Wednesday, 6 March 2019

కేసీయార్ మరియు కేటీయార్ అనే సుందోపసుందులకు మైండు పని చేస్తున్నదా లేదా?

కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు మాకూ మా ప్రాంతానికీ ఆంధ్రోళ్ళు అన్యాయం చేశారని యేడ్చి అధికారం తెచ్చుకున్నవాళ్ళు మీ యేడుపు మీరు యేడ్చే పని మానేసి ఇంకా ఆంధ్రా మీద పడి యేడవటానికి సిగ్గూ శరం మానం అభిమానం ఏమీ లేవా?

చంద్రబాబు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు "పొరుగు రాష్ట్రం వాడికి ఇక్కడేం పని?" అని కూసిన మీరు ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఆంధ్రా వ్యవహారంలో తల దూరుస్తున్నారు?

దావోస్ పర్యటనలో కాళ్లరిగేలా తిరిగి నోరు నొప్పెట్టేలా అరిచి ఏమీ పీకలేక దాని గురించి చెప్పుకోవటం కూడా మానేసిన జూనియరు కూడా సీనియారిటీ చూసుకోకుండా రెచ్చిపోతున్నాడు - ఏంటి, వొళ్ళెలా వుంది?

దమ్ము ఉంటే ఇక్కడి కొచ్చి ప్రచారం చేసి ఆంధ్రాలో ఎన్ని సీట్లు గెల్చుకోగలవో  తేల్చుకోవడానికి బదులు గల్లీ లెవెల్ చీప్ ట్రిక్స్ ప్లే చెయ్యడానికి సిగ్గు వెయ్యడం లేదా?

ఏ రాస్ట్ర ప్రభుత్వం యొక్క డాటా చోరీకి గురయితే ఆ రాస్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలనీ దాని గురించి ఏ చర్య తీస్కోవాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వమే చెయ్యాలనే కామన్ సెన్సు కూడా లేదా తండ్రీ కొడుకు లిద్దర్లో ఏ ఒక్కడికీ - నాలుగేళ్ళ పైన అధికారంలో ఉండి చట్టానికి సంబంధించిన కనీస పరిజ్ఞానం కూడా లేదా మీకు?ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చెయ్యాల్సిన పని మీరు చెయ్యాల్సిన అవసరం ఏమిటి?

రోహింగ్యా ముస్లిముల వల్ల మన దేశానికి ముప్పు ఉందని తెలిసినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం చేసింది?మీ రాష్ట్రం నిర్వహించిన పరీక్షల క్వశ్చెన్ పేఅర్లు వేరే రాష్ట్రంలో లీకయితే ఆ రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు మీరు చేసినట్టు మీ రాష్ట్రప్రభుత్వం మీద కేసు పెట్టిందా?పెట్టి ఉంటే మీకెలా ఉండేది!

ఇన్ని రోజులూ మీరూ ఆంధ్ర గజదొంగన్ కలిసి మా రాష్ట్రప్రభుతపు డేటా చోరీకి గురయిందని అంత హడావిడి ఎట్లా చేశారో!ఇప్పుడు ఆంధ్రా డేటా పక్కా సేఫ్ అని తేలిపోయింది.ఇప్పుడు అసలు చోరీకి గురైనది టీడీపీ పార్టీకి సంబంధించిన ప్రైవేట్ డాటా అని తేలాక అసలు మీరు ఎవర్ని ముందు పెట్టి డ్రామా ఆడాల్నుకున్నారో ఆ కంత్రీ "అవును!ఆ ఘనకార్యం మేమే చేశాం!అక్రమంగా చేర్చిన టీడీపీ అనుకూల వోట్లని తీసేయించాలని పోరాడుతున్నాం" అని కొత్త క్యామెడీ మొదలు పెట్టాడు,ఇంక మీరు ఏ క్యామెడీ స్టేట్మెంట్ ఇస్తారో చూసి నవ్వుకోవడమే మిగిలింది ఈ ఆంధ్ర డేటా చోరీ కేసులో!

కేసు ఏ క్లైమాక్సుకి వస్తుందో అందరికీ తెలిసిపోయింది, మీ చదువుకున్న తెలివిలేమితనం తెలంగాణ పోలీసులు  ఉద్యోగుల చేత తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారన్న విషయం బయటపడినప్పుడే తెలిసిపోయింది:-)

మీరు ఆంధ్రలో గేం ఆడటానికి ఎంచుకున్న పావు ఎంత బలహీనమైనదో తెలుస్తున్నదా మీకు!నిన్న గాక మొన్న "ఇంకేముంది అన్ని ఉద్యోగాలూ కమ్మవాళ్ళకే ఇచ్చేసుకున్నారు,కాపు కులానికి అన్యాయం జరిగింది!" అని బిల్డప్ ఇచ్చాడు తన సొంత మీడియాలో ఈ బుజ్జాయి పబ్లిక్ డయాస్ మీద పేర్లు చెప్పి నా శత్రువులని ప్రకటించిన మీడియా రంగంలోకి దిగి లెక్క తీసి అక్కడ ఉన్న కమ్మకులస్థులు ఇద్దరే ఇద్దరని చూపించాక టెంకిజెల్ల తిన్న స్కూలుపిల్లాడిలా సైలెంట్ అయిపోయాడు.ఎక్కడో ఓక మారుమూల పల్లెటూళ్ళో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే సరాసరి చంద్రబాబే వెళ్ళి అతని కడుపులో కత్తి గుచ్చి చంపేసినంత స్థాయిలో ఆందోళన చహెశాడు.చంద్రబాబు తారాబలం బాగుండి అసలు "జరిగిన కధ!" వీడియో బైటికి రావడంతో అవాక్కయ్యాడు!

ఇప్పుడే ఇట్లా ఉన్నాడు, ఆ మనిషి అధికారంలోకి వచ్చాక ఇంకెన్ని పిచ్చిపన్లు చేస్తాడో అని ఆంధ్ర జనం హడిలి చస్తున్నట్టున్నారు ఇప్పటికే!మీరూ మోదీ కలిసి గాలి కొట్టిన కొద్దీ ఉబ్బిపోయి ఇలాంటి ఎదవ ప్లాన్లు వేస్తా ఉంటే ఆంధ్రా జనం "I KNOW WHAT YU DID LAST SUMMER!","WHAT LIES BENEATH" లాంటి హర్రర్ సినిమాలన్నీ ఓకేసారి చూసినట్టు మరింత భయపడిపోయి బాబుని మరింత మెజార్టీతో గెలిపించటం ఖాయం!మీరుముగ్గురూ వేసిన వేస్తున్న ప్లానులన్నీ బూమరాంగ్ అవటం చూస్తుంటే చంద్రబాబుకు అదృష్టం కూడా తోడైనట్టు ఉంది - జగన్ మీద అనవసరపు ఆశల్ని పెట్టుకుని చిల్లరపనులు చేసి ఎన్నికల తర్వాత నవ్వులపాలు కాకుండా ఉండటం కోసమైనా తండ్రీ కొడుకులు కొంత నిదానించితే బాగుంటుందనేది నా ఉచిత బోడి సలహా!

ఆంధ్ర వోటర్లు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుని ఉంటారు - ఇవ్వాళ ఆంధ్ర ప్రజలు రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో కాంగ్రెసు పార్టీకి భారీ మెజార్టీని చేకూర్చడం తెలివైన పని అనేది నా మనసులోని మాట!

16 comments:

  1. జగన్ బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయం చూస్తూ ఉండు

    ReplyDelete
    Replies
    1. ఎట్లా వస్తాడు!ఏమిటి మీ ధైర్యం?

      ఒకసారి అధికారంలోకి వచ్చి కారణాంతరాల్ వల్ల ఓడిపోయినా మళ్ళీ ఎన్నికల్లో నిల్బడినప్పుడు ఇదివరకు తను అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచిపనులు చెప్పుకునే అవకాశం ఉంటుంది.మీరు బహుశా "బాబు ఓకసారి గెలిస్తే రెండోసారి ఓడిపోతాడు!", "బాబు ఒంటరిగా పోటీ చేసినప్పుడల్లా ఓడిపోయాడు!", "జగన్ ముఖ్యమంత్రి అవుతాడని జ్యోతిష్కులు చెప్తున్నారు", "కాపుల కోసం రెండు మూడు సార్లు అల్లరి చేశాం కాబట్టి వాళ్ళ వోట్లన్నీ మాకే పడతాయి" అని జగన్ పార్టీవాళ్ళు చెప్పుకునే సొంత గొప్పల్ని తప్ప ఇతర విషయాల్ని మీరు పట్టించుకోవటం లేదనుకుంటాను.

      చంద్రబాబు మొదటిసారి అధికారంలోకి ఎలా వచ్చాడో మీకూ తెలుసు.ఇప్పటికీ ప్రజల్లో అభిమానం ఉన్న రామారావు మీద ఆ రోజున తిరుగుబాటు చేసి "వెన్నుపోటు దారు" అనే ముద్రతోనే నిలబడ్డాడు, అవునా కాదా?సాక్షాత్తూ రామారవు కొడుకులే తండ్రిని వదిలి బావ పక్కనే నిలబడ్డారు.ఇవ్వాళ వంకలు పెడుతున్న పెద్దల్లుడు కూడా అప్పుడు చంద్రబాబు పక్కనే ఉన్నాడు కదా!

      అవినీతి రాహిత్యాన్నీ ,బంధుప్రీతి వైమనశ్యాన్నీ ఎవరు పాటించారు?గాంధీ అతీతుడా?నెహ్రూ పవిత్రుడా?వీటిని పక్కన పెడితే అధికారంలోకి రావడంలోనూ సాక్షాత్తూ రామారావు నల్లబట్టల యుద్ధం చేస్తున్నా మౌనంగా ఉండిపోయి అధికారాన్ని నిలబెట్టుకోవడంలోనూ తన సమర్ధత చూపించాడు చంద్రబాబు!రాజశేఖర రెడ్డి పావురాల గుట్ట దగ్గిర చావకుండా ఉండి ఉంటే సంవత్సరం దాటేలోపు కేసీయారునీ తెరాసానీ తెలంగాణ ఉద్యమాన్నీ అంతకుముందు నక్సలైట్లని పాతిపెట్టినట్టు పాతిపెట్టి ఉండేవాడు.అలాంటి రాజశేఖర రెడ్డిని తట్టుకుని పార్టీని ఎంత గట్టిగా నిలబెట్టాడు? అలాంటి సమర్ధత విషయంలో జగన్ చంద్రబాబు కాలిగోటికి కూడా సరిపోడు,అవునా కాదా?

      ఇదివరకు తను చేసిన పనుల్ని చెప్పుకునే అవకాశం చంద్రబాబుకి ఉంది కానీ జగనుకి లేదు.అలాంటప్పుడు జనం అతన్ని యెలా నమ్మాలి?అధికారంలోకి రావడానికి అతను చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లో ఆ నమ్మకాన్ని కలించే విధంగా ఉన్నాయా?తొలినాటి తండ్రి సంతకాల సేకరణ నుంచి నిన్నటి రైతు ఆత్మహత్యని ఉపయోగించుకోవటం వరకు ఏ సన్నివేశంలో సక్సెస్ అయ్యాడు?

      ఇప్పటి డాటా చోరీ గొదచలో మొదట నమోదైన అభియోగం ఏమిటి?వైకాపా వోటర్ల వివరాల్ని tamper చేశారని.ఇప్పుడు రివర్స్ అయేసరికి ఫారం ఏడు పేరుతో మాట మార్చేశాడు, ఇదేనా సమర్ధత అంటే?

      మనం దాడి చేస్తే ప్రతికక్షులు కంగారు పడితే అది మన సమర్ధత అవుతుంది గానీ ప్లాన్ రివర్స్ కాగానే మొదట తత్తరపడి మాట మార్చి తర్వాత తేలు కుట్టిన దొంగలా సైలెంట్ అయిపోవడం ఏ విధమైన సమర్ధతయో మీకే తెలియాలి.

      నేను జగన్ని అవినీతి గురించి వ్యతిరేకించడం లేదు,అసమర్ధతని గురించి మాత్రమే వ్యతిరేకిస్తున్నాను.రేపు అతను సమర్ధవంతంగా పరిపాలిస్తాడు అని జనం నమ్మే స్థాయిలో సమర్ధతని ప్రదర్శించిన ఒక్క సన్నివేశాన్ని చూపించండి!

      ఇప్పుడున్న పరిస్తితిలో జగన్ ఆంధ్రా ముఖ్యమంత్రి కాగలిగితే ఆంధ్రా వోటర్లు తెలంగాణ వోటర్ల కన్న పదిరెట్లు ఎర్రిపప్పలని తేలిపోద్ది!

      Delete
    2. లాస్ట్ పంచ్ అదిరింది!!!

      Delete
    3. >>ఇప్పుడున్న పరిస్తితిలో జగన్ ఆంధ్రా ముఖ్యమంత్రి కాగలిగితే ఆంధ్రా వోటర్లు తెలంగాణ వోటర్ల కన్న పదిరెట్లు ఎర్రిపప్పలని తేలిపోద్ది!>>

      ఇలా ఎలా అనగలిగారు ? చంద్రబాబు గారేవైనా దేవుడా నిత్యం కొలుచుకుని ఆరాధించడానికి ? తెలంగాణా వారిలాగా ఆంధ్రులు నియంతృత్వాన్ని కోరుకోరు. వై ఎస్ అర్ పీ ఎందుకు రావాలో ఇదాప్రపంచం బ్లాగర్ ఒక విషయం చెప్పారు. ప్రత్యేక హోదా కోసమయితే వై ఎస్ ఆర్ పీ గెలిచినా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఓటు వేయొచ్చు అని అన్నారు. ఇటు బీజేపీ తోనూ, కేసీఆర్ తోనూ సఖ్యతగానే ఉంటున్నారు అనేది వారి వాదన. అవినీతిని పట్టించుకోను అసమర్ధతే పట్టించుకుంటాను అని మీరు అనడం ఏవిటీ ? అసమర్ధుడు రాజ్యమేలినా ప్రభుత్వంలో అధికారులు అప్రమత్తతతో ఉండవచ్చు కానీ అవినీతిని ఎలా అడ్డుకుంటారు?

      Delete
    4. ప్రస్తుత పరిస్థుతులలో తమ ఓట్లు ఉన్నాయో లేవో అన్న గందరగోళంలో ఉన్న ఆంధ్రా ఓటర్లని అవమానించేలా మాట్లాడకండి. ఆంధ్రాలో ఎన్నికలకోసం దేశం అంతా ఆసక్తిగా చూస్తున్నది. గెలవడమూ, ఓడడం కాదు ఆడడం ముఖ్యం కదా ? తెలంగాణాలో పోటీ అన్నదే లేదు. కేసీఆర్ పంచిన గొర్రెల్లా తలూపడం మీకు నచ్చుతుందా ? తెలివైన ప్యత్యర్ధి లేకపోతే బాహుబలి సినిమా ఆసక్తిగా చూసేవారా ? ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలబడ్డవాడే హీరో ! ప్రేక్షకులను వెర్రిబాగులోళ్ళనడం నాకు నచ్చలేదు.

      Delete
    5. ఏమిటి బాబు సమర్థత్యా. ఐదేళ్లలో కనకదుర్గ ఫ్లైఓవర్ కట్టాలేకపోయాడు.

      Delete
    6. @neehaarika
      అవినీతిని పట్టించుకోను అసమర్ధతే పట్టించుకుంటాను అని మీరు అనడం ఏవిటీ ?

      hari.S.babu
      నేను అన్నది ఒక్క జగన్ విషయంలోనే!ఎందుకంటే, అతని మీద కేసులు ఉండటం అనేది అది అతన్ని అవినీతికి సింబల్ అనిపిస్తున్నది.కానీ, అవి నిరూపణ కాలేదు గాబట్టి వాటిని పదే పదే రిపీట్ చేసినందువల్ల ఏ ఉపయోగమూ ఉండదు అనే అర్ధంలో అన్నాను.particular caeseని బట్టి ఇచ్చిన స్టేట్మెంటుని generalaize చెయ్యకూడదు.కంఫ్యూజన్ ఉంది గాబట్టి క్లారిటీ ఇస్తున్నాను.ఇది పెద్ద ఇస్యూ కాదు, సరేనా?

      Delete
    7. kanakadurga flyover kattalsindi centre, state govt already land acquisition chesi icchindi. centre nunchi funds release avvaka construction company chetuletti koorchundi. idi kuda teleekunda vimarsalu enti mashtaaru.

      Delete
    8. @neehaarika
      ప్రస్తుత పరిస్థుతులలో తమ ఓట్లు ఉన్నాయో లేవో అన్న గందరగోళంలో ఉన్న ఆంధ్రా ఓటర్లని అవమానించేలా మాట్లాడకండి...... ప్రేక్షకులను వెర్రిబాగులోళ్ళనడం నాకు నచ్చలేదు.

      hari.S.babu
      ఇప్పుడే జర్నలిస్ట్ సాయి గారి యూట్యూబ్ వీడియో చూశాను - ఈయన చంద్రబాబు అయిదంచెల వ్యూహం అని లెక్కలు వేసి చెప్తున్నదాన్నే KN చానెల్ నాగేశ్వర రావు గారు కూడా చెప్పారు.ఆయన వీడియో ఇదివరకే చూశాను.చూస్తే ప్లాను గట్టిగానే ఉంది.మరి నా బ్లాగు దగ్గిరా సోషల్ మీడియాలోనూ "ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, ఈసారి బాబు అవుట్!" అనే మాటలు ఎందుకొచ్చాయో తెలియడం లేదు.

      సాయి గారిదే బాబు మీద కేసీయార్ పగ పట్టడానికి కారణాలని చెప్పిన వీడియో కూడా ఇప్పుడే చూశాను.దాని ప్రకారం వోటుకు నోటు కేసు అనేది చంద్రబాబు కేసీయార్ ప్రభుత్వాన్ని పడగొట్టటానికి వేసిన ప్లానుని ఆఖరి నిముషంలో కనిపెట్టి దాన్ని బూమరాంగ్ చెయ్యటం.

      నిన్నటి రోజున తెలంగాణలో బాబు రంగప్రవేశం కూడా మాంఛి పకడ్బందీ ప్లానుతోనే జరిగింది.ఇప్పుడు బాబు మీద ఆరోపిస్తున్న "ప్రతిపక్షం వోట్లని తీసేయించటం" లాంటి క్రూరమైన పనితో పాటు ఒక బక్కోని మీదకి ఇంతమంది వస్తరా అనే సెంటిమెంటు కలిసి 108 మంత్రంతో జియ్యర్ స్వామి గారి ఆశీసులూ కలవకపోయి ఉంటే కేసీయార్ అవమానకరమైన ఓటమిని ఎదుర్కుని ఉండేవాడని తెలుస్తున్నది.

      మా వెలమ కులస్తులకి రోషం చాలా ఎక్కువ.అలాంటప్పుడు తనని తొక్కెయ్యాలని చూస్తున్న బాబు పట్ల కేసీయార్ అలా కాకుండా ఇంకెలా రియాక్ట్ అవుతాడు?కానీ కధని ఇక్కణ్ణుంచే మొదలుపెడితే బాబు విలన్ లాగే కనిపిస్తాడు. కానీ ఆంధ్రాకి కొంత వెసులుబాటు కల్పించే విభజన బిల్లుకి సంబంధించిన మెలికల్ని పరిష్కరించుకోవడానికి ముందుకు రాని కేసీయార్ తనకి కావల్సిన హైకోర్టును గురించి పట్టుపట్టటాన్ని మర్చిపోగలమా?

      విభజన బిల్లులో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడం వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుందా?తనకి ఒక్క రూపాయి కూడా నష్తం రానప్పుడు ఆంధ్రాకి ఒక్క రూపాయి కూడా వెళ్ళకూడదు అనే ఉద్దేశం తప్ప విభజన బిల్లు సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా ముందుకు రాకపోవటానికి ఇంకొక కారణాన్ని తెరాసా అభిమానులే కాదు సాక్షాత్తూ కేసీయార్ అయినా చెప్పగలడా?

      కేటీయార్ పార్లమెంటు ఎన్నికల వ్యూహం విన్నాను.మొత్తం 16 సీట్లూ గెల్చుకుంటే కేంద్రంతో బేరసారాలు జరిపి లాభపడవచ్చునని చెప్తున్నాడు.తెలంగాణ ప్రజలకు అది మంచిదే!కానీ, ఆంధ్రాలో చంద్రబాబుని వోడించటం అనేది తెలంగాణ ప్రజల సౌభాగ్యం కోసం కాదు,

      తెలంగాణ ప్రజలు పొరుగు రాష్ట్ర ప్రజల పట్ల న్యాయంగా ఆలోచించాలి.తమ ముఖ్యమంత్రి తమకు మేలు చేస్తున్నాడు గాబట్టి అతను పొరుగు రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేస్తూ రాజకీయంగా ఎదగాలనుకోవడాన్ని సమర్ధించకూడదు!కేసీయారులో వెలమ కులస్థులలో చాలా ప్రముఖంగా కనిపించే ఒక లక్షణం కొంచెం కూడా లేదు - హుందాతనం!అతని భాషలో గయ్యాళితనమే ఎక్కువ.కొంచెం కష్టమైనాఅతనికి హుందాతనం నేర్పండి!

      ఇప్పుడు జగన్ తీసుకున్న ఫారం ఏడు దెబ్బతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇరుకున పడి తెలంగాణ డాటా కూడా చోరీకి గురైంది అనే బిల్డప్ ఇస్తున్నది.అంటే, మా డాటా కూడా చోరీకి గురయింది కాబట్టి మేం కలగజేసుకున్న్నాం.అది అబద్ధం అని తేలిపోయింది బట్టి మేమిక కలగజేసుకోం అని సైలెంట్ అయిపోతుంది.ఎలెక్షన్లు పెట్టుకుని బాబు కూడా వోటుకు నోటు కేసులో పారిపోకుండా ఇప్పుడు దాడి చేస్తున్నాడు, చెయ్యాలి, చెయ్యటం సరైన వ్యూహమే!అభాసు పాలయ్యేది ఎవరు?డ్యామీజీ పూర్తిగా జగనుకే!

      చంద్రబాబు కూడా తన ప్రాభవం కోసమే ఎత్తులు వేస్తున్నప్పటికీ అందులో ఆంధ్రప్రజల భవిష్యత్తు ముడిపడిఉంది!ఎన్నికల తర్వాత కూడా ఆంధ్రాకి ప్రత్యేక హోదా దక్కాలన్నా విభజన బిల్లు పూర్తి రూపంలో అమలు కావాలన్నా ఆంధ్రాలో చంద్రబాబు మరింత బలపడటం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడటం చాలా అవసరం అనేది ఆంధ్ర వోటర్లు గుర్తుంచుకోవాలి!పుల్వామా ప్రతీకార దేశభక్తి ప్రదక్షిణల్ని చూసి ముగ్ధులైపోయి ఇక్కడ బాబుని గెలిపించి అక్కడ మోదీని గెలిపించుదాం అని మొహమాట పడినా రాష్ట్రం "అవశేషం"గా మిగిలిపోతుంది!

      Delete
    9. kanakadurga flyover kattalsindi centre correcte. mari polavaram kattalsindi kuda centre kada? mari dabbulu ivvakapoyina polavaram kadutu janalni tiranaluga enduku tippurunaru? aa kharchuto ilantivi enni kattepano kada mashtaru? miru chadivaro ledo ipudu a flyover may lopala kattestam ani prakatincharu. adedo munde chesivundavachu kada?

      Delete
    10. I saw his videos about operation garuda also.

      At that time so many people, including myself laughed at him.It is not his fault.He did not produced any evidences and that too is pardonable, as he himself told it is confidential.But later events proved his theory had some base!

      Of course later events are not completely matched with his theory - but I think it was because the parties deviated from their original plan to be sate.But now, He came up with full evidences and playing tactfull.Even journalist sai acceped the truthfulness of shivaji!

      I am writing a post myself covering all these in historical order by disssecting validity of this conspiracy theory!

      Delete
    11. @Anonymous,

      kanakadurga flyover, polavaram rendu cheyalsindi centre ye. kani cheyyatledu. entaki nidulu release avvakapotunte ika state govt ye chestondi. kani renditi paristiti veru. flyover complete avvakapote janalu diversion route lo ibbandi padataru, kani polavaram fast ga complete avvakapote chala samasya. ippatike late ayyi Rehabilation & Resettlemen (R&R) package tadisi mopedu ayyindi. 2013 lo chesina kotta land acquisition act prakaram ye project ki aina R&R bhariga perigindi. YSR time lo cheppinatte polavaram project start chesi vunte, leni project ki kalavalu tavvakunda, cheyyalsina reetilo first R&R settle chesi vunte ippati karchulo one third tho poyedi. appudu idi complete cheyyaka, kotta act prakaram bhariga perigindi. centre di em poyindi inka saaga deestundi, eppatikaina chestam wait cheyyandi ani. desam mottam mida national projects yeppudu start ayyi ye stitlo vunnayo okasari pariseelinchandi. centre funds release cheyyaledani manam kurchunte R&R settlement, prices anni inka perigi eppatiki complete avvadu. adi AP ki chala avasaram ippudu, krishna delta lo agriculture godvari water tho stabilize cheyyalanna, krishna water seema ki ivvalanna, uttarandra industries ki water supply ki aina annitiki adi keelakam. anduke chestunnaru.

      kanakadura fly over chusinanni rojulu chusi, centre ki ivvalasina funds iche vuddesam ledani confirm ayyaka ippudu teeskuntunnaru. centre vodilesindi kada ani state vodileyyaledu kana janaalni ibbandi padandi ani. paiga ekkuvamandi janaalaki edi centre project, edi state project teliyadaaya, anduku paina mi question example. centre project edaina valla dwarane cheyinchela anni attempts chesi kudaraka pote appudu state teeskuntundi. polavaram ala aage vishayam kadu. time gadichekoddi R&R package exponential ga perugutundi.

      Delete

  2. రోహింగ్యా ముస్లిముల వల్ల మన దేశానికి ముప్పు ఉందని తెలిసినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం చేసింది?మీ రాష్ట్రం నిర్వహించిన పరీక్షల క్వశ్చెన్ పేఅర్లు వేరే రాష్ట్రంలో లీకయితే ఆ రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు మీరు చేసినట్టు మీ రాష్ట్రప్రభుత్వం మీద కేసు పెట్టిందా?పెట్టి ఉంటే మీకెలా ఉండేది!
    Valid Point !

    ReplyDelete
  3. Everything is fine, but never talked about Ashok, why is he hiding

    ReplyDelete
    Replies
    1. He might have feared about TLN Govt!

      It is quite natural, you know?It is a common sense that police first approach the amnagement of the company before taking the employees of that company, and Why they Did it in that way?

      When You are in the position of ashok and you suspect conspiracy from the govt itself who has to protect it's citizens We could justify asohk very easily!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...