు కూతురూ చెడింది!ఒక ఆడది చెడితే - పెళ్ళి కానిదైతే తలిదండ్రులు తల దించుకోవాలి,పెళ్ళైనదైతే రెండు కుటుంబాలు తల దించుకోవాలి,బిడ్డలు గలదైతే రెండు తరాలు తల దించుకోవాలి!కానీ కళాకారుడు చెడితే వాడు మాట్లాడే భాష మాతృభాషగా ఉన్నవాళ్ళంతా తల దించుకోవాలి!!ఇన్ని తరాల పాటు స్త్రీ అంటే రంభోరువులూ నాభిదేశమూ తనుమధ్యమూ వక్షోజాలూ మాత్రమే అని వాటినే చూపించి వెర్రెక్కించటమే తప్ప ఆమెకో ముఖం ఉంటుందనీ ఆ ముఖం వెనక భావాలు ఉంటాయనీ చూపించడం చాతగాని వాళ్లంతా కళ పేరుతో రెచ్చగొడితే ఆ సమాజం పరిస్థితి ఇట్లాగే అఘోరిస్తుంది!!!కుర్రాడైతే ఆడదాని అందాల్ని రుచి చూడ్డమే ముఖ్యం, ఇష్టం లేకపోతే రేప్ అయినా చెయ్యడమే మగతనం అనుకుంటాడు,కుర్రదైతే తన అందాల్ని యెరగా వేసి మగాళ్లని వెంటతిప్పుకోవటమే ఘనకార్యం అనుకుంటుంది!వ్యామోహం ఇద్దరిలోనూ ఒకేరకంగా చెలరేగితే వావివరసలూ యెగిరిపోతాయి.యెక్కడ బడితే అక్కడ కనిపిస్తున్న ఈ మనస్సులో అనైతికత నిండిన చీకటి గుహల్లో నైతికత వెలుగుల్ని నింపడానికి యెన్ని దీపాలు వెలిగించాలి?!

ప్రియాన్న సంభవేత్ దుఃఖం అప్రియాత్ అధికం భయం
                                          తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనః!
     ఈ మంత్రం సీతాదేవి మనకు చేస్తున్న జ్ఞానోపదేశం వంటిది!"మనకు కలిగే దుఃఖాలన్నిటికీ మూలకారణం వస్తువులతో గానీ వ్యక్తులతో గానీ మనకు గల మమకారం నుండి యెక్కడ వియోగం కలుగుతుందో నని భయపడటం.అలాంటి భయాలకూ దుఃఖాలకూ అతీతులైన మహాత్ము లందరికీ నేను నమస్కరిస్తున్నాను." - బహుశా రాముడి పట్ల తనకి గల వ్యామోహంతో కలిగిన భయం వల్ల లక్ష్మణుణ్ణి అనకూడని మాటలు అనటమే తన కష్టాలకి కారణమని స్వానుభవం నేర్పిన పాఠం కాబోలు!

వాల్మీకి అందరికీ పనికొచ్చే నీతుల్ని సీత ద్వారానే చెప్పాడు - సీతాయాః చరితం మహత్!

37 comments:

  1. రావణునిలాటి భర్త శూర్ఫణఖలాటి భార్య కావాలనుకుంటున్న కాలం, అదే గొప్ప అదే అభివృద్ధి అనుకుంటున్న కాలం. భర్తలను మార్చుకునే కాలం, ఒక భర్త ఉండగా మరొకరితో తిరిగే కాలం, భార్య ఉండగా మరొకరితో కులికే కాలం, రామా అంటే బూతు మాటలా వినపడే కాలం, రాముడికి, సీతకి, మండోదరికి కాలం చెల్లిన కాలం, ఇది కలికాలం, బుగ్గలు నొక్కేసుకోకండి, ఉపయోగం లేదు, ఎవరిమాట ఎవరు వింటారు? అసలెందుకు వినాలి. బాధ పడకండి, భారతనారి బాగానే ఉంది.

    ReplyDelete
  2. Haven't you heard the SUPER HIT song - I WANT BAD BOYS?

    ReplyDelete
  3. సభ్యత, సంస్కారాలు, వావీ వరసలు మరిచిపోయిన పాశ్చాత్య దేశాలు ఎంతగా అఘోరిస్తున్నాయో అక్కడ ఉండే వారికే తెలుస్తుంది. పై పై మెరుగులు చూసి మోసపోయి, వాళ్ళ సంస్కృతే గొప్పదని, వాళ్ళలాగా బ్రతకడమే గొప్ప ఘన కార్యంలా భావిస్తూ ఉండేవారికి మన సంస్కృతి గురించి ఎంత చెప్పినా తలకెక్కదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోనివ్వండి. మీ ప్రయత్నం మానకండి.

    ReplyDelete
  4. Money matters!
    It is the lure of the lucre that plays a major role in attracting these small-town girls, says Varsha, and adds: "Since these students are young, they get good money from their clients, which are solicited either directly or through their brokers. Each girl has more than six-seven SIMs and they keep changing their numbers. Each girl earns almost 6000 to 10,000 per night. And on hourly basis, their charging rates are 1500 to 2000, depending upon the client. On an average, each girl indulges in paid sex at least twice a week. So, in a month, they rake in plenty of moolah."

    Expensive tastes
    "In some of the cases, a part of this money is spent on their families, but in most of the cases, it is blown on expensive mobiles, la-di-dah makeup, accessories and smart new wardrobes. Almost all these girls drink like fish and live under the illusion of being as smart and trendy as their mini-metro brethren, informs Varsha. She goes on to add: "We have registered data base of 3000 non-brothel commercial sex workers, and out of these, almost 70 per cent are students. Others are young girls, who are supposedly working in different organisations in Nagpur and indulging in commercial sex during the working hours. The parents are blissfully unaware about the true nature of their work or education."

    http://timesofindia.indiatimes.com/life-style/people/College-girls-by-day-sex-workers-by-night/articleshow/24738353.cms

    ReplyDelete
    Replies
    1. Remamber a pro. running a lodge for scholars at Tirupati, a pro. asking money or to lay with him. This is universal in versities of India and much in west.who is bothered about chastity? Earning one lakh on an average per month is not less. Nobody is ready to speak about them

      Delete
    2. http://www.andhranews.com/ftopic1360.html

      Delete
    3. A research student is much worried about earning money than thre 'research' and PG students following them. professors are their guides in the matter :)

      Delete
    4. A lady research scholar earning around one crore before completing the 'research'. Photos of these students are freely available in market with brokers.

      Delete
    5. Anonymous30 August 2015 at 11:04
      మీరు చూపించిన లింకులో ఉన్న విషయం చదీవాను,దారుణమే!

      తప్పు మొత్తం సమాజపు ఆలోచనా ధోరణిలో ఉంది!అందంగా ఉన్న వాడవాళ్ళే కోరుకోదగిన వాళ్ళుగా మగ్వాళ్ళకి అనిపిస్తున్నది,మగ్వాణ్ణి ఆకర్షించడమే జన్మకి సార్ధకత అని ఆదవాళ్లకి అనిపిస్తున్నది."పిలచినా బిగువతరా" అన్న భానుమతికే వెర్రెత్తిపోయిన కాలం నుంచి ఆ నటుడే "నాకు వుడుకెత్తిపోతఓంది హరీ హరీ" అని గంతులేసేవరకూ జరిగిన మార్పుకి యే ఒక్కర్ని తిట్టినా పాపమే!ఈ కలికాలంలో నా హరికాలం ఘోష యెవడు వింటాడు?!

      Delete
    6. ఇంత క్రితం తాడేపల్లి బాల సుబ్రమన్యం మీలాగే ఘోషిస్తూండేవాడు.

      Delete
    7. నేను ఘోషతో ఆగన్లెండి,ఇదంతా మైక్ టెస్టింగ్ మాత్రమే!

      Delete
    8. మీకేమండి మీ ఇంటి పేరులో "నేని" ఉంది కదండి. మిమ్మల్ని తాడేపల్లి గారిలా పీక్కుతినరులేండి:) ఆయన బ్రాహ్మణుడు కనుక దళిత, కులగజ్జి వర్గాల వారందరు కక్ష గట్టి ఆయన పైన పచ్చ మీడీయా సహకారంతో దాడికి దిగారు. మీకు ఆ బాధ లేదు.

      Delete
    9. పైన అనామకా, బోడి గుండుకు, మోకాలికి ముడి వెయ్యకు సామీ.., తాడేపల్లి మీద పడి పీక్కు తిన్నది సుత్తి మరియు ఫెమినిస్ట్ సంఘాలు, అందులో ఆకుపచ్చ, పసుపుపచ్చ, మహా మేత, ఎగవేత గట్రా మీడియా ల పాత్ర, కేవలం అలవాటు ప్రకారం TRP రేటింగుల కోసం, శవాల మీద మరమరాలు ఏరుకొనే ప్రయత్నమే :)

      Delete
    10. సుత్తి, అంతర్జాతీయ వార్తల బ్లాగు అందరు ఉన్నారు. అంతర్జాతీయ వార్తలాయన తాడేపల్లి గారు వేరే వాళ్లకు రాసిన లేఖను ప్రచూరించాడు.అదొకట్టి చాలు చెప్పటానికి. ఫెమినిస్ట్, మార్క్సిస్ట్ గొడుగు కిందవచ్చి వాళ్లందరు కూడ బలుకొని కేసు పెట్టటమే కాకుండా, మీడీయాలో ఫ్రంట్ పేజిలో పోటో లేసి చంకలు గుద్దుకొన్నారు. ఆంధ్రా లో ఫెమినిస్ట్ లు పచ్చ మీడీయా వర్గం వారే ఎక్కువగా ఉంటారు. ఈ సంఘాల వారు వారి వర్గం లో జరిగే అన్యాయలపై మాట్లాడేదానికన్నా, హిందూ సంస్కృతిని ( కథలలో బ్రాహ్మణ పాత్రలను ప్రతీకగా సృష్టించి) ఎక్కువగా విమర్శించటం సుమారు వందేళ్ళుగా చేస్తున్నారు. ప్రతి పండగకు టివి9, ఆంధ్రజ్యోతి టి వి చానల్స్ లో ఐలయ్య ను తీసుకొచ్చి హిందూ దేవి దేవతలను విమర్సిస్తూ గంటకు పైగా ప్రోగ్రాంస్ నిర్వహించేది వాళ్లే!

      బ్రాహ్మణులలో కట్నాలు ఇతర వర్గాల వారితో పోలిస్తే లెక్కలోకే రాదు. పచ్చ వర్గం వాళ్లు దానిని ఆదర్శంగా తీసుకొవచ్చు కదా! ఆ కోణంలో వాళ్లు ఎప్పుడైనా ఆలోచించారా? కట్నం తీసుకోవటం హిందూ మత సాంఘిక దురాచారం కిందవస్తుంది. మరి నేడు చదువుకొన్న ఆ వర్గం వారిలో విపరీతమైన ధన దాహం ఎందుకుంది?

      పెళ్లిలప్పుడు మంత్రాలు చదువుతారు, చదివేది బ్రాహ్మణులు, మంత్రాలు చదివి వివాహం చేసే తంతు బ్రాహ్మణులు చేస్తారు కనుక హిందూ మత సాంఘిక దురాచారలకు వారే బాధ్యత వహించాలి. ఇదే గదా Marxist, ఫెమినిస్ట్ లు చేసే వాదన.

      Delete
    11. తాడేపల్లి, తాడేపల్లి అని ఇప్పుడు తెగ గింజుకుంటున్నారు. అప్పుడు మీరంతా ఎక్కడున్నారు? అటుపక్కన ఉన్నవాల్లు నోరుమూసుకుని ఊరుకున్నంత వరకే గదా మీ ప్రతాపాలు అనాని"ముచ్చు" కామెంట్లు? సరైన సమయములో తోకముడిచి పరారే. అప్పుడు ఆయన వెనక నిలబడి ధైర్యం చెప్పలేనివారికి ఇప్పుడు మాట్లాడే హక్కులేదు. సైలెంటుగా ఉండండి. ఎందుకంటె, మళ్ళీ ఎవరన్నా పాతవి కెలికితే ఇబ్బంది పడేది ఆయన. తమబోటి అనాని"ముచ్చు"లు కాదు.

      Delete
    12. ఆపహే! ఎవరు తోకముడిచి పరారైంది? వ్యక్తిగత పరిచయం లేకపోయినా, ఆయన రాసేవి చదివేవాళ్ళు ప్రపంచవ్యాప్తం గా ఉన్నారు. ఆయన హైదరాబాద్ లో పోలీస్ కేసు పెట్టిన తరువాత వేరే దేశంలో ఉండేవాళ్ళు చేయగల సహాయం ఎమిటి?

      అటుపక్కన ఉన్నవాల్లు నోరుమూసుకుని ఊరుకున్నంత వరకే గదా మీ ప్రతాపాలు అనాని"ముచ్చు" కామెంట్లు?

      అహంకారం తలకెక్కి, కన్నుమిన్ను కానకుండా, కొత్తగా ఏర్పాటు చేసుకొన్న తెలంగాణ ప్రభుత్వం,మంత్రులు పైనే ఎగతాళి చేస్తూ, వాళ్ళు వార్తలు ప్రసారం చేశారే, సాధారణ పౌరులును లెక్కచేస్తారా? మధ్యతరగతి పౌరులను విలన్లు గా ప్రొజెక్ట్ చేసి రాయటం, కంటి ముందు జరిగిన గోదవారి పుష్కరాలలో చనిపోయినవారిని వెనకేసుకొస్తూ రాయటం, వాళ్లకి వెన్నతో పెట్టిన విద్య. నచ్చకపోతే కె.సి.ఆర్. ప్రభుత్వ మంత్రుల మీద కూడా అదే తరహాలో ప్రవర్తించారు కదా! ఆ టివిల ప్రసారాలను నిలుపు చేసి కె.సి.ఆర్. ఇనుప కడ్డి కాల్చినాలుకపై నోరెత్త కుండా వాత పెట్టాడు కదా!

      వారి ప్రతాపం గూడా ప్రపంచం అంతా చూసింది లేండి. తెలంగాణ వారి చేతిలో నానామాటలు అనిపించుకొని, 65 సంవత్సరాల తరువాత తట్టా బుట్టా ఎత్తుకొని విజయవాడకి ప్రయాణమైనారు కదా!

      Delete
    13. ఏడ్సినట్టుంది. సాయం చేయడమంటె ఆయన దగ్గరికి వెల్లి కంపెనీ ఇవ్వమని కాదు కదా బెదరూ ? ఆన్-లైనులోనే ఆయన మీద ప్రజలు విరుచుకు పడుతూ ఒంటరివాడిని చేసినప్పుడు బహిరంగంగా ఆయనకు మద్దతు ఇచ్చి ఉండొచ్చు. ఏ అంత తెగింపు లేదా అప్పుడు?

      ఇంకోవిషయం, నువ్వన్నట్టు తెలంగాణాలో భారీ అవమానాలకు గురవ్వడం లాంటివన్నీ ఆంధ్రాకు లాభించేవే. బుద్దిగా ఇక్కడికి వచ్చి పరిపాలన బుద్దిగా చేసుకుంటున్నాడు. శుభం. ఈపని ముక్కన్న ముందే చేసి ఉండుంటే ఇంకా బావుండేది !

      Delete
    14. @anon of "అహంకారం తలకెక్కి, కన్నుమిన్ను కానకుండా, కొత్తగా ఏర్పాటు చేసుకొన్న తెలంగాణ ప్రభుత్వం,మంత్రులు పైనే ఎగతాళి చేస్తూ, వాళ్ళు వార్తలు ప్రసారం చేశారే, సాధారణ పౌరులును లెక్కచేస్తారా? మధ్యతరగతి పౌరులను విలన్లు గా ప్రొజెక్ట్ చేసి రాయటం, కంటి ముందు జరిగిన గోదవారి పుష్కరాలలో చనిపోయినవారిని వెనకేసుకొస్తూ రాయటం, వాళ్లకి వెన్నతో పెట్టిన విద్య. నచ్చకపోతే కె.సి.ఆర్. ప్రభుత్వ మంత్రుల మీద కూడా అదే తరహాలో ప్రవర్తించారు కదా! ఆ టివిల ప్రసారాలను నిలుపు చేసి కె.సి.ఆర్. ఇనుప కడ్డి కాల్చినాలుకపై నోరెత్త కుండా వాత పెట్టాడు కదా! "

      Please stop such nonsense!
      ఇటువంటి యేడుపుగొట్టు మాటలు ఇంకా చెల్లవు!మీ ప్రాంతపు నాయకులు యెదవలై అరవయ్యేళ్ళపాటు వెనకబడిన దానికి ఇంకో ప్రాంతం వాళ్ళని తప్పు పట్టకుండా మీ తప్పులు మీరు ఎలుసుకోండి!యేం పీకాడు అంత గొప్ప కేసీఆర్?వాహనాల రీ రిజిస్ట్రేషను నుంచి గుడుంబాకి బదులు చీప్ లిక్కరు అనే వరకూ అన్నీ నగుమాట్ల మారి పనులే,కాదా?దేనిమీద కన్ను పడితే దాన్నలా కూలుస్తా కూలుస్తా అనటమే తప్ప ఒక్కదాన్నైనా కూల్చాడా?

      ఇక్కడే నా బ్లాగులోనే హైదరాబాదు నంతా ఆంధ్రోళ్ళు కబ్జా చేసేశారు అని హడావిడి చేసారు కొందరు!ఆయనగారు కూడా అదే కూశాడు!మరి రాష్ట్రం సాధించుకున్నాక యెంత భూమిని(యెకరాలూ సెంట్లూ కాదు కనీసం మిల్లీమీటర్లలో నైనా సరే లెక్క చెప్పండి) ఆంధ్రోళ్ళ కబ్జా నించి విడిపించ గలిగాడు?అది నిజంగా సరైన పరిపాలన అని మీరు అనుకుంతున్నారా?ఆ చిల్లర పనులు చేసింది గూడా పక్కన చంద్రబాబు అనే అనుభవజ్ఞూడు జీరోలో నిలబెట్టినా అన్నీ నిభాయించుకొస్తూ ఈ తెలివితక్కువ పనుల్ని అందరూ వెక్కిరిస్తుంటే తట్టుకోలేని ఉక్రోషం వల్లనే అని నాకు తెలుసు,యెందుకు గప్పాలు కొట్టుకుంటారు ఆ కేతిగాడి గురించి?ఇవ్వాళ తెలంగాణా పిచ్చోడి చేతిలో రాయి?!

      ఆంధ్రోళ్ళు దోచుకోవటం వల్లనే మీరు వెంకబడిపోతే ఇప్పుదు కూడా ఆంధ్రోళ్ళు అక్కదే యెందుకు ఉన్నారు కాంట్రాక్టుల్లో కూడా తెలంగాణా వాళ్ల కన్నా ఆంధ్రోళ్ళకె యెక్కువ వెళ్తున్నాయి, యెందుకని?అబ్బే తెలంగాణా వాళ్ళ క్వాలిటీ బాగుందదు అని మీ ప్రభుత్వమే అంతిన్నది తెలుసా! తమాషాగా ఉందా ఇంకా అవే సుత్తి కబుర్లతో రెచ్చిపోతున్నారు?!

      Delete
    15. చెప్పదలచుకుంది మీడియా ద్వారా మేటర్ ను మానిపులేట్ చేయటంలో తెలుగు పత్రికల పాత్ర గురించి. ఆంధ్రా తెలంగాణ విభేదాల గురించి కాదు. ఆ రెండు పత్రికలు చేసిన దందా వలనే గదా సాక్షి పత్రిక పుట్టింది. కె.సి.ఆర్. మంత్రి వర్గ సభ్యులను వ్యక్తిగతంగా లాప్ టాప్ మొహం చూడని వారు .... అంట్టు విమర్సించారే అది హరిషించదగ్గ విషయమా? తెలుగు మీడీయా వాళ్లు బాబు నన్నా ప్రశ్నిస్తారేమో గాని కె.సి.ఆర్. తో తలపడరు.

      Delete
    16. తాడేపల్లి గారు ధార్మికవాదే గాక సమాజం గురించి దాని భవిషత్ గురించి అవగాహన ఉన్న అరుదైన వ్యక్తి. ధార్మిక వాదులకు మొదటినుంచి అసుర శక్తులనుంచి ఇబ్బందులు ఎదురౌతూంటాయి. సోషల్ మీడీయాలో గోల చేసే వారు వర్తమానం లో జరిగే అంశాలపై,గతం లోజరిగిన సంఘటనాలధారంగా అభిప్రాయలు చెప్పేవారితో నిండిపోయింది. ఆయన భవిషత్ దర్శి ఆయన చెప్పిన మాటలు నేడు వాస్తవమయ్యాయి కదా!

      నేడు రిషితేశ్వరి సంఘటనే తీసుకొండి, ఆ అమ్మాయిని ఇంకొక అమ్మాయి అబ్బాయిని ప్రేమించమని బలవంతం చేయటం ఎమిటి? దానికి ప్రిన్సిపల్ సహకరించటమేమిటి? కోస్తా సమాజం కుళ్ళిపోతే దానిని గుర్తించకుండా బ్లాగరులు ఆయన తప్పుగా మాట్లాడినట్లు టపా రాశారు. మరి నేడు రిషితేశ్వరి సంఘటన పై గాని, ఇంద్రాణి సంఘటనల పై గాని ఎక్కడైనా విమర్సించారా?

      అప్పట్లో బ్లాగులో జరిగిన చర్చలో ఎంతో మంది పాల్గొన్నారు. వీరిలో ఏ ఒక్కరు రిషితేశ్వరి సంఘటనను ఖండిస్తూ ఒక్క టపాకుడా నేడు ఎందుకు రాయలేదు?

      Delete
    17. చాకిరేవు రాసినట్టు గుర్తు .

      Delete
    18. చాకిరేవు రాసినట్టు గుర్తు
      what do you mean?I found irrelevant!
      can you expand?

      Delete
  5. Must Watch: This Guy Gives The Perfect Response To Jasleen Kaur's Situation

    https://www.youtube.com/watch?t=363&v=hrqAQOqt9yw

    ReplyDelete
  6. "యెవరి వెసులుబాటు వారు చూసుకున్న అపవిత్ర సూర్యవంశమే ఇక్కడ కూడా...."

    సృష్టించిన ప్రభువు ఇద్దర్నె సృష్టించి ఒక్క పండు ఇచ్చి ... కక్కుర్తి తనం ప్రదర్శించడం అనే పిసినారి కథ నిజం అనే వెర్రి బుర్రలు ....తొలి తరం పేరెంట్స్ సొదర సొదరీమణులు అనుకునే దరిద్రం లో ఉంటారు.

    కుప్పలు తెప్పలు గా పుట్టించి ప్రకృతిని అలంకరించాడు బ్రమ్హ అనుకునే వాళ్ళు తక్కువైపోయారు గనక రాబోయే కాలం లో జరిగే నీచాలని భరించే శక్తిని కూడగట్టుకోవడం మన భాద్యత !!

    ReplyDelete
  7. kali visrumkhalatvam paraakaastaku cherukonunnatlumdi

    ReplyDelete
  8. పిన్నిని పెళ్ళాదాలనుకునే మదపిచ్చి కమ్యునిష్టులు పెరిగి హేతువాదం పేరుతో వావివరసల్ని కూడా భ్రష్టు పట్టించారు!

    తప్పు ఆయనది కాదు. అతని బ్లాగు లో ఒక్క కామెంట్ ఉండవు. వాడికి తోచక రాసే వ్యాఖ్యలను, ఒకసారా రెండుసార్లా, లెక్కనలేనన్ని సార్లు ప్రచూరించే కొండలరావుది. ఆలోచిస్తే కొండలరావు అంత బాధ్యతలేని వ్యక్తి ఈ బ్లాగులోకంలో ఇంకొకరు ఉండరు.

    ReplyDelete
  9. where r ur fans:)

    ReplyDelete
  10. ఇప్పుడీ ఇంద్రాణి ముఖర్జీని ప్రముఖులైన హిందూమత ద్వేషులు యేదో ఒకనాడు సామాజిక విప్లవకారిణిగా అభివర్ణించి వెనకేసుకు వస్తారు చూస్తూ ఉండండి!


    మీ అంచనా తప్పైంది. ఆమెను వెనుకేసుకోరాడానికి ఫెమినిస్ట్ బదులుగా నైనా లాల్ కిద్వాయ్ ని రంగంలోకి దించారు. ఆమే కార్పోరేట్ రంగంలో మహిళలు ఎదగడానికి ఎంతో శ్రమిస్తారు. ఇంద్రాణి లాగా షార్ట్ కట్ పాత్ అనుసరించేవారు ఉండరని చెప్పుకొచ్చింది. నాలుగు పెళ్లిలు చేసుకోవటం తప్పుపట్టవలసిన అవసరం లేదనే విధంగా మాట్లాడింది.

    కార్పోరేట్ రంగంలో మహిళా సి.ఇ.ఓ. లు, హైపొసిషన్ లో ఉన్నవారు ఇంద్రాణి దెబ్బకి ఉలికిపడ్డారు. ప్రజలు వాళ్ళు కూడా ఇటువంటి పనులు చేసి పైకి ఎదిగారని ఎక్కడ అనుమానిస్తారో అని భయపడినట్లున్నారు. వీళ్ళు మీడీయా ముందు ఎంత సమర్ధించుకొన్నా, కార్పోరేట్ కంపెనిలో పనిచేసేవారికి అక్కడి రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియనివి కాదు కదా! దేశం లో ని ప్రముఖ కార్పోరేట్ సంస్థలన్ని కొన్ని కుటుంబాల చేతిలో ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ రాజకీయ నాయకుల చేతిలొ ఉన్నాయి. పదవులను వాళ్లలో వాళ్ళే సర్ధుకుంటారు. భయట వారికి కంపెనిలలో ఎదగటానికి అవకాశాలు దాదాపు శూన్యము. ఇటువంటి టఫ్ కాంపిటేషన్ లో, పైకి పోవటానికి ఎవరికి తగ్గ మార్గం వాళ్లేన్ను కొంటారు.

    ReplyDelete
  11. చాలా బాగుంది... సార్.... ఇలాంటి బ్లాగులే మీ నుంచి ఇంకా రావాలని కోరుకుంటూ

    ReplyDelete
  12. Replies
    1. You can proceed,why permission for ana open topic?

      Delete
  13. మీరు వ్రాసిన విషయం మంచిదే...సమస్య లేవనెత్తి పరిష్కారం చూపకుండా వదిలేయకూడదు.ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళంతా అమరజ్యోతు(వీరు)లు కారు.ఒకరకంగా సీతది కూడా ఆత్మహత్యే ! ఈనాటి రావణులకు సరికొత్త గుణపాఠాన్ని నేర్పేలా మీరే అయిడియా ఇవ్వండి.

    ReplyDelete
    Replies
    1. బహుశా రిషితేశ్వరి అంశం గురించి అనుకుంటాను మీ ప్రస్తావన!
      నిజాని కది అసలు కధలో వచ్చిన పిట్టకధ,పిల్ల కాలవ కాదూ?


      యే చెప్తాం?యే చెప్పినా తప్పే!
      రాముడి లాంటి ఆదర్సపురుషుల్ని భర్తలుగా వొద్దే వొద్దంటున్నారు!
      రాముడికే దిక్కు లేదు,రాంబక్తుణ్ణీ నావల్లేమవుతుంది?!

      Delete
  14. కొండలరావు గారు బాధ్యతలేని వ్యక్తి అని అజ్ఞాతంలో ఉన్నవారు చెప్ప(లేరు)కూడదు.



    ReplyDelete
    Replies
    1. కరస్టే, చెబితే గిబితే ఎర్రగడ్డ జనాభానే చెప్పాలి.

      Delete
    2. @నీహారిక
      నేనూ ఒకప్పుడు అనామకంగా ఉన్నవారితో అసలు వాదించనే కూదదనీ ఒకసారి మాటిమాటికీ పేరు చెప్పమని ఒత్తిడి చేసిన వాణ్ణే!
      కానీ కొందరు అనామకంగా వ్యక్తపర్చినా ఆ అభిప్రాయం కరేక్టే నని తెలియడం వల్లనే నేను కామెంట్ మోడరేషన్ యెత్తేశాను.

      మరీ బూతులు మాట్లాదనంత వరకూ,వ్యక్తిగత దూషణకి దిగనంత వరకూ వ్యక్తుల గురించి గానీ విషయల గురించి గానీ అభిప్రాయాలు చెప్పదంలో తప్పు లేదు.అంతెందుకు,నిన్ననే ఒక చర్చలో డబ్బు లేకుండా పోవాలంతం,అన్ని వస్తువులకీ సమాన విలువ ఉండాలనటం నాకూ నవ్వు తెప్పించింది!కాకపోతే నేను అక్కడ ప్రశ్న వేశాను,అంటే చర్చలో దూరాను.ఈయన ఆ పని చెయ్యలేదు - అంతే తేడా!

      అట్లాగే జై విషయంలో అతని కూతురు గురించి ప్రస్తావించిన వ్యాఖ్యనీ తీసేసాను.

      దూషిస్తే తప్పు పట్టాలి గానీ అభిప్రాయం చెప్తే తప్పు పట్టకూడదు.బ్లాగు తెరిచి చూడటం ఆలశ్యం కావచ్చు గానీ నా నియమాలకి వ్యతిరేకంగా ఉంటే నేనే తొలగిస్తాను

      కామెంట్లు యెలా ఉండాలీ అని మిగతావారికీ తెలియదం ఓసం ఇంత వివరంగా చెప్పాను!

      ఏమి చెప్పినా సభ్యతా పరిధుల్ని దాటకండి.ఒకవేళ ఆరోపణలు గానీ తీవ్రంగా ఉంటే ఆధారాలు కూడా చూఒపించడం మీ బాధ్యత!

      Delete
  15. हरि बाबु,

    हार गया! :)

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...