Thursday, 4 June 2015

ఇక్కడ కూర్చుని యెక్కడ వున్న యెవరితోనైనా చదరంగం ఆడుకోవచ్చు - వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ!

చదరంగం ఆట గురించి ఇవ్వాళ కొత్తగా నేను చెప్పటానికి యేముంది?కాకపోతే నేను కొత్తగా ఒక ఒక చదరంగపు బల్లని తయారు చేశాను - దాని గురించి చెప్తాను!నా చదువంతా చాలా నిర్లక్ష్యంగా బధ్ధకంతో గడిపేశాను.తెలివి అమోఘమే - యే మాత్రమూ ప్రిపరేషను లేకుండా అప్పటికప్పుడు లేచి నిలబడి సెమినార్ చెప్తే,అంటే ఎక్స్టెంపోర్ అన్నమాట, లెక్చరరుగారు  ముచ్చట పడి చప్పట్లు కొట్టించేశారు!కానీ ఆ తెలివి మంచిమార్కులు తెచ్చుకోవడం,వాటితో ఒక ఉద్యోగం తెచ్చుకోవడం అనే విధంగా పనిచెయ్యకపోవడంతో సుదీర్ఘకాలం పాటు కాలిబంతి బతుకు బతికి ఆఖరికి ఇప్పుడిట్లా ఉన్నాను!

నేను మంచి ప్రోగ్రామర్ని మరియూ చెత్త డిజైనర్ని!నిజానికి కంప్యూటరు ప్రపంచంలో యేదయినా  క్రియేటివిటీకి సంబంధించిన  పని చెయ్యాలంటే ఈ రెండూ 50%/50% అవసరమేనని తెలిసినా యే ఒక్కడిలోనూ అవి అట్లా ఉండటం లేదు.కొందరు డిజైనర్లుగా కొందరు ప్రోగ్రామర్లుగా చీలిపోతున్నారు.నేను ఫ్లాష్ నేర్చుకునేటప్పటికి అది అడోబ్ వాళ్ళకి దఖలు పడలేదు.ఒక సంవత్సరం పాటు నడిచే సర్టిఫికెట్ కోర్సులో భాగంగా ఫ్లాష్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజి దగ్గిర కొచ్చేసరికి  ఇదే నాకు తగిన సబ్జెక్ట్ అనిపించి అందులో ఎక్స్పర్ట్ అయ్యాను.యెప్పట్లాగే నా మనస్తత్వంలోని ఒకే ఒక్క బలహీనత - ఒకేదాని మీద మనసు పారేసుకుని అది తప్ప ఇంకేదీ ముఖ్యం కాదనుకోవటం - వల్ల అట్లా చేశాను గానీ ఆ కోర్సులో మాయా అనే 3డి అప్లికేషను కూడా వుంది గాబట్టి పూర్తి చేసి ఉంటే బాగుండేదని ఇప్పుడేడుస్తున్నాను!

ప్రోగ్రామరు ఒక ప్రాజెక్టు విషయంలో ఒక పార్టు ఒక గంటలో పూర్తి చేశాడనుకోండి అతను చివరి పావు గంటలోనే కోడ్ రాయటం మొదలు పెడతాడు - మొదటి ముప్పావు గంటా ఆలోచన సాగుతుంది!చూసేవాళ్ళకి ఈ పావుగం పనికి ఇతను గంట తీసుకున్నాడా అనిపిస్తుంది, అదే డిజైనరు తప్పు చేసినా ఒప్పు చేసినా యేదో ఒకటి కెలుకుతూ ఉంటాడు గాబట్టి ప్రతి నిముషమూ కష్టపడ్తున్నాడు అనిపిస్తుంది - ఆరకంగా మా ప్రోగ్రామర్లకి చాలా అన్యాయం జరుగుతున్నది!

ప్రోగ్రామింగ్ నాలెడ్జిలో నా గురించి నేను యేదయినా చెప్పుకుంటే గొప్పలు చెప్పుకున్నట్టు ఉంటుంది.నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అప్పటి యం.డి నాకు టెంప్లేట్ డెవలప్మెంట్ పని అప్పజెప్పారు.దాని స్కోప్ యేంటంటే మా కంపెనీ ఈ-యెడ్ ప్రాజెక్టుల నన్నిట్నీ ఒకే చో చూపించటం,అదీ మా కంపెనీ లోని మిగతా ప్రోగ్రామర్లకి పని తగ్గిస్తూ!ఉదాహరణకి ఒకచోట ఒక ప్రశ్న ఇచ్చి దానికి జవాబుల్లో యేదో ఒకటి యెన్నుకోవటం అనే కోడ్ ఉన్న ఫ్లాష్ ఫైల్ ఉంటే దాన్ని ఒక పేరెంట్ ఫైల్ నుంచి మనకి కావలసిన వివరాలు ప్రశ్న,జవాబులు,కరెక్ట్ జవాబు లాంటివి ఆర్గ్యుమెంట్లుగా పంపిస్తూ ఓపెన్ చేసేలాగ మారిస్తే ఆ ఫైల్ మీద ప్రతిసారి వర్క్ చెయ్యనక్కరలేదుగా!ఆ విధంగా ఒక ఫైలు యెట్లా పనిచెయ్యాలో రూల్సుతో సహా మనం తయారు చేసే మాస్టర్ ప్రోగ్రాముని టెంప్లేట్ అంటారు.నేను ఆ పని పూర్తి చేశాక యెందుకయినా మంచిదని వేరే బ్రాంచిలో టెంప్లేట్ కన్స్ట్రక్షన్లో అనుభవం ఉన్నవాళ్ళని పిలిచి నేను చేసిన దాంట్లో యేదయినా కొరత ఉంటే చూసి చెప్పమన్నారు - వాళ్ళు చూసి నా దగ్గిర కొచ్చి అన్న ఒకే ఒక్క మాట "అమేజింగ్!" అని.నేను ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు టెంప్లేట్ కన్స్స్ట్రక్షన్ అంటే యేమిటో తెలియదు ప్రాజెక్ట్ ఇట్లా ఉండాలి అనే స్పెసిఫికేషన్స్ తప్ప - అయినా మొదటిసారి తీసుకున్న కొత్త అసైన్మెంటులోనే అందులో అనుభవం ఉన్నవాళ్ళకి మించి చెయ్యగలిగాను!

అయినా సరే,అసలు ఫీల్డు లోకి ఆలశ్యంగా రావటం, నన్ను నేను చక్కగా ప్రొజెక్ట్ చేస్కుంటూ చురుగ్గా కదిలి పేరూ డబ్బూ వచ్చే చోటికి చేరుకోలేకపోవటం లాంటివాటితో గొర్రెలా తోకాడిస్తూనే ఉండిపోయాను తప్ప సింహంలా గర్జించే అవకాశం రాలేదు.అయితే 2001 నుంచీ ఒక ప్రాజెక్ట్ నా మనసులో రింగులు తిరుగుతూ - ఇది గనక సక్సెస్ అయితే నాకు నా ప్రతిభకి తగిన గుర్తింపు వస్తుందనే ఆశని రగిలిస్తూ ఉండేది!అది చదరంగం చుట్టూ తిరుగుతుంది.మొదట "HTML,JS,ASP" ఉపయోగించి వెబ్ సైటుగా తయారు చేసి  2003లో హోస్ట్ చేశాను, కానీ ఫెయిలయింది!యెందుకు ఫెయిలయిందంటే మొదటిసారి కావటంతో జావాస్క్రిప్ట్ కోడింగ్ బాగా యెక్కువగా సాగింది, ఒక ఫ్రెండ్ వాడి చూసి సైట్ హ్యాంగ్ అవుతుంది అన్నాడు!అట్లా 2003లో చదరంగం అనే ఆటతో జనాన్ని కలపాలనుకున్న నేను ఫెయిలయ్యాను,కొద్దికాలంలోనే గాడిదల్నీ అమ్మాయిల్నీ చూపించి వెర్రెక్కించిన మార్క్ జుకెర్బర్గ్ రంగప్రవేశం చేసి ముఖపుస్తకంతో జనం ఒకరితో ఒకరు భావాల్ని పంచుకోవటం అనే నేను చెయ్యలేకపోయిన దాన్ని తను చేసి చూపించాడు - యేం చేస్తాం మన గాచ్చారం అట్టా గాండుమారింది మరి!

యెప్పుడయితే ఫ్లాష్ నేర్చుకున్నానో,అందులోనూ "OOPS" ఆధారితంగా ఉండి జావా లాంగ్వేజిని బోలిన "AS3" నాకు చాలా ఈజీగా పట్టుబడటంతో మళ్ళీ పాత కోరిక సెలవేసింది!ఇప్పుడు కోడ్ బాగా తగ్గింది,ఫ్లాష్ గదా అని క్రేజీ యానిమేషన్లకి పోకుండా మినిమం కంటెంట్ ఉండేలాగ చూసుకున్నా.ఈసారి సర్వర్ లాంగ్వేజి PHPకి మారింది.డాటా హాండ్లింగ్ విషయంలో XML పరిజ్ఞానం కూడా ఉపయోగపడింది.కానీ పూర్తి కావడానికి సమయం మాత్రం సంవత్సరాలు తీసుకుంది!!యెందుకంటే ఉద్యోగం అయ్యాక అందరూ పడుకున్నాక మొదలు పెట్టి మళ్ళీ నేను పొద్దున్నే ఆఫీసుకి పోవాలి గాబట్టి యెక్కువసేపు చెయ్యకుండా రోజుకి కొంచెమే చేస్తూ వచ్చి మొత్తానికి మళ్ళీ పని చేసే స్థితికి తీసుకొచ్చాను.అంతా పూర్తయ్యాక పనితీరు బాగానే ఉన్నా నేను చెత్త డిజైనర్ని కావడంతో సైటు మాత్రం చాలా ఘోరంగా కనబడుతున్నది!దానితో ఇప్పటి వరకూ సాగి ఇప్పటికి ఒక మంచి డిజైనరు దొరికి ఒక మంచి లేయౌట్ కుదరటంతో ధైర్యంగా మీముందుకి తీసుకు రాగలిగాను.

ఇప్పుడిక మిగిలిన వాటికన్నా ఇందులో ప్రత్యేకంగా నేను యేమి చేశానో చెప్పి నా సైటుని యెట్లా ఊయోగించుకోవాలో చెప్తాను.సైటులో హెల్ప్ మెను ఉంది గానీ మీరిప్పుడు ఇక్కడ వున్నారు గాబట్టి వివరంగా చెప్తాను.ఇక్కడ నేను చదరంగానికి సంబంధించిన మిగతా విషయాలను యేమీ చూపించటం లేదు.చదరంగం ఆడటానికి ఉత్సాహం ఉండి ఆటలో కొంతమేరకు ప్రవెశం ఉన్నవాళ్ళకి మాత్రమే ఈ సైటు పనికొస్తుంది.ఇప్పుడు అంతర్జాలంలో ఉన్న చదరంగానికి సంబంధించిన సైట్లలో ఆప్షన్లు తక్కువగా ఉన్నాయి - మీరు ఒక ఆటగాడిగా పేరు ఇచ్చి అవతలి వైపు మరో ఆటగాడు ఉన్నా లేక అనామక ఆల్గోరిదం పనిచేస్తూ ఉన్నా అది కొంతసేపు మాత్రమే ఉంటుంది.అప్పటికి సేవ్ చేసి మళ్ళీ కొంతకాలం అయ్యాక వచ్చి కంటిన్యూ చేసే పరిస్థితి లేదు!ఆటలో కూడా అతి ముఖ్యమైన డ్రా ఆప్షన్ నేనెక్కడా చూడలేదు!చెక్మేట్ చెప్పటం ఆటగాడు తన నిర్ణయాత్మకంగా వెయ్యాల్సిన యెత్తు - టోర్నమెంట్సులో గూడా యెత్తుకు ముందు చెక్మేట్ డిక్లేర్ చెయ్యకపోతే కంట్రోలర్ ఒప్పుకోడు,అవునా?అట్లాగే ఎన్-పాసంట్,ప్రమోషన్,క్యాజిలింగ్ లాంటి అతి ముఖ్యమైన యెత్తుల్ని వేసే వీలు నాకు దాదాపు కనబలేదు.మొదటిసారి "HTML" లో చేస్తున్నప్పటికీ ఇప్పటికీ మార్పు లేదు,అందుకే నేను నమ్మకంగా ఉన్నాను యెవరయినా సరే ఒకసారి లోపలికి వెళ్ళి ఒక ఆ పూర్తి చెయ్యగలిగితే తప్పకుండా ఒక అధ్భుతాన్ని చూస్తున్నట్టు ఫీలవుతారు - అని!
దశలవారీగా మొదటి నుంచి చివరి వరకూ ఒక్కొక చోట మీరు యేమి చెయ్యాలో చెప్తే అంతా పూర్తయ్యేసరికి మీకు సైటులో ఉన్నదేమిటో తెలుస్తుంది,కదా!సైటుకి వెళ్ళగానే మొదట,"PLAY NOW" నొక్కండి!అది మీకు నేను తయారు చేసిన ఫ్లాష్ ఆబ్జెక్టుని చూపిస్తుంది.ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు గాబట్టి మొదట "New to site?click me to rigister" నొక్కితే రిజిస్టరు అవటానికి ఒక ఫాం కనబడుతుంది.
ఇక్కడ నేను మీ దగ్గిర్నుంచి యెక్కువ వివరాలు తీసుకోవటం లేదు.పేరు లోని రెండు భాగాలు,ఈమెయిల్ ఐడి,లాగిన్ నేం,పాస్ వర్డ్ - అంతే!పాస్ వర్డ్ మీరు వూహించుకోవటానికి బధ్ధకం వేస్తే "generate password" నొక్కితే చిన్న ప్యానెల్ ఓపెన్ అవుతుంది అక్కడే!దానిలో కనబడే  ప్యార్న్ మీరు తేలిగ్గా గుర్తుంచుకునేటంతగా మీకు నచ్చేవరకూ "NEXT WORD" నొక్కవచ్చు.అలా నచ్చగానే "GO" నొక్కితే ఆ ప్యానెల్ పోయి పాస్ వర్డ్ సెట్ అవుతుంది.ఈ ప్యానెల్ నుంచి దాన్ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకోవచ్చును.ఒక నోట్ ప్యాడ్ ఫైలులోకి పేస్ట్ గూడా చేసుకోవచ్చు.యెలా చేసినా ఒక నాలుగైదు సార్లు మనసులో చదువుకుంటే చాలు మర్చిపోకుండా వుండగలుగుతారు! ఆ ప్యార్న్ పుట్టించటంలో ర్యాండం లాజిక్ వాడాను గాబట్టి మిలియన్ల ట్రిలియన్ల సార్లు వాడినా డూప్లికేట్ కాంబినేషన్ రాదు!ఇప్పుడెవరూ ప్రత్యేకంగా లాగిన్ ఐడి అడగటం లేదు,ఈమెయిల్ ఐడి యెట్లాగూ ఉంటుంది గదా అని ఫేస్ బుక్ లాగ!ముందు ముందు నేనూ మారుస్తాను.పాస్ వర్డ్ కూడా రెండుసార్లు మీరు టైప్ చెయ్యటం లేదా ప్యానెల్ ఓపెన్ చెయ్యడం బదులుగా ఒకేసారి ర్యాండం ప్యాటర్న్ ట్రిక్కునే వాడితే పోతుందనిపిస్తున్నది - ప్రజల ప్రోత్సాహాన్ని బట్టి ఇలాంటివన్నీ మరుసటి వెర్షన్లో చేస్తాను!ఒకసారి రిజిస్టర్ అయ్యారంటే ఇక తిన్నగా లాగిన్ అవమే గదా!
పాస్ వర్డ్ మర్చిపోతే నేను మిగతా సైట్ల మాదిరి దశల వారీ కార్యక్రమం యేమీ ఇవ్వట్లేదు.ఇవ్వాళ మెయిల్ సర్వర్లు బాగానే పని చేస్తున్నాయి గాబట్టి "Forgot Password?get help here" నొక్కగానే ఒక డయలాగ్ విండోఓపెన్ అయ్యి మీరు అక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చి "submit" నొక్కగానే నేను తయారు చేసిన ర్యాండం పాస్వర్డ్ జనరేటర్ టెక్నిక్ ఫాలో అయ్యి మీ మెయిల్ అకవుంటుకి మెయిల్ వచ్చేలాగ చేస్తున్నాను. పురజనుల కోరిక పాత పధ్ధతినే కోరుకుంటే తర్వాత అప్డేట్ చేసేటప్పుడు చేస్తాను - నిజాయితీగా చెప్పాలంటే దీన్ని ఉపయోగించుకుని తరచుగా పాస్వర్డ్ మార్చుకోవటం కూడా సమర్ధవంతమైన యాంటీ హ్యాకింగ్ సొల్యూషనే!ఈ మధ్యనే కొన్ని సైట్లలో ప్రతి సారీ లాగిన్ అయ్యేతప్పుడు కొత్త పాస్వర్డ్ వాళ్ళే జనరేట్ చేసి మీ మెయిల్ ఐడికి మెయిల్ చెయ్యటమో మీ ఫోనుకి మెసేజి ఇవ్వటమో చేసి దానితోనే చెక్ చేస్తున్నారు!ఇక్కడ మీ అంతట మీరే ఆ పని చెయ్యవచ్చు.లాగిన్ అయినందుకు గుర్తుగా చిన్న యానిమేస్గన్ నడుస్తుంది - లాగిన్ బాక్స్ పోయి మెయిన్ మెను బటన్సు కనబడతాయి!మూడో బటన్ "Public" గురించి ఇప్పుడప్పుడే పట్టించుకోకండి దాని సంగతి తర్వాత చెప్తాను.రెండో బటన్ "Account" నొక్కితే మీ ముఖ్యమైన వివరాలలో మార్చుకోదగినవి మార్చుకోవడం సాధ్యపడుతుంది.ఇక మొదటి  బటన్ "Games" నొక్కితే ఈ సైటుకల్లా అతి ముఖ్యమయిన భాగం మీ ముందు వుంటుంది!
ఇక్క ఇదివరకు మీరు ఆడిన ఆలు పైన లిస్టులో కనబడతాయి ముఖ్యమైన వివరాలతో!కొత్త ఆ ఆడటానికి అడుగున వున్న "New Game" నొక్కాలి.అది నొక్కగానే ఆట వివరాల్ని నమోదు చెయ్యటానికి అవసరమైన ఫాం తెరుచుకుంటుంది!
మిగతా సైట్లలో మీపేరు మాత్రం తీసుకుని సెకన్లలో మిమ్మల్ని బోర్డు ముందుకు తీసుకెళ్తుంటే నేను ఇన్ని వివరాలు యెందుకు సేకరిస్తున్నాను అని మీకు అనుమానం రావచ్చు - కానీ ఆడిన ప్రతి ఆనీ లిష్టులో చూసినప్పుడు గుర్తు పట్టాలంటే దానికి ఒక పేరు ఉంటే తేలిక కదా!ప్రస్తుతం నేను మీకు స్టాండర్డ్ గేం మాత్రమే చూపిస్తున్నాను,తర్వాత పజిల్ గేం కూడా ఆడే వీలు కల్పిస్తాను.అంటే ఒక ప్రముఖమైన ఆట నుంచి మధ్యలో మొదలు పెట్టి "యిన్ని యెత్తులలో ఇంత సమయంలో ఈ రంగు పావుల్ని గెలిపించగలవా?" అనే చాలెంజి కోసం బోర్డుని సెట్ చెయ్యాలంటే ఈ వివరాలు అవసరమే కదా!ప్రస్తుతానికి అవి వర్క్ చెయ్యకపోయినా ఉండటం వల్ల నష్టం లేదుగా!ఇప్పటికయితే ఆకి ఒక పేరుని రాయండి,మీరు తెల్ల పావులతో ఆడాలనుకుంటున్నారా నల్లపావులతో డాలనుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోండి, "Practice" లేదా "Expert" అనే రెండు రకాలలో యేదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి,"Show Chess Board" న్ నొక్కండి - అంతే!నల్ల్లపావులతో ఆడాలనుకుంటే ఆను క్రియేట్ చేసినది మీరే అయినా తెల్లపావులతో ఆడుతున్న అవతలి వ్యక్తికే మొదటి యెత్తు అవకాశం వస్తుంది తెలుసుగా?కొత్తగా వచ్చారు గాబట్టి మొద "Practice" రకం సెలెక్ట్ చేసుకోండి -  రెండు రకాల పావుల్నీ మీరే కదిలించగలరు గనక సమస్య ఉండదు!
ఇక్కడ మీ ఆటకి రంగస్థలం సిధ్ధమైంది!ఈ మధ్యనే ఫ్లాష్ వాళ్ళు 3డి పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు వాళ్ళ అప్లికేషన్ డెవలప్మెంటులో,నేను దాన్ని ఉపయోగించుకున్నాను - చూడటానికి ఫ్లాట్ బోర్డు కన్నా పెర్స్పెక్టివ్ బోర్డు అయితే మీకు రియలిస్టిక్ వాతావరణం కనబడుతుంది.ఆటకి సంబంధించిన అన్ని ముఖ్యమైన కంట్రోల్సు సెంటర్లో ఒకదాని కొకటి అతుక్కుని ఉంటాయి.అన్నిటి గురించి ఒక వరసలో చెప్తాను.

మొదటిది "Show Moves List" మీరు ఇప్పటివరకూ ఆడిన ఆటలోని అన్ని యెత్తులూ ప్రస్తుతం ఫాలో అవుతున్న గేం నొటేషన్ ప్రకారం కనబడతాయి.ఇది టాగుల్ బటన్ - అంటే తెలుసుగా మూసుకుని ఉన్నప్పుడు నొక్కితే తెరుచుకుంటుంది,తెరుచుకుని ఉన్నప్పుడు నొక్కితే మూసుకుంటుంది.ఇందులో గూడా ఒక ప్రత్యేకమైన సౌకర్యాన్ని ఇచ్చాను.మీరు ఒక నలభై యెత్తులు వేశాక పదిహేనో యెత్తులో నలుపు యెత్తుని మరో రకంగా వేస్తే అది మరో రకమైన దిశలో ఆటని నడిపిస్తుందేమో కదా అనిపిస్తే అలా ఆటలో వెనక్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది.దీనికోసం కొత్తగా ఆటని వర్ణించేటప్పుడు ఇప్పుడు "ALL MOVES" అని చూపిస్తున్న "You want backstep link for" అనే డ్రాప్ డవున్ లిస్టులో "RECENT MOVE ONLY" అనే మరొక ఆప్షన్ కూడా సెలక్ట్ చేసుకోవచ్చు.అసలు ఈ వెనక్కి వెళ్ళటం అక్కర్లేదనుకుంటే మూడో ఆప్షన్ ఉంది.

రెండవది "Show Positions" మీరు ఇప్పటివరకూ ఆడిన ఆటలోని అన్ని యెత్తుల తర్వాత బోర్డు అమరిక యెలా ఉందో చూపిస్తుంది.ఇక్కడ మాత్రం మామూలుగా కంట్రోలరు యెట్లా బోర్డుని వర్ణిస్తాడో అట్లా తెల్లపావుల వైపు నుంచి బోర్డు మీద పావులు అమరి ఉంటాయి.దీనితో చెయ్యదగిన పనంటూ యేమీ లేదు గానీ నేను మిగతా వాళ్ళ కన్నా భిన్నంగా చదరంగం ఆటలోని అన్ని ప్రత్యేకమైన యెత్తుల్నీ నిజజంగా బోర్డు మీద పావులు పరుచుకుని యెదురెదురుగా కూర్చుని ఆడేటప్పుదు యెలా వేస్తారో అదే మాదిరిగా ఇక్కడ ఇవ్వగలగటానికి మొదట నేను ఒక ప్రత్యేకమైన జోడు ఫంక్షన్లు వాడాను.మిగతా ప్రోగ్రామర్లు అందరూ బోర్డు మీద పావుని కదపటానికి మామూలుగా గేం నొటేషన్ వాడితే నేను బోర్డ్ పొజిషన్ వాడాను.అంటే ఇటువైపు బల్లమీద ఒక యెత్తు తర్వాత బోర్డు పొజిషన్ యెలా ఉంటుందో ఆ అమరికని ఇక్కడి నుంచి సర్వర్ మెమరీలో సేవ్ చెయ్యటం,అటువైపు సర్వర్ నుంచి వచ్చిన ఈ బోర్డు పొజిషన్ ఆధారంగా బల్లమీద పావుల్ని అమర్చడం చేశాను.దానివల్లనే తెల్ల పావులతో ఆడుతున్న ఆటగాడికి తెల్లపావులు కింద వున్న స్థితి, నల్ల పావులతో ఆడుతున్న ఆటగాడికి. నల్లపావులు కింద వున్న స్థితి - రెండూ సహజంగా అమరుతున్నాయి.ఇప్పుడంటే ఫ్లాష్ వాడుతున్నాను గాబట్టి బోర్డును రొటేట్ చేస్తున్నాను గానీ మొదట HTML లో ఇట్లా తిప్పడం కుదరక పోయినా తెల్ల ఆటగాడికి తెల్లపావులు కిందవైపుకీ నల్ల ఆటగాడికి నల్లపావులు కిందవైపుకీ వచ్చేలాగ చెయ్యగలిగాను!

మామూలుగా అయితే ఈ తెల్ల ఆటగాడు తనవైపు నుంచి చూసే అమరికని నల్ల ఆటగాడికి రివర్సులో చూపించడం చాలా కష్టం!దాని కోసం ఆలోచిస్తూ బోర్డు పొజిషన్ మరియూ బల్లమీద పావుల్ని అమర్చడానికి పెట్టిన నియమాలనీ మధిస్తుంటే ఒక అద్భుతమైన క్లూ దొరికింది!నేను ఈ పొజిషన్ కోడుని యెట్లా సర్వరు లోకి పంపిస్తున్నానంటే పైనుంచి కిందకి యెడమనుంచి కుడికి ఖాళీలు ఉన్నచోట "*" పెట్టి వీటిని "_" తో కలిపి ఒక దారంలాగ పంపిస్తున్నాను.అసలు యే పావునీ కదపక ముందు ఒకసారి బోర్డు అమరికని చూడండి - తెల్ల ఆటగాడికి కుడివైపున కిందివరసలో తెల్లగడి వచ్చేలాగ ఆటగాళ్ళు చదరంగం బల్లని అమర్చుకోవాలి,కదా?యెనుగులూ,గుర్రాలూ అన్నీ జంటలుగా ఉన్నాయి గాబట్టి చివరి నుంచి మధ్యకి అటూఇటూ ఒకే వరసలో ఉండేటట్టు చేశారు,సరేనా!ఇక మిగిలిన రాణినీ రాజునీ మామూలు లెక్క ప్రకారం తెల్లరాజుని తెల్లగడిలో నల్లరాజుని నల్లగడిలో ఉంచకుండా చిన్న మార్పు చేశారు,తెల్లరాణిని తెల్లగడిలో నల్లరాణిని నల్లగడిలో వచ్చేటట్టు మార్చారు.నాకదే కలిసొచ్చింది!నేను గనక ఆ బోర్డు పొజిషన్ కోడ్ దారాన్ని స్ప్లిట్ చేసి ఒక అర్రే లోకి పంపి రివర్స్ చేసి మళ్ళీ దాన్ని మామూలు పధ్ధతిలో కలిపేస్తే చాలు మొదటి దారంలో నాలుగో పొజిషన్లో ఉన్న నల్ల రాణి తిరగేసిన దారంలో అయిదో పొజిషన్లోకి చక్కగా అమిరిపోతున్నది, యేమి అద్భుతం?!అట్లా కాకపోయుంటే ప్రతి పొజిషను కోసం ఒక రివర్సు పొజిషను లెక్కవేసుకుంటూ ఉండాల్సి వచ్చేది,ఈనాడు నాకు ప్రాణానికి సుఖంగా ఉండటానికే ఆనాడు వాళ్ళట్లా చేశారేమో అనిపించింది -  నిజం!

ఇక ఆటకి సంబంధించిన కంట్రోల్సు ఇద్దరికీ సమానమే కాబట్టి కిందవైపున వున్న వరసలో వాట్ని గురించి చెప్తాను.డ్రా అనే ఒక యెత్తు కోసం మూడు బటన్లు పెట్టాను,యెందుకో తెలుసా?మీరు డ్రా చెయ్యాలనుకోగానే సరిపోదు,అవతలి ఆటగాడికి ప్రొపోస్ చెయ్యాలి,అతను ఒప్పుకున్నాకనే డ్రా పూర్తి అవుతుంది.అందుకని మొదట "REQUEST DRAW" పెట్టాను.అయితే ఇక్కడ దీన్ని క్లిక్ చెయ్యగానే దానిమీద ఉన్న చెక్ బాక్స్ "ON" స్టేట్ లోకి వెళ్తుంది.వెంటనే డ్రా అయిపోదు.యెదటి ఆటగాడికి తెలియాలి అంటే సర్వర్ అప్డేట్ కావాలి,కాబట్టి మీరు ఒక యెత్తు వెయ్యాలి - అది "డ్రా యెత్తు" అవుతుందన్నమాట! అవతలివైపున మీ యెత్తుతో పాటు మీరు డ్రా యెత్తు వేశారన్నందుకు గుర్తుగా మీ రంగు "REQUEST DRAW" చెక్ బాక్సు "ON" స్టేట్ లో  కనబడ్డం వల్ల అతనికి తెలుస్తుంది.అప్పుడు అతను తీసుకునే రెండు రకాల నిర్ణయాలకీ రెండు బటన్లు "REJECT DRAW","ACCEPT DRAW" పెట్టాను.నిజంగా ఆడేటప్పుడు యెదటి ఆతగాడు తన యెత్తు వేశాక మనం జస్ట్ డ్రా అడగటం అతను ఒప్పుకోకపోతేనే మనం పావుని కదల్చాల్సి వచ్చినా ఇక్కడ మాత్రం డ్రా యెత్తు తప్పనిసరి!

కింది వరసలో కనిపించే వాటిల్లో యెడమ పక్కన ఉన్నది తేలిగ్గానే అర్ధమవుతుంది - "RESIGN" మీరు రిజైన్ చెయ్యదల్చుకున్నప్పుడు దీన్ని నొక్కాలి.దీనికి మీరు ప్రత్యేకంగా యెత్తు వెయ్యనక్కర లేదు,కానీ గభాల్న కనబడే డయలాగ్ బాక్సులో పొరపాటున నొక్కకపోతే "CONFIRM",ఒకవేళ అనుకోకుండా నొక్కి వుంటే "CANCEL" నొక్కితే చాలు ఓ పనైపోతుంది!కిందివరసలో కుడివైపున ఉన్నది "ATTACK" ఇది మీరు యెదటివాళ్ళకి "షా" చెప్పడానికి ఉపయోగించుకోవాలి.వూర్కే "REJECT" తో సిమెట్రీ కోసం "ATTACK" అని పెట్టాను,అంతే!దీన్ని క్లిక్ చెశాక తప్పనిసరిగా యెత్తు వెయ్యాలి - మరి చెక్ చెప్పేసి కూర్చుంటే ఆట ముందు కెళ్ళదు గదా?ఇందులో ఇంకో తిరకాసు ఉంది, మీరు వెయ్యబోయేది అన్నివిధాలా చెక్ చెప్పటానికి తగిన యెత్తు అయినప్పటికీ మిగిలిన చోట్ల లాగా ఆటోమాటిక్ చెక్ నోటిఫికేషన్ ఇవ్వలేదు నేను.మీరు దీన్ని నొక్కి చెక్ బాక్స్ ఆన్ స్టేట్ లో ఉంటేనే అటువైపు ఆటగాడికి మీరు చెక్ చెప్పినట్టు తెలుస్తుంది - జాగ్రత్త మరి!

అన్నీ ఒక వరసలో చెప్తానని మాటిచ్చి వీటికన్నా పైన ఉన్న అంత అందమైన అధరాల్ని వర్ణించకుండా వొదిలేశాడు సుమీ అని తెగ ఇదయిపోమాకండి.ఈ 3డి అమరికలో ఉన్న ఒక ఇబ్బందిని తొలగించడానికి దాని ఉపయోగం యెంతయినా వుంది - మీరు చక్కగా నొక్కి పులకించవచ్చు!బోర్డు 3డిలో వంగడం వల్ల ఒక పావుకి వెనకాల ఉన్న పావుని కదిలించాలంటే యేమి చేయాలి?ఆ పెదిమల్ని యేదో ఒక చివర్న కొంచెం నొక్కాలి - అప్పుడు ఆ పెదిమలూ వాటికి వ్యతిరేక దిశలో బోర్డూ ఐమూలకి తిరుగుతాయి - ఇప్పుడు మీరు యే పావునైనా చాలా తేలిగ్గా కదపవచ్చు.కొంచెమే తిరుగుతుంది గాబట్టి పావుని యే గడిలోకి కదల్చాలన్నది స్పష్టంగానే తెలుస్తుంది, యేర్పాటు బావుందా!

ఇంక అన్నిటికన్నా కిందవరసలో ఆకుపచ్చగా బ్లింక్ అవుతున్నది మీరు యెత్తువెయ్యడానికి తొందర చేస్తుంది,దానిపైన చూపించే టైము అవతలి పావును కదిపాక మీరు యెంత టైము తీసుకుంటున్నారనేది చెప్తుంది,అంటే టైమర్లతో సహా ఒక టోర్నమెంటు బోర్డునే ఇక్కడ మీకు చూపిస్తున్నాను,యెట్లా వుంది?

ఒకసారి ప్రాక్టీస్ గేం పూర్తి అయ్యేసరికి బోర్డు బాగా అలవాటు అయి వుంటుంది గాబట్టి ఇక ఎక్స్పర్ట్ గేం గురించి చెప్తాను.ఈ ఆట ఆడాలంటే అటువైపు యెవరో ఒకరు ఉండాల్సిందే!నేను కావాలనే మిగతా సైట్లలో ఇచ్చినట్టు అనామకపు ప్రోగ్రామింగ్ లాజిక్ మీద ఆడే యేర్పాటు చెయ్యడం లేదు,నా ముఖ్యమైన ఉద్దేశం చదరంగం ఆటతో జనాన్ని కలపడం కాబట్టి అటుకేసి ఆలోచించలేదు.ప్రాక్టీస్ ఆటలో కూడా మొదట్లో ఆన్లైనులో కొన్నిచోట్ల ప్రముఖ ఆటగాళ్ళు ఆడిన ఆటల లిస్టులు కనబడుతున్నాయి - అక్కడ మాదిరిగా ఆల్ని లోడ్ చేసుకుని "<" బటనూ ">" బటనూ నొక్కుతూ గడిపే ప్రివ్యూ తరహా విధానం ఇద్దామా అని టెంప్ట్ అయ్యి కూడా మానుకున్నాను.మీరు ఒకపని చెయ్యవచ్చు,ఆ ఆటల్లో బాగా నచ్చినవి ఇక్కడ ఒక్కొక్క యెత్తూ వేసి అడుకుని రెఫరెన్సుగా వుంచుకోవచ్చు!ఇపుడిక మనం ఒక ఎక్స్పర్ట్ గేం ఆడటానికి ఇతర్లతో యెట్లా కనెక్ట్ అవ్వాలో వివరంగా చెప్తాను.మొదత గేం డెఫినిషన్ విండోలో ఎక్ష్పెర్ట్ రేడియో బటన్ నొక్కి వుంటే తర్వాత తెరుచుకునే విండో ఇట్లా ఉంటుంది:
ఇక్కడ మీరు రెండురకాలుగా కనెక్త్ అవవచ్చు,"INSTANT" అంటే అప్పటికప్పుడు జరిగిపోయేది!దీనికి అవతలి వ్యక్తి "User Space" లో ఉండి తను ఎక్స్పర్ట్ గేం ఆడుతూ ఉండకుండా ఫ్రీగా ఉండాలి!ప్రస్తుతం అలా ఖాళీగా ఉన్న ఈ  సైటు మెంబర్ల లిస్టు కనబడుతుంది.ఆ మెంబరు వివరాల్లో చివర ఉన్న రేడియో బటన్ నొక్కి ఆ మెంబర్ని సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న "SEND" బటన్ నొక్కగానే మీవైపున ఒక వెయిట్ విండో తెరుచుకుంటుంది.
మీరు ప్రస్తుతం చెయ్యడానికేమీ లేదు అవతలి వ్యక్తి యేదో ఒక నిర్ణయం తీసుకునే వరకు - కాబట్టి యే బటనూ ఉండదు ఇక్కడ!ఇక్కడ మీరు గుర్తుంచుకోఅవలసిన విషయం ఒకటి ఉంది.ఈ రెండురకాల కనెక్షన్లు మీరు లాగిన్ అయి వున్నారా యేదయినా ఎక్స్పర్ట్ గేము ఆడుతున్నారా అని  నోటిఫై అవడాన్ని బట్టి పని జరుగుతుంది కనక లాగిన్ అయిన ప్రతిసారీ లాగౌట్ అవ్వాలి.ఒకవేళ హఠాత్తుగా కంప్యూటరు క్రాష్ అయినా మళ్ళీ ప్రాబ్లెం సరవగానే లాగిన్ అయి లాగౌట్ అయ్యేటంత నిష్ఠగా ఉండాలి ఆ విషయంలో.అలాగే ఆటని కూడా "LEAVE GAME" బటన్ ద్వారానే మూసెయ్యాలి!లేదంటే మీ పేరు ఇతర్ల గేం స్క్రీనుల్లో కనపడుతూనే ఉంటుంది.
మీవైపున వెయిట్ విండో తెరుచుకున్న సమయంలోనే అవతలి వైపున ఒక ఆప్షన్ డయలాగ్ విండో తెరుచుకుంటుంది,వేరేవాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే మీవైపున కూడా ఇదే రకమైన విండో తెరుచుకుంటుంది.ఇందులో ఆకి సంబంధించిన ముఖ్యమయిన వివరాలతో పాటు రెండు బన్సు వుంటాయి -  "ACCEPT" మరియూ "REJECT", మీరు నిర్ణయించుకోవలసిన రెండు ఆప్షన్లు అవి!అవతలి వ్యక్తి తిరస్కరిస్తే మీరు మరొక రేడియో బటన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది! అవతలి వ్యక్తి ఆమోదిస్తే మీవైపున వెయిట్ విండో పోయి కంటిన్యూ విండో వస్తుంది.అక్కడ ఉన్న "CONTINUE" బన్ నొక్కితే మీరు ఆకి సొంతదారుగా రంగస్థలం లోకి వెళ్తారు.మీకు రిక్వెస్ట్ వచ్చి మీరు ఆమోదించినా ఒక కంటిన్యూ విండో వస్తుంది.ఆ బన్ నొక్కగానే ఆహ్వానితులుగా ఆటకి సంబంధించిన రంగస్థలం లోకి ప్రవేశిస్తారు.
ఇక రెండో రకం "PENDING" కనెక్షన్ యెన్నుకోవాలంటే చివరి వరసలో ఉన్న రేడియో బన్ నొక్కి "SEND" బన్ నొక్కాలి. అప్పుడు పైన చూపించిన మరో లిష్టు వస్తుంది.ఇది కూడా మొదటి లిస్టులాగే ఉంటుంది - కాకపోతే వీళ్ళలో యెవర్ని సెలెక్ట్ చేసుకుని "SEND" నొక్కినా అవతలి వ్యక్తి మెయిల్ అకవుంటుకి ఒక కస్టమైజ్డ్ మెస్సేజి వెళ్తుంది,అంతే!ఇక్కడ ఇంక పని యేమీ ఉండదు. అతను తన మెయిల్ చూసుకుంటేనే తనంతట తను మీ ఆహ్వానానికి జవాబు చెప్పగలడు.ఈ రకం కనెక్షను యెవరు దొరికితే వాళ్లతో కాకుండా ఇప్పటికిప్పుడు కనెక్ట్ అయ్యే స్థితిలో లేకపోయినా సరే ఫలానా వ్యక్తి తోనే ఆడాలి అనుకున్నప్పుడు పనికొస్తుంది. అయితే నేను అలా వొదిలెయ్యకుండా మీకు మరో వెసులుబాటు కూడా ఇచ్చాను - మీరు మీ అకవుంటులోకి ప్రవేశించగానే మీకు గనక యెవరయినా పెండింగ్ రిక్వెస్ట్ పంపించి ఉంటే ఆ వివరం మీకు చిన్న బ్లింక్ మెస్సేజి వస్తుంది.ఆ మెస్సేజిని చూగానే "Public" బటన్ నొక్కితే "Requests","Sessions" అనే రెండు బన్లు వస్తాయి.మొదటిది నొక్కితే మీరు యాక్సెప్ట్ చెయ్యాల్సిన గేములన్నీ కనబడతాయి.
ఈ లిస్టు కూడా మామూలుగా ఈ సైటులో అన్నింటిలాగే ఉంటుంది.కాకపోతే వరసలో తక్కువ వివరాలే వస్తాయి కాబట్టి అన్ని వివరాలూ చూడాలంటే పేరుని క్లిక్ చేస్తే కనబతాయి.వరసలో చివరి బటన్ నొక్కితే ఇక్కడ కూడా ఆమోదించటానికీ తిరస్కరించటానికీ ఉపయోగపడే విండో తెరుచుకుంటుంది.ఆమోదించినా తిరస్కరించినా ఇక ఆ వరసలో ఉన్న గేము మీద నిర్ణయం తీసేసుకున్నారు గాబట్టి ఆ గేము వరస లిస్టులో నుంచి పోతుంది.
ఇంక పబ్లిక్ బటన్ నొక్కగానే వచ్చే బటన్లలో రెండోదైన "Sessions" బన్ నొక్కితే మీరు సొంతదారుగా గానీ ఆహ్వానితులుగా గానీ కనెక్ట్ అయిన ఆలు అన్నీ కనబదతాయి.ఇక్కడ యే ఆకి సంబంధించి అయినా సరే అవతలి వ్యక్తికి ఆ గేము ఆడటానికి ఒక సమయం యెన్నుకుని మెయిల్ పంపించవచ్చు.అట్లా ఇద్దరూ ఒకే సమయానికి లాగిన అయ్యి ఆ ఆటని కంటిన్యూ చెయ్యవచ్చు!ఎక్స్పర్ట్ గేముకి మరో అదనపు ఆకర్షణ చాట్ కంట్రోలు!మొదట్లో ఎక్స్పర్ట్ గేములో వెనక్కి వెళ్ళే చాన్సు తీసుకుంటే దాన్ని యెలా హ్యాండిల్ చెయ్యాలో తెలియక అవతలి వ్యక్తికి తెలియపరచే ఉద్దేశంతో పెట్టాను,కానీ తర్వాత అక్క కూడా చాయిస్ విండోలతో చేస్తే తప్ప పని జరగదని తెలిసి దాన్ని కూడా కనెక్షను మాదిరిగానే నడిపించినా ఉన్నదాన్ని తీసెయ్యడ మెందుకని దీన్ని తీసెయ్యలేదు!బోర్డు అంతా టోర్నమెంటు లెవెల్లో ఇచ్చినా నిజం టోర్నమెంటు కాదుగా - ఆట మధ్యలో మీరు చాటింగ్ కూడా చేసుకోవచ్చు - నా అసలు లక్ష్యం కూడా మనుషుల్ని చదరంగం ద్వారా కలపడమే కదా!
హమ్మయ్య నాసుత్తి అయిపోయింది?మీరిక అక్కడికెళ్ళి ఇరగదీసెయ్యండి!

9 comments:

  1. బాగుంది కానీ ఇవన్ని మొబైల్ చెస్ appలో ఉన్న ఫీచర్స్. అలానే మీరు గ్రాండ్ మాస్టర్ అనే కంప్యూటర్ app గురించి వినే వుంటారు. అందులో ఈ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. అది install చేసుకోవాలి దీనికి ఇంటర్నెట్ కావాలి. అలానే మన ఫ్రెండ్స్ తో ఆడుకునే ఆప్షన్ ఉందా? ఎందుకు రిజిస్ట్రేషన్ ? జిమెయిల్ లేదా ఫేస్బుక్ లేదా యాహూమెయిల్తో లాగిన్ అయ్యేలా పెట్టొచ్చు కదా. ఇంకోటి రిజిస్ట్రేషన్ లేకుండా అతిథిలా ఆడుకునే ఆప్షన్ పెట్టొచ్చు కదా. నేను ఆడిన గేమ్స్ సేవ్ చేసుకోవాలంటే లాగిన్ అవ్వాలి జస్ట్ ఆడి వెళ్ళిపోవటానికి గెస్ట్ లాగిన్ ఉంచండి. ప్రజలని రిజిస్ట్రేషన్ చేసుకోమని రూల్ వద్దు ఇది నా అభిప్రాయం మాత్రమే. మీరు ఎంతో అలోచించి చేసుంటారు కరెక్ట్ అనిపిస్తే తీసుకోండి. ఇంకా ఆడలేదు ఆడిన తరువాత నా అనుభవం ఎలా ఉందో చెప్తాను

    ReplyDelete
    Replies
    1. ఫ్రెండ్స్ తో ఆడుకోవచ్చు వాళ్ళు ఈ సిట్ మెంబర్స్ అయి వుంటే!గెస్ట్ లాగిన్ విషయం ఆలోచిస్తాను,నిజమే ఆడాలంతే కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాలనడం ఒక రకంగా ఫోర్స్ హేసినట్టు - కానీ చెయ్యడం టెక్నిక్ విషయంగా చూస్తే చాలా కష్తం.ఆతకి సమబంధించిన ప్రతి చిన్న వీవరం కరెక్టుగా నమోదు అయ్యి మళ్ళీ ఫ్లో దెబ్బ తినకుండా కనపడాలంటే రిజిస్టర్ అవకుండా సాధ్యపడుతుందా?మొబైల్ ఆప్స్ అప్పుడే ఇవన్నీ కవర్ చేస్తున్నాయా!నేనింకా సైటు వల్ల యేమొస్తుంది బాగా పాప్యులర్ అయీతే యాడ్స్ తప్ప,ఆండ్రాయిడ్ ఆప్ కూడా చేస్తే ఒక్కో లోడింగ్ టైములో అయితే రెవెన్యూ వస్తుంది కదా అనుకుంటున్నా.

      Delete
    2. ఉన్నాయండి చెస్ ఫ్రీ (app పేరు) డెవలపర్ AL Factory Limited. అందులో అన్ని ఉన్నాయి Propose డ్రా, resign, undo( ఇది కావాలనుకుంటే disable చేసుకోవచ్చు). ఇంకా లాగిన్ విషయానికి వస్తే OpenId ఉపయోగించి యాహూ లేదా జిమెయిల్తో మీ సైటులో లాగిన్ అయ్యేలా చేయోచ్చు. ఎలాగో మెయిల్ id unique ఉంటుంది కాబట్టి వాళ్ళ డేటా మైంటైన్ చేయటం కష్టం కాకపోవచ్చు. దీని వల్ల ఇంకో సౌలభ్యం ఏంటంటే వాళ్ళ స్నేహితులని ఈజీగా invite చేయోచ్చు. వాళ్ళ మెయిల్ id లో కాంటాక్ట్స్ / ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళని ఫ్రెండ్స్గ చూపించొచ్చు. ఇది చాల సైట్స్లో చేస్తున్నదే . నేను టెస్టర్ని కాబట్టి technologies గురించి అంత లోతైన జ్ఞానం లేదు. చూడగానే నాకు కనిపించినవి, నాకు తెలిసినవి చెప్పాను. ఆలోచించండి. ఆఫీసులో ఉన్న కాబట్టి మీ సైటులో రిజిస్టర్ కాలేదు ఇంటికెళ్ళి రిజిస్టర్ అయ్యి టెస్ట్ చేస్తాను. ఏమన్నా ఉంటే మీ feedback ఫార్మ్ వాడుకుంటాను.

      Delete
    3. ఇంకో చిన్న సలహా చిన్నప్పుడు నేను మా అన్నయ్య ఎక్కువ ఆడేవాళ్ళము. ఆయన చాల బాగా ఆడేవాడు. కొన్ని ఎత్తుల తరువాత నేను ఓడిపోతాను అనిపించినప్పుడు నేను కొత్త గేమ్ మొదలుపెడదాము అంటే ఆయన లేదు అని బోర్డు తిప్పి నా గేమ్ ఆయన ఆడేవాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆట మధ్యలో ఉన్నప్పుడు (నావి నల్ల పావులు అనుకోండి, తెల్ల పావులుకి మారటం ) నేను సైడ్ మార్చుకునే ఆప్షన్ డెవలప్ చేయగలరేమో చూడండి

      Delete
  2. @Ashok8734
    మీ సలహాలు తప్పకుండా గురుంచుకుంటాను.ప్రస్తుతం నేను వాడుతున్న కంప్యూటరులో ఫ్లాష్ మరియూ వంప్ సర్వర్ లోపించాయి.అవి లోద్ చేయించే పనిలో ఉన్నాను.అది పూర్తవగానే మీరు సూచించిన మార్పులలో వీలయినన్ని చేసి అప్డేట్ చేస్తాను!చాలాకాలం ముందే పూర్తి చహెసి ఉండాల్సింది,వెనకబడీతే వెనకేనోయ్ అన్నట్టు తయారయిందా?

    ReplyDelete
  3. Replies
    1. మీ ఆసక్తికి ధన్యవాదాలు!సైటు మెంబర్స్ లిస్ట్ చూస్తే మీరు రిజిస్తర్ అయినట్టు తెలీసింది!అవును,ప్రతి ప్రోదక్టుకీ టెస్టర్ల అభిప్రాయం చాలా అవసరం,ఇప్పటివరకూ మీరు ఇచ్చిన సూచనలు చాలా బాగున్నాయి.వీలయినంతవరకూ మార్చి చూస్తాను.ఫేస్ బుక్ గ్రాఫ్ కనెక్షనుకి అవసరమయిన అకవుంటు ఐడి ఇప్పటికే ఉంది.రిజిస్టర్ విత్ ఫేస్బుక్ లాగిన్ విత్ ఫేస్బుక్ ఆప్షన్లు పెట్టతం పెద్ద కష్టమేమీ కాదు.అసలు రిజిస్తర్ అవకుండా లాగిన్ చెయ్యనక్కరలేకుండా ఒక ట్రయల్ రన్ మెయిన్ విండో నుంచి ఓపెన్ అయ్యేలా కూడా చెయ్యగలను.

      Delete
  4. డ్రా ఎత్తు గురించి మీరు ముందే చెప్పారు అయిన సరే అది ఎందుకో కరెక్ట్ అనిపించటం లేదు. ఎప్పుడైతే రిక్వెస్ట్ డ్రా చెక్ బాక్స్ ఆన్ అయ్యిందో అప్పుడే అవతలి వ్యక్తి అభిప్రాయం తీసుకోవచ్చు కదా ఒప్పుకుంటున్నాడో లేదో ఎందుకు డ్రా ఎత్తు అది కొంచెం అయోమయంగా ఉంది. అల ఎందుకు పెట్టారు మీరు? స్ట్రెయిట్గా ఉన్నప్పుడు రాజు ముందు సిపాయిని సెలెక్ట్ చేయటం కొంచెం కష్టంగా ఉంది. రాజు లేక మంత్రి సెలెక్ట్ అవుతున్నాయి. పెదవుల బొమ్మ బదులు ఇంకేదన్నా సరిఅయిన బొమ్మ పెడితే బాగుంటుంది అనిపించింది. అవును కంప్యూటర్తో ఆడే ఆప్షన్ లేదా డిఫాల్ట్గా రెండు నా పేరుతోనే గేమ్ క్రియేట్ అయ్యింది. అది ఒకసారి చూడండి. బోర్డు ఫుల్ స్క్రీన్ ఆప్షన్ పెట్టగలేరేమో చూడండి. ఎందుకంటే కొంచెం ఇరుకుగా ఉంది బోర్డు. హ ఇంకోటి ఇప్పటివరకు వేసిన ఎత్తులు చూడటానికి ఆప్షన్ పెట్టండి అంటే గేమ్ స్టార్ట్ అయిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఏ స్టెప్స్ వేసాను చూడాలనుకుంటే ఒక్కోటి లైక్ స్లయిడ్ షో లేదా స్టెప్స్ (ఏరో బటన్స్ ఉపయోగించి). ఇది ఊరికినే చూడటానికి. మీ show పోసిషన్ ఇప్పటి పోసిషన్ చూపిస్తుంది. నేను చెప్పేది జస్ట్ లైక్ రీకాప్ లాగ. ఇంకోటి గేమ్ అయిపోయాక వీడియో ఫైల్ generate చేసి సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటే బాగుంటుంది. offlineలో చూసుకోవటానికి. ప్రస్తుతానికి ఇవి నా అభిప్రాయలు మరియు పరిశీలనలు

    ReplyDelete
  5. @ashok
    అవును,డ్రా యెత్తుని కూడా రెజైన్ యెత్తులాగ మారుస్తాను.ఫ్లాష్ దెవలప్మెంటు ప్యాకజి న అకమ్యూతరులోకి లోడ్ చేసుకుని వీలున్నంత తొందర్లోనే మారుస్తాను.మీరు చెప్పకముందే ఈ మధ్యనే లైటు వెలిగింది డ్రా యెత్తు సరి చెయ్యాలని,చెయ్యొచ్చు.ఫుల్ స్క్రీన్ చేసాను మొదట్లో,కానీ నేను ఉపయోగించిన ఫ్లాష్ వెర్షన్లో చాత్ కంత్రోల్ సరిగ్గా వర్క వ్వట్లేదు.ఇప్పుడు వెర్షన్ పెంచితే వస్తుందని అనుకుంటున్నాను.కాబ్ట్టి ఫుల్ స్క్రీన్ తప్పకుండా వాద్తాను.పేదవుల గుర్తు కూడా ట్రయల్ మాత్రమే ఇప్పుడు అప్దట్ చేసేతప్ప్పుడు అదీ చెయ్యాలి,ఒక రెండు మూడు రోజుల్లో లేదా ఈ వారాంతానికి మారుస్తాను.గేం అయిపోయాక లిస్ట్లో ఉన్న "ఖీళ్ళ్" ఆప్షన్ వాడీతే మొత్తం ఆత హిస్తరీ ఒక తేబుల్ మాదిరి మీ మెయిల్ ఐడికి వెళ్ళేలాగ చేసాను.కానీ నేను సైతు ద్వారా ఫ్ఫ్తో పంపే ఆ మెయిల్స్ అన్నీ స్పాం లోకి వెళ్తున్నాయి,యెందుకో తెలియదు.అది కొంచెం రీసెర్చ్ చేసి అయిన అమళ్ళీ ఇంబాక్స్ లోకి వెళ్ళేలాగ చెయ్యాలి.ఒక్కసారిగ అవీడియోగా మార్చటం కొంచెం కష్టమే.
    >>అవును కంప్యూటర్తో ఆడే ఆప్షన్ లేదా డిఫాల్ట్గా రెండు నా పేరుతోనే గేమ్ క్రియేట్ అయ్యింది. అది ఒకసారి చూడండి.
    మీరు ఓపెన్ చేసింది ప్రాక్టీస్ గేము అయితే రెండు వైపులా మీరే ఉంటారు కదా!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...