Thursday 25 June 2015

పాపం, తెలంగాణ లారీల యజమానులకి రెండు రాష్ట్రాల మధ్యన సింగిల్ స్టేట్ ట్యాక్స్ కావాలంట?అసలు సింగిల్ స్టేట్ కోసం ఉద్యమిస్తే గానీ అది కుదరదేమో!

          భ్రమల్ని ప్రేమిస్తూ భ్రమలే జీవితంగా గడుపుతూ భ్రమల్లో పొందే ఆనందం కోసం వాస్తవ జీవితం లోని సుఖాల్ని కూడా త్యాగం చెయ్యగలిగిన అతి మేధావులకి తప్ప విశాల తెలంగాణ ప్రజానీకానికి యేనాడూ విభజన ఉద్యమానికి అండదండలు ఇవ్వాలనిపించ లేదు!తార్కికంగా ఆలోచించే తెలంగాణలోని నిజమైన మేధావులకి విడిపోతే ఇంతకన్నా బాగుంటుందన్న నమ్మకం యేనాడూ లేదు?వీళ్లందరినీ ఆంధ్రోళ్ళు మనల్ని దోచుకోవదం వల్లనే మనం వెంకక పడ్డాం,విడిపోయి ఆ దోపిడీని వదలగొట్టేస్తే చాలు అంబరాన్ని చుంబిస్తాం అని వూదరగొట్టి కనీసం యెదటివాళ్ళకి వచ్చిన అనుమానాలకి సరయిన జవాబులు కూడా ఇవ్వలేక అలాంటివాళ్ళంతా తెలంగాణ ద్రోహులని ముద్దర్లు కొట్టేసి,లక్ష అబధ్ధాలతో కోటి రౌడీ పన్లతో తెచ్చుకున్న దానిని మంచితనంతో ఒప్పుకుంటున్నామే గానీ సాంకేతికంగా ఈ విభజన చట్టబధ్ధమైనదని అసలు ఒప్పుకోవాలా?

          అసలు ఆ విభజన చట్తాన్ని కూర్చిందే నేనని ఒకానొక దశలో డప్పు కొట్టుకున్న వ్యక్తియే ఆ చట్టం సరిగ్గా లేదని అంటుంటే ఆ విభజన చట్టమే పనికిమాలినదని అర్ధం కాదా?తన ప్రమేయంతోనే తన ఆమోదం కోసం కేంద్రమంత్రులు కూడా తన చుట్టూ తిరిగి తనకు చూపించాకనే బిల్లు సభలో కొచ్చిందని తనూ చెప్పాడు,ఆ కేంద్రమంత్రులూ లోపాయకారీగానూ పత్రికల వాళ్ళు గుచ్చి గుచ్చి అడిగితే పత్రికాముఖంగానూ ఒప్పుకున్నది నిజం కాదా?తెలిసి తెలిసీ ఇంత అధ్వాన్నంగా తనెందుకు తయారు చేశాడో,వాళ్ళు చేస్తే చూసినప్పుడో తనెందుకు ఒప్పుకున్నాడో ఇప్పటికయినా తిన్నగా చెప్తాడా?మన పిచ్చి గానీ ఆ మనిషి యేది తిన్నగా చెప్పాడు గనక!ఆయనకీ ఆయన అభిమానులకీ తిన్నగా మాట్లాటం వస్తే మనకె బాధలన్నీ యెందుకు?!తెలంగాణ తరపున దాఖలయిన ఓటుకు నోటు మరియూ ఆంధ్ర త్రపున దాఖలయిన ట్యాపింగ్ వ్యవహారం లాంటివి పట్టించుకోకుండా విశాల తెలంగాణ ప్రజానీకం యొక్క సమస్యలు సుదూరంలోనన్నా పరిష్కరించబదతాయనే గ్యారెంటీ యెంతమంది తెలంగాణ్యుల కుంది?

          ఈ రెండు కేసులూ ఒకళ్ళు మరొకళ్ళ మీద బురద జల్లుకోవడానికి తప్ప యెందుకూ పనికిరానివేనని తెలియడం వల్లనే రేవంత్ పరిస్థితి యేంటి?అదృష్టం బాగుండి అతనికి బెయిలొస్తందా?జైలుకి వెళ్ళి చిప్పకూడు తింటాడా?బాబు కూడా అరెస్టవుతాడా? - ఇలాంటి కుక్కజట్టీలకి దూరంగా ఉన్నాను!అరిభీకరంగా చెలరేగిపోయి బాబు అవినీతి గురించి వాదిస్తూ పుంఖాలు పుంఖాలుగా వాదించిన తర్వాత కూడా "Horse trading is everywhere,nobody is an exception" అనేవాళ్ళు ఒంటిమీద స్పృహ వుండి కళ్లముందు జరిగేది చూస్తూ అంతా తెలిసే అలా మాట్లాడుతున్నారా?నేనైతే మొదటినుంచీ ఒకే మాట అడుగుతున్నా,ఒకడు అవినీతిపరుడయితే కావచ్చుగాక,అతన్ని అవినీతిపరునే అర్హత మరో అవినీతిపరుడికి ఉంటుందా అని, దానికి సూటిగా జవాబు చెప్పగలరా?రేవంత్ అడ్డంగా దొరికిపోయి జైలు పాలయినా,చంద్రబాబు కూడా ఆ ఫోను సంభాషణ మూలంగా పదవిని పోగొట్టుకున్నా యేమాత్రం బాధపను,ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సరయిన రాజకీయ చైతన్యం అంటూ ఉంటే మరొక నాయకుడు వస్తాడు!అలా కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఖర్మ,అంతే?

          కానీ తెలంగాణ మేధావుల మేధావిత్వం ఇంత అధమ స్థాయిలో అఘోరించటానికి కారణం యేమిటి?"పరారీలో బాబు అనే వార్త చూడాలని ఉంది" అనేటంతగా బాబు అవినీతిని ద్వేషిస్తున్నవాళ్ళు కేసీఆర్ అవినీతిని చూడరేందుకు?బాబు పట్ల గల ద్వేషానికి కారణం యేమిటి.,కేసీఆర్ పట్ల గల బానిసత్వానికి కారణం యేమిటి?తెలంగాణకి కేసీఆర్ అవినీతి వల్ల అన్యాయం జరిగినా ఫర్వాలేదు అని సహిస్తున్నప్పుడు చంద్రబాబూ అవినీతిని కూడా సహించవచ్చును గదా?ఆకర్ష తంత్రం మొదలు పెటిన మొదట్లోనే కాంగ్రెసువాళ్ళు బాహాటంగానే "మీ మీద పాతకేసులు తిరగదోడతాం,మిమ్మల్ని జైలుకి పంపిస్తాం మా పార్టీలో చేరకపోతే అంటున్నారు - మరీ ఇంత ఘోరమా?" అని అన్నప్పుడు అక్క యేం జరుగుతుందో తెలియదా?అది అవినీతి కాదా?యే అవినీతిపరుల్ని భూస్థాపితం చేస్తానన్నాడో అదే అవినీతిపరుల్ని పక్కన పెట్టుకుంటే బంగారు తెలంగాణ యెట్లా వస్తుంది?మీకు కావలసింది బంగారు తెలంగాణయే అయితే కేసీఆర్ అవినీతిని యెందుకు వ్యతిరేకించడం లేదు!అదే అవినీతిని ఇప్పుదు కూడా పదింతలు ధైర్యంగా చేస్తుంటే సహిస్తున్నప్పుడు రాష్ట్రం విడిపోవలసిన అవసరం యేమిటి?పరిశ్రమల్లో వ్యాపారాల్లో అదే దొపిడి దొంగలైన ఆంధ్రోళ్ళ హవా సాక్షాత్తూ ముఖ్యమంత్రి అండదండలతోనే సాగుతున్నప్పుడు ఈ విభజనని వ్యతిరేకిస్తే తప్పేమిటి?ఇదివరకటి వారి పరిపాలనలో ఉన్న చెడు అదే విధంగా కొనసాగుతున్నప్పుడు ఈ తెలంగాణ ఆస్తిత్వం యొక్క ప్రత్యేకత మేమిటి?

          ఉద్యమంలోనూ నిజాల్ని చెప్పి అందర్నీ ఒప్పించకుండా రౌడీతనంతోనే చెలరేగిపోయారు,అధికారంలోకి వచ్చాక కూడా ప్రజల్ని మెప్పించే చక్కని పరిపాలనతో బలాన్ని పెంచుకోవాలనే రాజమార్గం వదిలి అదే రౌడీతనానికి ఆకర్ష తంత్రం అనే సంకేతికమైన ముద్దుపేరు తొడిగి దొడ్డిదారిన వెళ్తూ చెలరేగిపోతున్నారు,రాజధానిలో సగం హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పదేళ్ళపాటు హక్కు ఉన్నదని చట్టంలో లేదా?చట్టంలో మీకు ఇష్టం లేనివాట్ని మీరు వ్యతిరేకిస్తే మొత్తం విభజన చట్టాన్నే మేము వ్యతిరేకిస్తాం,తప్పా!అప్పుడు కేంద్రంలో ఉన్న ఒక లత్తుకోరు పార్టీతో లాలూచీ ఒప్పందం ద్వారా 23 జిల్లాల మీద రుద్దిన ఈ విభజనని రద్దు చేసి పారెయ్యాలి!అసలు నిజాలతో చారిత్రక వాస్తవాలతో ఇంతకు ముందు విడిపోయిన అన్ని రాష్ట్రాల మాదిరిగానే శాసనసభలో విభజన తీర్మానం పెట్టి వోతింగు ద్వారానే విడిపోవాలని మేము అంటాం - ఒప్పుకుంటారా?మా వాదన కనీసం నినను కూడా వినకుండా జరిగిన విభజన ప్రజాస్వామికం యెలా ఔతుంది?ప్రజాస్వామికంగా జరగని విభజన పట్ల మేమెందుకు గౌరవం ప్రకటించాలి?యే ప్రాంతీయాభిమానాన్ని రెచ్చగొడుతూ ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చారో వారినే ఆ ప్రాంతీయాభిమానం అబినీతికి దూరంగా ఉంచలేకపోతుంటే దానివలన ప్రయోజనం యెవరికి యెందుకు యెంత వుంటుంది?కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికీ,కేసీఆర్ కుటుంబానికి నాలుగు మంత్రిపదవులు తెచ్చుకోవడానికీ,కేసీఆర్ ఇది నా అడ్డా అని జబ్బలు చరుచుకోవడానికీ 23 జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఈ విభజనని బలవంతంగా ఒప్పుకోవాలా?యే లక్ష్యం కోసం యెవరెవరు అన్నేళ్ళు మిన్నూ మన్నూ యేకం చేసి ఇవ్వళ రాష్ట్రాన్ని సాధించుకుని అధికారంలోకి వచ్చాక వాళ్ళనే అవినీతికి దూరంగా ఉంచలేనప్పుదు,విశాల తెలంగాణ ప్రజానీకం తరపున నిలబడి ఆ అవినీతిని వ్యతిరకించాల్సిన వాళ్ళు కూడా అవినీతిపరులకే కొమ్ము కాస్తూ బాజాభజంత్రీలతో ప్రోత్సహిస్తున్నప్పుడు ఆ ప్రాంతీయాభిమానంలోని పవిత్రత యెంత?

          ఇప్పటికిప్పుడు ఈ ఓటుకు నోటు దగ్గిర్నుంచి ఫోన్ల ట్యాపింగు వరకూ సమస్తాన్నీ ప్రజల ముందు పెట్టి మళ్ళీ యెన్నికలకి నిలబడగలడా?ఇదివరకు గెలుచుకున్నన్ని సీట్లు కూడా రావని నేను ధీమాగా చెప్పగలను!యెందుకంటే ప్రజల్లో ఈ యేడాది పాలన మీద అధ్భుతమైన ప్రశంస లేవీ పలేదు.ఇప్పుదు మొదలు పెట్టిన చెరువులు తవ్వడం,నగరాన్ని శుభ్రం చెయ్యడం,వ్యవసాయాన్ని బాగుచెయ్యడం,తమ ఉద్యమం ధాటికి జడిసి పారిపోయిన పరిశ్రమల్ని మళ్ళీ వెనక్కి రప్పించుకోవడం - ఇలాంటివాటికి తనే చెప్పుకున్నట్టు నాలుగేళ్ళు పడుతుంది.అది గనక జరుగుతుంటే ప్రజలు కూడా యెదురు చూడగలరు!కానీ ఇప్పుడు జరుగుతున్నవి మాత్రం విశాల తెలంగాణ ప్రజానీకానికి యేమాత్రం పట్టనివి,అవునా?దాని గురించి చెప్పుకునే అవకాశం యెటూ లేదు - అవినీతి అంతటా ఉన్నదని వాళ్లే ఒప్పుకుంటున్నప్పుడు పొరుగు రాష్త్రం ముఖ్యమంత్రి అయిన  బాబు అవినీతి తెలంగాణ ప్రజలు పట్టించుకుంటారా?తన అవినీతి వ్యవహారాలు బయటికి వస్తే?వస్తాయి - యెన్నికలంటూ వస్తే అప్పుయినా యెదటివాళ్ళు వాట్ని హైలైట్ చేస్తారు!ఉద్యమకాలంలో ప్రజల్ని అనేక రకాల ఇబ్బందులకి గురిచేసినా అది ఉద్యమకాలం కాబట్టి సరిపెట్టుకున్నారు,అధికారంలో ఉండి ప్రజలకి ఇబ్బంది కలగకుండా పరిపాలించాల్సిన కాలంలో మళ్ళీ తమని ఇబ్బందులకి గురి చేస్తే విశాల తెలంగాణ ప్రజానీకం మద్దతు ఇస్తుందా - అదీ తమ అవినీతిని దాచుకోవడానికి ప్రాంతం గొప్పని వాడుకుంటున్న వాళ్ళకి?

          ఇవ్వాళ లారీల యజమానులకి తెలియదా రాష్త్రం విదిపోయాక కూడా ఒకే పన్ను సాధ్యపడదని,తెలుసు కానీ భ్రమల్లో బతికేవాలాళ్లలాగ కాకుండా విభజన వల్ల నిజమైన ఇబ్బందుల్ని యెదుర్కొంటున్న వాళ్ళు కాబట్టి దానికి పరిష్కారం కోరుతున్నారు!రాకపోకలు తప్పనిసరి అయినప్పుదు అది సుఖంగా ఉండాలని కోరుకోవటం వాళ్ళ హక్కు,కాదా?ఇక్కడ చూస్తే అనాగరికమైన పరిపాలనతో గందరగోళం వుంది,ఇక్కడి నుంచి బైటికి పోయి  నాలుగు బ్బులు సంపాదించుకుందామంటే పన్నులు తడిసి మోపెడు అవుతున్నాయి?సత్య మార్గాన పోయి న్యాయమైన వాదనల్తో చట్తప్రకారం శాసనసభలో బిల్లు పెట్టి ధర్మంగా తమకు యేమి కావాలో అడిగి యెవరికి కావలసినవి వాళ్ళు పంచుకునేలాగ విడిపోతే ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా!

          ఇదివరకు సమైక్య రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకి అప్పటి ప్రభుత్వాల మీద విరుచుకు పడ్డవాళ్ళు ఇప్పుదు కనీసం ఓదార్చతాని కయినా వెళ్ళటం లేదు,యెందుకని?అప్పట్లో చంద్రబాబు వెళ్ళకపోయినా మిగతా మంత్రులు కొందరయినా వెళ్ళారు,ఇప్పుడదీ లేదు గదా!ధనిక రాష్ట్రంగా ఉన్నామని చెప్పుకోవదమే తప్ప అందులో ప్రజలకి నిక్కచ్చిగా ఉపయోగిస్తున్నది యెంత?వ్యక్తి->కుటుంబం->వీధి->గ్రామం->జిల్లా-రాష్ట్రం-దేశం->ప్రపచం అనే వృత్తాలలో మీరు చెప్తున్న "మాప్రాంతం" అనేది యెక్కడ నుంచి మొదలై యెక్కడి వరకూ సాగి యే అంతరువులో స్థిరంగా వుంటుంది?ప్రాంతం పట్ల మమకారమే అన్ని సమస్యలకీ పరిష్కారమా?ఇప్పుడు తెలంగాణ రాష్త్రం మొత్త్తం ఒకే ప్రాంతమా?యే జిల్లాకీ సొంత ఆస్తిత్వం లేదా?తమ అవినీతిని సహించడానికి ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని బూచిగా చూపిస్తున్నారని మీకు తెలియదా,తెలిసీ సహిస్తున్నారా?కేసీఆర్ మరియూ అతని అభిమానులూ ఇదే రకంగా కొనసాగితే భవిష్యత్తులో మళ్ళీ ఈ రెండు రాష్ట్రాల్నీ విలీనం చెయ్యాలన్న సమైక్యవాదం పుడితే తెలంగాన నడిబొడ్డునే పుడుతుంది!ఇంకా గట్టిగా మాట్లాడితే తొలి జండా కేసీఆర్ ఇంటిముందే యెగరొచ్చు?!

ద్వేషంతో సాధించింది ఆ ద్వేషంతోనే పోతుంది!

28 comments:

  1. సమైక్యమా? వద్దండి బాబూ. తిన్న తిట్లు, అడ్డగోలు వాదనలూ, అయిన పరాభవాలు చాలు. న్యాయ మార్గం లో మనది మనకి వస్తే చాలు. విద్వేషం తో రగిలి పోతున్నారు! ఛీఛీ! విద్వేషం తో యేం సాధిస్తారో!

    ReplyDelete
  2. "పరిశ్రమల్లో వ్యాపారాల్లో అదే దొపిడి దొంగలైన ఆంధ్రోళ్ళ హవా సాక్షాత్తూ ముఖ్యమంత్రి అండదండలతోనే సాగుతున్నప్పుడు ఈ విభజనని వ్యతిరేకిస్తే తప్పేమిటి?ఇదివరకటి వారి పరిపాలనలో ఉన్న చెడు అదే విధంగా కొనసాగుతున్నప్పుడు ఈ తెలంగాణ ఆస్తిత్వం యొక్క ప్రత్యేకత మేమిటి?


    పైన మీరు అడిగిన దానికి ఏ ఒక్క తెలంగాణా మేధావి ఆయినా సరయిన సమాధానం చెప్పగలిగితే చాలు. వారు సరయిన కారణంతోటే రాష్ట్రమ్ సాధించుకున్నారు అనుకోవచ్చు. ఏ దోపిడికి వ్యతిరేకంగా రాష్ట్రం సాధించుకున్నారో అదే దోపిడి సాగుతుందంటే ఆ ముఖ్యమంత్రిని వెధవ అనుకోవాలా.. లేక దానిని ప్రశ్నించకుండా ఉన్నా మేధావులను వెధవలు అనాలా... లేక అబద్దాలు చెప్పి సాధించుకున్న వెధవలు అనాలా? సమాధానాలు చాలా స్ట్రయిట్ గా చెప్పండి.. మీ వాదనలో పస ఉంటే సరి... లేపోతే సైలెంటుగా ఉండాలి..... అలవాటు ఆయిన పద్దతిలో సంబందంలేని టాపిక్ వద్దు...

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారూ, మీకు మీరే ఏదో చాలెంజ్ విసిరేసారాని ఊహించుకుంటున్నారా?

      "విశాల తెలంగాణ ప్రజానీకానికి యేనాడూ విభజన ఉద్యమానికి అండదండలు ఇవ్వాలనిపించ లేదు"

      మీకెలా తెలిసిందండీ బాబూ! విశాల తెలంగాణా సమాజంతో మీరు ఎప్పుడు సంపర్కం జరిపారు?

      "ఇదివరకటి వారి పరిపాలనలో ఉన్న చెడు అదే విధంగా కొనసాగుతున్నప్పుడు ఈ తెలంగాణ ఆస్తిత్వం యొక్క ప్రత్యేకత మేమిటి?"

      ఎంత చెడు కొనసాగుతుంది? బడ్జెట్ నిధుల తరలింపు ఆగలేదా? రేపో మర్నాడో ట్రిబ్యూనల్ తీర్పులో కొంతయినా నీటి చౌర్యం ఆగిపోదా? చూస్తూ ఉండండి, అన్నీ వస్తాయి, రాకపోతే నిలదీసయినా తెచ్చుకుంటాం, మీరు రంది పడకండి.

      "Horse trading is everywhere,nobody is an exception" అనేవాళ్ళు ఒంటిమీద స్పృహ వుండి కళ్లముందు జరిగేది చూస్తూ అంతా తెలిసే అలా మాట్లాడుతున్నారా?"

      మీ పచ్చ కామెర్ల పార్టీ & వారి యెల్లో మీడియా ఒక్కటంటే ఒక్క ఆధారం తీసుకొస్తే బాగుండేది కదా. Are you not equating individuals under criminal investigation with those against who not a shred of evidence has been proffered?

      "23 జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడుతూ"

      13 జిల్లాలు :)

      "కేసీఆర్ మరియూ అతని అభిమానులూ ఇదే రకంగా కొనసాగితే భవిష్యత్తులో మళ్ళీ ఈ రెండు రాష్ట్రాల్నీ విలీనం చెయ్యాలన్న సమైక్యవాదం పుడితే తెలంగాన నడిబొడ్డునే పుడుతుంది"

      వీడు కాకపొతే ఇంకోడు, వాడూ కాకపొతే మరొకడు. అంతేతప్ప మళ్ళీ "దోచుకోండి రా" అని పిలిస్తారని కలలు కనకండి బాబు గారూ!

      Delete
    2. Jai, i think you are so informed. Can you get the revenue details of AP/TS by end of March 2015? Telangana is projecting super surplus and AP super deficit, just want to know how much exactly each got in Actual numbers. Not with the budget projections. That will tell the world that bifurcation effected the revenue of TS/Hyderabad.

      Also FYI. This is an article from e-paper appeared on Jun 26, 2015 in page 6. about TS agriculture and ~20% down in the production of food grains even though your Harish got more water from krishna last year.

      Click the following link to read : http://epaper.eenadu.net/svww_showarticle.php?art=20150626a_006134008

      Delete
    3. Every budget shows 4 sets of numbers. 2017-18 budget will have 2015-16 actual numbers (accounts), 2016-17 original demand, 2016-17 revised estimates and 2017-18 projected demand.

      We will have to wait till February 2017 to know the account situation of 2015-16.

      In any case, the numbers are irrelevant to the "fairness debate".

      I tried to reach the Eenadu link but my browser shot it down, probably because popu-up blocking.

      Delete
  3. విభజనని మాత్రం ఎట్టి పరిస్దితుల్లోను వ్యతిరేకించడం సరయిన పద్దతి కాదని నా అభిప్రాయం... విడిపోవాలని అవతలి వారు కోరుకున్నప్పుడు అదే వంద రెట్లు ఉత్తమం. .. ఆయితే విభజనలో ఉన్న లొసుగులు మీదే మన అభ్యంతరం ఉండాలి...... విడిపోయిన తర్వాత అక్కడి విషయాలు పూర్తిగా మన వాళ్ళకి అనవసరం... అదే సమయంలో మన గురించి వారికి ఇంకా అనవసరం... అలాగే ఆంధ్ర పారిశ్రామికవేత్తలను నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ ఇంకా మన గురించి వాగే సందర్బాలు మాత్రమే చిరాకు చెప్పిస్తున్నాయి.... రాష్ట్రం కావాలనుకున్నారు. తెచ్చుకున్నారు.. ఒకే.. అది బంగారం అవుద్దొ, ఇత్తడి ఆవుద్దో ఇక్కడి వాళ్ళకి అనవసరం..... ఇటు వైపు గురించి మాట్లాడానికి ప్రస్తుతం ఇది సమైక్యం కాదు. కాబటి సమైక్యంలో మాట్లాడినట్టు ఏది పడితే అది మాట్లాడడం పద్దతి కాదు. సమైక్యం అని ఎవడైనా అంటే గింటే ఇక్కడ తన్నులు తినడానికి రెడీగా ఉన్నట్టే...

    ReplyDelete
    Replies
    1. రాజీవ్ గారూ,

      "విభజనలో ఉన్న లొసుగులు మీదే మన అభ్యంతరం ఉండాలి"

      విభజనలో లొసుగులు ఏమిటి అని అడిగితె ఎవరూ చెప్పలేక పోయారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన వాటికీ లేని కొమ్ములు ఆంధ్రకు ఉన్నాయనే భావనలో నుండి బయటికి వచ్చి "ఫలానా చట్టంలో ఉన్న ఫలానా అంశం లేనందువల్ల ఆంధ్రకు కష్టం" అని ఒక్కటి చూపించండి చూద్దాం.

      "ఆంధ్ర పారిశ్రామికవేత్తలను నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ ఇంకా మన గురించి వాగే సందర్బాలు"

      ఒకవేళ నిజం అయినా అదేదో చీకాకు పడే బదులు సదరు ఆంద్ర పారిశ్రామిక వేత్తలతో "మానను తిడుతున్న వారితో మీరెందుకు? మన రాష్ట్రానికి వెళ్దాం రండి" అనొచ్చా? అంటే వాళ్ళు వస్తారా?

      What does this prove?

      1. These industrialists are motivated by their own profits, not sentiment
      2. They are dependent on Telangana, not the other way round
      3. Telangana does not lose even if they leave. Someone else will replace them

      Delete
    2. జై గారు,
      చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడడం.....

      1. విభజనలో లొసుగులు వలన ఆంధ్రకి జరిగిన నష్టం గురించి ఇప్పటికి కూడా మీకు కనిపించలేదా.... బ్లాగర్లలో ఎవరూ కూడా దీని మీద రాయలేదా... మీరు ఒక్క విషయం చూపండి చాలు అన్నా, ఇదే బ్లాగులో హరిబాబు గారు చాలా మార్లు చాలా విషయములు ప్రస్తావించారు ఆంధ్రకి జరిగిన నష్టం మీద... ఆయినా సరే అంశాల వారీగా నా బ్లాగులో త్వరలో రాస్తాను.

      2. ఇది చాలా సిల్లీగా ఉంది జై గారు... దోపిడిదారులు అని ముద్ర వేసి ఆంధ్రుల దోపిడిని అడ్డుకట్ట వేయాలి అన్న ధీమ్ తో రాష్ట్రం సాధించుకున్నది మీరు.... మీ ధీమ్ ప్రకారం విభజనకి ప్రధాన కారణంగా ప్రస్తావించబడిన దోపిడిని నిరోధించవలసినది మీరు కానీ... మాకెందుకు.... మీ ధీమ్ ప్రకారం వారు మీ వనరులు దోచుకుంటున్నప్పుడు, దానిని ఆపడానికి మీరు ప్రయత్నించాలి గానీ... మేము ఎందుకు చెప్పాలి? వాళ్ళు అక్కడ ఉండడం వలన మాకేమి వచ్చిన నష్టమేమి లేదు.. కాకపోతే ఏ దోపిడి ధీమ్ తో ఆయితే విభజన కోరారో అదే ధీమ్ ని ఏమి చేయలేకపోయారనే అపవాదు మీ మీద ఉంటుంది... సమైక్యానికి, ఇప్పటికీ ఏమి తేడా లేదు.. ఆరోజు ఎవరూ ఆయితే దోపిడి చేస్తున్నారో, ఇప్పటికీ వార్ దోపిడి చేస్తున్నారు. (మీ ధీమ్ ప్రకారం).. ఆయినా వారినే నెత్తిన ఎలా పెట్టుకుంటున్నారు. నాలుకకు రెండు వైపులా పదును అంటే ఇదేనా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..... చివరగా వారిని మేము వచ్చేయండి అని అనవలసిన పని లేదు.. పారిశామికవేత్తలు ఎప్పూడు తన స్వంత లాభమే చూసుకుంటారు. సమైక్యం, విడి అన్న దానితో వాళ్ళకు పని లేదు...

      Delete
    3. Telangana does not lose even if they leave. Someone else will replace them

      నూరు శాతం ఏకిభవిస్తాను దీనితో... ఒకరో, ఇద్దరో పోయినంత మాత్రానా ఎక్కడ కూడా అర్దిక వ్యవస్ద స్దంబించడం జరగదు.. ఖచ్చితంగా ఆ లోటు వేరే విధంగా భర్తీ ఆవుతుంది..

      ఆంధ్ర పారిశ్రామికవేత్తలు తరలిపోతే తెలంగానా అర్దిక వ్యవస్ద కూలిపోతుందని నమ్మేవాళ్ళలో నేను అస్సలు లేను.... ఇక్కడ నేను ప్రస్తావించేది దోపిడిదారులు వెళ్ళగొట్టడం అనే ధీమ్ గురించే తప్ప, దాని వలన తెలంగానా నష్టపోతుందన్న ఆలోచన ఆయితే మాత్రం కాదు...

      Delete
    4. రాజీవ్ రాఘవ్ గారూ:

      1. హరిబాబుతో సహా ఎవరు మాట్లాడినా "అన్యాయం జరిగింది" అంటారు. సదరు అన్యాయానికి చట్టంలో ఉన్న ఫలానా అంశానికి సంబంధం చెప్పరు, ఒకవేళ చెప్పినా అదే తరహా అంశం గతంలో కూడా వాడారన్న వాస్తవాన్ని విస్మరిస్తారు. If an item is discriminatory against Andhra now, it was beneficial to them from 1953 onwards. నా ఉద్దేశ్యంలో "నష్టం" వేరే "అన్యాయం" వేరే అని గుర్తించకపోవడమే దీనికి కారణం. I hope your blog posts on this matter will start from the assumption that an item that was prevalent in all reorganizations from 1953 is deemed to be fair.

      2. తెలంగాణా ఉద్యమానికి ఆంద్ర పెట్టుబడి దారుల దోపిడీ ప్రధాన కారణం అని ఎవరన్నారో తెలీదు కానీ ప్రస్తుత చర్చ కోసం పరిగణనలో తీసుకుందాం. అధికారం గుప్పిట్లో ఉంది కనుక విపరీతమయిన లాభాలను అన్యాయంగా కాజేసే crony capitalism దోపిడీ అవుతుంది. ఉ. హైటెక్ సిటీ ప్రాజెక్ట్ బయటికి పొక్కే ముందు అసమదీయులకు కారు చవకగా కట్టపెట్టడం, కాంట్రాక్టులను గుట్టు చప్పుడు చేయకుండా అసమంజసమయిన మొత్తాలకు అప్పచెప్పడం వగైరా. ఇది జరుగుతున్నట్టు ఇప్పటిదాకా కనిపించడం లేదు, ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాం. గతంలో జరిగిన అవకతవకలు/కుంభకోణాలు బయటికి తెచ్చి శిక్షిస్తే మరీ మంచిది కానీ ఆగిపోయినా ఫరవా లేదు కదా.

      3. మీరు నేనూ ఒప్పుకున్నాం కనుక సాగతీత అక్కరలేదు.

      Delete
    5. 1. ఒకవేళ చెప్పినా అదే తరహా అంశం గతంలో కూడా వాడారన్న వాస్తవాన్ని విస్మరిస్తారు.

      ఏ పరిస్దితుల్లో చేయవలసి వచ్చిందన్న దానిని బట్టి, అప్పటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవడం దేనికైనా సబబు. అంతే కాని గతములో అలా చేసారు కాబట్టి, ఇపుడు కూడా అలానే అంటే కాలముతో పాటుగా మారిన అవసరములను మనమ్ అర్ద్రం చేసుకోకపోవడమొ అవుతుంది కదా.... ఉ. అంబేద్కర్ రాజ్యాంగం సమయంలో వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం అన్నది అనాటి పరిస్దితుల్లో సముచితం. అలాని ఇప్పటి పరిస్దితులకు వర్తించడం సముచితం అని చెప్పగలమా? కాదు కదా... ఇది కూడా అలానే... గతంలో ఇదే తరహా అంశం వాడారు అని చెప్పడం వలన ఒక ప్రాంతానికి జరిగిన అన్యాయం, న్యాయం ఆయిపోదు.

      నా ఉద్దేశ్యంలో "నష్టం" వేరే "అన్యాయం" వేరే అని గుర్తించకపోవడమే దీనికి కారణం.

      అన్యాయం జరిగినపుడె నష్టం సంభవిస్తుంది... మోసపోయినపుడు కూడా నష్టం సంభవిస్తుంది. మన అజాగురత కారణంగా నష్టం వాటిల్లుతుంది. పై మూడు కూడా ఆంధ్రకి వర్తించాయి.

      2."ఇది జరుగుతున్నట్టు ఇప్పటిదాకా కనిపించడం లేదు, ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాం."

      అంటే మీరు చెప్పినటువంటి crony capitalism దోపిడి జరగలేదు అనే కదా.. అటువంటప్పుడు ఆంధ్ర మీద అబద్దపు ప్రచారము చేసారని అనుకోవచ్చా..

      3. సంబంధం లేనిది ఆయినా ప్రస్తావిస్తున్నాను. ఆంధ్రకి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది.. హైదరబాద్ లాంటి నగరం కోల్పోయినా, ఖచ్చితంగా దాని స్దానాన్ని వేరోకటి భర్తీ చేస్తుంది...

      Delete
    6. రాజీవ్ గారూ,

      1. గతంలో *అన్ని సార్లూ* వాడిన విధానం ఇప్పుడు వాడకూడదన్న వాదనకు చాలా బలమయిన ఆధారాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా ఉంది. కాలం మారింది ఆంటే సరిపోదు, ఆ మార్పు ఏమిటి, దానికి ఆ పద్దతిపై ప్రభావం ఏమిటని కూడా చూపించాలి.

      న్యాయాన్యాయాలకి లాభానష్టాలకు ఖచ్చితమయిన సంబంధం (correlation) ఉండాల్సిన అవసరం లేదు. ఉ. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినందుకు ఇంగ్లాండుకు జరిగింది నష్టం కానీ అన్యాయం కాదు.

      2. I was referring to the post-Telangana formation timeline only above

      3. హైదరాబాద్ నగరాన్ని ఎవరూ కోల్పోలేదు. భర్తీ చేయడానికి ఖాళీ ఎక్కడిది? ఒకవేళ కోల్పాయారంటే 1953 మదరాసు కోల్పోడం వల్ల ఏర్పడ్డ ఖాళీ ఎలా భర్తీ అయింది?

      మీరు మీ బ్లాగులో రాస్తానన్నారు కాబట్టి నాదొక మనవి. 1953 ఆంద్ర రాష్ట్ర ఆవిర్భావ చట్టంలో ఏదో ఒక అంశం తీసుకోండి. 2014 తెలంగాణా ఆవిర్భావ చట్టంలో దాని corresponding అంశంలో ఏమి మార్పులు మీరు ఎందుకు కావాలంటున్నారో విపులీకరించండి.

      Delete
    7. జై గారూ...
      1. ఆధారాలు ఇవ్వాలి, ఆధారాలు కావాలి. అవి కావాలి, ఇవి కావాలి.. ఇవన్నీ విపులకరించడానికి ఇదేమి కోర్టు కాదు. ఏదైనా విషయానికి సంబంధించి కోర్టుకయితే ఆధారాలు కావాలి. మామూలు మనుషులకైతే అవసరమ్ లేదు. అర్ద్రం చేసుకోగలిగతే చాలు. అవన్నీ రెండు మూడు ముక్కల్లో చెప్పగలినవి కాదని మీకూ తెలుసు....
      భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినందుకు ఇంగ్లాండుకు జరిగింది నష్టం కానీ అన్యాయం కాదు.
      ఇంగ్లాండు భారతదేశం నుండి సంపద దోచుకుపోయింది తప్ప, లండన్ వాళ్ళు అక్కడ ఆస్దులు అమ్ముకొని వచ్చి భారత్ లో పెట్టుబడులు పెట్టలేదు... ఆంధ్ర వాళ్ళు అస్దులు అమ్ముకొని వచ్చి హైదరబాదులో పెట్టుబడులు పెట్టినట్టుగా.
      భారత్ వదిలిపోయిన తర్వాత బ్రిటిషర్లు అందరూ తట్టాబుట్టా సర్దుకొని లండన్ పోయారు. అంతే గానీ బ్రిటిషర్లును ప్రక్కలో ఉంచుకొని స్వయం పాలన చేపట్టలేదు..... మీరు అంధ్ర్ పారిశ్రామికవేత్తలను ప్రక్కలో పెట్టుకున్నట్టుగా...
      2. చూద్దాం.. ఎంత నిజాయితీగా సాగుతుందో....
      3. హైదరాబాద్ నగరాన్ని ఎవరూ కోల్పోలేదు. భర్తీ చేయడానికి ఖాళీ ఎక్కడిది? ఒకవేళ కోల్పాయారంటే 1953 మదరాసు కోల్పోడం వల్ల ఏర్పడ్డ ఖాళీ ఎలా భర్తీ అయింది?
      మిమ్మల్లి దృష్టిలో పెట్టుకొని చెబుతున్నారా హైదరబాదు ఎవరూ కోల్పోలేదని.. అంధ్రులు రాజధానిని కోల్పోవడం అంటే అర్ద్రం అది కాదా?
      ఆంధ్ర పారిశ్రామికవేత్తలు ఒకవేళ తెలంగానాని ఖాళీ చేస్తే, ఆ ఖాళీని ఇంకొకరు ఎలా భర్తీ చేస్తారని మీరు అనుకున్నారో ఇక్కడ కూడా అలానే హైదరబాదు స్దానాన్ని భర్తీ చేస్తారు.
      మదరాసు కోల్పోడం వల్ల ఏర్పడ్డ ఖాళీ హైదరబాద్ తో భర్తీ ఆయిందని కూడా చెప్పాలా మీకు! అలానే హైదరబాదును కోల్పోడం వలన ఏర్పడ్డ ఖాళీ అమరావతితో భర్తీ ఆవుతుందని కూడా చెప్పాలా!
      సినీ పరిశ్రమ చైన్నె నుండి ఎందుకు హైదరబాదుకి వచ్చింది? అప్పటి వరకు చైన్నైలో పెట్టుబడులు పెట్టిన అంధ్రులు ఆ తర్వాత హైదరబాదుకు ఎందుకు మారారు?
      రాజధాని కాబట్టే... ఇందులొ మీకుగానీ, నాకు గానీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు.. సినీ పరిశ్రమ హైదరబాదుకి ఎందుకు తరలింది? రాజధాని కాబట్టే! రాజధాని హైదరబాదు కాకుండా వేరే చోట ఎక్కడైనా పెట్టి ఉంటే సినీపరిశ్రమ, ఆంధ్రుల పెట్టుబడులు అక్కడికే వెళ్ళేవి. అంతే తప్ప హైదరబాదు వచ్చే చాన్స్ లేదు.

      Delete
    8. @rajiv raghav:

      1. నిజమే ఇది కోర్టు కాదు. అయితే మనం ఒక నిర్ధారణకు రావాలంటే ఒక బేసిస్ అంటూ ఉండాలి కనుక కొంతయినా లోతుకు వెళ్లి అధ్యయనం చేస్తే తప్ప అర్ధం కాదు. ఎవరో చెప్పారని మనమూ గుడ్డిగా నమ్మడం బదులు సొంత అవగాహనకు రావడం మంచిది.

      2. OK చూద్దాం

      3. ఆంధ్రులు ఎవరూ మదరాసు కానీ హైదరాబాద్ కానీ కోల్పోలేదు, ఆంద్ర *ప్రభుత్వం* మాత్రమె కోల్పోయింది. మదరాసు "ఖాళీ" హైదరాబాద్ భర్తీ చేసి ఉంటె ఐదో స్థానం నుండి ఆరో స్థానానికి పడేది కాదేమో. ఏది ఏమయినా కొత్త ఆంద్ర రాజధాని అభివృద్ధి చెందాలనే నా కోరికయినా తద్వారా హైదరాబాద్ నష్టం పోదని నా నమ్మకం. I do not believe it is a zero sum game. మున్ముందు చూద్దాం మీరు నేనూ ఇక్కడే ఉంటాం.

      Delete
  4. జై గారికి కావాల్సింది సీమాన్ద్రులను వెల్లగోట్టడమే. తెలంగాణా వారు అడుక్కు తిన్న పర్వాలేదు. నిజాం లాంటోడు బట్టలిప్పి బతుకమ్మ ఆడించినా పర్లేదు సాటి సీమాంధ్ర తెలుగోడు ఉండొద్దు అంతే.

    ReplyDelete
  5. ఇక్కడ జై గారు ఆంధ్రోళ్ళు వెళ్ళిపోయినా ఫర్వాలేదు అని ధీమాగా చెప్తున్నారు కానీ వాస్తవం అట్లా లేదు.పని గట్టుకుని తెలంగాణా వారిని పక్కన పెట్టేసి ఆంధ్రా వ్యాపారస్తులకే ఇంకా ప్రోత్సాహం అందిస్తున్నారని నాబోతి వారు కాదు తెలంగాన అసాంజి పేరుతో ఉన్న వీర తెలంగాణ్యులే అంతున్నారు.పోనీ వ్యాపారం అంటే కాంప్లికేటెడ్ యవ్వారం అనుకుంటే కాంట్రాక్టుల్లో కూడా అల్లాగే ఉండి "మనవాళ్ళనీ ప్రోత్సహించంది,లేకపోతే మనవాళ్ళు యెప్పటికీ సుబ్ కాంట్రాక్తర్లు అయిపోతారేమో?!" అని ఆందోలన పడుతున్నారు!

    ReplyDelete
    Replies
    1. ఆంధ్రోళ్లు వెళ్లాలని నేను ఎప్పుడూ అనలేదు, అనబోను కూడా. ఆంద్ర *పెట్టుబడిదారులు* వెళ్ళినా నష్టం లేదు. మీకు అనుమానం ఉంటె వాళ్లకు ఎర వేసి పట్టుకెళ్ళి పొమ్మని బాబు గారికి చెప్పండి.

      ye नहीं तो और सही और नहीं तो कोई और सही. బెల్లం ఎక్కడ ఉంటే అక్కడ ఈగలు వస్తాయి!

      If you have any questions for the other blogger, please address it to him.

      PS: సౌగాతో రాయ్ ఎవరు? వారి సుద్దులు ఏమిటి?

      Delete
    2. @jai
      సౌగతో రాయ్ అనే బెంగాలీ సభ్యుడు ఒకసారి ఈ రెందు రాష్ట్రాల మధ్యనా జరుగుతున్న విషయాల్ని కొంచెం సరదాగా కొంచెం సలహాలతో తన ప్రసంగంలో చెప్పాడు.ఒకానొకప్పుదు కేసీఆర్ విజయశాంతి ఇద్దరె ఉండేవాళ్లనీ,అప్పట్లో కేసీఆర్ తన సీట్లో తను కూర్చునో నిల్చునో ంటే అప్పూదప్పుడూ విజయశాంతే "జై తెలంగాణ" అంటూ ఉండేదనీ,అట్లాంతిది కాలం అంకొలించ్జి వారు వారి ఆకాంక్షని నెరవేర్చుకున్నందుకు అభినదిసూ మొత్తం దసల వారీగా బయత వాళ్ళు యెట్లా చూస్తున్నారో రేఖామాత్రంగా వీవరించాడు.మిమ్మల్ని గానీ మమ్మల్ని గానీ యేకి పారెయ్యలేద్ గానీ అప్పుడే హరీష్ ర్రావు చంద్రబాబ్ని తెలంగానలో అడూపెట్టనివ్వం అనే స్టేట్మెంటు ఇస్తే ఒక లోక్ స్బ అసభ్యుదికె,ఒక రాష్త్ర ముఖ్యమంత్రికీ,అంతెందుకు శ్శాసన సభ్యుడయినా దేసమంతటా తిరగొచ్చు,ఒక రాష్త్రంలో అడుగుపెట్టనివ్వం అనేలాంతి మాటలు అంత మంచి కావు అని చెప్పడం జరిగింది.ఇది తెలుగులో ఆంధ్రజ్యొథిలో పడింది గాబట్టి మీరు పచ్చ మీడియా అనుకుంటారేమో హిందూలో కూడా వచ్చింది.అయితే నేనప్పుడు మా అమ్మగారికి బాగుందక హాస్పితల్లో జాయిన్ చేస్తే అక్కద వచ్చే పేపర్లలో చదివాను.పూర్తిగా ముక్కస్య ముక్క అన్నట్టు చెప్పలేకపోయినా సారాంశం మాత్రం అది.

      మనంపాటికి తెలుగులోనే మాట్లాడుతున్నాం అనుకుంట్టే అది శానా తప్పు - ఇద్దరికీ వర్తిస్తుంది!

      Delete
    3. Thanks for the update. Is this the same Saugata Roy in the Sharda chit scam?

      Delete
    4. @jai
      మీ పవిత్రాతి పవిత్రమైన ప్రాంతీయాభిమానపు ఉద్యమ నేతలు తెలంగాణ కోసం దేబిరించీ ముష్టెత్తీ 30 సీట్ల లాలూచీ ఒప్పందాలు పెట్టుకుని ఇస్తానన్న తొమ్మిదిన్నరేళ్ళు ఇట్లాగయినా ఇవ్వకుండా తప్పించుకుందామని చూసిన కాంగ్రెసులో ప్రధానమంతరె స్కాముల్లో ఇరుక్కున్నాడు!

      ఇంతకీ హార్స్ ట్రేడింగ్ మీ ప్రానతం గొప్ప్పతో మీ ప్రాంతాన్ని రాష్త్రంగా సాధించిపెట్టాడు గాబట్టి కేసీఆర్ అధికారంలో ఉన్న వెసులుబాటు నుపయోగించుకుని పాతకేసుల్ని తిరగదోడతామని భయపెట్టడం దగ్గిర్నుంచి ఫాం హౌసుకే పిలిపించుకుని చేస్తే లేని తప్పు తెదెపా చేస్తే అంత నెప్పిగా యెందుకు ఫీఅలవుతున్నారు? - అనే ప్రశ్నని దాటవేసినట్టున్నారు!

      నా ప్రశ్న మొదటినుంచీ ఒకటే - తెదెపా అవినీతి చేసి ఉండొచ్చుగాక,అదే అవినీతిలో మునిగితేలుతున కేసీఆర్ వర్గం కేవలం అధికారంలో ఉన్న వెసులుబాటు వల్ల పట్టుబడకపోయినంత మాత్రాన పవిత్రమైనదా?ఇంకొకళ్ళని తప్పు పట్టే అర్హత వాళ్ళకి ఉందా?పెంపుదు జంతువులతో ఉచ్చులు వేసి తను యేమి సధించగలడు?ఉద్యమం ద్వరా అధ్భుతకార్యాన్ని సాధించిన తొలి యెన్నికల్లోనే తను వోత్ వెయ్యని తెదెపాకి మాత్రమే వోతు వేసే అలవాటున్న వోటర్లు అతమ కిస్తమైన వాళ్ళని పగబట్టి వేధించిన వాడికి పూనుకుని వోటు వేస్తారా?ఇప్పుడు కళ్ళముందు కనిపిస్తున వాళ్ళే కాదు ఇదివరకు అట్లా పార్టీలు మారిన వాళ్ళు కూడా బొత్స లాగా స్టాంద్ ఉన్నవాళ్ళు తప్ప తిరిగి తమ స్థానాల్లోనే గెలవలేకపోయారు,అది తెలిస్తే ఆర్స్ ట్రేడింగ్ వల్ల అప్పటికప్పుడు అధికారంలో ఉండి అవినీతి చేసుకోవడ్డానికి అవకాశంగా తప్ప అమరెందుకూ ఊపయోగపడదని తెలుస్తుంది మీకూ కేసీఆర్ మహాసయులకి కూడా!

      ముఖ్యంగా మీకు వేస్తున్న ప్రశ్న - కేసీఆర్ అవినీతి రహస్యంగా యేమీఎ జరగటం లేదు,మరి అప్పుడు మీ ప్రతిస్పందన యెట్లా ఉంది?మీలో ఉన్న ప్రాంతీయాభిమానం నిజమైనదే అయితే ంత ప్రశాంతంగా యెట్లా ఉండగలిగేవారు?

      Delete
    5. హరిబాబు గారూ, మీరు కెసిఆర్/తెరాస వారిని అడగదల్చిన ప్రశ్నలు వారినే అడగండి. జగన్ తరహాలో "ఫలానా వారు పట్టుబడని దొంగలు" అనడం కాస్త వింతగా ఉంది.

      కెసిఆర్ తెలంగాణా సాదించాడనే మీ నమ్మకం మీది, నాకా అపోహ లేదు.

      కెసిఆర్ వర్గానికి టీడీపీ వారిని విమర్శించే అర్హత ఉన్నా లేకపోయినా నాకుంది కాదనగలరా?

      కెసిఆర్ అవినీతి ఆధారాలు (ప్రత్యక్ష సాక్ష్యం కానక్కరలేదు) బయటకు వస్తే (వచ్చినప్పుడు) నేనే ముందు వరసలో నిలబడి దుమ్మేసి పోస్తాను, మీకా విషయంలో అనుమానం వలదు మిత్రమా! మీకు ప్రాపగండా తప్ప మరో ప్రయోజనం లేని ఈ విషయం మాకు అత్యంత నష్టదాయకం అనే సంగతి మరువకండి.

      Delete
    6. @jai
      హరిబాబు గారూ, మీరు కెసిఆర్/తెరాస వారిని అడగదల్చిన ప్రశ్నలు వారినే అడగండి.
      No no
      సారీ,మీరు తెలంగాణని బలంగా కోరుకుని దానికోసం తహ లాడినవారు.ఈ ప్రశ్నలు అడిగి తేల్చుకోవటం మీ బాధ్యత మాత్రమే!అధికారంలో ఉన్నవాడు చట్టానికి దొరకడు.జగన్ యెప్పుడు ఆ అవినీతీ చేస్తుండగా దొరికాడా?

      కేసీఆర్ అవినీతి గురించిన వార్తలు రహస్యంగా జరగటం లేదు.ఉద్యమంలో నిస్వార్ధంగా పని చేసిన వాళ్లని తెలివిగా అధికారానికి దూరంగా ఉనచటం,పాత అవినీతి పరులనే పక్కన పెట్టుకుని కనీసం కాంట్రాక్టులు కూడా తెలంగాణా వాళ్ళ కివ్వకుండా వాళ్లలో స్టాందర్డ్ లేదని తీసిపారెయ్యటం బహిరంగంగానే జరుగుతున్నాయి, సాక్ష్యానికి నేను తీసుకున్న తెలంగాణా అసాంజి బ్లాగరు అన్ని పోష్తుల్నీ చూదండి తెలుస్తుంది.ఇవ్వాళ జరుగుతున్నా ఆపలేని నిస్సహాయతలో ఉండి రేపెప్పుదో వాడు దొరికాక చూద్దాములే అనడం యెట్లా ఉంతుందంటే కళ్ళముందు రేప్ సీను జరుగుతుంటే యెవరన్నా వచ్చి కాపాడీతే ఓకే,కోర్టులో కేసు వేసి సాక్ష్యానికి పిలిసతే గూడా ఓకే - కానేఎ నేను మాత్రం పూనికుని పోరాడను అది నాపని కాదు అనటం లాంటిది.ఈ గోడమీద పిల్లివాటం కబుర్లు నేను కూడా చెప్పగలను.దానివల్ల ఉపయోగం లేదు.

      పోష్తులొ నేను వేసిన అతి ముఖ్యమైఅన ప్రశ్న "ప్రాంతీయాభిమానం పేరుతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతీయాభిమానం యొక్క ఆదర్సాన్ని మర్చిపోయి అవినీతికి పాల్పడుతున్నప్పుదు వారిలో అవినీతికి పాలడకుండా ఊండేటట్లు చెయ్యలేనిదీ మీలో ప్రాంతీయాభిమానం ద్వారా అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా పవిత్రంగా ఉండలేకపోవటం పట్ల క్రోధం కలగనివ్వనిదీ అయినప్పుడు మరి ఇన్నాళ్ళూ దానికి అంత ప్రాముఖ్యత యెందుకిచ్చారు మీరు?" అనేది - అదయినా సరిగ్గా అర్ధమయిందా?

      ఉద్యమ అసమయంలో కేసీఆర్ ఆంధ్రోళ్ళని తిడుతున్నాడూ న్నప్పుదు దాంతో నాకు స్మబంధం లేదు ఉద్యమం అంచున వున్నాను అన్నారు.ఈ సంవత్సర కాలంగా జరుగుతున్న అవినీతిని గురించి అడిగితే అదీ నాకు సంబంధం లేదు కేసీఆర్/తెరాసా వాళ్లని అడగండి అంటున్నారు.వాటిలో వేటికీ లేని సంబంధం ఇప్పుడు ఓతుకినోతు కేసులో యేమి ఉంది?
      గట్టిగా నిలదీసీ అడిగిన వాటికల్లా సంబంధం లేదని తప్ప్పించుకునే మీరు బాబు అవినీతి గురించి మాత్రమే ఇంత గట్టిగా పటించుకోవటానికి దీనిలో మాత్రం మీకు ఉన్న ప్రత్యేకమైన సంబంధం యేమిటి?

      Delete
    7. హరిబాబు గారూ, ముందు తెలంగాణావాదులు అందరూ తెరాస/కెసిఆర్ చంచాలని & ప్రతి విషయంలో వారి ఆదేశాలు తీసుకొని వాటిని తూచా తప్పక అనుసరిస్తారనే బావిలోంచి బయటకి రండి. Nobody owns me. I am not answerable to what any Tom, Dick or Harry did/said just because some other Tom, Dick or Harry "thinks" I should.

      ద్రోణంరాజు సత్యనారాయణ ఎన్టీఆర్ అవినీతి అంటూ 100 ఆరోపణల సూచీ విడుదల చేసారు. వైఎసార్ మీద టీడీపీ ఏకంగా ఒక పుస్తకం వేసింది. అటువంటి ఏమన్నా కెసిఆర్ మీద వస్తే చదువుతాను తప్ప ఎటువంటి ఆధారాలు లేని వాటి మీద నా సమయం వృధా చేయను. నా కాళ్ళ ఎదుట ఏమి జరుగుతుందో మీరు చెబితే తప్ప తెలుసుకోలేని మూర్ఖత్వం నాకు ఆపాదించడం మీకే చెల్లింది.

      I did not understand your long sentence liberally laced with inneundo & buzz words. Can you make it simpler, if necessary by splitting it, thanks.

      బాబు మీద విపక్షాలు చేసిన ఆరోపణలు నేను పట్టించుకోలేదు. రేవంత్ అరెస్టుకు కూడా కూడా స్పందించలేదు. వోటుకు కోట్లు కుట్రలో చంద్రబాబు పాత్ర (అదీ పక్కాగా ఉన్నట్టు అనిపించే ఆధారాలు) వచ్చాక, ఆయన దాని నుండి బయటకు పడేందుకు సర్కస్ ఫీట్లు మొదలట్టాక మాత్రమె నేను లోతులో విచారించాను. This is consistent with my usual approach of taking cognizance of a matter only if it is grave & backed by reasonable prima facie facts. Unlike some others I take a stand based on factual evidence.

      Delete
  6. బ్లాగు మిత్రులారా,

    నవీనం అనే ఈ జోకర్ గాడు ఏ పేపర్ లో వార్తలు రాస్తాడో మీకెవరికైనా తెలుసా?


    http://naveenrjy.blogspot.in/2015/06/blog-post_6.html

    ReplyDelete
  7. జై గారు "నష్టం","అన్యాయం" వంటి మాటల్ని తెలివిగా వాడుతూ ఆంగ్లేయులకీ ఆంధ్రావారికీ సాపత్యం తీసుకురావడం వాస్తవాన్ని చూదలేని వారి నైజాన్ని మరోసారి నిరూపిస్తున్నది.ఆంగ్లేయులు చేసింది అప్పటి భారతీయ ఆంగ్లేయ మేధావులందరూ నిరసించిన పధ్ధతి - "గంగానదిలో ఒక పెద్ద స్పాంజిని ముంచి ఆ నీటిని పీల్చుకున్నాక దాన్ని ధేంసు నదిలో పిండటం" లాగ జరిగింది.షెరిడన్ అనే ఒక ఆంగ్లేయ మేధావి భారతదేశంలో జరుగుతున్నదాన్ని చూసి "నేను నమ్మే భగవంతుడి పేరున ఈ అన్యాయాలు చెస్తున్న వారందర్నీ శపిస్తున్నాను" అనేటంతగా ఆగ్రహించిన దుర్మార్గం!

    మరి మీరు ఇప్పటికీ ఇన్నాళ్ళు ఆంధ్రావాళ్ళు తెలంగాణని దోచుకుతిన్న సంపదని కొల్పోవడమనే నస్టానికే ఇప్పుడు ఆంధ్రావాళ్ళు యేడుస్తున్న్నారనే మీ క్రూరమైన వాదనని మీ ముఖ్యమంత్రే ఒప్పుకోవడం లేదు.ఇంకా వాళ్ళ కష్తమే మాకు కావాలి అంటున్న్నాడు,అది అర్ధమయితే మీరు ఈ "నష్తం","అన్యాయం" అనే పదాలతో గారడీ వాదనలు చెయ్యరు.కేవలం ఒక నగరపు ఆదాయం మూడు ప్రాంతాల ఆదాయాన్ని కలిపిన ఆదాయంలో చెప్పుకోదగ్గ మొత్తంగా పెరగడం వెనక ఉన్న రహస్యం యేమిటో ఇవ్వాళ అధికారంలో ఉండి ప్రత్యక్షంగా చూస్తున్న మీ ముఖమంత్రికి తెలిసినంతగా మీకు తెలియకపోవడమే కారణం కావచ్చును.

    మీరు 1953 నాటి విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నరు.ఒకప్పుడు చెన్నప్ప అనే తెలుగువాడి పేరున యేర్పడిన చెన్నపట్నానికి నిన్నమొన్నటివరకూ ఉన్న మద్రాసు అనే పేరుకి బదులుగా చెన్నై అని మార్చిన ఒక తమిళ ముఖ్యమంత్రి అట్లా యెందుకు చెయ్యవలసి వచ్చిందో కూడా తెలుసుకోండి.మా రెక్కల్ కష్తం మీదనే ఆ నగరం పెరిగిందనేది వాళ్ళు ఒప్పుకున్నారు - అది వాళ్ళ మంచితనం!భాగ్యనగరం విశ్వనగరంగా పెరగడం వెనక మా వంతు కష్టం ఉందని తెలిసినా అందులో నయాపైసా కూడా ఇవ్వకూడదని భీష్మించుకోవదం వల్లనే మాకు మీరు చెప్తున్న "నష్తం" జరిగింది.ఆంగ్లేయుల మాదిరి మీ ప్రాంతంలోని సంపదని మా ప్రాంతానికి తరలించుకుపోవడం కాకుండా అది కూడా మా ప్రాంతమే అనుకుని ఇవ్వాళ మిమ్మల్ని నిలవలఓ ఉండి ధనిక రాష్ట్రంగా మారదంలో ఆ నగరమే ప్రముఖపాత్ర వహిస్తున్నదని యే చరిత్ర ఆఠాలు చదవకుండా కేవలం కళ్ళతో చూసినదాన్ని నమగలిగితే చాలు తెల్య్స్తుంది.

    సాంకేతీక్ పదాల చాటున క్రూరత్వాన్ని దాచుకోకండి!మీకన్నా మీ ముఖ్యమంత్రీయే చాలా నయం.ఆ రెందు ముక్కలూ తనౌ ఒపుకున్నాడు "ఉద్యమ వేడిలో యేదో అన్న్నాం,మనసులో పెట్టుకోవద్దు" అనీ "ఆంధ్రావాళ్ళు యెక్కడికీ వెళ్ళల్సిన పని లేదు,వాళ్ళ శ్రమ బంగారు తెలంగాణ నిర్మాణానికి కావాలి" అని!

    ఈ సాంకేతిక పదాల చాటున దాక్కోకుండా మా ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం మీ దద్దమ్మతనం అని అంటారా,అది శభాషైన మాట?!

    ReplyDelete
    Replies
    1. ఆంగ్లేయులు కొందరు భారత స్వాతంత్ర్యాన్ని సమర్తించినట్టే ఎందరో ఆంధ్రులు తెలంగాణా రాష్ట్ర ఆకాంక్షనూ సమర్తించారు. మీకు తెలియనట్టి నటించినా ఈ విషయం వాస్తవం.

      మా "ముక్కుమంత్రి" మీకు కలలో వచ్చి చెప్పాడా సదరు దొరవారి ఫాంహౌసుకు మీరే వెళ్ళారా?

      ఆదాయం తక్కువగా ఉన్న ఒక ప్రాంతం దాంట్లో నుండి సింహభాగం ఖర్చు ఎక్కువ ఆదాయం ఉన్న ప్రాంతంపై పెట్టిందా? దీనికి రుజువులు చూపిస్తే వచ్చే నోబుల్ ఆర్ధిక పథకం మీకే :)

      ఆంద్ర వాళ్ళు వెళ్లి పోవాలని నేను ఎప్పుడూ అడగలేదు. అలా జరిగితే నా సొంత కుటుంబం సగం ఖాళీ అవుతుంది. హైదరాబాద్ నగరం & తెలంగాణా రాష్ట్రం రెంటిలోనూ ఆంధ్రులతో సహా అందరి కాంట్రిబ్యూషన్ ఉందన్న వాస్తవాన్ని నేను ఎప్పుడు కాదన్నానో చూపించండి. వారి కృషికి పరిశ్రమకు తగిన ఫలితం వారికి కాక ఆంధ్రలో ఉండే వారి "అసమదీయులకు" చెందాలనే వాదన నేను వ్యతిరేకించడం మీకు తప్పనిపిస్తే మీ ఇష్టం.

      పెట్టుబడి పెట్టిన మనిషి తన కష్టనష్టాలను చూసుకుంటాడు. ఆయన "నేటివ్ ప్లేస్" కి చెందినా వారి జోక్యం అవసరమా?

      Delete
    2. మీరు మళ్ళీ మొదటి కొచ్చారు.

      నేను సూటిగా అడిగినది

      1.మీరు ఒకనాటిది క్రొనీ క్యాపిటలిజం అంతున్నప్పుడు అది ఇంకా అలాగే ఉన్నప్పుడు ఉంటుందని రూఢిగా తెలిసినప్పుడు రాష్త్రసాధన వల్ల కొత్తగా యేమి సాధించినట్టు? - అని.

      2.ఒక పవిత్రమైన ఉద్యమావేశం ఉండి దానితో అధికార పీఠాన్ని అధిష్తించిన వారిలో ఆ ఉద్యమావేశానికి తగ్గ పవిత్రత లేనప్పుడు ఆ సిధ్ధాంతం లోని గొప్ప యేమిటి? - అని.

      3.ఇక్కడ చర్చలోకి ప్రవేశించింది మీరు గనక మిమ్మల్ని అడుగుతుంటే ఆ ప్రశ్నల్ని టి.ఆర్.యస్ వాళ్ల నడగండి అనేటప్పుదు చర్చలోకి యెందుకు వచ్చినట్టు? - అని.

      4."ఆదాయం తక్కువగా ఉన్న ఒక ప్రాంతం దాంట్లో నుండి సింహభాగం ఖర్చు ఎక్కువ ఆదాయం ఉన్న ప్రాంతంపై పెట్టిందా?", "వారి కృషికి పరిశ్రమకు తగిన ఫలితం వారికి కాక ఆంధ్రలో ఉండే వారి "అసమదీయులకు" చెందాలనే వాదన నేను వ్యతిరేకించడం మీకు తప్పనిపిస్తే మీ ఇష్టం." అని అంటున్నారు - వచ్చిన ఆదాయాన్ని మొత్తం కలిపి రాష్త్రమంతా పంచుతుందే తప్ప యే ప్రభుత్వమూ మరో విదంగా చెయ్యదు!ఇప్ప్పుడు తెలంగాన ప్రభుత్వం అలా చేస్తుందని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా?

      వాదనలో ప్రవేశించినప్పుదు చివరి వరకూ మీ సొంత బాధ్యత మీదనే జవాబులు చెప్పడం విధి!యే సూటి ప్రశ్న అడిగినా వాళ్ళ నడగంది వీళ్ళ నడగండి అంతే మీరు ఇక్కడికి యెందుకు వచ్చారు?

      నేను అడిగిన ప్రశ్నల్లో యేవీ కేవలం తెరాసా పార్టీ వారు మాత్రమే జవాబు చెప్పాల్సినవి కావు,మీరు కూడా సమర్ధించే జరనరల్ కాన్సెప్తు గురించే అడుగుతున్నాను."ఈ వడ్లగింజలో బియ్యపు గింజ కింత రాధ్ధాంతమా?" దగ్గిర్నుంచి నేను అడిగిన ప్రశ్నల్లో వేటికీ నాకు జవాబు రాలేదు!

      ఇప్పుడు కూడా ఇంకా ఆంధ్రా పారిశ్రామిక వేత్తలనే నెత్తిన పెట్టుకుంటున్నది తెలంగాణా ప్రభుత్వం అనే ఆరోపణ నాది కాదు - తెలంగాణ అసాంజి అనే బ్లాగరు కూడా అరిభీకర తెలంగాణ వాదియే,అవునా?

      అసలు పెట్టుబడి దారీ విధానంలోనే ఒక స్థాయిలో క్రొనీనెస్ అనేదిఉంటుంది!ధీరూబాయ్ అంబానీ అతి సామాన్య స్థితి నుంచి యెదిగాడు.కానె చిన్నప్పటినుంచీ ఆ వ్యవహారాలకి దగ్గిరగా ఉందటం వల్లా శిక్షణ వల్లా అతని కొడుకులే ఆ వ్యాపార సామ్రాజ్యానికి వారసులు అయ్యారు తప్ప అతని కంపెనీలో పని చేసే మరెవరికీ ఈపాటి సమర్ధత లేక కాదు గదా?

      పాత వాదనల్ని వదిలేస్తే ఇప్పటి మీ ప్రస్తావనలో మీరు ఇదివరకటి ఆంధ్రా అస్మదీయత్వం అంటగట్టి విమర్సిస్తున్నారో అదే అస్మదీయ తకధిమి ఇప్పుడు కేసీఆర్ కుతుంబానికీ అతని మిత్రబాంధవులకి దఖలు పడింది.

      నేను మొదటి నుంచీ అడుగుతున్నదే - ఇద్దరూ ఒకే రాజకీయ సామాజిక ఆర్ధిక కార్యకలాపాలు ఒకే రకంగా చేసే సంస్క్ర్తిలో ఉన్నప్పుదు ఒకడు దొంగ ఒకడు దొర అని యెట్లా అనగలరు? - అని,అర్ధమయిందా!

      ముసుగు విప్పేసి నాకు ప్రాంతమే ముఖ్యం అనదల్చుకుంటే ఇల్లు-.వీధి->గ్రామం/నగరం->మందలం->జిల్లా->రాష్త్రం-?దేశం->ప్రపంచం యెక్కద ఆగుతుంది ప్రాంతానికి నిర్వచనం అనే ప్రశ్నకీ జవాబు చెప్పాల్సి ఉంతుంది మరి?!

      నా ప్రశ్నలు ఉనంత సూటిగా మీ జవాబులు ఉందటం లేదు,గమనించారా?

      కనీసం ఉద్యమంలో సిన్సియారితీతో ఆదర్శప్రాయంగా ఉన్నవాళ్ళు కూడా కఊరలో కరివేపాకు ముక్కల్లా అయిపోయారనేది నేను ఆందోళన పడాల్సిన విషయమా?మీరు ఆలోచించి తేల్చుకోవాలి.

      నాకు అక్కడ ఆంగేయ ప్రభుత్వాన్ని విమర్సించిన షెరిడన్ లాంతి వాళ్ల గురించి కూడా కొంత తెలుసు.యెక్కడయినా ప్రభుత్వాన్ని యేకిపారేసే ప్రతిపక్షం ఉన్నట్టు విమర్సించిన వాళ్ళు తప్ప భారత జాతీయ కాంగెసులో చేరి గానీ మరో విధంగా గొప్ప అసహాయాలు చేసిన వాళ్లు గానీ యెవరూ లేరు.నెహ్రూ గాంధీ లాంతివాళ్ల మీద పోష్తులు రాసేతప్పుదు చాలా చదివాను నాకెక్కడా కనపదలేదు మరి?(ఇది అప్రస్తుతం,దీని గురించి సాగదియ్య్యొద్దు!)

      Delete
    3. 1. క్రోనీ కాపిటలిజం అంతే స్థాయిలో ఉందని మీరు అంటున్నారు. నా జవాబు "ఇది జరుగుతున్నట్టు ఇప్పటిదాకా కనిపించడం లేదు, ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాం" చెప్పేసాను. ఒకవేళ భవిష్యత్తులో అలా జరిగినా దాన్నితెలంగాణా పరిధిలోనే "వీడు కాకపొతే ఇంకోడు, వాడూ కాకపొతే మరొకడు. అంతేతప్ప మళ్ళీ "దోచుకోండి రా" అని పిలిస్తారని కలలు కనకండి బాబు గారూ! " పరిష్కరిస్తామని చూపించాను. అంతేకాక "తెలంగాణా ఉద్యమానికి ఆంద్ర పెట్టుబడి దారుల దోపిడీ ప్రధాన కారణం అని ఎవరన్నారో తెలీదు" అన్నాను. ఇకపోతే రాష్ట్ర సాధన వాళ్ళ ఏమి సాదించారు అన్న ప్రశ్నకు "బడ్జెట్ నిధుల తరలింపు ఆగలేదా? రేపో మర్నాడో ట్రిబ్యూనల్ తీర్పులో కొంతయినా నీటి చౌర్యం ఆగిపోదా? చూస్తూ ఉండండి, అన్నీ వస్తాయి, రాకపోతే నిలదీసయినా తెచ్చుకుంటాం, మీరు రంది పడకండి" జావాబు ఇచ్చాను. ఇవేవీ మీరు చూడలేదేమో?

      2. ఉద్యమం ద్వారా పీఠాలు ఎక్కిన వాడు ఆశయాన్ని నీరు కారిస్తే ఆశయం పవిత్రత తగ్గదు. అవసరం అయినప్పుడు వాడిని పక్కకు ఈడ్చి పారేస్తే సరి! "వీడు కాకపొతే ఇంకోడు, వాడూ కాకపొతే మరొకడు"

      3. మీరు కెసిఆర్ పాత కేసులు గురించి బెదిరించో డబ్బులు ఇచ్చో టీడీపీ వారిని లాక్కున్నాడన్నా, అసాన్జే అనే పేరు కల బ్లాగర్ ఆంద్ర వారికి కాంట్రాక్టులు ఇచ్చి ప్రత్సాహించారని అన్నారని అన్నా, దానికి నేను జవాబుదారీ కాదు. నేను తెరాస నాయకుడిని/కార్యకర్త/మద్దతుదారు కాను, ఇప్పటిదాకా కనీసం వారికి వోటు కూడా వేయలేదు. నేను చర్చలో అన్న మాటలకు మాత్రమె బాధ్యతా తీసుకోగలను తప్ప ఆయనెవరో నా తాత చుట్టం కనుక వారి చేసిన/అన్న విషయాలకు జవాబు చెప్పాలని అని మీరు అనగానే సరిపోదు. I repeat I am not answerable to what any Tom, Dick or Harry did/said just because some other Tom, Dick or Harry "thinks" I should.

      4. ఆదాయాన్ని గత రాష్ట్రంలో పంచిన విధానం మంచిదా కాదా అన్నది ఇప్పుడు అప్రస్తుతం. మీరు చేసిన "ఆంధ్రకు ఆదాయం తక్కువ. అయినా దాంట్లో కూడా త్యాగం చేసి అంతా హైదరాబాద్ మీద ఖర్చు పెట్టారు" వాదనకు రుజువు చూపించి మీరు నోబుల్ ఆర్ధిక పథకం గెలవండి :) ఇక రెండో విషయానికి వస్తే ప్రైవేట్ వ్యక్తుల పెట్టుబడి/శ్రమ/వగైరాల ఫలితం వారికే చెందాలి తద్వారా వారి ఊరు/జిల్లా/ప్రాంతం హక్కులు వస్తాయన్న వాదన విడ్డూరంగా ఉండదా?

      తెలంగాణా అసాన్జే గారి టపా మళ్ళీ చూడండి. ఆయన అన్యాయంగా ఆంద్ర వారికి కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆరోపించలేదు. మన వారికి కాంట్రాక్టులు రావడం లేదని ఆవేదన చెందారు.

      పెట్టుబడిదారీ విధానంలో క్రోనీనేస్స్ అంతర్భాగం కాదు, దానికి వక్రీకరణ అని నా నమ్మకం. We can discuss this at length separately.

      "ఒకడు దొంగ ఒకడు దొర"

      అంతిమంగా కోర్టులు తీర్పు చెప్తాయి. నా మట్టుకు నేను ప్రాధమిక (prima facie). ఆధారాలు చూస్తాను. I repeat "This is consistent with my usual approach of taking cognizance of a matter only if it is grave & backed by reasonable prima facie facts. Unlike some others I take a stand based on factual evidence"

      నేను ముసుగు వేసుకోలేదు అప్పుడూ ఇప్పుడూ తెలంగాణావాదినే. తెలంగాణా వల్ల ఇతర 28 రాష్ట్రాలకు అన్యాయం జరగనంత వరకు తెలంగాణా ప్రయోజనాలే నాకు ముఖ్యం. ఆ 28 రాష్ట్రాలలో ఆంద్ర *కూడా* ఒకటి తప్ప నాకు ప్రత్యెక వ్యతిరేకత/ప్రేమ రెండూ లేవు. ఎక్కడికి వరకు ఆగుతుందనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకయితే లేదు. తెలంగాణా ప్రయోజనం తమకు అడ్దోస్తుందని హైదరాబాదీలు భావిస్తే ఉద్యమం చేస్తారు అప్పుడు చూద్దాం.

      ఉద్యమంలో ఆదర్శంగా పని చేసిన వారెవరూ పదవుల కోసం చేయలేదు. ఉ. నేను పుట్టకముందటి నుండే తెలంగాణా కోసం కొట్లాడిన మా కుటుంబ పెద్దలు పదవి కాదు కదా కనీసం పేరు రావాలని కోరుకోలేదు. ఇకపోతే ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ లాంటి కొందరు పదవి తీసుకున్నా అవసరం అనుకున్నప్పుడు వాటిని తృణప్రాయంగా వదిలేసి ప్రజలలోకి మళ్ళీ వస్తామని చెప్పడం సంతోషం. కోదండరాం గారు రాజకీయ బురదలోకి పిలిచినా తిరస్కిరించడం కూడా మంచిదే. రేప్పొద్దున గద్దె ఎక్కిన వాడు ఆశయాన్ని నీరు కారిస్తే వీరే మనకు శరణ్యం :)

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...