Sunday, 14 June 2015

ఆంధ్ర పారిశ్రామికవేత్తల సాయం లేంది పూట గడవని స్థితిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి నిజంగా ఆంద్ర ముఖ్యమంత్రిని అరెస్టు చెయ్యగలడా?

          ఆంధ్రావోడిగా నా సొంతమాటల్లో చెప్తే పులిమేస్తున్నాడు గురుడు అని తాటాకులు కదతారు.కాబట్టి ఒక తెలంగాణా బ్లాగరు పోష్టుల నుంచే యెత్తి చూపిస్తే ఇవ్వాళ తెలంగాణా వాళ్ళు ఆంధ్రావాళ్ళ మీద యెంతగా ఆధారపడి బతుకుతున్నారో తెలుస్తుంది! "ఆంధ్రా నేత‌ల‌తో సంబంధం ఉన్న కంపెనీల‌కు తెలంగాణ కాంట్రాక్టులు ఇవ్వొద్దు" అని 2015 జూన్ 10న అంత దీనంగా ఆక్రందిస్తున్నది యెవరు?ఇతర్ల కుళ్ళును చూపించి హీరో అయిన అస్సాంజి పేరు పెట్టుకుని తన కుళ్ళుని బయట పెట్టుకుంటున్న తెలంగాంఆ అసాంజి బ్లాగరు!యేమిటట ఈయనగారి ఆరోపణలతో కూడిన ఆవేదన?ఆంధ్రా నేత‌ల‌తో సంబంధం ఉన్న కంపెనీల‌కు తెలంగాణ కాంట్రాక్టులు ఇవ్వొద్దు.. వారంతా ఇక్క‌డ కాంట్రాక్టులు చేసుకొని డ‌బ్బులు కూడ‌బెట్టుకుని అదే సొమ్ముతో ఇక్క‌డి పాల‌న‌ను అస్త‌వ్య‌స్తం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.. వీలైతే తెలంగాణ‌లో పారిశ్రామిక వేత్త‌ల‌ను త‌యారు చేయండి..సలహా బాగానె ఉంది,కానీ పారిశ్రామిక వేత్తల్ని యెట్లా తయారు చెయ్యాలో తెలుసా ఈయనకి - దేశంలో బిజినెస్ స్కూల్సు చాలా ఉన్నా అందులో డిగ్రీలు పుచ్చుకున్న వాళ్ళలో యెంతమంది బిజినెస్సుల్లో ఆరితేరిపోయారో డాటా యేమయినా ఉన్నదా ఈయన దగ్గిర!ఇదంతా తెలంగాణా ఆవిర్భవించెయ్యగానే ఆధాటున జరిగిపోతుందని ఈయన కలగన్నాడని అనుకోకుండానే జరిగిపోతుందా - పిల్లి శాపాలకి ఉట్లు తెగుతాయా?ఆదర్శాలు బాగానే చెప్పాడు,కానీ పాపం అదే నోటితో ఉన్న వాస్తవం యెట్లా ఉందో కూడా ఆయనే చెప్పాడు విని తరించండి:మ‌న కాంట్రాక్ట‌ర్ల‌కు అర్హ‌త‌లు, అనుభ‌వం లేద‌ని కొన్ని ప్రాజెక్టుల్లో వారిని అన‌ర్హులుగా ప‌క్క‌న పెడుతున్నారు.. యెంత పచ్చినిజం చెప్పేశాడు?కానీ అట్లా పక్కన పెడుతున్నది యెవరు - ఆంధ్రా దోపిడీ దారుల్ని పొలిమేరలు దాటిస్తానని కూస్తే పులకించిపోయి ఈ కేతిగాళ్ళంతా చప్పట్లు కొట్టి వోట్లు గుద్ద్ది అధికారంలోకి పంపించిన ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వం వారు,కాదా!

          ఇంత సీరియస్సుగా తెలంగాణ పట్ల భవ్యావేశంతో రాస్తున్న వాణ్ణి "కేతిగాడు" అంటావా అని యెవరైనా నన్ను నిలదీసే ముందు తెలంగాణ సినిమా పరిశ్ర్మ వృధ్ధిలోకి రావటానికి మ‌ల్టీప్లెక్స్‌ల‌లో ఒక షో తెలంగాణ సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించే నిబంధ‌న తెస్తే బాగంటుందన్న పోష్టు చూడండి,నాకైతే నవ్వాగలేదు తెలుసా?ఇంతకీ తెలంగాణలో తెలంగాణ వారికి ప్రాముఖ్యత రావడం లేదన్న బాధ యెప్పటి నించి సెలవేసి రగుల్తుందో తెలుసా?2015 ఏప్రిల్ 28న మ‌న కాంట్రాక్ట‌ర్ల‌నూ ప్రోత్స‌హించండి...! స‌బ్ కాంట్రాక్టర్లుగా మ‌న‌వాళ్ల‌ను మార్చొద్దు అనేటప్పటికి తెలంగాణ ఆవిర్భవించి యెంత కాలమయింది?ఇంతగా ఆంధ్రా పారిశ్రామికవేత్తల బానిసాధముడై తరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రికి నిజంగా ఆంధ్రపరదేశ్ ముఖ్యమంత్రిని అరెస్టు చెయ్యగలిగే ధైర్యముందా?ఒకవేళ ధైర్యం చేస్తే అతన్ని నిలవరించలేకపోయిన ఆంధ్ర పారిశ్రామిక వేత్తలు చూస్తూ వూరుకున్నందుకు తిరిగి ఆంధ్ర రాష్ట్రంలోని తమ స్వస్థలాలకి ధైర్యంగా రాగలరా!

          సంపద పెంచటమంటే బతుకమ్మ చుట్టూ గంతులేసినంత తేలికనుకున్నారు కాబోలు!ఇక్కడ ఐప్పుడు అంతగా పెరిగిన ఆంధ్రావాళ్ళు ఒక్కరోజులో యెదిగారా?ఇది మన రాజధాని అని నమ్మి అక్కడ గొప్పగా బతకాలనే ఆశతో స్వస్థలాల్లోని ఆస్తుల్ని తెగనమ్మి యే ఒప్పందాల్ని ఉల్లంఘించారని వీళ్ళివాళ జరిగిందేమిటో తెలియకుండా పుచ్చొంకాయ కబుర్లు చెప్తున్నారో ఆ ఒప్పందాల్ని అడ్డు పెట్టుకుని 10 రూపాయల భూమిని 30 రూపాయలు చెప్తే అవసరం తమది గనుకా అంత పెట్టినా అంతకంతా లాభం తియ్యగలం అనే నమ్మకంతో కొని అక్కడ తొలి అడుగు వేసిన సందర్భంలో సాటి తెలంగాణ వాడి కమ్మితే 10 ఇస్తాడు,రూల్సు అడ్డంగా వున్నాయి గనక ఆంధ్రావాడయితే 30 ఇస్తాడు అనే తెలివి చూపించిన వాళ్ళు అమాయకులా?ఒక తెలంగాణా వ్యాపారవేత్తయే తన గతకాలపు జీవితానుభవాల్ని చెప్తూ "ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు యెంతకయినా తెగించి భూముల్ని యెక్కువరేటుకి  కొనటం, దాంతో భూముల రేట్లు అమాంతం పెరుగిపోవటంతో తెలంగాణలో చాలామంది అప్పట్లో వ్యాపారాల్లో పరిశ్రమల్లో అడుగుపెట్టలేకపోయారు" అన్నాడు,నిజమో అబధ్ధమో అప్పటి పరిస్థితుల పట్ల అవగాహన వున్న యెవడయినా చాలా తేలికగా తెలుసుకోగలడు.యే రక్షణల్ని బూచిగా చూపించి వాట్ని ఉల్లంఘించి మీరు మాకన్యాయం చేశారని మమ్మల్ని బెదరగొడుతున్నారో ఆ రక్షణలే మీ వ్యాపారవేత్తలకి ముందరి కాళ్ళ బంధాలై ఇవ్వాళ దాని ఫలితం చూస్తున్నారు - చరిత్రని చరిత్రలా చదవండి!

          నిజాము జనాన్ని పీడించి నిలవేసిన సంపద వుండటం వల్ల అప్పుదు కూడా తెలంగాణ ధనిక రాష్ట్రం అని డప్పు కొట్టుకున్నా చంద్రబాబు ఐటిని ప్రవెశపెట్టి ప్రపంచానికి తలుపులు తెరవడం వల్ల తప్ప టూరిష్టులు చూసి సంతోషించటానికి మాత్రమే పనికొచ్చే నిజాము కట్టిన భవనాల వల్లనా హైదరాబాదు పెరిగింది?వూరికే హైదరాబాదుని ఒక్కదాన్నే పెంచాడు అనే వాళ్ళు ఇవ్వాళ ఈ ముఖ్యమంత్రి చేస్తున్నదేమిటో చూస్తున్నారా?టాంకుబండు పక్కన 60 అంతస్థుల మేలు కడతాను,ఇంకా పెంచుతాను అంటున్నాడే తప్ప తెలంగాణ లోని మిగిలిన నగరాల్ని గుఇంచి ఆలోచించటం లేదేమిటి?

          మాటిమాటికీ ఆంధ్రాలో దారుణాలూ మోసాలూ జరిగిపోతున్నాయని విపరీతమైన ఆందోళన పడుతూ "ఇవీ ఆంధ్రా మేధావులు విశ్లేషించుకోవలసిన విషయాలు" అని నీతులు చెప్తున్న వాళ్ళకి నేను ఒకే ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను:ఆంధ్ర దోపిడీ నుంచి విముక్తం చేస్తానని బీరాలు పలికి ఇంకా ఆంధ్రోళ్ళనే అంటకాగుతున్న మీ ఉఖ్యమంత్రిని ఆ ఆంధ్రోళ్ళని తరిమికొట్టమని నిగ్గదియ్యగలరా?నిగ్గదీస్తే యేం జరుగుతుందో తెలుసా!ఒక పెద్ద ఖాళీ యేర్పడుతుంది,ఆ ఖాళీ లోకి ఇవ్వాళ కొత్తగా మీవాళ్ళు పరిశ్రమలూ వ్యాపారాలూ పెట్టి రాష్ట్ర ఖజానాకి తగినంత రెవెన్యూ రప్పించాలంటే కనీసం 25 యేళ్ళు పడుతుంది,మీరు మీ దుస్థితి గురించి విశ్లేషించుకోండి!

          ఇట్టాంటి పిచ్చ యవ్వారాలు చేసి మాకు అతిగా కాలేటట్టు చేస్తే మేము ఒత్తిడి చేసి ఆంధ్రా పారిశ్రామిక వేత్తల్ని ఖాళీ చెయించినా జరిగేది అదే - కాబట్ట్టి అతిగా బాబుకి యేదో అయిపోతుందని ఆశపడితే లక్ష నాగళ్ళతో రామోజీ ఫిలిం సిటీని దున్నిస్తే చూద్దామనుకున్నట్టే ఉంటుంది - కళ్ళు తెరిచి చూడండి!అయినా కేసీఆర్ మీ అంత పిచ్చొడేం కాదు లెండి.

          మీరు విశ్లేషించుకుని విచార పడవలసింది మరొకటి ఉంది - అధికారంలో ఉన్నాడు గాబట్టి చాటుమాటుగా కాకుండా ఇంటికే పిలిపించుకుని డబ్బుకి లొంగేవాళ్ళకి డబ్బులిచ్చి డబ్బుకి లొంగనివాళ్లని బ్లాక్ మెయిల్ చేసి తెగబడుతుంటే అది మీకు హీరోయిజం లాగ కనిపించిందా?ఒక ముఖ్యమంత్రి ఇలాంటివాడయితే అని బాబుకి యే విశేషణాలు తొడుగుతున్నారో అవి అసలేమాత్రం తనకి వర్తించనంత పులుగడిగిన మిత్యమా కేసీఆర్!పగబట్టి వేధిస్తూ ఉనికిని కాపాడుకోవటం కోసం మనమూ యేదయినా చేద్దామనే స్థితికి తీసుకెళ్ళేలాగ మెంటల్  కార్నరింగ్ చేసి ఆశపెట్టి పోలీసులకి పట్టించి ప్రగల్భాలు పలికే నీచస్థాయి రాజకీయం ఇక్క కాక ఇంకెక్కడన్నా జరిగిందా!ఇక్కడే యెందుకు జరిగింది?ఫలానా వాడు మా పార్టీ నుంచి ఫిరాయించాడు అని స్పీకరుకి రిపోర్టు ఇచ్చినా ముడ్డి కదల్చకుండా కూర్చుంటే అవతలివాణ్ణి రెచ్చగొట్టినట్టు కాదా?రహస్యంగా కాదే ఆన్నీ బాహాటంగానే జరిగినాయి కదా,అయినా అతనూ మీరూ సమర్ధించుకుంటున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది - మీరు ఉన్నతమైనదని చెప్పుకున్న ప్రాంతీయాభిమానాన్ని అతనూ మీరూ కలిసి భ్రష్టు పట్టిస్తూ తెలంగాణాని మాఫియా అడ్డాగా మీ చెతుల్తో మీరే మారుస్తున్నా తెలుసుకోలేకపోతున్నారేమిటా అని మీమీద జాలిగా కూడా వుంది,పోనివ్వండి మీ ఉన్నతాశయాలు భ్రష్టు పట్టిపోతున్నాయని మీకుండాల్సిన బాధ నాకెందుకు?

          ఒకటి మాత్రం నిజం - వారం క్రితం వరకూ నేను కూడా యెంతయినా సాటి తెలుగువాళ్ళు కదా,ఉద్యమకాలంలో వేడిలో యేదో తొందరపడి ఒకటీ రెండూ అన్నారులే అని సరిపెట్టుకుని మానసికంగా "ఆంధ్రాకీ తెలంగాణాకీ తగాదా వస్తే ఆంధ్రా వైపునే నిలబడినా తెలంగాణాకి యే మహారాష్ట్రతోనో తగాదా వస్తే తెలంగానాకే సపోర్టుగా ఉందాం" అనుకున్నాను గానీ ఇవ్వాళ హైదరాబాదులో జరిగినదానికీ జరుగుతున్న దానికీ నిలువెల్లా మీరంటే అసహ్యంతో రగిలిపోతున్నాను!ఆతిధేయ రాష్త్రంగా వుండి వాళ్ళిక్కడ ఉన్నంతకాలం మర్యాదగా వ్యవహరించి పదిమందితో మంచి అనిపించుకోవలసిన స్థానంలో ఉండి అతిధిని దొంగగా నిరూపించి అవమానించాలనుకోవటం యే రకమైన సంస్కారం?ఇదేనా తెలంగాణా సామాజికుల అతిధి మర్యాద!నువ్వు అధికారంలో ఉని ధీమాగా ఇంటికే పిలిపించుకుని బేరసారాలు చెయ్యటం డబ్బుకి లొంగాపోతే కేసుల్లో ఇరికిస్తానని బెదిరించటం నిస్సిగ్గుగా చేస్తూ,మాఫియా గూండాలు  వేరే ముఠాని పట్టించటానికి ఇక్కడ మాల్ ఉంది కలెక్ట్ చేసుకో రమ్మని పిలిచి పోలీసులకి ఉప్పందించిన తరహా నీచపు యెత్తుగడలు వెయ్యటం గొప్పగా చెప్పుకుంటున్నారే,కొంచెమయినా విచక్షణ లేదా?ఒక వ్యక్తి నన్ను ఆర్ధికంగా దెబ్బతియ్యాలంకుంటున్నాడు కేసీఆర్ అని పార్టీలో చెప్పుకుని సపోర్టు తీసుకుని గూడా కుదురుగా ఉండలేక దూకేశాదంటే అతని మీద యెంత ఒత్తిడి పెట్టి ఉండాలి?

          మరీ ముఖ్యంగా తెలంగాణా ఉద్యమలో ప్రముఖంగా కనిపించి నిజాయితీ గల ఉద్యమ కార్లుల మాటల ద్వారా పాటల ద్వారా ప్రతికక్షుల్ని కూడా మెప్పించగలిగిన ప్రాంతీయాభిమానాన్ని "ఇది నా అడ్డా ఇక్కడ నీ రుబాబు చెల్లదు" అని అమీరుపేట గూండా దిల్షుక్నగరు గూండాతో మాట్లాడే స్థాయికి దిగజారుస్తున్నాడు!దీన్ని నిజంగా అమీరుపేట గూండాలు ఆదర్శంగా తీసుకుని రేపోమాపో "అమీరుపేట రాష్ట్ర సమితి" యేర్పాటు చేస్తే యెట్లా ఉంటుంది?ఇక్కడ మాత్రం జోకు కాదు సూటిగానే అడుగుతున్నాను!మీ ముఖ్యమంత్రే ఇంకా లోపల ఆంధ్రోళ్ళ చెప్పులు నాకుతూ బైట వీధి గూండాల భాష మాట్లాడుతున్నాడు,మీకు నిజంగా దమ్ముంటే మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీ తెలంగాణ గౌరవం పేంచేలా కట్టడి చెయ్యండి.ఆంధ్రావాళ్ళు తెలివిగానే ఉన్నారు,వాళ్ళ గురించి కాదు రాష్ట్రం సాధించుకున్నాక ఇప్పటి మీ నిజమైన స్థితి యేంటో ఆలోచించుకోండి!ఇంకా మాకు మండాల్సినంతగా మండలేదు,మండితే మాత్రం సినిమా వాళ్లతో సహా పనికొచ్చేవాణ్ణి ఒక్కణ్ణి కూడా వదలం,హైదరాబాదులో ఉండకుండా ఖాళీ చెయించడానికి మీకు లాగ పన్నేండేళ్ళు తీసుకోం మాకు 12 నెలలు చాలు - ఖబడ్దార్!

ఆంధ్రా మిత్రులకి నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా - ఈసారి ఇట్లాంటిది జరిగితే మనం తగలెయ్యాల్సింది కేసీఆర్ దిష్టిబొమ్మల్ని కాదు,మనవాళ్లని సినిమా వాళ్లతో సహా ఆంధ్రాకి వచ్చెయ్యమని పిల్చి రానన్నవాళ్ళ దిష్టిబొమ్మల్ని తగలెయ్యాలి!

ఆంధ్రావాళ్ళు బెజవాడలో అరిస్తే గోల్కొండ ఖిలా దడదడ లాడాలి?!

82 comments:

  1. మన నాయుడిలో అంత ఆవేశం కనిపించడం లా. ఆంధ్రాకి వచ్చితీరాలాని ఆయన స్వంత ప్రభుత్వంలోని ఉద్యోగుల్నే ఒత్తిడి చెయ్యలేక సణుగుతూ గొణుగుతూ ఊరుకుండిపోయాడు. ఇహ తెలంగాణ నుంచి మకాం మారిస్తే తెలంగాణలో తమ సినిమాల్ని ఆడనిస్తారో లేదోనని వణుకుతున్న సినిమావాళ్ళనా? ఆ పరిశ్రమలో అందరూ ఆయనవాళ్ళే. అదీ గాక వాళ్ళమీద కేసీయార్ ఎంత ఆధారపడి ఉన్నాడో సీబీయన్నూ అంతే ఆధారపడి ఉన్నాడు.

    ఒక విషయంలో మాత్రం మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. "మనలో మరో సగం" అని మనం ఎవరి గురించి భావిస్తూ వచ్చామో వాళ్ళు ఆ ఫీలింగ్ కి ఎంతమాత్రం తగరు. అన్నిరకాలుగానూ తెంచుకుని disown చేయడమే మనకు మంచిది.

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడయినా ఆంధ్రాలో రేగిన అల్లర్లని చూసేరియాక్ట్ అయ్యాడు,లేకపోతే ఇంకా నత్తిమాటలు మాట్లాడుతూనే ఉండేవాడు.మీరన్నది నిజమే,తెలుగు జనాన్న్ని ఇక ప్రశాంతంగా ఉండనివ్వరు కేసీఆరూ వాడి చెంచాలూ.మనం కూడా మన సెంతిమెంట్లని తెంచుకోవాల్సిందే!

      Delete
  2. మీరు పిలుస్తే పెట్టుబడిదారులు తమ స్వలాభం మానేసి వచ్చేస్తారా? మీ ఇష్టం, అలానే అనుకోండి :)

    ReplyDelete
    Replies
    1. మీరన్నట్లు ఇప్పుడు రారులెండి జైగారూ! కానీ చచ్చినట్లు ఆంధ్రాకి వచ్చితీరాల్సిన సమయం ముంచుకొచ్చేస్తుంది 2021 తరువాత! "ఎందుకు ?" అని అడుగుతారా? అది నేనిప్పుడు చెప్పను. మీ కళ్ళతో మీరే చూస్తారు.

      Delete
    2. మహోజస్ గారూ, ఆంధ్రకు పెట్టుబడులు వస్తే నాకూ సంతోషమే. పెట్టుబడిదారులు తమ స్వలాభం కోసమే నిర్ణయాలు తీసుకుంటారని, అలా చేయడం ద్వారానే ఆర్ధిక వ్యవస్తకు పెరుగుదల ఉంటుంది. ఆంద్ర most desired destination అయితే దేశానికే మంచిది.

      I will be extremely pleased if Andhra (or any state for that matter) implements an integrated development model that attracts capital, talent & knowledge. This will foster a healthy competitive spirit that can propel India to its destiny.

      Delete
  3. అయ్యా....మాకు ఏ రాష్ట్రం వాళ్ళతో తగాదా రాదు... వచ్చినా మీ లాంటి వాళ్ళ సానుభూతి అక్కర లేదు.... ఒక పక్క క్రిస్టల్ క్లియర్ గా డబ్బులతో పట్టుబడితే దాని గురించి ఏమి లేదు.... రేవంత్ రెడ్డి ని డబ్బుల తో పంపిచింది కె. సి ఆర్ అంటారేమో రేపు.... ప్రతీ దానికి తెలంగాణ ప్రజలను కించపరిచే మీ బాష ను ఒక్క సారి సరి చేసుకోండీ.... బతుకమ్మ చుట్టూ గంతులు వేసినట్టు అనే మీ మాటల్లోనే ఎంత అవహేళన, కుళ్ళు దాగుందో తెలుస్తుంది.

    ReplyDelete
    Replies
    1. వచ్చాడు ఇంకో ముండ సన్నాసి నీతులు చెప్పనీకి. ఏరా కుక్క ఈ దొంగేడుపు ముష్టి సన్నాసి మీ దొర 'ఆంధ్రోల్లు' ని నానా 'కారు కూతలు' కూసినప్పుడు ఏడ పండినా. ఇప్పుడొచ్చి ఏడుపు షురూ జేసినావ్. కుక్క ఏడుపులు ఏడిస్తే మూతిపగులుద్ది.

      Delete
    2. ఈ మాట యెవరో ఒకరు కెలుకుతారని అనుకుంటూనే ఉన్నా,అది అంత తేలిక కాదు అని మామూలుగా చెప్పటం కూడా యెగతాళి కింద మార్చేసి నాకు అహంకారం అంటగట్టటం ఉద్యమలో చేసిందేగా!ఇంతకీ అక్కడ చెప్పిన చరిత్ర కన్నా ఇది బాగా యెక్కిందన్నమాట?

      Delete
    3. 1) బతుకమ్మ చుట్టూ గంతులు వేయరు..... దానికి ఒక రిధం వుంటుంది.... మీకు అది తెలియదు....
      2) అంతా తేలికగా జరిగే పని అని చెప్పటానికి బతుకమ్మ చుట్టూ గంతులే గుర్తుకు వచ్చాయా... సార్.... దానికి బదులు గా అట్ల తద్ది గా వుయ్యాల కట్టినట్లు అని రాసుకోలేకపోయారా.... మీరు ఆ వాక్యం రాసేటప్పుడు మీ మనసు లో ఏ ఉద్దేశం ఉందో ఆ హరి కే తెలవాలి.... మీ ఆత్మ సాక్షి కే తెలవాలి. దానికి సంజాయిషీ అక్కర లేదు..
      3) ఇక పోతే.... అనానమస్ లు పాపం చాలానే వున్నట్టు కనపడుతుంది.... పాపం ముందమోపి కుక్క అని ముందు తన పేరు రాసుకోకపోతే సొంత పేరుతో రాసుకోవచ్చు కదా..... ఇంతకు ముందు కూడా మోరిగారు కానీ పామేరియన్ అనుకుంటా.... పామేరియన్స్ కి కూడా పిచ్చి ఎక్కుతుందంట.. ఎందుకైనా మంచిది ఇంజక్షన్ చేయించండి... కనపడితే.... మీకు అయితే చెప్పగలం... కానీ కుక్కల తో మాట్లాడటానికి నాకు వాటి బాష రాదు కదా....

      Delete
    4. ఒరేయ్ ముండమోపి మీకే బాసలో చెప్తే గోస ఉంటదో మీ ముఖ్యమంత్రి దేశం మొత్తం దేశమంతా చెప్పేడుస్తున్నడులే ఇహ మూసుకుని పోకపోతే అచ్చం వాడు చెప్పినట్లే మూతి పగలగొట్టి మరీ చెప్తాం. ఆవులే నీకు మరీ వీదికుక్క బాసకద వచ్చెది. అది తెలుసులే ఇహ దొబ్బెయ్. మరిసిన జెప్పుడు పొయ్యి ఆ రిధం లో తిరుగుతూ ఉండు.

      Delete
    5. యెదటి వాళ్ళు మామూలుగా మాట్లాడినా మాట మాటకీ మీకు నచ్చిన అర్ధం పీక్కోవదం యేళ్ళ తరబడి చూస్తూనే ఉన్నాంగా!

      అనామకంగా రాసేవాటికి నా బాధ్యత లేదు,అయినా మరుసటి పోష్తు నుంచీ నా మామొలు పధ్ధతిలోనే ఐది తప్పనిసరి అవుతుంది.

      మీరూ మీ నేతా మమ్మల్ని బూతులు తిట్టినా తప్పు లేదు గానీ గంతులెయ్యడం అనే ఒక్క మాటే అంత ఇదవుతున్నారు,స్వాభిమానం మీకు మాత్రమే ఉండాలా?ఇది నేను యెప్పటినించో మీకు వేస్తున్న ప్రశ్నే కానీ దాన్న్ మాత్రం పట్టించుకోరు,యెందుకో తెలుసుకోవచ్చా?

      తెలంగాణ వాళ్లకి తప్ప ఆత్మాభిమానం ఉండకూడదా!

      Delete
  4. డబ్బులతో పట్టుబడడం తరవాత... తలసానిలాంటివాళ్ళు ఏకంగా మంత్రి పదవులతోనే పట్టుబడిపోయారు కదా! "నాకు డబ్బు కావాలి, ఇంటికి రా" అని అడిగినవాణ్ణీ, వాడి వెనకుండి కెమేరాలు బిగించి అడిగించినవాళ్ళ దిగజారుడుతనాన్నీ ప్రశ్నించకుండా వదిలేసి ఎవరినో దేనికో బాధ్యుల్ని చేస్తామంటే ఎలా? గతంలోని సుప్రీం కోర్టు తీర్పు దృష్ట్యా అసలు స్టింగ్ ఆపరేషన్లకున్న విలువేంటి? ఒక వేశ్య విటుణ్ణి కోరి పిలిపించుకుని తీరా అతనొచ్చాక కెమేరాలు బిగించి "నామీద మానభంగ ప్రయత్నం చేయబోయాడు" అని కేసు పెట్టినట్లు లేదూ? ఆయనెవరో బ్లాగులో రాసినట్లు "గేదె తనంతట తాను నా ఇంటికొచ్చి పాలిచ్చి వెళ్ళింది" అంటున్నారు.

    ReplyDelete
    Replies
    1. మీరు చెబుతున్నది రజత్ ప్రసాద్ కేసు గురించి. ఇందులో రాజకీయ ప్రత్యర్తికి లంచం ఇచ్చి ప్రైవేట్ స్టింగ్ వీడియో విడుదల చేసారు. దరిమిలా ఇద్దరూ సహచరులతో సహా కేసులో ఇరికారు.

      ప్రస్తుత స్టింగ్ విచారణా సంస్థలు జరపింది. ఫిర్యాదీ రేవంత్ తనకు లంచం ఇవ్వజూపుతున్నాడని అవినీతి నిరోధక సంస్థకు తెలిపాడు.

      ఇంతకీ సదరు తీర్పులో స్టింగ్ ఆపరేషన్లు చెల్లవని లేదు. స్టింగ్ ఫలితాలను పరిగణలో తీసుకునే ముందు కొన్ని విషయాలను పరిశీలించాలని మాత్రమె అంది. ఉ. మత్తుకు బానిస అయిన వ్యక్తికి డ్రగ్స్ ఇస్తామని ప్రలోభ పెట్టించి చేయించిన నేరం స్టింగు చెల్లదు.

      Delete
    2. ఈ ముండమోపి కుక్కకి దిలీప్ బానే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తునట్లున్నాడు :-)) అయ్యి తెచ్చి ఇక్కడ కాపీ, పేస్టు జాబు చేస్తాన్నాడు ఈ సన్నాసి. ఒరే ముండమోపి సన్నాసి ఇంకేం మరి వెళ్లి బాబు మీద కేసు బుక్ చేసి జైల్లోకి తోయక ఇక్కడ కుక్కలాగా మొరుగుతున్నావె. అవ్ లే లోపల లోపల భయం ఆ రేవంత్ ని గట్టిగ్గా కెలికితే మన కయితక్క యావ్వరం ఫోటోలు ఏడ బయటకోస్తాయో అని. దొరగారి ఈ పెంపుడు జీవాలు భలే మెరుగుతుంటాయి .

      అవ్ గానీ ఇంతకీ నువ్వు మగనా, ఆడనా , లేకపోతె ఆ ఇంకోటా? ఆ ఇంకో వాటికోసం దొర desparate ఎదురుస్తున్నాడు అంటగా రోడ్ మీద కనపడినొల్లనందరిని నువ్వేంది నువ్వేంది అని. పక్కన నిన్ను పెట్టుకొని మళ్ళీ అంత ఆరాటం ఏందీ దొరకి?

      Delete
    3. @Anonymous14 June 2015 at 06:49
      రేవంత్ ని గట్టిగ్గా కెలికితే మన కయితక్క యావ్వరం ఫోటోలు
      ?
      ఈ కవిత ఫొటోల గొదవేమిటి?అప్పట్లో ఒక గాలివార్తలా కొద్దిగానే తెలిసింది!విస్తారంగా తెలుసుకోవాలని యేం లేదు గానీ అస్సలు తెలీదు గదా కంచెమయినా తెలుసుకుందామని ఉంది,చెప్తారా?

      Delete
    4. వాళ్ళిద్దరూ పాత దోస్తులు. అక్కయ్య గారు ముందు ఈ కేసు పెట్టటానికి ఒప్పుకోలేదు. ఇక అందరికీ తెలిసిందేగా ఆయల్టి నుంచి అదే పాట A1 గా చంద్రబాబుని పెట్టాలో అంటూ అసలు సంగతి వదిలెసి. మాములుగా అయితే ఈ పాటికి రచ్చ రచ్చ చేసేది అక్కాయి.
      మీరు మాత్రం ఈ ఇద్దరు చెంచాలతో జాగ్రత, ఇయ్యి మామూలు చెంచాలు కాదు. ఈడకి ఆడకి మెసెంజర్ డ్యూటీ చేసే చెంచాలు.

      Delete
  5. నాకు సీమాంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర ప్రదేశ్ కు తరలివస్తారని నమ్మకం లేదండి. బాబు తెలంగాణా ని వదిలి ఎంత త్వరగా వస్తే అంత మంచిది. అక్కడ తెదేపా ని కాపాడుకొనే ప్రయత్నంలో ఆంధ్రకి అన్యాయం చేస్తున్నాడు. కచరా

    "ఆంధ్ర మిత్రులకి నేను ఒక్కటే చెప్పదలచుకున్నా...దిష్టిబొమ్మల్ని తగలెయ్యాలి"

    అలాచేసిన మనవాళ్ళకి సిగ్గురాదు. దున్నపోతుమీద వర్షం కురిసినట్టే!

    ReplyDelete
    Replies
    1. కాలం దారి చూపిస్తే నాయకులు ఫెయిలయినా ప్రజల్లో ఉద్రేకం తప్పకుండా వస్తుంది.ఒకసారి పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి నుంచి ఆంధ్ర ప్రజలు నాయకులతో సంబంధం లేకుండా చారిత్రక సన్నివేశాల్ని సృష్టించిన కధలన్నీ గుర్తుకు తెచ్చుకోండి!

      Delete
  6. 1. ఆంధ్రా వారికి రాజకీయ నాయకులే కాదు, కవులు రచయితలు, సీనియర్ జర్నలిస్ట్ లు కూడా అన్యాయం చేస్తున్నారు. వీరు ఆంధ్రా తరపున వాదన వినిపించటం లో విఫలమైనారు. తెలంగణా వారికి అది లోకువై పోయింది. ముందర పేపర్లో, టివి లో సుద్దులు చెప్పే ఆంధ్రా మీడీయా వారిని ప్రజలు బ్లాగులో, సోషల్ మీడీయాలో నిలదీయాలి. తెలంగాణ వారు ఆంధ్రావారిని అవమానిస్తూంటే అది రాజకీయ నాయకులకు మాతం వర్తిస్తుందన్నట్టు, వారికి వర్తించదన్నట్లు హైదరాబాద్ లో కుచొని సొల్లు విశ్లేషనలు చేస్తూంటారు. వీళ్లు ఆంధ్రా తెలంగాణ అంశాన్ని కె.సి.ఆర్. వర్సెస్ బాబు అంశంగా మార్చేశారు.

    2. రాష్ట్రం విడిపోయిన తరువాత, ఆంధ్రావారికి తెలంగాణ సంగతులు ఎందుకు? కె.సి.ఆర్. ఎవరి కాళ్ల పై పడి దండం పెడితే ఆంధ్రావారికి కెందుకు? ప్రతివారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంతృలపై రాధకృష్ణ చీప్ విశ్లేషణలు చేయటం ఆపితే బాగుంట్టుంది.

    3. బాబు గారు రోజు కెసీఅర్ చేత తిట్లు తినటం ఆయనకు అలవాటైందేమోగాని, ఆంధ్రా వారికి చిర్రెత్తుతున్నాది. ఆయనతెలంగాణ కదలకపోతే, ఆయనని కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలోకి నెట్టి సీమాంధ్రులు వేరే వారిని గెలిపిస్తే బాగుంట్టుంది.

    ReplyDelete
    Replies
    1. మంచి మాట చెప్పారు. అసలు ఆంధ్ర కు అన్యాయం జరిగింది ఈ కుహనా సమవాదుల వల్లే! హైదరాబాద్ లో ఉంటూ, ఏ మాట అంటే ఎవడు కొడతాడో అన్న భయం తో వెధవ విశ్లేషణలు చేస్తున్నారు.దరిద్రులు!

      Delete
    2. రివర్స్ ఓపెన్ హార్ట్ చూశాను,అప్పటి దాకా మోహన్ బాబు పెద్ద గొడవగాడు అని అనుకోవటమే గానీ అక్కడ మాత్రం నాకు బాగా నచ్చాడు!రామారావుని విషప్రచారంతో పడగొట్టటంలో బాబుకి చాలా గొప్పగా సహకరించాదని స్పష్టంగా దొరికిపోయాడు.రామారవు బొట్టు యెట్లా పెడితే వీడి కెందుకు?తెలంగాణా ఉద్యమాన్ని కూడా తెలంగాణా అంతటా మహోద్రేకం పుట్టేసింది,ప్రజలు ఉర్రూత లూగిపోతున్నారు అని రాసింది తను కాదా?యే ముఖ్యమంత్రీ తనపైన మరొకడు పెత్తనం చెయ్యడాన్ని సహించడు గబట్టి అప్పట్లో అధికారంలో ఉన్నవాళ్ళు తను కోరుకున్న రాజగురువు స్థానం ఇవ్వకపోయేసరైకి రాష్ట్రాన్ని విదగొట్టగలిగీతే "అరే ఒరే" అని పిలుచుకునే సాన్నిహిత్యం ఉన్న కేసీఆర్ యేదో పగల్దీస్తాడని ఎక్స్పెక్ట్ చేశాడు,అది కుదరకపోయేసరికి ఇట్లా ప్రజాస్వామ్య పరిరక్షక మీడియా వతారం యెత్తాడు!

      కానీ ఒక క్లూ మాత్రం వొదిలాడు నేను ముందు నుంచీ అనుకుంటున్నదే - ఈ ఎపిసోడ్ వల్ల పాత స్నేహితులైన ఇద్దరు చంద్రులూ ఒక్కలాగే లాభపడ్డారు!ఓటుకు నోటు విషయంలో హీరోయిజం నచ్చేసి ఈ యేడాదిలో పెర్ఫామన్సు చూస్తే అధ్భుతంగా లేకపోయినా విమర్శించడానికి బదులు ప్రశంసలు కురిపించేస్తున్నారు,అక్కడ ఆంధ్రాలో కూడా బాబు పెర్ఫామెన్సు గురించిన విమర్సల స్థానంలో కేసీఆర్ దిష్తిబొమ్మల్ని తగలబెడుతూ బాబుకి సపోర్తుగా నిలబడ్డారు,బాబు కూడా టెలిఫోను ట్యాపింగ్ ఏరుతో తను రెచ్చిపోతున్నాడు!

      యెదవలయింది తప్పనిసరై వీళ్ళని సమర్ధించాలసిన దౌర్భాగ్యం పట్టిన మనం!?

      Delete
  7. చంద్రబాబు హైదరాబాదు వదిలేసి విజయవాడో, గుంటూరో వచ్చి స్థిరపడితే, ఉద్యోగులు మేమింకా హైదరాబాదులోనే వుంటాం అనే ధైర్యం చేస్తారా? ఆయనకే వదలడం ఇష్టం లేదు, పాత ఇల్లు పడగొట్టి, కోట్లు వృధా చేసి అద్దె ఇల్లు, దానికి సెక్యూరిటీ అంటూ అలాంటి పనులు చేస్తుంటే ఎటువంటి సిగ్నల్స్ వెళతాయి అంధ్రకి రావాలనుకునే వాళ్లకి? మన బంగారం మంచిదైతే

    ReplyDelete
  8. తెలంగాణలో తెలంగాణేతరుల నైతిక నియమాలు చెల్లవు!తెలంగాణ అంతా కేసీఆర్ అడ్డా!అది ఆయన పబ్లీకున నినదభీషణ సంఖము దేవదత్తమే అన్నంత ధీమాగా చెప్పేశాడు,ఆయన అభిమానులు చప్పట్లు కొట్టేశారు,మిగతా వారి నుంచి యే వ్యతిరేకతా రాలేదు కాబట్టి మౌనం అర్ధాంగీకారం అన్న నీతి ప్రకారం విశాల తెలంగాణ సమాజం కూడా ఆ సుభాషితాన్ని ఒప్పేసుకున్నారు!
    ఇంక అడ్డేమిటి?అడ్డులేని ఆ రాచరికంలో రాజు పాటించిందే న్యాయాం,రాజు చెప్పిందే ధర్మ,రాజు మాట్లాడిందే సత్యం!
    రాజు చారచక్షువు అని తెలుసుకోని వాళ్లే ఫోనుట్యాపింగ్ అక్రమం అని వాదిస్తారు!
    రాజు దండధరుదై సమవర్తిలాగ పాలిస్తేనే ప్రజలు ధర్మానువర్తు లవుతారు అనే సూత్రం తెలియని వాడే రేవంతుని శిక్షించడాన్ని విమర్శిస్తారు!
    రాజు రత్నాకరుదని యెరుగని అర్భకులే ఆకర్షతంత్రాన్ని అవహేళన చేస్తారు!
    మీరు అపర మాంధాత పరిపలనలో ఉన్నారురా శుంఠలారా గర్వించకుండా యెందుకీ వ్యర్ధ ప్రేలాపనలు?!
    యెక్వ మాట్లాడితె బొక్క లిరగదీస్తం,సంఝే?

    ReplyDelete
  9. There is a lot of difference in Hyderabad after one year which are given below.

    1) It is estimated around one lakh people migrated from Hyderabad and expects (As Vijayawada real estate rates are high so less migration) more if AP Capital work starts.
    2) Daily tourist/visitors are minimized - Hyderabad is a not capital of Big state and become half.
    3) Govt. officers are unhappy that they are not getting as much as earlier (For example: Promotion, transfer etc.., Employees are ready for 3/4 hours journey instead of big bribe as all most all districts are nearer to Hyderabad, Except Adilabad).
    3) Autowala cries he is not earning as much as previous time (Andhra people comes from long distance and pay whatever Autowala demands).
    4) Osmania, NIMS (Big) Govt. Hospital staff - nurse, peon, etc., situation is also same - Rayala Seema & South Coastal people prefering Bengalore or Chennai - Vizag situation is different and good demand for Hospitals (from Orissa, Chatisgarh).
    5) Small vendors - vegetable/flower/fruits etc., are unhappy.
    6) The situation become even difficult for venodors as Telangana state implements state entry tax (AP people are happy that rates reduced) - last year coconut rate is
    Rs. 15/- but now Rs. 20/-.
    7) Earlier in Peak times it takes two hours to travel from KPHB Colony to Koti/Abids/MGM Bus stand but now one/one and half hour(Due to metro work - half an hour extra time) only.
    8) Koti, Abids markets situation is not good (less Customers).
    9) Ordinary persons whom are staying in Hyderabad/its surroundings are happy as Rent rate's slashed and Real Estate down.
    10) This is the main reason that "Yadadri/ Yadagiri Gutta" project announced, Tankbund beautification, Change of Govt. buildings from old town to new places etc., - so that real estate rates will rise!

    ReplyDelete
  10. ఇది వరకు, చంద్రబాబు ఇమ్మీడియట్ గా విజయవాడకో లేక ఆంధ్రాలోని మరో ప్రాంతానికో వచ్చేసి అక్కడ టెంట్లు వేసుకుని అయినా సరే పాలించాలని భావించేవాడిని. అసలు హైదరాబాదును బాబు ఎంత త్వరగా వదిలేసి వస్తే అంగ గౌరవమని ఫీలయ్యే వాడిని. కానీ, ఇప్పుడు మాత్రం అలా అనుకోవడం లేదు. బాబు హైదరాబాదునుండే పరిపాలించాలి. మన పోలీసులను అక్కడికి తీసుకెల్లాలి, మన పోలీసు స్టేషన్లు అక్కడా ఏర్పాటు చేయాలి. 10 సవత్సరాల ఉమ్మడి రాజధాని, 10 వ సంవత్సరం చివరి రోజు రాత్రి 11:59 వరకూ అక్కడి నుండే పరిపాలన జరగాలి. చూద్దాం ఏమవుతుందో..! ఎన్ని కేసులు పెట్టుకుంటారో అనిపిస్తోంది. అదేదో సెక్షన్ 8ఎ అంటగా అది కూడా అమలు జరిగాలి, ఈ మిగిలిన 9యేల్లు.

    ReplyDelete
    Replies
    1. నిజమే,పోతుగాడిలాగా దడిపిస్తే దడుచుకుంటారని అనుకుంటున్నారు చెత్త వెధవలు!తెగేదాక లాగితే తన పుట్టీ మునుగుతుందని తెలియడం లేదు కోతికి దొరికిన కొబ్బరిచిప్ప లాంటి అధికారం మత్తులో.ఈ సంవత్సరం పేర్ఫామన్సు పైకి పర్లేదని వచ్చినా యే కేంద్రం నుంచి ఆర్తికిల్ మూడు ద్వారా తెచ్చుకున్నామనై విర్రవీగుతున్నాడో ఆ కేంద్రమే ఇప్పుదు రద్దు చేసి పారేసి యెన్నికలు పెడితే మొన్నొచ్చిన సీట్లు గూడా రావు,ఇంకా ప్రజలు రాష్ట్రం తెచ్చిన నాటి సంబురాల్లోనే వుంటారా?

      రెండు రాష్ట్రాల్లోనూ తెదెపాయే వచ్చి పరిపాలన పరంగా చిక్కులు వస్తున్నాయని చెప్పి రెండు అసెంబ్ల్లీల లో యేకగ్రీవ తీర్మానం ద్వారా మళ్ళీ కలిపేస్తే సరి?!

      Delete
    2. శుక్రాచార్య గారూ, ఆంద్ర ప్రభుత్వం తెలంగాణాలో పోలీసు స్టేషన్లు పెట్టడం నేరం. హొమ్ (ముఖ్య?) మంత్రి నుండి మొదలు పెడితే కాన్స్టేబుల్ వరకు అందరూ జైల్లోకి పోతారు. చంద్రబాబు కక్షకు పాపం వాళ్ళను ఎందుకు బాధ పెట్టాలి?

      Delete
    3. తెలంగాణా హోం మినిస్టర్ నేనా జైలుకు పోతాడని కోస్తున్నవ్. అందుకే గామాలు బదులు పట్టుకున్నాయి పాపం.

      Delete
    4. Jai Gottimukkala గారూ,

      పోలీస్ స్టేషన్లు పెట్టడం నేరం అయితే వదిలేయడమే. నేరం కాకపోతే, పెట్టడమే. నేను చెప్పాలనుకున్నది చట్టానికి వ్యతిరేకంగా వెల్లి నేరం చేయమనికాదు. అవకాశం ఉన్న ప్రతీ ఒక్కటీ నిర్మొహమాటంగా చేయమని. ఇది వరకంటే మా సీయం సారు, రెండు కళ్ళ సిద్దాంతం అని తెలంగాణాలొ టీ.డీ.పీ ప్రయోజనాలకు భంగం కలగకూడదు అని చాలా త్యాగేల్చేసేశారు. బూతులు తిట్టినా గమ్మునున్నారు. 8ఏ గురించి అస్సలు మాట్లాడేవారు కాదు. కొండొకచో, ఆంధ్రా ప్రయోజనాలను కూడా కొన్నింటిని తాకట్టు పెడుతున్నారన్న అపవాడును కూడా మూట కట్టుకున్నారు.

      మరిప్పుడు, ఏకంగా పోలీసులను పిలిపించుకోవడాలూ, పోలీసు స్టేషన్లు పెట్టడాలూ అంటున్నారు. సెక్షన్ 8ఏ గురించి గట్టిగా పట్టుపడుతున్నారు. మొన్నేదో సభ జరిగింది, మహా సంకల్ప సభ అనుకుంటా.. మా సీయం సారు, ఆవేశముతో శివతాండవమే చేశారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి తప్ప ఎవ్వరూ తెలంగాణా రాజకీయ నాయకుల మాటలకు దీటుగా సమాధాన మిచ్చిన పాపాన పోలేదు. ఇప్పుడు అందరూ కట్ట కట్టుకొని విరుచుకు పడుతున్నారు. కానీ, ఇది వరకు వీళ్ళీలా లేరు. ఎక్కడ ఏచిన్న మాట మాట్లాడితే .. దాన్ని సాకుగా చూపి ప్రత్యర్ధులు తెలంగాణా వ్యతిరేకి అంటూ ప్రచారం చేసేసి గొడవ చేస్తారో అని జంకుతూ వచ్చారు. ఇప్పుడు అవేమీ లేవు. ఇది ఇలానే కంటిన్యూ కావాలన్నది నా ఉద్దేశ్యం. తెలంగాణాలో టీ.డీ.పీ రావాలని అనుకుంటే, ఇక్కడ ఆంధ్రాలో బాగా పరిపాలించి, మాకు అధికారం వస్తే ఇక్కడకూడా ఇలానే పాలిస్తాం అని చెప్పుకోవడం మరేమీ చేయాల్సిన అవసరం లేదు. వస్తే వస్తుంది, లేదంటే లేదు. అంతే.

      Delete
    5. శుక్రాచార్య గారూ, ప్రభుత్వమే నేరాలకు పూనుకోవద్దన్న వాదనకు అంగీకరించినందుకు థాంక్సండీ.

      టీడీపీ పార్టీ "రెండు కళ్ళ సిద్దాంతం" కొద్దో గొప్పో ఇబ్బందులు కలిగించిన మాట వాస్తవమే. అయితే అపర చాణుక్యులయిన బాబు గారు వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు మాటలతో (అనగా రెండు నాలుకలతో) బాగానే మానేజ్ చేసారనే నాకు అనిపిస్తుంది.

      అవకాశం ఉన్నవన్నీ చంద్రబాబు చేయలేదు అనుకోవడం సరి కాదేమో? ఎంసెట్, పీపీఎలు, రవాణా పన్ను వగైరాలు మీకు గుర్తుండే ఉంటాయి. వాటిలో కొన్నిటిని కోర్టు కొట్టేసింది కానీ అది వేరే విషయం.

      టీడీపీకి ఉన్న ఈ బాధ వైకాపకు లేదు. చంద్రబాబు ఆంద్ర ప్రయోజనాలను త్యాగం చేసారన్న వాదన జగన్ ప్రచారంలో భాగమేమో?

      ప్రస్తుతం టీడీపీ చేస్తున్న శివతాండవం కారణం ఏమిటో స్పష్టంగానే ఉంది. వ్యక్తిగత/రాజకీయ ప్రమాదం వచ్చినప్పుడు చూపిన దూకుడు స్థాయి ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో కూడా చూపిస్తారని నేను అనుకోవడం లేదు. అలా చూపిస్తే మంచిదే.

      PS: సెక్షన్ 8 కోర్టులు కొట్టేయడం ఖాయం. దాన్ని నమ్ముకోవడం కుక్క తోక పట్టి గోదారి దాటాలనే ప్రయత్నంతో సమానం.

      Delete
    6. Jai Gottimukkala గారూ,
      ప్రస్తుతం, ఈ మీడియా యుగములో, వేర్వేరు మాటలు మాట్లాడినా చెల్లవు కదండీ. అవకాశం ఉన్నవన్నీ చంద్రబాబు చేయలేదు. లేకపోతే, గొడవలు అనేవి ఆంధ్రా వారికి కేటాయించిన ప్రదేశాన్ని, భవనాలను ఎవరు క్లీన్ చేయాలి (సెక్రటేరియట్లో అనుకుంటా) అన్న చిన్న చిన్న విషయాలనుండి కూడా వస్తూనే ఉన్నా .. మా సీయం గారు గట్టిగా రియాక్టయిన సందర్భాలు బహు తక్కువ. విధ్యుత్ పి.పి.యేలపై గొడవలు, ఒకదాని తరువాత ఒకటిగా అఫెన్సివ్ స్ట్రాటజీతో అటుపక్కవారు పోతున్నప్పుడు తప్పని సరి పరిస్థితుల్లో, చేసినవే అని గుర్తించుకోవాలి. ఇక కోర్టులు మొటిక్కాయలు వేయడం విషయానికి వస్తే, ఒకటీ అరా బాబుగారికి పడుండొచ్చేమో కానీ, అటువైపు మాత్రం తల బొప్పి కట్టేటన్ని మొటిక్కాయలు పడ్డాయని మీకు తెలిసే ఉంటుంది.

      చంద్రబాబు ఆంధ్రా ప్రయోజనాలను త్యాగం చేస్తున్నారన్న బాధని నేను ఏకంగా టీ.డీ.పీ వీరాభిమానులనుంఛే విన్నా. జగన్ అయినా, ఉన్న వాటిని చూపించి విమర్శించగలరే కానీ లేని వాటిని చూపించి మభ్యపెట్టలేడు. అది అసాధ్యం.

      ప్రస్తుత శివతాండానికి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు ముక్యమన్నది నిజమే. కాకపోతే, చరిత్రను గమనిస్తే, చాలా విషయాలు మొదట వ్యక్తిగత అంశాలతో మొదలయ్యి, తరువాత కామన్ ఇంటెరెస్టు ఉన్నవారితో కలిసి ఉధ్యమములా ముందుకు వెల్లడం గమనించవచ్చు. ఎక్కడిదాకానో ఎందుకు, చంద్రబాబు నాయుడు, ఒకప్పుడు ఓ పెద్దాయనకు మంత్రి పదవి ఉచ్చి ఉండుంటే, ఒక పార్టీ ఆవిర్భవించేది కాదు, ఒక రాష్ట్రం ఏర్పడేది కాదు. అప్పట్లో అది వ్యక్తిగతమే కదా. దానికి తోడు అప్పట్లో ఆ పార్టీ పెట్టినాయన కూడా ప్రత్యేక తెలంగాణా అవసరం లేదని చెప్పాడని విన్నా. మంత్రి పదవి రాకపోయే సరికి, ప్రత్యేక తెలంగాణా గుర్తుకొచ్చింది. కోయీ దూధ్ కా ధూలా నహీన్ హోత హై. So, this is quite common.

      సెక్షన్ 8ఎ గురించి తీసుకుంటే, దాన్ని కోర్టులు కొట్టేయొచ్చు, ఉంచొచ్చు. అది కోర్టుకెలితేనే తెలుస్తుంది. ఒక వేల కొట్టేసినా, చట్టం చేయడానికి, సవరణలు చేయడానికి పార్లమెంటు ఉంది. ఒకప్పుడు అంటే, మేము నాయకులు అని నమ్ముకున్న వాల్లు, సీక్రెటుగా కుమ్మక్కయ్యారో లేక అధిష్టానానికి భయపడ్డారో, మమ్మల్ని ముంచేసారు. నిజానికి విభజన చట్టం పార్లమెంటులో పెట్టినప్పుడు, ఆంధ్రా రాజకీయ అనాధగా మారిపోయింది. మమ్మల్ని పాలిస్తున్న పార్టీయే మేము అక్కర్లేదనుకొని మా గొంతు కోసింది. దానివల్లే ఇలాంటి అడ్డగోలు చట్టం వచ్చింది. కానీ, ఇప్పుడు అలా కాదు. ఆంధ్రా కోస్మ పోరాడాల్సి వస్తే.. ఎంత దూరమైనా పోగల పార్టి ఉంది. ప్రసుతం ఆ పార్టీ అధినేతకు రెండు కళ్ళ సిద్దాంతం మీద మోజు కూడా పోయింది.

      If a law is unjust, a man is not only right to disobey it, he is obligated to do so అన్నడో పెద్దాయన. మేము మాత్రం చట్టాన్ని తుంగలో తొక్కకుండా, అది మార్చడానికి సర్వశక్తులూ ఒడ్డి పోరాడతామని చెబుతున్నాం. దానికి కావలసింది మంచి నాయకత్వం. మాకు ఉన్నవాడు మంచి నాయకుడే కానీ, రెండు కళ్ళ సిద్దాంతముతో వెనకడుగు వేస్తున్నవాడు. ప్రస్తుతం, ఆయన్ను మీరు ఎంత రెచ్చ గొడితే అంతగా ఆయన పోరాడడానికి ముందుకు వస్తాడు. సో, రెచ్చగొట్టండి. ఇంకా రెచ్చగొట్టండి, ఆయన "అయితే ఆత్మకూరు లేకపోతే బండి ఆత్మకూరు" అని డిసైడ్ అయ్యేంతగా రెచ్చగొట్టండి.

      Delete
    7. ఈ గొట్టిముక్కల అనే ముష్టి కుక్క ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలు , ఏమి నమ్మాలి అని నీతులు చెబుతుంది, అక్కడ మాత్రం పక్క రాష్ట్రం నేల, సొమ్ము కూడా మాదే అనే వాగే గజ్జిగాడికి సపోర్ట్ చేస్తూ ఉన్నవి ఉన్నవి లేనివి తెచ్చి మరీ సపోర్ట్ చేస్తది. తూ అసలు సిగ్గనేదే ఉండదనుకుంటా ఈ ముదనష్టపు గుంపుకి.

      Delete
    8. గొట్టి ముక్కల గానీ, అనానిమస్ లు గానీ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఆంధ్ర పోలీస్ స్టేషన్లు పెట్టాలనుకుంటున్నది తెలంగాణా రాష్ట్రంలో కాదు. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో. అసలైన ఈ విషయాన్ని వదిలేసి తెలంగాణాలో పోలీస్ స్టేషన్లు పెట్టడం నేరం అని, కాదు అని వాదించుకుంటున్నారు. ఉమ్మడి రాజధానిలో తెలంగాణ ప్రభుత్వానికి హక్కులు ఉన్నట్లే ఆంధ్ర ప్రభుత్వానికి కూడా హక్కులు ఉన్నాయని గుర్తుంచుకోండి. ఆ హక్కుల మేరకే పోలీసు స్టేషన్లు పెట్టుకుంటామని అంటున్నారు.

      Delete
    9. @Anonymous13 July 2015 at 03:57:

      తెలంగాణా ఆవిర్భావ చట్టం సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్ నగరం మీద ఆంద్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కులు లేవని కోర్టు తేల్చేసింది.

      "On a fair reading of Section 5 of Act, 2014, as correctly contended by the learned A.G. for the State of Telangana, the State of Andhra Pradesh is a mere user of the city of Hyderabad for a maximum period of ten years. It has no proprietary right, title and interest in this city"

      Delete
  11. శుక్రాచార్య గారు,

    నా మనసులో ఉన్నదాన్ని సరిగ్గా చెప్పారండి. నాకు కూడా మొదట్లో అలాగే ఉండేది. ఈ ఫోన్ టాపింగ్ విషయం తర్వాత నా నిర్ణయం పూర్తిగా మార్చుకున్నా. 10 యేళ్ళ వరకూ మనకూ, తెలంగాణా వారికి హైదరాబాద్ మీద ఉమ్మడి అధికారాలు ఉన్నాయి. భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణా లో ఉంది కనుక యే ప్రభుత్వమూ అతిగా ప్రవర్తించకుండా గవర్నర్ కు అధికారాన్ని దఖలు పరిచారు. మన దరిద్రం ఏమిటంటే ఈ విషయాన్ని బాబు తెతెదేపా పై తెలంగాణా లో వ్యతిరేకత వస్తుందేమోనని పట్టించుకోలేదు. ఇప్పటికి కళ్ళు తెరిచాడు, మంచే జరిగిందిలెండి. అప్పుడు పార్లమెంట్ లో సరిగా చర్చ జరగకుండా విభజన బిల్లు ఆమోదించారు, యిప్పుడు యిరువురూ అనుభవించాల్సిందే!

    ReplyDelete
    Replies
    1. సత్తిబాబు గారూ, ఆంధ్రకు హైదరాబాద్ మీద ఎన్ని హక్కులు ఉన్నాయో అన్నది హైకోర్టు తేల్చేసింది:

      "On a fair reading of Section 5 of Act, 2014, as correctly contended by the learned A.G. for the State of Telangana, the State of Andhra Pradesh is a mere user of the city of Hyderabad for a maximum period of ten years. It has no proprietary right, title and interest in this city"

      Delete
    2. ఇగ చాల్ తియ్ గొట్టిముక్కల నువ్వు నీ దిక్కుమాలిన పెచారాలు. దొంగ ఉత్తరాలు, దొంగ ఏడుపులు, దొంగ ఉద్దేమాలు ఇవి మీ బతుకులు. ఆ హోం మినిస్టర్ అడ్డదిడ్డమైన వాగుడు వాగుతున్నందుకు నీకు నాలుగు తగిలిస్తే సరి. కడుపు బెజారయ్యి కుయ్యో మోయ్యో మంటూ హాస్పిటల్ లో జెరుదువు.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. @jai
      "the State of Andhra Pradesh is a mere user of the city of Hyderabad for a maximum period of ten year",

      ఈ వాక్యము యొక్క అర్ధము పదేళ్ళ వరకూ శుబ్బరంగా వాడుకోవచ్చును అని స్పష్తంగా చెప్తుంది,ఒక పదిసార్లు అర్ధం చేసుకుంటూ కూదబలుక్క్కుంతూ కాంపోజిషను రాయండి!"mere" అనే మాతని మీరు లాగి, పట్టి,గుంజి.పిసికి చెప్పినా దాని అర్ధం కూడా శాశ్వతముగా హక్కు లేకపోయినా ఉపయోగించుకోవదానికి అధికారం ఉంది అనై దబాయించి చెప్తున్నది,జర సోంచాయించు.టెక్నికల్ భాష అర్ధం కానంత పుచ్చొంకాయలం కాదులే మేము,పదేళ్ల పాటు అక్కణ్ణించి కదలదం అనేది జరగదు,అంతే!

      Delete
    5. @Haribabu Suranenii:

      FYVKI the text in quotes from the court judgment :)

      Delete
  12. అందుకే నేను ముందునుంచే తెలంగాణలో ఉండాలంటే కేసీఆర్ లాంతివాడితో వ్యవహరించాలంటే ఎఫెన్సివ్ స్ట్రాటజీ తప్ప డిఫెన్సివ్ స్ట్రాటజీ పని చెయ్యదని మూత్తుకుంటున్నది!

    ఉద్యమవార్తలు మీడియా సహాయంతో యెంత ప్రచారం చేసినా విశాల తెలంగాణ ప్రజానీకం ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వ్వలేదని అప్పడు జరిగిన ప్రతి యెన్నికలోనూ స్పష్టంగా కనబడింది!అదుకే గతిలేని పరిస్థితిలోనే ఆర్టికిల్ 3 ద్వారా కేంద్రం నుంచి విడగొట్టించుకోవాలనే మాస్టర్ ప్లాను రంగంలోకి వచ్చింది.రాష్ట్ర సాధన అనే అధ్భుతకార్యం చేసిన తర్వాత ప్రభుత్వం యేర్పాటుకి కూడా బొటాబొటి మెజార్టీ ఇచ్చారు!

    అలాంటి పరిస్థితుల్లో వివేకం గలవాడు యేమి చేస్తాడు?ప్రజలకి మంచి చేసి చూపించి ఇన్నాళ్ళూ తను వూదరగొట్టిన ఆంధ్రాదోపిడీ నుంచి విముక్తం చెయ్యటం అనే మహత్కార్యాన్ని నిజాయితీగా చేస్తూ అవినీతికి తావులేకుండా పరిపాలిస్తే ఈ సంవత్సర కాలంలో నిజంగానే తెదెపాని నామరూపాలు లేకుండా చెయ్యగలిగేవాడు!

    "కన్నులందు మదము పొరలు గమ్మి కానవు గాని నిరుడు మొన్న దగ్ధులైనవారు నిన్ను మించినవార్రు గారో?" అన్న వేమన్న వాక్యం అంత సాహిత్యాభినివేసం ఉన్న వ్యక్తికి గుర్తు రానంతగా అహంకారం బలిసిపోయింది.దుర్యోధనుణ్ణి "నేనున్నాను అర్జునుణ్ణి గెలవటానికి నీకేంటి?" అని తన దురద తీర్చుకోవడానికి గాలికొట్టి నాశనం చేసిన కర్ణులు పదివేవురై విజృంభించి ఈ దారిలో తనని నడిపించారు!

    కత్తిని మిగటానికి కత్తి మాతరమె సరిపోతుంది!

    ReplyDelete
    Replies
    1. క్రొత్త బిచ్చగాడు ప్రొద్దెరగడన్నట్లుగా దూకుడుగా వెళ్ళాడు! ఇప్పుడు ఆ టాపింగ్ ఆధారాలతో సహా బయట పడితే అప్పుడు మహరంజు గా ఉంటుంది.

      Delete
  13. @శుక్రా చార్య:

    వ్యతిరేక తీర్పులు & strictures ("మొట్టి కాయలు" పదం సరి కాదనుకుంటా) రెండు వైపులా వచ్చాయి కానీ నాకు తెలిసి అవేవీ తెలంగాణా ప్రయోజనాలకు భంగం చేయలేదు. ఉ. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం కొట్టేస్తే ఆ ఆరుగురు వ్యక్తులకు & వారి పార్టీకి నష్టం కానీ నాకేమీ ఫరక్ పడదు.

    చంద్రబాబు కేసీయారుకు మంత్రి పదవి ఇవ్వనందుకు ఏర్పడింది అనుకోవడం కాంగ్రెస్ ఎన్టీయారుకు రాజ్యసభ ఇవ్వనందుకు టీడీపీ ఆవిర్భవించిందని అనడంతో సమానం. రెంటికీ చారిత్రిక నేపధ్యాలు ఉన్నాయని & దీనికి వ్యక్తిగత విషయాలను ఆపాదించలేమని నా అభిప్రాయం.

    The Thomas Jefferson quote you cite is from the American independence struggle. Not sure how it is relevant to democratic India especially when the subject (equality of states) is a cornerstone of our system.

    సెక్షన్ 8 ఎందుకు చెల్లదో రేపో మర్నాడో నా బ్లాగులో టపా వేస్తాను. ఈలోపల కుదిరితే అసెంబ్లీలో చర్చ సమయంలో లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ్ ప్రతిపాదించిన సవరణ చూడండి.

    చంద్రబాబు సర్వైవల్ నైపుణ్యత చాలా గొప్పది. ఆగస్ట్ సంక్షోభం ("వెన్నుపోటు") దరిమిలా ఎన్టీఆర్ సానుభూతి పవనాలను అధిగమించడం ఆయనకే చెల్లింది. ఇప్పటికీ ఆయన కొంప ముణగలేదనే అనుకుంటాను. గతానికి పోలిస్తే ఒక్కటే ముఖ్య తేడా కనిపిస్తుంది: సొంత నిర్ణయాలను & వ్యూహాలను నమ్మే బదులు సలహాదారులపై ఆధార పడుతున్నారా అనే అనుమానం.

    ReplyDelete
    Replies
    1. Dear Jai,

      As far my knowledge Congress and BJP got an agreement that if this sec8 does not workout in SC then they should be ready to get constitutional amendment. i am not saying that BJP guys will do it, but congress might push it to regain andhra or andhrite's money.

      Delete
    2. Even a constitutional amendment won't work because of the "basic structure" restriction.

      PS: I am not a lawyer as some "fiends" claim or "think"

      Delete
  14. @Jai Gottimukkala,

    మీరు తలచింది జరగలేదు అని చెప్పాను. తెలంగాణా ప్రయోజనాలు లేకున్నా ఎందుకు వాటిని చేపట్టాలనుకున్నారో మీకే తెలియాలి.

    టీడీపీ ఆవిర్భావానికీ, టీ.ఆర్.ఎస్ ఆవిర్భావానికి చారిత్రాత్మిక నేపథ్యం ఉండొచ్చు, వ్యక్తిగత స్వార్థం మాత్రం ఉంది. ఎంటీయార్ కూడా మొదట వ్యక్తి, తరువాత ఇతరుల సెంటిమెంటును కూడా కలుపుకున్నారు. అదే నిజం.

    జెఫర్సన్ ఏ సమయములో చెప్పినా, విభజన చట్టం, కాంగ్రెస్ వారు .. తెలంగాణా "భజన" చేసి తద్వారా అధికారములోకి రావాలని చేసిన అడ్డగోలు చట్టం, అన్యాయ మైన చట్టం కాబట్టి దాన్ని వ్యతిరేకించే హక్కు ప్రజాస్వామ్యములో ఉంది. ఇంకా చెప్పాలంటే, అది పాసయ్యిన విధానం ప్రజాస్వామ్యానికే కలంకం తెచ్చేలా ఉంది కాబట్టి, దాన్ని వ్యతిరేకించే బాధ్యత ఇంకాస్త ఎక్కువే ఉంది.

    సెక్షన్ 8ఏ గురించి పైనే రాశాను. అది చెల్లినా చెల్లకపోయినా, అన్యాయంగా చేసిన చట్టానికి వ్యతిరేకంగా పోరాడే హక్కు, బాధ్యత ప్రతీ పౌరుడికీ ఉంది. గమైంచారో లేదో ప్రస్తుతం టీ.డీ.పీ లో కొంత మంది హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని అంటున్నారు. అవుతుందని కాదు కానీ, ఆ తరహా పోరాటాన్ని నేను ఆహ్వానిస్తాను. (స్ట్రాటజికల్ గా).

    చంద్రబాబు సర్వైవల్ స్ట్రాటజీ నిజంగానే గొప్పదే. కాకపోతే ఏమి లాభం, ఆ స్టేజికి రాకుండా పనులు చక్కబెట్టలేకపోయాడు. చిన్నప్పుడు చదువుకున్నాం చూడండి.. సుమతి, కాలమతి, మందమతి అనే చేపల కథ. చంద్రబాబు .. కాలమతి లేదా మందమతి అవగలడే కానీ, సుమతి మాత్రం కాదు. ప్రస్తుతం ఈ ఓటు-నోటు వ్యవహారములో అయితే మందమతిలా తయారయ్యాడు. దేశములో, అలా డైరెక్టుగా ఫోన్లలో మాట్లాడి అడ్డంగా దొరికిన తొలి ముఖ్యమంత్రి బాబే అని మీడియా కోడై కుస్తోంది. (కాకపోతే అది తన వాయిస్ అవునని కానీ కాదని కానీ చెప్పడం లేదనుకోండి అది వేరే విషయం).

    ఒక విషయములో మాత్రం మీకు నా అభినందనలు. కొంత మంది కామెంట్లు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తున్నాను. పరమ నీచంగా తిడుతున్నారు. అయినా మీరు బూతు మాట మాట్లాడకుండా సమ్యమనముతోనే ఉన్నారు. Hats off to you. ఈ సంస్కారము విషయములో మీదే పైచేయి.

    ReplyDelete
    Replies
    1. పోయినన్నాళ్ళు పరదేశెం పోయి ఊరు ముందుకు వచ్చి ఉరుకులు పరుగులు పెట్టాడు.
      తనదాకా వస్తే కానీ తత్త్వం తెలియలేదు
      అగ్రహారం పొతే పోయింది ఆక్టు తెలిసింది. ఇవి చంద్రబాబుకి సరిగ్గా సరిపోతాయి.

      Delete
    2. ఇతరులు కోపంతో తిడితే జై గారు సంతోషిస్తారే గాని, ఆయనకు కోపమేమి రాదు. బాగా కాల్చిన చువ్వను ముడ్.. లో కిందనుంచి దూపితే ఎంత బాధపడతారో, అలా తన వాదనతో ఆంధ్రులను బాధించి, వారు ఎంత కోపం తో ఊగిపోతే తన వాదన అంత నెగ్గిందని, ఆయన ఆనందిస్తారు. ఆయన లాయర్ కదా! మీలాగా ఎమొషనల్ గా ఫీలవ్వడు.

      హరిబాబు కూడా ఆంధ్రుల తరుపున మంచి వాదన వినిపిస్తున్నాడు కనుక తనకు సమ ఉజ్జి చిక్కాడని, ఇక్కడే తిష్ట్ట వేసి కౌంటర్ అటాక్ చేస్తూంటాడు. మీరేన్ని మాటలన్నా ఆయన శ్రీకాంత్ చారి ఎమి అనుకోరు. వారేప్పుడో మానవమానాల స్టేజ్ దాటేశారు.

      Delete
    3. మీరు చెప్పిన ఇద్దరితో పాటు దొరకి మరో వీరాభిమాని కూడా ఉన్నాడుగా! ఆయనే గుండు మధుసూదన్ నామధేయుడు. వీళ్ళు ముగ్గురినీ కలిపి బ్లాగుల్లో తెలంగాణా triumvirate త్రిమూర్తులు అనచ్చు.

      Delete
    4. తెలంగాణా త్రిమూర్తులు :)

      Delete
    5. [అయినా మీరు బూతు మాట మాట్లాడకుండా సమ్యమనముతోనే ఉన్నారు. Hats off to you. ఈ సంస్కారము విషయములో మీదే పైచేయి.]
      This is joke of decade. Gottimukkala samshakaram is an oxymoron. My dear where were you when this gottimukala used choicest of bad words against AP and its people. Look at the comments he made in another blog about CBN's English.

      Gottimukkala idiot of Idiots that is the truth.

      Delete
    6. గొట్టిముక్కలకు క.చ.రా. బూతుముక్కలు అంటే ప్రాణం, బాబు ఇంగ్లీష్ అంటే వెటకారం? అయితే ఏంటంట, అసలే కేసులు లేక చెట్టుకింద కూకొని ఈగలు తోలుకోకుండా ఎదో బలాగులలో టైంపాస్ చేస్తా ఉంటే, ఇలా ఆడిపోసుకోవటం ఆంధ్రోళ్లకే చెల్లిందబ్బా?

      Delete
    7. అనానిమస్, గొట్టిముక్కల రాసే కామెంట్లు చూసి లాయర్ అని పప్పులో కాలెసినారులే. అవన్నీ తెలంగాణా ఫోరం నుంచి కాపీ పేస్టులు. మనోడు స్వంత రాజధానిలో ఆంధ్రోల్లు ఉండొద్దు అని పిచ్చి 'కారు' కూతలు తను మాత్రం వేరే దేశంలో అప్పనంగా దొబ్బితినే బొచ్చుకుక్క. ఇప్పుడు హైదరాబాద్ లో ఆంధ్రోల్లు వాళ్ళ నీళ్ళు వాళ్ళే తెచ్చుకోవాలంట అలాగే వీడు బతికే దేశం వాళ్ళు కూడా వీటి దగ్గర నుంచి నేర్చుకుని నీ టాయిలెట్ పేపర్ కూడా నువ్వే తెచ్చుకో అని మెడ పట్టి గెంటాలని ఆ దేవుణ్ణి మొక్కుతున్నా.

      Delete
    8. అనానిమస్, గొట్టిముక్కల రాసే కామెంట్లు చూసి లాయర్ అని పప్పులో కాలెసినారులే. అవన్నీ తెలంగాణా ఫోరం నుంచి కాపీ పేస్టులు
      ----
      Oh, then my bad :(, another copy&paste guy just like his brother GunDu :)

      Delete
    9. //మీరేన్ని మాటలన్నా ఆయన శ్రీకాంత్ చారి ఎమి అనుకోరు. వారేప్పుడో మానవమానాల స్టేజ్ దాటేశారు. //

      శ్రీకాంతా చారి దూషణలు లేకపోయి ఉంటే శుక్రాచార్య ఉండేవాడు కాదు. ఆయన బ్లాగుల్లో వాడిన భాషే తిరిగి అంతే వాడిగా కామెంట్లు రాసేలా చేసింది. ఆయన ఏమీ అనుకోకుండా ఎప్పుడున్నారు, అప్పట్లో తిరిగి దూషణలు కొనసాగించారు. కాకపోతే, ఇటుపక్క నేనూ తగ్గలేదు అంతే. ఇక ఆ దోపడాలు గట్రా అందరికీ వచ్చు, చూసే ఉంటారు పైన కామెంట్లలో !

      మిగిలిన అనానిమసులు: నేను ఇక్కడ ఒకరికి సర్టిఫికెట్ ఇవ్వడం నా ఉద్దేశ్యం కాదు. కానీ, ఈ రెండు టపాలలో, ఆయన్ను దూషించినా ఆయన తిరిగి దూషించలేదు. దాని గురించి మాత్రమే రాశాను.

      Delete
  15. @శుక్రా చార్య:

    Thanks a lot for your kind words.

    ప్రభుత్వం అన్నాక ఎన్నో ఉంటాయి అందులో కొన్ని కొట్టేసినా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం ఉండదు. ఫలానా వ్యక్తులకు పార్లమెంటరీ కార్యదర్శి పదవి కట్టపెట్టడం చెల్లకపోయినా మనకు నష్టం లేదు కనుక అది ఎందుకు చేసారో కూడా మనకు అనవసరం.

    ఎన్టీఆర్ సఫలం కావడానికి గత జస్టీస్ పార్టీ ప్రయోగం, త్రిపురనేని లాంటి మేధావుల ప్రభావం లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిగత పాత్ర తక్కువ చేయలేము కానీ ఆ పునాది లేకుండా ఆయన ఘన విజయం సాదించడం కష్టం అయేది. అవేవీ లేకపోవడం చిరంజీవి వైఫల్యానికి కారణం అనుకుంటా.

    1953లొ ఆంద్ర నుండి ఇటీవలి ఝార్ఖండ్ వరకు ఎన్నో రాష్ట్రాలను ఏర్పాటు చేసిన చట్టం కిందే తెలంగాణా కూడా ఏర్పడింది. చట్టం అన్యాయమని మీరు అనుకుంటే మీ ఇష్టం.

    వోటుకు కోట్లు ఉదంతంలో చంద్రబాబు వైఖరి అంతుపట్టడం లేదు. మీడియాలో వచ్చిన ఆడియో టేపులో ఎక్కడా 50 లక్షలు లేదా 4.5 కోట్ల ప్రస్తావన లేదు. This is not incriminatory by itself. With proper strategy he could have escaped totally unscathed.

    మీలాంటి వారితో చర్చిస్తే నేర్చుకుంటాను కనుక నాకు ఉపయోగం. వాదనకు వాగ్యుద్ధానికి తేడా తెలీని వారిని ఇగ్నోర్ చేయడం మంచిదే అని మీరూ ఒప్పుకుంటారని నమ్మకం.

    ReplyDelete
    Replies
    1. @Jai Gottimukkala,

      ఎలా ఏర్పడింది అని కాదండి, చట్టములో ఏమేమి ఉన్నాయి, వాటిలో ఆంధ్రాకు అన్యాయ చేస్తూ చేసిన సెక్షన్లేవి, అనే వాటి గురించి మాట్లాడుతున్నాను. వాటిని కేవల తెలంగాణా ప్రజలను ఆకర్శించి తద్వారా అక్కడ అధికారములోకి రావడానికి చేసినవి అవి. వాటిని వ్యతిరేకించ వచ్చు, వాటిని సవరించమని పోరాడవచ్చు. కొంత మంది ఏకంగా హైదరాబాద్ UT అంటున్నారు. అవుతుందా కాదా అన్నది పక్కన బెడితే.. పొరాడడం వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభాలున్నాయన్నది నా ఫీలింగ్.

      ఇంకో విషయం, ఆ చట్టాన్ని ఎన్ని సార్లు ఇదివరకు ఉపయోగించినా, అది తప్పు అని నిరూపించగలిగితే తీర్పు మారే అవకాశం ఉంది. దేశములో చాలా జడ్జిమెంట్లు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు అని పిలుచుకున్నవి ఉన్నాయి. వాటిలో ఉన్న అంశాలను పరిశీలించి చట్టాలను సవరించడం లేదా కొత్తవి చేయడం జరిగింది కూడా.

      Delete
    2. @శుక్రా చార్య:

      చట్టంలో ఉన్నవాటిలో ఆంధ్రకు "అన్యాయం" జరిగినవి ఏమిటని నేను చాలా మందిని అడిగాను సమాధానం రాలేదు. వారు చెప్పేవన్నీ విభజన వల్ల వచ్చిన "నష్టాలు". వీటినే "గత కలయిక వల్ల జరిగిన అన్యాయాలకు అంతం" అనవచ్చన్నది నాణానికి మరో వైపు.

      చట్టంలో ఫలానా అంశం ఉండడం/లేకపోవడం వల్ల ఆంధ్రకు ఫలానా అన్యాయం/నష్టం జరిగిందని ఎవరన్నా నేను చర్చకు తయారు. గత చట్టాలతో పోల్చినప్పుడు నాకయితే ఒక్కటి కూడా అగుపడలేదు.

      హైదరాబాద్ యూటీ/ఆంధ్రలో కలపడం/ప్రత్యెక రాష్ట్రం ఏవయినా ఎవరయినా అడగొచ్చు. ఆ డిమాండ్ సఫలం కావాలంటే హైదరాబాదీలతో ఉద్యమం చేయంచడం శ్రేష్టమయిన పద్దతి. అది మొదలయితే వ్యతిరేకించే వారు కూడా తమ వాదన వినిపించే అవకాశం వస్తుంది. హైదరాబాదీలు కాని కొందరు వ్యక్తులు మీడియాలో చేసే ప్రకటనలు/వ్యాఖ్యలు నేను పట్టించుకోను.

      "అది తప్పు అని నిరూపించగలిగితే తీర్పు మారే అవకాశం ఉంది"

      ముఖ్య సవరణ: తప్పని కాదు. రాజ్యాంగవ్యతిరేకమని చూపించాలి. నేను ఈ చాలెంజుకు కూడా సిద్దం.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. @Jai Gottimukkala:

      ఎన్నని చెప్పాలి, అప్పులు జనాభా పరంగా పంచడం, విద్యుత్తు వినియోగం పరంగా పంచడం, భద్రాచలం, NIT సీట్లు, ఎంసెట్, ఇలా ప్రతీ దానిలో అన్యాయమే కదా జరిగింది. ఇది "గత కలయిక వల్ల జరిగిన అన్యాయాలకు అంతం" అనడం కడుపు నిండిన వాడి మాటలు మాత్రమే అనొచ్చు. ఇది నాణానికి మరోవైపు (Other side of the coin) కాదు. ఆంధ్రా పట్ల పేరుకుపోయిన ద్వేషం, ఈ తరహా భావమూ "ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు" వంటివి (two sides of the same coin).


      తెలంగాణా పోరాటమైనా మరోటైనా, ముందుగా కొంత మంది నాయకులు ప్రజలలో ఉన్న అభిప్రాయాలకు కొసమెరుపుగా ఇచ్చినవే కదండీ. ప్రస్తుతం హైదరాబాదులో ఆంధ్రుల సంఖ్య తక్కువేమీ కాదు. వారికి ఉన్న అభధ్రతా భావమూ తక్కువేమీ కాదు. వారు సైలెంటుగా ఉన్నారు అంటే, అది కేవలం ఆ అభద్రతా భావం వల్లనే. ఒకాయన ఈ మధ్యే బహిరంగ లేఖ రాశారు. హైదరాబాదులో మేము క్షేమం అని. కానీ, వారి క్షేమం ఏమాత్రమో కొన్ని ఏరియాలలో జరిగిన ప్లాట్ల కూల్చివేతలూ, అలాంటివే మరోచోట కూడా జరుగుతాయన్న బెదిరింపులూ, అలా జరగకుండా ఉండడానికి ఎన్ని కోట్లు ఇవ్వాల్సి వచ్చింది అన్నీ ప్రజలకు తెలుసు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, అక్కడున్న ప్రజలకు సాక్షాధారాలు అక్కర్లేదు. కాబట్టి, వీటికి సాక్షాలు లేవు అని మీరు అన్నా అది కుదరదు.

      చెప్పొచ్చేదేమిటంటే, వారికి భరోసా ఇవ్వగల నాయకుడు దొరికితే పరిస్థితి వేరుగా ఉంటుంది. అది సెంట్రల్ కు చెందిన పార్టీవాడైతే ఇంకా బావుంటుంది. ఎలానూ టి.ఆర్.ఎస్ తప్ప తెలంగాణాలో మరో పార్టి ఇప్పట్లో పుంజుకోవడం కష్టం కాబట్టి, హైదరాబాద్ UT అని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చేసి దానికోసం పోరాడతాను, మీ భద్రతకు భరోసా ఇస్తాను అని చెప్పగలిగితే ... అప్పుడు నేను చెబుతున్న ఉధ్యమం ఖచ్ఛితంగా వస్తుంది. అది ఉధృత రూపం దాల్చడనికి కావలసింది 30 ప్లస్ + జాబ్ లెస్ యూత్, అంతే. కాబట్టి, నాయకులు మీడియాలో చేసే ప్రకఠనలు అంత తేలిగ్గా తీసి పారేయకండి. ముందుగా అన్నీ ఇలానే మొదలవుతాయి.

      //ముఖ్య సవరణ: తప్పని కాదు. రాజ్యాంగవ్యతిరేకమని చూపించాలి. నేను ఈ చాలెంజుకు కూడా సిద్దం.//

      అవసరం లేదు. సవరణ అన్నది ఫలానా చట్టం లేదా చట్టములోని అంశం రాజ్యాంగ వ్యతిరేకం అని నిరూపించకపోయినా చేయొచ్చు. ప్రత్యేక తెలంగాణా ఏర్పడింది, ఇదివరకూ జరిగిన "కలయిక" రాజ్యాంగ వ్యతిరేకమని కాదు కదండీ? కలయిక వ్యతిరేకం కాదు, అలానే విడిపోవడమూ వ్యతిరేకం కాదు. అంటే నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, సవరణ జరగడానికి "ఆ సవరణ రాజ్యాంగ వ్యతిరేకం" కానట్లయితే సరిపోతుంది. రెండిటికీ తేడా మీకు అర్థమయ్యే ఉంటుంది.

      ఇప్పుడు ఉన్నట్లుంది కేంద్రం, అప్పులు ఆదాయం పరంగా, విధ్యుత్ జనాభా పరంగా మార్చి చట్ట సవరణ చేస్తున్నాం అంటే.. అది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందా చెప్పండి? భద్రాచలం కూడా ఆంధ్రాలో కలిపేస్తున్నాం అంటే అది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందా? హైదరాబాద్ UT చేస్తున్నాం అంటే అది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందా? ఎలానూ పార్లమెంటు తలుపులేసి చట్టాలు చేసే సంస్కృతి .. తప్పేమీ కాదని విభజన పుణ్యమా అని ప్రజలు గ్రహించారు. మరొక్కసారి అది జరిగితే అది రాజ్యాంగ విరుద్దం అవుతుందా?

      Delete
    5. శుక్రాచార్య గారూ, ముందు భద్రాచలం ప్రజలు తమను ఆంధ్రలో కలపాలని ఉద్యమం చేయలేదని గమనించాలి. ఒకవేళ అన్యాయం అయినా అది వారికి తప్ప మిగిలిన ఆంధ్రులకు కాదేమో ఆలోచించండి.

      "అప్పులు జనాభా పరంగా పంచడం" ఉదాహరణ తీసుకుందాం:

      మీరనుకున్నట్టు అప్పులు *అన్నీ* జనాభా ఆధారంగా విభాజించలేదు. ఎక్కడవి అక్కడే (lex situs) అనే సిద్దాంతం ప్రకారం స్తిర చరాస్తులు పంచారు. ఒక లొకేషన్ పరిధి లోకి రానివి మాత్రమె (ఉ. రాష్ట్రం బయట ఉన్నవి) జనాభా దామాషాలో పంచారు. అప్పులు ఆస్తులను అంటి పెట్టుకొని ఉంటాయి కనుక దానికీ ఇదే సూత్రం వర్తిస్తుంది.

      48. (1) Subject to the other provisions of this Part, all land and all stores, articles and other goods belonging to the existing State of Andhra Pradesh shall,—

      (a) if within the transferred territory, pass to the State of Telangana; or

      (b) in any other case, remain the property of the State of Andhra Pradesh:

      Provided that in case of properties situated outside the existing State of Andhra Pradesh, such properties shall be apportioned between the successor States on the basis of population ratio:

      ఇదే విధానం 1953 ఆంద్ర చట్టం నుండి అమలు అవుతూ వచ్చింది. అంతేకాక లెక్స్ సిటాస్ అనే సిద్దాంతం కామన్ లా దేశాలలో సర్వసాధారణం. దీనికి వ్యతిరేకంగా వెళ్ళితే కోర్టులు కొట్టేసే అవకాశమే మెండు.

      మీరు పేర్కొన్న ఇతర అంశాలు అన్నీ గతంలో పాటించిన పద్దతుల బట్టి చేసినవే. నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం తెచ్చినా ఇలానే తెచ్చేది. అంచేత అన్యాయం అనడం సరిపోదు.

      "ఇది నాణానికి మరోవైపు (Other side of the coin) కాదు"

      With due respect, I submit you are wrong. Your alleged "present loss" is equal to "loss of an earlier benefit" that the others can see as "end of earlier loss". ఇందులో ద్వేషం ఉండనక్కరలేదు, ద్రుక్పథ వైరుద్ద్యం ఉన్నా చాలు.

      500 డిమాండ్లు వస్తాయని అప్పటిలో ఊదరగొట్టారు ఒక్కటీ రాలేదు. హైదరాబాద్ యూటీ ఉద్యమం అంటూ వస్తే చూద్దాం లెండి. ఒక హైదరాబాదీగా నాకు న్యాయం అనిపిస్తే సమర్తిస్తాను.

      "సవరణ అన్నది ఫలానా చట్టం లేదా చట్టములోని అంశం రాజ్యాంగ వ్యతిరేకం అని నిరూపించకపోయినా చేయొచ్చు"

      మీరు లాండ్మార్క్ తీర్పులు ప్రస్తావించారు కనుక మీ "తప్పును సరిదిద్దడం" నేను తప్పుగా అర్ధం చేసుకున్నాను. I apologize for misunderstanding your intention.

      మీరు కోరుకున్న మార్పులు న్యాయస్థానాల ద్వారా కాక చట్టసభలలో తెవాలనుకుంటే తప్పక ప్రయత్నించండి. మాకూ వ్యతిరేకించే హక్కు ఉంటుంది, పైగా ఇప్పుడు రాష్ట్రం హోదాలో ఆ పని చేయోచ్చు.

      Delete
  16. జై గారు
    విభజనవల్ల మీకోరింగేదేమిటని చాలామంది తెలంగాణా మిత్రులనడిగాను ఎవ్వరు సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పటికయితే కేసీఆరు కుటుంబం కొండకచో ఉద్యోగులు బాగుపడ్డారని తరువాత తరాలయినా భాగు పడతాయని ఆశిస్తున్నామని విరక్తిగా చెప్పారు. దీనికేమంటారు.

    ReplyDelete
    Replies
    1. నేను చెప్పగలను ఎన్నోసార్లు చెప్పాను కూడా.

      There is a fundamental difference though. Those who want something need not provide rationale to others. Telangana is not answerable to anyone else. In any case, the state is already formed under the due constitutional process.

      Some people want Telangana formation to be reversed because it allegedly impedes their rights. They need to prove the allegation when (if) they go to court.

      Delete
  17. జైగారూ,

    >Telangana is not answerable to anyone else.
    అది త్రికాలా౽బాధ్యమైన సత్యం కాదనుకుంటాను. తెలంగాణా సర్వసత్తాకరాజ్యంగాదు. భారతదేశంలోని ఒక రాష్ట్రం మాత్రమే కదా!

    >Some people want Telangana formation to be reversed....
    లేదండీ. అలా ఎవరూ కోరటం లేదనే భావిస్తున్నాను. ఒకసారి కలిసి ఉన్నందుకు పడిన శిక్షచాలనే ఇరుపక్షాలవారూ భావిస్తున్న విషయం గమనార్హం. కాని నిజానికి శిక్షపడినది ఆంధ్రకు మాత్రమే అన్నది ప్రస్తుతపరిస్థితి - ఈ మాట తెలంగాణావారు ఒప్పుకోనంతమాత్రాన అబధ్ధం కాదు.

    ఈ మాటలు మీకు రుచించకపోతే వదిలెయ్యండి. ప్రతివిమర్శచేయండి. దయచెసి నేనేదో పక్షపాతంతో అంటున్నానని భావించవద్దు. అలాగే దీనిని ఒక చర్చాప్రాతిపదికగా కూడా భావించవద్దు. ఎవరి అభిప్రాయం వారిది. కాలం నిగ్గుతేల్చాలి కాని చర్చలు తేల్చేది ఏమీ ఉండదని విజ్ఞులు మీకు తెలుసుననే నా నమ్మకం.

    ReplyDelete
    Replies
    1. >>> నిజానికి శిక్షపడినది ఆంధ్రకు మాత్రమే అన్నది ప్రస్తుతపరిస్థితి

      అవును. ఇంతకు ముందు మాదిరిగా తెలంగాణాపై కూడా రాజ్యమేలడం సాధ్యం కాదు! ప్రాంతం వరకే పరిమితం కావాలి. తెలంగాణా భూములు ఇష్టారాజ్యంగా కబ్జా చేసుకోవడం వీలుకాదు, అవేవో మనదాంట్లోనే చూసుకోవాలి. మనవేపు ఆదాయం లేకున్నా హైదరాబాదు ఆదాయాన్ని ఇష్టం వచ్చినట్టు తరలించి అస్మదీయ ప్రాంతంలో ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు చేసుకోవడం వీలు కాదు. ఉమ్మడి పేర నీళ్ళ కేటాయింపులు జరిపించుకుని మొత్తంగా వాడడానికి, ఉద్యోగాల్లో ఇష్టారాజ్యంగా అస్మదీయులకు కేటాయింపులు జరుపుకోవడం ఇప్పుడు కుదరదు కదా? ఇది నిజంగా పెద్ద శిక్షే సుమండీ!!

      Delete
    2. చిత్తం.

      శ్రీకాంత్ చారిగారూ, మీరు వస్తారని అనుకుంటూనే ఉన్నాను. పడ్డవాళ్ళందరూ చెడ్దవాళ్ళు కాదు. ఈ తెలుగు సామెత మీరు వినలేదనుకుంటాను. ఒక వేళ విన్నా మీ దృష్టిలో మీ అంత మంచివాళ్ళు సృష్టిలో లేరన్న భ్రమలో ఉన్నారేమో. కాలస్వభావం ఎఱిగినవారు మీలాగా తొందరపాటుతో మాటలు విసరరు. పోనియ్యండి. ఏదో ఒకటి లెండి. ఐనా మంచి పనిమధ్యలో తీరికలేకుండా ఉన్నాను. మీ ఆనందంలో మీరుండండేం. సరేనా? నాకేమీ అభ్యంతరం లేదు.

      Delete
    3. ఒకవైపు నిస్పక్షపాతినని గోముఖ దర్శనమిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు వ్రాస్తుంటే తప్పకుండా సమాధానం చెప్పవలసి వస్తుంది మరి!

      గురివింద తన నలుపెరుగదన్నట్టు "శిక్షపడినది ఆంధ్రకు మాత్రమే" అంటూ ఏడుపులు మొదలుపెట్టినది తమరే కదా? నిజం చెప్తే ఉలిక్కి పడతారెందుకు? పోనీ తమరు చెప్పండి, విభజన విషయంలో ఏవిధంగా APకి అన్యాయం జరిగిందో? ఏరాష్ట్రానికి ఆంధ్రా కన్నా ఎక్కువ పరిహారాలు ఇచ్చారో? అది చెప్పకుండా శిక్షో అంటూ విలాపాలు దేనికి?

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. @sreeaant chaari
      నా గత పోష్టులోనూ ఇప్పుడూ యెన్నో ప్రశ్నలు అదిగాను.కారనాంతరాల వల్ల దారి తప్పిపోతే యెత్తి చూపించి అడిగిన అజవాబు లేదు మీ వైపు నుంచి,యెందుకని?మరోసారి పయత్నించవచ్చు కదా/యెవరు గురివిందలో తెలుస్తుంది!ఈ. పోష్తులోనే ఉన్నాయి కొన్ని చూడరాదు?

      ఉద్యోగాల గురించి చాలాకాలం క్రితమే అయింది లెంది భాగోతం "ఈ వడ్లగింజలో బియ్యపు గింజ కింత రాధ్ధాంతమా?" అనీ "తెలంగాణా మేధావుల్లోని మేధావిత్వపు శాతం యెంత?" అనీ చాలా అడిగాను.ఒక్క ప్రశ్నకీ సూటిగా జవాబు చెప్పలేకపోయారు యెవరూ,మీరు ఈ పోష్తులోనూ "టాటా వీదుకోలు" పోష్తులోనే చాలా ప్రశ్నలున్నాయి,కొంచెం చూడరాదూ!

      Delete
    6. @ హరిబాబు

      మీ గత పోస్టులన్నీ చదివాల్సిన అవసరం ఇక్కడ కనిపంచడం లేదు. 'రాష్ట్ర విభజన ఆంధ్రకి ఏవిధంగా శిక్ష?' అన్నది ప్రశ్న. దీనికి సమాధానం చెప్పగలితే చెప్పండి.

      Delete
    7. శ్రీకాంత్ చారిగారు,
      ప్రశ్నకు జవాబును వెదకుతున్నారా?
      మంచిది అలాగే కానివ్వండి. కాని కాస్త చిత్తశుధ్ధితో వెదకండి, మీకు ఇష్టమైన సమాధానం మాత్రమే వచ్చితీరాలని వెదకటం కాకుండా!

      ఇతరులు చెప్పే జవాబులు మీకు నచ్చుతాయా?
      నచ్చవు. మీ వాదన మీ ఆలోచన తప్ప ఇతరులు ఈషణ్మాత్రం తద్భిన్నంగా మాటలాడినా మీకు ఆగ్రహం కలుగుతుందని తెలుసు కదా.

      మరి ఎందుకు ఇతరులను అడుగుతున్నారు?
      మీకు కావలసినది చర్చపేరుతో రచ్చ. పరంపరగా వ్యాఖ్యల మిషతో నిరంతరాయంగా పరనిందాలాపాలు కొనసాగించటమే మీ లక్ష్యంగా ఉన్నది మీ విధానం. నాపై నిందాలాపాలకు మీరు దిగటం ఇది మొదటిసారి కాదు, తుదిసారి కూడా కాబోదని తెలుసు. శేషం కోపేనపూరయేత్ అన్నట్లు మీకు సరైన వాదన లేకనే ఇలా దుర్వాక్యాలకు దిగుతున్నారంటే మరలా మీకు మరింత ఆగ్రహమూ మరిన్ని నిందాలాపాలూ వస్తాయి మీ నుండి. బాగుంది బాగుంది.

      హరిబాబుగారు,
      ఈ శ్రీకాంత్ చారిగారితో మీరు కుస్తీ పట్టదలచుకొంటే కానివ్వండి. నాకు ఆసక్తి లేదు. ఇందులో మంచి చెడ్డలన్నీ మీకు తెలిసే ఉన్నాయని అనుకుంటున్నాను.

      Delete
    8. @శ్యామలీయం:

      "తెలంగాణా సర్వసత్తాకరాజ్యంగాదు"

      సాన్ గారు తెలంగాణా వల్ల మీకేమి ఒరిగందని అడిగితె ఎవరూ చెప్పలేకపోయారని అన్నారు. నేను చెప్పగలను, చెప్పాను అని సమాధానం చెప్పాను. అయినా ఈ విషయంలో ఎవరికీ జవాబుదారీ కాదన్నాను. This is the limited context of my "waiver".

      "నిజానికి శిక్షపడినది ఆంధ్రకు మాత్రమే"

      శుక్రాచార్య గారికి నాకు మధ్య చర్చ ఇదే విషయంపై. నా అభిప్రాయం ప్రకారం "అన్యాయం" వేరే, "నష్టం" వేరే. ఆంద్ర మొదలుకొని అన్ని రాష్ట్రాలలో వాడిన పద్దతులు వాడడం "అన్యాయం" కాదు. ఒకవేళ "నష్టం" అనుకున్నా అవతలి వారు దాన్ని "గతంలో జరిగిన నష్టానికి స్వస్తి" అనడం కూడా సబబే.

      "కాలం నిగ్గుతేల్చాలి"

      The tomorrow we yesterday thought will never come is today!

      500 రాష్ట్రాల డిమాండ్లు రాలేదు, నక్సల్స్ పెట్రేగలేదు, మతకల్లోలాలు మారణకాండలు చెలరేగలేదు, స్థానికేతరులపై మూకుమ్మడి దాడులు జరగలేదు, పెట్టుబడి వలస పోలేదు, ఘోర కలి రాలేదు, రాష్ట్రం అంధకారమయం కాలేదు. జరిగింది ఒక్కటే: ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్న వారు (సంజయ్ బారు మినహా) తమ ఊహాగానాలు నిజం కాలేదని విషయం ఒప్పుకోలేదు.

      కాలం కొంతవరకు నిగ్గు తేల్చింది, ఇంకా తెలుస్తుంది.

      Delete
    9. @శ్రీకాంత్ చారి:

      "ఒకవైపు నిస్పక్షపాతినని గోముఖ దర్శనమిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు వ్రాస్తుంటే తప్పకుండా సమాధానం చెప్పవలసి వస్తుంది మరి!"

      ఆయన అభిప్రాయం ఆయనది. ఆయన నిష్పక్షపాతి అన్నా అనకపోయినా, అయినా కాకపోయినా మీ అభిప్రాయం మారదు కదా. దీనికి వ్యక్తిగత విమర్శ ఎందుకు? ఇష్యూని ఇష్యూగానే చూస్తె బెటర్.

      Delete
    10. @ జై

      శ్యామలీయం: ఒక వేళ విన్నా మీ దృష్టిలో మీ అంత మంచివాళ్ళు సృష్టిలో లేరన్న భ్రమలో ఉన్నారేమో. కాలస్వభావం ఎఱిగినవారు మీలాగా తొందరపాటుతో మాటలు విసరరు. పోనియ్యండి. ఏదో ఒకటి లెండి. ఐనా మంచి పనిమధ్యలో తీరికలేకుండా ఉన్నాను. మీ ఆనందంలో మీరుండండేం. సరేనా?

      అంటూ గురువు గారు వ్యక్తిగత విమర్శలకు దిగిన తర్వాతే నేనూ అనవలసి వచ్చింది. ఆయన తర్వాతి వ్యాఖ్యలు కూడా చూడండి. గ్రాంధికంలో రాసినంత మాత్రాన ఎకసక్కాలు ఎకసక్కాలు కాకుండా పోవు కదా!

      Delete
    11. "గురువు గారు వ్యక్తిగత విమర్శలకు దిగిన తర్వాతే నేనూ అనవలసి వచ్చింది"

      ఒకవేళ ఆయన అన్నా (లేదా అన్నారని మీకనిపించినా) సంవయనం పాటించడం మంచిదే కాదే శ్రీకాంతన్నా! రియాక్ట్ అయ్యి పెద్దాయన మనసు నొప్పించే బదులు వాదనలకు మాత్రం జవాబిస్తే చాలు.

      ఎందరెందరు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎకసక్కాలు చేయలేదు? అవన్నీ పట్టించుకుంటే ఇష్యూ డైవర్ట్ అవుతుంది.

      Delete
    12. జైగారు, శ్రీకాంత్ చారి గారిని వ్యక్తిగతంగా ఉద్దేశించి నేను ఏవిధమైన నిందాలాపాలూ ఆడలేదు, నాకు తెలిసినంతవరకూ. ఆయనట్లా కించపడవలసినది ఏమీ లేదు. కాని ఆయన నాది 'గోముఖ దర్శనం' అని అన్నది మాత్రం నిజం. ఇటువంటి అనుచితమైన పదాలు ఆయన కొంతకాలంగా నాపట్ల వాడుతూనే ఉన్నారు. అది గమనించండి. పరస్పరం గౌరవించుకుంటూనే మాట్లాడుకోవచ్చును. ఎవరికీ ఎవరమూ శత్రువులము కాము కదా ఇక్కడ! నన్ను ఆయన గురుస్థానంలో ఉంచి గౌరవించదలచుకుంటే అది ఆయన యిష్టం. ఈ వయస్సులో నాకు ఒకరి వలన వచ్చే మానావమానాల గురించిన పట్టింపు ఏమీ లేదు. ఒకరు నమ్మాలని ఈ మాట చెప్పటం లేదు. శ్రీకాంత్ చారిగారిని నేను వ్యక్తిగతంగా విమర్శించకపోయినా ఆయనకు అటువంటి అభిప్రాయం కలగటం దురదృష్టం. కాని గురువుగారిని పట్టుకొని మీరొక గోముఖ వ్యాఘ్రం అనటం సబబుకాదు కదా!. పోనివ్వండి. ఆయన మాటతీరే అంత కావచ్చును. నా యోగ్యత అటువంటిది కావచ్చును. నాకు తెలియదు. ఆయన మనస్సులో దోషం లేకపోవచ్చును. నిందాలాపాలు అటుంచండి, నేను ఎకసెక్కాలు కూడా చేయటాన్ని హర్షించను. శ్రీకాంత్ చారిగారికి నా మీది దురభిప్రాయం తొలగితే సంతోషం. లేకుంటే ఆయనకో ఆశీర్వాదం చేసి గమ్మునుంటాను. సరే. ఇబ్బంది ఏమీ లేదు.

      Delete
    13. సార్ మీరు వారిని వ్యక్తిగతంగా నిందారోపణ చేసారని నేను అనలేదు. ఒకవేళ అలా జరిగినా లేదా ఆయనకు అలా అనిపించినా దానికి రియాక్ట్ కాకపోవడమే మంచిదని మాత్రమె వారికి నా సలహా. ఆయన మిమ్మల్ని టార్గెట్ చేసినా లేదా చేసినట్టు అనిపించినా మీకూ నష్టం లేదు కనుక ఇంతటితో వదిలేయడం మంచిదేమో.

      Delete
    14. This comment has been removed by the author.

      Delete
    15. శ్యామలీయం మాస్టారు ఆయన అభిప్రాయం ఆయన యెప్పుదూ చెప్తూనే ఉన్నారు - ఇక్కడ మాత్రమే కొత్తా కాదు.శ్రీకాంత్ చారి గారు ఆ అభిప్రాయంతో విభేదించి యేదయినా చెప్తే బాగుండేది కానీ ఆయనకి గోముఖవాఘ్రపు లక్షణం అంటగట్టడం భావ్యంగా లేదు.తనే వ్యక్తిగతంగా దాడి చేసి అదే లక్షణాన్ని ఆయనకి అంతగట్టడం మరీ విడ్డూరంగా ఉంది!

      నేను కామెంట్లు మోదరేషన్ పెట్టకపోవటానికి కారణం అందరం సభ్యతా సంస్కారం గల వ్యక్తులం కాబట్టి యెవరి సంస్కారానికి వారే బాధ్యులుగా ఉటారని ఆశించి!

      బేదాభిప్రాయాలు ఉన్నా మానవ సహజమైన మర్యాదల్ని తప్పనిసరిగా పాటించాలి.మా నాన్నగారు అప్పటి శాసనసభ గ్యాలరీలో కూర్చుని తెన్నేటి విశ్వనాదహం లాంటి దిగ్దంతులు సభలో ఒకరినొకరు యెంత విమర్సించుకున్నా బయటికి రాగానే అదే మనిషితో ఆప్యాయంగా ప్రవర్తించడాన్ని గురించి చెప్పేవారు.అది సైధ్ధాంతీకంగా విభేదించే సత్పురుషుల మధ్యన ఉండే వాతావరణం!ఆ విలువల్ని మనం ఇప్పటికీ పాటించవచ్చు.విలువలు వలువలు వాటంతటవి వూడిపోవు,వాటంతటవి అతుక్కోవు!వాటిని మనం గట్టిగా పట్టుకుంటేనే మనతో ఉంటాయి!

      కాబట్టి ఇంతకన్నా నేను యేమి చెప్పినా బ్లాగు యజమానిగా నా మర్యాదకి భంగం అవుతుంది.మీరు ఆలోచించుకోండి!

      Delete
    16. హరి గారు,

      నేను ఇక ఇక్కడికి రావద్దనే అనుకున్నాను. కాని మీ వ్యాఖ్య చూసి సమాధానం వ్రాయవలసి వస్తోంది.

      వారు ఆంధ్రాకు అనుకూలంగా ఏ వాదన చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అవసరమనుకుంటే సమాధానమిస్తా, లేకుంటే లేదు. కాని నిస్పక్షపాతిని అంటూ ఒకవైపు టముకు వేసుకుంటూ ఆ పని చేస్తే ఎత్తి చూపవలసి వస్తుంది.

      మొదట నేను కేవలం వారికి సమాధానం మాత్రమే ఇచ్చాను. వారి అధిక ప్రసంగం తర్వాతే నేనూ కాస్త అధిక ప్రసంగం చేసిన మాట వాస్తవమే. ఆ తర్వాత శ్యామలీయం గారు ఎన్ని వ్యాఖ్యలు చేసిన జై గారి వ్యాఖ్యతో నేను మౌనంగానే వున్నాను.

      నేను వారు తనను తాను అభివర్ణించుకున్న "నిస్పక్షపాత ధోరణి"ని మాత్రమే నేను "గోముఖం"గా అభివర్ణించాను. వ్యాఘ్రాన్ని మీరు తగిలించారు!

      ఇక ఇంతటితో ముగిస్తాను.

      Delete
  18. @Shukracharya:

    http://jaigottimukkala.blogspot.in/2015/06/cash-for-votes-conspiracy-contentious.html

    ReplyDelete
  19. Jai Gottimukkala has the habit of using bad language when he comments as Anonymous. He poses like a samskaari when he posts in the name of Jai Gottimukkala. I don't know why he enters Andhra blogs and why Andhra bloggers entertain this sworn enemy of Andhra. Had it been a Telangana blog or website, they won't allow you to post anything in favour of Andhra. For example, see Mission Telangana site.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...