Sunday, 31 March 2019

డబ్బుని ఎవరు పుట్టిస్తున్నారు?డబ్బుని ఎలా పెంచుతున్నారు?డబ్బు ఎలా ఉపయోగించుకుంటున్నారు?డబ్బుని లేకుండా చెయ్యలేరా!

          గత వ్యాసంలో డబ్బు ప్రజల మధ్య ఎలా వ్యాపిస్తుంది అనేది చూశాం, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అసలు కరెన్సీని ఎలా ముద్రిస్తుందో చూద్దాం.మొదటి వ్యాసం కేవలం పరిచయం మాత్రమే గనక పైపైన తడిమి వదిలేశాను.ఇప్పటినుంచి విషయం క్రమేణ సంక్లిష్టం అవుతుంది.ఈజీగా తేల్చెయ్యాలంటే రిజర్వ్ బ్యాంక్ ఎలా పని చేస్తుందో చెప్పేస్తే చాలు.కానీ, ఇది ఇలాగే ఎందుకు జరగాలి అనే సందేహం తీరాలంటే కొంచెం చరిత్రలోకి తొంగి చూడాలి.

          "దేశభక్తి" ఇవ్వాళ ఆకర్షణీయమైన పదం. కాని, ఒకప్పుడు "దేశం" అనే పదానికి ప్రాంతం ఆని తప్ప్ప మరొక ప్రత్యేకత లేదు.అప్పుడు "రాజభక్తి" ఆకర్షణీయమైన పదం - ఈ రెంటికీ తేడా ఏమిటి?దేశం అంటే ఏమిటి, రాజ్యం అంటే ఏమిటి, దేశానికీ రాజ్యానికీ మధ్యన తేడాలూ పోలికలూ ఏమిటి అని సవాలక్ష సందేహాలతో సతమతం అయిపోకుండా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే రాజ్యానికి కావలసిన డబ్బుని రాజ్యం చెప్పుచేతల్లో నడిచే ఖజానా ముద్రిస్తుంది, దేశానికి కావాల్సిన డబ్బుని ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండని ఒక సెంట్రల్ బ్యాంక్ ముద్రిస్తుంది. 

          ప్రపంచ చరిత్రలోని అనేక ప్రాచీన కాలపు రాజ్యాలు విచ్చిన్నమై ఆధునిక కాలపు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతనే వాటిని దేశాలు అని వ్యవహరించటం గమనిస్తే ఇది ఎంత ఖచ్చితమైన నిర్వచనమో అర్ధం అవుతుంది.

          మన దేశపు ఆర్ధిక వ్యవస్థకు అతి కీలకమైన Reserve Bank of India(RBI) ఒక సర్వస్వతంత్రమైన సంస్థ - 1. Issue of Bank Notes, 2. Banker to Government, 3. Custodian of Cash Reserves of Commercial Banks, 4. Custodian of Country’s Foreign Currency Reserves, 5. Lender of Last Resort, 6. Central Clearance and Accounts Settlement, 7. Controller of Credit అనే అతి ముఖ్యమైన విధుల్ని నెరవేరుస్తున్నది కాబట్టి ఆర్ధికశాస్త్రంలో పట్టు లేని వ్యక్తులు దాన్ని ఉపయోగించుకుని సత్ఫలితాలు పొందాలే తప్ప దర్పాన్ని ప్రదర్శించితే శృంగభంగం తప్పదు - అటువైపున ఉన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నరు కూడా అహంకారి అయితే తన మీద ప్రభుత్వం చేస్తున్న పెత్తనానికి కినిసి తప్పుడు సలహాలు ఇస్తే ప్రధాని పరువూ పోతుంది ప్రజలూ కల్లోలానికి గురవుతారు!

          రిజర్వ్ బ్యాంకు నోట్లని ముద్రించటానికి ఉన్న సాంకేతికపరమైన మార్గదర్శకాలు చాలా తక్కువ.ఇందుకోసం 1956లో Minimum Reserve System అనే ఏర్పాటు చేసుకుంది.దీని ప్రకారం రిజర్వ్ బ్యాంకు సర్వకాల సర్వావస్థల్లోనూ తన అధీనంలో 200 కోట్ల రూపాయలను బంగారం నిల్వల రూపంలోనూ విదేశీమారకద్రవ్యం రూపంలోనూ ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకుంటుంది.నోట్ల తయారీలో గానీ ఇతర విధుల విషయంలో గానీ ఇది ఎలాంటి ప్రభావాన్నీ చూపించకపోయినా ఒక కంపెనీ ప్రభుత్వానికి చూపించాల్సిన మూలధనంలా ఉంటుంది.

          ఇక ప్రతి సంవత్సరం కొత్త నోట్లని ముద్రించడానికి స్థూల జాతీయోత్పత్తిని కాక growth rate అనే దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.కరెన్సీ అనేది చేతులు మారేది అమ్మకం, కొనుగొళ్ళు అనేవి జరిగే చోటనే కదా - మరి ఇన్ని కొత్త ట్రాన్సాక్షన్లు జరుగుతాయని రిజర్వ్ బ్యాంకు ఎలా వూహిస్తుంది?

          వూహలతోనూ స్వప్నాలతోనూ ఆర్ధికాన్ని నడిపిస్తే హార్దికం ఫెడేల్ మంటుంది - గ్రోత్ రేట్ 9% ఉంటే 9 x 2 + 4 = 22% అని లెక్క ఉంది.అంటే రాబోయే సంవత్సరంలో సాధించగలమని అంచనా కట్టిన గ్రోత్ రేటుకి రెండింతల స్థాయిలో కరెన్సీ కావాలి,ఇక 4 శాతం అనేది నిరంతరం ఎదుగుతున ఆర్ధిక వ్యవస్థలో ఉండే మినిమం ఇన్‌ఫ్లేషన్ యొక్క శాతం.ఈ 4% ద్రవ్యోల్బణం వాంఛనీయమే!

          మనం ఒక ఉద్యోగం చేస్తే వచ్చే నెల జీతం,మనం ఒక వస్తువును అమ్మితే వచ్చే లాభం, మనం వేరేవాళ్ళకి అప్పు ఇస్తే వచ్చే వడ్డీ అనే రకరకాల మార్గాలలో వచ్చే డబ్బు రిజర్వ్ బ్యాంక్ ముద్రించి ఇచ్చినదే అయి వుండాలి - దీన్నే వైట్ మనీ అంటారు.అలా కాక మనం ఒక వస్తువుని లక్ష రూపాయలకి అమ్మి క్రయపత్రంలో పదివేలకే అమ్మినట్టు రాస్తే ఆ మిగిలిన తొంభై వేలూ బ్లాక్ మనీ అవుతుంది. దీనితో గనక బహిరంగ మార్కెట్టు దగ్గిర క్రయవిక్రయాల్ని చేస్తే ఠపీమని రిజర్వ్ బ్యాంకు పట్టేసుకోగలుగుతుంది!మరి, బహిరంగ మార్కెట్టు దగ్గిర దేన్నీ కొనడానికి పనికిరాని పద్ధతిని ఏ లాభమూ లేకుండా ఎందుకు అనుసరిస్తున్నారు?

          నల్ల ధనంలో ఎక్కువ శాతం దేశంలో అరాచకం సృష్టించే అరాచక మూకలకు ఆయుధాలను కొనుగోలు చేయడానికి పోతుంది,మత సంస్థలకు విరాళాలు ఇవ్వడం ద్వారా తన నలుపుని తొలగించుకుని కొంత శాతం తెలుపు అయిపోతుంది.దీనికి కేవలం క్రైస్తవ మత సంస్థలే కాదు హిందూ మత సంస్థలు కూడా సహాయం చేస్తున్నాయి. తర్వాత స్థానం తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం ప్రభుత్వంలో ఉన్నవారికి ముడుపుల కింద పోతుంది - జగన్ కావచ్చు, కేసీయార్ కావచ్చు,చంద్రబాబు కావచ్చు,మోదీ కావచ్చు, అద్వానీ కావచ్చు, యడ్యూరప్ప కావచ్చు, సుష్మా స్వరాజ్ కావచ్చు - నల్లధనాన్ని సృష్టించేవాళ్ళు గానీ వ్యాపింపజేసేవాళ్ళు గానీ అందుకునేవాళ్ళు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు నిజమైన అభివృద్ధిని చూపించటానికి తమ శక్తియుక్తుల్ని ఉపయోగించరు!

          విచిత్రమైన విషయం ఏమిటంటే, అది వాళ్ళ తప్పు కాదు, నిస్సహాయత మాత్రమే! అసలైన విషాదం ఏమిటంటే వాళ్ళని నిస్సహాయుల్ని చేసింది జాతిపిత అని కీర్తించబడుతున్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ లాంటి గోముఖ వ్యాఘ్రాలే!ఆ చిత్రం ఏమిటో తెలియాలంటే Utsa Patnaik పరిశోధన ప్రకారం 1765 నుంచి 1938 వరకు మొత్తం $45మిలియన్ల సంపదని సృష్టించి ఇప్పుడు "మా దేశంలో ఒకప్పుడు జరిగిన పారిశ్రామిక విప్లవం వల్లనే మేము ప్రపంచమంతటికీ వ్యాపించి వాళ్ళకీ వీళ్ళకీ నాగరికత నేర్పి బీద దేశాల్ని అభివృద్ధి చేసి గొప్పవాళ్ళమయ్యా"మని విర్రవీగుతున్న అప్పటి బీద దేశాలకి కళ్ళు చెదిరే వైభవాలను సమకూర్చిన పాడియావు లాంటి భారతదేశం కేవలం ఒక దశాబ్దం గడిచి స్వతంత్రం వచ్చేనాటికి ఎగ్గొడితే తప్ప ఎంత నిజాయితీగా శ్రమించినా ఏనాటికీ తీరనంత అప్పుని నెత్తిన వేసుకున్న కధ తెలియాలి - అది వచ్చే వ్యాసంలో చెబుతాను.

(this is the second part of a series on macro economy!)

7 comments:

  1. మిత్రులకి ఒక సూచన!

    ఇప్పుడు నేను వేస్తున్న పోష్టులు చాలా ముఖ్యమైనవి.నాకు అర్ధశాస్త్రంలో అధికారికమైన పాండిత్యం లేదు, కానీ చదివి కొంతా చదివిన వాటిని మన చుట్టూ జరుగుతున్నవాటిలో గమనించి కొంతా నేర్చుకున్నదే!అయితే, నేను చదవడానికి ఎంచుకున్న చోట్లు అధికారికమైనవే, శాస్త్రీయమైనవే కాబట్టి నా సూత్రీకరణలు సరైనవే అని నమ్ముతున్నాను.నాకన్న ఎక్కువ తెలిసి ఉండి అవి తప్పని అనిపిస్తే వాటిని ఖండించి నన్ను సరిదిద్దే అవకాశం మీకు ఉంది.

    చూసి వెళ్ళిపోవడం కాకుండా ప్రతి ఒక్కరూ మీ స్పందన తెలియజేస్తే బాగుంటుంది - మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి.

    మరీ ముఖ్యమైనది, ఇవి ఎలా ఉన్నాయి?కొనసాగించవచ్చునా!

    ReplyDelete
  2. ధన్యవాదాలు హరిబాబు గారు.
    మీరు వ్యక్తిగతంగా తీసుకోకపోతే నేను మీ కోసం చిన్న సలహాను ఇవ్వాలనుకుంటున్నాను.
    భారీ వ్యాసాలను రాయడానికి బదులు, దయచేసి పాఠకులకు సులభమైనది కావటానికి, పేరాగ్రాఫ్లు మరియు పాయింట్ల విషయాన్ని స్ప్లిట్ చేయండి.

    మరియు, inforgraphs లేదా స్లయిడ్ సిద్ధం చేయడం గురించి ఆలోచించండి.

    క్షమించండి అనువాద లోపాలు. Google Translate has developed greatly because of artificial intelligent and machine learning.
    But it has long to go for accurate and realtime translation.

    ReplyDelete
  3. Dear Haribabu garu,
    Please don't give up in providing the support for CBN.
    I am big fan of but, but i am worried about people thoughts about Mr.420 and in general about happening in india.

    Can you please try to get/quantify the monetery gain that AP will get if Polavaram project is completed ?
    (like percapita income increase / agriculture produce increase/ industrial output etc ? )

    Also, if we can quantify the losses because of stalling the polavaram project ,
    then it may at least bring some awareness among educated fools who blindly support Mr.Jail bird.

    for example ,

    How many employees,coolies had to be paid per day + electricity ,rent etc , if the polavaram had been stalled because of Telangana's /odisha's newly opposing affidavits about impact calculations etc..

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ఇంతవరకు తన కోరికనే ఆంధ్రప్రజల ఆకాంక్ష కింద చిత్రిస్తూ దానికి తగ్గ వాస్తవాలని మాత్రమే పేర్చుకుంటూ వస్తున్న తప్పుడు విశ్లేషణల్ని తిప్పి కొట్టటం మాత్రమే చేశాను.ఇప్పుడు చాలెంజికి జవాబు చెప్తున్నాను.

      ప్రశ్న కూడా సూటిగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని ఉండటంతో నాపని తేలికయింది.ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో టేబుల్ వేసి చెప్పమంటే చచ్చుండేవాణ్ణి.

      అసెంబ్లీ సీట్ల పరంగా తెలుగుదేశానికే మెజారిటీ వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు.కుండబద్దలు చానెల్ కాటా సుబ్బారావు గారు 123 నుంచి 133 మధ్యలో గెలుచుకుంటుందని చెప్పారు.జయప్రకాశ్ నారాయణ్ గారు లెక్కలు చెప్పలేదు గానీ తెదెపాకి ఉన్న అనుకూలతల్ని చెప్పారు, అవి సుబ్బారావు గారి విశ్లేషణతో కలుస్తున్నాయి.చాలా కాలం క్రితమే నాగేశ్వరరావు గారు చంద్రబాబు యొక్కఅయిదంచెల వ్యూహం గురించి చెప్పారు - తెదెపా ఎన్నికల ప్రచారం కూడా అదే దారిలో నడుతున్నది.

      కాటా సుబ్బారావు గారు నాలా ఎక్కడో కూర్చుని వాళ్ళ మాటలూ వీళ్ళ మాటలూ విని చెప్పలేదు.ఫీల్డ్ వర్క్ చేశానని చెప్పారు.అయితే, గబుక్కున ఒక అంకె చెప్పి లెక్కింపు తర్వాత దానికన్న ఎక్కువ వస్తే ఓకే, కానీ తక్కువ వస్తే credibility పోతుందనే భయం ఉంటుంది.తెలంగాణ ఎన్నికల ఫోర్ కాస్ట్ విషయంలో నాగేశ్వరరావు గారిదీ అదే ఇబ్బంది, అవునా?

      కాటా సుబ్బారావు గారి ఫీల్డ్ వర్క్ ద్వారా వచ్చిన రేంజిని ఒప్పుకుంటూనే జేపీ తదితర విశ్లేషకులు చెప్పీన తెదెపా అనుకూలతల్నీ ప్రచారపర్వంలోని ఇప్పటి వాతావరణాన్నీ దృష్టిలో పెట్టుకుని TDP:142 అనే అంకె చెప్తున్నాను.

      కాటా సుబ్బారావు గారు పార్లమెంటు సీట్లకి 22 అని చెప్పారు.కానీ తెదెపా ప్రత్యేక హోదా సాధించలేకపోవటానికి తెదెపా పార్లమెంట్ సభ్యుల ఫెయిల్యూర్ కారణంఅని నేను అనుకుంటున్నాను.కేంద్ర ప్రభుత్వంలో మత్రులుగా కూడా ఉండి వాళ్ళు చెయ్యాల్సిన పనే అది!చెంబుడు నీళ్ళూ కుండెడు మట్టీ ఇచ్చినప్పుడే భాజపా హోదా ఇచ్చే వాలకంలో లేదని అనుమానం అందరికీ వస్తే దగ్గరనుంచి భాజపా వాళ్ళ వాలకాన్ని గమనించే అవకాశం ఉండి కూడా ఎందుకు అంత సమయం వేస్ట్ చేశారు? ఆసులో కండెలా రెండేళ్ళు చంద్రబాబు వేధిస్తే వచ్చింది ప్యాకేజీ, నిజానికి ఇది వాళ్ళ పని కదా!

      అసెంబ్లీ సీట్ల విషయం రాష్ట్రప్రభుత్వం యొక్క భవిష్యత్తును నిర్ధారిస్తుంది కాబట్టి సెంటిమెంట్లూ ఫియర్ సైకోసిస్సులూ పని చేస్తాయి.కానీ పార్లమెంటు స్థానాల గెలుపుకి చదువుకున్నవాళ్ళు కేంద్రంలో రాష్ట్రం యొక్క ప్రాతినిధ్యానికి సంబంధించిన సాంకేతిక పరమైన అంశాలని చూస్తారని అనుకుంటున్నాను.అలా అనుకుంటే తెదెపాకి 20 లోపు వస్తాయి, అంకె చెప్పాలంటే 16.మంచి అబ్యర్ధుల్ని పెట్టి ఉంటే తెదెపాకి పడాల్సిన వోట్లు జనసేన వైపుకి వెళ్తాయని నేను అనుకుంటున్నాను.

      ఫైనల్ నంబర్స్
      అసెంబ్లీ >TDP:142
      పార్లమెంట్ >TDP:16

      P.S:జైగారి వాదన ఒకే పద్ధతిలో నడుస్తున్నది.కనకదుర్గ ఫ్లై ఓవరు గురించి ప్రస్తావిస్తే రాష్ట్రంలో ఇంకే పనీ చెయ్యకుండా ఆ ఒక్క పనే చేసినట్టు దానికి అంత సమయం ఎందుకు పట్టిందని అడుగుతున్నారు.పోలవరం గురించి ప్రస్తావిస్తే రాష్ట్రంలో ఇంకే పనీ చెయ్యకుండా ఆ ఒక్క పనే చేసినట్టు దానికి అంత సమయం ఎందుకు పట్టిందని అడుగుతున్నారు.

      ఒకవేళ అమరావతి రహదారుల గురించి ప్రస్తావిస్తే దానికీ ఇదే తరహా వాదన చేస్తారు - రాష్ట్రంలో ఇంకే పనీ చెయ్యకుండా ఆ ఒక్క పనే చేసినట్టు దానికి అంత సమయం ఎందుకు పట్టిందని అడుగుతారు.కానీ, తరుగులో వచ్చి కేంద్రం నుంచి సాయం లేని పరిస్థితుల్లో ఉండి ఒకేసారి అన్ని పనుల్ని తలకెత్తుకుని ఒక్కొక దాన్నీ ఆమాత్రం చెయ్యడం కూడా చాలా అద్భుతమైన విషయమే!చంద్రబాబు చేశానని చెప్తున పనులకి వీడియో సాక్ష్యాలు ఉన్నాయి.తెదెపా వాళ్ళు కూడా చాలా ధీమాగా వచ్చి చూసుకోండనే అంటున్నారు.కాబట్టి చంద్రబాబుని గెలిపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దిక్కులు చూడాల్సిన పని లేదు.

      Delete
    3. manchi analysis sir

      Delete
  4. http://mattersindia.com/2018/12/sixth-us-church-set-to-become-hindu-temple/

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...