Wednesday 17 June 2015

ఈ దేశ చరిత్రకి తొలిసారి మిరియాల కషాయం తాగించిన వాస్కో డ గామా నిజంగా మనం గౌరవించాల్సిన వాడేనా?

మీరు గోవాలో కానీ కొచ్చిన్ కోట ప్రాంతంలో గానీ తిరుగుతూ ఉంటే యెక్కడో అక్కడ తొలిసారిగా భారత్ అనే ఒక ధనధాన్యసమృధ్ధులతో తులతూగే సంపద్విలసితమైన భూఖండం మీద అడుగుపెట్టిన విదేశీ యాత్రికుడిగా వాస్కో డ గామాను స్మరించే జ్ఞాపికలు కనబడతాయి.చరిత్రని శ్రధ్ధగా అధ్యయనం చెయ్యనివాళ్ళు ఆ ప్రతిమల పట్ల మన ప్రభుత్వాలూ కొందరు ప్రముఖులూ చూపించే గౌరవాదరాల్ని గమనించి చూస్తే అతను ఈ దేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన అవతార పురుషడని భ్రమించే అవకాశం యెంతైనా ఉంది!కానీ యదార్ధంగా ఈ దేశ ప్రజల మీద అతడు చేసిన దారుణాలు తెలుసుకుంటే ఆ విగ్రహాల నలా క్షేమంగా కాపాడుతూ పాఠ్యపుస్తకాలలో అతని ఘనకార్యాన్ని మాత్రమే కీర్తిస్తూ అధ్యాయాలకి అధ్యాయాలే కేటాయిస్తుంటే బుధ్ధిగా చదువుకుంటున్నందుకు మనలో దేశభక్తి అంటూ ఉంటే మనమీద మనకే అసహ్యం కలుగుతుంది,కానీ అసలు కధ యెంతమందికి తెలుసు?

వాస్కో డ గామా పోర్చుగల్ దేశంలో సైన్యంలో అతి తకువ స్థాయిలో చేరి అతి వేగంగా యెదుగుతూ 1460 కల్లా సైన్స్(Sines) నగరానికి గవర్నరు హోదాకు చేరుకున్న Estêvão da Gama అనే వ్యక్తికి 140లో మూడో కొడుకుగా పుట్టాడు.వాస్కో డ గామా బాల్యం గురించి యెక్కువగా తెలియదు.ఒక పోర్చుగీసు చరిత్రకారుని అభిప్రాయం ప్రకారం ఎవొర పట్టనంలో లెక్కలు,నౌకాయానం నేర్చుకున్నాడు.

1487లో ప్రపంచ నావికా చరిత్రలో ఒక విశేషమైన సంఘటన జరిగింది.బార్తలోమ్యూ డయాస్ అనే అతను ఆఫ్రికా ఖంపు కొసన ఉన్న గుడ్ హోప్ అనే ప్రాంతానికి చేరగలిగాడు.దీనివల్ల అట్లాటిక్ సముద్రం హిందూ మహా సముద్రం కలిసి ఉన్నాయని తెలిసింది.దీనితో యూరోప్ ఖండం లోని చాలామందికి అప్పటిదాకా సిరిసంపదలతో తులతూగుతున్నదని విఖ్యాతి గాంచిన భారతదేశాన్ని పట్టుకోవాలనే ఆశ రగిలింది!1490ల కల్ల్లా రాజైన మాన్యూల్ మనసులో ఒక స్థిరనిశ్చయం కలిగింది.కేవలం అతని దేశానికి సంపదని సాధించుకోవటమే కాకుండా తూర్పు దేశాల్ని పట్టి ఇస్లాముని మట్టుబెట్టి జెరూసలేం ప్రభువుగా అవతరించాలనేది అతని ఆలోచన.

ఆతని ఆశీస్సులతో ఆజ్ఞాపత్రంతో 1497 జూలై 8న లిస్బన్ రేవు పట్టణం నుంచి నాలుగు వెనక వచ్చే నావలతో సెయింట్ గాబ్రియేల్ పేరు గల తన ఫ్లాగ్ షిప్ కూడా కలిపి 170 మంది సిబ్బందితో బయలు దేరాడు.కొన్ని నెలల పాటు తెలిసిన దారిలోనే ప్రయాణించి గుడ్ హోప్ చేరి అక్కడి నుంచి తనదైన కొత్తదారిలో ప్రయాణం చేసి జనవరికి హిందూ మహాసముద్రంలో ఇప్పటి మొజాంబిక్ దగ్గిర లంగరు వేశాడు.చాలామంది నావికులు రోగాల బారిన పడటంతో విశ్రాంతి తీసుకుని నావలకి రిపేర్లు చేసుకుని మళ్ళీ మార్చ్ 1498లో మొజాంబిక్ నుంచి లంగరు యెత్తారు.

ఏప్రిల్ కల్లా ఇప్పటి కెన్యా ప్రాంతాన్ని చేరుకుని ఆగకుండా అక్కడి నుంచి బయలుదేరి మరో 23 రోజుల ప్రయాణంతో మే 20న కాలికట్ నగరాన్ని చేరుకున్నాడు.కానీ వాస్కో అజ్ఞానం వల్ల ఆ ప్రాంతం వాళ్ళు క్రైస్తవులని భ్రమపడ్డాడు.కాలికట్ ప్రంతంలోని వారంతా హిందువులు కాగా అప్పటికి వాస్కో కి గానీ అతని బృందానికి గానీ హిందూ మతం అనే ఒక మతం ఉందని తెలియకపోవడం వల్ల యేర్పడిన తికమక అది!అప్పటి ప్రభువు స్నేహపూరితంగా ఆహ్వానం పలికినప్పతికీ మూడు నెలలు గడిపినా ఇరువర్గాల మధ్యనా సయోధ్య ఏర్పడలేదు.అప్పటికే రాజుకి దగ్గిరగా ఉన్న ముస్లిము వ్యాపారులు వాస్కోకి రాజుతో వ్యాపార సంబంధాలు యేర్పరచుకునే అవకాశం యేర్పడనివ్వలేదు.

ఇక లాభం లేదని నిశ్చయించుకుని ఆగస్ట్ 1498లో నిరాశతో పోర్చుగల్ వెళ్ళిపోవటానికి మళ్ళీ లంగరు యెత్తాడు.ఈసారి వాస్కో బయలుదేరిన వేళావిశేషం బాగులేదు - ఋతుపవనాలు మొదలవటంతో వర్షాలతో శిధిలమైపోయాడు.మామూలు నేల మీద వర్షం పడితే ఫర్వాలేదు గానీ సముద్రం మీద ప్రయాణించే సమయంలో పడే వర్షాన్ని యెంతటివాదైనా తట్టుకోలేడు!చాలామంది నావికులు స్కర్వీ బారిన పడటంతో పొదుపు కోసం తన నావల్లో ఒకదాన్ని తగలబెట్టేశాడు?ఆఖరికి బయలుదేరిన సంవత్సరం తర్వాత 1499 జులై 10న వాస్కో నావల్లోని మొదటి నావ పోర్చుగల్ తీరాన్ని చేరింది.మొత్తం మీద వాస్కో సుమారు రెండు సంవత్సరాల పాటు 24,000 మైళ్ళు ప్రయాణించాడు,170 మందిలో 54 మనది మాత్రమే ప్రాణాలతో పోర్చుగల్ గడ్డమీద తిరిగి అడుగుపెట్టగలిగారు!

వాస్కోకి అపూర్వస్వాగతం లభించింది,ఇక ముస్లిము వ్యాపారుల్ని అణిచివేసి భారత్ అనే బంగారుకోడిపెట్టని ఒడిసిపట్టటానికి పాడ్రో అల్వరస్ కాబ్రల్ అనే వాడితో కొన్ని నౌకల్ని పంపించారు.ముస్లిం వ్యాపారులతో జరిగిన సంకులసమరంలో 800 మంది ముస్లిం వ్యాపారుల్ని నౌకలతో సహా హతమార్చి విజయగర్వంతో వెనక్కి వెళ్ళాడు కాబ్రల్!అతను భారతదేసంలో తొలి పోర్చుగల్ వ్యాపార స్థవరాన్ని యేర్పాటు చేశాడు.మళ్ళీ 1592లో వాస్కో 20 నౌకలతో భారతదేశానికి బయలు దేరాడు.10 నౌకలు అతని సొంత అధికారం కింద ఉండగా అతని మేనమామ,మేనల్లుదు కూడా ఈసారి భాగస్తు లయ్యారు.అప్పటి వరకూ తను సాధించిన ఘనకార్యాలతోనూ కాబ్రల్ మూలంగా అప్పటికే భారత భూభాగం మీద యేర్పడి ఉన్న అనుకూలతల వల్లా అతని కంటే తాను ఘనుడనని నిరూపించుకోవాలనే వీరావేశంతోనూ మత్తెక్కిపోయి ఇక తనలో అప్పటి వరకూ దాగి ఉన్న పోర్చుగల్ శౌర్యాన్ని ప్రదర్శించాలనుకున్నాడు వాస్కో!

తన వీరత్వ ప్రదర్శన కోసం యెక్కడ ముస్లిం కనిపిస్తే అక్కడల్లా సజీవ దహనమే!ఆఖరికి మక్కా వెళ్ళి తిరిగొచ్చే యాత్రికుల నావని సైతం,అందులో మహిళలూ చిన్నపిల్లలూ ఉన్నారని తెలిసి కూడా యేమాత్రం దయలేకుండా తగలబెట్టేశడు?!ఆ వెంటనే కాలికట్ నగరం చేరుకుని మొదటిసారి వచ్చినప్పుడు తనకి అనుకూలంగా ఉండనదుకు ప్రతీకారంగా కాబోలు అక్కడి వైభవాన్నంతా ఛిన్నాభిన్నం చేసి 38 మందిని బందీలుగా పట్టుకుని కాలికట్ నగరానికి దక్షిణ దిశలో ఉన్న కొచ్చిన్ రేవుని చేరుకున్నాడు.ఆక్కడి ప్రభువుతో వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకుని 1503 ఫిబవరి 20న స్వదేశానికి తిరుగుముఖం పట్టి అక్తోబర్ 11న పోర్చుగల్ చేరాడు.రెండోసారి అతనికి తన ఘనవిజయాలకి తగ్గ గుర్తింపు రాలేదని కొంత అసంతృప్తిగా అనిపించినా రాజుకి భారతదేశానికి సంబంధించిన విషయాల్లో సలహాలు ఇచ్చే పదవిని పొంది 1519లో కౌంట్ బిరుదును చేజిక్కించుకున్నాడు.పోర్చుగీసు అధికారుల్లో పెరుగుతున్న అవినీతిని అణిచివెయ్యటానికి 1524లో వైస్రాయ్ పదవి నిచ్చి భారతదేశానికి పంపిస్తే ఒక సంవత్సరంలోనే ఆరోగ్యం చెడి కొచ్చిన్ నగరంలో తనువు చాలించాడు.వాస్కో డ గామా వల్ల ఈ దేశానికి జరిగిన భావి విషాదం యేమిటో తెలుసా?సరిగ్గా శతాబ్దం కూడా దాటకుండా అతడు చూపించిన సముద్రమార్గంలోనే ఆంగ్లేయులూ ఫ్రెంచివారూ వచ్చిపడి పోర్చుగీసుల స్థానం కోసం ఒకరితో ఒకరు పక్కింటి వాళ్ళు మనింటికొచ్చి యెవరు మనని యెక్కువ దోచుకు తినాలనే రకంగా పందేలు వేసుకుని పోరాడుకుంటూ మొదట పోర్చుగీసు వాళ్ళని తరిమికొట్టి తర్వాత జరిగిన పరస్పరారోహణ క్రమంలో ఆంగ్లేయులు విజృంభించి ఈ దాశాన్ని తమ పాదపీఠంగా మార్చుకోవడం!

అప్పటికే తీసిన ప్రతి సినిమాలోనూ దేశం పట్ల తనకున్న బాధ్యతని చూపించిన సంతోష్ శివన్ ఈ వాస్కో డ గామా ప్రతిమల్ని పదే పదే చూస్తూ ఆవేదనతో దహించుకుపోతూ అతని నిజరూపాన్ని చూపించే ఒక కధాంశాన్ని ఆలోచించుకున్నాడు.అతని ఆలోచనల్ని  యధాతధంగా చదివితే "ఉరుమి" అనే సినిమా తియ్యడం వెనక ఉన్న అతని సిన్సియారిటీ తెలుస్తుంది:"Whenever you travel to Goa or Fort Kochi or such places, you will always find a suite in the name of Vasco da Gama who is revered as a discoverer of India. But when you delve deeper into the history, you will realize that he discovered India for the Western world but he is the conqueror, the first colonial ruler in the world as they all came to trade in pepper but instead of trading they decided to conquer the place. Hence I thought it would be interesting to make a film that would show the small peppercorn changing the entire history of India. I think for every Indian it would be interesting."
ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు కనిపించిన మొదటి అధ్భుతం జెనీలియా డిసౌజా!తెలుగు సినిమాల్లో హీరో చుట్టూ తిరుగుతూ ఆటపాటలకి మాత్రమే పరిమితమైన ఈ గ్లామర్ తార ఇందులో ఆరక్కళ్ ఆయేషా అనే వీరనారిగా కన్ను చెదిరే నటనా సౌందర్యంతో ప్రకాశించింది!ప్రతిభ ఉండి ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం దేనికని అలాంటి సినిమాల్లో నటించిందే తప్ప ఒక గంభీరమైన పాత్ర ఇస్తే ఆ పాత్రని అంతే గొప్పగా చూపించగలనని నిరూపించుకుంది,శభాష్ జెనీలియా - శెభాష్!గ్లామర్ కురిపించే పాత్రల్లో పడుచువాళ్ళ గుండెల్లో కలకలం రేపగలిగిన ఆమె కళ్ళు చాలా పవర్ఫుల్ అని మీకూ తెలుసు,కానీ ఈ సినిమాలో ఆపాదమస్తకం తన పవర్ చూపించింది - కత్తి లాంటి నటి కత్తి చేతబట్టి కత్తిలాగ మెరిసింది!ఆరక్కళ్ ఆయేషా రూపురేఖలు తెలియక పోయినా తను కూడా ఇలాగే చూస్తుందేమో,తను కూడా ఇలాగే కదుల్తుందేమో,తను కూడా ఇలాగే మాట్లాడుతుందేమోనని భ్రమిపంపజేసేలా కనబడింది తెరమీద!

ఈ సినిమాలో నాకు సంతోషాన్ని కలిగించిన మరో అంశం ఇవ్వాళ ఆంగ్లేయుల దుర్నీతికి గురై పరస్పరం కలహించుకుంటున్న హిందువులూ ముస్లిములూ సోదర సమానులుగా కలిసిపోయి బతుకుతున్న నిరుడు కురిసిన హిమసమూహాల్ని చూడటం!ఒక రాజు తన కూతురు ఒక ముస్లిముని ఇష్టపడుతున్నదని తెలిసి యేమాత్రం సంకోచించకుండా తనంతట తనే పూనుకుని వాళ్ళిద్దరూ సంతోషపడేలా వివాహం జరిపించడానికి నిర్ణయించుకోవడం ఇవ్వాళ చూడగలమా?"పుణ్యభూమి నా దేశం నమో నమామి" లాంటి దేశభక్తి గేయాలు యేవీ లేకపోయినా సినిమా పూర్తయ్యేసరికి దేశభక్తి నరనరాల్లోకి ఇంట్రావీనస్ ఇంజక్షన్ లాగ యెక్కిపోయేటంత తెలివిగా తీశాడు దర్శకుడు ఈ సినిమాని,దానికెంత ప్రతిభ కావాలో గదా!సంతోష్ శివన్ కున్న దేశభక్తి ఉంది అలాంటి టెక్నిక్ వెనక!పాటగా వినిపిస్తే ఆ పాట చెవులకి వినబడుతున్నప్పుడే ఆవేశం పుడుతుంది,కానీ కధలోనే అంతర్లీనంగా ఇమిడ్చితే ఆ కధ గుర్తున్నంత కాలం ఆ స్పందన ఉంటుంది,అవునా?

ఈ దేశచరిత్రని పరమ దుర్భరమైన పరాధీనతకి నడిపించిన విషాద భరితమైన కాలానికి సంబంధించిన కధని తీసుకుని ఆనాడు ఆ పరాధీనతని తప్పించడానికి తమ ప్రాఅణాల్ని పణంగా పెట్టిన వీరకుమారుల్ని యేమాత్రం ఆదంబరాల హంగులు లేకుండా చూపించడం దేశభక్తి లేనివాడికి అసాధ్యమే!


వీరుల్ని పొగడటం కూడా వీరత్వమే,అది మనలో యెంతమంది కుంది?

12 comments:

  1. ఈ మధ్యనే కొంత సందేహించాను,నిన్నటి పోష్టులోనే మళ్ళీ మోదరేషన్ పెట్టాలనుకుంటున్నాని చెప్పాను గానీ అనవసరం అనిపిస్తుంది!ఇక నా బ్లాగులో కామెంట్లకి మోదరేషన్ ఉంచను - యెప్పటికీ?యెందుకంటే నా పోష్తులు మంచివే,గొదవలు రేపటానికి పనిగట్టుకుని ద్వేషభాషతో రెచ్చిపోకుండా గొదవల్ని తగ్గించడానికే రాస్తున్నాను గాబట్టి అందరూ ఇక్కడ స్వేచ్చగా కామెంట వచ్చు.అయితే మరీ అసభ్యంగా దుస్సహంగా ఉన్నవాటిని మాత్రం ఉంచను,వాటిని తొలగించే అధికారం ఉంది.విచక్షణ అంటారా యెవరై సంస్కారాన్నీ నేను నియంత్రించలేను గదా,కామెంటే వారికి నాకు స్థాయీ గౌరవం అక్కర్లేదు నేనిలాగే కామెంటుతాను అనే మొందితనం ఉంటే చెప్పినా వినరు గదా?

    ReplyDelete
    Replies
    1. మంచి నిర్ణయం హరిబాబు గారు.

      Delete
  2. In 4th century AD Christianity became the dominant religion of the Roman Empire. The Sassanian rulers of Iran wisely foresaw that the Syrian Christians within their borders would develop into a fifth column of their powerful neighbours. Their aim was to persecute the Syrian Christians. Some of these Christians fled Iran in groups. In AD 345, around 400 odd persons from 72 families comprising men, women and children, reached Cragananore (Kodungalloore) Kerala, under the leadership of a merchant known as Thomas Cananeus. The Hindu kings gave them refuge.

    What these treacherous Christians did in return was to invite Vasco da Gama to invade India. They had promised the Portugese, French and British their support to defeat and evict the local kings, the Zamorins, who gave them refuge. Vasco da Gama had bombarded Calicut in Kerala when the Zamorin ruler refused to be dictated by him.

    These facts came to light from the Dutch history of Travancore, and also through the French records.

    https://christianwatchindia.wordpress.com/2007/06/04/the-treacherous-kerala-christians/

    ReplyDelete
  3. హరిబాబుగారూ,

    వ్యాసం బాగుంది. ఇటువంటి వ్యాసాలు అవశ్యపఠనీయాలు అందరికీ. అంధుచేత ఇటువంటీ స్ఫూర్తిదాయకమైన విషయాలు మీరు విరివిగా వ్రాయగోర్తాను.

    వ్యాఖ్యలను ఎలా నియంత్రించాలీ, అసలు నియంత్రించటం అవసరమా వంటివి బ్లాగర్లు తమకు తామే ఉచితమైన విధంగా నిర్ణయించుకోవాలి. విద్వేషాలు రెచ్చగొట్టేవీ, అనుచితమైన పదభావాలతో సభ్యతాదూరంగా ఉండేవీ మాత్రం వీలైనంతవరకూ అనుమతించకపోవటం బ్లాగులోకానికి మంచిచేస్తుందని నా భావన.

    ReplyDelete
  4. ఇప్పటికీ మన పాఠ్య పుస్తకాల్లో భారత దేశానికి దారికనిపెట్టింది వాస్కో డిగామా అనే ఉంచారు. అది పాశ్చాత్య ఆలోచానల ప్రభావం. మనం కూడా సిగ్గులేకుండా వారు చెప్పిన చరిత్రనే చదువుతున్నాము కాబట్టి. మీ వ్యాసం ఆలోచింపచేసింది. "ఉరిమి" గురించి మీరు చెప్పింది అక్షర సత్యం.

    ReplyDelete
  5. సిక్యులరిజానికి విఘాతం కలిగించేలా ఉన్నాయి.
    గతాన్ని తవ్వి నేటి ప్రశాంతతని నాశనం చేయడం అవసరమా?
    (ఇది కమ్మీ ల భావన).
    KeraLa WILL BE next pak if they/we don't realize the true HISTORY.

    ReplyDelete
  6. నేను వాస్కోడిగామా ఇండియాలో అడుగు పెట్టిన కాలికట్ వెళ్ళాను. అక్కడ ఆ సంఘటనకి జ్ఞాపకంగా ఒక స్థంభం మాత్రం ఉంది. ఆ ప్రదేశం అంతా చెత్త చెదారంతో ఎవరూ పట్టించుకోనట్టు ఉంది. విగ్రహం కూడ ఏమీ లేదు.

    ReplyDelete
    Replies
    1. Bonagiri Garu, It is good (There is no statue of Vasco da gama). Why should we give respect to him?

      Delete
  7. వ్యాసం బాగుంది. హిందూ ముస్లింల ఐక్యత నాటి నుండి నేటికీ వర్ధిల్లుతూనే ఉంది. వర్ధిల్లాలనే ఆకాంక్షను వెలిబుచ్చిన మీ దేశభక్తి అభినందనీయం.

    ReplyDelete

  8. ఈ మధ్యే చూసారా ఏంటి ఆ సినిమాని. అందరు బాగా చేసారు. తలుక్కున మెరిసే విద్య , టబు అయితేనేమి కొత్త కాబట్టి వేసిన నిత్యమేనోన్ అయితేనేమి. కానీ నిడివి ఎక్కువ అవుతుందని కొన్ని సన్నివేశాలు తొందర తొందరగా ముగించేసారు అనిపించింది. మంచి సినిమా

    ReplyDelete
    Replies
    1. చూసి చాలాకాలమైంది గానీ పోస్టు రాయడానికి సరిపదే ఐదియాలు ఈ మధ్యనే వచ్చాయి!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...