Monday 8 December 2014

మార్క్సిష్టు సిధ్ధాంతాన్ని హిందూ ధర్మం ప్రకారం విమర్శించి వెక్కిరించ వచ్చునా?

               రామాయణం పని పట్టడం అయ్యింది,ఇక ముతప్పాళ కురంగీన్యాకమ్మ ఇప్పుడు భారతం మీద పడింది!యేమిటి నీ అధికారం అంటే ఆవిడా ఆవిడ పంఖాలూ చెప్పేది యేమిటంటే మా మార్క్సిష్టు సిధ్ధాంతం లోకంలో అన్నింటి కన్నా గొప్పది, దానితో దేనినయినా విశ్లేషించ వచ్చు గాబట్టి ఒక మార్క్సిష్టు భారతాన్ని యెలా అర్ధం చేసుకోవాలో వివరించే హక్కు మాకు వుంది అని అంటారు? పైగా మీరు విమర్శలకి యెందుకు భయపడుతున్నారు అని మనల్ని దబాయిస్తారు! అందుకే ముందు ఇతర మతస్తుల పుస్తకాల్ని మీ మతం ప్రకారం అర్ధం చేసుకోవడం తర్వాత చేద్దురు గానీ మీ మతం లో వున్న మూఢనమ్మకాల సంగతి యేమిటి అని నేను అడుగుతున్నాను!

         ఇక్కడ బ్లాగుల్లో చర్చించే ఒక కుర్ర కమ్యునిష్టు మనిషి వస్తుగత వాది అనే స్మిత్తుగారి ఆర్ధిక సూత్రాన్నే మార్క్సు కూడా వొప్పుకుంటాడు అని చాలా గట్టిగా చెప్తున్నాడు!మరింక కొత్తగా మనం మార్క్సిజాన్ని యెందుకు ఫాలో అవ్వాలి?తన లక్ష్యానికి తగ్గట్టుగా కొత్త ఆర్ధిక శాస్త్రం యేదీ కనుక్కోలేదు మార్క్సు! స్మిత్తుగారి ఆర్ధిక శాస్త్రాన్నే ఫాలో అవుతూ మరి స్మిత్తుగారు చెప్పేదానికన్నా భిన్నమయిన సమాజాన్ని యెట్లా సృష్టిద్దామనుకున్నాడు మార్క్సు మహాశయుడు? కమునిష్టు పార్టీకి సంబంధించిన ప్రతి వాడూ ఇప్పటి వ్యవస్థ లన్నీ ఫెయిలవటానికి వాటికి సరయిన ఆర్ధిక ప్రణాళిక లేకపోవటమనీ ప్రతిదానికీ ఆర్ధిక శాస్త్ర పునాది వుండాలనీ చెప్తూ ప్రతి లక్ష్యానికీ ఫ్రేం వర్కు చాలా అవసరం అని సొల్లు వాగుతూ కూడా వర్గరహిత సమాజాన్ని సృష్టించే కొత్త వ్యవహారానికి ఇప్పటి స్మిత్తుగారి ఫ్రేం వర్కు సరిపోతుందని యెలా అంటున్నాడు?

            మనిషి వస్తుగత వాది - అంటే అతని ప్రపంచం మొత్తం తనతోనే మొదలవుతుంది. మరి ఈ బలమయిన నేను అనే మౌలిక లక్ష్యానికీ కమ్యునిష్టు సిధ్ధాంతం మనిషికి చెప్పే తొలి సుభాషితమయిన స్వంత ఆస్తి రద్దుకీ మధ్య సమన్వయం యేలా కుదురుతుంది? మిగతా మతాల వాళ్ళు "నేను , నాది అనేది వొదులుకోండి, అంతా మంచిగా వుంటుంది" అని చెప్తున్నట్టు మీ మతంలో దానికి ప్యారలల్ గా వినిపించే స్వంత ఆస్తి రద్దు అనే ఒక తింగరి మాటని ప్రచారంలోకి తెచ్చారు, కానీ స్వంత ఆస్తి రద్దు సాధ్యమా? మీ ఇంట్లో గోడ మీద వేలాడే మార్క్సు గారి బొమ్మ అక్కడికి యెలా వచ్చింది?కొంటే వచ్చింది,అవునా కాదా? కొనాలంటే ఒక్క రూపాయి అయినా సరే మీ దగ్గిర స్వంత ఆస్తి వుండి తీరాలి, అవునా కాదా?

           ఇక దోపిడీ గురించి "కన్నంలో దొంగని కన్నంలోనే కనుక్కున్నాడు" - అని డప్పాలు కొదతారు!ప్రపంచం మొత్తం జనాభా అంతా ఇద్దరికే కుదించుకు పోయినా ఆ ఇద్దరి మధ్యనా అమ్మకం, కొనుగొలు అనే ట్రాన్సాక్షన్లు యెన్ని జరిగినా యే ఒక్క అమ్మకం-కొనుగోలు వ్యవహారమూ 50-50 గా వుండదు, త్రాసు యెటో ఒక వైపు మొగ్గుతుంది! అమ్మేవాడి అవసరం గట్టిదని తెలిస్తే కొనేవాడు చెట్టెక్కి కూర్చుంటాడు, కొనేవాడికి అది తప్పనిసరిగా అవసరం అని తెలిస్తే అమ్మేవాడు చెట్టెక్కి కూర్చుంటాడు - వెయ్యేళ్ళకి ముందూ ఇదే జరిగింది, ఇప్పుడు మన కళ్ళముందు ఇదే జరుగుతున్నది,వెయ్యేళ్ళ తర్వాతా ఇదే జరుగుతూ వుంటుంది మీ కమ్యునిష్టులు ప్రభుత్వాలు నడుపుతున్న చోట్లతో సహా? ఇంతోటి గొప్ప నిజం మార్క్సుగారు చెప్తే తప్ప తెలుసుకోలేని మీరే మిగతావాళ్ళతో పోలిస్తే పిచ్చి పుల్ల్లయ్యలు!

              అదనపు విలువని సమాజపరం చెయ్యడం అనేది స్వంత ఆస్తిని మనిషి వొదులుకోగలిగినప్పుడే సాధ్య పడుతుంది! స్వంత ఆస్తి రద్దుకి మీకు పిచ్చపిచ్చగా నచ్చేసిన ఈ కొత్తమతాన్ని ప్రచారం చెయ్యడానికి మీరు ముచ్చటగానే వొప్పుకున్నా మిగతా వాళ్లకి "నేను,నాది" అనేవాటిపట్ల మమకారాన్ని యే విధంగా వొదిలిస్తారు?ఈ అదనపు విలువని సమాజపరం చెయ్యడం అనేది మార్క్సు కన్నా చాలాకాలం ముందే భారతదేశంలో కొంతకాలం చాలా నిక్కచ్చిగా అమలు జరిగిందని మీకు తెలుసా?

             ప్రపంచంలో వున్న ముసల్మాను లంతా మక్కా లోని కాబా దగ్గిర నమాజు చేసినట్టు మీరు మాత్రం లెనిన్ శవం ముందు పిడికిళ్ళు బిగించి "విప్లవం వర్ధిల్లాలి" అని పొలి కేకలు వేస్తే అది మీరు మీ మతపెద్దల పట్ల చేశారు గాబట్టి గొప్ప,అదే ఇతర మతస్తులు రాముడికో పీర్లకో శిలువకో చేస్తే మూఢనమ్మకం,దీన్ని సిధ్ధాంత నిబధ్ధత అనరు డబుల్ మొరాలిటీ అంటారు, అవునా కాదా? మార్క్సిష్టు సిధ్ధాంతం అన్నిటికీ పరిష్కారాల్ని చూపిస్తుంది అని మీరు యే ఆధారమూ లేకుండా చెప్పినా అది తావీజు మహిమ కాదు, ఇతర్లు అదే పని చేస్తే అది మతమౌఢ్యం, యేమి వాదనా చమత్కృతి?

        లెనిన్ పోయాక స్టాలిన్ వీర విక్రమోపేతంగా విజ్రంబిస్తుంటే దాన్ని వ్యతిరేకించిన వాళ్ళలో మగవాడైన ట్రాట్స్కీ దేశం వొదిలిపెట్టిపోగా ఆడదైనందుకు లెనిన్ భార్య కుండలు కడుక్కుంటూ ఇంటికి మాత్రమే పరిమితమైపోతే ఆ పురుషాధిక్యత గురించి మాట్లాడని వాళ్లకి మహాభారతంలో పాత్రల మీద జాలి పొంగుకొస్తున్నది, యేమి విడ్డూరం?!వాస్తవ జీవితంలో తను వున్న కమ్యునిష్టు పార్టీ లోనే పాతుకుపోయిన పురుషాధిక్యతని వదల గొట్టలేని ఈ ముగ్గుబుట్ట ముసిల్ది కల్పిత పాత్రల గురించి జాలిపడుతున్నది,కూటి కోసం కోటి విద్యలు?! ముగ్గురు మొగుళ్ళని మార్చిన ము.రం.నా ద్రౌపది అయిదుగురు భర్తల గురించి వెక్కిరిస్తే యెట్లా వుంటుంది?తను ఒక మొగుడితో కాపర ముంటున్నప్పుదు మరో మొగాడితో తిరిగిందా యెప్పుడయినా? అంటే దాంపత్యం విషయంలో తన సొంత జీవితంలో తను కూడా సీత లాగే పవిత్రంగానే గడిపింది కదా? మరి తను పాటించిన ధర్మాన్నే వాల్మీకి కావ్యరూపంలో చెప్తే తట్టుకోలేక విమర్శించడం అంటే నిన్ను నువ్వు చెప్పుచ్చుక్కొట్టుకోవటం అని కూడా తెలియని ఈ దేబెమొహం పెద్ద తెలివయినదానిలాగా ఇవ్వాళ కొత్తగా దేన్ని విమర్శిస్తున్నది?


హిందువులు ఇదివరకట్లా లేరు,తస్మాత్ జాగ్రత్త?!

31 comments:

  1. సరిగ్గా ఇవే భావాలు నాకు పొద్దున అనిపించాయి. వీళ్ల (అంటే కమ్యూనిస్టులు) విచిత్ర వాదనలు ఇంకా చాలా ఉంటాయి. మచ్చుకు.. మన శ్రీశ్రీశ్రీ గౌరవనీయులైన బ్రహ్మశ్రీ పూజ్యశ్రీ విశేఖరుల వారి బ్లాగులో అయితే ఇలాటి చిత్రాలు చాలా కనపడతాయి. ఉదాహరణకు.. చైనా ఆక్రమించుకుంటున్నట్టుగా జపాన్ చెబుతున్న దీవులు ఒకప్పుడు చైనావేనట (చూడుడు: http://teluguvartalu.com/2014/09/03/%E0%B0%8E%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%90%E0%B0%B2-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A1%E0%B1%80-%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%80-%E0%B0%A4/). కాబట్టి చైనాకు ఇచ్చేయాలట. కానీ, కాశ్మీర్‌లో మాత్రం అక్కడి ప్రజల (కమ్యూనిస్టుల దృష్టిలో ప్రజలు అంటే దృష్టిలో హిందువులు కానివారు. హిందువులకు ప్రజలుగా బతికే అర్హత లేదు. కుక్కల్లా, కుక్కిన పేనుల్లా పడి ఉండాలి) అభిప్రాయ సేకరణ కావాలంటారు. టిబెట్ ప్రజలందరూ పాపం ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, ’చైనా రావాల్సిందే.. మమ్మల్ని, మా దేశాన్ని దరిద్రపు, దొరహంకార, ఫ్యూడలిస్టు దలైలామాల నుంచి విముక్తి గరపాల్సిందే అని రెడ్ కార్పెట్ వేస్తేనే టిబెట్ ప్రజలకు చైనా విముక్తి కల్పించిందని వారి (మళ్లీ కమ్యూనిస్టులే) ప్రగాఢ నమ్మకం. టిబెట్టే చైనాది కాదు మొర్రో అని మనం అంటే.. టిబెట్ సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ కూడా చైనాదే అని మన కమ్యూనిస్టుల విశ్వాసం. అంచేత చైనాకు అరంగుళం అన్యాయం జరిగిపోయినా గగ్గోలు పెట్టేస్తారు. అదేమని మీరు అడిగారనుకోండి.. మిమ్మల్ని మోదీ వీరభక్తుడి కింద జమేసేస్తారు తస్మాత్ జాగ్రత్త. కామెంట్లలో కొంచెం వ్యంగ్యం ఉంటే దాన్ని ఎగతాళి కింద జమగట్టి ’నేను ప్రచురించను.. ప్రచురించే చోట చేసుకో పొండి’ అని ఎదురుదాడికి దిగుతారు. ఇలా చెప్పకొంటూ పోతే బోలెడన్ని తమాషాలు.

    ReplyDelete
  2. మోరల్ పోలీసింగ్ అంటే అది హిందువులు మాత్రమే చేసే పని అని కూడా వీరి నమ్మకం. వాడెవడో వేదిక మీదే గౌహర్ ఖాన్‌ను ఈడ్చిపెట్టి చెంపమీద కొట్టినా ఒక్క పోస్టు కూడా రాలదు పాపం వీరి నుంచి. అదే పని ఏ హిందువో చేసి ఉంటేనా.. పేద్ద పోస్టు, దానికింద ఆపాలు, ఈపాలు అంటూ బోలెడన్ని కామెంట్లు కూడా రాలిపడేవి. ఇలాంటి సందర్భాల్లో వ్యూహాత్మక మౌనం పాటించడం వీర కమ్యూనిస్టుల ప్రథమ లక్షణం. ఇంకోటి కూడా ఉంది.. వక్ఫ్ భూములను పరిరక్షించాలని గొంతు చించుకునే కమ్యూనిస్టులు దేవాలయాల భూముల్ని మాత్రం అందరికీ పంచేయాలంటారు. బక్రీదు పండగనాడు మేకల్ని, పొట్టేళ్లని దేవుడికి బలిచ్చి ముస్లింలు తినొచ్చట. హిందువులు జంతు బలులు చేస్తే మాత్రం.. మూఢనమ్మకం. హిలేరియస్ కదూ. వీళ్లకి ఉత్తమ కమెడియన్లు అనే అవార్డు ఇచ్చేయవచ్చు.

    ReplyDelete
  3. అప్పల్నాయుడు అనే మీ పేరుకి తగినట్టుగానే ఉంది మీ పల్లెటూరి తెలివి. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం (vigilante justice)ని ప్రపంచంలో ఎక్కడా అనుమతించరు. అలా అనుమతిస్తే ఒకడు ఒక స్త్రీని రేప్ చేసి, ఆమె ప్రవర్తన బాగాలేదు కనుకనే తాన్ను చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమెని రేప్ చేసాను అని చెప్పుకోగలడు.

    ReplyDelete
  4. రంగనాయకమ్మ ను వదిలేద్దాం..
    టపా సూటిగా..బాగుంది.అదనపు విలువ (surplus value) గురించి మీరు తేల్చేసిన విధానం బాగుంది.ప్రపంచం లో ఇద్దరే మిగిలినా కూడా ఒకడు ఇంకొకడి నుంచీ లాభం లాగాలని చూస్తాడు.కానీ సమస్య ఆ లాభం వలన మాత్రమే రాదు. ఆ కొద్ది లాభాన్ని తన రోజువారీ అవసరాల కోసం ఉపయోగించుకొంటే (ప్రవీన్ షేర్లు అమ్మి, తన అవసరాల కోసం ఉపయోగిస్తున్నట్లు) సమాజానికి పెద్ద నష్టం లేదు. ఆ లాభం తో పిల్లలను పుట్టించి మరిన్ని లాభాలను పోగేసి, మర్రి చెట్టు లా విస్తరించినపుడు మాత్రం అది కాపిటలిస్మ్ అవుతుంది. మార్క్స్ గారు అదనపు విలువ కనిపెట్టాడంటె, ఏమిటో తెలుసుకొందామని కాపిటల్ చదివినపుడు, "ఓస్ ఇదేనా అదనపు విలువ అంటే", అనిపించింది. కానీ మార్క్స్ గారి రోజుల్లో దానిగురించి ఆలోచించగలగటం గొప్ప విషయమే కావచ్చు.మార్క్స్ గారి లా సమస్య అదనపు విలువ లో కాకుందా, బాగా విస్తరించిన వ్యాపారం లో, కొన్ని లక్షలమంది నుంచీ కొంచెం కొంచెం అదనపు విలువ వచ్చి ఒకరిదగ్గరే పోగుపడటం లో ఉంది. అదనపు విలువ వలన ఒక అమ్మకం దారు(as an employee who sells his effort) గా మనకి పెద్ద నష్టం ఉందదు. కానీ ఒక కొనుగోలు దారు గా పాల నుంచీ, కారు నుంచీ, ఇల్లు దాకా, మనం ప్రతి వస్తువు మీదా సగటున ఓ 30%-40% అధికం గా చెల్లిస్తున్నాం. రూపాయి ఖర్చుతో తయారయ్యే పెప్సీ వంటి వాటికి 20 రూపాయలు చెల్లిస్తున్నాం. అంటే మిగిలిన 19 రూపాయలూ షారూఖ్, మహేష్ బాబు లాంటి వాళ్ళ జేబుల్లోకీ, ఇంద్రా నూయి గారి బోనస్ కీ, పెప్సీ ఖాతా దారుల జేబుల్లోకీ వెళ్తున్నాయి. అదే పెప్సీ ఉత్పత్తి చేసిన ఖర్చుకే అమ్మితే 2000% తక్కువ రేటు కే దొరుకుతుంది.
    ఇక మార్క్స్ గారి బొమ్మని డబ్బులు లేకుండా కొనుక్కోలేరు, కరస్టె, కానీ సోషలిజం లో కూడా డబ్బుని బ్యాన్ చేయరు. డబ్బుని ని దైనందిన అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.డబ్బు ని పెట్టుబడి కి మాత్రం ఉపయోగించరు. సోషలిజం అంతే డబ్బు లేకుండా ఉండటం కాదు, క్యాపిటల్/లాభం లేకుండా ఉండటం. (రోజువారి transactions కోసం డబ్బు ఉంటుంది. అది సౌకర్యం కూడా. సమస్య డబ్బు తో కాదు క్యాపిటల్/లాభం యొక్క విస్తరణ తో తో). సోషలిజం అంతే absolute equality కాదు.పని చేసినోడికి చేసినంత చెల్లించటం. కష్టమైన ఉద్యోగాలకి ఎక్కువ చెల్లించటం. డబ్బు తో లాభాలను సంపాదించటాన్ని మాత్రం బ్యాన్ చేస్తారిట! వంశ పారంపర్యం గా వచ్చే డబ్బుని బ్యాన్ చేస్తారు. ఎందుకంటె దాని వలన అసమానతలు పెర్గుతాయి. ఓ enterprise కి డైరెక్టర్ ఉన్నడనుకోండి, అతని జీతం ఆ enterprise తీసే లాభాల లో పర్సెంటెజ్ గా కాకుండా (అసలు లాభాలే ఉండవనుకోండి),ఆ enterprise ఉత్పత్తి లో చూపిన సామర్ధ్యాన్ని బట్టి ఉంటుంది. మొత్తం మీద ఈ వ్యవ్స్థ ఒక abolutes ఉండే ఒక utopia/ideal system కాదు. పేట్టుబడి దారీనే, తనలోని కొన్ని లోపాలను వదిలించుకొంటే వచ్చే వ్యవ్స్థ. కాకపోతే మార్క్స్ గారు దాన్ని speed up చేయటానికి విప్లవం అనే ఆలోచన చేస్తే, లెనిన్ గారు ఆచరణ లో పెట్టటానికి ప్రయత్నించి విఫలురైనారు.

    ఈ టపా లో నాకున్న కొన్ని ప్రశ్నల కు సమాధానాలు దొరికాయి. ఈ టపా లో మీరడిగిన కొన్ని ప్రశ్నల కి సమాధానాలు ఈ నా టపా(http://wp.me/pGX4s-UQ) లో దొరుకుతాయేమో చూడండి.

    ReplyDelete
  5. అప్పలనాయుడు గారు, గ్రేట్ ఆంధ్రాలో ప్రసాద్ కొత్తగా ఈ జాబితాలో చేరాడు. ఆయన చాలా ఇంగ్లిష్ పత్రికలు తిరగేసి పసలేని ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. గుజరాత్ లో ఎదో ఒక జైన పుణ్య క్షేత్రం ఉండే ఊరులో, వెజి టేరియనిజం అమిత్ షా ప్రోత్సహిస్తున్నారని, దేశంలో ఎదో ఒకటి రెండు ఊర్లలో శాఖాహారానికి అనుమతిస్తే దేశసంస్కృతి అంతా అస్త్వవ్యస్థమైనట్లు బాధపడిపోయారు. శాఖహారం వలన మనదేశం ముసలి జంతువులకు తిండిపెట్టి, మేపలేక ఆర్ధికవ్యవస్థ తలక్రిందులౌతుందని ఆందోళనపడిపోయారనుకోండి.

    ReplyDelete
  6. TV ని తీసుకొంటే, టీ వీ కంపెనీ వాడు మనకి ఓ 20% ఎక్కువేసి అమ్మాడనికొందాం. టీ వీ కంపెనీ వాడికి, పిక్చర్ ట్యూబ్ కాంపొనెంట్ వాడూ,LCD కాంపొనెంట్ వాడూ, మదర్ బోర్డ్ వాడూ ఓ 20% ఎక్కువేసుకొని అమ్మారను కొందాం. మదర్ బోర్డ్ వాడికి, ఫ్యాబ్ వాడు జెనరల్ గా ఓ 20% మార్జిన్ తో అమ్ముతాడు (ఇది నాకు తెలుసు). ఇలా టీవీ లో ని కాంపొనెంట్ లన్నీ వివిధ్ధ దశల లో అదనపు విలువ తో వచ్చి చేరుతాయి. మొత్తం అదనపు విలువలన్నీ కలుపుకొంటే తడిసిమోపెడవుతుంది. ఈ అదనపు విలువలన్నె మైనస్ చేస్తే మనకి LCD టీవీ చాలా చాలా చీప్ గా దొరుకుతుంది.
    కాబట్టీ అదనపు విలువ అనే దానిని isolation లో చూడలేం.
    ఇక క్యాపిటలిస్త్ సమాజం లో ఉండే ద్రవ్యోల్బనమూ వగైరాలను పరిగణిస్తే, ఇవాళ x రూపాయలు ఉన్న వస్తువు ఖరీదు రేపు సాధారణం గా పెరుగుతుంది. కొన్ని రేట్లు మూడు సంవత్సరాల కోసారి దబల్ అవుతున్నాయి. అంటె, కష్టపడి జీతం ద్వారా సంపాదించినమన డబ్బుని క్యాపిటలిస్ట్ కొట్టేస్తున్నట్లే లెక్క (క్యపిటలిస్ట్ తన కాంపొనెంట్స్ కోసం చెల్లించిన ఎక్స్-ట్రా ఇంఫ్లేషన్ ఖర్చుని మన మీదికి నెడతాదు.అమ్ముడవకపోతే ఉత్పత్తి ఆపెసి, వేరే లాభసాటి వ్యాపారం చూసుకొంటాడు.కానీ మనం అలా చేయలేమే. జీవితావసరాల కోసం కొంటూనే ఉండాలి)మన జీతాలు ఆ మేరకు పెరుతాయా? చెప్పలేం.

    ReplyDelete
    Replies
    1. కేపిటలిస్ట్ అనే ఒక పదం తీసుకొచ్చి, దేశ కాలమాన పరిష్తితులను పరిగణలోకి తీసుకోకుండా విశ్లేషణ చేస్తే అది అసంపూర్ణం. ఇదే మార్క్సిస్ట్ భావజాలం తో 1960-1980 ల మధ్య విశ్లేషించిన వారు వారి సిద్దాంతానికి అనుగుణంగా వైశ్యులను దోపిడివర్గం గా చిత్రికరించారు. ఇక వారి ప్రపగండా కి సాహిత్యాన్ని,సినేమాలను ఎంచుకొన్నారు. పాత సినేమాలలో చూపించిన దోపిడి వర్గం పప్పు,ఉప్ప్పు నూనే అమ్ముకొనే శెట్టిగార్లు. వారు లాభాల కోసం బియ్యం, పప్పుల లో కొన్ని రాళ్లు, చక్కరలో రవ కలిపి ప్రజలను మోసం చేసినట్లు. వ్యాపారులు ప్రజలను దోచేసి వారి జీవితాలతో ఆడుకొన్నట్లు, అదొక పెద్ద నేరం, ఘొరం అయినట్లు చూపేవారు. అది ఆనాటికాలం దోపిడివర్గాన్ని వారు అన్వయించింది. అసలికి చిన్న దుకాణాలు పెట్టుకొని నడిపే వారు దోపిడి వర్గమా? ఆనాడు వ్యాపారం లో నష్టపోయిన ఎంతో మంది వైశ్యులు, ఇతర వ్యాపారులు ఉన్నారు. అదే ఈ రోజులలో వేల కోట్లు వ్యాపారం చేసినవారు దివాల తీసినట్లు,వారి కుటుబాలు వీధినపడ్డట్లు ఎక్కడ కనపడటంలేదు. ఈ మధ్య కాలంలో వ్యాపార రంగంలోకి వచ్చిన వారు సంవత్సరానికి వందలకోట్లు లాభాలు ఆర్జించటమేగాక, భారి ఎత్తున్న వేల కోట్లలో అప్పులు చేశారు. ఒక మాజి యం.పి.గారు ఏడు వేల కోట్ల వ్యాపారాన్ని, రాజకీయాలనుంచి వైదొలగటం తో వేరే వారికి వెంటనే అమ్మేశారు. ఇంకొకరు ఐ.పి.యల్. క్రికెట్ లో పెట్టుబడి పెట్టటానికి ఒకే పేపర్ కంపెనిని ఎంతో మందికి అమ్మి బోర్డ్ తిప్పారు. 1960 లో చేసింది వ్యాపరమే, 2010 వీరు చేసింది వ్యాపారమే. ఇందులో ఎవరు నిజమైన కేపిటలిస్ట్? ఈ రెండు రకాలవారిని వ్యాపారం చేస్తున్నారు గదా అని కేపిటలిస్ట్ లని ఒకే గాటన కట్టేయవచ్చా? ఎవరికి మార్క్స్ గారి సిద్దాంతం అన్వయించాలి> ప్రస్తుత కొత్తరకం వ్యాపారులతో పోలిస్తే వీధికొసలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దుకాణంలో కూచొని వ్యాపారంచేసుకొనే వారు దోపిడిదారులెలా అవుతారు?

      Delete
    2. నిరంతరం మార్పు చెందే సమాజంలో ఎప్పుడో రెండొందళ్ల ఏళ్ల క్రితం రాసిన రాజకీయ ఆర్ధిక శాస్త్ర పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుత సమాజాన్ని విశ్లేషించటం, ఎవరికి వారు వారి ఇంటర్ప్రెటేషన్ లు చేసుకొని ఆయన చెప్పినట్లు జరుగుతున్నాదనో, జరగబోతుమందనో భావించటం సరి అయిన పద్దతి కాదు. మార్క్స్ కాలం నాటి కేపిటలిజానికి ఇప్పటి కేపిటలిజానికి పోలికేలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్దిచెందిన దేశాలలో ఆర్ధిక వ్యవస్థ నడిచే తీరే వేరు. ట్రిలియన్ డాలర్ల క్వానిటిటేటివ్ ఇజింగ్ ( QE ) కాలంలో, మార్క్స్ కాలం నాటి అదనపు విలువల విశ్లేషణ ఏపాటిది?

      Delete
    3. You first comment completely agreed.
      Second comment-
      1.నిరంతరం మార్పు చెందే సమాజంలో--> ఈ ముక్క మార్క్సే చెప్పాడు.
      2.మార్క్స్ కాలం నాటి కేపిటలిజానికి ఇప్పటి కేపిటలిజానికి పోలికేలేదు.-->ఇప్పటి కాపిటలిస్మ్ చాలా మారింది..కానీ పోలికే లేదనటం కొంచెం అతిశయోక్తి అవుతుంది.
      3.ఎప్పుడో రెండొందళ్ల ఏళ్ల క్రితం రాసిన రాజకీయ ఆర్ధిక శాస్త్ర పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుత సమాజాన్ని విశ్లేషించటం, ఎవరికి వారు వారి ఇంటర్ప్రెటేషన్ లు చేసుకొని ఆయన చెప్పినట్లు జరుగుతున్నాదనో, జరగబోతుమందనో భావించటం సరి అయిన పద్దతి కాదు.--> ఆయన చెప్పింది ఇప్పటికీ నిలుస్తుందా లేదా అని ఆలోచించటం లో తప్పు లేదు.. కొంపదీసి, అలా ఆలోచించటాన్ని కూడా బ్యాన్ చేయాలంటారా ఏమిటి?

      4.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్దిచెందిన దేశాలలో ఆర్ధిక వ్యవస్థ నడిచే తీరే వేరు. ట్రిలియన్ డాలర్ల క్వానిటిటేటివ్ ఇజింగ్ ( Qఏ ) కాలంలో, మార్క్స్ కాలం నాటి అదనపు విలువల విశ్లేషణ ఏపాటిది? -->>కరక్టే తీఉ వేరే..కానీ ఆయన చెప్పిన పరిధిని దాటి పోలేదనుకొంటాను. రిసెషన్ల గురించీ, సెంట్రల్ బ్యాంకుల గురించీ, democtatic political economy గురించీ మాట్లాడాదు. మనం ఇంకా ఆ అలాంటి political economy లోనే ఉన్నాం. quantitative easing అనే మాట అప్పుడు లేదు కానీ, రిసెషన్ల సమయం లో అప్పటి బాంకీ ల ప్రవర్తన కరెక్ట్ గా ఇప్పటి federal reserve ప్రవ్ర్తనని పోలి ఉంటుంది. మన వేదాలూ, పురాణాలూ ఎప్పుడో వేల యేళ్ళనాటివి, ఇప్పుడు అంతా డేతింగ్, మేటింగ్, స్త్రీ హక్కులూ. కాబట్టీ రామాయణం లో చెప్పిన ఆదర్శ దాంపత్యం,భ్రాతృ ప్రేమ ఇప్పుడు అప్లై చేయలేమంటే ఎలా ఉంటుంద?. కాబట్టీ "అన్నీ కాపిటల్ లోనే ఉన్నాయిష" అని నేను అనను గానీ, మార్క్స్ ఇప్పుడు పూర్తిగా "irrelavant" అని కూడా అనను.
      ఇంతకి QE మార్క్స్ చెప్పినదానికి ఎల అతీతమో చెప్తారా?

      Delete
  7. @Marxist Hegelian
    పశ్చిమ వంగ దేశంలో వ్యతిరేకుల్ని చంపి శవాల ఆనవాళ్ళు కూడా దొరకకుండా భూమిలో పాతిపెట్టదం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కిందకి రాదా?వారి ప్రభుత్వం సమూలంగా మమతక్కగారి చతిలోకి వెళ్ళేవరకూ అంతా సజావుగానే జరిగిపోయిందిగా,మరి అప్పల్నాయుడు గారిది పల్లెటూరి తెలివి అయితే తమరిది యే రకపు తెలివి?

    యెలాగూ వచ్చారు,నా మొదటి ప్రశ్న స్వంత ఆస్తి రద్దు గురించి చెప్పండి?మొత్తం ఆరు ప్రశ్నలు వున్నాయి, మొదటిదానికి జవాబు చెప్పాక అడగటం కోసం దాచి వుంచాను!

    ReplyDelete
  8. @బొందలపాటి
    అదనపు విలువ కొన్ని ట్రాన్సాక్షన్స్ యెక్కువసార్లు రిపీట్ అయిన తర్వాతనే వునికిలోకి వస్తుందంటారు?!

    ReplyDelete
  9. Marxist theory is a caricature of Christian doctrine, rationalized and secularized by men who grew up within the Church and who at times insisted they were speaking for the Church. Communism is religion turned inside out, so to speak. The theology it contains we can discuss under five general headings: its doctrine of God, its view of sin, its belief in salvation, its teaching on man, and its concept of last things. We shall try to spell out each of these elements as we go along.


    The Theology of Communism

    http://www.airpower.maxwell.af.mil/airchronicles/aureview/1969/jan-feb/scharlemann.html

    ReplyDelete
    Replies
    1. Superb article,
      without knowing all these details, I described it as religious practice.How similar to my blog post Idea?
      AMAZING!

      Delete
    2. Interesting read-Both are similar, though not same

      Delete
  10. కాదండీ, ఎక్కువగా రిపీట్ అవ్వటం వలన it pinches అని చెప్పదలచుకొన్నాను. అలా రిపీత్ అయ్యే వస్తువులన్నీ ఓ ఉత్పత్తి తయారయ్యే చైన్ (silicon fab-> hardware cards->PC assembly->software) లో ఉంటే వాటి మార్జిన్ ప్రభావం multiply అవుతుంది.

    ReplyDelete
  11. మీకు ఇప్పుడు స్పష్టత వచ్చిందటారా? ఈ క్రింద రాసింది ఒకప్పుడు వేరే ఫోరంలో జరిగిన చర్చను కాపి చేసి పెట్టు కొన్నాను. చదువుకోండి. మీకింకా స్పష్టత వస్తుంది.
    It is ironical that a single Agency ( Food & Drug Administration, FDA) is conveniently created to regulate both food & drugs - the harsh reality is that FDA permits food chains, McDonald's, KFCs, Burger Kings to sell junk that mass-manufacturers diseases & permits pharma companies to mass-manufacture drugs to treat those diseases - all under one roof.

    We are being manipulated everyday by Corporations. USSR Tried to achieve "EQUITABLE DISTRIBUTION OF WEALTH" , USA used CAPITALISM beautifully to achieve "EQUITABLE DISTRIBUTION OF DEBT" by selling cheap LOANS and controlling people is easy if you give them a LOAN !

    The Vatican controls loans worth trillions through mortgages on the largest pieces of real estate belonging to the Churches, like the Church of England by permitting MNC banks to create MBS( mortgage backed securities). The CEOs of all major European & American banks attended the last Pope's funeral.

    The educated & the intellectuals can be easily enslaved through loans.

    The MBS led to the Subprime crises of 2008 and the economic collapse. Capitalism itself an extension of the Judeo-Christian ideology. Ayn Rand complicated it more by calling it Objectivism and Alan Greenspan who ran the Federal Bank was her student and is famously quoted for his " irrational exuberance" statement. Alan Greenspan for 20 years extracted trillions of dollars from the American middle class and sharply benefitted the rich and protected big businesses.

    ReplyDelete
    Replies
    1. Loans are instruments of modern, though complex form of slavery

      Delete
    2. పైన చర్చలో పాల్గొన్నవారు ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.థామస్ పికెటి రాసిన్ "ది కేపిటల్" అనే బుక్ గురించి చర్చస్తూ, మళ్లీ ఆర్ధికవ్యవస్థ కుదుపులకు లోనౌతున్న సందర్భం లో , ఆ దేశ ఆర్ధిక వ్యవస్థలను చర్చించే క్రమంలో పశ్చిమదేశాల వ్యవస్థల మూలాల పై అది కమ్యునిజమైనా, కేపిటలిజమైనా మతం తాలుకు ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉందని చర్చించటం జరిగింది.

      Delete
    3. దేశ ఆర్ధిక వ్యవస్థలను చర్చించే క్రమంలో పశ్చిమదేశాల వ్యవస్థల మూలాల పై అది కమ్యునిజమైనా, కేపిటలిజమైనా మతం తాలుకు ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉందని చర్చించటం జరిగింది.
      ?
      అంటే రాజకీయాలను కూడా మతమే శాసిస్తుందన్న మాట అది కమ్యునిజమయినా క్యాపిటలిజమయినా?అందుకే ము.రం.నా లాంటి వాళ్ళు మతం మీద అంతగా విరుచుకు పడేది - గెలవలేని శత్రువు కదా?!

      Delete
    4. ఇక్కడ మతం అంటే అబ్రహమిక్ మతాలు. మీరు పశ్చిమదేశాల మేధావులు ,శాస్రజ్ణులపై మత ప్రభావం సంపూర్ణంగా ఉంది. అక్కడి శాస్రవేత్తలైతే ఇప్పటికి వేలకోట్లు ఖర్చు పెట్టి, ఏ ప్రయోగంచేసిన, చివరికి బైబిల్ లో రాసింది నిజమ కాదని నిరుపించటానికి, కృషిచేస్తూంటారు. ఈ ఇరవయవ శతాబ్దంలో ఆ గ్రంథన్ని నమ్మకపోతే పక్కన పెట్టవచ్చు. కాని వారు అలా చేయరు. బైబిల్ లో రాసిన ఒక లైన్ పట్టుకొని అది అబ్దం అని చెప్పటానికి వారు జీవితకాలం ప్రయత్నిస్తారు. వారిని చూస్తే మన హిందూపురాణాల లో విష్ణువుని ద్వేషిస్తూ ఆయన్నే ఎప్పుడు తలచుకొనే జయా, విజయుల మార్గం అనుసరిస్తున్నారనిపిస్తుంది. అదే మనదేశం విషయానికొస్తే దేవుడి కాన్సేప్టే వేరు.మూడు కోట్ల దేవుళ్ళు, గుడులు గోపురాలన్ని స్థానిక ప్రజల, ప్రభుత్వ ఆధీనంలో ఉంట్టూ వచ్చాయి.
      పశ్చిమదేశాల మేధావులు తార్కికత ముందు మనదేశం వారు సరిపోరు. బెట్రాండ్ రసేల్స్, అయాన్ రాండ్, కారల్ మార్క్స్ మొదలైన వారిని చూడండి. వాళ్లు నమ్మినదానిని ఎంత బలంగా చెపుతారంటే ఇక వేరే వాదనకి తావే ఉండదు. అక్కడ అభివృద్దిచెందిన బాంకింగ్, ఇండస్ట్రి, కార్పోరేట్,న్యాయ వ్యవస్థల వెనుక ఈ మేధావుల ఆలోచనా ప్రభావం ఎంతో ఉంది. వారు ఒక మార్గం లో పోవటానికి నిశ్చయించుకొన్న తరువాత దానినే అమలుచేస్తూ, కొనసాగిస్తూ ముందుకు వేళిపోయారు గాని, మనవలే తప్పొప్పులను చర్చిస్తూ కూచోలేదు. అందులో ఎంతో మందికి నష్టం జరిగిన వారేమి పశ్చాతాప పడినట్లు ఎక్కడా నా దృష్టికి రాలేదు.

      అన్నిటికనా వింత, వారు మహిళలను ఉద్దరించారని మనవాళ్లనుకొంటారు. మన సంస్కృతిలో ఆడవారికి రక్షణకల్పించటానికి శాయశక్తులా ప్రయత్నిస్తే. వేస్ట్ లో కమ్యునిస్ట్ లు ,కేపిటలిస్ట్ లు మహిళలు ఇంట్లో కూచొని పిల్లలను చూసుకోవటం వారికి నచ్చలేదు. వారి రాజకీయ,ఆర్ధిక అజెండా కోసం ఉపయోగించుకోవటంలో ఎన్నో ఎత్తుగడలు వేశారు. ఇది చదువుకోండి.
      Tactics (to persuade women to not have children) were outlined in a series of secret strategy meetings
      "No woman should be authorized to stay at home to raise her children."
      Lenin knew that many women would be tempted to go back to the old ways to tend to hearth and home. So the traditional family would need to be abolished.

      If women are allowed the right to stay home and look after their children many will choose to do so. Some feminists say they must not be allowed the choice.

      In his book Perestroika, Mikhail Gorbachev reflected on 70 years of Russian turmoil: "We have discovered that many of our problems — in children's and young people's behavior, in our morals, culture and in production — are partially caused by the weakening of family ties."

      The radical feminist worldview, goals, tactics, and rhetoric can all be linked directly to Marxist-Leninist theory.

      http://www.life.org.nz/abortion/abortionkeyissues/feministagenda/

      Delete
    5. More than 35% of Americans ages 24 to 28 are dealing with debt that surpasses the value of any of their assets, Dartmouth College assistant professor Jason Houle states. That's approximately double the proportions of the late 1980s and mid 1970s. Around 75% of young Americans have debt of some kind.

      http://www.huffingtonpost.com/2014/11/20/american-debt-photos_n_6186756.html

      Delete
    6. కమ్యునిష్టుల వుద్దేశం ఆస్తుల్ని ఆదాయాన్ని పంచడమయితే పెట్టుబడిదారీ విధానం అప్పుల్ని పంచుతుందన్నమాట.అదేదో పాత తెలుగు సినిమాలో రమణా రెడ్డీ సూర్యకాంతం తమకి అప్పనంగా వచ్చిపడబొయ్యే వాట్ని "సొఘం","సొఘం" అని పంపకాలు వేసుకుంటూ ఆయన అప్పులు - సఘమెందుకులే మొత్తం నువ్వే తీసుకో అనటం,మొదట "మొత్తం నాకేనా?!" అని సంబరపడిపోయి సర్దుకుని నాకొద్దు నాకొద్దు మొత్తం నువ్వే తీసుకో అనటం పిచ్చ క్యామిడీ:-)

      Delete

  12. సెహ భేష్ !

    అట్లా చెప్పండి !

    నేనూ ఓ టపా కట్టెస్తా వెంటనే ఈ టాపిక్కు పై !

    జిలేబి

    ReplyDelete
  13. ముతప్పాళ కురంగీన్యాకమ్మ -- మీరు ఎంత చెన్నై లో ఉంతె మాత్రం ఇలా తిట్టటం బాలేదు. ఆమె విమర్శలు చేశుంది.మంచి విమర్శా చెడు విమర్శా అనేది పక్కన పెట్టండి. మీరు ఏకం గా తిట్లు తిడుతున్నారు.
    అదనపు విలువని సమాజపరం చెయ్యడం అనేది మార్క్సు కన్నా చాలాకాలం ముందే భారతదేశంలో కొంతకాలం చాలా నిక్కచ్చిగా అమలు జరిగిందని మీకు తెలుసా?
    >>ఎలా జరిగిందో మీరు చెబితే గదా తెలిసేది. ఒక వేల జరిగితే మంచిదే, మళ్ళీ ఇప్పుడు జరిగితే ఏమన్నా ప్రాబ్లమా?

    లెనిన్ శవం ముందు పిడికిళ్ళు బిగించి "విప్లవం వర్ధిల్లాలి" అని పొలి కేకలు వేస్తే
    >> లెనిన్ మాసోలియం కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? నేను వెళ్ళాను. లోపల నిశ్శబ్దం గా ఉండాలి. బయట కూడా ఎవరూ పిడికిళ్ళు బిగించి నినాదాలు చేయరు. మన ఇండియా లో రోడ్ల మీద చేసినట్లు ప్రపంచమంతా ఉండదు. ఇండియన్ కమ్యూనిస్టుల మీద హిందూ మతం ప్రభావమేమో. మనకీ పండగలూ పబ్బాలూ, మైకులూ, స్టెజీ లూ అన్నీ రోడ్డు మీదేనాయే!
    >>ఆడదైనందుకు లెనిన్ భార్య కుండలు కడుక్కుంటూ ఇంటికి మాత్రమే పరిమితమైపోతే
    లెనిన్ చనిపోక ముందు అక్కడి వ్ప్లవం లో లెనిన్ భార్య పాత్ర ఏమిటి? ఆడదైనందుకు , అదీ లెనిన్ భార్య ఐనందుకు ఆమె ని తీసుకెళ్ళి పదవి ఇవ్వాలా (మన నేతల పెళ్ళాలకి ఎంపీ టికెట్స్ ఇచ్చినట్లు) మీకు రోసా లక్సెంబోర్గ్ తెలుసా?
    >>పశ్చిమ వంగ దేశంలో వ్యతిరేకుల్ని చంపి శవాల ఆనవాళ్ళు కూడా దొరకకుండా భూమిలో పాతిపెట్టదం
    వాళ్ళు ఎన్నికలలో పాల్గొన్నపుడే కమ్యూనిస్టులు కాకుండా పోయారు. ఇది "దారా సింగ్, గ్రాహం స్టెయిన్స్ ని చంపాడని, హిందువులందరూ ఇతరమతాల వారిని హతమారుస్తారు", అనటం లాంటిది.

    ReplyDelete
    Replies
    1. "ముతప్పాళ కురంగీన్యాకమ్మ -- మీరు ఎంత చెన్నై లో ఉంతె మాత్రం ఇలా తిట్టటం బాలేదు. "
      ----
      ముతప్పాళ కురంగీన్యాకమ్మ అనటాని చెన్నపట్టణం లో ఉండటానికి సంబంధం ఏమిటి? తపాళ రంగి ఇంటి ప్రక్కన ఉండి అంటే మీకేమి అభ్యతరం ఉండదా?

      ఇండియన్ కమ్యూనిస్టుల మీద హిందూ మతం ప్రభావమేమో.
      ------------
      ఎందుకురా సామీ, మీ వెధవ వేషాలకు హిందూ మతాన్ని లాగుతారు. అచ్చం ఇలాగే ఓ లెఫ్ట్ మేతావి హరగోపాల్ ఇవ్వాళ http://www.andhrajyothy.com/Artical.aspx?SID=62408SupID=42 సోనియమ్మ తెలంగాణా ఇవ్వటానికి తన కేథలిక్ క్రిష్టియన్ నేపథ్యం అంటాడు, మీ కమ్మీ గాళ్లకు ఇష్టమయినవన్నీ హిందూ మతం లో తప్ప మిగతా మతాలలో కనబడటం క్రొత్త ఏమీ కాదుగా :-)

      లెనిన్ మాసోలియం కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? నేను వెళ్ళాను. లోపల నిశ్శబ్దం గా ఉండాలి.
      -------
      వెరీ గుడ్డూ. congrats on visiting your Commie God. మొత్తానికి జిందాబాద్ లు కొట్టకుండా, అచ్చం బౌద్దులు లాగా మౌనం పాటించి ప్రార్ధించి వచ్చారన్నమాత. మీకు పరలోక oops స్వారీ, commie లోక ప్రాప్తిరస్తు. అది నచ్చకపోతే హరగోపాల్ లాగా కేథలిక్ లోక ప్రాప్తిరస్తు.

      వాళ్ళు ఎన్నికలలో పాల్గొన్నపుడే కమ్యూనిస్టులు కాకుండా పోయారు.
      -----------
      superb, అలా అయితే మన చికెన్ నారాయణ నుండి జ్యోతి బసు ల వరకు మన దేశం లో కామ్మీ గాళ్లె ఎవ్వరూ లేరన్నమాట :), ఇంకో సిన్న అనుమానం ఈ భూ పెపంచంలో ఎవరయినా కామ్మీ గాళ్లు మిగిలి ఉన్నారా? లేక కేవలం లెనిన్ శవం ఒక్కటే కామ్మీ నా?

      Delete
    2. మొదట లెనిన్ తను చనిపోక ముందే స్టాలిన్ గురించి కొన్ని ప్రమాదకరమయిన హెచ్చరికలు చేసాడు.అయినా సరే స్టాలిను ప్రెసిడెంటుగా నిలబడినప్పుడు లెనిన్ హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ స్టాలిను మహాసయుడికి మద్దతు ఇచ్చిన వారిలో లెనిన్ భార్య కూడా వుంది,అంటే పార్టీ సెంట్రల్ కమిటీలో ఆమె కూడా సభ్యురాలే,ఈ సంగతి మీకు తెలుసా?.కానీ స్తాలిన్ మరోరకంగా బిహేవ్ చేసినప్పుడు తిరుగుబాటులో ట్రాట్స్కీ అలాగ ఈమె ఇలాగా వున్నారు.

      ఆమె పేరుని కొంచెం మారిస్తేనే అంత కోపమొచ్చింది మీకు!మరి రాముడు శూర్పణఖని చూసి లొట్టలేసుకుంటూ "ఆహా,సీత కన్నా ముందు ఈమె(యెంత గౌరవమో ము.రం.నాకి శూర్పణఖ అంటే?) కనబడితే ఈవిణ్నే చేసుకునేవాణ్నేమో" అనుకున్నాడని రాస్తే వాల్మీకి అభిమానులకి ఇంకెత కోపం రావాలి?ఒక రచయిత రాసిన దాన్ని హుందాగా విమర్సించటం అంతే అక్కద యేమి రాశాడో దాన్ని విమర్శించదం కాకుండా మార్చి వెక్కిరించతం సరయినదే మీ అభిప్రాయమా?తను సంచలనం సృష్టించి పేరు తెచ్చుకోవటానికి ముందరి తరం రచయిత రచనలోని భాగాన్ని మార్చి వెక్కిరించిన మనిషి మీ దృష్తిలో మేధావి అన్న మాట,యెందుకని?మీలాంటివాళ్లకి ఈ ఝలక్కు వెయ్యటానికే అలా తన పేరు మార్చి రాశాను:-)

      Delete
  14. This comment has been removed by the author.

    ReplyDelete
  15. మీరు ఈ కింది లింకులో, యు ట్యూబ్ లో ఉన్న ఒక వీడియో (ఉభయ కుశలోపరి) ఉషశ్రీ గారి సంస్మరణ సభ (రెండు గంటల పైగా ఉన్న వీడియో) ప్రముఖ రేడియో కళాకారుడు ఎ బి ఆనంద్ గారు, ప్రముఖ రచయితా శ్రీ రమణ గారు మాట్లాడారు. ఆ మాట్లాడే క్రమంలో రామాయణ విషవృక్షం గురించిన కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక సారి చూడండి.

    https://www.youtube.com/watch?v=DSXphc9tMsY

    ReplyDelete
    Replies
    1. Sure sir, I will do it.i am a fan of vushaSree!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...