Friday, 22 March 2019

హైందవేతరులు విగ్రహారాధన పాపం అని ఎందుకు అంటున్నారు?హిందువులు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఉందా!

హిందువులు ముఖ్యంగా తెలుసుకోవాల్సినది ఒకటే!

వేదం దేన్నీ పాపం పేరున నిషేధించలేదు.కొన్నింటి విషయంలో "ఇది చెయ్యదగినది!" అని ప్రోత్సహించడమూ కొన్నింటి విషయంలో "ఇది చెయ్యకూడనిది!" అని సలహాలూ హెచ్చరికలూ ఇవ్వడం తప్ప "ఇది పాపం!ఈ పని చేస్తే నేను మిమల్ని నరకంలోకి పడదోసి అనంతకాలం వరకూ అక్కడే ఉంచి భయంకరమైన శిక్షలకు గురిచేస్తాను!" అని గానీ "ఇది పుణ్యం!ఈ పని చేస్తే మిమల్ని స్వర్గానికి పంపించి అనంతకాలం వరకూ అక్కడే ఉంచి సకలసౌఖ్యాలూ అమర్చి సుఖపెడతాను!" అని గానీ మన దేవుడు ఎక్కడా చెప్పలేదు.

ఇది గుర్తుంచుకుంటే చాలు - సందేహాలు రావు.అసలు కీలకం చాగంటి వెంకట రమణ గారికి కూడా తెలియకపోవడం వల్ల ఇన్ని వీడియోలతో ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నారు!

"విగ్రహారాధన మహా పాపం!" అనేది హైందవేతరులైన ఫాదర్లూ ముల్లాలూ చేస్తున్న వింత వాదన.వింత వాదన అని ఎందుకు అంటున్నానంటే, నాకు వారి మతగ్రంధాలలో పాపం అని చెప్తున్న దాని గురించి కూడా స్పష్టంగా తెలుసు.రమణ గారికి వేదం మీద మంచి పట్టు ఉన్నది.కానీ మనం దీన్ని వేదం ఏమి చెప్తుంది అనే కోణంలో చూస్తే అర్ధం కాదు.విగ్రహారాధన పాపం అంటున్న అబ్రహామిక్ మతాల ప్రకారం పాపం అంటే ఏమిటో తెలుసుకుంటే గానీ ఈ చిక్కుముడి విడిపోదు.

అసలు బైబిలు లోని ఉల్లేఖనం ప్రకారం పాపం అంటే ఏమిటో చివరి భాగంలో చెప్పి ముగిస్తాను.ప్రస్తుతం ఆ మతాల ప్రచారకుల ప్రకారం వాళ్ళ హడావిడికి కంగారుపడి ఇప్పుడు చేస్తున్న విగ్రహారాధన మానేసినప్పటికీ వాళ్ళ దృష్టిలో అప్పటికి కూడా హిందువులు పాపులే అవుతారు.అది యెట్లా అంటే - క్రైస్తవుల దృష్టిలో "యహోవా ఒక్కడే దేవుడు!యేసు మాత్రమే నా రక్షకుడు!" అని నమ్మకపోవటమే పాపం, ముస్లిముల దృష్టిలో "అల్లాహ్ ఒక్కడే దేవుడు!మహమ్మదు మాత్రమే నా ప్రవక్త/మార్గదర్శి!" అని నమ్మకపోవటమే పాపం.

వాళ్ళ మతాంతరీకరణ వ్యూహంలో మిమ్మల్ని విగ్రహారాధనకి దూరం చెయ్యటం మొదటి మెట్టు,ఒకసారి వాళ్ళు పాపం అంటున్నారు కదాని చేస్తున్న విగ్రహారధనని మానేశారనుకోండి "శభాష్!మీరు ఇప్పుడు సరైన దారిలో నడుస్తున్నారు!" అని ఉబ్బేసి "మరి, మా మతంలోకి వచ్చి మా దేవుణ్ణి ఒప్పుకుంటే ఇంకా మంచిది,అనంతకాలపు స్వర్గసుఖాలు అనుభవించవచ్చును కదా!" అని బేరం పెడతారు - మీరు అది కూడా నమ్మేశారనుకోండి, అంతటితో ఒక హిందూ సింహం క్రైస్తవ/మహమ్మదీయ గొర్రె అయిపోతుంది!

మన పెద్దలు కూడా విగ్రహారాధన మొదటి మెట్టు మాత్రమే, వీలయినంత త్వరలో విగ్రహాల మీద వ్యామోహం తగ్గించుకుని విశ్వం అంతటిలోనూ దైవాన్ని చూడండి అనే చెప్తున్నారు, తేడా అల్లా మన గ్రంధాల గురించి తెలియని వాళ్ళు మనల్ని భయపెట్టడంలో ఉంది!

అసలు ఆయా మతాల్ని ఫాలో అవుతున్న గొర్రెలకి కూడా తెలియని వింత యేమిటంటే, ఒక మనిషి క్రైస్తవుడైనా ముస్లిమయినా చనిపోయిన మరుక్షణమే స్వర్గానికి వెళ్ళడు - యేసు రెండవ రాకడ అనే కధ దానికోసం సృష్టించబడినదే, దాని ప్రకారం యేసు రెండవసారి వచ్చేవరకు అన్ని తరాల మృతులూ ప్రేతాలుగా బుద్ధిమంతులైతే వాళ్ళ శవాల్ని అంటిపెట్టుకుని ఉండియో అసంతృప్త జీవనం గడిపినవాళ్ళైతే ఎగ్జార్సిస్ట్, హాంటెడ్ లాంటి సినిమాల్లో చూపించినట్టు బతికున్నవాళ్ళని ఆవహించి అల్లరి చేస్తూనో గడుపుతారు.

యేసు రెండవసారి వచ్చినప్పుడు అధికారికమైన బాప్తిజం పొందినవారికి మాత్రమే స్వర్గవాసం దక్కుతుంది!వాళ్ళు పాపం అని చెప్తున్నారు గదాని విగ్రహారాధన మాత్రం మానేసి బాప్తిజం తీసుకోకుండా హిందువులుగానే ఉన్నా నరకానికే వెళ్తారు.నేను చెప్తున్నది నమ్మలేకపోతే ఏ పాస్టరునైనా అడిగి తెల్సుకోండి, లేదంటే, తెలుగు బైబిలు పుస్తకం చదివినా తెలుస్తుంది.మా ప్రవక్తయే ఆఖరి ప్రవక్త అయినప్పటికీ ముందరి ప్రవక్తల్ని కూడా  గౌరవిస్తాము అనే మెలికతో ముస్లిం మతప్రచారకులు కూడా దాదాపు ఇదే చెబుతారు.అయితే, వాళ్ళకి జెహాదులో పాల్గొంటే. గనక వీరు యేసు రెండవ రాకడకు ప్రత్యామ్నాయంగా చెప్పిన  తీర్పు దినం వరకు ఎదురు చూడకుండా చచ్చిపోయిన వెంఠనే స్వర్గవాసం దక్కుతుందనే వెసులుబాటు ఇచ్చారు - అది వారి సరుక్కి అదనపు ఆకర్షణ అని అర్ధం చేసుకోవాలి. మరి, క్రైస్తవ్యం నుంచి కూడా మహమ్మదీయంలోకి లాగడానికి ఏదో ఒక రాయితీ ఇవ్వాలి కద!

మనకి చచ్చాక కూడా ఏవడో గొట్టాంగాడు వచ్చేవరకు ఎదురు చూడాల్సిన దరిద్రం లేదు - పాపరాశి శూన్యం అయితే మోక్షం, మిగిలి ఉంటే మళ్ళీ జన్మ!,మీదుమిక్కిలి వాళ్ళలా మా దేవుణ్ణి నమ్మినవాళ్ళకే స్వర్గం, మా దేవుణ్ణి నమ్మనివాళ్ళకి నరకమే గతి అనే వేర్పాటు కూడా లేదు!

నేనే కాదు ఏ హిందువూ ఇతర  హిందువులకి ఈ విషయం గురించి ఇంతకన్న వివరమైన సమాధానం ఇవ్వలేరు - ప్రస్తుతానికి!

ఇప్పటికీ సమాధాన పడలేని హిందువులు తమ ముందర "విగ్రహారాధన పాపం!" అంటున్న అవతలివాళ్ళనే "మీ దృష్టిలో పాపం అంటే ఏమిటి?" అని అడిగితే వాళ్ళు తెలివైనవాళ్ళయితే మౌనం వహిస్తారు, తెలివితక్కువవాళ్ళయితే మరింత చెత్త లాజిక్కులతో మిమ్మల్ని ఇంకొంత గందరగోళానికి గురి చేస్తారు - అప్పుడు ఖచ్చితంగా జ్ఞానోదయం కావచ్చు!

ఆఖర్లో చెప్తానన్న అసలైన విషయం యేమిటంటే, బైబిలు ప్రకారం పాపం అంటే "ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవటం" అని ఈడెను తోట కధలో అసందిగ్ధం అవిస్తరం సందేహరహితం అన్నంత కొట్టొచ్చినట్టు కనబడుతుంది!పోనీ అనువాదం తప్పు చేశారేమో అనుకోవడానికి వీల్లేకుండా ఇంగ్లీషు ప్రతి కూడా దానినే రూఢి పరుస్తుంది!

మీరు హిందువా క్రైస్తవుడా మహమ్మదీయుడా అనేది మర్చిపోయి మతగ్రంధాల సంగతి కూడా వదిలేసి కామన్ సెన్సుతో ఆలోచించినా "ఏది మంచి ఏది చెడు అని తెలిశాక పనిగట్టుకుని చెడు చేసినప్పుడే అది పాపం అవుతుంది!" అని చెప్పడమే సరైనది కానీ అసలు "ఏది మంచి  ఏది చెడు అని తెలుసుకోవడం" అనే సమస్త జంతుజాలం నుంచి మానవుణ్ణి వేరు చేసి అధికుడిగా నిలబెట్టిన ప్రత్యేకతని చిన్నబుచ్చడం తప్పు అని తెలుస్తుంది.ఈ పాయింటుతో ఇప్పటికి నాలుగు గొర్రెల్ని చంపేశాను.పాస్టర్లనే కాదు పోపుని సైతం చంపగలిగిన బ్రహ్మాస్త్రం ఇది.

హిందువులు దేని గురించీ కంగారు పడాల్సిన పని లేదు!

8 comments:

  1. మోదీ మాతృసంస్థ RSS కదా!దాని వ్యవస్థాపకుణ్ణి పబ్లిక్ డయాస్ మీద ఎన్నిసార్లు ప్రస్తావించాడు/తల్చుకున్నాడు?అసలు ఆనాడే, అంటే స్వతంత్రం కోసం పోరాడే దశలోనే కాంగ్రెసు హిందువుల ప్రయోజనాల్ని కాపాడలేదని ఆవిర్భవించిన సంస్థ నుంచి వచ్చిన మోదీ మాతృసంస్థకు చెందిన హెడ్గెవార్, గోల్వాల్కర్ లాంటివారిని వదిలేసి కాంగ్రెసుకు చెందిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిర్మించి అంత భక్తిని ఎందుకు పర్దర్శించాడు?హెడ్గెవార్ పేరుని పబ్లిక్ డయాస్ మీద తలిస్తే స్పాన్సరర్/ఫైనాన్షియర్ గ్రూపులు మొట్టికాయలేస్తాయనా!

    మోదీయే కాదు, అద్వానీ, వాజపేయి సైతం ఏనాడూ హెడ్గెవార్, గోల్వాల్కర్ లాంటివారిని పబ్లిక్ డయాస్ మీద పొగడలేదు - why this deception kolaveri?

    ReplyDelete
  2. అవునూ!కేసీయార్ కూతురు కవిత ఇంటిపేరు ఇంకా కల్వకుంట్ల అనే ఉంటుంది - పెళ్ళి కాలేదా ఏంటి?

    ReplyDelete
  3. మీరు భలేవారండి.. లక్స్మి మంచు ఇంకా Y.S.షర్మిల ఇలా చాలమంది ఉన్నారు.. భర్త కంటే తండ్రికి పేరు ప్రఖ్యాతులుంటే వీల్లు ఇంటి పేరు మార్చుకోరు.. ఎమన్నా అన్నారంటే మిమ్మల్ని స్త్రీ ద్వెషులుగా పురుషహంకారులుగా చిత్రీకరిస్తారు జాగ్రత్త.

    BTW, విగ్రహారాదన నేరం, ఘోరం, పాపం అంటూ వీల్లు మాత్రం యాత్రలు చెయ్యడం లేదా? ఎక్కడైన ఉండే దేవునికోసం యాత్రలు అవసరమా?

    .

    ReplyDelete
  4. మా ఆడపడుచు కూడా మా (తండ్రిగారి) ఇంటిపేరునే వాడుతుంది. పెళ్ళికి ముందు ప్రభుత్వోద్యోగం వచ్చింది. పెళ్ళయిన తరువాత మార్చడం కుదరదా అని నాకు అనిపిస్తుంటుంది. తండ్రి అంటే ఆవిడకి విపరీతమయిన గౌరవం.

    ReplyDelete
    Replies
    1. అవును నీహారిక గారు!! ఈ రోజు నేను observe చేస్తే తెలిసిందేమిటంటే మా Office లో కూడా మహిళా ఉద్యోగులు ఎవ్వరు తమ surname మార్చుకోలేదు.
      కాని పైన ఉదహరించిన మహిళామూర్తులందరు surname మార్చుకోకపోవడం కేవలం గుర్తింపు కోసం అనుకుంటా !!

      Delete
  5. మీ బ్లాగులో వ్యాఖ్యలు మాలికలో మళ్ళీ గాయబ్ అవుతున్నాయి ఏమిటీ ?

    ReplyDelete
  6. @నీహారిక26 March 2019 at 21:33
    మీ బ్లాగులో వ్యాఖ్యలు మాలికలో మళ్ళీ గాయబ్ అవుతున్నాయి ఏమిటీ ?

    hari.S.babu
    నా బ్లాగు వ్యాఖ్యలు మాలికలో కనపడకపోవటం గురించి యాగ్రిగేటర్ నిర్వాహకులే చెప్పాలి.నాకయితే కొన్ని బ్లాగుల్లో నన్ను ఉద్దేశించి నానా మాటలూ అంటున్నప్పటి నా రిక్వెస్టుకి భరద్వాజ గారు "ఆ మాటలు మా అభ్యంతరకరమైన పదాల లిస్టులో లేవు కాబట్టి మేము ఏమీ చెయ్యలేం" అన్నప్పుడే విరక్తి పుట్టేసింది.ఒక వ్యక్తి నన్ను ఉద్దేశించి అనకూడని మాటలతొ ఇబ్బంది పెడుతుంటే ఆయన కొన్ని పదాల లిస్టు పెట్టుకుని వాటిలో ఉన్నవాటికే స్పందిస్తాను అనడం ఏమిటి?

    యాగ్రిగేటర్ల వల్ల నాకు వ్యక్తిగత దాడుల నుంచి రక్షణ లేనప్పుడు నేను యాగ్రీగెటర్లను ఎందుకు పట్టించుకోవాలి?త్వరలోనే బ్లాగుని మోనిటైజ్ చేద్దామని అనుకుంటున్నాను.అప్పట్లో నేను యాగ్రిగేటర్ల నుంచి తప్పుకున్నది నా బ్లాగు యొక్క నిజమైన సత్తా ఎంతో చూసుకుందామనే!యాగ్రిగేటర్లలో ఉన్నప్పుడూ లేనప్పుడూ రోజుకి 100 నుంచి 300 హిట్లు వస్తున్నాయి.అప్పుడే కొలీగ్సు మధ్యన కబుర్లలో ఆ మాట చెబితే మోనిటైజ్ చెయ్యవచ్చు కదా అని అన్నారు.ఎటూ మోనిటైజ్ చేసినప్పుదు నేనే నా బ్లాగుని యాగ్రిగేటర్లనుంచి పీకేస్తాను.అలాంటప్పుడు వ్యాఖ్యలు కనపడనందువల్ల నాకు నష్టం ఏమిటి?

    కావాలని కనపడకుండా చేస్తే అడిగినా ఫలితం ఉండదు.సాంకేతికపరమైన ప్రాబ్లెం అయితే అడక్కపోయినా సరిచేస్తారు - అడిగి చిన్నబుచ్చుకోవడం అవసరమా?

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...