అనగనగా ఒకచోట తెలుగు బాషని ఆధునికం చెయ్యాలనే ఒక చర్చలో ఒక వ్యక్తి ఇంగ్లీషు 26 అక్షరాలతో యెంతో విస్తృతమయిన పదజాలాన్ని కలిగి వుండి ప్రపంచ వ్యాప్తం కాగా తెలుగు భాషకి 56 అక్షరాలు యెందుకు,తగ్గించుకుని ఫాస్టుగా యెదగొచ్చుగా అంటున్నారు. అక్షరాలు తక్కువగా వుండటం వల్లనే ఇంగ్లీషు భాష ప్రపంచవ్యాప్తం కాగలిగిందా?అక్షరాలు యెక్కువగా వుండటం వల్లనే తెలుగు వెనక బడిపోయిందా!
పారిశ్రామిక విప్లవంతో వచ్చిన హుషారు వల్ల విపపరీతమయిన విధ్వంసాన్ని సృష్టించ గలిగిన కొత్తరకపు ఆయుధాలతో యుధ్ధాల ద్వారా దేశాల్ని ఆక్రమించుకుని ఆక్రమించిన ప్రతి చోటా బలవంతంగా నేర్పిస్తే జరిగిన వ్యాప్తిని అక్షరాలు తక్కువగా వుండటానికి అంటగడుతున్నారు,యేమి పిచ్చితనం?"ధర్మం" అనే మాటకి సరయిన పారిభాషిక పదాన్ని కనుక్కోలేక తల్లకిందులయి "Dutifulness" అనేది కొంచెం దగ్గిరగా వస్తుందని సరిపెట్టేసుకున్నారు. తెలుగులో ప్రతి అక్షరానికి ప్రాధాన్యత వుంది.భావాలకి మాత్రమే కాదు ద్వనులకి కూడా రూపం కల్పించారు.దానివల్ల మిగతా భాషల కన్నా పదజాలం లో విస్తృతి పెరగడం వల్ల అది గొప్పే అవుతుంది తప్ప లోపమెలా అవుతుంది? ఇతర భాషల్లో చెప్పలేని భావాన్ని కూడా చెప్పగలిగే గొప్పదనాన్ని కత్తిరించుకుని ఇతర భాషల మాదిరిగా తయారవడం అంటే ఒక ఆజానుబాహుడు కొద్దిసేపు పొట్టివాళ్ళ మధ్య గడపటం కోసం కాళ్ళో తలో కత్తిరించున్నట్టు కాదా, అది అవసరమా?!
పదవిస్తృతి యెంత అవసరమో ఒక వుదాహరణ చెప్తాను - ఈ మధ్యనే ఇంగ్లాండులో స్కూలు స్థాయిలో ఒక 2000 మంది విధ్యార్ధులకి వాళ్ళు వొపయోగించగలిగిన పదవిస్తృతి(vocabulary)నీ వాళ్ళ వ్యక్తిత్వ వికాసాల్లో వుండే తేడాల్నీ పరిశీలించి చూశారు.సహజంగానే యెక్కువ పదాల్ని వుపయోగించ గలిగిన వాళ్ళు అన్నిటిలోనూ అగ్రస్థానంలో వున్నారు!అలాంటిది ఇతర భాషలు వ్యక్తీకరించలేని భావాల్ని కూడా చెప్పటానికి పనికొచ్చే విస్తృతమయిన పదకోశం వుండి, ఇతర భాషల పదాల్ని అతి తేలిగ్గా ఇముడ్చుకోగలిగిన గొప్పదనాన్ని వొదులుకుని ఇంగ్లీషు లాగా వున్న అక్షరాలనే కత్తిరించుదాం అంటున్నారు,ఇది యేమి భాషాభిమానం?
భాష ధాతుజన్యం, అంటే క్రియ ముఖ్యం.ప్రతి భాషలోనూ నామవాచక పదాలు,క్రియా పదాలు,విశేషణ పదాలూ - ఇలా విభాగాలు వుంటాయి. కానీ తమాషా యేంటంటే మిగతా రకం పదాల్లో కూడా క్రియ గుప్తంగా వుంటుంది. వుదాహరణకి రాముడు అనేది మనిషి పేరు.కానీ దాని అర్ధం రమింపజేయువాడు అని. అంటే రమింప జెయ్యటం అనే క్రియ అందులో దాగి వుంది. కారా మాస్టారు తెలుగు వాక్యం అనే ఒక పుస్తకం రాసారని చదివాను.వాక్య నిర్మాణానికి సంబంధించిన సూత్రాలే భాషలకి ప్రత్యెకత నిస్తాయి.ఇంగ్లీషులో ఆబ్జెక్ట్ చివరికి చేరుతుంది.తెలుగులో కర్త,కర్మ ,క్రియ అన్నీ ఆ వరసలోనే వుంటాయి.ముఖ్యంగా తెలుగు భాష ధ్వని ప్రధానమయినది(phonetic language), ఆ ప్రత్యేకతని పోగొట్టుకోవటం, అదీ ఇతర భాషల మాదిరిగా తయారు చెయ్యాలనే వుద్దేశంతో చెయ్యటం మూర్ఖత్వం!
తెలుగు భాష కున్న ప్రత్యేకత అందమైన పొందికైన అక్షరాల కూర్పు!ఇవి ఒక్కరోజులో వచ్చిపడ లేదు.దశల వారీగా అవసరం కొద్దీ పుట్టించినవే.మిగతా భాషలకి లేనిదీ తెలుగుకి మాత్రమే వున్న ప్రత్యెకత - ద్వనుల్ని కూడా అక్షరబధ్ధం చెయ్యటం.పైగా దశల వారీగా చేసిన మార్పులలో వరసగా పేర్చటంలో ఒక సౌలభ్యం వుంది.చూదండి:
అ & ఆ - కంఠ్యములు (గొంతుతో పలికేవి).
ఇ & ఈ తాలవ్యములు (కంఠానికీ, పళ్ళ చిగుళ్ళకీ మధ్య ఉన్న భాగాన్ని తాలువు అంటారు. తాలువుతో పలికేవి తాలవ్యములు).
ఎ, ఏ & ఐ - కంఠ్యతాలవ్యములు (కంఠము & తాలువుతో పలికేవి).
ఋ & ౠ - మూర్ధన్యములు (నాలుక ముందు భాగాన్ని వెనక్కి వంచి పలికేవి).
ఌ, ౡ - దంత్యములు (నాలుక ముందు భాగాన్ని దంతాలకి తగిలించు పలికేవి).
ఉ & ఊ ఓష్ఠ్యములు (పెదవులతో పలికేవి).
ఒ, ఓ & ఔ - కంఠ్యోష్ఠ్యములు (కంఠము & పెదవులతో పలికేవి).
ఇప్పుడు స్పర్శములు (plosives) చూద్దాం. తెలుగులో "క" నుంచి "మ" వరకు ఉన్నవి స్పర్శములు (నోటి భాగములతో గట్టి ప్రయత్నం చేసి పలికేవి).
క, ఖ, గ, ఘ & ఙ - కంఠ్య స్పర్శములు (guttaral plosives).
చ, ఛ, జ, ఝ & ఞ - తాలవ్య స్పర్శములు (palatal plosives).
ట, ఠ, డ, ఢ & ణ - మూర్ధన్య స్పర్శములు (retroflex plosives).
త, థ, ద, ధ & న - దంత్య స్పర్శములు (dental plosives).
ప, ఫ, బ, భ & మ - ఓష్ఠ్య స్పర్శములు (labial plosives).
"ఙ, ఞ, ణ, న, మ"లు నాసిక్యములు (ఇవి పలికేటప్పుడు నోటిలో ఏదో ఒక భాగం గాలి ప్రవాహానికి అడ్డు తగిలి ముక్కు నుంచి గాలి బయటకి వస్తుంది).
స్పర్శములు కానివి అంతస్థములు (approximants). అవి:
య - తాలవ్య అంతస్థము.
ర, ఱ & ళ - మూర్ధన్య అంతస్థములు.
ల - దంత్య అంతస్థము.
వ - దంత్యఒష్ఠ్య అంతస్థములు (labiodental approximant).
గాలి ఊదుతూ పలికేవి ఊష్మములు (fricatives). అవి:
శ - తాలవ్యోష్మము
ష - మూర్ధన్యోష్మము
స - దంత్యష్మము
హ - కంఠ్యోష్మము
provided by Marxist Hegelianతెలుగుకి రాతలో వుండే సౌలభ్యం పెన్ను గానీ పెన్సిలు గానీ పేపరు మీద ఆనించి మొదలు పెడితే చివరి వరకూ ఒక్కపెట్టున రాయగలగడం."ట" లాంటివటికి కొన్ని మినహాయింపులు వున్నా తొందరగా రాసేటప్పుడు అవి కూడా చకచకా రాసెయ్యొచ్చు!
పదాలు యెరువు తెచ్చుకోవడం తప్పు కాదు. పదుగు రాడుమాట పాడియై ధర జెల్లు నన్నట్లు మాట్లాడే వాడుక భాషే ముఖ్యం.భాషని పుట్టించే శక్తి కష్టజీవులకే వుంది! యెందుకంటే భాష పుట్టిందే పని కోసం కాబట్టి? ఒక పని చెయ్యాలంటే తను ఒక్కడే చెయ్యగలిగిన దయితే తనే వుపాయాలు ఆలోచించి చేసుకుంటాడు. కానీ ఇతర్ల సాయం అవసరం అయినప్పుడు తప్పనిసరిగా భాష కావాలి."నాకు నువ్వు ఈ సహాయం చెయ్యాలి" అని మరో మనిషిని అడగటానికే భాష పుట్టింది. పనిమంతులకి మాట్లాడటం ఒక అవసరం. ఆ అవసరం వున్నవాడు చిన్నయ సూరి కోసమూ చూడడు, రెన్ అంద్ మార్టిన్నూ వెదుక్కోడు.ఈ మధ్యనే ఫ్లై ఓవరుని ఒక పల్లెటూరి వాడు పైదారి అన్నాడని చదివాను.యేది బాగుంది?ఇంతకాలం ఆ చుట్టూ తిరుగుతూనే ఎవున్నా నాగరీకులూ పండితులూ అంత మంచిమాటని యెందుకు పుట్టించలేక పోయారు?
అలా వాక్యనిర్మాణంలో తెలుగు యొక్క లక్షణాన్ని పాటిస్తున్నంతవరకూ యెన్ని రకాల పదాల్ని ఇముడ్చుకున్నా అది తెలుగే అవుతుంది. మాతృభాష అని యెందుకు అంటున్నాం అంటే మమకారం కోసం! పనిలో లీనమవ్వాలంటే పనిని ప్రేమించాలి. భాషని సరిగ్గా వాడుకోవాలంటే భాషని ప్రేమించాలి. ప్రతి భాషా మొదట అరుపులుగా కేకలుగా పుట్టిందే. ఆ అరుపుల్నీకేకల్నీ క్రమబధ్ధం చేస్తే అంటే వ్యాకరణాన్ని వుపయోగిస్తే భాష అయ్యింది.ఈ క్రమబధ్ధం చేసేవాళ్ళు యెక్కణ్ణించి వస్తారు? ఆ భాష మాట్లాడే వాళ్ళలోంచే వస్తారు గదా! పంచవేణీ సంగమం గురించి చెప్పుకుంటారు అన్ని రకాల పదాల్నీ కలుపుకోగలదని తెలంగాణాలో వినపడే తెలుగు గురించి.యేమండీ మీరొక్కరేనా కలుపుగోగలిగింది?కృష్ణా జిల్లా మాండలికంలో అంతా తెలుగు పదాలేనా?వుర్దూ పదాలూ ఇంగ్లీషు పదాలూ లేవా?
అసలు భిన్నత్వంలో యేకత్వం అనేది మన దేశానికే పరిమితమనీ ఇంకెక్కడా ఇలా లేదనీ కొందరెందుకో అదేపనిగా పొగుడుతారు? అమెరికాలో ఇప్పుడు అనేక జాతుల వాళ్ళు కలిస్ బ్రతకటం లేదా? రష్యా అంతా యేక మొత్తమయిన భూఖండమా? సెర్బియన్లు, బోత్స్నియన్లు లేరా? ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్ళిన మనిషి అక్కడ యెక్కువ కాలం వుండాలంటే చచ్చినట్టు అక్కడి భాషని నేర్చుకోవలసిందే గదా! ఆ మనిషి తిరిగి తన ప్రాంతాని వస్తే అక్కద నేర్చుకున్న మాటల్ని ఇక్కడా మాట్లాడితే ఇక్కడివాళ్ళకి నచ్చితే అందరూ అలవాటు చేసుకుంటే ఆ పదాలు ఈ భాషలోకి వొదిగి పోవడం లేదా?
యేరుల జన్మం శూరుల జన్మం యేరికి తెలుసు? యే పదం యెప్పుడు పుట్టిందో యెప్పుడు చచ్చిందో యెప్పుడు మళ్ళీ పుట్టిందో తెలుసుకోవాలంటే పదవ్యుత్పత్తి శాస్త్రం వుంది.భాష యెదగాలంటే వాడే వాళ్ళు కూర్చేవాళ్ళు ఇద్దరూ వుండాలి,వాళ్ళ మధ్య సయోధ్య వుండాలి!ఇవ్వాళ తెలుగు కున్న దుస్థితి కూర్చే వాళ్ళు లేకపోవటం మరీ గట్టిగా చెప్పాలంటే కూర్చుకోవటం మీద శ్రధ్ధ లేకపోవటం?!యెవడిష్ట మొచ్చినట్టు వాడు మాట్లాడుకోవాలనే దురద పరిమితి దాటింది.పనిమంతుడెవడూ ఇలా పిల్లితల గొరిగే చర్చలకి రాడు!వాడి కవసరమయిన భాషని వాడే సృష్తించుకోగలడు!పండితులు అతడు సృష్టించిన పదాల్ని వుపయోగించుకుని కావ్యాలు రచించి పేరు తెచ్చుకుంటారు?!
కూర్చడం యెవరు చెయ్యాలి?అధికారం వున్నవాడు చెయ్యాలి!అధికారం యెలా వస్తుంది?పదే పదే వాడటం వల్ల పరిచయం పెరిగి జ్ఞానం విస్తారమయితే అధికారం వస్తుంది!అస్లు అన్ని అక్షరాలు యెందుకు,భాష తల్లి కాదు ఒక కట్టుగొయ్య మాత్రమే అనేవాళ్ళతో యేమి మాట్లాడగలం,అనవసరం!అక్షరాలు తగ్గించితే పదవిస్తృతి తగ్గడమే తప్ప యే వుపయోగమూ వుండదు,అలాంటి వికృత ప్రయోగాల కన్నా అసలు తెలుగు మాట్లాడకుండా వుండటం మంచిది?!ఈ అక్షరాలు యెక్కువైనాయనే వాదం తెలంగాణా మేధావుల నుంచే వస్తున్నది.నిజమే, వారికి ఇన్ని అక్షరాలూ ఇంత విస్తృతమయిన పదజాలం అవసరం లేదు.ఇవి చాలు.ఆ బ్లాగరు యెప్పుడో సరదాగా వెక్కిరించిన దాన్ని ఇప్పుడు చాలా గంబీరమయిన తాత్విక చింతనతో యెత్తుకున్నారు:-) చారిత్రకంగా,బౌగోళికంగా ప్రాచీన కాలంలో ఇప్పుదు ప్రత్యెకరాష్ట్రంగా యేర్పడిన తెలంగాణా ప్రాంతంలోని తెలుగువాళ్ళనే ఆంధ్రులు అనీ వారిది ఆంధ్రత్వం అనీ వ్యవహరించే వాళ్ళు!వాళ్ళు నిన్నటి రోజున ఆ పేరుని మన రాష్ట్రానికి సాధికారికంగా ఇచ్చేసి ఆంధ్రత్వాన్ని వొదులుకున్నారు. ఇవ్వాళ తెలుగు భాషనీ చిన్నబుచ్చుతున్నారు, రేపు తెలుగుదనాన్నీ వొదులుకుంటారు? మహద్భాగ్యం, రేపటి రోజున అవి మనకు మాత్రమే సొంతమవుతాయి - కానివ్వండి!
కొందరిలో మరొక విచిత్రం చూశాను - తెలుగు నా మాతృభాష అనటానికే శ్రీరాముడి ప్రస్తావన వొచ్చినప్పుడల్లా జవహరు లాల్ నెహ్రూ యెగిరి పడినట్టు వులిక్కి పడుతున్నారు? తెలుగును మాతృభాష అనుకోకపోతే యేం?తప్పనిసరిగా తెలుగుని అంతగా గౌరవించి తీరాలా? అనేవారికి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. విస్తారంగా చెప్పబోయే విషయాన్ని అర్ధం చేసుకోవాల్సిన పధ్ధతిలో అర్ధం చేసుకుంటే చాలు! ముందుగా ఒక సరదాగా వుండే పద్యాన్ని ఇక్కడ ఇస్తున్నాను:-)
క్రమముగ "శ్రీమత్సకల గుణ సంపన్న"
యని యున్న జదివెడు నఱవవాడు
కడగి "చిరిమదు చగల కుణ చంపన్న"
యని,కన్నడము వాడు మొనసి
"సిరిమతు సగల గోణ" యని తోడనె
"శంపణ్ణ" యని,మహారాష్ట్రుండు పని వడివడి
జెలగుచు "శ్రీమతూ సెకల గుణానె
సంపన్నాసె" యని,యోడ్ర భాషణుండు
వెలయు "శ్రీమొతొ సొకొలో గుణ సొంపొన్నొ"
యని, యికెన్ని యేల యన్యభాష
లాంధ్రు డున్నయట్లె యలరు బఠించు
నంచు హాస్యవేది యాడునాడు:-))
ఈ సరదా పద్యం రాసింది శ్రీ కొక్కొండ వెంకట రత్నం పంతులు గారు.ఈయనా వీరేశలింగం పంతులు గారూ అప్పట్లో గజకచ్చపాల్లాగా పోట్లాడుకునే వాళ్ళు - ప్రతిభ తోనే?!యీయన ఒక నాటకం రాసి అందులో పాలేరు పాత్రకి వీరిగాడు అని పెడితే ఆయనేమో ఒక నత్తిపాత్రతో తన పేరుని "కొక్కొక్కొండి గాడండి" అనీ చెప్పించాడు!
సరదాగా రాసినా ఈ పద్యంలో ఒక సాంకేతికాంశం వుంది.ప్రపంచంలో వున్న ప్రతి భాషా ఒకే ప్రాంతంలో యెందుకు కేంద్రీకరించబడి వుంది?యెందుకంటే యే భాషకైనా అక్షరాలూ,పదాలూ, వాటి వుచ్చారణా ముఖ్యం - వాట్ని వేరు చేసేవి గూడా అవే!చలిగా వుందే ప్రాంతం వాళ్ళు కొన్ని ద్వనుల్ని చించుకున్నా పలకలేరు.వేడిగా వుందే ప్రాంతంలో వుండేవాళ్ళకీ అదే ఇబ్బంది?పై పద్యంలో జనరలైజ్ చెయ్యటమే తప్ప అన్నిచోట్లా పరాయి భాషల్ని కూడా చక్కగా మాట్లాడాలని పట్టుదలతో సాధించే వ్యక్తులు కొందరయినా వుంటారు!మొత్తమ్మీద ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితులకీ బౌగోళిక పరిస్థితులకీ అక్కడి ప్రజలు మాట్లాదే భాషకీ దగ్గిర సంబంధం వుండి వుండాలి?!ఆ రకంగా చూస్తే మన ప్రాంతం సరిగ్గా భూమధ్య రేఖ మీద వుండటంతో చలీ, వేడీ రెండూ సమానంగా తగుల్తుండటం చేతనే మనం అన్ని రకాల ద్వనుల్నీ పలక గలుగుతున్నామేమో!
సుబ్బారావు వాళ్ళ అమ్మ మాట్లాడేది సుబ్బారావుకి మాతృభాషా మరియూ పుల్లారావు వాళ్ళమ్మ మాట్లాడేది పుల్లారావుకి మాతృభాషా అవదు! భాష ప్రాంతానికి సంబంధించినది కాబట్టి ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరికీ ఆ భాషే మాతృభాష అవుతుంది. స్తన్యమిచ్చి పెంచే కన్నతల్లితో యెంత గౌరవనీయమయిన స్త్రీ నైనా సమానం చెయ్యగలమా! యవ్వనంలో అమెరికా వంటి దూరదేశాలకు పోయి ఇక చాలు అనేటంత సంపాదించిన వాళ్ళు వృధ్ధాప్యంలో మళ్ళీ ఇక్కడే సెటిలవ్వాలని యెందుకు తపించి పోతున్నారు?మాతృదేశం పట్ల వుండే "జననీ జన్మభూమిశ్చ" అనే భావనతోనే గదా!మాతృదేశం అనే భావనని ఒప్పుకున్నపుడు మాతృభాష అనేదాన్ని ఒప్పుకోవటానికి అభ్యంతర మేమిటి?
చాలామంది బెంగ పడుతున్నట్టు నేను తెలుగు యేమవుతుందో అని అతిగా బెంగ పడిపోవటం లేదు. మాట్లాడాల్సిన అవసరం వున్నవాడు తను చెప్పదల్చుకున్న దాన్ని యెదటివాళ్ళకి యెలా అయినా చెప్పి తీరతాడు, అందులో యెలాంటి అనుమానమూ అక్కర్లేదు.కానీ మాట్లాడాల్సిన అవసరం వున్నవాళ్ళకి తను చెప్పదల్చుకున్న భావానికి సరిపోయే మాట ఇక్కడ తెలుగులో వుంది అని తెలిస్తే గదా ఆ తెలుగు మాటనే వాడగల్గేది! ఆ తెలియజెప్పటం అనేది మాత్రం మనం పూనుకుని చెయ్యాలి.
ముందుగా ఇక్కడ నాకు పరిచయమయిన అచ్చతెలుగు మాటల్ని ఒక నాల్గింటి గురించి చెబుతాను:
---------------------------------
పైదారి = Fly-over
పొద్దు మాను = Light house
తవ్వోడ = Dredger
చిచ్చు గోలి(లు) = Lighter
---------------------------------
వీటిల్లో వున్న అసలయిన విశేషం పలకడానికి తేలిగ్గా వుండటం కాదు అవి చేసే పనిని సూచించే పాండిత్యం ఆ పదాన్ని పుట్టించిన వాడికి వుండటం.తవ్వుకుంటూ వెళ్ళే ఓడ తవ్వోడ అయింది!ప్రతి వెలిగించే వస్తువుకీ వొత్తి వుంటుంది,అ వొత్తి చుట్టూ పుట్టే వెలుగు మొదట గోళాకారం లోనే వుంటుంది!
ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఇదే: భాష పదాల సమాహారం, కనుక మొత్తం భాషకి సంబంధించిన విహంగ వీక్షణ కాదు మూలానికి వెళ్ళి ప్రతి పదాన్నీ దాని చరిత్రతో సహా పట్టించుకోవాలి!ఒక పదకోశం యేర్పాటు చెయ్యాలి?బ్రౌణ్య నిఘంటువు వుంది కదా అని అనవచ్చు. అది చాలా పరిమితం. కేవలం పదాన్నీ అర్ధాన్నీ చూపిస్తుంది,అంతే! నేను చెప్తున్నది etymological dictionary! వీలున్నంతవరకూ పైన చెప్పిన లాంటి అచ్చ తెలుగు పదాల్ని సేకరించాలి. అచ్చతెలుగు పదం కాకపోయినా అది యే భాషా పదమో చెప్పాలి. కైఫియత్ అనేది పరభాషా పదమే - కానీ కైఫియత్తు అనగానే తెలుగు పదమై పోయింది!
ప్రామాణిక తెలుగు అనగానే రెండున్నర జిల్లాల భాష మామీద రుద్దాలని చూస్తున్నారు అని యెగిరిపడి దాన్ని పడనివ్వలేదు - మరి ఇప్పుడు మనం అఘోరిస్తున్న దేమిటి? అంత జేసీ కాళోజీ గారు నా గొడవ అనిండే గానీ నా లొల్ల్లి అనలే! రాష్త్ర గీతానికి మళ్ళీ ఆ నీటుభాషలోని పాటే యెక్కింది? ఇప్పుడు దీనికైనా కలిసి వస్తే మొత్తం 23 జిల్లాల లోనూ,లేని పక్షంలో ఇటువైపు 13 జిల్లాల లోనూ కలియదిరగాలి. వినపడే ప్రతి మాటనీ రికార్డు చెయ్యాలి. వీలున్నంతవరకూ అచ్చ తెలుగు పదాలనే సేకరించాలి.తప్పనిసరిగా అది తెలుగు పదం కాకపోయినా అందరూ వాడుతున్నారు గాబట్టి దానినీ ఆ ప్రస్తావనతో కలిపి యెక్కించాలి.మన మనసులోని భావాన్ని తెలిపేటందుకు తగ్గ పదం వుందనేది తెలిస్తే గదా వాడటం జరిగేది?పనిముట్టుగా చూసినా వాడకం వల్లనే గదా దాని పనితనం తెలిసేది!
ఇదంతా ఒక్క రోజులో అయ్యేపని గాదనేది నాకు తెలుసు.తెలుగుని తెలుగులా వుంచడానికి యేడుస్తున్నవాళ్ళు పోయిన ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుని అధికార భాషగా చేసుకోలేని వాళ్ళం నిజంగా చెయ్యగలుగుతామనీ కాదు, కానీ చెయ్యాల్సింది మాత్రం ఇదే!
ముఖే ముఖే సరస్వతి!
______________________________________________________________పదవ్యుత్పత్తి శాస్త్రం=etymology(science of finding the history of words)
"కనీసం మన తర్వాత యేర్పడిన రాష్ట్రాల వాళ్ళు చేసుకోగలిగినట్టు అధికార భాషగా కూడా చేసుకోలేకపోయాం"
ReplyDeleteఅర్ధం కాలేదు. కాస్త విపులంగా చెప్తారా, థాంక్స్.
ఆ ప్రస్తావన తీసేశాను, కౌంటర్ - థాంక్స్!
Deleteష ....శ ....స లు ఒక్కటి అయ్యాయి అంతా ఈ మూడింటిని స లో కలిపేసారు !
ReplyDeleteఙ కాస్తా గ్యా అయిపోయింది ఞ్!! చచ్చిపోయింది!!!.
56 .......will come to 5.6!!!
OMG?!
Deletevisit and laugh yourself
Deletehttp://tetageeti.wordpress.com/2014/02/24/separate_state_celebrations/
శ,ష,స లు ఎప్పటికీ ఒక్కటి కావు. నోరు వాటిని తేడాగా పలకగలిగినంత కాలం అవి ఉంటాయని నా అభిప్రాయం. తెలీకో అతి తెలివితోనో ఒక్కటి చేస్తే తప్ప అవి మూడు ఒక్కటి కాలేవనేది నా అభిప్రాయం.
Deleteతెలంగాణా - ఆంధ్రా గొడవ వదిలేస్తే మీ ఆర్టికల్ లో ఉపయోగపడే అంశాలున్నాయి. fly-over పైదారి బాగుందే. ఇంగ్లీషు పై మోజులేని లేదా ఇంగ్లీషు రాని వాడి అవసరంలోనుండి పుట్టిందా పదం. యెస్ మీరన్నట్లు పదాలు జనాలనుండే పుడతాయి. అక్షరాలు తగ్గాలని తెలంగాణావారందరికీ ఉన్నదనే అపోహ వద్దు. అది కొందరి అభిప్రాయం మాత్రమే. నా అభిప్రాయమైతే పదాల సంఖ్య పెరగాలి. భాషమీద ప్రేమ ఉన్నవారంతా వీలయినన్ని తెలుగు పదాలను తయారు చేయడానికి ప్రయత్నించాలి. అక్షరాలు ఉచ్చారణని బట్టి వాటి వాడకాన్ని బట్టి పెరగడం లేదా తగ్గడం చేయవచ్చు. ఎవరూ దీని గురించి కాదు గింజుకోవలసింది. తెలుగు పదాల సంఖ్య పెంచడం గురించి. అన్నింటా తెలుగు పదాల వాడకం గురించి. తెలుగు భాషపై అవసరమైనమేరకు మమకారం పెంచుకోవడం గురించి. తెలుగు భాష అభివృద్ధి అంటే అది తప్ప అక్షరాల తగ్గింపో పెంపో మాత్రమే కానే కాదు. మీరన్నట్లు పదాల పెంపు వాటిని నిక్షిప్తం చేఅయడం తెలుగువారంతా కలసి చేఅయాలి. దీనికీ తెలంగాణా ఆంధ్రా గొడవలొద్దు సోదరా!
ReplyDeleteఅందరూ ఒక్కరు కారు?
Deleteఒక్కరూ అందరు కాదు!
తరతమ భేదం తెలుసు నాకు?!
__/\__
నేను హరిబాబుగారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.put కి but కి మధ్య ఉచ్చారణ భేదం గుర్తుపెట్టుకో వలసిన దుస్థితి ఇంగ్లీష్ ది. తెలుగులో రాసేది పలకగలం పలికేదే రాయగలం.దేశభాషలందు తెలుగు లెస్స.
ReplyDelete"...తవ్వుకుంటూ వెళ్ళే ఓడ తవ్వోడ అయింది..."
ReplyDeleteసబ్మరైన్ తవ్వుకుంటూ వెళ్ళదు, నీటిలోపల ప్రయాణం చెయ్యగలదు. "తవ్వోడ" ఎలా అయిందో మరి!
తవ్వోడ అని జనం పిలిచింది dredger నండీ submarine ని కాదు.
Deleteఅవునా, సరి చేశాను - అది కూడా చేసే పనినే సూచిస్తుంది కదా!
Deleteయెలాగయినా etymological dictionary పని జరిగితే ఇలాంటి తప్పులు యెవరూ చెయ్యరేమో!
Dredging అనే కఠినమయిన పదానికి బ్రహ్మాండమయిన తెలుగు మాట కనిపెట్టిన ఆ వ్యక్తిని నిజంగా మెచ్చుకోవాలి. Submarine పదాన్ని హిందీలో పండూబీ (पण्डूबी) అన్న తర్జుమా కూడా అద్బుతం.
Deleteఅచ్చుల్లో ఉన్న ఋ ౠ ఎక్కడ వాడాలో తెలియక రు రూ వాడేస్తున్నాము. చివరకు ఋ వ్రాయలంటే బు కి కొమ్మిస్తే ఋ అనుకునే రోజు వచ్చింది. స/శ వాడాల్సిన చోట ష వాడకం పెరిగిపోయి, స శ అక్షరాలు ఉన్నాయా అనే అనుమానం వస్తున్నది. బాల శిక్ష పుస్తకాలు (ఈ మధ్య పుస్తక ప్రదర్శనల్లో తెగ అమ్ముతున్నారు) "వేడుక" గా కొనుక్కుని పుస్తకాల బీరువాల్లో అందరికీ కనపడేట్టుగా పెట్టుకోవటమే కాని, తెలుగు టి వి లుగా పేరు పెట్టుకున్న వాటిలో గౌన్లు వేసుకునే (చీర కట్టుకుంటే దురాచారమయినట్టు) యాంఖర్లు వాళ్ళ టింగ్లీషుతో తెలుగు భాషను ఖూనీ చేస్తుంటే అడిగే వాళ్ళు లేరు. వాళ్ళకు ముందు తెలుగు నటీమణులు కూడా కొంతమంది భాషను హత్య చేశారు బాధ అనవలసిన చోట భాద అనటం, వత్తులు పలకలేని వారి అశక్తత ఫ్యాషన్ గా మారి ఈరోజున వత్తు అక్కర్లేని చోట వత్తులూ, వత్తు ఉండాల్సిన చోట వాడకపోవటం టి వి యాంఖర్ల భాషగా చెలామణీ అవుతున్నది. ళ అనే అక్షరం ఎలా పలకాలి!? తెలియదే! ళ బదులు ల వాడటం పరిపాటి అయిపోయింది. పిల్ల జమీందారు సినిమాలో ఈ విషయం మీద ఒక కామెడీ ట్రాక్ నడిపించి తెలుగు మాష్టారి పాత్రలో జీవించారు ఎం ఎస్ నారాయణ.ఆ తెలుగు మాష్టారికి భాష మీద ప్రేమ కన్నీళ్ళు పెట్టించింది. కాని ఆయన "చాదస్తం" చూసి నవ్వుకున్నామే కాని ళ వాడటం ఏ మాత్రం పెరగలేదు. పూర్వం గుఱ్రము అని వ్రాసేవారు, ఇప్పుడు గుర్రము అని వ్రాసినా తప్పు కాదట. ఌ.ౡ తో మొదలయ్యే పదాలు ఉన్నాయా అని అసలు ఈ అక్షరాలూ ఎందుకు అని చర్చలు కూడా మొదలయ్యాయి. స శ ష మూడు అక్షరాలుగా ఎందుకు అన్నిటికీ బదులు ష వాడేద్దాము అనుకునే వాళ్ళు కోకొల్లలు. తప్పు తప్పు స శ లు ఉన్నాయన్న స్పృహే లేక మనకున్నది ష మాత్రమే అనుకునేవారు ఎక్కువ. అం అః వాడటం కష్టతరమైపోయింది. ణ బదులుగా న వాడటం తప్పు అనిపించటం మానేసింది. ఈ అక్షరాలన్నీ తీసేస్తే తెలుగు బాషకు నష్టమా అని వాదించే రోజు మరెంతో దూరం లేదు
ReplyDeleteకాబట్టి, తెలుగు భాషలో తీసెయ్యాల్సిన అక్షరాలు ఋ ౠ ఌ.ౡ అం అః ఙ ఞ్ ణ శ స ళ ఱ . ఇలా పదమూదు అక్షరాలు తీసేస్తే (వాడకం లేక, వాడటం చేతకాక) 43 అవుతాయి. మరికొంత కాలానికి ఓ బదులు వో అనివ్రాస్తే ఎమున్నది అని ఓ తీసెయ్యచ్చు. ఇ బదులుగా యి వ్రాయవచ్చుకదా అని వాదించవచ్చు. మరికొంత కాలానికి ఇంగ్లీషులో 26 అక్షరాలతో ప్రపంచ భాష కాలేదా, మనకు ఇన్ని అక్షరాలు ఎందుకు అని తెలుగు అక్షరమాలను చీల్చి చెండాడే భాషా తాలిబాన్లు కూడా రావచ్చు. కలికాలం.
భాష అభివృధ్ధి చెందాలిసినది పోయి అసలు ఇన్ని అక్షరాలు అవసరమా అనే చర్చ చెయ్యాల్సిన దుస్థితి పట్టటం ఎంతైనా శోచనీయం. వీటికి తోడు కొత్త పద గుంపులు (అవును గుంపులే, బృందాలు కాదట) చేసే అనువాద పద కూర్పులతో తెలుగు భాష కుసిళ్ళి పోతున్నది. ఈ విషయంలో మునుపు నేను వ్రాసిన వ్యాసాలు ఈ కింది లింకుల సహాయంతో చదువుకోవచ్చు
http://saahitya-abhimaani.blogspot.in/2010/08/blog-post_29.html
http://saahitya-abhimaani.blogspot.in/2012/09/blog-post_25.html
బాగుంది మాష్టారూ బాగున్నది మీ ప్రశ్న. మంచి చర్చకు దారి తీస్తున్నది.
శివరామప్రసాద్ గారూ,
Deleteమీ వ్యాసాలు బాగున్నాయండీ,చదువుతున్నాను.
This comment has been removed by the author.
ReplyDelete@వీవెన్ వీరపనేని
ReplyDeleteనా అడ్మిన్ కామెంటు లిస్టులో కూడా మీ కామెంటు కనపడ లేదు, యెందుకనో?!కనుక మీ కామెంటును నేను పోష్టు చేస్తున్నాను:
పైదారికి తోడుగా కిందారి, కాల్దారి (ఫుట్‌పాత్) కూడా ఉన్నాయి. తవ్వోడ అనేది డ్రెడ్జర్‌ను అనుకుంటానండీ. సబ్‌మరైన్ని దొంగోడ అన్నారని విన్నాను.
ఈ మధ్యే విన్న మరో మాట గోరుగిల్ల/గోరుగల్ల (నెయిల్ క్లిప్పర్/కట్టర్).
ఇక మీరన్నట్టు, జిల్లాలన్నీ తిరిగి మాటలన్నీ సేకరించి కొందరు పదకోశాలను తయారుచేసారు (ఇది ఎప్పటికీ అయిపోని పని అనుకోండి). వాటిలో కొన్ని మాండలిక, వృత్తి పదకోశాలు ఆంధ్రభారతి నిఘంటు శోధనలో వెతక్కోడానికి సిద్ధంగా ఉన్నాయి. http://www.andhrabharati.com/dictionary/About
Thanks for the info!
సబ్‌మైరైన్‌ని "మునుగోడ" అంటారని గతంలో చదివాను.
Deleteజర్నలిస్టు అయితగాని జనార్ధన్ గారు తెలంగాణా అచ్చ తెలుగు పదాలు ఎన్నిటికో ఇలా etymology ఇచ్చారు. అయితే వారి బ్లాగు ఐడీ ఏమిటన్నది నాకు గుర్తు రావడం లేదు.
Deleteమీ విశ్లేషణ చాలా బాగుంది హరిబాబు గారు.
ReplyDeleteఌబ్దావధానులు - పదము సరైనదేనా?
ReplyDeleteఌబ్దావధానులు - పదము సరైనదేనా?
ReplyDeleteలేదండీ,లుబ్దావధానులు అనే పదం ఉంది కదా!
Deleteసంఙలు అనే పదం సరియైనదేనా?
ReplyDeleteసంఙలు అనే పదం ఉన్నదా?
ReplyDelete"ఈ సంజ కెంజాయలో.." అని ఒక తెలుగుపాటలో పదప్రయోగం ఉంది కదా,సంధ్య అనే పదానికి అచ్చ తెలుగు రూపం సంజ - అది యేకవచనం అయితే సంజలు అనేది బహువచనం అవుతుంది.
Delete