Wednesday, 3 June 2015

బాబుకి ఈ శాస్తి జరగాల్సిందే!లేకపోతే చందుని తక్కువ అంచనా వేస్తాడా?

     ఆనాడు మదరాసు వాళ్ళు యెప్పుడయితే పొమ్మన్నారో ఆంధ్రకేసరి మొదట్లో మదరాసు లేని ఆంధ్రాకి తను అస్సలు వొప్పుకోకపోయినా తప్పనిసరై వదలాల్సి వస్తే నిముషాల్లో ఆంధ్రాకే వచ్చేసి పరిపాలన తొలిరోజు నుంచే స్వరాష్ట్రం నడిబొడ్డున నిలబడి కొనసాగించాడు - తెరచాటు రాజకీయాల మీద చూపు లేని మానధనుడు గనక!మరి చంద్రబాబునాయుడు సంవత్సరం గడుస్తున్నా ఇంకా భాగ్యనగరంలోనే ఉండి యేం పీకుదామనుకున్నాడు?పరిపాలన పొరుగు రాష్త్రం నుంచి చెయ్యాల్సిన ఖర్మ దేనికి?

     రెండు కళ్ళ సిధ్ధాంతమూ తెలుగువాళ్ళని కలపాలనే మహత్తర ఆశయాలూ అన్నీ చచ్చు మాటలు.?ఇవ్వాళ అలాంటి మహోన్నతాశయాలు అతనితో సహా యే రాజకీయ నాయకుడికీ లేవు గాక లేవు, వున్నాయని యెవరయినా నిరూపిస్తే నా చెవి కదపాయిస్తా!బాబు చాలాసార్లు పైకే చెప్పినట్టు కేసీఆర్ వేస్ట్ క్యాండిడేట్ అని తెలంగాణా ప్రజలకి చెప్పి 2019లో తెలంగాణాలో కూడా గెలిచి కాలరెగరెయ్యాలని సరదా పడుతున్నాడు.పోనీ ఆ సరదా తీర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు గొప్పగా ఉన్నాయా అంటే అదీ లేదు!ఇంతవరకూ ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య సాంకేతికంగా ఒకరి మీద మరొకరు ఆధిక్యత సాగించే యెత్తుగడల్లో తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వెళ్ళి పైచేయి అనిపించుకోవడమూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నత్తి మాటలు మాట్లాడటమో అర్ధాంతరంగా వెనక్కి తగ్గడమో యెందుకు చేసింది?అప్పటికే కేసీఆర్ వ్యూహాత్మకంగా బాబు తెలంగాణాని బద్నాం చెయ్యాలనే ఇక్కడ ఉన్నాడు,తెలంగాణాని విఫల ప్రయోగం చెయ్యాలని కుట్రలు పన్నుతున్నాడు అని స్టేటుమెంట్లు ఇచ్చేసి తెలివిగా ఇరికించేశాడు గాబట్టి గట్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పట్టుబడితే తప్పకుండా కేసీఆర్ దాన్ని అదుగో నేను ముందే చెప్పాను గదా బాబు తెలంగాణకి నష్టం చేస్తున్నాడు చూడండి అనేటట్టు మెలితిప్పి తనకి పనికొచ్చేటట్టు ఉపయోగించుకుంటాడు గనక వెనక్కి తగ్గడం కాదా?నువ్వు సమర్ధుడివని 13 జిల్లాల ప్రజలు నీకు అధికారం అప్పగిస్తే పొరుగు రాష్ట్రం వైపు చూపు పెట్టి సొంత రాష్ట్రానికి బొక్కపడెయ్యటం యేమి తెలివి?

     సొంతప్రజలకి బొక్క పడినా పకపోయినా రాజకీయాల్లో యెదటివాడి మీద గెలుపు సాధించాలంటే యెఫెన్సివ్ స్ట్రాజీయే పని చేస్తుంది తప్ప కేసీఆర్ తనని అన్ని మాటలంటున్నా మా పార్టీ నుంచి వెళ్ళినవాళ్ళే మమ్మల్ని తిడుతున్నారు,మా దగ్గిర పనిచేసి నేర్చుకున్న వాడేగా అనే పుచ్చొంకాయ డిఫెన్సివ్ స్ట్రాటజీ యెట్లా పని కొస్తుంది!ఇప్పుడు జగన్ తరపున పాతకాపులైన రెడ్లూ కేసీఆర్ కొత్తగా పైకి తీసుకొస్తున్న వర్గాలూ గట్ట్టిగా కలిసిపోతే ఇక శాశ్వతంగా తెలంగాణలో దుకాణం యెత్తెయ్యాల్సిందే - ఇప్పుడున్న క్యాడరు బలం యెన్నికల్లో నాలుగు వరస ఓటముల తర్వాత ఉండదు.

     రేవంత్ రెడ్డి గొవని కేసీఏఅర్ అంత తేలిగ్గా వదలడు.బాబు పేరు బైటికొచ్చింది గనక తప్పకుండా బాబుని కూడా లాగుతాడు, అదీ నదురూ బెదురూ లేని రాజకీయమంటే!అలాంటి కేసీఆర్ ఇలాంటి జగన్ కలిస్తే ఇంక బాబుకి యెలాంటి రిజల్ట్ వస్తుందో తేలిగ్గానే వూహించుకోవచ్చు!తెలంగాణలో కేసీఆర్ ఉన్నంతవరకూ యెఫెన్సివ్ స్ట్రాటజీ పనిచెయ్యదు,డిఫెన్సివ్ స్ట్రాటజీ ఇట్లాంటి ఫలితాన్నే ఇస్తుంది!ఇద్దరు కూబి నాయుళ్ళకీ తెలివి ఉంటే జగన్ మీద కేసులు యెత్తి వేసి వాణ్ణి కేసీఆర్ మీదకి వొదిల్తే అప్పుడు కేసీఆర్ రాజకీయంగా కొంత ఇబ్బంది పదవచ్చు.అందుకే తను ముందుచూపుతో అతన్ని తనవైపుకి లాగేసుకుంటున్నాడు - వాళ్ళిద్దరి మైత్రీ బలపడితే తెలంగాణలో కేసీఆర్ ఇక దుర్నిరీక్ష్యమైన తేజస్సుతో చెలరేగిపోతాడు - తెలంగాణ ఇక పూర్తి రాజరికంలోకి వెళ్ళిపోతుంది కాబోలు?ముఠాలు కట్టి తనవాళ్ళకే అన్నీ దఖలు పర్చుకున్న అప్పటి బ్రహ్మానంద రెడ్డి నుంచి తెలంగాన ఉద్యమం పతాక స్థాయికి వచ్చి కేంద్రం ఓకవైపున విభజన మొదలు పెట్టాక కూడా ఒక్క నయాపైఅస ఇవ్వను ఫో అన్న కిరణ్ కుమార్ రెడ్డి వరకూ ఇప్పటి దాకా బహిరంగంగా కొవ్వు చూపించిన ఈ రెడ్లూ తమ తాతల నాటి దివాణాల ప్రభావం నుంచి బయటపడని ఈ వెలమలూ వాళ్లలోని ఫ్యూడల్ భావజాలం ప్రభావంతో తెలంగాణని మధ్యయుగాల్లోకి తీసుకెళ్ళీ నిలబెట్టే ప్రమాదం ఉంది!తెలంగాణా యెక్కడి కెళ్ళినా అక్కడి మేధావులు చూసుకుంటారు గానీ బాబుని తొందరగా గెంటేస్తే ఆంధ్రాకి పూర్తికాలం స్వరాష్త్రం నుంచే పని చేసే ముఖ్యమంత్రి వస్తాడు!

     యే విధంగా చూసినా బాబు ఇక తట్టాబుట్టా సర్దుకుని ఆంధ్రాకి పోవాల్సిందే - యెఫెన్సివ్ స్ట్రాటజీలో వెళ్తే కేసీఅర్ తనకి అనుకూఒలంగా ఉపయోగించుకోవడం డిఫెన్సివ్ స్ట్రాటజీలో వెళ్తే ఇప్పటిలా దొరికిపోవడం తప్ప యే ప్రయోజనమూ ఉండదని తెలుసుకుని తెలంగాణని కేసీఆర్ మానానికి వొదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా సెటిలయిపోవడం మంచిది?!

P.S::కేసీఆర్ ఆంధ్రావాళ్లకి పనికొచ్చే ఇట్లాంటి మంచిపన్లు చేస్తుంటే నేను మనసారా అభినందిస్తాను,ఇందులో యెలాంటి వెతకారమూ లేదు - నమ్మండి!

4 comments:

 1. Babu should move to VJA and pull all their staff too. Unless he is offensive and pull down hyderabad brand he would not win in AP again. He should create deflation in hyderabad and insecurity for investors. This offshore governance should stop immediately, else he and AP will lose alot.

  ReplyDelete
 2. బాబు అధికారంలో ఉంటే నీటిలో ఉన్న మొసలి లాంటివాడు. అధికారం ఆంధ్రాలో రాజకీయం తెలంగాణా లో అంటే ఎలా ..? అధికారం అనే నీటిలో కాక తెలంగాణా ఒడ్డున ఉన్న బాబును కుక్కకూడా లెక్క చేయదు. హరిగారు మీకిమధ్య నోటి దూల బాగా ఎక్కువైనట్లుంది. రెడ్డిగారికి కొవ్వుంటుందని మీరే డిసైడ్ చేస్తే ఎలా..? కి కూ రెడ్డి ఎ పరిస్థితిలో ఆమాట అన్నాడో పాత పేపర్లు తిరిగేయండి. ఇక్కడ ఎవ్వడు పతివ్రతా రాజకీయాలు నడపట్లేదు. ఎ కులపోడు అధికారారం లోకి వస్తే వాడు కులాన్ని ప్రోత్స్తహిస్తాడు. ఎన్టీఆర్ tdp కి ముందు ఎంతమంది కమ్మవారు బలంగా రాజకీయాల్లో ఉన్నారు. చెన్నయి లో వ్యాపారాలు చేసుకునే కమ్మవారు tdp అధికారంలోకి వచ్చాక కోస్తంద్ర్హాలో కమ్మ కాపుల మధ్య యుద్దమే జరిగింది. కారంచేడు సంఘటన వారు అధికారంలో ఉన్నపుడే జరిగింది. అందుకే రా.కీ.నా లు . ఎ రంగు సీసాలో పోస్తే ఆ రంగులో కనబడతారు. చం . బాబు ను తక్కువ అంచనా వేయకండి ఎవ్వరితో నైన యూ బ్రూటస్ అనిపించుకోగల అన్ని అర్హతలు ఉన్నవాడు.

  ReplyDelete
  Replies
  1. @san
   కికురె ఆ మాతలు అన్నది తెలుసుకోవడానికి పాతపేపర్లు తిరగెయ్యదం దేనికి?ఆ మాట అంటున్నప్పటికే ఉద్రేకాలు ఉన్నాయి కదా,వాళ్ళు ఆ ప్రస్తావన తీసుకొచ్చిందే అందుకు కదా/!దానికి ఆజ్యం పోస్తూ మాత్లాడటం అంటే వాళ్ళని ఇంకా వెర్రెత్తించటమే కదా?తెలంగాణా వాదులు యే పెద్దమనుషుల ఒప్పందాన్ని గురించి గత్తర చేస్తున్నారో ఆ అకాలంలో అధికారంలో ఉన్నది యే కులస్థులు?వాళ్ళ క్యారెక్తర్లు యేమిటి?నేను గోన గన్నారెడ్డిని విమర్శించానా?"సై సైరా చిన్నపరెడ్డీ నీ పరేఅ బంగరు కడ్డీఎ" అని పాతలు పాడుకున్న చిన్నప రెడ్డిని విమర్శించానా?

   Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు