డబ్బుని తయారు చెయ్యటానికి కూడా చాలా డబ్బు ఖర్చవుతుందండోయ్!కాగితం,సిరా, సాంకేతికత, ముద్రణ సౌకర్యం - ముఖ్యంగా నకిలీ నోట్లని తయారు చేసే వీలు లేకుండా తీసుకోవలసిన జాగ్రత్తలతో సహా ప్రతి సంవత్సరం కొత్త కరెన్సీని ప్రజలకి అందుబాటులోకి తేవటానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ రేంజిలోనే ఉంటుంది - 2016లో అక్షరాలా 3,421 కోట్లు, అంటే 502 మిలియన్ డాలర్లు!
ఆ యేడాది స్థూల జాతీయోత్పత్తి 84 లక్షల కోట్లలో ఇది 0.04% మాత్రమే కావచ్చు, కానీ అంత తక్కువ శాతం పొదుపైన విషయమే అయినప్పటికీ నిర్వహణ చాలా చాలా కష్టం. మనకన్న అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ కరెన్సీ తయారీని out-source చేసేసుకుని హ్యాపీగా ఉంటున్నాయి.ఎక్కువ స్థాయిలో కరెన్సీ నోట్లని ఉపయోగించేవీ సొంతంగా తయారు చేసుకునేవీ అయిన దేశాల్లో చైనా తర్వాత రెండవ స్థానంలో ఉంది మన దేశం.ఫెళఫెళలాడే కొత్త నోట్లని మురిపెంగా చూసుకుని పదే పదే తడుముకుని మురిసిపోయే మనస్తత్వం వల్లనే డెబిట్ కార్డు వాడకం పెరగటంలేదు, అన్ని విషయాల్లోనూ అమెరికన్లని ఇమిటేట్ చెయ్యటమే ఆధునికత అనుకునేవాళ్ళు కూడా ఈ విషయంలో మాత్రం కార్డు కన్న కరెన్సీనే ముద్దు చేస్తున్నారు!!
అన్ని వారసత్వాల లాగే నోట్లని తయారు చేసుకునే వారసత్వం కూడా తెల్లదొరల నుంచి సంక్రమించినదే. నిన్నమొన్నటివరకు అన్ని ముడిసరుల్నీ దిగుమతి చేసుకుని వాటితో నోట్లని తయారు చేసుకునేవాళ్ళం - ముఖ్యమైన watermarked paper జర్మనీకి చెందిన Giesecke & Devrient నుంచీ బ్రిటనుకి చెందిన De La Rue వంటి కంపెనీల నుంచీ కొనుక్కునేవాళ్ళ్ళం - మొత్తం ఖర్చులో 95% దీనికే సరిపోతుంది.
భారత దేశం ప్రతి సంవత్సరం 22,000 మెట్రిక్ టన్నుల కాగితాన్ని ఉపయోగించుకుంటున్నది.2016 జూన్ ఆఖరుకి Reserve Bank of India (RBI) తయారు చేసి వదిలిన నోట్ల సంఖ్య 21.2 బిలియన్లు.వాటికి అయిన ఖర్చే పైన మనం చూసిన 4,321 కోట్ల రూపాయలు.
ఈ ఖర్చును తగ్గించి పేపర్ కరెన్సీ వాడకం వల్ల ఎదురయ్యే సవాళ్ల నుంచి ఆర్ధిక వ్యవస్థని రక్షించటానికే మోదీగారు De-Monitization అస్త్రాన్ని ప్రయోగించారు.మొత్తం డీమోనిటైజేషన్ ప్రక్రియలో పెద్దనోట్లరద్దు ఒక భాగమే, కానీ ఈ దేశంలో సామాన్య ప్రజలకే కాదు విద్యావంతులకి కూడా మార్పుని వ్యతిరేకించే మూర్ఖత్వమూ ఎజెండాలకు అంటుగట్టుకుపోయిన మొండితనమూ ఉండటం వల్ల ఆ మొత్తం వ్యవహారాన్ని పెద్దనోట్లరద్దు అనే తంతు కిందనే పరిగణించేసి కరెన్సీ వాడకాన్ని మాత్రం యధేచ్చగా కొనసాగిస్తున్నారు.
నా మట్టుకు నేను ప్రభుత్వం ఆమోదించిన ఒక యాప్ నా మొబైలు ఫోనులో పెట్టుకున్నాను.కరెంటు బిల్లు లాంటి పేమెంట్లన్నీ దానిద్వారానే చేస్తున్నాను - ఇదివరకు గంట పట్టే కరెంటు బిల్లు కట్టడం అనే పని ఒకట్రెండు నిముషాల్లో పూర్తయిపోతున్నది!IRCTC యాప్ నుంచి రైల్వే టిక్కట్లు బుక్ చేసుకోవడం ఎంత ఈజీ!ఫలానా మాట చెప్పినవాడు నాకు నచ్చలేదు, ఫలానా పని చెయ్యమన్నవాడు బ్రాహ్మణ మతానికి చెందిన అగ్రకుల దురహంకారి - కాబట్టి వాడు చెప్పింది మంచి అయినా నేను చెయ్యను అని హఠం చేస్తే ఎవరికి నష్టం?GST ఫెయిలవటమూ, యడ్డీ డైరీల తరహా చెల్లింపులూ ప్రజలు డీమోనిటైజేషనుని ప్రోత్సహించకపోవటం వల్లనే జరిగాయేమో కదా!
ఏమైతేనేం, 2015 నుంచి out-sourcing ఆగిపోయింది.ప్రస్తుతం అన్ని 500, 2000 నోట్లూ మైసూరులోనే తయారవుతున్నట్టు తెలుస్తున్నది - రిజర్వ్ బ్యాంక్ పూర్తి వివరాల్ని చెప్పటం లేదు. మన నోట్లని మనమే ముద్రించుకోవటం మొదలుపెట్టిన 90 యేళ్ళకి పూర్తి స్వదేశీ నోట్లని వాడుకోగలుగుతున్నాం - నిజంగా గొప్ప విషయమే!
British colonial government ఈ దేశంలో చలామణి చెయ్యాలనుకుంటున్న కరెన్సీని ముద్రించటం 1862లో మొదలుపెట్టింది.మొట్టమొదట out sourcing contract తీసుకున్న Thomas De La Rue సంస్థ అసలు playing cardsనీ postage stampsనీ ప్రింట్ చేస్తూ చిన్న స్థాయిలో మొదలై క్రమేణ కరెన్సీ నోట్ల వ్యాపారంలోకి అడుగుపెట్టి 200 సంవత్సరాల తర్వాత ఇవ్వాళ దాదాపు ప్రపంచంలోని అన్ని కమర్షియల్ బ్యాంకులకీ నోట్లని ముద్రించి ఇవ్వటంలోనూ కాగితాన్ని సప్లై చెయ్యటంలోనూ ఏకఛ్చత్రాధిపత్యం సాధించేసింది!
మన దేశానికి కావలసిన కరెన్సీని దేశం లోపలే తయారు చేసుకోవాలనే నిర్ణయం 1920లలో జరిగింది.అలా 1926 నుంచి మహారాష్ట్రలోని నాసిక్ ముద్రణాలయం యొక్క నిర్మాణం మొదలైంది.రెండు సంవత్సరాల తర్వాత అంతకుముందు ఉన్న డిజైనునే తీసుకుని 5 రూపాయలనోట్లని ముద్రించటం మొదలుపెట్టి క్రమేణ సొంత డిజైన్లను కూడా రూపొందించుకుని 100, 1000 రూపాయల నోట్లనే కాకుండా 10000 రూపాయల నోట్లని కూడా ముద్రించటం కొనసాగించింది. స్వతంత్రం వచ్చాక కూడా చాలా కాలం పాటు నాసిక్ ప్రెస్ ఒక్కటే అన్ని నోట్లనీ ముద్రిస్తూ ఉండేది.కానీ, భారతీయులకి నోట్ల వాడకం అవసరమే కాక సరదాగా మారి స్టేటస్ సింబల్ కూడా అయిపోవడం వల్ల భారత ప్రభుత్వం 1973లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని Dewas దగ్గిర మరొక ప్రెస్సుని మరింత కట్టుదిట్టమైన సెక్యూరిటీతో ప్రారంభించింది.
1997 నాటికి మొత్తం నోట్లన్నీ ఈ రెండు చోట్లనుంచే వస్తూ ఉండేవి. కానీ, పెరిగిన జనాభా ఇబ్బడిమిబ్బడిగా నోట్లని వాడుతుండటం వల్ల పెరిగిన డిమాండును తట్టుకోలేక అప్పటి ప్రభుత్వం 3.6 బిలియన్ నోట్లని ముద్రించటానికి American, Canadian, European(including De La Rue) కంపెనీలకి ప్రింటింగ్ ఆర్దర్ ఇచ్చింది - ఇది $95 million వ్యవహారం కావటంతో సహజంగానే దీని చుట్టూ వివాదం చెలరేగింది!ఇంక లాభం లేదని, ఆ వివాదాన్ని ఎలాగోలా తట్టుకుని 1999లో మైసూరు ప్రెస్సునీ 2000 సంవత్సరంలో సల్బోని ప్రెస్సునీ ప్రారంభించింది.నోట్ల తయారీకి కావలసిన పేపరును 1968 నుంచి Hoshangabadలోని Security Paper Mill అందిస్తున్నది.కానీ దీని సామర్ధ్యం 2,800 మెట్రిక్ టన్నులు మాత్రమే కావటం వల్ల మిగిలిన కాగితాన్ని Britain, Japan, Germany వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తూనే ఉన్నది.
2015లో ప్రధాని మోదీ ఈ పరిస్థితి పట్ల గట్టి వ్యతిరేకతని వ్యక్తం చేసి Hoshangabad మిల్లు సామర్ధ్యాన్ని పెంచడానికీ మైసూరు ప్రెస్సుకి దగ్గిర్లో 12,000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో మరొక మిల్లుని నిర్మించడానికీ తగిన చర్యలు తీసుకున్నారు.అయితే, ఇప్పటికీ దిగుమతులను పూర్తి స్థాయిలో ఆపెయ్యలేకపోవచ్చు గానీ దిగుమతుల భారంలో మట్టుకు చాలా తేడా వస్తుంది.
అన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించేసి అది శక్తి చాలక చతికిల పడుతుంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళని తిట్టేసి ఘనకార్యం చేసినట్టు ఫీలవ్వడం కాదు, మనం చెయ్యాల్సిన చిన్న చిన్న పనుల్ని మనమూ చెయ్యాలి.మన బాధ్యతని మనం నెరవేర్చి అప్పుడు బాధ్యత లేనివాళ్ళని విమర్శించితే ఆ విమర్శకు బలం వస్తుంది. అలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తుల వల్లనే చరిత్ర తన గతిని పతనం నుంచి పురోగతికి మార్చుకుంటుంది - దురదృష్టవశాత్తు ఇవ్వాళ దేశంలో అలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తుల సంఖ్య చాలా తక్కువ, అసలైన మైనారిటీ వీళ్ళే!

(this is the first part of a series on macro economy!)