ఏరుల జన్మం శూరుల జన్మం అన్నట్టుగానే రాజకీయ నాయకుల జననం కూడా పుట్టుకతోనే మొదలు కాదు.రాజకీయాల్లో ఇవ్వాళ యే స్థానంలో ఉన్న నాయకుడైనా అతనికి యవ్వనం నుంచీ రాజకీయాలంటే ఆసక్తి ఉండి ఏదో ఒక రాజకీయ పార్టీలో సామాన్య కార్యకర్తగా నమోదు కావడంతోనే మొదలవుతుంది.అయితే, ఇలాంటి అనామక జీవితం గడిపే కోటానుకోట్ల కార్యకర్తల మధ్య నుంచి పదిమందికీ పరిచయమయ్యే తొలి సన్నివేశం నుంచి ఒక నాయకుడి జీవితాన్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది.
అట్లా చూస్తే "నవ తెలంగాణ నిర్మాత" అనే ఇవ్వాళ్టి దుర్నిరీక్ష్య శక్తి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనే 65 సంవత్సరాల వ్యక్తి యొక్క తొలినాటి ముద్దు పేరు "దుబాయ్ శేఖర్"!అది సా.శ 1980ల నాటి ముచ్చట - పాస్‌పోర్ట్ కన్సల్టెన్సీ అనేది గౌరవప్రదమైన వ్యవహారమే కానీ, చాలామంది బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్ళాలనుకునే వారికి సహాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ అక్రమార్జనకు ఉపయోగించుకునేవారు - ఇతను కూడా అలాంటివారిలోనే ఒకడు, ఆ ముద్దుపేరే అందుకు సాక్ష్యం!
కాంగ్రెసులో తాలూకా స్థాయి నాయకత్వం వెలగబెడుతున్నప్పుడే ఒక దొంగనోట్ల కేసులో ఇరుక్కున్నాడు.ఇప్పుడు జగన్ మాదిరే కోర్టుల్లో ఉన్న వాయిదా పద్ధతిని ఉపయోగించుకుని సాగదీస్తూ సాగదీస్తూ కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుని బయటపడాలని ప్రయత్నించాడు గానీ పార్టీ వైపునుంచి సహకారం రాలేదు.సహజంగా ఏ పార్టీ అయినా పార్టీకి లాభం అనుకున్న పైస్థాయి వ్యక్తులకు ఇలాంటి లోపాయకారీ సహాయాలు చేస్తుంది గానీ కింది స్థాయి వ్యక్తుల కోసం ముందుకు రాదు.దాంతో, సమయానికి చెలరేగిన తెలుగుదేశం అవిర్భావ ప్రభంజనంలో అవకాశం చూసుకుని దూకేశాడు.అది 1983 నాటి తొలి గోడదూకుడు సన్నివేశం!
తెలుగుదేశం అధికారంలోకి రావటంతో రామారావు ప్రాపకం సంపాదించి దొంగనోట్ల కేసునుంచి బయటపడి తేరతిండికి అలవాటు పడిన కక్కుర్తి చావక దుబాయ్ శేఖర్ అవతారం ఎత్తాడు! ఆ కాలంలో అతను చేసిన ఘనకార్యం ఏమిటీ అంటే, ఒంటరి మహిళలకి వివాహిత మహిళపేరున పత్రాలు పుట్టించి దుబాయికి వెళ్ళే ఏర్పాట్లు చెయ్యటం, ఒక్కో క్లయింటు నుంచీ లక్షల్లో ఉంటుంది ఆదాయం - అది అక్రమ రవాణా కాబట్టి అక్కడ వాళ్ళకి ఏమన్నా తేడా వచ్చినా ఇతని పూచీ ఉండదు,తన సంపాదనకి మాత్రం ఏ ఢోకా ఉండదు.డబ్బు కోసం ఇంత నీచమైన పని చెయ్యటానికి కూడా సిగ్గుపడని ఇతను ఒక రాష్ట్ర్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే అది ఆ ప్రజల దురదృష్టం అయినా అవ్వాలి,లేదంటే ఆ ప్రజలు కూడా ఇంత నీచమైన వాళ్ళే అవ్వాలి!
2008లో New York Timesకి చెందిన Jim Yardley అనే అతని చేత "A politician who went hungry to redraw India's map." అని గుర్తించబడిన తన సహజసిద్ధమైన ఆకలితో ఉన్న ఇతను నవజాత శిశువైన తెలుగు దేశం పార్టీకి రాజకీయ పునాదిని బలపర్చటం కోసం శిక్షణా తరగతులను నిర్వహించి రామారావు చంద్రబాబుల అభిమానం చూరగొని 1994లో రవాణా శాఖ మరియు అటవీ శాఖల్ని తీసుకుని మంత్రి పదవిని దక్కించుకున్నాడు."ఒక్కసారి మంత్రిని చెయ్యి గణనాధా!" అన్నట్టు ఆ ఒక్కసారి చేసిన నిర్వాకం వల్ల తిరిగి 1999 నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వటానికి భయపడి కుల సమీకరణల సమతౌల్యం కోసం ఇతని బదులు విజయ రామారావును మంత్రివర్గంలోకి తీసుకున్నారు!తర్వాత ఆలోచించుకుని ఇతన్ని పూర్తిగా అవమానించలేక స్పీకర్ పదవి ఇచ్చినప్పటికీ అది పాప్యులారిటీ ఇవ్వని సంపాదనకు తావులేని కంచిగరుడసేవ కావడంతో ఇతనే 2001లో రాజీనామా చేసి అప్పటికే నక్సలైట్లు మొదలుపెట్టిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోకి దూకాడు.
ప్రపంచంలో తమ జాతికీ ప్రాంతానికీ అన్యాయం జరిగిందని చెప్తూ అత్యంత బలహీనమైన స్థాయిలో మొదలై ఉద్యమకారుల రుజువర్తనతోనూ ఉత్తేజభరితమైన ప్రసంగాలతోనూ విజయం సాధించిన ఎన్నో ఉద్యమాలకి భిన్నమైన శైలిలో "ఆంధ్రా గోంగూర గోబ్యాక్!" అనే ద్వేషప్రలాపాలతో తెలంగాణ ఉద్యమం నడవటానికి ప్రధాన కారణం డబ్బు కోసం ఏ గడ్డయినా తినటానికీ గెలుపు కోసం ఏ అడ్డదారినైనా తొక్కటానికీ అలవాటు పడిన తమ నాయకుడి సంస్కారలేమినే అనుచరులు కూడా అలవాటు చేసుకోవటమే అని చెప్పాలి.ఇప్పటికీ ఆంధ్రావాళ్ళకి ఉన్న బాకీల్ని ఎగ్గొట్టేస్తూ గట్టిగా నిలదీస్తే "ఏంరో ఆంధ్రోడా!ఓళ్ళెలా వుంది?" అనే బెదిరింపులు నడుస్తున్నాయంటే కేసీయారు తన నీచత్వాన్ని తెలంగాణ ప్రజల మనస్తత్వంలోకి ఎంత లోతున దించాడో అర్ధం చేసుకోవచ్చును.!
తన రాష్ట్రపు సమస్యల్ని గాలికొదిలేసి పొరుగురాష్ట్రపు గొడవల్లో తల దూరుస్తున్నా ప్రజలు వ్యతిరేకించకపోవడం అతని పట్ల ఉన్న భయం వల్ల అని నేను అనుకోవడం లేదు - సామాన్య ప్రజలు భయపడ్డారంటే అర్ధం ఉంది, నిన్న గాక మొన్న అంత వీరత్వం ప్రదర్శించిన ఉద్యమవీరులు కూడా భయపడుతున్నారంటే నాకు నమ్మకం కలగడం లేదు.మనస్సులో ఏ మూలనో అతని పట్ల మొహమాటమో అభిమానమో సానుకూలతయో అతని ప్రభావం నుంచి బయటపదలేని అంతర్గత బలహీనతయో లేకుండా ఇంత స్థాయిలో అర్ధాంగీకారం లాంటి మౌనం అసాధ్యం!
అలా 2001లో తెరాస స్థాపించి హడావిడి చేసిన కేసీయార్ 2004లో కేంద్రమంత్రి అయ్యాడు.తను కేంద్రంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన రెండేళ్ళలో తెలంగాణ ఉద్యమం కోసం చేసింది ఏమీ లేదు గానీ తన కక్కుర్తి ప్రకారం సహారా ఇండియాతో ఒప్పందమూ ఈయస్సై కుంభకోణమూ లాంటి డబ్బులు వెనకేసుకునే ఉద్యమంలో మాత్రం ముందున్నాడు!2006లో బైటికి రావటానికి తను కాంగ్రెసువాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని నిర్లక్ష్యం చెయ్యటం అని చెప్పుకున్నప్పటికీ తన శాఖకి సంబంధించిన అవినీతి గబ్బు పెరిగి పెరిగి ఇంకా చూరు పట్టుకుని వేలాడితే తన్నించుకుని రావాల్సి వస్తుందని తెలియటమే కారణం.
కేంద్రంతో తెగదెంపులు చేసుకుని బైటికి వచ్చాక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు - అంటే, ప్రైవేటుగా వ్యాపారస్తుల్నీ పారిశ్రామికాధిపతుల్నీ సినిమారంగానికి సంబంధించిన ప్రముఖవ్యక్తుల్నీ బ్లాక్ మెయిల్ చెయ్యటమూ పబ్లిక్ డయాస్ మీద ఏకంగా అశుద్ధం తిని మాట్లాడుతున్నాడనిపించే నీచభాషని తను మాట్లాడి ఇతర్లని కూడా ప్రోత్సహించటం అన్నమాట - ఈ నీచత్వంలో తమకీ వాటా ఉందన్న మొహమాటం వల్లనే ఇవ్వాళ ఉద్యమవీరులు కేసీయారుని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చెయ్యలేకపోవటానికి కారణం అని నా నమ్మకం!
ఇక 2007 నాటి చరిత్రకి వెళ్తే - బహుశా,తమని బ్లేం చేస్తూ విడిపోవటం వల్ల కాంగ్రెసు పని చేసిందో దానంతటది బయటపడిందో గానీ తన దుబాయ్ శేఖర్ అవతారం నాటి భాగోతం ఇప్పుడు బయటపడింది! అయితే మిగిలినవాళ్ళ కన్న తెలివైనవాడు గనక ముందు తనే చొరవ చూపించి ఆలె నరేంద్ర లాంటి వాళ్ళని బలిపెట్టి తను తప్పుకున్నాడు.దెబ్బ తిన్నాక ఆరోపణలు చేస్తే ఎవరు పట్టించుకుంటారు? అవి నిరాధారమైన ఆరోపణల కింద కొట్టుకుపోయాయి - అవతలి వాళ్ళూ పులుగడిగిన ముత్యాలు కాదు గదా!
పార్టీలోని ప్రత్యర్ధుల్ని దెబ్బతీసిన తన చురుకుదనాన్ని చూసి తను కూడా సంతోషపడలేని అత్యంత భయానకమైన దశ అది - రాజశేఖర రెడ్డి కొడుతున్న వరస దెబ్బలకి విలవిలలాడి వలవల విలపిస్తూ వేదనలో శోధనలో అంతర్మధనలో గడిచిన నిస్సహాయమైన కాలం!చివరికి అద్భుతమైన ఎత్తుగడ అని పార్టీవాళ్ళని నమ్మించి చట్టసభల్లో ఉన్న అందర్నీ రాజీనామాలు చెయ్యమని ఆదేశించాడు - తెలుగు, ఇంగ్లీషు,ఉర్దూ పడుగుపేకల అనర్గళమైన ప్రసంగాలతో ప్రజల్ని ఉర్రూతలూగించి అంతకు రెట్టింపు మెజార్టీ సాధించగలననే ధీమాతో!కానీ అది బెడిసికొట్టి కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక వూడినట్టు అంతకు ముదరి 16 స్థానాలకి 7 మాత్రమే దక్కటంతో తెల్లమొహం వెయ్యాల్సి వచ్చింది.
మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు రాజశేఖర రెడ్డి దెబ్బల్ని తప్పించుకోవడానికని తనకి రెండవసారి మంత్రిపదవి దక్కకపోవటానికి కారణమని ఫీలవుతున్న చంద్రబాబుతో కలిసి పోటీ చేసిన 2009 ఎన్నికల్లో ఫలితం full wash out!శతకోటి ఆశలతో స్థాపించి పదేళ్ళు కూడా పూర్తి కాకుండానే తెరాస పార్టీ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, కేసీయార్ రాజకీయ జీవితం శూన్యమైపోయిన పరిస్థితి - నిజంగా హృదయమున్న ప్రతి వ్యక్తికీ కడుపు తరుక్కుపోయి పగవాళ్ళకి కూడా కోరుకోకూడనంత పెద్ద కష్టమే. పులి మీద పుట్రలా ఉద్యమాన్ని స్పాన్సర్ చేసిన కాంట్రాక్టర్లు నష్టంతో వెనక్కి తగ్గడానికి ఏమాత్రం ఇష్టపడక ఏదో ఒక ఎత్తు వేసి ఫలితం చూపించమని ఒత్తిడి పెడుతున్నారు, ఎత్తులు వేయాల్సిన కీలకమైన పావు ఖాళీ మందు గ్లాసులా అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది - సదాజపా, ఏమిటి శాయడం?కేసీయార్ పరిస్థితి "అంతా భ్రాంతియేనా?ఆశా నిరాశేనా!జీవితాన పవరింతేనా?మిగిలిందీ మాజీ బతుకేనా!" అన్నట్టు, తయారైంది.
నిజానికి, అప్పుడు గనక రాజశేఖర రెడ్డి చచ్చిపోకుండా ఉంటే కొద్ది నెలల తర్వాత ఉద్యమాన్ని స్పాన్సర్ చేసినవాళ్ళు బాకీల కింద కేసీయారు ఆస్తుల్ని లాక్కుని నడిరోడ్డు మీద నిలబెట్టటంతో పాటు కేసీయారు బ్యాచ్చి బ్లాక్ మెయిల్సుకి బలయిన వ్యాపారవేత్తలూ పారిశ్రామికాధిపతులూ అందర్నీ ఫుట్ బాల్ ఆడుకునేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం, కాంగ్రెసులో చెలరేగిన గందరగోళం కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టు కేసీయారుకి పునర్జన్మని ప్రసాదించింది!
September 2009లో రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు, December 9, 2009 నాటికి గొట్టాలతో సెలైన్ ఎక్కించుకుంటున్న భీబత్సమయిన నిరాహార దీక్షతో హడావిడి చేసి చిదంబరంతో కేంద్రం చొరవ చూపించి సమైక్య రాష్ట్ర అసంబ్లీలో బల నిరూపణతో పని లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెయ్యడానికి ప్రకటన చేయించుకున్నాడంటే ప్రజల్ని మోసం చేసి తను అనుకున్నది సాధించడంలో అతను ఎంత గుండెలు తీసిన బంటో అర్ధం చేసుకోవచ్చును - అంత బేఖారీ క్యామెడీ సన్నివేశంతో విషాదాన్ని పండించటంలో తెర వెనక ఉన్న కాంట్రాక్టర్ల పక్కన నిలబడి we dicide, you follow అంటున్న మీడియా మొగల్సు యొక్క చాతుర్యం చాలా ఉంది సుమా!
అదీ గాక, అసెంబ్లీకి తగినంత మంది ఎమ్మెల్యేల్ని పంపించే స్థాయిలో తెలంగాణ సామాన్య ప్రజానీకం వేర్పాటుని సమర్ధించకపోయినా అప్పటికే కేసీయార్ బ్యాచ్చి రెండు ప్రాంతాల్లోనూ విద్యావంతులూ మేధావులూ రాజకీయ విశ్లేషకుల మధ్య ఆవేశకావేషాలను రెచ్చగొట్టి ఉన్నారు,అటు చూస్తే ఉద్యమానికి పెట్టుబడి పెట్టిన వాళ్ళు అంతర్యుద్ధం సృష్టించటానికి కూడా వెనుకాడని మొండితనంతో ఉన్నారనేది పైస్థాయిలో జరుగుతున్న నాటకీయమైన సన్నివేశాల్ని దగ్గరినుంచి గమనిస్తున్న ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకుడికీ తెలుసు.
సొంత బలం గురించి తెలియని రోజుల్లో తెరాసని కాంగ్రెసులో విలీనం చేస్తానని వాగ్దానం చేసి సొంత బలం తగినంత పెరిగిందని తెలిశాక గతిలేక స్వతంత్రం ఇచ్చిన ఇంగ్లీషొడి లాంటి కాంగ్రెసుతో పోరాడి తెచ్చుకున్న గాంధీలాంటి తెరాస ఎట్లా కలుస్తుందనే వింత లాజిక్కుతో కాంగ్రెసుకి జెల్లకొట్టడం నుంచి దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తనే ముఖ్యమంత్రి కావడం వరకు కధ అతి వేగంగా నడిచింది - ఇది చరిత్ర కుండబద్దలు కొట్టి చెప్తున్న కేసీయార్ గతం!
"తెలంగాణను గాలికొదిలేసి.. ఏపీతో లొల్లేందీ..?" అని అడుగుతున్న వీరయ్య గారి ప్రశ్నకి జవాబు లేదు. ఇదే వీరయ్య గారు బడ్జెట్ గురించి "కేసీఆర్ ఎందుకు దాచిపెడుతున్నారు?" అని ఒక ప్రశ్నని మనకి వేసి తనే కేసీయార్ అధ్వర్యంలో ప్రభుత్వమే ప్రజల్ని ఎట్లా దోచుకుంటున్నదో కళ్ళకి కట్టినట్టు వివరించారు.మిషన్ భగీరధని ఒక కార్పొరేట్ సంస్థ తరహాలో డిజైన్ చేశారు.అంటే, దానికి కావలసిన మొత్తం నిధులు ప్రభుత్వం పన్నుల ద్వారా సేకరించిన నికరమైన ఆదాయం నుంచి ఇవ్వదు. బయటనుంచి సమకూర్చుకుని పని చెయ్యాలి.ఆ నిధుల సేకరణ వడ్డీకి తీసుకునే ఋణాలుగా కూడా ఉండవచ్చు.ఇది నేను చెప్తున్నది కాదు,వీరయ్య గారు చెప్తున్నదే.ముఖ్యమంత్రియే మిషన్ భగీరధ కోసం కేంద్రాన్ని 12000 కోట్లు ఋణం అడుగుతున్నాడు.ఆ అప్పు తీర్చడం కోసం అవసరమైన ప్రతి రూపాయినీ ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తానని కేంద్రానికి హామీ కూడా ఇచ్చేశాడట!
మిషన్ భగీరధ సక్సెస్ అయితే ఆ కీర్తి కేసీయారుకి దక్కుతుంది.మరి, ఫెయిలయితే?ఫెయిల్ కావడం అంటే అప్పుల పాలు కావడం అని అర్ధం!ఆ సంస్థ చేసిన అప్పుల్ని ఎవరు తీర్చాలి?అక్కడ ఉన్నవాళ్ళు యజమానులు కాదు కదా, కేవలం ఉద్యోగులు!చచ్చినట్టు ప్రభుత్వమే తీర్చాలి.అంటే, పన్నుల ద్వారా వెళ్తున్న అధికారికమైన ఆదాయం నుంచి ప్రజలు తీర్చాలి.ఇదీ కేసీయార్ ఆవిష్కరిస్తున్న బంగారు తెలంగాణ!
ఇదే అనుకుంటే నీటి పారుదల ప్రాకెక్టుల్ని పూర్తి చెయ్యడానికి కేంద్రం నుంచి తీసుకుంటున్న నలభై వేల కోట్ల అప్పుని కూడా ప్రజల నుంచే వసూలు చేస్తాడట - అమ్మతోడు, కేంద్రానికి రాసిన లేఖలో ఇదీ ఉంది!నిజానికి, తెలంగాణ ప్రజల అజ్ఞానం, అమాయకత్వం, నిస్సహాయతలను గురించి పూర్తి పరిజ్ఞానం ఉన్న కేసీయార్ తప్ప ఇంత ఘాతుకానికి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ సాహసించి ఉండడు - ఎందుకంటే, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం అనేది పన్నుల ద్వారా వచ్చే ఆదాయం నుంచి మిగులూ తరుగూ చూసుకుని తీర్చాల్సినవీ తెచ్చుకున్నవీ ఐన అప్పుల్ని మినహాయించి కేటాయింపులు చేస్తే గానీ సాధ్యపడని వ్యవహారం!ఈ అనాలిసిస్ చేస్తున్న వీరయ్య గారికే కాదు,వింటున్న నాకూ గుండె గుభేలు మనేసింది - తెలంగాణ లోని కొందరు అమాయకత్వం ఎక్కువై కేసీయారు మాటలు నమ్మి మనల్ని తిట్టారని మనలాంటి తెలంగాణ ప్రజలు కష్టాలు పడుతుంటే పైశాచికానందం పొందే జై గొట్టిముక్కలని కాదు గదా!
వేర్పాటులోని తమ రహస్య లాభాల కోసం ప్రత్యేక తెలంగాణను కోరుకున్న కాంట్రాక్టర్లు తెలంగాణ ప్రజల మీద కసిబూని వదిలిన మాయల మరాఠీ కేసీయార్.కేసీయారుని మాయల మరాఠీతో పోల్చడం కేసీయారుకి కాదు - మాయల మరాఠీకే అవమానం!ఎందుకంటే, బాలనాగమ్మని మోహించక ముందరి మాయల మరాఠీ అత్యంత ప్రతిభావంతుడైన సంగీత కళాకారుడు, నిజమైన రసికత గలిగిన సౌందర్య పిపాసి, చావుని జయించగలిగిన మహాజ్ఞాని.కానీ కేసీయార్ గతమూ నీచమైనదే,వర్తమానమూ నీచమైనదే - ఆగతం కూడా నీచమైనదే!
కొన్నిసార్లు ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ప్రజాకర్షణలో అఖండ ప్రజ్ఞ కలిగిన నందమూరి తారక రామారావు సైతం ఒక దశలో భారతదేశం గురించి ఆలోచన చేసి వెనక్కి తగ్గాడు - జాతీయ స్థాయి నేతలతో మిత్రబృందాన్ని ఏర్పాటు చేసుకుని సరిపెట్టుకున్నాడు!అంతటి ఆకర్షణ లేని తను సభ్యుల సంఖ్య కూడా తగ్గిపోయిన ఇప్పుడు ఏమి సాధించాలనుకుని వెళ్తున్నాడో దాన్ని ఎట్లా సాధించగలనని అనుకుంటున్నాడో నాకు అర్ధం కావటం లేదు!
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టిన ప్రాంతీయ పార్టీ నాయకుడు జాతీయ స్థాయికి వెళ్ళడం ప్రధానమంత్రి పదవిని సాధించటం కోసమే చెయ్యాలి!అది లేనప్పుడు చంద్రబాబు చేసినట్టు ఆసులో కండెలా తిరుగుతూ హదావిడి చెయ్యటం కూడా తనకి గానీ తన పార్టీకి గానీ తన రాష్ట్రానికి గానీ గౌరవప్రదం కాదనేది చంద్రబాబు దుస్థితిని బట్టే తెలుస్తున్నది కదా!ప్రధాని పదవిని అందుకోవాలంటే కనీసం 160 పార్లమెంటు సీట్లని తన సొంత ప్రతిభతో గెల్చుకోగలగాలి!ఆంధ్రాలో పోర్టుల మీద పెత్తనాన్ని అస్మదీయులకి కట్టబెట్టటం కోసం ఆంధ్రప్రజల నెత్తిన జగన్ని రుద్దాలని చూస్తున్నాడని అందరికీ తెలిసిపోయిన ఇప్పుడు పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రంలోనే ఎన్ని సీట్లని గెల్చుకోగలడో తెలియని స్థితిలో ఉన్న మనిషి తెలుగేతర రాష్ట్రాల్లో ఎంతమందిని పార్లమెంటుకి తనతో పాటు తీసుకెళ్ళగలనని అనుకుంటున్నాడు?
లగడపాటి రాజగోపాల్ దగ్గిర్నుంచి దాదాపు అందరు పరిశీలకుల అంచనాల్ని తారుమారు చేసిన నిన్నటి గెలుపుకి ఎలక్షన్ కమిషనరుతో లాలూచీ పడి తనకి వోటు వెయ్యని ఇరవై లక్షలమందిని ఓటర్ల లిస్టునుంచి తొలగించడమే కారణమనేది తనకు సొంత రాష్ట్రంలోనే తగినంత బలం లేదని రుజువు చేస్తున్నది గద!ఒకవేళ ఇతర రాష్ట్రాలలో కొత్తగా అడుగుపెడుతున్న తనకు అప్పటికే అక్కడ పాతుకుపోయిన పాతకాపులు ఇదే సినిమా చూపించరని గ్యారెంటీ ఏమిటి?
అసలు జాతీయ స్థాయికి వెళ్ళకుండానే తనకు సమాన స్థాయిలో ఉన్న పొరుగు రాష్ట్రం మీద కేసులు పెట్టి వేధించాలని చూస్తున్న వాణ్ణి ఏ రాష్ట్రపు నాయకుడు నమ్మి స్నేహం చేసి తనమీద అధికారం చెలాయించటానికి ప్రోత్సహిస్తాడు?అలా ఇతన్ని ప్రోత్సహించినందుకు ఇతను వాళ్లకివ్వగలిగిన లాభం ఏమిటి?
ఎటునుంచి ఎటువైపుకు తిరగేసి మరగేసి చూసినా కేసెయార్ ప్రధాని కావడం సాధ్యం కాదనే నాకు అనిపిస్తున్నది!తమకి తోచిన వూహ కాబట్టి తండ్రీ కొడుకులు సాధ్యమేనని కలలు కనవచ్చును గానీ వాస్తవాల ప్రాతిపదికన అంచనా వేసుకోవాల్సిన ఇతరులు అలాంటి భ్రమల నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది!
కేసీయారు కూడా జాతీయ స్థాయిలో అద్భుతాల్ని చెయ్యడం కోసం గాక కొడుక్కి ముఖ్యమంత్రిత్వం కట్టబెట్టడం కోసం తను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్ప్పుకోవడానికి ఒక గౌరవప్రదమైన మిష కోసమే ఈ జాతీయ స్థాయికి వెళ్ళడం అనే హడావిడి చేస్తున్నాడని నా అనుమానం!
కొడుక్కి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాక సాగినంత కాలం హడావిడి చేసి సాగనప్పుడు ఆగిపోతాడు - అది నీచత్వంతో మొదలైన ఒక రాజకీయ నాయకుడి నిరంతర నీచత్వపు అవిశ్రాంత జీవితానికి నీచమైన ముగింపు అవుతుంది కాబోలు!
నిజమైన సమర్ధత ఉందో లేదో తెలియని కొడుక్కి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టటం కోసం ఇప్పటికే సమర్ధతని ఎన్నోసార్లు రుజువు చేసుకున్న హరీష్ రావును బహిరంగ వేదికల మీద నుంచి మాయం చేసి పక్కకి తప్పిస్తూ అవమానిస్తున్న తీరు తెరాసలోని అతని అభిమానుల్ని కూడా కష్టపెడుతున్నది."నవ తెలంగాణ సృష్టికర్త!" అన్న పేరుని తీసేస్తే హరీష్ కేసీయారుతో దీటుగా నిలబడగలిగిన వాడు!ముఖ్యంగా మంచిపేరు తెచ్చుకోవటానికి ఒక రాజకీయ నాయకుడికి కావలసిన నాలుగు అంశాలూ కేసీయారు కన్న హరీష్ రావుకే అనుకూలంగా ఉన్నాయి.
కేసీయారు కన్న హరీష్ రావు ప్రసంగాలు హుందాగా ఉంటాయి.కేసీయారు కున్న అవినీతి మరకలు అతనికి లేవు.ప్రజలతో కలిసిపోయి పార్టీకి ప్రజల్లో అభిమానం సంపాదించగలగడంలో అతని ప్రజ్ఞ అసామాన్యం.అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, పబ్లిక్ డయాస్ మీద ఎన్ని విమర్సలు చేసినప్పటికీ వ్యక్తిగత స్థాయిలో అన్నిపార్టీల నాయకులతోనూ మర్యాదగా ఉంటాడు!ఆ సానుకూలత ఉండటం వల్లనే గతంలో చాలాసార్లు అతన్ని ఉపయోగించుకోవాలని ఇతర్లు చూసినా అప్పుడు పార్టీలో ఉన్న మర్యాదని చూసుకుని అటువైపు మొగ్గు చూపలేదు - కానీ ఇప్పుడు హరీష్ రావు తనకోసం కాకపోయినా తనను అభిమానించే తెరాస శ్రేణుల కోసమైనా కేసీయారు మీద తిరగబడాల్సిన అవసరం ఉంది!
చరిత్ర ఎవరికీ అవకాశాల్ని బంగారుపళ్ళెంలో పెట్టి ఇవ్వదు,లేని అవకాశాల్ని సృష్టించుకోవాలి, ఉన్న అవకాశాల్ని ఇతర్ల కన్న ముందే ఉపయోగించుకోవాలి.కాంగ్రెసు పార్టీని ఏయే రకాల అవినీతుల గురించి మోదీ కేసీయార్ విమర్శిస్తున్నారో అవే అవినీతుల్ని అంతకు రెట్టింపు స్థాయిలో వాళ్ళే చేస్తుంటే కాంగ్రెసు ఎందుకు సిగ్గుపడి వెనక్కి తగ్గుతున్నదో నాకు అస్సలు అర్ధం కావటం లేదు!మా ఎమెల్యేల్ని కొంటున్నాడు లబోదిబో అని మీడియా ముందు యేడ్చే బదులు వాళ్ళు రివర్సులో తెరాస నుంచే ఎమ్మెల్యేల్ని కొనుక్కోవచ్చును గద!తమకి ఫైనాన్స్ చెయ్యటానికి స్పాన్సర్లే లేనంత స్థాయిలో దేశం ఎప్పుడు పవిత్రమైపోయింది?
ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ చేతిలో చచ్చిపోవటం ఆ పార్టీ నాయకులకే కాదు, ఆ పార్టీని అభిమానించే వారికి కూడా అవమానమే! నిన్న కాక మొన్న పైకొచ్చినవాడు చేస్తున్న చిలిపిపనులు ఎప్పట్నుంచో పాతుకుపోయిన కాంగ్రెసు చెయ్యలేకపోవడం ఏమిటి?పెట్టుబడి కోసం ఇవ్వాళ కేసీయార్ పక్కన చేరిన కాంట్రాక్టర్ల పోటీదారులతో మాట్లాడాలి!తెరాసని కొనుగోళ్ళతో అతలాకుతలం చెయ్యాలి!ఉద్యమవీరులు మొహమాటాలు వదిలించుకుని కలాలూ గళాలూ పదునుపెట్టుకోవాలి!
ఉద్యమం నాటి ఆవేశంలో మమ్మల్ని తిట్టిన తిట్లకి ఒకసారి క్షమాపణ చెప్తే చాలు మాలాంటివాళ్ళం మీకు పైనుంచి మాటసాయం కూడా చేస్తాం - ఇంకెందుకు ఆలశ్యం?

కేసీఆర్ తిడితే కాంగ్రెస్ క్షమార్పణలు చెప్పడం ఏవిటీ ? ఖర్మ ని తిట్టినందుకు విన్నకోటవారికి క్షమార్పణలు చెపితే సరిపోతుందా ? అద్వానీ ని క్షమార్పణ అడిగితే అసదుద్దీన్ క్షమార్పణ చెపుతారా ? ఎక్కడో తేడాకొడుతున్నట్లు లేదూ ?
ReplyDeleteక్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెసువాళ్ళు కాదు,కేసీయారుతో గొంతు కలిపి ఆ పాపంలో పాలు పంచుకున్న ఒకనాటి ఆంధ్రద్వేష పండిత ప్రకాండులైన ఉద్యమవీరులు!
Deleteur two friends kundabaddal and veerayya are agst kcr becos of their kulagajji
ReplyDeleteYou say that who will go against KCR are with kulagajji!So, can you confirm KCR is out of kulagajji?Do you have any answers for their questions and counter their arguments n such logical way?
DeleteThose talk with kulagajji cannot have such logical excellency - that is sure!
even posani telling about cbn and abn caste gajji
Deleteమీరు బలే విశ్లేషిస్తారండి..
ReplyDeleteజిల్లాకి ఒక MP అనే అవకాశం ఉంటే తెలంగాణ ని 100 జిల్లాలుగా విభజించడం తప్ప ఏమి చెయ్యలేడు.
పరిస్తితులు అనుకూలిస్తే 1 లేదా 2 మంత్రి పదవులు తెచ్చుకుంటాడు అంతే..
:)
"జాతీయ పార్టీ పెడతా. దేశాన్నంతటినీ ఒక్కటి చేస్తా." అని మొన్నటి కరీంనగర్ సభలో అన్నాడట కేసీఆర్ (18-03-2019 "ఆంధ్రజ్యోతి" దినపత్రికలో హెడ్-లైన్స్). ఆ లైన్ చూడగానే నాలో మెదిలిన మొదటి ఆలోచన ... ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని రెండు చేయించాడు, కానీ దేశాన్నంతటినీ ఒక్కటి చేస్తాడుట ... అని.
ReplyDelete:) awesome
Deleteవినేవాడు చెవిటివాడైతే ఘంటషాల భగవత్గీత లోకెష్ బాబు చెప్పాడంటారు.. హహ!!
lokesh babuku paramarsha anadame chetakadu paravasham antadu telugu tution mastaru danduga
Delete"తెలంగాణ బిడ్డ ప్రధాని ఎందుకు కావొద్దు?" అని కవితమ్మ గారి ప్రశ్న (నిన్నటి (22-03-2019) "ఆంధ్రజ్యోతి" దినపత్రికలో మొదటిపేజ్ లో వార్త)).
ReplyDeleteజనులారా, అదన్నమాట అసలు సంగతి?
కాగలిగితే అడ్డుకోగల్గినవాళ్ళు ఎవరూ లేరు!అన్ని అడ్డంకుల్నీ అధిగమించి ప్రధాని అయ్యే సత్తా ఉంటే ఆపినా ఆగడు కదా - కానీ అది సాధ్యమా?
Deleteకేసీఆర్ గారు పి.వి.నరసింహారావు గారిని మరిచిపోయినట్టున్నారు.
ReplyDelete