Tuesday, 11 August 2015

అయోధ్య రాముణ్ణే మోసం చేసినోళ్ళకి ఆంధ్రోళ్ళని మోసం చెయ్యడం ఓ లెఖ్ఖా?!

     యాకూబ్ మెమన్ అనబడే ఒక ముస్లిముని యెందుకు ఉరితీశారు?250 మంది చావుకి కారణమైన కుట్రలో భాగమయ్యాడని!మరి రధయాత్ర సమయంలో 1000 మంది చావుకి కారణమైన అద్వానీకి శిక్ష పడిందా?అబ్బే,అతను నేరం చెయ్యలేదు గదండీ అంటారా?2003లోనే కోర్టులు అద్వానీ సహా 7గురు నాయకులు మసీదు విధ్వంసానికి కారణమయ్యారని నిర్ద్వందంగా తీర్పులు ఇచ్చాయి.17 యేళ్ళ పాటు విచారణ జరిపి లిబర్హాన్ కమిటీ రిపోర్టు 2009లో సభకి సమర్పించబడింది.అందులోనూ నిందితుల్లో ఒకడిగా అద్వానీ పేరు ఉంది.ఇదే అద్వానీ హవాలా కుంభకోణంలో ఇరుక్కుని చాలా హుందాగా తనకు తనే అధికార పదవుల్ని త్యజించి కోర్టు నిర్దోషిగా తీర్పు ఇచ్చాకనే మళ్ళీ క్రియాశీల రాజకీయాలలో అడుగుపెట్టాడు,మరి మసీదు విధ్వంసానికి కారణమైన కేసులో యెందుకు మొండిగా చట్టానికి లొంగడం లేదు?

   యాకూబ్ మెమన్ నేరస్థుడని నిర్ధారించినదీ ఈ దేశపు కోర్టులే!అద్వానీ నేరస్థుడని నిర్ధారించినదీ ఈ దేశపు కోర్టులే!అయినా ఒకరు ఉరితీయబడ్డాడు,మరొకరిమీద చార్జిషీటు కూడా దాఖలవ్వ లేదు,యెందుకని?వీళ్ళని ముస్లిములు యెట్లా నమ్ముతారు?అందుకే కాంగ్రెసుకి దూరమైన వాళ్ళు భాజపా వైపుకి కాకుండా ములాయం లాంటివాళ్ళ వైపుకి జరిగారు!ఒకానొకప్పుడు కేవలం 2 సీట్లతో ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు అధికారం చేపట్టేవరకూ యెదగటానికి మాకు అధికారమిస్తే రామాలయం కడతామన్న వీళ్ళ మాటని హిందువులు నమ్మటం వల్ల కాదా?అది కాకుంటే వీళ్ళలో యేమి చూసి జనం వోట్లు వేశారు?నాయకులు కొందరు నైతికంగా ఉన్నతులు కావచ్చు,కాంగ్రెసు కన్నా మంచి పరిపాలన అందిస్తారు అన్న విశ్వాసం నాలాంటి వాళ్లలో ఉంటే ఉండొచ్చు!కానీ భాజాపాకి ఇప్పటి బలం కేవలం ఆ రెండు కారణాల వల్లనే వచ్చిందా?

    అయోధ్య సమస్యని కోర్టు బయట శాంతియుతంగా పరిష్కరించుకోవడంలో ముస్లిములు పూర్తి సహాయ సహకారాలు అందించటానికి సిధ్ధంగా ఉన్నారు - కాకుంటే వాళ్ళ మర్యాదకి భంగం కలగకూడదనే పట్టుదల,అంతే!అయినా నూటికి 85% హిందువులు ఉన్న ఈ దేశంలో ముస్లిములతో మాట్లాడేదేమిటి అని మొండిగా ఉన్న విశ్వ హిందూ పరిషత్ మాట వింటూ సభలో బిల్లు పెట్టి మందబలంతో నెగ్గించుకుని గుడి కట్టెయ్యాలని చూస్తున్నదే తప్ప ముస్లిములతో సయోధ్యని కోరుకోవడం లేదు,యెందుకని?రెండు సభల్లోనూ పూర్తి మెజార్టీ ఇస్తేనే కానీ కట్టలేం అని చెప్తున్నారు,నిజంగా అది సాధ్యపడుతుందా?అసలు ఒకసారి బలప్రయోగంతో కూల్చినందుకే ఇన్ని సంవత్సరాలుగా ముంబై బాంబు ప్రేలుళ్ళూ,గోద్రా రైలు ఘటనా,గోద్రా అల్లర్లూ లాంటివి జరుగుతుంటే మందబలంతో ఆ పని చేస్తే ఇప్పటికన్నా ప్రమాదం కాదా?

     ఇప్పుడు రామ్ లల్లా యెలా ఉన్నాడో తెలుసా?మసీదు కూలుస్తున్న హడావిడిలో కొందరు గబగబా లోపలి కెళ్ళి ఆ విగ్రహాలను బయటికి తీసుకొచ్చి ఒక తాత్కాలిక విడిదిలో చాలా నిరాడంబరంగా ఉంచారు.పాపం అప్పటి వరకూ అన్నిరోజులు మసీదు లోపలి కెళ్ళి పూజలు చేసిన ఆత్మీయత వల్ల కాబోలు ఆ పూజార్లకి కూడా బాధగా అనిపించిందట మసీదుని పడగొడుతుంటే!ఆ ప్రాంతమంతా ఇప్పుడు కేంద్రప్రభుత్వం అధీనంలో ఉంది.చుట్టూ పసుపుపచ్చని బద్దీలతో ఫెన్సింగ్ కనబడుతుంది.సెక్యూరిటీ చెక్ పోష్టుగా ఉన్న ఒక నడవా దాటి లోపలికి వెళ్ళాలి.సందర్సకుల నుంచి స్వాధీనం చేసుకున్న పెన్నులూ,క్యామెరాలూ చిందరవందరగా పడి ఉంటాయి.2000 మందికి పైగా పహరా కాస్తూ ఇసుక బస్తాలతో ట్రెంచీలతో ఆలయాన్ని కాకుండా యుధ్ధభూమిని తలపించేటట్టు ఉంటుంది!అలాంటి మార్గంలో భయం పుట్టకుండా వుండేందుకు మరింత భక్తితో రామ్ లల్లాని తలుచుకుంటూ సుమారు 200 అడుగులు వేస్తే ఒక చిన్న బోర్డు కనబడుతుంది.ఆ తర్వాత ఒక తెల్లని టార్పాలిన్ కింద గాలికి చుట్టూ ఉన్న దిట్టమైన ముఖమల్ తెరలు వూగుతుండగా నేనెక్కడుంటే అదే వైకుంఠం అన్నట్టు దర్శనమిస్తాడు ఆనాటి పధ్నాలుగేళ్ళ వనవాసాన్నీ నవ్వుతూ గడిపేసిన రామ్ లల్లా!ఆ టార్పాలిన్ బుల్లెట్ ప్రూఫ్,వాటర్ ప్రూఫ్,ఫైర్ ప్రూఫ్ కాబట్టి ప్రస్తుతానికి రామ్ లల్లా క్షేమంగానే ఉన్నట్టు లెఖ్ఖ.అతి సాహసంతో కరసేవకులు చేసిన దుర్మార్గం రాముడినే ఆలయహీనుడిగా చేసింది?!

     ఆసేతు శీతనగం ఉన్న దేశంలోని కోటానుకోట్ల రామభక్తులందర్నీ మోసం చేస్తూ కూడా అంత ధీమాగా ఉన్న పార్టీ తిప్పి తిప్పి కొడీతే అయిదు కోట్లు కూడా లేని ఆంధ్రోళ్ళని మోసం చెయ్యడం పెద్ద బ్రహ్మవిద్యా?!నోరు తెరిస్తే ప్రత్యేకహోదా అని పేరు చెప్పి ఇస్తే తమిళ్నాడూ కర్ణాటకా అభ్యంతరం చెప్తాయి,హోదా కన్నా యెక్కువే ఇస్తాం అనే సొల్లు కబుర్లు చెప్పటమే తప్ప ఈ పదిహేను నెలల్లో ఇవ్వాల్సినవే ఇవ్వలేదు కదా?పదడిగితే యెనిమిదీ అయిదడిగితే రెండూ ముష్టి పారేసి సరిపెట్టటం రాజ్యాంగబధ్ధంగా యెన్నికైన వాళ్ళు చెయ్యాల్సిన పనేనా?హక్కుగా ఉన్నదేదో ఇస్తే మా బాగు మేం చూసుకుంటాం గానీ అదనంగా నువ్విచ్చే ముష్టి మాకు దేనికయ్యా?బీహారు యెన్నికల కోసం బీహారుకి ఇవ్వడానికి వచ్చిన చేతులు కలిసి పోటీ చేసి మిత్రపక్షంగా ఉన్న వాళ్లకి ఇవ్వడానికి మూగసైగలు తప్ప చేతులు రావడం లేదంటే,యేంటి కధ?ఆంధ్రోళ్ళు పిచ్చిపుల్లయ్యలని అనుకుంటున్నారా?సొల్లుకబుర్లు కాదు గట్టిమేలు చేసి చూపించాలి - అప్పుడే నమ్ముతాం మిమ్మల్ని!బోడిగుండుకీ మోకాలికీ ముడిపెడుతున్నానని అనుకోకండి - రామాలయం కట్టడం విషయం లోనూ,మసీదు విద్వంసానికి కారణమైన అస్మదీయుల్ని కోర్టుకి అప్పగించకుండా ఉండటం లోనూ,ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం లోనూ ఉన్నది ఒకటే మనస్తత్వం - మా వోటుబ్యాంకు మాకు సురక్షితంగా ఉంది కదా అన్న అహంకారం?!

అయోధ్య రాముణ్ణే మోసం చేసినోళ్ళకి ఆంధ్రోళ్ళని మోసం చెయ్యడం ఓ లెఖ్ఖా?!

78 comments:

  1. హరిబాబు గారూ, ఆంధ్రకు ప్రత్యెక ప్రతిపత్తి ఇవ్వడం కుదరదనీ, ఒకవేళ ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఏమీ లేదనీ నేను ఆనాటి నుండే చెప్తున్నాను. వాస్తవం చెప్పిన పాపానికి కొందరు వీరాంద్రాభిమానులు నన్ను కుళ్ళుపోతు, ఆంధ్రద్వేషి లాంటి మాటలు అన్నారు.

    అసలు జరిగిందేమిటి? ఆంద్ర కాంగ్రెస్ వారిని తృప్తి పరిచేందుకు యూపీఏ పోలవరం ప్రతిపాదించింది. వారికి ఎక్కడ క్రెడిట్ దక్కుతుందో అన్న భయంతో బీజేపీ ప్రత్యెక ప్రతిపత్తి & ముంపు మండలాల బదిలీ అంశాలను తెరపైకి తెచ్చింది. లోక్సభలో నోరు మెదపని ఎన్డీయే యూపీఏకి సంఖ్యాబలం లేని రాజ్యసభలో ఈ విషయంపై బ్లాక్మెయిల్ మొదలెట్టింది. ఈ డ్రామాకు కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం మొత్తం వెంకయ్య నాయుడు.

    వీళ్ళెవరూ ఇసుమంత హోమువర్క్ చేసినా తెలిసే వాస్తవాలు తెలియని మూర్ఖులు కారు. అంచేత సంకుచిత తాత్కాలిక రాజకీయ లబ్ది కోసం తెలిసి తెలిసీ అబద్దాలు చెప్పారని అర్ధం చేసుకోవాలి.

    బీజేపీ/టీడీపీ నే(మే)తల ప్రవర్తన ఒక ఎత్తయితే, ఆంద్ర మే(తా)ధావుల పాత్ర మరో ఎత్తు. వాళ్ళు అబద్దం చెప్తున్నారని వారి మాటలు నమ్మొద్దని చెప్పడం మానేసి గంగిరెద్దుల్లా తందానా పాడడం దారుణం. నిజానికి రాజకీయవేత్తల కన్నా ఇటువంటి వారి (ఉ. లోక్సత్తా నాగభైరవ, చలసాని శ్రీనివాస్ వగైరా) ప్రవర్తన ఆంద్ర రాష్ట్ర భవిష్యత్తుపై ప్రశ్నార్ధకాలు లేవనెత్తుతుంది.

    పోలవరం & ప్రత్యెక ప్రతిపత్తే కాదు ఇంకొన్ని ఎందమావులూ ఉన్నాయి. మున్ముందు మీరే చూస్తారు.

    ReplyDelete
    Replies
    1. ఆంధ్రాకి ప్రత్యేక హోదా రాదు, తెలుగు దేశం దాన్ని రానివ్వదు. ఈ రోజు ఉదయం TV ఆన్ చేసాను. సాక్షి తప్ప ఏ చానెల్‌లోనూ ప్రత్యేక హోదా చర్చ లేదు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే కాంగ్రెస్ బలపడిపోతుందని ఆంధ్ర చానెల్‌ల భయం. హైదరాబాద్‌ని ఆంధ్రాకి కాకుండా చేసిన కాంగ్రెస్‌ని తిరిగి రానివ్వకుండా చెయ్యడానికి ప్రత్యేక హోదా మాటని మరుగున పెట్టడానికే ఆంధ్రా చానెల్‌లు ప్రయత్నిస్తున్నాయి. సాక్షి మాత్రం ప్రత్యేక హోదా గురించి ఎందుకు చర్చిస్తోంది? కాంగ్రెస్ తిరిగి వస్తే జగన్ కంటే చంద్రబాబుకే ఎక్కువ నష్టం. ఆంధ్రాలో కాంగ్రెస్ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, శాసనసభలో హంగ్ ఏర్పడితే, అప్పుడు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్‌కి మద్దతు ఇవ్వగలరు కానీ తెలుగు దేశానికి మద్దతు ఇవ్వలేరు. కాంగ్రెస్ తిరిగి వచ్చినా జగన్ దాన్ని తనకి అనుకూలంగా మలుచుకోగలడు కానీ తెలుగు దేశానికి మాత్రం అది ఎదురు దెబ్బే అవుతుంది. చంద్రబాబుకి అంత నష్టం కలిగించగల కాంగ్రెస్‌ని తిరిగి రానివ్వడానికి కమ్మ చానెల్‌లు రిస్క్ తీసుకోవు. రాష్ట్రం ఎలా పోయినా, తమ కుల నాయకునికి మాత్రం నష్టం రాకుండా వాళ్ళు చూసుకుంటారు.

      Delete
    2. ఆంధ్ర శాసన సభకు గడచిన ఎన్నికలలో టీడీపీ బీజేపీ కూటమికి 1,35,48,599 కోట్ల వోట్లు వచ్చాయి. వైకాపా కాంగ్రెస్ పార్టీలు రెంటికీ కలిపి 1,35,60,074 వోట్లు (అంటే 11,475 ఎక్కువ) వచ్చాయి. వామపక్షాలను కూడా కలుపుకొని వెళ్ళితే ఇంకా ఎక్కువ వచ్చేవి. జగన్ అతిదీమా వైఖరి ఆయన కొంప ముంచింది.

      Delete
    3. రాజకీయాల్లో పలుకుబడితో పాటు ఓర్పు(ఓదార్పు కాదు) కూడా ఉండాలి.చిరంజీవి కాంగ్రెస్ తో కలవకపోయినా,జగన్ కాంగ్రెస్ తో కలిసిపోయినా బాగుండేది. ఇప్పటికైనా జగన్ వాస్తవాన్ని గ్రహిస్తే బాగుంటుంది.

      Delete
    4. కాంగ్రెస్ తిరిగి వస్తే అది తెలుగు దేశాన్ని ఓడించి గెలుస్తుందా లేదా వైకాపాని ఓడించి గెలుస్తుందా అనేది తెలియదు. హంగ్ వచ్చి, కాంగ్రెస్‌కి తక్కువ స్థానాలు వస్తే మాత్రం జగన్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించగలడు. కాంగ్రెస్ తిరిగి గెలిచినా, జగన్‌తో పొత్తు పెట్టుకున్నా తెలుగు దేశానికి మాత్రం నష్టమే.

      తాము రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని సోనియా ఎన్నడూ చెప్పుకోలేదు. సోనియా చచ్చినా తెలంగాణా ఇవ్వదని ప్రచారం చేసినది కిరణ్ కుమార్ రెడ్డి. ఆ ప్రచారం వల్లే ఆంధ్రాలో కాంగ్రెస్ ఓడిపోయింది తప్ప తెలంగాణా ఏర్పాటు వల్ల కాదు. తెలంగాణాపై ఆంధ్రుల్లో ద్వేషం ఉంటే 2004లోనే తెలంగాణా ఇస్తామన్న కాంగ్రెస్ అప్పట్లో గెలిచేది కాదు.

      Delete
    5. @
      తాము రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని సోనియా ఎన్నడూ చెప్పుకోలేదు. సోనియా చచ్చినా తెలంగాణా ఇవ్వదని ప్రచారం చేసినది కిరణ్ కుమార్ రెడ్డి. ఆ ప్రచారం వల్లే ఆంధ్రాలో కాంగ్రెస్ ఓడిపోయింది తప్ప తెలంగాణా ఏర్పాటు వల్ల కాదు. తెలంగాణాపై ఆంధ్రుల్లో ద్వేషం ఉంటే 2004లోనే తెలంగాణా ఇస్తామన్న కాంగ్రెస్ అప్పట్లో గెలిచేది కాదు.
      ?
      యేం చెప్పావులే,ఇప్పటికిపుడు నీకు గుందు కొట్టి గాడిదమీద వూరేగించలల్న్నంత సర్దా అయిన విష్యం చెప్పావు?!

      ఆ కికురె యే పొజిషనులో ఉంది చేశాడు నాన్నా అదంతా?సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కొండొకచో అధిష్ఠానం తరపునే ఇదంతా చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటూ చేస్తుంటే తన్ని తగలేసి ఇంకోణ్ణి పెట్టకుండా షిందేలూ,గాండూలో మా కికురే మంచోడు అని మెచ్చుకోవటం యెరగవా నువ్వు?

      యెన్నికల ఫలితాల్లో గుడుసున్నా తళత్తలా మెరుస్తూ కనిపించాక గూడా ఆంధ్రావాళ్లకి కాంగ్రెసు మీఎద కోపం లేదంటున్నావంటే నువ్వు బుర్రలో తెలివుండే మాట్లాడుతున్నావా?

      నీ బతుక్కి నువ్వు చంద్రాబాబుని చంబు అనే స్థాయిలో ఉన్నావా నువ్వు?మీ నాన్న నిన్ను కొట్టాడు కొట్టాడు అని వూర్కే ఇదయిపోతావు,నువ్వొక్కడివే ప్రత్యేకంగా పుట్టావా?మా నాన్న నన్నూ కొట్టాడు,అయితే యేంటి?ప్రేమ ఉండదా? దెబ్బల గురించే చెప్పి రెచ్చిపోతున్నావు, పోతరాజులాగా ఆయన పెట్టిన తిండి తిన్నావుగా,కుక్కలు కూడా తిండి పెట్టినవాడ్ని కరవవు,నువ్వు మీ నాన్నకి తిరిగి యేం విస్వాసం చూపించావు?ఆయన పెట్టిన తిండికి లెక్కగట్టి చెల్లింపు చెయ్యగలిగావా?అది చేసి అప్పుడు దుర్మార్గుడు నన్ను కొట్టాడు అన్నా ఒక గొప్ప!నీ నెత్తిమీద 1000 రూపాయలు పెట్టి అమ్మకానికి పెడితే ఆ 1000 రూపాయలూ తీసుకుంటాదే తప్ప నిన్నెవడూ తీసుకోడు?

      పెద్దా ఆర్ధికసూత్రాలు చెప్తున్నావు?రాజకీయ విశ్లేషనలు చేస్తున్నావు?పిన్నిని చేసుకోవాలని అఘోరించావు,తల్లిని వొదిలేశావేం?అడక్కపోయావా మీ అమ్మని నిన్ను పెళ్ళీ చేసుకోవాలని ఉందని?!
      విధవని చేసుకోవాలనుకున్నాట్ట!అందరూ మెచ్చుకున్నారట?నాకన్నా పెద్దదాని చేసుకోవాలనుందన్నాట్ట!అందరూ తిట్టార్ట?పోనీ ఆ కండిషనుకి గూడా సరిపోయేదాన్ని తెస్తే ఆ మొగుడితో పిల్లలు కూడా ఉన్నది కావాలనో ఆ మొగుడితో ఒక్కసారి గూఅడా పడుకోనిది కావాలనో అడుగుతావా?మానసమాజంలో బతకటానికి పనికొచ్చే తెలివితేటలేనా ఇవి?

      Delete
    6. తెలంగాణా వచ్చే అవకాశం లేదని కిరణ్ కుమార్ రెడ్డి, ఘంటా శ్రీనివాసరావులు చేసిన ప్రకటనలు నేను TVలో చూసాను. Our own eyes can't mislead us. ఆ ఘంటా శ్రీనివాసరావు తెలుగు దేశంలో చేరాడు. కిరణ్ కుమార్ రెడ్డి భాజపాలో చేరాలనుకుంటున్నాడు కానీ అందు కోసం తనకి అడ్డుగా ఉన్న తెలుగు దేశంతో పొత్తు వదులుకోవాలనీ, తనకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనీ కిరణ్ కుమార్ రెడ్డి కందిషన్ పెట్టాడు. 2004 నుంచి 2014 వరకు సోనియా ఎన్నడూ తాను రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానని చెప్పుకోలేదు. సోనియా తెలంగాణా ఇవ్వదు అని ప్రచారం చేసినవాళ్ళే ఇప్పుడు తెలుగు దేశం, వైకాపా, భాజపాలలో ఉన్నారు.


      Delete
    7. @Marxist Hegelian
      అదొక్కటే చూశావా?మరి షిందేలూ ఆజాదులూ కికురె మంచి క్రమశిక్షణ గల పారీ కార్యకర్తా,అధిష్థానానికి తిరుగులేని విధేయుడు అని ఆ తర్వాతనే పొగిడి అఘోరించారుగా కళ్ళు మసకలు అగ్మ్మినయ్యా?నీకు కుళ్ళడానికి పనికొచ్చేవి మాత్రమే చూస్తావా!ఇక్కడ ఇంత భీకరంగా మూజువాణీ వోటుతో అసెంబ్లీలో తీర్మానం చేసిన వెంటనే ఆంధ్రజ్యోథిలో ఒక పెద్ద తలకాయ ఇది అక్కడ మీరు బిల్లుని కూడా ఇలాగే పాస్ చేసిపారెయ్యొచ్చు అని సంకేతం ఇవ్వటానికి తప్ప యెందుకూ పనికిరాదు అన్నాడని వార్త వచ్చింది.పేరు చెప్పలేదు గాబట్టి యెవడైనా అన్నాడో లేదో ఆంధ్రజ్యోతి వాడు ఒక హింట్ వొదిలాడు గదా అక్కద కూడా ఇలాగే బిల్లుని చుట్టేస్తారని,అలాగే జరిగింది కదా?అది నీకు తెలియదా? ఆ రకంగా చూస్తే కికురె కూడా విభజన ప్లానూమలు చెయ్యటానికే అక్కడున్నాడని తెలుస్తుందా లేదా?

      జై అంటే తెలంగాణా వాడు, హోదా రాకూడదని కోరుకుని అఘోరిస్తున్నాడు అనుకుందాం,నీకేం మాయరోగం?రాకపోతే అడుక్కుతినేది నీ రాష్ట్రమా పక్క రాస్ట్రమా?

      తెలంగాణా యెలా వచ్చింది?యెన్నికల్ల్లో అమోఘంగా మద్దతు పెంచేసుకుందాం,ఇదుగో ఇంతమంది తెలంగాణ్యులు విభజనకి మద్దతిస్తున్నారు అని ధీమాగా విదగొట్టుకుందాం అంటే తెరాసాకి యెన్నికల్లో యెన్ని సీట్లు వచ్చాయి?ధరావతులు కూడా పోగొట్టారు!ఇక సోనియా ఇంటి గుమ్మం యెక్కనూ దిగనూ యెక్కనూ దిగనూ!ఒక్కడే వెళ్ళేవాడు,అక్కడ గుంజిళ్ళే తీసేవాడో నేల మీద పొర్లిగింతలే పెట్టేవాడో ఇవ్వకపోతే బ్లేడుతో మెద కోసుకుంటానని గుక్కపట్టి యేడ్చేవాడో యెవడికీ తెలీదు,చూడటానికి తోడుగా యెవరూ లేరు గదా?ఇస్తాననేసింది,సిగినేళ్ళు వొచ్చేసినై అంటూ అమాసకని పున్నానికీ మల్ళొచ్చే పున్నాని కని అమాస నాడూ యెన్ని పిట్టలదొర వేషాలు వేశాడు?ఈపాటి తెలివి మాకు లేదా?సభలో హామీ ఇచ్చినదాన్ని పబ్లీకుగానే తెచ్చుకుంటాం!నోరు తెరిస్తే చాలు సమైక్యం అంటూ అల్లరి చెయ్యకపోతే ప్యాకేజీలు అడుక్కోకపోయారా అనై ఉబోసలు,గాడిద గత్తర విభజనకే యేదో అధ్హుతకారయం చేసినట్టు యెగిరెగిరి పడుతున్నారు?!

      యేంటి అసలీ ప్యాకేజీలూ ప్రత్యేక హోదాలూ తొక్కా తోలూ?24 జిల్లాల రాష్ట్రాన్ని తనే అధికారంలో ఉండి మొత్తం వనరు లేమిటి?యెవరికి వేట్ని పంచాలి అనే లెక్కలు తెలిసి పంచేస్తే ఈ ప్రత్యేక హోదాలూ,పన్ను రాయితీలూగొట్టాలూ గొడుగులూ యెవడడిగాడు?

      మాట్టాడితే ప్యాకేజిలు అడుక్కోవచ్చుగా సమైక్య ఉద్యమం చెయ్యకపోతే అనే గాడిదలు యెక్కడ అడగాలో చెప్తారా?అసెంబ్లీలో కికురె జరిపించింది ఒక చర్చా? అక్కడ చేసిన యే తీర్మానమూ బిల్లులోకి యెక్కే గ్యారెంటీ లేదని ముందే తెగేసి చెప్పారు!ఇక్కడ ఒకవేళ సమైక్యానికి ఓటు వేసి పంపినా చెల్లదు,విదగొట్టటమూ బిల్లూ అన్నీ తయారయిపోయినాయి అని కూడా చెప్పారు,ఇంకా యెక్కడ యెవర్ని యే ప్యాకేజీ కోసం దేబిరించాల్రా లవ్దేకే బాల్!

      రాజ్యాంగబధ్ధంగా పధ్ధతై ప్రకారం విడగొదితే అసలు ప్యాకేజీల అవసరమేంటి?9వ షెడ్యూలూ 10వ షెడ్యూలూ అంటూ అన్ని కంపెనీలు ఉన్నాయని తెలిసినప్పుడు ముందు అవి విదగొట్టి తర్వాత మిగతా పనులు చూస్తారు యెవరయినా?ముందు పనులు వెంక చెయ్యటం అంటే ముడ్డితో తిండి తిన్నట్టు,యెదవకానా విభజన,ధూత్తెరి?!

      Delete
    8. ఈ సోది అంతా ఎందుకు? 2004లో కాంగ్రెస్‌పై లేని వ్యతిరేకత 2014లోనే ఎందుకు కలిగింది? రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అతను అర్బన్ ల్యాంద్ సీలింగ్ చట్టం రద్దు చేసి హైదరాబాద్‌లో భూముల ధరలు పెరిగేలా చేసాడు. దాంతో హైదరాబాద్‌లో real estates వ్యాపారం వికసించి హైదరాబాద్ కొందరికి మేడిపండు అయ్యింది. ఆంధ్రా ఎమ్మెల్యేలలో చాలా మంది హైదరాబాద్‌లో భూములు కొనడం వల్లే కదా తెలంగాణాపై 2004లో లేని వ్యతిరేకత 2009 తరువాత పుట్టింది.

      హైదరాబాద్‌నీ, విశాఖపట్టణాన్నీ సమానంగా అభివృద్ధి చేసి ఉంటే రాష్ట్రం విడిపోయినా రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ గెలిచి ఉండేది. కానీ 1956లో విలీనం జరిగినదే హైదరాబాద్ కోసం. అలాంటప్పుడు రెండు నగరాలని సమానంగా అభివృద్ధి ఎలా చేస్తారు?

      Delete
    9. మరి నీ సోది యేంటి?సగం మంది అన్ని నెలలు ముఖ్యంగా - కాంగ్రెసోళ్లే, సమైక్య ఉద్యమం చెసిందంత కాంగ్రెసోళ్ళే,మిగతా పార్టీ వాళ్ళు యెవరయినా ఉన్న్నారా?అన్ని రోజులు రహస్యంగా అయేమీ చెయ్యలేదే - అయినా అవన్నీ సోనియాకి తెలియకుండానే జరిగాయా?నీ చెవులో వొచ్చి చెప్తేఅనే చెప్పినట్టా.ఆంధ్రాలో ఉన్న అన్ని చోట్లా అన్ని రోజుల యెన్నికల ఫలితాల్లో గుండుసున్నా యెందుకొచ్చిందో చెప్పకుండా పాత సోది విప్పుతావేంటి?మూసుకుపో నీతో మాట్లాడటమే చిరాకు.అసలు నీకు నా పోష్టులో చాలంజి చేసాను,టేకప్ చెయ్యలేదేంటి?అన్ని రోజులూ తప్పుకుని తిరిగావు!యేదో మరీ యాడుస్తున్నాడు,వాదించలేని బడుధ్ధాయి అని వొదిలేస్తే రెచ్చిపోతున్నావు.ఆ పోష్తులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.కొత్తది కూడా వేశాను.దమ్ముంటే కాస్కో,బస్తీ మే సవాల్?!క్రినద్టి పోష్టులోనే ంది చాలంజి - రెడీయా?

      Delete
    10. హైదరాబాద్ అందరిదీ అని ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు నమ్మినంతమాత్రాన సోనియా కూడా అది నమ్మాలని రూల్ లేదు. ఏ ప్రాంతాన్నీ అభివృద్ధి చెయ్యకుండా హైదరాబాద్‌నే అభివృద్ది చేస్తే ప్రాంతీయవాద ఉద్యమాలు తలెత్తుతాయనే అనుమానం కలగకపోవడమే ఆంధ్రా నాయకుల తప్పు. దానికి సోనియా ఏమి చెయ్యగలదు?

      Delete
    11. తన పార్టీలో తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అల్లరి చేస్తున్న్ మందని ఆపలేకపోవడానికి ఆంద్రాలో ప్రజలు చూపించారు కదా?యేమీ చెయ్యలేని దేబెతనం చూపించింది,అది చాలు!

      చెయ్యాల్సింది చెయ్యలేదు కాబట్టే ఆంధ్రావాళ్ళు వోట్లు కూడా వెయ్యలేదు.చెల్లుకు చెల్లు,హళ్ళికి హళ్ళి అన్నట్టు నెత్తి మెద గుండు సున్నా ఫలితాన్ని పెట్టి చూపించారు.

      Delete
    12. ఏ ప్రాంతాన్నీ అభివృద్ధి చెయ్యకుండా హైదరాబాద్‌నే అభివృద్ది చేస్తే ప్రాంతీయవాద ఉద్యమాలు తలెత్తుతాయనే అనుమానం కలగకపోవడమే ఆంధ్రా నాయకుల తప్పు.
      ?
      తెలంగాణాకి దోచిఎపెట్టేటందుకు పనికొచ్చే దామాషాని మిగతా అన్నిట్లోనూ,కరెంటుకి సంబంధించి మాత్రం మరో దామాషాని యెత్తుకొచ్చి పెట్టడంలోనూ మంచి న్యాయాన్నే చూపించిందిగా నువ్వు కీర్తించే పార్టీ,దాని యొక్క అధిష్ఠానమూ?!

      Delete
    13. @neehaarikaa
      చిరంజీవి కాంగ్రెస్ తో కలవకపోయినా,జగన్ కాంగ్రెస్ తో కలిసిపోయినా బాగుండేది. ఇప్పటికైనా జగన్ వాస్తవాన్ని గ్రహిస్తే బాగుంటుంది.

      ans"జవాబు చెప్పటం లేటు కావచ్చు గానీ ఈఎ కామెంటు చదవగానే ఫకాల్న నవ్వుకున్నా!

      అసలు చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిందే కాంగ్రెసుకి మేలు చెయ్యడానికి!అది నా కల్పన కాదు,ఆనాడు పేరు మోసిన రాజకీయ విశ్లేషకుల అంచనా.అప్పటి రాజకీయ సమీకరణాల ప్రకారం ఒకప్పుడు రామారావులా యెకాయెకిన ముఖ్యమంత్రి అయినా కాకపోయినా కాపు కుల తిలకుడిగా ఆ వోట్లు తెదెపాకి పదకుండా చీల్చడమే దాని ప్రాధాన్యత.ఇంక అతను కాన్రెసులో కలవకపోతేనే హాశ్శ్చెర్యపడాలి!

      ఇంక జగన్ సంగతి!అప్పటీవరకూ ఆంధ్రా కాంగ్రెసు వాళ్ళంతా ఢిల్లీ వాళ్ళకి నీ బాంచను కాల్మొక్తా గాళ్ళే.మొదటిసారి కాంగ్రెసులో అధిష్ఠానాన్ని కూడా తన కాళ్ల చుట్టూ తిప్పుకున్న మొదటి మొనగాడు అతని తండ్రి!అంత ధీమాగా అతను ఉన్నా పార్టీని పవరులోకి తీసుకొస్తున్నాడు గనక కిక్కురు మనలేదు గానీ సాటివాళ్లకీ పైవాళ్ళకీ అత్ననటే భయం కూడా ఉండేది.అతని రాజకీయ జీవితమంతా కాంగ్రెసులోనే అపటి కాంగ్రెసులో నిత్య అసమ్మతి వాది బతుకు!అంతటివాడి కొడుకుని అతని కంటె ఘనుదుగా యెదగాలనుకున్న వాణ్ణి పైవాళ్ళ్ళు గానీ పక్కవాళ్ళ్ళు గానీ ప్రోత్సహిస్తారా - నీ పిచ్చి గానీ!

      కాబట్టి చిరంజీవి కాంగ్ర్సెలో కలవడం,జగన్ కాంగ్రెసు నుంచి బయటికి రావటం చాలా చాలా సహ్జమైన విషయాలు.రాముణ్ణి విమర్శించినా వైరభక్తి అనుకుంటారు గానీ ఇలాంటి పిచ్చిమాతలు మాట్లాడితే తిట్టను గూడ తిట్టరు - పక్కకి తిరిగి పుసుక్కున నవ్వుకుంటారు?!

      Delete
    14. జై సమైక్యాంధ్ర పార్తీకి ఆంధ్రాలో 1% వోత్‌లు కూడా పడలేదు. కాంగ్రెస్‌కి విశాఖపట్నం, అరకు నియోజకవర్గాల్లో 4%, 5% వోత్‌లు పడగా, మిగితా నియోజకవర్గాల్లో 2%, 3% వోత్‌లు పడ్డాయి. జై సమైక్యాంధ్ర పార్తీని ప్రజలు ప్రాక్తికల్‌గా కూడా చెప్పుతో సమానంగా ఎందుకు చూసారు? ఆంధ్రాలో సమైక్యవాదం బలంగా లేకపోబట్టే కదా.

      Delete
    15. ఆంధ్రలో సమైక్యవాదం బలంగా ఉందని యెవడన్నాడు?నేనంటే నువ్వు నన్ను చెప్పుచ్చుకు కొట్టు!లేనిదాని గురించి ఉన్నట్టు నువ్వు కూస్తే నేను నిన్ను చెప్పుచ్చుకు కొడతా!

      ఆంధ్రప్రజలు విభజనకి సిధ్ధంగానే ఉన్నారురా పిచ్చ్చిపుల్లయ్యా!విడిపోతే భూముల రేట్లు పెరుగుతాయనీ రక్రకాల కారణాలతో హుషారుగా ఉన్నారు యెప్పుదెప్ప్పుడు విడిపోతుందా అని,అది కూడా నీకు యెక్కలేదు!నా ఖర్మ!మీ ఫ్రెండు నీహారికా యే చెప్పిందిగా ఇక్కడ బ్లాగుల్లో నీకు చెవిలో చెప్తే గానీ అర్ధం కాదు గాబోలు!లేకపోతే అసాఎదీ అర్ధం కాదా?

      ఇంకోసారి సమైక్యాంధ్రా పార్టీ గురించి వాగితే మొత్తం నీ కామెంత్లన్నీ డెల్త్ చేసిపారేసి ప్రశాంతంగా ఉంటా!!ఆ స్మైక్య ఉద్యమం చేసింది యెవడురా గూట్లే - కాంగ్రెసోళ్ళు కాదా?తన పార్టీ వాళ్ళు సమైక్య ఉద్యమం చెస్తుంటే యేం పీకింది నీ అమాయ్కపు సోనియా?

      Delete
    16. > రాముణ్ణి విమర్శించినా వైరభక్తి అనుకుంటారు
      హరిబాబుగారూ, ప్రచారం కోసమో కాలక్షేపం కోసమో, సంపాదనకోసమో, రాముణ్ణి విమర్శించినా వైరభక్తి అవదండీ. హరివైరం కంటిమీద కునుకులేకుండా చేస్తే ఎవరినైనా వారిది వైరభక్తి అంటే. తీరికూర్చుని హరినింద చేసే వారికి గతి ఎటువంటిదో వేరే చెప్పాలా?

      Delete
    17. ఒక చేత్తో ప్రోగ్రాములు వ్రాసుకుంటూ ఇంకో చేత్తో చెత్త పారాయణాలు వ్రాసేవారిదే హరి భక్తి !

      Delete

    18. >>>>>చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిందే కాంగ్రెసుకి మేలు చెయ్యడానికి!<<<<<

      చిరంజీవి వల్లా వై ఎస్ ఆర్ వల్లా కాంగ్రెస్ కి మేలు జరిగిందా ? తిరిగి కోలుకోలేనంత దెబ్బలు మాత్రం తగిలాయి.

      మీరంతా నవ్వుకోవడానికే కదా నేనున్నది ? నవ్వడం ఒక భోగం...నవ్వించడం ఒక యోగం !

      Delete
    19. నీహారికగారూ, "ఒక చేత్తో ప్రోగ్రాములు వ్రాసుకుంటూ ఇంకో చేత్తో చెత్త పారాయణాలు వ్రాసేవారిదే హరి భక్తి !" అన్నారు. మీ‌ వాగ్ధోరణి క్రొత్తది కాదు. మీకు నచ్చని బ్లాగులు మీరు చదువనవసరం లేదు. మీకు చెత్త అనిపించటం మీ వ్యక్తిగత మైన భావన - అంతమాత్రం చేత మీకు ఒరిగేది మరొకరికి తరిగేదీ కూడా ఏమీ ఉండదు. నిరుద్వేగకరం వాక్యం...< అనీ వాగ్భూషణం భూషణం అనీ మీరు వినే ఉంటారు కదా. పోనీ తెలుగులో ఐనా, ఒక్క వేలు చూపి యొరులను నిందింప వెక్కిరించు నిన్ను మూడు వేళ్ళు అన్నది వినే ఉంటారు కదా ఒక వేళ మీకు సంస్కృతం తెలియని పక్షంలో? ఎందుకు దురాలాపాలతో కాలక్షేపం చేస్తున్నారు మరి! మీ ధోరణిని కొంచెం మార్చుకోలేని పక్షంలో "స్వభావో దురతిక్రమణీయః" అని ఊరకుంటాం.

      Delete
    20. >> తీరికూర్చుని హరినింద చేసే వారికి గతి ఎటువంటిదో వేరే చెప్పాలా?<<<<

      తీరికూర్చుని భజనలు చేస్తే అదే "హరిభక్తి" అనుకోమని రాముడు మీకు కల్లోకొచ్చి చెప్పాడా ? అధికార దుర్వినియోగం చేసిన రామదాసు గతి ఏమయిందో ఇంకా వేరే చెప్పాలా ? సకల సౌఖ్యాలూ అనుభవిస్తూ హరిజనులను ఉద్ధరిస్తూ తిరుగడమేనా రామభక్తి ?

      మీ వేళ్ళతో మీ కంట్లో పొడుచుకోవడం అంటే ఇదే ! సత్ బ్రాహ్మణుడవై జన్మించినందుకు గర్వించండి ! వైదిక ఆచారాలను నిలబెట్టటానికి ఏమి చేయాలో(చేతలు మాత్రమే) అది వ్రాయండి,యజ్ఞ యాగాదులు లేక చిక్కి శల్యమవుతున్న మీ దేవతలకు హవిస్సుని అందజేసి తరించండి !

      Delete
    21. నీహారికగారూ, రాముడు ఇలలోనో నా కలలోనో ఏమిచెప్పాడన్నది మీకు చెప్పనవసరం లేదు సుమా. మీ‌ అయాచితహితోపదేశాలు ముచ్చటగొలిపాయి. నేనేమి చేయాలో ఏమి వ్రాయాలో చెప్పటం మీ దురహంకారం నవ్వుపుట్టించింది. ధన్యవాదాలు. షట్సునరో‌లఘుతాముపవీతి అని చెప్పబడిన ఆరింట్లో స్త్రీషువివాదమ్‌ అని కూడా చెప్పారు కాబట్టి మీతో తగవుల ముచ్చట నాకు లేదు. ప్రాచేతసులు మీబోంట్లగురించే 'మంధరాః పాపదర్శినీ' అన్నారని తెలుసు. మీ అధికప్రసంగాలకు ఇకపై స్పందించను. మీ చిత్తం వచ్చినట్లే అనుకోండి వ్రాసుకోండి. సెలవు.

      Delete
    22. మొన్న అమావాశ్య

      Delete
    23. మొన్న అమావాశ్య
      -------
      Tooo good :)

      Delete
    24. >>>>>మీ‌ వాగ్ధోరణి క్రొత్తది కాదు<<<
      ఇకమీదట నీహారిక గారూ అంటూ నీతులు చెప్పటం మానండి. నీతులు చెప్పడానికి రాముడే సరిపోడు మీరెంత ? మీలాంటి వయోముఖ శకుని కన్నా మంధర ఎన్నో రెట్లు మేలు. శకుని వల్ల కౌరవనాశనం జరిగింది, మంధరవల్ల రాముని కీర్తి ఇనుమడించింది. మళ్ళీ చెపుతున్నాను నా జోలికి వస్తే ఊరుకునేది లేదు.

      Delete
    25. > నా జోలికి వస్తే ఊరుకునేది లేదు.
      నేను మీ జోలికి ఎన్నడూ రాలేదే! మీరే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు కాని?

      Delete
    26. >>>ఒక చేత్తో ప్రోగ్రాములు వ్రాసుకుంటూ ఇంకో చేత్తో చెత్త పారాయణాలు వ్రాసేవారిదే హరి భక్తి <<<

      మిమ్మల్ని ఉద్దేశ్యించి వ్రాసానని మీకు చెప్పానా ? మీరెందుకు నాకు నీతులు చెప్పారు ?

      Delete
    27. @ Mr Syamaliyam,

      ఒక్క వేలు చూపి యొరులను నిందింప వెక్కిరించు నిన్ను మూడు వేళ్ళు అన్నది వినే ఉంటారు కదా ?ఎందుకు దురాలాపాలతో కాలక్షేపం చేస్తున్నారు మరి ! మీ ధోరణిని కొంచెం మార్చుకోలేని పక్షంలో "స్వభావో దురతిక్రమణీయః" అని ఊరకుంటా !

      Delete
  2. మావాల్లలో మేధావులు ఎక్కడ ఉన్నారు. వ్యాపారవేత్తలు తప్ప ! వాళ్ళే ఉండుంటే, చివరి "బ్యాట్స్ మన్" గురించి ముందే చెప్పేవారే కదా ! చివరి ఓవరులో అన్ని పరుగులు చేయడం కుదరదని చెప్పేవారే కదా? రన్స్ బ్యాట్ తో కొడితే వస్తాయి కానీ ప్యాడ్స్ థో (పెప్పర్ స్ప్రే)తో కొడితే రావని చెప్పేవారే కదా ! వీల్లు చేసిన గందర గోళానికి అంపైర్లూ, రెఫరీలు అంతా కలిసి మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో కూడా డక్‌వర్త్ లూయిస్ మెథడ్లో ( తలుపులేసి, కెమెరాలు ఆఫ్ చేసి) మ్యాచ్చును పక్కటీముకే ఇచ్చేస్తారని చెప్పేవారు కదా !!

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు,ఆ వ్యాపారస్థుల వల్ల మొత్తం ఆంధ్రా వాళ్ళనే దోపిడీదారులన్నారు,తెలంగాణా వాళ్ళనైనా క్షమించవచ్చునేమో గానీ చిన్నమ్మని మాత్రం మర్చిపోకూడదు.పైగా రాహుల్ తో నా మీద కోపం ఎందుకు బేటా అని రాగాలు తీస్తుంది.తె రా స కి ఇద్దరే ఎం పీ లు ఉన్న లోక్ సభలో ఆవిడ చేసిన ఘనకార్యం తక్కువేమీ కాదు.

      Delete
    2. "తెలంగాణా వాళ్ళనైనా క్షమించవచ్చునేమో"

      నీహారిక గారూ, మీరు క్షమించినా మానినా ఫరక్ పడదు. తెలంగాణా తప్పు చేయనప్పుడు క్షమాపణలు అనవసరం.

      Just for fun. ఎవరి దగ్గర నుంచి దొంగలించామో వారిని క్షమించడం కష్టం: శ్రీశ్రీ

      Delete
    3. @jai
      యెక్కడ ప్రత్యేక హోదా వస్తుందో అన్న యేడుపు ఇక్కడ నువ్వు వేసిన కామెంట్లలోని ప్రతి అక్షరంలోనూ కనబడుతూనే ఉంది.యెవరు యెవర్ని దోచుకున్నారో తెలియదు గానీ వాహనాల రీ-రిజిస్ట్రషను నుంచి "అది కూల్చుతా","ఇది పదగొడతా" నంటూ చేసే పిట్టలదొర కడుచక్కని పాలన మహా భేషుగ్గా యెంజాయ్ చేస్తున్నారులే!

      సింగపూరు వెళ్ళాడు,యెందుకు?అక్కడి ప్రగతిని తెల్సుకోవటానికి!వెళ్ళి పేల్చిన జోకు యేమిటంటే మేము వెంట వచ్చి అన్నీ వివరిస్తాం మహప్రభో అని వాళ్ళంటే "ఠాట్,నువ్వు నాకు చెప్పేదేమిటి?అన్నీ మేమే తెలుసుకుంటాం" అని భీకరంగా మాట్లాడి పండిట్ కచరా మోహన మాలవ్యా గారు చెసిందేమిటయ్యా అంతే కారులో రోడ్ల మీద మాత్రం తిరగడం! పైగా తిరిగి ఇక్కడి కొచ్చి గొప్ప్పలు చెప్పుకుంటుంటే పగలబడి నవ్వాల్సింది పోయి పరవశించి విన్నారు?!!

      ముందు నీ రాష్ట్రంలో జరుగుతున్న కేతిగాడి పరిపాలన సరిచేసుకోవయ్యా యేడుపుగొట్టుముక్కలా!హోదా పేరుతో స్టాంపు గుద్ది ఇమ్మనడం లేదు మేము కూడా! మా ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రిలాగా రోడ్లు అర్వే చేసి సరిపెట్టెయ్యకుండా ప్రపంచ దేశాల పారిశ్రామిక వెత్తల నుంచి "MOU"లు రెడీగా అపెట్టుకున్నాడు. మాకు కావలసినది పారిశ్రామిక రాయితీలు - ఆ విషయం తేలితే మా బతుకు మేం మొదలుపెదతాం!అందరి కష్టమూ ఉందని తెలిసి కూడా ఒక్క రూపాయి ఇచ్చేది లేదన్న వాల్ళు కూడా న్యాయమంతా మా దగ్గిరే ఉందని పగలబడిపోతున్నారు?!దేవుడు లేదనుకుంటే పాపపుణ్యాల్ని కూడా లెఖ్ఖ్క చెయ్యనఖర్లేదు,పశ్చాత్తాపం మాత్రం ఉంటుందా?!లెఖ్క్ఖ ప్రకారమే నాసికుడివైనట్టున్నావు?! మిగతా లోటు బడ్జెట్ పూడ్చటం,రాజధాని నిర్మాణ్మలో వాటా కూడావస్తే చాలు!నువ్వ్వేదో యెండమావులు చాలా ఉన్నాయి అన్నది నీ ఉక్రోషపు చూపులకి కనిపిస్తున్నట్టున్నాయి.మేం పూర్తి తెలివితోనే ఉన్నాం, మాకు రావలసినవి యెలాగూ సాధించుకుంటాం.నీ ఉబోసలు నీ దగ్గిరే ఉంచుకో! బీహారు యెన్నికల తర్వాత అనే మాట యెప్పటినుంచో వింటూనే ఉన్నాం,కాకపోతే మిత్రధర్మంగా పోతున్నాడు మా ముఖ్యమంత్రి,అంతే!

      ఒకే మాట ఇద్దరు అన్నా ఒకణ్ణి ముందుగానే ఇన్సైదరుగానూ ఇంకొకణ్ణి ఔత్సైద్డరుగా ఫిక్సయిపోయి ద్వేషం కురిపించినది మీరు!గయ్యాళితనంతో దాన్ని మాకు అంటగట్టారు?!నిజమైన తెలంగాణా ప్రజలు చాలా మంచివాళ్ళు.దెంచనాల శ్రీనివాస్ రాసిన "భస్మ సారంగి"లో నిలువెత్తు రూపంలో కనబడతారు.వాళ్ళు గనక నిజమైన తెలంగాణా వాళ్ళు అయితే ఈ భూ ప్రపంచం మీద తెలంగాణాలో పుట్టకపోయినా నాతో సహా మరెవడికయినా సరే తెలంగాణా వాడు అని పిలిపించుకునే అర్హత ఉంటుందేమో కానీ తెలంగాణాలో పుట్టినా సరే నీకు మాత్రం తెలంగాణా వాడు గా ఉండే అర్హత లేదు.

      Delete
    4. @ హరిబాబు గారు,

      మీ బ్లాగులోకి ఎవరైనా వచ్చారంటే మీ ఇంటికి వచ్చి మీతో చర్చించినట్లుగా భావించండి. మమ్మల్ని మీ అతిధులుగా భావించాలి.అతిధులతో అమర్యాదగా ప్రవర్తించకూడదు కదా ? అజ్ఞాతలు దుర్భాషలాడితే వారికి చెప్పినా దండగే !మీరు కాస్త సౌమ్యంగా మాట్లాడితే చర్చించగలం.రామజన్మ భూమి విషయం గానీ కశ్మీర్ విషయం గానీ తేలాలంటే ముస్లిం వర్గాలకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో తెలంగాణా వారికీ అంతే ప్రాముఖ్యత ఉన్నది.మీరు కాస్త సామరస్యత పాటిస్తే అందరికీ మంచిది.

      Delete
    5. @Jai gaaru,

      ఒక చిన్న ఉదాహరణ చెపుతాను.తప్పెవరిదో మీరే నిర్ణయించండి. హైదరాబాద్ లో స్థిర నివాసముంటున్న ఒక ఉద్యోగికి కొంత ఆస్థి కలిగిన అమ్మాయినిచ్చి పెళ్ళి చేసారు పెద్దలు. ఇద్దరూ కలిసి ఇంకొంత ఆస్థి సంపాదించుకున్న తరువాత ఎవరు గొప్ప అన్న తగాదాలొచ్చాయి.నాదంటే నాదే గొప్పని వాదించుకున్నారు.పెద్దలందరూ కలిసి ఇద్దరి గొడవా చూడలేక,సర్ది చెప్పలేక విడదీసేసారు కానీ ఇద్దరూ కలిసి సంపాదించిన ఆస్థిని భర్తకే ఇచ్చేసారు.భరణం కూడా ఇవ్వకపోతే ఆమె ఎలా బ్రతుకుతుంది ? ఆమె ఆస్థి ఆమెకు ఉంది కానీ ఆమె కష్టం ఏమయిపోయింది ? సామరస్యంగా ఉండని భార్యా భర్తలది తప్పా ? సర్ది చెప్పలేక బలవంతంగా విడదీసిన పెద్దలది తప్పా ? వీళ్ళందరి మధ్యన బలవుతూ గజానికో టోల్ టాక్స్ మలేషియాకో , సింగపూర్ కో బలవంతంగా కడుతున్న పిల్లల భవిష్యత్తు ఏమిటి ?



      Delete
    6. మా అమ్మగారు మొదట్లో సమైక్యాంధ్రవాదాన్ని సమర్థించారు కానీ తరువాత ఆవిడ తెలంగాణావాదాన్నే సమర్థించారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోకుండా హైదరాబాద్‌ని మాత్రమే అభివృద్ధి చేస్తే వాళ్ళు హైదరాబాద్‌ని మనకి ఎలా ఇస్తారు అని ఆవిడ అడిగారు. ఒక auto driver కూడా ఇలాగే అనడం చూసాను "IT కంపెనీలన్నీ హైదరాబాద్‌లోనే పెట్టించి ఇప్పుడు తెలంగాణా-ఆంధ్రా తనకి రెండు కళ్ళు అని చెపితే ఎవడు నమ్ముతాడు" అని. IT కంపెనీలు అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి సౌకర్యాలు ఉన్న హైదరాబాద్‌లోనో, బెంగళూరులోనో పెడతారు కానీ విజయవాడలోనో, కర్నూల్‌లోనో పెట్టరు. ఒక రకం పరిశ్రమని మాత్రమే నమ్ముకుంటే ఇలాగే జరుగుతుంది.

      Delete
    7. నీహారిక: మీ బ్లాగులోకి ఎవరైనా వచ్చారంటే మీ ఇంటికి వచ్చి మీతో చర్చించినట్లుగా భావించండి. మమ్మల్ని మీ అతిధులుగా భావించాలి.అతిధులతో అమర్యాదగా ప్రవర్తించకూడదు కదా ?

      అవునవును నీహారిక గారూ. కానీ మీరు మాత్రం, ఇతరుల బ్లాగుల్లోకి అలాగ 'అతిథి'హోదాలో వెళ్ళి 'ముసలికాకులూ' వగైరా అంటూ అవాకులూ చవాకులూ పేలవచ్చునా? అతిథులుగా వెళ్ళిన వారు తాము పోయిన చోట మర్యాదగా మాట్లాడొద్దా?
      అడ్డమైన బ్లాగులోనూ దూరి అడ్డదిడ్డంగా మాట్లాడటం అతిధులలాగా ప్రవర్తించటం అవుతోందా చెప్పండి మరి!?

      Delete
    8. @neehaaarika,
      ఒకప్పుడు ఉద్యమం జరిగే సమయంలోనే బ్లాగుల్లో నేనొక కామెంటు వేశాను.అప్పుదు కూడా విభజనని వ్యతిరేకించకుండా కేవలం ఈ దుర్మార్గపు పులుముడు గురించే పట్టించుకునేవాణ్ణి.ఆ కామెంటుకి తను ఇచ్చిన కామెంటు చూసి ప్రతిదాన్నీ స్పోర్టివ్గా తీసుకునే నాకు కూడా మనసు చివుక్కు మనేసింది.నాకొక్కడికే అలా అనిపించందేమో అనుకుంటే నేను అతిగా ఫీలవుతున్నానని నాకు మీరు లెక్చర్లు ఇస్తారు.ఒక లేడీ బ్లాగరు,బహుశా మాలతీ మాధవం అనుకుంటాను "జై గారూ యెంత క్ర్రొరమైన మాత వాడారు?" అనే కామెంటు వేశారు.

      వరూధిని బ్లాగులె "హరికాలం ఇక పోయే కాలమే" అన్నా నవ్వుకోగలిగాను కానీ ఆకింద ఇతబు వేసిన స్మైలీ చూసి మాత్రం మనస్సు భగ్గున మండింది! కేవలం హాస్యం కాదు పోతే బాగుండునన్న ఆనందం నుంచి వచ్చిన స్మైలీ అది అనిపించింది నాకు?!

      సింగపూరు ఒక నగరమే దేశం అయిన పరిస్థితి!యే రాష్ట్రంలో నైనా ఇతర్లు చూసేదీ రాజధానినే, తొలిసారిగా ఆ రాష్ట్రానికి వెళితే రాజధాని నే చూస్తారు.ఇంటికి ముఖద్వారం యెలాగో రాష్ట్రానికి రాజధాని అలా!1940లో ఒక తమిళియన్ ఆంధ్ర ప్రాంతం బాగుకోసం పోలవరాన్ని ప్రతిపాదిస్తే దాని మీద యెన్ని యేడుపులు యేడుస్తున్నాడు?కే యల్ రావు కేవలం డిజైనులో ఉన్న లోపం గురించి వ్యతిరేకత చూపిస్తే అసలు ప్రాజెక్తునే వ్యతిరేకించినట్టుగా పులుముతున్నాడు!పోలవరం కోసం మానాన్నగారు కన్న కలలు నిజంకావాలి అన్న ఆయన కూతురు కంటే యెక్కువ తెలుసా ఇతనికి కే యల్ రావు గురించి?

      అన్నీ విభజన బిల్లులో లేవని మాకూ తెలుసు!రావయ్యా బాబూ చర్చించి పరిష్కరించుకుందాం అనై ఆంధ్రా ముఖ్యమంత్రి యెబ్ని సార్లు పిల్చాడు?పదేళ్ళు ఉమ్మడి రాజధాని ప్రతిపాదనకి తను కూడా తలూపి ఇప్పుడు నిముష నిముషం నీకిక్కడేం పని పో పో అనే గోల తప్ప మరొకటి లేదు,యెందుకని?

      ఉద్యోగుల రెట్రెంచ్మెంట్ అంటే యెంత కిరాతకం?వాళ్ళు నెల జీత గాళ్ళు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చర్చలకి పిల్చింది సజావుగా ఇలాంటివి పరిష్కరించుకందామనే కదా!అంతమంది నెల జీతగాళ్లని యేకపక్షంగా ప్రత్యామ్నాయం చూపించే వీలు లేకుండా యీసెపారెయ్యటం క్రూరత్వం కాదా?

      నిన్నటిదాకా క్రూరంగా జరిగినదంటున్నదానికి వీదగొట్టిన వాళ్ళు ఇవ్వాళ చేస్తున్నది క్రూరత్వం కాదా? యేవరు క్రూరులు?యెవరికి యెవరి మీద మండాలి?

      Delete
    9. @Marxist Hegelian
      విడిపోయేనాటికి సమైక్య రాష్ట్రం అధ్భుతంగా వెలిగిపోతున్నదా?60 యేళ్ళు గడిచాక కూడా కొంచెం కూడదీసుకునే దశలోనే ఉంది.ఒక నగరమైనా - అదీ రాజధాని నగరం, మొత్తం రాష్త్ర ఆదాయంలో కొన్ని జిల్లాలతో కూడిన ఒక ప్రాంతం తీసుకొచ్చేటంత ఆదాయం తీసుకొచ్చేలాగ చేస్తే దానికీ యేదుస్తున్నారంతే బుర్రలో గుక్జ్జు ఉన్నట్టా లేనట్టా?

      Delete
    10. ముసలి కాకి (లెక్కలు) చెప్పింది సదరు బ్లాగరే....అక్కడే వివరణ కూడా ఇచ్చాను,సరిచూసుకోండి.నేను ఎవరినీ అన్యాపదేశంగా విమర్శించను.ఆఖరికి రాముడినైనా సరే !

      Delete
  3. @jai
    హరిబాబు గారూ, ఆంధ్రకు ప్రత్యెక ప్రతిపత్తి ఇవ్వడం కుదరదనీ, ఒకవేళ ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఏమీ లేదనీ నేను ఆనాటి నుండే చెప్తున్నాను. వాస్తవం చెప్పిన పాపానికి కొందరు వీరాంద్రాభిమానులు నన్ను కుళ్ళుపోతు, ఆంధ్రద్వేషి లాంటి మాటలు అన్నారు.
    ??
    దీని తర్వాత "అసలు జదిగిందేమిటి?" అని నువ్వు తవ్వి తీసినవి కొత్తగా నీ బుర్రలఓనే పొడిచాయనుకుంటూన్నావా?నాకు గతకాలపు పాఠాలు చెప్తున్న నీకు ఇవ్వాళ్తి పరిస్థితి చెప్తా విను!

    ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టి అడిగింది భాజపాకి సంబంధించిన వెంకయ్య నాయుడు ఆ పేరుతో గానీ మరో పేరుతో దాన్ని కాంపెన్సేట్ చెయ్యకుండా ఆంధ్రాలో భాజపా అభ్యర్ధుల్ని నిలబెట్టి ప్రచారం చేసి గెలిపించుకోగలడా నికరమిన సాయం చెయ్యకుండా?అది సూటిగానే కాదు ఒకవేళ బాబుని బద్నాం చేసి బురిడీ కొట్టించి తీసేసి జగన్ బొమ్మని కూర్చోబెట్టిన బటాచోరు పధ్ధతిలో అయినా సరే ఇచ్చిన మాట తప్పి ఆంధ్రాలో కాలు పెట్టగలడా!?

    మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అయ్యిందని మీవాళ్ళే అంటున్నారు!మా భూములన్నీ కబ్జా చేసేశారు అని యేడ్చారు కదా,ఈ సుదీర్ఘకాలపు జమానాలో యెన్నంగుళాల భూమిని ఆంధ్రావాళ్ళ కబంధ హస్తాల నుంచి విడిపించాడు మీ ముఖ్యమంత్రి?నిన్న గాక మొన్న ఉస్మానియా యూనివర్శిటీలో తను స్వాధీనం చేసుకోవాలన్న భూమి యెంత?అక్కద యెన్ని ఇళ్ళ్ళూ పడతాయి?తను వాగ్దానం చేసినది యెంతమందికి?నాకు తెలియకే అడుగుతున్నాను,నువ్వ్వు లెక్కలు వేసి చెప్తావా?అది యెండమావి కాదా?వాస్తు సరిగ్గా లేదు కూలగొట్టేస్తానని అంత హడావిడి చేసిన వాడు అది చేశాడా?అది యెందమావి కాదా?హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు 65అంతస్థులవి కదతానన్నాడు,దాని పని యెప్పుడు మొదలవుతుందో గ్యారెంటీ ఇవ్వ్వగలవా?అది యెండమావి కాదా!ఇన్ని యెండమావుల్ని చూసీ చూస్తూ చూడటానికి సిధ్ధంగా ఉండి నువ్వు మాకు యెండమావుల గురించి హెచ్చరికలు చేస్తున్నావా?హవ్వ!

    ReplyDelete
  4. @Haribabu Suranenii:

    ముందుగా రెండు వ్యక్తిగత విషయాలు:

    1. ఎవరిని ఏకవచనంతో సంబోదించాలో అన్న విషయంపై మీకు ఉన్నట్టే నాకూ నా నియమాలు ఉన్నాయి. మీరు నన్ను నువ్వు అన్నా నా నియమాల దృష్ట్యా నేను అలా చేయనందుకు మన్నించండి. I am unable to reciprocate as my standards for the "familiar thou" are different.

    2. మీరే కాదు ఎవరూ బ్లాగింగ్ నుండి తప్పుకోవాలని నేను కోరుకోను, ఇకముందు కూడా కోరుకోను. నాది ఫలానా వాళ్ళు పొతే బాగుంటుందని అనుకునేంత చిల్లర మనస్తత్వం కాదు. నలమోతు చక్రవర్తి గారు నేను పూర్తిగా పరస్పర వ్యతిరేకమయిన వాదనలు వినిపించినప్పుడు కూడా వారిని నేను పూర్తిగా గౌరవించాను. I am incapable of hating anyone merely on account of their beliefs.

    ఇక మీరు ప్రస్తావించిన అనేక విషయాలలో కొన్నిటికి (ఓపిక ఉన్న మేరకు) సమాధానం చెప్తాను.

    ప్రత్యేక ప్రతిపత్తి (హోదా కాదు):

    ఆంధ్రకు (తెలంగాణకు కూడా) ఎందుకు ప్రత్యేక ప్రతిపత్తి రాదో అన్ని వివరాలతో గతంలోనే చెప్పాను. ఒకవేళ వచ్చినా పెద్దగా ప్రయోజనం లేదని కూడా వివరించాను. మీకు కావాలంటే మళ్ళీ చెప్పగలను. ఇందులో వ్యక్తిగతం ఏమీ లేదు, ఏడుపు అంతకన్నా లేదు. నాది కొట్లాడే మనస్తత్వమే తప్ప ఏడుస్తూ కూచోవడం నాకు తెలీదు.

    ప్రత్యేక ప్రతిపత్తికి రాయితీలకు మామూలుగా అయితే సంబంధం ఉన్నమాట వాస్తవమే కానీ ప్రస్తుత ఉదాహరణలో కాదు. తెలంగాణా ఆవిర్భావ చట్టం సెక్షన్ 94 ఇప్పటికే రెండు వారస రాష్ట్రాలకు రాయితీలు పొందు పరిచింది. అంచేత ప్రత్యేక ప్రతిపత్తితో సంబంధం లేకుండా రాయితీలు యధావిధి తెచ్చుకోవోచ్చు.

    ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వకపోతే బీజేపీని భూస్తాపితం చేస్తారా చేయండి. ఈ రెండు సీట్లు రాకపోతే వెంకయ్య నాయుడికి నష్టమేమో కానీ మోడీకి పోయేదేమిటి? ఆంధ్రకు ఇస్తే బీహార్/బెంగాల్/రాజస్తాన్/ఒరిస్సా వదిలేసుకోవాల్సివస్తుందేమో అన్న బెంగ సంగతేమిటి?

    కెసిఆర్/తెరాస పాలన:

    వీళ్ళేదో పొడిచేస్తారన్న అపోహ నాకు లేదని నా ఇంటర్వ్యూలోనే చెప్పాను. నా ప్రయారిటీలు ఏమిటో కూడా అక్కడే చెప్పాను. మిగిలిన విషయాలు (ఉ. ఆకాశహర్మ్యాలు) గురించి నాకు ఆసక్తి లేదు కనుక అవి నాకు ఎండమావులు కాలేవు.

    నాకు సీరియస్ ఇంటరెస్ట్ ఉన్న నీటి పారుదల రంగంలో నేను అనేక విధాలుగా పని చేస్తున్నాను. ఇందులో బ్లాగింగ్ లాంటి వాటికి అన్నిటి కంటే తక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. బయటకు కనిపించని ఆక్టివిస్ట్ కార్యకలాపాలలో ఫలితాలు మిన్నగా ఉంటాయని నా ధృడ నమ్మకం. When I am serious about something, I take it up in all possible ways instead of just blogging.

    కెసిఆర్ సింగాపూరులో ఏమి చేసాడో, కేటీఆర్ అమెరికాలో ఏమి పీకాడో తెలుసుకోవాలని అనుకుంటే సదరు బృందాలలో సభ్యులయిన మిత్రులను అడుగుతాను తప్ప మీడియా రిపోర్టులను చదివి ఊహాగానాలు చేసే Tom, Dick or Harryలను కాదు. I use reliable sources wherever I can.

    మిషన్ కాకతీయ అయినా మరోటయినా రాజకీయ ప్రత్యర్తులు అవినీతి ఆరోపణలు చేయడం మామూలే. మనం ఎప్పుడు స్పందించాలి? ప్రాధమిక ఆధారాలు ఉన్నప్పుడు లేదా సీరియస్ సెకండరీ రుజువులు దొరికినప్పుడు మనం దృష్టి సారించాలి తప్ప ప్రతీ అభియోగామూ నిజమనడం అవుతుంది.

    ReplyDelete
    Replies
    1. Continued:

      పోలవరం:

      పోలవరం & ఇతర నీటి పారుదల అంశాలపై ఎవరితోనయినా ఎంతలోతు చర్చయినా నేనెప్పుడూ సిద్దమే. బస్తీమే సవాల్ :)

      కెఎల్ రావు గారు పోలవరాన్ని తదుపరి కాలంలో ఎందుకు వ్యతిరేకించారో అన్న అంశంపై మీకున్న ఆధారాలు బయటపెట్టండి చర్చిద్దాం. అదే సమయంలో పోలవరంపై నాకున్న అభ్యంతరాలన్నీ ఆధారాలతో సహా చెప్తాను మీరు ఎన్నిటిని ఎండ కట్టగలరో కట్టండి. ఏడుపులు పెడబొబ్బలు (లేదా అవతలి వాడికి కామన్ సెన్స్ లేదనడం) అనడం వాదనలు కావు.

      FYVKI శ్రీరామపాదసాగర్ లాభసాటి కాదని తేల్చిన నివేదికను 1951 మీటింగులో కేంద్రజల సంఘం తరఫున సబ్మిట్ చేసిన బృందంలో కెఎల్ రావు గారు కూడా ఉన్నారు.

      సుజాతా రావు గారంటే నాకూ గౌరవమే. ఆవిడ నాకు వ్యక్తిగతంగా పరిచయమే కాక వారి సమీప బంధువు ఒకతను నాకు ఆప్త మిత్రుడు కూడా. అయితే రావు గారి నీటి పారుదల నైపుణ్యానికి/ఆలోచనా ధోరణికి ఆవిడ వారసురాలు కారని కాలేరని సవినయంగా మనవి. If someone wants to understand Dr. Kalam's missile vision, I would recommend reading his work and/or speak to his defense colleagues, not his brother!

      మీరు వెంకట అయ్యర్ గారిని తమిళియన్గా & కెఎల్ రావు గారిని ఆంధ్రుడిగా చూడాలంటే అది మీ ఇష్టం. నా మట్టుకు నేను ఇద్దరినీ ఇంజనీర్లు/నీటి నిపుణులుగానే చూస్తాను.

      విభజన పర్వ సాధక బాధకాలు:

      చంద్రబాబు చర్చిద్దాం రమ్మంటున్నది ఎలాంటి అంశాల మీదండీ? ఆంద్ర ప్రయోజనాలు (ఉ. డెల్టాకు నీళ్ళు కావాలి) దెబ్బ తిన్నప్పుడు ఆయన చర్చలు కావాలని అన్నారు. పీపీయే రద్దు లాంటి విషయాలలో తెలంగాణా ప్రయోజనం కోసం చర్చలకు ఆయన రాలేదు. ఎవరయినా తమ రాష్ట్ర ప్రయోజనమే చూసుకుంటారు నాకూ ఒకే కానీ "మేము సిద్దం, వాళ్ళు సహకరించలేదు" అనే బిల్దప్పులే విసుగు.

      మీరు ఉటంకించిన ఆంద్ర ప్రాంత విద్యుత్ ఉద్యోగులను రెట్రెంచ్ చేయలేదు. తెలంగాణా వారిని తీసుకోమని ఆంధ్రను అడిగింది. తమ రాష్ట్ర ఉద్యోగులపై ప్రేమ ఉండుంటే ఆంద్ర వారిని తీసుకోవాలి కానీ ససేమిరా అని భీష్మించింది. శాశ్వత పరిష్కారం దొరికే వరకూ కనీసం వారికి జీతాలు ఇవ్వోచ్చనే సోయి చంద్రబాబు గారికి లేకుండా పోయింది అందుకే రోడ్డు మీద పడ్డారు.

      "నిజమయిన తెలంగాణా వాళ్ళు":

      నేనెవరినో తెలంగాణా కోసం నేను/మా కుటుంబం చేసిందేమిటో అక్కర ఉన్న వాళ్లకు తెలుసు. తెలియని వారికి డప్పు కొట్టి చెప్పాల్సిన ఆగత్యం నాకు లేదు. I don't need a certificate from anyone.

      తెలంగాణా (ఆంద్ర కూడా) ప్రజల మంచితనం గురించి మీరు చెప్తే తప్ప తెలియని వారెవరూ ఇక్కడ లేరని గమనిస్తే సంతోషం. ఆయన ఎవరో రాసిన పుస్తకాలు చదివి తెలుసుకోవడం కంటే ప్రజలలో తిరిగి వారి ఔన్నిత్యాన్ని అర్ధం చేసుకోవడమంటేనే మెరుగని నా ఉద్దేశ్యం. My appreciation for the people is based on person-to-person contacts, not mere reading. I have been blessed by the warmth showered by people from Telangana, Andhra & many other states.

      Delete
  5. @నీహారిక:

    "మమ్మల్ని మీ అతిధులుగా భావించాలి"

    ఎవరి శైలి వారిదండీ. నేను బూతులు రాసిన వారిని ఇగ్నోర్ చేసి మిగిలిన వారందరితో(భాష బాగున్నా లేకపోయినా) చర్చిస్తాను.

    "ఒక చిన్న ఉదాహరణ చెపుతాను"

    ఆలుమగల ఉదాహరణ ఇక్కడ కరెక్ట్ కాదేమో.

    ఇకపోతే "అన్ని ప్రాంతాల ఆదాయం హైదరాబాదులో ఖర్చు పెట్టాం" అన్న వాదనకు కనీస ఆధారాలు ఉన్నాయా? ఉంటె ఆ లెక్కలు ఏమిటో చూపిస్తే చర్చించగలం. లెక్కలు తేలాక అవసరం అయితే తెలంగాణా ఆంధ్రకు నష్ట పరిహారం చెల్లించాలని నేనూ వాదిస్తాను. ఒకవేళ తెలంగాణా ఆదాయం మీదే ఆంధ్రకు లబ్ది జరిగిందన్న నా అనుమానం రుజువయితే ఆంద్ర తెలంగాణకు పరిహారం కట్టాలని మీరూ ఒప్పుకుంటారా?

    నేను GOMకు ఇదే తరహాలో ఇచ్చిన ప్రస్తావన నా బ్లాగులో ఉంది. కుదిరినప్పుడు చదవగలరు.

    ReplyDelete
    Replies
    1. ఆదాయాల లెక్కల గురించి తెలంగాణా వాదులు తప్పు చేసారని భావించటం కరెక్ట్ కాదు.నా వాదన విభజన జరిగిన పద్ధతి గురించి,23 నిమిషాలు తలుపులు మూసి మూజువాణి పద్ధతిలో విభజిస్తారా ?

      Delete
    2. తలుపులు మూసారన్న మాట కరెక్ట్ కాదండీ. లోక్సభలో ప్రక్రియ వీక్షకులు & పాత్రికేయులు ఉండగానే జరిగింది.

      ఇకపోతే వాజపేయీ హయాములో మూడు రాష్ట్రాలు ఏర్పడేనాటికి లోక్సభ టీవీ లేదు. ఇంతకు ముందు ఏర్పడ్డ రాష్ట్రాల బిల్లుల చర్చ ఎంతెంత సేపు జరిగిందో, మూజువాణీ చేసారా డివిషన్ వెళ్ళారా అన్న విషయాలు ఎవరికీ తెలీదు కానీ ఆంద్ర పార్టీలు & మీడియా మాత్రం ఈ విషయంపై రచ్చ చేసాయి.

      Delete
  6. @jai
    శ్రీరామపాదసాగర్ లాభసాటి కాదని తేల్చిన నివేదికను 1951 మీటింగులో కేంద్రజల సంఘం తరఫున సబ్మిట్ చేసిన బృందంలో కెఎల్ రావు గారు కూడా ఉన్నారు.
    ??
    మీరు చెప్తున్నది 1953లో రెపోర్ట్ సబ్మిత్ చేసిన ఖోస్లా కమిషన్ గురించేనా?లేక మోరొక కమిషనా/వివరాలు చెప్పగలరా?

    ReplyDelete
    Replies
    1. కృష్ణా-గోదావరీ జలాల పంపకం విషయంపై 1951 జూలై 27-28 తారీకులలో ప్రణాళికా సంఘం అధ్వర్యంలో అంతర్-రాష్ట్ర మీటింగ్ జరిగింది. దీనికి 5 పారివాహిక రాష్ట్రాల (బొంబాయి, మదరాసు, హైదరాబాద్, మధ్య ప్రదేశ్ & మైసూరు) రాష్ట్రాలనుండి 16 సభ్యుల అత్యున్నత స్థాయి ప్రతినిధులతో పాటు ప్రణాళికా సంఘం & కేంద్ర జలసంఘం (CWC) తరఫున చెరి నలుగురు శిఖర నాయకులు పాల్గొన్నారు.

      కేంద్ర జలసంఘం అప్పటికే వివిధ రాష్ట్రాల ప్రతిపాదనల గురించి ముందుస్తు అధ్యయనం చేసి ఒక నివేదికను తయారు చేసింది. ఈ నివేదికను సబ్మిట్ చేసిన సీడబ్యూసీ ఖోస్లా గారితో పాటు డా. కెఎల్ రావు గారూ ఉన్నారు.

      మీరు చెప్తున్న 1953 ఖోస్లా సాంకేతిక కమిటీలో (నాకు తెలిసినంత మేరకు) రావు గారు లేరు.

      Delete
    2. @jai
      మీరు చెప్తున్న రిపోర్టుకు సంబంధించిన సమాచారం నాకు కనపడలేదు.కాబట్టి దాని గురించిన సమాచారం గానీ అధీకృతమైన లింకు ఉంటే ఇవ్వగలరా?

      యెందుకంటే "పోలవరం గురించి ఇప్పుడేడ్చి యేం ప్రయోజనం?" అని చాలాకాలం క్రితం ఒక పోష్టు వేసాను.అక్కడ్డ కొన్ని విసహ్యాల గురించి మీరు కూడా స్పందించారు.అది వూర్కే గాలి పోగేసి రాయలేదు.మొత్తం అంతా పోష్తులోకి యెక్కించ లేదు గానీ చాలా మెటీరియల్ కలెక్ట్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి రాసిన పోష్టు అది!

      మీరు 1951 నాటి రిపోర్టులో కే.యల్ రావు గారు పాల్గొన్న కమిటీ మొత్తం పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే వద్దని అన్నట్టుగా యెక్కడయినా స్పష్టంగా ఉందా?

      యెందుకిలా అడుగుతున్నాను అంటే 1953 నాటి ఖోస్లా రిపోర్టు చేసింది మాత్రం పోలవరం పూర్తిగా తప్పు అని చెప్పకుండా కేవలం అప్పుడు ప్రపోజల్ చేసిన మోడల్ సరిగ్గా లేదు,ఒన్ని మార్పులు చెయ్యాలి అని మాత్రమే చెప్పింది.అయితే ఆ మార్పుల్ని చెయ్యడానికి తగ్గ సాంకేతిక పరిజ్ఞానం లేకపెవడం వల్ల పెండింగులో పెట్టారే తప్పాసలు ప్రాజెక్టు లాభసాటి కాదౌ అని తేల్చి చెప్పి రద్దు చెయ్యమని సలహా లాంటిది కూడా ఇవ్వలేదు!

      ఆ తర్వాత ఆ డిజనులోమార్పులూ చేశారుసాంకేతిక పరిజ్ఞానమూ పెరిగింది,అంతకు ముందు వచ్చిన మార్పులు చేర్పులకి సంబంధించిన సలహాలను స్వీకరించి యెన్నో మార్పులు చహెసి 2015 లోపు కేంద్ర జలసంఘం సాంకేతిక విషయాలని పరిశీలించి ఆమోదించిన తర్వాత ఇప్పటికీ 1951లో కే యల్ రావు గారు చెపిన డిజను లోపాల్ని ప్రస్తావించటం హేతువిరుధ్ధం కాదా?

      మీరు "If someone wants to understand Dr. Kalam's missile vision, I would recommend reading his work and/or speak to his defense colleagues, not his brother!" అన్నది మీకు కూడా వర్తిస్తుంది!మీరు వృత్తి రీత్యా విద్యార్హతల రీత్యా లాయరు అనుకుంటాను,అవునా?ప్రపోస్ చేసిన వారు,మార్పులు సూచించిన వారు,ఆ మార్పుల్ని ఇంప్లిమెంట్ చేసి డిజైన్లని మార్చిన వారు,వాటిని పరిశీలించి వ్యాలిడిటీని బట్టి అనుమతులు ఇచ్చిన వారూ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం లేని డాక్టర్లూ లాయర్లూ అని అనుకుంటున్నారా మీరు?

      విద్యార్హతల పరంగా గానీ వృత్తి పరంగా గానీ దాన్ని సమర్ధించిన అధీకృతమయిన వారి మాట ప్రమాణమా,కేవలం ఆసక్తి కొద్దీనో ఆంధ్రావాళ్ళు మా నీటి వనరులన్నిట్నీ దోచుకున్నారు అనే వాదనకి సపోర్టు తెచ్చుకోవాలనో మీ వాదనకి సపోర్టుగా పనికొచ్చే మ్యాటరు మాత్రమే(మిమ్మల్ని బ్లేం చెయ్యటం కాదు, ఇటువంటివారు కూడా ఉండొచ్చు కదా అని నా అభిప్రాయం,అంతే!) సేకరించే వారి మాట ప్రమాణమా?

      పోలవరం గురించి అంత రీసెర్చ్ చేసిన నాకు మొదట ప్రపోస్ చేసిన అయ్యరు గారు ఇంజనీరు అని తెలియకుండా ఉంటుందనుకున్నారా తప్పు నేదో యెత్తి చూపిస్తున్నట్టు ప్రత్యేకంగా ప్రస్తావితున్నారు!

      ఇక్కడే అనామక వ్యాఖ్యాతలు మీరు లాయరని చెప్పారు,మీరూ ఖండించలేదు,పైగా ఒక పోష్టులో మరొకరితో కోర్టు తీర్పుల ఉదాహరణలతో వాదించటం చూశాను - కాబట్టి మీరు లాయరే అయి ఉండాలి.

      ప్రస్తుతం మరొక ముఖ్యమైన పోష్టు రచహనలో మునిగి ఉన్నాను,అదయ్యాక మళ్ళీ అక్కడ పోలవరం గురించి విస్తారంగా మాట్లాడుకుందాం.కానీ మీరు గనక ఇంజనీఎరు కాకుండా లాయరు అయినట్లయితే మనిద్దరిలో యెవ్వరికీ గట్టిగా సొంత అభిప్రాయాల్ని నొక్క్కి వక్కాణించే అర్హత లేదు.కేవలం ఆ ఫీల్డుకు సంబంధించిన వారు యెక్కదయినా యేదన్నా చెప్తే వాటిని మాత్రమే సాక్ష్యాధారాలుగా తీసుకోవాలి,ఒకవేళ మీరు గనక్ ఐంజనీరు అయి ఉంటే నాకసలు దాని గురించి యేమీ తెలియదు.అప్పుడిక నేను చేతులెత్త్తెయ్యడం మినహా చెయ్యగలిగింది లేదు,

      అప్పుడు చెప్పకుండా వదిలేసిన సమాచహార మంతా చెప్తూ కొత్త పోష్టు వెయ్యాలి మీ కోసమైనా!

      Delete
    3. హరిబాబు గారూ, పోలవరం గురించి మీరు మళ్ళీ టపా వేస్తానన్నారు కనుక ప్రస్తుతానికి కొన్ని clarifications మాత్రమె ఇస్తాను.

      1951 జూలై అంతర్-రాష్ట్ర మీటింగ్ మినుట్స్ & సీడబ్యూసీ నివేదిక గోదావరీ జలవివాద ట్రిబ్యూనల్ నివేదికలో ఉన్నాయి. మీకు దొరక్కపోతే చెప్పండి, నేను ఈమెయిలు చేస్తాను.

      సీడబ్యూసీ వారు తమ అభిప్రాయాలను & అంచనాలను మాత్రమె చెప్పగలరు. ప్రాజెక్ట్ కట్టాలా లేదా అన్న నిర్ణయం చేయ(లే)రు.

      1953 ఖోస్లా సాంకేతిక కమిటీ నివేదిక నేను చదవలేదు. వారికి కూడా నిర్ణయాధికారం ఉండదు.

      ఖోస్లా కమిటీ సూచించిన మార్పులు ఏమిటో నాకు తెలీదు. అవి ఇటీవల హనుమంతరావు గారి సూచనలకు దగ్గరగా ఉంటే వాటిని ఆంద్ర తిరస్కరించిన విషయం విదితమే.

      ఇంకో వ్యాఖ్యలో మీరు లేవనెత్తిన మరో విషయంపై జవాబు ఇస్తాను.

      Delete
    4. @jai
      1951 జూలై అంతర్-రాష్ట్ర మీటింగ్ మినుట్స్ & సీడబ్యూసీ నివేదిక గోదావరీ జలవివాద ట్రిబ్యూనల్ నివేదికలో ఉన్నాయి. మీకు దొరక్కపోతే చెప్పండి, నేను ఈమెయిలు చేస్తాను.

      ans:Yes,I want that.Please send me!

      Delete
    5. ఒక విషయంపై ప్రావీణ్యం పొందేందుకు విద్య & పని అనుభవం ఖచ్చితంగా సాయం చేస్తాయి. అయితే జ్ఞానార్జనకు ఇవి మాత్రమె మార్గాలు కావు. సొంతంగా చిత్తశుద్ది & శాస్త్రీయ దృక్పధంతో అధ్యయనం చేసి కూడా విషయం లోతుకు వెళ్ళవచ్చు.

      నేను బీటెక్ (ఎలక్ట్రానిక్స్) & ఎంబీయే చదివాను, మార్కెటింగ్, పర్చేస్ & క్వాలిటీ రంగాలలో పని చేసాను. నేను లాయర్ని కానని మీ బ్లాగులో చెప్పినట్టే గుర్తు.

      నీటి పారుదల అంశాలను అర్ధం చేసుకోవాలంటే నాలుగు రంగాలు అతిముఖ్యం: 1. నీటి శాస్త్రం 2. నీటి న్యాయసూత్రాలు & చట్టాలు, 3. ఇరిగేషన్ 4. వ్యవసాయం & అనుబంధ విషయాలు. వీటిలో ఒక్కటి కూడా నేను కాలేజీలో చదవలేదు సరికదా ఉద్యోగరీత్యా నేర్చుకోలేదు.

      తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో నీటి వివాదాల దిబేటుకు ముందు నేను దూరంగా ఉండే వాడిని. చర్చల తీవ్రత చూడగా చూడగా దీన్ని అధ్యయనం చేయాలని అనిపించింది. ఏడాదిన్నర పాటు చేసిన సుదీర్ఘ అభ్యాసంలో వేలాది ఘంటలు వెచ్చించి వందలాది డాక్యుమెంట్లలో వేలాది పేజీలు చదివాను. అన్ని ముఖ్యమయిన అంశాలను లోతులోకి వెళ్లి విశ్లేషించాను.

      ఈ అధ్యయనంలో నాకు నేను విదించుకున్న నియమాలలో ముఖ్యమనవి కొన్ని:

      1. దేన్నీ గుడ్డిగా నమ్మొద్దు, కుదిరినంత మేరకు వేరే ఆధారాలతో వాలిడేట్ చేయాలి
      2. తెలంగాణా వాదుల వాదనను పరిగణనలో తీసుకొవొద్దు సరికదా చదవనూ లేదు. (ఆతరువాత చదివాను కానీ వాటిని ఎప్పుడూ విషయనిర్దారణలో వాడను)
      3. అనుమానం వచ్చిన ప్రతిసారీ benefit of doubt ఆంధ్రకే ఇవాలి.

      Delete
    6. హరిబాబు గారూ, GWDT డాక్యుమెంట్ ఈమెయిలులో పంపానండీ.

      Delete
  7. రాముల వారు ఇంకా అర్ధ సెంచురీ కూడా కా మంట ల లో దాట లేదేమిటి చెప్మా :)

    జిలేబి

    ReplyDelete
  8. కామెంట్లు 50 దాటాయిగా. సంతోషమా జిలేబీ గారూ?

    ReplyDelete
  9. ఆ పాత మధురాలని అప్పుడప్పుడూ నెమరువేసుకునే 2008 నాటి బ్లాగరు18 August 2015 at 08:43

    ప్రవీణ్ బాగున్నావా?

    ఏం ఓపిక గురూ నీది. ఇంచుమించు 2006 నుండి తెలుగుబ్లాగుల్లో ఉన్నావు పదేళ్ళు. నీతో పెట్టుకున్న ఓ మలకు, ఓ ఆర్కే, ఓ కార్తీక్, ఓ ఒంటేలు, ఓ తార, ఒ మంచు ఓ సౌమ్య- నువ్వు అర్ధవంతంగా రాస్తే చదివి చచ్చిపోతానన్న సుజాత, అందరూ మాయమైపోయారు. నువ్వు మాత్రం అలానే ఉన్నావు, అవే భావాలు, అవే సిద్ధాంతాలు.
    నిన్ను అసలు ఏమి మోటివేట్ చేస్తుంది గురూ, ఇంతకాలంపాటు బ్లాగుల్లో ఏమాత్రం అప్రతిహతంగా లేకుండా (నిన్ను టార్గెట్ చేసినట్టుగా బ్లాగుల్లో ఇంకెవ్వరినీ ఎప్పుడూ టార్గెట్ చేయలేదు ఎప్పుడూ, వందమంది కలిసి ఎదురొచ్చిన్నా 1500 కామెంట్లతో చిత్రవధ చేసినా అలాగే తొణకని కుండలా ఎలా నిలబడ్డావు?

    బ్లాగర్లు అందరూ నీకు సన్మానం చేయాలి, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. శబాష్ ప్రవీణ్ శబాష్.

    ReplyDelete
    Replies
    1. బ్లాగర్లు అందరూ నీకు సన్మానం చేయాలి, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. శబాష్ ప్రవీణ్ శబాష్. :)

      Delete
    2. పెళ్ళి కాకపోతే అంతే

      Delete
    3. పెళ్ళి కాకపోతే అంతే
      :-)
      పిన్నిని చేసుకోవాలనుకుంటే అంతే

      Delete
    4. పెళ్ళాన్ని అడువులకు పంపినా అంతే

      Delete
  10. ఆ పాత మధురాలని అప్పుడప్పుడూ నెమరువేసుకునే 2008 నాటి బ్లాగరు18 August 2015 at 08:52

    గుడ్ ఓల్డ్ డేస్ కదా ..

    మైకేల్ వదిన కామరాజు వీడియోలు
    నీహారిక కీ ఒంటేలు కీ మధ్య ప్రాక్సీ యుద్ధాలు
    ప్రమాద ప్రమోద ప్రమదా వనాల్లో పేరడీ రాతలు
    రామదండు అనీ, రామాయణ విష వృక్షం అనీ, హిందూ మత సర్వస్వం అనీ, కే బ్లాస అనీ, ప్రపీసస అనీ రకరకాల బ్లాగుల్లో ధర్మయుద్ధాలు
    శరత్తన్న చతుర్లు, కెలికీ కెలకనట్టు అంటీ ముట్టనట్టు - తొడపాశం పెట్టి, జండూబాం రాసేవాడూ
    బాతిశతకాలు, భరారే విసుర్లు
    అప్పి బొప్పి గొడవలు, నారద ముని రాతలు, నాగ ప్రసాద్ శాస్త్ర విఙ్ఞానం, వీకెండ్ కామెంట్లు, పిల్లకాకి సందడి

    ఎక్కడున్నారర్రా అందరూ .. మళ్ళీ తిరిగి వచ్చేయండి ఎన్ని అభిప్రాయ భేధాలున్నా మనందరం ఒక కుటుంబం మళ్ళీ కలిసి సందడి చేద్దాం .. వచ్చేయండర్రా

    ReplyDelete
    Replies
    1. ఎక్కడున్నారర్రా అందరూ .. మళ్ళీ తిరిగి వచ్చేయండి ఎన్ని అభిప్రాయ భేధాలున్నా మనందరం ఒక కుటుంబం మళ్ళీ కలిసి సందడి చేద్దాం .. వచ్చేయండర్రా...
      కలిసి తన్నుకు చద్దాం...రండి రండి రండి..దయచేయండి..

      Delete
  11. @aapaatamadhuraalu......
    నువ్వు మాత్రం అలానే ఉన్నావు, అవే భావాలు, అవే సిద్ధాంతాలు.
    ?
    తెడ్డుని చూడండి!వూరగాయలో పెట్టి కలియదిప్పితే బయటికె తీసి కడిగే లోపు వూరగాయ వసనేస్తుంది!నాకితే వూరగాయ రుచి కూడా తెలుస్తుంది,అవునా?అదే తెడ్డుని పాయసంలో ముంచి తీస్తే?పాయసం వాస్నా పాయసం రుచీ కలిసి తితియ్యగా అనిపిస్తుంది,అవునా?

    ప్రవీణు కూడా అనతే!తెడ్డుశ్రీ?!

    ReplyDelete
  12. తెగించిన వాడికి తెడ్డేలింగం

    ReplyDelete
  13. హరిబాబు,

    మీరు పిచ్చి దానిని మా మీద వదలిపెడితే ఎలా? మీరు ఇతర బ్లాగర్లు పడే ఇబ్బందిని గమనించరా? మీదయ వలన ఆమే ఎర్రి కామెంట్లు మాలిక నిండా నిండిపోతున్నాయి.ఈ పిచ్చి దాని బ్లాగును ఎవ్వరు సందర్శించరు. తెల్లారకట్ల నుంచి మీబ్లాగులో మొరుగుతూంట్టుంది.

    కొళ్లాయి నీళ్ల దగ్గర కోట్లాటలు చేసేవాళ్ళని మీరు బ్లాగు యంకరేజ్ చేస్తే, మీ బ్లాగు విలువ అథ:పాతాళానికి పడిపోతుంది.

    ReplyDelete
    Replies
    1. నేను వదలటమేమిటండి బాబు!కామెంట్ల విషయంలో నా పధ్ధతి చెప్పాను గదా,మరీ అసభ్యంగా ఉండనంతవరకూ యెవరి కామెంత్లనీ డెల్ట్ చెయ్యను.యెవరి అభిప్రాయం వారు చెప్పుకోవాలి.నచ్చకపోతే యెందుకు నచ్చలేదో సోదాహరణంగా చెప్పి ఒప్పించాలి.నేను అలాగే జవాబు చెప్తున్నాను కదా!ఆమెతో వాదించటం మీకు కష్తం కావచ్చు కానీ నాకు కాదు!యెట్లా జవాబు చెప్పాలో నాకు తెలుసు కాబట్టి చెప్పగలుగుతున్నాను.

      మాలికలో కామెంట్ల సెక్షను ఉన్నదే అందుకు కదా!దాని గురించి వర్రీ దేనికి?జవాబు చెప్పగలిగిన పాయింటు మీఎ దగ్గిర ఉందా,చెప్పండి!శ్తిమించితే నేను కలగజేసుకోక తప్పదు అనిపిస్తే తప్పకుండా కంట్రోల్ చేస్తాను,సరేనా!

      Delete
    2. @anonymous,

      ఇక మీదట ఒళ్ళు దగ్గరపెట్టుకుని మరీ కమెంట్స్ వ్రాయండి/పబ్లిష్ చేయండి. స్మితా సబర్వాల్ లా వంద కోట్లకి పరువు నష్టం దావా వేస్తాను. అజ్ఞాతలను ఏమీ చేయలేము కాబట్టి బ్లాగర్ల మీద దావా వేస్తాను. రాముడిని తిడుతున్నందుకు మీరు కూడా దావా వేయవచ్చు. ఊరికే ఆయసపడిపోకుండా పని చూడండి.

      Delete
  14. కేసుదేముంది లేండి తేలే టప్పటికి 30 ఏళ్లు పట్టొచ్చు, ముందు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
    మీ ఓళ్ళు డాక్టర్ దగ్గరికెళ్ళి పరిక్ష చేయించుకోండి. ఇతరుల బ్లాగులో కెళ్ళి మానసిక సమతుల్యత లేని వ్యాఖ్యలు రాయటం మానుకోవటానికి, ఏదైనా మందు ఉంటే డాక్టర్ ని ఇమ్మనిచెప్పండి.

    ReplyDelete
    Replies
    1. ఊరు పేరు చెప్పుకోలేని పిరికితనం కన్నా మానసిక దౌర్భల్యమే మేలు ! ప్రవీణ్ కి మీలా మానసిక దౌర్భల్యం లేదు. ఆడవాళ్ళని ఎన్నడూ అవమానించలేదు. బ్లాగర్లందరికన్నా ప్రవీణ్ గొప్పవాడు. సిద్ధాంతం తప్పు కావచ్చు కానీ వ్యక్తిగత నింద చేయడు. తనని అవమానిస్తే చూస్తూ కూర్చునే రకమూ కాదూ. దేనికనా టైం రావాలి కదా ? ఎవరికి ఎవరు సన్మానం చేస్తారో, ఎవరు ఎవరికి మందు వేస్తారో అదీ చూద్దాం ! 30 సంవత్సరాలు కాదు ఇప్పటికే మూడు యుగాలు దాటిపోయాయి తప్పించుకుని ఎక్కడికి పోతారు ?



      Delete
    2. * * * బ్లాగర్లందరికన్నా ప్రవీణ్ గొప్పవాడు. * * *
      అందానికి నేనూ .... పాటకు .... అన్నట్లు.
      అంతే అంతే.

      Delete
    3. 1. పరువు ఉన్నవాళ్లు పరువు నష్టం దావా గురించి ఆలోచిస్తారు. మీరెందుకు పరువు నష్టం దావా గురించి ఆలోచిస్తున్నారో అర్థం కావటంలేదు.

      2. ప్రవీణ్ గొప్పవాడైతె అభ్యంతరమేమి లేదు. మీరక్కడే వ్యాఖ్యలు రాసుకోండి.

      3.మీరు రాసే చెత్త చూసి చిరాకేసి వ్యాఖ్యలు రాసేమే తప్ప, మీరు మగనా,ఆడనా,మాడానా అని చూసి మిమ్మల్ని విమర్శించలేదు.

      దయచేసి మీరు మీ బ్లాగులో రాసుకోండి. అటువైపుకొస్తే ఒట్టు.

      Delete
    4. మీరు చెప్పింది నిజమే ! ఎర్రోడి పెళ్ళాం.....సామెతలాగా రాముడి పెళ్ళానికి పరువేమిటండీ ? ఎవరిష్టం వచ్చినట్లు వాడ్రు వా(బ్లా)గవచ్చు. నేను మాట మీద నిలబడే రకాన్ని కాదండీ ....ఒట్టు మీద అసలు నమ్మకం లేదు. ఒట్టేసి మరీ చెపుతున్నా ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్రాస్తే ఊరుకునేది లేదు,నా కంటబడనంతవరకే మీరు సేఫ్....నా కంఫర్ట్ చెడగొడితే దిబిడి దిబిడే ! అమావాస్య తరువాత వచ్చేది పౌర్ణమే కదా ?

      Delete
    5. అధర్ములు ధర్మాత్ములని, అవినీతి పరులు నిజాయితిగా ఉండేవారిని ఎలా చూసి ఓర్వలేరో, లేశ మాత్రం సిగ్గు ఎగ్గులేని మీవంటి వారు సీతా సాధ్విని చూసి ఈర్ష పడటంలో ఆశ్చర్యం లేదు.

      Delete
    6. తనని అవమానించి అడవికి పంపేవాడికన్నా తనకోసం ప్రాణమిచ్చే రావణుడున్న సాధ్వీ సీతని చూసి ఈర్ష్యపడని ఆడజన్మ మీకెక్కడైనా కనిపించిందా ?

      Delete
  15. ప్రవీణ్, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నవేంటి ??
    అక్కడ సారంగ లో దుమ్ము లేచిపోతుంటే .. నిజం చెప్పాలంటే నీలాంటి వాళ్లకి సారంగ చాలా మంచి ప్లాట్ఫాం .

    ReplyDelete
    Replies
    1. అన్నా మంచిపన్జేసినవ్!ప్రవీణ్ ఆడికేబోయిండు!జూసినవ్

      Delete
  16. వీళ్ళలో ఎన్ని చీలకలన్నా! ఒకడికి మరొకడికి పడి చావదు, అక్కడీయన పనికిరాడు :)

    ReplyDelete
    Replies
    1. ఆ గొడవేదో అర్థం కాక నేను తలగోక్కుంటానని మీరు అనుకున్నారు. అందులో అర్థం కానిది ఏమీ లేదు. పురాణాలు ఊహాజనితం అని తెలిసి కూడా మనం అవి చదువుతాం. విరసం నాయకులు మార్క్సిజమ్‌ని కూడా పురాణాన్ని అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకుని దాన్ని పురాణంతో సమానం చేసారు. అందుకే రంగనాయకమ్మ గారు విరసం నాయకుల్ని విమర్శించారు. ఈ విషయం అర్థం కానిది భాష రానివాళ్ళకేమో?

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...