Monday 5 February 2018

ఏం పిలడో!ఎల్దమొస్తవా?ఏం పిలడో?ఎల్దమొస్తవా?

పల్లవి:ఏం పిలడో!ఎల్దమొస్తవా?ఏం పిలడో?ఎల్దమొస్తవా?
సిక్కోలు నెఱబండి అగ్గల మీదున్నాది!
అమ్మ మారెమ్మ తల్లి అగిపిడుగుల్నీ సలిపిడుగుల్నీ
ఎంటేసుకు రమ్మన్నాది -
ఏం పిలడో?ఎల్దమొస్తవా?

చరణం:ఏర్లన్ని ఎండిపోయి ఊళ్ళన్ని పాడుబడి
పల్లెటూళ్ళు వల్లకాళ్ళై జనం మాడి చస్తంటె
చూస్తా నిమ్మళంగ తొంగున్న పల్లెల సర్పంచులకి
పేడకళ్ళ స్నానమాడించి మురికినీళ్ళు తాగించనీకి -
ఏం పిలడో!ఎల్దమొస్తవా?ఏం పిలడో?ఎల్దమొస్తవా?

చరణం:చదువులు తిన్నగ జెప్పకుండ
బుడ్డోళ్ళని గాడిదుల్నీ దున్నల్నీ కాయించే
ఎలిమెంటరీ స్కూలు టీచర్లకి
బెత్తందెబ్బల కొత్త పాఠాలు గట్టిగ నేర్పనీకి -
ఏం పిలడో!ఎల్దమొస్తవా?ఏం పిలడో?ఎల్దమొస్తవా?

చరణం:కలిగినోళ్ళ మోచేతి నీళు తాగుతు
బనాయింపు కేసులల్ల ఇరుక్కున్న బీదోళ్ళని
తప్పుడు తీర్పులిచ్చి జైళ్ళకి పంపించే
బలిసిన ఎనుబోతులంటి కఠీనపు జడ్జీల్ని
దొంగలబండి యెక్కించి దేశాలు తిప్పనీకి -
ఏం పిలడో!ఎల్దమొస్తవా?ఏం పిలడో?ఎల్దమొస్తవా?

చరణం:రేషను షాపుల కాడనుంచి
హాస్టళ్ళ వార్డెన్లుగ,
రిజిస్ట్రేషను క్లర్కులుగ,
మినిస్టర్ల ఓసీడిలుగ,
నెలవారీ బేటాల పోలీసులుగ,
సెక్రటేరియటు లోగిళ్ళ పండిన బ్రోకర్లుగ
మినిస్టర్ల బినామి కాంట్రాక్టుల ఎంగిలి దాక
లక్షల కోట్ల జనండబ్బును దొడ్డిదారి పట్టించే
గుంటనక్కల్ని దేశం పొలిమేరలు దాటించనీకి - 
ఏం పిలడో!ఎల్దమొస్తవా?ఏం పిలడో?ఎల్దమొస్తవా?

చరణం:కాష్ఠంల కాలేటి దేహపు అందాల్ని
ముక్కుతో,చేతితో,మూతితో రాపాడి
వాళ్ళు డబ్బునీ వీళ్ళు బొడ్డునీ చూసి సొల్లు గార్చుకుంట
కడదాక నిలిచే మనసు బంధాల్ని తన్ని తగిలేసి పోయే
శాడిష్టు పీనిగల్ని వాళ్ళని వీళ్ళని లేకుండ
కర్రులు గాల్చి కసిదీర వాతలు పెట్టి బుద్ధులు మప్పనీకి - 
ఏం పిలడో!ఎల్దమొస్తవా?ఏం పిలడో?ఎల్దమొస్తవా?

చరణం:గెలిస్తివా,
బిడ్డల తల్లులు సంజెవేళ బిన్ను తలుస్తరు!
మడిస్తివా,
వీరుల రాదారిల తడారని సలివేంద్ర మైతవు!

తుదిపోరున నిలబడి కలబడి
జయం ఫలం కొట్టే వీరాధివీరుల
చేతుల్ల శంఖమై ఆయుధమై మొల్చుకొస్తవు -
రావోయ్ వీరుడా నీకు లాల్ సలాం!

జయీభవ!విజయీభవ!!దిగ్విజయీభవ!!!

9 comments:

  1. చరణం:కాష్ఠంల కాలేటి దేహపు అందాల్ని
    ముక్కుతో,చేతితో,మూతితో రాపాడి
    వాళ్ళు డబ్బునీ వీళ్ళు బొడ్డునీ చూసి సొల్లు గార్చుకుంట
    కడదాక నిలిచే మనసు బంధాల్ని తన్ని తగిలేసి పోయే
    శాడిష్టు పీనిగల్ని వాళ్ళని వీళ్ళని లేకుండ
    కర్రులు గాల్చి కసిదీర వాతలు పెట్టి బుద్ధులు మప్పనీకి -
    ఏం పిలడో!ఎల్దమొస్తవా?ఏం పిలడో?ఎల్దమొస్తవా?

    ఏం వ్రాసారండీ అసలు ? ఈ చరణం నాకు బాగా నచ్చేసింది.

    ReplyDelete
    Replies
    1. నీకు నచ్చుతుందని నేనూ అనుకున్నాను - మాయాబజారు ప్రియదర్శిని యంత్రం సీనులో శ్రీకృష్ణుడికి శకుని కనిపిస్తాడు,గుర్తందా?

      Delete
    2. మనకు గిట్టని మనువు
      February 12, 2018

      [మను ధర్మ శాస్త్రం - 1 ]
      ఎం. వి. ఆర్. శాస్త్రి
      Manu belongs to no single nation or race; he belongs to the whole world. His teachings are not addressed to an isolated group , caste or sect , but to humanity. They trascend time and address themselves to the eternal in man .There is need for a fresh statement , in the light of modern knowledge and experience , of the fundamental teachings of Manu.

      ( మనువు ఏ ఒక జాతికి కాదు.. మొత్తం ప్రపంచానికి చెందిన వాడు. ఆయన బోధలు విసిరేసినట్టు విడిగా ఉండే ఏ ఒక సమూహానికో, కులానికో , తెగకో కాక మొత్తం మానవాళికి ఉద్దేశించినవి . అవి కాలాతీతమైనవి. మానవుడి లోని శాశ్వత తత్వానికి ఉద్దేశించబడినవి. ఆధునిక విజ్ఞానం, అనుభవాల వెలుగులో మనువు మౌలిక బోధనలను పునః ప్రకటించవలసిన అవసరం ఉంది .)

      ఈ మాటలన్న వాడు కళ్ళకు అగ్రవర్ణ దురహంకారం పొరలు కమ్మిన , మూఢత్వం జడలు కట్టిన , ఏ చాందస బ్రాహ్మణుడో కాదు. బ్రాహ్మణాధిక్యాన్ని నిలబెట్టాలని, అడుగు కులాలను అణగదొక్కాలని కంకణం కట్టుకున్న మిడి మిడి జ్ఞానపు ఏ బ్రాహ్మణ పక్షపాతో కూడా కాదు. నేటికి 60 ఏళ్ళ కింద అమెరికా లోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం లో పి హెచ్ డి పట్టా పొందిన థీసిస్ లో విఖ్యాత సోషియాలజిస్టు Dr. Kewal Motwani చెప్పిన మాట ఇది. " Manu Dharma Sastra .. A Sociological And Historical Study " అనే పేరుతో 1958 లో ఇది గ్రంథంగా వెలువడి దేశ దేశాల మేధావుల మన్ననలు పొందింది.

      మనువు పేరు చెబితే చాలు మన మేధావులు చాలామందికి కంపరం పుడుతుంది. అతడేదో భయంకర బ్రహ్మ రాక్షసుడు అయినట్టూ , కింది కులాలను , ముఖ్యంగా దళితులనూ, మహిళలనూ అమానుషంగా కాల్చుకు తిన్న కర్కోటక కుల వ్యవస్థకు అతడే మూలపురుషుడైనట్టూ వారి భావన. బ్రాహ్మణాధిక్యాన్ని , బ్రాహ్మణాధిపత్యాన్ని ,పురుష దురహంకారాన్ని బలవంతంగా రుద్దిన అతడి "మను ధర్మ శాస్త్రం " లేక "మనుస్మృతి" వందల, వేల సంవత్సరాలపాటు కోటానుకోట్ల బడుగు బలహీన దళిత వర్గాలను దారుణ అవమానాలకు, అన్యాయాలకు, క్రూరాతిక్రూర శిక్షలకు గురి చేసిందని ఎంతోమంది నమ్ముతున్నారు.

      మరి అటువంటి నీచ , నికృష్ట , మహాదుష్టుడిని పట్టుకుని " మొత్తం మానవాళికి మూలపురుషుడు , గర్వకారకుడు " అంటూ ఈ మొత్వాని ఆకాశానికి ఎత్తేస్తున్నాడేమిటి ?

      ఆశ్చర్యమేముంది ? ఇతడూ ఒక మనువాది. బ్రాహ్మణ పక్షపాతి , చదువుకున్నా బుద్ధి లేని మూర్ఖుడు - అని తక్షణ నిశ్చయానికి వచ్చే ముందు అతడు ఏమంటున్నాడో కాస్త ఆలకించండి :


      " ఇది కేవలం ఒక ధర్మ శాస్త్రమే తప్ప శాసనాల సంహిత కాదు . శాసించే నియమావళీ కాదు. ఇది ఏ ఒక భౌగోళిక ప్రాంతంలో నివసిస్తున్న ఏ వర్గాన్నీ , సమూహాన్నీ శాసించేందుకు ఉద్దేశించిన న్యాయ సంహిత కాదు.
      " ప్రధానంగా ఈ ధర్మ శాస్త్రం లో అన్నికాలాల్లో, అన్ని దేశాల్లో మానవుడి సాంఘిక జీవితానికి వర్తించే సూత్రాలు ఉన్నాయి. మనిషి యొక్క, సమాజం యొక్క జీవనం లో నిత్యము, శాశ్వతము అనదగ్గ అంశాలను నొక్కిచెప్పే బోధలు ఉన్నందువల్ల దీని ప్రాముఖ్యం విశ్వ వ్యాప్తమైనది."

      [ Manu Dharma Sastra , Kewal Motwani , p. xi ]

      " మనకుతెలిసి ఉండక పోవచ్చు. కానీ ప్రాచీన, ఆధునిక ప్రపంచాలలో ప్రబలంగా వినిపించే పేరు మనువు. ఆర్య నాగరికత విస్తరించిన ప్రతి చోటికీ మనువు ప్రభావం వెళ్ళింది. ఉత్తర చైనా , జపాన్, ఫార్మోసా , ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఇరాన్. సుమేరియా, ఈజిప్టు లకు .. అనంతర కాలంలో బాబిలోన్ , అస్సీరియా, పాలస్తీనా, గ్రీస్, రోమ్ లకు మనువు బోధలు చేరాయి. తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాల్లో మనువు అత్యంత గౌరవ పాత్రుడు. బర్మా, సయాం, మలయా, ఇండోనేసియా, ఇండో చైనా , బాలి, ఫిలిప్పీన్స్ దీవులు , సిలోన్ లు మనువు జ్ఞాపకాన్ని పదిలపరుచుకుని , అతడి ధర్మశాస్త్రాన్ని ఈనాటికీ ఉపయోగిస్తున్నాయి. ఆ దేశాల న్యాయ విధానాలు , సామాజిక వ్యవస్థలు అతడి ఉపదేశాలపైనే ఆధారపడ్డాయి. "
      [ అదే గ్రంథం పే.5-6 ]

      వట్టిగా పేర్లు ఏకరువు పెట్టటం కాదు. ఆయా దేశాలకు మనువుతో ఉన్న ప్రగాఢ చారిత్రక అనుబంధం గురించి మోత్వాని తన పుస్తకంలో విపులంగా వివరించాడు.

      ఆ గ్రంథకర్త ఒకడే కాదు.మానవ జాతి కి మూలపురుషుడుగా , మొట్టమొదటి న్యాయ ప్రదాత గా , తొలి సామాజిక తత్త్వవేత్తగా మనువు కున్న ప్రఖ్యాతి ని కేంబ్రిడ్జి హిస్టరీ ఆఫ్ ఇండియా , బ్రిటిష్ ఎన్ సైక్లోపీడియా, అమెరికన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ లు గుర్తించాయి. మనుస్మృతి లో పేర్కొన్న న్యాయాలు విశ్వజనీనమైనవని, మానవాళికి మేలు చేసేవని A.A. Macdonnel, A.B. Keith , P.Thomas, Louis Renoy వంటి పాశ్చాత్య గ్రంథకర్తలు ప్రస్తుతించారు. ప్రసిద్ధ జర్మన్ తత్వవేత్త FrederichNeitsche అయితే మనుస్మృతి బైబిల్ కంటే గొప్ప పవిత్ర గ్రంథమని అభివర్ణించాడు.

      Delete
    3. చేసే వృత్తిని బట్టి మనువు ఏర్పరిచిన వర్ణ వ్యవస్థ బాలి , బర్మా ఫిలిప్పీన్స్,కంబోడియా ,వియత్నాం, థాయిలాండ్, మలేసియా, నేపాల్, శ్రీలంక లలో అమలు జరిగినట్టు అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మనువు నిర్దేశించిన ధర్మ సూత్రాల ప్రకారమే పూర్వం అనేక దేశాల ప్రభువులు న్యాయ నిర్ణయం చేసే వారు. తాము మనువును అనుసరిచేవారమని మనుధర్మానికి చెందిన శ్లోకాలు వివిధ దేశాల శిల్పాలలో కనపడతాయి. తాము మనువును అనుసరించేవారమని చెప్పుకోవటానికి అనేక దేశాల రాజులు , చక్రవర్తులు గర్వపడేవారు. ఉదాహరణకు చంప ( వియత్నాం ) రాజా జయేందర్ వర్మ దేవ తాను మనువాదినని ఒక శిలా శాసనంలో గర్వంగా చెప్పుకున్నాడు. ఉదయన వర్మ, రాజా జయవన్న శిలా శాసనాల లోనూ మనువు, మానవ నీతిసార ల ప్రస్తావన ప్రశంసా పూర్వకంగా కనిపిస్తుంది.

      ఈ కింది చిత్రాన్ని చూడండి :



      ఫిలిప్పీన్స్ లోని నేషనల్ అసెంబ్లీ హాల్ లో సభాపతి ఆసనం వెనుక కనిపించే మనువు విగ్రహమిది." Manu, the first ,the greatest , and the wisest lawgiver of mankind. " ( మానవాళికి న్యాయప్రదానం చేసిన వారిలో మొట్టమొదటివాడు , అందరికంటే గొప్పవాడు, అందరిలోకీ విజ్ఞుడు అయిన మనువు ) అని దాని కింద రాసి ఉంటుంది. ఎక్కడో హిందూ దేశంలో వేల సంవత్సరాల కిందట ఏదో ధర్మశాస్త్రాన్ని రాసిన వాడి బొమ్మను తెఛ్చి ఇక్కడెందుకు పెట్టారని ఫిలిప్పీన్స్ లోని ఏ మేధావీ , పాత వాసనలు గిట్టని ఏ పార్టీకి చెందిన ఏ రాజకీయ వాదీ ఇంతవరకు ఆక్షేపణ చెప్పలేదు.

      కానీ అదే మనువు పుట్టిన మన పుణ్యభూమి లోనో .. ?
      1989 సంవత్సరం లో జైపూర్ లోని రాజస్థాన్ హై కోర్ట్ ప్రాంగణంలో న్యాయవాదుల సంఘం మనువు విగ్రహాన్ని ప్రతిష్టించింది. ( కింది బొమ్మ చూడండి )


      దాని మీద నానా గత్తర అయింది. తక్షణం దాన్ని అక్కడి నుంచి తొలగిస్తారా లేదా అని మనువును, మనువాదాన్ని అసహ్యించుకునే సంఘాలు, సంస్థలు పట్టుబట్టాయి. వాటి ఫిర్యాదులను మన్నించి రాజస్థాన్ హై కోర్టు ఆ విగ్రహాన్ని తొలగించమని ఒక దశలో ఉత్తర్వు చేసింది. దాని మీద ఆర్య సమాజ్ కు చెందిన ఒక ప్రముఖుడు అప్పీల్ చేసి స్టే పొందటం తో కూల్చివేత ఆగింది. అప్పీలు పావు శతాబ్దానికి పైగా అదే హై కోర్టు లో నానుతున్నది. ఈ మధ్యనే ప్రభుత్వానికి నోటీసులు వెళ్లాయి.

      ఆశ్చర్యమేమిటంటే .. మొట్ట మొదటి శాసన కర్త గా మనువు ను మిగతా ప్రపంచమంతా గుర్తించి సముచిత గౌరవం ఇస్తున్నా ...
      అతడి జన్మభూమి లో మాత్రం మనువును ఏవగించుకోవలసిన ఒక దుష్టుడిగా , భారతీయ సమాజాన్ని , సాంఘిక వ్యవస్థను దారుణ దుర్ణయాలకు గురి చేసిన ఒక మహాపాపిగా , క్రూరాతిక్రూరుడిగా చదువుకున్నవారూ, సంస్కారవంతులలోనే చాలామంది తిట్టిపోస్తున్నారు. మనువాదమే దేశాన్ని పీడిస్తున్న చెడుగులన్నింటికీ మూల కారణమని దృఢంగా నమ్ముతున్నారు.

      ఈ విచిత్ర వైరుధ్యానికి హేతువు ఏమిటి? లోపం మనువుదా ? అతడు చెప్పిన ధర్మ శాస్త్రానిదా ? లేక మనువాదాన్ని తెగనాడుతున్న వారి ఆలోచనా విధానానిదా? నిజానికి మనువు చెప్పినదేమిటి ? అతడికి ఆధునికులు అంటగడుతున్న నేరాలకు అతడు ఎంతవరకు బాధ్యుడు ? మనువాదం పూర్తిగా దోష భూయిష్టమేనా ? లేక అందులో ఈ కాలానికి కూడా పనికి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా ?

      తరువాయి భాగాలలో చర్చిద్దాం.

      Delete
    4. ఏది సైన్సు? ఏది నాన్సెన్సు?
      February 03, 2018
      {జ్యోతిషం వట్టి మూఢనమ్మకమని ,గ్రహ గతులు, గ్రహణాల గురించి జ్యోతిషులకు ఏమీ తెలియదని హేతు వాదులమని ,సైన్సుకు గుత్తదారులమని తమకు తాము ప్రకటించుకుంటున్న కుహనా మేధావుల మూర్ఖత్వం గురించి 17 ఏళ్ళ కింద (26 ఆగస్టు2001 న) ఆంధ్రభూమి దినపత్రిక లో నేను వరసగా రాసిన వ్యాసాలలో ఇదొకటి : }

      ఏది సైన్సు? ఏది నాన్సెన్సు?
      ఎం.వి.ఆర్. శాస్త్రి

      సైన్సు పార్టీ, జ్యోతిషం పార్టీ చాలాకాలంగా గొడవ పడుతున్నాయి. జ్యోతిషం అశాస్త్రీయమని వీరంటే సశాస్త్రీయమని వారంటారు. వారిది మూఢనమ్మకమని వీరనగా, వీరే తెలిసీ తెలియక మూర్ఖంగా వాదిస్తున్నారని వారంటున్నారు. సైన్సు గొప్పా, జ్యోతిష్యం గొప్పా అన్నది కాదు సమస్య. జ్యోతిషమనేది సైన్సు అవునా కాదా అన్నదే తేలాల్సిందల్లా. ఇది తేలాలంటే - సైన్సు అంటే ఏమిటో, దాని తత్వమేమిటో, లక్షణాలేమిటో ముందు అర్థం కావాలి.

      జ్యోతిషానికీ సైన్సుకూ స్పర్ధ ఈనాటిది కాదు. కొన్ని శతాబ్దాల పాతది. జ్యోతిషానికి శాస్త్రీయ ప్రాతిపదిక లేదని, కేవలం మూఢ విశ్వాసమని, వట్టి బూటకమని ఎంతోమంది మేధావులు సైన్సు పుట్టినది మొదలు విడివిడిగా అంటూనే ఉన్నారు. అంతా కలిసి గొంతు కలిపి జ్యోతిషం మీద సామూహికంగా ద్వజమెత్తడం నాలుగు దశాబ్దాల కిందే జరిగింది. వివిధ దేశాలకు చెందిన మొత్తం186 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు (అందులో 18 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు) కలిసి "Objections to Astrology" పేర వెలువరించిన సంయుక్త ప్రకటనను 'అమెరికన్ హ్యూమనిస్టు' పత్రిక 1975 సెప్టెంబర్ సంచికలో ప్రచురించింది. దానిపై అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది.

      186 మంది సైంటిస్టులు జాయింటుగా చెప్పిందిది.

      "...we the undersigned astronomers, astrophysicists and scientists in other fields - wish to caution the public against the unquestioning acceptance of the predictions and advice given ... by astrologers. Those who wish to believe in Astrology should realise that there is no scientific foundation for its tenets.

      "In ancient times people looked upon celestial objects as abodes or omens of the gods and thus, intimately connected with events here on earth, they had no concept of the vast distances from the earth to the planets and stars. Now that these distances can and have been calculated, we can see how, infinitesimally small are the gravitational and other effects produced by the distant planets and the far more distant stars. It is simply a mistake to imagine that the force exerted by stars and planets at the movement of birth can in any way shape our futures. Neither is it true that the positions of distant heavenly bodies make certain days or periods more favourable to particular kinds of action, or that the sign under which one was born determines one's compatibility or incompatibility with other people.

      Why do we believe in astrology? In these uncertain times many would like to believe a destiny predetermined by astral forces beyond their control... We must realise that our futures lie in ourselves and not in the stars.

      .... we are especially disturbed by the continued uncritical dissemination of astrological charts, forecasts and horoscopes by the media and by otherwise respectable newspapers, magazines and book publishers. This can only contribute to the growth of irrationanalism and obscuranism. We believe that the time has come to challenge directly and forcefully, the pretentious claims of astrological charlatans ..."

      ( ఈ కింద సంతకం చేసిన మేము ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ - తదితర రంగాలకు చెందిన సైంటిస్టులం. జ్యోతిష్కులు చెప్పే జ్యోస్యాలను, ఇచ్చే సలహాలను మారు మాట్లాడక అంగీకరించడం గురించి ప్రజలను మేము హెచ్చరించదలిచాం. జ్యోతిష సూత్రాలకు శాస్త్రీయ పునాది ఏదీ లేదని జ్యోతిషాన్ని నమ్మేవారందరు గుర్తించాలి.

      Delete
    5. ప్రాచీన కాలంలో వినువీధిలోని సూర్యచంద్ర నక్షత్రాదులను దేవుళ్ళ నెలవులుగానో శకునాలుగానో జనం భావించేవారు. భూమిమీద జరిగే ఘటనలతో వాటికి సన్నిహిత సంబందం ఉందని నమ్మేవారు. భూమినుంచి గ్రహాలకు నక్షత్రాలకు ఉన్న అపార దూరాల గురించి వారికి అవగాహన ఉండేది కాదు. ఈ దూరాలను ఇప్పుడు లెక్క వేయగలం. లెక్కవేశాం కూడా. కాబట్టి దూరంలో ఉన్న గ్రహాలు, అంతకంటే దూరంలో ఉన్న నక్షత్రాలు ప్రసరించగల గురుత్వాకర్షణ, ఇతర ప్రభావాలు ఎంత సుక్ష్మాతిసూక్ష్మమైనవో మనం చూడగలుగుతున్నాం. పుట్టిన సమయంలో నక్షత్రాలు, గ్రహాలు ప్రసరించే బలాలుమన భవిష్యత్తులను ఏవిధంగానైనా మలచగలవని ఊహించడం శుద్ధ తప్పు. దూరాన గ్రహ నక్షత్రాల ఉనికి మూలంగా కొన్ని రకాల క్రియలకు కొన్ని రోజులు లేక కొన్ని వేళలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయనీ... ఒకడికి ఇతరులతో సరిపడుతుందా లేదా అన్నది అతడు పుట్టిన రాశి నిర్ణయిస్తుందనీ చెప్పడమూ నిజం కాదు. మనం జ్యోతిషాన్ని ఎందుకు నమ్ముతాం? ఈ అనిశ్చిత కాలంలో చాలామందికి తమ భవిష్యత్తు తమ అదుపులో లేదని , గ్రహాలు వాటిని ముందే నిర్ణయించేశాయని నమ్మడం ఇష్టం. మన భవిష్యత్తు నక్షత్రాల్లో కాక మన చేతుల్లోనే ఉందని మనం గుర్తించాలి.

      ...జ్యోతిష చక్రాలకు, జాతకాలకు మీడియా వారు ఇతర విధంగా గౌరవనీయమైన వార్తాపత్రికలు, మాగజైన్లు పుస్తక ప్రచురణ కర్తలు విమర్శనాత్మకంగా చూడకుండా వ్యాప్తిచేస్తూ పోతున్నందుకు మేము ప్రత్యేకంగా కలవరపడుతున్నాం. ఇది అహేతుక ఛాందసత్వం పెంపొందడానికి మాత్రమే తోడ్పడుతుంది. జ్యోతిష్కపు డాంబికుల బూటకపు వాదాలను నేరుగా, దృడంగా సవాలు చేయవలసిన సమయం వచ్చిందని మేము విశ్వసిస్తున్నాం...)

      ఈ సంయుక్త ప్రకటన "ది అమెరికన్ హ్యుమానిస్టు" పత్రికలో ప్రముఖంగా ప్రచురించడమే కాక దీని కాపీలను ప్రపంచంలోని వేలాది పత్రికల కార్యాలయాలకు పంపి, మీరు గనుక ఆస్ట్రాలజీ కాలంను నడుపుతుంటే (మీకు ధైర్యం ఉంటే) ఈ ప్రకటన కూడా వేయమని అడిగారు. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ప్రకటన మీద సంతకాలు చేసిన వారు సామాన్యులు కారు. పేరు మోసిన ఆస్ట్రానమర్లు, ఆస్ట్రోఫిజిస్టులు, శాస్త్రాన్ని ఔపోసన పట్టిన ఇతర రంగాల సైంటిస్టులూనూ. అంతటి ఘనాపాఠులకు ఎదురు మాట్లాడడం సామాన్య మానవులు కలనైన ఊహించలేని పని. అందులోనూ వారు అల్లాటప్పా విషయాలను గాక గ్రహాల గురించి, నక్షత్రాల గురించి వాటిమధ్య దూరాల గురించి ఆ దూరాల ప్రభావాల గురించి ముక్కు మీద గుద్ది మరీ ప్రస్తావించారు. ఆ గ్రహాల గురించి అంతరిక్షం గొడవలు గురించి క్షుణ్ణంగా తెలిసిన డాక్టరు కార్ల్ సాగన్ లాంటి దిగ్దంతులు తప్ప వారితో మాట్లాడలేరు.

      Delete
    6. కార్ల్ సాగన్ లాంటి విజ్ఞులు మూర్ఖపు వైఖరి తగదని ఎంత హెచ్చరించినా జ్యోతిషాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం సైన్సు వాదులు మానలేదు. 18 మంది నోబెల్ గ్రహీతలు సహా 186 మంది సైంటిస్టులు వెలువరించినదేదో తిరుగులేని తామ్రపత్రమైనట్టు, అదే జ్యోతిషానికి డెత్ వారంటు అయినట్టు'సైన్సుపార్టీ' వారు మాటిమాటికి ప్రస్తావిస్తున్నారు. నిజానికి లోతుగా పరిశీలిస్తే ఈ చారిత్రాత్మక అభిశంసన పత్రం నిండా డబాయింపులూ ధర్మబోధలే తప్ప నిజమైన సైంటిస్టుల నోటినుంచి రావలసిన మాట ఒక్కటి కనపడదు. ముప్పై మూడు వైజ్ఞానిక శాస్త్రాలలో ఏదో ఒక దానిలో పోస్టుగ్రాడ్యుయేట్ పట్టానో, పి.హెచ్.డి. నో పొందినంత మాత్రాన ఏ ఆసామీ మొత్తం సైన్సుకు గుత్తదారు కాబోడు. సైన్సు డిగ్రీ ఉన్న ప్రతివాడికి సైంటిఫిక్ దృష్టి ఉన్నట్లు, సైన్సు తత్త్వం ఒంటబట్టినట్టు చెప్పలేము.

      సైంటిస్టులుగా చలామణి అయ్యేవారు ఏమి మాట్లాడతే అదే శాస్త్రీయమని, వారికి అర్థం కానిదంతా అర్థం లేనిదని, వారి బుద్దికి అంతుబట్టనిదంతా ఆశాస్త్రీయమనీ, వారు మెచ్చి తీర్థం చిలకరిస్తే తప్ప ఏ విద్యకూ శాస్త్రీయ ప్రతిపత్తి సమకూడదనీ భావించటం తప్పు.

      పైన ఉటంకించిన సైంటిస్టుల 'శిలాశాసనాన్నే' గమనించండి. గ్రహాలూ, నక్షత్రాలూ వాటికీ భూమికీ మధ్య దూరాలు వీరికి తెలిసిన సైన్సుకు ఇటివలి వరకూ తెలియనంతమాత్రాన ఆ సంగతులు ప్రపంచంలో మరెవరికీ ఎన్నడూ తెలిసి ఉండే అవకాశమే లేదని ఊహించటం మూర్ఖత్వం. ఆకాశంలో కనిపించేవన్నీ దేవుళ్ళు, వాళ్ళ ఇళ్ళు, శకునాలు అన్న వెర్రి నమ్మకాలు వీరు చెప్పిన ప్రాచీన కాలంలో కూడా భారతీయ జ్యోతిశ్శాస్త్రవేత్తలకు లేవు. గ్రహానికీ గ్రహానికీ మధ్య దూరాల గురించి, గ్రహ సంచారం గురించి, సౌరకుటుంబం అమరిక గురించి, అంతరిక్ష ఘటనా సంవిధానాల గురించి కచ్చితమైన, శాస్త్రీయమైన అవగాహనే లేకపోతే రానున్న గ్రహణాల గురించి తోకచుక్కల గురించి కరక్టు లెక్కలు కట్టడం మన జ్యోతిషులకు అనేక వేల సంవత్సరాలుగా సాధ్యమయ్యేదికాదు. అధునాతనమైన టెలిస్కోప్ లతో చూసి అత్యాధునిక ఉపగ్రహాలను వినియోగించి మోడరన్ సైన్సు ఈనాడు లెక్క కడుతున్న గ్రహణ కాలాలకూ, వేల సంవత్సరాలుగా మనదేశంలో వాడుకలో ఉన్నజ్యోతిస్సిద్దాంత గణితాల ప్రకారం పంచాంగ కర్తలు వేస్తున్న లెక్కలకూ పెద్ద తేడా లేకపోవడానికి సోకాల్డ్ సైన్సు వేత్తలు ఏమంటారు? వరాహమిహిరుడి కంటే ముందు నుంచీ ఈ దేశంలో పంచాంగకర్తలు వేస్తూ ఉన్న లెక్కల ప్రకారమే ఆయా నక్షత్రాల, గ్రహాల రాశి సంచారం ఆకాశంలో కనపడుతున్న వైనం వీరికి తెలియదా?

      Delete
    7. సర్వజ్ఞులమనీ, విశాల విశ్వం లోని సమస్త విజ్ఞానానికి తామే హక్కుదారులమనీ, తాతాచార్ల ముద్ర వేసి తాము అవునన్నదే శాస్త్రమనీ అహంకరించే కుహనా శాస్త్రవేత్తలకు బహుశా తెలియక పోవచ్చు. కాని - వీరు కాలేజీల్లో ముక్కున పట్టి పట్టాలు పొందిన భౌతిక శాస్త్రానికి మూల పురుషుడైన సర్ ఐజాక్ న్యూటన్ జ్యోతిషశాస్త్రంలో స్వయంగా అనేక పరిశోధనలు జరిపి, జ్యోతిషం కూడా విజ్ఞాన శాస్త్రాల్లో ఒకటని సాధికారికంగా ద్రువీకరించాడు. ఆకాశంలో గ్రహ చలనాలకు, భూమి మీద జరిగే విషయాలకు నిర్దిష్ట కార్యకారణ సంబంధం ఉన్నట్లు న్యూటన్ సిద్ధాంతీకరించాడు. క్రీస్తుశకం 2వ శతాబ్దంలో టోలేమీ చేసిన గ్రహగణితాన్ని లోతుగా అధ్యయనం చేసి దాని ఆధారంగా - ప్లూటో గ్రహం 248 ఏళ్ళ కొకసారి సూర్యునికి భూమి దగ్గరగా వచ్చిన కాలంలో భూమి మీద జరిగే పరిణామాలను పరిశోధించాడు. అలాగే గతంలో వచ్చిన భయంకర భూకంపాలను గమనించి సాధారణంగా సూర్య, చంద్రుల గ్రహణ కాలాల్లో యురేనస్, అంగారక గ్రహాల స్థితిని బట్టి భవిష్యత్తులో ఎప్పుడు ఎక్కడ భూకంపం వచ్చేది న్యూటన్ కచ్చితంగా అంచనా వేయగలిగాడు. తాను మరణించాక 23 సంవత్సరాలకు 1750 సంవత్సరంలో లండన్ ఆకాశం కంపించి, ఉత్తర ధ్రువంలో కాంతులు ప్రజ్జర్విల్లి ప్రచండమైన గాడ్పులు చెలరేగి, ఆ వెనువెంటనే తుఫాను, భూకంపం విరుచుకుపడి వేల మందిని సజీవ సమాధి చేయబోయే భయానక ఘటనా క్రమాన్ని న్యూటన్ ముందుగానే చెప్పగలిగాడు. అందులో మాయలు, మంత్రాలు ఏవీ లేవని అందరికీ అర్థమయ్యేట్టుగా... తన శాస్త్రీయ పరిశోధనా ఫలితాలను క్రమబద్దం చేసి చిరస్థాయిగా నిలిచే జ్యోతిష సిద్దాంతాలను ప్రకటించాడు కూడా.

      ఆధునిక భౌతికశాస్త్రానికి ఆద్యుడైన న్యూటన్ కే జ్యోతిషం పట్ల అంత ఆదరభావం ఉన్నప్పుడు...అత్యాధునిక టెలిస్కోపులు, ఎఫిమెరీలు ఏవీ లేని కాలంలోనే ఆయనంతటి వాడు జ్యోతిష సిద్దాంతాలను పరీక్షించి, పరిశోధించి, శాస్త్రీయమని ధ్రువపరిచినప్పుడు సైన్సు జాంబవంతుని అంగలు వేసిన ఈ కాలంలో ఆధునిక శాస్త్ర పరికరాల సాయంతో జ్యోతిష సిద్దాంతాలను శాస్త్రీయంగా పరిశీలించి నిగ్గు తేల్చడానికి మన సైన్సు వాదులకు అభ్యంతరమేమిటి? వారి దృష్టిలో న్యూటన్ మూర్ఖుడా? లేక తాము నిజమని నమ్మేది మినహా మరొక నిజం దేన్నీ గుర్తించమని, తాము పెట్టుకున్న నమ్మకాలు తప్ప మరేది తమ బుర్రలోకి చొరనివ్వబోమని, గట్టిగా ముసేసుకున్న తమ కళ్ళకు కనపడనిదంతా శూన్యమే, సర్వం అశాస్త్రీయమే అని వితండ వాదం చేసే వీరే మహా ముర్ఖులా? గ్రహణాలు, గ్రహ సంచారాలూ, గ్రహ ప్రభావాల గురించి పర్యవసానంగా రాబోయే వైపరీత్యాల గురించి జ్యోతిష శాస్త్రం సరిగ్గా లెక్కకట్టగలదనడానికి సహస్ర నిదర్శనాలు కళ్ళముందు కనిపిస్తున్నప్పటికీ జ్యోతిషాన్ని చేతబడులను ఒకే గాట కడుతూ జ్యోతిషానికి ఎలాంటి శాస్త్రీయత, హేతుబద్దత లేదని ఢంకా బజాయిస్తూ వీర స్టేట్ మెంట్లు వెలువరిస్తున్నారంటే వీరిని శాస్త్రజ్ఞులనాలా? చదువుకున్న మూఢులనాలా? ఆకాశంలో చంద్రుడి వృద్ది క్షయాల ప్రభావం సముద్రంలో కెరటాల మీద ఉంటుందని, పౌర్ణమి అమావాస్యల్లో పిచ్చివాళ్ళ ఉన్మాదం ప్రకోపిస్తుందనీ ఎరుగని వాడున్నాడా? సంపూర్ణ సూర్యగ్రహణాల లాంటి అంతరిక్ష ఘటనల వేళల్లో ఆకాశం కేసి చూస్తే కంటిచూపు దెబ్బ తింటుందని శాస్త్రవేత్తలే హెచ్చరించేటపుడు సుదూర గ్రహాల ప్రభావం భూమి మీద మనుష్యపైన ఉండనేరదనీ గవిడిగంతలుతగిలించుకున్న కుహనా సైన్సువాదులు ఎలా దబాయించగలరు?

      - 26 ఆగస్టు 2001

      Delete
  2. Wrecking Machine: When the Pagan Mongols Nearly Wiped Out Islam

    http://indiafacts.org/wrecking-machine-pagan-mongols-nearly-wiped-islam/

    మనకు గిట్టని మనువు
    February 12, 2018
    https://mvrsastri.blogspot.in/2018/02/blog-post_12.html

    ఏది సైన్సు? ఏది నాన్సెన్సు?
    ఎం.వి.ఆర్. శాస్త్రి
    https://mvrsastri.blogspot.in/2018/02/blog-post.html

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...