Monday 29 June 2015

అయ్యలారా?అమ్మలారా!ఆంధ్రాని బాగుచెయ్యలి సాయం పట్టండయ్యా!పనీ పాటా యేమీ చెయ్యఖ్ఖర్లేదు - పీకల్దాకా తాగితే చాలునండయ్యా?!

     మంచోడు మంచోడు మామిడికాయంత దొడ్డోడు అని మురిసినంతకాలం పట్టలేదు మంచమంతా చెడగొట్టే రకమని తెలియడానికి?!అప్పుడెప్పుడో మామగారు పార్టీ పెట్టినప్పుడు అటు వెళ్ళలేదు మర్యాద కోసమైనా - ఉన్న పార్టీకి అంకితమైన నిజాయితీ అనుకుందామా?అబ్బే,మామ గెలిచి అధికార పీఠం యెక్కడం ఖాయం అని తెలిసేదాకా ఆగి అప్పుడు ఝామ్మున జంపయ్యాడు!ఫలితాలు తెలియడానికి ఒక్క రోజు ముందు దూకినా నాబోటివాళ్ళు మంచివాడేలే ఆఖరి నిముషాల్లో అయినా జనంలో పొంగిపొర్లిఉతున్న వూపుని గమనించి నిజాయితీగానే వచ్చాడని నమ్మేవాళ్ళు - అడ్డెడ్డెడ్డే, కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలాగా దూకేశాడు!పోనీ మామగారికి మంచిపేరు తెస్తూ తన మర్యాద కాపాడుతూ నైతికంగా ఉన్నతంగా ఉన్నాడా అంటే అదీ కుదురుగా చెయ్యలేదు.అప్పటి దాకా తన చుట్టూ తిరుగుతున్న జనం ఒక ఆడదాని చుట్టూ తిరగడం భరించలేక కొత్తగా రాజపురోహితుడి వేషం కట్టాలనుకున్న వాధా ఘృష్ణ లాంటి సంస్కారహీనపు  మీడియా మాయావులు మామగారి చెవిపోగుల గురించీ మారిన బొట్టు తీరుల గురించీ యెద్దేవా చేస్తూ ఒక దుష్టశక్తిని సృష్టించి జనాన్ని భ్రమింపజేసి ప్రజాప్రతినిధుల్ని యెత్తుకెళ్ళి విలాసవంతమైన పంచతారల భవనాల్లో దాచి చాలా గొప్ప ప్రజాస్వామికంగా తిర్రుగుబాటు చేశాడు!ఇల్లలుకుతూ పేరు మర్చిపోయిన ఈగలా తన చరిత్రని మర్చిపోవడం వల్లనేమో ఇవ్వాళ మరొకడు దిమ్మ తిరిగి గూబ గుయ్యిమనిపించే దెబ్బ కొడితే విలవిలలాడుతున్నాడు - ఒక సచ్చీలుణ్ణి అపఖ్యాతి పాలుచేసినంతగా రోదిస్తున్నాడు!రామహత్యాపాతకం  కట్టి కుడపక మానుతుందా?

     విమానంలో మాంగారి కాళ్లకి అడ్డం పడిన పెట్టెని అటు జరిపి ఇటు జరిపి హడావిడి చేసిన మనిషే విమానం దిగగానే చాలా కూల్ కూల్ యెత్తుగడతో గూబ గుయ్యిమనిపించిన చతురత వెనక్కాల పెట్టుకుని ఇప్పుడు అదే తారకరాముని అభిమాని తన అభిమాననేతను దెబ్బతెసిన విలన్ మీద పగతీర్చుకున్నంత సరదాగా కొట్టిన తమలపాకు సరసానికే హడిలిపోతున్నాడు వృధ్ధనారి పతివ్రత అయినట్టు!

     యేం మాట్లాడితే పేపర్లో పెద్దచ్చరాల్తో తన పేరు పడుద్దో,యేం చేస్తే అందరూ తనని ఇంద్రుడూ చంద్రుడూ అని పొగుడుతారో అనే ప్రచారకండూతి తప్ప ప్రజల గురించి యేనాడన్నా నిజాయితీగా ఆలోచించాడా?అలా అలోచిస్తే అధికారం పోయినప్పుడు తెరాసా సాయంతోనైనా మళ్ళీ అధికారంలోకి వద్దామని కలలు గన్న రోజులు గుర్తు లేవా?తెలంగాణ నేత ఒకడు ఉసిగొలుపుతుంటే గయ్యాళిమంద అంతా ఒక్కటై ఆంధ్రావాళ్ళని అన్యాయంగా తిడుతున్నప్పుడు అదేం మాట మీకు రాష్త్రం కావాలంటే అడిగి తీసుకోండి మీ కష్టాలకీ సమస్యలకీ ఇతర్ల నెందుకు తిట్టడం అని నిలదీసి అడిగి ఆంధ్ర ప్రజల్లో ఉండే స్వాభిమానం నిలబెట్టాలని అనుకున్నాడా?తన స్థానంలో యెన్.టి.ఆర్ ఉంటే అలా కిక్కురుమనకుండా ఉండేవాడా?సాఫ్టువేరుతో మ్యాజిక్కులు చేసి ఉద్యోగాలు రప్పించటం పిడకలేసినట్టు ఒకే ఒక్క నగరంలో అభివృధ్ధిని పోగుపడెయ్యటం - ఇవేనా నాయకత్వానికీ సమర్ధతకీ గీటురాళ్ళు?ప్రజల్లో రోటీ కపడా మకాన్ అన్న ఆ మూడింటి తర్వాత ఆత్మాభిమానం అనేది ఒకటుంటుందనీ ఒక వర్గం వాళ్ళు కేవలం దురుద్దేశంతో భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలు కూడా వేసుకుని కారుకూతలు కుయ్యడం వల్ల ప్రజలు ఆ మాటలకి దీటుగా జవాబు చెప్పలేని తమ ప్రాంతం నాయకుల దేబెతనానికే యెక్కువ కష్టపెట్టుకుంటున్నారనీ గమనించని వాడు అతడేమి ప్రజానాయకుడు?విభజన అన్యాయంగా జరుగుతున్నదని తెలిసినప్పుదు అక్కడా ఇక్కడా పడుక్కుని అఘోరించే బదులు ప్రజల ముందుకొచ్చి అక్కడ జరుగుతున్నదేమిటో విప్పిచెప్పి ధైర్యంగా క్రూరమైన విభజనకి వ్యతిరేకంగా ఉద్యమిస్తే యెవరు అడ్దుకునే వాళ్ళు - గోడమీదిపిల్లి రాజకీయపు మనస్తత్వం నిలువెల్లా మూర్తీభవించటం వల్ల కాదా ఆ ఫలితమివ్వని తింగరి పనులన్నీ చేసింది!సమర్ధించావా తెలంగాణాని నిండుమనస్సుతో సమర్ధించి సహాయం చేసి ఆంధ్రాకి న్యాయం జరిగేలా పోట్లాడాలి, లేదా లక్షమంది వ్యతిరేకించినా సరే ఇది నా పాయింటు భవిష్యత్తులో తెలుస్తుంది నేను రైటో మీరు రైటో అని చెప్పి గట్టిగా నిలబడాలి - అది నిజమైన నాయకత్వ లక్షణం అంటే,అది వుందా మనోడికి?

     తమ నాయకుల్లోనూ తమలోనూ ఉన్న వెధవాయిత్వాల్ని గురివిందల్లాగ దాచుకుని ఆంధ్రావాళ్ళ దోపిడీ వల్ల మేం నష్టపోయాం అని తిడుతుంటే ప్రాంతీయాభిమానం ఆంధ్రుల కుండకూడదా?ఆంధ్రప్రజల తరపున మాట్లాడే అవకాశం ఉండి కూడా రెండు కళ్ళ సిధ్ధాంతం చాటున నత్తిమాటలు మాట్లాడకుండా ఉంటే ఆంధ్రపరజలు తనకి కూడా మామగారిని మించి నీరాజనాలు పట్టి ఉండేవాళ్ళు - ఆంధ్రుల ఆత్మాభిమానం అనే నినాదంతో పుట్టిన పార్టీలో ఉండి స్వాభిమానం లేకపోవటం వల్ల అవకాశం జారవిడుచుకుని ఒంటికన్నుతో మిగిలాడు, ఆ ఒక్కటి గూడా గుడ్డికన్ను మూస్తే యెంత తెరిస్తే యెంత అన్నట్టు ఉంది!

     అదంతా పోనీ విభజన తర్వాత ఇంతవరకూ రాష్ట్రానికి నికచ్చిగా యేమి సాధించాడు?యెంతసేపూ రాను రానంటూ చెట్టెక్కి కూచున్న పక్క రాష్త్రపు ముఖ్యమంత్రిని చర్చలకి పిలుస్తూ ముసలి ముత్తయిదువ కబుర్లు చెబుతూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి యేమో గయ్యాళితనంతో షెడ్యూలు 10లోని వాటితో సహా అన్నిటికీ లుంగజుట్టి ఒడేసుకునేందుకు ఇప్పటికే హోం వర్కు పూర్తి చేసేసుకుని అవకాశం కోసం యెదురు చూస్తున్నాడు!విభజన చట్టంలోనే ఉండి విభజన చట్టం ద్వారా అధికారికంగా దఖలు పడి ఆంధ్రాకి రావలసిన వాటిలో దేన్నీ సాధించకుండా యేడాదిలో ఈ పోటుగాడు చేసిన ఘనకార్యం యెమిటి?అసలు విభజన బిల్లుని వండివార్చిన వాళ్ళు విభజన తర్వాత ఆంధ్రప్రదెశ్ అనే భూభాగం ఒకటి ఉంటుందని అనుకున్నారా అని అనుమానమొచ్చేలా చేస్తుంటే చూస్తూ కూర్చున్న వాడు ఇవ్వాళ కేంద్రంలో నలుగురు మంత్రుల్ని చేర్చి కూడా ప్రత్యేకహోదాని కూడా సాధించలేకపోవడం అంటే అక్కడ నడుస్తున్నది సమస్థాయిలో ఉండి చేస్తున్న స్నేహమా?లేక వాళ్ళ సాయం లేనిదే పదవిలో ఉండటం కష్టమని తెలిసిన కుర్చీ కాపాడుకునేందుకు పనికొచ్చే దాస్యమా?

     పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు హైదరాబాదులో కూర్చుని కేసుల్లో ఇరుక్కుని అఘోరించకపోతే అప్పటి ముఖ్యమంత్రి చేసినట్టు రెండవ నిముషం నుంచే సొంత రాష్ట్రం నడిబొడ్డు నుంచి పారిపాలించవచ్చు గదా?ఇప్పుడు సౌకర్యవంతమైన భవనాలకీ కొదవ లేదు గదా!ఒకవేళ ఉన్నాడే అనుకుందాం తన జాగ్రత్తలో తను ఉండొద్దా!అంతా అయిపోయి అడ్డంగా దొరికిపోయాక ఇపుడేడ్చి యేం లాభం?ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి యొక్క  సిధ్ధాంతం,వ్యూహం,ఆయుధం అన్నీ ద్వేషమే నని చిన్నపిల్లాణ్ణి అడిగినా చెప్తాడు, తనింకా అతను తన మంత్రివర్గంలో చేతులు కట్టుకు తిరిగిన మనిషిలాగే చూసినందుకు ఫలితం అనుభవిస్తున్నాడు!మన రాష్ట్రానికి యేదయినా గట్టిగా అడిగితే తెలంగాణలో 2019కి దెబ్బ తగుల్తుందేమో అనే రంధిలో అన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి ధాటిగా మాట్లాడి లాక్కుపోతున్నా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చోవడం వల్ల యేమి వొరిగింది?!ఇప్పుడు షెడ్యొలు 10 విషయంలో నైనా గట్టిగా ఉంటాడో వీట్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి వాగ్ధాటికే వదిలేస్తాడో?

     అడ్డగోలుగా దొరికిపోయేలా కేసులో ఇరికించటమంటే మొహం మీద ఉమ్మెయ్యటం లాంటిదే కదా - ఇంకా చూరు బట్టుకుని ఇల్లిటపుటల్లుడి లాగా కేంద్రాన్ని నేనిక్కడే ఉంటాను నాకు ఆర్టికిల్ 8 కావాలి అని మారాం చేస్తున్నాడంటే సిగ్గూ లజ్జా వొదిలేసినట్టు కాదా - క్షాత్రం తనకి లేదని ఆంధ్రప్రదేశ్ జనం కూడా తనలాగే అన్నీ వొదిలేసుకుని కూర్చోవాలా!కేంద్రం కలగజేసుకుని చెప్పినంత మాత్రాన తెలంగాణ ముఖ్యమంత్రి వింటాడా?ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని యెన్నికలకి దిగుతాడు, యెవడి పెర్ఫామెన్సూ బాగోలేని స్థితిలో మోదీ గానీ తను గానీ ఇప్పుడు యెన్నికలకి సిధ్ధంగా ఉన్నారా - యెందుకింకా అభాసు పాలయ్యే క్షాత్రం లేని నికృష్టపు పనులు?దెబ్బ తిని ఇన్ని రోజులైంది తిరిగి దెబ్బ కొట్టగలిగాడా?దెబ్బ కొట్టే పాటి తెగువ లేనప్పుడు అక్కడ స్థానబలిమి లేనప్పుడు ఇంకా ఆక్కడే యెందుకు?అటువైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రంతో యేమాత్రం పనిలేకుండా ధీమాగా తనకి కావల్సినవన్నీ పోట్లాడి మరీ సాధించుకుంటూ మగాడిలాగా నెట్టుకొస్తూ ఉంటే ఈ పునిస్త్రీ రాజకీయంతో నాబోటివాళ్ళకి విసుగు తెప్పిస్తున్నాడు!

     రాష్ట్రం లోటుబడ్జెట్టులో వచ్చింది!కేంద్రం నుంచి ప్రత్యేక హోదా కానీ ఇతోధికమైన సాయానికి నికరమైన వాగ్దానం కానీ యేదీ తేలేదు!అయినా ప్రపంచం పట్టనంత రాజధాని కడతానంటున్నాడు - ఆదాయం యెక్కడిదయ్యా అంటే గంధపు చెక్కల స్మగ్లర్ల నందర్నీ చంపేసి వాళ్ళనుంచి స్వాధీనం చేసుకున్న చందనం ముక్కల్ని అమ్మటమూ మద్యం షాపుల్ని పెంచటమూ అద్భుతమైన పరిష్కారాలట - వీటి తర్వాత  వ్యభిచారాన్ని చట్తబధ్ధం చేసి వ్యభిచార కేంద్రాల్ని కూడా తెరిస్తే బాగుంటుంది?!

కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టినట్టు ఒక ఆల్పుడికి అధికారమిచ్చామా గతిలేక!

31 comments:

  1. Actually this Note for Vote is really good for AP. It pushes CBN and staff quickly to AP. It pushes for sec-8. It pushes for aggressive behavior of AP min/CBN. Otherwise he is murmuring like a cat. Tanadaka vaste kani tatvam teliyaledu. We lost a lot for sec 10. But sec9 gives all headquarters to be shared with 58:42. Bus bhavan itself would get 2000cr for AP i think with this 58% share ;-) i hope with all those corporations AP would easily get 10kCrore property from corporations. Lets see. If we get sec10 properties then its bonus.

    ReplyDelete
    Replies
    1. I don't think this is going to happen. It seems, both parties already compromised. All this hungama goes for few more weeks, later it will disappear. As usually, CBN try for strengthening the party in Telangana at the expense of AP.

      Delete
    2. @Anonymous29 June 2015 at 09:44

      "Bus bhavan itself would get 2000cr for AP"

      Share may not mean physical possession but only accounting adjustments.I don't know what is the book value of Bus bhavan. BTW assets & liabilities will be both shared in the same formula.

      Even if Andhra gains possession, leveraging on an asset located in a different state is not going to be easy.

      "If we get sec10 properties then its bonus"

      Negligible chance in the light of HC judgment

      Delete
    3. Dear Jai, For sec9 physical Assets of corporations will be based on location. Headquarters will be with population. Since most of the HQs lie in HYD AP would get 58% physical asset. Bus bhavan is ~20 acre land in RTC crossroads which would be ~3-4kCr in full. RTC had mortgage on it with 1000cr+ as far i remember. So If ap want they can sell their stake and get rid of the debt. They can buy 1 acre along the side of Ikea ;-) for 20cr.

      For sec10, AP would get bank deposits 58%, documents, files relevant to them or copies of other... Lets see.

      Delete
    4. Above Anonymous,

      Land at RTC Cross Roads was assigned to then NSRRTD (Nizam's State Road Transaport and Railway Department) by erstwhile Nizam. So Andhra do not have any claim on that property.

      Left is the building of Bus Bhavan. But if you compare all mega structures in RTC, Telangana have only three, MGBS, Bus Bhavan and JBS where AP have Mega Bust Stations at Vijayawada, Vizag, Guntur, Kurnool and Tirupathi. Likewise if all structures, depots and workshops are compared, they have already have there fair share located in present AP.

      Delete
    5. I can't find any evidence that the share will be transfer of physical assets. It may not even be possible to divide a building into two parts.

      Delete
    6. Guys, i am not the one who is dividing the assets. Sec9 corporations are not like sec10. A state can have its corporations in another state. like himachal pradesh govt owned juice shops in every bus stand.. just follow the RTC division and committee on sec 9 assets. You will understand in future. I want to see how AP get singareni's HQ assets share. its also in sec 9 i think.

      Delete
  2. I think you took a U turn with cbn. He is is a fraud and you supported him before too many times and he needs your support now.

    ReplyDelete
    Replies
    1. I never supported CBN blindly.I alraedy specified I have some disbelif in hm and I put my anger in many of my posts!

      Delete
  3. ఫ్రష్ట్రేషనపు ఆవేశం వ్యాసంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నాయకులు రెండు కళ్ళ సిద్ధాంతమని చెప్పి ఎప్పటికైనా తెలంగాణాలో అధికారం రాకుండా పోతుందా అన్న ఆశతో అక్కడే దేవుళ్ళాడుతున్నారు. మహానాడులూ మహాసంకల్పాల్లాంటి ఊకదంపుడు కాలక్షేపాలు తప్పితే ఏడాదిలో ఒనగూడింది శూన్యం. ఎదైనా చేయగలరా అంటే ఇక్కడున్న ప్రతిపక్షమే పక్కలో బల్లెమైపోయింది. ఇంకో నాలుగేళ్ళిలా ఈడిస్తే మళ్ళీ ఎన్నికల ప(దం)డగ. ముఖ్యమంత్రి ఢిల్లీలో అందరి తలుపులూ సాయంకోసం తట్టడం చూస్తుంటే అలనాడు పదవీభ్రష్టుడైన రామారావుగారు హైదరాబాదు వీధుల్లో మైకుల్లో ఆక్రోశించిన వైనం గుర్తుకొస్తోంది.

    ReplyDelete
    Replies
    1. ఫ్రష్ట్రేషనపు ఆవేశం వ్యాసంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
      ?
      చంద్రబాబు హైదరాబాదులో తిష్ట వేసుకుని ఉండటాన్ని మొదతినుంచి వ్యతిరేకిస్తున్నాను,మరోసారి బలంగా చెప్పాను.

      అప్పట్లోనే ఆంధ్రావాళ్లని తిడుతున్నప్పుడు తనకి అవకాశం ఉంది కూడా మాట్లాడలేదనే మాట కూడా యెప్పటినుంచో చెప్తున్నాను.ప్రత్యేక హోదా గురించి కూడా తను గట్టిగా ప్రయత్నించకపెవటం వల్లనే రాలేదని నాకు గట్టి నమ్మకం!

      ఇప్పుదు నాలో కొత్తగా ఫ్రస్టేషనం యేముంది?

      ఒక్కటి చూడండి,కేంద్ర మంత్రివర్గంలో నలుగురు ఉండి కూడా ప్రతి చిన్నదానికీ ఈయనే పరిగెడుతున్నాడు,యెందుకని?అక్కడున్న వాళ్ళు సమర్ధులైతే ఇతను మాటి మాటికీ వెళ్ళాల్సిన పని ఉంటుందా?

      తన పార్టీ వాళ్ళు నలుగురు కేంద్రమంత్రివర్గంలో ఉండి కూడా అక్రమ సహాయాలు అఖ్ఖర్లేదు,మనకి న్యాయంగా రావలసిన వాటికి కూడా దేబిరించీ ముష్తెత్తీ కాళ్లరిగేలా తిరిగాల్సిన పని ఉందా?

      ఇవన్నీ నేను యెప్పటినుంచో అదుగుతున్న పాయింట్లే - కొత్తగా వచ్చిన ఆవేశ్శం,ఫ్రస్టేషనం లాంటివి యేమీ లేవు.

      Delete
  4. ఇంతేనా, ఇంకా తిట్టడానికేమైనా మిగిలి ఉన్నాయా?
    కరక్టుగా ఇదే తేడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల మధ్య.
    వాళ్ళ ముఖ్యమంత్రి ఏమి చేసినా వాళ్ళు సమర్థిస్తూనే ఉంటారు.
    మనం మాత్రం, మన ముఖ్యమంత్రి తప్పులు ఎన్నుతూ కూర్చుంటాము.
    ఇక్కడ ప్రతిపక్షం కూడా ఇంతే. మనలో మనకి ఏమైనా ఉంటే విడిగా చూసుకోవాలి కాని బయటి వాళ్ళతో మాత్రం కలిసే పోరాడాలి. ఈ విషయంలో తమిళులని చూసి మనం నేర్చుకోవాలి.

    ReplyDelete
  5. "కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టినట్టు ఒక ఆల్పుడికి అధికారమిచ్చామా గతిలేక!"

    ఇన్ని రోజులకి సరైన మాట చెప్పారు ఆయన గురించి. కానీ కుక్కతో పోల్చితే కుక్క జాతికి కూడా అవమానమే, కుక్కకున్నంత విశ్వాసమే ఉంటే, రామారావు గారు అలాంటి దిక్కుమొక్కు లేకుండా పోయేవాళ్ళు కాదు, రామారావు వుసురు బాబుని కట్టికుడుపుతుంది, వోటు-నోటు కేసులో జైలుకు పొతేనైనా ఆ పాపం కొద్దిగా ప్రక్షాళన అవుతుందేమోననుకుంటే అడ్డమైన వాడి కాళ్ళు పట్టుకొని తప్పించుకునేలా ఉన్నడు చూడబోతే

    ReplyDelete
    Replies
    1. అల్పుడా అల్లుడా ఒకే అక్షరం తేడా!
      కుక్కంటే డ్రామారావు ఉద్దేశ్యంలో భాజపా వాళ్ళు :)

      Just for fun

      Delete
  6. హరిగారు... మీరు పురాణాలకేక్కువ రాజకీయాలకు తక్కువలాగున్నారు. బాబు, జగన్ లాంటివాళ్ళు వ్యాపార రాజకీయవేత్తలు. వారికి ఆత్మగౌరవమయిన ఆకుల కట్ట ఐనా వారికి అనవసరం. ఇక ఆత్మగౌరవం, ప్రాంతీయ తత్త్వం అంటారా ఇవన్ని సామాన్యులను రెచ్చగొట్టి ఓటు చేసుకోవాటానికే. ఉదా: ఎన్టీఆర్ ఆత్మగౌరవం పేరుతొ ఇందిరాగాంది ని ఎదిరించినా..మోడీ గుజరాత్ వాడి దెబ్బ ఏంటో చూస్తావని సోనియాగాంధికి సవాల్ విసిరినా, తెలంగాణా కోసం ఆంద్ర్హులను తిట్టిపోసినా అధికారం కోసమే అని మరిచిపోరాదు. అంచేత మనకు పురాణాలే ముద్దు రాజకీయాలు వద్దు.

    ReplyDelete
  7. హరి బాబు గారు,

    మనసులో మాటను చక్కగా చెప్పారు. మీరు మర్రిపుడి మహొజొస్ విశ్లేషణలు పేరున్న జర్ణలిస్ట్ ల కన్నా మంచి గా వస్తవాన్ని ప్రతిబింబిస్తూ రాస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. మర్రిపూడి మహోజస్ గారితో పోల్చినందుకు కృతజ్ఞతలు!

      Delete
  8. చంద్రబాబుకి ఇలాంటి దెబ్బలు బాగా తగిలితే గాని బుధ్ధిరాదు. జగన్ మీద, కాంగ్రెస్ మీద ఉన్న అసహ్యం తో పదవి ఇచ్చింది ఆంధ్రా. తన సమర్థత ని అభివృధ్ధితో నిరూపించుకోకుండా తెలంగాణాలో ప్రాపకం కోసం పాకులాడటం ఎందుకో.
    తెలంగాణలో TDP నాయకులకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే తరవాతైనా అవకాశం వచ్చేది. నక్కజిత్తులకి పోయి రెంటికీ చెడ్డ రేవడైపోయి అపోజిషన్ వాల్ల చేతుల్లోకి ఆయుధాలిచ్చాడు.

    అధికారం లో లేని టైం లో దీక్షలు చేయటం కాదు, ఇపుడు ఆంధ్రా కి న్యాయంగా రావల్సిన వాటికోసం దీక్ష చేస్తే ఢిల్లీ దిగిరాకుండా ఉండగలదా ?
    బహుశా వయసు ముదిరిపోవటం తో ధైర్యం తక్కువై లోభిలా పక్క రాష్ట్రం లో అధికారం కోసం పాకులాడటం దేనికి.
    తెలంగాణా తన పనులకు ఇవాల కాకపోయినా రేపైనా అనుభవించక తప్పదు. ప్రతిదానికీ ఆంధ్రావాళ్ళను దోపిడీ దారులంటూ తిట్టే ఆ గుంటనక్క గొట్టం గాడొకడు. ఇంతకీ తన ఉద్దేశం లో దోపిడీదారులంటే ఎవరో చెప్పడు. (1) ఆంధ్ర పారిశ్రామిక వేత్తలు తెలంగాణా వదిలి వెల్లక్కరలేదంట, వాల్ల లాభం వాల్లు చూసుకోవచ్చంట! (2) ఆంధ్ర రాజకీయ నాయకుల దోపిడీ అరికట్టబడిందనుకుంటున్నాడు. కాని తమ ముఖ్యమంత్రి కుటుంబం లో అంతమందికి పదవులు ఎందుకో మాత్రం ఎపుడూ అనుమానం రాదు ఆ బుధ్ధి హీనుడికి! తెలంగాణా గురించి ఆ కుటుంబం తప్ప ఇంకెవ్వరూ ఆలోచించట్లేదనుకుంటున్నాడో ఏమో!
    (3) సమైక్యం అనే మాట వినబడినా ఆంధ్రావారిని దోచుకోమని ఎవరూ పిలవరు అంటున్నాడు ఉలికిపడుతూ. ఇపుడు సమైక్యం అసలు ఆంధ్రావారికే అవసరం లేదు.

    తెలంగాణాని వారి గతికి వారిని వదిలేసి ఆంధ్ర తన తీరప్రాంతాన్ని, పంటభూములని వృధ్ధిచేసుకుంటే చాలు, అపుడు తమకి ఎవరూ సాటిరారు.

    ReplyDelete
    Replies
    1. ఒక ఊరి రెడ్డి ఇంకో ఊరిలో పనుల పోలిగాడు అనే సామెత చంద్రబాబుకి బాగా వర్తిస్తుంది.

      Delete
  9. తెలంగాణలో తనది ఇంకా unfinished business అని బి.జె.పి భావిస్తోంది. అందుకే మూణ్ణెల్లకోసారి కేంద్ర ఘనాపాటీలు హైదరాబాద్ వెళుతున్నారు, పనున్నా లేకపోయినా! వచ్చేసారి ఎవరితోనూ పొత్తులుండవనీ, సొంతంగా ఎదుగుతామనీ అమిత్ షా మొన్న హైదరాబాదులో కుండబద్దలు కొట్టేశాడు. అంటే కనీసం తెలంగాణ వరకైనా బి.జె.పి ఒంటరిగా TRS తో తలపడబోతోంది. కాబట్టి 2019 లో స్థానిక బి.జె.పి ని వెంటేసుకుని ఆ దన్నుతో TRS ని దించి తాను గద్దెనెక్కాలనుకుంటున్న TDP కలలు కల్లలేనని స్పష్టమవుతోంది. అందుకే BJP ప్రతివిషయంలోనూ తెలంగాణకి అనుకూలంగానూ, స్వంత మిత్రపక్షపు రాష్ట్రానికి వ్యతిరేకంగానూ ప్రవర్తిస్తోంది.

    గమనించండి. దీని వెనక వాళ్ళకి చాలా దీర్ఘకాలిక లక్ష్యాలున్నాయి. ఆంధ్రావాళ్ళం - అంత గ్రహించలేనంత అమాయకులం కాము. (నాయుడు కూడా ఇది గ్రహించలేనంత అమాయకుడనుకోను) ఒకవేళ BJP ఈ Future Telangana Mission లో విజయవంతురాలైతే ఆ ఫీట్ ని ఆంధ్రాలో రిపీట్ చేయడం కోసం ఇక్కడ TDP కి శత్రువులుగా మారడానికి వెనుదీయరు. అదీ గాక మొన్న తెలంగాణాలో TDP గెలిచిన సీట్లు కూడా 90% వరకూ దొంగవోట్లతోనేనని సమాచారం. ఆ వోట్లన్నీ ఏపీ నుంచి జరిగిన డబుల్ రిజిస్ట్రేషన్లట. అంటే TDP కి తెలంగాణలో ఉన్న లోకల్ వోటర్ బేస్ అంతంతమాత్రం అన్నమాట. ఆ వంకర వేషాలు తెలంగాణలో ఇకముందు చెల్లవు. అన్నీ తెలిసి ఇలాంటి పరిస్థితుల్లో నాయుడు తెలంగాణ మీద ఇంకా దిపుడుకల్లం ఆశ ఎందుకు పెట్టుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఆశపెట్టుకుని ఆంధ్రాకి అన్యాయం చేస్తున్నాడు మహానుభావుడు. ఇదీ రకం పరిపాలనావ్యభిచారం. విడిపోయాక మనకెందుకు తెలంగాణ గొడవ. పొద్దున్నే పాకీదొడ్డికెళ్ళినంతమాత్రాన రోజంతా దాన్ని తల్చుకుంటూ కూర్చోం గదా! అలాంటిదే హైదరాబాదు కూడా మన ఆంధ్రావాళ్ళకి! కేసీయార్ కి తెలంగాణ పట్ల ఉన్న నిబద్ధతలో సగమైనా ఆంధ్రా పట్ల నాయుడికి ప్రసాదించాలనీ ఈ పరిపాలనావ్యభిచార కూపంలోంచి ఆయన్ని త్వరగా బయట పడెయ్యమనీ ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం.

    ReplyDelete
  10. హరిబాబూ

    మా పేర్లను నువ్వు నిద్రలో కూడా తలుచుకోవడం మారిచిపోనట్టున్నావే!!

    భగవద్గీత చర్చలో వాటంగా తల బొప్పి కట్టించుకున్న సంగతి అప్పుడే మరిచావా?
    అప్పటి చర్చలో ఎటూ పాలుపోక, నీ మొండివాదనకి నలుగురూ అక్షింతలు వేసేసరికి కులాన్ని అంది పుచ్చుకున్నావు.
    కులాన్ని నిరసించి మాట్లాడాలంటే కులాంతర వివాహం చేసుకోవాల్సిందే అని కొత్త సిద్ధాంతం ప్రతిపాదించావు.

    నీ బుర్రలో లాజిక్ ఇంజను పనిచెయ్యదనుకుంటా! అందుకే ఆకుకూ పోకకూ అందకుండా మాట్లాడతావు. Grow up man!

    మేం తెలంగాణా వైపు మాట్లాడితే తెరాసలో చేరాలంటావు!

    మరి నీవు వీరలెవెల్లో ఆంధ్రాకి అన్యాయం జరిగిందని మాట్లాడుతావే!
    మరి ఎన్ని మిధ్యమాల్లో పాల్గొన్నావు - మీ పరకాల అధ్వర్యంలో!
    ఎన్ని సార్లు లాఠీ దెబ్బలు తిన్నావు, జైలుకెళ్ళావు?
    పౌరుషం ఉన్న క్షత్రియుణ్ణి అని చెప్పుకుంటావు కదా, మరి రాజిరెడ్డి లాగా పార్లమెంటు ముందు ఆత్మాహుతి ప్రొగ్రామేదైనా వుందా, ప్రత్యేక హోదా కోసం, లేక ఉట్టి బ్లాగుల్లో మాటలేనా?

    రామాలయం కట్టాలని వాదిస్తావే.
    మరి కరసేవకు అయోధ్య వెళ్ళావా?

    నువ్వు మాత్రం ఇలాంటి పిచ్చి లాజిక్కులు చెప్పితే ఫరవాలేదు, పొంతన లేని మాటలు మాట్లాడుతుందని ఓ ఆడకూతురిపై దెప్పిపొడుపా?

    చూశావా? ఎదుటి వారిపై రాళ్ళెయ్యడం వీజీ. అవే మాటలు మనవరకూ వస్తే గాని అసలు విషయం తెలుసుద్ది మరి!

    ReplyDelete
    Replies
    1. ఐతే నువ్వు గ్రామ సిం హం లెక్కన బ్లాగు భౌ భౌ గాడి వన్న మాట. తె లంగాణ పై ఉద్యమం ఉద్యమం అని మొరుగుతూఉంటావు. ప్రత్యక్షం గా పాల్గొనింది ఎమి లేదు. వచ్చాడయ్య సన్నాసి గాడు, జవాబివ్వటానికి.
      మీరు మాట్లాడుతారు గా లజిక్ గా.నువ్వు చెప్పరాదే, వెయ్యి నాగళ్లతో రామోజి పిలిం సిటిని ఎందుకు ఇంకా దున్నించలేదు? తేలంగాణా వాళ్లకు దమ్ము లేకనే గదా! ఆత్మహత్యలు చేసుకొనే వారిని, వీరులంటు ప్రోత్సహించే పిరికినా.. మీరు, మీమేధావులు.

      Delete
    2. సచ్చి బ్లాగులలో తిరిగే దెయ్యపు సన్నాసి,
      నువ్వూ మాట్లాడే వాడివే, వెళ్ళి నీ దొర కు కాళ్ళు నాకుతూ, ఏమయినా బిస్కెట్స్ పడేస్తే అద్దరాత్రి స్మశానం లో తింటూ కూర్చోక, నీకెందుకురా తెలబాన్ లాజిక్ ల గురించి, అది కాస్తో కూస్తో బుర్ర వున్న వాళ్లకు, అర్ధమయ్యిందా.

      Delete
    3. @sreekaant chaari
      భగవద్గీత చర్చలో వాటంగా తల బొప్పి కట్టించుకున్న సంగతి అప్పుడే మరిచావా?
      అప్పటి చర్చలో ఎటూ పాలుపోక, నీ మొండివాదనకి నలుగురూ అక్షింతలు వేసేసరికి కులాన్ని అంది పుచ్చుకున్నావు.
      కులాన్ని నిరసించి మాట్లాడాలంటే కులాంతర వివాహం చేసుకోవాల్సిందే అని కొత్త సిద్ధాంతం ప్రతిపాదించావు.

      నీ బుర్రలో లాజిక్ ఇంజను పనిచెయ్యదనుకుంటా! అందుకే ఆకుకూ పోకకూ అందకుండా మాట్లాడతావు. Grow up man!

      1.యెక్కడి మాటలు అక్కడ మాట్లాడితే సందర్భం తెలుస్తుంది.వ్యాసుడు గుణకర్మ విభాగయోగం చేసినట్టు చ్బితే మీరే పుట్టుకకి ప్రాధాన్యమిచ్చ ఆంగ్ల జాత్యహంకారుల సిధ్ధాంతాల్ని జాత్యహంకారాన్ని విమర్శించే మీరు మీకు సాక్ష్యానికి తెచ్చుకోవడం గురించి ప్రశ్నిస్తే జవాబు క్ష్హెప్పలేనిది మీరు!ఆ లింకు ఇప్పుడు కనబడటం లేదు గాబ్ట్టి యేది వాగినా యేమీ కాదనే ధైర్యం,అవునా?
      2.మరి,నువ్వు మాత్రం పత్తిత్తులాగా నీ కులంలో అమ్మాయినే పెళ్ళి చేసుకుని ఇతర్లకి కూడ అనా కులం గొప్పదని డప్పు కొట్టుకుంటే కులాలౌ యెలా ఒక్కటవుతాయి?!కులాలు ఉండకూదదు,సమానం అవ్వాలి అని చెప్పేవడిలో వైరుధ్యం ఉండకూడదు,కానీ కులాలు ఒక్కటి కాలేవు అంటున్న వాళ్ళు దానికి కటూబడి సిన్సియారిటీని చూపిస్తూనే ఉన్నరుగా!

      3.అయినా చిన్నప్పట్నించీ ఇష్టముండి నువ్వు చెసుకున్న వ్యక్తిగతమైన వ్యవహారాన్ని నేనెక్కడా విమర్శించ లేదు,నేను కూడా మేనరికమే చెసుకున్నాను,నిన్నెందుకు ఆ పాయింటు మీద విమర్శిస్తాను.కంచేఇలయ్య గారు హిందూ మతం సవర్ణ హిందువుల బ్రహ్మాణాధిపత్యం గల మతం అని అంటొనే నా కురుమగొల్ల కులం విశ్వవ్యాపతం కావాలి అని ఆశిస్తున్నాడే - ఆ వీరుధ్యాన్ని మాత్రమే నేను తప్పు పట్టాను!తన కులం పట్ల తనకి ఆప్యాత ఉండొచ్చు,యన కులం వాడు ముఖ్యమంత్రి,ప్రధాన మంత్రి,అమెరికా అధయక్షుడు అయితే చూఅడ్డ్లని తను మాతరమె ముచ్చట పడాలి,కదూ?!

      పెరగాల్సింది నువ్వు - నేను మాత్రమే కాదు కేసీఆర్ దగ్గిర్నుంచీ కోదందరాం వరకూ రామాలయం కడితే బాగుండునని కోరుకునే వాళ్ళే తప్ప వద్దని ఘీంకరించే వాల్ళు యేఅరూ లేరని నా నమ్మకం!కట్టాక వెళ్ళి దర్శనం చేస్కుని మొక్కులు మొక్కుకునే వాళ్ల లిస్టులో వీళ్ళు లేకపోతే అప్పుడు నన్నడుగు.

      ఆ ఆడకూతురు గురించి నువ్వు సప్పోర్టు రానక్కర లేదులే,తన గొదవ తను చూసుకంటుందిలే!

      నేను యెప్పుడూ ఆకుకి పోకై అనకుండా మాట్లాడలేదు,అయినా అసలు నేను యెక్కడ వాదించ్నా యెదటి వాళ్ళూ ర్రెండు రకాలుగా మాట్లాడినప్పుడు నిలదియటమే తప్ప నేనుగా యే ప్రతిపాదనలూ చెయ్యలేదు,చేసినా అవతలి వాళ్ళ వాదన అబధ్ధం అని నిరూపించే సాక్ష్యాన్ని చూపించటమే.నేను పాల్గొన్న చర్చ లన్న్నిట్లోనూ నా మాతల్ని నేనే ఖండించుకునే విధంగా రెండు రకాల మాతలు మాట్లాడిన సందర్భం యేదయిన ఉంటే యెత్తి చూపించగలవా?

      రామాయణం చదవకుండానే సీతకి అన్యాయం జరిగినదని యేడుస్తూ ఆ సీత గారాబంగా చూస్య్కునే ఆవిడ మొగుణ్ణే తిడుతూ గట్టిగా నాలుగు పాయింట్లు పట్టగానే నేను ఆర్యుల ఉవాచ ప్రకారమే "వైరభక్తి"ని ప్రదర్సిస్తున్నాను అని అడ్డం తిరగడం దేన్ని సూచిస్తుందో నువ్వు చెప్పు!

      Delete
  11. మా పేర్లను నువ్వు నిద్రలో కూడా తలుచుకోవడం మారిచిపోనట్టున్నావే!!

    ఓయబ్బ! అక్కడికి మీరు పొడిచేసే వీరులైనట్లు. కామేడి గాళ్లను ఎవరైన మరచి పోతారా?

    ReplyDelete
  12. @sreekaant chaari
    కులాన్ని నిరసించి మాట్లాడాలంటే కులాంతర వివాహం చేసుకోవాల్సిందే అని కొత్త సిద్ధాంతం ప్రతిపాదించావు.

    ans:యెదటివారికి కులపిచ్చిని అంటగట్టి వాదించేవాళ్ళూ తమలఓ కులపిచ్చిని ఉంచుకోకూదదు కదా అని మాత్రమే నేను చెప్తున్నది.నీ కిష్తమై నువ్వు మామ కూఒతుర్ని చెసుకున్నవు,నా కిష్తమై నా మామ కూతుర్ని చేస్కునాను - ఇంకా నేను కులాల్ని నిరసించాలంటే కులాంతర వివాహాలు చేసుకోవాల్సిందే అని యెట్లా అంటాను?

    ఒకసారి అక్కడ జరిగిన వాదనల్లో పుట్టుకకీ స్వభావాలకీ సంబంధం ఉంటుంది అనే సిధ్ధాంతాన్ని యెవరు ప్రస్తావించారో గుర్తు చేసుకో!

    వ్యాసుడు గుణకర్మ విభాగం మాత్రమే చేశాడు,స్వబావజం అన్నాడు,స్వభావాలు యుక్తవయస్సు వచ్చాక గానీ యేర్పడవు అని నేను అంటుంటే స్వభావాలు పుట్టుకతోనే వస్తాయి అని నల్లవాళ్ళ కన్నా తెల్లవాళ్ళు పుట్టుకతోనే ప్రత్యేకమైన వాళ్ళు అని చెప్పుకోవటానికి సూత్రీకరించిన శ్వేతజాతీయుల సిధ్ధాంతాని గురిచి చెప్పి - కాబట్టి వ్యాసుడు స్వభావజం అన్నా గానీ అది పుట్టుకతోనే మనుషుల్ని విడదియ్యటమే అనే రీజను లాగింది మీరు కాదా?

    బాగా గుర్తు తెచ్చుకో!జాత్యహంకారాన్ని నిరసించటానికి జాత్యహంకారి=ఉల సిధ్ధాంతాలని సమర్ధనగా తెచ్చుకోవటం తెలివైన పనేనా?అంత తెలివితక్కువగా వాదించేవాళ్లని "కేతిగాళ్ళు" అంటే తప్పా?!
    Not me,you have to grow up man?!

    ReplyDelete
  13. నా వ్యాఖ్యను ఇంకో కొత్త పోస్టులో వుంచబోయి పొరబాటున ఇక్కడ వుంచాను. సారీ!

    నేనడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనే లేదు?

    కులాలను గురించి మాట్లాడినపుడు నీవు కులాంతర వివాహం చేసుకున్నావా అని అడిగె నీవు...
    తెలంగాణా గురించి మాట్లాడేటపుడు నీవు TRSలో చేరావా అని అడిగే నీవు...

    మరి అవే ప్రశ్నలు నీక్కూడా అన్వయిస్తాయని ఎందుకనుకోవు?

    రామాలయంకోసం నువ్వు చేసిన ఉద్యమాలేమిటి?
    సమైక్యాంధ్ర కోసం (సారీ! పల్లవి మార్చారుగా! సరైన విభజన కోసం (మీ దృష్టిలో)) చేసిన ప్రయత్నాలేమిటి?
    ప్రత్యేక హోదాకోసం చేసిన చేస్తున్న ప్రయత్నాలేమిటి?
    బ్లాగుల్లో ఇంతలేసి వాదాలు చేస్తున్న నీవు ఏయే సంస్థల్లో చేరి ఏమేం పనులు చేస్తున్నావు?

    మమ్మల్ని కేతిగాళ్ళు అంటే ...
    మనకైతే ఒక న్యాయం, ఇతరులకైతే ఒక న్యాయం అని మాట్లాడే వారిని ఏమనాలి. దగుల్బాజీ అనా, చంద్రబాబు అనా?

    ReplyDelete
  14. @sreekaant chaari
    ఆ చర్చ చాలాకాలం క్రితం జరిగింది గాబట్టి గుర్తు లేదనుకున్నా అంతకు చాలాకాలం క్రితం నుంచీ కులాన్ని వ్యతిరేకించేవాళ్ళు కులాంతర వివాహం చేసుకుతీరాలనే అభిప్రాయం నాకెప్పుదూ లేదు,అలా అనే ఆస్కారం లేదు.యెందుకంటే చాలా చిన్నప్పుదే ఇలాంటి చర్చలో "సినిమాలో చావు సీను వస్తే ఆ యాక్టరు నిజంగానే చావాలన్నట్టు ఉంటుంది" అని వెక్కిరించిన గుర్తు!తను తన కులం పట్ల అబిమానం ప్రకటించుకుంటూ యెదటివాళ్లకి కులాభిమానం ఉందకూడదనే కంచె ఐలయ్య లాంటివాళ్ళని తప్ప మిగతా వాళ్ల నెవర్నీ నేను విమర్శించిన దాఖలాలు లేవు!కులపిచ్చికి సంబంధించి నా స్టాండు చిన్నప్పట్నించీ స్పష్తంగానే ఉంది.కులాంతర వివాహాలు కుల సమస్యకి పరిష్కారం అని కూడా నేను అనుకోను,అలాంటప్పుడు ఆ ప్రస్న వేసే ఆస్కారమే లేదు.

    అయినా చర్చ జరుగుతున్నప్పుడు ప్రతివాళ్లకీ అనులోకుండా కొన్ని వస్తాయి,పూర్తయ్యేలోపు సరిదిద్దుకుంటాం!చర్చ లింకు పట్టుకోగలవా?మీరు జాత్యహంకారాన్ని విమర్శిస్తున్నాము అంటూ జాత్యహంకారుల సిధ్ధాంతాన్ని సాక్ష్యంగా తెచ్చుకోలేదా?

    అందుకే మధ్యలో చర్చ ఆగినప్పుడు అందులో పార్టులు తీసి విసిరితే లాభం లేదని అంటున్నాను!ఇప్పటి ప్రశ్న ఆంధ్రావాళ్ళ దోపిడీ నిజమా అబధ్ధమా?నీకు స్వయంగా ఆ వాదనతో సంబంధం ఉంది కాబట్టి నువ్వు జవాబు చెప్పి తీరాలి!

    యెవరో ఒక చాలెంజి విసిరితే నాకు అభ్యంతరం లేదనటం తప్ప నేనెక్కడా గట్టిగా సమర్ధించని ప్రతిపాదనకి నేను కార్యాచరణలోకి దిగాలనదం అర్ధం లేని వాదన!

    అక్కద విస్తారంగా ప్రస్తావించింది కూడా ఆవిడ నా జవాబుకి పెట్టిన తింగరి మెలిక వల్ల్లనే అని కూడా చెప్పాను,ఇంకేంటి?

    ReplyDelete
  15. >>> అంతకు చాలాకాలం క్రితం నుంచీ కులాన్ని వ్యతిరేకించేవాళ్ళు కులాంతర వివాహం చేసుకుతీరాలనే అభిప్రాయం నాకెప్పుదూ లేదు

    అలా అయితే ఇక చర్చే అవసరం లేదు. ఆరోజు అలా అడిగావు కాబట్టే... తిరిగి ఈరోజు "యే సంఘటనలోనైనా ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు యేమయినా ఉన్నాయా అంటే అనుమానమే" అని మాట్లాడావు కాబట్టే నేను అభ్యంతరం చెప్పాల్సి వచ్చింది. రామాలయం విషయంలో అది ప్రశ్నే అని తెక్నికల్ గా తప్పించుకున్నా, నాకు అంత ఓపిక లేదు కాని నీ బ్లాగు చూస్తే అనేకమైన వాదనలు కనిపిస్తాయి. ఒకసారి దిష్టిబొమ్మలు తగలెయ్యాలని కూడా పిలుపు ఇచ్చినట్టు గుర్తు. బ్లాగుల్లో రాయడం వేరు, ఆచరణ వేరు. నా ఉద్దేశంలో బ్లాగుల్లోనో, మరోటో రాసి కూడా ప్రజల్ని ఉత్తేజితుల్ని చేయొచ్చు. ఆ విధంగా అదీ ఒక కార్యాచరణే. కాని నీవు ఈ వాదం చేశావు కాబట్టి ఆచరించావా? అని అడగడం మాత్రం సరైంది కాదు.

    తెలంగాణా ఉద్యమ సందర్భంగా, తర్వాతా చేసిన ప్రతి వ్యాఖ్యకు కట్టుబడి వున్నాను. తెలంగాణా ఏర్పడిన తర్వాత అద్భుతాలు జరుగాయి అని మేమేం అనుకోలేదు. తర్వాత కూడా ఇదే రాజ్యాంగ చట్రం లోనే పని చెయ్యాలి. తెలంగాణా బద్జెట్ పై తెలంగాణా ప్రతినిధులకు నిర్ణయాధికారం ఉంటుంది. తెలంగాణా బడ్జెట్ తెలంగాణాలోనే కర్చవుతుంది. ఇది చాలదా మా రాష్ట్రాన్ని మేం కోరుకోవడానికి?

    ఇక అన్యాయాల విషయానికి వస్తే అవి మారాష్ట్రంలో జరిగినా, మీరాష్ట్రంలో జరిగినా దేశంలో మరెక్కడ జరిగినా నాకు తోచిన విధానాల్లో పోరాడుతా. నువ్వు ఆ సంస్థలో చేరి ఎందుకు పోరాడలేదు, ఈ రాస్తా రోకోకు ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు.

    ReplyDelete
    Replies
    1. నాయన చారి, చర్చ ముంగించినందుకు ధన్యవదాలు. సంతోషం తో దీపావళి టపాసులు కాల్చుకొంట్టున్నాము. మీకు రాష్ట్రం వచ్చినా సంతోషించకుండా, మళ్ళీ మళ్ళీ మాతో ఎందుకు అనవసరంగా తలపడుతారు. గత కొన్ని రోజులుగా, మాలిక లో అంతా నీ వ్యాఖ్యలే. నీ బ్లాగు లో నువ్వు రాసేదానికన్నా, వేరే బ్లాగులో రాసేది ఎక్కువగా ఉంది.. మా రాష్ట్రంలో అన్యాయాల సంగతి తరువాత మీ రాష్ట్రం సంగతి ముందు చూసుకో! పోవయ్యా నీ పని చూసుకో పో!

      Delete
    2. @sreekaant chaari?
      నువ్వు ఆ సంస్థలో చేరి ఎందుకు పోరాడలేదు, ఈ రాస్తా రోకోకు ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు.
      ?యేంటయ్యా ఇది?నేను రాస్తారెకోల్లో యెందుకు పాల్గొనలేదనై అడిగుతున్నానా,అప్పుడు అంత సిన్సియరుగా ఆంధ్రావాళ్ల దోపిదీఎకి వ్యతిరేకంగా పోరాడి మీ ముఖ్యమంత్రి వాళ్ళనే నెత్తిమీద పెట్టుకుంటుంటే ఇప్పుడు పోరాడవేమిటి అని అడుతున్నానా?

      >>ఒకసారి దిష్టిబొమ్మలు తగలెయ్యాలని కూడా పిలుపు ఇచ్చినట్టు గుర్తు.
      ప్రత్యేక హోదాకి సమబంధించిన పోష్తులో దిష్టిబొమ్మల ప్రస్తావన వచ్చిందేమో?,పోష్టు గూడా ఏపీకి ప్రత్యేక్ అహోదా వస్తుందా?పీకేకి ఆస్కార్ వస్తందా? అని డౌటుగానే వేసినట్టు నాకు గుర్తు?విశ్లేషనలే తప్ప నేను దేనికి పిలుపు లిస్తాను?ఇచ్చినా దిక్కూ దివాణం ఉండదని తెలిసిందే!

      ప్రజ కొండల రావు గారు పోష్తుల్నీ చర్చల్నీ తిరగేసి మరగేసి యెప్పుడో అన్నితినీ వేస్తామంటున్నారు.నిన్నే లింకు అడిగానుగా సాక్ష్యానికి,నేను అని వుంటే సాక్ష్యం చూపిస్తే చచ్చినట్టు ఒప్పుకుంటానుగా!సాక్ష్యం చూపించలేని ఆరోపణలు చేసి గట్టి సాక్ష్యమ అడగ్గానే "అయితే ఇక వాదించేందుకేమీ లేదు" అనటమేంటి?

      గిర్గ్లానీ రిపోర్తు దగ్గైర్నుంచి నేను చాలా ప్రశ్నలు అడిగాను!ఒక్కదానికీ సూటిగా జవాబు రాలేదు,పైన చెప్పనే చెప్పానుగా,అడిగిన దానికి చెప్పకుండా "వాళ్ళు చెప్పిన జవాబులు కరెక్టే నువ్వు ప్రశ్నలు మార్చుకోవాలి" అన్నట్టు జవాబులు చెప్తారని.

      అంటే అన్నానంటారు గానీ:-)

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...