Tuesday 30 December 2014

ఆంధ్రప్రదేశ్ కి విభజన కష్టాలు మొదలయ్యాయా?చంద్రబాబు నిజంగా వీట్ని పరిష్కరించగలడా!

    హుద్ హుద్ తుఫానుకు ప్రధాని మోదీ ప్రత్యక్షంగా చూసి చలించిపోయి ప్రకటించిన 1000 కోట్ల సాయంలో నికరంగా వచ్చేది 620 కోట్లు మాత్రమేనని తెలుస్తున్నది!కేంద్రం తన వాతాగా ఇప్పటికి 400 కోత్లు మాత్రమే ఇచ్చిందనీ,మహా అయితే ఇంకో 105 కోత్లు ఇచ్చి సరిపెట్తేస్తారనీ,అంతకంటే యెక్కువ ఆసలు పెట్తుకోవద్దని కేంద్ర అధికారులు తెగేసి చెప్పారనీ మీసాల సుహాసిని లాంటి నయా మీడియా సలహాదారు ఒక కధనాన్ని జనం మీదకి వొదిలాడు.

     హుద్ హుద్ తుఫాను నష్టంపై రాష్త్ర ప్రభుత్వమే రెండు రకాల నివేదికల్ని పంపింది.తొలుత 40 వేల కోట్ల పైనే నష్టం జరిగిందని తెలిపారు.ఆ తర్వాత 21 వేల కోట్ల నష్తం జరిగిందంటూ గణాంకాలతో మరో నివేదిక వెళ్ళినట్టు తెలిసింది.రెండు రకాల నివేదికలతో గందరగోళానికి గురయి సాయాన్ని నిర్ణయించే బాధ్యతను పూర్తిగా కేంద్ర బృందానికే వదిలేసింది.ఆ బృందం తను సొంతంగా మళ్ళీ తిరిగి చూసి కొండని తవ్వి యెలకని పట్తినట్టుగా తుఫాను సాయం కింద రూ.620 కోట్లు ఇస్తే సరిపోతుందని తేల్చేసింది.మరోవైపు ప్రధానమంత్రి ప్రకటించినట్లుగా వెయ్యి కోట్లు ఇవ్వక్కర్లేదని రూ.400 కోట్లు ఇస్తే సరిపోతుందని కేంద్ర హోం శాఖ పరిధిలోని జాతీయ విపత్తు విభాగం సిఫారసు చేసింది.దీనికి కేంద్ర ఆర్ధిక శాఖ కూడా ఆమోద ముద్ర వేసింది.ఈ మొత్తానికి రాష్ట్ర విపత్తు నిధి నుంచి తన వాటాగా రూ.115 కోట్లను చేర్చి మొత్తం రూ.515 కోట్లను కేంద్ర సాయంగా చూపించ వచ్చు.ప్రస్తుతానికి ఇదే కేంద్రం నుంచి నికరంగా అందే తుఫాను సాయం?కేంద్ర బృందం సిఫారసు యెంత గరిష్ఠంగా లెక్క వేసినా రూ.620 కోట్లు మించదు.అంటే ప్రధాని ప్రకటించిన సాయంలోనే రూ.495 కోట్లకు కోత పడిందన్న మాట!

     ఈ మొత్తం వ్యవహారం ఇంత నిష్ఫూచీగా జరుగుతుంటే కేంద్ర మంత్రివర్గంలోనే వున్న నలుగురు తెదెపా సభ్యులూ భాజపా వెంకయ్య నాయుడూ యేమి చేస్తున్నట్టు?అంత భయంకరమయిన తుఫానుకి ప్రధాని బహిరంగంగా చేసిన వాగ్దానానికి సంబంధించిన నిధుల్నే సమర్ధవంతంగా రాబట్టలేని వాళ్ళు రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లూ, రాష్త్ర పునర్నిర్మాణానికి అవసరమయిన మరిన్ని లక్షల కోట్లూ యెట్లా సాధించగలరు?ఆడలేని సానిది మద్దెల ఓడన్నట్టు వీళ్ళ అసమర్ధత నంతా జాతీయ విపత్తు విభాగంలోని ఒక అధికారి మీదకి మళ్ళించాలని మీసాల సుహాసిని సుకుమారమైన కధలు చెప్తున్నాడు!

     ఆడలేని సానిది మద్దెల ఓడన్నట్టు ఈ అసమర్ధత నంతా జాతీయ విపత్తు విభాగంలోని ఒక అధికారి మీదకి మళ్ళించాలని మీసాల సుహాసిని సుకుమారమైన వింత వింత కధలు చెప్తున్నాడు!సరయిన నివేదికలు పంపకపోవడం,అక్కడి నుంచి వచ్చే సమాచారాన్ని రాష్ట్ర  ప్రభుత్వానికి నివేదించక పోవడం,సుకుమారుని వింతయిన వ్యవహార శైలి అనీ రకరకాల సాహిత్య పదకోశంతో వార్తని నింపేసింది.నిజానికి నాకిది రాష్త్ర ప్రభుత్వంలో సర్వం సహాధికారి అయిన మిత్రుడూ కేంద్రంలోనూ వున్న ఆ మిత్రుని పార్టీ సభ్యులూ ఇబ్బంది పడకుండా చక్రం అడ్డువెయ్యటం లాగా కనిపిస్తున్నది!

     హుద్ హుద్ సాయం రప్పించే బాధ్యత నంతా ఆ ఒక్క అధికారికే రాష్త్ర ప్రభుత్వం కట్టబెట్టిందా?ప్రబుత్వంలో ఇంకెవరూ తుఫాను సాయం గురించి పట్టించుకోలేదా?సాక్షాత్తూ కేంద్ర మంత్రివర్గంలోనే వున్న వాళ్ళకి కూడా తుఫాను సాయం పని యెంత వరకూ వచ్చింది అనే ఆరా కూడా లేకుండా పోయిందా?నిక్కచ్చిగా రావాల్సిన సాయాన్నే తెచ్చుకోలేని రాష్త్రప్రభుత్వం అసలు రాత పూర్వకంగా నికరమయిన హామీయే లేని ప్రత్యేక హోదాని యెలా సాధించుకుంటుంది?ఇప్పటికే సుజనా రాగం మారింది!ఇదివరలో వున్న ప్రణాళికా సంఘం ప్రకారం అయితే ప్రధానికి విశేషాధికారాలు వుండేవి - ఆ ఒక్కణ్ణి బతిమాలుకుంటే సరిపోయేది,ఇప్పుదు మోదీగారు దాని స్థానంలో ముఖ్యమంత్రుల కౌన్సిలు చేతిలో పెట్టాడు ఆ పనిని?!భయం గల కోడి బజారులో గుడ్డు పెట్టినట్టు ఒక్క మనిషి నిర్ణయమే అనుకూలంగా వుంటుందో లేదో తెలియని విషయం ఇప్పుడు అంతమంది చేతిలో పడింది!

33 comments:

  1. "మీసాల సుహాసిని" ఎవరండీ? భలే పేరు పెట్టారు :)

    ReplyDelete
  2. "ఇదివరలో వున్న ప్రణాళికా సంఘం ప్రకారం అయితే ప్రధానికి విశేషాధికారాలు వుండేవి - ఆ ఒక్కణ్ణి బతిమాలుకుంటే సరిపోయేది,ఇప్పుదు మోదీగారు దాని స్థానంలో ముఖ్యమంత్రుల కౌన్సిలు చేతిలో పెట్టాడు ఆ పనిని?"

    గతంలో ఆ పని ప్రణాళిక సంఘం అధ్వర్యంలో ఉన్న రాష్ట్రీయ వికాస్ పరిషద్ కింద ఉండేది. దాంట్లో కూడా కేంద్ర మంత్రులు & ముఖ్య మంత్రులు సభ్యులు.

    ReplyDelete
    Replies
    1. నిజమే,కానీ ప్రధాన మంత్రికి ఈ ప్రతిపాదనల్ని వీటో చెయ్యదమూ,సొంత నిర్ణయాల్ని అమలు చెయ్యదమూ లాంటి విశేషాధికారాలు వుందేవి కదా!మౌన మోహను గారు ప్రత్యేక ప్రతిపత్తిని నోటి మాటగా చెప్పినప్పుడు కూడా మళ్ళీ మేమే వస్తాము కదా,ఆ విశేషాధికారాల్ని వుపయోగించి మీకు న్యాయం చేస్తాము అని హింటు ఇచ్చాడు,అవునా?ఇప్పుదు మోదీ గారు చేసింది పూర్తిగా కౌన్సిలుకే ప్రాధాన్యత నిచ్చాడు.అందుకే కదా సుజానా చౌదరి,"చట్టబధ్ధంగా ప్రత్యేక హోదా పొందలేకపోయినా మరోరూపంలో అయినా ప్రయత్నిస్తాము" అని సన్నాయి నొక్కులకి దిగిపోయింది.మొదట్లో వున్న ధీమా ఇప్పుదులేదు,గమనించారా?

      Delete
    2. ప్రధానికి వీటో హక్కు ఉందనడం ఒక ప్రాపగండా మాత్రమె. సదరు వీటో ద్వారా ప్రత్యెక ప్రతిపత్తి పొందిన/కోల్పోయిన ఒక్క రాష్ట్రం పేరు ఎవరయినా చెప్పగలరా లేరే?

      ఆంధ్రకు ప్రత్యెక ప్రతిపత్తి హోదాకు కావాల్సిన అర్హతలలొ ఒక్కటి కూడా లేదని, ఇది జరగని పని అని నేను ఆనాడే చెప్పాను. దీన్ని అప్పుడు నమ్మని ఆంద్ర మిత్రులు ఇప్పటికయినా గుర్తిస్తే మంచిది.

      ఇకపోతే ప్రధాని రాజ్యసభ ప్రకటన తమ ఒత్తిడి వల్లే వచ్చిందని, ముఖ్యంగా వెంకయ్య నాయుడే దీనికి సూత్రధారి అని ఆంద్ర కమలనాధులు చెబ్తారు. నా సూత్రాలు కూడా ఇదే నిర్ధారిస్తున్నాయి. తాము ఎటు తిరిగీ గెలవమని కాంగ్రెస్, బెడిసి కొట్టినప్పుడు సోనియాను బ్లేం చేయొచ్చని భాజపా ఆంధ్రుల చెవిలో పువ్వు పెట్టాయి.

      Delete
  3. ఆంధ్రాకు కేవల‌ఒకే ఒక హక్కు ఉన్నది. అది స్వయంకృషితో మరలా ఎదిగి, నిస్వార్థబుధ్ధితో తమ శక్తియుక్తుల్నీ సంపదల్నీ యావధ్బారతానికీ పంచుతూ దేశసేవచేయటం. అలా ఎదిగేందుకు సహాయంగా, కుట్రల కారణంగా చితికిపోయిన రాష్ట్రానికి కాస్త చేయూత ఇవ్వమని అభ్యర్థించేందుకు ఆంధ్రాకు ఎంతమాత్రపు హక్కూ లేదు కాక లేదు ఎన్నటికీ. అందుచేత మరొకసారి, మరొకసారి.... ఇలా మోసపోతూనే దేశంకోసం‌ బ్రతికేయటం ఆంధ్రులు నేర్చుకోక తప్పదు. అంతే‌కాక నోరున్నవారిచేత మోసగాళ్ళన్న మాటలూ పడటం తప్పదు కూడా. సూత్రాలూ సిధ్ధాంతాలూ ఎలాగున్నా, ఈ వెంకయ్య ఒరిగించిందీ ఏమీ లేదన్నది క్రమంగా బోధపడుతూనే ఉన్నది ఇప్పటికే ప్రజలకు.

    ReplyDelete
    Replies
    1. నిజమే మాష్టారూ,యాభయ్యేళ్ళుగా ఆకడ ఆంధ్రోళ్ళు వున్నంతకాలం మనం అక్కడికి వెళ్ళీ బాగుపదకూడదు అని కచరా లాంటి మాంధాత గారి కోసం యెదురు చూస్తూ తమ ఇంటి గడపలు దాటకుండా కూర్చుని వెనకపడిపోయిన వాళ్ళు ఇవ్వాళ ఆ కాస్త వేరుకుంపటి పెట్టగలిగినందుకే వుబ్బి తబ్బిబ్బవుతున్నారు,వాళ్ళ ముఖ్యమంత్రిని చూస్తే ఒక్కరోజు సర్వే అన్నాడు,సరవే ఫలితాల్ని యెలా వుపయోగించుకంటున్నాడో తెలియదు,కుయ్యిమంటే కయ్యిమంటే గాలిలో చక్కర్లతో సరిపెడుతున్నాడు!రాచకొంద్డలో ఫిలిం స్టూడియో అంటే యేమి చెయ్యాలని అతడి ప్లాను?ఆ పాతకోటని బాగుచేసి సినిమా వాళ్ళ మీదకి వొదిలితే అట్టకత్తి కాంతారావు చేసిన జానపదాలకి తప్ప ఇంకెదుకయినా పనికొస్తుందా?అబ్బే,వాటిని కూలగొట్టేసి కొత్త టూడియో కడతాం అంటే రాచకొండలోనే కట్టాలా?తమ ముఖ్యమంత్రే తమ మీద వేస్తున్న ప్రాక్టికల్ జోకుల్నే అర్ధం చేసుకోలేని వాళ్ళు యేంటో తెలివైనవాళ్ళం అని భ్రమ పడుతున్నారు!

      Delete
    2. జయలలిత తారమణి లో ఒక ఫిల్మ్ స్టూడియో కట్టింది. అది ఇప్పుడు ఉన్నాదో లేదో! ఫిల్మ్ స్టూడియో అనేది లాభ సాటి వ్యాపారంకాదు. అసలికి ఈ రోజుల్లో ఎవరు చూస్తున్నారు.

      Delete
    3. తమాషా ఎమిటంటే రాష్ట్ర విభజన వరకు ఇరువైపుల బిజెపి ని పట్టించుకొన్న పాపన పోలేదు. విడిపోయిన మొదలు బిజెపి వాళ్లు, వెంకయ్య నాయుడు సహాయం చేయటంలేదని ఆంధ్రా ప్రజలకి కాంగ్రెస్ పార్టితో ఉన్నంత అనుబంధం , బిజెపి తో దశాబ్దాల అనుబంధం ఉన్నదన్నట్లు ఆడిపోసుకోవటం తమాషా గా అనిపిస్తుంది.

      Delete
    4. @Sriraam,
      దశాబ్దాల అనుబంధం వుంటేనే ఆడిపోసుకోవాలంటే భాజపాని విమర్శించడానికి యాభయ్యేళ్ళు ఆగాల్సి వుంటుంది?ఈ లోపు జరక్కూదని హాని అంతా పూర్తయిపోతుంది!ఆ హామీల గురించి పట్టుపట్టి సాధించింది వెంకయ్య నాయుదే కదా?ఆ రకంగా మిగతా వాళ్ళకన్నా ఖచ్చితంగా తనకే యెక్కువ తపన వుండాలి మరి!ఇక్కద రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన చంద్రబాబు వాళ్ళకి మిత్రపక్షమూ అయ్యాడు,వాళ్ళ వాళ్లకి కేంద్రంలో మంత్రిపదవుల్నీ ఇప్పించుకున్నాడు.ఆయన కూడా సమ్న్యాయం జరగలేదు అంటున్నప్పుదు వాళ్ళిద్దరికీ ఇప్పుదు అది జరిపించాల్సిన బాధ్యత సమానంగానే వుంటుంది కదా!

      చచ్చిన కాంగ్రెసుని ఇంకా విమర్శించి యేం లాభ?ఇవ్వాళ అధికారంలో వున్న భాజపా కూడా కాంగ్రెసులాగే ప్రవరించకుండా ఎలర్ట్ గా వుండాలి?!

      Delete
  4. ఎవరివో ఏమో కుట్రల వల్ల ఆంధ్రకు అన్యాయం (లేదా కనీసం నష్టం) జరిగిపోయిందని అనడం వరకు బాగానే ఉంది. అవేమిటో & జరిగిన అన్యాయం (నష్టం) ఎంతో ఒక్కరూ చెప్పరు.

    పోనీ అన్యాయం (నష్టం) జరిగిందని వాదన కోసం ఒప్పుకున్నా, దానికి పరిహారం ఏమిటి? నిబంధనలను ఉల్లంఘించి సాయం చేయడం సబబు కాదు కదా. ఒక్క అర్హత కూడా లేని ఆంధ్రకు కేంద్రం ప్రత్యెక ప్రతిపత్తి ఇస్తే ఎవరు ఊరుకుంటారు? మోడీ కేంద్రాన్ని కడిగి పారేయ్యడూ?

    ReplyDelete
    Replies
    1. జైగారూ, మీ వాదనతో యేకీభవించ లేను. అలాగని చర్చలకు దిగేందుకు నాకు ఆసక్తి కూడా లేదు. ఒక్క అర్హత కూడా లేని ఆంధ్రకు అంటూ మీరు పదేపదే ప్రస్తావిస్తున్నారని గమనించుతున్నాను - పోనీ తనమానాన తాను బ్రతికే అర్హతనైనా ప్రసాదించండి. ఇంతకు మించి అడగగలిగిందీ లేదు, చర్చల వలన ఉపయోగమూ లేదు. ఆ ఆసక్తీలేదు.

      Delete
    2. సార్ మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది. మీరు వాదించనని అంటే ఒకసారి ప్రత్యెక ప్రతిపత్తి హోదాకు కావాల్సిన "అర్హతలు" తత్సంబంధ మార్గదర్శక సూత్రాల గురించి చదవమని ప్రాధేయపడడం మినహా నేను ఏమీ చేయలేను.

      Delete
    3. జైగారూ, ప్రత్యేకప్రతిపత్తి ఇస్తామని అన్నవారికీ, ఇన్నేళ్ళనీ కాదు ఇన్నేళ్ళనీ బేరసారాలు చేసినవారికీ కూడా ప్రత్యెక ప్రతిపత్తి హోదాకు కావాల్సిన "అర్హతలు" తత్సంబంధ మార్గదర్శక సూత్రాల గురించి తెలుసా తెలియదా అన్న అనుమానం ఒకటీ కలగాలి. తెలుసును అనుకుంటే ఆ బేరాలన్నీ ఆంధ్రుల్ని వెర్రివెధవల్ని చేయాలన్న కుట్ర అన్నమాట. తెలియదు అనుకుంటే ఎలాంటెలాంటి మూర్ఖులు కూర్చున్నారూ విభజనసభాపర్వంలో అన్నది ప్రత్యేకంగా అందరూ గ్రహించదగ్గ విషయం అన్న మాట.



      ఇప్పుడు ఆ విషయం వదిలేదాం. ఈ అద్భుతమైన విభజనాతంత్రంలో ఆంధ్రజనం అంతా మోసపోయారన్నది వాస్తవం కాదా? ఇప్పుడు వాళ్ళు ఏ గంగలో ములగాలీ?

      చూసారా? వద్దనుకుంటూనే చర్చలో పడిపోతున్నాను! ఇంక నాకున్నది ఒకే దారి - బ్లాగుప్రపంచం నుండి నిష్క్రమించటం. అదీ రేపో మాపో ఒక రోజున పాక్షికంగా ఐనా జరుగవచ్చును!

      Delete
    4. మంచిది మాష్టారూ, ఇప్పుడు మీరు బ్లాగుప్రపంచం నుంచి నిష్రమించగోరినట్టే, ఈ వేలికేస్తే కాలికేసి అటు తిప్పీ ఇటు తిప్పీ ఆంధ్రోళ్ళు మమ్మల్ని దోచుకున్నారు అనేదానికి వాళ్ళు సాక్ష్యాలు చెప్పకుండా, యాభయ్యేళ్ళుగా అవకాశాలు పక్కనే వున్నా వొచ్చి బాగుపడిన కృష్ణా జిల్లాల వాళ్ళ మీద పడి యేదవకుండా మీరు కూడా వచ్చి యెందుకు బాగుపదలేకపోయారు అనే నా ప్రశ్నకి మాత్రం జవాబు దాటేస్తూ వున్న ఈ గయ్యాళి మందతో మనం వేగలేం అనిపించి ఆంధ్రోళ్ళు మొత్తం తెలంగాణాని ఖాళీ చేస్తే వాళ్ళ వీపులు వాళ్ళే గోక్కుంచూ వుంచారు?!

      Delete
    5. ప్రత్యెక ప్రతిపత్తి విషయంలో వెంకయ్య నాయుడు వగైరాలు మూర్ఖులా లేక ఆంధ్రులను బకరా చేసారో అన్న ప్రశ్న కాస్సేపు పక్కన పెడదాం. మనం కూడా కనుక్కొని బేరీజు చేసుకోవాలి అన్న ధోరణిలో ఆంద్ర మేధావులు & విద్యావంతులు వెళ్ళితే బాగుండేది కదా. This is not rocket science, anyone can find the info.

      ఆంద్ర జనం ఎలా & ఎంత మోసపోయారో సరయిన ఆధారాలతో వివరించిన వారు ఎవరూ నాకు కానరాలేదు. మీకు తెలిస్తే నేనూ చదువుతాను.

      చర్చించాలా వద్దా అనేది మీ ఇష్టం. పరిశోధిస్తే నిజానిజాలు బయట పడతాయన్నది మాత్రం వాస్తవం. చర్చిస్తే (సక్రమ ధోరణిలోనే లెండి) పరిశోదనకు అనువయిన సంగతులు బయట పడే అవకాశం లేకపోలేదు. మీరు అదే స్పిరిట్ లో తీసుకోవాలని నా కోరిక.

      Delete
    6. @Hari Babu Suraneni:

      "అనేదానికి వాళ్ళు సాక్ష్యాలు చెప్పకుండా"

      నదీ జలాల విషయంలో నేను ఎటువంటి చర్చకయినా సిద్దం. మీకు ఎలాంటి సాక్ష్యం కావాలన్నా ఇవ్వగలను.

      PS: ఇంటర్/ఎంసెట్ రాద్దాంతం గురించి నిన్నే టపా వేసాను. కుదిరితే చదివి మీ అభిప్రాయం చెప్పండి.

      Delete
    7. ఇక్కడ మనం యెంత సొల్లు మాట్లాడినా మొండి వాదనలు చేసినా సభలో మనకి ప్రాతినిధ్యం లేదు.అక్కద జరిగే శాసనాల వల్లనే జరుగుతున్నాయి వ్యవహారాలు.అక్కడ కొలువుదీరిన వాళ్ళ గురించి శ్యామలీయం మాస్టారు చేసిన విశ్లేషణ మీకు అర్ధమయిందా లేదా,ముందు అది చెప్పండి?

      నదీజలాల విషయంలో మొత్తం ప్రపంచంలోనే యెన్నో తగాదాలు వున్నాయి.ప్రతి వాళ్ళూ మాకు అన్యాయం జరిగిందనే అంటున్నారు!అవేవీ ఆంధ్రా తెలంగాణా రాయల సీమ ప్రాంతాలకి మాత్రమే ప్రత్యేకం కాదు?

      వుద్యోగాల కయితే చదువులూ,డిగీలూ కావాలి.అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో జేఎపీ 80ల వరకూ తెలంగానా ప్రాంత నాయకులే చదువు యొక్క అవసరాన్ని గుర్తించలేదు అని గణాంకాలతో సహా చెప్తే ఒక్కరు అది అబధ్ధం అనలేదు,నిజమా కాదా?పోనీ కాలేజిలు పెట్టలేదు,స్కూళ్ళు పెట్టలేదు అనుకుందామా అంటే పెట్టిన తర్వాత నిధులు ఇవ్వడమా, మానడమా అనేది యూజీసీ చేతుల్లో వుంటుంది.అది అటెందెన్సునీ వుత్తీర్ణతా శాతాన్నీ చూస్తుంది.తెలంగాణాలో స్కూళ్ళు సరిగ్గా నడుస్తున్నాయా లేదా అనేదానికి కూడా ఆంధ్రోళ్ళే యెట్లా కారణం అవుతారు?

      పోనీ చదువులు,వుద్యోగాలు విషయంలో బోల్డు కమిషన్లూ,రిపోర్టులూ వున్నాయి,అది పెద్ద గందరగోళం అనుకుందాం,నా ప్రశ్నని నాఎను ఇప్పటికి మూదు సార్లు అడిగాను.వ్యాపార పారిశ్రామిక రంగాల్లో యెదగటానికి పెట్టుబడీ,చొరవా చాలు గదా మరి అక్కడ వెనకబదటానికి చొరవలేమి తప్ప మరో కారణం యేదయినా చూఒపించగలరా?అది అన్యాయార్జితం,లక్ష నాగళ్లతో దున్నిస్తా నన్న చోటికి వెళ్ళి అద్బుత ప్రపంచం అని కీర్తించిన పెద్దమనిషి నిశానీయా?అప్పుడు తను యెక్కడున్నాడో తెలియని మత్తులో వున్నాడా?మామూలుగా అందరూ చేసే వ్యాపారాన్ని కూడా దోపిడీ అని పేరు పెట్టి అన్ని వీరంగాలు వేసి ఇప్పుడు యే అధారాలు చూపిస్తారు?మీరు నీటి విషయాల్లో నిష్ణాతులని నాకు తెలియని నీళ్ళ విషయం గురించి యెలా అడుగుతాను?నేను అడిగిన దానికి చెప్పండి!మీకు తెలియకపోతే మీవాళ్లలో చెప్పగలిగిన వాళ్ళ దగ్గిర తెలుసుకునే చెప్పండి లేదా వాళ్ళనె ఇక్కడికి రమ్మనండి!ప్రశ్న వివరంగా కావాలంటే "ఈ విడ్లగింజలో బియ్యపు గింజ కింత రాధ్ధాంతమా?" అనే పోష్తులోనూ వుంది,ఈ మధ్యనే "తెలంగాణా మేధావులకి నా వైపునుంచి శ్రీరామప్రసాద గీత!" పోస్టులోనూ వేశాను!ప్రశ్న వివరంగా అక్కడ వుంది గనక ఆ రెండు పోష్టుల్లో యెక్కడయినా చెప్పొచ్చు.

      ఇంటర్/యెంసెట్ గురించి మావాళ్లదే తప్పు అంటాను.అక్కద సాంకేతికంగా యేమి గొడవలు వున్నాయో తెలియదు గానీ అసలు మీరు విడిపోయిందే అన్నీ విడిగా చేసుకోవాలని కదా!ఇంకా కలిపి నిర్వహించాలనే సుత్తి సుదాణం దేనికి మా వాళ్ళకి?

      Delete
    8. ఒకప్పటి మా ప్రజా ప్రతినిధులు ఇడియట్సే, వొప్పుకుంటాను!

      Delete
    9. @jai
      మత్తులో వున్నాడా అన్నది లేదు కదా,తెలిసే వెళ్ళాడు గదా అనే అర్ధంలో వాడాను -అనవసరంగా లేనిపోని అపార్ధాలు పీక్కండి!

      Delete
    10. @హరిబాబు సూరనేని
      1. ఆంధ్రలో "వ్యాపారి అంటే వీడురా" అనదగ్గ నిరార్సైన బిజినెస్‌మెన్ ఎవరు? వారి సక్సెస్ లెవెల్ ఎంత?
      2. తెలంగాణ ఛీకొడుతున్నా ఇంటర్, ఎంసెట్ కలిపి నిర్వహిస్తాం అనడంలోని "నారాయణ" రహస్యం ఏమిటి?
      3. నారాయణ మూర్తి, అజీం ప్రేంజీ ఆకాశంలో దూసుకెళ్తుంటే సత్యం రామలింగరాజు ఎందుకు నేల కూలాడు?
      4. వ్యాపారానికి కేవలం డబ్బు, చొరవ సరిపోతే ఆంధ్ర వ్యాపారులు దేశంలో (ఆ మాటకొస్తే ప్రపంచంలో) మొదటి స్థానంలో ఎందుకు లేరు?
      5. వ్యాపారానికి కేవలం డబ్బు, చొరవ సరిపోతే ఆంధ్రకి "ప్రత్యేక హోదా" ఎందుకు?
      6. డబ్బు, చొరవతో మాత్రమే జగన్ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించాడా?

      ఈ ప్రశ్నలకు సమాధానాలకోసం ప్రయత్నిస్తే మీ ప్రశ్నకు దానికదే సమాధానం దొరుకుతుంది.

      Delete
    11. Crony capitalists (more correctly carpetbaggers or rent seekers)!

      Delete
    12. @chaari
      1. ఆంధ్రలో "వ్యాపారి అంటే వీడురా" అనదగ్గ నిరార్సైన బిజినెస్‌మెన్ ఎవరు? వారి సక్సెస్ లెవెల్ ఎంత?
      ans:
      హైదరాబాదుని పెంబ్చిది కేవలం వీరే కాదు,కానేఎ వీరు కూడా వున్నారు అని మీ వారిలోనే కొందరు కీర్తిస్తున్నారే వారే నిఖార్సైన బిజినెస్ మ్యానులు!
      వారిలో లక్ష నాగళ్ళతో దున్నిస్తానని నిన్న చెప్పి ఈరోజు అధ్బుత లోకాన్ని సృష్తించారు సుమీ అని మీ ముఖ్యమంత్రి గారు కూడా మెచ్చుకున్నారు,వినలేదాండీ!
      2. తెలంగాణ ఛీకొడుతున్నా ఇంటర్, ఎంసెట్ కలిపి నిర్వహిస్తాం అనడంలోని "నారాయణ" రహస్యం ఏమిటి?
      ans:
      ఇది నాకూ నచ్చలేదని చెప్పాక నాకు మళ్ళీ ఈ ప్రశ్న వెయ్యడంలో అర్ధ మేమిటి?
      3. నారాయణ మూర్తి, అజీం ప్రేంజీ ఆకాశంలో దూసుకెళ్తుంటే సత్యం రామలింగరాజు ఎందుకు నేల కూలాడు?
      ans:
      ఈ ప్రపంచంలో సత్యం రామలింగ రాజు ఒక్కడే కనబడ్డాడా నేలకూలిన వాడు?అయినా నాకు తెలిసింది చెప్తాను.నేను రామలింగ రాజు ఫ్యానుని కాదు గదా వివరంగా తెలుసుకుని చెప\పటానికి!యే వ్యాపారస్తుడయినా పూర్తిగా తన సొంత డబ్బుతో వ్యాపారం చెయ్యడు ఒక స్థాయికి యెదిగాక.షేర్ మార్కెట్ అనేది వునికిలోకి వచ్చిందే వ్యాపారస్తులకి తమ గూద్ విల్ చూపించుకుని జనం దగ్గిర్నుంచి పెట్టుబడిని సమకూత్ర్చుకోవడానికే.ఆఖరులో కేసు బాగా నలిగిన తర్వాత నాకు అర్ధమయిన విషయం కొడుకు మేటాసు అనే కొత్త కంపెనీకివున్న నిధులు పెట్టాడు.సరిగ్గా అదే టైములో అప్పుల వాళ్ళకి చెల్లింపులు చెయ్యాల్సిన అవస్రం పడింది.మేటాసు అనుకున్న విధంగా పుంజుకుంటే దాని జూం తో అప్పులు తీర్చటం అతి తేలిగ్గా చేసేసి వుండే వాళ్ళు.కానీ అది సడెంగా అడ్డం తిరిగేసరికి రొటేషను మనీ బొక్కయి పోయింది.అది యే వ్యాపారస్తుడికయినా యెప్పుడో ఒకప్పుడు యెదురు కావచ్చు.రేపు యెదగబోయే మీ తెలంగాణా వ్యాపారస్తులు కూడా వ్యాపారం మరో రకంగా అంటే షేరు మార్కెట్టుకి వెళ్ళకుండానూ అంతా తమ కష్తార్జితమే పెట్టుబడి గాపెడుతూనూ,లెక్కల్లో లాభాల్ని యెక్కువ చూపించకుండానూ చెస్తారని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా?
      4. వ్యాపారానికి కేవలం డబ్బు, చొరవ సరిపోతే ఆంధ్ర వ్యాపారులు దేశంలో (ఆ మాటకొస్తే ప్రపంచంలో) మొదటి స్థానంలో ఎందుకు లేరు?
      ans:
      మొదటి స్థానంలోనే వుండాలా?యెక్కడ ప్రముఖ స్థానంలో లేరో మీరు చెప్పండి?అయినా ఇక్కడ వివాదం హైదరాబాదు లోనూ ఆ చుట్టుపట్ల వ్యాపించటం గురించి కదా?విడిపోక ముందు ఇది అందరికీ సమానంగానే హక్కు వుంది కదా,యెక్కడో కృషనా జిల్లా నుంచి వచ్చి కొందరు బాగుపడుతున్నారు - అది చూసి కూడా పక్కనే వున్న వాళ్ళు వచ్చి యెందుకు బాగు పడలేకపోయారు అనే నా ప్రశ్న చాలా సూటిగా వుంది,అవునా కాదా?దానికి సూటిగా జవాబు చెప్పకుండా ఈ డొంకతిరుగుడు ప్రశ్నలు దేనికి?దానికి జవాబు చెప్పలేక కిందపడ్డా నాచెయ్యి పైనే వుంది అని సంతృప్తి పడటానికా?
      5. వ్యాపారానికి కేవలం డబ్బు, చొరవ సరిపోతే ఆంధ్రకి "ప్రత్యేక హోదా" ఎందుకు?
      ans:
      రామాయణ మంతా విని అన్నట్టుంది మీ ప్రశ్న!బవాలా యాడవాలా?ఆంధ్రా వాళ్ళు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసిందీ ఇప్పుడు మీ రాష్ట్రమైన ఒకప్పటి అనద్రి హక్కుభుక్తమయిన రాజధానిలో.దానిలో సూది మొనమోపినంత వాటా కూడా ఇవ్వమని మీరు తరిమి కొట్టడం వల్ల మాకు ప్రత్యేక ప్రతిపత్తి అవసరమయింది!అర్ధ మయిందా?లాభాల కోసం చేశారు అన్న్నా ఆ లాభాల్ని ఆంధ్రాకి తరలించకుండా మళ్ళీ అక్కడే పెట్టుబడులు పెట్టి అఘోరించారు దూరదృష్టి లేక!
      6. డబ్బు, చొరవతో మాత్రమే జగన్ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించాడా?
      ans:
      కేవలం మధ్యతరగతి నీతిమంతనంతోనే కేసీఆరు గారు యెకరానికి కోటి ఆదాయం రప్పించగలిగిన అంత గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని విసరించగలిగారా?వారు పులుగడిగిన ముత్యమా?అసలు మోసమే చెయ్యని సత్య హరిశ్చంద్రులా?
      ఈ ప్రశ్నలకు సమాధానాలకోసం ప్రయత్నిస్తే మీ ప్రశ్నకు దానికదే సమాధానం దొరుకుతుంది.
      ???????
      అయినా ఇక్కడ వివాదం హైదరాబాదు లోనూ ఆ చుట్టుపట్ల వ్యాపించటం గురించి కదా?విడిపోక ముందు ఇది అందరికీ సమానంగానే హక్కు వుంది కదా,యెక్కడో కృషనా జిల్లా నుంచి వచ్చి కొందరు బాగుపడుతున్నారు - అది చూసి కూడా పక్కనే వున్న వాళ్ళు వచ్చి యెందుకు బాగు పడలేకపోయారు అనే నా ప్రశ్న చాలా సూటిగా వుంది,అవునా కాదా?దానికి సూటిగా జవాబు చెప్పకుండా ఈ డొంకతిరుగుడు ప్రశ్నలు దేనికి?దానికి జవాబు చెప్పలేక కిందపడ్డా నాచెయ్యి పైనే వుంది అని సంతృప్తి పడటానికా?

      Delete
    13. @హరిబాబు సూరనేని

      >>> మీ ప్రశ్న: వ్యాపార పారిశ్రామిక రంగాల్లో యెదగటానికి పెట్టుబడీ,చొరవా చాలు గదా మరి అక్కడ వెనకబదటానికి చొరవలేమి తప్ప మరో కారణం యేదయినా చూఒపించగలరా?

      మీరు చెప్పిన "నిఖార్సైన వ్యాపారి" ఎలా ఎదిగాడు, మీరు EAMCET, ఇంటర్‌లు ఉమ్మడిగా జరుపుతానంటే ఎంఉదుకు వ్యతిరేకించారు, నారాయణ మూర్తి ఏ చట్టాలను ఉల్లంఘించి బొక్కలో పడ్డాడు, జగన్ లక్షకోట్ల వ్యాపారిగా ఎలా ఎదిగాడు అన్న విషయాలు ఆలోచిస్తే మీకు పై ప్రశ్నకు జవాబు దొరికే వుంటుంది.

      ఏ నీటి పంపకాల విషయంలో మీరు జై తో చర్చకు జంకారో ఆ నీటి వల్ల తెలంగాణాకన్నా ఆంధ్రలో డబ్బు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి చేరింది. ఆ డబ్బుతోనే హైదరాబాదులో వారు వ్యాపారాలు మొదలు పెట్టారు. అంతే తప్ప ఏ ఇతర సామర్థ్యాల వల్లో కాదు.

      మీరు తెలంగాణా వారు వ్యాపారంలో ఎందుకు వెనుక బడ్డారని అడిగినట్టే, నేను ఇతర ప్రాంతాలకన్నా ఆంధ్రా వారు ఎందుకు వెనుకబడ్డారని అడిగాను. ఆంధ్రకు ఉన్న మెజారిటీ వల్ల వచ్చిన మందబలంతో ప్రతిసారీ ముఖ్యమంత్రులు వారే అవుతూ ఉమ్మడి రాష్త్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర పక్షపాత ప్రభుత్వంగా మార్చి ఇష్టం వచ్చినట్టు భూములు ధారాదత్తం చేసుకుని, GOలు ఇచ్చుకుని, లేదంటే కబ్జాలు చేసుకుని వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు కాబట్టే ఈనాడు వాళ్ళు హైదరాబాదులో వేళ్ళూనుకున్నారు. ఒకవేళ 1956 కన్నా ముండు వున్న హైదరాబాదు రాష్ట్రం అలాగే వుంటే అప్పుడూ రాగలిగే వారా? అలా వెళ్ళగలిగితే ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళలేక పోయారు?

      మీ వాళ్ళకు ఉన్నది వ్యాపార దక్షత కాదు. వారి వ్యాపారానికి కావలసింది ఒక పెద్ద క్యాపిటల్, దాని చూట్టూ విలువైన భూములు, వాటిని కబ్జా చేసుకునేందుకు కావలసిన అధికారం. విభజనతో అవి మూడూ పోతాయనే అందుకు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడూ అలాంటి బలమైన క్యాపిటల్ ఒకటి కట్టాలని కలలు గంటున్నారు. చట్ట వ్యతిరేక వ్యాపారాలతో ఇప్పటికే ఎంతో మంది ఊచలు లెక్కపెట్టారు. భద్రతా సంస్థలు సరిగా పని చేస్తే ఇంకెంత మంది ఊచల వెనక్కు వెళతారో చెప్పనలవి కాదు. అందులో మాటిమాటికి స్టేలు తెచ్చుకునే ఒక ముఖ్యమంత్రి ఉన్నా కూడా అశ్చర్య పడవలసిన పనిలేదు. ఆ వాపును మీరు బలుపు అనుకుని భ్రమిస్తున్నారు.

      Delete
    14. అప్పుతచ్చు: నారాయణ మూర్తి అన్నదగ్గిర రామలింగరాజు అని చదువుకోగలరు.

      Delete
    15. @శ్రీకాంత్ చారి
      లక్ష నాగళ్లతో దున్నిస్తానన్న చోటికి ఆనందంగా వెళ్ళి ఆప్యాయంగా మీ ముఖ్యమంత్రే పొగిదినాక కూడా అది అక్రమ వ్యాపారమే అని వాదిస్తున్నారు - అంటే ఆ ఇద్దరిలో యెవరు మోసగాడు!

      అవి కబ్జాలే అయితే మరి లాంకో హిల్సుని యేమి చెయ్యగలిగాడు మీ ముఖ్యమంత్రి.పాపం బద్దలయితే మట్టి కరవతం గురించి శాపనార్ధాలు పెడితే మీ సమర్ధత యేముంది?ఒక మామూలు ఆదమనిషి జగన్ బామ్మర్ది తన ఇంటిని కబ్జా చేస్తే బుల్డోజర్లతో పెకలించగలిగిన మాత్రం రాష్ట్రం మీదయి అధికారం వచ్చాక గూడా ఇంతమంది మేధావులు యేమీ చెయ్యలేక వాళ్లనే అధ్భుతాలు సృష్తించారు మీరు అని పొగిడి చెవులు దులుపుకు రావటం చూసినా మీకు వాస్తవాలు కనపదటం లేదు గానీ మా భ్రమల గురించి మాకు హితబోధ చేస్తున్నారు?!

      Delete
  5. శ్యామలీయం మాస్టారి మాట నాకు అర్ధం అయ్యింది. నేనన్నదే వారికి & మీకు అర్ధం కానట్టు ఉంది. వెంకయ్య నాయుడు (కెసిఆర్) చెప్పాడు కాబట్టి ఫలానా విషయం నమ్మేద్దాం అనుకోవడం కంటే మన పరిశోధన విచక్షణా సామర్త్యాలు వాడడం మంచిది కాదంటారా?

    లోక్సత్తా పార్టీకి చెందినా ఏకైక మాజీ ఎమ్మెల్యే గారి (మీరు ఉటంకించిన) ప్రసంగం నేను చదవలేదు. యూజీసీ ఎలా పని చేస్తుందో నాకు తెలీదు. అసలు నా వ్యాఖ్యకు వీటికి సంబంధం ఏమిటో నాకయితే బోధపడడం లేదు.

    సాక్ష్యాలు ఆధారాలు లేవన్నారు కాబట్టి నా దగ్గర ఉన్నవి చెప్పాను. నేను అన్నవాటిని నేను డిఫెండ్ చేస్తాను కానీ నేను పంపిస్తే వెళ్ళడానికి "మా వాళ్ళు" నా జీతగాళ్ళు కారని గుర్తించండి.

    PS: ఇంటర్/ఎంసెట్ లొల్లి కలిపి చేయాలా వద్దా గురించి కాదు ఎవరు చేయాలని చట్టంలో ఉందొ దాని గురించి
    PPS: మీరు "మత్తు" పదాన్ని "సోయి"కి ఆపోజిట్ అర్ధంలో వాడారనే తెలిసింది లెండి

    ReplyDelete
    Replies
    1. @jai
      మన పరిశోధన సామర్ధ్యాలు అనేవాటికి అక్కడ విలువ లేదురా బాబో అక్కడి వాళ్ళు యేమి చేస్తే అదే చట్టంగా చెలామణీ అవుతున్నాది అంటుంటే మళ్ళీ మన పరిశోధన తొక్కా తోలు అని మొదటికే వస్తున్నారు!

      Delete
    2. మన పరిశోధనా విశ్లేషణలకు విలువుందా లేదా కాదండీ. వాళ్ళు చెప్పిందల్లా నమ్మకుండా మనం సొంతంగా నిజానిజాలు తెలుసుకుంటే మనకే లాభం కదా.

      Delete
  6. @jai
    1.PPS: మీరు "మత్తు" పదాన్ని "సోయి"కి ఆపోజిట్ అర్ధంలో వాడారనే తెలిసింది లెండి
    "
    ఇది నేను ఆ అర్ధం వచ్చే ప్రమాదం వుందని ఆలశ్యంగా వెలిగి నేను అతను తను యెక్కడికి వెళ్తున్నాడో తెలిసే వెళ్ళాడు గదా అనే అర్ధంలో వాడాను అని చెప్పాక గూడా "సోయి" అని నాక్య్ వ్యంగ్యంగా వాడారేమో అనిపించే మీ మాందలికాన్ని వాడటాన్ని నేనెలా అర్ద్జం చేసుకోవాలి?

    2.సాక్ష్యాలు ఆధారాలు లేవన్నారు కాబట్టి నా దగ్గర ఉన్నవి చెప్పాను. నేను అన్నవాటిని నేను డిఫెండ్ చేస్తాను కానీ నేను పంపిస్తే వెళ్ళడానికి "మా వాళ్ళు" నా జీతగాళ్ళు కారని గుర్తించండి.
    ?
    మా ప్రాంతానికి సంబంధించిన పొలిటీషియన్లు చేస్తున్నది నాకు నచ్చలేదూ అనే చోట వాడినది మీరు రాంగ్ ప్లేసులో వాడుతున్నారు,కావాలని యెగతాళికి చేశారా,యేదయినా నిగూఢమైన అర్ధమ వుందా?

    ReplyDelete
    Replies
    1. సోయి= alert/knowledgeable i.e. opposite of మత్తు. దీనికి "ప్రామాణిక" పదం ఉందొ లేదో నాకు గుర్తు రావడం లేదు.

      వ్యంగం, ఎగతాళి ఏమీ లేవండీ. మీరు "మా వాళ్ళను" పంపించమన్నారు, వాళ్ళు నేను చెబితే వస్తారా? వాళ్ళు ఎవరినో శాసించే అధికారం నాకు లేదని చెప్పడమే నా ఉద్దేశ్యం.

      I can defend my views, not that of so called "my people". This approach cuts both ways.

      Delete
  7. @jai
    మీరు"మా వాళ్ళను" పంపించమన్నారు
    ?
    నేను మీవాళ్ళని యెక్కడికి పంపించమన్నాను?నేను పంపితే రావ్డానికి మావాళ్ళు జీతగాళ్ళు కారు అని మీరు యెలా అర్ధం చేసుకున్నారో నాకర్ధం కావదం లేదు?నేను అన్నది "మా ప్రాంతపు పొలిటీషియన్లు చేస్తున్న ఈ రగద నాకు నచ్చలేదు" అనే చోట "మావాళ్ళు" అని వాడీతే మీరు "నేను పంపితే రావటానికి మావాళ్ళు జీతగాళ్ళు కాదు" అని అనటానికీ యేమి సంబంధం వుంది?

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...