Monday, 9 February 2015

ఆంధ్రాకు అన్యాయం చేసినోడు ఎవడూ బతికిబట్టకట్టడు… కాంగ్రెసుకి దేశంలో పట్టిన గతి బీజేపీకి ఢిల్లీతో మొదలవుతుంది

రాజ్యం వీరభోజ్యం అన్న పెద్దలే రాజ్యాంతే నరకం దృవం అన్నారు!

రాష్ట్రాన్ని విడగొట్టటం మరో అధికార కేంద్రాన్ని సృష్టించే పై స్థాయిలోని పెద్దమనుషుల వెసులుబాటు కోసం జరిగిందే తప్ప తెచ్చుకున్న వాడికి తెలంగాణా ప్రజల సౌభాగ్యం మీద దృష్టీ లేదు.ఇచ్చిన వాడికి అసలు విభజించాక అటుపక్కన మరో ముక్క కూడా వుంటుందనే వివేకమూ లేదు?విభజించితే తను అన్ని సీట్లు గ్యారెంటీగా ఇస్తానంటున్నాడు,విభజించకుండా వుండాలంటే మీరు యెన్ని సీట్లు గెలిపించగలరు అని పరిశీలకుడి హోదాలో వచ్చిన తన పార్టీ వాడే కూశాడని మర్చిపోయిన లఘువీరుడు ఇతర్ల మతిమరుపును గురించి యాష్ట పడిపోతున్నాడు?!మాతృరాష్ట్రం అనే గౌరవప్రదమైన హోదా వుండగా అవశేషాంధ్ర అని విన్నవాడికి గుందెలు భగ్గుమనే విధంగా వెక్కిరింతగా మాట్లాడిన దౌర్భాగ్యులు ఇవ్వాళ రాష్ట్రం పట్ల యేదో బాధ్యత వున్నట్టు రెచ్చిపోతున్నారు.సమైక్యవాదం పేరుతో హడావిడి చేసిన దంతా కాంగ్రెసు వాళ్ళు కాదా!వాళ్ళ అసలు వుద్దేశం రాష్ట్రాన్న్ని సమైక్యంగా వుంచడం కానే కాదు,కేసీఆర్ నుంచి హైదరాబాదులో వున్న తమ వ్యాపారాల్ని పదిలంగా వుంచుకోవటానికి కావలసిన లోపాయకారీ హామీ కోసమే జరిగింది!?అతడూ వీళ్ళలాగే పార్ట్ టైం పొలిటీషియన్ కం ఫుల్ టైం బిజినేస్ మాగ్నెట్ గనుక పై స్థాయిలో అది దొరకగానే చల్లబడిపోయారు!

చంద్రబాబు ప్రజాభిమానంతో అధికారంలోకి వచ్చినా కేంద్రంతో గట్టిగా వ్యవహరించకుండా పిరికిగా యెందుకుంటున్నాడో తెలుసా?ఒకనాడు వాజపేయి అనే మేధావీ రుజువర్తనుడూ భాషాయుధ పాణీ నిష్కపటీ ఉదారుదూ అయిన వాజపేయి వల్ల ఒకానొకప్పుడు కేవలం 2 సీట్లకే పరిమితమయి కూడా భాజపా నేడున్న స్థానానికి వచ్చింది!మోదీ ఇవ్వాళ వచ్చాడు?2 సీట్లకి మాత్రమే పరిమితమయిన స్థానం నుంచి యే అంశాన్ని చూసి ప్రజలు ఆదరించారో భాజపా వాళ్ళు మర్చిపోయి వుండవచ్చు.రధయాత్ర నాడు భాజపాని ద్వేషించిన నాలాంటి వాళ్ళు కూడా కాంగ్రెసుకి భిన్నంగా అక్కడున్న వాజపేయి,అద్వానీ లాంటి వాళ్ళ హుందా అయిన రాజకీయ వ్యక్తిత్వాలను చూసే అభిమానించడం మొదలు పెట్టారు!కానీ ఒకసారి అధికారాన్ని అనుభవించి పోగొట్టుకుని మళ్ళీ సాధించిన ఇప్పటి భాజపా నేతలు ఆ గతాన్ని మర్చిపోయి కమలమే సకలం కావాలి అనే ధూర్తత్వాన్ని ప్రదర్శిస్తూ కాంగ్రెసుకి నకలుగా తయారయ్యారు.దేశప్రజలంతా నిర్ఘాంతపోయి చూసే విధంగా లగడపాటి రాజగోపాల్ అనే కాంగ్రెసువాడు చేసిన పెప్పర్ స్ప్రే దుర్మార్గమే కాంగ్రెసుకి ఆ గతి పట్టించింది!అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన పట్టుదల మీదనే వచ్చిందని చెప్పుకున్న ప్రత్యేక హోదానీ విభజన ప్యాకేజినీ తను అధికారంలో వుండి కూడా మా చేతుల్లో లేదని వెంకయ్య నాయుడు చెప్పినప్పటి నుంచే ఆప్ వైపుకి త్రాసు మొగ్గడం వూపందుకుంది?!

సకలం కావాలీ అనే భాజపా లక్ష్యం ప్రతి పార్టీకి వుండొచ్చు,కానీ యెలా సాధించాలనుకున్నది ఆ పార్టీ?తను చేసిన వాగ్దానాల్ని నిరపేక్షంగా నెరవేర్చి సజావైన పధ్ధతిలోనా!తనకే లాభం రావాలనే తొండి రాజకీయపు పైత్యకారి తనంతోనా!

ఆంధ్రప్రదేశ్ విషయంలో భాజపా పరమ దుర్మార్గమైన వ్యూహంతో వుంది!జగన్ మీద వున్న కేసులు ఇప్పుడు విచారణ జరుగుతున్న పధ్ధతి ప్రకారం 2090వరకూ కూడా పూర్తి కాకపోవచ్చు,అసలెప్పటికీ పూర్తి కానె కాకపోవచ్చు!అసలు జగన్ మీద ఆరోపణలు యేమిటి?తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించాడని కదా!ఆ తండ్రి ముఖ్యమంత్రి అనే ప్రధమ స్థానంలోనే వున్నా మంత్రివర్గ సభ్యులకి తెలియకుండా చెయ్యగలడా యే పని అయినా?అధికార దుర్వినియోగం జరిగితే అది రహస్యంగా యెప్పటికీ జరగదు?!కన్నమేసే దొంగ కూడా  తోడు లేకుండా చెయ్యడు గదా, మరి అతని మంత్రివర్గంలో వున్న లఘువీరుడికీ బొత్సకీ పార్టీలో యెవ్వడికీ తెలియకుండా జరిగిందా అది?ఆ కేసు స్వరూపం ప్రకారం అసలు ముద్దాయి జగన్ అవ్వడు వీళ్ళే అసలు నేరస్థు లవుతారు!జగన్ ధైర్యం కూడా అదే!చంద్రబాబు తోక ఝాడించిన మరుక్షణం జగన్ భాజపా సహకారంతో నిర్దోషిగా బయట పడి తెదెపాని మట్టి కరిపిస్తాడు.నేను జగన్ అభిమానిని కాదు,కానీ ఇన్ని విధాల కేసులతో సతమతమవుతున్నా రోజుకొకసారి తెదెపా శ్రేణులతో యెప్పుడు జైలు కెళ్తావో తెలియదు అని జోకు లేయించుకుంటున్నా అంత ధీమాగా వుండగలటానికి కారణం యేమిటనే ప్రశ్న వేసుకుంటే మీకే అర్ధమవుతుంది! జగన్ కూడా నిక్కచ్చిగా కేసుల నుంచి బయట పడదల్చుకుంటే  చాలా ఈజీగా బయట పడగలడు,కానీ తనకి సానుభూతిని రప్పిస్తున్న ఈ వ్యవహారాన్ని తనూ తన కనుకూలంగా తీసుకుంటున్నాడు!

యే విధంగా జరిగినా ఒకసారి అధికారం కోల్పోయాక మళ్ళీ అధికారంలోకి రావడం అంత తేలిక కాదని మనందరి కన్నా చంద్రబాబుకే యెక్కువ తెలుసు! అంతా మోసం!అంతా దగా!ముఖ్యమంత్రుల బోర్డు ఒప్పుకోదేమో అని అనుమానాలు ఇప్పుడు వెలిబుచ్చుతున్న వాళ్ళు ఇచ్చినవాడు తమ పార్టీ వాడు కాదు గదాని గట్టిగా కృషి చెయ్యకపోవడం వల్లనే గదా వ్యతిరేకించేది?హామీ ఇచ్చిన వాడు నిన్నటి వాయినా ఇచ్చింది ప్రధాని స్థానంలో వుండి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రులయినా మరెవరయినా కుంటిసాకులతో దానికి తూట్లు పొడిస్తే రాజ్యాంగబధ్ధమయిన ఆ పదవికే తలవొంపులు కాదా?

ఒక దేశప్రధాని ఇచ్చిన న్యాయబధ్ధమయిన హామీ పట్ల ఇంత అనిశ్చితిని రగిలించిన భాజపాని యెవరయినా యెలా అభిమానించ గలరు?అందుకే వ్యతిరేక ప్రభంజనం దిల్లీలో తొలి విసురు విసురుతున్నది?!ముస్లిముల్ని రంజింప జేసినా  కాశ్మీరులో వుషారు ఇచ్చినా ప్రధాని స్థానంలో ఉండి ఒక నగర ప్రజానీకాన్ని రంజింపజెయ్యాలని చూసినా యెదురు తన్నడం యెందుకు జరుగుతుందో యెదురుదెబ్బ తగిలిన తర్వాతనయినా బోధపర్చుకుంటే మంచిది.

అధికారాంత మందు జూడవలె గదా అయ్యల సౌభాగ్యములు?!

Saturday, 7 February 2015

దోపిడీ->యుధ్ధం->రాజ్యం->కులం->అణిచివేత?->వైప్లవ్యం!

ఈ దేశం ఒకప్పుడు యుధ్ధాలు లేని,అసమానతలు లేని,దోచుకోవడం అంటే యేమిటో తెలియని ఒక వ్యవస్థలో కొంతకాలం బతికింది!పైగా తారతమ్యాలు అంచనా వేస్తే ఆ కాలంలో పరిఢవిల్లిన మిగతా ప్రాంతాల సంస్కృతి కన్నా అన్నింటిలో అగ్రాసనం ఇవ్వదగిన ఒక సంస్కారవంతమైన నాగరక జీవన వృత్తాన్ని పదిహేను వందల సంవత్సరాలు 5 మిలియన్ల జనసమూహం పాటించి నిలబెట్టడం ఇప్పటికీ మనం గర్వంగా చెప్పుకోదగినదే!దానినే చరిత్రకారులు "సింధు లోయ నాగరికత"గా పిలిచి యెన్నో పరిశోధనలు చేసి మనకి తెలియని మన ప్రాచీనుల గొప్పదనాన్ని మన కళ్లముందు నిలబెట్టారు.వెతికి చూసినా యుధ్ధానికి వుపయోగపడే పరికరాలు లేవు?యెంత శోధించినా మతానికి సంబంధించి మూఢనమ్మకాలు వున్న ఆధారాలు కనపడలేదు?తర్వాతి కాలంలో శైవులు శివుడి గానూ, బౌధ్ధులు అవలోకితేశ్వరుడి గానూ, జైనులు తీర్ధంకరుడి గానూ భావించిన యోగముద్రలో కనబడుతూ జంతువులతో పరివేష్టించబడిన "పశుపతి" ప్రముఖంగానూ శక్తి వుపాసనకి మూలమైన "మహా మాత" మూర్తి మాత్రమే కనబడుతున్నాయి.ప్రత్యేకంగా అతిపెద్ద మందిరాలు లేకపోవడం చేత ఇవ్వాళ మనం చేస్తున్నట్టుగానే యెవరికి వారు వ్యక్తిగతంగా పూజలు చేసుకునే వారని అనుకోవాలి!

ఇలాంటి గొప్ప వ్యవస్థ యెందుకు అదృశ్యమై పోయింది? యెక్కువమంది పరిశోధకులు తీర్మానించిన దాని ప్రకారం కాలం కలిసిరాక,విపరీతమైన చలికి తట్టుకోలేక,నిరంతర వర్షాలకి అతలాకుతలమైపోయి విధిలేని పరిస్థితుల్లో ఆ నగరాలని వొదిలేసి మరింత లోతట్టు ప్రాంతాలకి చేరి అప్పటికే అక్కడున్న ప్రజలతో యుధ్ధాలు చేసి గెలిచి కొత్త చోట్లలో కొత్తగా ఋతుపవనాల మీద ఆధారపడిన సేద్యాన్ని అలవాటు చేసుకుని ఒక కొత్త యుగంలోకి ప్రవేశించారు.క్రీ.పూ 1900 ప్రాంతాల మధ్యన విరాజిల్లిన సింధు నాగరికత క్రీ,పూ 1700 ప్రాంతానికి ఋగ్వేద కాలంలోకి మారింది.ఇది భారతదేశ చరిత్రలోకల్లా నిరంతర యుధ్ధాలతో,యుధ్ధాలలో గెలుపు కోసం యజ్ఞయాగాదుల పేరున సరికొత్త ఆరాధనా పధ్ధతులు తలయెత్తిన కాలం.అందుకేనేమో ఋగ్వేద సాహిత్యంలో శక్తిని,గెలుపును,వృధ్ధిని కోరుకునే సాహిత్యమే యెక్కువ? ఇక్కడ నాకు ఒక విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది - ఇప్పటికీ సంతృప్తి కలిగించే జవాబు దొరకనంత అస్పష్టంగా వుండి మార్మికంగా ఉంటున్నది!వీరు నిజంగా సింధు నాగరికతా శిధిలాల నుంచి వచ్చిన వారేనా అనేది?యెందుకంటే ఋగ్వేద సాహిత్యంలో గానీ మిగిలిన వైదిక సాహిత్యంలో గానీ ఇవ్వాళ కనుక్కున్న సింధు లోయ నాగరికతకి సంబంధించిన ప్రస్తావనలు లేవు,యెందుకని?!

నా వూహ అయితే కొత్తగా సాహిత్యసృష్టి నేర్చుకున్న వెంటనే కళ్ళముందు జరుగుతున్న కోలాహలం ప్రధానంగా రికార్డు చెయ్యాల్సిన అవసరం వుండటం వల్ల ముందు వాట్ని గ్రంధస్థం చేసి ఆ తర్వాత పాత విషయాల్ని గుర్తు చేసుకోవడం మొదలు పెట్టేసరికి సింధు నాగరికత నాటి విషయాలు అస్పష్టమై పోయి కధలుగా మారి అప్పటి వ్యక్తులు రూపం మార్చుకుని పురాణ పురుషులుగా నిలబడ్డారని అనుకోవాలి!"ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహా" రచయిత విజయవంతంగా చేసింది ఇప్పుడు మన ముందు శివుడిగా పూజలందుకుంటున్న ఒకప్పటి సామాన్య మానవుణ్ణి అత్యంత వాస్తవికంగా చిత్రించడమే!

వైదిక కాలానికి సంబంధించిన జ్ఞానమంతా క్రీ.పూ 1500 - 1200 మధ్యలో సంకలించబడిన ఋగ్వేద సంహిత నుంచే  లభిస్తున్నది!ఇతర రాజ్యాలని ఆక్రమించే వుద్దేశంతో యేర్పరచిన "అశ్వమేధ యాగం" ప్రముఖంగా వర్ణించబడింది. ప్రముఖమైన "బ్రాహ్మణ","క్షత్రియ","వైశ్య","శూద్ర" వర్ణాలు నాలుగూ ప్రస్తావించబడినాయి,కానీ ఇవి అక్కడున్న వ్యక్తుల ప్రాధాన్యతని సూచించే విధంగానే వున్నాయి తప్ప జన్మకు అనుసంధానించటం అనేది తొలి వైదిక కాలంలో జరగలేదు!ఇక్కడే మరొక విశేషాన్ని కూడా ప్రముఖంగా చెప్పుకోవాలి.సింధు నాగరికత ద్వంసమైపోయి వారు చెల్లా చెదరవటం కేవలం ఒకే దిశలో జరగలేదు.అన్ని వైపులకీ వెళ్ళగా మన వైపుకి వచ్చిన వారు ఇక్కడ తమ పూర్వీకుల గురించి చెప్పుకున్న విషయాలూ ఇవ్వాళ్టి భారత దేశపు సరిహద్దుల కవతల వున్న సంస్కృతుల లోని ప్రాచీన సంస్కృతికి సంబంధించిన విషయాలూ ఒకే రకంగా వున్నాయి!అందుకే ఇక్కడి కొందరు అఖండ భారత్ పేరుతో ఆఫ్ఘనిస్థాను కూడా మనదే అంటున్నారు?వీటిని భాషా కుటుంబాలు అంటారు.ఇండో ఇరానియన్ భాషా కుటుంబం యొక్క వారసత్వం ప్రకారం మన దేశాన్ని ఆక్రమించిన ఆంగ్లేయులు కూడా మనకి సోదర జాతి అవుతారు?"మదర్ - మాతర్","బ్రదర్ - భ్రాతర్" లాంటి చిన్న చిన్న మాటల్లోని పోలికలే కాదు భాషా శాస్త్రవేత్తలు ఇంకా గహనమైన పోలికల్ని కూడా పట్టుకోగలిగారు!



వైదిక కాలంలోని రాజ్యం మొదటిసారిగా అధికారాన్ని కంద్రీకృతం చేసుకుంటూ యేర్పడింది!కురు వంశం అప్పటి చిన్న చిన్న తెగల నుంచి యుధ్ధాలు చెయ్యడంలో నేర్పరులైన వాళ్ళంతా వాళ్లలో వాళ్ళు కలిసిపోయి ఒక వున్నతమైన వంశంగా ప్రభవించింది.వీరిలో "పరిక్షిత్", "జనమేజయుడు" అనే ఇద్దరు తండ్రీ కొడుకులు అప్పటి రాజ్యానికి కావలసిన అన్ని హంగులూ యేర్పరచారు.పెరుగుతున్న జనాభాని పోషించడానికి అవసరమైన భూమి కోసం ఇతర్లని దోచుకోవడానికీ ఇతర ప్రాంతాలకి విస్తరించడానికీ యుధ్ధాలు అవసరమైనాయి.యుధ్ధానికి నాయకత్వం వహించి గెలిపించగలిగిన వాడు రాజయ్యాడు.యెంత లెక్క ప్రకారం వ్యూహాలు పన్ని పోరాడినా గెలుపు అదృష్టాన్ని బట్టి వుండటంతో దైవబలాన్ని సాధించుకోవడం కోసం పురోహితుడు అతనికి అవసరమయ్యాడు.యుధ్ధానికి అవసరమైన వనరుల్ని సమకూర్చగలిగిన వైశ్యుడు రాజ్యానికి మూలస్తంభం అయ్యాడు.యుధ్ధం తప్పనిసరి అయినప్పుడు కొన్ని పనులు తప్పనిసరిగా చెయ్యడానికి కొందరు తప్పనిసరిగా అవసరం గనుక శూద్రులు అందుకు వుపయోగపడ్దారు.యుధ్ధ పరికరాల అవసరమే లేని ఒక అధ్భుతమైన నాగరికతలో యెంత హీనపక్షంగా లెక్కేసినా వెయ్యేళ్ళ పాటు ప్రశాంతంగా గడిపిన జనసమూహమే కాలాంతరంలో యుధ్ధమే సమస్తంగా బ్రతికే జీవన విధానానికి మారడం ప్రపంచ చరిత్రలోని అత్యంత దుర్భరమైన విషాదా లన్నింటిలో ఒకటి?!

క్రీ.పూ 12వ శతాబ్దం వచ్చేసరికి ఋగ్వేద సాహిత్యం సంపూర్ణంగా సృజించబడి రాజ్యం యొక్క స్వభావం పూర్తిగా నిర్వచించబడి క్రీ.పూ 6వ సతాబ్దానికి 16 మహాజనపదాలు యేర్పడి భారత దేశపు స్సంస్కృతిలో అత్యంత ప్రముఖమైన కుల స్వభావాన్ని ప్రజల మనసుల్లో సుస్థిరం చేశాయి!.వీటన్నిటిలో మగధ ఇవ్వాళ్టి ప్రపంచ రాజకీయ వేదిక మీద అమెరికా స్థానానికి దీటయిన స్థానాన్ని ఆక్రమించడానికి కారణం ఆ రాజ్యంలోని విస్తారమైన ఇనుప ఖనిజపు నిధులు!ఈ మగధ చరిత్ర క్రీ.పూ 600 నాడు హర్యంక వంశంతో మొదలవుతుంది.క్రీ,పూ 424 నంచి శిశునాగ వంశం మొదలైంది.రాజు బలహీనుడైతే మంత్రో సైన్యాధిపతో అతన్ని హతమార్చి తమ పేరుతోనే ఒక కొత్త వంశాన్ని కల్పించుకోవటంతో కొత్త రాజవంశం అవతరించేది!ఈ శిశునాగుల కాలంలోనే గౌతమ బుధ్ధుని ప్రవచనాల ఆధారంగా బౌధ్ధ మతం, మహావీరుని బోధనల ఆధారంగా జైన మతం ఆవిర్భవించాయి.ఈ శిశునాగ వంశంలోని పదవ రాజు గారి బార్యకి ఆష్థాన క్షురకుడు చాలా మోహాన్ని పుట్టించాడు!అంతే,రాజుగారు హతమై పోయాడు - మహా పద్మ నందుడు నంద వంశ స్థాపకుడిగా రాజయ్యాడు!రాజవ్వగానే ఆ రాణిని ఖైదు చేసి పట్టపురాణి హోదాని వేరొక స్త్రీకి కల్పించాడు - తెలివైన వాడు గదూ?!

అయితే ఈ క్షురకుణ్ణి రాజుగా సాటివాళ్లంతా అంగీకరించడం అనేది "నందో రాజా భవిష్యతి" అనే గట్టి సంకల్పంతో రాజ్యాన్ని వృధ్ధిలోకి తీసుకొచ్చిన రాక్షస మంత్రి ఇతనికి విశ్వాసపాత్రుదైన మంత్రిగా దొరకడం వల్ల్లనే సాధ్యపడింది.రాజ్యం యెంత వృధ్ధిలోకి వచ్చినా ఇతడి కొడుకైన ధననందుడి తోనే వంశం అంతరించి పోయింది.ధననందుడికి యెనిమిది మంది కొడుకులు.అందర్నీ కలిపి నవనందులనే వాళ్ళు. చాణక్యుడు అప్పటికే అలెగ్జాంర్ యొక్క ప్రమాదాన్ని గుర్తించి మగధ రాజుని కలిసి అలెగ్జాంరు సైన్యాన్ని నిరోధించగలిగిన శక్తివంతమైన రాజ్యం గనుక అతన్ని సిధ్ధపరుచుదామని అక్కడికి వస్తే నందుని కొడుకులు నిర్లక్ష్యంగా అతన్ని అవమానించారు.దానితో అలెగ్జాండరు గురించి మర్చిపోయి నందహతకుల్ని భూస్థాపితం చెయ్యడంలో కృతకృత్యుదు కావడంతో చాణక్యుని శిష్యుడైన చంద్రగుప్తుడు రాజుగా మౌర్య వంశం మొదలైంది.ఈలోపు అలెగ్జాండరు తనంతట తనే మగధ వరకూ రాకుండానే వెనుదిరగడంతో మగధకి అలెగ్జాండరు పోటు తప్పింది!

నందుడికి విధేయుడిగా వున్న రాక్షసుణ్ణి చంద్రగుప్తుడికి మంత్రిని చెయ్యడానికి వేసిన రాజకీయపు యెత్తుగడల నేపధ్యంగా రచించబడిన "ముద్రా రాక్షసం" నాటకపు ఇతివృత్తం సంస్కృత సాహిత్యంలో అత్యంత విభిన్నమైనది - ఇప్పటి దిటెక్టివ్ కధల్లో వుండే టెన్షన్ పుట్టించే గుణం అంతర్లీనంగా వుంటుంది?!ఇప్పటికీ ప్రాచీన కాలపు రాజరికాలు యేవిధమయిన సాంప్రదాయాల్ని పాటించేవి అనేది తెలుసుకోవడానికి చాణక్యుని "అర్ధశాస్త్రం" అనే గ్రంధం ఒక్కటి చాలు.ఇందులో శూద్రుల స్థితి గురించి నిర్మొహమాటంగా "శూద్రుడికి సొంత ఆస్తి సమకూరితే దాసవృత్తి చెయ్యడు గనక శూద్రుడి దగ్గిర పోగుపడిన చిల్లిగవ్వనైనా సరే లాగివేసుకోవటం చట్టవిరుధ్ధం కాకపోగా రాజు తప్పనిసరిగా చెయ్యాల్సిన ముఖ్యమైన పని" అని తేల్చి చెప్పాడు!ఇటువైపు నుంచి ధార్మిక విషయాలలో "శూద్రుడు తనంతట తను వేదం చదవడం కాదుగదా ఆ దారిన దూరంగా వెళ్తున్నప్పుడు పొరపాటున చెవిన పడ్డా ఆ శూద్రుడి చెవుల్లో సీసం కరిగించి పొయ్య" మనే రకం సుభాషితాలు మరింత క్రూరమైనవి - చేశారో లేదో తెలియదు గానీ మాటలు మాత్రం మిగిలి వున్నాయి?!వీటి నన్నిట్నీ దుందుడుకు ప్రస్తావనలుగా కొట్టిపారేసినా శంబుక వధని సమర్ధించలేరు గదా!తపస్సు చెయ్యడం పట్ల శ్రధ్ధ అనే బ్రాహ్మణ స్వభావం అతని మనస్సులో వుండటం వల్ల అతన్ని బ్రాహ్మణుడిగా గుర్తించడానికి బదులు మృతశిశువును కారణంగా చూపించి చంపించటం అన్యాయమే కదా?అయితే ఒకటి - అప్పటి బ్రాహ్మణులు చేసిన దానికి ఇప్పటి బ్రాహ్మణుల్ని నిందించి ప్రయోజనం లేదు.ఇప్పటి బ్రాహ్మణుల్లో చాలామందికి నాకు తెలిసిన మాత్రం కూడా తెలియదు అప్పటి విషయాల గురించి,యేదో పెద్దవాళ్ళు చెప్పారు అని పాటించటమే తప్ప అందరూ అవన్నీ అర్ధమయి పనిగట్టుకుని కులాధిపత్యాన్ని చూపిస్తున్నారని చెప్పలేం.వాళ్లలోనే వీటిని దగ్గిరగా చూసి అసలు అర్ధం తెలుసుకుని వ్యతిరేకించి పోరాడిన సంస్కర్తలు గూడా పుట్టారు మరి?

అయితే ఇన్ని సహస్రాబ్దాల పాటు ఈ వ్యవస్థ యే తిరుగుబాటూ లేకుండా వొద్దికగా యెలా వుంది?ఇంతకాలం బద్దలు కొట్టకుండా వుండటానికి ఇక్కడి ప్రజలు క్షాత్రం లేనివాళ్ళు కాదుగదా!ఇతర దేశాల్లో బానిసల పేరుతో చేసినట్టు గొలుసుల్ని కట్టి బంధించి చేయ్యలేదు గదా,విపణి వీదిలో పెట్టి అమ్మలేదు గదా - మరి దీన్ని దుర్మార్గం కింద యెలా లెక్కిస్తాం?ఈ కులవ్యవస్థని అంతం చెయ్యాలనుకునే వాళ్ల మీదకి సంధించబడే ఈ ప్రశ్నలు బలమైనవి గనకనే వాళ్ళూ నోరెత్తలేక పోతున్నారు.తమ కులంలోనే కులాన్ని గట్టిగా పట్టుకుని వుండేవాళ్ళని చూసి,తమలోనే తమ కులం పట్ల ఆత్మీయత వుండటం చూసి -  దీన్ని యెలా బద్దలు కొట్టాలో పాలుపోని స్థితిలో నిలబడ్డారు.కులవ్యవస్థలోని కీలకం యేమిటంటే కులానికీ వృత్తికీ అనుబంధాన్ని యేర్పరచారు - దాన్నొక ఆదాయమార్గం చేశారు!దానితో ఒక వృత్తిలో నైపుణ్యం వున్నవాళ్ళకి సొంత ఆస్తి లేకపోయినా జీవనం గడుస్తుంది కాబట్టి సర్దుకుపోయారు.ఆ వృత్తి ద్వారా వచ్చే జీవనోపాధిని తమ పిల్లలకి నికరంగా సంక్రమింపజెయ్యడం కోసం ఒక వృత్తికి సంబంధించిన వాళ్ళు తమలో తామే పెళ్ళిళ్ళు చేసుకుని దాన్ని క్రమబధ్ధం చెయ్యడం తప్ప మరో మార్గం లేకపోయింది!ఆరకంగా ఆ కాలంలోని అన్ని దేశాల్లో సాటి మనుషుల్ని బానిసలుగా చేసి కిరాతకంగా ప్రవర్తిస్తే "సూర సుబ్బన యోర్మధ్యే సుబ్బనః కించిదుత్తమి?సుబ్బనః రక్తపాయీ చ సూరనః శల్యభక్షకః(సూరన సుబ్బనల్లో సుబ్బన కొంచెం మంచివాదు - సుబ్బన రక్తం పీల్చి వొదిలేస్తాడు? సూరన యెముకల్తో సహా నమిలేస్తాడు!)" అన్నట్టు ఇక్కడ కులవ్యవస్థ అనే బంగారు పంజరాన్ని సృష్టించారు?!

స్వయంపూర్ణ గ్రామ వ్యవస్థ అని సామాజిక శాస్త్రవేత్తలతో వర్ణించబడిన ఒకవైపు నుంచి చూస్తే అధ్భుతంగానూ మరోవైపు నుంచి చూస్తే కిరాతకంగానూ కనబడే ఈ ద్విముఖ వ్యవస్థ పారిశ్రామిక విప్లవం ఇచ్చిన అతుత్సాహంతో అప్పటివరకూ చలనం లేకుండా వున్న మిగతా దేశాలలో భూకంపాల్ని పుట్టించిన ఆంగ్లేయులు ఇక్కడ కూడా అడుగు పెట్టడంతో పునాదులతో సహా కదిలిపోయింది.సముద్రయానాన్ని నిషేధించి అప్పటిదాకా అపురూపంగా పట్టి వుంచిన బంగారు పంజరం ఆంగ్లభాషాద్యయనం వల్ల వీచిన కొత్తగాలుల దెబ్బకి మూడొంతులు ద్వంసమైంది!గాంధీ - నెహ్రూ ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు,పైగా ఒకరంటే ఒకరికి అభిమానం వున్న గురుశిష్యులు అయినా వారిద్దరి మధ్యనా విభేదాలు రావడానికి కారణ మేమిటో ఇప్పటికీ చాలామంది గ్రహించలేకుండా వున్నారు!గాంధీ తన వుపన్యాసాలన్నిటి లోనూ తనకి ప్రాచీన హిందూ సాంప్రదాయాల పట్ల వున్న మక్కువనీ ముఖ్యంగా కుల వ్యవస్థని మరీ అంత క్రూరంగా కాకుండా కొంచెం సుకుమారంగా తయారు చేసి అయినా సరే యధాతధంగా వుంచాలనే వుద్దేశం వెలిబుచ్చే వాడు?ముస్లిములకి ప్రత్యేక నియోజకవర్గాలకి వుదారంగా వొప్పుకుని దళితులకి ప్రత్యేక నియోజక వర్గాలకి అడ్డం తిరిగడానికి సరయిన కారణం చెప్పలేదు - మొండిగా వ్యతిరేకించటం తప్ప?నెహ్రూ యేమో తనకి వ్యామోహంగా వున్న కమ్యునిజం ప్రభావంతో ఈ సమస్తాన్నీ బద్దలు కొట్టెయ్యాలని ఆవేశ పడే వాడు!అయితే వర్గరహిత సమాజం యెట్లా వుంటుందో కార్ల్ మార్క్సు గారికే అవగాహన లేక వేదాంతం చెప్పడం వల్ల నెహ్రూకి కూడా ప్రత్యామ్నాయం లేక ఇద్దరి పైత్యాల్నీ సంతృప్తి పర్చే ఒక దిక్కుమాలిన విధానాన్ని జనం మీదకి ప్రయోగాత్మకంగా వొదిలాడు.అటు పూర్తిగా కమ్యునిజమూ ఇటు పూర్తిగా క్యాపిటలిజమూ కాని మధ్యేవాదపు సోషలిజాన్ని కళ్ళు మూసుకుని పాటించేశాడు?!లెక్క ప్రకారం నడపాల్సిన ఆర్ధిక వ్యవహారాల్ని గవ్వలిసిరే మహలనోబిస్సు కప్పజెప్పాడు?!

దీనివల్ల్ల యదార్ధంగా జరిగింది కులవృత్తుల మీద పట్టును కోల్పోయి ఆర్ధికంగా మరింత దిగజారడం, ఒకే పనికి అన్ని కులాల వాళ్ళూ పోటీ పడటం వల్ల మనుషులు కులానికి మరింత గట్టిగా అంకితం కావడం, కులం పేరుతో రాజకీయ లబ్ధిని కోరుకుని వైషమ్యాలు పెంచుకోవడం తప్ప దేశపు మొత్తం పరిస్థితిని నిక్కచ్చిగా లెక్కించినా ఆర్ధికంగా అభివృధ్ధినీ సాధించలేదు,సామాజికంగా సంస్కారాన్నీ మెరుగు పర్చుకోలేదు!గాంధీ అంతరాంతరాల్లో కోరుకున్నట్టుగానే అప్పటి రాజవంశీయులూ, జమీందార్లూ,కాకుంటే భూస్వాములూ చట్టసభల్లో యెన్నికల పేరుతో జరిగే హంగామా చాటున తప్పు యెక్కడుందో మహామేధావులకి కూడా అంతుపట్టనంత చక్కని వక్రమార్గంలో ప్రవేశించి అధికారం తమ నుంచి జారిపోకుండా చూసుకోగలిగారు!ఇప్పటికీ విద్యారంగానికి అతితక్కువ నిధులు కేటాయించటం,అర్హతలు వున్న టీచర్లు యేళ్ళ తరబడి యెదురు చూస్తున్నా,వారందర్నీ నియమించడానికి సరిపడిన ఖాళీలు వున్నా వాటిని భర్తీ చెయ్యకపోవటం,ఇంకా యెన్నివిధాల వుపాయాలు వున్నాయో అవన్నీ వుపయోగించి ప్రభుత్వ పాఠశాలల్ని నీరసంగా తయారు చెయ్యటం అనుకోకుండా జరిగే పొరపాటు అనుకుంటున్నారా?కాదు,విద్యని కింది అంతరువుల్లో వున్నవాళ్ళకి చేరనివ్వకుండా వాళ్లని పాకీపనులకీ,మంగలి పనులకీ,చాకలి పనులకీ మాత్రమే పరిమితం చెయ్యడం అనే వ్యూహం వుంది ఆ నిర్లక్ష్యం వెనక?!

నిజానికి మంచి అవగాహనతో గట్టి సంకల్పంతో ప్రయత్నిస్తే తొలి పద్దెనిమిదేళ్ళూ అప్రతిహతమైన అధికారాన్ని అనుభవించిన నెహ్రూ యెంతో కొంత మార్పుని సాధించగలిగి వుండేవాడు!ఇవ్వాళ వున్న పరిస్థితి మరీ దారుణమైనది? వెనకటి రోజుల్లో యెవడికి వాడికి కులవృత్తి పట్ల వున్న ధీమాతో ఒక కులంవాళ్ల మీద మరో కులంవాళ్ళు జోకులేసినా సర్దుకుపోయే స్పోర్టివ్ మనస్తత్వం వుండేది - ఇప్పుడు కాస్తకీ కూస్తకీ మనోభావాలు దెబ్బతినడం అనే ధోరణిని చూస్తున్నాం?!స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధాని ఈ దేశప్రజలు తనపైన వుంచిన నమ్మకాన్ని తనకి తోచిన కొత్త ప్రయోగానికి వుపయోగించుకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది?అసలే ప్రతి కులంలోనూ వుపకులాలు కూడా వుండి పొరలు పొరలుగా వున్న ఇక్కడి వాస్తవ జీవిత దృశ్యాన్ని పట్టించుకోకుండా అక్కడెక్కడో మెరుస్తూ కనిపించిన యెర్రమావుల వెంట పరిగెత్తేసరికి కొండనాలిక్కి మందేస్తే వున్న నాలిక వూడినట్టయింది! ఇప్పటి పరిస్థితి గురించి కామ్రేడ్ అనూరాధ గాంధీ విశ్లేషణ చాలా బాగుంది!దాదాపు నా అవగాహన కూడా అదే కాబట్టి ఇక్క మళ్ళీ అదంతా చెప్పడం లేదు!దళిత అనుకూల ప్రభుత్వం అనే వూహని మొదట్లో చాలా గట్టిగా వ్యతిరేకించాను,వారి నుంచి వచ్చిన ప్రతిస్పందన చూసి నాకు దానిపట్ల బలమైన వ్యతిరేకత యేదీ లేకపోవటం వల్ల అంతే నిజాయితీగా దాన్ని గురించి చాలా కూలంకషంగా పరిశోధించాను,దాని ఫలితమే ఈ పోష్టు!ఆ వూహ కూడా సరయిన ఫలితాన్ని ఇవ్వదనే అనిపిస్తున్నది నాకు.తెలంగాణాలో రాజయ్య వ్యవహారం పైకి కనబడేటంత సూటిగా జరగలేదు కాబట్టి గట్టి సాక్ష్యంగా చెప్పలేను గానీ అధికారంలో వున్నవాడు అవినీతి పరుడయితే దళిత ప్రాతిపదికన అక్కడికి చేరినా సాటి అవినీతిపరుల్తో చాలా ఈజీగా కలిసిపోయి మార్పుకి కావల్సిన సామాజిక సంస్కరణలకి అనుకూలంగా వుండడు అని అర్ధం చేసుకోవడానికి పనికొస్తుంది.

మార్క్సిష్టులు గతించి పోయిన చరిత్రనీ వర్తమాన సమాజాన్నీ అద్భుతంగా విశ్లేషించగలరు,కానీ  భవిషత్తు గురించిన సూత్రీకరణల దగ్గిర కొస్తే మాత్రం సైన్సు కెక్కువా మతానికి తక్కువా అన్నట్టు పిడివాదనలకి దిగిపోతారు?!యెందుకంటే ఇవ్వాళ యెన్నికల్లో నిలబడే బూర్జువా కమ్యునిష్టులు మొహమాట పడి చెప్పరు గానీ కమ్యునిష్టు సిధ్ధాంతం ప్రకారం విప్లవానికి సాయుధ పోరాటం తప్ప మరో దారి లేదని మార్క్స్ తెగేసి చెప్పాడు,లెనిన్ కూడా అదే చేశాడు?!సాయుధ పోరాటం అనగానే నెత్తురు చూస్తే కళ్ళు బైర్లు గమ్మే రకాలు ప్రతి చోటా వుంటారు గనక అదంత గబుక్కున ముందుకు దూకదగిన పరిష్కారం కాదు!నాకున్న అవగాహన మేరకు ఇవ్వాళా రేపూ మహాధ్భుతమైన మార్పుల్ని సాధించలేం.


స్వైన్ ఫ్లూ యెందుకొస్తుంది?!అపరిశుభ్రమయిన వాతావరణం వల్ల!మన పరిసరాలు పరిశుభ్రంగా వుండనంత కాలం చికెన్ గన్యా, స్వైన్ ఫ్లూ మరొకటీ మరొకటీ వేధిస్తూనే వుంటాయి.పోనీ వచ్చాక నయం చెయ్యగలుగుతున్నారా అంటే డాక్టర్లకే స్వైన్ ఫ్లూ అంటే యేమిటో తెలియక పేషెంట్లకి వైద్యం చెయ్యడానికి ముందుకు రావడానికి బదులు వాళ్లే దూరంగా పారిపోతున్న పరిస్థితి వుంది!అనారోగ్యాన్ని నిరోధించే ఆస్పత్రులే అనారోగ్య నిలయాలుగా వున్నాయి.రోగికి ఇవ్వడానికి మందులు లేని పరిస్థితి యెందుకు దాపరించింది? "స్వచ్చ భారత్" అని సెలెబ్రిటీలకి చీపుళ్ళిచ్చి హడావిడి చేసి దానిపేరుతో ప్రత్యేకంగా నిధులు పంపిణీ చేసే బదులు ప్రజారోగ్య శాఖ మరియు నగర పారిశుధ్య శాఖ అనే రెండూ ప్రభుత్వంలోని విభాగాలే కదా - వాటి పనితీరుని మెరుగు పరిస్తే ప్రతి పక్షాలు అభ్యంతరం చెబుతాయా వుగ్రవాదులు చెయ్యనివ్వబోమని బెదిరిస్తారా?శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు గాబట్టి మొదటిదిగా దీన్ని చెబుతున్నాను.ప్రభుత్వంలో ఆరోగ్య పరిరక్షణకి సంబంధించిన శాఖల నుంచి గరిష్ఠ ప్రయోజనాన్ని సాధించాలి!


ఇవ్వాళ్టి కులవ్యవస్థ తమకి అన్యాయం చేస్తున్నదని తెలుసుకుని పోరాడుతున్న వాళ్ళు చదువుకోవటం వల్లనే గదా అలా తయారయింది!చదువుకున్న ప్రతివాడికీ వుద్యోగం రాకపోయినా చదువు లేకపోవటం వల్ల తనకి జరిగే అన్యాయాల నుంచి తప్పించుకోగలుగుతాడు గదా?విద్యాశాఖని పనిగట్టుకుని దాన్ని నిర్వీర్యం చేసే రెసిడెన్షియల్ స్కూళ్ళ యజమానుల తొత్తుల నుంచి లాగిపారేసి కింది కులాల వాళ్ళు కూడా అతి తక్కువ ఖర్చుతో తమ పిల్లలకి మంచి చదువులు చెప్పించుకోగలిగే విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని పనిచేయించాలి.సాధ్యపడదేమో అనే అనుమానం కూడా లేకుండా తప్పనిసరిగా సాధించాల్సిన లక్ష్యమిది!


దేశం నిండా యెక్కడ చూసినా పరిశ్రమలూ వ్యాపారాలూ తామర తంపరగా విస్తరించినా అధిక సంఖ్యలో ప్రజలు వాళ్ల వుత్పత్తుల్నే కొని వాడుతున్నా మనం యెవరిని వుధ్ధరించాలని అనుకుంటున్నామో వాళ్ళింకా చేతిపనులతోనే హస్తకళలతోనే సతమతమవుతున్నారు!నాణ్యతలోనూ సౌకర్యంలోనూ బహుళజాతి కంపెనీల మరపనివాళ్ల కన్నా యెంతో ముందు వున్నా మార్కెట్ అనుకూలతల్ని గమనించకపోవడం వల్ల వెనకబడుతున్నారు.నేత పనివాళ్ళని వుదాహరణగా తీసుకుంటే వాళ్ళ కౌశలం అమోఘమే అయినా డిజైన్లు మాత్రం తాతల నుంచీ అలవాటయిన వాటితోనే సరిపెట్టుకుంటున్నారు, అందువల్లనే అవి కొనుగోలు దారుల్ని త్వరపడి కొనేటంతగా ఆకర్షించలేకపోతున్నాయి!కొత్త డిజైన్లని అతివేగంగా రూపొందించుకోవడానికి వాళ్లకి కంప్యూటరు ప్రపంచంలోని గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ వుపయోగపడవచ్చు.ఇంటర్నెట్ పరిజ్ఞానం మధ్యదళారులు లేకుండా తమ వుత్పత్తులకి తామే మార్కెట్ సృష్టించుకోవడానికి వుపయోగపడవచ్చు.ప్రతి ఒక్కరికీ నేర్పాల్సిన పనిలేదు వాళ్లలో వుత్సాహంగా నేర్చుకోగలిగిన వాళ్లకి నేర్పితే చాలు వాళ్ళు మిగతావాళ్లకి సహాయ పడతారు!అయినా మొదటి రెండూ నిక్కచ్చిగా జరిగీతే పూర్తి ఆరోగ్యంతో సరయిన విజ్ఞానంతో వున్నవాడు ఖాళీగా వుండడు గనక తన కాళ్ళమీద తను నిలబడటం అనే మూడోది దానంతటదే జరుగుతుంది!ప్రభుత్వంలో వున్నవాళ్ళు ప్రజల్ని తమ బతుకులు తాము బతకగలిగేలాగ చెయ్యకుండా తమ మీద ఆధారపడి బతికేలాగ వుంచేస్తేనే కేవలం తాము చేసే మంచిపన్లకి కృతజ్ఞతగా వచ్చేసారి కూడా తమకే వోట్లు వస్తారనే నికృష్టపు తెలితేటలు చూపించడమే ఇంత చిన్నచిన్న పనులు కూడా జరగకపోవడానికి కారణం!


ఆర్ధికపరమయిన వెనుకబాటుతనం కన్నా సామాజికంగా చెయ్యని తప్పుకి అవమానించబడటం మనిషిని మరింత బాధపెడుతుంది!"ఘర్ వాపసీ!" అని హడావిడి చేస్తున్న వాళ్లని "కిస్కా ఘర్?ఘర్ కహా హై?" అని అడిగితే యేమి జవాబు చెబుతారు?మాల కులస్థులూ మాదిగ కులస్థులూ హిందూ మతంలో భాగమే,కానీ వాళ్ళకి దేవాలయ ప్రవేశం నిషేధం!చట్టం ఒకటి అఘోరించింది గాబట్టి ముఖాన తలుపెయ్యకుండా రాష్ట్రపతి స్థానంలో వున్న వాడు వచ్చినా గడప దాటి బైటికెళ్ళగానే మైల పడిపోయినట్టు శుధ్ధి తంతులు చేస్తారు!అలాంటి పనులు చెయ్యకుండా నిగ్రహంగా వుండి సాటి మనుషులుగా గుర్తిస్తే ఇక్కడున్న వాళ్ళు సంతోషంగా సామూహిక వుత్సవాల్లో పాలు పంచుకునే వాతావరణం కల్పిస్తే బయటికి వెళ్లే అవకాశం యెందుకు వుంటుంది?మతమార్పిడులు డబ్బు ఇవ్వడం వల్ల కన్నా ఇక్కడ గౌరవం లేకపోవడం వల్లనే జరిగినాయని అందరికీ తెలుసు,అయినా డబ్బుతో మార్చడాన్నే ప్రముఖంగా యెందుకు చెప్తున్నారు?ఇవ్వాళ హిందూధర్మం బలహీనపడిందనేది నిజమె,కానీ ఘర్ వాపసీ పరిష్కారం కాదు - మన ఆధ్యాత్మిక సంస్కృతి మారాలి!కన్యాశుల్కంలో బండివాడు "బ్రాహ్మల్లో కూడా మంచివాళ్ళు వుంటారన్నమాట?!" అన్నట్టు కమ్యునిష్టుల్లో వున్న కొందరు మంచివాళ్ళు హిందూధర్మం గురించి ఒక చక్కని విశ్లేషణ చేశారు.హిందూధర్మాన్ని స్వయంచాలిత గడియారంతో పోల్చారు - అంటే తనకి తనే కీ ఇచ్చుకుని నడవగలిగే లక్షణం వున్నది అని అర్ధం!ఒడిదుడుకులు హిందూధర్మానికి కొత్త కాదు.శైవులూ వైష్ణవులూ కొంతకాలం తన్నుకు చచ్చారు.పెద్దలు కల్పించుకుని హరిహర మూర్తిని సృష్టించీ శివుడు యోగముద్రలో విష్ణువుని తలుస్తాడనీ విష్ణువు యోగనిద్రలో శివుణ్ణి ధ్యానిస్తానీ కధలు కల్పించి శాంతపర్చారు!బహుశా వుదారులైన ముస్లిము ప్రభువుల పాలనలో అనుకుంటాను ముస్లిములు ప్రార్ధనా సమయంలో చదివే కల్మాని అల్లోపనిషత్తుగా సంస్కృతీకరించినదీ బ్రాహ్మణులే!మళ్ళీ తనకి తనే కీ ఇచ్చుకోవాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు, లోపాల్ని దిద్దుకోవడం ద్వారానే హిందూ ధర్మం తిరిగి తల యెత్తుకుని నిలబడుతుంది!చర్చిల్నీ మసీదుల్నీ వారి వారి మతాల వారికి అప్పజెప్పేసి హిందూ ఆలయాల్ని మాత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్వర్యంలోకి తెచ్చిన లౌకికవాద ప్రభువులు దానికి పూనుకోవాలి.సమాజంలోని మేధావులు నిర్మాణాత్మకంగా సహకరించాలి.ఈ తరం అలాంటి మౌలిక సంస్కరణల పట్ల నిర్లక్ష్యంగా వుంటే ఇక యెప్పటికీ అది సాధ్యపడక పోవచ్చు?!


హెగెల్ గతితార్కిక బావవాదం అని చెప్పినదాన్ని తిరగేసి ఆర్ధికానికి ముడిపెట్టి గతితార్కిక భౌతికవాదంగా మార్చానని చెప్పుకున్న మార్క్స్ అంతిమ లక్ష్యమైన వర్గరహిత సమాజం గురించి చెప్పడానికి వచ్చేసరికి మళ్ళీ దాన్ని తిరగేసి భావవాదపు కల్పనలతో నింపెయ్యడంతో ఆ లక్ష్యం యెంత ఆశించదగినదయినా ఇంతవరకూ భూమి మీద ఆవిర్భవించలేదు గాబట్టి యెప్పటికయినా సాధ్యపడుతుందంటే నమ్మడం కష్టం!కానీ భారతదేశానికి నేను సూచించే లక్ష్యం మాత్రం ఒకప్పుడు ఈ భూమి మీదే చాలా కాలం పాటు మనగలిగింది!ఇవ్వాళ యెందుకు చేస్తున్నామో కూడా తెలుసుకోకుండా అమరికన్ తరహా జీవనవిధానాన్ని కాపీ కొడుతున్నట్టు కాకుండా సింధు నాగరికత లోని ప్రజల జీవన విధానం నుంచి అసలైన స్పూర్తిని ఆచరణలోకి తెచ్చుకోవాలి!దానికి తోడుగా ఆర్ధిక విధానంలో మార్క్సిష్టులు చెప్పే అదనపు విలువని సమాజపరం చెయ్యడం అనే లక్ష్యాన్ని యెవరి పెత్తనమూ లేకుండానే ఒకప్పటి మనవాళ్ళు వొప్పుకుని పాటించిన దేవీభాగపు సాంప్రదాయాన్ని పాటించాలి!ఈ రెండూ సాధించగలిగితే భారత దేశం యెప్పటికీ ప్రపంచానికి ఆచార్య స్థానంలోనే నిలవడం తధ్యం!!ఒకే సారి పది అంచెల్ని వర్ణిస్తే భయసంకోచాలతో మొదటి అడుగే పడదు గనక ఇప్పుడున్న స్థితికి అతి దగ్గిరగా వున్న మెట్టుని చేరుకోవడానికి సాధించాల్సిన మూడు విషయాల్ని మాత్రమే సూచించి వొదిలేస్తున్నాను,నాలుగోది కొసరు!


నిజాని కివన్నీ మనం గొంతు చించుకుని అడగక్కర్లేదు, చట్టసభల్లో అడుగుపెట్టే రోజున వాళ్ళు చేసే ప్రమాణాల్లో వాళ్ళు వుధ్ధరిస్తామని చెప్తున్నవే. వీటిని నిక్కచ్చిగా చేస్తే అయిదేళ్ళు కాదు యాభయ్యేళ్ళయినా వాళ్లని అధికారంలో వుంచడానికి ప్రజలు వెనకాడరు?!కానీ వాస్తవ సమస్యలకి వాస్తులో పరిష్కారాల్ని వెదుక్కునేవాళ్లకి అది అర్ధం కావడం లేదు!ముహూర్తాలు చూసి మంత్రివర్గ సమావేశాలు యేర్పాటు చేసుకుంటే దారిలో వున్న ముళ్లకంపలు వాటంతటవే మాయమౌతాయా?పాతకాలం వాడైన నిజాము ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు,ప్రజలకి చదువు చెప్పించలేదు అని తప్పులు పట్టి గర్జించే అర్హత నిజంగా వీళ్ళకుందా?ఆధునికులమని చెప్పుకునే వీళ్ళ లౌకికత్వం వెల్లివిరిసే ప్రజాస్వామ్యబధ్ధమైన పరిపాలన కూడా అట్లాగే అఘోరిస్తున్నది గదా!



మంత్రాలకి చింతకాయలు రాలవు,వాస్తు వైభవాల్ని తీసుకు రాలేదు,స్వాప్నికులు యదార్ధాన్ని చూడలేరు!సృజించే శక్తి భూమికీ స్త్రీకే వుంది!పూజించి తీసుకుంటే సకల సంపదల్నీ ఇచ్చే భూమిని ఇష్టారాజ్యంగా అమ్మడం పాడుచెయ్యడం చేసేవాడిని దరిద్రం వెతుక్కుంటూ వొచ్చి కావిలించుకుంటుంది!మెప్పించి అందుకుంటే అన్ని సుఖాల్నీ ఇచ్చే స్త్రీని హింసించి ఆనందించాలనుకునేవాడు పరలోకంలో కాదు ఇక్కడే ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తాడు!యేది సత్యమో అదే శివమైనదీ అవుతుంది!యేది శివమో అదే సుందరమూ అవుతుంది!!


సత్యం శివం సుందరం!!!

Tuesday, 3 February 2015

మళ్ళీ కాంగ్రెసుకి జీవం ఆంధ్రా వాళ్ళే పోస్తారా?

            చావబోతున్న పార్టీ మళ్ళీ బుసకొడుతున్నది?క్రూరంగా విభజించి అన్యాయం చేసినందుకు కాంగ్రెసు చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రంలో సున్నాకి దించారు!యేమి లాభం ఇద్దరు స్మార్ట్ నాయుళ్ళూ తమ దివాళాకోరు రాజకీయంతో కాంగ్రెసుకి కోరలు తగిలిస్తున్నారు?!వీరంగాలు వేసేటందుకు రంగభూమిని సిధ్ధం చేస్తున్నారు,చేజేతులా ఆయుధాలు సమకూరుస్తున్నారు.భాజపా వాజపేయికాలం నాటిలా అమాయకమైన పార్టీ కాదు?!మొన్నటి యెన్నికల్లో మిగతా దేశమంతా యెట్టాగూ మోదీ హవా తో కొట్టుకొస్తాం గదా అనే ధీమాతో అనుకుంటా తను వోడిపోయినా బాబుని బలహెనుణ్ణి చెయ్యాలని మితృత్వం నటిస్తూనే తనకిచ్చిన సీట్లలో దద్దమ్మల్ని నిలబెట్టి తొండి రాజకీయం చెయ్యబోయింది.సమయానికి బాబు కళ్ళు తెరిచి ఇచ్చిన సీట్లు కూడా వెనక్కి లాక్కుని హడావిడిగా గట్టి అబ్యర్ధుల్ని నిలబెట్టడం వల్ల పరువు దక్కింది గానీ అన్ని కేసులతో సతమతమవుతున్నా ఇప్పటికీ నువ్వా నేనా అంటున్న జగన్ ఈజీగా ముఖ్యమంత్రి ఐ వుండేవాడు - కనీసం ఇంకా గట్టి పోటీ ఇచ్చి ఇవ్వాళ్టి ధీమా లేకుండా చేసేవాడు.

        ఇప్పుడు కూడా ప్రధానమంత్రి దగ్గిర్నుంచి వెంకయ్య నాయుడు వరకూ ఆంధ్రాని ఆదుకోవడం మా బాధ్యత,కాంగ్రెసు చేసినట్టు మేము చెయ్యం అంటూనే ప్రత్యేక ప్రతిపత్తి లేదని ముఖానే చెప్పేసి ఆంధ్రాకి రావలసిన నిధుల్లోనూ కోతపెట్టి మాట ఇచ్చి తప్పడం అనే ద్రోహానికి పూనుకుంది.కమలమే సకలం కావాలని ఆశించే భాజపా యే ముఖం పెట్టుకుని ఆంధ్రాకి తను మాట ఇచ్చినవి ఇవ్వకుండా వోట్లడుగుతుంది?ఆంధ్రాలో యేనాడూ సొంత బలమ లేదు!బాబు సాయం లేకుండా సొంతంగా ఒక్క సీటు కూడా రాదు?ఇప్పుడు కృష్ణాతీరం కబ్జాలో భాజపా వాళ్ళూ వున్నారని బయట పడుతున్నది.ఇలాంటి బేఖారీ గాళ్ళని చూసి యెవడూ వోటు వెయ్యడు భాజపాకి!భాజపాకి యెప్పటి నుంచి బలం పెరిగిందో అందరికీ తెలుసు?వాజపేయిని చూసీ కాంగ్రెసులో వున్నంత అవినీతి పరులు భాజపా లో లేకపోవడం వల్ల వున్నత స్థాయి రాజకీయాల్ని కోరుకునే వాళ్ళంతా అభిమానించడం వల్లనే భాజపా బలపడింది. 

              గోకరాజు లాంటివాళ్ళు పెరిగాక భాజపా ఇలాంటి వాళ్ళ అండతో అధికారం లోకి వచ్చిందా?భాజపా అధికారం లోకి వచ్చాక వీళ్ళ హవా పెరిగిందా?ప్రజలకి యేదయినా ఒకటే!భాజపా కూడా కాంగ్రెసు పధ్ధతిలోనే వెళ్తే ప్రజలకి యేపార్టీ అయినా ఒకటే అనిపిస్తే పాత పార్టీ కాంగ్రెసు మీద సానుభూతి పెరుగుతుందే తప్ప కొత్త పార్టీని కావిలించుకోరు!అలవాటుగా భాజపాకి పడతాయనుకున్న వోట్లన్నీ కాంగ్రెసుకి పడ్తాయి.ఆ ధైర్యం తోనే రఘువీరా రెడ్డి విజృంభిస్తున్నాడు!చంద్రబాబు కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని తనకి తనుగా రాబట్టలేనని తెలిసి పెట్టుబడుల కోసం అంటూ రాజధాని కట్టడం కోసం అంటూ చేస్తున్న హడావిడి జనాల్లో కష్టపడుతున్నాడనే ఇమేజి రప్పించటం వల్ల తెదెపా వోటుబ్యాంకు ప్రస్తుతానికి క్షేమంగానే వున్నా కేంద్రం నుంచి యేమాత్రం సాయం రాకపోయినా ఇంకా భాజపాని అంటకాగుతూ వుంటే తొందర్లోనే ఆ పార్టీకి కూడా గడ్డు పరిస్థితి యెదురు కావచ్చు.

           భాజపా మాత్రం కేంద్రం లో వెంకయ్య నాయుడు అట్లా చక్రం తిప్పుతూ వుండి కూడా తెదెపా నుంచి నలుగుర్ని కేంద్రమంత్రులుగా తీసుకుని కూడా ఆంధ్రాకి తను వాగ్దానం చేసినవి ఇవ్వకుండా ఆంధ్రపరదేశ్ నుంచి బలమైన ప్రాతినిధ్యాన్ని ఆశిస్తే మాత్రం అది అత్యాశే అవుతుందిభాజపా రాష్ట్రంలో ఆశిస్తున్న స్థానాన్ని కాంగ్రెసు ఆక్రమించడం ఖాయం!ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం లో ఇవ్వాళ ప్రతి ఒక్కరికీ ఈ రాష్ట్రం తమ కన్యాయం జరిగేలా విభజించబడిందనేది తెల్సు.ఇప్పుడు యెవరేమి చేస్తారు అనే విషయాన్ని వాళ్ళు ప్రశాంతంగా వుంటూనే వెయ్యి కళ్లతో యెదురు చూస్తున్నారు.వాళ్ళని మోసం చేసి నెగ్గుకు రావడం కష్టం!

              మోదీ హవా మీద అతినమ్మకం తొలగి పోయి మిత్రుల్ని కూడా మింగేసి యెదుగుదామనుకుంటున్న హజం తగ్గాలంటే డిల్లీలో వోటమి తప్పని సరి.నేను మనస్పూర్తిగా డిల్లీలో భాజపా వోటమిని కోరుకుంటున్నా!పైగా అఖరి నిమిషాల్లో బేదీని దించి యెటూ ప్రమాదకరమైన యెత్తునే వేసింది.ఆ యెత్తు వికటిస్తే గానీ కళ్లకి పట్టిన పొరలు చిరగవు?!అక్కడ గెల్చినా గెలవకపోయినా ఆంధ్రాలో కాలు మోపాలంటే మాత్రం ఆంధ్రాకి తను వాగ్దానం చేసిన ప్రత్యేక హోదానీ పన్నుల రాయితీని ఖచ్చితంగా రాష్ట్రానికి ఇవ్వాలి?!ఒకసారి లేస్తే కాంగ్రెసుని ఆపడం కష్టం?!

Saturday, 31 January 2015

ఇద్దరు బెమ్మచారులు పాలిస్తున్నారండయా మన దేశపు జనాల్ని?!

     "బ్రహ్మచారీ శతమర్కటః" అని యెందుకన్నారా అని చాలా కాలం నుంచి దురదగా వుందేది.మనకి వున్నయ్యి బాల్యము,యవ్వనము,కౌమారము,వార్ధక్యము అని నాలుగే గదా ఈ బ్రహ్మచర్యం అనేది యెలా వచ్చిందీ అని కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే చదువుకీ బ్రహ్మచర్యానికీ లింకు పెట్టారు.మామూలుగా రోజువారీ పన్లకి నోటిలెక్కలు సరిపోయేవి.కానీ ఇవ్వాల్టి వుద్యోగాల మాదిరి యేదయినా పెద్దయెత్తున పనికొచ్చేది నేర్చుకోవాలంటే మాత్రం యెవరో ఒక గురువుని పట్టుకుని ఆయన గారి ఆశ్రమమలో చేరి చదువుకుని ఆయనో కుర్రాడో ఇక చాలనుకునే వరకూ వుండి వెళ్ళేటప్పుడు గురుదక్షిణ చెల్లించి జనం మీదనో రాజుగారి మీదనో పడేవాళ్ళు!

మొట్టమొదట గురువుగారు చేసే పని యేమిటంటే తన దగ్గిర కొచ్చిన కుర్రాడికి జంఝప్పోగు తగిలించటం?అందుకే బ్రాహ్మలకే గాదు కంసాలులకీ,ఇంకా విశేషవృత్తుల వారికి కూడా జంధ్యం వుండేది!అ కాలంలో అది వేశారు అంటే కుర్రాడు వున్నతవిద్యలో వున్నట్టు లెఖ్ఖ!ఆ వీరతాడు వేసిన గురువుగారు పెట్టే ఆతి ముఖ్యమయిన కండిషను "బ్రహ్మచర్యం!" చదువుకునే వయస్సులో ఇప్పట్లాగ అమాయిలకి లైన్లెయ్యటం అస్సలు కుదరదన్న మాట?వేస్తే వీపు చీరేస్తారు,తన్ని తగిలేస్తారు,మధ్యలో బయటికెళ్తే యెందుకూ  కొరగాకుండా ఐపోతాడు?!అప్పటి వరకూ యెంత అందమైన ఆడపిల్ల కనపడినా మాతృభావన చేసి పక్కకి తప్పుకోవలసిందే,ఓరి దేవుడోయ్?!

ఆ చదువు కాస్తా పూర్తయ్యాక ప్రభుత్వోద్యోగిగానో సీనియర్ల దగ్గిర సహాయకుడిగానో కుదురుకుని పెళ్ళి చేసుకునే వరకూ మాత్రం కుర్రాడు అచ్చోసిన ఆంబోతు లాగా యెన్ని తిరుగుళ్ళయినా తిరచొచ్చు.ఈ దశలోనే కుదురు తక్కువ వాళ్ళు అప్పటిదాకా కట్టుకున్న కచ్చడాలు తొలిగిపోతాయి గనక మర్కటాల మాదిరి ఆవేశపడి పోయేవాళ్ళు?!వాస్తవానికి ఆ పెళ్ళికాని ప్రసాదులకి అప్పట్లో ప్రత్యేకమయిన పేరు లేకపోవటంతో ఆ బ్రహ్మచారి క్యాటగిరీలోనే లాగించేశారు.

ఈ దశలోని బ్రహ్మచారులు అత్యంత ప్రశస్తమైన వాళ్ళు.మళ్ళీ వీళ్లలో రకాలు కూడా వున్నాయి!"అస్ఖలిత బ్రహ్మచారులు","నిష్కళంక బ్రహ్మచారులు","ఘోటక బ్రహ్మచారులు" అనేవి ముఖ్యమైనవి. మొదటిది అప్పటికింకా స్త్రీ సాంగత్యం కుదరకపోయినా కుదిరితే ఆ బ్రహ్మచర్యాన్ని వొదిలేసే మామూలు రకం!రెండో రకం యెందుకనో పెళ్ళి పట్ల విముఖత వుండి దానితో పాటు ఆధ్యాత్మికత కూడా కలిసి పెళ్ళికీ స్తీ సాంగత్యానికీ దూరంగా వుండటం -  ఇప్పటికీ రా.కృ.మి లో కనపడుతున్నారు?మూడో రకం ప్రమాదకరమైనది - వాళ్ళు మాత్రమే  బ్రహ్మచర్యానికి అంకితమై పోవడంతో సరిపెట్టుకోకుండా మిగతా వాళ్లని కూడా ప్రభావితం చెయ్యాలని చూస్తారు?!

వీళ్లు కాకుండా "నాతి గల బ్రహ్మచారులు" మరో రకం?!పెళ్ళి చేసుకున్నాక కొంతకాలానికి జ్ఞానోదయమై అటు పూర్తిగా సన్యాసానికీ ఇటు పూర్తిగా సంసారానికీ కాకుండా కేవలం భార్యకి శృంగారపరంగా దూరంగా మాత్రం వుంటూ గృహస్థుగానే చెలామటీ అవుతూ వుంటారు - కత్తి మీద సామే అయినా తప్పదు మరి?!



ఈ నాతిగల బ్రహ్మచర్యం గురించి చెప్పాక మెల్లగా మీకూ లైటు వెలిందనుకుంటాను ఇదంతా అప్రస్తుత ప్రసంగం కాదని?!ఇవ్వాళ మననేలుతున్న వాడు నాతిగల బ్రహ్మచారి?ఇప్పుడు చాన్సు తప్పిపోయింది గానీ ఆ సీటు మా ఫామిలీదే అని ధీమాగా వున్న రాహు బాబు ఘోటక బ్రహ్మచారి!పైగా ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేకపోయినా ప్రతిపక్షంలో వున్న అతిపెద్ద పార్టీకి నాయకుడిగా వుండటం వల్ల ఇప్పుడు కూడా మనని ప్రభావితం చేస్తున్నట్టే గదా!ఇంతవరకూ తను ప్రచారం పేరుతో అడుగుపెట్టిన ప్రతి యెన్నికల్లోనూ విజయావకాశాలు వున్నచోట కూడా అపజయాన్నే తెచ్చిపెట్టటం చూసి జ్ఞాననేత్రం కొంచెం వికసించటం వల్ల కాబోలు అప్పుడప్పుడూ కాంగిరేసు వారికే ఈ బ్రహ్మచారి యేం గట్టెక్కిస్తాడు అనిపించి నాయనమ్మ పోలికల్తో వున్నఅనుంగు సోదరిని పిలుద్దామా ఆంటే ఆవిడా తన మొగుడు బంగారం మూలంగా చెడతాననో యేమో తనూ వెనకాడుతున్నాది?!ఆక్కడ మరో అసలు సిసలు నికార్సయిన మర్కటమూర్తి ఒకడున్నాడు?!అవిడ మొగుడికి నోటిదూలెక్కువై ఆత్తగారి యేలుబడిలో వున్నదని కూడా చూసుకోకుండా "ఈ దేశపు జనం అరిటి పండు రాజ్యపు వెధవలు" అనేసి అక్కడా ఒక మర్కటం వుందనిపించాడు?!పాపం భరతమాత దగ్గిరున్న ఒకే ఒక అరిటిపండు కోసం యెన్ని మర్కటాలు పోటీ పడుతున్నాయో?!



దళితేతరులు దళితులకి న్యాయం చెయ్యలేరు గాబట్టి దళిత అనుకూల ప్రభుత్వం కోరుకుంటున్నట్టు బ్రహ్మచారి సంసారులకి న్యాయం చెయ్యలేడు గాబట్టి వుద్యమం చేద్దామా అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు నాతి గల బ్రహ్మచారి నుంచి ఘోటక బ్రహ్మాచారి కిందకి వెళ్తామా అని భయంగా వుంది?!

ఆ ఘోటక బ్రహ్మచారి యేమో అమాయకంగా కాంగ్రెసుని మళ్ళీ అధికారంలోకి తెచ్చేవరకూ పెళ్ళి చేస్కోననేశాడు.ఈ లెక్కన కాంగ్రెసు మళ్ళీ లేవలెక పూర్తిగా అదృశ్యమై పోతే కాంగ్రెసుతో పాటూ గాంధీ - నెహ్రూ కుటుంబాలకి సంబంధించిన ఈ ఒకే ఒక వారసుడితో ఆ రెండు ఇంటిపేర్లూ కూడా భారత రాజకీయ రంగం నుంచి అదృశ్యమై పోతాయా?!

శుభం భూయాత్!!!
_______________________________________________________________
చిత్రములు:గూగులమ్మి!

Friday, 30 January 2015

ఈ బొబ్బిలి దొర దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాల?!

దొర తలిస్తే దెబ్బల్కి కొదవా?!నేను తలిస్తె మొత్తం తెలంగాణానె అనంతగిరి మాన్యాలు పట్టిస్త?!తెలంగాణా తెచ్చింది నేను!తెలంగాణా నాది!తెలంగానా నేను!తెలంగాణాకి సలాం జెయ్యకుంటె మెదలు విరుస్తనన్న,ఆ పచ్చ బాకా మీదియా గాణ్ణి నోరు మూయించిన,లేకుంటె నా కొదుకు మీద సొల్లు కబుర్లు రాస్తడు?కేసీఆర్ కొదుకు తప్ప్పు జేస్తడా ఆ గొట్టాం గాడు రాజయ్య లెక్క?బోడి రాజయ్య యెవడయ్య నేను జేస్తె అయ్యిండు మంత్రయినా,వుపముఖ్యమంత్రయినా!?నాలాగ తెలంగాణా తెచ్చిండా,స్వయం ప్రకాశంగ యెదిగిండా?నేను మంత్రిని జేస్తె మంత్రయినప్పుదు సమ్మగుండె!పీకినప్పుడె వచ్చింద తంట?పెతిదానికీ తనే మాట్లాడ్తడు,హెల్తు యూనివర్సిటి అంటడు,అదంటడు,ఇదంటడు - అసుంటియి మాట్లాడితె నేను మాట్లాడాల,నా కూతురు మాట్లాడాల,నా కొడుకు మాట్లాడాల,నా అల్లుదు మాట్లాడాల!గది గూడ దెలియలె ఆ దిమాగు తక్కువోంకి - నేనెందుకు పీకిన్నొ?!యెవడు బడితె వాడు దేని గురించి బడితె దాని గురించి మాట్టాడితె నా ఫ్యామిలీకి మైలేజి యెట్లొస్తది?

చెష్టు ఆస్పత్రి యెక్కడ బెడితె యేంది?ఆస్పత్రి యెక్కడుంటె అక్కడికె గద పోయెడిది.రోగమొచ్చినోని ఇంటి ముంగల బెట్టాలా యేంది?నాలుగేళ్ళు ఆగినంక అందర్నీ నా లెక్క పెద్ద ఫాం హౌసు వోనర్ని జేస్త!గప్పుదు అమెరికల వున్నా పోవొచ్చు ఆస్పత్రికి.నా ఇష్తమొచ్చిన లెక్క జేస్త నన్ను మించినోడు వొచ్చెదంక!యెన్ని మాట లిచ్చినా యెన్ని సార్లు దప్పినా యెంత జబర్దస్తుగ జేసిన!యెవడన్న గదేందని యేనాడూ అడగలె?నా అంతట నేను ముఖ్యమంత్రి నయిన్నా?అందరు జేరి నీకన్న మొగోడు లేడంటెనె గదా అయ్యింది?మరింక గిప్పుడీ సణుగుదేంది!నాకన్న మొగోడు వుంటె దీస్క రాండి నేను తప్పుకుంట?!

సమజైందా?!నేనొక్కసారె జెప్త!చెప్పింది చేసుడే?!

Tuesday, 27 January 2015

యెవరీ కాళిదాసు?యేమిటితని గొప్ప!

          తెలుగుని ఇటాలియన్ ఆఫ్ త ఈస్ట్ అంటారట!ప్రాచీనమైన దాన్ని నవీనమైన దానితో పోలిస్తే వాడు ఫలానా వారి మనవడు అని చెప్పడానికి బదులు ఆయన ఫలానా కుర్రాడి తాతగారు అని చెప్పడం కాదా?వాళ్ళు కొత్తగా తెలుసుకుని ఈ భాషేదో ఇటాలియన్ భాషలా వుంది కదా అని అనుకోవడం వరకూ ఓకే?!కానీ మనవాళ్ళు కూడా వొప్పేసుకుని సర్దుకు పోయారే అదే కొంచెం ఇబ్బందిగా వుంది.

          తెలుగు భాష లాంటిదే కాళిదాసు పరిస్థితీ,షేక్స్పేయర్ ఆఫ్ ది ఈస్ట్ అట!కానీ రచనా కాలాన్ని బట్టీ వస్తు విశేషాన్ని బట్టీ చూస్తే నక్కనీ నాకాన్నీ పోల్చినట్టు వుంటుంది పోలిక?షేక్స్పెయర్ నాటకాలు అన్నీ ఒకే మూసలో వుంటాయి - విక్టోరియా కాలం నాటి వాతావరణం లోనే నడుస్తాయి కింగ్ లియర్ అయినా హాంలెట్ అయినా రోమియో జూలియట్ అయినా.కానీ కాళిదాసు తన కధల్లోని వర్ణనలు అతనెక్కడి వాడో తేల్చలేనంత వాస్తవికంగా వున్నాయి.కుమార సంభవంలో హిమాలయాల్ని వర్ణించిన తీరు చూసి అక్కడి వాడేమో ననీ,మేఘదూత కావ్యంలో చేసిన వుజ్జయిని వర్ణనల్ని చూసి ఇతను ఖచ్చితంగా వుజ్జయిని వాడే ననీ,రఘువంశంలో కళింగ ప్రభువైన హేమాంగదుది రాజ్య వైభవాన్ని కీర్తించిన తీరు చూసి కళింగ ప్రాంతాని చెందిన వాడనీ దిగ్దంతులైన విమర్సక శిఖామణులే గందరగోళంలో పడిపోయారంటే ఆ వైవిధ్యం యెంతటి గొప్పదో గదా!

          ఇతని సాహిత్యమే తప్ప ఇతని గురించి వస్తవాలు యెవరికీ తెలియవు.లక్ష్మీ ధర్ కాలియా అనే పండితుదు మాత్రం యెన్నో వ్యయప్రాయాసల కోర్చి ఆధారాలతో అతను కాశ్మీరుకు చెందిన వాడనీ బహుశా రాజాశ్రయం కోసం అటు తిరిగీ ఇతు తిరిగీ వుజ్జయిని నగరం దగ్గిర ఆగి వుండొచ్చునని అభిప్రాయ పడ్డాడు! అప్పటి వాళ్ళకి ఒక రకమైన నిర్లక్ష్యం వుండేది తమ గురించి చెప్పుకోవదం పట్ల - నా కావ్యంలో సత్తా వుంటే అది నిలబడుతుంది,నేను చదువర్లకి యేమి చెప్పాలనుకున్నానో అది చెప్పగలిగితే చాలు గదా నేనెవరినో చెప్పుకోవాల్సిన అవసర మేమిటి అనే వుద్దేశం వల్ల కాబోలు ?చిన్న బొమ్మ గీసినా అందులో యేదో ఒక మూల "ఆర్టిస్ట్:ఫలానా" అని ఇరికించుకునే సరదా వున్నవాళ్ళకి దాని వెనక వున్న ధీమా అర్ధం కాదు!

              ఇతని కాలాన్ని మాత్రం మొదట క్రీ.శ 1వ శతాబ్దంగా భావించారు గానీ ఇప్పుడు మాత్రం అందరూ క్రీ.శ 5వ శతాబ్దం వాడని నమ్ముతున్నారు.చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా భావిస్తున్నారు.కవిత్వంలో తీసుకున్న వస్తువులూ వర్ణించిన పోలికలూ కూడా సామాన్యుల జీవితాల లోని అంశాలకి సంబంధించినవే అయి వుంటాయి.ఇతని నాటకాలు అన్నింటిలోకి "అభిజ్ఞాన శాకుంతలం" చాలా గొప్పది.దీని గొప్పదనాన్ని వర్ణించటానికి ఒక రమ్యమయిన శ్లోకం వుంది!అప్పటి విమర్సకులు ఇప్పటి లాగా రచన నంతా పీకి పాకం పెట్టి పేజీల కొద్దీ వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు గాదు,సింపుల్గా వున్నా మొత్తం కావ్యంలో వున్న గొప్పదనాన్ని విప్పిచెప్పిన తీరు అర్ధమయితే "మజ్జారే,యేమి చెప్పినాడురా!" అనిపిస్తుంది.
"కావ్యేషు నాటకం రమ్యం 
నాటకేషు శకుంతలా 
తత్రాపి చతుర్థాంకం 
తత్రశ్లోక చతుష్టయోః" అని ఒకే ఒక్క శ్లోకం?! 
మొత్తం శాకుంతలం చదివి ప్రతి శ్లోకాన్నీ అర్ధం చేసుకున్నా గూడా ఈ పాయింటు పట్టిన వాడిని మాత్రం "అధ్భుతః" అనుకోకుండా వుండలేము?

దుష్యంతుణ్ణి మరోసారి చూడటం కోసం ఆగి వెనక్కి తిరిగిన శకుంతల:రాజా రవి వర్మ!

       చతుర్ధాంకం శకుంతల గర్భవతి అని తెలిసి కణ్వుడు ఆమెని ఇక యెంతోకాలం పుట్టింట్లో వుంచడం మంచిది కాదని దుష్యంతుడి దగ్గిరకి పంపించే సన్నివేశంతో మొదలవుతుంది.ఆ నాలుగు శ్లోకాల లోనూ వరసగా సకుంతల గునగణాల్ని వర్ణిస్తూ ఆమె పెంచిన మొక్కల్నీ జింకల్నీ కూడా వీడుకోళ్ళు అడగటం,కేవలం పెంచిన కూతురైన శకుంతలని విడవలేక పోతున్న కణ్వుడు తన దుఃఖాన్ని సంసారుల దుఃఖంతో పోల్చుకోవడం,కణ్వుడు దుష్యంతుడికి విన్నపం చేసుకోవడం,కణ్వుడు శకుంతలకి హితవు చెప్పదం అధ్బుతమైన సంవిధానం!

శ్లో||పాతుం న ప్రధమం యవస్యతిజలా యుష్మాస్వపీ తేషుయా
నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహే నయా పల్లవం
అజ్యేవః కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః
సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం!
భావం:మొక్కలకి నీళ్ళు పోయకుండా తను మంచినీళ్ళు కూడా తాగేది కాదు శకుంతల.చిగురుటాకులను అలంకరించుకోవతం యెంత ఇష్టమయినా సరే తుంచేది కాదు శకుంతల.తను పెంచిన మొక్కకి పువ్వులు పూస్తే పిలల్ పుట్టినంత సంబరపడి వుత్సవం చేసేది శకుంతల.అలాంటి శకుంతల ఇవ్వాళ అత్తారింటికి వెళ్తోంది అనుజ్ఞ ఇవ్వండి!

శ్లో||యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట ముత్కంఠయా
కంఠస్తంభిత భాస్పవృత్తి కలుషశ్చింతా జదం దర్శనం
వైక్లవ్యం మమతావధీ దృస మిదం స్నేహాదరణ్యౌ కసః
పీడ్యంతే గృహిణః కధమ్నుతనయా విశ్లేష దుఃఖైర్నవై!

భావం:శకుంతల అత్తవారింటి వెళుతుందంటే కంఠం పట్టేసి మాట రావటం లేదు.కంటిలో నీరు చేస్రి చూపు కనిపించతం లేదు.చుట్టూ వున్నదంతా జడంగా కనిపిస్తున్నది.యే బంధాలూ లేని నాకే ఇంత బాధగా వుంటే గ్ర్హస్థులు ఇంకెంత బాధ పదతారో గదా?

శ్లో||అస్మాన్ సాధు విచింత్య సమ్యమధనాన్ ఉచ్చై కులంచాత్మనః
త్వైయస్యా కధమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్యించతాం
సామాన్య ప్రతిపత్తి పూర్వక మిదం దారేషు దృస్యాత్వయా
భాగ్యా యత్త మతః పరం నఖలుత ద్వాత్యం వహూబంధుభిః

భావం:మహారాజా!మునివృత్తిలో వున్న మాకు తపస్సే ధనం- అదే ఇస్తున్నా.నీ తాహతుకు తగ్గట్టు మేము ఇవ్వలేము - సిరిసంపదలు ఇవ్వలేదని మా అమ్మాయిని సాధించకు.మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళీ కాదు,మీకై మీరు ఇష్టపడి చేసుకున్న గాంధర్వ వివాహం.కనుక మా అమ్మాయి నచ్చలేదని అనకు.నీకు చాలా మంది భార్యలున్నా అందరితో పాటే సమానంగా చూడు.అందరికన్నా యెక్కువగానే చూసుకుంటాను అంటే అది శకుంతల అదృష్తం, కానీ నేను మాత్రం అలా చెప్పకూడదు!

శ్లో||శుశ్రూషస్వ గురూన్ ప్రీయసఖీ వృత్తిం సపత్నీజనే
భర్తుర్విప్ర కృతాపి రోషణతయా మాస్మం ప్రతి పంగమః
భూయిష్తం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ
యాంత్యేవం గృహిణీ పదం యువతయో వామాః కులస్యాధయః

భావం:శకుంతలా!పెద్దలకి సేవ చెయ్యి.సవతులతో స్నేహంగా వుండు.భర్త కోపించినా వెనువెంటనే రోషం తెచ్చుకోకు.సేవకుల యందు దయ గలిగి వుండు.బోగభాగ్యాలు వున్నాయి గదా అనే వుద్వేగంతో గర్వాన్ని దరిచేరనివ్వకు.ఇలా వున్నప్పుడే యువతులు గ్ర్హిణీత్వంలో శోభిల్లుతారు!

      తన నవరస భరితం బ్లాగులో ఇదివరకే రసజ్ఞ గారు కాళిదాసు కవిత్వాన్ని చాలా చక్కగా విశ్లేషించారు.సంస్కృతం నేర్చుకుని ఆ కావ్యాలని అర్ధం చేసుకుని విడమర్చి చెప్పిన రసజ్ఞ్ గారికి నా అభినందనలు!నేనూ తప్పకుండా నేర్చుకోవాలన్న హుషారు నిచ్చాయి ఆ పోష్టులు.

     ఆ సన్నివేశంలో,"నేను సన్యాసిని,అన్ని బంధాలూ వొదిలించుకున్నవాణ్ణి..నువ్వా నాకు పుట్టలేదు, కేవలం పెంచాను.అంత మాత్రానికే ఈరోజు నువ్వు వెళ్తుంటే నాకే ఇంత దుఃఖంగా వుందే,యుక్తవయస్సు వచ్చేవరకూ పెంచిన సంసారులకి ఇంకెంత దుఃఖంగా వుంటుందో గదా!" అంటాడు.అదీ అక్కడి విషయం!ప్రతీ తరంలోనూ ప్రతి కుటుంబంలోనూ అతి మామూలుగా జరిగిపోయే ఒక సున్నితమైన సన్నివేశానికి అంతే సరళంగా శాశ్వతత్వం కల్పించాడు!?సంసారుల దుఃఖాన్ని సన్యాసి చేత పలికించాడు!అనువాదం చదివిన గోధే లాంటి మాహాకవి మంత్రముగ్ధుడయ్యాడంటే అవడా మరి?భారతీయ సాహిత్యంలో మొట్టమొదటిగా యూరొపీయ భాషలోకి అనువదించబడిన సంస్కృత గ్రంధాల్లో "అభిజ్ఞాన శాకుంతలం" ఒకటి!

        కాళిదాసు సాహిత్యాన్ని పరిశీలించి పరిష్కరించి అనువదించిన విదేశీ పండితు డొకరు,"సంస్కృత సాహిత్యం మొత్తం లుప్తమై పోయి కేవలం కాళిదాసు కవిత్వం మాత్రం మిగిలినా చాలు భారతీయులు ప్రపంచ సాహిత్య వేదిక మీద నిలబడి ఇదీ మా సాహిత్యం అని చెప్పుకుంటే అప్పటికీ ప్రధమ స్థానమే దక్కుతుంది భారతీయులకి" అని అన్నాడు!

        మరో నాటకం "మాళవికాగ్నిమిత్రం" కధ ఇవ్వాళ్టికీ మొత్తం ప్రపంచ సినిమా రంగమంతటా ఫార్ములా ఐపోయిన "పతి పత్ని ఔర్ ఓ" కధలా వుంటుంది!కానీ అప్పుడు భారతీయ సాహిత్యంలో మిగతా వాళ్ళు ఇంకా రామాయణ మహాభారత కధల నుంచి విడిపోకపోవడాన్ని బట్టి చూస్తే మాత్రం ఆ కాలానికి కొత్తరకమైనదే?అగ్నిమిత్రుడనే రాజు ఒక చిత్రపటాన్ని మాత్రం చూసి మాళవికని "ప్రేమిస్తాడు!" తీరా ఆ అమ్మాయి దాసి అని తెలిసి మొదటి భార్యకి ఒక దాసీ సవతిగా రావడం ఇష్టం లేక మాళవికని తన అంతఃపురంలోనే బందీని చేస్తుంది.చివరాఖరికి ఆ అమ్మాయి కారణాంతరాల వల్ల దాసిగా వున్నా మరో రాజ్యానికి చెందిన  రాక్జకుమార్తె అని తెలియడంతో సుఖాంత మవుతుంది.మరో నాటకం "విక్రమోర్వశీయం" అయితే మిల్స్ అండ్ బూన్ వాళ్ళ మూస అయిన "బాయ్ మీట్స్ గర్ల్" కధ లాంటిది - కాకపోతే మనుష్య లోకానికి సంబంధించిన విక్రముడికి దేవలోకానికి సంబంధించిన వూర్వశికి లింకు కలిపాడు.ఇప్పటికీ ప్రపంచ సాహిత్యంలో పుట్టిన ప్రేమకధ లన్నింటిలో గొప్పగా నిలబడగలిగిన శక్తి వున్న కావ్యం.

        పైన ఒక మాటని అక్కర్లేకపోయినా కొటేషను మార్కుల్లో పెట్టాను,యెందుకంటే ఆ మాటతో చక్కిలిగింతలు పెట్టే ఒక చిన్నప్పటి జోకు గుర్తొచ్చింది.గోదాదేవి కధ తెలుసుగా,ఒక తెలుగు మాష్టారు ఆ కధ చెప్పి పిల్లల్ని ప్రశ్లలడుగుతున్నాడు!మళ్ళీ ఆ కధని పిల్లలతో చెప్పించాలని చూస్తే అప్పటికే మన పిల్లలకి సినిమాల వల్ల పెరిగిన లోకజ్ఞానంతో భక్తి,ఆరాధన లాంటి లాంటి గంభీరమయిన మాటలు నోరు తిరక్క ఒక కుర్రాడు "రంగనాధుడూ గోదాదేవీ పేవించుకున్నారు?!" అనే మాటని వాడేసరికి గురువుగారికి "యెందుకీ వెధవలకి ఈ కధ యెక్కించాలనుకున్నానుస్మీ?!" అనేటంత విరక్తి కలిగింది?యెంత విరక్తి పుట్టినా తనకున్న పవరు ప్రకారం కుర్రాడి వీపు విమానం మోత మోగించడం మాత్రం మర్చిపోలేదులెండి!రంగనాధుదూ గోదాదేవీ పేవించుకోవడం అనే దృశ్యం తన కళ్లముందు నుంచి మాయమయ్యేదాకా కుర్రాడి వీపు మీద తబలా వాయించేశాడు "పేవించుకున్నారు అంటావా, అంటావా, అంటావా?" అని!

  ఇతని "మేఘసందేశం","ఋతుసంహారం" అనే కావ్యాలు రెండూ మరింత ప్రత్యెకమైనవి - విషయాన్ని బట్టి చూస్తే అతి విలక్షణమైనవి.మనకి మామూలుగా యెవరయినా యేదయినా గొప్ప కావ్యం రాసినా గొప్ప సినిమా తీసినా అలాంటిదే మనమూ తీసి మనమూ అంతటివాళ్ళం అనిపించుకోవాలనే దురద వుంటుంది.ఒక వసుచరిత్ర కావ్యం మోత మోగించగానే పది పిల్ల వసుచరిత్రలు వచ్చేశాయి!ఒక సినిమాలో యేదో ఒక అంశం వల్ల హిట్టయితే అదే వరసలో పది సినిమాలు వస్తున్నాయి.కానీ ఆ రెండు కావ్యాలలో వున్న విషయాన్ని మాత్రం కాపీ కొట్టడానికి యెవరూ సాహసించలేక పోయారు!ఒకటి అందమైన విరహప్రేమతో ముడిపెట్టిన మొదటి ట్రావేలాగ్ లిటరేచర్!రెండోది కధ యేమీ లేకుండా మన చుట్టూ మనకి యెలియకుండానే మారిపోతున్న ఋతువుల్లో మనకి కనిపించే అతి మామూలు దృశ్యాల్ని కొత్తగా వర్ణించి అందంగా చెప్పడం!

        మొదట్లో వాల్మీకి రామాయణంలో కవిత్వాన్ని శేషేంద్ర గారి ద్వారా కొన్ని విని నాకు ఒక అనుమానం వచ్చింది - ఇంత గొప్పగా వుపమాలంకారాన్ని వాడిన వాల్మీకిని వొదిలేసి "వుపమా కాళిదాసస్య" అని యెందుకన్నారా అని?ఋతుసంహారం లోని కొన్ని పద్యాలు చదివాక తెలిసింది ఆ మాట అతనికే తగినదని!పత్రికల్లో ఋతుసంహారానికి అనువాదమైన పద్యాలు చదివాను.యెండాకాలంలో జంతువులు నీడకి చేరి నాలికలు చాపి రొప్పుతూ వుండటాన్ని కూడా మర్చిపోలేని విధంగా వర్ణిస్తాడు.కాళిదాసు ఋతుసంహారం పూర్తిగా చదివి అర్ధం చేసుకోగలిగితే ఆ తర్వాత రుతువులన్నీ మనకి మరింత అందంగా కనబదతాయని నా నమ్మకం.మేఘసందేశం తెలుగు అనువాదం చదివాను.నేను చెన్నపట్నంలో వున్నాను అది మాతృనగరంలో వుంది!ఈసారి వెళ్ళినప్పుదు వెతికి దొరికితే తప్పకుండా ఇక్కడ వుంచుతాను?రామగిరి నుంచి అలకాపురి వరకూ దారిని వర్ణించడం యెంత గొప్పగా చేశాడంటే ఇవ్వాళ్టి గూగుల్ మ్యాపుని పట్టుకున్నా దారి తప్పిపోవచ్చునేమో గానీ ఆ వివరాలు పట్టుకుని వెళ్తే యెంత మొద్దావతారమైనా తేలిగ్గా గమ్యాన్ని చేరుకోవచ్చుననేటంత వివరంగా చెప్తాడు!అలకాపురి అనేది కల్పిత ప్రదేశమే అయినా అదొక వాస్తవం అని భ్రమించేటంత విపులంగా వర్ణించాడు ఆ నగరాన్ని - తన ప్రియురాలు యెక్కడ వుందో ఖచ్చితంగా మనం మన బంధువుల చిరునామా చెప్పినంత స్పష్టంగా రూపు కట్టించాడు!

        ఇంతటి ప్రతిభాశాలి గనకనే ఇతన్ని పొగడటానికి కూడా విమర్శకులు అందమైన కవిత్వాన్నే వాడారు!ఒకసారి సాక్షాత్త్తూ సరస్వతీ దేవిని యెదురుగా వుంచి సాహిత్యాన్ని తూచాలనుకున్నారు పండితులు కొందరు?!ఒక వైపు దండి,భవభూతి లాంటి వాళ్ళ కావ్యాలు వుంచారు,మరొక వైపు ఒక్క కాళిదాసు కవిత్వమే వుంచారు.త్రాసు మెల్ల మెల్లగా వేరే వైపుకి దిగి కాళిదాసు కవిత్వం తేలిపోతుంటే మధ్యవర్తిగా వుండాల్సిన వాణి తన కచ్చపీ నాదపు మాధుర్యంలో వేలి కొసని ముంచి కాళిదాసు కవిత్వం మీద ఒక బొట్టుని రాల్చిందట - దాంతో త్రాసు కాళిదాసు కవిత్వం వైపుకే మొగ్గింది!అంటే కాళిదాసు కవిత్వం ఇతరుల కవిత్వం ముందు తేలిపోవడం సరస్వతీ దేవి కూడా భరించలేకపోయిందని విమర్సకుడి భావం అన్నమాట!

        కాళిదాసు అనగానే మొదట్లో కూర్చున్న కొమ్మని నరుకుతూ కనబడి అత్యంత నాటకీయంగా ఒక రాకుమారిని పెళ్ళాడి ఆవిడ ప్రోద్బలంతో నాలిక మీద కాళిక బీజాక్షరాలు రాయగానే సాహితీ విశారదుడైన కధే అన్ని భాషల్లోనూ సినిమాలు గా కూడా వొచ్చింది!కానీ అది కేవలం కల్పన!యేదో అప్పుడప్పుడూ కొంచెం చందోబద్ధమైన ఒక పదో పదిహేనో సీసపద్యాలు రాయడానికే నాకింత కష్టంగా వుంటే అంత చక్కని భాష యే గురువు దగ్గిరా యేమీ నేర్వకుండానే హఠాత్తుగా వొచ్చేస్తుందా యెవరికయినా?ఐన్ స్టీన్ అనే మహా మేధావి వుడకబెట్టటానికి గుడ్డుకి బదులుగా తన రిస్ట్ వాచీని మరిగే నీళ్ళలో వొదిలాడంటే అంత తెలివి తక్కువ పని మనం చెయ్యము గనక అతనిలా సాపేక్ష సిధ్ధాంతం లాంటివి మనం సృజించలేమని తెలిసినా సరదాగా నవ్వుకుంటాం కదా!బహుశా అలాంటి ఆప్యాయత ఇలాంటి కధలలో వుండటం వల్లనే కాబోలు మిగతా విషయాల్లో హేతువుకి ప్రాధాన్యత నిచ్చే వారు కూడా తాము అభిమానించే వారిని గురించిన అందమైన కల్పనల్ని స్వాగతిస్తారు?

     కాళిదాస కవి కూడా అందరి వలెనే విద్యాభ్యాసం ద్వారానే తన ప్రతిభని మెరుగు పర్చుకుని వుండవచ్చు.అతనికీ ఇతర కవులైన దండి,భవభూతి లాంటి వాళ్లతో ప్రజ్ఞావైరం కూడా వుండి వుండవచ్చు.ఈ ముగ్గురితో ముడిపడిన మరొక కధలో ఆ కధా రచయిత అన్యాపదేశంగా చెప్పదలచింది అదేనేమో?


        ఒకసారి తనని మిగతా కవులు సరయిన రీతిలో గుర్తించడం లేదని కాళిదాసుకే ఆగ్రహం పుట్టి అందరికీ తను వుపాసించే కాళికా దేవితోనే చెప్పిస్తానని పిల్చాడు.అందరూ వచ్చాక దేవిని ప్రార్ధించి ప్రశ్న అడిగాడు.మూలవిరాట్టు నుంచి "కవిర్దండిః కవిర్దండిః భవభూతిస్తు పండితః" అని వినపడింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం.అసలు అడిగిందే తను అయితే తన గురించి చెప్పలేదని చిరాకు పుట్టి "కోహం రండే?" అని గద్దించగానే "త్వమేవాహం త్వమేవాహం న సంశయః" అని వినబడేసరికి ఎవరికి తోచిన అర్ధం వాళ్ళు తీసుకుని దేవికి నమస్కరించారు!మిగతా వాళ్లకి నువ్వు నా అంతటివాడివి అని కాళిదాసుని పొగిడినట్టూ కాళిదాసుకి నువ్వూ నాలాగే రండవే అని అన్నట్టూ అర్ధమయింది?!



నెదర్లాండ్ లోని ఒక భవనం పైన సంస్కృత శ్లోకం?!

        యెప్పటికయినా కాళిదాసు కవిత్వాన్ని సొంతంగా చదివి అర్ధం చేసుకోవడానికయినా సంస్కృతం నేర్చుకోవాలి, కుదురుతుందో లేదో?!విదేశీయులు యెప్పుడో చదివారు,మనం ఇప్పుడైనా చదవకపోతే యెట్లా!?మన పెద్దవాళ్ళు "ఆనందో బ్రహ్మా,బ్రహ్మేతి వ్యజానాత్" అన్నారు!ఆనందమే బ్రహ్మ అయి ఆ బ్రహ్మ నుంచే సమస్తం జన్మించిందని.కాళిదాసు ఋతుసంహారం ఒక్కటి చదివి మన చుట్టూ మారుతున్న ఋతువుల్ని కొత్తగా చూస్తూ ఆనందంగా గడిపి ఆ ఆనందంలోనే అంతమై పోవడం కన్నా మనిషి కోరుకోదగిన దేమిటి?

(కొన్ని చోట్ల వస్తుగుణ సహాయం చేసిన మిత్రులకి _/\_)

Monday, 26 January 2015

కట్టబ్రహ్మన మనవాడే!బోధిధర్ముడు మనవాడే!చెయ్యెత్తి జైకొట్టు ఆంధ్రుడా?!జైకొట్టి నిద్రపో అమాయకుడా!?

పాంచాల కురిచ్చి నుంచి వీరపాండ్య కట్తబ్రహ్మన "నారు పోశావా?నీరు ఇచ్చావా?యెందుకు కట్టాలిరా శిస్తు?" అని హుంకరించి తిరగబడిన పోరాటమే ఆంగ్లేయుల మీద భారతీయులు జరిపిన సమరాల్లో మొట్టమొదటిది!అయితే ఆ వీరుడి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్ల్లాలోని కందుకూరు ప్రాంతం నుంచి విజయనగర రాజ్యం కాలంలో వలస వెళ్ళిన వాళ్ళనేది కూడా తెలుసుకుంటే అతడు మనకి బంధువే కదా అని గర్వంగా వుండదా!

క్రీ.శ 440 నాటి బోధిధర్ముడు పల్లవ రాజు - ఈ పల్లవులు తెలుగు రాజులు!స్థానిక ప్రభువులుగా తమిళ నాడులో వున్న రాజ వంశాలు మూడే - పాండ్య,చేర,చోళ వంశాలు మాత్రమే ప్రాచీన తమిళ కావ్యాల్లో ప్రముఖంగా కీర్తించబడ్డాయి.బోధిధర్ముడి గురించి చెప్పే యే గ్రంధమైనా అతడు పల్లవుడే అని చెప్తున్నది!1959లో తెలుగు భాషా సమితి ప్రచురించిన విజ్ఞాన సర్వస్వంలో పల్లవులు తెలుగు వారే అని ఆధారాలను ప్రకటించారు.ఇక్ష్వాకుల తర్వాత,అంటే క్రీ.శ 300 నుంచి క్రీ.శ 600 వరకూ తొలి పల్లవులు తెలుగునేలను పరిపాలించారు.

కుమార విష్ణువు అనే అతను కాంచీనగరాన్ని గ్రహించినట్టు వేలూరుపాళెయం శిలాఫలకాలు తెలియజేస్తున్నాయి?ఆంజనేయుడికి తన శక్తి తనకి తెలియనట్టు ఆంధ్రులకి తమవన్నీ యెదటివాళ్ళకి ధారపోసి అమాయకంగా నిలబడటం అలవాటయిపోయింది గనకనే శ్రమించి పెంచిన సంపదని కూడా దోపిడీ అని వదరుబోతులు ఇల్లెక్కి కప్పెక్కి కూస్తుంటే "సాక్ష్యాలు చూపించి మాట్లాడు బే!" అని దబాయించే కన్నపు దొంగలకి వుండేపాటి కనీసపు క్షాత్రం కూడా లేకుండా నిజమే నని ఒప్పుకుని ఇవ్వాళ  వుద్యోగులకి జీతాలివ్వలేని దుస్థితిలో తమ కిచ్చిన హామీలని ఇచ్చిన వాళ్లే వెక్కిరిస్తున్నా చేతులు నలుపుకుంటూ రాజధాని కూడా లేకుండా నిలబడ్డారు?!! 

ఇవ్వాళ "వారెవ్వా!నీ సృష్టి అద్భుతం,నీ వ్యాపార దక్షత మాకు కావాలి" అని వాళ్ళ ముఖ్యమంత్రే పొగుడుతున్నవాణ్ణి కూడా దోపిడీదారుగా ముద్రవేసి లక్ష నాగళ్లతో దాన్ని దున్నిస్తుంటే చూడాలని కలలు గన్న పైశాచిక ప్రవృత్తి గలవాళ్ళు మీరు పెంచిన సంపదలో ఒక్క నయాపైసా కూడా ఇవ్వం,మీరు మాత్రం ఇక్కడ వుండటానికి వీల్లేదు అని అంటుంటే జవాబు చెప్పలేక నీళ్ళు నమిలారు.ఇవ్వాళ నిజంగా అన్యాయానికి గురయి కూడా ప్రశాంతంగా వుందగలుగుతున్నారు,యేమి సౌజన్యం?!తెలంగాణాలో ఇతరులు భూములు కొనగూదదని పెద్దమనుషుల వొప్పందంలో వుంది,కొన్నా సరే అది తప్పే అని నాతో వాదించిన మేధావులు ఆ ముక్క వాళ్ళ ముఖ్యమంత్రికి చెప్పరేమి?అబధ్ధాలతో,నాకిది ఇస్తే నీకది ఇస్తాననే పార్టీల విలీనం లాంటి నీచకృత్యాలతో చెలరేగి తమకి ద్రోహం చేసిన వాళ్ళు యేదో ఘనకార్యం సాధించినట్టు పొంగి పోతుంటే తప్పు చేసిన వాళ్లలా తలదించుకుని కుంగిపోతున్నారు,యేమి సౌమనస్యం?!కోళ్ళపందేలకి వొచ్చినవాళ్ళు "తెలంగాణా నాది,నెల్లూరు నాది,చిత్తూరు నాది" అంటుంటే "మరి హైదరాబాదు మాది కాదన్నారేం" అని అడగాలని అక్కడ లేని నాకనిపించింది గానీ అక్కడున్న వాళ్ళు మాత్రం ప్రజల్లో ఆత్మీయతలు ఇంకా మిగిలాయని చంకలు గుద్దుకున్నారు,యేమి సౌహార్ద్రం?!

ఆ అవమానాలూ ఈ దుర్భర స్థితీ చుట్టూ యేమి జరుగుతందో తెల్సుకోకుండా చరిత్రలో అసలు యేం జరిగిందో తెలుసుకోకుండా మట్టిబుర్రల్లా వుండటం వల్లనే అని ఇప్పటికయినా తెలుసుకుంటే మరోసారి - ఇక్కడ ప్రతిపక్షమే లేదు గాబట్టి మనకి తిరుగు లేదు,నెక్స్తు యెలక్షన్ల కల్లా తెలంగాణాని కూడా చంకలో ఇరికించుకుందాం అని కలలు గంటున్న రెండుకళ్ళ సిధ్ధాంతి - ముందు కేంద్రం నుంచి నిక్కచ్చిగా నిధులూ హోదా తెచ్చుకోవటం మానేసి రాజధాని కోసం అంటూ భూసమీకరణ పేరుతో రైతులకి చట్టపరమయిన రక్షణలు కూడా లేకుండా లాక్కుంటూ చేస్తున్న మోసాన్ని పసికట్టగలుగుతారు!లేదంటే మరోసారి ఇక భవిష్యత్తులో గొప్పగా చెప్పుకోవటానికి యేదీ మిగలకుండా మోసపోతారు.

వాళ్ళ దుర్మార్గం అట్లా వుంచితే,రాష్ట్రాన్ని విభజించే పని ఒక పదో తరగతి కుర్రాడికి అప్పజెప్పినా ఇంతకన్నా చక్కగా ఆ పని చేసి వుండేవాడు,ఈ అన్యాయానికి కారణం కేంద్రంలోనూ రాష్త్రంలోనూ అధికారంలో వుండి కూడా ఇంత దరిద్రంగా విదగొట్టిన తమ పార్టీయే అని తెలియకనే ఇవ్వాళ లఘుశంకవీరుడు అంత ఆవేశం ప్రదర్శిస్తున్నాడా?నిజంగానే ఆ గర్జనలకి పొంగిపోయి ప్రజలు అతనికీ అతని పార్టీకీ బ్రహ్మరధం పడతారా?చచ్చిన గాంగ్రీను పార్టీని మళ్ళీ నతికిస్తారా?దూరంగా వున్న చెత్తని మళ్ళీ తెచ్చి తల మీద రుద్దుకుంటారా?ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం విజ్ఞత యేమిటో చూడాలి?!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...