వాత్స్యాయనుడు దేశంలో కల్లా ఆంధ్రావాళ్ళు గొప్ప రొమాంటిక్ అని తేల్చేశాడు,తెలుసా?అసలు తెలుగక్షరాల్ని తీసుకోండి,యెంత ముద్దొచ్చేలా వుంటాయి!అన్నీ వృత్తాకారం నుంచే పుట్టాయి.యే అక్షరం తీసుకున్నా ఒక వృత్తాన్ని గీసి అక్కడక్కడా కొంచెం చెరపటం,చిన్న చిన్న వొంపుల్ని చేర్చటం - అంతే!నేల చూస్తే సస్యశ్యామలం.గాలి వీస్తే చేమట ఆరే మాత్రపు సుకుమారం.యెండ రోహిణీ కార్తెలో తప్ప యెప్పుడూ నీరెండ.సరిగ్గా భూమధ్యరేఖ మీద వుండటం వల్ల కాబోలు కాలాలూ,ఋతువులూ స్పష్టంగా తమ ముద్ర వేసే వాతావరణం అమిరింది!అందుకే "ఆంధ్రత్వ మాంధ్రభాషాచ" అని అన్నది!
అసలే అందమయిన ఇలాంటి ప్రాంతంలో ఆడదాని వొంపుసొంపుల్ని గుర్తు చేసే మిట్టపల్లాల్తో కాస్త జాగా దొరికితే చాలు బులబులాగ్గా మొలుచుకొచ్చేసి ఠీవిగా నిలబడే చెట్తుచేమల్తో కళకళ్ళాదే మావిశాఖ లాంటి విశాఖలో అయిదేళ్ళు గడిపితే కవిత్వం పుట్టుకు రాకుండా వుంటుందా!అసలు వైజాగులో చదవాల్సి రావటమే బలవంతంగా భగవంతుడే అక్కడికి తోసినట్టు జరిగింది?డిగ్రీ బెజవాడ లయోలా కాలేజి అనే గొప్ప క్రమశిక్షణాయుతమయిన కాలేజిలో చదివినా మేము చేరిన టైము బాగుండక మొదటి రెందేళ్ళూ ఆ ఫాదర్లు కూడా తలలు పట్టుకునేలా ఏ ఐ యస్ ఎఫ్ మరియూ యస్ ఎఫ్ ఐ వాళ్ళు రంగప్రవేశం చేసి ఆ కాలేజి చరిత్రలో యెన్నడూ లేనివిధంగా స్టూదెంట్ యూనియన్ల పోట్లాటలూ స్ట్రెయికులూ లాంటి వాటితో గడిచి పోయింది.అసలా ఫాదర్లకి మాలాంటి సంతనంతా తీసుకోవాల్సిన పరిస్థితి రావడం వల్ల గానీ మామూలుగా అయితే అక్కద చదివే అదృష్టం లేదు.వాళ్ళు బుద్దిమంతులైన కుర్రాళ్ల కోసం వడకట్టి మరీ సెలక్షన్లు చెయ్యటంతో విధ్యార్ధుల లెక్క బాగా తగ్గిపోయి యూజీసీ వారు శ్రీముఖం పంపించారు - యేమని?"అయ్యా, మీ కాలేజిలో చదివే విధ్యార్ధుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మాకేలనో మా నిధులు దుర్వినియోగమవుచున్నవని అనుమానముగా వున్నది.కాబట్టి మీ కాలేజికి నిధులు ఆపివయేయ దలచితిమి" - అని! దానితో గండం గడవటానికి ఇంగ్లీషులో మాత్రం 90% పైన వొస్తే చాలు అనే కండిషన్ పెట్టి టముకెయ్యడంతో మాలాంటివాళ్లతో పాటు,పైన చెప్పుకున్న వాళ్ళ లాంటివాళ్ళు కూడా అక్కడి కొచ్చి పడ్డారు.ఫైనలియరు కొచ్చేసరికి ఫాదర్లూ వాళ్ళకి తిక్క రేగిపొయి గొడవ బ్యాచినంతా వాళ్ళ చాణక్యనీతు లన్నీ వుపయోగించి బయటికి పంపేశాక గానీ మళ్ళీ మామూలు వాతావరణం రాలేదు.ఆ ఒక్క సంవత్సరం కళ్ళు తెరిచి యేమి వుపయోగం?అత్తేసరు ఫస్టు క్లాసుతో సరిపెట్టుకోవలసి వచ్చింది!ఆ పెర్సంటేజికి అసలు సొంత రాష్ట్రంలో అప్లై చెయ్యడమే దండగ మీలాంటి మందకి భోపాలు విదిషాలు తప్ప గతిలేదు అని ఒక లెక్చరరు గారు బైస్కోపు వేసెయ్యగా, మా బ్రదరు ఒకతను అక్కడి నుంచే రావడం వల్ల మొత్తం భారత దేశానికి నడిబొడ్డున వున్న భోపాల్లో రెండేళ్ళు చదివా!రెండేళ్ళూ మొదటి సంవత్సరమే అఘోరించా?ఇంక లాభం లేదని ఆంధ్రాలో ప్రయత్నిద్దామని స్వరాష్త్రంలో అన్ని యూనివర్సిటీలకీ అప్లై చేసి ఖమ్మంలో ఒక రెండు నెలలు వుస్మానియాలో యెంట్రెన్సుకి ట్రయనింగు టూషన్లు కూడా ఉధ్ధరించి నానా పాట్లూ పడి ఆఖరికి వైజాగులో సెటిలయ్యా.సరిగ్గా నేను అక్కణ్ణించి బయటపడిన కొద్ది నెల్లకే భోపాలులో గ్యాసు లీకు ప్రమాదం జరిగింది!
చేరిన కొత్తల్లోనే నాకు "వొన్లీ విమల్" అనే నిక్కు నేము పెట్టేశారు!దానికి కారణం నా షర్టుకి కూడా ఆ మోడల్ షర్టుకి లాగా నిలువు చారలుండేవి.పైగా సార్లు రావడం ఆలీసమయితే బోరు గొట్టి వరండాలో వచ్చీపోయే సార్లకి సలాములు కొడుతూ కబుర్లు చెప్పుకుంటూ వుందేవాళ్లం.సహజంగా పిట్టగోడకి ఆనుకుంటే అనుకోకుండానే కాళ్ళు మెలికేస్తాం గదా, నా పోజు కూడా అలాగే వుండేది.అప్పటికే పెళ్ళి కుదిరిందని తెలిసిపోయి "అన్నాయ్" అంటూ వాళ్లకి పోటీ లేకుండా చేసేసుకున్నారు వెధవలు?!నాకూ ఆ దురద లేదు గాబట్టి పెద్దమనిషి తరహాలోనే వుండిపోయా ననుకోండి,కానీ వాళ్ళు సాయంకాలం లేడీసు హాస్టలు కెళ్ళడానికి చేసుకునే యేర్పాట్లు చూసినప్పుడు మాత్రం పెళ్ళి కుదరకపోతే నేనూ ఈరకంగానే తయారయ్యేవాణ్ణి గదా అనిపించేది!సాయంకాలమయ్యేసరికి మళ్ళీ బ్రష్షింగు చేసి ఆ పేష్టు వాసన రాకుండా మింటు స్ప్రేలు నోట్లోకి వూదుకుని పోయేవాళ్ళు!
స్వతంత్రం వచ్చిన కొత్తల్లో పెట్టిన స్కూళ్ళూ కాలేజి లన్నీ వుదారులైన అప్పటి జమిందార్ల అశ్వశాలలో గజశాలలో అయి వుండేవి!ఇక్కడ కూడా ఆ ఆనవాళ్ళు కనబడుతూ వుండేవి.వాటి మధ్య తిరుగుతుంటే మనకీ రాజభోగం పట్టినట్టు వుంటుంది గదా?నేను కృష్ణాజిల్లా నుంచి వొచ్చినట్టు అందరూ అన్ని ప్రాంతాల నుంచె వచ్చారు గద - హాస్టల్లోనే వుండాలి మరి.కానీ మాకు అలాట్ చెయ్యాల్సిన రూము లన్నీ సీనియర్లు ఖాళీ చెయ్యకుండా మొండికేశారు!మమ్మలనందర్నీ మాకు కేటాయించిన "శ్రీ కృష్ణ దేవరాయ వసతి గృహం" లోనే కామన్ హాలులో సర్దేశారు.మాలో ఒకడు ఫైర్ బ్రాండ్ లాగా వార్డెను దగ్గిర హడావిడి చేస్తే వాడికి జడిసి పాపం వాళ్లకీ చురుకు పుట్టిందేమో గట్టిగా ప్రయత్నించి కుదరక తెల్లారి రాత్రికల్లా మా ఫైర్ బ్రాండుని రహస్యంగా పిలిపించుకుని,"బాబూ, నీ మాటలకి కదిలి కొంచెం గట్టిగా ప్రయత్నించేసరికి నిన్న రాత్రి ఒక గుంపు ఐరన్ రాడ్లు పట్టుకుని కొంప మీద కొచ్చారు,పిల్లలు గల వాణ్ణి,చిన్న వాడివి దణ్ణం గూడా పెదతాను కావాలంటే కొంచెం వోపికపట్టు" అని బతిమిలాడుకునేసరికి వాడు చల్లబడిపోయాడు.తర్వాత యెప్పటికో గానీ అధికారికంగా రూముల్లోకి పంపలేక పోయారు.ఈలోపు ఖర్చు పెట్టుకోగలిగిన నాలాంటి నలుగురైదుగురం పక్కనే వున్న చినవాల్తేరులో రూములు తీసుకున్నాం.హాస్టల్లో రూములు అలాట్ అయ్యేసరికి చినవాల్తేరు బాగా అలవాటయ్యి మారూములు మేము వొదిలేసుకున్నాం.అయినా సరే రాత్రి పదింటి వరకూ ఇక్కడే మకాం!
వైజాగు జనాలకి బెజవాడ జనాల్లాగ సినిమా పిచ్చి లేదు!బీచి వుండటం ఒక ప్లస్ పాయింటు కాగా,వైజాగే కాదు భీమిలీ లాంటివన్నీ మంచి సీనరీలు గల చోట్లు కాబట్టి నలురైదుగురు కలిసి పిక్నికులకి పోవచ్చు!సినిమాలకి వెళ్ళినా మేం యేనాడూ బ్లాకులో టిక్కెట్లు కొన్న పుణ్యాన పోలా!మెల్లగా నడుచుకుంటూ వెళ్తే ఏవీయెన్ కాలజి డవున్లో పాత సినిమాలు ఆడే థియేటరు ఓకటుందేది - పేరు గుర్తుకు రావడం లేదు!మేము వెళ్ళేసరికి అక్కడా క్యూ దిట్టంగానే వుండేది గానీ అంతా మాలాంటివాళ్లే గదా తేలిగ్గానే టిక్కెట్లు దొరికేవి.దాంతో ఒక మంచి పాత సినిమా చూసి గిట్టుబాటు చేసుకునే వాళ్ళం.రామారావు పాత సినిమాల కన్నా గొప్ప సినిమాలు తియ్యలేని ఇప్పటి సినిమా జనాల్ని యేదో వుధ్ధరిద్దామని పెట్టిన స్లాబు సిస్టము మాలాంటి వాళ్లందరికీ థియేటరులో పాత సినిమాలు చూసే అదృష్టం పోగొట్టింది! క్వాలిటీ సినిమాలు తియ్యడం చేతకాకపోవడం అనే అసలు లోపాన్ని ఇప్పటికీ సరి దిద్దుకోలేకపోవడం వల్ల స్లాబు సిస్టము వచ్చాక గూడా స్లంపులు మాత్రం పోలేదు?
అంతగా ఆపాతమధురాలకి అతుక్కు పోయిన మమ్మల్ని కూడా "శుభలేఖ రాసుకున్నా యెదలో యెపుడో" పాట మాత్రం అదరగొట్టేసింది!ఆపాట యెంత క్రేజు పుట్టించిందంటే కొత్తపాటల్లో యేముంది చెత్త అనుకునే పాతపాటల ఫ్యాన్సు కూడా గట్టిగా లెంపలేసుకునేటట్టు చేసింది?క్యాంపసులో ఆపాట సృష్టించిన భీబత్సం చూస్తే కుర్రాళ్ళెప్పుడూ మాటలర్ధం కానివ్వని ఫాస్టు బీటునే కోరుకుంటారు అనేమాట అబధ్ధం అనిపిస్తుంది!అక్కడ అంతగా పిచ్చెక్కిపోయింది కుర్రాళ్ళే గదా మరి?మా స్టూడెంటు హాస్టళ్లలో లేదు గానీ స్కాలర్స్ హాస్టల్లో వుండేది టీవీ. అప్పుడీ నానాజాతి చానల్సు లేవు,వోన్లీ డీడీ!హిందీ సినిమా పాటల్తో చిత్రహారూ తెలుగు పాటల్తో చిత్రలహరీ వొచ్చే టైము కల్లా అక్కడ చేరేవాళ్లం.అక్కడి సీను చాలా గొప్పగా వుండేది.సోడాబుడ్డి కళ్లద్దాల వాళ్లంతా "మీకేం,మీరు యెక్కడ కూచున్నా కనపడుద్ది - మాకు కనపడదుగా!" అని వెనకపడ్ద తరగతుల వాదనతో ముందరిప్లేసుల్ని ఆక్రమించే వాళ్ళు.కూచుంటే మనవాళ్ళు బాసింపట్ల రాయుళ్ళేగా, వాళ్ళట్టా కింద కూచుని మోరలెత్తుకు చూస్తంటే నా సామిరంగా చూసే వాళ్లలో నాలాంటి తింగరోళ్ళకి కడుపుబ్బి పోయేది!ఆ కూచోడం గూడా హైటుల వారీగా కూచునే వాళ్ళు!యెక్కడయినా బావ గానీ వంగతోటకాడ కాదన్నట్టు పొడుగు వాళ్ళు ఇంకెక్కడయినా రొమ్ములిరుచుకుని తిరుగుతారేమో గానీ ఇక్కడ మాత్రం యే పొట్టివాడి ముందయినా కూచున్నాడా నిర్దాక్షిణ్యంగా అణిచి పారేస్తారు!మామూలుగానే ఇంత భీబత్సంగా వుండే టీవీహాల్లో ఈపాట టైములో కొత్త బ్యాచి ఒకటి తయారయింది!పాట వొచ్చేముందు సినిమా పేరు వెయ్యటం ఆలీసం కయ్యిన ఈల వెయ్యాలి - ఫ్రెండులకి హింటు!అంతే,స్నానం చేసే వాళ్ళు గూడా గబగబా టవలు చుట్టేసుకుని వొంటినిండా సబ్బునురగల్తో సహా పరిగెత్తుకొచ్చే వాళ్ళు.
సంగీతం,సాహిత్యం రెండూ జోడుగుర్రాల మాదిరి పరిగెత్తి హుషారు పుట్టించేస్తాయి!మెలోడీ జాంబొరీ 50:50 అయిపోయాయి ఈపాటలో!బృందగానం పేరుతో హడావిడి చేసే గ్రూపు డాన్సర్లు లేరు!చిరంజీవి రాధ ఇద్దరూ మామూలుగా చేసే డ్రిల్లు తంతు లాగా కాకుండా స్వింగింగు మూవ్మెంట్లతో నింపేశారు పాటని!పిక్చరైజేషనూ అదిరింది - పొగమంచు,పరిగెత్తే గుర్రం,పాతకాలపు లాంతర్లు,బొచ్చుకుక్కపిల్లతో యెదురొచ్చే మనిషీ,చెట్టు కింద నుంచుని చూసే మనుషులూ - ప్రతి ఫ్రేమూ అధ్భుతమైన సౌందర్యభరితమే!

నాకూ ఈ పాట ఇష్టమే అయినా చమక్ చమక్ జా పట్టుకో పట్టుకో పాటలోని సింపుల్ స్టెప్పుల స్టైలు పిచ్చ పిచ్చ గా నచ్చుతుందంటే నమ్మండి.
ReplyDelete