ఇప్పుడిక్కడ రెండు చీలుదారుల శృంగాటక జంఝాటంలో ఇరుక్కుని ఉన్నాం మనం.దేన్ని యెంచుకోవటమా అనేది తప్పనిసరి మొహమాటాల్తోనూ కీర్తిప్రతిష్ఠల వ్యామోహాల్తొనూ నిర్ణయించుకోవాల్సిన పని లేదు - అంత గందరగోళమూ లేదు!దేనికి దానికి ఖచ్చితమైన లాభనష్టాల మదింపు - ఈ యెంచుకున్న దారిలో నడవాలంటే ఏ దుర్గుణాల్ని ప్రయత్నించి వొదుల్చుకోవాలి,ఏ మంచి లక్షణాల్ని నేర్చుకుని సాధించాలి అనే అవగాహన - స్పష్టంగానే ఉంది.
ఒక దారి - వ్యామోహాల వల్ల కలిగే భీభత్స విషాదాల్తో కలగుండువడి తలదించుకు తిరగాల్సిన నిత్య నిరంతర దాసత్వం - రాజీ మార్గం.ఈ దారిలొ నడిచేవాళ్లు తలని మోకాళ్ళ మధ్యకి చేర్చుకుని గూని గొడుగులా వంచుకుని యెదురైన ప్రతి అడ్డగాడిదకీ వంగి వంగి సలాములు చేస్తూ ఇతర్ల కాళ్లకి అడ్డం పడకుండా చూసుకుంటూ తన కాళ్ళని అడ్డదిడ్డంగా ఝాడిస్తూ నడవాల్సి ఉంటుంది,తప్పదు!ప్రతివాడూ తన వ్యక్తిత్వాన్ని కొంచెం కొంచెం కించపరుస్తున్నా నవ్వుతూ భరించగలిగితే యెంతటి అవమానానికైనా తిరుగుబాటు చెయ్యని నిరపాయకరమైన వ్యక్తి అని నమ్మించగలిగితే మంచివాడూ మాననీయుడూ అనే బిరుదుల్ని ఇవ్వడం జరుగుతుంది.
నీ దగ్గిరున్నదాన్ని గుంజుకునేటప్పుడు నీకు నెప్పి తెలియకుండా ఇచ్చే ఆ ఘనమైన పొగడ్తలన్నీ నిన్ను బాగానే సంతృప్తి పరుస్తాయి.అప్పుడప్పుడూ నీ కన్నా చవటల దగ్గిర్నుంచి లాక్కుని "అప్పుడప్పుడూ నేనూ సమర్ధుణ్నే సుమా!" అని నువ్వూ మురిసిపోవచ్చు.స్వతంత్రంగా దేనికీ ప్రయత్నించకపోవటం వల్లనూ యే గొప్ప పనికీ నాయకత్వం వహించకపోవటం వల్లనూ తీరిగ్గా వైఫల్యాల గురించి బెంగపెట్టుకోవాల్సిన సన్నివేశమేదీ యెదురుకాకుండానే హాయిగా కాలం గడిచిపోతుంది - అది చాలు నీకు!పరిస్థితులు యెంత ప్రతికూలంగా ఉన్నా శీతలరక్తజంతువుకి మల్లే చక్కగా సర్దుకుపోగలిగి ఉండి స్థిమితమైన బతుకును కోరుకునే ప్రశాంతమనస్కులకి ఈ దారి అత్యంతమొ భద్రత నిస్తుంది.
కానీ,స్వాభిమానం ఆబిజాత్యం లాంటి ఉన్నత లక్షణాల్ని గురించి మాత్రం ఆలోచించకూడదు.అవమానాలకి రోషపడి ప్రతిఘటించటం లాంటి అలవాటు లేని దుందుడుకు పనులు కొత్తగా మొదలు పెట్టిన మరుక్షణమే నీ జీవితంలో ఒడిదుడుకులు మొదలవుతాయి,జాగత్తగా ఉండు!నీ శక్తికి మించిన కష్టాలు యెదురవడం వల్ల నీ బౌధ్ధికపునాదులు కదిలిపోవచ్చు - కనుక తార్కికంగా ఆలోచించడం ఈ దారిలో వెళ్ళడానికి లాభసాటి కాదు?!
మరో దారి - ఠీవిగా రొమ్ము విరుచుకుని శిరస్సు నిఠారుగా నిలబెట్టి అడుగులు ధాటిగా వేస్తూ ఆత్మాభిమానం గలవారు మాత్రమే నదవగలిగిన త్యాగభరిత జీవనం - రాజమార్గం!ఈ దారిలో నడిచేవాళ్ళు దృష్టిని దిగంతాల వరకు ప్రసరిస్తూ ఎవరికీ అతివినయాలు చూపకుండా స్థిరమైన గమనంతో కదలగలుగుతారు.ఐతే,చూపు ప్రసరించినంత మేరలో కనిపించే యెంత చిన్న అంశాన్నీ నిర్లక్ష్యం చెయ్యని సమదర్శిత్వం ఉండాలి.ఇంకా క్రిందటి క్షణం వరకూ మనం ప్రాణాధికంగా ప్రేమించిన దేన్నైనా సరే క్షణమాత్రపు సంకల్పంతో ఆ అర్వాత మరెన్నడూ దాన్ని వదిలినందుకు బాధపదకుండా త్యజించగల నిర్మోహత్వం అలవర్చుకుంటే అది కొన్ని సందిగ్గ్ధ క్షణాల్లో అక్కరకొస్తుంది.
ఈ దారిలో కదలడమంటే వ్యామోహాల్ని జయించి - ఒక పధ్ధతీ పాడూఒ లేని సామాజిక స్థితి మన వ్యక్తిత్వాల మీదకి విసిరే - ప్రలోభాల్ని తప్పించుకుంటూ సాధ్యపడినప్పుదు తోటివార్ని కూడా ఉచ్చుల్లోంచి బైటపడేస్తుండటం గనక ఇతరుల మీదకి వలలు విసిరి తమ ఉచ్చుల్లో చిక్కుకున్న అమాయకుల్ని పీల్చిపిప్పి చెయ్యడమే జీవనోపాధిగా పెట్టుకున్న వారు అక్కసుతో నిన్ను ణౌతికంగానూ మానసికంగానూ హింసకి గురి చెయ్యవచ్చును కూడా!అందుకు సిధ్ధంగా ఉండి ఆ హింసకు ప్రతిహింస చెయ్యటానికి ఆయుధం పట్టాల్సిన తప్పనిసరి సందర్భంలో దానికీ నువ్వ్వు వెనుకాడకూడదు.ఐతే శత్రువు మీద చేసే దాడిలో ఆత్మరక్షణ పరిధిని దాటి ఒక్క అమాయకుడినైనా నీ చేతినుంచి ప్రయోగించబడిన ఆయుధం గాయపర్చినా,నీ తడాఖా చూపించి యెదటివాణ్ణి భయపెట్ట్ నెగ్గుకురావాలనే ఉబలాటం నీ అమనస్సులో కదిలినా - ఉత్తరక్షణంలో నువ్వు ధర్మమార్గం నుంచి తప్పుకుని నీ మడమలు వెనక్కి తిరిగిపోయి ఆ పిశాచాల గుంపులోనే కలిసిపోయినట్టు లెఖ్ఖ!
ఒక్కటి గుర్తుంచుకో,ధర్మవీరులైన వారిలో తాము నడిపే ఉద్యమాల్లో శత్రువుల మీద చేసే న్యాయపూరితమైన దాడిలో పోరాటానికి దూరంగా ఉన్న అమాయకులు బలి కాకుండా చూదతం యెత్లాగన్న తపన యే స్థాయిలో ఉంటుందో,తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ లక్ష్యాన్ని యెంత సమర్ధవంతంగా నిర్వహించుకు రాగలరో అంతవరకే సాధుసజ్జనుల దృష్తిలో ఆదర్శప్రాయులౌతారు!
(18/09/1991)
ధర్మానికి కట్టుబడిన వాడు ఓడితే ధర్మం ఓడినట్టు - సాధుసజ్జనులకు ప్రమాదం కలుగుతుంది!ఓటమిని గర్వంగా చెప్పుకోవాలనుకోవడం తప్పు, ఓడిపోకూడదనే పంతంతోనే యోధుడు యుధ్ధం చెయ్యాలి!ఓడిపోతామని తెలిసినా ఒళ్ళు దాచుకోకుండా పోరాడగలిగిన వాడే నిజమైన యోధుడు!యుద్ధం చెయ్యకుండా వెనక్కి తగ్గే భీరుత్వం యెనాటికీ గౌరవప్రదం కాదు.ఇవన్నీ నిక్కచ్చిగా జరిగి తీరాలంటే ముందు నీ శత్రువుని గుర్తుపట్టాలి,శత్రువు ఫలానా అని తెలుసుకోవడంలోనే యోధుడికి వివేకం అవసరమౌతుంది!చెయ్యగూడని వాడితో యుధ్ధం చేసి అంతా అయిపోయాక అమాయ్కుణ్ణీ వేధించానని పశ్చాత్తాప పదటం యోధలక్షణం కాదు!
క్షాత్రమా దాస్యమా అనే ప్రశ్న వస్తే నేను క్షాత్రం వైపుకే ముగ్గు చూపుతాను!ఒక మహానుభావుడు "శాంతి అనెది రెందు యుధ్ధాల మధ్యన వచ్చే విరామం లాంతిది" అన్నాడు, మరో మేధావి "శాంతి కోసం సమరమే సాధనం" అన్నాడు!అవును,శాంతిని భగ్నం చేసేవాళ్ల మీద యుధ్ధం చేసి వాళ్లని నిగ్రహించడం వల్లనే మనం శాంతిని స్థాపించగలము,ఆ యుద్ధం ఆగితేనే అశాంతి పైకి లేస్తుంది.యెప్పటికీ నాకు స్పూర్తి నిచ్చే మంత్రవాక్యం ఒకే ఒక చిన్నమాట:

శాంతి కోసం సమరమే సాధనం!!!
No comments:
Post a Comment
సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు